
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్‌పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు.
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్‌కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment