మెక్‌కెంజీ, జెఫ్ బెజోస్
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భార్యతో కుదుర్చుకున్న విడాకుల ఒప్పందం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ ఒప్పందం ద్వారా ఆయన భార్య మెక్‌కెంజీకి రూ.2.62 లక్షల కోట్ల (38 బిలియన్ డాలర్లు) మొత్తం సొంతం కానుంది. ఈ వారంలోనే ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారుకానుంది. స్వతహాగా రచయిత అయిన మెక్‌కెంజీ(49) ప్రపంచంలో నాలుగో అత్యంత ధనిక మహిళగా మారారు.
ఈ సంపదలో సగం వారెన్ బఫెట్, బిల్‌గేట్స్ స్థాపించిన ది గివింగ్ ప్లెడ్జ్ అనే ధార్మిక సంస్థకే కేటాయించనున్నట్లు గతంలో ఆమె చెప్పారు. అమెజాన్ ప్రారంభించటానికి ముందే 1993లో మెక్‌కెంజీకి బెజోస్‌తో వివాహమైంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. జెఫ్ బెజోస్(55)కు వివాహేతర సంబంధం ఉన్నట్లు వార్తలు రావడంతో వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. బెజోస్ దంపతులకు అమెజాన్‌లో ఉన్న ఉమ్మడి షేర్లలో 25 శాతం మెక్‌కెంజీకి దక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment