
పారిపోతున్న పెద్దిరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు
వినుకొండటౌన్: వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలంటూ వివాహిత ఇంటివద్ద వ్యక్తి హల్‌చల్ చేసిన సంఘటన పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన తాటిపాక పెద్దిరాజుకు పట్టణంలోని మార్కాపురం రోడ్డులో నివాసం ఉంటున్న వివాహితతో నాలుగు ఏళ్లక్రితం వివాహేతర సంబంధం ఉండేది. పెద్దిరాజు నాలుగేళ్లక్రితం గుంటూరులో ప్రయివేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగా వివాహిత భర్తతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి పెద్దిరాజును మూడేళ్లపాటు ఇంట్లో ఉంచుకున్నారు.
ఆ క్రమంలో పెద్దిరాజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గత ఏడాది వారు ఇరువురు ఇంటి నుంచి వెళ్లిపోయి కేరళలో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న భర్త తనకు చిన్న పిల్లలు ఉన్నారని బంధువులతో మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురానికి తీసుకువచ్చారు. గుంటూరులో నివాసం ఉంటే మరలా పెద్దిరాజు నుంచి ఇబ్బందులు వస్తాయని గమనించిన వారు కాపురాన్ని వినుకొండకు మార్చారు. పెద్దిరాజు మరలా వారిని వెతుక్కుంటూ వివాహిత ఇంటికి చేరి వీరంగం సృష్టించాడు. దీంతో వివాహిత, భర్తతోకలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా బాత్‌రూమ్‌కంటూ వెళ్లి గోడదూకి పెద్దిరాజు పారిపోయే ప్రయత్నం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment