
బెంగళూరు: దేశీ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అనేక ఉత్పత్తులకు ఆన్‌లైన్ డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకున్న నేపథ్యంలో గిడ్డంగి, డెలివరీ నెట్‌వర్క్ విభాగాల్లో సీజనల్ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించింది.