Fornication Relationship
-
బెడ్రూమ్లో పక్కింటి వ్యక్తితో భార్య అలా చేస్తూ..
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. కొన్ని సంబంధాలు హద్దులు దాటడంతో అవి చివరకు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. దీంతో వారి పిల్లలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. ఆమెకు పదేళ్ల క్రితం పెళ్లై ఇద్దరు పిల్లలుగా పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. తీరా ఆమె ప్రియుడితో బెడ్ రూమ్‌లో రాసలీలలు కొనసాగిస్తూ భర్త రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. అనంతరం దారుణానికి ఒడిగట్టింది. వివరాల ప్రకారం.. పుర్నియ జిల్లా చకర్పద గ్రామానికి చెందిన పోషిత్ కుమార్‌కు సావిత్రిదేవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, సావిత్రిదేవి వారి ఇంటి పక్కనే ఉండే మరోవ్యక్తి అరవింద్ మహల్దార్‌తో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కాగా, ఓరోజు కుమార్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి సావిత్రి బెడ్రూమ్లో తన ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తమ బండారం బయటపడటంతో ప్రియుడు మహల్దార్‌తో కలిసి సావిత్రి.. కుమార్ మెడకు తాడు బిగించి దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సావిత్రి, అరవింద్ మహల్దార్ను అరెస్ట్ చేశారు. ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. -
పదేళ్లలో 25 సార్లు లవర్స్‌తో జంప్: ‘నా భార్య నాకు కావాలి’
డిస్పూర్: భార్య పరాయి వ్యక్తితో అవసరం ఉండి మాట్లాడితేనే.. అనుమానంతో ఆమెను రాచి రంపాన పెట్టే భర్తలున్నారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ ఓ మహిళ పెళ్లైన నాటి నుంచి దాదాపు 25 సార్లు పరాయి మగాళ్లతో వెళ్లిపోయింది. భార్య ఇలాంటి నీచమైన పని చేసినప్పటికి ఆమె భర్త ఒక్కమాట అనలేదు. పైగా ఆమెతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ వివరాలు.. అసోంలోని నాగావ్ జిల్లా మారుమూల గ్రామం ధింగ్ లహ్కర్కు చెందిన ఓ వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. పదేళ్ల క్రితం అతడికి వివాహం అయ్యింది. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. భార్య అంటే అతడికి ప్రాణం. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ అతడి భార్యకు.. భర్త కన్నా పరాయి పురుషుల మీద ప్రేమ ఎక్కువ. (చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు దొరికి..) ఈ క్రమంలో సదరు మహిళ పెళ్లైన నాటి నుంచి గ్రామంలోని పలువురు యువకులతో వివాహేతర సంబంధాలు నడిపేది. అంతటితో ఆగక వారితో కలిసి ఇంటి నుంచి పారిపోయేది. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చేది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. అలా తిరిగి వచ్చిన ప్రతిసారి భర్త ఆమెను ఆదరించాడు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా భార్యను స్వీకరించేవాడు. (చదవండి: భార్య ఊరికి వెళ్లగానే ఇంటికి పిలిపించుకుని..) ఇలా పదేళ్ల నాటి నుంచి సదరు మహిళ 24 సార్లు పలువురు వ్యక్తులతో వెళ్లిపోయి.. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చింది. ఆమె ప్రవర్తన పట్ల అత్తింటివారు, ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. తిట్టినా.. ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తాజాగా ఈ నెల 4న మరోసారి అనగా 25వ సారి మరో ప్రియుడితో పారిపోయింది. ఈ సందర్భంగా సదరు మహిళ భర్త మాట్లాడుతూ.. ‘‘నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. తన మీద నాకు అసలు కోపం రాదు. ఇక ఇంటి నుంచి పారిపోయి తిరిగి వచ్చిన ప్రతిసారి నా భార్య ఇక మీదట ఇలా చేయను అని ప్రమాణం చేసేది. కానీ మాట మీద నిలబడలేకపోయేది. ఈ సారి కూడా అదే చేసింది. నా చిన్న కొడుక్కి మూడు నెలలుంటాయి. వాడిని పక్కింట్లో వదిలేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. మేకలకు మేత తెస్తాను.. బాబును చూడమని వారికి చెప్పి వెళ్లిపోయింది. ఈ సారి 22 వేల రూపాయల డబ్బు, కొన్ని వస్తువులు తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. ఎవరితో వెళ్లిపోయిందో.. ఎన్నాళ్లకు తిరిగి వస్తుందో తెలియదు’’ అన్నాడు. అంతేకాక ‘‘నేను నా భార్యను నిజాయతీగా ప్రేమిస్తున్నాను. ఈసారి కూడా తను తిరిగి వస్తే ఆహ్వానిస్తాను. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పంచాయతీ పెట్టడం చేయను. పైగా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు. నా భార్య కోసం ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపాడు. చదవండి: ఒక చేత్తో స్కూటీ.. మరో చేత్తో ఆమెను అసభ్యంగా -
కొడుకును కొట్టి చంపింది
జీడిమెట్ల: కడుపున పుట్టిన కొడుకును అక్రమ సంబంధానికి అడ్డుగా తలచింది ఓ కర్కశ తల్లి. ముక్కుపచ్చలారని కొడుకును చేతికందిన దాంతో విచక్షణారహితంగా కొట్టేది. ఆ దెబ్బలకు చిన్నారి తట్టుకోలేక విలవిల్లాడిపోయేవాడు. ‘అమ్మా.. నన్ను కొట్టద్దు అమ్మా’ అంటూ రోదిస్తున్నా.. ఆ తల్లి మనసు కరగలేదు. చివరికి బాలుడు కన్నుమూశాడు. అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఈ అమానుష ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు, బాలుడి తండ్రి కథనం ప్రకారం... సూరారం ప్రాంతానికి చెందిన సురేశ్ ప్రైవేట్ ఉద్యోగి. భార్య ఉదయ, కుమారుడు ఉమేష్(3)లతో కలిసి ఉండేవాడు. కుటుంబకలహాలతో ఉదయ ఏడాదిగా భర్తకు దూరంగా ఉంటోంది. చింతల్ డివిజన్ భగత్‌సింగ్ నగర్లో నివసిస్తున్న ఈమెకు భాస్కర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ తరచూ ఉమేష్‌ను వేధించేవాళ్లు. ఉదయ అయితే తన భర్తపై ఉన్న కోపాన్ని కుమారుడిపై చూపించేది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కసితో బాలుడిని హింసించేది. మంగళవారం మధ్యాహ్నం కరెంట్ వైర్‌తో విచక్షణారహితంగా కొట్టింది. ఆ దెబ్బలు తాళలేక కొద్దిసేపటికి ఉమేష్ సొమ్మసిల్లి, అచేతనంగా పడిపోయాడు. దీంతో సాయంత్రం 4 గంటలకు సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలని కోరింది. పరీక్షించిన డ్యూటీ డాక్టర్ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానించిన ఆస్పత్రి సిబ్బంది జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఉదయ, భాస్కర్ల వివాహేతర సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడనే కొట్టి చంపారని సురేశ్ ఆరోపిస్తున్నారు. -
26 కత్తి పోట్లు: ‘దగ్గరకు వచ్చారో మీకు ఇదే గతి’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి భార్యపై అమానుషంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. కాపాడ్డానికి ప్రయత్నించిన వారిని దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుంది అంటూ హెచ్చరించాడు. దాంతో జనాలు చూస్తూ నిలబడి పోయారు. ఆ వివరాలు. ఢిల్లీకి చెందిన హరీశ్, భార్యతో కలిసి బుధ్ విహార్ ప్రాంతంలో మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే గత కొద్ది రోజులుగా అతడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించసాగాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య దీనికి సంబంధించి వివాదం రాజుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరీశ్.. భార్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భర్త నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ఇంటి నుంచి బయటకు పరిగెత్తింది. ఆమెను వెంబడించిన హరీశ్.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. సుమారు 26 సార్లు భార్యను కత్తితో పొడిచాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. దాంతో హరీశ్ ‘‘దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుందని’’ హెచ్చరిస్తూ.. తన దుశ్చర్యను కొనసాగించాడు. భార్య మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేశారు. చదవండి: దారుణం: భార్యను పొడిచి, ఆపై కారుతో... -
పరువు కోసం కూతురిని కడతేర్చిన తండ్రి
వేంపల్లె: పరువు కోసం ఓ తండ్రి తన కుమార్తెను కడతేర్చాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వేంపల్లె పట్టణం గాండ్ల వీధిలో జరిగింది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన కథనం మేరకు..పోరుమామిళ్ల వనజారాణి (29)కి గురువేంద్రతో 2009లో వివాహమైంది. వీరి కుమార్తె గురు పూజిత మూడో తరగతి చదువుతోంది. గురువేంద్ర బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన క్రమంలో వనజారాణి తన తల్లిదండ్రుల వద్ద ప్రొద్దుటూరులో ఉంటూ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ నుంచి ఆమె భర్త వేంపల్లెకు వచ్చాడు. అప్పటి నుంచి ఆమె తన భర్తతో తనకు విడాకులు ఇవ్వాలని, మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనిపై వారం రోజుల నుంచి భర్తతో ఆమె గొడవపడుతోంది. విషయాన్ని వనజారాణి తల్లిదండ్రులకు గురువేంద్ర చెప్పి ఆమెకు నచ్చజెప్పాలని వారిని కోరాడు. వనజారాణి తండ్రి రాజశేఖర్, చిన్నాన్న జనార్థన్, మరొకరు శనివారం రాత్రి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆమె వినిపించుకోలేదు. దీంతో చున్నీని మెడకు చుట్టి ఆమెను హత్య చేశారు. సీఐ వెంకటేశ్వర్లు తండ్రి, చిన్నాన్న, మరొకరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. -
మహిళ, యువకుడిని స్థంభానికి కట్టేసి..
ఉదయ్‌పూర్ : వితంతు మహిళతో పాటు ఆమె ప్రియుడిగా అనుమానిస్తూ ఓ యువకుడిని కరెంటు స్థంబానికి కట్టేసి మూడు గంటల పాటు దారుణంగా హింసించిన ఘటన రాజస్తాన్‌లో వెలుగుచూసింది. చిత్తోర్‌గఢ్ సమీపంలోని దుంగ్లా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు బాధితుల దుస్తులు చించివేసిన నిందితులు వారిని తీవ్రంగా గాయపరిచారు. ఘటన సమాచారం వెల్లడైన అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బన్సీలాల్, సన్వ్రా, భగ్‌వాన్‌లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుంగ్లాలో 3 ఏళ్ల కుమారుడితో కలిసి బాధిత మహిళ నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆమె ఇంటికి ఓ వ్యక్తి నిత్యావసరాలు అందించేందుకు రాగా, ఆ యువకుడితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించిన గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. మహిళ ఇంటి నుంచి ఆమెను, యువకుడిని బయటకు లాక్కునివచ్చిన గ్రామస్తులు కరెంటు స్థంబానికి వారిని కట్టేసి దారుణంగా హింసించారు. నిందితులు మహిళ దుస్తులను చించారు. ఇక వీరిని నిందితులు తీవ్రంగా హింసిస్తున్నా చుట్టూ చేరిన వంద మంది మౌనం దాల్చారు. కొందరు గ్రామస్తులు నిందితులను వారించినా వారు వినలేదని స్ధానికులు తెలిపారు. స్ధానికులు కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఎస్పీ ఆదేశాలతో దుంగ్లా ఎస్హెచ్ఓ కేసు నమోదు చేసి బాధితులను వైద్య పరీక్షలకు పంపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి : వివాహితపై సామూహిక అత్యాచారం -
రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు దొరికి..
-
రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు దొరికి..
సాక్షి, నల్గొండ : తనను పట్టించుకోకుండా పరాయి మహిళతో సహ జీవనం చేస్తున్న భర్తకు గట్టిగానే బుద్ధిచెప్పిందో భార్య. అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బంధువుల సహాయంతో దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది. కనగల్ మండలం ధర్వేశిపురానికి చెందిన మాధవి అనే మహిళతో చిట్యాల మండలం ఎలికట్టకు చెందిన సాయిబాబాతో 2011లో వివాహం జరిగింది. ( బావతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ) కారు డ్రైవర్‌గా పనిచేసే సాయి.. భర్త చనిపోయిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య భార్యను పట్టించుకోవటం మానేశాడు. సాయి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మాధవి, ఆమె తరపు బంధువులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. -
భార్య, కుమార్తెను హతమార్చి.. కిరాతకం..!
ప్రకాశం,యర్రగొండపాలెం: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భార్యను, కన్న కూతురిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన యర్రగొండపాలెంలోని అంబేడ్కర్ నగర్లో సోమవారం జరిగింది. ఈ హత్యలు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులకు సమాచారం అందింది. స్థానిక ఒక ప్రైవేట్ డెయిరీలో పాలపట్టే వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న కె.ముసలయ్య తన భార్య రేష్మ(21), కుమార్తె సమీర(3)లను హత్యచేసి ఆత్మహత్య కింద చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు చీర కట్టి ఉరివేసుకున్నారని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. ముందుగా కుక్కర్ ప్లగ్ తీగతో గొంతుకు బిగించి హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. హత్య చేసిన తరువాత రేష్మ ఎడమ చేతి మణికట్టును కత్తితో కోసి రక్తపు మరకలు కింద పడకుండా జాగ్రత్త పడినట్లు వారు ఆరోపించారు. (భర్తను ఇంట్లో పూడ్చి.. ప్రియునితో సహజీవనం) ఆడపిల్ల పుట్టిందని వేధించేవాడు.. కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లెకు చెందిన రేష్మను పుల్లలచెరువుకు చెందిన కె.ముసలయ్యకు ఇచ్చి 2016లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.80 వేలు, ఆ తర్వాత రూ.20 వేలు ఇచ్చామని మృతురాలి తండ్రి డి.హుస్సేనయ్య తెలిపాడు. వివాహం జరిగిన ఏడాదిన్నర తరువాత ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి తన కూతురిని తీవ్రంగా వేధించేవాడని మృతురాలి తల్లి జరీనా వాపోయింది. నిత్యం తాగివచ్చి గొడవ పడుతుండేవాడని, ఈ విషయాన్ని తన కుమార్తె ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా కాపురం చేసుకుంటుందని ఆమె తెలిపింది. అయితే ముసలయ్య అక్రమ సంబంధం గురించి అడిగినందుకు రేష్మను అతికిరాతకంగా హత్యచేశాడని, అడ్డువస్తుందని ముక్కుపచ్చలారని పసికందును కూడా గొంతుకు తీగబిగించి హత్య చేశాడని వాపోయింది. మీ కుమార్తె గొడవ పడుతుందని ఆదివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ముసలయ్య ఫోను చేశాడని, అందుకు తాను సర్ది చెప్పినట్లు మృతురాలి తండ్రి హుసేనయ్య తెలిపాడు. కాసేపు ఆగిన తరువాత నా కుమార్తె రేష్మకు ఫోను చేసి మాట్లాడానని, మాట్లాడుతున్న సమయంలో అర్థంతరంగా ఆగి పోయిందని ఆయన తెలిపాడు. రాత్రి 10గంటలు దాటిన తరువాత నీ కుమార్తె ఉరివేసుకొని మరణించిందని ఫోను ద్వారా తెలిపాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో మధ్యాహ్నం 4 గంటల నుంచి కేకలు వినిపిస్తున్నాయని, భార్యభర్తలు గొడవ పడుతున్నారని తాము అనుకున్నామని పరిసర ప్రాంతాలకు చెందిన వారు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం డీఎస్పీ తల్లి, కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హుటాహుటిన యర్రగొండపాలెం చేరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురయిన రేష్మ తల్లిదండ్రులు, బంధువులను ఆయన విచారించారు. తహసీల్దార్ కె.నెహ్రూబాబు శవ పంచనామా కార్యక్రమాలను చేయించారు. ఈ కేసును సీఐ పి.దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్సై పి.ముక్కంటి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను ఇంట్లో పూడ్చి.. ప్రియునితో సహజీవనం
చెరుకుపల్లి(రేపల్లె): మండల కేంద్రమైన చెరుకుపల్లిలో వ్యక్తి అదృశ్యమైన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. మూడు నెలలుగా తన కుమారుడు బల్లేపల్లి చిరంజీవి కనిపించటం లేదని మండల కేంద్రమైన చెరుకుపల్లికి చెందిన బల్లేపల్లి సుబ్బారావు వారం రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో చిరంజీవి భార్య కొల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి అక్కడ సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు ఆమెను విచారించగా నిర్ఘాంత పోయే విషయాలు వెలుగుచూసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడు నెలల క్రితం ప్రియునితో కలిసి భర్తను హత్య చేసి చెరుకుపల్లిలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పూడ్చి వేశారని తెలుస్తోంది. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి కొల్లూరు గ్రామానికి వెళ్లి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. చిరంజీవిని హతమార్చటంలో సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరంజీవికి రెండో భార్య చిరంజీవి మొదటి భార్యతో వివాదం రావటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సమయంలోనే ఇంటూరుకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. చిరంజీవికి కొల్లూరులో మెడికల్ షాపు ఉండేది. ఆ సమయంలో కొల్లూరుకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చిరంజీవికి స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో అతని భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఇటీవల స్థలం అమ్మగా రూ.20 లక్షలు వచ్చాయని, వాటిని ఇంట్లో భద్రపరచగా, అదే రోజు ప్రియునితో కలిసి చిరంజీవిని హత్య చేసి ఆ సొమ్ముతో కొల్లూరు వెళ్లిపోయి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. భయాందోళన చెందుతున్న గ్రామస్తులు చిరంజీవిని పాతిపెట్టారని భావిస్తున్న ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తుండటంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవటంపై స్థానికులు కలవరపడుతున్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తాం దీనిపై రేపల్లె రూరల్ సీఐ బి. శ్రీనివాసరావును వివరణ కోరగా వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును మరింత వేగవంతం చేసి దర్యాప్తు చేపడుతున్నామని, నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
కన్న బంధాన్ని తెంచిన అక్రమ బంధం
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తండ్రిని తల్లితో కలిసి హత్య చేసిన కుమార్తె సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. విల్లుపురం సమీపంలోని వడవంపాళయంకు చెందిన ధనశేఖర్ (45) ఆలయ పూజారి. ఈ నెల 12న ఇంట్లో హత్యకు గురయ్యాడు. ఫిర్యాదు మేరకు విల్లుపురం ఎస్పీ రాధాకృష్ణన్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ధనశేఖర్ భార్య రాజేశ్వరి (40), ఆమె కుమార్తె సత్య (20), పుదుచ్చేరికి చెందిన మురుగవేల్ (30)లను విచారణ చేశారు. విచారణలో సత్యకు వివాహమైన కొద్ది నెలలకే భర్త నుంచి విడిపోయి పుట్టింటికి వచ్చింది. (తనను వ్యభిచారిగా చిత్రీకరించి.. ) భర్తకు బంధువు అయిన మురుగవేల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అతను ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ సంగతి తెలుసుకున్న ధనశేఖర్ కుమార్తెను నిలదీశాడు. ఈ విషయంగా భార్యతో సైతం గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 12న తెల్లవారుజామున 1.45 గంటలకు ఇంటికి వచ్చిన ధనశేఖర్ భార్య, కుమార్తెతో గొడవపడి నిద్రపోయాడు. తల్లి, కుమార్తె అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. నిద్రపోతున్న తండ్రిని సత్య కత్తితో పొడిచింది. రాజేశ్వరి కత్తిపీటతో గొంతు కోయడంతో అతను మృతి చెందాడు. మురుగవేల్‌ను ఇంటికి రప్పించి హత్య చేసిన ఆనవాళ్లు లేకుండా చేశారు. పోలీసులు రాజేశ్వరిని, సత్య, మురుగవేల్‌ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ముగ్గురిని విల్లుపురం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
భార్య ఊరికి వెళ్లగానే ఇంటికి పిలిపించుకుని..
ఉప్పల్: వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారి తీసింది. ఉప్పల్ సీఐ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం మూసిపట్ల గ్రామానికి చెందిన డి.అంజయ్య(30) చిలుకానగర్‌లో ఉంటూ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య 18 ¯ðనెలల కుమారుడిని తీసుకొని తల్లిగారింటికి వెళ్లింది. అంజయ్యకు నాచారం ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి రేణుక(30)తో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉంది. భార్య ఊరికి వెళ్లగానే ఆదివారం రాత్రి అంజయ్య రేణుకను తన గదికి తెచ్చుకున్నాడు. రాత్రి మద్యం తాగిన తర్వాత రేణుక తన అవసరం నిమిత్తం డబ్బులు కావాలని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన అంజయ్య ఖాళీ బీరు సీసాతో రేణుకను కొట్టడంతో తల పగిలింది. వెంటనే కాలుతో మెడపై నొక్కి హత్య చేసి పారిపోయాడు. మృతురాలికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కర్ణాటక ప్రాంతానికి చెందిన రేణుక భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి ఉంటోంది. సోమవారం ఉదయం స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఉప్పల్ సీఐ రంగస్వామి, ఎస్ఐ మైబెల్లి ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
తమ్ముడే అక్కను కడతేర్చాడా?
పులివెందుల: పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఆదివారం హత్య జరిగింది. పోలీసుల కథనం మేరకు ఎస్బీఐ కాలనీలో నివాసం ఉన్న శివరాణి(35) గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైంది.ఈమె తన భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోయి ఒంటరిగా నివాసం ఉండేది.ఇద్దరు కుమారులను భర్త వద్దనే వదిలేసి వచ్చింది. పులివెందులలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేది. ఆదివారం ఉదయం10 గంటలు అవుతున్నా శివరాణి ఇంటినుంచి బయటికి రాలేదు. దీంతో చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ సంఘటాన స్ధలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తలపై బలమైన గాయాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడే కడతేర్చాడా? శివరాణి హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.శివరాణి తండ్రి ఆర్టీసీ సంస్థలో పనిచేస్తూ రిటైరయ్యారు. మొదటి భార్య మరణించడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె శివరాణి. రెండో భార్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల రెండో భార్య కుమారునికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి కుమార్తె బంధువులకు శివరాణి ఫోన్ చేసి తమ్మునిపై లేనిపోని మాటలు చెప్పింది. వివాహం రద్దయ్యేలా చేసింది. దీంతో అతను శివరాణిపై కక్ష పెంచుకున్నాడు . ఈనేపథ్యంలో హత్య జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శివరాణికి పట్టణంలోని యువకునితో వివాహేతర సంబంధం ఉంది. వడ్డీ డబ్బుల విషయంలో ఆమె దురుసుగా ప్రవర్తిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధం.. దారుణ హత్య
కుత్బుల్లాపూర్: తాను సన్నిహితంగా ఉన్న మహిళతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీలో మాధవరావు అనే వ్యక్తి మేస్త్రీగా పని చేస్తూ అదే భవనంలో ఉంటున్నాడు. పక్కనే ఉంటున్న పోచమ్మ అనే మహిళతో చనువుగా ఉంటున్నాడు. గతంలో పోచమ్మ మెదక్ జిల్లాలో ఉండగా కృష్ణ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఈ విషయంపై కుల పెద్దలు పంచాయితీ పెట్టి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే పోచమ్మ, కృష్ణ ఇద్దరు కలిసి రెండు నెలల క్రితం అక్కడి నుంచి ప్రగతినగర్‌కు వచ్చారు. బంధువులు చివరికి వీరిద్దరిని గుర్తించి మరోసారి మందలించారు. మకాం మార్చి భాగ్యలక్ష్మి కాలనీలో ఉంటున్నారు. వీరి పక్కనే కొత్తగా భవన నిర్మాణం చేపట్టే మాధవరావుతో పోచమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో చనువుగా ఉంటూ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన కృష్ణ గురువారం మధ్యాహ్నం వరకు పోచమ్మతో ఉండి ఊరికి వెళ్లొస్తానని చెప్పి సాయంత్రం మరో సారి ఫోన్ చేశాడు. ఫోన్లో రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా ఇంట్లో లేదు. పక్కనే ఉన్న మాధవరావు గదికి వెళ్లగా అక్కడే ఉంది. కోపోద్రిక్తుడైన కృష్ణ బయటకు వెళ్లి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా నిద్రపోతున్న మాధవరావుపై కత్తితో దాడి చేసి బండరాయితో మోది హత్య చేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మన్సూర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
కోడలితో వాహేతర సంబంధం.. హత్య
అన్నానగర్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్రిని శనివారం కుమారుడు హత్య చేశాడు. కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలో కృష్ణాపురం ఎంకే నగర్‌కి చెందిన మునియప్పన్ కూలీ కార్మికుడు. ఇతనికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. అందరికీ వివాహం జరిగింది. ఇతని భార్య మృతి చెందడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న నాల్గో కుమారుడు వేలన్ (45) కూలిపని చేస్తూ వస్తున్నాడు. ఇతనికి మల్లికా (40) అనే భార్య ఉంది. శుక్రవారం మద్యం సేవించి తండ్రిని చూడడానికి వెళ్లాడు. అక్కడ నిద్రపోతున్న మునియప్పన్ మీద రాయి వేసి హత్య చేశాడు. తరువాత తండ్రిని హత్య చేసినట్లు తన సహోదరుడికి శనివారం తెలిపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేలన్ని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన వాంగ్మూలంలో తన భార్య మల్లికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీన్ని ఖండించినా అతను వినలేదని తెలిపాడు. తానే తండ్రి అని చూడకుండా అతనిపై రాయి వేసి హత్య చేసినట్టు వేలన్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
భార్య తల, మొండం వేరు చేసిన కసాయి భర్త
ఆ చిన్నారుల కళ్లలో బేల చూపులు.. రాత్రి పక్కనే గుండెలపై చేయి వేసి నిద్దుర పుచ్చిన అమ్మ .. తెల్లవారే సరికి శాశ్వతంగా నిద్దురలోకి జారిపోయింది. ఏ రాత్రి వేళో, వేకువ వేళో డబ్బులిచ్చి తలపై ప్రేమగా నిమిరే నాన్న చేతులు.. బేడీలతో కటకటాల వెనక్కి వెళ్లి ముడుచుకుపోయాయి. మద్యం మత్తులో కర్కశంగా మారిన తండ్రి మూర్ఖత్వానికి ఇద్దరు పసివాళ్ల జీవితాలు అనాథగా మారాయి. వివాహేతర సంబంధం వద్దన్నందుకు భార్య తలను నరికిన కసాయి భర్త ఉదంతం కలకలం రేపింది. గుంటూరు ,సత్తెనపల్లి: కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జరిగింది. అర్బన్ సీఐ ఎస్.విజయ చంద్ర తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ముప్పన శ్రీనివాసరావుకు తండ్రి మరణంతో లింగంగుంట్ల మేజర్‌పై ఉద్యోగం వచ్చింది. పిల్లుట్ల గ్రామానికి చెందిన మాండ్ల అంకమ్మ (35)ను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఐదేళ్ల క్రితం శ్రీనివాసరావు సాధారణ బదిలీల్లో భాగంగా ఫిరంగిపురం మండలానికి బదిలీ అయ్యాడు. కొండవీడు మేజర్‌పై లస్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, పిల్లలను సత్తెనపల్లిలోని ఎన్ఎస్పీ కాలనీలో ఉంచి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఫిరంగిపురంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని నిత్యం మద్యం సేవిస్తూ భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇంటికి రావడం పూర్తిగా తగ్గించాడు. జీతం ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో భార్య అంకమ్మకు అనుమానం వచ్చి కొద్దిరోజుల క్రితం ఫిరంగిపురం వెళ్లి భర్త శ్రీనివాసరావు ఉంటున్న ఇంటిని పరిశీలించింది. అక్కడ భర్త శ్రీనివాసరావు మరో మహిళతో ఉండటం ప్రత్యక్షంగా చూసింది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అనంతరం తన భర్తను వెంట పెట్టుకుని అంకమ్మ సత్తెనపల్లి వచ్చింది. శ్రీనివాసరావు ఎప్పుడు వచ్చినా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత రావడం, తెల్లవారుజామున 3, 4 గంటల మధ్య వెళ్లిపోవడం చేస్తుంటాడు. రెండు రోజులుగా భార్యతో భర్త శ్రీనివాసరావు గొడవ పడుతున్నాడు. సోమవారం రాత్రి పూటుగా మద్యం సేవించి భార్య అంకమ్మతో గొడవకు దిగాడు. అంకమ్మ జరిగిన ఘటనను తొమ్మిది గంటల సమయంలో తన సోదరుడు అంకారావుకు ఫోన్లో చెప్పింది. అర్ధరాత్రి సమయంలో శ్రీనివాసరావు గొడవ చేస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తేల్చి చెప్పింది. పోలీసుస్టేషన్‌కు బయలుదేరి వెళుతుండగా కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు మొండి కొడవలితో వెనుక నుంచి వచ్చి ఎన్ఎస్పీ బంగ్లా వద్ద అతి కిరాతకంగా నరికాడు. తల, మొండం వేరు చేశాడు. తలను పట్టుకుని పారిపోయేందుకు యత్నించగా సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలను పట్టుకున్న శ్రీనివాసరావును సీఐ ఎస్.విజయచంద్ర అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరుడు మాండ్ల అంకారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వదినతో వివాహేతర సంబంధం..ఇంటికి పిలిపించి
కడ్తాల్: కడ్తాల్ మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో స్నేహితుడే తన ఇంటికి రప్పించుకుని, కుటుంబ సభ్యులతో కలిసి గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్ (28) వృత్తిరీత్యా ప్రైవేటు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిçన కిరణ్ స్నేహితుడైన ఏదుల మహేష్.. కిరన్‌కు ఫోన్ చేసి తన ఇంటికి రమ్మని కోరడంతో కిరన్ అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో మహేష్ ఇంటికి వెళ్లాడు. ఇంటికి వచ్చిన కిరణ్‌ను.. మహేష్ తన వదినతో వివాహేతర సంబంధం విషయమై నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలోనే అక్కడికి మహేష్ సోదరుడు, వదిన కూడా రావడంతో గొడవ పెద్దదైంది. దీంతో మహేష్, అతని సోదరుడు శ్రీశైలం, వదిన రమాదేవితో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కిరణ్‌ను గొడ్డలితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పథకం ప్రకారమే మహేష్ కుటుంబ సభ్యులు తన కుమారుడిని ఇంటికి పిలిపించుకుని కొట్టి చంపారని కిరణ్ తండ్రి కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తన కుమారుడి హత్యకు మహేష్, శ్రీశైలం, రమాదేవి, కళమ్మ, లాలయ్య, సురేష్, మాసని రాజు కారణమని, విచారణ జరిపి న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గ్రామంలో భయాందోళనలు.... కిరణ్ హత్యతో మర్రిపల్లి గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. మర్రిపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా కిరణ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టి అడ్డుకున్నారు. ఎసీపీ వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎసీపీ సురేందర్, సీఐ నర్సిహ్మారెడ్డి మర్రిపల్లి గ్రామానికి చేరుకుని కిరణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకున్నారు. క్లూస్‌టీం సభ్యులు హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించారు. కడ్తాల్ ఎస్హెచ్ఓ సుందరయ్య ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
భర్తకు అక్రమ బంధం గురించి తెలిస్తే బాగుండదని..
తలకొండపల్లి: ఓ వ్యక్తి గొంతు కోసి అడవిలో వదిలేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 10న ఫరూక్నగర్ మండలం వెంకన్నగూడెంకు చెందిన కొడావత్ రాజును గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి మండలంలోని నల్లమెట్టు అటవీ శివారు ప్రాంతంలో వదిలేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసులో రాజు భార్య శాంతిని, బామ్మర్ది శీనును, ఫంక్షన్‌హాల్ ఓనర్ ఎండీ యూసూప్, ఆయన చిన్నాయన జహీరోద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఎస్ఐ బీఎస్ఎస్ వరప్రసాద్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. (గొంతు కోసి.. అడవిలో వదిలేసి) రెండేళ్ల క్రితం.. బాధితుడు రాజు రెండేళ్ల కితం తన భార్య పిల్లలతో కలిసి కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరి సంసారం సాఫీగా సాగిపోసాగింది. ఏడాది కితం రాజు భార్య శాంతికి ఫంక్షన్ హాల్ ఓనర్ ఎండీ యూసూఫ్‌తో పరిచయం ఏర్పడింది. వీరు పరిచయం కాస్తా ప్రేమగా ఏర్పడి వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొన్ని రోజులుగా అన్యోన్యంగా ఉండసాగారు. భవిష్యత్‌లో రాజుకు అక్రమ సంబంధం గురించి తెలిస్తే బాగుండదని వీరిరువురు (శాంతి, యూసూఫ్) ఒక్క నిర్ణయానికి వచ్చారు. మన అక్రమ సంబంధానికి అడ్డు పడుతాడని భావించారు. ముందు జాగ్రత్తగా రాజును హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు శాంతి అన్న శ్రీను, యూసూప్ చిన్నాయన జహీరోద్దీన్‌ల సహకారం తీసుకున్నారు. నలుగురు కలిసి పక్కా ప్లాన్ వేశారు. బయటికి వెళదామని.. ఈనెల 10న రాజుకు మాయమటలు చెప్పి బయటికి వెల్దామని ఆ నలుగురు చెప్పారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి రాజుతో పాటు నలుగురు కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో రాజుకు మందు తాగించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మండలంలోని నల్లమెట్టు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రాజు దిగి మూత్రం పోస్తుండగా ఈ నలుగురు ఆయనను పొదల్లోకి లాక్కుపోయారు. చాక్‌తో గొంతు కోశారు. తీవ్రమైన రక్తం కారడంతో రాజు చనిపోతాడని భావించి వదిలేశారు. రాజు నడుచుకుంటూ మరుసటి రోజు ఉదయం రోడ్డు పైకి వచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చికిత్స నిమిత్తం రాజును హైదరాబాద్ ఈఎన్టీ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలిసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా వ్యూహంతో వల పన్ని పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్ఐ చెప్పారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..
అనంతగిరి: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన అనంతగిరి గుట్ట అడవిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులో చూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన చెన్నయ్య(38), శశికళ దంపతులు, వీరికి పిల్లలు ప్రవీణ్, పావని ఉన్నారు. అయితే, చెన్నయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే, ఆయన భార్యకు వరుసకు మరిది అయ్యే రమేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన చెన్నయ్య భార్యతో కొంతకాలంగా గొడవపడుతున్నాడు. ఈనేపథ్యంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని శశికళ భావించి పథకం వేసింది. అయితే, మద్యానికి బానిసైన చెన్నయ్యకు అనంతగిరిలో చెట్లమందు ఇస్తారని శశికళ, రమేష్ నమ్మబలికారు. ఈనెల 6న అతడిని వికారాబాద్‌కు బస్సులో తీసుకొచ్చారు. మార్గంమధ్యలో కూడా చెన్నయ్యకు మద్యం తాగించారు. అనంతరం అక్కడి నుంచి అనంతగిరికి చేరుకుని పథకం ప్రకారం చెన్నయ్యకు పూటుగా మరికొంత మద్యం తాగించారు. ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత వాటర్ ట్యాంకు సమీపంలోని ఘాట్ వద్ద ఒక్కసారిగా లోయలోకి తోసేసి అతడిపై రాళ్లు వేసి చంపేశారు. మృతదేహం ఎవరికీ కనిపించకుండా చెట్లకొమ్మలు, మట్టితో కప్పేశారు. నాలుగు రోజుల క్రితం తల్లి మృతి ఇదిలా ఉండగా చెన్నయ్య తల్లి నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఒక్కగానొక్క కొడుకైన చెన్నయ్య కోసం సాయంత్రం వరకు ఎదురు చూసినా ఆయన జాడ లభించకపోవడంతో అదేరోజు సాయంత్రం వరకు చూసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆదివారం చెన్నయ్య తల్లి మూడు రోజుల కార్యక్రమం పూర్తయింది. అదేరోజు సాయంత్రం పలువురు బంధువులు చెన్నయ్య విషయమై భార్య శశికళను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అనుమానంతో రమేష్‌ను గ్రామపెద్దల సమక్షంలో నిలదీయగా అసలు విషయం బయట పెట్టాడు. గ్రామస్తులు, బంధువులు కలిసి మంగళవారం అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి వారిసాయంతో వికారాబాద్ పోలీసులను ఆశ్రయించారు. రెండుఠాణాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. వివరాలు సేకరించి, అక్కడే పంచనామా చేశారు. కాగా, విషయం వెలుగుచూడటంతో శశికళ తన స్వగ్రామంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మిస్డ్ కాల్‌తో ఏర్పడ్డ ప్రేమ కారణంగా..
చెన్నై, అన్నానగర్: మిస్డ్ కాల్‌తో ఏర్పడ్డ ప్రేమ కారణంగా ఇద్దరు పిల్లలను వదిలేసి వివాహం కాలేదని ఓ యువకుడిని మోసం చేసిన మహిళను ప్రస్తుతం ఇద్దరు భర్తలు, బంధువులు ఆమెను అంగీకరించలేదు. తమిళనాడులోని నెల్లై జిల్లా సేరన్ మహాదేవికి చెందిన కూలీ కార్మికుడికి పాళయంకోటై కృష్ణాపురానికి చెందిన బంధువు మహిళకి గత పదేళ్లకు ముందు వివాహం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల పరామర్శలతో పెరుగుతూ వచ్చిన ఆ మహిళ వద్ద నగలు, నగదు వంటివి ఏమీ తీసుకోకుండా కూలీ కార్మికుడు వివాహం చేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో ఒక్కటిన్నర సంవత్సరాల ముందు ఆ మహిళకి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. కాయత్తార్‌కి చెందిన యువకుడితో పరిచయమై కాలక్రమేణా ప్రేమగా మారింది. ప్రేమ మత్తులో ఉన్న ఆ మహిళ ఆ యువకుడి వద్ద తనకు వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టింది. ప్రియుడిని కలవడానికి వెళ్లినప్పుడు మంగళసూత్రాన్ని తీసేసి బ్యాగులో పెట్టుకుని ఊరు తిరిగింది. 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడానికి పథకం వేశారు. అనంతరం ఆ మహిళ గత 20వ తేదీ నాగర్‌కోవిల్‌లో ఇంటర్వ్యూ అని భర్తకు చెప్పి వెళ్లింది. తరువాత ప్రియుడితో తెన్కాశి సమీపంలో సుందరపాండియన్ పురానికి వెళ్లిన ఆ మహిళ ప్రియుడి బంధువుల ముందు 24వ తేదీ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలియని భర్త తన భార్య కనబడడం లేదని, భార్యను కనిపెట్టి ఇవ్వమని సేరన్ మహాదేవి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఫొటోని ఆ మహిళ తన ఫొన్లో స్టేటస్‌గా పెట్టింది. దీన్ని ఆమె బంధువులు, కుటుంబీకులుకు తెలిపిన అనంతరం వారు సేరాన్ మహాదేవి పోలీసులకు తెలిపారు. వారు కయత్తార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు జులై 1వ తేదీ ఇద్దరినీ పిలుచుకుని విచారణ చేసినప్పుడు ఆ మహిళకు ముందుగానే వివాహం జరిగి పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అనంతరం ఆ యువకుడు ఆమెను అంగీకరించలేదు. సేరణ్ మహాదేవి పోలీసులు గత రెండో తేదీ సేరన మహాదేవిని పిలుచుకుని వెళ్లి వచ్చారు. దీనిపై భర్త, బంధువులకు తెలిపితే వారు కూడా ఆమెను అంగీకరించలేదు. ఆమెను ఆ రోజు రాత్రి సేరన్ మహాదేవిలో ఉన్న కరోన శిబిరంలో ఉంచారు. మరుసటి రోజు కృష్ణాపురంలో ఉన్న బంధువులకు సమాచారం తెలిపి వారి పర్యవేక్షణలో వాగ్వాదం ఏర్పడింది. ఇందులో ఆ మహిళను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరలా ఆ మహిళను సేరన్ మహాదేవి శిబిరానికి పంపారు. వేరే జిల్లా నుంచి మహిళ రావడం వల్ల ఆమెకు జులై 4వ తేదీ వరకు కరోనా పరిశోధన చేశారు. శిబిరంలో ఉన్న మిగతా వారికి పరిశోధన ముగిసి రిజల్ట్ వచ్చిన స్థితిలో ఈమెకి మాత్రం రిజల్ట్ వెయిటింగ్లో ఉంది. మూడు రోజులుగా ఆ మహిళ శిబిరంలోనే ఉంది. -
ఆమె నాకు పిన్ని వరస.. అందుకే హత్య
చెన్నై, అన్నానగర్: తమిళనాడులోని కావేరి పట్టణంలో వివాహేతర సంబంధంతో యువకుడు మద్యం బాటిల్‌తో పిన్నిని హత్య చేశాడు. పోలీసులు అతన్ని శనివారం అరెస్ట్ చేశారు. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలోని పొత్తపురమ్ మణిమాడికొట్టాయి ప్రాంతానికి చెందిన మలర్ (38) భర్త మృతి చెందాడు. అప్పడాలు తయారుచేసి విక్రయిస్తూ జీవిస్తోంది. రెండు రోజులకు ముందు రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి బయలుదేరింది. రాత్రి చాలాసేపు అయినా గానీ ఆమె ఇంటికి రాలేదు. బంధువులు వేర్వేరు స్థలాల్లో వెదికినా ఆమె ఆచూకీ లభించలేదు. శనివారం పొత్తాపురం సమీపంలో ఉన్న కాలువలో మలర్ శవంగా పడి ఉంది. కావేరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా మలర్‌కి, ఆమె బంధువు అయిన గాంధీ (28)కి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. గాంధీని పట్టుకుని పోలీసులు విచారించగా అతడు మలర్‌ను హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. ‘మలర్ నాకు పిన్ని వరస. అయినా ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్ని రోజుల ముందు ఆమెకు మరొకరితో పరిచయం ఏర్పడింది. మందలించినా ఆమె వినకుండా అతడితో చనువుగా ఉంటూ వచ్చింది. ఈ విషయమై మా మధ్య గొడవ జరిగింది. ఘటన జరిగిన రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న నేను క్వార్టర్ బాటిల్‌ను పగులగొట్టి తలపై పొడిచి హత్య చేశాను. తరువాత ఆమెను కాలువలో విసిరేసి వెళ్లిపోయాను’ అని గాంధీ వెల్లడించాడు. -
అధికార పార్టీ నేత సంబంధం గుట్టు రట్టు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అధికార పార్టీ నాయకుడిని తండా గిరిజనులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న నాయకుడికి గిరిజనులు దేహశుద్ధి చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల వివరాల మేరకు.. వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత బానోతు విఠల్‌నాయక్ సీతారాంనాయక్‌తండాకు చెందిన ఓ మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మహిళ ఇంటికి వెళ్లగా స్థానికులు గమనించి నిఘా ఉంచారు. రాత్రి పదకొండు సమయంలో మహిళ ఇంటి నుంచి విఠల్ బయటకురావడంతో గ్రామస్తులు పట్టుకున్నారు. వివాహేతర బంధంపై నిలదీయగా సరైన సమాధానం రాకపోవడంతో గిరిజనులు విఠల్పై మూకుమ్మడిగా దాడికి దిగారు. తండావాసులంతా గుమిగూడడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విఠల్‌తోపాటు మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివాహేతర సంబంధంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బావతో కలిసి భర్తను మట్టుబెట్టింది..
తూర్పుగోదావరి ,మారేడుమిల్లి: వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. తూర్పు ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి మండలం కూడూరులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై డి.రామకృష్ణ కథనం ప్రకారం కూడూరుకు చెందిన కత్తుల సోమిరెడ్డి(39), భవానీ భార్యా భర్తలు. అదే గ్రామానికి చెందిన కత్తుల సూర్యనారాయణ రెడ్డితో భవానీకి వివాహేతర సంబంధం ఉంది. సూర్యనారాయణ రెడ్డి భవానీకి వరుసకు బావ అవుతాడు. అయితే భార్య భవానీపై అనుమానం వచ్చి, సోమిరెడ్డి ఆమెను ప్రశ్నించడంతో ఇరువురు మద్య గొడవ జరిగింది. దీంతో సోమిరెడ్డి భవానీని మందలించడంతో ఆమె ఆగ్రహించి బుధవారం తెల్లవారుజామున గ్రామానికి సమీపంలోని కొండపోడు వద్ద నివాసముంటున్న కత్తుల సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లిపోయింది. (తల్లి వివాహేతర సంబంధం; ఇద్దరు కుమారులు..) ఆమె వెనకాలే సోమిరెడ్డి అక్కడికి వెళ్లాడు. దీంతో ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భవానీ, సూర్యనారాయణరెడ్డి కలసి సోమిరెడ్డి గొంతు నులిమి, కర్రతో కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలోని గోతిలో పడేశారు. ఉదయం తనకేమి తెలియనట్టు ఇంటికి తిరిగి వచ్చి తన భర్త కనిపించడం లేదని గ్రామస్తులతో తెలిపింది. గ్రామస్తులందరూ చుట్టు పక్కల గాలించగా ఊరికి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సీఐ రవికుమార్, ఎస్సైలు రామకృష్ణ, సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. హత్యకు వినియోగించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నిందితులు పరారయ్యారు. మృతదేహాన్ని పరిశీలించిన ఏఎస్పీ రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ కూడూరు గ్రామంలో హత్యకు గురైన సోమిరెడ్డి మృతదేహాన్ని, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
తల్లి వివాహేతర సంబంధం; ఇద్దరు కుమారులు..
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధం కారణంగా తల్లి ప్రియుడితో పారిపోవడంతో ఆమె కుమారులు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. పుదుకోట నామన సముద్రం ప్రాంతానికి చెందిన వెంకటాచలం (47) కూలీ కార్మికుడు. అతని భార్య జయదీప (40). వీరికి విఘ్నేశ్వరన్ (20), యోగేశ్వరన్ (18) ఇద్దరు కుమారులున్నారు. విఘ్నేశ్వర పుదుకోటై ప్రభుత్వ కళాశాలలో బి.కాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. యోగేశ్వరన్ ప్రైవేటు పాలిటెక్నికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వెంకటాచలం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబం నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇద్దరు కుమరులతో జయదీప జీవనం సాగిస్తున్నారు. రెండు రోజులకు ముందు తన తల్లి వివాహేతర సంబంధం ఉన్న ప్రియుడితో కలిసి ఇల్లు వదలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు కుమారులు తీవ్ర ఆందోళన, విరక్తితో కనబడినట్లు తెలిసింది. వీరిద్దరూ శుక్రవారం ఉదయం చాలా సేపు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి చూడగా విఘ్నేశ్వరన్, యోగేశ్వరన్ ఇద్దరూ తన తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వా«దీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. -
కొండగట్టు మెట్లపై హత్య..
మల్యాల(చొప్పదండి): కొండగట్టు మెట్లపై 2017 నవంబర్‌లో జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను గొంతుపై బీరుసీసాతో కోసి చంపిందని జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి తెలిపారు. విలేకరుల సమావేశంలో హత్యకేసు మిస్టరీని వివరించారు. తిమ్మాపూర్ అనుబంధ గ్రామం మక్తపల్లికి చెందిన పాలేటి సంపత్ కొంతకాలం దుబాయ్ వెళ్లి వచ్చాడు. గ్రామంలో ఇల్లు కట్టుకుంటుండగా, ఆయన స్నేహితుడు పెంట సాగర్ తరచూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సంపత్ భార్య స్వరూపతో సాగర్‌కు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం సంపత్‌కు తెలియడంతో స్వరూపను హింసించడం ప్రారంభించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని స్వరూప నిర్ణయించుకుంది. 2017 నవంబర్ 11న సంపత్ కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లాడు. ఈనేపథ్యంలో ప్రియుడు సాగర్‌తోపాటు స్వరూప, ఆమె తమ్ముడు చింత రాము అదే రోజు కారులో కొండగట్టు వెళ్లారు. సంపత్ బీరు తాగుతూ మెట్లదారి వెంట వెళ్తుండగా ముగ్గురు అతడిపై ఒకేసారి దాడికి దిగారు. సంపత్ చేతులను రాము వెనక్కి విరిచిపట్టుకోగా, భార్య తల వెంట్రుకలు పట్టుకుంది. ఈక్రమంలో సంపత్ చేతిలో ఉన్న బీరు బాటిల్‌ను సాగర్ తీసుకొని పగులగొట్టి గొంతులో పొడిచాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆయన సెల్‌ఫోన్‌తోపాటు, పర్సు తీసుకెళ్లారు. కొండగట్టు మెట్లపై హత్య జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి ఎస్సై నీలం రవి హత్య కేసుగా నమోదు చేశారు. మరునాడు ఇతరుల ద్వారా సమాచారం తెలిసిందనట్లుగా భార్య స్వరూప ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న భర్త మృతదేహాన్ని గుర్తుపట్టింది. భర్తకు అప్పులు ఉన్నాయని, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులకు వివరించింది. కథ మలుపు తిరిగిందిలా.. కొండగట్టు మెట్లపై సంపత్ హత్యకు గురికావడంతో పాటు ఆయన సెల్‌ఫోన్, పర్సు మాయమయ్యాయి. దీంతో సీఐ కిశోర్ సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. సంపత్ చనిపోయిన రోజు నుంచి సెల్‌ఫోన్ వినియోగంలో ఉంది. దీంతోపాటు మృతుడి సిమ్, ఫోన్ భార్య వినియోగిస్తుండడంతో మరింత అనుమానానికి బలం చేకూరింది. తన భర్తకు అప్పులున్నాయని చెప్పడం, సంపత్‌కు గ్రామంలో సుమారు కోటి రూపాయల ఆస్తి ఉండడం తదితర అంశాలపై దృష్టి సారించారు. విచారణ చేపట్టగా హత్య మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. సాగర్‌పై హత్య కేసుతో పాటు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడి ఆత్మహత్యాయత్నం.. మల్యాల సీఐగా కిశోర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండలంలోని కేసుల పరిష్కారంపై దృష్టిసారించారు. ఈ క్రమంలో 2017లో జరిగిన హత్య కేసు విచారణ ప్రారంభించారు. పెంట సాగర్‌ను 28 ఫిబ్రవరి, 2020న మల్యాల పోలీస్‌స్టేషన్‌కు పిలిపించగా, ఇద్దరుముగ్గురు ప్రజాప్రతినిధులతో స్టేషన్‌కు వచ్చాడు. ఈక్రమంలో స్టేషన్ ఆవరణలోని బాత్రూంలో బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ కిశోర్ హుటాహుటిన సాగర్‌ను జగిత్యాలకు అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించి వైద్యం అందించగా నిందితుడు కోలుకున్నాడు. సీఐ కిశోర్‌కు అభినందన.. రెండున్నరేళ్ల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని ఛేదించిన మల్యాల సీఐ కిశోర్‌ను ఏఎస్పీ దక్షిణామూర్తి అభినందించారు. డిపార్ట్మెంట్ పరమైన రివార్డుకు కిశోర్ పేరు సిఫార్సు చేస్తామని అన్నారు. కానిస్టేబుల్ సంపత్‌కు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిశోర్, మల్యాల ఎస్సై నాగరాజు, పెగడపల్లి ఎస్సై నవత పాల్గొన్నారు. -
కాళ్ల పారాణి ఆరకముందే...
కర్ణాటక, మైసూరు : తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భరించలేని భార్య ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇక్కడి ఆనంద నగరకు చెందిన భావన (24) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భావనకు నెల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు నుంచే అజయ్ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. (అక్కాచెల్లెలు అదృశ్యం.. ) ఆ మహిళకు చెందిన ఫొటోలు అజయ్ మొబైల్లో ఉండటం, ఇద్దరూ నగ్నంగా ఉన్న ఫొటోలు కనిపించడంతో భావన అజయ్‌ను నిలదీసింది. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దల వరకు వెళ్లింది. అనంతరం పెద్దలు ఇద్దరికి రాజీ కూడా చేశారు. అయినా కూడా భర్తలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర ఆవేదనతో శుక్రవారం ఉదయం భావన తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ప్రేమ.. పెళ్లి.. వేధింపులు!) -
తాళ్లతో కట్టేసి.. బ్లేడుతో మర్మాంగాలు కోసి
పశ్చిమగోదావరి, టి.నరసాపురం: భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలతో ఏకంగా కట్టుకున్న భార్య భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో జరిగింది. సినీ ఫక్కీలో మంచానికి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి, మెడకు మరో తాడును బిగించి, నడుమును మంచానికి చీరతో కట్టేసి బ్లేడుతో మర్మాంగాన్ని కోసి భర్తను భార్య హతమార్చిన సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. హత్యానంతరం బంధువులకు సమాచారం అందించి పారిపోయిన నిందితురాలు చివరకు పోలీసులకు లొంగిపోయింది. చింతలపూడి సీఐ పి.రాజేష్, ట్రైనీ డీఎస్పీ హర్షిత ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.(ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో) ఐదేళ్లుగా గొడవలు.. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్కినవారిగూడెంలోని ఊరగుంట కొత్తపేటకు చెందిన కఠారి అప్పారావు (35)కు తెలంగాణలోని దమ్మపేట గ్రామానికి చెందిన లక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో అప్పారావు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూనే మట్టి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరి కాపురం కొన్నేళ్లు సక్రమంగానే సాగినప్పటికీ అప్పారావు ఐదేళ్ల క్రితం మద్యానికి బానిసై భార్యను వేధించడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, పలుమార్లు గ్రామపెద్దలు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మట్టి తోలకానికి అప్పారావు వెళ్లగా నిందితురాలు లక్ష్మి తన కుమార్తెను పుట్టింటికి పంపించింది. భర్త వేధింపులకు విరక్తి చెందిన భార్య కఠారి లక్ష్మి అప్పారావును అత్యంత దారుణంగా బుధవారం రాత్రి హత్య చేసింది. అప్పారావు మృతదేహం సినీ ఫక్కీలో.. మద్యం సేవించి ఉన్న అప్పారావును భార్య లక్ష్మి నవ్వారు మంచానికి రెండు వైపులా తాళ్లతో చేతులు, కాళ్లు కట్టేసింది. నడుముకు చీర, మెడకు తాడు బిగించింది. బ్లేడుతో మర్మాంగాలు కోసి హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారైంది. గురువారం ఉదయం మృతుడు అప్పారావు అన్న కఠారి నాగేశ్వరరావుకు లక్ష్మి ఫోన్ చేసి మీ తమ్ముడు ఇంట్లో ఉన్నాడు చూసుకోండి అంటూ సమాచారం ఇవ్వడంతో వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా, అప్పారావు విగత జీవిగా పడి ఉన్నాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో చింతలపూడి సీఐ రాజేష్, తడికలపూడి ఎస్సై కె.వెంకన్న , ట్రైనీ డీఎస్పీ హర్షిత సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్ఓ బోసు సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్ తెలిపారు. ఇదిలా ఉండగా, నిందితురాలు లక్ష్మి బంధువుల ద్వారా వెళ్లి గురువారం సాయంత్రం టి.నరసాపురం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
ప్రియుడిని రెచ్చగొట్టి భర్త హత్యకు స్కెచ్..
నూరేళ్లు కలిసి జీవిస్తామని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు గాలికొదిలేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే పైలోకాలకు పంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడినా బాధితుడు అదృష్టవశాత్తు మృత్యువు నుంచి బైటపడ్డాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితురాలు పరారీలో ఉంది. చిత్తూరు ,తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం పంచాయతీ వడ్డిపల్లికి చెందిన బత్తల శివయ్యపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం ఎస్ఐ పరమేశ్వరనాయక్ వివరాలు వెల్లడించారు. పదేళ్లు కాపురం చేసి, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత సమీప బంధువులక్ష్మయ్యతో శివయ్య భార్య సుజాత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏడాది కిందట ఆమెను భర్త పుట్టింటికి పంపించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని బరితెగించింది.(కొద్ది సేపట్లో భర్త రెండో పెళ్లి.. ) ప్రియుడిని రెచ్చగొట్టింది. గత మార్చి 21న ఐరన్ రాడ్‌తో శివయ్యపై దాడి జరిగింది. మే నెల 23న కత్తితో నరికారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధంతోనే శివయ్యను హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నాలు చేసినట్లు, శివయ్య భార్య సుజాతను ఇందులో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ప్రియుడు లక్ష్మయ్యతో కలిసి ఈ హత్యయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. మార్చి 21న ఐరాన్‌రాడ్‌తో చంపేందుకు ప్రయత్నించిన సమయంలో శివయ్యకు తలకు తీవ్రగాయమైంది. తర్వాత చిగురువాడకు చెందిన వినయ్‌తో కలిసి మే 23న సాయంత్రం వడ్డిపల్లికి సమీపంలోనే కత్తితో పొడిచి శివయ్యపై హత్యయత్నానికి లక్ష్మయ్య ప్రయత్నించాడు. ముఖంపై కత్తితో నరికాడు. మరోసారి పొడిచేందుకు ప్రయత్నించడంతో శివయ్య కేకలు వేశాడు. దీంతో పరార్ అయ్యారు. నిందితులు వినయ్, లక్ష్మయ్యను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇద్దరినీ రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో నిందితురాలైన శివయ్య భార్య సుజాత పరారీలో ఉందని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
ప్రాణం తీసిన వివాహేతర బంధం
లక్నో : మహిళతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే ఆరోపణలతో ఓ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో వెలుగుచూసింది. హతుడిని భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్‌గా గుర్తించారు. కొద్ది నెలల కిందట మహిళ వీడియో క్లిప్‌ను ఆ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం మహిళ బంధువులకు ఆగ్రహం కలిగించింది. దీంతో అనైతిక బంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో మహిళ బంధువులు సోమవారం బాధితుడిని ఇంటి నుంచి వెలుపలకి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితుడిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు. యువకుడి హత్యపై బాధిత కుటుంబ సభ్యులు, స్ధానికులు ఆగ్రహంతో పోలీస్ వాహనాలను దగ్ధం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఘటనా ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. చదవండి : మహిళా లెక్చరర్‌ను వెంబడించి.. -
కొట్టి.. మట్టిలో పూడ్చేశాడు..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కొడవలూరు: ఆరునెలలుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి కిరాతకంగా కొట్టి మట్టిలో పాతేశాడు ఆమె ప్రియుడు. మృతురాలి కుమార్తె ద్వారా ఐదురోజుల అనంతరం ఈ దారుణం వెలుగు చూసింది. సోమవారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మండలంలోని గండవరం సమీపంలోని దగదర్తి మండల సరిహద్దు ప్రాంతమైన గొట్లపాళెం వద్ద కాలువకట్టపై పాక వేసుకుని పొన్నూరు సుభాషిణి (36) అనే గిరిజన మహిళ ఉండేది. సంజీవనగర్‌కు చెందిన స్వాములు అలియాస్ దేవుడు అనే వ్యక్తితో ఆమె ఆరునెలలుగా సహజీవనం చేస్తోంది. కాగా ఆమెకు గతంలో దగదర్తి గిరిజన కాలనీకి చెందిన రమణయ్య అనే వ్యక్తితో వివాహం జరగ్గా వారు కొన్నేళ్ల క్రితమే విడిపోయారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. సుభాషిణికి సాములుతో పరిచయమేర్పడగా, వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కాగా సుభాషిణిపై స్వాములుకి అనుమానం ఉంది. ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. అలా జరిగినప్పుడల్లా ఆమె పుట్టింటికి వెళుతుండేది. తర్వాత స్వాములు వెళ్లి ఆమెను తీసుకొస్తుండేవాడు. గొడవపడి.. గత నెల 27న కాలువకట్టపై ఉన్న పాకలో సుభాషిణి, స్వాములు మద్యం సేవించి గొడవ పడ్డారు. అదేరోజు రాత్రి స్వాములు ఆమెపై కిరాతంగా దాడి చేసి ఇంటి వెనుక గుంత తీసి పూడ్చివేశాడు. ఈ విషయాన్ని గమనించిన మృతురాలి ఏడేళ్ల కుమార్తె ధనమ్మను స్వాములు బెదిరించడంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. తల్లిని చంపి పాతి పెట్టిన విషయాన్ని బాలిక సోమవారం ఆమె పెద్దమ్మ దృష్టికి తీసుకెళ్లింది. వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతురాలి కాళ్లు, చేతులు కన్పిస్తుండడంతో కొడవలూరు పోలీసుల దృష్టికి తెచ్చారు. కోవూరు సీఐ జీఎల్ శ్రీనివాసరావు, కొడవలూరు ఎస్సైలు కె.వీరప్రతాప్, పి.శ్రీనివాసులురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీయించారు. ధనమ్మను విచారించగా, తన తల్లి ప్రాణంతో ఉండగానే మట్టిలో పాతేశాడని చెప్పి కన్నీరు పెట్టుకోవడం అందర్నీ కలిచి వేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడు పట్టుకుంటామని తెలిపారు.(ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో) -
సొంత అక్క తమ్ముడిపై అనుమానం పెంచుకుని..
ప్రకాశం, దర్శి: సొంత అక్కతో స్వయానా ఆమె తమ్ముడే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఆమె భర్త బావమరిదిని అతికిరాతకంగా హత్య చేశాడని డీఎస్పీ కె. ప్రకాశరావు వెల్లడించారు. నిమ్మారెడ్డిపాలెంలో 12వ తేదీ అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో పోకూరి రామస్వామి (55)ని అతి కిరాతకంగా ముఖంపై కొట్టి చంపిన కేసును దర్శి పోలీసులు ఛేదించారు. స్థానిక తన కార్యాలయంలో డీఎస్పీ ప్రకాశరావు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హంతకుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోకూరి రామస్వామి సొంత అక్కను దామా సుబ్బారావు అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. బావ మరిది రామస్వామి ఏడాదిన్నర క్రితం కొత్తగా ఇంటి నిర్మాణం సమయంలో భూమి పూజకు చుట్టాలు వచ్చారు. ఇంట్లో మంచాలు చాలక పోవడంతో అంతా సుబ్బారావు ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. ఆ సమయంలో సొంత అక్క పక్కన ఆమె సోదరుడు రామస్వామి పడుకుని ఉండటాన్ని భర్త సుబ్బారావు గమనించి అనుమానించాడు. తన భార్యకు ఆమె తమ్ముడితో వివాహేతర సంబంధం ఉందని సుబ్బారావు అనుమానం పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి బావమరిదిపై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి తన గొర్రెల దొడ్డి వద్ద రామస్వామి ఒంటరిగా పడుకుని ఉండటాన్ని గమనించిన సుబ్బారావు రోకలి బండతో ముఖంపై తీవ్రంగా కొట్టి గాయపరిచి హత్య చేశాడు. ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. శుక్రవారం గ్రామ వీఆర్వో బండారు శ్రీనివాసరావు వద్ద లొంగి పోయాడు. వీఆర్వో నిందితుడిని సీఐ మహమద్ మొయిన్ వద్ద హాజరు పరిచారు. సుబ్బారావును అరెస్టు చేసి హత్య చేసేందుకు ఉపయోగించిన రోకలి బండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం దర్శి జూనియర్ సివిల్ జడ్జి కోర్డ్‌లో నిందితుడిని హాజరు పరచనున్నట్లు డీఎస్పీ ప్రకాశరావు వివరించారు. డీఎస్పీతో పాటు ఎస్ఐ ఆంజనేయులు ఉన్నారు. -
వివాహేతర సంబంధం.. దారుణ హత్య
మెట్పల్లి(కోరుట్ల) : వివాహేతర సంబంధం యువకుడి ప్రాణం తీసింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని ఆమె భర్త రెండు నెలలక్రితం హతమార్చడానికి ప్రయత్నించగా, ఆ సమయంలో త్రుటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం మరోసారి జరిపిన దాడిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపేటకు చెందిన దనరేకుల రాజేందర్(28) అనే యువకుడు గ్రామంలో ఉపాధిహామీ పథకంలో మేట్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య హరిణితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా రాజేందర్‌కు అదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గల్ఫ్‌లో ఉన్న ఆమె భర్త విషయం తెలుసుకొని కొన్ని నెలలక్రితం తన సోదరుడు మహేశ్‌తో కలిసి గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి రాజేందర్‌పై కక్ష పెంచుకున్న సోదరులు ఇద్దరు గత మార్చి 3న గ్రామశివారులో అతడిపై కత్తితో దాడి చేసి పారిపోయారు. (అమ్మా.. నేనూ నీవెంటే!) ఈ సంఘటనలో రాజేందర్ ప్రాణాలతో బయటపడగా పోలీసులు రమేశ్, మహేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అనంతరం ఇద్దరు కొన్నిరోజులకు బెయిల్‌పై గ్రామానికి వచ్చారు. ఆ తర్వాత కూడా రాజేందర్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలనే ఆలోచనతో సోదరులిద్దరు అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామశివారులో ఉపాధి పనులు ముగిసిన తర్వాత కూలీగా వచ్చిన తన తల్లిని ఉదయం 11.30 సమయంలో ఇంటి వద్ద దించి తిరిగి రాజేందర్ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న రమేశ్, మహేశ్‌లు అతడిపై గొడ్డలితో దాడి చేశారు. మెడపై విచక్షణరహితంగా నరకడంతో అక్కడిక్కక్కడే రాజేందర్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు పారిపోయారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ గౌసుబాబా, సీఐ రవికుమార్, ఎస్సై çసుధాకర్ గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. దాడికి సంబంధించి పలు కోణాల్లో విచారణ జరిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా తనను ఇంటి వద్ద దించిన కొన్ని క్షణాలకే కుమారుడు మృత్యువాతపడడంతో సమాచారం తెలుసుకున్న రాజేందర్ తల్లి లక్ష్మీ మృతదేహం వద్దకి వచ్చి బోరున విలపించింది. మరోవైపు రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి రాజేందర్ భార్య హరిణి గుండెలవిసేలా రోదించింది.(సడలింపులు.. ‘తొలి’ కేసు) -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
అన్నానగర్ : వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మదురై సమీపంలో సోమవారం బైకులో వచ్చిన ఇద్దరిని ప్రత్యర్థులు నరికి చంపారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మదురై జిల్లా మేలూర్ సమీపం తిరువాదవూర్ నుంచి ఉత్తరవీధికి వెళ్లే నాయక్కర్ పట్టి రోడ్డులో పెద్ద కాలువ ఉంది. దాని సమీపంలో సోమవారం ఓ యువకుడు, యువతి నడి రోడ్డులో హత్య గురికావడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు మేలూర్ పోలీసులకి సమాచారం అందించారు. పోలీసు సూపరింటెండెంట్ వనితా, జాయింట్ సూపరింటెండెంట్ సుభాష్, తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు జరిపిన విచారణలో హత్యకు గురైన వారు తెర్కుతెరు గ్రామానికి చెందిన అయ్యనన్ కుమారుడు అన్బునాథన్ (27), విమల్ భార్య ఆయమ్మాల్ (26) అని తెలిసింది. అన్బునాథన్‌కి వివాహం కాలేదు. ఆయమ్మాల్‌కి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనికారణంగా వారిని నరికి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. యువకుడి హత్య నాగై జిల్లా మయిలాడుదురై మణక్కుడికి చెందిన రాజేంద్రన్ కుమారుడు ముత్తళగన్ (23). ఇతని సహోదరుడు కట్టబొమ్మన్‌కి, మయిలాడుదురై బాలాజీ నగర్‌కి చెందిన సురేష్ (28)కి పాత కక్షలున్నాయి. గత 16వ తేదీ మయిలాడుదురై బాలాజీ నగర్లో కట్టబొమ్మన్‌కి, సురేష్‌కి తగాదా ఏర్పడింది. కట్టబొమ్మన్ బైకుని సురేష్, అతని స్నేహితులు శశికుమార్, ముత్తుపాండి, మణికంఠన్, కీర్తిధరన్ తీసుకొని వెళ్లారు. ఆ బైకుని తిరిగి అడగడానికి సోమవారం ముత్తళగన్, కట్టబొమ్మన్, స్నేహితుడు శివరాజ్ (19)ని పిలుచుకుని మయిలాడుదురై బాలాజీ నగర్‌కి వెళ్లాడు. ఇరుతరపువారికి తగాదా ఏర్పడింది. ఆవేశం చెందిన సురేష్, ఇతని స్నేహితులు కలిసి ముత్తళగన్, శివరాజ్‌పై కత్తులతో దాడి చేశారు. కట్టబొమ్మన్ అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన శివరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్తళగన్ పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై మయిలాడుదరై పోలీసులు కేసు నమోదు చేసి సురేష్, శశికుమార్ (21), ముత్తు పాండి (19), మణికంఠన్ (22), కీర్తిధరన్ (21)ని అరెస్టు చేశారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
వనపర్తి ,అమ్రాబాద్ (అచ్చంపేట): వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ బీసన్న సోమవారం తెలిపిన వివరాలు.. మండలంలోని మన్ననూర్‌కు చెందిన బుడగజంగం ఆంజనేయులు(22) అదే గ్రామానికి చెందిన బాలమ్మ(అలియాస్ బాలమణి) అనే మహిళతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. విషయం తెలిసిన ఆంజనేయు లు తల్లి నారమ్మ, మామ శ్రీనివాసులు ఇద్దరినీ పంచాయతీ పెద్దల సమక్షంలో మందలించారు. ఇదే క్రమంలో మామ శ్రీనివాసులు తన కుమార్తెతో ఆంజనేయులుకు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి విషయమై ఈ నెల 5న వివాహేతర సంబంధం పెట్టుకున్న బాలమ్మతో ఆంజనేయులు చెప్పాడు. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. పెళ్లి విషయమై బాలమ్మ ఆంజనేయులుతో గొడవ పడి ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసింది. ఆంజనేయులు చనిపోయాక గోనె సంచిలో కట్టి ఇంటి సమీపంలో ఎస్బీఐ బ్యాంకు పక్కన గల డ్రెయినేజీ కల్వర్టులో పడేసింది. విషయం తెలియని ఆంజనేయులు కుటుంబీకులు ఈ నెల 6వ తేదీన యువకుడు అదృశ్యమైనట్లు అమ్రాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన మన్ననూర్ ఎబీఐ ఎదుట కాల్వ నుంచి దుర్గందం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా మృతదేహం లభ్యమైంది. ఆంజనేయులు మృతదేహంగా గుర్తించి విచారణ చేపట్టారు. బాలమ్మ హత్య చేసినట్లు నేరం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
లాక్డౌన్ :ప్రియుడిని కలవటం కుదరక భర్తను..
పశ్చిమ గోదావరి, ఏలూరు టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి పరారైన ఘటన జిల్లాలోని ఏలూరు శివారు రాఘవా ఎస్టేట్స్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఏలూరు డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్, త్రీటౌన్ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన గుడిపూడి నాగరాజు (38)తో భూలక్ష్మికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. నాగరాజు ఏలూరు త్రీటౌన్ పరిధిలోని రాఘవ ఎస్టేట్స్‌లో తాపీపనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. వట్లూరు ప్రాంతానికి చెందిన తోకల సురేష్ అనే వ్యక్తి నాగరాజు వద్ద పనిచేస్తున్నాడు. కుటుంబంలో వ్యక్తిలా సన్నిహితంగా మెలుగుతోన్న సురేష్‌తో నాగరాజు భార్య భూలక్ష్మి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్డౌన్ వల్ల ఇంటివద్దనే ఉంటున్న నాగరాజు అడ్డు తొలగించుకోవాలని సురేష్, భూలక్ష్మి పథకం రచించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంటిలో నిద్రిస్తుండగా నాగరాజు తలపై భార్య భూలక్ష్మి సురేష్‌తో కలిసి రాడ్డుతో బలంగా మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయిన నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సురేష్‌తో కలిసి భూలక్ష్మి పరా రైంది. సమాచారం అందుకున్న డీఎస్పీ దిలీప్‌కిరణ్, త్రీటౌన్ సీఐ మూర్తి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో
చిత్తూరు, మదనపల్టె టౌన్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. ఈ సంఘటన మదనపల్లెలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు..పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన కాలం చిన్నరెడ్డెప్ప చిన్న కుమారుడు బాలసుబ్రమణ్యం అలియాస్ బాలు(35) పదేళ్ల క్రితం మదనపల్లెకు వచ్చాడు. నీరుగట్టువారిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమార్తె రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు రిష్మిత, జష్మిత, అభిరామ్ ఉన్నారు. బాలసుబ్రమణ్యం ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తితో రేణుక వివాహేతర సంబంధం కుదుర్చు కుంది. ఏడాదిగా భర్తతో తరచూ గొడవ పడుతోంది. సంసారాన్ని అతడు తిరుపతికి కాపురం మార్చాడు. ఆమె అక్కడ ఉండకుండా ఆరు నెలలు తిరగకనే నీరుగట్టువారిపల్లెలోని అయోధ్యనగర్‌కు మకాం మార్చింది. తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పథకం పన్నింది. కడప, మదనపల్లెకు చెందిన నలుగురు కిరాయి హంతకులతో రూ.4 లక్షలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. రెండు రోజుల క్రితం వైఎస్సార్ జిల్లాకు చెందిన లారీని చౌడేశ్వరీ కల్యాణ మండపం వద్దకు తెప్పించింది. శనివారం రాత్రి గొంతునొప్పి, దగ్గు వస్తోందని, మందులు తీసుకురావాలని భర్తను టమాట మార్కెట్ యార్డు వద్దకు బైక్‌లో పంపించింది. ఈ విషయం వెంటనే ప్రియునికి ఫోన్లో చేరవేసింది. మందులు తీసుకుని బైక్‌లో వస్తున్న బాలసుబ్రమణ్యాన్ని దుండగులు కదిరి రోడ్డులోని నీరుగట్టువారిపల్లె డౌన్లో లారీతో బైక్‌ను ఢీకొని వెళ్లిపోయారు. బాలసుబ్రమణ్యం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంగా భావించిన పట్రోలింగ్ పోలీసులు లారీ కోసం గాలించారు. నిందితులు వాల్మీకిపురం వద్ద అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. విచారణలో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటో పట్ట ణ సీఐ తమీమ్ అహ్మద్, ఎస్ఐ సోమశేఖర్ సిబ్బందితో వెళ్లి నిందితురాలు రేణుక, ఆమె ప్రియుడు, హంతకులను అదుపులోకి తీసుకున్నారు. -
తండ్రి ప్రేయసిని చంపిన కుమారుడు..
చెన్నై,టీ.నగర్: తండ్రి ప్రియురాలిని ఓ బాలుడు హతమార్చాడు. ఈ ఘటన మంగళవారం పట్టుకోట్టై సమీపంలో జరిగింది. పట్టుకోట్టై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు. ఇతనికి వివాహమై 17 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇలావుండగా బాలుని తండ్రికి, అదే ప్రాంతానికి చెందిన, ఓ వివాహిత (47)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో సోమవారం తండ్రి ప్రియురాలి ఇంటికి స్నేహితుడితో వెళ్లిన బాలుడు తండ్రితో సంబంధం వదులుకోవాలని ఆమెను హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన బాలుడు దుడ్డుకర్రతో మహిళ తలపై దాడి చేసి పరారయ్యాడు. గాయపడ్డ మహిళను వెంటనే స్థానికులు పట్టుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతిచెందింది. పోలీసులు స్నేహితుడు సహా బాలున్ని అరెస్టు చేశారు. -
అక్రమ బంధాన్ని ప్రశ్నిస్తే దాడి చేశాడు
నాంపల్లి: భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన ఓ మహిళపై ఆమె భర్త అమానుషంగా దాడి చేశాడు. ఈ సంఘటన బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వద్ద జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. మౌలాలీలోని ఆర్టీసీ కాలనీ శివానందనగర్‌లో నివాసం ఉండే మహేష్ భార్య కళావతితో మౌనేష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య కళావతి పథకాన్ని రచించింది. భర్త ఇంట్లో నిద్రించే సమయంలో యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కళావతి తన ఇద్దరు ఆడ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేర ప్రవృత్తి కలిగిన తన భార్య వద్ద పిల్లలు ఉంటే జీవితం నాశనం అవుతుందని, తన ఇద్దరు కుమార్తెలను తనకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని, లేనిపక్షంలో స్టేట్ హోంకు తరలించి చదివించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మహేష్ ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు కమీషన్ ఎదుట బుధవారం విచారణ జరగాల్సి ఉండేది. విచారణకు మహేష్‌తో పాటు భార్య కళావతి హాజరైంది. మౌనేష్ కూడా అక్కడకు వస్తాడనే విషయం ముందుగా తెలిసింది. అయితే కళావతి పరిచయం అనంతరం తన భర్త మౌనేష్ ఇంటికి రావడం లేదని శాంతి అనే మహిళ బుధవారం మానవహక్కుల కమిషన్‌కు వచ్చింది. అక్కడ మౌనేష్‌ను భార్య శాంతి మౌనేష్‌ను నిలదీసింది. భార్య ప్రశ్నించడాన్ని భరించలేని మౌనేష్ ఆమెపై దాడిచేశాడు. దాడిలో శాంతి మూతి పండ్లు రాలిపోయాయి. తీవ్ర రక్తస్రావం అయ్యింది. బాధితురాలిని కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య తన చాంబరులోనికి ఆహ్వానించి సమస్యను తెలుసుకున్నారు. కమిషన్ ఎదుట భార్యపై భర్త దాడి చేయడంపై కమీషన్ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
కోడలిపై కన్నేసి.. హతమయ్యాడు
‘కామాతురాణాం నభయం నలజ్జ’ అన్నారు పెద్దలు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక మామ సొంత కోడలిపై కన్నేసి కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. కొడుకు ఇంటిలో లేని సమయంలో కన్న కూతురితో సమానమైన కోడలిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ దురాగతాన్ని భరించలేని కొడుకు.. తండ్రిని హత్య చేశాడు. ఈ సంఘటన కొత్తపల్లి మండలంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి బంధువుల కథనం ఇలా ఉంది. తూర్పుగోదావరి, కొత్తపల్లి: శ్రీరాంపురం గ్రామానికి చెందిన పిర్ల తమ్మారావు (55)కు ఇద్దరు కుమారులు ఆదినారాయణ, సుబ్బారావు. భార్యతో కలిసి తమ్మారావు ఉప్పాడ–పెరుమాళ్లపురం బీచ్ రోడ్డు సమీపంలో ఉన్న పొలంలో గేదెలను మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన శ్రీరాంపురంలో ఉంటున్న పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లాడు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో కోడలు చేయి పట్టుకుని లైంగిక దాడి చేయబోయాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. ఈ విషయాన్ని తట్టుకోలేక కుమారుడు తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి తన పొలంలో నిద్రిస్తున్న తండ్రి తలపై అతడు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కాకినాడ డీఎస్పీ భీమారావు, పిఠాపురం సీఐ బి. సూర్య అప్పారావు, కొత్తపల్లి ఎస్సై పార్ధసారథి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య దండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమారుడు ఆదినారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని హత్య చేసిన కుమారుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ్మారావు మృతితో శ్రీరాంపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ప్రియుడికి పెళ్లి కావడంతో ఎడబాటు..
పెళ్లి కాని యువకుడికి పెళ్లై ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరేళ్లుగా ఇద్దరు సహజీవనం చేశారు. రెండేళ్ల క్రితం ఆ యువకుడికి మరో యువతితో వివాహం కావడంతో వీరి బంధానికి తెరపడింది. అలా కొంత కాలంగా ఇద్దరూ దూరంగానే ఉన్నారు. కానీ గతంలో ఉన్న సంబంధాన్ని తిరిగి కొనసాగించాలనే ఆలోచనతో ఆ ప్రియుడు కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవలో ఆవేశానికి లోనై చివరకు ఆమెను మట్టుబెట్టాడు. నల్లగొండ,చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో ఈ నెల 9వ తేదీన చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీనిఇ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి బుధవారం ఏసీపీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన మీసాల జయసుధ(34) టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. మల్కాపురం గ్రామానికి చెంది ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న మీసాల శేఖర్‌ను 12ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. శేఖర్‌కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈమెతోనూ కాపురం చేశాడు. వీరికి చరణ్, సిద్దు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరి నడుమ మనస్పర్థలు రావడంతో 9ఏళ్ల క్రితం విడిపోయారు. దీంతో జయసుధ సొంత ఊరైన కొయ్యలగూడెంలో ఇంటిని అద్దెకు తీసుకొని టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆరేళ్లపాటు సఖ్యతగా.. జయసుధ కొయ్యలగూడెంలో ఊదరి రామచంద్రం ఇంట్లో అద్దెకు ఉంటున్న సమయంలో పక్కింట్లో ఉండే ఊదరి రమేష్ పరిచయమయ్యాడు. అవివాహితుడైన అతనితో ఆరు సంవత్సరాల పాటు వివాహేతర సంబంధం కొనసాగించింది. తాపి మేస్త్రీగా పని చేసే రమేష్ తాను పెళ్లి చేసుకునేంత వరకు జయసుధతో వివాహేతర సంబంధాన్ని యథావిథిగా కొనసాగించాడు. ప్రియుడికి వివాహం కావడంతో.. జయసుధతో వివాహేతర బంధం కొనసాగుతుండగానే రమేష్ రెండేళ్ల క్రితం చండూరు మండలం తేరట్పల్లి గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. తనతో సహజీవనం చేస్తున్న సమయంలో తాను ఎవ్వరిని పెళ్లి చేసుకోను, నీతోనే జీవిస్తానంటూ రమేష్ చెప్పాడు. చెప్పిన మాట ప్రకారంగా కాకుండా వేరే యువతిని పెళ్లి చేసుకోవడంతో జయసుధ ఆగ్రహించింది. అంతటితో ఆగకుండా ఇంటికి వెళ్లి అతని భార్యకు విషయం చెప్పి గొడవపడింది. అప్పటి నుంచి ఇద్దరి నడుమ వివాహేతర సంబంధం తెగిపోయింది. ఇదే సమయంలో రమేష్, అతని భార్య నడుమ గొడవ జరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయిందని.. అటు భార్య, ఇటు ప్రియురాలు రమేష్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో జయసుధతో తిరిగి సఖ్యతగా మెలిగగేందుకు రమేష్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల జయసుధ కొయ్యలగూడెం నుంచి పక్కనే ఉన్న ఎల్లంబావి గ్రామానికి ఇంటిని మార్చింది. అందులో భాగంగా రమేష్ ఈ నెల 05, 06, 07 తేదీల్లో జయసుధ ఇంటికి వెళ్లాడు. మాట్లాడే క్రమంలో ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. అదే క్రమంలో 9న సైతం అదే మాదిరిగా ఇంట్లోకి వెళ్లాడు. పాత విషయాలు మాట్లాడుకునే సమయంలో ఇద్దరి నడుమ ఘర్షణ జరిగింది. ఆ క్రమంలోనే పక్కనే ఉన్న ఫైజామాతో మెడకు బిగించి జయసుధను హత్య చేశాడు. నిందితుడు ఎలా చిక్కాడంటే... జయసుధ ఎల్లంబావిలోని మాచర్ల సుధాకర్ ఇంట్లో అద్దెకు ఉంటుంది. సుధాకర్ తన ఇంటి వెనుకనే మరో ఇంటిని నిర్మించుకుంటున్నాడు. తాపి మేస్త్రీగా ఊదరి రమేష్ ఇక్కడ పని చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ నెల 9న మరో ఐదుగురితో కలిసి ఇంటి పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం 1గంటలకు భోజన సమయంలో మద్యం సేవించి జయసుధ ఇంటికి వెళ్లాడు. ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడే చిరిగిపడి ఉన్న ఫైజామాతో మెడకు బిగించి హత్య చేశాడు. ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఇంటి యజమాని అక్కడికి రావడంతో జారుకుని మేస్త్రీ పనిలో నిమగ్నమయ్యాడు. కొద్ది సేపటి తర్వాత జయసుధ కుమారుడు చరణ్ ఇంట్లోకి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే రమేష్ ఇంట్లోకి వెళ్లిపోవడం, మధ్యాహ్నం ఇంటి నిర్మాణ పనుల్లో కొంత సేపు లేకపోవడం, సాయంత్రం 4 తర్వాత పని నుంచి పరారవ్వడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఆ ప్రకారంగా విచారణ చేపట్టారు. అందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని బస్‌స్టేషన్‌లో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించాడు. అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రామన్నపేట కోర్టుకు తరలించారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ పులిజాల వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వర్రావు, ఉన్నారు. -
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
రాజానగరం: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా మహిళలను కీర్తిస్తూ సభలు, సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఓ భర్త అనుమానంతో భార్యను అమానుషంగా హతమార్చాడు. తాగుడుకు బానిసైన అతడు వాస్తవాలను విస్మరించి, విచక్షణా రహితంగా పీక నులిమి చంపేశాడు. దీంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు మాతృమూర్తిని కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి... నామవరానికి చెందిన ఈలి వెంకన్న తాపీ పని చేస్తుంటాడు. 15 సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన కుమారితో వివాహం జరిగింది. వారికి 12, 8 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన వెంకన్న భార్యపై అనుమానం పెట్టుకుని తరచు గొడవ పడుతూ, కొడుతూ హింస పెడుతుండేవాడు. అతను పెట్టే బాధలను భరిస్తూ, పిల్లలను బాగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలనే తలంపుతో కుమారి సర్దుకుపోతూ వచ్చింది. ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా ఇంటికి తాగి వచ్చిన వెంకన్న లేనిపోని అనుమానాలను వ్యక్తపరుస్తూ భార్యతో గొడవపడ్డాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తెల్లవారే సరికి కుమారి మంచంపై చనిపోయివుండటం, ఇంట్లో భర్త వెంకన్న లేకపోవడంతో స్థానికులు అనుమానించారు. విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మరణానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మృతురాలి పీకపై చేతి గోళ్లతో అయిన గాయాలు ఉండటంతో ఆమెను పీక నులిమి హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో రాత్రి గొడవ పడిన భర్త ఇంటిలో లేకపోవడంతో అతని కోసం గాలిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు. ఈ మేరకు వీఆర్ఏ గణేష్ నుంచి రిపోర్టు తీసుకుని తదనుగునంగా కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు, వెంకన్న బంధువులు కూడా కుమారిని ఆమె భర్త వెంకన్నే హత్య చేశాడంటున్నారు. తాగుడుకు బానిసై లేనిపోని అనుమానం పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని వారు విచారణలో పోలీసులకు తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చి..
నెల్లూరు(క్రైమ్): హత్య కేసును మిస్టరీని నెల్లూరు వేదాయపాళెం పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం వద్దనుందుకే భర్తను తన ప్రియుడి ద్వారా భార్య దారుణంగా హత్య చేయించిందని తేలింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. కొత్తూరు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించి దహనం చేశారని గతనెల 22వ తేదీన స్థానిక వీఆర్వో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సైలు బి.లక్ష్మణ్, ఎం.పుల్లారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటన జరిగి 10 రోజులకు పైగా అయిఉండొచ్చని భావించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సేకరించడంతోపాటు హత్య జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్ టవర్డంప్ను పరిశీలించినా ఏమాత్రం క్లూ దొరకలేదు. ఇలా వెలుగులోకి.. ఉమ్మారెడ్డిగుంటలో నివాసం ఉంటున్న తన కుమారుడు సూర్యనారాయణ (42) కొద్దిరోజులుగా కనిపించడంలేదని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సన్యాసి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సై పుల్లారెడ్డిలు వివరాలు ఆరాతీయగా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అతను కనిపించడం లేదని సన్యాసి పేర్కొన్నారు. దీంతో పోలీసులు కొత్తూరు హత్య కేసును లోతుగా పరిశీలించగా హతుడు సూర్యనారాయణగా గుర్తించారు. భార్యే సూత్రధారి మృతుడి భార్య భద్రమ్మతో మాట్లాడే క్రమంలో ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె తన ప్రియుడి ద్వారా భర్తను హత్య చేయించిందని నిర్ధారణ అయింది. ఉపాధి నిమిత్తం వచ్చి.. శ్రీకాకుళం లక్ష్మీనరసుపేట మండలం యాంబరం గ్రామానికి చెందిన సూర్యనారాయణకు 20 ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన భద్రమ్మతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, రెండేళ్ల క్రితం వారు ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా రెండో కుమార్తె చదువుకుంటోంది. ఏడాదిగా భద్రమ్మ సుధాకర్ అనే మేస్త్రీ వద్ద పనులకు వెళుతూ అతడితో సన్నిహితంగా మెలగసాగింది. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. ఈక్రమంలో గతనెల 11వ తేదీన సూర్యనారాయణ భార్యతో గొడవపడి చేయి చేసుకున్నాడు. జరిగిన విషయాన్ని భద్రమ్మ తన ప్రియుడు సుధాకర్‌కు చెప్పి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం భద్రమ్మ గత నెల 12వ తేదీన సుధాకర్‌కు ఫోన్ చేసి తన భర్తకు పని ఇప్పిస్తానని తీసుకెళ్లి అతడిని హత్య చేసి శవాన్ని మాయం చేసి తనకు ఫోన్ చేస్తే తిరిగి వస్తానని చెప్పి ఊరు వెళ్లిపోయింది. సుధాకర్ పథకం ప్రకారం అదేరోజు సాయంత్రం సూర్యనారాయణను కలిసి కూలీ పనులు చేస్తే ఏం సంపాదిస్తావు.. మేస్త్రీ పని ఇప్పిస్తానని.. లక్షల రూపాయలు సంపాదించవచ్చని అందుకు పనులు సైతం తానే చూస్తానని, తనకు 5 శాతం కమీషన్ ఇస్తే చాలని నమ్మించాడు. కొత్తూరు సమీపంలో మద్యం కొనుగోలు చేసి కొత్తూరు ఫైరింగ్ రేంజ్ ప్రాంతానికి సూర్యనారాయణను తీసుకెళ్లాడు. అక్కడ ఫూటుగా మద్యం తాగించి బండరాయితో అతనిపై దాడి చేశాడు. గుండెల్లో కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం సుధాకర్ భద్రమ్మకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా ఆమె శవాన్ని కాల్చివేయాలని సలహా ఇచ్చిందని, దీంతో సుధాకర్ బైక్‌లోని పెట్రోల్‌ను తీసి సుర్యనారాయణపై పోసి నిప్పంటించి అక్కడినుంచి పరారైయ్యాడని డీఎస్పీ తెలిపారు. విచారణలో భద్రమ్మ హత్య జరిగిన తీరును వెల్లడించడంతో పోలీసులు ఆమె ప్రియుడు వైఎస్సార్ నగర్‌కు చెందిన సుధాకర్‌ను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసింది తామేనని అంగీకరించడంతో అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
మాస్టారు నీచత్వం.. విద్యార్థినితో
కర్ణాటక, మైసూరు: విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువుకున్న విద్యార్థినితో క్రామక్రీడలకు పాల్పడుతూ, సరదాగా మొబైల్ఫోన్లో ఫోటోలు తీయడం, అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం మైసూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. కామ ఉపాధ్యాయుని నీచత్వంపై జనం ఛీ కొడుతున్నారు. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో ఈ దాష్టీకం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. రాంపుర గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాడైన సిద్దరాజు అలియాస్ సిద్ధరామయ్యకు ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు అయ్యాయి. తన వద్ద చదువుకున్న పాత విద్యార్థిని (20)ని మభ్యపెట్టి వాంఛలు తీర్చుకునేవాడు. ఆ ఫోటోలు తీసి వాటిని యువతి వాట్సప్‌కు పంపించాడు. అవి కాస్త మరో నంబర్‌కు వెళ్ళడంతో సోమవారం గ్రామం మొత్తం కామ క్రీడల పోటోలు వైరల్‌గా మారాయి. కాముకుడు పరారీ ఈ ఘోరంపై గ్రామస్తులు ఆగ్రహంతో పాఠశాల ముందు ధర్నాకు దిగగా సిద్దరాజు గ్రామం నుంచి పరారీ అయ్యాడు. అతడు గత కొంతకాలంగా ధనుర్వాతంతో బాధపడుతున్నప్పటికీ యువతిని తరచూ ఇంటికి రప్పించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న అతని అరెస్టు చేయాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. -
గుట్టు బయటపెడుతుందని అత్త హతం
కర్ణాటక, యశవంతపుర: తమ గుట్టును బయటపెడుతుందని కోడలు ప్రియునితో ఏకంగా అత్తను అంతమొందించింది. తరువాత ఏమీ తెలియనట్లు నటించినా చివరకు దొరికిపోయారు. ఈ నెల 18న బ్యాటరాయనపుర మెయిన్ రోడ్డులో హత్యకు గురైన రాజమ్మ (60) అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న ఆమె కొడుకు కుమార్, కోడలు సౌందర్యలు రాజమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న రాజమ్మ ఇంటిలో ఉండగా అపరిచిత వ్యక్తులు దాడి చేసి ఆమెను హత్య చేశారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేయగా అసలు విషయం బయట పడింది. ఇద్దరినీ చూడడంతో రాజమ్మను ఆమె కోడలు సౌందర్య, ఆమెతో ఆక్రమ సంబంధమున్న లైన్‌మ్యాన్ నవీన్ జడేస్వామి కలిసి హత్య చేసిన్నట్లు బయట పడింది. దీనితో నిందితులను బ్యాటరాయనపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న నవీన్ జడేస్వామి–సౌందర్యలు కలిసి ఇంటిలో ఉండటం రాజమ్మ చూసింది. దీనితో కోడలు సౌందర్యను మందలించింది. విషయంను భర్త కుమార్‌తో చెప్పి పంచాయతి పెడతానంటూ హెచ్చరించింది. దీంతో తమ బండారం బయటపడుతుందని భయపడిన సౌందర్య ప్రియుడు నవీన్‌తో కలిసి రాజమ్మ తలపై రాడ్‌తో బాదడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. సౌందర్య ఏమీ తెలియనట్లు పక్క ఇంటీకీ వెళ్లగా, నవీన్ అక్కడ నుండి జారుకున్నాడు. కేకలు వేస్తూ ఏడుపు గంట తరువాత సౌందర్య ఇంటికెళ్లగా రాజమ్మ రక్తపు మడుగులో శవమై ఉంది. సౌందర్య గట్టిగా కేకలు వేస్తూ అత్తను ఎవరో హత్య చేసినట్లు లబోదిబోమంటూ ఏడ్చింది. ప్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్లిన కుమార్‌ను పోలీసులు పిలిపించారు. తన తల్లీని ఏవరో హత్య చేసిన్నట్లు బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మొదట రాజమ్మ వద్దనున్న బంగారం కోసం దొంగలు హత్య చేసి ఉంటరాని భావించారు. అయితే సౌందర్యపై అనుమానం రావటంతో స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కుమార్ లేనప్పుడు ఎవరెవరు ఇంటికీ వచ్చేవారని తమదైన శైలిలో విచారించటంతో విషయం చెప్పేసింది. రాజమ్మ వద్దకు నవీన్ జడేస్వామి అప్పుడప్పుడు తమలపాకు కోసం వచ్చేవాడు. సౌందర్యతోనూ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడి రెండేళ్ల నుంచి అక్రమ సంబంధం నడుస్తోంది. తమ గురించి కొడుక్కి చెబుతుందనే కోపంతో రాజమ్మను ఇద్దరు కలిసి హత్య చేసినట్లు పోలీసులకు వివరించింది. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలు పంపారు. -
భర్త ఉండగానే ప్రియుడితో తాళి కట్టించుకొని..
తూర్పు గోదావరి, సర్పవరం (కాకినాడ రూరల్): కాకినాడ నగరంలోని గొడారిగుంట దుర్గానగర్‌లో ఈ నెల 19న అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా లారీ డ్రైవర్ నక్కా బ్రహ్మానందం అనే బ్రహ్మాజీ (29) హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్లో సోమవారం జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కరణం కుమార్, ఇన్చార్జి డీఎస్పీ వి.భీమారావు, సీఐ గోవిందరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. లారీ డ్రైవర్‌గా పనిచేసే బ్రహ్మానందం అతని మరదలు మంగలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. వీరు గొడారిగుంట దుర్గానగర్‌లో అద్దింట్లో నివాసం ఉంటున్నారు. భార్య మంగలక్ష్మి కాకినాడ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామం సావరంపేటకు చెందిన ఈతకోటసూర్యప్రకాష్ అనే సూర్య డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ అవుదామని కాకినాడలో ట్రైనింగ్‌కు వచ్చాడు. సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, చిత్రంలో నిందితుడు సూర్యప్రకాష్ శిక్షణ మధ్యలో మానేసి కార్పొరేషన్లో పారిశుద్ధ్య సూపర్వైజర్గా చేరాడు. ఈ క్రమంలో మంగలక్ష్మి, సూర్యప్రకాష్‌ల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా మంగలక్ష్మి ఇంటి పక్కన అద్దెకు సూర్యప్రకాష్ దిగాడు. మూడు నెలల కిందట ప్రియురాలికి తాళి కట్టాడు. వీరి పరిచయానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి హతమార్చేందుకు వ్యూహం పన్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల కిందట సూర్యప్రకాష్ విధులకు సెలవు పెట్టి సొంతూరుకు వెళ్లాడు. హత్య చేద్దామని ముందు రోజు రెక్కీ నిర్వహించాడు. ఈ నెల 19న రాత్రి మంకీ క్యాప్, చేతులకు గ్లౌస్, స్వెట్టర్ ధరించి మోటారు సైకిల్‌తో పాటు ఆయుధం తీసుకుని వచ్చాడు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బ్రహ్మానందం ఇంట్లోకి ప్రవేశించాడు. భర్త హత్యకు భార్య సహకరించడంతో అతికిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. మరుసటి రోజు తెల్లవారు జామున సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మిస్టరీని ఛేదించారు. నిందితుడు ఈతకోట సూర్యప్రకాష్‌తో పాటు హతుడి భార్య మంగలక్ష్మిని సోమవారం అరెస్టు చేశారు. పోలీసు అవుదామని వచ్చి.. సంఘట వివరాలను అడిషనల్ ఎస్పీ కుమార్ వివరించారు. సూర్యప్రకాష్ ఉంటున్న గదిని పరిశీలించగా డైరీలో మంగ వెడ్స్ సూర్య అని.. మంగ బంగారం అని కాగితంపై రాసి ఉందన్నారు. వీటి ఆధారంగానే సులువుగా నిందితుడిని పట్టుకున్నామన్నారు. పోలీసు అవుదామని వచ్చి కటకటాలు పాలయ్యాడని, అలాగే ప్రియుడి వ్యామోహంతో భర్తను కోల్పోయి, పిల్లలకు దూరమై జైలుకు మంగలక్ష్మి వెళ్తుందన్నారు. -
ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం
కర్ణాటక, యశవంతపుర : వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన డాక్టర్ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న యువతి సైతం బెంగళూరులో ప్రాణాలు తీసుకుంది. దీంతో డాక్టర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలు... చిక్కమగళూరు జిల్లా కడూరులో డాక్టర్ రేవంత్, కవితలు నివాసం ఉంటున్నారు. ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తెను కడూరుకు చెందిన డాక్టర్ రేవంత్ ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల చిన్నారితో పాటు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. రేవంత్ బీరూరులో డెంటల్ క్లినిక్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో బెంగళూరు రాజరాజేశ్వరి నగర జవరేగౌడ లేఔట్లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ అయిన హర్షిత (32)కు రేవంత్ వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తరచూ హర్షిత తన వద్దకు వచ్చేయాలని రేవంత్‌పై ఒత్తిడి తెచ్చేది. ఈ క్రమంలో కవిత ఈనెల 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన భార్యను ఎవరో హత్య చేశారని కడూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కూడా రేవంత్‌ను అనుమానించలేదు. ఇదిలా ఉంటే గురువారం హత్యకు సంబంధించిన నివేదిక పోలీసులకు చేరింది. అందులో కవితకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొంతు నులిమి హత్య చేసినట్లు బయటపడింది. దీంతో రేవంత్‌ను విచారణ చేయాలని అతని ఫోన్‌కాల్స్ లిస్ట్‌ను కూడా తెప్పించారు. దీంతో భయపడిన రేవంత్ శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బండికొప్పలు వద్ద కారు నిలిపి సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రేవంత్ హర్షిత (32)కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. రేవంత్ ఆత్మహత్య చేసుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బెంగళూరు ఆర్ఆర్ నగర జవరేగౌడ లేఔట్లో నివాసం ఉంటున్న హర్షిత కూడా డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వివాహేతర సంబంధం ఇలా మూడు ప్రాణాలు తీసి చిన్నారులను అనాథలుగా మార్చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(ఇంట్లోనే శత్రువు) -
జవాన్‌ను చంపిన భార్య, డ్రైవర్..
దేశం కోసం మంచుకొండల్లో, ఎడారుల్లో పహరా కాస్తూ జీవితం త్యాగం చేస్తున్న జవాన్‌కు ఇంట్లోనే శత్రువులు ఉన్నారని తెలియదు. భార్య ఆనందం కోసం ఆమెకు కారు, ఇల్లు సమకూర్చాడు. కానీ చివరకు ఇల్లాలే, ప్రియునితో కలిసి జవాన్నుపరలోకానికి పంపించింది. ఇప్పుడుఇద్దరూ కటకటాలు లెక్కిస్తున్నారు. కర్ణాటక, యశవంతపుర: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటనలో పోలీసులు ఓ మహిళతో ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసిన ఘటన బెళగావిలో జరిగింది. హతుడు ఆర్మీ జవాన్ కాగా, నిందితులు అతని భార్య, కారు డ్రైవర్ కావడం గమనార్హం. వివరాలు... బెళగావి తాలూకా మారిహలకు చెందిన దీపక్ పట్టణధార్ (32) 14 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అంజలితో పెళ్లయింది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. దీపక్ ఆరు నెలలకు ఒకసారి సొంతూరు బెళగావికి వచ్చి వారం రోజుల పాటు ఉండి వెళ్లేవాడు. తాలూకాలోని హోన్నిహళ గ్రామంలో ఇంటి స్థలం కొని ఇల్లు కట్టిచాడు. ఆమెకు కారును కొనిచ్చి ప్రశాంత్ అనే యువకున్ని డ్రైవర్‌ను నియమించాడు. దీపక్ దేశ రక్షణలో నిమగ్నమై ఉండగా, అంజలి, డ్రైవర్ ప్రశాంత్ మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. రిటైరవుతానని చెప్పడంతో అంజలి, డ్రైవర్ మధ్య గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుస్తోంది. దీపక్ జనవరి మూడో వారంలో సెలవు పెట్టి వచ్చాడు. ఆర్మీలో రిటైర్మెంట్ తీసుకుని కర్ణాటక పోలీసుశాఖలో చేరాలని నిర్ణయించాడు. ఇది భార్యకు నచ్చలేదు. భర్త ఊరిలో ఉంటే తమ ఆటలు సాగవని భావించింది. సమస్య తీరాలంటే భర్త దీపక్‌ను అడ్డు తొలగించుకోవడం ఒక్కటే మార్గమని ప్రేయసీ ప్రియుడు తీర్మానించుకున్నారు. గోకాక్‌కు తీసుకెళ్లి, మద్యం తాపి భర్తను జనవరి 28న గోకాక్ గోడచనమల్లి జలపాతానికి కారులో తీసుకెళ్లారు. మధ్యలో అంజలి ఒత్తిడి చేసి భర్త చేత మద్యం బాగా తాగించింది. పథకం ప్రకారం ప్రశాంత్ స్నేహితులు ముందుగానే జలపాతం వద్దకు వచ్చారు. అంజలి మత్తులో ఉన్న దీపక్‌ను గొంతు పిసికి కారులోనే హత్య చేయించింది. అనంతరం డ్రైవర్ ప్రశాంత్ స్నేహితులు నవీన్ కెంగేరి, ప్రవీణ్‌లు జవాన్ మృతదేహాన్ని జలపాతంలోకి తోసేశారు. భర్త మిస్సింగ్ అని హంగామా నాలుగు రోజుల తరువాత తన భర్త కనిపించటంలేదంటూ ఫిబ్రవరి 4న అంజలి మారిహళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా çపోలీసులు పట్టించుకోవటంలేదని పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా కూడా చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు జవాన్ మొబైల్ నంబర్ ఆధారంగా జలపాతం పరిసరాల్లో గాలించగా కుళ్లిన స్థితిలో పక్షులు, చేపలు తిని మిగిలిన శవం కనిపించింది. దీంతో దర్యాప్తు చేపట్టారు. హత్యకు ముందు, తరువాత డ్రైవర్ ప్రశాంత్ మొబైల్‌ఫోన్ లొకేషన్, అంజలి ఫోన్‌కాల్స్ ఆధారంగా ఇద్దరిపై అనుమానం వచ్చింది. ఇద్దరినీ తమదైన శైలిలో విచారించగా అంజలి–ప్రశాంత్‌లు చేసిన నేరం బయట పడింది. దీంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. నవీన్ కెంగేరి, ప్రవీణ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కొడుకును కడతేర్చిన తల్లి
నల్లగొండ క్రైం: వివాహేతర సంబంధం బయటపడుతుందనే ఉద్దేశంతో.. ప్రియుడితో కలసి ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా బుద్ధారంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన వెంకన్న–విజయకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా విజయ గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తో్తంది. శుక్రవారం మధ్యాహ్నం వెంకట్‌రెడ్డి విజయ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రెండో కుమారుడు నాగరాజు (7) ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్ద కుమారుడు బయట ఆడుకుంటున్నాడు. విజయ, వెంకట్‌రెడ్డి చనువుగా ఉన్న సమయంలో నాగరాజు గమనించి నాన్నకు, నాన్నమ్మకు చెప్తానన్నాడు. వెంటనే తల్లి నాగరాజు చెంపపై కొట్టగా.. గట్టిగా ఏడ్చాడు. ఎవరైనా చూస్తున్నారా అని ఇంటి బయటికి వచ్చి చూసింది. ఇరుగుపొరుగు వారు కుమారుడు ఎందుకు ఏడుస్తున్నాడని అడగడంతో కడుపు నొప్పి ఉందని, అందుకే ఏడుస్తున్నాడని చెప్పింది. తల్లి మళ్లీ ఇంట్లోకి వెళ్లి నాగరాజుని ఏడ్వవద్దని చెప్పింది. మళ్లీ వెంకట్‌రెడ్డితో చనువుగా ఉండటంతో విషయాన్ని అందరికీ చెప్తానని నాగరాజు అన్నాడు. దీంతో విషయం బయటపడుతుందని భయపడి ప్రియుడితో కలసి బాలుడి గొంతుకు టవల్ బిగించి హతమార్చారు. ఆర్థిక సంబంధాలతో చనువు విజయ కుటుంబానికి తోకల వెంకట్‌రెడ్డి రూ.లక్ష అప్పు ఇచ్చాడు. రూ.50 వేలు తిరిగి ఇచ్చినప్పటికీ మరో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అప్పుడప్పుడు వెంకట్‌రెడ్డికి వ్యవసాయ పని కోసం ట్రాక్టర్ దున్నటానికి విజయ భర్త వెంకన్న వెళ్లేవాడు. భార్య విజయ వెంకట్‌రెడ్డితో చనువుగా ఉంటుందన్న విషయం తెలిసిన వెంకన్న గతంలో విజయ, వెంకట్రెడ్డిలను మందలించినట్లు తెలిసింది. -
కోడలు అక్రమ సంబంధం.. మామ అరెస్టు
చెన్నై,సేలం: కోడలిని హత్య చేసిన మామను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా తంబంపట్టి సమీపంలో ఉలిపురం నరికరడు ప్రాంతానికి చెందిన అరివళగన్ (45) ఒక కో–ఆపరేటివ్ సొసైటీలో సేల్స్ మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అముద (40). వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అరిళగన్ ఎప్పటిలానే సోమవారం ఉదయం పనికి వెళ్లిపోయాడు. అముద ఒక్కటే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం అరివళగన్ తండ్రి పళని (63) ఇంటికి వచ్చాడు. తర్వాత ఇంటిలోపల గడియపెట్టాడు. అముద కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు వారు తలుపులు తట్టినా తెరుచుకోలేదు. కాసేపటికి ఇంటి లోపలి నుంచి పళని బయటకు వచ్చాడు. తన కోడలిని చంపినట్టు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పళనిని అరెస్టు చేశారు. తర్వాత విగత జీవిగా పడి ఉన్న అముద మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆత్తూరు జీహెచ్‌కు తరలించారు.పోలీసుల విచారణలో కోడలు మరో వ్యక్తితో అక్రమం సంబంధం కలిగి ఉన్నట్టు తెలియడంతో తాను ఆమెను హత్య చేసినట్టు అరివళగన్ అంగీకరించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
మహిళా కానిస్టేబుల్‌పై భర్త ఫిర్యాదు
ప్రకాశం, వేటపాలెం: వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళా కానిస్టేబుల్‌పై ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ప్యార్లి గ్రామానికి చెందిన సునీల్‌రాజ్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పదమూడేళ్ల క్రితం కంభం అనూషతో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనూష మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉండటంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెను సస్పెండ్ చేశారు. ఇటీవల తిరిగి వేటపాలెం పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరిన అనూష వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మంగళవారం రాత్రి ఇరువురిని రెడ్ హ్యండెండ్‌గా పట్టుకున్న సునీల్‌రాజ్ ఆధారాలతో సహా వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అనూషపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. -
కూతురి అక్రమ బంధం.. పరువు హత్య !
సాక్షి, కర్ణాటక, బళ్లారి: వివాహేతర సంబంధం పర్యవసానంగా పరువు హత్య చోటుచేసుకుంది. తండ్రి చేతిలో కూతురి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బళ్లారి తాలూకా గోడేహళ్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు గోపాలరెడ్డి కాగా, హతురాలు అతని కుమార్తె కవిత (22). పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం...గోడేహళ్ గ్రామంలో నివసించే రైతు గోపాల్‌రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి చేశారు. అయితే కవితకు అక్కడే ప్రకాశ్ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల నుంచి భర్తను వదలి ప్రియునితో ఉంటోంది. కవిత భర్త.. భార్య కనిపించడం లేదని తోరణగల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కవిత పుట్టింటికి వచ్చింది. ప్రియుడు కూడా వచ్చి కవితను తనతో రావాలని గొడవకు దిగడం జరిగింది. ఈ సంఘటనతో తండ్రి గోపాలరెడ్డి ఎంతో మథన పడ్డారు. సోమవారం రాత్రి కూతురితో ఆయన ఘర్షణ పడ్డాడు. ఈ గొడవలో ఆమె విగతజీవిగా మారింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. -
భార్య, ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాక్షి, అద్దంకి: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలిసి ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది తెలిసి భర్త అప్రమత్తమై తన ప్రియురాలితో ఇక మన మధ్య వివాహేతర సంబంధం కుదరదని తేల్చి చెప్పాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కాపాడబోయిన అతడు నదిలో దూకి గల్లంతై మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తిమ్మాయపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నది వద్ద సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అద్దంకి మండలం నాగులపాడుకు చెందిన గారపాటి వెంకట్రావుకు, చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన మల్లేశ్వరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మల్లేశ్వరిని బయటకు తీసుకొస్తున్న 108 సిబ్బంది వెంకట్రావు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంటు వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తుండగా భార్య మల్లేశ్వరి బేల్దారి కూలీగా పనిచేసేది. అద్దంకి పట్టణం ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ధనలక్ష్మి భర్త గుంజి వేణుబాబు(45)తో బేల్దారి పని చేసే సమయంలో మల్లేశ్వరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం మల్లేశ్వరి హైదరాబాద్ నుంచి అద్దంకి వచ్చి ప్రియుడు వేణును కలిసింది. వేణు ఆదివారం సినిమాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. సినిమాకని చెప్పి బయటకు వెళ్లిన భర్త రాకపోవడంతో భార్య సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరింది. ఇంతలో ఓ సంచిలో మల్లేశ్వరితో కలిసి తీయించుకున్న ఫొటో చూసి ఇదేమిటని ఫోన్లోనే భార్య తన భర్తను ప్రశ్నించింది. అనంతరం తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని మనస్తాపం చెంది ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను బంధువులు స్థానిక వైద్యశాలలో చేర్చగా చికిత్స పొందుతోంది. క్షణికావేశంతో నదిలోకి దూకిన మల్లేశ్వరి ఈ విషయం ఇలా ఉంటే వేణుబాబు, మల్లేశ్వరి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని అప్పటికే చీమకుర్తి వెళ్లి ఉన్నారు. భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిసి ఇద్దరూ అద్దంకి పయనమయ్యారు. మార్గంమధ్యలో మనకు వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగి పిల్లలున్నారని, ఇక వివాహేతర సంబంధం కొనసాగించడం మంచిది కాదని మల్లేశ్వరితో మార్గమధ్యలో వేణు అన్నాడు. అప్పటికే వారు ప్రయాణిస్తున్న బైకు గుండ్లకమ్మ బ్రిడ్జిపైకి చేరుకుంది. క్షణికావేశానికి గురైన మల్లేశ్వరి తాను నిన్ను విడిచి బతకలేనంటూ బైకు నుంచి కిందకు దిగి గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయి.. మల్లేశ్వరి నదిలోకి దూకడంతో హడావుడిగా కిందకు దిగి నదిలో మునిగిపోతున్న ఆమెను కాపాడేందుకు వేణు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేణు నదిలో గల్లంతయ్యాడు. కొటికలపూడికి చెందిన తిప్పాబత్తిన బ్రహ్మయ్య అనే యువకుడు ఆటో నుంచి తాడు తీసుకుని ఆమెకు అందించాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది అతికష్టం మీద ఆమెను కాపాడారు. చికిత్స కోసం వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు కొత్తపట్నం నుంచి రెస్క్యూ టీమ్‌ను పిలిపించి వేణును బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు వేణుకు భార్య ధనలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుమార్తెలు విలపించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న భార్యకు బంధువులు భర్త మృతి విషయం తెలియనివ్వలేదు. -
భర్త కోసం యువతితో ఘర్షణ.. ఆత్మహత్య
విశాఖపట్నం, నక్కపల్లి(పాయకరావుపేట): అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ వేరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు ఆమెను ఇంటికి తీసుకురావడమే కాకుండా తనపై దాడి చేయించడాన్ని తట్టుకోలేక ఓ మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లిలో టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న కొప్పిశెట్టి చినరాజుకు డొంకాడకు చెందిన నాగ వరలక్ష్మి(28)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. చినరాజు వేరొక యువతితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్య వరలక్ష్మి అతన్ని తరచూ నిలదీస్తూండేది. వరలక్ష్మి మృతదేహం దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇవి పెద్ద మనుషులు, కుటుంబ పెద్దలు వరకు వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అయితే వివా హేతర సంబంధం పెట్టుకున్న యువతిని రాజు శనివారం తన ఇంటికి తీసుకు వచ్చాడు. దీంతో వరలక్ష్మికి ఆ యువతికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదం ముదరడంతో వరలక్ష్మి ఇంటికి వచ్చిన యువతి అదే ఇంటి మేడ పైనుంచి కిందకు దూకింది. ఆమెకు గాయాలయ్యాయి. దీంతో భర్త రాజు వరలక్ష్మిని మందలించాడు. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈవిషయాన్ని చుట్టుపక్కల వారు, బంధువులు కొత్తూరులో ఉంటున్న సోదరికి సమాచారం ఇచ్చారు. భర్త, అత్త, వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి వేధింపుల కారణంగానే వరలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు చెప్పారు. -
అంతమొందించి.. అంతులేకుండా వెళ్లాడు..
ప్రకాశం కొనకనమిట్ల: వివాహేతర సంబంధం వద్దని వారించిన భార్యను ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా చంపేసి పరారయ్యాడు. ఈ సంఘటన మండలంలోని మంగాపురం ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని మునగపాడుకు చెందిన దమ్ము వెలుగొండయ్య, ఎర్రక్క దంపతుల కుమార్తె ఆదిలక్ష్మి(35)ని మంగాపురం గ్రామానికి చెందిన శిగినం లక్ష్మీనారాయణకు ఇచ్చి వివాహం చేశారు. ఇతడు బేల్దారి పనులు చేస్తుంటాడు. వీరికి మణికంఠ, మాధవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మీనారాయణ ఇటీవల వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది తెలిసిన భార్య.. భర్తను నిలదీసింది. ఈ విషయమై దంపతులు ఇంట్లో గొడవ పడ్డారు. తీవ్ర ఆగ్రహం చెందిన భర్త.. ఆదిలక్ష్మిని ఇంట్లో ఉన్న కేబుల్ వైరును ఆమె మెడకు బిగించి చంపాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లు బయటకు వచ్చి ఆదిలక్ష్మి పలకడం లేదు.. పడిపోయిందంటూ పక్కనున్న బంధువులతో చెప్పి పరారాయ్యాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు మంగాపురం వెళ్లి తమ కుమార్తె మృతి చెంది ఉండటాన్ని చూసి భోరున వలపించారు. అల్లుడే తమ కుమార్తెను చంపాడని ఆరోపించారు. తల్లి మృతి చెందటంతో ఇద్దరు పిల్లలు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆదిలక్ష్మి మృతికి కారణాలు బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కానిస్టేబుల్ వివాహేతర సంబంధం
తమిళనాడు, తిరువొత్తియూరు : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలు.. తిరుచ్చిజిల్లా తురైయూర్ పులివలానికి చెందిన సంతోష్(25), లక్ష్మి(27) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సంతోష్ నాలుగునెలల క్రితం పనివెదుక్కుంటూ చెన్నైకు వెళ్లాడు. అప్పటి నుంచి భార్య లక్ష్మికి భర్త సమాచారం తెలియలేదు. దీంతో భర్త అదృశ్యమైనట్లు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్ రామర్(43) ఆమెపై కన్నేశాడు. తరచూ విచారణ పేరుతో లక్ష్మి ఇంటికి రాకపోకలు సాగించి, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గుర్తించిన ఇరుగుపొరుగు వారు శనివారం అర్ధరాత్రి లక్ష్మి ఇంట్లో రామర్ ఉండగా బయట తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎస్ఐ ముత్తుసామి తలుపులు తెరిపించి కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకని విచారణ చేస్తున్నారు. -
పెళ్లయిన వారూ పేట్రేగుతున్నారు..
బెంగళూర్ : వివాహేతర సంబంధాల మోజులో సంసారాలు ఛిద్రమవుతున్నా అనైతిక బంధాల కోసం అర్రులు చాచే ధోరణి పెరుగుతోంది. తాజాగా వివాహేతర డేటింగ్ యాప్‌లో ఏకంగా ఎనిమిది లక్షల మంది వివాహితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.తమ భాగస్వాములను మోసం చేస్తూ సాగిస్తున్న రహస్య బంధాల్లో స్ర్తీ, పురుషులు ఇద్దరూ పాలుపంచుకోవడం గమనార్హం. ఈ డేటింగ్ యాప్‌లో టెక్ హబ్ బెంగళూర్ నుంచి అత్యధిక సంఖ్యలో సబ్స్క్రైబర్లు నమోదయ్యారు. జనవరి తొలి వారంలో డేటింగ్ యాప్‌కు సబ్స్క్రైబర్లు వెల్లువెత్తారు. ఈ ఏడురోజులూ రోజుకు 300 శాతం చొప్పున సబ్స్క్రిప్షన్ పెరగ్గా, నెలమొత్తంలో వచ్చిన సబ్స్క్రిప్షన్ల కంటే తొలి వారంలో వచ్చినవి ఏకంగా 250 శాతం అధికం. నూతన సంవత్సర వేడుకలు ముగిసి దంపతులు తమ పనుల్లో నిమగ్నమవడంతో పాటు పిల్లల వింటర్ వెకేషన్ ముగిసిన క్రమంలో వివాహేతర బంధాల డేటింగ్ యాప్‌కు సబ్స్క్రిప్షన్లు వెల్లువెత్తాయని నివేదిక వెల్లడించింది. ఈ యాప్‌లో ఎక్కువ మంది బెంగళూర్, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, పూణే, చెన్నై, గుర్గావ్, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్, లక్నో, కొచ్చి, నోయిడా, వైజాగ్, నాగపూర్, సూరత్, ఇండోర్, భువనేశ్వర్ నగరాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ఈ యాప్ వృద్ధి 567 శాతం పైగా ఉండటంతో వివాహ బంధానికి వెలుపల అనైతిక బంధాల కోసం ఎంతగా వెంపర్లాడుతున్నారనేది వెల్లడవుతోందని ఫ్రెంచ్ ఆన్లైన్ డేటింగ్ కమ్యూనిటీ వేదిక నివేదిక తెలిపింది. చదవండి : ప్రియుడితో పారిపోయేందుకు మహిళ ఘాతుకం.. -
ప్రియుడితో పారిపోయేందుకు మహిళ ఘాతుకం..
చండీగఢ్: ప్రియుడితో పారిపోయేందుకు మహిళ తన రెండున్నరేళ్ల చిన్నారిని పరుపు కింద కుక్కడంతో ఊపిరాడక బాబు మరణించిన ఘటన పంజాబ్‌లోని బురాలి గ్రామంలో వెలుగుచూసింది. ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్న దశరథ్ పనులు ముగించుకుని ఇంటికి రాగా, భార్య కుమారుడు కనిపించకపోవడంతో వారు అత్తవారింటికి వెళ్లి ఉంటారని భావించాడు. భార్యకు ఫోన్ చేయగా తాను ఇంట్లో లేనని, బాలుడిని పరుపు కింద పడుకోబెట్టానని చెప్పడంతో దశరథ్ పరుపు కింద చూడటంతో రెండున్నరేళ్ల చిన్నారి విగతజీవిగా కనిపించాడు. కొడుకును హత్య చేసి తన భార్య ప్రియుడితో పారిపోయిందని దశరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
ఫోన్ సంభాషణతో సౌజన్య గుట్టు రట్టు..
దుండిగల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేయించిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఏసీపీ నర్సింహరావు, సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం, కుర్తివాడకు చెందిన ముక్కుట్ల యాదాగౌడ్ (35), సౌజన్య దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి చర్చి గాగిల్లాపూర్‌లో ఉంటున్నారు. యాదాగౌడ్ ఆటో ఫైనాన్స్‌లో పని చేస్తుండగా సౌజన్య గృహిణి. కాగా అదే ప్రాంతానికి చెందిన డీసీఎం డ్రైవర్ షేక్ ఆసిఫ్‌తో యాదాగౌడ్‌కు స్నేహం ఉంది. దీంతో అతను తరచు యదాగౌడ్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో సౌజన్యకు అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో యాదాగౌడ్ ఇద్దరినీ మందలించాడు. ప్రియుడిని రెచ్చగొట్టి.. యాదాగౌడ్ అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్న సౌజన్య ఆసిఫ్‌కు పలుమార్లు ఫోన్ చేసి భర్త తనను వేధిస్తున్నాడని, అతడి అడ్డుతొలగిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చునని చెప్పింది. ఈ నెల 15న యాదాగౌడ్ ఇంటికి వచ్చిన ఆసిఫ్ పార్టీ చేసుకుందామని అతడిని చర్చి గాగిల్లాపూర్‌లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు తీసుకెళ్లాడు. యాదాగౌడ్‌కు ఫుల్లుగా మద్యం తాగించిన ఆసిఫ్ కత్తితో దాడి చేసి అతడిని హత్య చేశాడు. అక్కడి నుంచి నేరుగా సౌజన్య వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అయితే తన భర్తను హత్య చేసిన ఆసిఫ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజాలు వెలుగులోకి.. ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా సౌజన్య ప్రోద్భలంతోనే హత్య చేసినట్లు చెప్పాడు. ఆమెకు ఫోన్ కూడా తానే కొనిచ్చానని, నిత్యం దాని నుంచే ఇద్దరం మాట్లాడుకునే వారమని తెలిపాడు. అయితే సౌజన్య మాత్రం హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆసిఫ్ వెకిలి చూపులు చూసేవాడని, ఈ విషయం తన భర్తకు చెప్పడంతో అతడిని మందలించినట్లు చెప్పింది. ఆసిఫ్ ఇచ్చిన ఫోన్ నంబర్‌ను దాచి మరో నంబర్‌ను పోలీసులకు ఇవ్వడంతో విచారణ ఆలస్యమైంది. మరోసారి ఆసిఫ్‌ను విచారించి పోలీసులు అతడు ఇచ్చిన ఫోన్ కాల్ డేటాను సేకరించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తరచూ అతనితో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు భర్తను హత్య చేయాలని ప్రేరేపించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తండ్రి హత్యకు గురి కావడం, తల్లి జైలుకు వెళ్లడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. -
ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్ పెట్టి..
పంజగుట్ట: వివాహేతర సంబంధంపై భార్య నిలదీసినందుకు ఓ వ్యక్తి ‘తాను ఆత్మహత్య చేసుకుంటానని’ భార్యకు మెసేజ్ పంపి అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి, వినోద్కాంబ్లి దంపతులు గత కొంత కాలం క్రితం నగరానికి వలస వచ్చి చింతల్‌బస్తీ, వీర్‌నగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వినోద్‌కాంబ్లీ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆదిలక్ష్మి అతడిని మందలించింది. దీంతో ఈ నెల 22న డ్యూటీకి వెళ్లిన వినోద్ ‘తాను చనిపోతానని’ ఆదిలక్ష్మికి మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె అతడి కోసం ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో గురువారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంజు ప్రాణం తీసిన అనుమానం..
భోపాల్ : అనుమానం ముగ్గురి నిండు ప్రాణాలను బలితీసుకుంది. మంజు అనే మహిళకు పలువురితో వివాహాతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెతో పాటు ఏడాదిన్నర చిన్నారి, మరో వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ముగ్గురి చేతులు,కాళ్లు కట్టేసి నోటికి టేప్ వేసి ఉన్న మృతదేహాలను గుర్తించారు. వ్యక్తి మృత దేహాన్ని గ్యాస్ స్టవ్‌పై పడేశారు. కాలిన మృతదేహాలతో పాటు హత్యకు పాల్పడిన వ్యక్తి గోడపై ఓ సందేశం రాశాడు. మంజు కోసం నా సోదరుడు ఉరిపోసుకున్నాడు. ఆమెకు పలువురు వ్యక్తులతో సంబంధాలున్నాయి అందుకే ఆమెను చంపాను..ఆమె కుటుంబంలో ప్రతి ఒక్కరినీ చంపేస్తా అని అందులో రాసి ఉంది. మధ్యప్రదేశ్‌లోని భిలాయ్‌లో ఈ జరిగిన ఘటన కలకలం రేపింది. మూడు హత్యలకు కారకుడిగా భావిస్తున్న మంజు భర్త రవిని ఒడిషాలోని రూర్కెలాలో పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన రాత్రి మంజు తల్లితండ్రులకు ఫోన్ కాల్ వచ్చిందని..అందులో మీ కుమార్తె, అల్లుడు మంటల్లో కాలిపోతున్నారని మీరు వాళ్లను కాపాడుకోవచ్చని అవతలి వ్యక్తి చెప్పాడని బాధితురాలి తల్లితండ్రులు తెలిపారు. ఆ నెంబర్‌కు తాము తిరిగి కాల్ చేయగా స్విచాఫ్ అవడంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి రాగా కాలిపోయి గుర్తుపట్టలేని రీతిలో ఉన్న మృతదేహాలు కనిపించాయి. మహిళతో పాటు ఆమె ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తి సజీవ దహనం కాగా, పొగను పీల్చడంతో చిన్నారి మరణించినట్టు పోలీసులు గుర్తించారు. మంజు కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చదవండి : ఆస్తి కోసం అక్కమొగుడే.. -
భార్యతో సంబంధం కొనసాగిస్తున్నాడని..
బంజారాహిల్స్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో పీకలదాకా మద్యం తాగించి పథకం ప్రకారం ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్‌కు చెందిన సదయ్య కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. హన్మకొండకు చెందిన అతడి దూరపు బంధువు రాంబాబు గత కొంతకాలంగా తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా సదయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా వీరి వైఖరిలో మార్పు రాకపోవడంతో రాంబాబును అంతమొందించాలని సదయ్య పథకం పన్నాడు. ఇందులో భాగంగా శనివారం రాంబాబుకు ఫోన్ చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా విందు ఇస్తానని చెప్పడంతో రాంబాబు నగరానికి వచ్చి సదయ్యకు ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి సమీపంలో ఉంటున్న సదయ్య బావ స్వామి ఇంటికి వెళ్లగా ముగ్గురు కలిసి మద్యం తాగారు. రాంబాబుకు బలవంతంగా ఎక్కువ తాగించిన సదయ్య పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతుకోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రాంబాబును స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సదయ్య, అతడి బావ స్వామిలపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్టు చేశారు. -
ప్రియుడి ఆత్మహత్యను తట్టుకోలేక వివాహిత
చెన్నై ,టీ.నగర్: తిరునెల్వేలి సమీపాన ప్రియుడు మృతిచెందిన ప్రాంతంలోనే ఓ యువతి ఐదేళ్ల బిడ్డను అనాథగా విడిచి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. దీన్ని గమనించిన స్థానికులు నెల్లై పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో మృతిచెందిన యువతి మూలకరైపట్టికి చెందిన మురుగన్ కుమార్తె కర్పగం (25)గా తెలిసింది. ఈమెకు వివాహమై ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అభిప్రాయభేదాల కారణంగా ఆమె రెండేళ్ల క్రితం భర్తను విడిచి ఒంటరిగా జీవిస్తోంది. ఇలావుండగా కర్పగం పనిచేస్తున్న కంపెనీలో నరసింగనల్లూరు తిరువళ్లువర్‌నగర్‌కు చెందిన ఇంజినీరు మహారాజన్ (26)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇరువురూ కొన్ని రోజుల క్రితం తిరుపూర్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. కర్పగం తండ్రి మురుగన్ తన కుమార్తె కనిపించడం లేదని మూలకరైపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి తిరుపూర్‌లో మహరాజన్‌తో కుటుంబం నడుపుతున్న కర్పగంను విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత కూడా ఆమె మహారాజన్‌తో సంబంధాన్ని విడిచిపెట్టలేదు. తర్వాత పాళయంకోట్టైలో ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. ఆ సమయంలో తనను సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొమ్మని కర్పగం మహారాజన్‌ను కోరింది. దీనిపై మహారాజన్ తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు. కర్పగం తనను మహారాజన్‌తో చేర్చాల్సిందిగా సుద్దమల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సంఘటన జరిగిన ప్రాంతం పాళయంకోట్టై పరిధిలో ఉందని చెప్పి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఇలావుండగా దీనిపై ఎటూ తేల్చుకోలేని మహారాజన్ తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఇటీవల ఇంట్లో సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, పాన్‌కార్డులు ఉంచి మలయాళమేడు రైల్వే గేట్ సమీపాన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కర్పగం శనివారం మహారాజన్ మృతిచెందిన ప్రాంతంలోనే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్ల బిడ్డ అనాథగా మిగిలడం స్థానికంగా విషాదాన్ని నింపింది. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
చెన్నై, అన్నానగర్: విరుదునగర్‌లో ప్రియురాలిని గొంతు కోసి హత్యచేసిన వ్యక్తి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. రాజపాళ యం శంకరన్ కోవిల్ రోడ్డులోని ఎంఆర్‌నగర్ కు చెందిన మురుగన్ (39), రామలక్ష్మి (35) దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గోమతినాయగం (09) అనే కుమారుడు, చందనమారి (06) అనే కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రి తం రాజపాళయంలో కాపురం పెట్టారు. మురుగన్ కోవైలోని ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. ఈ క్రమంలో రామలక్ష్మికి, భర్త బంధువు షణ్ముగం (40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. షణ్ముగంకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో రామలక్ష్మి నగదు కావాలని షణ్ముగంను ఇబ్బంది పెట్టేది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరోసారి వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన షణ్ముగం వెంటతెచ్చుకున్న కత్తితో గొంతుకోశా డు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం షణ్ముగం రాజపాళయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు రామలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి షణ్ముగంను విచారణ చేస్తున్నారు. -
హత్య చేసి పూడ్చేశారు..?
చిత్తూరు, కుప్పం రూరల్: ఓ వ్యక్తి అదృశ్యం కేసులో తమిళనాడు పోలీసులు మండలానికి చెందిన దంపతులను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అదృశ్యమైన వ్యక్తిని దంపతులు హత్య చేసి, పూడ్చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. కుప్పం మండలం, అడవిబూదుగూరు పంచాయతీ వినాయకపురం కాలనీకి చెందిన భార్యభర్తలు శివకుమార్, మాదేశ్వరి పొట్టకూటి కోసం చెన్నై వెళ్లి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి చెన్నైలోని శంకరానగర్కు చెందిన కార్తికేయన్ (40) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలంగా వీరు కలిసిమెలిసి ఉండేవారు. రెండు నెలల క్రితం శివకుమార్, మాదేశ్వరి తమ స్వగ్రామానికి వచ్చేశారు. అయినా కార్తికేయన్ చెన్నై నుంచి వీరింటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో పదిహేను రోజుల నుంచి కార్తికేయన్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణలో కార్తికేయన్ తన సెల్ నంబర్ నుంచి శివకుమార్ దంపతులతో మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. కార్తికేయన్ కనిపించకపోవడం వెనుక వీరి ప్రమేయం ఉన్నట్లు అనుమానించారు. దీంతో చెన్నై పోలీసులు శుక్రవారం వచ్చి వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. వివాహేతర సంబంధం,ఆర్థిక లావాదేవీలే కారణమా? కార్తికేయన్ మృతికి మాదేశ్వరితో ఉన్న వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్తికేయన్ మాదేశ్వరితో కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇది బెడిసి కొట్టిందని, మరోవైపు కార్తికేయన్ తానిచ్చిన డబ్బుల్ని తిరిగి ఇమ్మని కోరడంతో దంపతులిద్దరూ అతడిని వ్యూహం ప్రకారం అడవిబూ దుగూరుకు రప్పించి హత్య చేసినట్లు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో కార్తికేయన్ మృతదేహం? కార్తికేయన్ చంపి ఇంట్లోనే పూడ్చినట్లు కొన్ని సామాజిక మాధ్యమాలు, టీవీ చానళ్లలో వార్తలు రావడంతో పంచాయతీలో ఇది దావానలంలా వ్యాపించింది. కార్తికేయన్‌ను హతమార్చి ఇల్లు లేదా పొలంలోనే ఖననం చేసినట్లు తమిళనాడు పోలీసులు సైతం అనుమానిస్తున్నట్లు తె లిసింది. ఈ క్రమంలో మృతదేహం ఆచూకీ తెలుసుకునేందుకు వారు స్థానిక పోలీసుల అనుమతి కోరారు. అయితే చెన్నై పోలీసులు తెచ్చిన రికార్డుల్లో అదృశ్యమైనట్లు ఉందని, హత్యకు గురైనట్లు లేదని,ఈ కారణంగా పోలీ సులు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో పూర్తి స్థాయి ఆధారాలతో తమిళనాడు పోలీసులు శని వారం కుప్పం రానున్నట్లు సమాచారం. పోలీ సుల దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది. -
భర్త హత్య.. సహకరించిన ప్రియుడు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితిలో ప్రజలంతా మంగళవారం అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నమై ఉండగా, ఓ దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి తన భర్తనే హత్య చేసిందో ప్రబుద్ధురాలు. మునిగుడ సమితి ఆఫీస్‌లో తాత్కాలిక డ్రైవరుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ చంటి జీరో నైట్ ముగించుకుని రాత్రి 2 గంటలకు సొంతింటికి చేరుకున్నాడు. అదే సమయంలో తన భార్య నివేదిత నాయక్ ప్రియుడితో కలిసి ఉండడాన్ని చూశాడు. దీంతో కోపోద్రేకుడైన రాజ్‌కుమార్ భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ పెరిగి తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో నివేదిత నాయక్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేశారు. వంటింట్లో ఉన్న రొట్టెలకర్ర, పీఠ చెక్కతో రాజ్‌కుమార్ చంటిపై ఇద్దరూ కలిసి దాడి చేసి చంపేశారు. హత్య అనంతరం అతడి మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి, ప్రియుడి కారులో గజపతి జిల్లాలోని ఒడవ ప్రాంతానికి తరలించారు. అక్కడి రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి ఇద్దరు కలిసి తిరిగి కారులో ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. మునిగుడ తహసీల్దారు కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న నివేదిత తన భర్త కనిపించడం లేదంటూ మునిగుడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఒడవ ప్రాంతంలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని క్షణ్నంగా పరిశీలించి, పలు ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ ఆధారాలతో నివేదిత నాయక్‌ను ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజ్‌కుమార్ చంటి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భార్యతో అక్రమ సంబంధం వద్దన్నందుకు..
చెన్నై, సేలం: భార్యతో అక్రమ సంబంధాన్ని వదులుకోమని కోరిన భర్తను దారుణంగా హత్య చేసి, పరారైన ప్రియుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని వెన్నందూరుకు చెందిన కృష్ణన్ (55) సెంట్రింగ్ పని చేస్తున్నాడు. ఇతని భార్య వసంతి (45) టైలరింగ్ దుకాణం నడుపుతోంది. వీరికి కుమారుడు మోహన్ (25) ఉన్నారు. కొన్ని నెలల క్రితం కృష్ణన్‌కు సేలం జిల్లా చిన్నప్పన్‌పట్టికి చెందిన జ్యోతిష్కుడు రామచంద్రన్ (35)తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రామచంద్రన్ అప్పుడప్పుడు కృష్ణన్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అప్పుడు రామచంద్రన్‌కు కృష్ణన్ భార్య వసంతికి అక్రమ సంబంధం ఏర్పడింది. కృష్ణన్ ఎంత చెప్పినా రామచంద్రన్ వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హెచ్చరించినా రామచంద్రన్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇదేవిధంగా రామచంద్రన్ సోమవారం రాత్రి కూడా వసంతితో మాట్లాడాలంటూ కృష్ణన్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉండడం వల్ల అతనికి నచ్చజెప్పి ఊరికి పంపించడానికి అతడిని కృష్ణన్, మోహన్‌లు బస్టాండ్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న కత్తితో కృష్ణన్‌ను రామచంద్రన్ పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణన్‌ను సేలం జీహెచ్‌కు తరలించగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం కృష్ణన్‌ను అరెస్టు చేశారు. వెన్నందూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
మాజీ ప్రియుడిని హత్య చేసిన బుల్లితెర నటి
పెరంబూరు : వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసినందుకు దేవి అనే బుల్లితెర నటి తన మాజీ ప్రియుడిని హత్య చేసింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. దేవి అనే బుల్లితెర నటి తన భర్త శంకర్‌తో కలిసి చాలా కాలంగా వడపళనిలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మధురైకి చెందిన రవి(38) అనే వ్యక్తి 10ఏళ్ల క్రితం సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నైకి వచ్చాడు. సాలిగ్రామంలో నివసిస్తున్న రవికి దేవితో పరిచయమైంది. కొంతకాలానికి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇటీవల ఆమె ప్రియుడిని వదిలించుకోవాలని చెప్పాపెట్టకుండా కొలత్తూర్ సెమాత్తమన్ కోవిల్ వీధికి ఇల్లు మారిపోయింది. నటిగా అవకాశాలు తగ్గడంతో టైలరింగ్ వృత్తిని చేపట్టి పొట్టపోసుకుంటోంది. కాగా, ఆమె కోసం పలు చోట్ల గాలించిన రవికి దేవి చెల్లెలు లక్ష్మి ఇంటి చిరునామా తెలిసింది. దీంతో ఆదివారం రాత్రి మద్యం సేవించి లక్ష్మి ఇంటికి వెళ్లిన రవి ఘర్షణకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న దేవి తన భర్త శంకర్‌తో కలిసి లక్ష్మి ఇంటికి చేరుకుని రవిని వెళ్లిపోవాలని కోరింది. దీనికి అంగీకరించని రవి వాగ్వాదానికి దిగడంతో కోపం పట్టలేని దేవి ఇనుప రాడ్డుతో, ఆమె భర్త శంకర్ కట్టెతో దాడి చేశాడు. దీంతో రవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న కొలట్టూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కీల్పాక్కమ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన దేవి, ఆమె భర్త శంకర్, చెల్లెలు లక్ష్మి, భర్త సావరీస్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురి స్నేహితురాలి చేతిలో
తమిళనాడు, తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం పెట్టుకున్న కూతురి స్నేహితురాలి చేతిలో ఉత్తర చెన్నైకి చెందిన కర్పూరం వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. వివరాలు.. సాత్తుమానగర్ ప్రాంతానికి చెందిన అమ్మన్‌శేఖర్ (54) వ్యాపారి. సొంత ఊరు తూత్తుక్కుడి జిల్లా. కొన్నేళ్ల క్రితం చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. కర్పూరం హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె సేహితురాలి (25)పై అమ్మన్ శేఖర్‌కు లైంగిక వాంఛ కలిగింది. ఈ క్రమంలో యువతికి బహుమతులు ఇస్తూ సన్నిహితంగా మెలిగాడు. తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంత కాలంగా ఇద్దరూ పలు చోట్లకు వెళ్లి ఉల్లాసంగా గడిపారు. ఈ క్రమంలో పవిత్రకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. ఈ సంగతి తెలుసుకున్న శేఖర్ యువతితో తీసుకున్న ఆశ్లీల వీడియోలు చూపించి వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన యువతి శేఖర్‌ను హత్య చేయడానికి నిర్ణయించుకుంది. సోమవారం ఇద్దరూ బెసంట్ నగర్, తదితర ప్రాంతాల్లో ఉల్లాసంగా తిరిగారు. అనంతరం కొత్త చాకలిపేట హార్బర్ క్వార్టర్స్ క్రీడామైనానం వైపు బైక్‌పై వెళుతున్నారు. ఆ సమయంలో యువతి శేఖర్‌ను బైక్ ఆపమని చెప్పింది. నాకొక గిఫ్ట్ ఇవ్వాలని కోరింది. అతన్ని కళ్లు మూసుకోమని చెప్పడంతో శేఖర్ కళ్లు మూసుకున్నాడు. ఈ క్రమంలో యువతి మత్తు స్ఫ్రేను అతని ముఖంపై చల్లింది. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై పొడిచి పారిపోయింది. అమ్మన్ శేఖర్ అదేచోట స్ఫృహతప్పి పడిపోయాడు. తర్వాత కొంత సమయానికే మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా యువతిని ఉరి తీయాలని మృతుని కుటుంబీకులు డిమాండ్ చేశారు. -
అడ్డుగా ఉన్నాడనే దారుణం..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు భర్తను హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏకంగా సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే .. కృష్ణాజిల్లాకు చెందిన నాగరాజు(35), హేమలత దంపతులు నగరానికి వలసవచ్చి ప్రగతినగర్ ప్రాంతంలో ఉంటున్నారు. గతంలో వారు స్థానిక ప్రశాంతి గోల్డెన్ హిల్స్‌లో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పని చేసేవారు. ఈ క్రమంలో హేమలత వెంకటేశ్వరెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గుర్తించిన నాగరాజు పలుమార్లు భార్యను హెచ్చరించారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎలీప్ పారిశ్రామికవాడ ప్రాంతానికి మాకాం మార్చాడు. అయినా వారి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. తమ వివాహేతర సంబంధానికి నాగరాజు అడ్డుగా ఉన్నాడని భావించిన హేమలత, వెంకటేశ్వరరెడ్డి అతడిని హత్య చేయాలని పథకం పన్నారు. ఈ నేపథ్యంలో అతడు తినే ఆహారంలో విషం కలపాలని సూచించిన వెంకటేశ్వరరెడ్డి రెండుసార్లు హేమలతకు విషం తెచ్చి ఇచ్చాడు. అయితే ఆమె ధైర్యం చేయలేకపోయింది. దీంతో అతడిని హత్య చేసేందుకు బీదర్, వాడిచెల్కాపూర్ ప్రాంతానికి చెందిన మాపన్న అనే వ్యక్తి రూ.లక్షకు సుపారీ ఇచ్చాడు. పథకం ప్రకారం ఈ నెల 10న నాగరాజును బీదర్ సమీపంలోని బాల్కి ప్రాంతానికి తీసుకెళ్లిన వెంకటేశ్వర్‌రెడ్డి మాపన్నతో అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహంపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించారు. అనంతరం ఈ విషయాన్ని హేమలతకు చెప్పడంతో ఆమె తనకు ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమలత, వెంకటేశ్వరరెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. హేమలత పేరున ఫ్లాట్ రిజిస్ట్రేషన్.. హేమలతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వెంకటేశ్వరెడ్డికి ఆమెకు ప్రగతినగర్‌లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి నిందితులు.. నిందితులు వెంకటేశ్వరెడ్డి, మాపన్నలను సీఐ జగదీశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఏ విధంగా హత్య చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే దానిపై వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు. -
అక్రమ బంధానికి అడ్డొస్తున్నాడనేనా..?
నిజాంపేట్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఆమె భర్తకు మాయమాటలు చెప్పి కర్నాటకలోని బీదర్ పరిసరాలకు తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలిసింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రగతినగర్ ప్రాంతంలో ఉంటున్న నాగరాజు(35), హేమలత దంపతులు స్థానిక ఎలీప్ పారిశ్రామికవాడలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కృష్ణాజిల్లా, బొమ్మలపాడుకు చెందిన నాగరాజు 12 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. తొలుత ప్రగతినగర్, ప్రశాంతి గోల్డెన్ హిల్స్‌లో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో హేమలతతో వెంకటేశ్వరెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గుర్తించిన నాగరాజు ఎలీప్ పారిశ్రామికవాడకు మకాం మార్చాడు. అయినా వారి మధ్య సంబంధం కొనసాగుతుండటంతో మద్యానికి బానిసైన నాగరాజు తరచూ భార్యను కొట్టేవాడు. నమ్మించి తీసుకెళ్లి.. ఈ నెల 10న ఇంటి నుంచి బయటికి వెళ్లిన నాగరాజును వెంకటేశ్వర రెడ్డి నమ్మించి తనతో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడికి మద్యం తాగించి కారులో బీదర్ సమీపంలోని బాల్కి ప్రాంతానికి తీసుకెళ్లాడు. 11న హేమలత భర్త ఇంటికి రాకపోవడంతో పరిసరాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా వెంకటేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లి అడిగింది. అయితే అతను తన వద్దకు రాలేదని చెప్పాడు. ఈ విషయాన్ని హేమలత స్థానికులకు చెప్పడంతో నాగరాజు వెంకటేశ్వర రెడ్డితో కలిసి వెళుతుండగా చూసినట్లు తెలిపారు. దీంతో బుధవారం మధ్యాహ్నం హేమలత తన బంధువులతో కలిసి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నాగరాజును బీదర్ తీసుకెళ్లి హత్య చేయడమేగాక పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపాడు. హేమలతపై అనుమానం..? వెంకటేశ్వరరెడ్డి, హేమలత మధ్య వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నందునే నాగరాజు హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వరెడ్డి ఘటనకు ఐదు రోజుల ముందు నుంచే తన అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఆఫ్ చేయించి ఉండటంతో పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హేమలత, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరూ కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారా..? లేదా వెంకటేశ్వర రెడ్డి హేమలతకు తెలియకుండానే నాగరాజును హత్య చేశాడా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బీదర్‌కు ప్రత్యేక బృందం.. నాగరాజు హత్యకు గురైనట్లు తెలియడంతో పోలీసులు బుధవారం రాత్రి బీదర్ సమీపంలోని ఘటనా స్థలానికి బయలు దేరి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరుగు ప్రయాణమైనట్లు తెలిసింది. కాగా మృతుడి భార్య హేమలత ప్రస్తుతం బాచుపల్లి పోలీసుల అదుపులో ఉంది. -
మద్యం, మాంసం రుచిచూపి.. ప్రియుడితో కలిసి
సాక్షి, కేజీఎఫ్: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి మృతదేహాన్ని కాల్చివేసిన భార్య ఉదంతం నగరంలోని బెమెల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బంగారుపేట తాలూకా అనంతపుర గ్రామంలో వెంకటేష్(30) గాయత్రి (21)దంపతులు నివాసం ఉంటున్నారు. గాయత్రికి దాసరహొసహళ్లి గ్రామానికి చెందిన గారమేస్త్రి యల్లప్పతో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలుసుకున్న వెంకటేష్ గాయత్రిని హెచ్చరించాడు. అయినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. దీంతో వెంకటేశ్ మద్యానికి బానిసై గాయత్రితో గొడవ పడేవాడు. ఎలాగైనా భర్త వెంకటేష్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుతో కలిసి గాయత్రి పథకం రచించింది. గత నెల 24వతేదీన వెంకటేష్‌ను బెమెల్‌నగర్ మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి మాంసం తినిపించింది. అనంతరం స్కూటీలో వెంకటేష్‌ను ఐమరసపుర అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లింది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న యల్లప్ప వెంకటేష్‌ను కర్రతో తలపై బాది హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఉడాయించారు. అటవీ ప్రాంతంలో కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో మృతుడిని వెంకటేష్‌గా గుర్తించి అతని భార్య గాయత్రిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చినట్లు వెల్లడించడంతో గాయత్రిని, యల్లప్పను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి హత్యోదంతం తీరును తెలుసుకున్నారు. కాగా నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ మహమ్మద్ సుజీత అభిందించారు. చదవండి: మన్యంలో ఉపాధ్యాయురాలిపై మృగాడి వికృత చేష్టలు -
కోడల్ని సైతం వేధించిన శీనయ్య..
నెల్లూరు(క్రైమ్): వివాహేతర సంబధాలు ఏర్పరచుకుని భార్యను, కోడల్ని వేధించిన శీనయ్యను అతని భార్య, కుమారులే హత్య చేశారని నెల్లూరు రూరల్ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నరుకూరు సెంటర్ ఇందిరాకాలనీకి చెందిన ఐ.శీనయ్య (49), నాగమ్మలు దంపతులు. వారికి కుమార్, మరో కుమారుడు ఉన్నారు. శీనయ్య ఉప్పు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతను కొంతకాలంగా వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. పలుమార్లు కుటుంబసభ్యులు పద్ధతి మార్చుకోవాలని సూచించినా ప్రవర్తనలో మార్పురాలేదు. భార్య గట్టిగా నిలదీయడంతో ఆమెను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన శీనయ్య తన భార్య వద్దకు వచ్చాడు. అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తుండగా అతను హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్య చేశారని నాగమ్మ నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తులు లేదా మరెవరైనా చంపి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో భార్య, కుమారులు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో వారిపై అనుమానం రేగింది. దీంతో బుధవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. హత్య చేసిందిలా.. శీనయ్య కోడల్ని సైతం వేధించసాగాడు. ఈ విషయాన్ని నాగమ్మ సహించలేకపోయింది. భర్త వేధింపులు తాళలేని ఆమె జరిగిన విషయాలను తన కుమారులిద్దరికి చెప్పి ఎలాగైనా శీనయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే నవంబర్ 27వ తేదీన శీనయ్య ఇంటికి వచ్చి రాత్రి ఆరుబయట నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల అనంతరం భర్త ఆదమరిచి నిద్రిస్తుండడంతో నాగమ్మ తన ఇద్దరి పిల్లలతో కలిసి శీనయ్య ముఖంపై మరుగుదొడ్లను శుభ్రం చేసే యాసిడ్ పోశారు. అనంతరం రోకలిబండ, పచ్చడి నూరుకునే బండరాయితో అతడిపై విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారని డీఎస్పీ వెల్లడించారు. శీనయ్య హత్యను ఇతరుల మీద నెట్టేందుకు నిందితులు ప్రయత్నించారు. అందులో భాగంగా తన భర్తతో వివాహేతర సంబధం ఏర్పరచుకున్న వారు లేదా మరెవరైనా అతడిని హత్యచేసి ఉండొచ్చని నాగమ్మ ఫిర్యాదు ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి, ఎస్సై కె.నాగార్జునరెడ్డి, వారి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఆమె-ఆయన.. మధ్యలో ఇంకో ఆయన!
భార్యా భర్తల బంధం.. నమ్మకం, విశ్వాసం అనే పునాదులపై ఆధారపడి కొనసాగుతుంది. ఆ పరస్పర నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరిలో ఎవరు ఎవర్ని మోసం చేసినా.. సంసారం చెదిరిపోతుంది. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలతో అసలు బంధాలను దూరం చేసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఫ్యామిలీ కోర్టులకు వచ్చే మెజారిటీ కేసుల వెనుక వివాహేతర సంబంధాలే కారణాలుగా ఉంటున్నాయి. అలాంటి ఓ ఘటన దిల్ సుఖ్ నగర్లో వెలుగు చూసింది. భార్య చేస్తున్న మోసాన్ని బయటపెట్టేందుకు భర్త ఆస్ట్రేలియా నుంచి వచ్చి అర్థరాత్రి సమయంలో పోలీసులతో సహా భార్య ముందు ఎంట్రీ ఇచ్చాడు. అలా ఎంట్రీ ఇచ్చిన అతనికి మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది. తేదీ- నవంబర్ 22 సమయం- అర్థరాత్రి 12 గంటల తర్వాత స్థలం- దిల్ సుఖ్ నగర్‌లోని వాసవీ కాలనీ పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లారు ఓ ఫ్లాట్ ముందు నిలబడి తలుపులు కొట్టారు చాలాసేపు తలుపులు తెరుచుకోలేదు చివరికి ఓ మహిళ తలుపు తీసింది.. పోలీసుల్ని చూసి ఎందుకొచ్చారు అన్నట్టుగా చూసింది.. ఆ ఖాకీల వెనుక నిలబడి తననే చూస్తున్న వ్యక్తి ఎవరా అని చూసి నిర్ఘాంతపోయింది ఆ వ్యక్తి ఎవరో కాదు ఆమె భర్త భర్తను చూసి ఆ భార్య ఎందుకు షాక్ తినాలి..? ఎందుకంటే అతను హైదరాబాద్‌లో లేడు ఆస్ట్రేలియాలో ఉంటాడు అక్కడి నుంచి ఎప్పుడొచ్చాడో ఆమెకు తెలియదు.. ఇంటికి ఎందుకు రాలేదో కూడా తెలియదు నేరుగా పోలీసులతో వచ్చాక మాత్రమే ఆమెకు అతను ముందుగా ఇంటికి ఎందుకు రాలేదన్న విషయం అర్థమైంది. తన విషయం భర్తకు పూర్తిగా తెలిసిపోయిన సంగతి కూడా ఆ క్షణంలోనే గ్రహింపులోకి వచ్చింది ఆ తర్వాత ఆమె అదరలేదు. బెదరలేదు. తన గుమ్మం ముందు నిలబడ్డ పోలీసులు ఇంట్లోకి వెళ్తోంటే అలా చూస్తూ నిలబడిపోయింది. ఇక్కడ కాస్త ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పుకోవాలి. పదేళ్ల క్రితం పెళ్లి.. హాయిగా కాపురం పోలీసులతోపాటు వచ్చిన వ్యక్తి పేరు సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డికి పదేళ్ల క్రితం సూర్యాపేటకు చెందిన సమతతో పెళ్లైంది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే. కాపురం కొన్నేళ్లపాటు హాయిగానే సాగింది. ఇంకా చెప్పాలంటే ఆమె.. పోలీసులతోపాటు తన భర్తను చూసిన ముందు క్షణందాకా కూడా బయటి ప్రపంచం దృష్టిలో వీళ్లది అన్యోన్య దాంపత్యమే. సంతోష్ రెడ్డి-సమత దంపతులకు ఇద్దరు చూడముచ్చటైన పిల్లలున్నారు. కొన్నేళ్ల క్రితం పైచదువుల కోసం సంతోష్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లారు. భార్యాపిల్లలకు తోడుగా తన తల్లిని ఇంట్లోనే ఉంచి.. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లారు. ఏడాదికి ఓసారి వచ్చి నెల రోజులపాటు కుటుంబంతో గడిపి తిరిగి వెళ్లేవారు. అయితే, భార్యను కూడా తనతోపాటు ఓసారి ఆస్ట్రేలియా తీసుకెళ్లాలని సంతోష్ చాలా సార్లు అనుకున్నారు. ఇదే విషయం భార్యకు పదే పదే చెప్పారు కూడా.. నువ్వూ ఆస్ట్రేలియా రావచ్చు కదా.. కొన్నాళ్ల పాటు మొత్తం తిరిగి వద్దాం అంటూ ఎన్నో సార్లు చెప్పారు. ఎందుకో ఆమె ఒప్పుకునేది కాదు. పాస్ట్ పోర్టు సమస్యలున్నాయని చెప్పి తప్పించుకునేది. అప్పుడు కూడా సంతోష్ తన భార్యకు ఇల్లు వదిలి బయటికి రావడం ఇష్టం ఉండదనీ, తనను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేకనే అలా చెప్తోందనీ అనుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చేవి. మీ అమ్మను ఎంతమాత్రం భరించలేనని తరచూ భార్య నుంచి కంప్లైంట్. ఏడుపులు. పెడబొబ్బలు.. ఆ గొడవలు పెరిగిపోయి.. చివరికి కోడలితో పడలేనంటూ సంతోష్ రెడ్డి తల్లి తన ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఆస్ట్రేలియా రమ్మన్నా రాకపోవడం... తల్లి ఇంటి నుంచి వెళ్లిపోవడం.. సంతోష్ రెడ్డికి ఏదో జరుగుతోందన్న అనుమానం కలిగించాయి.. మొహమాటపడుతూనే తన స్నేహితులను వాకబు చేశాడు. వాళ్లకు తెలిసిన సమాచారం వాళ్లు షేర్ చేశారు. అంతే.. తన అనుమానమే నిజమయ్యింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు కానీ, ఇంటికి వెళ్లలేదు పదేళ్ల పాటు నిర్మించుకున్న నమ్మకం అనే గోడ తన కళ్లముందే కూలిపోయినట్లనిపించింది సంతోష్ రెడ్డికి. రోజూ భార్య ఫోన్లో తనతో మాట్లాడుతున్న మాటలన్నీ ఎందుకో అతన్ని వెక్కిరిస్తున్నట్లే అనిపించాయి.. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. దూరంగా ఉంటూ రోజూ తన భార్య కదలికలు గమనించేవాడు. రాత్రివేళ తన అపార్ట్మెంట్ ముందు రహస్యంగా గస్తీకాసేవాడు.. తన అనుమానాలే నిజమయ్యాయి. తన కళ్లతోనే చాలా విషయాలను చూసి నిర్ధారించుకున్నాడు. నీ భార్యను భరించలేనంటూ తన తల్లీ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో అతనికి బోధపడింది. పదే పదే ఆస్ట్రేలియా రమ్మని పిలిచినా భార్య ఎందుకు ఒప్పుకోవడం లేదో సరైన కారణం అతనికి తెలిసింది.. కానీ తాను నేరుగా వెళ్లి తనకు తెలిసిన విషయాలను ఆమె తల్లిదండ్రులకు చెప్తే వింటారన్న నమ్మకం అతనికి లేదు. ఎందుకంటే.. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటావ్ కాబట్టి అనవసరంగా అనుమానాలు పెంచుకున్నావ్ అంటారనుకున్నాడు. అందుకే... నవంబర్ 22 అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేశాడు. తాను చూసినదీ.. తెలుసుకున్నదీ అన్నీ చెప్పాడు. పోలీసులు కూడా అతని వెంట రావడానికి ఒప్పుకున్నారు.. అంతా కలిసి వెళ్లి తన ఇంటి తలుపు కొట్టారు. అప్పటిదాకా తన భర్త ఆస్ట్రేలియాలోనే ఉన్నాడనుకున్న సమత.. పోలీసులతో కలిసి అర్థరాత్రి ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి నిర్ఘాంతపోయింది. సైలెంటుగా వాళ్లకు తన ఇంట్లోకి అనుమతిచ్చింది. అయితే.. అప్పటికే ఆ ఇంట్లో అలజడి మొదలైంది.. పోలీసులు నేరుగా బాత్రూమ్లోకి వెళ్లారు. అక్కడ నక్కి చూస్తున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి సమత ప్రియుడు శివప్రసాద్. బెడ్రూమ్లోంచి మరో జంట.. షాక్ సంతోష్ రెడ్డి అనుకున్న విధంగానే పోలీసుల సమక్షంలో తన భార్య బండారాన్ని బయటపెట్టాడు. సరిగ్గా ఇక్కడే అతనికి ఇంకో కొత్త విషయం తెలిసింది. తన ఇంట్లో ఆ సమయంలో ఉన్నది భార్య.. ఆమె ప్రియుడు మాత్రమే కాదు.. మరో బెడ్రూమ్లోంచి మరో జంట బయటికొచ్చింది. వాళ్లను చూసి షాక్ తినడం సంతోష్ రెడ్డి వంతైంది. వాళ్లెవరు..? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నట్టు..? నైటీలో ఉన్న ఆ మహిళ పేరు విశాల.. ఆమె సమత స్నేహితురాలు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తి పేరు నరేష్.. సమతకు పెళ్లైనట్లే విశాలకూ పెళ్లై పిల్లలున్నారు. కానీ.. ప్రియుడితో కలిసి సమతలాగే విశాల కూడా రహస్య బంధాన్ని కొనసాగిస్తోంది. సమత భర్త పోలీసులతో రావడంవల్ల ఆమె వివాహేతర సంబంధం కూడా బయటపడింది. ఇదే ఇంట్లో నుంచే.. మహిళా కానిస్టేబుల్ విశాల భర్తకు ఫోన్ చేసి మీ భార్య తన స్నేహితురాలి ఇంట్లో ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. సమత ప్రియుడు శివప్రసాద్.. ఓ డాక్టర్. అతనిదీ సూర్యాపేటే. సమత పుట్టింటికి దగ్గర్లోనే అతని ఇల్లు.. పెళ్లికి ముందు నుంచి ఉన్న పరిచయం.. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత వివాహేతర సంబంధంగా కొనసాగుతోంది. శివప్రసాద్‌తో సంబంధం వల్లే సమత.. తనతోపాటు ఆస్ట్రేలియా వచ్చేందుకు ససేమిరా అనేదని సంతోష్ రెడ్డి అంటున్నారు. శివప్రసాద్‌తో ఇలా గడిపేందుకే తన తల్లితో తరచూ తగాదా పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసిందంటున్నారు. అంతేకాదు.. తాను ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె ఫోన్ బిజీగానే ఉండేదనీ.. తాను పిల్లలతో మాట్లాడాలని ప్రయత్నించినా.. మాట్లాడనిచ్చేది కాదంటున్నారు. కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న స్మార్ట్ ఫోన్ కల్చర్ సంతోష్ రెడ్డి నుంచి ఫిర్యాదు తీసుకున్న చైతన్యపురి పోలీసులు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో అర్థరాత్రి వేళ సమత ఇంటికి వెళ్లి సమతతోపాటు.. ఆ ఇంట్లో ఉన్న ఆమె ప్రియుడు శివప్రసాద్.. మరో జంట విశాల, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 408, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భార్య వివాహేతర సంబంధాన్ని భర్త బయటపెట్టే కేసులు.. భర్త రహస్య సంబంధాలను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ కల్చర్ కుటుంబాల్లో చిచ్చుపెడుతోందని నిపుణులంటున్నారు. దూరంగా ఉండే ఇద్దరు వ్యక్తులు వాట్సప్‌లో తరచూ టచ్‌లో ఉండటం.. గంటలు గంటలు సోషల్ మీడియాల్లో గడపడం వివాహబంధాన్ని నిలువునా కోతకోస్తోందంటున్నారు. భార్యాభర్తల బంధం మధ్య వాళ్లిద్దరే కాకుండా పిల్లలు కూడా ఉన్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. -
ప్రియుడితో కలిసి.. భర్తను స్కార్పియోతో తొక్కించి!!
సాక్షి, మైదుకూరు : వివాహేతర సంబంధం విషయమై భర్త పలుమార్లు మందలించడంతో.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన ఆమె ప్రియుడితో కలిసి అంతమొందించింది. దువ్వూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును ఛేదించి.. ఆమెతోపాటు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం మైదుకూరు పోలీసు సబ్‌డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ముడావత్ తులసీనాయక్, సాలిబాయికి 17 ఏళ్ల కిందట వివాహం అయింది. నాలుగేళ్ల కిందట వైఎస్సార్ జిల్లా టి.సుండుపల్లి మండలం మన్యంవారిపల్లెకు చెందిన మూడె రెడ్డినాయక్‌కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వెళ్లిన సాలిబాయి అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై ఆమెను భర్త తులసీనాయక్ పలు మార్లు మందలించాడు. అడ్డుగా ఉన్నాడని.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. అతనిని అంతమొందిస్తే తాము సంతోషంగా ఉండవచ్చునని రెడ్డి నాయక్‌తో కలిసి సాలిబాయి కుట్రపన్నింది. అందులో భాగంగా రెడ్డినాయక్ తన స్నేహితులైన చక్రాయపేట మండలం ఎర్రగుడి తండాకు చెందిన వినోద్‌కుమార్ నాయక్, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లె గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, విజయనగరం జిల్లా మండల కేంద్రమైన గంట్యాడకు చెందిన మునగపాటి జగన్నాథరాజుతో కలిసి.. తులసీనాయక్‌ను చంపేందుకు లక్ష రూపాయలకు సుఫారి ఖరారు చేసుకున్నారు. ఇందుకు రూ.30 వేలు అడ్వాన్సుగా చెల్లించారు. కాగా రెడ్డినాయక్ సాలిబాయికి రూ.10 వేలు బాకీ ఉండటంతో.. ఆ సొమ్మును చెల్లిస్తానని ఈ నెల 12న తులసీనాయక్‌ను వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామ సమీపానికి పిలిపించారు. అక్కడ తులసీనాయక్‌కు మద్యం తాపారు. అనంతరం కుట్రలో సాలిబాయి ఆదేశాల మేరకు తులసీనాయక్‌ను మద్యం బాటిల్‌తో కొట్టారు. తులసీనాయక్ పారిపోబోగా తమ వద్ద ఉన్న స్కార్పియో వాహనంతో తొక్కించి చంపారు. అనంతరం శవాన్ని దువ్వూరు మండలం పెద్దజొన్నవరం మిట్ట దగ్గర జాతీయ రహదారి కల్వర్టు పక్కన పడేశారు. ఈ నెల 15న మృతదేహం ఉన్న విషయం తెలియడంతో దువ్వూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తప్పుదోవ పట్టించే యత్నం పోలీసులు కనుగొన్న శవం తన భర్తదేనని, ఆయన మరణానికి తమ గ్రామానికి చెందిన దమన పెద్దపుల్లయ్య కారణమని సాలిబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు సాలిబాయి సెల్‌ఫోన్‌లోని కాల్ డేటాను పరిశీలించి.. ఆమె తన ప్రియుడు రెడ్డినాయక్‌తో రోజూ మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నారు. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించినట్టు నిర్ధారించారు. ఆ మేరకు మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశాలతో రూరల్ సీఐ టీవీ కొండారెడ్డి, దువ్వూరు ఎస్ఐ ఎస్.కుల్లాయప్ప సిబ్బంది శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ టీవీ కొండారెడ్డి, దువ్వూరు ఎస్ఐ కుల్లాయప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘాతుకం : మామ చేతిలో కోడలి హతం
కర్ణాటక, మండ్య: వివాహేతర సంబంధానికి అంగీకరించలేదనే కారణంగా వ్యక్తి కోడలిని హత్య చేసిన ఘటన ఆదివారం మండ్య తాలూకా రాగిముద్దనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హాసన్ జిల్లాకు చెందిన వీణ (26)కు రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కాగా రెండేళ్ల క్రితం నాగరాజు భార్య సావిత్రమ్మ మృతి చెందింది. అప్పటినుంచి నాగరాజు ప్రతిరోజూ కోడలు వీణను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో విషయాన్ని భర్త అనిల్ దృష్టికి తీసుకెళ్లడంతో అనిల్ సైతం తండ్రి నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ తీరు మార్చుకోని నాగరాజు వీణను లైంగికంగా వేధించసాగాడు. దీంతో భార్య, పిల్లలతో కలసి అనిల్ గ్రామంలోనే వేరుగా ఉండసాగాడు. దీంతో వీణపై అక్కసు పెంచుకున్న నాగరాజు కొడుకు అనిల్ ఇంటికి, దుకాణానికి వస్తూ వీణను మాటలతో చేష్టలతో వేధించసాగాడు . దీనిపై అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లిన నాగరాజు జామీనుపై విడుదలై కోడలిని మరింత వేధించసాగాడు. ఈ క్రమం లో ఆదివారం ఇంటి బయటకు వచ్చిన వీణపై తమ్ముడు మంజు సహకారంతో కత్తితో దాడి చేసిన నాగరాజు గొంతు, కడుపులో పొడిచాడు. వీణ కేకలు విన్న అనిల్, గ్రామస్థులు వెంటనే అక్కడికి వెళ్లగా అప్పటికే వీణ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతోంది. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా నాగరాజు, మంజు వెంటనే బైకుపై తప్పించుకున్నారు. వీణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మండ్య పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
నవ వధువు..ఇవి వద్దు అంటూ వేడుకుంది..
గత ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరిగింది. పదికాలలపాటు చల్లగా ఉండాలని తల్లిదండ్రులు ఆశీర్వదించి తమ కుమార్తెను అత్తంటికి పంపించారు. కట్టుకున్నవాడు వ్యసనపరుడు..వివాహేతర సంబంధం కూడా ఉంది. ఇన్ని విషయాలు తెలుసుకున్న నవ వధువు..ఇవి వద్దు అంటూ వేడుకుంది. అయినా భర్తలో మార్పు రాలేదు. దీంతో పురుగులు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కె.కోటపాడు మండలం పిండ్రంగిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎ.కోడూరు ఎస్ఐ బి.సతీష్ అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నం , –కె.కోటపాడు (మాడుగుల) : విశాఖలోని కంచరపాలేనికి చెందిన జాగరపు నాగలక్ష్మి(22)కి పిండ్రంగి గ్రామానికి చెందిన గౌరినాయుడుకు గత ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలలు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. కొద్ది నెలల్లోనే గౌరి నాయుడు అసలు స్వరూపం బయటపడింది. వ్యసనాలకు బానిసయ్యాడు. అలాగే గ్రామంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై ఐదు నెలలుగా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తతో ఎప్పటిలాగే వివాహేతర సంబంధంపై నాగలక్ష్మి ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వేదనకు గురైన నాగలక్ష్మి పురుగులు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న భార్యను కె.కోటపాడు 30 పడకల ఆస్పత్రికి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు తీసుకువెళ్లాడు. వైద్య సిబ్బంది చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి నాగలక్ష్మి మృతి చెందింది. అల్లుడి తీరు కారణంగానే.. అల్లుడు గౌరినాయుడు తీరుతో మానోవేదనకు గురైన తన కుమార్తె నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు లక్ష్మి,వెంకటరావు బోరున విలపించారు. వ్యసనాలతోపాటు వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని, భర్తలో మార్పు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించిందని, అయినా మార్పు రాకపోవడంతో అఘాయత్యానికి పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఎం.లక్ష్మి సమక్షంలో పంచనామా జరిపిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్.ఐ సతీష్ తెలిపారు. -
కాల్చేసిన వివాహేతర సంబంధం
చెన్నై,అన్నానగర్: క.పరమత్తి సమీపంలో వివాహేతర సంబంధం వదలని పారిశ్రామికవేత్తని బుధవారం హత్య చేసి కారులో పెట్టి దహనం చేసిన భార్య, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరూర్ జిల్లా క.పరమత్తి సమీపం కుప్పం – వేలమ్‌పాలైయమ్ వెళ్లే రోడ్డు పక్కన బుధవారం ఓ కారు కాలిన స్థితిలో నిలబడి ఉంది.దీన్ని చూసిన స్థానికులు క.పరమత్తి పోలీసు స్టేషన్‌కి సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూశారు. అప్పుడు కారు వెనుక భాగంలో కాలిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉంది. అతను హత్యకు గురై ఉండవచ్చని పోలీసులకు అనుమానం వచ్చింది. కారు నంబర్‌ను బట్టి పోలీసులు విచారణ చేశారు. ఇందులో మృతుడు నొయ్యల్‌కి చెందిన రంగస్వామి (51) అని, రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వేత్త అని తెలిసింది. అతని ఇంటికి పోలీసులు నేరుగా వెళ్లి విచారణ చేశారు. ఇందులో రంగస్వామి భార్య కవితా (41), కుమారుడు ఆశ్విన్‌కుమార్ (19) అని తెలిసింది. రంగస్వామికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండడం వల్ల అతనిని కవిత, అశ్విన్‌కుమార్ ఇద్దరూ కలసి ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేసి, తరువాత మృతదేహాన్ని కారులో తీసుకొని వెళ్లి తగలబెట్టినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి కవిత, అశ్విన్‌కుమార్ ఇద్దర్నీ అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
వివాహితుడితో ప్రేమ.. బాలిక ఆత్మహత్య
విశాఖపట్నం,జి.మాడుగుల(పాడేరు): ఓ గిరిజన బాలిక ఆత్మహత్య చేసున్న విషయం ఆలస్యంగా తెలిసింది. మండలంలో లువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామానికి చెందిన మసాడ విలియంకుమార్(27)కు ఓ యువతితో కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. విలియం కుమార్ అదే గ్రామానికి చెందిన గిరిజన బాలిక కొండపల్లి లక్ష్మి(15)తో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఈ విషయంలో విలియంకుమార్, అతని భార్యకు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. పలుమార్లు భార్యాభర్తలు గొడవపడినట్టు గ్రామస్తులు తెలిపారు. బుధవారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం వద్దని, మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విలి యంకుమార్ భార్య...లక్ష్మిని హెచ్చరిస్తూ గొడవ పడింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ప్రియరాలు ఆత్మహత్య చేసుకోవడంతో విలియంకుమార్ కూడా గురువారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న విలియంకుమార్‌ను స్థానికులు పాడేరు జిల్లా స్థాయి ఆస్పత్రికి తరలించారు. విలియంకుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్ఐ రామారావు తెలిపారు. -
చెడు నడవడి.. చేతులు తెగిపడి
ఎంతో శాంతంగా ఉండే శివయ్యకు భార్య ప్రవర్తన కోపం తెప్పించింది. సమాజంలో తలవంపులు తెచ్చే నడవడికను మార్చుకోవాలని చెప్పి చూశాడు. పెద్దలు, తల్లిదండ్రులు చెప్పినా ఆమెలో మార్పురాలేదు. శివయ్య శివాలెత్తిపోయి భార్య రెండు చేతులు నరికాడు.ప్రాణాపాయస్థితిలో ఆమె తిరుపతిలో చికిత్స పొందుతోంది. వైఎస్ఆర్ జిల్లా, రైల్వేకోడూరు రూరల్ : వివాహేతర సంబంధం వద్దని పలుమార్లు హెచ్చరించినా వినని భార్యపై భర్త కత్తితో దాడి చేసి రెండు చేతులు నరికాడు.ఈ సంఘటన రైల్వేకోడూరు మండలంలోని లక్ష్మీగార్డెన్స్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వీపీఆర్ కండ్రిక పంచాయతీ లక్ష్మీగార్డెన్స్ (ఎస్టీ కాలనీలో)లో నివాసం ఉంటున్న సౌడవరం శివయ్యకు కడపలోని ఓ ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న పద్మావతితో వివాహమైంది. నాలుగు సంవత్సరాల వారి కాపురంలో పలుమార్లు గొడవలు అయ్యాయి. ఆమె మరొక వ్యక్తితో వివాహేతర సంబంధంతో పది రోజులకు ఒక సారి ఇంటి నుంచి వెళ్లిపోయేది. తర్వాత వచ్చి భర్త దగ్గర ఉండేది. ఈ విషయంపై ఆరా తీసిన శివయ్య భార్య ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు. అయినా ఆమె వినలేదు. తర్వాత గ్రామంలోని పెద్దలు కూడా జోక్యం చేసుకుని ఇరువురికి సర్దిచెప్పి కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా చెప్పి చూసినా వినలేదు. ఈ క్రమంలో గత వారం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో బట్టలను సర్దుకుంది. అంతలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ రాత్రి 11 గంటల సమయంలో శివయ్య గట్టిగా అరుస్తూ పద్మాను కత్తితో నరికి చంపాను వెళ్లి చూసుకోండని చెప్పి పారిపోయాడు. గ్రామస్తులు వెతుక్కుంటూ వెళ్లగా శ్మశానం వద్ద రక్తపుమడుగులో ఆమె కన్పించింది. స్థానికులు దేశెట్టిపల్లెలోని వైఎస్సార్ సీపీ నాయకుడు ప్రసాద్‌రెడ్డికి సమాచారం అందించారు ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని పోలీసులకు తెలిపారు. తెగిపడిన కుడి చేయి దూరంగా చెట్ల మధ్యలో నుంచి వెతికి తెచ్చారు. ఎస్ఐ నరసింహం బాధితురాలిని 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఇదిలా ఉండగా శివయ్యకు గతంలో వివాహమైంది. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదవ కాన్పులో ప్రసవ వేదనతో 2014లో భార్య కమల మృతి చెందింది. ఒకటిన్నర సంవత్సరం పాటు పిల్లలను చూసుకుంటున్న శివయ్య ఒక చోట జరిగిన కార్యక్రమంలో పరిచయమైన పద్మావతిని వివాహం చేసుకున్నాడు. పద్మావతి కూడా గతంలో ఒకరిని వివాహం చేసుకొని భర్తకు దూరంగా ఉండేది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..
కర్ణాటక,బళ్లారి అర్బన్: బళ్లారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హతమార్చిన ఘటన చోటు చేసుకొంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొళగల్లు గ్రామానికి చెందిన కాగి సోమయ్య(34) అనే వ్యక్తి ఈనెల 20న తన భార్య యల్లమ్మతో కలిసి ద్విచక్ర వాహనంలో బళ్లారి–హొసపేటె రోడ్డులోని రామేశ్వరినగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వంతెన వద్దకు రాగానే పథకం ప్రకారం యల్లమ్మ తన ప్రియుడు, అదే గ్రామానికి గ్రామ పంచాయితీ సభ్యుడు సంజీవప్పను అక్కడకు పిలిపించింది. దీంతో సంజీవప్ప వారిని అటకాయించి సోమయ్యపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేసి హెచ్ఎల్సీ ప్రధాన కాలువలోకి మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి సోమయ్య ఆచూకీ లేకపోవడంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి యల్లమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సంజీవప్ప కోసం గాలింపు చేపట్టారు. కాగా సోమయ్య మృతదేహం మంగళవారం లభ్యమైంది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హనుమంతప్ప దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి జైలుశిక్ష
సాక్షి, ధర్మవరం : వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్ మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుని మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని సోదరి ఫిర్యాదు మేరకు బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈశ్వరయ్య, అతడి మరదలు రాధపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయిలు ఈశ్వరయ్య, రాధలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పు వెలువరించారు. -
ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
తమిళనాడు , తిరువొత్తియూరు: గుమ్మడిపూండి, సున్నాంబు కులం సమీపంలో సెంగల్ చూలైమేడు ప్రాంతానికి చెందిన మురుగన్ (38). అతని భార్య దేవి. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 12వ తేది రాత్రి మురుగన్ హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఆరంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ వినోద్‌తో దేవికి వివాహేతర సంబంధం ఉందని.. దీన్ని భర్త ఖండించడంతో వినోద్‌తో భర్తను హత్య చేయించినట్టు తెలిసింది. దీంతో దేవిని పోలీసులు అరెస్టు చేశారు. హంతకుడు వినోద్ హత్య చేసిన మరుసటి రోజు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ఆరోగ్యం కుదుటపడిన తరువాత అరెస్టు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
ఎల్బీనగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళతో పాటు, ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. మంగళవారం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా, తండాకు చెందిన ఇస్లావత్ ప్రసాద్‌బాబు, సరోజ దంపతులు నగరానికి వలసవచ్చి ఇంజపూర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రసాద్ బాబు ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా, సరోజ వెలుగు ప్రాజెక్ట్‌లో బుక్ కీపర్ పనిచేసేది. దీనికితోడు ప్రసాద్ బాబు చిట్స్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. అప్పుదారులు ఇంటికి వస్తుండటంతో అతను ఇంటికి రాకుండా స్నేహితుల వద్దే తలదాచుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న నర్సింహ్మతో సరోజకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయం తెలియడంతో ప్రసాద్ బాబు గత కొద్ది రోజులుగా సరోజను కొడుతున్నాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె ఈ విషయాన్ని తన ప్రియుడు నర్సింహకు విషయం చెప్పింది. పథకం ప్రకారం ఈ నెల 6న నర్సింహ తన బంధువు అయాన రామకృష్ణకు విషయం చెప్పి అతడిని ప్రసాద్ ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరిని సరోజ భర్తకు పరిచయం చేసి పైనాన్స్ ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిపింది. అనంతరం అందరూ కలసి మద్యం తాగారు. పథకం ప్రకారం మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ బాబు మెడకు టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారు. నర్సింహ్మ, రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లి పోయారు. 7న ఉదయం తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని సరోజ తన సోదరుడు లక్ష్మణ్‌తో పాటు బంధువులకు సమాచారం అందించింది. అందరూ కలిసి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించారు. అయితే బంధువుల్లో కొందరు ప్రసాద్ బాబు మెడకు ఉరిబిగించిన గుర్తులను చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సరోజను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్ధలిపురం ఏసీపీ శంకర్, సీఐ వెంకటయ్య సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఎఫైర్!
సాక్షి, న్యూఢిల్లీ : ఆఫీస్ పని మీద మరో నగరానికి వెళ్లి బస్టాండ్ నుంచి అప్పుడే క్యాబ్‌లో ఇంటికి చేరుకుంది స్టిఫాని బర్టన్. ఇంట్లోని వరండాలోకి వచ్చి అలసటతో పక్కనున్న సోఫాపై భుజానున్న బ్యాగ్‌ను పడేసి హమ్మయ్య! అంటూ ఆ పక్కనే కూర్చుండి పోయింది. ఆఫీస్ పని మీద వెళ్లిన నగరంలో బస చేసిన హోటల్ గదిలో రాత్రిపూట బాయ్ ఫ్రెండ్‌తో గడిపిన మధుర స్మృతులు అప్పుడప్పుడే ఆమె మనోఫలకం మీది నుంచి మాయమవుతున్నాయి. ‘హౌ ఆర్ యూ స్టిఫానీ!’ అంటూ ఎదురుగా వచ్చి పలకరించిన భర్తను చూసి దిక్కున సోఫా నుంచి లేచిన స్టిఫానీ రెండు చేతులు చాచి, భర్తను కౌగలించుకొని ‘ఐ లవ్ యూ డార్లింగ్, ఐయామ్ ఫైన్’ అంటూ సమాధానం ఇచ్చింది. అప్పటికే గత రాత్రి స్మతులను పూర్తిగా మరచిపోయి రోజు వారి ఇంటి పనిలో పడిపోయింది స్టిఫానీ. 40 ఏళ్ల స్టిఫాని ఇంగ్లండ్‌లోని మాన్‌చెస్టర్‌లో తన న్యాయవాది భర్త మైకేల్, 14 ఏళ్ల కూతురుతో కలిసి ఉంటోంది. 18 నెలల క్రితం బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్ బంధం ఏర్పడకముందు స్టిఫానీకి జీవితంలో ఏదో వెలితీగా ఉండేది. ఆఫీసు, ఇంటి పనితో సతమతమవుతూ వచ్చేది. ఎప్పుడు విశ్రాంతి కావాలనిపించేది. అది కుదరకపోవడంతో జీవితంపట్లనే విసుగనిపించేది. 18 నెలల నుంచి జీవితం కొత్తగా కనిపిస్తోంది. ఓ మధురానుభూతి ఇప్పుడు ఆమెను నడిపిస్తోంది. ఆఫీసు పనైనా, ఇంటి పనైనా ఆమెకు ఇప్పుడు ఏ మాత్రం విసుగనిపించడం లేదు. ఈ విషయాలను ఆమె నిర్భయంగా ‘సెక్స్ అండ్ రిలేషన్షిప్’ పేరిట ‘ఫిమేల్’ మాగజైన్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. స్టిఫానీలాగా భర్తకు తెలియకుండా పరపురుషుడితో సెక్స్ సంబంధాలు పెట్టుకున్నవారు ఇంగ్లండ్‌లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరున్నారు. ఈ మహిళలు తమను కూడా మోసం చేస్తున్నారనే విషయం వారితో సెక్స్ జీవితాన్ని పంచుకుంటున్న పరపురుషుల్లో 47 శాతం మందికి తెలియదట. ఇక వివాహేతర సెక్స్ జీవితాన్ని ఇతరులలో పంచుకుంటున్న మహిళల భర్తల్లో దాదాపు 50 శాతం మందికి తమ భార్యల పట్ల కించిత్తు అనుమానాలు కూడా లేవట. అన్ని వయస్కుల మహిళల సెక్స్ అనుభవాలపై ‘ఫిమేల్’ పత్రిక ఇటీవల అధ్యయనం నిర్వహించగా దాదాపు వెయ్యి మంది మహిళలు తమ సెక్స్ జీవితాల గురించి క్షుణ్నంగా వివరించారు. పరపురుషుడితో పడకసుఖం ఎంతో థ్రిల్లింగా ఉన్నా.. భర్తను వదిలి పెట్టాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్టిఫానీ తెలిపారు. అది తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. కుటుంబం కారణంగా తనకు సామాజిక జీవితం కూడా వచ్చిందని, వీటన్నింటిని వదులుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆమె తెలిపారు. ఇప్పటికీ తాను భర్తతోని వారానికి ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొంటానని, బయట తనకు దొరుకుతున్న సుఖాన్ని దృష్టిలో పెట్టుకొని భర్తకు ఎక్కువ సుఖం ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని స్టిఫాని వివరించారు. తన బాయ్ ఫ్రెండ్‌కు కూడా పెళ్లయిందని, ఆమె పట్ల తానేమీ అసూయపడడం లేదని చెప్పారు. వివాహ బంధంలేని ఏ ఎఫైర్లోనైనా థ్రిల్లింగ్ ఉంటుందని ప్రముఖ సైకోథెరపిస్ట్ లూసీ బెరస్ఫోర్డ్ చెప్పారు. ఇంటి జీవితంలో మహిళలు తాము కొంత దోపిడీకి గురవుతున్నామని భావిస్తారని, ఇలాంటి ఎఫైర్ దొరికినప్పుడు తాము కోల్పోయింది దొరికినట్లు భావిస్తారని ఆయన చెప్పారు. పెళ్లి బంధంతో తాము నిర్లక్షానికి గురవుతున్నామని కూడా భార్యలు భావిస్తారని, అందుకనే పరపురుషులతో వారు ఎక్కువ ఆనందంగా ఉంటారని కూడా ఆయన చెప్పారు. మహిళల్లో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయని, భర్త పట్ల కోపం, ప్రతీకారం, ప్రస్తుత జీవితం పట్ల అసంతృప్తి, అసహనంతో పరపురుషులను ఆశ్రయిస్తారని బెరస్ఫోర్డ్ వివరించారు. ఆఫీసు పనిమీద ఇతర ప్రాంతాలకు తాను వెళ్లాల్సి వస్తోందని, అలాంటి సందర్భాల్లో మగవారితో కలిసి పనిచేసినప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయాలు సెక్స్ సంబంధాలకు దారితీశాయని లండన్‌కు చెందిన 38 ఏళ్ల రాచెల్ మోర్గాన్ తెలిపారు. ఈ సంబంధాల కారణంగా తాను భర్త నుంచి విడిపోవాల్సి వచ్చిందని, అందుకు బాధేమీ లేదని ఆమె అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ రహస్య సెక్స్ కార్యకలాపాల గురించి వివరించారు. ఎక్కువ మంది తమకు భర్తలను వదిలేసే ఉద్దేశం లేదని చెప్పగా, దాదాపు అందరూ మహిళలు పరపురుషులతోనే సెక్స్ అనుభూతి బాగుందని చెప్పారు. -
కన్న పేగే కాటేసింది
చెన్నై,తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే ప్రియుడితో కలిసి హత్య చేసిందో కసాయి తల్లి. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని సేవూర్‌కు చెందిన కుమార్ కూలి. భార్య సోలయమ్మాల్. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈనెల 15న సోలయమ్మాల్ ఆరణి ప్రభు త్వఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటిరోజే బిడ్డతో సహా అదృశ్యమైంది. సేవూర్ వీఏఓ కార్యాలయానికి ఆదివారం ఉదయం తన వివాహేతర ప్రియుడు బాబు (49)తో కలిసి వచ్చింది. తనకు పుట్టిన ఆడబిడ్డను తామిద్దరం హత్య చేసి పాతి పెట్టామని తెలిపింది. వీఏఓ ఆరణి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. -
వివాహిత హత్య.. ప్రియుడే హంతకుడు..
కనిగిరి: కనిగిరిలో అదృశ్యమైన వివాహిత రజియా (32) మర్రిపుడి మండలం కూచిపుడి కొండల్లో హత్యకు గురై కాలి బూడిదగా మారింది. రజియా ప్రియుడు ఖాదర్‌బాషానే ఆమెపై అనుమానంతో కొండ గుహల్లోకి తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. వివరాలు.. మండలంలోని కంచర్లవారిపల్లికి చెందిన ఎస్కే చాంద్‌బాషా, మీరాబీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె రజియా. కనిగిరి మూడో వార్డుకు చెందిన రసూల్బాషాతో సుమారు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లుగా దంపతుల మధ్య సంబంధాలు లేవు. పదో తరగతి వరకు చదివిన రజియా కంచర్లవారిపల్లిలోనే ఉంటూ ఐకేపీలో యానిమేటర్‌గా పని చేస్తోంది. పట్టణంలోని ఓ షోరూమ్‌లో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తోంది. ఇలా రోజూ కనిగిరి వస్తూ..పోతోంది. రోజూ ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో రాక పోకలు సాగిస్తూ కనిగిరి బీసీ కాలనీకి చెందిన వివాహితుడైన స్కూల్ బస్సు డ్రైవర్ ఖాదర్‌బాషాతో సన్నిహితం పెంచుకుని చివరకు సహజీవనం చేసేంత వరకూ వెళ్లింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమె కుటుంబం కనిగిరికి మకాం మార్చింది. పట్టణంలోని కూచిపుడిపల్లిలో నివాసం ఉంటున్నారు. ప్రియుడు ఖాదర్‌బాషా తన ప్రియురాలు రజియాపై అనుమానం పెంచుకున్నాడు. స్కూల్ బస్సుకు, సొంత భార్య, పిల్లల వద్దకు వెళ్లకుండా రజియా చుట్టూ కాపాలాగా తిరుగుతుండే వాడు. మద్యం తాగి వచ్చి ఇంట్లో ఆమెను కొట్టేవాడు. సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బులు కూడా లాక్కుని గందరగోళం చేసేవాడు. కొద్ది రోజుల క్రితం రజియా, ఆమె తల్లి మీరాబీలు కనిగిరి పోలీసుస్టేషన్లో ఖాదర్‌బాషాపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని పిలిచి తీవ్రంగా మందలించారు. వారి వద్ద తీసుకున్న నగదు తిరిగి ఇవ్వాలని, వారి ఇంటికి వెళ్లవద్దని హెచ్చరించారు. ఐదు నెలలుగా అతడు అలాగే వెళ్లడం లేదు. ఇటీవల రజియాతో మళ్లీ మాటలు కలిపినట్లు సమాచారం. శనివారం యానిమేటర్ విధులకు వెళ్లిన రజియా తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో కూచిపుడి కొండల్లో కాలి బూడిదైనట్లు సమాచారం అందుకుని భోరున విలపిస్తున్నారు. అనుమానంతోనే చంపేశాడా? ప్రియుడు ఖాదర్‌బాషా అనుమానంతోనే ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి హత్య చేసి కాల్చాడని తెలుస్తోంది. సుమారు ఐదేళ్ల సహజీవనం చేసిన తర్వాత అందంగా ఉండే రజియాపై అతడు అనుమానం పెంచుకున్నాడు. ఎవరితో మాట్లాడినా సహించే వాడు కాదని, పెళ్లిళ్లకు వెళ్లినా, ఏదైనా ఊరికి వెళ్లినా కాపాలాగా తిరిగే వాడని తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె తనను వదిలించుకుని ఇంకొకరి సొంతమవుతుందేమోననే అనుమానంతో చంపేసి ఉంటాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రజియాను పెళ్లి చేసుకున్న భర్త రసూల్ మూడు నెలల క్రితం చనిపోయాడు. సీఐ ఏమంటున్నారంటే.. కనిగిరి సీఐ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ను “సాక్షి’ వివరణ కోరగా కూచిపుడి సమీపంలోని ఆండ్రా కొండల్లో కాలి బూడిదైన శవం మహిళదిగా తెలుస్తోందన్నారు. ఆ శవం కనిగిరిలో అదృశ్యమైన రజియాదా.. లేక వేరొకరిదా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహం 90 శాతం కాలడంతో అనావాళ్లు గుర్తుపట్టలేకపోతున్నామన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ వివరించారు. కూచిపూడి (మర్రిపూడి): మండలంలోని కూచిపూడి ఆండ్ర రామలింగేశ్వరస్వామి కొండ గుహల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గురువారం గుర్తించినట్లు ఎస్ఐ సుబ్బరాజు తెలిపారు. కూచిపూడికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామలింగేశ్వరస్వామికొండ గుహల్లో 90 శాతం కాలిన మహిళ మృతదేహం గుర్తించినట్లు చెప్పారు. మృతురాలు కనిగిరి మండలంలో అదృశ్యమైన ఎస్కే రజియా(32)గా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు సాగుతోందన్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. సంఘటన స్థలాన్ని పొదిలి, కనిగిరి సీఐలు మొయిన్, ప్రతాప్ పరిశీలించారు. -
తల్లి దుర్భుద్ది.. తలలు పట్టుకున్న పోలీసులు
సాక్షి, చెన్నై : ప్రియుడితో కుమార్తె వివాహం జరిపించేందుకు తల్లి ప్రయత్నించిన సంఘటన పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తంజావూరు జిల్లా తిరువయ్యారు సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరువయ్యారు సమీపంలోని గ్రామానికి చెందిన చెందిన 19 ఏళ్ల యువతి తంజావూరు ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఒక ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు తనను ప్రేమించి మోసం చేశాడని అందులో పేర్కొంది. ఇప్పుడు వేరొక యువతిని గురువారం వివాహం చేసుకుంటున్నాడని, ఈ వివాహాన్ని అడ్డుకుని తనతో వివాహం జరిపించాలని కోరారు. ఈ ఫిర్యాదును ఎస్పీ తిరువయ్యారు మహిళా పోలీసు స్టేషన్‌కు పంపి విచారణకు ఉత్తర్వులిచ్చారు. దీంతో పోలీసులు మంగళవారం సాయంత్రం వారిని పిలిపించి విచారణ జరిపారు. యువతి వెంట ఆమె తల్లి కూడా వచ్చింది. ఈ సమయంలో యువతి హఠాత్తుగా తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీన్ని పోలీసులు అడ్డుకుని మందలించారు. ఆ తర్వాత విచారణ చేపట్టారు. విచారణలో ఆ యువకుడు తాను యువతిని ప్రేమించలేదని, అయితే ఆమె తల్లితో సంబంధం ఉందని బాంబు పేల్చాడు. దీంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. ఇదిలా ఉండగా తన ఫిర్యాదు వాపసు తీసుకుంటున్నట్లు తెలిపిన యువతి అక్కడ్నుంచి వెళ్లింది. అనంతరం పోలీసులు యువతి తల్లి(45), యువకడు ఇద్దరిని విచారణ జరపగా సదరు మహిళకు, యువకుడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. తన కుమార్తెను ప్రియుడికి ఇచ్చి చేస్తే తనకు అనుకూలంగా ఉంటుందని తల్లి భావించింది. దీంతో తలలు పట్టుకున్న మహిళా పోలీసులు తల్లికి హితవు చెప్పి పంపారు. ఇలావుండగా గురువారం యువకుడి వివాహం యధావిధిగా జరుగనుంది. -
వివాహేతర సంబంధం పర్యవసానం.. హత్య
బెంగళూరు,యశవంతపుర : వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ప్రియురాలు తనకు దూరమైందనే అక్కసుతో ఓ వ్యక్తి మహిళతో పాటు ఆమె భర్తను కూడా దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. నరసింపుర తాలూకా సాత్కోళి గ్రామానికి చెందిన ధర్మయ్య (53), ఆయన భార్య భారతి (43)లను అదే గ్రామానికి చెందిన గోవింద హత్య చేశాడు. వివరాలు... ధర్మయ్య, ఆయన భార్య భారతి కూలి పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా భారతికి గోవింద్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ధర్మయ్యకు తెలియడంతో భారతిని హెచ్చరించాడు. ఈ క్రమంలో గోవింద్‌తో కూడా ధర్మయ్య గొడవపడ్డాడు. నెల రోజుల క్రితం ఇదే విషయంగా ఇద్దరు ఘర్షణ పడ్డారు. అప్పట్లో హతమారుస్తానని గోవింద్ హెచ్చరించాడు. దీంతో ధర్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదం పెద్దది కావడంటో గ్రామపెద్దలు ఇద్దరిని రాజీ చేశారు. భారతి తనకు దూరమైందని ఆక్రోశంతో ఉన్న గోవింద్ శనివారం రాత్రి ధర్మయ్య ఇంటికి వచ్చాడు. దీంతో భార్యభర్తలు ఇద్దరు కలిసి గోవింద్‌ను చితకబాదారు. అనంతరం బయటకు వెళ్లిన గోవింద్ తిరిగి మచ్చు కత్తితో వచ్చి ధర్మయ్య, భారతీలను దారుణంగా నరికి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎన్ఆర్ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
చీటింగ్ కేసులో తల్లీకొడుకు అరెస్ట్
కుత్బుల్లాపూర్: ఈజీ మనీకి అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న తల్లీకొడుకులను బాలానగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, కోదాడకు చెందిన బట్ట మహేశ్ డిగ్రీ మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన ఇతను రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంక్, పాఠశాలల ఏర్పాటు చేద్దామంటూ పలువురిని నమ్మించి రూ. కోట్లలో వసూలు చేశాడు. స్థానిక ఏపీజే అబ్దుల్ కలామ్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న రాజేశ్వరి ఇంట్లో అద్దెకు ఉన్న మహేష్ ఆమె నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేస్తే లాభాలు వస్తాయని ఆమెను నమ్మించాడు. ఇందుకు రూ.25 లక్షలు అవసరమవుతాయని చెప్పడంతో రాజేశ్వరి రూ.16.80 లక్షలు మహేశ్ తల్లి బట్ట లింగమ్మ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. మిగిలిన రూ.8.2 లక్షలు ఆమె చేతికి ఇచ్చింది. ఇదే తరహాలో మహేశ్ పలువురు ఫైనాన్సియర్ల నుంచి పెట్టుబడి పేరుతో రూ. కోట్లు వసూలు చేశాడు. ఇందుకు అతడి తల్లి లింగమ్మ, సోదరుడు శేఖర్ సహకరించారు. డబ్బుల విషయమై రాజేశ్వరి, ఆమె భర్త శ్రీనివాస్‌గౌడ్ పలుమార్లు మహేశ్ ను అడిగినా సమాధానం రాకపోవడంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన జీడిమెట్ల డీఐ సుమన్ నిందితులు మహేశ్, లింగమ్మ లను అరెస్టు చేశారు. నిందితులు దాదాపు రూ. 5 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని, వాటిని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రియుడితో కలిసి భర్త హత్య.. వివాహేతర సంబంధంపై నిలదీసినందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్యతో పాటు, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కు చెందిన నక్కా రామారావు, శ్రీదేవి దంపతులు శామీర్ పేట్ మండలం, తూంకుంట గ్రామంలోని బిట్స్ కాలనీలో ఉంటూ కూలీ పని చేస్తున్నారు. అదే ప్రాంతంలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన దామండ్ల శివతో వీరికి పరిచయం ఏర్పడింది. తరచూ రామారావు ఇంటికి వచ్చే శివ అతని భార్య శ్రీదేవితో సన్నిహితంగా ఉండేవాడు. దీనిని గుర్తించిన రామారావు పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న శ్రీదేవి తన భర్తను హత్య చేయాల్సిందిగా ప్రియుడు శివను పురమాయించింది. ఇందుకు రూ. 5 వేలు ఇచ్చింది. పథకం ప్రకారం శివ రామారావుతో మద్యం తాగింది బైక్‌పై సమీపంలోని సురభి వెంఛర్లోకి తీసుకు వెళ్లి మద్యం సీసాతో పొడిచి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీదేవి, ఆమె ప్రియుడు శివ హత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం
చెన్నై, తిరువొత్తియూరు: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాద్యమాలలో పెట్టిన వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తున్నారు. కుమారి జిల్లా మార్తాండం సమీపం కాప్పికాడు ప్రాంతానికి చెందిన రమేష్ సెకండ్ హ్యాండ్ బైకులను విక్రయిస్తుంటాడు. పంచమూర్తికి చెందిన సైనికడు ఒకరు ఇతని వద్ద ఓ బైక్‌ను కొన్నాడు. దీంతో ఆ సైనికుడికి, రమేష్‌కు పరిచయం ఏర్పడింది. రమేష్ తరచూ సైనికుడి ఇంటికి వచ్చే వెళ్లే సమయంలో సైనికుడి భార్యతో రమేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. సైనికుడు లేని సమయంలో రమేష్ అతని భార్యతో ఉల్లాసంగా వున్నట్టు తెలిసింది. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా రమేష్ సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఆ వీడియోలను చూసిన రమేష్ భార్య దిగ్భ్రాంతి చెంది ఆ వీడియోలను సామాజిక మాద్యమంలో పెట్టేశారు. ఆ వీడియోలను చూసిన సైనికుడు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రమేష్ వద్ద విచారణ చేస్తున్నారు. దీని గురించి సైనికుడి భార్య పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడం వలన పోలీసులు అతన్ని హెచ్చరించి పంపించి వేశారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్..
న్యూఢిల్లీ : జిమ్ ట్రైనర్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న మహిళ అతడితో కలిసి భర్తను అంతమొందించేందుకు వేసిన ప్లాన్ వికటించింది. గ్రేటర్ నోయిడాలో ఈ ఏడాది జులై 23న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజర్‌గా పనిచేసే రాజీవ్ వర్మపై కాల్పులు జరిపిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్తపై హత్యా యత్నం కేసులో భార్యతో పాటు జిమ్ ట్రైనర్‌గా పనిచేసే ప్రియుడు, మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వర్మను అంతమొందించే లక్ష్యంతో ఆయనపై నిందితులు కాల్పులు జరిపి పారిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని వైద్యులు కాపాడారు. సూరజ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రేటర్ నోయిడాలోని సఖీపూర్ వద్ద ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. గత ఏడాదిగా వర్మ భార్య శిఖాతో తనకు వివాహేతర సంబంధం ఉందని నిందితుడు రోహిత్ కశ్యప్ వెల్లడించాడని పోలీసులు చెప్పారు. జిమ్‌లో వారి మధ్య ఏర్పడిన పరిచయం అనైతిక సంబంధానికి దారితీసిందని, భర్త అడ్డు తొలగించేందుకు ఆయనను హతమార్చాలని రోహిత్‌ను శిఖా కోరిందని పోలీసులు తెలిపారు. హత్య ప్రణాళికను పకడ్బందీగా అమలుచేసేందుకు శిఖా సూచనతో రూ 1.2 లక్షలకు రోహన్ కుమార్ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌తో రోహిత్ ఒప్పందం చేసుకున్నాడు. వీరు ముగ్గురూ జులై 23న వర్మను చంపే ఉద్దేశంతో ఆయనపై కాల్పులు జరపి ఘటనా ప్రాంత నుంచి పరారయ్యారని పోలీసులు చెప్పారు. నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారని వెల్లడించారు. -
పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం
తమిళనాడు, అన్నానగర్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడాదిన్నర కుమారుడిని పొట్టనపెట్టుకుందో కసాయి తల్లి. ఈ దారుణ ఘటన నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువేంకటమ్ తాలుకా పళంగోటైకి చెందిన భాగ్యమ్ కుమారుడు రాజ్ (45) అదే ప్రాంతంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య వడకాశి (35). వీరికి తానేష్ ప్రభాకరన్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. తూత్తుకుడి జిల్లా కలుగుమలై నడు వీధికి చెందిన స్వామినాథన్ (32) పాలవ్యాపారి. ఇతనికి వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామినాథన్ రాజ్ ఇంటికి పాలు పోసేవాడు. ఈ క్రమంలో వడకాశితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచూ కలుసుకునే వారు. విషయం తెలుసుకున్న రాజ్ ఇద్దరిని మందలించాడు. అయినా వారిలో మార్పు రాలేదు. తమ సంబంధానికి అడ్డు వస్తే తానేష్‌ను హత్య చేసి స్వామినాథన్‌తో వెళిపోతానని వడకాశి భర్తను బెదిరిందింది. దీంతో రాజ్ తన కుమారుడిని మామ చెల్లయ్య ఇంట్లో ఉంచాడు. సోమవారం కుమారుడిని చూడాలని ఉందని చెప్పిన వడకాశి కోవిల్పట్టికి వెళ్లింది. అనంతరం ఇంటికి వెళ్లకుండా స్వామినాథన్‌తో వెళ్లిపోయింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో వారి కోసం రాజ్ చుట్టుపక్కల వెతికాడు. మరోపక్క అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో స్వామినాథన్, వడకాశి ఏకాంతంగా గడుపుతుండగా కుమారుడు తానేష్ ప్రభాకరన్ ఆకలితో ఏడ్చాడు. ఆగ్రహానికి గురైన ఇద్దరూ బాలుడిని కొట్టారు. అదే సమయంలో అక్కడ గాలిస్తున్న రాజ్‌కు బిడ్డ అరుపులు వినబడ్డాయి. దీంతో అక్కడికి వెళ్లి కేకలు వేశాడు. స్థానికులు అక్కడికి వచ్చే లోగా వడకాశి బిడ్డని తీసుకుని బయటికి పరుగెత్తింది. తరువాత వడకాశి తన బిడ్డ మిద్దెపై నుండి జారి పడినట్లు చెప్పి ప్రభుత్వాస్పత్రిలో చేర్చింది. అక్కడ చికిత్స పొందుతూ తానేష్ ప్రభాకరన్ మృతి చెందాడు. పోలీసుల విచారణలో తల్లి, ఆమె ప్రియుడు కొట్టడంతోనే మృతి చెందినట్లు తేలింది. -
వివాహేతర సంబంధంతో మహిళ హత్య
తమిళనాడు ,టీ.నగర్: వివాహేతర సంబంధం కారణంగా మంగళవారం మహిళ దారుణ హత్యకు గురైంది. తూత్తుకుడి జిల్లా, తిరువైకుంఠం తాలూకా ఆళ్వార్తిరునగరి సమీపానగల ముదలైమొళి ఉత్తర వీథికి చెందిన మల్కియా (35), అదే ప్రాంతానికి చెందిన ముత్తుసామిని 17 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. లారీ డ్రైవర్ మాణిక్కరాజ్ (40) ముత్తుసామిని చూసేందుకు తరచుగా ఇంటికి వచ్చేవాడు. ఆ క్రమంలో మాణిక్కరాజ్‌కు, మల్కియాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీన్ని గమనించిన ముత్తుసామి భార్య మందలించాడు. ఈ క్రమంలో వారి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఇలావుండగా మల్కియా దీనిగురించి ప్రియుడు మాణిక్కరాజ్‌కు తెలిపింది. అతడి ప్లాన్ ప్రకారం ముత్తుసామిని హతమార్చేందుకు మల్కియా సమ్మతించింది. దీంతో గత 13 మే, 2014లో ముత్తుసామిని భార్య, ప్రియుడు హతమార్చారు. ఇరువురిని ఆళ్వార్తిరునగరి పోలీసులు అరెస్టు చేసి శ్రీవైకుంఠం కోర్టులో కేసు దాఖలు చేశారు. 2015లో మల్కియా ప్రియుడితోపాటు బెయిలుపై విడుదలయింది. దీంతో వీరిద్దరు కలిసి జీవించసాగారు. పళయకాయిలైలో ఒక కంపెనీలో మల్కియాకు ఉద్యోగం దొరికింది. అదే ప్రాంతానికి చెందిన యువకుడితో మల్కియాకు మళ్లీ వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మాణిక్కరాజ్, మల్కియాల మధ్య గొడవలు జరిగాయి. మంగళవారం రాత్రి మల్కియా పనిముగించుకుని రోడ్డుపై ఇంటికి తిరిగి వస్తుండగా అక్కడ పొంచివున్న మాణిక్కరాజ్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మెకానిక్ హత్య సత్యమంగళం సమీపంలో మంగళవారం మెకానిక్ హత్యకు గురయ్యాడు. సత్యమంగళం సమీపానగల మెట్టూర్ గ్రామానికి చెందిన ఆనందన్ కుమారుడు జగదీశ్వరన్ (30). ఇతడు సత్యమంగళం–కోవై జాతీయ రహదారిలోగల ఒక లారీ వర్కుషాపులో మెకానిక్‌గా ఉన్నాడు. ఇతడు బుధవారం ఉదయం వర్కుషాపు సమీపానగల రోడ్డులో శవంగా కనిపించాడు. స్థానికులు సమాచారం అందించడంతో సత్యమంగళం పోలీసులు విచారణ జరిపారు. ఈ విషయం తెలుసుకున్న జగదీశ్వరన్ తల్లిదండ్రులు బంధువులు రోడ్డుపై భైఠాయించి ఆందోళన జరిపారు. మద్యం మత్తులో ఏర్పడిన తగాదాలో జగదీశ్వరన్ హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. టైలర్ హత్య తిరుపూర్‌లో మంగళవారం టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. పుదుచ్చేరి మెత్తపాక్కం మేట్టు వీథికి చెందిన కలియమూర్తి (48) తన కుమార్తె, కుమారుడితో తరుపూర్ విజయాపురం మహాలక్ష్మినగర్ రెండో వీధిలో నివశిస్తున్నాడు. కలియమూర్తికి మద్యం అలవాటు ఉంది. ఇతడు మంగళవారం ముత్తనంపాళయంలోగల మద్యం దుకాణానికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి రాలేదు. స్మశానం చెట్టు కింద శవంగా లభించాడు. అతనిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడిచేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు. -
వివాహేతర సంబంధమే ఊపిరి తీసింది.. !
సాక్షి, ఒంగోలు: తనతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళతో మరో ఇద్దరు సంబంధం కలిగి ఉన్నారనే నెపంతో ఒకరిని దారుణంగా హతమార్చి మరో వ్యక్తి హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసి నిందితులను అరెస్టు చేశామని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను ఆయన వివరించారు. డీఎస్పీ కథన, ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముగ్గురూ స్నేహితులే.. కొత్తపట్నం మండలం ఈతముక్కలకు చెందిన షేక్ అబ్దుల్ నిస్సార్ తన ఇద్దరు భార్యలను, ఒక కుమార్తెను దారుణంగా పెట్రోలు పోసి చంపేసిన కేసులో నిందితుడు. కేసు అనంతరం ఆయన సింగరాయకొండలో పండు రెస్టారెంట్ ఎదురుగా మెకానిక్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతని వద్ద ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ జిలానీ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే విధంగా మర్రిపూడి మండలం జువ్విగుంటకు చెందిన దేవరపల్లి మాధవరెడ్డి(35)తో పరిచయం ఏర్పడింది. మాధవరెడ్డి ఇసుక వ్యాపారం చేస్తూ దుర్వసనాలకులోనై అప్పుల పాలయ్యాడు. ముగ్గురి మధ్య పరిచయం ఉన్నా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో మాధవరెడ్డి కూడా సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానం అబ్దుల్ నిస్సార్‌కు కలిగింది. అంతే కాకుండా ఆమె ద్వారా వ్యభిచార వృత్తి కూడా నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లుగా భావించాడు. ఈ క్రమంలోనే నిస్సార్ వేధింపులు తట్టుకోలేక మహిళ ఆ గ్రామం విడిచి పెట్టింది. ఆమె గ్రామం నుంచి వెళ్లిపోవడానికి మాధవరెడ్డి, అతని స్నేహితుడు టంగుటూరుకు చెందిన రాజుగా నిర్థారించుకున్న నిస్సార్ ఇద్దరిని ఎలాగైనా కడతేర్చాలని ప్లాన్చేశాడు. అందులో భాగంగా ఈ నెల 27న మాధవరెడ్డికి ఫోన్‌చేసి మందు పార్టీకి ఆహ్వానించాడు. తన షాపులో ఫూటుగా మద్యం తాగించిన అనంతరం తన సహాయకుడైన జిలానీతో కలిసి ఇనుపరాడ్‌తో, వాటర్ బాటిల్‌తో తలపై బలంగా మోదాడు. మెడకు వైరు బిగించి చంపేశారు. అనంతరం రిపేరుకోసం తన వద్దకు వచ్చిన కారులో మాధవరెడ్డి మృతదేహాన్ని వేసుకొని కె.బిట్రగుంట గ్రామ అప్రోచ్ రోడ్డు మార్జిన్లో పడవేయడంతో పాటు మాధవరెడ్డి వినియోగించే మోటారు సైకిల్‌ను కూడా స్టాండు వేసి మృతదేహం పక్కనే ఉంచారు. తరువాత వారు కారులో పరారై చినగంజాం రైల్వేస్టేషన్లో వదిలేసి పారిపోయాడు. ఉదయాన్నే ఈ వ్యవహారం వెలుగు చూడడంతో కలకలం రేగడం, మృతుని సోదరుడైన సుబ్బారెడ్డి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనాస్థలం నుంచి మాధవరెడ్డి జేబులోని పాకెట్ బుక్‌ను, అందులో ఉన్న మహిళ ఫొటో సాయంతో దర్యాప్తు ముమ్మరం చేయడంతో నిందితులు ఎవరనేది స్పష్టమైంది. మరో హత్యకు కుట్ర మాధవరెడ్డిని హత్యచేసిన అనంతరం నిస్సార్ టంగుటూరు మండలానికి చెందిన రాజును కూడా హతమార్చి అనంతరం పోలీసులకు లొంగిపోవాలని భావించినట్లు సమాచారం. దీంతో ఒంగోలు రూరల్ సీఐ , సింగరాయకొండ ఇన్చార్జి సీఐ పి.సుబ్బారావు, జరుగుమల్లి ఎస్సై కమలాకర్, కొండపి ఎస్సై ఎన్సీ ప్రసాద్, కానిస్టేబుళ్లు శివ, అంకమ్మరావు, కిషోర్, ఐటీ కోర్‌టీం సిబ్బంది ఎప్పటికప్పుడు నిందితుల కదలికలపై దృష్టిసారించి బుధవారం కె.బిట్రగుంట బస్టాండ్ వద్దకు చేరుకున్న ఇరువురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కేవీవీ ప్రసాద్ తెలిపారు. సకాలంలో నిందితులను అరెస్టు చేయడం వల్ల మరో హత్య జరగకుండా కాపాడగలిగామన్నారు. ఈ కేసును చేధించడంలో కృషిచేసిన వారందరికీ నగదు రివార్డులు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తనను ఆదేశించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసేందుకు కృషిచేసిన సిబ్బందిని ప్రశంసించారు. -
ప్రేమ జంట ఆత్మాహుతి
చెన్నై, టీ.నగర్: వివాహేతర సంబంధం ప్రేమ జంట ఆత్మాహుతి చేసుకున్న సంఘటన ఆత్మాహుతి చేసుకున్న ఘటన త్రిశూలంలో తీవ్ర సంచలనం శనివారం కలిగించింది. చెన్నై త్రిశూలం ప్రాంతానికి చెందిన అయ్యనార్ (38) లారీ డ్రైవర్ ఇతని భార్య సుశీల (32). వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణి (26)తో అయ్యనార్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో అయ్యనార్‌కు అతని భార్య సుశీలకు మధ్య తరచుగా తగాదాలు ఏర్పడేవి. దీంతో మనస్తాపానికి గురైన అయ్యనార్ ఒక నెల రోజుల క్రితం ప్రియురాలు కృష్ణవేణితో పీర్కంకరనై కామరాజ్ నగర్ ఎంజీఆర్ వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా, అయ్యనార్‌కు, ప్రియురాలికి మధ్య తగాదా ఏర్పడింది. శనివారం రాత్రి జరిగిన తగాదాలో కృష్ణవేణి ఇంట్లో ఉన్న కిరసనాయిల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకోనున్నట్లు బెదిరించింది. దీంతో భీతి చెందిన అయ్యనార్ కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు చేశాడు. అంతే కాకుండా ఒంటికి నిప్పు అంటించుకోవడంతో, అతన్ని కాపాడబోయిన కృష్ణవేణి కూడా మంటల్లో కాలింది. తీవ్రగాయాలైన ఇద్దరిని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలు పొందుతూ ఇద్దరు ఆదివారం ఉదయం మృతి చెందారు. దీని గురించి పీర్కంకరనై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య
బంజారాహిల్స్: తాను దుబాయ్‌కి వెళ్తానంటే నిరాకరించాడని మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రి సమీపంలోని జక్కంపేట గ్రామానికి చెందిన చాప స్వాతి(24) హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్ వీడియో గల్లీకి చెందిన దోసపాటి గోపి అనే పెయింటర్‌తో రెండేల్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు గతంలోనే పెళ్లికాగా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే స్వాతి తన భర్త, కుమారుడిని రాజమండ్రిలోనే వదిలేసి అప్పటికే వివాహమై గోపీతో సహజీవనం చేస్తోంది. మూడు రోజుల క్రితం గోపి మొదటి భార్య భాగ్యమ్మ ఇంటికి వచ్చి తన కుమారుడి స్కూల్ ఫీజు కట్టాలని అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అతను స్వాతితో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు ముగ్గురం కలిసే ఉందామని చెప్పాడు. ఇందుకు స్వాతి నిరాకరిస్తూ తాను దుబాయ్ వెళ్తానని చెప్పగా అందుకు గోపి అంగీకరించలేదు. దీంతో స్వాతి తన స్వగ్రామానికి వెళ్లి, శనివారం రాత్రి తిరిగి రాగా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. మళ్లీ ఎందుకు వచ్చావంటూ గోపి నిలదీయడంతో మనస్తాపానికిలోనైన స్వాతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్ర లేచిన గోపి దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. గోపిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం
క్రిష్ణగిరి: సూళగిరి వద్ద మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం గొడవతో భర్తనే ఆమెను హత్య చేసినట్లు భర్త పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. విళుపురం జిల్లా శంకరాపురం తాలూకా వడపన్‌తరపి గ్రామానికి చెందిన ఇళయరాజ నిందితుడు. వివరాలు.. ఇతడు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. ఇతనితో పాటు సూళగిరి సమీపంలోని చెంబరసనపల్లి గ్రామానికి చెందిన సేటు గతంలో సౌదీలో పనిచేస్తూ వచ్చాడు. అప్పుడు ఇద్దరికీ పరిచయమైంది. సేటు రెండేళ్ల కిందట ఉద్యోగం మానేసి స్వగ్రామానికొచ్చాడు. ఈ తరుణంలో సేటు, ఇళయరాజ భార్య శాంతి (28) మధ్య సంబంధం ఏర్పడింది. దంపతుల మధ్య గొడవ సేటు 15 రోజుల క్రితం శాంతిని సూళగిరి ప్రాంతంలో అద్దె గదిలో ఉంచాడు. సూళగిరిలోని ఓ బ్యూటీపార్లర్‌లో ఉద్యోగంలో చేర్పించాడు. రెండు రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికొచ్చిన ఇళయరాజ సూళగిరిలోని భార్యవద్దకు వెళ్లాడు. ఈ సమయంలో సేటు, శాంతిల మధ్య వివాహేతర సంబంధాన్ని పసిగట్టాడు. స్వగ్రామానికి వెళ్లిపోదామని తెలిపాడు. దీనికి భార్య నిరాకరించడంతో గొడవ ఏర్పడింది. ఆవేశం చెందిన ఇళయరాజ సుత్తితో ఆమె తలపై బాదడంతో ఆమె స్పృహ తప్పింది. ఆమె గొంతుకు ఉరి బిగించి కిటికీకి వేలాడదీసి పరారయ్యాడు. శనివారం ఉదయం గమనించిన స్థానికులకు శాంతి మృతి చెందినట్లు తెలిసింది. ఈ సంఘటనపై సూళగిరి పోలీసులు ఇళయరాజ కోసం గాలించి పట్టుకొన్నారు. సేటును కూడా అరెస్టు చేశారు. కేసు తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
ప్రేమ వివాహం.. భర్త హత్య భార్య అరెస్టు
తమిళనాడు, తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తేని జిల్లా తేవారం మేట్టుపట్టికి చెందిన చెల్లదురై (50). అతని భార్య సెలీనా (43). 20 సంవత్సరాల క్రితం ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తేవారం మీనాక్షిపురానికి చెందిన సుధాకర్ (27)తో సెలీనాకువివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న చెల్లదురై భార్యను ఖండించాడు. ఈ క్రమంలో భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. బుధవారం రాత్రి సుధాకర్‌ను ఇంటికి రప్పించిన సెలీనా అతనితో కలిసి నిద్రిస్తున్న భర్త చెల్లదురైపై బండరాయి వేసి హత్య చేశారు. దీనిపై చెల్లదురై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుధాకర్‌ను, సెలీనాను అరెస్టు చేశారు. -
ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి
చెన్నై, అన్నానగర్: అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న ఐదేళ్ల కుమారుడిని హత్యచేసిన తల్లితో సహా నలుగురు నిందితులని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తేని జిల్లా ఉత్తమపాళయం సమీపంలో వున్న కోంబై మదురైవీరన్ వీధికి చెందిన మురుగన్. అతడి భార్య గీతా (23). వీరి కుమారుడు హరీష్ (05) అక్కడ ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. గత 14వ తేదీ ఉదయం నుండి ఇతడు కనబడలేదు. ఈ స్థితిలో అక్కడ ఉన్న శ్మశానవాటికలో ముఖంపై గాయాలతో హరీష్ హత్య చేయబడి ఉండటం చూసిన స్థానికులు కోంబై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి హరీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు జరిపిన విచారణలో హరీష్ తండ్రి మురుగన్‌కి, తల్లి గీతాకి మధ్య అభిప్రాయబేదాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో రెండు సంవత్సరాలకు ముందు వారు విడిపోయారు. తరువాత మురుగన్ వేరొక మహిళను వివాహం చేసుకున్నాడు. గీతా అదే ప్రాంతంలో నివసించే ఉదయకుమార్ (35)ని రెండవ వివాహం చేసుకుంది. హరీష్‌ను తన తల్లిదండ్రుల ఇంటిలో వదిలేసింది. తరువాత గీత, ఉదయకుమార్‌తో ఆమె కన్నవారి ఇంటి పక్కనే ఉన్నారు. దీంతో హరీష్ తరచూ తల్లి గీత వద్దకి రావడం ప్రారంభించాడు. ఇంకా రాత్రి సమయంలో తల్లితో వచ్చి పడుకుని నిద్రపోయేవాడు. ఆ ఇంట్లో ఒక గది మాత్రమే ఉంది. ఇందువలన గీత, ఉదయకుమార్ చనువుగా ఉండటానికి అతను అడ్డుగా ఉన్నాడని వారు చిరాకు చెందారు. గీత చెల్లెలు భువనేశ్వరి గత కొన్ని నెలలకు ముందు ఆటో డ్రైవర్ కార్తీక్‌ను వివాహం చేసుకుంది. ఈ స్థితిలో కార్తీక్ తరచూ గీతా ఇంటికి వచ్చి ఆమెతో చనువుగా ఉన్నాడు. అలాగే భువనేశ్వరి, ఉదయకుమార్ చనువుగా ఉంటూ వచ్చారు. దీనిని హరీష్ చూశాడు. కాబట్టి అందరి సంబంధాలకు హరీష్ అడ్డుగా ఉన్నాడని అతనిని హత్య చేయాలని పథకం వేశారు. పథకం ప్రకారం 14వ తేదీ గీత, ఉదయకుమార్ తన ఇంటికి భువనేశ్వరి, కార్తీక్‌లను పిలిపించారు. అక్కడ నలుగురు కలిసి కూర్చొని మద్యం సేవించారు. తర్వాత రాత్రి 8 గంటలకు హరీష్‌కు బిస్కెట్ కొనిపించి కోంబై పశువుల ఆస్పత్రి సమీపంలో ఉన్న శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఆ నలుగురు కొంచెం కూడా జాలి లేకుండా ఇటుకలు, కట్టలతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనైతిక బంధం :చెల్లెలిపై అన్న కత్తితో దాడి
చందంపేట (దేవరకొండ) : వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలోని హంక్యతండాలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఉపేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకుచెందిన కేతావత్ చిట్టి నాగర్కర్నూల్జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహంకాగా ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌తో కొంతకాలంగా సఖ్యతతో మెలుగుతోంది. దీంతో ఆ డ్రైవర్‌ను స్థానికులు నిలదీశారు. సుమారు రూ.లక్ష, ఎకరం పొలం చిట్టికి ఇస్తానని ఆ డ్రైవర్ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు. కానీ అవే వీ ఇవ్వలేదు. కాగా సోమవారం రాత్రి ఆ వ్యక్తితో చిట్టి సన్నిహితంగా ఉండడంతో ఆమె మూడో అన్న కేతావత్ వంగ్లా నిలదీశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తప్పించుకోగా ఆగ్రహంతో చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. దీంతో చిట్టికి తీవ్ర రక్తస్రావం కావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచిం చారు. తమవద్ద డబ్బులు లేవని, హైదరాబాద్‌కు తరలించలేమని బంధువులు తెలుపడంతో పోలీసుల సమక్షంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మరిదితో కలిసి భర్తను హతమార్చిన భార్య
చెన్నై, టీ.నగర్: అన్నను హతమార్చిన తమ్ముడు... వదినతో పాటు కేరళలో బుధవారం పట్టుబడ్డాడు. ఆరేళ్ల తరువాత ఈ హత్యకేసు మిస్టరీ వీడింది. కడలూరు హార్బర్ సింగారతోపు గ్రామానికి చెందిన మురుగదాసన్ (45). భార్య సునీత. వీరికి ఇద్దరు పిల్లలు. సౌదీ అరేబియాకు ఉద్యోగం కోసం వెళ్లిన మురుగదాసన్ 2013, జనవరి 6న బావమరిది వివాహం కోసం సింగారతోపునకు వచ్చారు. తరువాత కొన్ని రోజులకు అదృశ్యమయ్యాడు. మురుగదాసన్ అచూకీ తెలియకపోవడంతో, అతని పాస్‌పోర్టు ఇంట్లోనే ఉండడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అదే సమయంలో చిన్నకుమారుడు సుమయర్ కనిపించకపోవడంతో తల్లి పవనమ్మాళ్‌కు అనుమానం అధికమైంది. కోడలిని సంప్రదించేందుకు వీలుకాలేదు. దీనిపై పవనమ్మాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో.. మురుగదాసన్ విదేశానికి వెళ్లిన సమయంలో సింగారతోపులోని వదిన సునీతను సుమయర్ తరచూ కలిసేవాడు. దీంతో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి మురుగదాసన్ మందలించడంతో అతన్ని హత్య చేసేందుకు కుట్రపన్నారు. పథకం ప్రకారం అతన్ని హత్య చేసి పాతిపెట్టారు. కేరళలో తలదాచుకున్న ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పాతి పెట్టిన మురుగదాసన్ మృతదేహాన్ని గురువారం వెలికి తీసి పోస్టుమార్టంకు పంపారు. -
ఖరీదైన విడాకులు
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భార్యతో కుదుర్చుకున్న విడాకుల ఒప్పందం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ ఒప్పందం ద్వారా ఆయన భార్య మెక్కెంజీకి రూ.2.62 లక్షల కోట్ల (38 బిలియన్ డాలర్లు) మొత్తం సొంతం కానుంది. ఈ వారంలోనే ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారుకానుంది. స్వతహాగా రచయిత అయిన మెక్కెంజీ(49) ప్రపంచంలో నాలుగో అత్యంత ధనిక మహిళగా మారారు. ఈ సంపదలో సగం వారెన్ బఫెట్, బిల్‌గేట్స్ స్థాపించిన ది గివింగ్ ప్లెడ్జ్ అనే ధార్మిక సంస్థకే కేటాయించనున్నట్లు గతంలో ఆమె చెప్పారు. అమెజాన్ ప్రారంభించటానికి ముందే 1993లో మెక్కెంజీకి బెజోస్‌తో వివాహమైంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. జెఫ్ బెజోస్(55)కు వివాహేతర సంబంధం ఉన్నట్లు వార్తలు రావడంతో వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. బెజోస్ దంపతులకు అమెజాన్‌లో ఉన్న ఉమ్మడి షేర్లలో 25 శాతం మెక్కెంజీకి దక్కనున్నాయి. -
పరాయి పురుషుడితో భార్య పరారీ
కర్ణాటక ,దొడ్డబళ్లాపురం : భార్య పరాయి వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా హొసహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. కాంతరాజు (40) పదేళ్ల క్రితం భాగ్యమ్మను వివాహం చేసుకున్నాడు. దంపతులకు 9 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భాగ్యమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కాంతరాజు తరచూ మందలించేవాడు. దీంతో భాగ్యమ్మ పరాయి వ్యక్తితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో కాంతరాజు కలతచెంది తన కష్టం గురించి మొబైల్లో వీడియో తీసి చెప్పుకుని స్వంత స్థలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి కుదూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఫొటోలను యువతి భర్తకు వాట్సాప్‌లో..
తిరువణ్ణామలై: ప్రేమించిన సమయంలో తీసుకున్న అసభ్య ఫొటోలను యువతి భర్తకు సెల్ఫోన్లో పంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాతూర్ గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువతి అదే గ్రామంలో పాత్రలు విక్రయించే దుకాణానికి పనికి వెళ్లింది. ఆ సమయంలో దుకాణం యజమాని కుమారుడు వీరమణికి యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరమణి ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ సమయంలో యువతికి తెలియకుండా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను చూపించి యువతిని బెదిరించి పలు మార్లు లైంగికవాంచ తీర్చుకున్నాడు. ఆనంతరం ఆ యువతిని వివాహం చేసుకునేందుకు వీరమణి నిరాకరించాడు. సెల్ఫోన్లో ఉన్న అసభ్య ఫొటోలు పూర్తిగా తొలగిస్తానని చెప్పాడు. ఈ విషయం తెలియని యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మరో యువకుడితో ఈనెల 6వ తేదీన వివాహం జరిపించారు. వివాహం అనంతరం యువతి తనను దూరం పెట్టడంతో జీర్ణించుకోలేని వీరమణి ఆమె భర్త సెల్‌ఫోన్ నెంబరును తెలుసుకొని ఆమె అసభ్య ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపాడు. దీన్ని ఆమె భర్త ఇంట్లోని కుటుంబ సభ్యులకు చూపించి ఇకపై ఆ యువతితో కాపురం చేయలేనని పుట్టింటిలో వదిలిపెట్టాడు. దీనిపై బాధిత యువతి తల్లిదండ్రులు తిరువణ్ణామలై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
ప్రియుడితో పరారైన వివాహిత
వేలూరు: ఆమెకు పెళ్లయింది.. మూడేళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. ఆపై గర్భవతి కూడా.. ఇవన్నీ ఆమెకు అడ్డు కాలేదు. అక్రమ సంబంధం మోజులో కట్టుకున్న భర్తని, కన్న కుమారుడిని వదిలేసి ప్రియుడితో పరారయింది. ఈ సంఘటన గుడియాత్తంలో చోటు చేసుకుంది. వేలూరు జిల్లా గుడియాత్తం గ్రామానికి చెందిన రాజేష్, పూర్ణిమలు నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న కుమారుడున్నారు. ప్రస్తుతం పూర్ణిమ నాలుగు నెలల గర్బవతిగా ఉంది. ఇదిలా ఉండగా గుడియాత్తం ఇందిరానగర్‌కు చెందిన పార్థిబన్ కూలీ కార్మికుడు. ఇతనికి వివాహం జరగలేదు. పార్థిబన్‌కు పూర్ణిమకు రెండు సంవత్సరాల క్రితం అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ తరచూ కలిసి మాట్లాడుకునే వారు. ఈనెల 13వ తేదీన పూర్ణిమ ఆస్పత్రికి వెళ్లి వస్తానంటూ ఇంటి నుంచి వెళ్లి అనంతరం తిరిగి రాలేదు. ఈమె భర్త పలు చోట్ల వెతికినప్పటికీ ఎటువంటి ఆచూకి తెలియరాలేదు. అయితే పూర్ణిమ ప్రియుడు పార్థిబన్‌తో కలిసి వెళ్లినట్లు తర్వాత భర్తకు తెలిసింది. దీంతో భర్త రాజేష్ సోమవారం ఉదయం గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్ణిమను తీసుకెళ్లిన పార్థిబన్ కోసం గాలిస్తున్నారు. -
వదినతో వివాహేతర సంబంధం
టీ.నగర్: వదినతో వివాహేతర సంబంధం పెట్టుకుని తోడబుట్టిన అన్నను హత్య చేసాడు కసాయి తమ్ముడు. వివరాలు.. శివగంగై జిల్లా ఎస్.పుదూర్ సమీపాన ముగండపట్టి తువరంకురిచ్చి రోడ్డులో ఒక వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విచారణలో మృతుడు వలసైపట్టి గ్రామానికి చెందిన మురుగయ్య(40) మేస్త్రీగా తెలిసింది. విచారణలో భార్య వివాహేతర సంబంధం కారణంగా మురుగయ్య హత్యకు గురైనట్లు తేలింది. మురుగయ్య భార్య మణిమేగలై (36), మురుగయ్య తమ్ముడు పిచ్చుమణి (34) మధ్య వివాహేతర సంబంధం ఉంది. దీని గురించి తెలియడంతో మురుగయ్య తన భార్యను మందలించాడు. దీంతో వారి మధ్య ప్రతి రోజు గొడవలు జరగసాగాయి. మురుగయ్య ప్రాణాలతో ఉంటే తమ సంబంధం కొనసాగించలేమని, అతన్ని హతమార్చేందుకు మణిమేగలై పిచ్చుమణిలు కుట్ర పన్నారు. మురుగయ్యను తమ్ముడు పిచ్చుమణి హత్యచేసినట్లు తెలిసింది. తర్వాత మృతదేహాన్ని ఇద్దరు కలసి మృతదేహాన్ని వంతెన కింద పడవేసారు. పిచ్చుమణి, మణిమేగలైలను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. హత్యకు గురైన మురుగయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో వీరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. -
కోర్టు చెప్పినా ఇంట్లోకి రానివ్వడం లేదని..
బంజారాహిల్స్: కోర్టు తీర్పు ఇచ్చినా అత్తింటి వారు తనకు ఆశ్రయం కల్పించకపోగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువతి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌కు చెందిన నారాయణరెడ్డి, మంగమ్మ దంపతుల కుమార్తె దీపికకు 2012లో నందినగర్‌కు చెందిన రామిడి శ్రీనివాసరెడ్డితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శ్రీనివాసరెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వారి మధ్య గొడవలు చోటు చేసుకోడంతో అతను భార్యను ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. దీనిపై బాధితురాలు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీపికకు నెలకు రూ.6వేల చొప్పున భరణం ఇస్తూ ఇంట్లో ఆశ్రయం కల్పించాల్సిందిగా న్యాయస్థానం శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం దీపిక భర్త ఇంటికి వెళ్లగా కుటుంబసభ్యులు ఆమెను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో బంధువులు, మహిళా మండలి సభ్యులతో కలిసి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ విషయమై ఇప్పటికే 13 కేసులు నమోదై ఉన్నాయి. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లోనూ నమోదైన కేసులపై కోర్టులో విచారణ జరుగుతోంది. -
బంధువులే అతన్ని చంపేశారు ..
సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి) : భీమవరంలో మాయమై బిక్కవోలులో శవంగా కనిపించిన ఆర్ఎంపీ డాక్టర్ మామిడిశెట్టి నర్సింహమూర్తి (36) కేసు మిస్టరీ వీడింది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆయన్ను బావమరుదులు, బంధువుల సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు శ్రీనివాససెంటర్‌లో నివాసం ఉంటున్న మామిడిశెట్టి స్వప్న మంజరి ఈనెల 7న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త నర్సింహమూర్తి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈనెల 4వ తేదీన దూనబోయిన లక్ష్మీనర్సింహరావు, దూనబోయిన లక్ష్మీనారాయణరావులతో కలిసి బయటకు వెళ్లినట్లు అప్పటి నుంచి తన భర్త సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని తీసుకువెళ్లిన వారిని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు వివరాలను నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జరిగింది ఇదీ.. మామిడిశెట్టి నర్సింహమూర్తి భీమవరం శ్రీనివాస సెంటర్లో ఆర్ఎంపీ డాక్టర్‌గా శివప్రియ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నడుపుతున్నాడు. 15 ఏళ్ల క్రితం రాజరాజేశ్వరి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఆమె తన భర్తకు తెలియకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్లి తిరిగి వస్తుండేది. ఈ నేపథ్యంలో నర్సింహమూర్తి స్వప్నమంజరి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆరేళ్ల క్రితం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. తన ముగ్గురు ఆడ పిల్లలు, రెండవ భార్యతో కలిసి ఉంటున్నాడు. మొదటి భార్య అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసి వెళుతుండేది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాజరాజేశ్వరి కనిపించకపోవడంతో ఆమె సోదరులు దూనబోయిన లక్ష్మీనర్సింహరావు, లక్ష్మీనారాయణలు దాచి వేసి ఉంటారని వారితో పలుమార్లు నర్సింహమూర్తి గొడవపడ్డాడు. తమ సోదరి ఇల్లు విడిచి వెళ్లిపోవడానికి బావ నర్సింహమూర్తి కారణమని లక్ష్మీనర్సింహరావు భావించి కక్ష్య పెంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం హత్య లక్ష్మీనర్సింహరావు అతని సోదరుడు లక్ష్మీనారాయణ మేనల్లుడు మల్లుల నాగశివ, తోడల్లుడు కట్టా కృష్ణమూర్తి, దూరపు బంధువు కంద్రేకుల మోహన నాగేంధ్రరరావులతో కలిసి నర్సింహమూర్తి హత్యకు ప్లాన్ చేశారు. ఈనెల 4న రాజరాజేశ్వరి పిఠాపురంలో ఉన్నట్లు ఆచూకీ తెలిసిందని బావను నమ్మించి కారులో తీసుకువెళ్లారు. ఆ రోజు రాత్రి 8.30 గంటల సమయంలో బిక్కవోలు–సామర్లకోట కెనాల్ రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కారును ఆపి మధ్యలో కూర్చొన్న నర్సింహమూర్తి మెడచుట్టూ స్కార్ఫ్‌తో గట్టిగా ముడిపెట్టి బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి రోడ్డును ఆనుకుని ఉన్న కాలువలో పడేశారు. 11న ఆచూకీ లభ్యం కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 11న లక్ష్మీనర్సింహరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం విషయాన్ని అతను అంగీకరించి మృతదేహాన్ని చూపించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మిగిలిన నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డీఎస్పీ కె.నాగేశ్వరరావు, కేసు దర్యాప్తు చేసిన సీఐ పి.చంద్రశేఖరరావును సహకరించిన సిబ్బందని అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై డి.హరికృష్ణ పాల్గొన్నారు. -
భార్య, ప్రియురాలితో కలిసి లాడ్జిలో భర్త అఘాయిత్యం...
టీ.నగర్: చెన్నై ట్రిప్లికేన్ లాడ్జిలో ప్రియురాలితోపాటు విషం సేవించిన దంపతుల్లో భర్త మృతి చెందగా, బిడ్డతో పాటు ప్రియురాలు, భార్య చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఆదివారం కన్యాకుమారిలో చోటుచేసుకుంది. కరుంగల్ సమీపంలోని మాంగరైకు చెందిన జయన్ (30) భార్య పునితా రాణి (29). వీరి కుమార్తె జేసేబి (6). జయన్‌కు అదే ప్రాంతానికి చెందిన శరణ్య (21) అనే యువతితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. శరణ్యకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలియగానే జయన్ భార్య, బంధువులు ఆమెను మందలించారు. దీంతో జయన్, శరణ్య ఊరువిడిచి వెళ్లిపోయారు. పోలీసులు వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పాంపారు. తర్వాత కూడా జయన్, శరణ్య మధ్య బంధం కొనసాగింది. వారు మరోసారి ఊరు విడిచి వెళ్లారు. దీంతో పోలీసులు మళ్లీ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. శరణ్య వద్ద నుంచి తనను విడదీస్తే ఆత్మహత్య చేసుకుంటానని జయన్ పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని హెచ్చరించి రాతపూర్వకంగా లేఖ తీసుకుని పంపివేశారు. సొంత ఊరులో కలిసి జీవిస్తే అవమానం అని భావించిన జయన్ భార్య పునితా రాణి బిడ్డను తీసుకుని బయట ఊరికి వెళ్లేందుకు నిర్ణయించింది. ఆ సమయంలో ప్రియురాలు శరణ్యను కూడా తమతో తీసుకెళదామని జయన్ పట్టుబట్టాడు. మొదట్లో అతని భార్య వ్యతిరేకించింది. అయితే భర్త బెదిరింపులతో గత్యంతరం లేక సమ్మతం తెలిపింది. జయన్, భార్య పునితా రాణి, ప్రియురాలు శరణ్య, బిడ్డలు నలుగురు కొన్ని రోజుల క్రితం కరుంగల్ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ట్రిప్లికేన్‌లోని ఓ లాడ్జిలో ఈ నెల 7న గది తీసుకున్నారు. ఆదివారం రాత్రి లాడ్జి ఉద్యోగులు వారుంటున్న గదికి వెళ్లి చూడగా లోపలివైపు గడియపెట్టి ఉంది. చాలా సేపు వారు తలుపుతట్టి చూడగా, తలుపులు తెరుచుకోలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. నలుగురు విషం సేవించి స్పృహతప్పి పడి ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని జయన్, పునితారాణి, శరణ్యని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను జేసీబీని ఎగ్మూర్‌లోని పిల్లల ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ జయన్ సోమవారం ఉదయం మృతి చెందాడు. -
కట్టుకున్న భార్యే సూత్రధారి
నెల్లూరు, మనుబోలు: మండలంలోని మడమనూరు గ్రామంలో వారంరోజుల క్రితం జరిగిన ఆటో డ్రైవర్ చేవూరు శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ప్రియుడి ద్వారా ఆమె పథకం ప్రకారం భర్తను హత్య చేయించినట్టుగా వారు తెలిపారు. బుధవారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో గూడూరు డీఎస్పీ బాబూప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మడమనూరుకు చెందిన చేవూరు శ్రీనివాసులు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. ఈనెల 28వ తేదీ రాత్రి భోజనం ముగించుకుని ఇంటి వెనక్కు వెళ్లిన అతను దుండగుల కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను పిలిపించి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈక్రమంలో గతంలో ఉన్న గొడవలను దృష్టిలో ఉంచుకుని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనివాసులును హత్య చేసి ఉంటాడని మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ డేటా ఆధారంగా.. మృతుడి ఇంటి సమీపంలో దొరికిన కత్తులు, చేతి రుమాలు, చెప్పులు, తమిళ అక్షరాలున్న అగ్గిపెట్టె తదితర ఆధారాలతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈక్రమంలో అనుమానిస్తున్న వ్యక్తికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని తేలింది. అదే సమయంలో మృతుడి భార్య శారద వైపు నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆమె సొంతూరు ముత్తుకూరు మండలంలోని మల్లూరులో విచారణ చేయగా ఆమెకు తమిళనాడులోని పుదుకీచలం గ్రామానికి చెందిన రాజేంద్రన్ అనే వ్యక్తితో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో రాజేంద్రన్, శారదల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజేంద్రన్ కదలికలపై నిఘా పెట్టారు. బుధవారం రాజేంద్రన్‌తోపాటు మరో ఇద్దరు మోటార్‌బైక్‌పై నెల్లూరు వైపు వస్తున్నారు. గూడూరు సీఐ వంశీధర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. రూ.50 వేలకు బేరం రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న శారద భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఈ నేపథ్యంలో రాజేంద్రన్ తమిళనాడులోని పలుతిగైమేడు గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తితోపాటు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడితో హత్య చేసేందుకు రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం గత నెల 28వ తేదీ రాత్రి ముగ్గురూ కలిసి మడమనూరు వచ్చి శ్రీనివాసులును వారి పశువుల దొడ్డిలో కత్తులతో పొడిచి చంపారు. వీరి ముగ్గురితోపాటు మృతుడు భార్య శారదను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సమావేశంలో గూడూరు సీఐ వంశీధర్, రూరల్ ఎస్సై శ్రీనివాసులురెడ్డి, మనుబోలు ఎస్సై సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తన భార్యతో చనువుగా ఉండటం చూసి..
రాయదుర్గం : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా, రేకులబి తాండకు చెందిన బానోతు రాము (28) నగరానికి వలస వచ్చి మణికొండ ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉవటున్న రమేష్ భార్య శాంతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. మంగళవారం రాత్రి రాము తన భార్య శాంతితో చనువుగా ఉండడాన్ని గుర్తించిన రమేష్ ఆగ్రహంతో కూరగాయలు కోసే కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాము అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయపడిన రమేష్ నేరుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రమేష్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధాలు.. నిత్యకృత్యంగా..
నెల్లూరు(క్రైమ్): దాంపత్య జీవితంలో ఆలుమగల మధ్య అనురాగం, ఆప్యాయత, అన్యోన్యత కనుమరుగైతే అనుమానం పెనుభూతంలా మారి పచ్చని కాపురాలను దహించి వేస్తుంది. క్షణికానందం కోసం ఇద్దరు వ్యక్తులు చేసే తప్పిదాలు వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని మంటగలిపి హత్యలకు దారితీస్తున్నాయి. వివాహ సమయంలో దంపతులు ఏడడుగులు నడిచి జీవితాంతం ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కలిసి ఉంటామని బాసలు చేసిన గొంతుకలు అర్ధాంతరంగా మూగబోతున్నాయి. దీంతో కొన్ని కుటుంబాలు నా అనేవారు లేకుండా తుడిచి పెట్టుకుని పోతున్నాయి. భార్యపై భర్తకు అనుమానం వచ్చి బలితీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అదే సమయంలో ప్రియుడి కోసం భర్తలను హత్య చేయడానికి వెనుకాడని భార్యల నేరాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో ఈ తరహా వికృతాలు పెరిగాయనే విషయం కొన్ని ఘటనలను పరిశీలిస్తే అర్థమవుతుంది. రోజురోజుకు.. జిల్లాలో ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దంపతుల నడుమ చెలరేగిన వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. భర్తలు మద్యానికి బానిసలుగా మారడం సైతం ఇలాంటి దుశ్చర్యలకు కారణాలుగా మారుతున్నాయి. ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. దాంపత్య విలువలు విస్మరిస్తే ఇలాంటి అనర్ధాలు తప్పవని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కొన్ని సంఘటనలు ♦ గతంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ ఆటోడ్రైవర్‌ను అతని భార్య, ఆమె ప్రియుడు కిరాయి హంతకులకు రూ.లక్ష సుపారీ ఇచ్చి హత్య చేయించారు. ♦ ముత్తుకూరు మండలంలో దంపతులు ఉండేవారు. వివాహితకు ఓ వ్యక్తితో పరిచమైంది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో కోపోద్రిక్తుడైన అతను వారిద్దరూ తన ఇంట్లో ఉండగా బయట గడియపెట్టి నిప్పంటించారు. ఇద్దరూ సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన గతేడాది జూలై 4వ తేదీన జరిగింది. ♦ డిసెంబర్ 5వ తేదీన రైలువీధిలో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అక్కసుతో వివాహితను ఆమె భర్త హత్య చేశాడు. ♦ ఈ ఏడాది జనవరిలో నవాబుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీకాలనీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ మహిళ దారుణహత్యకు గురైంది. ఫిబ్రవరిలో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు భార్యను ఆమె భర్త కడతేర్చాడు. ♦ ఏప్రిల్ 24వ తేదీన వివాహేతర సంబంధం నేపథ్యంలో రైసుమిల్లు ఆపరేటర్ శ్రీనివాసులును ప్రియురాలు తన స్నేహితుడితో కలిసి అతి దారుణంగా హత్యచేసింది. ♦ మే 28వ తేదీన రామలింగాపురంలో మహిళను ఆమె సన్నిహితుడే అతి దారుణంగా హత్యచేసి నగలు అపహరించాడు. ♦ మనుబోలులో మండలంలోనూ ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ తరహా సంబంధాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. „క్షణికానందం కోసం జరిగే సంబంధాలతో ప్రాణాలే పోతున్నాయి. తాళికట్టి వివాహం చేసుకున్న భార్యను భర్త మోసం చేయడం, భర్త కళ్లుగప్పి తప్పు ఆలోచనలతో భార్య పెడదారిపట్టడం తమని తామే మోసం చేసుకోవడమే అవుతుంది. దంపతులిద్దరూ ఇలాంటి చర్యలకు లోనుకాకుండా ఉంటే హత్యలను రూపుమాపవచ్చు. – పి.శ్రీధర్, మహిళా స్టేషన్ డీఎస్పీ, నెల్లూరు -
వివాహేతర సంబంధం : సోదరిపై దాడి
లక్నో : వివాహితుడితో సన్నిహితంగా ఉంటోందని సోదరిపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బులంద్‌షహర్ జిల్లా గులోతికి చెందిన నిందితులను ఇర్ఫాన్, రిజ్వాన్, ఇమ్రాన్‌లుగా గుర్తించారు. బులంద్‌షహర్‌కు చెందిన భూస్వామి కుమారుడితో తమ సోదరి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందనే కోపంతో ఆమెపై దాడి చేశామని నిందితులు విచారణలో వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 5న కుటుంబ సభ్యులు అలీగఢ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇర్ఫాన్, రిజ్వాన్, సల్మా స్కూటర్‌పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో సల్మాపై ఇద్దరు సోదరులు దాడి చేశారు. ఆమెపై యాసిడ్ పోయడంతో పాటు తీవ్రంగా కొట్టారు. సల్మా మరణించిందని భావించిన నిందితులు దాద్రిలోని లుహర్లి బ్రిడ్జి వద్ద ఆమెను విడిచివెళ్లారు. స్ప్రహలోకి వచ్చిన అనంతరం సల్మా తనపై సోదరులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, బాధితురాలు ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం
యశవంతపుర: వివాహితకు మత్తు మందు ఇచ్చి 11 నెలల చిన్నారిని అపహరించిన నిందితుడిని కామాక్షిపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. సుంకదకట్టకు చెందిన కుమార్ దంపతులకు చెందిన 11 నెలల చిన్నారిని రామమూర్తినగరకు చెందిన జాన్ అనే వ్యక్తి అపహరించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కుమార్, జాన్‌లు ఒకే సంస్థలో సూపర్‌వైజర్లగా పని చేస్తున్నారు. రెండేళ్ల నుంచి వీరు స్నేహితులు. ఈక్రమంలో కుమార్ భార్యతో జాన్ సన్నిహితంగా ఉండేవాడు. కొంతకాలంగా జాన్, కుమార్ మద్య విభేదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో ఈ నెల 24న కుమార్ ఇంటికి వచ్చిన జాన్.. బరువు తగ్గేందుకంటూ మత్తు మందు కలిపిన ఔషధాన్ని కుమార్ భార్యతో తాగించాడు. ఆమె స్పృహ కోల్పోగానే 11 నెలల చిన్నారిని జాన్ అపహరించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుమార్.. బాలుడు కనిపించకపోగా భార్యను ఆరా తీశాడు. జాన్ ఇచ్చిన ఔషధాన్ని తాగిన వెంటనే స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని పేర్కొంది. దీంతో కుమార్ కామాక్షిపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టి రామమూర్తినగరలో తలదాచుకున్న జాన్‌ను అరెస్ట్ చేశారు. అయితే కుమార్ భార్యతో తనకు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని, ఆమెకు పుట్టిన బిడ్డ తన బిడ్డేనని జాన్ వాదించాడు. అయితే ఆ పసికందు తనబిడ్డనే అని కుమార్ వాదించాడు. దీంతో ఉన్నత అధికారులతో చర్చించి న్యాయ సలహా తీసుకొని ఆ చిన్నారి రక్తశ్యాంపుల్స్ను డీఎన్ఏ పరీక్షలకు పంపాలని పోలీసులు నిర్ణయించారు. -
వివాహిత ఆత్మహత్య
తమిళనాడు, వేలూరు: ఆంబూరు సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రాజశేఖర్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆంబూరు సమీపంలోని పచ్చనపళ్లికి చెందిన కాశి కుమార్తె నివేద (24) వీరిద్దరూ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు తిరస్కరించారు. దీంతో ఐదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతులకు నాలుగు సంవత్సరాల కుమారుడున్నాడు. ఈ నేపథ్యంలో శేఖర్ రెండు నెలల క్రితం ఆంబూరులోని కస్పా వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని కుటుంబంతో కాపురం పెట్టాడు. ఇదిలా ఉండగా రాజశేఖర్‌కు గుడియాత్తంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భార్య నివేదకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. శనివారం సాయంత్రం కూడా ఘర్షణ జరిగింది. దీంతో విరక్తి చెందిన నివేద ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం నిద్రలేచి చూడగా నివేద మృతి చెంది ఉండటాన్ని గమనించిన రాజశేఖర్ ఆంబూరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి రాజశేఖర్ వద్ద విచారణ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. వివాహిత పరువు హత్య
తమిళనాడు, టీ.నగర్: కముది సమీపంలో వివాహేతర సంబంధం, మహిళ హత్యకు దారితీసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆరుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా, అభిరామం సమీపంలోని డి.వల్లకుళానికి చెందిన మాయాండి కుమార్తె రాధిక (22)కు, పిచ్చయప్పనేందల్ గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్(30)తో గత రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భర్తతో గొడవ పడి దీంతో ఏడాది క్రితం పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతానికి చెందిన కరుప్పసామి (22)తో రాధికకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. గత ఏప్రిల్ 22న మరో సారి బంధువులకు పట్టుబడడంతో కరుప్పసామిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె మాయమైంది. ఏప్రిల్ 30న కాలిపోయిన స్థితిలో రాధిక మృతదేహం కనిపించింది. అక్కడ లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాధిక పేర్కొంది. దీన్ని ఆత్మహత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు. కానీ రాధికా బంధువులు మాత్రం ఆమె ప్రియుడే హతమార్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హంతకులను అరెస్టు చేయాలని, నష్టపరిహారం చెల్లించా లని ఆందోళనలు జరిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి రాధిక తల్లిదండ్రులకు రూ.4.12 లక్షలు నష్టపరిహారం ఇప్పిం చారు. అయితే రాధిక బంధువులు మురుగన్ (24), మోహన్ (20) అళగర్సామి (23), మనియసామి (40) పాప్పా (50), మరో 17 ఏళ్ల బాలుని అభిరామం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. రాధికా సెల్‌ఫోన్‌తో తరచుగా సంప్రదించిన 17 ఏళ్ల బాలుడిని విచారించగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వేరొక కులానికి చెందిన వ్యక్తితో రాధిక వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో హత్య చేసేందుకు బంధువులు నిర్ణయించారని, దుడ్డుకర్రలతో ఆమెను హతమార్చి మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టారని తెలిపారు. రాధిక రాసినట్లు ఒక లేఖను 17 ఏళ్ల బాలునితో రాయించారని, రాధికను ఆమె తల్లి కస్తూరి వెదకడం తెలుసుకున్న హంతకులు మృతదేహాన్ని రాత్రి వేళ ఊరి వెలుపల పారేసి నిప్పంటించి కాల్చినట్లు విచారణలో తేలిందన్నారు. -
వివాహేతర బంధం : భార్యను గొలుసులతో కట్టేసి..
న్యూఢిల్లీ : వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్యను భర్త అత్యంత దారుణంగా హింసించిన ఘటన వెలుగుచూసింది. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనలో బాధిత మహిళను పోలీసులు కాపాడటంతో భర్త రాక్షస ప్రవర్తన బయటి ప్రపంచానికి తెలిసింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం గురించి తనను ప్రశ్నించడంతో ఆగ్రహించిన భర్త తన భార్యను తీవ్రంగా కొట్టి చైన్లతో కట్టిపడేసి పదేళ్లుగా నిర్భందంలో ఉంచడం కలకలం రేపింది. ఈ పదేళ్ల కాలంలో మహిళను ఆమె భర్త దొమర్ పటేల్ తరచూ ఇనుప రాడ్లతో కొట్టడంతో పాటు తీవ్రంగా హింసించేవాడని పోలీసులు వెల్లడించారు. ఆమెకు ఆహారం కూడా ఇచ్చేవాడు కాదని, పిల్లలు ఆమెకు తిండి పెడితే వారినీ నిందితుడు తీవ్రంగా కొట్టేవాడని తెలిపారు. పదేళ్ల కిందట వీరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఇది వారి కుటుంబ వ్యవహారమని చెబుతూ బంధువులు, స్ధానికులు ఈ విషయం పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఓ మహిళను గొలుసులతో బంధించారన్న సమాచారంతో మహిళా హక్కుల సంఘానికి చెందిన బృందం ఆమెను కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య
కర్నూలు, బేతంచెర్ల: మరిది చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మండల పరిధిలోని అంబాపురంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. అంబాపురం గ్రామానికి చెందిన గుండుపాపల మద్దయ్య కుమారుడు మహేంద్రకు, ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన బోయ బాలస్వామి కుమార్తె లక్ష్మి(22)ని ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి హేమనాథ్ (4), చంద్రిక (2) సంతానం. కొంతకాలంగా లక్ష్మి వరుసకు మరిది అయిన లారీ క్లీనర్ మనోజ్(భర్త చిన్నాన్న కుమారుడు)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల మరికొంతమందితోనూ చనువుగా ఉండటంతో మనోజ్ కోపోద్రిక్తుడయ్యాడు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన ఇంటికి పిలిపించుకొని.. పిచ్చపాటిగా మాట్లాడి రాత్రి లక్ష్మి మెడకు చీరతో ఉరి వేసి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు. లక్ష్మి ఇంటికి రాకపోవడంతో భర్త గ్రామంలో గాలించి చివరకు వరుసకు తమ్ముడు అయిన మనోజ్ ఇంటి వద్దకు వెళ్లి తాళాలు పగుల గొట్టి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది. పక్క గదిలో మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు కనిపించాయి. గ్రామస్తుల సమాచారంతో సీఐ ఓబులేసు, ఎస్ఐ మస్తాన్‌వలి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించారు. -
వివాహేతర సంబంధం మోజులో కిరాతకం
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల బాలుడిని హత్య చేసిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా పెరుందురై అయ్యప్పన్ నగర్‌కు చెందిన కార్తికేయన్. అతని భార్య భువనేశ్వరి. వీరి మూడో కుమారుడు కిషోర్ (3). భువనేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన సోమసుందరంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న కార్తికేయన్ భార్యను మందలించాడు. దీంతో భువనేశ్వరి భర్త నుంచి విడిపోయి తన కుమారుడు కిషోర్‌తో సహా ఇంటి నుంచి పారిపోయి అంబత్తూరు మేనంమేడు వువుసి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో సోమసుందరంతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం చిన్నారి కిషోర్ మిద్దెపై నుంచి కింద పడి మృతి చెందాడని పెరుంతురైలో ఉన్న తన అత్త భువనేశ్వరికి సమాచారం తెలిపింది. మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి పట్టుకోటైలో ఉన్న భువనేశ్వరి అక్క ఇంటికి తీసుకొచ్చారు. ఆమె అక్కకు చిన్నారి మృతిపై సందేహం కలగడంతో పట్టుకోటై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేయగా చిన్నారి కిషోర్ హత్యకు గురైనట్టు తెలిసింది. దీని గురించి అంబత్తూరు సహాయ కమిషనర్ కన్నన్‌కు పట్టుకోట్టై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పట్టుకోట్టై వెళ్లి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బాలుడిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్టు తెలిసింది. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
కుమార్తెను హతమార్చి ప్రియుడితో కలిసి
టీ.నగర్: కుమార్తెకు విషమిచ్చి చంపి ప్రియుడితో కలిసి మహిళ శనివారం ఆత్మహత్య చేసుకుంది. నీలగిరి జిల్లా కూడలూరు ఓవేలి బాలవాడికి చెందిన విజయలక్ష్మి (27). ఈమె మేనమామ కనకరాజ్‌ను వివాహం చేసుకుంది. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. ఇరువురు ఏడేళ్ల క్రితం తిరుపూర్ బోయంపాళయంలో ఉంటూ బనియన్ కంపెనీలో పనిచేస్తూ వచ్చారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణి (39)తో విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీన్ని కనకరాజ్, సుబ్రమణి భార్య, ఆమె బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలావుండగా కుమార్తె, సుబ్రమణితో కలిసి విజయలక్ష్మి శుక్రవారం కూడలూరు బాలవాడిలోని పుట్టింటికి చేరుకుంది. వీరి వివాహేతర సంబంధం గురించి విజ యలక్ష్మి కుటుంబంలో శనివారం వివాదం చెలరేగింది. మనస్తాపానికి చెందిన ఆమె ఇంటి సమీపంలోని తోటకు వెళ్లి కుమార్తెకు విషమిచ్చి చంపింది. అనంతరం ప్రియుడు సుబ్రమణితో కలిసి విషం తీసుకుంది. స్పృహతప్పి పడిపోవడంతో వారిని కూడలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ శనివారం ఇరువురూ మృతిచెందారు. -
ప్రియుడు మోజులో భర్త హత్య
దొడ్డబళ్లాపురం: అనైతిక సంబంధం రెండు సంసారాల్లో చిచ్చు పెట్టింది. వివాహిత ప్రియునితో కలిసి భర్తను హత్య చేసి, పోలీసులకు దొరికిపోయిన సంఘటన అనేకల్ లో చోటుచేసుకుంది. శ్రీనివాస్ (30) హత్యకు గురైన వ్యక్తి. శ్రీనివాస్ భార్య ప్రతిభ (25)తన ప్రియుడు బాలక్రిష్ణతో కలిసి భర్తనే బలితీసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. బాగేపల్లికి చెందిన శ్రీనివాస్, ప్రతిభ ఇద్దరూ 10 సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉద్యోగ రీత్యా సంసారాన్ని అనేకల్ తాలూకా హిలలిగె గ్రామానికి షిఫ్ట్ చేశారు. శ్రీనివాస్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసేవాడు. ప్రతిభకు పక్కింట్లో నివసిస్తున్న బాలక్రిష్ణతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరినీ చూడకూడని స్థితిలో చూసిన భర్త శ్రీనివాస్ గొడవచేశాడు. తమ ఆనందానికి అడ్డుగా శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రతిభ, తన భార్యను కూడా చంపేయాలని బాలకృష్ణ తీర్మానించుకున్నారు. పొడిచి చంపి, చెరువులో పడేశారు కుట్రలో భాగంగా బాలక్రిష్ణ తన భార్య లక్ష్మిని, ప్రతిభ తన భర్త శ్రీనివాస్‌ను ఉద్యోగం ఒకటి ఉందని నమ్మించి చందాపుర సమీపంలోని సూర్యనగర్ బీఎంటీసీ బస్ డిపో వద్దకు తీసుకువచ్చారు. శ్రీనివాస్‌ను కత్తితో గొంతుకోసి చంపిన ఇద్దరూ, లక్ష్మినిచంపాలని యత్నించారు.అయితే ఆమెకు పురిటి బిడ్డ ఉండడంతో వదిలేసారు. శ్రీనివాస్ శవాన్ని సమీపంలోని చెరువులో విసిరేసి వెళ్లిపోయారు. అనంతరం బాలక్రిష్ణ భయంతో పరారయ్యాడు. ప్రతిభ అద్దె ఇంటిని యజమానిని కలిసి ఇల్లు ఖాళీ చేస్తున్నామని, అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. ఓనర్‌కు ఆమె భర్త శ్రీనివాస్ కనబడకపోవడంతో అతని తమ్ముడు మధుకి సమాచారమిచ్చాడు. మధు గ్రామానికి చేరుకోగా ఇరుగుపొరుగు అంతా వివరించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రతిభను అరెస్టు చేశారు. శ్రీనివాస్ శవాన్ని చెరువులో నుండి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరో నిందితుడు బాలక్రిష్ణ పరారీలో ఉన్నాడు. -
హత్యకు పథకం.. భార్యపై అనుమానం
యశవంతపుర: హెగ్గనహళ్లి క్రాస్‌లో కబాబ్ వ్యాపారి ఉమేశ్ (35) హత్యకు సంబంధించి ఆయన భార్య రూప ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి ఉమేశ్‌ను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హెగ్గనహళ్లి క్రాస్ వద్ద ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు మారణాయుధాలతో దారుణంగా ఉమేశ్‌ను హత్య చేశారు. మండ్య జిల్లా మద్దూరు తాలూకాకు చెందిన ఉమేశ్ హెగ్గనహళ్లిలో చికెన్ కబాబ్ వేస్తూ శ్రీగంథనగరలో నివాసం ఉంటున్నారు. హత్య జరిగిన కొద్ది నిముషాల సమయంలో కిశోర్ అనే వ్యక్తి రూపకు ఫోన్ చేసి మాట్లాడారు. నీ భర్తను ముగించాం. ఇక సంతోష్‌ను ముగిస్తే నీవు నా దానివి అవుతావంటూ మాట్లాడినట్లు తెలిసింది. దీంతో కిశోర్ పరారీలో ఉన్నాడు. ఉమేశ్, కిశోర్‌ల మధ్య పాతకక్షలున్నట్లు తెలిసింది. అతడిని అరెస్ట్ చేయటానికీ డీసీపీ శశికుమార్ ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. సంతోష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు నిర్ణయించారు. రూప కిశోర్‌తో చనువుగు ఉన్న ప్రైవేట్ వీడియోలో బయటపడింది. గతంలో ప్రియుడితో కలిసి రూప అన్నను కూడ కిశోర్ చేత హత్య చేయించిన్నట్లు పోలీసు విచారణలో తెలిసింది. ఇందుకు సంబంధించి రాజగోపాలనగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరి దారుణ హత్య
కర్నూలు , సి.బెళగల్: తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుంది. పద్ధతి కాదని చెప్పిన కుమారిడిని చంపుతానని బెదిరించింది. భయపడిన కుమారుడే తల్లిని, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల శివారులో బుధవారంచోటుచేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాలు.. సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన తెలుగు కర్రెన్న, శంకరమ్మ (48) దంపతులకు రాముడు, భాస్కర్ కుమారులు సంతానం. కర్రెన్న ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్ద కుమారుడు రాముడికి తెలంగాణ రాష్ట్రంలోని కొంకల ప్రాంతానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహమైంది. శంకరమ్మ గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన తెలుగు బడేసా (52)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై తల్లీ, కుమారుల మధ్య గొడవలు జరిగాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి శంకరమ్మ పలుమార్లు పెద్ద కుమారుడు రాముడిని హంతు చూస్తానని బెదిరించేది. దీంతో తననను చంపుతుందనే భయంతో కుమారుడే తల్లిని, ఆమె ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో బుధవారంరాజోలి గ్రామ శివారులో ఇద్దరూ ఉన్నారన్న సమాచారంతో రాముడు అక్కడికి వెళ్లి వేట కొడవలితో దాడి చేసి, ఇద్దరినీ హత్య చేశాడు. అనంతరం సి.బెళగల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రాజోలి పోలీస్‌లు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సి.బెళగల్ పోలీసులు నిందితుడిని రాజోలి పోలీసులకు అప్పగించారు. -
సవతి కూతురును తాత వరసైన వ్యక్తికి ఎర..
మీర్‌పేట: సవతి కూతురును తాత వరసైన తన మేనమామకు ఎరగా వేసింది. ఆరు నెలల పాటు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడేలా చేసింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో నష్ట పరిహారం చెల్లించాలని పెద్దల సమక్షంలో జరిగింది. మేనమామ నుంచి పరిహారం వసూలు చేసి ఆ డబ్బులను కాజేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణం ప్రియదర్శిని కాలనీకి చెందిన గోగుల మొగులయ్య, పున్నమ్మ దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మొగులయ్య ఉపాధి కోసం 18 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చాడు. గ్రానైట్ రాళ్లు కొట్టే వృత్తితో మీర్‌పేట లెనిన్‌నగర్ ప్రాంతంలోని ప్రశాంత్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఆయన భార్య పున్నమ్మ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో వరంగల్‌కు చెందిన దుర్గను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు మహేశ్వరి, విజయలక్ష్మి సంతానం. ఈ క్రమంలో భర్తను వదిలేసిన తన చెల్లెలు నాగమణిని, తన తల్లిని దుర్గ వరంగల్ నుంచి తీసుకొచ్చి తన వద్ద ఆశ్రయం కల్పించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సిర్సు మల్లేష్ (34) దుర్గకు మేనమామ అవుతాడు. మల్లేష్ తరచూ ప్రశాంత్‌నగర్‌లోని దుర్గ నివాసానికి వస్తుండేవాడు. మొగులయ్య మొదటి భార్య సంతానమైన ముగ్గురు కుమార్తెలను దుర్గ నిత్యం శారీరక, మానసిక హింసలకు గురిచేస్తుండేది. రెండేళ్ల క్రితం సవతి కూతురు లింగమ్మను స్థానికంగా ఉండే వ్యక్తితో వివాహం జరిపించారు. రెండో కూతురుకు అధిక ఖర్చుతో పెళ్లి చేయాల్సి వస్తుందేమోనన్న దుర్బుద్ధి పుట్టింది. దీంతో తరచూ ఇంటికి వచ్చే తాత వరస అయ్యే మల్లేష్‌తో ఆ బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి బయటకు వెళ్లేది. ఇదే అదనుగా భావించిన అతడు బాలికకు మాయమాటలు చెప్పి ఐస్‌క్రీంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితికి చేరిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న తండ్రి మొగులయ్య మల్లేష్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో మల్లేష్ ఈ విషయం బయటకు రాకుండా పది రోజుల క్రితం మిర్యాలగూడలోని తన నివాసంలో కుల పెద్దల సమక్షంలో గర్భస్రావం చేయించేందుకు నష్ట పరిహారం కింద రూ.1.50 లక్షలు మొగులయ్యకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నష్టపరిహారం తీసుకునేందుకు మంగళవారం ఉదయం మొగులయ్య, దుర్గ మిర్యాలగూడ వెళ్లి మొదటి దఫాగా ఇచ్చే రూ.50వేలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే చిన్న కూతురు లీల మొగులయ్యకు ఫోన్ చేసి అక్క ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆత్మహత్యపై అనుమానాలు.. మల్లేష్ ఇచ్చే రూ.50 వేల కోసం మిర్యాలగూడకు వెళ్లిన మొగులయ్య, దుర్గ వాటిని తీసుకుని ఇంటికి వస్తున్నారు. మొగులయ్య లేనప్పుడు దుర్గ ప్రశాంత్‌నగర్‌లో ఉండే తన చెల్లెలు నాగమణికి ఫోన్ చేసి నష్టపరిహారం మొత్తం తామే తీసుకుందామని, బాలిక పెళ్లి ఖర్చు బాధ ఉండదు.. అబార్షన్ ఖర్చు ఉండదని, మేం ఇంటికి చేరేలోపే బాలికను కడతేర్చు అని చెప్పినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో నాగమణి ఇంటి తలుపులు మూసివేసి నిండు గర్భిణిగా ఉన్న బాలికను చున్నీతో ఉరి వేసి చంపిందని వారు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దుర్గను, ఆమె చెల్లెలు నాగమణిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిన్ని నిత్యం నరకం చూపిస్తుండేది.. మారు తల్లి దుర్గ నిత్యం భౌతిక దాడులతో మానసిక చిత్రహింసలతో నరకం చూపిస్తుండేదని మొగులయ్య చిన్న కూతురు రోదిస్తూ తెలిపింది. ఎప్పుడూ డబ్బులు ఇవ్వని పిన్ని నాగమణి మాకు పైసలు ఇచ్చి ఇంటినుంచి బలవంతంగా బయటకు పంపించింది. నాకు అనుమానం వచ్చి ఇంటి పరిసరాల్లోనే దాక్కున్నా. ఇంట్లో నుంచి అక్క ఏడ్పులు వినిపించాయి. పిన్ని నాగమణి గట్టిగా అరుస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్న కేకలు వినిపించాయి. కొంత సేపటికి నిశ్శబ్దమైంది. భయంవేసి పక్కింటి వాళ్లకు చెప్పాను. వారు వచ్చి చూసేసరికి మా అక్క నేలపై మోకాళ్లపై కూర్చొని ఉంది. అక్క చావుకు కారణమైన మారు తల్లి దుర్గ, ఆమె చెల్లెలు నాగమణిలను కఠినంగా శిక్షించాలని బాలిక ఏడుస్తూ చెప్పింది. దుర్గ చెల్లెలు నాగమణి ,సంఘటనా స్థలాన్నిపరిశీలిస్తున్న పోలీసులు సీఐ వివరణ.. కాగా.. ప్రాథమిక నేర పరిశోధన మాత్రం బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామని మీర్‌పేట పోలీస్‌స్టేషన్ సీఐ నర్సింగ్ యాదయ్య తెలిపారు. బాలికది హత్యా.. ఆత్మహత్యా అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగిన అనంతరమే నిర్ధారణ అవుతుందన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. -
మహిళ హత్య కేసులో కీలక మలుపు
గుంటూరు, పేరేచర్ల(ఫిరంగిపురం) : ఫిరంగిపురం ఎస్టీ కాలనీలో ఆదివారం కలకలం రేపిన మహిళ హత్య కేసులో పోలీసులు ఆమె తల్లి మంగమ్మతో పాటు ప్రియుడు శివయ్యను పలు ధపాలుగా విచారించారు. తొలుత తానే చంపానని ఒప్పుకొన్న మంగమ్మ.. ఆ తరువాత పోలీసుల విచారణలో పలు వాస్తవాలు బయటపెట్టింది. వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉండటంతో పాటు ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకొన్న తల్లి ప్రియుడు తోకల శివయ్యతో కలసి ఆదివారం ఉదయమే హతమార్చింది. తొలుత చిన్న రోకలి బండతో మోది ఆ తరువాత శివయ్య సాయంతో పని కానిచ్చిట్లు పోలీసు విచారణలో బయటపెట్టింది. ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ఘటనను గోప్యంగా ఉంది ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా చేద్దామని అనుకొన్నారు. ఈలోపే విషయం స్థానికులకు తెలిసి పోలీసుల దాకా వెళ్లడంతో ఇద్దరు కటకటాల పాలయ్యారు. కన్న కూతురిని హతమార్చిన తల్లి మంగమ్మ, ఆమెకు సహకరించిన శివయ్యను త్వరలో రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అడ్డు అని అంతమొందించారు!
కర్నూలు, మద్దికెర: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి అడ్డు తొలగించిన భార్య ఉదంతం ఎట్టకేలకు బహిర్గతమైంది. ఈ మేరకు భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు పత్తికొండ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం సీఐ వివరాలను విలేకరులకు తెలిపారు. గత నెల 25న మద్దికెర రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పాడుబడిన క్వార్టర్స్‌లో గుర్తుతెలియని మృతదేహాన్ని కనుగొన్న విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన పోలీసులు ఈ హత్యకు భార్య నాగలక్ష్మీ, ప్రియుడు రామావత్ బజ్నునాయక్‌గా గుర్తించారు. డోన్ మండలం నక్కవాగుల పల్లి గ్రామానికి చెందిన హతుడు గొల్ల లక్ష్మన్న డోన్ పట్టణంలో హోటల్లో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన భార్య నాగలక్ష్మి రైల్వే పనులకు వెళుతూ డోన్ కొండపేటకు చెందిన రిటైర్డ్ రెల్వే ఉద్యోగి బజ్నునాయక్‌తో వివాహేతర సంబంధం కొనసాగించేంది. భార్యపై అనుమానంతో లక్ష్మన్న భార్యను వేధిస్తుండేవాడు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించారు. భార్య ప్రమేయంతో బజ్నునాయక్ ఏప్రిల్ 25న మద్దికెరకు పిలిపించి నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాపి మత్తులో ఉన్న లక్ష్మన్నను రాయితో కొట్టి చంపారు. సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టగా మృతుడి చావుకు భార్య, ప్రియుడే కారణమని భావించి అరెస్టు చేశారు. అనంతరం విచారణ చేయగా తానే హత్య చేసినట్లు ప్రియుడు ఒప్పుకున్నారన్నారు. గురువారం వీరిద్దరూ అనంతపురం జిల్లా కసాపురం దేవస్థానికి వెళ్లివస్తున్నారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కేసు త్వరగా చేధించడంతో సిబ్బందిని అభినందించారు. ఎస్‌లు మారుతి, శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్ రెడ్డిహుస్సేన్, పోలీసులు ఆనంద్, మదర్సాబ్ ఉన్నారు. -
మానవ మృగంగా మార్చేసిన వివాహేతర సంబంధం
వివాహేతర సంబంధం ఒక మనిషిని మానవ మృగంగా మార్చేసింది. అభం, శుభం ఎరుగని ఇద్దరు వ్యక్తులు మృతి చెందడానికి కారణమైంది. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిండ్ర మండలం అగరం పంచాయతీలోని దళితవాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చిత్తూరు, నిండ్ర: విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగడంతో ఇద్దరు మరణించిన ఉదంతమిది. నిండ్ర సీఐ వెంకటేశులు కథనం..అగరం దళితవాడకు చెందిన గోపి(38), పరిమళ భార్యాభర్తలు. ఇదే గ్రామానికి చెందిన వేలాయుధం(40)తో పరిమళకు వివాహేతర సంబంధం కలిగింది. పరిమళ భర్తతో చనువు పెంచుకున్న వేలాయుధం అతన్ని మద్యం మత్తులో దింపి పరిమళతో సాన్నిహిత్యంగా గడిపేవాడు. కొన్నాళ్లకు దీన్ని పసిగట్టిన గోపి భార్య పరిమళతో గొడవకు దిగాడు. దీంతో పరిమళ తన పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రావాలని పరిమళను వేలాయుధం ఫోన్లో ఒత్తిడి చేయగా తన భర్త గొడవకు దిగుతాడని అతనుండగా తాను రాలేనని తేల్చి చెప్పింది. దీంతో వేలాయుధం గోపిని ఎలాగైనా మట్టుపెట్టాలని నిశ్చయించుకున్నాడు. తన చేతికి మట్టి అంటకుండా దీనికి వ్యూహరచన చేశాడు. దీనికిగాను దళితవాడకు చెందిన గోపి స్నేహితుడు మేఘవర్ణం(35)ను పావుగా వాడుకున్నాడు. రాత్రి పూట గోపి తప్పనిసరిగా మద్యం సేవిస్తాడని తెలిసిన వేలాయుధం కూల్‌డ్రింక్‌లో విషం కలిపి మేఘవర్ణంకు ఇచ్చి మద్యం తాగడానికి వాడుకోండని ఇచ్చి పంపాడు. ఇది తెలియని మేఘవర్ణం తన మిత్రుడు గోపికి కూల్‌డ్రింక్‌ను మద్యంలో కలిపి ఇచ్చాడు. అతను తాగగా మిగిలిన కూల్‌డ్రింక్‌ను విషం అని తెలియకపోవడంతో ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఉంచాడు. కాసేపటికే ఫ్రిజ్‌లో కూల్‌డ్రింక్ బాటిల్ చూసిన మేఘవర్ణం భార్య మాధవి(28) తన భర్త కూల్ డ్రింక్ తెచ్చి ఉంచాడని భావించి దానిని తాగింది. విష ప్రభావంతో కొంతసేపటికే కేకలు వేసి స్పృహ కోల్పోయి పడిపోయింది. ఇంటికి వచ్చిన మేఘవర్ణం ఆమెను నగరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు మంగళవారం రాత్రి 10 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న గోపిని గుర్తించిన స్థానికులు అతను మృతి చెందినట్లు గుర్తించారు. మేఘవర్ణం వెంటనే గోపి ఇంటికి వెళ్లగా అప్పటికే అతను ఇంటిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు నిందితుడు వేలాయుధం అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన మాధవి పిల్లలు , రోదిస్తున్న గోపి భార్యాపిల్లలు మూడు కుటుంబాలు చిన్నాభిన్నం గోపి, మాధవి మృతి చెందడంతో ఆ రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. వేలాయుధం అరెస్టు కావడంతో అతని కుటుంబానిదీ ఇదే పరిస్థితి తప్పలేదు. వివాహేతర సంబంధం మూడు కుటుంబాలను నాశనం చేసిందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం మాధవి మృతి చెందడంతో ఆమె కుమారుడు రవితేజ(13), కుమార్తె భార్గవి(9), గోపి మృతి చెందడంతో అతని కుమార్తెలు శృతి (15), కీర్తన (13)ల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోతే, ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉసురు తీసిన వివాహేతర సంబంధం పుత్తూరు: వివాహేత సంబంధం ఒక మహిళ ఉసురు తీసింది. బుధవారం పుత్తూరు మున్సిపాలిటీలోఇది చోటుచేసుకుంది. సీఐ యల్లమరాజు కథనం.. మున్సిపల్ పరిధిలోని తాయిమాంబాపురం గ్రామానికి చెందిన రామదాసు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయనకు భార్య మునెమ్మ (30), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మహేష్‌తో మునెమ్మకు వివాహేతర సంబంధం ఉంది. మంగళవారం పుత్తూరు పక్కనే ఉన్న కొండలచెరువు గ్రామంలో నిర్వహిస్తున్న జాతరకు మునెమ్మ వెళ్లింది. విషయం తెలుసుకున్న మహేష్ కూడా కొండలచెరువుకు వెళ్లాడు. మంగళవారం రాత్రి గ్రామ పొలిమేర్ల వద్ద వారిద్దరూ గొడవ పడ్డారు. స్థానికులు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించేశారు. తనకున్న వివాహేత సంబంధం అందరికీ తెలిసిపోయిందనే అవమాన భారం భరించలేక మునెమ్మ బుధవారం వేకువజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి పుత్తూరు పోలీసులకు సమాచారం చేరవేశారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మరిదితో వివాహేతర సంబంధం.. భర్త హత్య
చైతన్యపురి: వివాహేత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఎల్బీనగర్ ఏసీసీ పృథ్వీదర్‌రావు, సీఐ సుదర్శన్ వివరాలు వెల్లడించారు. డిండి మండలం, దేవత్‌పల్లి తండాకు చెందిన బానోవత్ దులియా అలియాస్ శంకర్ (33) భార్య విజయ, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి చైతన్యపురి యదవనగర్లో ఉంటూ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే విజయ మరిది వరసయ్యే సపావత్ కిషన్‌తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిని గుర్తించిన శంకర్ ఆమెను మందలించడంతో అతడి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి మద్యం తాగిన శంకర్ నిద్రలో ఉండగా విజయ, కిషన్ అతని ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. శంకర్ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. తామె హత్య చేసినట్లు అంగీకరించడంతోవారిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. -
ఆత్మహత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం
అన్నానగర్: బంధువులు వ్యతిరేకించడంతో వివాహేతర ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లా రెడ్డియూర్ పెరుమాల్ కౌండర్ కాలనీకి చెందిన శంకర లింగమ్ కుమారుడు గోపినాథ్ (31) అదే ప్రాంతానికి చెందిన రాజేశ్వరి (33)తో ఈ నెల 19న విల్లుపురం జిల్లా త్యాగదురుగమ్‌కి వచ్చాడు. భార్యాభర్తలమని చెప్పి అన్నానగర్‌లో ఓ ఇల్లు బాడుగకి తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం గోపినాథ్, రాజేశ్వరి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. మరోవైపు పల్లపట్టి పోలీసు స్టేషన్లో గోపినాథ్ కనబడడంలేదని అతని భార్య ఉమా, రాజేశ్వరి కనబడడం లేదని అళగపురం పోలీసు స్టేషన్లో ఆమె భర్త ముల్లై వేందన్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వీరు వివాహేతర ప్రేమ జంట అని తెలిసింది. 5 నెలల క్రితం వీరికి పరిచయం ఏర్పడి అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఇరు కుటుంబీకులు వీరి ప్రేమకి వ్యతిరేకించడంతో ఇద్దరూ ఇంటి నుంచి బయటకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రియురాలి తండ్రిపై కత్తితో దాడి
తూర్పుగోదావరి, అనపర్తి: వివాహితతో ఏర్పడ్డ పరిచయం హత్యా యత్నానికి దారితీసింది. స్థానిక రైల్వే స్టేషన్లో మంగళవారం రాత్రి వివాహిత సీహెచ్ శేషారత్నంతో కలిసి ప్రియుడు కె.మణికంఠను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆమె తండ్రి, బంధువుపై.. ప్రియుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్పీఎఫ్ సీఐ మధుసూదన్‌రెడ్డి కథనం ప్రకారం అనపర్తి పాతవూరికి చెందిన శేషారత్నం తన కుమార్తెను రోజూ పాఠశాల బస్సు ఎక్కించేందుకు వెళుతుంది. బస్సు క్లీనర్ మణికంఠరెడ్డితో పరిచయం పెంచుకున్న ఆమె ఇంటికి రప్పించుకుని అతనితో మాట్లాడుతుంటే.. ఆమెను కుటుంబ సభ్యులు మందలించారు. ప్రియుడి ఒత్తిడితో ఆమె పరారయ్యేందుకు స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అనుమానం వచ్చిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు, బంధువు కామేశ్వరరావుతో కలిసి వెతుకుతూ రైల్వే స్టేషనులో వారిని గమనించారు. ప్రియుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు వారిపై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో తండ్రి కంఠానికి, బంధువుకు ఎడమ చేతికి గాయాలయ్యాయి. వారిని కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. హత్యాయత్నానికి పాల్పడిన ప్రియుడు పోలీస్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లో జరగడంతో అనపర్తి పోలీసులు ఈ కేసును సామర్లకోట రైల్వే పోలీసులకు అప్పగించారు. సామర్లకోట జీఆర్పీ సిబ్బంది అతడిని సామర్లకోట తీసుకువెళ్లారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. -
వివాహేతర సంబంధం కోసం వ్యక్తి వీరంగం
వినుకొండటౌన్: వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలంటూ వివాహిత ఇంటివద్ద వ్యక్తి హల్చల్ చేసిన సంఘటన పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన తాటిపాక పెద్దిరాజుకు పట్టణంలోని మార్కాపురం రోడ్డులో నివాసం ఉంటున్న వివాహితతో నాలుగు ఏళ్లక్రితం వివాహేతర సంబంధం ఉండేది. పెద్దిరాజు నాలుగేళ్లక్రితం గుంటూరులో ప్రయివేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగా వివాహిత భర్తతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి పెద్దిరాజును మూడేళ్లపాటు ఇంట్లో ఉంచుకున్నారు. ఆ క్రమంలో పెద్దిరాజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గత ఏడాది వారు ఇరువురు ఇంటి నుంచి వెళ్లిపోయి కేరళలో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న భర్త తనకు చిన్న పిల్లలు ఉన్నారని బంధువులతో మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురానికి తీసుకువచ్చారు. గుంటూరులో నివాసం ఉంటే మరలా పెద్దిరాజు నుంచి ఇబ్బందులు వస్తాయని గమనించిన వారు కాపురాన్ని వినుకొండకు మార్చారు. పెద్దిరాజు మరలా వారిని వెతుక్కుంటూ వివాహిత ఇంటికి చేరి వీరంగం సృష్టించాడు. దీంతో వివాహిత, భర్తతోకలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా బాత్రూమ్కంటూ వెళ్లి గోడదూకి పెద్దిరాజు పారిపోయే ప్రయత్నం చేశాడు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య, ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు. మండలంలోని జి.కొత్తపల్లిలో చోటు చేసుకున్న ఈ కేసును పోలీసులు ఛేదించారు. ద్వారకాతిరుమల ఎస్సై ఎం.సూర్యభగవాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమవరానికి చెందిన చప్పా చిన్న చిన్నారావు ఈనెల 16 ఉదయం జి.కొత్తపల్లి నుంచి దూబచర్లకు వెళ్లే రహదారి పక్కన తీవ్ర రక్తగాయాలతో పడి ఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి 108 అంబులెన్స్‌లో బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య అమ్మాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారావు ఈ నెల 19న మృతిచెందాడు. ఈ కేసును హత్యా నేరం కింద నమోదు చేసిన భీమడోలు సీఐ సీహెచ్.కొండలరావు దర్యాప్తును వేగవంతం చేశారు. అమ్మాజీ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆ దిశగా దర్యాపు చేశారు. అమ్మాజీకి లక్కోజు సత్యనారాయణ అనే వ్యక్తితో అక్రమం సంబంధం ఉందని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తామే దాడి చేసినట్టు ఒప్పుకున్నారు. చిన్నారావును అతని భార్య అమ్మాజీ అడ్డుతొలగించుకోవాలన్న తలంపుతో ఆమె ప్రియుడు లక్కోజు సత్యనారాయణతో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలో చిన్నారావును ఈనెల 16న భీమవరం నుంచి తీసుకొచ్చి ఘటనాస్థలం వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి అనంతరం చిన్నారావు మృతిచెంది ఉంటాడని భావించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి వచ్చిన అమ్మాజీ తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిపడేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐ కొండలరావు అసలు విషయాన్ని రాబట్టి, నిందితులు అమ్మాజీ, ఆమె ప్రియుడు సత్యనారాయణలను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. -
వేధింపులపై వివాహిత ఫిర్యాదు
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తనతో పాటు తన కుమార్తెను హతమార్చేందుకు అత్తమామలు, మరిది, తోటికోడలు, ఆడపడుచు యత్నించారని ఆరోపిస్తూ నెల్లి భాగ్యలక్ష్మి అనే మహిళ గాజు వాక పోలీసులను ఆశ్రయించింది. గాజు వాక డ్రైవర్స్ కాలనీ ఎల్బీ నగర్లో చోటు చేసుకున్న సంఘటనకు సంబం ధించి గాజువాక సీఐ కోరాడ రామారావు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన నెల్లి భాగ్యలక్ష్మికి గాజు వాక ఎల్బీ నగర్‌కు చెందిన అవినాష్‌తో 2013లో వివాహం జరిగిం ది. ఆ సమయంలో అవినాష్ అమెరికాలో వెల్డర్‌గా పనిచేసేవాడు. అనంతరం నగరానికి వచ్చి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భాగ్యలక్ష్మి నిలదీసింది. అప్పుడు పొంతన లేని సమాధానం చెప్పిన అవినాష్ మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి భాగ్యలక్ష్మిని అత్తమామలతోపాటు ఆమె మరిది, తోటికోడలు, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మళ్లీ దాడి చేయడంతో బాధితురాలు భాగ్యలక్ష్మి గాయాలతో గాజువాక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనతోపాటు తన కుమార్తెను హతమార్చేందుకు యత్నిం చారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపా రు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది
వైఎస్ఆర్ జిల్లా , రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ పరిధిలోని రాయుడు కాలనీలో శనివారం రాత్రి కత్తి శంకర్‌రెడ్డి అనే వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటనకు వివాహేతర సంబంధమే కారణమని వెల్లడైంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి రూరల్ పరిధిలోని అబ్బవరం గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి పాతికేళ్ల క్రితం జీవనోపాధి కోసం రాయచోటికి వచ్చాడు. పదేళ్ల క్రితం రాయుడు కాలనీలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. కొంత కాలంగా చెక్‌పోస్టు వద్ద చిల్లర కొట్టు నిర్వహించుకుంటూ తన భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన ఖదీరూన్ అనే మహిళతో పరిచయమైంది. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆమె భర్త జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లడంతో వారి చనువు మరింత పెరిగింది. అయితే ఆమె కుమారుడు దీనిని జీర్ణించుకోకపోవడంతో వీరి మధ్య ఉన్న సంబంధం వికటించింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి శంకర్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఖదిరూన్తో పాటు ఆమె కుమారుడు కూడా ఇంటిలోనే ఉండటంతో వారి మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో ముందు ఆమె కొడుకు క్రికెట్ బ్యాట్‌తో శంకర్ రెడ్డి తలపై మోదాడు. కొడుకుకు సాయంగా ఆమె కూడా కత్తిపీటతో గొంతు కోసింది. దీంతో శంకర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం ఆలస్యంగా తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేశారు. ఆదివారం సాయంత్రం వరకు పలు కోణాలలో దర్యాప్తు చేసిన పోలీసులు ఖదీరూన్, ఆమె కుమారుడు అమీర్లను అదుపులోకి తీసుకొన్నారు. అయితే వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. దీనిపై అర్బన్ సీఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా హత్య కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నామని, వీరు ఇద్దరే హత్య చేశారా.. వీరికి మరెవరైనా సాయం చేశారా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వీరికి సహకరించిన వారిని కూడా అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. -
పోలీస్ వేషంలో టీడీపీ నేత దోపిడీ
కావలి (నెల్లూరు): అతడో టీడీపీ నాయకుడు. బంగారం బిస్కెట్లను అక్రమంగా తరలించే ముఠాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బంగారం బిస్కెట్లు కొనేందుకు వెళ్లే వారినుంచి పోలీస్ వేషంలో నగదు దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఇదే తరహాలో రూ.56 లక్షలు ఎత్తుకెళ్లాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు కీలక సూత్రధారైన, నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు రూ.36 లక్షలను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. కావలిలో కొందరు బంగారు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా, బిల్లులు లేకుండా చెన్నైలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి కావలిలో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యాపారి బంగారం బిస్కెట్లు కొనుగోలు నిమిత్తం సీజన్ బాయ్‌కి రూ.56 లక్షలు ఇచ్చాడు. పోలీసులు, ఐటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇద్దరు మహిళలను తోడుగా పంపించాడు. ఆ ముగ్గురూ చెన్నై వెళ్లేందుకు బుధవారం కావలిలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. పోలీసులమంటూ కొందరు అగంతకులు ఆ ముగ్గుర్నీ అటకాయించారు. భయపెట్టి వారివద్ద ఉన్న రూ.56 లక్షలను దోచుకెళ్లారు. సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. సీజన్ బాయ్‌తోపాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మహిళల్లో ఒకరి ఫోన్ నుంచి టీడీపీ నాయకుడు మర్రి రవి ఫోన్‌కు పెద్దఎత్తున కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. మర్రి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం అతడిని వెంటబెట్టుకుని చెన్నాయపాళెం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో అతడు చూపించిన ప్రదేశాల నుంచి రూ.22 లక్షలు, కావలిలో రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.20 లక్షలు ఎక్కడ దాచాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. సూత్రధారి రవి.. పాత్రధారి మహిళ టీడీపీ నాయకుడు మర్రి రవి సెంట్రింగ్ సామగ్రిని బాడుగకు ఇచ్చే వ్యాపారంతో పాటు కూలీలతో సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేయిస్తుంటాడు. ఈ క్రమంలో భర్తకు దూరమైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా, ఆ మహిళకు చెన్నై నుంచి బిల్లులు లేకుండా బంగారం బిస్కెట్లు తీసుకొచ్చే ఒక వ్యాపారితో సంబంధాలున్నాయి. మర్రి రవితో సాన్నిహిత్యం ఏర్పడినప్పటి నుంచి అతని ఒత్తిడి మేరకు.. తరచూ బంగారం కొనేందుకు తీసుకెళ్లిన సొమ్ము పోలీసులకు పట్టుబడిందంటూ వ్యాపారికి టోకరా వేస్తుండేది. ఇలా స్కెచ్చేశాడు ఈ నేపథ్యంలో మర్రి రవి దోపిడీకి ఓ బృందాన్ని తయారు చేశాడు. బంగారం కొనేందుకు ఎవరెవరు వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు. బస్సులో వెళ్తున్నారా, కారులోనా లేక రైలులో ప్రయాణిస్తున్నారా, ఏ సమయానికి ఎక్కడ ఉన్నారనే వివరాలను సదరు మహిళ ఫోన్‌ద్వారా మర్రి రవికి చేరువేస్తుండేది. దానిని బట్టి రవి వారిని వెంబడించి.. పోలీసులమని భయపెట్టి నగదు ఎత్తుకెళ్లేవాడు. ఇదే తరహాలో స్కెచ్ వేసి బుధవారం చెన్నైకు వెళ్తున్న వారినుంచి రూ.56 లక్షలు దోపిడీ చేసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రియుడితో ఉన్న భార్య హత్య..
తమిళనాడు, సేలం: ప్రియుడితో కలిసి పడకపై ఉన్న భార్యను దారుణంగా హత్య చేసిన భర్త, ఆమె తలను బైకుపై పెట్టుకుని షికారు చేసిన సంఘటన ఈరోడ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈరోడ్ జిల్లా పెరుందురై వేప్పంపాళయం ప్రాంతానికి చెందిన మునియప్పన్ (28) గ్యాస్ సిలిండర్ లోడ్ తీసుకెళ్లే పని చేస్తుంటాడు. ఇతని భార్య నివేద డిపార్ట్మెంటల్ దుకాణంలో పని చేస్తుంది. ఈ క్రమంలో మునియప్పన్ సోమవారం రాత్రి ఎప్పటిలానే పనికి వెళ్లాడు. అయితే పని లేకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య నివేద వేరొక వ్యక్తితో పడకపై కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన మునియప్పన్ దిగ్భ్రాంతి చెందాడు. భార్యతో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఆమెను పుట్టింటికి పంపడానికి బైకుపై తీసుకెళ్లాడు. ఎరుకంకాట్టువలసు వద్ద వస్తున్న సమయంలో మళ్లీ వాళ్ల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆవేశానికి గురైన మునియప్పన్ తన వద్ద ఉన్న కత్తితో భార్య గొంతు కోశాడు. తర్వాత ఆమె తలను బైకు పెట్రోల్ ట్యాంకుపై ఉంచుకుని ఆమె దేహాన్ని బైకులో తన వెనుక కూర్చోపెట్టుకుని రోడ్డుపై షికారుగా వెళ్లాడు. ఒక ఇంటి వద్ద బైకు అదుపు తప్పి తల కింద పడిపోవడంతో స్థానికులు గుర్తించారు. సమాచారం అదుకున్న పెరుందురై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మునియప్పన్ను అరెస్టు చేశారు. నివేద మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ఈరోడ్ జీహెచ్‌కు తరలించారు. పెరుందురై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అంతం చూసిన వివాహేతర సంబంధం
బోనకల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని మోటమర్రి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ వేణు మాధవ్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చిట్టుమోదు విష్ణు భార్యతో అదే గ్రామవాసి మరీదు ఉపేంద్ర(40) గత కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం విష్ణు పోలీస్ స్టేషన్లో తన భార్యను వేధిస్తున్నాడని ఉపేంద్రపై ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తాను బుద్ధిగా ఉంటానని చెప్పాడు. కానీ..యథావిధిగా అతను ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం విష్ణు, ఉపేంద్ర వారి పొలాల వద్దకు వెళ్లారు. విష్ణు పొలంలో ఉండడాన్ని గమనించిన ఉపేంద్ర ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన విష్ణు ఇంటికి రాగా..అప్పటికే తన ఇంట్లో భార్యతో ఉపేంద్ర ఉండడాన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. కల్లు గీత కత్తితో ఉపేంద్ర మెడ, కణితిపై విష్ణు దాడి చేశాడు. ఈ సంఘటనలో అక్కడిక్కడే అతను మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. హత్య చేసిన తర్వాత ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కు విష్ణు తన భార్యతో కలిసి వెళ్లి లొంగిపోయాడు. సీఐ వేణు మాధవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తమ్ముడని ఆశ్రయమిస్తే.. వివాహేతర సంబంధం
చిత్తూరు, పీలేరు రూరల్ : వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిన సంఘటన శనివారం రాత్రి పీలేరు పట్టణంలో చోటుచేసుకుంది. పీలేరు అర్బన్ సీఐ చిన్నపెద్దయ్య కథనం మేరకు.. గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పేయలవారిపల్లెకు చెందిన కృష్ణప్పనాయుడు కుమారుడు రవి (37)కి వివాహమై భార్య విడాకులు తీసుకుంది. దీంతో ఒంటరిగా జీవనం సాగించేవాడు. రవికి వరుసకు సోదరుడైన అదే గ్రామానికి చెందిన గణపతి భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలసి పీలేరు పట్టణం శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉన్నారు. గణపతి లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్ని నెలల క్రితం ఒంటరిగా ఉన్న రవికి గణపతి తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడు. ఈ క్రమంలో ధనలక్ష్మితో రవి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నాలుగు నెలల క్రితం ఇద్దరూ గణపతికి తెలియకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. గణపతి పిల్లలు దిగులుపడుతున్నారని భార్యకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి పిలుచుకుని వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నుంచి పీలేరుకు వచ్చిన రవి ఓ లాడ్జిలో ఉండి ధనలక్ష్మికి ఫోన్‌చేసి రమ్మన్నాడు. ఈ విషయాన్ని ధనలక్ష్మి తన భర్త గణపతికి చెప్పి, ఇద్దరూ కలసి స్థానిక తిరుపతి రోడ్డులోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్దకు వెళ్లారు. ధనలక్ష్మిని చూసిన రవి ఇంత ఆలస్యం ఎందుకంటూ చేయిచేసుకున్నాడు. తన ముందరే భార్యను కొట్టడంతో కోపోద్రిక్తుడైన గణపతి పక్కనే ఉన్న ఇనుపరాడ్డుతో రవి తలపై మోదాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
అన్నానగర్: గురుపరపల్లి సమీపంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను హత్య చేసిన సైనిక వీరుడుని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా గురుపరపల్లి సమీపంలోని బి.దిప్పనపల్లికి చెందిన రాజేష్ (31). ఇతని భార్య గౌతమి (29). వీరికి గత 2012లో వివాహం జరిగింది. దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజేష్ రాజస్థాన్ రాష్ట్రం జోద్‌పూర్‌లో సైనికుడిగా పని చేస్తున్నాడు. ఈ స్థితిలో గౌతమి గత 5వ తేదీన ఉదయం ఇంట్లో హత్యకు గురైంది. ఆమె ముఖంపై దిండుతో అదిమిపట్టి ఊపిరి అందకుండా చేసి హత్య చేసినట్టు తెలిసింది. దీనిపై గురుపరపల్లి పోలీసు ఇన్స్పెక్టర్ ప్రభావతి కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో.. గౌతమి భర్త రాజేష్‌కు, కర్ణాటక రాష్ట్రం దుమ్కుర్ సవారివం నగర్‌కి చెందిన కలైవాణి (30) అనే మహిళకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీని గురించి తెలుసుకున్న గౌతమి భర్తను నిలదీసింది. ఈ స్థితిలో రాజేష్ సెలవులకి ఇంటికి వచ్చాడు. దీంతో గౌతమిని, రాజేష్ హత్య చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు అతని కోసం గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రాజేష్ సోమవారం కృష్ణగిరిలో పోలీసులకు పట్టుబడ్డాడు. తన ప్రియురాలి ఒత్తిడి వల్లనే గౌతమిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. రాజేష్, అతని ప్రియురాలు కలైవాణిని పోలీసులు అరెస్టు చేశారు. -
పెళ్లి చేసుకున్నా నీతోనే ఉంటా..
సాక్షి, చెన్నై: పది సవర్ల నగల కోసం వేధించడంతో కళాశాల విద్యార్థిని ప్రగతిని హత్య చేసినట్లు నిందితుడు సోమవారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. తమిళనాడు దిండుగల్ జిల్లా ఒట్టనసత్రంకు చెందిన కళాశాల విద్యార్థిని ప్రగతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రగతి బంధువైన ఒట్టనసత్రంకు చెందిన సతీష్‌కుమార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సేకరించిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రగతి తన అత్త కుమార్తె అని, ఇద్దరూ చిన్ననాటి నుంచి ఇష్టపడినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రగతిని వివాహం చేసుకునేందుకు అత్తమామలను అడగ్గా, అందుకు వారు నిరాకరించినట్లు తెలిపాడు. దీంతో తన తల్లిదండ్రులు వేరొక యువతితో తనకు వివాహం జరిపించారని పేర్కొన్నాడు. (ఒన్ సైడ్ ఉన్మాదం) గతంలో ప్రగతికి చీరలు, 10 సవర్ల బంగారు నగలు కొనిచ్చానని, తనకు బిడ్డ పుట్టిన తర్వాత ఆమెను కలవడం మానుకున్నట్లు తెలిపాడు. కానీ మరో పది సవర్ల బంగారు నగలు కొనివ్వాలని ప్రగతి బలవంతం చేసిందని తెలిపారు. ప్రగతి తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అది తనకు ఇష్టం లేదని తెలిపినట్లు చెప్పాడు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా తనతో సంబంధం కొనసాగిస్తానని తెలిపిందని, తరచూ ఫోన్ చేసి తనతోనే జీవిస్తానని తెలపడంతో ఎక్కడ తన కుటుంబంలో చిచ్చు రేగుతుందనే అనుమానంతో ఆమెను హతమార్చేందుకు నిర్ణయించినట్లు తెలిపాడు. సంఘటన జరిగిన రోజున ఆమెను కారులో తీసుకువెళ్లి ఆమెతో ఉల్లాసంగా గడిపానని, తర్వాత తన వద్ద దాచుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి హతమార్చినట్లు తెలిపాడు. పోలీసులు సతీష్‌కుమార్‌ను సోమవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
తల్లి మరొకరితో సంబంధం పెట్టుకోవడంతో కుమార్తె..
టీ.నగర్: తల్లి మరొకరితో వివాహేతర సంబం ధం పెట్టుకోవడంతో మనోవేదనతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. విల్లుపురం జిల్లా, చిన్న సేలం సమీపానగల నైనార్‌పాళయం గ్రామానికి చెందిన కవితాదేవి (41) వితంతువు. ఈమె భర్త వెంకటేశన్ ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందాడు. ఇదిలావుండగా కవితాదేవికి అదే ప్రాంతానికి చెందిన రాజేం ద్రన్ (33) అనే గ్రామ సహాయకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువరూ ఇంట్లో స న్నిహితంగా ఉండడం గమనించిన కుమార్తె, ప్లస్ వన్ చదువుతున్న భాగ్యలక్ష్మి (16) రాజేంద్రన్‌ను హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజేంద్రన్ భాగ్యలక్ష్మిపై చెప్పుతో దాడి చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని భాగ్యలక్ష్మి శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కీళకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి కవితాదేవి, రాజేంద్రన్‌లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తల్లి వివాహేతర సంబంధం కారణంగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది. -
ఆమెకి 25 అతనికి 54.. పెళ్లికి నిరాకరించిందని..
చెన్నై, సేలం: రెండేళ్లుగా వివాహేతర సంబంధం కలిగిఉన్న మహిళ తనతో పెళ్లికి నిరాకరించడంతో ఆవేదన చెందిన వ్యక్తి ఆ మహిళను కత్తితో నరికి చంపి, ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సేలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సేలం నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో కాసా కారనూర్ అనే ప్రాంతంలో ఒక ఐస్ క్రీమ్ దుకాణం నడుపుతున్న వ్యక్తి పాండ్యరాజన్. ఈ దుకాణంలో గత నాలుగేళ్ల క్రితం ఆజాద్ నగర్‌కు చెందిన సెరిన్ సితారాబాను (25) పనికి చేరింది. ఈమె భర్త నుంచి విడిపోయి జీవిస్తోంది. ఈ క్రమంలో సితారాబానుకు పక్క దుకాణంలో పని చేస్తున్న ఇనాముల్లా (54)తో పరిచయం ఏర్పడింది. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ఐస్‌క్రీం దుకాణానికి ఇనాముల్లా వచ్చాడు. సితారాబాను ఉన్న గదికి వెళ్లి తలుపు వేసి లోపల గడియపెట్టాడు. తర్వాత తాను తీసుకొచ్చిన కత్తితో సితారాబానును నరికి హత్య చేశాడు. ఆ సమయంలో ఆమె అరుపులు విని స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తలుపులు తట్టగా తెరుచుకోలేదు. లోపలి వైపు తలుపు గడియ పెట్టి ఉంది. సమాచారం అందుకున్న సూరమంగళం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు తెరవడానికి ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సితారాబాను రక్తపు మడుగులో శవంగా పడి ఉండగా, పక్కనే ఉన్న ఫ్యాన్‌కు ఇనాముల్లా ఉరి వేసుకుని శవంగా వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. పెళ్లికి నిరాకరించినందుకే హత్య: పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో సెరిన్ సితారాబాను వివాహమై, విడాకులు పొందినట్టుగాను, అదే విధంగా ఇనాముల్లా కూడా విడాకులు పొందిన వ్యక్తి అని తెలిసింది. వీరి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు, ఈ స్థితిలో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇనాముల్లా ఒత్తిడి చేయగా అందుకు నిరాకరించడంతోనే ఆమెను హత్య చేశాడని తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించగా, ఇనాముల్లా రాసిన ఒక లేఖ చిక్కింది. అందులో.. సితారా భానుకు వివాహమై భర్త నుంచి విడాకులు పొందింది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. నాలుగేళ్లుగా తమకు పరిచయం ఉందని, గత రెండేళ్లుగా వివాహేర సంబంధం ఏర్పడినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి నా కుటుంబీకులు దూరమయ్యారు. దీంతో సితారాబానును వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నా. అయితే సితార నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈమెను నమ్ముకుని నా కుటుంబాన్ని వదిలి వచ్చాను. ఇప్పుడు అనాథగా మారాను. ఎంత బతిమాలినా ఆమె వివాహానికి ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్టు రాసి ఉంది. దీనిపై సూరమంగళం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
జహీరాబాద్: తన ప్రియురాలిని కలుసుకునేందుకు భర్త అడ్డంకిగా మారాడని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్యచేయించినట్లు డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన సయ్యద్ కరీం(26)ను ఈనెల 2వ తేదీన మహ్మద్ ముబీన్(26) అనే నిందితుడు తన స్నేహితుడికి సుపారి ఇచ్చి హత్య చేయించాడు. నిందితుడు ముబీన్ మృతుడి భార్యతో కలిసి 1నుంచి 8వ తరగతి వరకు జహీరాబాద్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ముబీన్ అప్పటి నుంచి మృతుడి భార్యను ప్రేమిస్తున్నాడు. మృతుడు కరీం బతుకుదెరువు గురించి సౌది దేశం వెళ్లిన సమయంలో అతడి భార్య జహీరాబాద్‌లోని తల్లిగారింటికి వచ్చింది. దీంతో ముబీన్ ఆమెతో కలిసేవాడు. సుమారు 8 నెలల క్రితం మృతుడు కరీం సౌదీ దేశం నుంచి పూర్తిగా తిరిగి వచ్చాడు. ఆరు నెలల క్రితం జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా సమీపంలో హైటెక్ ఎస్.ఎస్ రేయిలింగ్ షాపును పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ముబీన్ తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కరీంను ఎలాగైనా చంపించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందుకు పథకం వేసి తన స్నేహితుడు అయిన జహీరాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ సమద్(30)ని ఆశ్రయించాడు. సమద్ స్కూల్ బ్యాగులు కుట్టుకుని జీవనం సాగించేవాడు. అతడు వ్యాపారం సక్రమంగా చేయనందున అప్పుల పాలయ్యాడు. మద్యంకు బానిసగా మారాడు. ముబీన్ సమద్ బలహీనతలను గమనించి తన బాధలను చెప్పుకున్నాడు. కరీంను చంపినట్లయితే రూ.3లక్షలు సూపారి కింద ఇస్తానని, ఈ డబ్బుతో అప్పులు తీర్చుకోవడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చేసుకోమని నమ్మబలికాడు. దీంతో సమద్ తన అప్పులు తీరుతాయని భావించి ముబీన్ సూచన మేరకు కరీంను హత్యచేసేందుకు నిర్ణయించుకున్నాడు. సమద్‌కు రూ.10వేలు ముట్టచెప్పాడు ముబీన్. ముబీన్‌ను నమ్మి ఈనెల 2వ తేదీన రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముబీన్ తన పల్సర్ మోటారు సైకిల్‌పై సమద్‌ను కూర్చోబెట్టుకుని ఆదర్శనగర్ క్రాసింగ్ వద్ద విడిచి పెట్టాడు. సమద్ తన వెంట కొబ్బరి బొండాం నరికే కత్తిని ప్యాంట్లో పెట్టుకుని కరీం దుకాణం వద్దకు వెళ్లాడు. వెళ్లి ఖాశీంపూర్ గ్రామంలో గల దర్గా వద్ద రేయిలింగ్ చేయాలని కరీంను రమ్మని కోరాడు. అతడిని బయటకు పిలిచి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై రెండు సార్లు నరికాడు. ఇంకా కొట్టబోగా చేతులు అడ్డం పెట్టాడు. దీంతో దాడిలో కరీం రెండు చేతులు, భుజానికి గాయాలయ్యాయి. కుడికాలుపై కూడా వేటు వేశాడు. దీంతో అక్కడే కుప్పకూలి మృతిచెందాడు. కరీం చనిపోయాడని నిర్దారించుకున్నాక వారు వేసుకున్న పథకం ప్రకారం.. బీదర్ క్రాస్ రోడ్డువద్ద ముబీన్, సమద్‌లు కలుసుకున్నారు. అనంతరం మోటారు సైకిల్‌పై కర్ణాటకలోని మన్నా ఎక్కెల్లికి పారిపోయారు. శుక్రవారం ఇరువురు తమ ఇళ్ల వద్దకు రాగా అరెస్టు చేసి మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. మృతుడు కరీంకు 4 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒక కుమార్తె ఉంది. ఈ సంఘటన మూడు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్సై రాజశేఖర్‌లు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అనైతిక బంధం
కెలమంగలం: వివాహేతర సంబంధం ప్రాణాలను బలిగొంది. జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన హొసూరు పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. వివరాల మేరకు హొసూరు సమీపంలోని పన్నపల్లి గ్రామా నికి చెందిన వితంతు మహిళ ప్రేమ (40). ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రేమ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ప్రేమ హొసూరు అన్నానగర్‌లో నివాసముంటూ రైతు బజారులో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుండేది. పరిచయంతో సంబంధం ఈ తరుణంలో గత కొన్నేళ్ల క్రితం రైతుబజారుకు తరచూ వస్తున్న కెలమంగలం సమీపంలోని జ్యోతిపురం గ్రామానికి చెందిన నాగరాజు (45)తో ప్రేమకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. నాగరాజు ప్రేమ ఇంటికి తరచూ వచ్చి వెళ్లేవాడు. మంగళవారం ప్రేమ ఇంట్లో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు ఇరువురినీ చికిత్స కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రేమ మృతి చెందింది. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ప్రేమను విడిచి ఉండలేక నాగరాజుకు భార్య మాదేవమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. ప్రేమతో వివాహేతర సంబంధం నాగరాజు కుటుంబసభ్యులకు తెలియడంతో దండించినట్లు సమాచారం. తరచూ గొడవలు జరుగుతుండడంతో ప్రేమను విడిచి ఉండలేక ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హొసూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
ప్రియుడు చేతిలో వివాహిత బలి..
షాద్‌నగర్ రూరల్: వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం కలిసితిరిగారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైనా ఆమెను కడతేర్చాలని ప్రియుడు పన్నాగం పన్నాడు. ఆ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మహల్ ఎలికట్ట గ్రామంలో చోటు చేసుకుంది. సొంత కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు మరో దారుణానికి ఒడగట్టిన సంఘటన సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములుకు అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ జంగం మంగమ్మతో కొంతకాలంగా సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కొంత కాలంగా బాగానే ఉన్న ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా ఇరువురి మధ్య మాటలు లేకపోవడంతో మంగమ్మపై కోపం పెంచుకున్న రాములు ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పన్నాగం పన్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పనులు చేసి ఇంటికి ఒంటిరిగా వెళ్తున్న మంగమ్మను రాములు వెంబడించాడు. పథకం ప్రకారం ముందుగానే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమె ఒంటిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలకు తాళలేక మంగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పి ఆమెను వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంగమ్మను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మంగమ్మ పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. అయితే ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాంగ్మూలం నమోదు చేసిన జడ్జి... ప్రియుడు రాములు చేతిలో హత్యాయత్నానికి గురైన మంగమ్మ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఆశారాణి షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మంగమ్మ నుంచి వాగ్మూలం తీసుకున్నారు. అయితే మంగమ్మను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన రాములు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండి ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు. సొంత కుటుంబ సభ్యులను హతమార్చిన రాములు తాజాగా మరో దారుణానికి పాల్పడ్డాడు. -
కుమార్తెను హతమార్చిన తల్లి అరెస్ట్
అన్నానగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కుమార్తెను హత్య చేసిన తల్లిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నీలగిరి జిల్లా ఊటి సమీపం కోడప్పమందు అంబేడ్కర్ కాలనీకి చెందిన జగన్నాథన్ (40) పెయింటర్. ఇతని భార్య రాజలక్ష్మి (35). వీరి కుమార్తె ఉషారాణి (11). ఈమె ఊటీలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతూ వచ్చింది. అదే పాఠశాలలో రాజలక్ష్మి వంట సహాయకురాలిగా పని చేస్తూ వచ్చింది. రెండు సంవత్సరాల కిందట ఏర్పడిన అభిప్రాయబేధాల కారణంగా భార్యను విడిచి జగన్నాథన్, గాందలిలో ఒంటరిగా జీవిస్తూ వచ్చాడు. రాజలక్ష్మి తన కుమార్తెతో జీవిస్తోంది. ఈ స్థితిలో రాజలక్ష్మికి, పక్కింటికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదిలాఉండగా బుధవారం రాత్రి తన కుమార్తె ఉషారాణి ఉయల ఊగుతుండగా తాడు గొంతుకు బిగుసుకుని మృతి చెందినట్లుగా స్థానికుల వద్ద తెలిపి బోరున ఏడ్చింది. అనంతరం ఉషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఈ క్రమంలో జగన్నాథన్ సహోదరుడు కుమార్ ఉషారాణి మృతిపై అనుమానం ఉన్నట్టు గురువారం ఊటీ నగర సెంట్రల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి రాజలక్ష్మి వద్ద విచారణ చేయగా ఆమె పొంతన లేని సమాధానాలివ్వడంతో పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లి విచారణ జరిపారు. వివాహేతరానికి సంబంధానికి అడ్డుగా ఉన్న కుమార్తెను రాజలక్ష్మి చీరతో గొంతు నులిమి హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు ఆమెని అరెస్టు చేసి, ఊటీ కోర్టులో హాజరుపరిచి, కోవై జైలుకు తరలించారు. -
ప్రియుడితో కలిసి దివ్యాంగుడైన భర్తను..
నాగోలు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడి తో కలిసి ఓ మహిళ దివ్యాంగుడైన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ పుథ్వీధర్రావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి కాశయ్య(40) దివ్యాంగుడు. అదే ప్రాంతానికి చెందిన మేన మామ కుమార్తె నాగలక్ష్మితో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన కాశయ్య ఎల్బీనగర్లోని ఎస్బీహెచ్ కాలనీ వెంచర్–3లో సుకృత అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. నాగలక్ష్మి స్థానికంగా ఇళ్లల్లో పని చేసేది. నల్లగొండ జిల్లా, కట్టవారి గుడెంకు చెందిన కొండ సైదులుతో నాగలక్ష్మి గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సైదులు నాగలక్ష్మి కోసం తరచూ ఇంటికి వస్తుండటంతో కాశయ్య అతడిని వారించేవాడు. ఈనెల 15న రాత్రి ఇంటికి వచ్చిన సైదులు, నాగలక్ష్మితో కలిసి కాశయ్యతో గొడవపడ్డారు. దీంతో కాశయ్య తన తమ్ముడు సురేష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన నాగలక్ష్మి ప్రియుడితో కలిసి కాశయ్య గొంతు నులిమి హత్యచేసింది. అనంతరం కాశయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. దీనిపై అనుమానం వచ్చిన మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల16న ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాశయ్య సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నాగలక్ష్మి, సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డురావడం, తరచూ నాగలక్ష్మిని వేధిస్తున్నందునే హత్య చేసినట్లు తెలిపారు. ఎల్బీనగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి, డీఐ కృష్ణ మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
తల్లి అక్రమబంధానికి కుమార్తె సహకారం..
కీసర: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన కేసులో కీసర పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిస్సాకు చెందిన బీర వసంత్(40) చాలా కాలం క్రితం నగరానికి వలస వచ్చి భార్య రేణుకతో కలిసి రాజీవ్‌గృహాకల్పలో ఉంటూ టెంట్‌హౌస్‌లో కూలీగా పని చేస్తున్నాడు. రేణుక గ్యాస్ గోదాంలో పనిచేసేది. వారికి ఇద్దరు సంతానం. భార్యా, భర్తలిద్దరూ తరచూ మద్యం తాగి గొడవపడేవారు ఈ నేపథ్యంలో రేణుకకు గ్యాస్ గోదాంలో తనతో పాటు పని చేస్తున్న కిషోర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రియుడి మోజులో పడిన రేణుక ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. ఇందుకు తన కుమార్తె (13) సహకారం కోరింది. తల్లి సూచనమేరకు ఈనెల 13న కుమార్తె చికెన్‌లో ఎలుకల మందు కలిపి తండ్రి వసంత్‌కు పెట్టింది. దీనిని పసిగట్టిన వసంత్ చికెన్‌ను బయట పారవేశాడు. రాత్రి మద్యం తాగి నిద్రిస్తున్న వసంత్‌ను రేణుక తన ప్రియుడు కిషోర్, కుమార్తెతో కలిసి చున్నీతో మెడకు భిగించి హత్య చేశారు.అనంతరం అతిగా మద్యం తాగినందునే చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని అక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో హత్య చేసినట్లు నిర్ధారణైంది. హత్యకు వినియోగించిన చున్నీ, టవల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు రేణుక, కిషోర్‌ను రిమాండ్‌కు తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘అక్రమ’ గుట్టు బయటపడిందని..
మీర్‌పేట: వివాహేతర సంబంధం బయటపడిందని ఓ మహిళ ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో ఉన్న భర్తను హత్య చేయడమేగాక సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సంఘటన సోమవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, పోర్లగడ్డతండాకు చెందిన వడ్త్యా గోపి (35) భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నాగోలు అల్కాపురిలో ఉంటున్నాడు. భార్యాభర్తలిద్దరూ అల్కాపురిలో బిల్డింగ్ మెటీరియల్ విక్రయించే వీరాస్వామి వద్ద పని చేసేవారు. ఈ క్రమంలోనే వీరాస్వామి లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని గుర్తించిన గోపి మూడు నెలల క్రితం అక్కడ పని మానేసి కర్మన్‌ఘాట్ భూపేష్‌గుప్తానగర్‌కు మకాం మార్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా వీరాస్వామి గతంలో వేసిన చీటీ డబ్బుల కోసం గోపి ఆదివారం అక్కడికి వెళ్లగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వీరాస్వామి తన స్నేహితుడు రాములుతో కలిసి గోపిపై దాడి చేశాడు. దీనిని అవమానంగా భావించిన గోపి అదే రోజు రాత్రి ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చి వీరాస్వామితో కలిసి తనను చంపేందుకు పథకం పన్నావంటూ భార్యతో గొడవకు దిగాడు. అనంతరం నిద్రమత్తులో ఉన్న గోపిని కడతేర్చేందుకు నిర్ణయించుకున్న లక్ష్మి గొడవ విషయాన్ని వీరాస్వామికి ఫోన్ చేసి చెప్పి అతడిని ఇంటికి పిలిపించింది. స్నేహితుడు రాములుతో కలిసి అక్కడికి వచ్చిన వీరాస్వామి లక్ష్మితో కలిసి గోపి గొంతు నులిమి ముఖం, ఛాతిపై పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లక్ష్మి అదే ప్రాంతంలో ఉంటున్న గోపి తండ్రి బద్యా చంద్రుకు ఫోన్ చేసి గోపి గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పింది. అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు గోపి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం పోర్లగడ్డతండాకు తరలించారు. మృతదేహాన్ని పరిశీలించిన బంధువులు శరీరంపై తీవ్ర గాయాలు, గొంతు కమిలిపోయి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గోపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు హత్యగా నిర్ధారించారు. దీంతో నిందితులు లక్ష్మి, వీరాస్వామి, రాములును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
భార్య ప్రియుడిని హత్య చేసిన భర్త
తిరువొత్తియూరు: శ్రీపెరంబదూరు, మణిమంగళంకు చెందిన బాలాజీ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతని భార్య వనిత (25). వీరికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన గణపతి (36) బాలాజీకి బంధువు. దీని వల్ల తరచూ బాలాజీ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో గణపతికి వనితతో పరిచయం పెరిగి క్రమంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న బాలాజీ భార్యను మందలించాడు. కాని ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ క్రమంలో గత వారం వనిత హఠాత్తుగా అదృశ్యమైంది. ఆమె ప్రియుడు గణపతితో కలిసి పారిపోయినట్టు తెలిసింది. వారిద్దరూ శ్రీ పెరంబదూరు, గుండు పెరుంబేడులోని అద్దె ఇంటిలో ఉంటున్నట్టు తెలిసింది. ఈ సంగతి తెలుసుకున్న బాలాజీ వారిని కడతేర్చడానికి నిర్ణయించుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తన సహచరులతో కలిసి గుండు పెరుంబేడుకు వెళ్లాడు. భార్య, ప్రియుడు ఉంటున్న ఇంటిలోకి చొరబడి గణపతిని చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. అడ్డువచ్చిన భార్య వనితకు కత్తివేటు పడింది. దాడిలో తీవ్ర గాయాలైన గణపతి అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం హంతకులు అక్కడి నుంచి పారిపోయారు. శబ్దం విన్న ఇరుగుపొరుగు ప్రజలు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న వనితను చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేసి గణపతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం గాలిస్తున్నారు.