ప్రతీకాత్మక చిత్రం
చెన్నై,టీ.నగర్: తండ్రి ప్రియురాలిని ఓ బాలుడు హతమార్చాడు. ఈ ఘటన మంగళవారం పట్టుకోట్టై సమీపంలో జరిగింది. పట్టుకోట్టై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు. ఇతనికి వివాహమై 17 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇలావుండగా బాలుని తండ్రికి, అదే ప్రాంతానికి చెందిన, ఓ వివాహిత (47)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో సోమవారం తండ్రి ప్రియురాలి ఇంటికి స్నేహితుడితో వెళ్లిన బాలుడు తండ్రితో సంబంధం వదులుకోవాలని ఆమెను హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన బాలుడు దుడ్డుకర్రతో మహిళ తలపై దాడి చేసి పరారయ్యాడు. గాయపడ్డ మహిళను వెంటనే స్థానికులు పట్టుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతిచెందింది. పోలీసులు స్నేహితుడు సహా బాలున్ని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment