directors
-
కోలీవుడ్ టార్చ్ బేరర్స్
కొంతకాలంగా నడక మార్చుకుంటోంది తమిళ సినిమా. వెండితెర నిర్వచనాన్ని మార్చే బాధ్యతను భుజానకెత్తుకున్నారు కోలీవుడ్ కొత్త కథనాయకులు. ఇక్కడ కథానాయకులు అంటే తెరపై కనిపించే హీరోలు కారు. సిల్వర్ స్క్రీన్‌ను రీ డిఫైన్ చేస్తూ ఇండస్ట్రీకే టార్చ్ బేరర్స్‌గా మారిన దర్శకులు. హీరోల ఇమేజ్ చుట్టూ తిరిగే కథలకు ఎండ్ కార్డ్ వేసి రొటీన్ ఫార్ములా సినిమాలకు మంగళంపాడేశారు ఈతరం దర్శకులు.సమాజం పెద్దగా పట్టించుకోని అంశాలనే ముడి సరుకుగా తీసుకుని ఈ దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాలు తమిళ సినిమాను కొత్త పంథాలోకి తీసుకెళ్తున్నాయి. అట్టడుగు ప్రజల జీవితాలే ఆ చిత్రాల కథా వస్తువులు. ప్రతి ఫ్రేమ్‌లోనూ సామాజిక స్పృహ ఉట్టిపడేలా సోషల్ కమిట్మెంట్తో సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఆ ముగ్గురు దర్శకుల గురించి తెలుసుకుందాం.సామాజిక వివక్షే కథగా...అణిచివేతకు గురైన వాడికే వివక్ష వికృత రూపం తెలుస్తుంది. తమిళనాడులో అణగారిన వర్గానికి చెందిన మారి సెల్వరాజ్ తాను అనుభవించిన, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షనే సినిమా కథలుగా మార్చుకున్నారు. అట్టడుగు ప్రజల గళంగా మారారు ఈ దర్శకుడు. తమిళ సంస్కృతి నేపథ్యంలో వాస్తవ జీవిత గాథలను ఆవిష్కరిస్తున్నారు.2018లో తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ నుంచి ‘కర్ణన్, మామన్నన్’, మొన్నటి ‘వాళై’ వరకు ప్రతి చిత్రంలోనూ కులం కట్టుబాట్లు, ప్రజల హక్కులు, గౌరవప్రదమైన జీవితం... మారి సెల్వరాజ్ చర్చకు పెట్టే అంశాలు ఇవే. మెయిన్ స్ట్రీమ్ సినిమా పట్టించుకోనిపాత్రలకు వాయిస్ ఇస్తూ తన సినిమా ద్వారా సామాజికపోరాటం చేస్తున్నారు. మారి సెల్వరాజ్ సినిమాల్లో కల్చరల్ రిప్రజంటేషన్ తప్పక ఉంటుంది. బడుగు బలహీన వర్గాల గ్రామీణ జీవన విధానాన్ని నిజాయితీగా కళ్లకు పట్టే ప్రయత్నంలో ఈయన ప్రతి సందర్భంలోనూ సక్సెస్ అవుతున్నారు.పోరాట యోధులుగా...సినిమా అంటే ఏదో ఒక కథ చెప్పడం కాదు. వివక్ష కారణంగా పూడుకుపోయిన గొంతులకు వాయిస్ ఇవ్వాలి. శతాబ్దాల నుంచి వివక్షను అనుభవిస్తున్న కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి స్వరం సినిమాగా చూపించాల్సి వచ్చినప్పుడు ఘాటుగానే ఉంటుంది.పా. రంజిత్ సినిమాలు కూడా అంతే. అంబేద్కర్ ఆలోచనా విధానానికి తగ్గట్టు దళిత్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు చిత్ర పరిశ్రమలో రాజీలేనిపోరాటమే చేస్తున్నారాయన.కబాలి (2016), కాలా (2018)... ఈ రెండు చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్‌కి సామాజిక న్యాయం కోసంపోరాడే యోధుడిపాత్రను మేళవించిపా. రంజిత్ చిత్రించిన విధానం తరాలుగా అన్యాయాలకు గురవుతున్న వర్గాలకు కొత్త బలాన్ని ఇచ్చింది. రంజిత్ సినిమాలకు రజనీకాంత్ కూడా ఫిదా అయిపోయారు. సామాజిక అంశాలు... వాటిని ప్రభావితం చేసే ΄పొలిటికల్ డైనమిక్స్ రంజిత్ సినిమాలో నిండి ఉంటాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి దళితుల సంఘర్షణలను, వారి ఆత్మగౌరవపోరాటాలను వెలికి తీసి ఈ ఏడాది ‘తంగలాన్’ రూపంలోపా. రంజిత్ సృష్టించిన సునామీ సినీ విమర్శకుల మెప్పు ΄పొందింది.దర్శకుడిగా దృశ్య రూపం ఇవ్వడంతో సరిపెట్టకుండా నిర్మాతగా మారి ఈ తరహా చిత్రాలెన్నింటికో బ్యాక్‌బోన్‌గా నిలిచారు. మారి సెల్వరాజ్ తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ అందులో ఒకటి. దళిత జీవితాలను తెరకెక్కించే క్రమంలో వారిని బాధితులుగా కాకుండాపోరాట యోధులుగా చూపిస్తూ అవసరమైన చోట కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించి సాగిస్తున్న మూవీ జర్నీ తమిళ ఇండస్ట్రీలోపా. రంజిత్‌కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.కఠినమైన వాస్తవాలతో...తమిళనాడులోని సామాజిక–రాజకీయ వాతావరణాన్ని నిజ జీవితాలకు దగ్గరగా చూపించడంలో వెట్రిమారన్‌ది ప్రత్యేక శైలి. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో వెట్రిమారన్ సినిమాలు కూడా అంతే. విభిన్న వర్గాల జీవితాలను సజీవంగా చూపించడంలో వెట్రిమారన్ ముందుంటారు. ఈయన సినిమాల్లో కనిపించే సామాజిక సమస్యల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘ఆడుగళం, విశారణై, అసురన్’... ఏ సినిమా తీసుకున్నా వాటి నేపథ్యంలో కనిపించేది ప్రజలపోరాటాలే. కళను వినోదానికి పరిమితం చేయకుండా సామాజిక మార్పుకు ఆయుధంగా మార్చుకున్న దర్శకులుగా మారి సెల్వరాజ్,పా. రంజిత్, వెట్రిమారన్ కనిపిస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించినా సరే ఈ ముగ్గురి సినిమాలో పీడిత ప్రజలే ప్రధానపాత్రలుగా ఉంటారు. వాళ్లే హీరోలుగా సినిమాను నడిపిస్తారు. భిన్న చిత్రాల ద్వారా వీళ్లు సంధిస్తున్న ప్రశ్నలు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ వీళ్ల ముద్ర కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వినోద సాధనంగా మారి, నేల విడిచి సాము చేస్తున్న సందర్భంలో వాస్తవికత, సామాజిక చైతన్యాన్ని నమ్ముకుని స్టోరీ టెల్లింగ్‌కు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు. దర్శకులుగా వీరిది బాధ్యతాయుతమైన ప్రయాణం. – ఫణి కుమార్ అనంతోజు -
పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు
ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, హోల్‌టైమ్ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.పీఎల్ఐ అందుకోవాలంటే అర్హతలురిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్‌ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.ఎన్పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్పీఏ తగ్గించాలి.కాస్ట్ టు ఇన్కమ్ రేషియో (సీఐఆర్): సీఐఆర్ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలునిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు. -
ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!
చమురు రంగ పీఎస్‌యూ దిగ్గజాలకు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ జరిమానాలు తప్పలేదు. నిబంధనల ప్రకారం సంస్థల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.జరిమానా విధించిన కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఉన్నాయి. లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల బోర్డుల్లో అవసరమైనమేర స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను ఎంపిక చేసుకోకపోవడంతో జరిమానాల వడ్డింపు కొనసాగింది.ఇదీ చదవండి: ఫెడ్‌వైపు ఇన్వెస్టర్ల చూపుఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను తగిన సంఖ్యలో నిమమించుకోవడం వల్ల జరిమానాలు తప్పలేదు. గత కొద్దికాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఆయా కంపెనీలు పెనాల్టీ చెల్లిస్తున్నా తీరుమార్చుకోకపోవడం కొంత ఆందోళన కలిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ గరిష్టంగా రూ.5,36,900, కనిష్టంగా రూ.2,41,900 మధ్య జరిమానాలు విధించాయి. -
ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూశాను : విజయ్ దేవరకొండ
‘‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్’ నిర్వహిస్తున్న దర్శక సంజీవని మహోత్సవంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మీరంతా ఎన్నో కలలు కంటుంటారు. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగక ముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు... భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ, కలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగుతుంటారు’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీని ‘దర్శక సంజీవని మహోత్సవం’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించింది. దివంగత దర్శకుడు డా. దాసరి నారాయణరావు పేరు మీద దాసరి హెల్త్ కార్డులను అందించారు. ‘‘మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ అసోసియేషన్‌కు నా సహకారం ఉంటుంది’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ. ‘‘అసోసియేషన్‌లోని 720 మంది హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 1920 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాం’’ అన్నారు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
ప్రభుత్వ ఒత్తిడితో రాజీనామాలు చేసిన నలుగురు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు
-
చంద్రబాబు సర్కార్ ఒత్తిడి.. విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఒత్తిడితో విద్యుత్ సంస్థల డైరెక్టర్లు రాజీనామా చేశారు. పది మంది ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల డైరక్టర్లచే చంద్రబాబు సర్కార్ బలవంతంగా రాజీనామాలు చేయించింది. రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. డైరెక్టర్లచే రాజీనామా చేయించాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పది మంది డైరెక్టర్ల రాజీనామాలను విద్యుత్ శాఖ ఆమోదించింది.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ సీఎంవో నుంచి కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. రాజీనామా చేసేంత వరకు గ్రూప్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేశారు.దేశంలో అన్ని రాష్ట్రాలలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో లీకేజీ ఆరోపణలు ఉన్నాయి.. ఏపీలో మాత్రమే లీకేజీ ఆరోపణలు లేకుండా చైర్మన్ గౌతం సవాంగ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహించారు. రికార్డు స్థాయియిలో ఆరోపణలకు తావులేకుండా ఫలితాలు వెల్లడించారు. చివరికి ప్రభుత్వ ఒత్తిడితో గౌతం సవాంగ్.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కి పంపించగా, రాజీనామాను ఆమోదించారు.ఇదీ చదవండి: ‘రింగ్’లో మింగారు!ఏపీపీఎస్సీ సభ్యులపైనా రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ ఒత్తిడితోనే మెయిన్స్ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. -
ఎల్బీ స్టేడియంలో ఘనంగా ‘డైరెక్టర్స్ డే’ సెలబ్రేషన్స్ ( ఫొటోలు)
-
సౌత్ డైరెక్షన్‌కి సై అంటున్న బాలీవుడ్ హీరోలు!
బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలతో దక్షిణాది సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.సౌత్ డైరెక్టర్ల క్రేజ్ కూడా బాగా పెరిగింది. అందుకే బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి సై అంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తమిళ దర్శకుడు అట్లీ వంటి వారు బాలీవుడ్లో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాది దర్శకులతో ఉత్తరాది హీరోలు చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. సికందర్ సిద్ధం దాదాపు పదిహేనేళ్ల క్రితమే హిందీ ‘గజిని’ కోసం హిందీ హీరో సల్మాన్ ఖాన్, తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కలిసి పని చేయాల్సింది. అయితే ఆ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించగా మురుగదాస్ దర్శకత్వం వహించారు. ‘గజిని’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ మురుగదాస్ మాత్రం సల్మాన్ ఖాన్‌తో ఎలాగైనా ఓ సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్‌కు ఓ కథ చెప్పారు మురుగదాస్. ఈ కథ సల్మాన్‌కు నచ్చలేదట. దీంతో సెట్ కాలేదు. కానీ తనతో సినిమా చేయాలనుకుంటున్న మురుగదాస్‌కు మరో నరేషన్ ఇచ్చే చాన్స్ ఇచ్చారు సల్మాన్. ఈసారి సల్మాన్‌కు కథ నచ్చడంతో సినిమా సెట్ అయ్యింది. ఈ సినిమాకు ‘సికందర్’ టైటిల్ పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ఆరంభం కానుందట. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ ‘ది బుల్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు ‘షేర్షా’ వంటి హిట్ ఇచ్చిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. బాలీవుడ్ అపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘అన్నియన్’ (‘అపరిచితుడు’) సినిమా బ్లాక్‌బస్టర్. ఈ సినిమాను రణ్వీర్ సింగ్‌తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు శంకర్. దాదాపు మూడేళ్ల క్రితం ఈ సినిమా ప్రకటించినా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాల పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్, ‘గేమ్ చేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు శంకర్. ఈ సినిమాలు విడుదలయ్యాక రణ్వీర్ సింగ్‌తో శంకర్ సినిమా ఉంటుందట. అయితే ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో రణ్వీర్తో ‘అన్నియన్’ సినిమానే శంకర్ చేస్తారా? లేక కొత్త కథతో సెట్స్‌పైకి వెళ్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. దసరాకు దేవా ఈ దసరాకి షాహిద్ కపూర్‌ను ‘దేవా’గా థియేటర్స్‌కు తీసుకురావాలనుకుంటున్నారు మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్‌లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హిందీలో రోషన్ ఆండ్రూస్‌కు ‘దేవా’ తొలి చిత్రం. కాగా షాహిద్ కపూర్ నెక్ట్స్ ఫిల్మ్ కూడా దక్షిణాది దర్శకుడుతోనే ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్ రవితో ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ ఫిల్మ్ కమిటయ్యారు షాహిద్. ‘దేవా’ పూర్తి కాగానే ‘అశ్వత్థామ: ది సాగా...’ షూటింగ్ ఆరంభం అవుతుందట. బేబీ జాన్ వస్తున్నాడు వరుణ్ ధావన్‌ను ‘బేబీ జాన్’గా మార్చేశారు తమిళ దర్శకుడు కాలిస్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న సినిమా ‘బేబీ జాన్’. కాలిస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లు. ఈ సినిమా మే 31న రిలీజ్ కానుంది. హిట్ రీమేక్‌తో... తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హిందీలో ‘సర్ఫిరా’గా రీమేక్ అవుతుండగా, అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. మాతృతకు దర్శకత్వం వహించిన సుధ కొంగరయే ‘సర్ఫిరా’కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘సూరరై పోట్రు’లో నటించిన సూర్య ‘సర్ఫిరా’కు ఓ నిర్మాతగా ఉంటూ, గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది.ఇంకా తెలుగు దర్శకులు తేజ, గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, తమిళ దర్శకుడు పా. రంజిత్ తదితరులు చెప్పిన కథలను హిందీ హీరోలు విన్నారని సమాచారం. -
ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ డైరెక్టర్స్ వీరే.
-
పేటీఎంలో మరో కీలక పరిణామం..
ఆర్బీఐ ఆంక్షల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేసేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి డైరెక్టర్లు షింజినీ కుమార్, మంజు అగర్వాల్ వైదొలిగినట్లుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో అరవింద్ కుమార్ జైన్, పంకజ్ వైష్, రమేష్ అభిషేక్ అనే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు మాత్రమే మిగిలారు. షింజినీ కుమార్ గతంలో సిటీ బ్యాంక్, పీడబ్ల్యూసీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వంటి సంస్థల్లో సీనియర్ పదవులను నిర్వహించారు. మంజు అగర్వాల్ ఎస్బీఐలో 34 ఏళ్లపాటు పనిచేశారు. అక్కడ ఆమె చివరి అసైన్మెంట్ డిప్యూటీ ఎండీ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో ఇప్పుడు మిగిలిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లలో అరవింద్ కుమార్ జైన్ మాజీ పంజాబ్ & సింద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పంకజ్ వైష్ యాక్సెంచర్ మాజీ ఎండీ కాగా రమేష్ అభిషేక్ డీపీఐఐటీ మాజీ కార్యదర్శి. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు -
ఆస్కార్‌లో కొత్త అవార్డు
ఆస్కార్ అవార్డుల్లో ఓ కొత్త కేటగిరీ చేరనుంది. ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్స్‌కు ఓ కేటగిరీని చేర్చినట్లు అకాడమీ వెల్లడించింది. దీంతో ఆస్కార్ అవార్డుల విభాగాల సంఖ్య 24కు చేరనుంది. కానీ ఈ ఏడాది మార్చి 10న జరగనున్న 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో కానీ, 2025లో జరిగే 97వ ఆస్కార్ అవార్డ్స్‌లో కానీ ‘క్యాస్టింగ్ డైరెక్టర్స్’ విభాగంలో అవార్డును ప్రదానం చేయరు. 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఈ విభాగంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. అంటే.. 2025లో రిలీజయ్యే సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అవుతారు. ‘‘ఫిల్మ్ మేకింగ్ విభాగంలో, ఆస్కార్ ప్రదానోత్సవంలో క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇప్పుడు వారిని ఈ ప్రదానోత్సవంలో భాగం చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జానెట్ యంగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ క్రామెర్. ‘‘క్యాస్టింగ్ డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డు’ అనేది మా కృషికి గుర్తింపుగా భావిస్తున్నాం. ఆస్కార్ అకాడమీకి «థ్యాంక్స్’’ అని క్యాస్టింగ్ డైరెక్టర్ బ్రాంచ్ గవర్నర్లు రిచర్డ్ హిక్స్, కిమ్ టేలర్–కోల్మన్, డెబ్రా జేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించి ఓ కేటగిరీని చేర్చారని, చివరిసారిగా 2001లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌ను చేర్చారని హాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. -
డిస్కమ్‌ల డైరెక్టర్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లోని డైరెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. వారి తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ రిజ్వీ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు 2012లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌ల సీఎండీలను ఆయన ఆదేశించారు. దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 11 డైరెక్టర్లు కొనసాగుతున్నారు. ఈ 11 మందిలో కేవలం ఇద్దరు డైరెక్టర్లు టి.శ్రీనివాస్ (డైరెక్టర్, ప్రాజెక్ట్స్), టీఎస్ఎన్పీడీసీఎల్ వెంకటేశ్వరరావు (డైరెక్టర్ హెచ్ఆర్) మాత్రమే 2013లో నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్లుగా నియామకమయ్యారని పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిదిమంది డైరెక్టర్లు ఆరేళ్ల క్రితం ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియామకమయ్యారని ఆ ఉత్తర్వుల్లో రిజ్వీ స్పష్టం చేశారు. తొలగించిన ఆ 11మంది ఎవరెవరంటే.. సోమవారం తొలగించిన 11 మంది డైరెక్టర్లలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలోని జె, శ్రీనివాస్‌రెడ్డి(ఆపరేషన్స్), శ్రీనివాస్(ప్రాజెక్ట్స్), కె.రాములు(కమర్షియల్, ఎనర్జీ ఆడిట్), జీ. పార్వతం(హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు(ప్రణాళిక, నిర్వహణ), ఎస్,స్వామిరెడ్డి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ), గంపా గోపాల్(ఎనర్జీ ఆడిట్).. కాగా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో బి. వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), పి. సంధ్యారాణి (కమర్షియల్), పి. గణపతి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ) ఉన్నారు. కొత్త డైరెక్టర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ.. ఇంటర్వ్యూలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త డైరెక్టర్లను నియమించనున్నట్లు సమాచారం, ఇప్పటికే జెన్కో, ట్రాన్స్‌కోలో డైరెక్టర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం విదితమే. ఇప్పుడు పంపిణీ సంస్థల డైరెక్టర్లకు కూడా ఉద్వాసన పలకడం ద్వారా విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లయింది. ఏళ్ల తరబడి డైరెక్టర్లుగా వాళ్లే కొనసాగడం వల్ల విద్యుత్ సంస్థల్లో పురోగతి లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నప్పటికీ.. నష్టాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వాళ్లు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా రూ.వేల కోట్లలో నష్టాలు పేరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలున్నాయి, కాగా, వచ్చేనెలలో ఈ డైరెక్టర్ల పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
డిజాస్టర్ డైరెక్టర్లకు వరంలా ఎన్టీఆర్...ఎలాగంటే ?
-
పెట్టుబడులకు టెమాసెక్ ఆసక్తి
ముంబై: గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం టెమాసెక్.. దేశీయంగా పెట్టుబడులపై మరోసారి దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సింగపూర్ సంస్థ బోర్డు డైరెక్టర్లు దేశీయంగా పర్యటనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, మరోపక్క రాజకీయ స్థిరత్వ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ వెలుగుతున్న నేపథ్యంలో 11మంది సభ్యులుగల టెమాసెక్ బోర్డు దేశీయంగా పెట్టుబడులపై అత్యంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్ల కాలంలో 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో టెమాసెక్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, ముంబైలలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేషన్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. సగటున 1.5 బిలియన్ డాలర్లు దాదాపు గత రెండు దశాబ్దాలలో టెమాసెక్ సగటున ఏడాదికి 1–1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. ఈ బాటలో ప్రస్తుతం పెట్టుబడులను మూడు రెట్లు పెంచే యోచనలో ఉంది. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీయంగా పెట్టుబడులకు తరలి వస్తున్న నేపథ్యంలో టెమాసెక్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలలో అధికార బీజేపీ విజయం సాధించడంతో పాలసీలు కొనసాగనున్నట్లు విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పటిష్ట వృద్ధిని సాధించడం జత కలుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హెల్త్‌కేర్ రంగంలోని మణిపాల్ హాస్పిటల్స్‌లో 2 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించి టెమాసెక్ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఇది భారీ డీల్‌కాగా.. ఇప్పటికే ఓలా, జొమాటో, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, క్యూర్‌ఫిట్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇషా అంబానీకి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా మరో ఇద్దరు
జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ'తో పాటు అన్షుమాన్ ఠాకూర్, హితేష్ కుమార్ సేథియాలను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ ఈ నియామకాలకు నవంబర్ 15న ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం నియామక తేదీ నుంచి ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ గడువులోపల ప్రతిపాదనలను అమలు చేయడంలో కంపెనీ విఫలమైతే.. ముందుగా ప్రతిపాదించిన మార్పులను అమలు చేయకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. 'ఇషా అంబానీ' యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్బీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్‌లో చేరింది. ఆ తరువాత రిలయన్స్ రిటైల్ విభాగాన్ని చేపట్టి కంపెనీకి లాభాలు రావడానికి కృషి చేసింది. ఇటీవల ఈమె నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపికైంది. అన్షుమాన్ ఠాకూర్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్, ఐఐఎం అహ్మదాబాద్‌లో MBA పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి విభిన్న పరిశ్రమలలో పనిచేశారు. ప్రస్తుతం ఇతడు జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ హితేష్ కుమార్ సేథియా.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పృథివీ విద్యార్ధి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. యితడు ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో సుమారు 20 సంవత్సరాలు ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ కెనడా, ఐసీఐసీఐ బ్యాంక్ జర్మనీ, యూకే, హాంకాంగ్‌లలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించారు. -
భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచాలి.. సింగరేణి డైరెక్టర్ల దిశానిర్దేశం..!
పెద్దపల్లి: భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి డైరెక్టర్లు జి.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి యంత్రాల వినియోగం పెంచాలన్నారు. షిఫ్ట్‌ల వారీగా భూగర్భ గనుల్లో మ్యాన్‌పవర్ గురించి తెలుసుకున్నారు. రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కాన్ఫరెన్స్‌లో ఆర్జీ–1 జీఎం చింతల శ్రీనివాస్, ఏరియ ఇంజినీర్ రామ్మూర్తి, ఓసీ–5 ప్రాజెక్ట్ అధికారి కె.చంద్రశేఖర్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బానోతు సైదులు, ఏజీఎం ఐఈడీ ఆంజనేయులు, క్వాలిటీ డీజీఎం శ్రీధర్, మేనేజర్లు నెహ్రూ, రమేష్‌బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వకీల్‌పల్లిగనిలో.. రామగుండం డివిజన్–2 వకీల్‌పల్లిగనిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలని డైరెక్టర్లు సూచించారు. శుక్రవారం ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు మాట్లాడారు. ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లి భూగర్భగనుల్లో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఎల్‌హెచ్‌డీ, ఎస్డీఎల్, కంటిన్యూస్ మైనర్యంత్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలన్నారు. వకీల్‌పల్లిగని ఆగస్టులో 119శాతం బొగ్గు ఉత్పతి సాధించడంపై అభినందించారు. కాన్ఫరెన్స్‌లో ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ఇన్చార్జి మేనేజర్ తిరుపతి, గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
సుమన్‌కి నటకేసరి
శతాధిక చిత్ర దర్శకులు దివంగత కోడి రామకృష్ణ జయంతి వేడుకలు వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు అందించారు. నటుడు సుమన్‌కి ‘నట కేసరి’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘కోడి రామకృష్ణగారి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడమే ఈ పురస్కారాల ముఖ్యోద్దేశం’’ అన్నారు నిర్వాహకులు టి. రామ సత్యనారాయణ, వీబీజీ రాజు, కొత్త వెంకటేశ్వరరావు. దర్శకులు కార్తీక్ వర్మ దండు, రామ్ అబ్బరాజు, వెంకట్ పెదిరెడ్ల, రచయిత భాను తదితరులు పురస్కారాలు అందుకున్నారు. కోడి రామకృష్ణ కుమార్తె, నిర్మాత కోడి దివ్య పాల్గొన్నారు. -
డైరెక్టర్ అసభ్య ప్రశ్న.. కౌంటర్ ఇచ్చిన టాప్ హీరోయిన్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో షెర్లిన్ చోప్రా ఒకరు. అక్కడ ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. 2012లో 'ప్లేబోయ్' అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది షెర్లిన్ చోప్రా. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు వివాదస్పద విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈమె పక్కా హైదరాబాదీనే తన చదవు, బాల్యం అంతా ఇక్కడే.. సినిమాలపై ఆసక్తితో తను ముంబయిలో అడుగు పెట్టింది. గతంలో కొంతమంది సినీ దర్శకులు తనను బాడీషేమింగ్ చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే) 'నా వక్షోజాల గురించి చాలా మంది దర్శకులు ఓపెన్‌గానే సర్జరీ చేయించుకున్నావా అని అడిగేవారు. ఇలాంటి వారి లిస్ట్ చాలానే ఉంది. నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి అవును.., చేయించుకున్నాననే చెప్పాను. ఎందుకంటే నాపై భాగం ఫ్లాట్‌గా ఉంటడం నాకు నచ్చలేదన్నాను. దీంతో వెంటనే వాళ్లు ఓసారి టచ్ చేయొచ్చా..? సైజ్ ఎంత..? అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా ఆశ్చర్యమేసింది. హీరోయిన్ల కప్ సైజు తెలుసుకున్న తర్వాతే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా? అంటూ.. ఆ డైరెక్టర్‌ను ఇలా అడిగాను. నీకు పెళ్లయింది. కాబట్టి స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్లండని చెప్పాను. దానికి అతను తన భార్యతో మాత్రం ఓపెన్‌గా మాట్లడలేడంట. కానీ నాతో మాత్రం ఇలా మాట్లాడుతానంటున్నాడు.' అని పేర్కొంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షో ఫేక్.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు) ఇలా సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకుల నుంచి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాంటి వారిలో కొందరైతే ఏకంగా డిప్రెషన్ ఎపిసోడ్ల నుంచి బయటపడేందుకు డ్రగ్స్‌లో మునిగిపోవాలని చాలాసార్లు సూచించారని, కానీ అలాంటి వాటికి దూరంగానే ఉండేదానినని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sherlyn Chopra (@_sherlynchopra_) -
హాలీవుడ్లో సమ్మె సైరన్.. 60 ఏళ్ల తర్వాత ఇలా..
ప్రపంచవ్యాప్త్తంగా సినిమా పరిశ్రమకు ‘పెద్దన్న’ అని హాలీవుడ్‌కి పేరు. భారీ బడ్జెట్ చిత్రాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సం΄ాదించుకుంది హాలీవుడ్. ఇప్పుడు ఆ హాలీవుడ్ నిరసనలతో భగభగమంటోంది. సమ్మె సైరన్ తప్ప యాక్షన్.. సౌండ్లాంటి షూటింగ్ లొకేషన్లో వినిపించే మాటలు వినిపించడంలేదు. నటీనటులు మేకప్ వేసుకోవడంలేదు.. రచయితలు కలం మూత తెరవడంలేదు. దాంతో షూటింగులు నిలిచిపోయాయి. కరోనా టైమ్‌లో వెలవెలబోయినట్లు స్టూడియోలు కళ తప్పాయి. ఇన్నాళ్లుగా సమ్మె చేస్తూ వచ్చిన రచయితల సంఘానికి నటీనటుల సంఘం మద్దతు తెలిపింది. ‘వేతనాలు పెంచండి... గౌరవించండి... సౌకర్యాలు సమకూర్చండి..’ అంటూ పలు నినాదాలతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం.. హాలీవుడ్ చిత్ర పరిశ్రమని డబుల్ స్ట్రయిక్ కుదిపేస్తోంది. ఓ వైపు కొన్నాళ్లుగా ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. తాజాగా ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెకు పిలుపునిచ్చింది. తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్‌ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్న నిర్మాణ సంస్థలు తమకు కనీస వేతనాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో పదకొండు వారాలుగా రచయితలు సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ నటీనటులు సైతం రైటర్స్ సమ్మెలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణ సంస్థలు, ఓటీటీలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి సమ్మె ఆరంభమైంది. దీంతో షూటింగ్‌లు ఆగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథస్సు) హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కృత్రిమ మేథస్సుతో పని చేసే ఓ యాంకర్ని ఇటీవలే పరిచయం చేశారు. ఈ సెగ హాలీవుడ్‌కు బాగానే తాకింది. కృత్రిమ మేథస్సుతో ముప్పు పొంచి ఉందని, తమ భవిష్యత్తుకి భరోసా ఇవ్వడంతోపాటు జీతాలు పెంచాలని, సరైన పని నిబంధనలను కల్పించాలని ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ‘ఏ’ లిస్ట్ యాక్టర్స్‌తో సహా 1,60,000 మంది నటీనటులకు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్’ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రధాన నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ నిరవధిక సమ్మెకు దిగింది. ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’, ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెతో ప్రస్తుతం కొనసాగుతున్న హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి నిష్క్రమణ... క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ఓపెన్ హైమర్’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా లండన్‌లో గురువారం ఈ సినిమా ప్రీమియర్ వేశారు. అయితే గురువారం అర్ధరాత్రి ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెప్రారంభం కావడంతో ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి యాక్టర్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫీ, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్ వంటి స్టార్స్‌తో సహా పలువురు నటీనటులు వెళ్లిపోయినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. హాలీవుడ్ ప్రముఖ సంస్థలు ‘పారామౌంట్, వార్నర్ బ్రదర్స్, డిస్నీ, నెట్ ఫ్లిక్స్’ వంటి వాటి ప్రధాన కార్యాలయాల వద్ద శుక్రవారం ఉదయం పికెటింగ్ (సమ్మె)ప్రారంభించారని టాక్. ఎమ్మీ, ఆస్కార్ అవార్డ్ వాయిదా? హాలీవుడ్లో మొదటిసారి 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రచయితల సంఘం, నటీనటుల సంఘం కలిసి డబుల్ స్ట్రైక్ చేశాయి. అలానే 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె మూడు నెలలపాటలు జరిగింది. మళ్లీ 63 ఏళ్లకు ఇప్పుడు రచయితల, నటీనటుల సంఘం కలసి డబుల్ స్ట్రైక్ చేస్తుండటం విశేషం. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడే పరిస్థితి. అలాగే సెప్టెంబర్ 18న జరగనున్న ఎమ్మీ అవార్డ్స్, టెలివిజన్ వెర్షన్ ఆస్కార్ అవార్డులు కూడా నవంబర్ లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని హాలీవుడ్ మీడియాలోవార్తలొస్తున్నాయి. ∙ సమ్మె బాధాకరం ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెను స్టూడియోలకుప్రాతినిధ్యం వహిస్తున్న ‘అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్’ తప్పుబట్టింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సినిమాలు, టీవీ కార్యక్రమాలకు జీవం పోసే నటీనటులు లేకుండా స్టూడియోలు పని చేయవు. కాబట్టి సమ్మె అనేది ఆశించిన ఫలితం ఇవ్వదు. పరిశ్రమపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు దారి తీసే మార్గాన్ని యూనియన్ ఎంచుకోవడం బాధాకరం’’ అని పేర్కొంది. -
బైజూస్‌లో ఏం జరుగుతోంది? ఆడిటర్‌గా తప్పుకున్న డెలాయిట్.. డైరెక్టర్ల రాజీనామా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకోగా మరోవైపు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. వివరాల్లోకి వెడితే .. 2021–22 ఆర్థిక సంవత్స ఆర్థిక ఫలితాల రూపకల్పనలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తమ కాంట్రాక్టు ముగియడానికి మూడేళ్ల ముందే రాజీనామా చేసినట్లు డెలాయిట్ తెలిపింది. ఆడిటింగ్ కోసం తాము తరచుగా బైజూస్ ఎండీ బైజూ రవీంద్రన్‌కి లేఖలు రాస్తూనే ఉన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకూ ఆడిట్ ప్రారంభించలేకపోయామని డెలాయిట్ వివరించింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. డెలాయిట్ 2016 నుంచి బైజూస్‌కి ఆడిటర్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా అయిదేళ్ల పాటు బీడీవో (ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్)ను చట్టబద్ధ ఆడిటర్లుగా నియమించుకున్నట్లు బైజూస్ మరో ప్రకటనలో తెలిపింది. బీడీవో ప్రస్తుతం ఐసీఐసీఐ, సిస్కో వంటి దిగ్గజాలకు ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. టర్నోవరుపరంగా టాప్ అయిదు గ్లోబల్ ఆడిట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇక బైజూ రవీంద్రన్తో అభిప్రాయభేదాల కారణంగా డైరెక్టర్ల బోర్డులో ముగ్గురు రాజీనామా చేశారు. పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్)కి చెందిన జీవీ రవిశంకర్, చాన్ జకర్బర్గ్ ఇనీíÙయేటివ్ ప్రతినిధి వివియన్ వూ, ప్రోసస్కి చెందిన రసెల్ డ్రీసెన్స్టాక్ వీరిలో ఉన్నారు. బోర్డులోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో మిగతా ముగ్గురు బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్‌నాథ్, రిజూ రవీంద్రన్ ఉన్నారు. అటు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టే వరకూ ఆగాలని బైజూస్ భావించడమే ఆడిటింగ్ జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ కొత్త గ్రూప్ సీఎఫ్‌వోగా అజయ్ గోయల్ నెల రోజుల క్రితమే చేరారని, వచ్చే వారం తర్వాత నుంచి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించాయి. -
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్‌కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్‌హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్‌హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్‌తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్‌తో మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్‌లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్‌ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్‌గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్‌లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
ధూమ్ ధామ్ రసూల్ మాటలు వింటే మస్తు నవ్వుకుంటారు
-
చిరంజీవి దారిలో దూసుకుపోతున్న బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్
-
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్