amezon
-
OTT: వందకు పైగా అవార్డ్స్ కొట్టిన సినిమా ఓటీటీలో.. తెలుగులో స్ట్రీమింగ్
ఆస్కార్ అవార్డు దక్కించుకున్న 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' అనే సినిమా 2023లో విడుదలైంది. ఫ్రెంచ్ లీగల్ డ్రామా చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అవార్డును గెలుచుకున్నది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా అవార్డులను గెలుచుకున్న సినిమాగా ఇది రికార్డుకెక్కింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా రిజనల్ భాషలు అయిన తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సాండ్ర హల్లర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఏడాది బెస్ట్ నటిగా ఆమెకే ఆస్కార్ అవార్డు దక్కుతుందని అందరు భావించారు కానీ తృటిలో అవార్డును మిస్సయింది. ఈ చిత్రంలో సాండ్రా హుల్లర్ తన భర్త మరణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రచయితగా నటించారు. మంచుకొండల్లోని తన ఫ్యామిలీతో ఒంటరిగా సాండ్రా జీవిస్తుంటుంది. తన భర్త అనుమానస్పద రీతిలో అక్కడ మరణించడం. ఆ ప్రాంతంలో సాండ్రా తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమె ఈ హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తుంటారు. ఊహలకు అందని ట్విస్ట్‌లతో నడిచే ఈ కథలో అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఈ నేరం నుంచి సాండ్రా ఎలా బయటపడుతుంది అనేది అసలు కథ. -
జాబ్ రిజైన్ చేస్తే రూ.4 లక్షలు - అమెజాన్ ఫౌండర్ అదిరిపోయే ఆఫర్!
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్' ఫౌండర్ 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) తమ కంపెనీలో ఉద్యోగం మానేయాలనుకునే వారికి 5000 డాలర్లు ఆఫర్ చేస్తూ ఓ సంచలన ప్రకటన చేశారు. ఊహూ... సంస్థకు ఉపయోగడరని భావిస్తున్న ఉద్యోగులను వదిలించుకునేందుకు కాదీ ప్రకటన. ఉద్యోగుల్లో సంస్థపట్ల ఎంతమందికి విధేయత కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు వేసిన ఎత్తుగడ. అదెలాగంటరా... ? చదివేయండి! ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన అమెజాన్ ఈ రోజు ఈ కామర్స్ విభాగంలో తిరుగులేని కంపెనీగా అవతరించింది. యజమాని జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా మారాడు. అసాధారణ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న బెజోస్ 2014లో మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి, కంపెనీ పట్ల విధేయత కలిగినవారి కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ప్రారంభంలో ఈ ఆఫర్ కింద స్వచ్చందంగా జాబ్ వదిలేసేవారికి 2000 డాలర్లు ఇస్తామని ప్రకటించారు, ఆ తరువాత ఈ మొత్తాన్ని 3000 డాలర్లకు పెంచారు, ఇప్పుడు అది 5000 డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువ. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో ఈ ఆఫర్ ప్రకటించిన సందర్భంగా 'Please Don’t Take This Offer' అని కోరడం విశేషం. సంస్థలో అందరూ ఉండాలని, ఈ ఆఫర్ ఎవరూ స్వీకరించరని భావిస్తున్నట్లు జెఫ్ బెజోస్ ప్రస్తావించారు. ఇలాంటి ఆఫర్ లాస్ ఏంజెలస్కు చెందిన ఆన్లైన్ రిటైలర్ 'జప్పోస్' మొదట ప్రారంభించింది. ఆ తరువాత బెజోస్ మొదలుపెట్టారు. -
డార్క్ ఎర్త్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు?
మనిషి అంతరిక్షంలోకి వెళ్లడంలో విజయం సాధించాడు. శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే భూమిపైగల అనేక రహస్యాల చిక్కుముడులు నేటికీ వీడటం లేదు. వాటి గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు అమెజాన్‌లో డార్క్ ఎర్త్‌ను కనుగొన్నారు. డార్క్ ఎర్త్ పేరుతో సారవంతమైన భూమిని రూపొందించేందుకు పురాతన అమెజోనియన్లు ప్రయత్నించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇటీవలి కాలంలో చేపడుతున్న వాతావరణ మార్పు ఉపశమన ప్రయత్నాలపై ఎంతో ప్రభావం చూపనుంది. పచ్చని వృక్షసంపద, వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన అమెజాన్‌లోని ఈ డార్క్ ఎర్త్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పురాతన మానవ స్థావరాల చుట్టూ ఉన్న నల్లని, సారవంతమైన మట్టిని పురావస్తు శాస్త్రవేత్తలు డార్క్ ఎర్త్ అని పిలుస్తారు. ఈ నేలను ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనేది స్పష్టంగా తొలుత తెలియరాలేదు. ఈ పరిశోధనా బృందం.. మట్టి విశ్లేషణ, ఎథ్నోగ్రాఫిక్ ప్రతిస్పందనలు, ఆధునిక స్వదేశీ కమ్యూనిటీల సాయంతో పలు వివరాలు సేకరించి, డార్క్ ఎర్త్‌ను పురాతన అమెజోనియన్లు ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారని నిరూపించారు. డార్క్ ఎర్త్‌ను తయారు చేయడంలో నాటి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారని, దానిని మానవ జనాభా నివాసానికి అనువైన ప్రదేశంగా మార్చడానికి, వాతావరణాన్ని ఎంతో చొరవతో సవరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఐటీకి చెందిన ఎర్త్, అట్మాస్ఫియరిక్ ప్రొఫెసర్ టేలర్ పెర్రోన్ మాట్లాడుతూ డార్క్ ఎర్త్‌లో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భూమిలో భారీ మొత్తంలో నిల్వఅయిన కార్బన్ ఉంది. ఇది వేల సంవత్సరాలుగా ఈ భూమిలో పేరుకుపోయింది. తరతరాల ప్రజలు తమ ఆహార వ్యర్థాలు, బొగ్గు, చెత్తతో ఈ మట్టిని సారవంతం చేశారన్నారు. సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైన నివేదికను ఆగ్నేయ అమెజాన్‌లోని ఎగువ జింగు నది పరీవాహక ప్రాంతంలోని క్యూకురో ప్రాంతం నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. పరిశోధకులు మట్టి నిర్వహణలో క్యూకురో పద్ధతులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారు. చెత్త, ఆహార స్క్రాప్‌ల కుప్పలు కంపోస్ట్ ఎరువు కుప్పల మాదిరిగానే ఉంటాయి. ఇవి కుళ్ళిపోయి మట్టిలో కలిసి, సారవంతమైన నేలను ఏర్పరుస్తాయి. ఈ డార్క్ఎర్త్ అభ్యాసాలను డాక్యుమెంట్ చేయడానికి పరిశోధకులు గ్రామస్తులతో ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. గ్రామస్తులు ఈడార్క్ ఎర్త్‌ను ఇగెపె అని పిలుస్తారు. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సారవంతమైన మట్టి రూపకల్పనకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి: పాక్‌లో మాజీ ప్రధానుల అరెస్ట్ ఎందుకు? ఏఏ కేసులలో అరెస్ట్ అయ్యారు? -
ఇస్రోతో చేతులు కలిపిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ - కొత్త ఆవిష్కరణల దిశగా..
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా స్పేస్–టెక్ సంబంధ నవకల్పనలకు ఊతమిచ్చేలా ఇస్రో, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్)తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా స్పేస్ స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలు, విద్యార్థులకు క్లౌడ్ టెక్నాలజీలను అందుబాటులో ఉంచడానికి ఈ ఒప్పందం ఉపయోగపడగలదని ఏడబ్ల్యూఎస్ ఇండియా, సౌత్ ఏషియా డైరెక్టర్ శాలిని కపూర్ తెలిపారు. అంతరిక్ష రంగం మరింత మెరుగైన నిర్ణయాలను, వేగవంతంగా తీసుకునేందుకు క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత ఆవిష్కరణలు సహాయపడగలవని ఆమె వివరించారు. -
ఐసీఏఆర్‌తో అమెజాన్ ఒప్పందం.. ప్రయోజనాలివే!
న్యూఢిల్లీ: కిసాన్ స్టోర్‌లో నమోదు చేసుకున్న రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడంలోనూ, అధిక దిగుబడులు.. ఆదాయం పొందడంలో తోడ్పాటు అందించడంపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. పుణేలోని ఐసీఏఆర్–కృషి విజ్ఞాన్ కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఊతంతో తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించినట్లు అమెజాన్ తెలిపింది. ఐసీఏఆర్ డిప్యూటీ జనరల్ యూఎస్ గౌతమ్, అమెజాన్ ఫ్రెష్ సప్లై చెయిన్..కిసాన్ విభాగం ప్రోడక్ట్ లీడర్ సిద్ధార్థ్ టాటా ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఐసీఏఆర్ అభివృద్ధి చేసే అధునాతన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరువ చేసేందుకు ఇరు సంస్థలు కృషి చేస్తాయి. అలాగే, రైతులు తమ ఆదాయాలను పెంచుకునేందుకు ఉపయోగపడే మెరుగైన సాగు విధానాలను కిసాన్ వికాస్ కేంద్రాల్లో (కేవీకే) ప్రదర్శిస్తాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు కావాల్సిన శిక్షణ, సహాయాన్ని అమెజాన్ అందిస్తుంది. తద్వారా రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానిస్తుంది. 2021 సెప్టెంబర్‌లో అమెజాన్ తమ ప్లాట్ఫామ్లో ’కిసాన్ స్టోర్’ సెక్షన్‌ను ప్రారంభించింది. ఇందులో షాపింగ్ ద్వారా వ్యవసాయానికి అవసరమైన ముడి వనరులను రైతులు ఇంటి దగ్గరే అందుకోవచ్చు. -
కేన్స్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో బెజోస్ గ్రాండ్ ఎంట్రీ.. వారు వచ్చిన బోట్ ఖరీదు తెలుసా?
బిలియనీర్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కేన్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌తో కలిసి బెజోస్ 500 మిలియన్ డాలర్ల (రూ.4 వేల కోట్లకుపైనే) విలువైన సూపర్‌యాచ్ (బోట్)లో ఫ్రాన్స్‌కు దక్షిణాన ఉన్న కేన్స్‌కు చేరుకున్నారని పేజ్ సిక్స్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ నివేదించింది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గ్లోబల్ సెలబ్రిటీలు ఈ రిసార్ట్ టౌన్‌కి చేరుకుంటున్నారు. కోరు అనే పేరుతో ఉన్న ఈ లగ్జరీ బోట్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సెయిలింగ్ యాచ్‌గా చెబుతారు. దీని తయారీని 2018లో ప్రారంభించగా ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవలే పూర్తి చేశారు. గత ఏప్రిల్‌లోనే ఇది తన తొలి సముద్రయానం చేసింది. సూపర్‌యాచ్ ముందు భాగంలో లారెన్ శాంచెజ్‌ను పోలి ఉండే మత్స్యకన్య బొమ్మ ఉన్నట్లు ఆ మ్యాగజైన్ పేర్కొంది. ఈ సూపర్‌యాచ్ నిర్వహణ కోసం జెఫ్ బెజోస్‌కు సంవత్సరానికి 25 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని తెలిసింది. బెజోస్ కోరుతో పాటు తన మరో బోట్ అబియోనాను కూడా కేన్స్‌కు తీసుకువచ్చారు. కేన్స్‌లోని డు క్యాప్ ఈడెన్ రోక్ హోటల్లో జరిగిన మ్యాగజైన్ పార్టీలో అలాగే హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఇచ్చిన ప్రైవేట్ మాన్షన్ పార్టీలో బెజోస్ ఆయన గర్ల్‌ఫ్రెండ్ శాంచెజ్ కనిపించారు. ఇదీ చదవండి: Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా.. రెడ్ కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్త! -
రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లను వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఖరీదైన మొబైల్ ఉపయోగించడానికి కొంత మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ రూ. 32,999 ధర వున్నా మొబైల్ ఫోన్ కేవలం రూ. 2,999కే లభిస్తుంది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మార్కెట్లో రూ. 32,999. కానీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం వల్ల మీకు రూ. 25,000 వరకు ఆదా చేయవచ్చు. అది కూడా మీరు ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే మొబైల్ ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి. అంతే కాకుండా మీ మొబైల్ బ్రాండ్ మీద కూడా ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆధార పడి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా కొనుగోలు చేయాలనుకుంటే అసలు ధరలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున మీరు రూ. 32,000 ఫోన్ రూ. 27,999కి లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనాలకునేవారు రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం మీద మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ. 2999కే లభిస్తుంది. కొనుగోలుదారుడు తప్పకుండా ఈ షరతులను గుర్తుంచుకోవాలి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) శాంసంగ్ గెలాక్సీ ఎం53 మొబైల్ మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.7 ఇంచెస్ సూపర్ అమోటెడ్ డిస్ప్లే కలిగి, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ పొందుతుంది. ఇందులోని 500 mAh బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ ఎం53 మొబైల్ అన్ని విధాలుగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!
అమెజాన్ ప్రైమ్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదల వల్ల ప్రారంభ ప్లాన్ ధరలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అమెజాన్ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధరలను అధికం చేసింది. ఇందులో నెల, మూడు నెలల ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే రూ. 179 ఉన్న అమెజాన్ నెల వారీ మెంబర్షిప్ ఇప్పుడు రూ. 299 కి చేరింది. అంటే ఈ ధర ఒక్క సారిగా రూ. 120 పెరిగింది. దీని ప్రకారం కొత్త అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ఖచ్చితంగా రూ. 299 చెల్లించాల్సిందే. ఇక మూడు నెలల ప్లాన్ విషయానికి వస్తే, రూ. 499 గా ఉన్న మూడు నెలల ప్లాన్ ఇప్పుడు రూ. 599కి చేరింది. ఈ ధరలు కూడా రూ. 140 వరకు పెరిగాయి. ముందుగానే నెల, 3నెలలు ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు, ఆటో రెన్యూవల్ సెట్ చేసుకున్న వారు పాత ధరలకే ఈ ప్లాన్స్ పొందవచ్చు. ఇవి 2024 జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత కొత్త ధరలు వర్తిస్తాయి. (ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) కొత్తగా అమెజాన్ ప్రైమ్ పొందాలనుకునే వారు కొత్త ధరలకే సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు, సినిమాలు టీవీషోలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ వంటి వాటిని కూడా చూడవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ లో షాపింగ్ బెనిఫీట్స్ కూడా లభిస్తాయి. అంతే కాకుండా అమెజాన్ మ్యూజిక్ ఉచితంగానే ఎంజాయ్ చేయవచ్చు. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
రాజీనామా చేస్తే సంవత్సరం శాలరీ ఫ్రీ.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని భారీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తూనే ఉన్నాయి. గూగుల్, అమెజాన్, మెటా వంటి దాదాపు సుమారు 570 టెక్ కంపెనీలు 2023లో మాత్రమే 1,60,000 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. లెక్కకు మించిన సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతో ఉద్యోగుల్లో కొత్త భయం ఏర్పడింది. నివేదికల ప్రకారం.. గూగుల్, అమెజాన్ కంపెనీలు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో చాలా మంది ఉద్యోగులను తొలగించాయి, కానీ యూరోపియన్ దేశాలలోని ఉద్యోగులను తొలగించడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తున్నాయి. ఈ దేశాల్లో ఉన్న కఠినమైన కార్మిక రక్షణ చట్టాల కారణంగా ఈ కంపెనీలు వెంటనే ఉద్యోగులను తొలగించలేకపోతున్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల్లో, టెక్ కంపెనీలు ఉద్యోగులతో చర్చించకుండా ప్రజలను తొలగించకూడదు. కావున ఈ చర్చల వల్ల తొలగింపులు కొంత ఆలస్యం అవుతున్నాయి. కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేయడానికి ముందు చట్టబద్ధంగా ఈ కౌన్సిల్లతో సంప్రదించవలసి ఉంటుంది. (ఇదీ చదవండి: Mercedes AMG GT 63 S E Performance: భారత్‌లో విడుదలైన కొత్త కారు - పూర్తి వివరాలు) ఫ్రాన్స్‌లో, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, దానికి తగిన ప్రతిఫలంగా పొందాలని కోరించి. అయితే ఐదు నుంచి ఎనిమిదేళ్లు అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ మేనేజర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వారికి ఒక సంవత్సరం వేతనంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజీని అమెజాన్ అందించనున్నట్లు కూడా తెలుస్తోంది. జర్మనీలో అమెజాన్ వారి ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులను తొలగించి, స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా, గూగుల్ తన 8,000 మంది ఉద్యోగులలో యూకేలో 500 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఈ ఉద్యోగులకు విభజన ప్యాకేజీలు కూడా అందించనున్నట్లు వెల్లడించింది. డబ్లిన్, జ్యూరిచ్లలో గూగుల్ తన ఉద్యోగులలో 200 మందికి పైగా తొలగించాలని యోచిస్తోంది. -
భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ..
గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని చాలా దేశాల్లోని అగ్ర కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించాయి, ఇప్పటికీ తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. మన దేశంలో ఇప్పటికే దాదాపు 36,400 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి గడిచిన ఆరు, ఏడు నెలల కాలంలో లిడో లర్నింగ్, సూపర్లర్న్, గోనట్స్ వంటి సంస్థలు వంద శాతం ఉద్యోగులను తొలగించగా.. గోమెకానిక్, ఫబల్కేర్, ఎంఫైన్ వంటి కంపెనీలు 70 నుంచి 75 శాతం ఉద్యోగులను తీసివేశాయి. భారతదేశంలో ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించిన సంస్థల జాబితాలో 'బైజూస్' మొదటి స్థానంలో ఉంది. బైజూస్ ఇప్పటికే 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. అదే సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' 2020 మే నుంచి ఇప్పటివరకు సుమారు 2,880 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీనితో పాటు ఓలా క్యాబ్ సర్వీస్ కంపెనీ ఇప్పటికి నాలుగు విడతలుగా 1,400 మందికి గుడ్ బై చెప్పింది. (ఇదీ చదవండి: Flipkart Summer Offer: వీటిపై 60 శాతం డిస్కౌంట్! మార్చి 26 వరకే..) భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా సుమారు 503 టెక్ కంపెనీలు ఇప్పటికే లక్షకంటే ఎక్కువమంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీలలో 'అమెజాన్' కంపెనీ మొదటి స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఉద్యోగులు మెచ్చే సంస్థ ‘మైక్రోసాఫ్ట్’
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులు మెచ్చే అత్యంత ఆకర్షణీయ సంస్థగా (అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్) మైక్రోసాఫ్ట్ ఇండియా నిలిచింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2022 ర్యాంకుల జాబితా విడుదలైంది. ఆర్థిక ఆరోగ్యం విషయంలో మైక్రోసాఫ్ట్ ఇండియా చాలా ఎక్కువ స్కోరు సాధించింది. బలమైన పేరు, గుర్తింపు, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రయోజనాలు.. ఈ మూడు అంశాలు మైక్రోసాఫ్ట్‌ను నంబర్ 1 స్థానంలో నిలిపాయి. ఈ జాబితా లోని టాప్–10లో హ్యూలెట్ ప్యాకార్డ్ నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, శామ్సంగ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాండ్‌స్టాడ్ రీసెర్చ్ సర్వే కోసం 5,944 కంపెనీలకు చెందిన 1,63,000 మంది నుంచి (31 దేశాల వారు) అభిప్రాయాలు తెలుసుకున్నారు. కెరీర్లో పురోగతి కీలకం.. భారత్‌లో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 9 మంది (88%) శిక్షణ, వ్యక్తిగత కెరీర్ పురోగతి తమకు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. అదే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇలా చెప్పిన ఉద్యోగులు 76%. 2021 చివరి ఆరు నెలల్లో భారత్‌లో 24% ఉద్యోగులు తమ కంపెనీని మార్చుకున్నారని రాండ్‌స్టాడ్ తెలిపింది. సంస్థను ఎంపిక చేసుకునే విషయంలో పని–వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలన్స్ తమకు ముఖ్యమని 63% మంది తెలిపారు. -
కుక్కను కరిచాడు!
ఫెయిర్‌ఫీల్డ్: మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను కరిస్తే వార్త అనే మాటను అక్షరాలా నిజం చేసాడో ప్రబుద్ధుడు. అమెరికాలో ఒక దొంగ మంచి టైమ్ చూసుకొని వృద్ధులున్న ఇంటికి కన్నం వేశాడు. దొంగతనం పూర్తయి పారిపోదామనుకునే సమయంలో ఆ ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. తను పారిపోయేందుకు డెలివరీ ట్రక్కును, లేదంటే చంపేస్తానని బాయ్‌ను దొంగ బెదిరించాడు. దీంతో భయపడిన అమెజాన్ బాయ్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు సదరు ఇంటిని చుట్టుముట్టారు. ఎంత ప్రయత్నించినా దొంగను బయటకు రప్పించలేకపోవడంతో చివరకు పోలీసు జాగిలం కార్ట్(కే9)తో కలిసి ఇంట్లోకి వెళ్లారు. దొంగను గుర్తించిన కుక్క అతన్ని పట్టుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దొంగ కుక్కను కరిచి, కత్తితో పొడిచాడని పోలీసులు ప్రకటించారు. చికిత్స కోసం కుక్కను ఆస్పత్రికి పంపారు. దొంగ మత్తు పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై పాత కేసులున్నా యని పోలీసులు గుర్తించారు. కొత్తగా కుక్కను కరిచినందుకు, ట్రక్కు దొంగతనానికి, ఇంట్లో దొంగతనానికి కేసులు నమోదు చేశారు. -
చెఫ్, వ్యాఖ్యాతకు చెరో రూ. 745 కోట్ల నగదు పురస్కారం
వాషింగ్టన్: రోదసీలోకి విజయవంతంగా తిరిగొచ్చా కా అమెరికా పారిశ్రామికవేత్త, అమెజాన్ వ్యవస్థాప కుడు జెఫ్ బెజోస్ ఒక కొత్త అవార్డును ప్రకటిం చారు. ప్రఖ్యాత చెఫ్ జోస్ ఆండ్రీస్, అమెరికాలో రాజకీయ వార్తల వ్యాఖ్యాత వాన్ జోన్స్‌లకు ఈ అవార్డు దక్కింది. కరేజ్ అండ్ సివిలిటీ పేరిట ఇచ్చే ఈ అవార్డుతోపాటు వీరిద్దరూ దాదాపు చెరో రూ. 745 కోట్ల(10కోట్ల డాలర్లు) నగదు పురస్కారం అందుకోనున్నారు. మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాడటంతో అవిశ్రాంత కృషిచేస్తున్నందుకు అవార్డును ప్రకటించినట్లు బెజోస్ చెప్పారు. నగదు పురస్కారంగా పొందే ఈ మొత్తాన్ని గ్రహీతలు తమ సొంత అవసరాలకు వాడుకోవచ్చు లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వవచ్చు. ఆండ్రీస్ ప్రఖ్యాత పాకశాస్త్ర ప్రవీణుడు. 2010లో లాభాపేక్షలేని ‘ వరల్డ్ సెంట్రల్ కిచెన్’ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోట్ల భోజన వసతులు కల్పిస్తున్నారు. -
గందరగోళం సృష్టిస్తోంది..
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో డీల్ విషయంలో మోకాలడ్డుతున్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్ కిషోర్ బియానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు అక్కరకు రాని వ్యవహారంలో తలదూరుస్తూ అమెజాన్ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఫ్యూచర్ గ్రూప్ ఉద్యోగులకు లేఖ రాశారు. అమెజాన్‌తో వివాదం విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు బియానీ ప్రయత్నం చేశారు. ‘అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని గెలిచినా.. భారత్‌లో విఫలమయ్యాడని చరిత్ర చెబుతోంది. భారతీయ వినియోగదారులకు అందిస్తున్న సేవలు, మీ అండతో దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూప్ చట్టబద్ధంగానే ముందుకు సాగుతోందని .. స్టాక్ ఎక్సే్చంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా డీల్‌కు అనుమతులు పొందిందని పేర్కొన్నారు. లిటిగేషన్లతో వేధిస్తోంది ..అమెజాన్ ఒక ప్రణాళిక ప్రకారం మీడియాలో దుష్ప్రచారం సాగిస్తోందని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని లీక్ చేస్తోందని కిషోర్ బియానీ ఆరోపించారు. ఫ్యూచర్ రిటైల్, డైరెక్టర్ల బోర్డు, రుణదాతలతో పాటు తనతో పాటు తండ్రి, పిల్లలు, కుటుంబసభ్యులను కూడా విడిచి పెట్టడం లేదని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పరమైన ఆర్థిక సంక్షోభం కారణంగా రిలయన్స్ గ్రూప్‌తో నిర్మాణాత్మక డీల్ కుదుర్చుకోవడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్లిస్టేడ్ సంస్థ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు 2019 ఆగస్టులో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్యూచర్ కూపన్స్‌కి వాటాలు ఉన్న ఫ్యూచర్ రిటైల్ సంస్థలో కొన్నేళ్ల తర్వాత అమెజాన్ కూడా వాటాలు కొనుగోలు చేయొచ్చు. అయితే, కరోనా దెబ్బతో రిటైల్‌ను రిలయన్స్‌కు సుమారు రూ. 24,713 కోట్లకు విక్రయించాలని ఫ్యూచర్ గ్రూప్ నిర్ణయించుకోవడంతో వివాదం వచ్చి పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా .. దానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. మరోవైపు, ఫ్యూచర్ గ్రూప్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నియంత్రణ సంస్థలు దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. ఒప్పంద ఉల్లంఘనకు గాను బియానీని అరెస్ట్ చేయడంతో పాటు ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది. -
మస్త్.. మస్క్!
న్యూయార్క్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి గురువారం టెస్లా షేర్ల ధర ప్రకారం ఆయన సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. కుబేరుల జాబితాలో గతేడాది తొలి నాళ్లలో 35వ స్థానంలో ఉన్న మస్క్.. ఏడాది తిరిగేసరికి అగ్రస్థానానికి చేరడం గమనార్హం. గురువారం టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది. టెస్లా షేరు ధర గతేడాది ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. ఏడాది వ్యవధిలో టెస్లా షేరు కనిష్ట ధర రూ. 65.42 డాలర్లు కాగా ప్రస్తుతం 811.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. గతేడాది నవంబర్ ఆఖర్లో మస్క్ 127.9 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను తోసిరాజని రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. రెండు నెలలు కూడా తిరక్కుండానే మరో 60 బిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుని నంబర్ వన్ స్థానానికి ఎగబాకారు. టెస్లాలో మస్క్‌కు 20 శాతం దాకా వాటా ఉంది. ఆయన గతంలో ఇంటర్నెట్ పేమెంట్స్ కంపెనీ పేపాల్ హోల్డింగ్స్‌ను కూడా నెలకొల్పి, మంచి లాభాలకు విక్రయించారు. స్పేస్ఎక్స్ అనే రాకెట్ల తయారీ సంస్థ, న్యూరాలింక్ అనే మరో సంస్థను కూడా నెలకొల్పారు. టనెల్స్ ద్వారా పూర్తి ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా బోరింగ్ కంపెనీని సైతం ఎలాన్ మస్క్ ప్రారంభించారు. -
ఫ్యూచర్–రిలయన్స్ డీల్‌కు బ్రేక్
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఈ డీల్‌ను సవాల్ చేస్తూ సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ (ఎస్ఐఏసీ)ని ఆశ్రయించిన అమెజాన్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందంపై 90 రోజుల పాటు స్టే విధిస్తూ ఎస్ఐఏసీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యూచర్, అమెజాన్ గ్రూప్‌ల నుంచి చెరొక సభ్యుడు, తటస్థంగా ఉండే మరో సభ్యుడితో త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఏర్పాటు కావొచ్చని, వివాదంపై 90 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాలు స్వాగతిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల పైగా విలువ చేసే దేశీ రిటైల్ మార్కెట్లో ఆధిపత్యం సాధించేందుకు రిలయన్స్‌తో అమెజాన్ పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ఈ వివాదం మరింత ఆజ్యం పోయనుంది. అమెజాన్ భారత మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఫ్యూచర్ రిటైల్ వంటి భారతీయ భాగస్వామి అవసరం చాలా ఉంది. మరోవైపు, దూకుడుగా దూసుకెడుతున్న రిలయన్స్ రిటైల్‌కి ఫ్యూచర్ రిటైల్ లభిస్తే .. తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అవకాశం దక్కనుంది. సత్వరం డీల్ కుదుర్చుకుంటాం: రిలయన్స్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) స్పందించింది. ఒప్పందం ప్రకారం తమకు దఖలు పడ్డ హక్కులను వినియోగించుకుంటామని, మరింత జాప్యం జరగకుండా డీల్ కుదుర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇక, ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు ఫ్యూచర్ రిటైల్ సంకేతాలు ఇచ్చింది. వివాదం ఇదీ..: ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ సంస్థకు 7.3% వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49% వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కూ ఎఫ్‌ఆర్‌ఎల్‌లో వాటాలు దక్కాయి. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఇటీవలే కరోనా వైరస్‌పరమైన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర వ్యాపారాలను ఆర్ఆర్వీఎల్కి విక్రయిస్తున్నట్లు ఆగస్టు 20న ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్వీఎల్ వేగంగా రిటైల్ రంగంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ డీల్‌ను అమెజాన్ వ్యతిరేకిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్ కొనుగోలుకు సంబంధించి తమ హక్కులకు భంగం కలుగుతోందంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ను ఆశ్రయించింది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లు 10 శాతం పతనం... రిలయన్స్ రిటైల్ – ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి తాత్కాలిక బ్రేక్ పడటంతో ఇంట్రాడేలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు 10 శాతం వరకు పతనమయ్యాయి. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ షేరు 10 శాతం నష్టపోయి రూ.78.15 వద్ద ముగిసింది. ఫ్యూచర్ రిటైల్ షేరు 5 శాతం క్షీణించి రూ.73.85 వద్ద స్థిరపడింది. ఇక ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్ లిమిటెడ్ షేర్లు 5 శాతం మేర పతనమై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. -
ఆ గేమ్‌లోకి వెళ్లను
నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నివేదా థామస్ చెప్పిన విశేషాలు. ► నిజానికి ఈ సినిమాని థియేటర్ రిలీజ్ కోసం తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనందరం పక్కనే ఉన్న షాప్‌కి వెళ్లటానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారని గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల సరైన నిర్ణయమే. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ► ‘వి’ సినిమా చేయడం వెనక నా స్వార్థం కూడా ఉంది. నా పాత్ర నచ్చడం, నానీతో మూడోసారి సినిమా చేయడం, ఇంద్రగంటి సార్‌తో రెండో సినిమా, ‘దిల్’ రాజుగారి బేనర్లో కంటిన్యూస్‌గా సినిమాలు చేయడం.. ఇవన్నీ నేను ‘వి’ చేయడానికి కారణాలు. ఈ సినిమాలో నా పాత్ర పేరు అపూర్వ. తను క్రైమ్ థ్రిల్లర్స్ రాసే నవలా రచయిత. ఇప్పటివరకు నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. ► స్వతహాగా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీతో చాలారోజులు ఇంట్లో స్పెండ్ చేశాను. 17 ఏళ్లుగా మా నాన్న దుబాయ్‌లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడన్నా అలా వచ్చి ఇలా వెళ్లేవారు. కానీ ఆరు నెలలుగా ఆయనతో బెస్ట్ టైమ్ గడుపుతున్నాను. ఈ లాక్డౌన్లో ఎంతోమంది కొత్త దర్శకులు చెప్పిన కథలు విన్నాను. ప్రతి కథ ఒక కొత్త అనుభూతినిచ్చింది. కానీ ఫైనల్‌గా నాకు సూట్ అయ్యేవే ఎన్నుకుంటాను. ► వెబ్ సిరీస్‌లో నటించాలనుకోలేదు. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తానేమో. ప్రస్తుతానికి నేను మంచి పొజిషన్లో ఉన్నాను. స్టార్డ్డమ్ అంటూ నంబర్ గేమ్‌లోకి రావటం నాకిష్టంలేదు. నేను ఆ బాక్స్‌లో ఉండను. స్టార్డమ్ కంటే కూడా ‘ఈ అమ్మాయి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది’ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. -
శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేసింది
దక్షిణ కొరియా స్టార్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి గురువారం(జూలై 30) కొత్త మోడల్ విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ గా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆగస్ట్ 6వతేది నుంచి అమెజాన్, శాంసంగ్డాట్కామ్ లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. అలాగే కొన్ని ఎన్నికోబడిన రిటైల్ స్టోర్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిరాజ్ బ్లూ, మిరాజ్ బ్లాక్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. బయోమెట్రిక్ సదుపాయం కోసం సైడ్ - మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. డ్యూయల్ సిమ్ సౌకర్యం కలదు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్లో రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో వేరే మొబైల్‌ను రివర్స్ ఛార్జింగ్ చేయొచ్చు. సింగిల్ టేక్ కెమెరా మోడ్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి యూజర్లు ఫొటోలు, వీడియోలు తీసేందుకు వీలవుతుంది. సింగిల్ టేక్ ఫీచర్ శాంసంగ్ ప్రీమియం గెలాక్సీ ఫోన్లలో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ఫీచర్లు 6.5 ఇంచుల ఆల్మోటెడ్ పంచ్ హోల్ డిప్లే నాలుగు కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు 32మెగా ఫిక్సెల్ సెల్ఫీ కెమెరా వెనుక వైపు 3ప్రధాన కెమెరాలున్నాయి. 64+12+5 మెగాఫిక్సెల్ సామర్థ్యాన్నికలిగి ఉన్నాయి. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సల్ కెపాసిటి, క్వాడ్ రియర్ కెమెరా 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 25W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ధరలు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499 -
ఆయనకు ఒక్కరోజులో రూ.97వేల కోట్ల లాభం
సంపద సృష్టి విషయంలో స్టాక్ మార్కెట్‌కు మించిన ప్రత్యామ్నయం ఈ భూమ్మీద మరోకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు అమెజాన్ వ్యవస్థాపకుడు సీఈవో జెఫ్ బెజోస్. స్టాక్ మార్కెట్లో తన కంపెనీ అమెజాన్ షేరు పెరగడంతో ఒక్కరోజులో ఏకంగా రూ.97వేల కోట్ల(13 బిలియన్ డాలర్లు) సంపదను ఆర్జించగలిగారు. తద్వారా ఒక్కరోజులో అత్యధిక సంపదను సంపాదించిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా పేరుగాంచిన జెఫ్ బెజోస్ మొత్తం సంపద 189 బిలియన్ డాలర్లుగా ఉంది. సంపద పెరిగింది ఇందుకే: వెబ్ షాపింగ్ ట్రెండ్స్‌పై ఆశావహన అంచనాలతో సోమవారం అమెజాన్ షేరుకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే ప్రముఖ రేటింగ్ సంపద గోల్డ్‌మెన్ శాక్స్ అమెజాన్ షేరుకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ... షేరు టార్గెట్ ధరను 3100డాలర్ల నుంచి 3800డాలర్లకు పెంచింది. ఫలితంగా అమెజాన్ షేరు 2018 డిసెంబర్ తర్వాత అత్యధికంగా 7.9 లాభపడింది. షేరు ర్యాలీతో కంపెనీ వ్యవస్థాపకుడు జెజోస్ సంపద కూడా ఎగిసింది. ఇదే కంపెనీలో భారీ వాటాలను కలిగి ఉన్న అతని మాజీ భార్య మెకంజీ బెంచ్ సంపద సైతం 4.6బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యధికంగా సంపద కలిగిన వ్యక్తుల్లో 13వ స్థానానికి ఎగసింది. ఈ ఏడాదిలో 74బిలియన్ డాలర్ల ఆర్జన: కరోనా ఎఫెక్ట్‌తో అమెరికా ఆర్థిక వ్యవస్థ మహా మాంద్యంలోకి వెళ్లిపోయింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో 56ఏళ్ల ఈ బిలీనియర్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 74బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. ఇదే సమయంలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకెన్బుర్గ్ 15బిలియన్ డాలర్లను సంపాదించారు. ఇదే 2020 ఏడాదిలో ఆసియాలో అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ముకేశ్ అంబానీ 13.5బిలియన్ డాలర్లను ఆర్జించగలిగారు. -
అమెజాన్ కార్ట్‌లో ఎయిర్టెల్!!
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు చేసే దిశగా అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కసరత్తు చేస్తోంది. సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని వివరించాయి. రిలయన్స్ జియోకు దీటైన పోటీ ఇవ్వడానికి ఎయిర్‌టెల్‌కు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ ఆపరేటర్ కార్యకలాపాల నుంచి డిజిటల్ టెక్నాలజీ దిగ్గజంగా జియో రూపాంతరం చెందిందని, ఎయిర్టెల్ కూడా అదే విధంగా వృద్ధి చెందవచ్చని తెలిపాయి. 8–10% దాకా వాటాలపై దృష్టి.. ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్ పలు అవకాశాలు పరిశీలిస్తోంది. సుమారు 8–10 దాకా కూడా వాటాలు కొనే అంశం కూడా ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికైతే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, డీల్ నిబంధనలు మారొచ్చని, ఒప్పందం కుదరవచ్చని లేదా కుదరకపోనూ వచ్చని వివరించాయి. ఒకవేళ వాటాల కొనుగోలు ప్రతిపాదన విఫలమైనా ఇరు కంపెనీలు కలిసి పనిచేసేందుకు ఇతరత్రా మార్గాలు కూడా పరిశీలించవచ్చని పేర్కొన్నాయి. అమెజాన్ ఉత్పత్తులను భారతి కస్టమర్లకు చౌకగా అందించే విధమైన డీల్ సైతం వీటిలో ఉండవచ్చని వివరించాయి. దేశీ టెల్కోలపై టెక్ దిగ్గజాల దృష్టి.. గడిచిన కొన్నాళ్లుగా దేశీ టెలికం కంపెనీలపై అంతర్జాతీయ టెక్ దిగ్గజాల ఆసక్తి గణనీయంగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ వ్యాపార విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌తో ఫేస్బుక్ తదితర దిగ్గజ సంస్థలు గత ఆరు వారాల్లో సుమారు 10 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. టెలికం సేవల సంస్థ జియో ఇందులో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పరిశీలిస్తోందంటూ కూడా వార్తలు వచ్చాయి. దేశీ టెలికం రంగంలో జియో అగ్రస్థానంలో ఉండగా, వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌లో తాజాగా అమెజాన్ ఇన్వెస్ట్ చేయనుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాపార విస్తరణకు ఊతం.. భారత మార్కెట్‌ను అమెజాన్ కీలకమైనదిగా భావిస్తోంది. ఈ–కామర్స్ వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు 6.5 బిలియన్ డాలర్లు పైగా ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే వాయిస్–యాక్టివేటెడ్ స్పీకర్లు, వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ స్టోరేజీ మొదలైన సొంత ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది. భారతి ఎయిర్‌టెల్‌తో డీల్ కుదిరిన పక్షంలో ఆ సంస్థ నెట్వర్క్ ద్వారా కూడా అమెజాన్ తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవడానికి వీలు పడుతుంది. భారతికి ఉన్న విస్తృతమైన టెలికం ఫైబర్ నెట్వర్క్ ఊతం లభిస్తే తక్కువ ఖర్చుల్లోనే క్లౌడ్ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. రిలయన్స్ జియో ఇదే తరహాలో అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకునేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఆఫ్‌లైన్ రిటైల్‌లో పాగా... ‘మా కస్టమర్లకు మరిన్ని కొత్త ఉత్పత్తులు, కంటెంట్, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ డిజిటల్, ఓటీటీ సంస్థలతో సాధారణంగానే సంప్రతింపులు జరుపుతుంటాం. అంతకుమించి ఇతరత్రా చర్చలేమీ జరపడం లేదు‘ అంటూ ఎయిర్టెల్ ప్రతినిధి స్పందించారు. అటు భవిష్యత్ ప్రణాళికల గురించి ఊహాగానాలపై తాము స్పందించబోమని అమెజాన్ ఇండియా ప్రతినిధి తెలిపారు. 2017లో అమెజాన్ నుంచి షాపర్స్ స్టాప్ రూ. 179 కోట్లు సమీకరించింది. ఇక 2018 సెప్టెంబర్‌లో ఆదిత్య బిర్లా రిటైల్‌కి చెందిన మోర్ స్టోర్స్‌లో విట్‌జిగ్ అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా అమెజాన్ ఇన్వెస్ట్ చేసింది. గతేడాది ఫ్యూచర్ రిటైల్‌లో కూడా వాటాలు కొనుగోలు చేసింది. -
అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు
బెంగళూరు: దేశీ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అనేక ఉత్పత్తులకు ఆన్లైన్ డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకున్న నేపథ్యంలో గిడ్డంగి, డెలివరీ నెట్వర్క్ విభాగాల్లో సీజనల్ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించింది. -
దానవ మానవుల పాతాళ్ లోక్
ఆకాశ హర్మ్యాలలో ఉంటారు కొందరు. నేల మీద ఉంటారు కొందరు. నేలకు దిగువన పాతాళలోకంలో వసిస్తారు కొందరు. పాతాళం అంటే చీకటి. నలుపు. చెడు. హింస. ప్రాణాలకు తెగించి చేసే బతుకు సమరం. కాని పాతాళంలోని బతుకులు ఇలా ఉండటానికి కారణం ఎవరు? నేల మీద ఉన్నవారు, ఐశ్వర్యపు అంచుల్లో బతికేవారు... వీరు తయారు చేసిన వ్యవస్థేనా దీనికి కారణం. ‘అమెజాన్ ఒరిజినల్స్’లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ చూడ్డానికి పైకి ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. నిజానికి ఇది మూసి ఉంచిన భారతీయ సమాజం. తెలిసీ చీకటిలో ఉంచేసే గుగుర్పాటు సమాజం. ఢిల్లీలో యుమునా నది అందరికీ తెలుసు. కాని ‘యమునా పార్’ (యమునకు ఆవల) ఒక ప్రపంచం ఉంది. అది దిగువ స్థాయి ప్రజల ప్రపంచం. స్లమ్స్ ప్రపంచం. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండే ప్రపంచం. ఆ యమునా పార్లో ‘ఔటర్ యమునా పార్’ పోలీస్ స్టేషనే మన కథాస్థలం. అందులో పని చేసే ఒక సాదాసీదా సర్కిల్ ఇన్స్పెక్టరే మన కథా నాయకుడు. అతని పేరు హాతీరామ్ చౌదరీ. కథ ఏమిటి? ఢిల్లీలో ఉన్న ఒక ప్రఖ్యాత న్యూస్ చానల్ హెడ్ మీద హత్యాయత్నం జరగనుందని పోలీసులకు తెలుస్తుంది. హత్య చేయడానికి పక్క ఊర్ల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు యమునా పార్ లాడ్జ్‌లో దిగి ఉన్నారు. ఆ లాడ్జ్ నుంచి బయట పడి హత్యకు బయలుదేరుతుండగా ఒక్క ఉదుటున వెంబడించి అరెస్ట్ చేస్తారు. జరిగిన హత్యాయత్నం ప్రఖ్యాత జర్నలిస్ట్ మీద. అతనికి ఏదైనా అయి ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు. అసలు ఈ చానల్హెడ్ను చంపడానికి ప్లాన్ చేసిందెవరు? అందుకు సిద్ధమైన ఈ నలుగురు ఎవరు? కేసు హాతీరామ్ చౌదరికి అప్పచెప్పబడుతుంది. అతనికి తోడుగా ఒక కుర్ర ఎస్.ఐని ఇస్తారు. వీరిద్దరూ అంత పెద్ద కేసును సాల్వ్ చేయాలి. చేయగలరా? చేయకూడదనే కొందరి ప్లాన్. అందుకే హాతీరామ్కు అప్పజెప్పారు. ఇప్పుడు హాతీరామ్ ఏం చేయాలి? ఒక్క అవకాశం హాతీరామ్ ఒక సగటు మధ్యతరగతి వాడు. జీవితంలో ఏమీ సాధించలేదు. ఇంట్లో భార్య అతడి ఎదుగుదలను కోరుకుంటూ ఉంటుంది. హైస్కూలుకు వచ్చిన కొడుకు తన తండ్రి ఒక హీరోలా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కాని ఒక పోలీస్ వ్యాన్ వేసుకొని, చిరుబొజ్జ పెంచుకుని చిల్లర తగాదాలు, మొగుడూ పెళ్లాల పంచాయితీలు తీరుస్తూ వచ్చిన హాతీరామ్కు ఇది తన జీవితంలో దొరికిన అత్యంత ముఖ్యమైన అవకాశం అనుకుంటాడు. దీనిని ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఎలా? నలుగురు నిందితులు దొరికారు కాబట్టి వీరి నుంచే ఆధారాలు దొరకాలి. వారిని ఇంటరాగేట్ చేయడం మొదలుపెడతాడు. వారిలో ఒకడిది మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్. ఇంకొకడిది పంజాబ్. ఒకడిది మీరట్. ఒకరిది ఢిల్లీ. ఈ నలుగురినీ కలిపింది ఎవరు? హాతీరామ్ తీగలాగుతూ వెళతాడు. మెల్లగా డొంక కదులుతుంది. కథ చివరకు తాను కేసు సాల్వ్ చేసి తీరుతాడు. అంతా మంచే ఉండదు.. ప్రతిదీ చెడే కాదు ఒక హత్యాయత్నం, దాన్ని ప్లాన్ చేసినవారిని పట్టుకోవడం ఇదే కథైతే ఈ సిరీస్ ఇంతమందిని ఆకట్టుకునేది కాదు. కాని ఇది జీవితాలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సమాజ భ్రష్టత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మేడిపండులా కనిపించే వ్యవస్థ కడుపులో ఎంత కుళ్లు ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కులం, మతం, ఆర్థిక అంతరాలు, స్వార్థం... ఇవన్నీ మనిషిని ఎలా మారుస్తాయి ఈ సిరీస్ చెబుతుంది. నేరస్తులు ఎలా తయారవుతారు, ఎందుకు తయారవుతారు, అవడానికి మూలం ఏమిటి ఇది చెబుతుంది. కొందరి పట్ల ఈ దేశంలో ఉన్న వివక్షను, ఛీత్కారాన్ని, అవమానాన్ని చాలా శక్తిమంతంగా చూపిస్తుంది. పోలీసుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మేడల్లో ఉండేవారిలో కూడా మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మంచి చెడు అనేది మనుషుల్లో ఉంటూ మారుతూ ఉండే లక్షణంగా ఈ సిరీస్‌లో కనిపించి ప్రేక్షకుడు తనను తాను చూసుకుంటాడు. కథ గడిచే కొద్దీ ప్రతి పాత్ర మీద ప్రేక్షకుడి అంచనా మారిపోతూ ఉంటుంది. ప్రతి పాత్రను నలుపు తెలుపుల్లో విడగొట్టలేమని తెలుస్తుంది. తరుణ్ తేజ్‌పాల్ పుస్తకంతో ‘తహెల్కాడాట్కామ్’తో తరుణ్ తేజ్‌పాల్ సంచలనం సృష్టించడం అందరికీ తెలుసు. జర్నలిస్టుగా అతను రాసిన ‘ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్’ పుస్తకం ఈ సిరీస్ తీయడానికి ఇన్స్పిరేషన్. పాతాళ్లోక్లో చానెల్ హెడ్ చాలా పేరున్నవాడు. పాలకుల మీద చాలా స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఉంటాడు. ఒక సంభాషణలో అతను లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాడని చెబుతారు. కాని అతను కూడా తన ఉనికి కోసం పతనమవడం ఈ సిరీస్ లో మనం చూస్తాం. మీడియా ఎలాంటి తప్పుడు పనులకు తెగబడుతుందో, తన టి.ఆర్.పిల కోసం ఎవరినైనా ఎలా బలి చేయడానికి సిద్ధపడుతుందో ఇందులో చూపిస్తారు. ఈ ప్రొఫెషన్లో ఉండే వ్యక్తుల భార్యలు ఎలాంటి వొత్తిడికి గురవుతారో, ఎంత యాంగ్జయిటీ ఫీలవుతుంటారో ఇందులో చానెల్ హెడ్ భార్య పాత్ర ద్వారా చూపిస్తారు. ఇందులో డి.సి.పి చెప్పే డైలాగ్ ఒకటి ఉంది– ‘చూడటానికి ఈ వ్యవస్థ ఒక చెత్త కుప్పలా కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్లి చూస్తే ఒక మిషన్ అని అర్థమవుతుంది. ఈ మిషన్‌లో ప్రతి నట్టూ బోల్టు తాము ఏం చేయాలో తెలుసుకొని పని చేస్తుంటాయి. అలా తెలుసుకోని వాటి స్థానంలో కొత్త నట్లూ బోల్టులు వస్తుంటాయి. వ్యవస్థ మాత్రం అలానే నడుస్తుంటుంది’ అని అంటాడతడు. రాజకీయ నాయకులు, పోలీసులు, పెద్ద మనుషులు వీరు ఆడే ఆటలకు పాతాళలోకంలోని సగటు మనుషులు శలభాల్లా నాశనం కావడమే ‘పాతాళ్‌లోక్’ మూల కథాంశం. ఉత్కంఠ రేపే కథనం దాదాపు 40 నిమిషాలు ఉండే ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ నడిచే కొద్దీ తర్వాత ఏం జరుగుతుందా అని కుతూహలం పెరుగుతుంది. కథనం ముందు వెనుకలుగా, పారలల్‌గా నడుస్తూ ఉంటుంది. ఒరిజినల్ లొకేషన్స్‌లో వాస్తవిక ప్రవర్తనతో తీయడం వల్ల ప్రేక్షకుడు తాను ఆ సన్నివేశంలో ఉన్నట్టుగా భావిస్తాడు. ఇందులో ముఖ్యపాత్ర ధారి, హాతీరామ్గా వేసిన నటుడు జైదీప్ అహ్లావత్ ఇంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్లో నటించాడు. ఈ సిరీస్ అతనికి చాలా పేరు తెచ్చింది. సిరీస్‌లో చేసిన వారందరూ పాత్రలు కారేమో అసలు మనుషులే నటిస్తున్నారేమో అనిపించేలా చేశారు. గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘సేక్రెడ్ గేమ్స్’ క్రైమ్ థ్రిల్లర్‌గా చాలా పెద్ద హిట్ అయ్యింది. అమేజాన్‌లో ‘పాతాళ్ లోక్’ అంతకన్నా ఎక్కువ ప్రశంసలు పొందుతోంది. రచయిత సుదీప్ శర్మ రెండేళ్లు కష్టపడి రాసిన ఈ సిరీస్‌ను హిందీ అర్థమయ్యేవారు తప్పక చూడొచ్చు. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఫాలో అవుతూ చూడాలనుకునేవారూ చూడొచ్చు. పాతాళ్ లోక్ (అమెజాన్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్) ఎపిసోడ్ల సంఖ్య: 9 మొత్తం నిడివి: 6 గం.30 నిమిషాలు రచన: సుదీప్ శర్మ దర్శకత్వం: అవినాష్– ప్రొసిత్ రాయ్ నిర్మాత: అనుష్కా శర్మ – సాక్షి ఫ్యామిలీ -
ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం
సినిమా కథను పూర్తి స్థాయిలో మోసేవారే హీరోలయితే ప్రస్తుతం జ్యోతిక, విద్యాబాలన్ సూపర్ హీరోలయ్యారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సిద్ధమయ్యారు ఈ హీరోయిన్లు. జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్ మగళ్ వందాళ్’. విద్యాబాలన్ లీడ్ రోల్లో గణితశాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన హిందీ సినిమా ‘శకుంతలా దేవి’. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కావాలి. లాక్డౌన్ కారణంగా విడుదల కాకపోవడంతో నేరుగా డిజిటల్ (అమేజాన్ ప్రైమ్‌లో) రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్లో రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ అయితే హిందీలో డిజిటల్ రిలీజ్ అవుతున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శకుంతలా దేవి’. ఈ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడంతో థియేటర్‌ను ఓటీటీ దెబ్బ తీస్తుందా? అనే ప్రశ్నకు ఈ ఇద్దరూ ఈ వి«ధంగా సమాధానమిచ్చారు. విద్యాబాలన్ మాట్లడుతూ – ‘‘సినిమాలను ఓటీటీలలో విడుదల చేస్తున్నందుకు సినిమా థియేటర్స్వాళ్లు అసహనానికి గురవుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాను థియేటర్లో విడుదల చేసే అవకాశం లేదు. దాంతో మరోదారి లేక ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని థియేటర్స్ యజమానులు అర్థం చేసుకుంటే బావుంటుంది. మళ్లీ థియేటర్స్ ప్రారంభమయ్యాక అంతా ఎప్పటిలానే ఉంటుంది. సినిమాలు థియేటర్‌కే వస్తాయి. కానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఓటీటీ లాంటివి ఉండటం మంచి పరిణామం’’ అన్నారు. జ్యోతిక మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో సినిమా విడుదల చేయడమనేది కేవలం తాత్కాలికమైనది. పరిస్థితుల దృష్ట్యా అలా చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులకు లేదా దర్శకులకు థియేటర్లలో ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు మించిన గొప్ప ఆనందం మరొకటి ఉండదు. దానికి సరితూగే ఆనందం మరెందులోనూ లేదు. మరికొన్ని రోజుల్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు థియేటర్సే మన ఎంటర్టైన్మెంట్కి ప్రధాన ఎంపిక అవుతాయి. కష్టసమయాల్లో ఓటీటీలాంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటం బావుంది. ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం’’ అన్నారు. ‘పొన్ మగళ్ వందాళ్’ మే 29నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ‘శకుంతలా దేవి’ తేదీని ప్రకటించలేదు. -
2033 నాటికి ముకేశ్ సంపద.. లక్ష కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, దేశీ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో దశాబ్ద కాలంలో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. 2033 నాటికి 75 ఏళ్ల వయసులో.. ఏకంగా 1 లక్ష కోట్ల (ట్రిలియన్) డాలర్ల సంపదతో ట్రిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ సంపద ప్రస్తుతం సుమారు 53.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ వ్యాపారాలపై తులనాత్మక అధ్యయనం చేసే కంపేరిజన్ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి అమెరికన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తొలి ట్రిలియనీర్ హోదా అందుకోనున్నారు. 145 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా చలామణీ అవుతున్నారు. గడిచిన అయిదేళ్లలో ఆయన సంపద సగటున 34 శాతం మేర పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, సంపన్న కంపెనీల చారిత్రక వేల్యుయేషన్లను అధ్యయనం చేయడం ద్వారా ఎవరు, ఎప్పుడు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో చేరతారనేది కంపేరిజన్ అంచనా వేసింది. రెండో ట్రిలియనీర్‌గా చైనా రియల్టర్.. జెఫ్ బెజోస్ తర్వాత చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం జు జియాయిన్ 2027 నాటికి ప్రపంచంలోనే రెండో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. అప్పటికాయన వయసు 75 ఏళ్లు ఉంటుంది. ఇక చైనాకే చెందిన మరో దిగ్గజ సంస్థ ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తదితరులు కూడా వచ్చే దశాబ్దం, దశాబ్దన్నర కాలంలో ట్రిలియనీర్ల లిస్టులో చోటు దక్కించుకోనున్నారు. కంపేరిజన్ మొత్తం 25 మంది కుబేరులపై అధ్యయనం చేయగా, ఇటీవలి కాలంలో వారి సంపద వృద్ధి రేటును బట్టి చూస్తే.. కేవలం 11 మందే తమ జీవితకాలంలో ట్రిలియనీర్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజీలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ గల 25 లిస్టెడ్ కంపెనీలు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 25 మంది వ్యక్తులకు సంబంధించి గత అయిదేళ్ల డేటాను కంపేరిజన్ పరిగణనలోకి తీసుకుంది. గత అయిదేళ్లలో సంపద వృద్ధి చెందిన తీరు ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో పెరుగుదలను లెక్కగట్టడం ద్వారా .. ట్రిలియనీర్ల జాబితాపై ఒక అంచనా రూపొందించే ప్రయత్నం చేసింది. -
గులాబో సితాబో డిజిటల్ రిలీజ్
అందరూ ఊహిస్తున్నదే మొదలవుతున్నట్టుంది. రిలీజ్‌కు సిద్ధంగా ఉండి లాక్డౌన్ వల్ల థియేటర్లలో ఇప్పుడప్పుడే ప్రదర్శనకు నోచుకునే వీలు లేని సినిమాలన్నీ తమ విడుదలకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నాయి. బాలీవుడ్లో ఈ ఒరవడికి ‘గులాబో సితాబో’ తెర తీయనుంది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ సినిమా ప్రసిద్ధ దర్శకుడు సూజిత్ సర్కార్ చేతుల్లో రూపుదిద్దుకుంది. గతంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఇది ఏప్రిల్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ వల్ల, కరోనా అనిశ్చితి వల్ల పూర్వ స్థితి ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేనందున డిజిటల్ రిలీజ్‌కు దర్శకుడు సూజిత్ రంగం సిద్ధం చేశాడు. ఓటీటీ దిగ్గజం అమేజాన్ ప్రైమ్‌లో జూన్ 12వ తేదీన ‘గులాబో సితాబో’ విడుదల కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఒక ముస్లిం ఇంటి యజమానిగా, ఆయుష్మాన్ ఖురానా అతని దగ్గర హిందూ కిరాయిదారుగా నటించారు. ‘‘సరిహద్దులను చెరిపేసే సరదా కథ ఇది’’ అని అమితాబ్ చెప్పారు. ‘‘సినిమాలో నేను, ఆయుష్మాన్ ఖురానా అనుక్షణం పేచీ పడుతుంటాం. కానీ వాస్తవానికి షూటింగ్లో ఇద్దరం ఎంతో అవగాహనతో పని చేశాం’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘అమితాబ్‌తో నటించాలనే నా రహస్య కోరికను సూజిత్ తీర్చినందుకు కృతజ్ఞతలు’’ అని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు. కామెడీ ప్లస్ డ్రామా కలిసిన ఈ సినిమాను డ్రామెడీ అంటున్నారు. దీని కోసం జూన్ 12 వరకు వేచి చూడక తప్పదు.