temparary
-
ఎన్నికల వేళ ఈసీ ఆదేశాలు..
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే తొలగించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఆయన స్థానంలో అదే కేడర్‌లోని అత్యంత సీనియర్ డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. అర్హులైన అధికారుల పేర్లను ఈ నెల 21వ తేదీలోగా తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అనురాగ్ గుప్తాపై వచి్చన ఆరోపణలపై విచారణకు ఈసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా అమితవ ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలలు లేదా కొత్త సీఎండీ నియామకం పూర్తి అయ్యే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్‌కు చెందిన ముఖర్జీ 2017లో ఎన్ఎండీసీలో చేరారు. ఎన్ఎండీసీ సీఎండీ పదవి కోసం పోటీపడుతున్న ఏడుగురిలో ముఖర్జీ కూడా ఉన్నారు. -
సీసీఐకు తాత్కాలిక చైర్పర్సన్ సంగీతా వర్మ నియామకం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీతా వర్మను నియమించింది. ప్రస్తుత ఫుల్‌టైమ్ చైర్‌పర్శన్ అశోక్ కుమార్ గుప్తా మంగళవారం వైదొలగడంతో ప్రభుత్వం సంగీతా వర్మకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. సీసీఐలో సభ్యురాలైన వర్మ బుధవారం(26) నుంచి మూడు నెలలపాటు చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. పూర్తిస్థాయి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేటంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ వర్మ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. మంగళవారం రాజీనామా చేసిన గుప్తా 2018 నవంబర్‌లో సీసీఐకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు గొటబయా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనే వెల్లడించారు. ప్రమాణ స్వీకారం అనంతరం విక్రమసింఘే పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. హింస, విధ్వంసాన్ని అరికట్టే అంశంలో సైనిక దళాలకు తగిన అధికారాలు, స్వేచ్ఛ కల్పించామన్నారు. దేశంలో హింసను ప్రేరేపించడానికి ఫాసిస్ట్ గ్రూప్‌లు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తియుత ప్రదర్శనలు, నిరసనలకు తాను వంద శాతం మద్దతు ఇస్తానని అన్నారు. నిరసనకారులకు, విధ్వంసాలకు పాల్పడేవారికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తన మొదటి కార్యాచరణ 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించడమేనని విక్రమసింఘే స్పష్టం చేశారు. ఇందుకోసం అతిత్వరలోనే ముసాయిదా సిద్ధం చేస్తామన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి అధికారాల్లో కోత విధించి, పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు కల్పిస్తూ 2015లో 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ వెనుక అప్పట్లో విక్రమసింఘే కీలకంగా వ్యవహరించారు. 2019 నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక గొటబయా రాజపక్స ఈ రాజ్యాంగ సవరణను రద్దు చేశారు. తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిని ‘హిజ్ ఎక్సలెన్సీ’ అని గౌరవ సూచకంగా సంబోధించడాన్ని నిషేధించారు. ప్రెసిన్షియల్ జెండాను సైతం రద్దు చేశారు. దేశానికి జాతీయ జెండా ఒక్కటే ఉండాలన్నారు. అధ్యక్షుడి పేరిట మరో జెండా అక్కర్లేదన్నారు. నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 20న పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ అబేయవర్దనే తెలియజేశారు. ఈ నెల 19న నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అధ్యక్ష పదవి ఖాళీగా ఉందంటూ శనివారం పార్లమెంట్‌కు అధికారికంగా సమాచారం అందిస్తారు. శ్రీలంకలో పార్లమెంట్లో రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుండడం 1978 తర్వాత ఇదే మొదటిసారి. వచ్చే నెల 28 దాకా దేశం విడిచి వెళ్లొద్దు శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహిందా రాజపక్స, ఆయన సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూలై 28వ తేదీ వరకూ దేశం విడిచివెళ్లొద్దని న్యాయస్థానం వారిని ఆదేశించింది. -
కేవలం ఆరో రోజుల్లోనే ఆరు వేల పడకల ఆసుపత్రి... ఎలాగంటే
A temporary hospital is being constructed in China: ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడ్డాం అని ఊపిరి తీసుకుంటున్న ప్రపంచ దేశాలకు మళ్లీ భయంకరమైన భారీ షాక్ తగిలింది. చైనాలో కరోనా కలకలం అంటూ వస్తున్న వార్తలు అందర్నీ కలవరపాటుకు గురి చేశాయి. దీంతో చైనాలోని అధికారులు సైతం అప్రమత్తమై కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు విధించింది కూడా. అంతేకాదు ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లోని సిపింగ్, డన్‌హువా నగరాల్లో కేసులు అధికంగా ఉండటంతో తాత్కాలికా ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఇది 6 వేల పడకల గల ఆసుపత్రి అని చెప్పారు. పైగా ఈ ఆసుపత్రి ఆరు రోజుల్లోనే వినియోగానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కానీ చైనా కరోనా మహమ్మారి మొదటి, రెండు ఫేజ్ల్లోనూ ఇలాంటి తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించింది. జిలిన్ ప్రావిన్స్ మార్చి 12 నాటికి మూడు తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించింది. ఈ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ యంత్రాంగం జాగురుకతతో వ్యవహరించలేదని జిలిన్ ప్రావిన్షియల్ హెల్త్ కమీషన్ అధికారి జాంగ్ యాన్ ఆరోపించారు. అంతేకాదు ఆ ప్రావిన్స్ మేయర్‌ని కూడా తొలగించినట్లు తెలిపారు. చైనాలో సోమవారం నాటికి 2 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది గత రెండేళ్లో చూస్తే ఇదే రోజువారిగా నమోదైన అధ్యధిక కేసుల సంఖ్య అని వెల్లడించారు. దీంతో షాంఘైలో పాఠశాలలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వ్యాపారాలు తాత్కాలిక లాక్డౌన్లో ఉన్నాయి. ఈ మేరకు తాత్కాలికా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వీడియోని చైనా స్ధానిక మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. LIVE: A makeshift hospital is under construction in Jilin City in China's Jilin Province to cope with a resurgence of COVID-19. The facility, which will provide 6,000 beds, is expected to be completed within 6 days https://t.co/JJRuqZzzZO — China Xinhua News (@XHNews) March 14, 2022 (చదవండి: సొంత దేశంలోనే వెల్లువెత్తుతున్న వ్యతిరేకత... సందిగ్ధ స్థితిలో పుతిన్) -
ఉక్రెయిన్‌లో యుద్ధ విరామం!
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 11.30 ని. నుంచి కాల్పులను ఆపేసింది. ఐదున్నర గంటలపాటు ఈ విరమణ ఉంటుందని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించేందుకు ఈ విరామం ఇచ్చింది రష్యా. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యూఎన్హెచ్ఆర్సీకి రష్యా తెలిపింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పదవ రోజు శనివారం కూడా యుద్ధం మొదలై.. విరామంతో కాసేపు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ లోపు విదేశీయులను తరలించే యోచనలో ఉంది ఉక్రెయిన్. -
అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు
బెంగళూరు: దేశీ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అనేక ఉత్పత్తులకు ఆన్లైన్ డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకున్న నేపథ్యంలో గిడ్డంగి, డెలివరీ నెట్వర్క్ విభాగాల్లో సీజనల్ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించింది. -
ఇద్దరికి వైరస్, ఆఫీసులు మూసివేసిన టెక్ సంస్థ
సాక్షి, బెంగళూరు: ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రకంపనలుకొనసాగుతుండగానే బెంగళూరు నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా జర్మనీ సాఫ్ట్వేర్ గ్రూప్ కుచెందిన భారత సంస్థ ‘సాప్’ ఉద్యోగులకు ప్రాణాంతక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ సోకడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా తన కార్యాలయాలన్ని మూసివేయడంతో పాటు, ఉద్యోగులకు ఇంటినుంచే సదుపాయాన్ని కల్పించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, హెచ్1ఎన్1 లక్షణాలలో జ్వరం, చలి, గొంతు నొప్పిలాంటివి సాధారణ జలుబు లక్షణాలుగా పైకి కనిపించినప్పటికీ, ఈ వైరల్ న్యుమోనియా ఆరోగ్యకరమైన యువకులను కబళించే తీవ్రత ఉన్న కారణంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.బెంగళూరులో సాప్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హెచ్1ఎన్1 వైరస్ ఫలితం పాజిటివ్ వచ్చింది. దీంతో శానిటైజేషన్ కోసం భారత్‌లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సాప్ ప్రకటించింది. బెంగళూరు, గుర్గావ్, ముంబై ఆఫీసులలో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది. అలాగే తదుపరి నోటీసు వచ్చేంతవరకు తమ ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేయాలని కోరింది. -
మారుతీలో 3 వేల ఉద్యోగాలు ఫట్
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
మరోసారి సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం
కొలంబో: హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాలను అక్కడి ప్రభుత్వం సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్బుక్, వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈస్టర్ దాడులు తరువాతముస్లింలకు సంబంధించిన వ్యాపార సముదాయాలు, ముసీదులు రాళ్లు రువ్వడం తోపాటు, ఒక వ్యక్తిపై దాడిలాంటి తాజా ఘటనల నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఈ వివాదం రాజుకుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో వివాదాస్పద పోస్ట్ పెట్టిన అబ్దుల్ హమీద్ అన్సారీ(38)ని అరెస్టు చేశారు. మరోవైపు ఈస్టర్ దాడుల్లో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న జహ్రాన్ హషీంతో సంబంధాలున్న సౌదీ అరేబియా మతబోధకుడు మొహమ్మద్ అలియార్(60) ను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యావేత్త, అయిన అలియార్..సెంటర్ ఫర్ ఇస్లామిక్ గైడెన్స్ వ్యవస్థాపకుడు. అయితే ఈ సంస్థ ఆధ్వర్యంలో జహ్రాన్.. సొంత పట్టణమైన కట్టంకుడిలో మసీదు, మత పాఠశాల, లైబ్రరీని అలియార్ స్థాపించాడు. అలియార్‌కు జహ్రాన్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, పోలీసులు పూర్తి వివరాలందించేందుకు నిరాకరించారు. కాగా ఏప్రిల్ 21, ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల్లో 257 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నందున సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. అయితే ఆ నిషేధాన్ని ఏప్రిల్ 30న ఎత్తివేశారు. తాజా నిర్ణయంతో దీంతో శ్రీలంకలో ఫేస్బుక్, వాట్సాప్, వైబర్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌ల సేవలు శ్రీలంక వాసులకు మరికొన్ని రోజులు దూరం కానున్నాయి. -
మోటో జీ5ఎస్ ధర తగ్గింది.. పరిమిత కాలమే
సాక్షి, ముంబై: మోటోరోలా వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. జీ5ఎస్ స్మార్ట్‌ఫోన్ ధరను 5వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 45వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ సేల్‌లో మోటో జీ5ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు ధరను మోటోరోలా ట్విటర్ ద్వారా ప్రకటించింది. గతేడాది ఆగస్టులో లాంచ్ అయినప్పుడు రూ.14,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ధర తగ్గింపు అనంతరం ప్రస్తుతం రూ.9,999కే అందుబాటులోకి వచ్చింది. అయితే అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా ఈ తగ్గింపు పరిమిత కాలానికి అంటే... ఈ నెల 11 వరకే అందుబాటులో ఉండనుంది. ఇక మోటో జీ5ఎస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 4జీబీ ర్యామ్, 16ఎంపీ రియర్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధానంగా ఉన్నాయి. We don’t mean to brag but making the first phone call 45 years ago calls for some celebration! So head to @AmazonIn and grab the all-metal #MotoG5s, which comes with 4 GB RAM and a 16MP rear camera, now at just Rs. 9,999. Offer valid till 11/04 only. — Motorola India (@motorolaindia) April 9, 2018 -
వేసవిలో జర భద్రం
పెద్దఅడిశర్లపల్లి : వేసవిలో వడ దెబ్బకు గురికా కుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పీఏపల్లి పీహెచ్సి వైద్యాధికారి హిమబిందు కోరారు. మంగళవారం ఆమె స్థానికంగా మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల తాకిడితో డిహైడ్రేషన్‌తో శరీరంలో నీరు తగ్గడమే వడదెబ్బగా భావించాలని అన్నారు. ఎండలో అధిక వేడిలో తిరగడంతో ఇది ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజూ 5 లేదా 6 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కవ ప్రాధాన్యం ఇస్తూ, శరీరంతో పాటు ఇంటిని చల్లగా ఉంచుకోవాలి. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారిణి పలు సూచనలు చేశారు. తీవ్ర ఎండ, ఉష్ణోగ్రత సమయాల్లో ఎక్కువగా బయట తిరగకూడదు. రోడ్లపై విక్రయించే రంగు పానియాలు, కలుషిత ఆహారం తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత్త సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో శరీరమంతా తూడ్చి ఫ్యాన్, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం తాగించి వీలైనంత త్వరగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించాలి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలి. అత్యవసరం ఉంటే త్వరగా పనులు ముగించుకోవాలి. బయట లేత రంగు, తేలికైన, కాటన్ దుస్తువులు, టోపి, గొడుగు లాంటివి తప్పనిసరిగా వాడాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్, మజ్జిగ, గ్లూకోజ్ లాంటి ద్రావణాలు దెగ్గర ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వడదెబ్బకు గురికాకుండా ఉండాలి. -
బాపూజీ సాక్షిగా..
జాతిపిత బాపూజీ జయంతిని పురష్కరించుకుని స్థానిక కార్ఖానగడ్డ చౌరస్తాలోని గాంధీ విగ్రహం సమీపంలో ప్రధాన రహదారిపై పడ్డ గోతిని పూడ్చారు. స్మార్ట్‌సిటీకి పోటీపడుతున్న నగరంలో ఇలా హడావుడి పనులతో అభాసుపాలవుతున్నారు. ఓ వైపు గాంధీ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ వస్తుండగా.. మరోవైపు హడావిడిగా గోతిని పూడ్చుతున్న సిబ్బంది కనిపించారు. – కరీంనగర్ -
కార్మికుని కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
గోదావరిఖని : గోదావరిఖని రిటైల్ పండ్ల వ్యాపారుల సంక్షేమ సంఘం సభ్యుడైన గోనెల వెంకటరాజం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులకు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెంకటరాజం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ సాగంటి శంకర్, సంఘం అధ్యక్షులు గాలి సతీష్‌యాదవ్, సబ్బు శ్రీధర్, డి.నారాయణ, అఫ్రోజ్, అయిలయ్య, సమ్మయ్య, జి.నారాయణ, మారుతి, చెరుకు బుచ్చిరెడ్డి, దీటి బాలరాజు, ఉల్లంగుల రమేశ్, అజీమ్ పాల్గొన్నారు.