A temporary hospital is being constructed in China: ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడ్డాం అని ఊపిరి తీసుకుంటున్న ప్రపంచ దేశాలకు మళ్లీ భయంకరమైన భారీ షాక్ తగిలింది. చైనాలో కరోనా కలకలం అంటూ వస్తున్న వార్తలు అందర్నీ కలవరపాటుకు గురి చేశాయి. దీంతో చైనాలోని అధికారులు సైతం అప్రమత్తమై కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు విధించింది కూడా.
అంతేకాదు ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లోని సిపింగ్, డన్‌హువా నగరాల్లో కేసులు అధికంగా ఉండటంతో తాత్కాలికా ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఇది 6 వేల పడకల గల ఆసుపత్రి అని చెప్పారు. పైగా ఈ ఆసుపత్రి ఆరు రోజుల్లోనే వినియోగానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కానీ చైనా కరోనా మహమ్మారి మొదటి, రెండు ఫేజ్‌ల్లోనూ ఇలాంటి తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించింది. జిలిన్ ప్రావిన్స్ మార్చి 12 నాటికి మూడు తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించింది. ఈ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ యంత్రాంగం జాగురుకతతో వ్యవహరించలేదని జిలిన్ ప్రావిన్షియల్ హెల్త్ కమీషన్ అధికారి జాంగ్ యాన్ ఆరోపించారు.
అంతేకాదు ఆ ప్రావిన్స్ మేయర్‌ని కూడా తొలగించినట్లు తెలిపారు. చైనాలో సోమవారం నాటికి 2 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది గత రెండేళ్లో చూస్తే ఇదే రోజువారిగా నమోదైన అధ్యధిక కేసుల సంఖ్య అని వెల్లడించారు. దీంతో షాంఘైలో పాఠశాలలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వ్యాపారాలు తాత్కాలిక లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఈ మేరకు తాత్కాలికా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వీడియోని చైనా స్ధానిక మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
LIVE: A makeshift hospital is under construction in Jilin City in China's Jilin Province to cope with a resurgence of COVID-19. The facility, which will provide 6,000 beds, is expected to be completed within 6 days https://t.co/JJRuqZzzZO
— China Xinhua News (@XHNews) March 14, 2022
(చదవండి: సొంత దేశంలోనే వెల్లువెత్తుతున్న వ్యతిరేకత... సందిగ్ధ స్థితిలో పుతిన్)
Comments
Please login to add a commentAdd a comment