
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారించేందుకు జీహెచ్ఎంసి పరిధిలోని టీచింగ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
1)ప్రతి ఆస్పత్రిలోని వైద్యులతో పాటు ఇతర సిబ్బందిని రెండుగా విభజించాలి.
2)ప్రతి బ్యాచ్‌కు 7రోజులు క్వారంటైన్లో ఉంచాలి. ఒక బ్యాచ్ ముగిసిన వెంటనే మరో బ్యాచ్‌ను క్వారంటైన్ చేయాలి.
3)కరోనా విజృంభణ నేపథ్యంలో సెలవులు రద్దు చేయాలి.
4)డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్, కరోనా టెస్టులు చేసి ట్రీట్‌మెంట్ అందించాలి.
5)ప్రతి ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వాళ్లందరు విధిగా వ్యక్తిగత రక్షణ కోసం పీపీఈ కిట్, మాస్కు ధరించాలి.