
గుంటూరు, పేరేచర్ల(ఫిరంగిపురం) : ఫిరంగిపురం ఎస్టీ కాలనీలో ఆదివారం కలకలం రేపిన మహిళ హత్య కేసులో పోలీసులు ఆమె తల్లి మంగమ్మతో పాటు ప్రియుడు శివయ్యను పలు ధపాలుగా విచారించారు. తొలుత తానే చంపానని ఒప్పుకొన్న మంగమ్మ.. ఆ తరువాత పోలీసుల విచారణలో పలు వాస్తవాలు బయటపెట్టింది. వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉండటంతో పాటు ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకొన్న తల్లి ప్రియుడు తోకల శివయ్యతో కలసి ఆదివారం ఉదయమే హతమార్చింది.
తొలుత చిన్న రోకలి బండతో మోది ఆ తరువాత శివయ్య సాయంతో పని కానిచ్చిట్లు పోలీసు విచారణలో బయటపెట్టింది. ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ఘటనను గోప్యంగా ఉంది ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా చేద్దామని అనుకొన్నారు. ఈలోపే విషయం స్థానికులకు తెలిసి పోలీసుల దాకా వెళ్లడంతో ఇద్దరు కటకటాల పాలయ్యారు. కన్న కూతురిని హతమార్చిన తల్లి మంగమ్మ, ఆమెకు సహకరించిన శివయ్యను త్వరలో రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.