assassinated
-
తాడిపత్రిలో దారుణం.. భార్యను నరికి చంపిన భర్త
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త వెంకటేశ్వరరెడ్డి వేట కొడవలితో నరికి చంపాడు. భార్య పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది. తాడిపత్రి పట్టణంలోని హేమాద్రి లాడ్జిలో ఘటన జరిగింది. దంపతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు వర్గాల పెద్దలు లాడ్జిలో సమావేశమయ్యారు. ఒంటరిగా మాట్లాడాలని చెప్పిన భర్త.. భార్యను హత్య చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.అనుమానాస్పదంగా మహిళ మృతికోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం తోటపేట గ్రామంలో ఈ నెల 12న దామిశెట్టి మహాలక్ష్మి (54) అనుమానాస్పదంగా మృతి చెందింది. సహజ మరణంగా భావించిన బంధువులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఒంటిపై బంగారం లేదని, బంగారం కోసమే హత్య చేసి ఉంటారని ద్రాక్షారామ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పాతిపెట్టిన మహాలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీశారు. స్మశానవాటిక వద్దనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ -
తల్లిని హత్య చేసిన కానిస్టేబుల్
చిత్తూరు అర్బన్: నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని ఓ కుమారుడు హత్య చేశాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదంలో తల్లిని కాలితో తన్నడంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. తలను గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ తల్లి... మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది. చిత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు... చిత్తూరు దుర్గానగర్ సమీపంలోని రోసీనగర్‌లో ఉంటున్న వసంతమ్మ (63)కు ఇద్దరు కుమారులు.భర్త పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. పెద్ద కొడుకు శంకర్ చిత్తూరు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా, మరో కొడుకు జ్యోతికుమార్ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. శంకర్ ప్రవర్తన నచ్చని తండ్రి బాలసుబ్రమణ్యం రెండేళ్ల క్రితం తన సోదరి ఊరికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. పనిచేసిన స్టేషన్లో ఆరోపణలు రావడంతో శంకర్ కొన్నాళ్లుగా వేకెంట్ రిజర్వు (ఏఆర్)లో ఉన్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం శంకర్ మద్యం మత్తులో తన తల్లితో గొడవకు దిగాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని సతాయించాడు. తల్లితో మాటా మాటా పెరిగి వాగ్వావాదానికి దిగాడు. ఒక్కసారిగా కోపానికిలోనైన శంకర్.. వసంతమ్మను చావ బాదాడు. తలను గోడకేసి కొట్టాడు. కింద పడేసి కాలితో తన్నుతూ, మొహంపై దాడి చేశాడు. ఒక్కసారిగా స్పృహతప్పిన వసంతమ్మ కిందపడిపోయింది. అప్పటికే కేకలు విన్న ఇరుగుపొరుగువాళ్లు ఆమెను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షల అనంతరం వసంతమ్మ మెదడులో రక్తం గడ్డకట్టిందని, కాలుతో తన్నడంతో పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు.ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె మృతి చెందారు. వసంతమ్మ రెండో కుమారుడు జ్యోతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తొలుత దాడి కేసు నమోదుచేసి, ఆపై హత్య కేసుగా మార్చారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ధర్మవరంలో కూటమి నేతల బరితెగింపు, కరెంట్ తీగలతో..
సాక్షి, సత్యసాయి జిల్లా: మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు బయటపడ్డాయి. వైఎస్సార్ సీపీ నేత, ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్య కుట్ర భగ్నమైంది.కాంపౌండ్ వాల్ ఐరన్ డోర్‌కు విద్యుత్ తీగలు వేసిన టీడీపీ కూటమి నేతలు.. డోర్ తాకిన వెంటనే కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి చనిపోయేలా పన్నాగం పన్నారు. అయితే 33కేవీ విద్యుత్ తీగలకు బదులుగా.. ఫైబర్ కేబుల్‌కు కనెక్షన్ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. కామిరెడ్డిపల్లి పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. అక్కడితో ఆగకుండా బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో నిత్యం రద్దీగా ఉండే వైఎస్సార్, నెహ్రూ సర్కిళ్లతో పాటు ధర్మవరం బస్టాండ్ ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ గూండాలు మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే... కొడపగానిపల్లికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, హరిపై అకారణంగా కాళ్లతో, కర్రలతో విరుచుకు పడ్డారు. కొత్తచెరువుకు చెందిన టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్నట్లు బాధిత కార్యకర్తలు వాపోయారు. కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఈడిగ మారుతి రెండు రోజుల క్రితం సోషల మీడియాలో ఓ పోస్టును పెట్టారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దిన ప్రభుత్వ బడి ఫొటోతో పాటు ఇటీవల ‘బడి వైన్స్’ పేరుతో తిరుపతిలో ప్రారంభించిన మద్యం దుకాణం ఫొటోను జతపరుస్తూ పోస్టు చేశారు. ఇందులో తప్పిదం ఏమీ లేకపోయినా... సీఎం చంద్రబాబు మద్యం పాలసీని తప్పు బట్టారని, ఆ పోస్టును తొలగించకపోతే కేసు పెడతామని స్థానిక టీడీపీ నేత శివయ్య బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఇంత చిన్న విషయాన్ని రచ్చ చేయరాదని, కేసులు.. గీసులు ఏమీ వద్దని పోలీసులు నచ్చచెప్పారు. అదే సమయంలో ప్రశాంత మైన గ్రామంలో వర్గ కక్షలు ఉండరాదని భావించిన మారుతి కూడా ఆ పోస్టును తొలగించాడు. దీంతో అప్పటికి సమస్య సద్దుమణిగిందనుకున్నారు. అయినా కక్ష కట్టిన శివయ్య... మారుతి పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఆదివారం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఒత్తిళ్లను తాళలేక మారుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న కొడపగానిపల్లికి చెంది వైఎస్సార్సీపీ నాయకులు వినోద్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరి... కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మారుతీకి స్టేషన్ బెయిల్ ఇచ్చే విషయంగా పోలీసులతో చర్చించి ఆదివారం రాత్రి బయటకు వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు తన అనుచరులతో కలసి పథకం ప్రకారం కొత్తచెరువులోని ప్రధాన కూడళ్లలో వీధి లైట్లను ఆఫ్ చేయించి వినోద్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరిపై దాడికి తెగబడ్డారు. చెప్పులు, కర్రలు, ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరి అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరికి మూగ దెబ్బలయ్యాయి. ఘటనపై బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మారుతిని సోమవారం పోలీసులు వదిలేశారు. -
అనంతపురం: బీజేపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్త హత్య చేశాడు. బొమ్మనహాల్ మండలం చంద్రగిరిలో ఘటన జరిగింది. ఇంట్లో భోజనం చేస్తున్న కృష్ణమూర్తి శెట్టి (50) పై వేటకొడళ్లతో దాడి చేశాడు.స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టి చెల్లెలు పుష్పావతితో కలిసి ఉండేవాడు. రాత్రి ఆయన ఇంట్లో చెల్లెలితో కలిసి భోజనం చేస్తుండగా టీడీపీ కార్యకర్త వేటకొడవలితో చెయ్యి, వీపు, తలపై దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించి చెల్లెలు భయంతో బయటకు వచ్చి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.కొన ఊపిరితో ఉన్న క్రిష్ణమూర్తి శెట్టిని 108లో బళ్లారి విమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బొమ్మనహాళ్ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా మండలంలోని కురువల్లికి చెందిన ఓ వ్యక్తితో భూమి తగాదాలతోనే ఈ హత్యాయత్నం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. -
జగిత్యాల: కాంగ్రెస్ నేత గంగారెడ్డి దారుణ హత్య
సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. పాత కక్షలతోనే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పలుమార్లు సంతోష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా గంగారెడ్డి ఉన్నారు. ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా?: జీవన్‌రెడ్డి ఆగ్రహంజగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా? అంటూ పోలీసులపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల- ధర్మపురి రహదారిపై ఆయన బైఠాయించారు. బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని ఆరోపించారు.ఇదీ చదవండి: రూ.20 కోట్ల భూ కుంభకోణం -
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు. ఇజాయత్ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. శనివారం.. దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు ఇంజనీర్‌ను కదలకుండా పట్టుకోగా, మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పరారైనట్లు తెలుస్తోంది.వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య
సంగారెడ్డి: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నే మాణయ్య (45), ఇందిర దంపతులకు కూతురు సుకన్య ఉంది. ఏడాది కిందట సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మద్యానికి బానిసైన మాణయ్య ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి భార్య, కూతురితో గొడవకు దిగాడు. గొడ్డలితో బెదిరిస్తూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్య అడ్డుకున్నా వినలేదు. దీంతో మాణయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఇందిర భర్తను నరికి చంపింది.ఘటన విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకూతురు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం
సాక్షి, కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో దారుణం జరిగింది. రాములు అనే వ్యక్తిని గొడ్డలితో భార్య మంజుల, మృతుడి తండ్రి నారాయణ నరికి చంపారు. రాములును హత్య చేసి ఇంటి ప్రక్కనే ఉన్న మరో పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. ఆపై దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు.తన భర్త రాములు కనబడటం లేదని ఈ నెల 16న భార్య మంజుల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని బాన్సువాడ పోలీసులు వెలికితీశారు. తండ్రి నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
Vizag: రేవ్ పార్టీలో దారుణం.. మద్యం మత్తులో అమ్మాయి కోసం..
సాక్షి, విశాఖపట్నం: అచ్చుతపురంలో రేవ్ పార్టీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం నుంచి పార్టీ చేసుకోవడానికి కొంత మంది యువతీ యువకులు వచ్చారు. మద్యం మత్తులో అమ్మాయి కోసం జరిగిన గొడవలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని స్విమ్మింగ్ పూల్‌లో ముంచి స్నేహితులు హత్య చేశారు. మృతుడు సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది? -
పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, పల్నాడు జిల్లా: జంగమహేశ్వరం గ్రామంలో దారుణం జరిగింది. బరితెగించిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త కునిరెడ్డి కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు. జంగమహేశ్వపురం వైఎస్సార్సీపీ పార్టీలో కృష్ణారెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకుల కోసం మూడు స్పెషల్ టీంలను పోలీసులు రంగంలోకి దింపారు. -
ఈక్వెడార్ ఎన్నికల నేపధ్యంలో వరుస హత్యలు
క్విటో: త్వరలో జరగనున్న ఈక్వెడార్ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల వరుస హత్యలు అక్కడ సంచలనం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే సిటిజన్ రివొల్యూషన్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్షియా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా కాల్చి చంపబడ్డారు. ఆ సంఘటన మరువక ముందే అదే పార్టీకి చెందిన మరో నాయకుడు పెడ్రో బ్రయోన్స్ ను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు దుండగులు. పెడ్రో బ్రయోన్స్ ఎస్మెరాల్డాస్ ప్రావిన్సులోని కొలంబియా సరిహద్దు ఉద్యమంలో కీలక నాయకుడు. ఈ హత్య అనంతరం సిటిజన్ రివొల్యూషన్ పార్టీ మరో రాష్ట్రపతి అభ్యర్థి లూయిసా గొంజాలెజ్ బ్రయోన్స్ కు నివాళులు అర్పిస్తూ.. పెడ్రో బ్రయోన్స్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం ఈక్వెడార్‌లో రక్తం ఏరులై పారుతోందని చెబుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం నేర సామ్రాజ్యాన్ని విస్తరించిందని చెబుతూనే ఇదొక పనికిమాలిన ప్రభుత్వంగా ఆమె వర్ణించారు. ఆగస్టు 9న సిటిజన్ రివొల్యూషన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్న ఫెర్నాండో విల్లావిసెన్షియాను అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. క్విటో నగరంలో ఒకచోట ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తన వాహనంలోకి వెళ్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. చుట్టూ సెక్యూరిటీ వలయం ఉండగానే హత్య జరగడం విశేషం. అవినీతికి వ్యతిరేకంగా విల్లావిసెన్షియా తన స్వరాన్ని చట్టసభల్లో చాలా బలంగా వినిపించేవారు. ఇదే క్రమంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో విల్లావిసెన్షియా అధ్యక్షుడి రేసులో ముందువరసలో ఉన్నారు. కానీ ఎన్నికలు జరిగే లోపే ప్రత్యర్థి తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఎన్నికల తంతు ముగిసేలోపు ఇంకెన్ని హత్యలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. ఇది కూడా చదవండి: Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్‌ఫ్రెండ్.. ఏం చేశారంటే? -
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
-
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
సాక్షి, జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది. కిడ్నాపర్లు కొట్టి హత్య చేసి మృతదేహాన్ని జనగామ సమీపంలోని చంపక్ హిల్స్ క్వారీ గుంతలో పడేశారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ఐదుగురిని అందులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్య వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. కిడ్నాప్‌నకు గురైన బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది. రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్‌పై స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ.. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. జీపీ, తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కారు నుంచి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు. ఆయన ఈనెల 15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి క్రైం నంబర్ 105/2023, యూ/ఎస్.363 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీడీఓ సెల్‌ఫోన్ దారిలో పడిపోయింది. ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. చివరికి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. -
HYD: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ఓ పూజారి హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పూజారి సాయికృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇది వరకే అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కాగా, అప్సర అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సరూర్ నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకొని వచ్చిన సాయికృష్ణ.. శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి మ్యాన్ హోల్లో పడేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జీఐ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు పోలీసులు బయటపెట్టారు. నిందుతుడికి ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉందని, ఈనెల 3 తేదీన హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: హైదరాబాద్ యువతి హత్య కేసు.. అపార్ట్మెంట్లో ఆ రోజు ఏం జరిగింది? -
విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని..
అల్లిపురం (విశాఖ దక్షిణం): తనతో కాకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అక్కసుతో ప్రియురాలి ప్రాణం తీసిన హంతకుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన శనివారం విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. నగర శాంతిభద్రతల డీసీపీ విద్యాసాగరనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా, కొత్తవలస, కుమ్మరవీధికి చెందిన కోడి శ్రావణి (27) గాజువాక దరి తుంగ్లాంలో నివాసం ఉండేది. తర్వాత ఉపాధి నిమిత్తం విజయనగరం జిల్లా కొత్తవలసకు మకాం మార్చింది. అనంతరం ఆమెకు పెళ్లి జరగ్గా భర్తతో మనస్పర్థల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో ఒక గది అద్దెకు తీసుకుని జగదాంబ సమీపంలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తోంది. ఆమె గతంలో తుంగ్లాంలో ఉన్నప్పుడు పరిచయమైన పెయింటర్ శ్రీపెరంబూరు గోపాలకృష్ణ అలియాస్ గోపాల్‌ను ప్రేమించింది. ఈ క్రమంలో గోపాలకృష్ణ అతని స్నేహితుడు వడ్లపూడికి చెందిన రాగిణి వెంకటేష్ అలియాస్ వెంకీని శ్రావణికి పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త శ్రావణి, వెంకీ మధ్య ప్రేమగా మారింది. దీంతో తాను వెంకటేష్‌ను ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని గోపాలకృష్ణకు శ్రావణి చెప్పింది. వెంకటేష్‌ను శ్రావణి ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న గోపాలకృష్ణ.. వారిద్దరితో కలిసి శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆర్కే బీచ్‌కు చేరుకున్నాడు. అక్కడ వారిద్దరితో మాట్లాడిన తర్వాత.. శ్రావణితో వ్యక్తిగతంగా మాట్లాడాలని వెంకటేష్‌ను గోకుల్‌పార్కులో కూర్చోమని చెప్పి.. శ్రావణిని తీరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు గోపాలకృష్ణ తీసుకెళ్లాడు. కొంత సేపటికి గోపాలకృష్ణ ఒక్కడే వచ్చి మంచి నీరు తీసుకొస్తానని చెప్పి బైక్‌పై వెళ్లిపోయాడు. అనంతరం గోపాలకృష్ణ ఎప్పటికీ రాకపోవడంతో వెంకటేష్ అతని కోసం చూస్తున్నాడు. ఇంతలో గాజువాక పోలీసుల నుంచి వెంకటేష్‌కు ఫోన్ వచ్చింది. మీ స్నేహితుడు గోపాలకృష్ణ బీచ్‌లో ఎవరినో పీక నులిమి చంపేశానని చెబుతున్నాడని.. బీచ్‌లోకి వెళ్లి చూసి చెప్పమని పోలీసులు చెప్పారు. చదవండి: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ దీంతో తీరంలో వెతగ్గా ఒక చోట శ్రావణి చనిపోయి పడి ఉంది. విషయాన్ని వెంకటేష్ పోలీసులకు తెలియజేశాడు. దీంతో గాజువాక పోలీసులు మహారాణిపేట పోలీసులకు సమాచారం అందిచడంతో నైట్ రౌండ్స్‌లో ఉన్న క్రైం ఎస్ఐ నెమరంబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు నిందితుడు గోపాలకృష్ణ, అతని స్నేహితుడు వెంకటేష్ నుంచి వాగ్మూలం తీసుకున్న అనంతరం, మృతురాలి తల్లి కోడి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈస్ట్ ఏసీపీ రమణమూర్తి, మహారాణిపేట సీఐ బి.రమణమూర్తి పాల్గొన్నారు. -
చందానగర్: షాపులో ఉన్న భార్యను పరిగెత్తించి.. అతి కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్: కట్టుకున్న భార్యను రాయితో అతి కిరాతకంగా కొట్టి హత్య చేసిన ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబికా.. బొటిక్ షాపులో పని చేస్తోంది. శుక్రవారం ఉదయం షాప్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమె వద్దకు వచ్చిన భర్త నరేందర్.. తలపై బండరాయితో దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి గాయాలతో రోడ్డుపై పరిగెత్తిన అంబికను వెంబడించి మరి అతి కిరాతకంగా కత్తితో హత్య చేశాడు. గొడవలు కారణంగా భార్యాభర్తలు ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి.. -
యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్
కంచికచర్ల(ఎన్టీఆర్ జిల్లా): కంచికచర్లలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్య పట్టణంలో కలకలం రేపింది. నందిగామ రూరల్ సీఐ ఐవీ నాగేంద్రకుమార్ కథనం మేరకు వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన కుంచం రామారావు(47) తన భార్య పిల్లలతో కంచికచర్ల పెద్ద బజారులోని పోస్టాఫీసు రోడ్డులో అద్దెకుంటున్నాడు. రామారావు స్వగ్రామంలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య భార్గవి కంచికచర్ల మండలం మోగులూరు గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. వారికి సంతానం లేకపోవటంతో పదేళ్ల క్రితం రామారావు తమ్ముడు శ్రీను చిన్న కుమార్తె జోహారికను పెంచుకుంటున్నారు. ఐదేళ్ల తర్వాత భార్గవికి సుస్మిత అనే పాప పుట్టింది. రామారావు గతంలో జేసీబీ ఉండేది. దానిపై జుజ్జూరు గ్రామానికి చెందిన మోగులూరు ప్రవీణ్‌కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలోనే డ్రైవర్ ప్రవీణ్‌కుమార్ తన యజమాని రామారావు భార్య భార్గవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటినుంచి ప్రవీణ్‌కుమార్ తరచుగా రామారావు ఇంటికి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్ రామారావు ఇంటికి రాగా రామారావు అతడిని మందలించాడు. దీంతో రామారావు భార్య భార్గవి, ఆమె ప్రియుడు ప్రవీణ్, అతని స్నేహితులు మోగులూరు బుజ్జిబాబు, పులి సురేష్ కలసి రామారావుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. విషయం గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకుని వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3.35 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సీఐ నాగేంద్రకుమార్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రామారావు సోదరుడు కుంచం శ్రీను ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..' -
దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య
-
తల్పగిరిలో వ్యక్తి దారుణ హత్య కలకలం
-
‘నా లక్ష్మిని లోకంలో లేకుండా చేశాను’.. వీడియో రికార్డు చేసి.. చివరికి బిగ్ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): మహిళను రాయితో బాది హత్య చేసిన వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చామరాజనగర జిల్లా మలెమహదేశ్వరబెట్ట పరిధిలోని నాగమలెలో జరిగింది. తమిళనాడు పెన్నాగరం చెక్‌పోస్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న లక్ష్మి (35) తన భర్తతో విభేదించి నాగమలెకు చేరుకుంది. తమిళనాడు ధర్మపురి జిల్లా వీరభద్రయ్యనహళ్లికి చెందిన మునిరాజు (40)తో సంబంధం పెట్టుకుంది. ఏడు నెలల క్రితం నాగమలెకు చెందిన రమేశ్ అనే వ్యక్తిని లక్ష్మి రెండో వివాహం చేసుకుంది. మంగళవారం లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చిన మునిరాజు.. కోపంతో లక్ష్మి తలపై రాయితో బాది హత్య చేశాడు. అంతకుముందు కొన ఊపిరితో ఉన్న సమయంలో ఆమె వద్ద కూర్చొని వీడియో రికార్డు చేసి ఫేస్బుక్లో పెట్టాడు. ‘నా లక్ష్మిని నేను ఈ లోకంలో లేకుండా చేశాను.. నన్ను హంతకుడిగా మార్చింది’ అంటూ మునిరాజు వీడియోలో వ్యాఖ్యలు చేశాడు. అనంతరం బొమ్మ అనే వ్యక్తి పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని మునిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మి భర్త రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలెమహదేశ్వరబెట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి: కాల్ లీక్ ప్రకంపనలు.. ఆ ఆడియోలో ఏముంది? -
భర్తకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగింది?
నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా): మద్యం మహమ్మారి మరో కుటుంబాన్ని నిలువునా బలి చేసింది. రోజూ తాగి వచ్చి వేధించే భర్త తీరును భరించలేక ఓ మహిళ ఏకంగా అతడిని హత్య చేసింది. అందుకు తన సోదరుడి సాయం తీసుకుంది. నరసన్నపేట మండలం పెద్దకరగాంలో మంగళవా రం జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకరగాంకు చెందిన ఇర్రి చంద్రభూషణ్(37)కు పదేళ్ల కిందట తోటపాలేంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వీరికి మాధురి, లాస్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న చంద్రభూషణ్ తాగుడుకు బానిసైపోయాడు. ఇతర వ్యసనాలు కూడా ఉండడంతో నిత్యం భార్యను వేధించేవాడు. ఈ గొడవ గ్రామంలో పెద్ద మనుషుల వరకు కూడా వెళ్లింది. రచ్చబండలో సంప్రదింపులు జరిగా యి. అయినా చంద్రభూషణ్‌లో మార్పు రాలే దు. వారం కిందటే భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. దీంతో భాగలక్ష్మి తన కన్నవారింటికి వెళ్లిపోయింది. రెండు రోజుల కిందటే భర్త వద్దకు వచ్చింది. వచ్చిన రోజు రాత్రి మళ్లీ వివాదం జరిగింది. దీంతో పోలీసులను ఆశ్రయిస్తే వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటికీ చంద్రభూషణ్ మారలేదు. సోదరుడిని పిలిచి.. మంగళవారం కూడా తాగి ఇంటికి వచ్చిన చంద్రభూషణ్ మళ్లీ భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆమె తన సోదరుడు శివకు ఫోన్ చేసి ఇంటికి పిలిచారు. అతను వచ్చాక మద్యం మత్తులో ఉన్న చంద్రభూషణ్‌పై కర్రలు, మంచం కోళ్లతో దాడి చేసి విపరీతంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక చంద్రభూషణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే శివ పారిపోకుండా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సంఘటన తెలు సుకున్న నరసన్నపేట సీఐ డి.రాము, ఎస్ఐ సింహాచలంలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికుల నుంచి సేకరించారు. వీఆర్వో గవరయ్య, గ్రామ పెద్దమనుషుల మధ్య శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నరసన్నపేట ఎస్ఐ వై.సింహాచలం కేసు నమోదు చేయగా.. సీఐ రాము దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లికి ముందే ప్రేమ.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది -
షాకింగ్ ఘటన: ఐ ఫోన్ బుక్ చేసి.. ఎంత దారుణం చేశాడంటే..
యశవంతపుర(కర్ణాటక): ఆన్లైన్లో ఐ ఫోన్ బుక్ చేసిన యువకుడు డబ్బులు ఎగ్గొట్టాలని ఏకంగా డెలివరీ బాయ్‌ని హత్య చేసిన ఘటన హాసన్ జిల్లా అరసికెరెలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని లక్ష్మీపురకు చెందిన హేమంత్ దత్త (20) నిందితుడు. ఇతడు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ను బుక్ చేశాడు. డెలివరీ సమయంలో నగదు ఇచ్చే ఆప్షన్ పెట్టాడు. అరసికెరె తాలూకాకు చెందిన డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ (23) ఈ నెల 11న ఫోన్‌ను తీసుకుని దత్త ఇంటికి వెళ్లాడు. అతడు ఫోన్‌ను తీసుకుని, ఇప్పుడే డబ్బులు తీసుకొని వస్తానని బాయ్‌ను కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం హేమంత్‌దత్త వెనుక వైపు నుంచి వచ్చి నాయక్‌పై కత్తితో పొడిచాడు. బలమైన గాయాలై రక్తస్రావంతో కుప్పకూలి అక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంట్లోనే మూడురోజులు తరువాత మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి 14వ తేదీన గోనెసంచిలో శవాన్ని మూటగట్టి స్కూటర్‌పై తీసుకెళ్లి సమీపంలోని కొప్పలు రైల్వేగేట్ సమీపంలో పడేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు హేమంత్ నాయక్ కనిపించడం లేదని తల్లిదండ్రులు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రైల్వేగేటు వద్ద కాలిన శవం ఉందని తెలిసి పోలీసులు వెళ్లి పరిశీలించగా అది హేమంత్ నాయక్ మృతదేహంగా గుర్తించారు. నాయక్ మొబైల్‌కు వచ్చిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా వెంటనే హేమంత్‌దత్తను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నోరు విప్పాడు. కఠినంగా శిక్షించాలి పోలీసులు అతని ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా హేమంత్‌దత్త స్కూటర్‌పై బంక్ వద్దకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లిన దృశ్యాలను కనుగొన్నారు. హత్య చేసి, ఆపై సాక్ష్యాలను నాశనం చేయడానికి హేమంత్‌దత్త అన్ని ప్రయత్నాలు చేశాడని ఎస్పీ హరిరామ్ శంకర్ తెలిపారు. ఈ దురాగతం స్థానికంగా సంచలనం కలిగింది. ఇటువంటి హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. చదవండి: భార్యకు తెలియకుండానే విడాకులిచ్చిన భర్త.. డబ్బు కొట్టేయాలని ప్లాన్ -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి..
మైసూరు(కర్ణాటక): ఈ ఫోటోని చూస్తే ఎంతో అందమైన కుటుంబం అనిపిస్తుంది. కానీ అక్రమ సంబంధం రూపంలో విధికి కన్నుకుట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ప్రియునితో కలసి హత మార్చిందో కసాయి భార్య. ఈ ఘోరం మైసూరులో జరిగింది. హోటగళ్లి నివాసి మంజు (37) హత్యకు గురైన వ్యక్తి. గతంలో ప్రియునితో పరార్ మైసూరు బోగాది నివాసి లిఖితతో 12 ఏళ్ల క్రితం మంజుకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారి కొడుకులు ఉన్నారు. పెళ్లయినప్పటికీ, గతంలో ఆమె ప్రియునితో కలసి వెళ్లిపోయింది. అయితే పెద్దలు రాజీ పంచాయతీ చేసి మళ్లీ భర్తకు అప్పగించారు. భార్య ప్రవర్తనను భర్త మంజు తరచూ ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. తమకు అడ్డుగా ఉన్నాడని కక్షగట్టిన భార్య, ప్రియుడు కలిసి హత్యకు కుట్ర చేశారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మంజును ఇద్దరూ గొంతు పిసికి హత్య చేశారు. బుధవారం ఉదయం అనారోగ్యంతో చనిపోయాడని భార్య శోకాలు పెట్టింది. అయితే విషయం తెలిసిన విజయనగర పోలీసులు కేసు నమోదు చేసి లిఖిత ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: మూడేళ్లుగా రిలేషన్షిప్..చివరికి ప్రియురాలిని చంపి, పరుపులో కుక్కి.. -
షాకింగ్ ఘటన.. భార్య శీలాన్ని శంకించి..
రాయచూరు రూరల్(కర్ణాటక): భార్య శీలాన్ని శంకించి ఇద్దరు పిల్లలను హత్య చేసిన కిరాతక భర్త ఉదంతం రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... దేవదుర్గ తాలూకా జక్లేర్ దొడ్డిలో నింగప్ప (35), ప్రభావతి (30) దంపతులకు రాఘవేంద్ర (5), శివరాజ్ (3) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు. నింగప్ప భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రోజూ ఆమెతో గొడవపడేవాడు. శనివారం రాత్రి కూడా అలాగే రగడపడ్డాడు. పిల్లలిద్దరూ అక్రమ సంబంధంతో పుట్టినవారేనని మండిపడ్డాడు. తరువాత కె.ఇరబగేరలో అవ్వ ఇంట్లో పిల్లలను జక్లేర్ దొడ్డి శివార్లకు బైక్ మీద తీసుకొని వచ్చాడు. వారిద్దరినీ గొంతు నలిపి హత్య చేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం ఈ ఘోరం గురించి తెలిసి తల్లి, బంధువులు గుండెలవిసేలా విలపించారు. పసిబిడ్డలను పొట్టనబెట్టుకున్నాడని రోదించారు. తల్లి దేవదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నింగప్పను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఔషపూర్ గ్రామంలో వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న మౌలాన్-శాంతి కుటుంబం. భార్య శాంతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గత కొన్ని రోజులుగా పలుమార్లు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి, తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. భర్త సేవించే మందులో భార్య శాంతి, ప్రియుడు బాబు విషం కలిపారు. ఈ విషయం బయటకు రాకుండా తన భర్త కడునొప్పితో చనిపోయారని పోలీస్ స్టేషన్లో శాంతి ఫిర్యాదు చేసింది.. రంగంలోకి దిగిన పోలీసులు, మృతి చెందిన మౌలాన్ మృతదేహాని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ చూసి, హత్యగా అనుమానించిన పోలీసులు.. భార్య శాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి. శాంతి, ఆమె ప్రియుడు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు శాంతి ఒప్పుకుంది. చదవండి: క్షణికావేశం.. తమిళనాడులో దారుణం! -
షాకింగ్.. ప్రియుడి మోజులో పడి.. భార్య ఎంతపని చేసిందంటే..
ముసునూరు(ఏలూరు జిల్లా): ఇసుక తోలడానికి వెళ్ళిన వ్యక్తి అదృశ్యమవడం, అనంతరం హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. మండలంలోని యల్లాపురానికి చెందిన రాయనపాటి రాటాలు(కాశి)(36) జనవరి 3న తన వ్యానులో ఇసుక లోడు చేసి రమణక్కపేటలో విక్రయానికి వెళ్తున్నానని చెప్పాడు. తెల్లారినా ఇంటికి రాకపోవడంతో తండ్రి సత్యనారాయణ ముసునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానితులను విచారించగా.. అతనిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సమాచారం. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మృతుని భార్య ప్రియుడితో కలసి హత్య చేయించినట్లు వెల్లడైంది. అదృశ్యమైన రోజు రాత్రి రమణక్కపేట నుంచి తిరిగి వస్తున్న మృతుడు రాటాలును అతని భార్య, ప్రియుడు, మరో ముగ్గురు కలసి సూరేపల్లి మామిడి తోటలో హత్య చేసి, లోపూడి అడవిలో దహనం చేశారు. అనంతరం మళ్లీ వెళ్ళి చూడగా శవం పూర్తిగా కాలలేదని గుర్తించారు. దీంతో తన వ్యానులో వేసుకుని యల్లాపురం గ్రామంలోని తమ్మిలేరులో పాతిపెట్టినట్లు సమాచారం. చదవండి: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్లో.. -
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో వ్యక్తి దారుణహత్య
-
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే?
చిత్తూరు అర్బన్: భార్యను హత్య చేసిన కేసులో నగరికి చెందిన శరవణ (26)కు జీవితఖైదు విధిస్తూ చిత్తూరు ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి శాంతి గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.నిర్మల కథనం మేరకు.. చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలో ఉంటున్న పులివర్తి నాని ఇంట్లో నగరి ప్రాంతంలోని నెత్తంకు చెందిన శరవణ సెక్యూరిటీ, వాచ్మెన్ డ్యూటీ చేసేవాడు. 2017లో లక్ష్మీనగర్ కాలనీకు చెందిన సత్యను శరవణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బిడ్డ పుట్టి, అనారోగ్యంతో కొన్నాళ్లకే చనిపోయింది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న శరవణ నిత్యం ఆమెను హింసించేవాడు. 2019 జనవరిలో తన అక్క ఊరికి వెళదామని సత్యను తీసుకుని శరవణ పిచ్చాటూరు మండలం వెంగళత్తూరుకు వెళ్లాడు. జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అక్క ఇంట్లోని బాత్రూమ్లో సత్యను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. దీనిపై మృతురాలి తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిచ్చాటూరు పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను, కేసు దర్యాప్తు అధికారులను విచారించిన అనంతరం శరవణకు జీవితఖైదు, రూ.1500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...! -
పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి?
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని.. కన్న కూతురిని తండ్రే హత్య చేసినట్టు బయటపడింది. వివరాలు.. చంద్రగిరికి చెందిన మునిరాజ కుమార్తె మోహనకృష్ణ (19) తల్లి చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎగువరెడ్డివారిపల్లిలోని తన మేనమామ బాలకృష్ణ చూసుకుంటున్నారు. మోహన్‌కృష్ణ ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో నాగయ్యగారిపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వేరే కులం యువకుడిని ప్రేమించడాని జీర్ణించుకోలేకపోయిన తండ్రి.. కూతురిని హత్య చేశాడు. ఆపై కడుపునొప్పి తాళలేక మోహనకృష్ణ ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించాడు. పోలీసులకు కూడా ఆ విధంగానే ఫిర్యాదు చేశాడు. అయితే, పోస్టుమార్టంలో అమ్మాయిది హత్య అని తేలడంతో తండ్రి మునిరాజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: వద్దన్నా.. వినకుండా ఈవెంట్ బృందంతో వెళ్లి.. -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
గంగవరం(చిత్తూరు జిల్లా): పెద్దపంజాణి మండలం ఇటుక నెల్లూరు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన దామోదరం హత్య కేసులో నిందితులుగా ఉన్న మృతుడి భార్య అనూరాధ, ఆమె ప్రియుడు గంగరాజును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు నిర్ధారించారు. గురువారం గంగవరం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ గంగయ్య వివరాలను వెల్లడించారు. పుంగనూరు మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన దామోదర్‌కి, పెద్దపంజాణి మండలం పెనుగొలకలకి చెందిన అనురాధతో ఏడాది క్రితం వివాహమైంది. దామోదరం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు షాక్.. వాట్సాప్‌లో యువతి న్యూడ్ వీడియో కాల్చేసి.. వివాహ సమయంలో అనురాధాకు అత్తింటి వారే నగలు పెట్టి పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అనురాధకు నాగిరెడ్డిపల్లికి చెందిన గంగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. అతనికి ఇది వరకే కొత్తపల్లికి చెందిన మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం అనంతరం అనురాధ తన భర్తతో సక్రమంగా కాపురం చేసేది కాదు. కాగా అత్తింటివారు పెట్టిన నగలను కొన్ని నెలల తరువాత భర్తకు తెలియకుండా ప్రియుడి అవసరార్థం ఇచ్చింది. కొన్నాళ్ల తరువాత పుంగనూరు పట్టణంలో సైటు కొనేందుకు కొంత నగదు సరిపోకపోవడంతో నగలను ఇవ్వమని అనురాధను అడగడంతో పుట్టింటిలో ఉన్నాయంటూ తప్పించుకుంది. అలా అడిగిన ప్రతిసారి సరైన సమాధానం ఇచ్చేది కాదు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. ఈ దీపావళి పండుగ (ఈ నెల 24)న భార్య భర్తలిద్దురూ అత్తింటికి వెళ్లారు. పండుగ ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తాము వస్తున్న లొకేషన్ గురించి ప్రియుడికి తరచూ సెల్ఫోన్లో మెసేజీలు పెట్టుకుంటూ వచ్చింది. తరువాత తుర్లపల్లి గ్రామ సమీపంలో నాగలాకుంట చెరువు కట్టపై వెళ్లగానే గంగరాజు వాహనాన్ని ఆపాడు. దామోదరం కళ్లలో కారం కొట్టి తల, శరీర భాగాల్లో కత్తితో దాడి చేసి పారిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హతమార్చి నగలు దోచుకెళ్లారంటూ అనురాధ కథ అల్లింది. అందురూ నిజమనే అనుకున్నారు. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలిసులు హత్యకు వినియోగించిన కత్తి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్
గంగవరం(చిత్తూరు జిల్లా): మండలంలో రెండు రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొగుడే భార్యను రేషన్ కట్టర్‌తో కిరాతకంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. డీఎస్పీ గంగయ్య బుధవారం నిందితుడి అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. మండలంలోని మల్లేరు గ్రామానికి చెందిన యాదగిరికి అదేగ్రామానికి చెందిన రోజాకు 2019లో వివాహమైంది. రోజాకు పుట్టింటివారు కానుకగా ఇచ్చిన బంగారు నగలను ఆమెకు తెలియకుండానే యాదగిరి అమ్మేశాడు. చదవండి: మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు విషయం తెలుసుకున్న రోజా తన నగలను తెచ్చివ్వాలంటూ భర్తను నిలదీసేది. ఈ క్రమంలో భర్తతో పాటు, అతని తమ్ముడు చోళరాజు, అత్తమామలు ఆమెను వేధించేవారు. కొన్నాళ్ల తరువాత అత్తమామలతో గొడవ పడి తన భర్తతో కలిసి ఇంటి పక్క నే ఉన్న రేకుల ఇంటిలోకి మకాం మార్చింది. ఆదివారం ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవైంది. దీంతో ఆగ్రహించిన యాదగిరి మల్బరీ ఆకును కత్తిరించే పెద్ద కట్టర్‌ను తీసుకొచ్చి రోజా గొంతుపై బలంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే భార్య మెడలోని బంగారు తాళిబొట్టు, చెవి పోగులు తీసుకెళ్లి కోళ్లషెడ్డులో దాచాడు. తరువాత పక్కింటిలో ఉన్న తల్లిదండ్రులతో తన భార్యను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి నగలు దోచుకెళ్లారని కథ అల్లాడు. ఎస్ఐ సుధాకర్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది చేపట్టిన దర్యాప్తులో భర్తే అసలు దోషిగా నిర్ధారణైంది. నిందితుడు యాదగిరిని అదుపులోకి తీసుకుని, హత్యకు వినియోగించిన కట్టర్, బంగారు నగలు, సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. భర్త, అత్తమామలను కీలపట్లలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. -
షాకింగ్ ఘటన.. రెండో భార్యను లాడ్జికి తీసుకెళ్లి..
అఫ్జల్‌గంజ్(హైదరాబాద్): వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపిన మేరకు.. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌కు చెందిన పత్లావత్ రామకృష్ణ (31) నగరంలోని గచ్చిబౌలిలో పుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చదవండి: ప్రేమ పెళ్లి.. భార్యపై అనుమానం.. చివరికి ఊహించని ఘటన అతని రెండవ భార్య పత్లావత్ అరుణ అతని తమ్ముడితో కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం రావడంతో శనివారం గౌలిగూడలోని మణికంఠ లాడ్జికి తీసుకువచ్చి ఆదివారం ఆమెను హత్య చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమ పెళ్లి.. భార్యపై అనుమానం.. చివరికి ఊహించని ఘటన
సత్తెనపల్లి(పల్నాడు జిల్లా): మూడుముళ్ల బంధం.. అనుమానపు కత్తులకు ముక్కలైంది. ఏడడుగుల అనుబంధం.. అపోహల అగాథంలో చిక్కి విచ్చిన్నమైంది. క్షణికావేశం.. ఓ బాలిక బంగారు భవిష్యత్తును బలిపీఠం ఎక్కించింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అతి కిరాతకంగా ఆమెను హతమార్చిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తెనపల్లి ఒకటో వార్డు అచ్చంపేట రోడ్డుకు చెందిన పసుపులేటి విజయలక్ష్మి (40), నాగరాజు దంపతులు. వీరి కులాలు వేరైనా 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా.. నాగరాజు అబ్బూరు రోడ్డులోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ముఠా పనికి వెళ్తుండగా, భార్య విజయలక్ష్మి ఇంటి వద్దే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. కొంతకాలం వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు జన్మిచారు. కుమారుడు ఐదేళ్ల వయస్సులోనే మరణించాడు. కుమార్తె మీనాక్షి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. నాగరాజుకు భార్య విజయక్ష్మిపై ఐదేళ్ళ నుంచి అనుమానం ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. విభేదాలు తారాస్థాయికి చేరడంతో గతంలో నాగరాజు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుమార్తెను పెట్టుకొని విజయలక్ష్మి జీవించింది. కుమార్తె భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరూ కలిసి ఉండాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. అయితే మళ్లీ భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు నాలుగునెలలుగా వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన నాగరాజు ఇంట్లో పనులు చేసుకుంటున్న భార్య తలపై ఇనుప బద్దెతో గట్టిగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నాగరాజు పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్ సీఐ యు.శోభన్ బాబు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరి నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తల్లి విజయలక్ష్మి మృతి చెంది రక్తపు మడుగులో పడి ఉండటం, తండ్రి నాగరాజు పరారీ కావడంతో అమ్మా నాకు దిక్కెవరమ్మా.. ఒక్కసారి లేమ్మా అంటూ కుమార్తె మీనాక్షి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేస్తోంది. నాగరాజు సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయినట్లు తెలిసింది. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాకే
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ ఇల్లాలు. వివరాలను తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు. తాడిపత్రికి చెందిన అబ్దుల్ బాషా అలియాస్ అబ్దుల్ (34)కు ఆరేళ్ల క్రితం ఆయేషాతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్.. మద్యానికి బానిసై మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? ఈ క్రమంలో రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్య ఆయేషాతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అబ్దుల్... ఆయేషాతో గొడవపడి చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో విసుగెత్తిన ఆమె అర్ధరాత్రి 2 గంటలకు రోకలి బండతో నిద్రపోతున్న అబ్దుల్ తలపై మోది హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ.. పట్టపగలే దారుణం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మరో దారుణ హత్యతో విశాఖ నగరం ఉలిక్కిపడింది. గత కొన్ని రోజులుగా నగరంలో వరుస హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. పెందుర్తి ప్రాంతంలో హల్చల్ సృష్టించిన సైకో కిల్లర్ ఉదంతం మరువకముందే ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధి ఆదర్శనగర్‌లోని అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట బుధవారం సాయంత్రం 4 గంటలకు మరో హత్య జరగడం చర్చనీయాంశమైంది. చదవండి: మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు ఈ ఘటనలో బొడ్డు అనీల్‌కుమార్ (35) అనే రౌడీషీటర్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిగా మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక ప్రణాళిక ప్రకారం హతమార్చినట్లు గుర్తించారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ద్వారకా జోన్ ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. వాసుపల్లి శ్యామ్ ప్రకాష్ (34) అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అనీల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలి నుంచీ నేర చరిత్రే... బొడ్డు అనీల్‌కుమార్ తన కుటుంబంతో కలిసి అప్పుఘర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు సంతానం. భార్య ఎంవీపీ కాలనీలోని ఓ ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. అయితే అనీల్‌కు తొలి నుంచి నేరచర్రిత ఉంది. దొంగతనాలు, పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడు. చాలా కాలం భార్యభర్తలు కాకినాడలో నివాసమున్నారు. ఆ సమయంలో అనీల్‌పై కాకినాడ పోలీసులు రౌడీషిట్ కూడా తెరిచారు. దీంతోపాటు అక్కడ పలు గొడవల్లో అనీల్ నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం క్రితం అనీల్ విశాఖకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బరంపురంలోని ఓ సంస్థలో ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చిన అనీల్‌కుమార్ బుధవారం హత్యకు గురవ్వడం పట్ల వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గతంలో హత్యాయత్నం అనీల్‌తోపాటు ఈ హత్య కేసులో నిందితుడైన బాక్సర్ శ్యామ్‌కూ (శ్యామ్ ప్రకాష్) తొలి నుంచి నేరచరిత్ర ఉంది. శ్యామ్‌పై కూడా రౌడీïÙట్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిర్ధారించ లేదు. అయితే వీళ్లు ఇద్దరికీ తొలి నుంచి మనస్పర్థలు ఉన్నాయి. లోకల్ గ్యాంగ్ వార్‌తోపాటు ఒకరిపై ఒకరు హత్యా బెదిరింపులకు పాల్పడేవారు. ఈ క్రమంలో ఓసారి బాక్సర్ శ్యామ్ ఆదర్శనగర్ ప్రాంతంలోనే అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు. అనీల్ కళ్లల్లో కారం కొట్టి హతమార్చేందుకు యత్నించాడు. ఆ సమయంలో అనీల్ ఎదురు దాడికి దిగడంతోపాటు స్థానిక యువకులు అడ్డుకోవడంతో అనీల్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్‌ను చంపేస్తానని పలుసార్లు అనీల్ బెదిరించేవాడు. దీంతో ఇరువురి మధ్య పరిస్థితి గ్యాంగ్ వార్‌గా మారడంతో స్థానిక యువకులు ఇద్దరినీ కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేశారు. ఒకే ప్రాంతానికి చెందిన వారి మధ్య గొడవలు ఎందుకని సర్ది చెప్పారు. దీంతో ఇద్దరూ అయిష్టంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవద్దంటూ ఒప్పందం చేసుకున్నారు. హత్యకు పక్కా ప్రణాళిక ఇరువురి ఒప్పందం నేపథ్యంలో అనీల్, శ్యామ్ మధ్య కక్షలు కొన్ని రోజులుగా సద్దుమనిగాయి. అయితే అవకాశం కోసం ఎదురు చూసిన బాక్సర్ శ్యామ్‌కు బుధవారం మధ్యాహ్నం అనీల్ ఆదర్శనగర్‌లో ఓ వేడుక సందర్భంగా మద్యం సేవిస్తూ కనిపించాడు. దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని భావించిన బాక్సర్ శ్యామ్ అతని దగ్గరుకు వెళ్లి ‘‘మామా... నాకు ఏమైనా ఉందా..’’ అని అడగడంతో ఇద్దరూ కొంతసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో శ్యామ్ కోసం అనీల్ బీరు కూడా తెప్పించాడు. ఆ బీరు తాగిన అనంతరం అనీల్ కోసం ఆఫ్ బాటిల్ మద్యం తెప్పిస్తానని చెప్పిన శ్యామ్... వేరే యువకుడికి డబ్బులు ఫోన్ పే చేసి బాటిల్ తెప్పించాడు. పథకం ప్రకారం అది కూడా పూర్తిగా అనీల్‌తో తాగించాడు. అది పూర్తయిన అనంతరం మళ్లీ ఇరువురు చేరో క్వార్టర్ మద్యం తాగుదామంటూ బాక్స్ర్ శ్యామ్æ కోరడంతో అనీల్ సరేనన్నాడు. దీంతో ఇరువురు దగ్గరలోని అనుపమ బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చారు. ఇద్దరూ చెరో క్వార్టర్ తాగి బయటకొచ్చారు. ఈ క్రమంలో అదును కోసం ఎదురుచూస్తున్న బాక్సర్ శ్యామ్ ఒక్కసారిగా అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు. బీరు బాటిల్‌తో తలపై బలంగా కొట్టాడు. మద్యం మత్తలో ఉన్న అనీల్ తేరుకునే లోపే మరోసారి దాడికి పాల్పడ్డాడు. దీంతో అనీల్ కుప్పకూలిపోగా శ్యామ్ అతడిపైకి ఎక్కి తనతోపాటు తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా చాతీతోపాటు పలు చోట్ల పొడిచాడు. దీంతో అనీల్ శరీరంపై పదుల సంఖ్యలో కత్తిపోట్లు పడ్డాయి. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. స్థానికులంతా భయాందోళనకు గురై పారిపోయారు. అనీల్ అక్కడికక్కడే మృతి చెందగా వెంటనే బాక్సర్ శ్యామ్ అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి నిందితుడు శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆఫ్రికా నుంచి వచ్చిన భర్త.. ప్రియుడి మోజులో భార్య.. దూరంగా ఉండలేమని..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం ఓ మహిళ.. భర్తనే చంపేసింది. 18 ఏళ్ల వయసున్న ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి హత్య చేసింది. విశాఖలోని మధురవాడలో బుడుమూరు మురళి కుటుంబం నివాసం ఉంటుంది. మురళికి పదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మృదుల అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ దశలో ఉపాధి రీత్యా మురళి సౌత్ ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఇంటికి దూరంగా ఉంటున్న దశలో మృదులకు ఆమె నివాసం ఉంటున్న రిక్షా కాలనీలో శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. చదవండి: నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని పెళ్లి చేసుకొని.. వీరిద్దరి మధ్య ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరికి శంకర్‌కి 18 ఏళ్లు నిండాయి. భర్త లేకపోవడంతో మృదుల శంకరతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. ఈ విషయం తెలిసి ప్రశ్నించిన మురళిపై వేధింపుల కేసు కూడా పెట్టింది. ఈ దశలో సెలవుపై ఈనెల తొమ్మిదో తేదీన మురళి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. భార్య నడవడికపై తొలి దశ నుంచి మురళికి అనుమానం ఉండటంతో కుటుంబ సభ్యులకు తనకు ప్రాణహాని ఉందని చెప్పేవాడు. ఈనెల తొమ్మిదో తేదీన విశాఖ వచ్చిన మురళి 11వ తేదీన తల్లి వద్దకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ దశలో మృదుల 60 రోజుల పాటు భర్త మురళి విశాఖలో ఉంటారని తామిద్దరం కలిసే అవకాశం ఉండదని శంకర్‌తో చెప్పింది. అంత కాలం దూరంగా ఉండలేమని హత్య చేస్తే జీవితకాలం కలిసి ఉండొచ్చని శంకర్ మృదులకు చెప్పాడు. ఆ ప్రకారం వీరిద్దరూ ఇంట్లో నిద్రపోతున్న భర్తను చంపేయాలని నిర్ణయించారు. అలా భర్త నిద్రపోతుండగా కుక్కర్‌తో తలపై చితకబాదింది. ప్రియుడు శంకర్ సహకరించాడు. వీరిద్దరూ కలిసి ప్రాణం పోయేంత వరకు మురళిని తీవ్రంగా కొట్టారు. అనంతరం మృతదేహాన్ని మూటగట్టి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలస గడ్డలో స్కూటీపై వెళ్లి పడేశారు. రజకుల బట్టల మూటగా నమ్మించే రీతిన మృతదేహాన్ని దుప్పట్లో కట్టేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఓ రాత్రి ప్రియుడు మృదుల వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఇంటికి వస్తానన్న కొడుకు రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. ఆమె ప్రశ్నించడంతో భర్త మురళి కనిపించడం లేదని పీఎం పాలెం పోలీసులకు మృదుల ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది భర్త దూరంగా ఉండటంతో మృదుల వివాహేతర సంబంధం పెట్టుకుందని దీన్ని ప్రశ్నించగా తన కొడుకు పైనే కేసు పెట్టిందని మురళి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మురళిని అత్యంత దారుణంగా హతమార్చిన మృదుల, ప్రియుడు శంకర్లను ఉరితీయాలని కోరింది. సమాజం తలదించుకునే రీతిన వ్యవహరించిన వీరిద్దరికీ కఠిన శిక్ష పడే వరకు న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు. -
హిజ్రాలతో చీకటి ప్రదేశానికి వెళ్లిన వంటమాస్టర్.. చివరికి ట్విస్ట్
తిరువొత్తియూరు(తమిళనాడు): పుదుకొట్టై జిల్లాలో ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సంబంధించి ఐదుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుకొట్టై జిల్లా పొన్‌అమరావతి ఆలవాయిల్ ప్రాంతానికి చెందిన ధర్మలింగం (45) తుడియలూర్ బస్‌స్టాప్ సమీపంలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. 8వ తేదీ తీవ్రగాయాలతో కోవై ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో తొమ్మిదో తేదీ రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ ధర్మలింగం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో చొక్కలింగం కడుపుపై దాడిచేయడంతో మృతి చెందినట్లు తేలింది. దీంతో పెరియనాయకన్ పాలయం డీఎస్పీ రాజపాండియన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో హిజ్రాలు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. సంఘటన జరిగిన రోజున రాత్రి తుడియలూర్ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న హిజ్రాల్లో ఒకరు ధర్మలింగంను ఉల్లాసం కోసం చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాగ్వాదం జరగడంతో మరో నలుగురు హిజ్రాలు అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ధర్మలింగం చికి త్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు.. గౌండంపాళ్యం మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన హిజ్రాలు రషి్మక (26), అరునిక (24), గౌతమి (20), రూబి (26), మమత (22)ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్ చేసి మరీ...
నేటి యువత ప్రస్తుత టెక్నాలజీ మాయలో పడి తల్లిదండ్రుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం తల్లిదండ్రులుగా వారికి మందలించే హక్కు కూడా లేదనే చెప్పాలి. ఆస్తి కోసమో లేక వారికి నచ్చింది చేయడం లేదనో కన్న తల్లిదండ్రుల పైనే కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. మరికొంతమంది ప్రబుద్ధులైతే తల్లిదండ్రులనే కడతేర్చేందుకు రెడీ అయిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడోక దుర్మార్గుడు కన్నతల్లిదండ్రులను చంపి, సోదరికి ఫోన్ చేసి మరీ చెప్పాడు. వివరాల్లోకెళ్తే.... మహారాష్ట్రలోని థానే జిల్లాలోని టిట్వాలా ప్రాంతంలో 37 ఏళ్ల అన్మోల్ భోంస్లే తన కన్న తల్లిదండ్రలనే కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి మరీ విషయం చెప్పాడు. దీంతో అతని సోదరి హుటాహటినా ఇంటికి వచ్చి చూడగా...తల్లిదండ్రులిద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఇల్లంతా దుర్వాసన రావడమే కాకుండా అన్మోల్ కూడా ఆ మృతదేహాల పక్కనే కూర్చొని ఉన్నాడు. ఈ మేరకు ఆమె అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో దంపతులను కత్తితో పొడిచి చంపినట్లు తెలిసింని పోలీసులు చెప్పారు. మృతులు అశోక్ భోంస్లే (55), ఆయన భార్య విజయ భోంస్లే (50)గా గుర్తించామని తెలిపారు. (చదవండి: అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా) -
ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే?
కంచికచర్ల (నందిగామ): ఎన్టీఆర్ జిల్లా: తల్లి, పెద్దలు కలసి ఇష్టం లేని పెళ్లి చేశారనే నెపంతో, నిండు చూలాలైన భార్యను ఆమె భర్త హత్య చేసిన ఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నందిగామ రూరల్ సర్కిల్ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్ కథనం మేరకు. నందిగామ మండలం గోళ్లమూడి గ్రామానికి చెందిన పేరం భూలక్ష్మి (22)కి అదే గ్రామంలో నివసించే పేరం గోపీతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం భూలక్ష్మి ఎనిమిది నెలల గర్భంతో ఉంది. రెండో కాన్పు కావటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిద్దామని భూలక్ష్మితో కలిసి గోపి బుధవారం ఉదయం బైక్ బయలుదేరాడు. చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి.. విజయవాడ వెళ్లకుండా కంచికచర్లలోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ భోజనం చేసి రాత్రి సమయంలో తిరిగి గోళ్లమూడి వెళ్దామని బైక్‌పై బయలుదేరారు. కీసర దగ్గరలోని నేషనల్ హైవేపై ఎన్ఎస్పీ కెనాల్ సమీపంలోకి రాగానే భూలక్ష్మితో గొడవ పడి చీర, తాళిబొట్టు తాడుతో ఆమె మెడకు బలంగా ఉరి బిగించాడు. భూ లక్ష్మి స్పృహ కోల్పోవడంతో, 108కు ఫోన్ చేసి తన భార్యకు కడుపు నొప్పి వస్తోంది, వాంతులు, విరేచనాలు అవుతున్నాయి ఆస్పత్రికి తీసుకెళ్లాలని నమ్మబలికాడు. 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్య సిబ్బంది విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు. అదే 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసు కెళ్లగా, అప్పటికే ఆమె మృతిచెందింది. భూలక్ష్మి మృతదేహాన్ని గోళ్లమూడికి కాకుండా తన స్వగ్రామమైన ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి గోపీ తీసుకెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహం ముఖానికి పసుపు రాసి, మెడపై తెల్లటి వస్త్రం కట్టాడు. ఆ తర్వాత భూలక్ష్మి మృతిచెందిందని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారంతా చిలుకూరు వెళ్లి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ఆసమయంలో బంధువులు భూలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించగా మెడపై చీరెతో బిగించినట్లు కనిపించడంతో గోపీని నిలదీశారు. తానేమీ చేయలేదని అతడు నమ్మబలికాడు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. పోలీసుల వద్ద భూలక్ష్మిని తానే హత్య చేశానని గోపీ అంగీకరించాడు. ఇబ్రహీంపట్నం పోలీసులు కంచికచర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోపీని అదుపులోకి తీసుకుని మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
అమ్మాయి కోసం స్నేహితుల మధ్య గొడవ.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే?
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడి హత్యకు దారితీసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన గిలక దీపక్ ఆకాష్ (24) జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆకాష్, గోపీకృష్ణ అలియాస్ ప్రభ, మరికొందరు కలిసి నగరంలోని కళాశాలలో చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. ఆకాష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె పేరును తన పొట్టపై పుట్టుమచ్చ కూడా వేయించుకున్నాడు. చదవండి: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. నగదు, ఇంటి కాగితాలు తీసుకుని.. ఈ అమ్మాయి విషయంలో ఆకాష్, గోపీకృష్ణల మధ్య గత రెండేళ్లుగా ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన టోనీ అనే రౌడీషీటర్ మృతదేహాన్ని చూడడానికి మంగళవారం మధ్యాహ్నం ఆకాష్ తన ఏడుగురు స్నేహితులతో కలసి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. ఆస్పత్రి సమీపంలో ఉన్న మద్యం షాపులో ఆకాష్ మద్యం తాగుతుండగా, అదే ప్రాంతంలో మరో ఇద్దరు స్నేహితులతో కలసి అక్కడ ఉన్న గోపీకృష్ణ మరోసారి ఆకాష్‌తో గొడవ పడ్డాడు. నీ సంగతి చూస్తానంటూ గోపీకృష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మద్యం బాగా తాగి ఉన్న ఆకాష్‌ను అతని స్నేహితులు బైక్‌పై ఎక్కించుకుని గురునానక్ కాలనీలో ఉంటున్న మరో స్నేహితుని ఇంట్లో దించి వెళ్లిపోయారు. ఆ సంగతి తెలుసుకున్న గోపీకృష్ణ కొంతమంది స్నేహితులను వెంటబెట్టుకుని గదిలో నిద్రిస్తున్న ఆకాష్‌ను కత్తులతో పొడిచి చంపి పరారయ్యాడు. ఆకాష్ స్నేహితుడు వెంటనే అతనిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆకాష్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆకాష్ హత్యపై అతని తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ హత్యలో తొమ్మిది మంది పాల్గొన్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. వీరిలో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరంతా గుణదలకు చెందిన వారుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. హతుడి ఫోన్ డేటాను పరిశీలించిన అనంతరం గుంటూరు, ప్రకాశం జిల్లా టంగుటూరు, నెల్లూరు ప్రాంతాలకు వీరిని పంపి నిందితుల కోసం గాలిస్తున్నారు. హతుడు, నిందితులు కూడా మంగళవారం ఆత్మహత్య చేసుకున్న రౌడీషీటర్ టోనీ అనుచరులుగా పోలీసులు గుర్తించారు. కేసును విజయవాడ సెంట్రల్ జోన్ ఏసీపీ షేక్ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆకాష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఆంగ్లం చదవలేక ఆత్మహత్యాయత్నం
తుమకూరు: ఆంగ్లం చదవలేక 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. తుమకూరు తాలూకా ఉర్గిగెరె గ్రామానికి చెందిన అజయ్(12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదవుతున్నాడు. ఆంగ్లం కష్టంగా ఉందని, పాఠశాలకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అయితే తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి పాఠశాలకు పంపుతున్నారు. దిక్కుతోచని స్థితిలో బాలుడు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. విద్యార్థినిని చిదిమేసిన స్కూల్ బస్ బనశంకరి: ద్విచక్రవాహనాన్ని స్కూల్‌బస్ ఢీకొని విద్యార్థిని మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన బనశంకరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. నాయండహళ్లి నివాసి కీర్తన(16) తన అక్క హర్షితతో కలిసి కనకపుర వద్ద ఉన్న హారోహళ్లికి వెళ్లారు. గురువారం ఉదయం నాయండహళ్లికి వెళ్లేందుకు దేవెగౌడ పెట్రోల్ బంక్‌వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆలస్యమైందని భావించి స్నేహితుడు దర్శన్‌తో కలిసి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. కిత్తూరురాణిచెన్నమ్మ జంక్షన్ నుంచి కామాక్య వైపు వెళ్తుండగా పై వంతెన వద్ద ప్రైవేటు స్కూల్ బస్ ఢీకొంది. దీంతో ముగ్గురూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుకనుంచి వస్తున్న బస్సు కీర్తన తలపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కీర్తన ఎస్ఎస్ఎల్సీ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. హర్షితా ద్వితీయ పీయూసీ పరీక్ష రాసి ఫలితాలు కోసం వేచిచూస్తోందని బనశంకరి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. నీళ్ల ట్యాంకర్ ఢీకొని చిన్నారి.. బనశంకరి: వాటర్ ట్యాంకర్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హెచ్ఎస్ఆర్.లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్జాపుర రోడ్డులోని శ్వేతా రెసిడెన్సీ అపార్టుమెంట్ ఎదురుగా గురువారం వాటర్ ట్యాంకర్ నీటిని అన్లోడ్ చేసి రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనుక ఉన్న బాలికపై దూసుకెళ్లింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక పేరు ప్రతిష్టగా పోలీసులు గుర్తించారు. బాలికను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. హెచ్ఎస్ఆర్.లేఔట్ పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు) -
విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష!
మన దేశంలో ఎవరైన హత్యలు చేస్తే వారికి శిక్ష పడటానికి చాలా టైం పడుతుంది. ఆధారాలు, సాక్షాలు పక్కాగా ఉండి నేరం రుజువైతే గానీ నిందితుడికి శిక్ష పడదు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏ జంతువు దాడిలోనో మనిషి చనిపోతే పట్టించుకునే వాడే ఉండడు. మహా అయితే సదరు జంతువు యజమాని మంచివాడైతే నష్టపరిహారంగా ఎంతో కొంత ఇస్తేరేమో గానీ ఎక్కువ శాతం మంది తప్పించుకునేందుకే చూస్తారు. కానీ ఇక్కడొక ఆఫ్రికా దేశంలో ఒక జంతువు మనిషిని దాడి చేసి చంపినందుకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే...దక్షిణ సూడాన్‌లో రామ్ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై మరణించింది. ఈ ఘటన రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు రామ్ అనే గొర్రెని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కస్టమరీ కోర్టులో ప్రోడ్యూస్ చేశారు. ఈ మేరకు కోర్టు రామ్ అనే గొర్రె కి మూడేళ్లు జైలు శిక్ష విధిచింది. రామ్(గొర్రె) యజమాని డుయోని మాన్యాంగ్ బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. శిక్షలో భాగంగా రామ్(గొర్రె) లేక్స్ స్టేట్‌లోని సైనిక శిభిరంలో గడుపుతుందని తెలిపింది. అంతేకాదు శిక్ష ముగింపులో గొర్రెని యజమాని డుయోని కోల్పోయే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. అంటే దక్షిణ సూడాన్ చట్టాల ప్రకారం ఏదైన జంతువు దాడిలో వ్యక్తి చనిపోతే ఆ జంతువుని శిక్షా కాలం ముగింపులో బాధితుడు కుటుంబానికి పరిహారంగా ఇచ్చేస్తారు. ఈ మేరకు ఇరు వర్గాలు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు కూడా. ఇదిలా ఉండగా గొర్రెల దాడిలో వ్యక్తి మృతి చెందడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది కూడా అమెరికాలో ఓ మహిళ పొలంలో గొర్రెల దాడికి గురై మరణించింది. (చదవండి: సౌదీ ఏవియేషన్ చరిత్రలో తొలిసారి..) -
రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య
రాజేంద్రనగర్: సహజీవనం చేస్తున్న మహిళను రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఏమైందో తెలియదు కానీ కాబోయే భార్యకు ఫోన్ చేసి ‘తనను బాగానే అర్థం చేసుకున్నావని.. మంచిగానే చూసుకుంటున్నావని.. కానీ నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ ఫోన్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కడప జిల్లాకు చెందిన విజయ్‌కుమార్(40) కొండాపూర్ రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 15 ఏళ్ల క్రితం ప్రశాంతి అనే మహిళతో వివాహం జరిగింది. ఒక కుమారుడు పుట్టిన అనంతరం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వేరుగా ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం టపాచబుత్ర ప్రాంతానికి చెందిన మంజుప్రియతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఏడాదిగా విజయ్‌కుమార్, మంజుప్రియ సహజీవనం చేస్తున్నారు. ఉప్పర్‌పల్లిలోని కె.ఎన్.ఆర్ అపార్ట్మెంట్లో అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వివాహం చేసుకోవాలని మంజుప్రియ ఒత్తిడి తేవడంతో ఈ నెల 25న ఇరువురు పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన పత్రికలను సైతం బంధువులకు అందజేశారు. గత వారం విజయ్‌కుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయాడు. దీంతో మంజుప్రియ టపాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు ఆదివారం రాజేంద్రనగర్ పీఎస్‌కు కేసును బదులాయించారు. ఎస్సై శ్వేత ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం విజయ్‌కుమార్, మంజుప్రియ స్టేషన్‌కు వచ్చి తాము 25న వివాహం చేసుకుంటున్నామని కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో వారికి చట్ట ప్రకారం నోటీసు ఇచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం మంజుప్రియ పెళ్లి షాపింగ్ కోసం తన సోదరితో కలిసి బయటికి వెళ్లింది. విజయ్‌కుమార్ సైతం తాను కూడా కొద్దిసేపట్లో షాపింగ్‌కు వెళతానని చెప్పి ఇంట్లోనే ఉన్నాడు. రెండు గంటల తర్వాత మంజుప్రియకు ఫోన్ చేసిన విజయ్‌కుమార్ తనను బాగానే అర్థం చేసుకున్నావని, బాగానే చూసుకుంటున్నావని చెబుతూ తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన మంజుప్రియ అతడితో ఫోన్లో మాట్లాడుతూనే ఇంటికి బయలుదేరింది. కొద్ది దూరం రాగానే విజయ్‌కుమార్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. హుటాహుటిన ఇంటికి వచ్చిన మంజుప్రియ లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో స్థానికులు, రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే విజయ్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. దీంతో మంజుప్రియ తాను బతికి ఏమి ప్రయోజనం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఖైరతాబాద్ పట్టాల వద్ద ఉన్నట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విజయ్‌కుమార్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి సంబంధించి∙పూర్తి వివరాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు. మొదటి భార్యకు సంబంధించిన విడాకుల కేసు కోర్టులో ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివాహిత మహిళతో యువకుడి సహజీవనం.. కన్న కొడుకుని తీసుకెళ్లి..) -
సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి
నల్లకుంట: కర్కశంగా మారిన ఓ మహిళ తన సవతి కుమారుడిని గొంతు నులిమి హతమార్చింది.ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేసన్ పరిధిలో జరిగింది. సీఐ హబీబుల్లా తెలిపిన మేరకు.. భాస్కర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి గోల్నాకలో నివాసముంటున్నాడు. అతని కుమారుడు ఉజ్వల్ (7) రెండు వారాల క్రితం భవనంపై నుంచి కింద పడిపోగా గాయాలయ్యాయి. గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించగా కోలుకుని ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో శనివారం ఉజ్వల్‌ను సవితి తల్లి సరిత గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. బాలుడి మృతిపై అనుమానంతో శనివారం తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సరిత తన సవతి కుమారుడిని పథకం ప్రకారం హత్య చేసినట్టు విచారణలో తేలింది. రెండు వారాల క్రితం భవనంపై నుంచి తోసేసినా బతకడంతో గొంతునులిమి చంపినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రాణాలు తీసిన ఈత సరదా) -
వివాహేతర సంబంధం.. వాకిలి ఊడుస్తుండగా ఇంట్లోకి పిలిచి..
చావలి (వేమూరు)గుంటూరు జిల్లా: ప్రియుడి చేతిలో గ్రామ వలంటీర్ దారుణ హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా చావలి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చావలిలోని దళితవాడకు చెందిన దొప్పలపూడి శారద (25)కు అదే గ్రామానికి చెందిన మద్దా పద్మారావుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. శారద ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇంటి వాకిలి ఊడుస్తుండగా పద్మారావు ఆమెను ఇంట్లోకి పిలిచి కత్తితో మెడ కోశాడు. చదవండి: నువ్వే లేకుంటే నేనెందుకని.. అనంతరం అదే కత్తితో గుండె పైనుంచి పొట్ట భాగం వరకు చీరేశాడు. ఆమె పొట్టలోంచి పేగులు బయటకు రాగా.. శారద రెండు చేతులతో వాటిని పట్టుకుని అరుస్తూ రోడ్డుపైకి వచ్చి పడిపోయింది. స్థానికులు 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే సమయానికి శారద మృతి చెందినట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. హతురాలు చావలి గ్రామ సచివాలయం ఒకటో వార్డు వలంటీర్‌గా పని చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త ధర్మారావు ఇంట్లోలేని సమయంలో ఈ ఘటన జరిగిందని ఎస్ఐ తెలిపారు. పద్మారావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు. -
కన్నకొడుకుని హతమార్చిన 90 ఏళ్ల వృద్ధుడు
గుంతకల్లు: ‘ఎంత వరకు ఓపిక పట్టాలి. ఎంతగా నచ్చచెప్పినా మారలేదు. ప్రతిరోజూ నాకు నరకమే చూపాడు. నాకున్న ఆరుగురు కుమారుల్లో ఎవరూ ఇంతగా సతాయించలేదు. ఏం చేయమంటారు? మనశ్శాంతి కోసం వాడు చచ్చేదాకా ఇనుప రాడ్‌తో తలపై పలుమార్లు బలంగా బాదాను’ అంటూ పోలీసుల ఎదుట 90 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కుమారుడి వేధింపులు తాళలేక చివరకు హతమార్చాల్సి వచ్చిందంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తెలిపిన మేరకు.. మద్యానికి బానిసగా మారి.. గుంతకల్లులోని ఎస్ఎల్వీ థియేటర్ వెనుక ఉన్న యల్లమ్మ తగ్గు ప్రాంతంలో నివాసముంటున్న షేక్ జాఫర్‌సాహెబ్‌కు ఆరుగురు కుమారులు సంతానం. వీరిలో ఐదో కుమారుడు షేక్ ఖలీల్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాగుడుకు బానిసైన ఖలీల్ వేధింపులు తాళలేక మూడేళ్ల క్రితం అతని భార్య విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి విడిపోయింది. అప్పటి నుంచి తండ్రి వద్దనే ఖలీల్ ఉంటున్నాడు. ఎలాంటి పనీపాట లేకుండా మద్యం మత్తులోనే జోగుతుండేవాడు. వృద్ధాప్యంలో శరీరం సహకరించకపోయినా.. కూలి పనులతో కుటుంబ పోషణ భారాన్ని జాఫర్ సాహెబ్ మోస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ తండ్రిని ఖలీల్ వేధించేవాడు. డబ్బు లేదని చెబితే నడిరోడ్డుపై కేకలు వేస్తూ ఇరుగూపొరుగు వారితో గొడవకు దిగేవాడు. వేధింపులు తాళలేక.. మంగళవారం రంజాన్ పండుగను ఉన్నంతలో గొప్పగా చేయాలని తండ్రి భావించాడు. దాచుకున్న డబ్బు తీసి వంట సరుకులు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. తండ్రి చేతిలో డబ్బు చూసిన ఖలీల్ తనకు ఇవ్వాలని గొడవపడ్డాడు. ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. మాటలతో దూషించాడు. అసహాయుడైన వృద్ధుడిపై దాడి చేసేందుకూ వెనుకాడలేదు. దీంతో జాఫర్‌సాహెబ్‌లో ఓపిక నశించింది. ఇక కుమారుడు జీవించి ఉన్నంత కాలమూ తనకు మనశ్శాంతి ఉండదని భావించాడు. మధ్యాహ్నం నిద్రిస్తున్న కుమారుడిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. శరీరంలో శక్తినంతటినీ కూడదీసుకుని పలుమార్లు తలపై బలంగా మోదడంతో ఖలీల్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసు స్టేషన్‌కు చేరుకుని జరిగిన వృత్తాంతాన్ని పోలీసులకు జాఫర్‌సాహెబ్ వివరించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నర్సింగప్ప, రెండో పట్టణ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ నరేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడు తెలిపిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..) -
లెజండరీ ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి
అతనుయుద్ధం మొదలైన తొలిరోజే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చేసి గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసలు అందుకున్నాడు. వైమానిక దాడులతో రెచ్చిపోతున్న రష్యాకి దడ పుట్టేలా చేశాడు. ఎవరా పైలెట్ ఫైటర్ అని రష్యా బలగాల్లో ఒకటే ఉత్కంఠ. రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసి సుమారు 40 యుద్ధ విమానాలకు కూల్చేశాడు ఉక్రెయిన్‌లో ఘొస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే యుద్ధ వీరుడు. రష్యా బలగాలను మట్టికరింపించేలా చివరి శ్వాస వరకు పోరాడాడు. war hero dies in battle after shooting down 40 Russian aircraft: ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే 29 ఏళ్ల స్టెపాన్ తారాబల్కా అనే ఉక్రెనియన్ ఫైటర్ పైలెట్ గత నెలలో జరిగిన యుద్ధంలో మరణించాడని వైమానికదళ అధికారులు వెల్లడించారు. అతను మిగ్ 29 ఫైలెట్లో వెళ్తున్నప్పుడూ శత్రుదళాలు జరిపిన కాల్పులో మరణించాడని తెలిపారు. అతను యుద్ధం మొదలైన తొలరోజునే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చి వేశాడని చెప్పారు. దీంతో అతన్ని ఉక్రెనియన్లు గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసించారు. అంతేకాదు తారాబల్కా ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా యుద్ధంలో రహస్య ఆపరేషన్లు చేపట్టి దాడులు చేస్తుంటాడని తెలిపారు. అంతేకాదు యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చాడు. దీంతో రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసే ఒక భయంకరమైన వ్యక్తిగా మారాడు. తారాబాల్కకు మరణానంతరం యుద్ధంలో కనబర్చిన ధైర్యసాహసాలకు ఇచ్చే ఉక్రెయిన్ అత్యుత్తమ పతకం ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్, హీరో ఆఫ్ ఉక్రెయిన్ అనే బిరుదును అందించారు. అతనికి భార్య ఒలేనియా, ఎనిమిదేళ్ల కుమారుడు యారిక్ ఉన్నారు. తారాబల్కా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొరోలివ్కా అనే చిన్న గ్రామంలోని శ్రామిక కుటుంబంలో జన్మించారు. అతను చిన్నప్పుడూ తన గ్రామం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న ఫైటర్ జెట్లు పైలట్ కావాలనుకునేవాడు. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వం తారాబల్కా మరణం గురించి ఎలాంటి సమంచారం ఇవ్వదని తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. ఉక్రెయిన్ ధైర్య సాహసాలు ప్రంపంచానికి అవగతమయ్యేలా వీరోచితంగా పోరాడి గొప్ప వీర మరణం పొందాడు. తారాబల్కా మరణించినా అతని ధైర్య సాహసాలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. (చదవండి: రష్యా బలగాలు నాడు మా దాకా వచ్చాయి.. టైమ్ మ్యాగజైన్‌పై జెలెన్స్కీ) -
ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..
కాకినాడ రూరల్: రమణయ్యపేట గ్రామ పరిధి గైగోలుపాడు గంజావారి వీధికి చెందిన ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. సర్పవరం పోలీసుల కథనం ప్రకారం.. గైగోలుపాడుకు చెందిన సూరంపూడి దుర్గాప్రసాద్ బుధవారం వాసంశెట్టి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. గతంలో వీరి కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేవి. బుధవారం మధ్యాహ్నం దుర్గాప్రసాద్ భార్యకు నాగేశ్వరరావు ఏం చేస్తున్నావని వాయిస్ మెసేజ్ పెట్టడం హత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..? మెసేజ్ చూసిన దుర్గాప్రసాద్‌కు కోపం రావడంతో పాటు తన భార్యతో వివాహేతర సంబంధం ఉండవచ్చని అనుమానించి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఇనుప నీటి గొట్టంతో దాడి చేశాడు. తలపై బలమైన గాయాలవ్వడంతో నాగేశ్వరరావును స్థానికులు జీజీహెచ్‌లో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వదిన రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్.సురేష్‌బాబు తెలిపారు. కేసును సీఐ మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను హత్య చేసేందుకే...ఆ నవల రాసిందా?
Author goes on trial for her spouses Assassinate Case: కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. నిందితులు తాము చేయాలనుకునే నేరం కోసమే ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తారో లేక యాదృచ్చికంగా జరుగుతాయో తెలియదు. కానీ ఇక్కడొక రచయిత విషయంలో అలానే జరిగింది. వివరాల్లోకెళ్తే...నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ రొమాన్స్ కథల స్వీయ రచయిత. అయితే ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసుని ఎదుర్కొంటోంది. ఈ మేరకు నాన్సీ 2018లో అరెస్టు అయినప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. ఆమె భర్త సౌత్‌వెస్ట్ పోర్ట్‌ల్యాండ్‌లోని ఒరెగాన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్లో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్న సమయంలో హత్యకు గురైయ్యాడు. ఆయన్ని ఎవరో తపాకీతో కాల్చి చంపారు. అయితే ఆమె తన భర్త మృతి చెందడానికి కొన్ని వారాల ముందు హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ అనే పేరుతో ఒక నవల రాయడం గమనార్హం. తొలత ఆమె భర్త మరణం పోలీసులకు ఒక మిస్టరీ కేసుగా అనిపించింది. అయితే తదనంతర విచారణల నేపథ్యంలో ఆమె అసలైన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ట్రాఫిక్ కెమెరాల్లో ఆమె భర్త హత్య జరగడానికి ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. అయితే న్యాయమూర్తి సీనియర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ షాన్ ముల్ట్నోమా కౌంటీ సుమారు 10 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కోసం లాంటి దారుణానికి ఆమె ఒడిగట్టిందని అన్నారు.అంతేకాదు ఆమె అక్రమ సంపాదనతో చాలా లాభపడిందని కూడా అన్నారు. అయితే ఆమె గతంలో ఎలాంటి నేరారోపణలకు పాల్పడలేదన్నారు. ఈ మేరకు ఈ కేసు ఏడు వారాలపాటు విచారణ కొనసాగనుందని న్యాయమూర్తి తెలిపారు. (చదవండి: ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.. విలాసాల కోసం యూట్యూబ్ చూసి..) -
భార్యపై అనుమానం..చివరకు ఎంతపని చేశాడంటే..
కంబదూరు (అనంతపురం జిల్లా): అనుమానం పెనుభూతమై.. చివరకు ఇల్లాలిని బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని నాగలాపురానికి చెందిన బోయ వెంకటేశులు పదేళ్ల క్రితం భార్య వెంకటలక్ష్మమ్మ (40), పిల్లలు సౌమ్య, మంజునాథ్‌తో కలిసి కంబదూరుకు వలసవచ్చాడు. అద్దె ఇంటిలో ఉంటూ కూలి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. భార్యపై అనుమానాలు పెంచుకుని రోజూ మద్యం మత్తులో గొడవపడేవాడు. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. శనివారం ఉదయం భార్యతో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. మధ్యాహ్నం ఇంటిలో నిద్రిస్తున్న వెంకటలక్ష్మమ్మపై రోకలితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దాడి అనంతరం వెంకటేశులు పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రియల్ వ్యాపారి దారుణ హత్య: కళ్లల్లో కారం కొట్టి.. రాళ్లతో కొట్టి చంపి
యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా): రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నెలకొన్న పోటీ హత్యకు దారి తీసింది. బుధవారం స్థానిక గోశాలకు సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అచ్యుత ఆదినారాయణ (40)ను అదే వ్యాపారం చేసే కొంతమంది దాడి చేసి దారుణంగా హత్య చేశారు. వివరాలు.. ఆదినారాయణ తన అన్నదమ్ములతో కలిసి స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద స్టీల్ వ్యాపారం చేసుకుంటున్నాడు. యర్రగొండపాలెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంటున్న తరుణంలో అతడు స్థలాలను కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నాడు. ఇటీవల కాలంలో స్థానిక త్రిపురాంతకం రోడ్డులో కొంత స్థలం కొనుగోలు చేశాడు. చదవండి: బరితెగించిన హిజ్రాలు.. బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. అదే స్థలాన్ని రియల్ వ్యాపార ప్రత్యర్థులు కూడా కొనుగోలు చేయడంతో వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో స్థానిక మాచర్ల రోడ్డులో ఉన్న తన ప్లాట్ల వద్దకు మోటారు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆదినారాయణను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయతి్నంచారు. అప్పుడు తప్పించుకున్న ఆదినారాయణ నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గోశాలలో సభ్యుడైన ఆదినారాయణ అక్కడ జరుగుతున్న పనులను అప్పుడప్పుడూ వెళ్లి పర్యవేక్షిస్తుంటాడు. దీన్ని అదనుగా చేసుకొని ప్రత్యర్థులు కిరాయి గూండాలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది. ఆయన వెంట మోటారు బైక్‌పై మరో వస్త్ర వ్యాపారి నారాయణ సింగ్ కూడా ఉన్నాడు. ప్రత్యక్ష సాక్షి అయిన సింగ్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు తాను ఆదినారాయణ కలిసి గోశాల నుంచి మోటారు బైక్‌పై పట్టణంలోకి వస్తున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు మద్యం తాగి తూలుతున్నట్లు నటిస్తూ మోటారు బైక్‌కు అడ్డంగా వచ్చారని తెలిపాడు. తాము మోటారు బైక్ నిలిపిన వెంటనే వారు తమ కళ్లలో కారం చల్లి ఆదినారాయణను రాళ్లతో కొట్టారని, తనను లాగి పక్కకు నెట్టారని సింగ్ పోలీసులకు వివరించాడు. గతంలో కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తూ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వెంటనే మార్కాపురం డీఎస్పీ కిశోర్ కుమార్ హుటాహుటిన వచ్చి విచారణ చేపట్టారు. -
మాట్లాడుకుందామని భార్యను హోటల్ గదికి పిలిచి..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాట్లాడుకుందాం రమ్మంటూ నమ్మకంగా హోటల్‌కు పిలిచి భార్యను హత్య చేసిన ఘటన గవర్నర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్లకు చెందిన షారోన్ పరిమళకు 2015లో అదే మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల ప్రసాదరావుతో వివాహమైంది. కొంత కాలం వీరి దాంపత్యం సక్రమంగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ప్రసాద్‌రావు తరచూ ఆమెను అనుమానించడం, అక్రమ సంబంధాలు అంటకట్టడం, మానసికంగా, శారీరంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. చదవండి: తల్లి మరణించిందని తెలియక.. రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చిన బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టారు. తనను బాగా చూసుకుంటానని పెద్దలకు చెప్పి కాపురానికి తీసుకెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత యధావిధిగా వేధింపులు ప్రారంభించాడు. ఈ విషయమై షారోన్ పరిమళ గతేడాది అక్టోబర్ నెలలో కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు 498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆమె విజయవాడలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తోంది. ప్రసాద్‌రావు ఆ తర్వాత దుబాయి వెళ్లి ఈ ఏడాది జనవరిలో తిరిగి వచ్చాడు. హోటల్ గదిలో హత్య... ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తాము భార్యాభర్తలమని చెప్పి ప్రసాదరావు, షారోన్ పరిమళ విజయవాడ బస్టాండ్ సమీపంలోని అశోక హోటల్లో రూం తీసుకున్నారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో జ్యూస్ తేవడానికి అని చెప్పి ప్రసాదరావు బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ వెంటనే భార్యకు జ్యూస్ నచ్చలేదని చెప్పి అతను మళ్లీ బయటకు వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో హోటల్ రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న కె.సుధాకర్‌రెడ్డి ప్రసాదరావుకు ఫోన్ చేశాడు. వెంటనే వస్తానని ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి ఉదయం 5.30 గంటల సమయంలో వారు తీసుకున్న 402 నంబరు గదిలోకి వెళ్లాడు. బెడ్‌పై కప్పి ఉంచిన దుప్పటి తొలగించి చూడగా మెడపై గాయంతో మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే గవర్నర్‌పేట సీఐకు సమాచారం అందించారు. జ్యూస్ కోసమని చెప్పి వెళ్లిన ప్రసాదరావు అదే రోజు రాత్రి 3 గంటల ప్రాంతంలో కంచికచర్ల పోలీసుల ఎదుట లొంగిపోయారు. హోటల్లో తన భార్య షారోన్‌ను హత్య చేసినట్లు చెప్పడంతో వారు హోటల్‌కు, గవర్నర్ పేట పోలీసులకు సమాచారం అందించారు. రిసెప్షనిస్ట్ ఇచ్చిన ఫిర్యాదుపై గవర్నర్ పేట పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కేసు విషయం మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన... కంచికచర్ల: విజయవాడలోని హోటల్ గదిలో హత్యకు గురైన మహిళ బంధువులు, కుటుంబసభ్యులు కంచకచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని, అతడి తల్లిందడ్రులు కుటుంబసభ్యులను అరెస్ట్ చేసి, విచారిస్తున్నామని, ఆందోళన వద్దని పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. -
కోల్డ్ బ్లడెడ్ కిల్లర్: అతని టార్గెట్ ఒంటరి పురుషులే
Targeting sleeping homeless men: యూఎస్‌లో తుపాకీలతో దాడుల జరిపే కొంతమంది నేరస్తుల గురించి విన్నాం. జాతి వివక్షతతో దాడులు చేసేవాళ్లు కొందరైతే. మరికొందరూ మా దేశంలోకి ఎందుకు వచ్చారంటూ స్థానిక రౌడిలు కాల్పులు జరపడం చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒంటరిగా ఉన్న పురుషుల పైనే దాడి చేస్తాడంటా. పైగా వారిని హతమార్చేంత వరకు వదలడట. వివరాల్లోకెళ్తే...న్యూయార్క్ వాషింగ్టన్ డీసీలలో వరుస హత్యలు జరిగాయి. ఈ జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉన్న పురుషుల పైనే నిందితుడు దాడి చేశాడు. అతను ఇప్పటి వరకు ఐదుగురుని మట్టుబెట్టడు. పైగా గత రెండు రోజుల్లో చేసిన దాడిలో ఇద్దరూ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతను ఒంటరిగా ఉన్న పురుషులనే టార్గెట్ చేస్తున్నాడని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డీసీ వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్లు అనుమానం వ్యక్తం చేశారు. వారు ఆ నేరస్తుడిని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్‌గా వ్యవహరించారు. అలాగే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మేయర్లు జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉండే పురుషుల కోసం ఒక హెచ్చరిక జారీ చేశారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును విచారిస్తుంది. అంతేకాదు దర్యాప్తులో.. అతను నిరాశ్రయుల పైన దాడులు జరుపుతున్నాడని, తాజాగా మాన్‌హట్టన్‌లోని ట్రిబెకా ప్రాంతంలో 43 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చడాని వెల్లడించారు. పోలీసుల నిందుతుడి ఫోటోను కూడా విడుదల చేశారు. పైగా నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 19 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. Tonight, Washington, DC Mayor Muriel Bowser and @NYCMayor spoke about ongoing investigations by the @DCPoliceDept and the @NYPDnews. Following their conversation, Mayor Bowser and Mayor Adams released the following joint statement: https://t.co/MpcefoOowL pic.twitter.com/dbWmLxg1Tb — Mayor Muriel Bowser (@MayorBowser) March 14, 2022 (చదవండి: ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్స్!) -
తల్లి మందుల కోసం వచ్చి...రష్యన్ దళాల దాడిలో హతం
Ukrainian woman ventured To find medicines: ఉక్రెయిన్ పై దురాక్రమణ చేసే క్రమంలో రష్యా రోజుకో రకమైన యుద్ధ వ్యూహాంతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంది. గత 18 రోజులుగా ఉక్రెయిన్ పై నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. యుద్ధోన్మాదంతో అమాయాక పౌరులను, మహిళలు, చిన్నారులను పొట్టన పెట్టకుంది. రోజులు గడుస్తున్న కొద్ది యుద్ధం తీవ్రతరం మవుతుందే గానీ ఆగే సూచనలు ఏ మాత్రం కనిపించడంలేదు. ఆ క్రమంలో ఒక ప్రముఖ వైద్యురాలు అనారోగ్యంగా ఉన్న తన తల్లి కోసం బయటకు రావడమే ఆమె పాలిట మృత్యువుగా మారింది. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్)తో కలసి పనిచేసిన ప్రముఖ వైద్యురాలు వలేరియా మక్సేట్స్కా. నిజానికి 31 ఏళ్ల మక్సేట్స్కా ఆమె ఈ యుద్ధం మొదలైనప్పుడే వెళ్లిపోవాలి కానీ ఈ యుద్ధ సమయంలో గాయపడుతున్న వారికి సాయం చేసేందుకు ఆమె ఉండిపోయారు. ఎప్పుడైతే యుద్ధ తీవ్రతరమై ఆసుపత్రిలపై కూడా దాడి చేయడం మొదలైందో అప్పుడే తన తల్లి చికిత్స నిమిత్తం ఆమె దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. రష్యా బలగాలు ఆమె డోనెట్స్క్లోని షెల్లింగ్ పై దాడి చేసినప్పుడూ ఆమె తప్పించుకుని ఉక్రెయిన్ రాజధాని కైవకి వచ్చింది. కానీ ఇక్కడ ఆమె తప్పించుకోలేకపోయింది. 2014లో క్రిమియన్ ద్వీపకల్పంపై రష్యా దాడి చేసినప్పటి నుంచి ఆమె మానవతావాద ప్రతిస్పందనలో భాగంగా పనిచేశారని యూఎస్ఎయిడ్ అడ్మినిస్ట్రేటర్ సమంతా పవర్ అన్నారు. ఆమె తన తల్లి మందుల కోసం డ్రైవర్ తీసుకుని తల్లితో సహా కైవ్ సమీపంలోని వచ్చనిప్పుడు రష్యాన్ యుద్ధ ట్యాంకుల దాడిలో మరణించినట్లు ధృవీకరించారు. ఈ దాడిలో మక్సేట్స్కా, ఆమె తల్లి, డ్రైవర్ అక్కడికక్కడే మరణించారని తెలిపారు. (చదవండి: రష్యా రాక్షస విధ్వంసం..చిన్నారులు, మహిళల పై కాల్పుల మోత) -
తల్లి పాడు పని.. కూతురు మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి..
బద్వేలు అర్బన్(వైఎస్సార్ జిల్లా): తన వివాహేతర సంబంధం గురించి మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి సొంత కూతురినే ఓ తల్లి అంతమొందించింది. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన అప్పట్లో ఆత్మహత్యగా చిత్రీకరించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపి హత్య అని తేల్చారు. ఆదివారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చదవండి: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ ఎంట్రీతో రెండో పెళ్లికి రెడీ! బద్వేలు మండల పరిధి లోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన గానుగపెంట వెంకటయ్య, రమణమ్మల కుమార్తె వెంకటసుజాత. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదివింది. రమణమ్మ తమ గ్రామానికి చెందిన గానుగపెంట శ్రీను అలియాస్ శీనయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన వెంకటసుజాత తల్లిని మందలించింది. దీంతో రమణమ్మ కుమార్తెను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ప్రియుడు శ్రీను, సమీప బంధువైన ఆటోడ్రైవర్ మేకల మల్లెంకొండయ్యతో కలిసి పథకం పన్నింది. అందరూ కలిసి గత ఏడాది అక్టోబర్ 16వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న వెంకట సుజాత గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. తర్వాత మల్లెంకొండయ్యకు చెందిన ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడేసి వచ్చారు. తర్వాత సుజాత కనిపించడం లేదని, తండ్రి తాగుడుకు బానిస కావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అందరిని నమ్మించారు. పోలీసులకు అదే ప్రకారం ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత గ్రామ శివారులోని బావిలో సుజాత మృతదేహం లభ్యమైంది. అయితే తండ్రి ప్రవర్తన నచ్చక వెంకటసుజాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. అటు తర్వాత కేసును పకడ్బందీగా విచారించి మిస్టరీని ఛేదించారు. కేసు విచారణలో చురుగ్గా వ్యవహరించిన అర్బన్ సీఐ రామచంద్ర, ఎస్ఐ వెంకటరమణలను జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌లు అభినందించారు. -
సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..?
తాడేపల్లిగూడెం అర్బన్(పశ్చిమగోదావరి): భార్య ప్రవర్తనపై అనుమానంతో ఓ భర్త ఆమెను కడతేర్చాడు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలో కామిశెట్టి దేవరాజు అలియాస్ విగ్గురాజు, సుబ్బలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేయడంతో ఉద్యోగం చేసి వాటిని తీర్చేందుకు సుబ్బలక్ష్మి (38) కొన్నేళ్ల క్రితం దుబాయ్ వెళ్లింది. ఇటీవల దుబాయి నుంచి తిరిగొచ్చింది. కొద్ది రోజులుగా సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో భర్త విగ్గురాజు దీనిపై నిలదీశాడు. సుబ్బలక్ష్మి సరైన సమాధానం చెప్పకపోవడంతో కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు. చదవండి: నన్నే మోసం చేస్తావా.. ప్రియుడిని చితక్కొట్టిన యువతి.. చివరకు ఈ నేపధ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఇలాగే గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో విగ్గురాజు ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో భార్య సుబ్బలక్ష్మిపై దాడిచేసి విచక్షణా రహితంగా గుండె, కడపులోను పొడిచాడు. సుబ్బలక్ష్మి కేకలు వేయగా, సమీపంలో ఉన్న బంధువులు వచ్చి చూసేసరికి కిందపడి ఉంది. ఆమెను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బలక్ష్మి అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పట్టణ ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి ఎందుకు నాన్న.. సీన్ కట్ చేస్తే..
ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు జిల్లా): ఆస్తి కోసం కుమారుడే తండ్రిని హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా గోనెసంచిలో మృతదేహాన్ని మూటగట్టి ఎల్లెల్సీలో పడేశాడు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి, ఆ వివరాలను ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్ బుధవారం ఎమ్మిగనూరు సీఐ కార్యాలయ ఆవరణలో విలేకరులకు తెలిపారు. గోనెగండ్ల వద్ద ఎల్లెల్సీలో ఈ నెల 17వ తేదీన గోనెసంచిలో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. మృతుడి జేబులో ఉన్న బ్యాంకు పాస్‌బుక్ ఆధారంగా దేవనకొండ మండలం కూకటికొండ గ్రామానికి చెందిన గోపాల్(60)గా గుర్తించారు. మృతుడి చిన్న కుమారుడు నాగశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తును ప్రారంభించారు. ఆస్తి గొడవలు.. హత్యకు గురైన గోపాల్‌కు అతని పెద్దకుమారుడు బాలరంగడికి ఆస్తి విషయంలో గొడవలు ఉండేవి. గోపాల్ భార్య అనారోగ్యంతో 2017లో మృతి చెందింది. తాను రెండో పెళ్లి చేసుకుంటానని కుమారులకు గోపాల్ చెప్పేవాడు. తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కదని భావించి, ఈ వయస్సులో రెండో పెళ్లి ఎందుకు అంటూ తండ్రిని బాలరంగడు నిలదీసేవాడు. దీంతో గోపాల్ ఇంటి నుంచి మూడు నెలల కిత్రం కర్నూలు వెళ్లి, అక్కడే జీవనం సాగిస్తున్నాడు. కర్నూలులో ఉంటూ తనకు తెలిసిన దేవనకొండ మండలం సింగాపురం గ్రామానికి చెందిన ఈరన్నతో రెండో పెళ్లి సంబంధం చూడాలని తెలిపాడు. పత్తికొండలో తన పేరున ఉన్న రెండున్నర సెంట్ల స్థలాన్ని రూ. 13 లక్షలకు విక్రయించటానికి బేరం కుదుర్చుకొని, అడ్వాన్సు కింద రూ. 2 లక్షలు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు బాలరంగడు సింగాపురానికి వెళ్లి తన తండ్రికి రెండో సంబంధం చూడవద్దని, పెళ్లి చేసుకుంటే ఆస్తితో పాటు తమ పరువు పోతుందని ఈరన్నతో చెప్పాడు. పక్కా ప్రణాళిక ప్రకారమే.. తన మాట వినని తండ్రిని హతమార్చేందుకు బాలరంగడు పక్కా ప్రణాళిక రూపొందించాడు. హత్యచేస్తే రూ.1.50 లక్షలు ఇస్తానని ఈరన్నతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 14వ తేదీన గోపాల్‌కు ఫోన్ చేసి ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో అమ్మాయి ఉంది, సాయంత్రం వస్తే చూపిస్తానని ఈరన్న నమ్మబలికాడు. మోటారు సైకిల్ మీద గొల్ల గోపాల్‌ను ఈరన్న, మల్లికార్జున ఎక్కించుకొని గుడేకల్–సిరాలదొడ్డి గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర దిగువ కాలువ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న బాలరంగడు తండ్రితో వాదనకు దిగాడు. ముగ్గురూ కలసి గోపాల్ గొంతుకు లుంగీ బిగించి, పిడిబాకుతో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి కాలువలో పడేశారు. మృతదేహం 17వ తేదీన గోనెగండ్ల దగ్గర బయటపడింది. నిందితుల అరెస్ట్ అనుమానంతో బాలరంగడుని అదుపులో తీసుకొని పోలీసులు విచారించారు. తనతో పాటు మరో ఇద్దరు కలసి హత్య చేసినట్లు బాలరంగడు నేరం అంగీకరించాడు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు. నిందితుల నుంచి ఒక మోటార్ సైకిల్, పిడిబాకు, రూ.25 వేల నగదను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. హత్య కేసును ఛేదించిన ఎమ్మిగనూరు రూరల్ సీఐ మంజునాథ్, ఎస్ఐ సునీల్‌కుమార్, గోనెగండ్ల ఎస్ఐ సురేష్లను డీఎస్పీ అభినందించారు. రివార్డుకు ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. -
కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని..
జి.మాడుగుల(విశాఖ జిల్లా): నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని మద్యం మత్తులో ఓ యువకుడు కిరాతకంగా కొట్టి హత మార్చాడు. కూరతో కాకుండా రసంతో భోజనం పెట్టిందని గొడవకు దిగి గొడ్డలితో దాడి చేశారు. ఈ కిరాతక దుశ్చర్య జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ మారుమూల గ్రామమైన అడ్డులులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. చదవండి: రూ.లక్షల్లో బెట్టింగ్.. హార్స్ రేసుల్లాగా పావురాల రేస్.. ఇలా తీసుకొచ్చి.. చివరికి.. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రేగం రాజులమ్మ, రామన్న దొర దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమార్తె, పెద్ద కుమారుడికి వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు మత్స్యలింగం, అర్జులమ్మ, రామన్న దొర కలిసి ఓ ఇంటిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యలింగం పూటుగా మద్యం తాగి ఆదివారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. భోజనం పెట్టమని తల్లి అర్జులమ్మ (60)ను కోరాడు. రసంతో అన్నం పెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కూరతో భోజనం పెట్టలేదని కోపగించుకుని తల్లితో గొడవకు దిగి కొట్టాడు. అడ్డుకున్న తండ్రి రామన్న దొరను బెదిరించడంతో ఆయన గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద కొడుకు లక్ష్మణరావు ఇంటికి పరుగుతీశాడు. ఇంతలో మత్స్యలింగం గొడ్డలి వెనుక భాగంతో అర్జులమ్మ తలపై తీవ్రంగా కొట్టాడు. గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. పెద్దకొడుకు వద్దకు పారిపోయిన రామన్న సోమవారం ఇంటికి వెళ్లి చూసేసరికి రాజులమ్మ మృతిచెంది ఉంది. మత్స్యలింగం పరారయ్యాడు. రామన్నదొర సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
కట్టుకున్న భర్తను హతమార్చి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..
గిద్దలూరు(ప్రకాశం జిల్లా): కట్టుకున్న భర్తను తన భార్య హతమార్చిన సంఘటన గిద్దలూరు పట్టణంలోని ఏడో వార్డులో గల శ్రీరాంనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మేకల చిరంజీవి అలియాస్ అంజి(32) తన ఇంట్లోనే మృతి చెందాడు. అందిన సమాచారం ప్రకారం.. శ్రీరాంనగర్‌కు చెందిన అంజి పట్టణానికి చెందిన అంకాలమ్మను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదట ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. గత కొన్ని రోజులుగా భర్త అంజి మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. చదవండి: పెళ్లి చూపులు ఇష్టం లేక.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఆదివారం అర్ధరాత్రి దాటాక పూటుగా మద్యం సేవించిన అంజి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భర్త వేధింపులను తట్టుకోలేక అసహనానికి గురైన అంకాలమ్మ పక్కనే ఉన్న రోకలితో భర్తపై దాడి చేసింది. గాయాలతో పడిపోయిన భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించింది. అంజి శరీరం కాలిపోవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అంకాలమ్మ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్తను తానే హత్య చేశానని చెప్పినట్లు తెలిసింది. సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై స్థానికుల వద్ద ఆరాతీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అనుమానం పెనుభూతమై.. భార్యను చంపిన భర్త
బ్రహ్మంగారిమఠం(వైఎస్సార్ జిల్లా): అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. మండలంలోని పలుగురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లె ఎస్సీ కాలనీలో జరిగిన ఈ దారుణ సంఘటన వల్ల ఇద్దరు పిల్లు అనాథలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన జాలా వసుంధర (30) అక్కడే మినీ అంగన్వాడీలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈమెకు కల్సపాడు మండలం చెన్నారెడ్డిపల్లె నుంచి జౌకుపల్లెకు చెందిన ప్రభాకర్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభాకర్ భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. శనివారం తెల్లవారు జామున ఇంటిలో వసుంధర నిద్రిస్తుండగా రోకలిబడెతో తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే పడి మృతి చెందింది. ప్రభాకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బి.మఠం ఏఎస్ఐ మూర్తి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మైదుకూరు రూరల్ సీఐ నరేంద్రరెడ్డి, డీఎస్పీ విజయకుమార్ జౌకుపల్లె ఎస్సీకాలనీకి చేరుకొని మృతురాలి బంధువులను,ఇద్దరు పిల్లలను విచారించారు. వసుంధర తల్లి ఫిర్యాదు మేరకు భర్త ప్రభాకర్, మామ, ఇద్దరు మరదులపై బి.మఠం పోలీసులు కేసు నమోదు చేశారు. -
అప్పు ఇచ్చిన పాపానికి హత్య.. మృతదేహాన్ని పార్సిల్ చేసి..
చిత్తూరు: కష్టాల్లో ఉన్నాం.. కాస్త డబ్బు అప్పుగా ఇస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం.. అనగానే సహాయం చేసిన పాపానికి వ్యక్తిని హత్య చేసి భాకరాపేట ఘాట్‌రోడ్డులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప వివరాల మేరకు.. తిరుపతి ఎల్బీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్(54) తిరుపతి టూరిజం శాఖలోని ట్రాన్స్‌పోర్టులో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ వడ్డీ వ్యాపారం చేసేవాడు. తిరుపతికి చెందిన మధుబాబు, రాజు, మధురెడ్డిలకు వడ్డీకి కొంత నగదు ఇచ్చాడు. సరిగ్గా వడ్డీ చెల్లించకపోవడంతో వారిని నిలదీశాడు. ఈ క్రమంలో డిసెంబర్ 31న చంద్రశేఖర్‌కు మధుబాబు ఫోన్ చేసి డబ్బులిస్తానని పిలిచాడు. ఇంటి నుంచి వెళ్లిన చంద్రశేఖర్ ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎస్వీ యూనివర్శిటీలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రశేఖర్ సెల్‌ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులోని అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. డీఎస్పీ నరసప్ప, సీఐలు రవీంద్ర, శ్రీనివాసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మంగళవారం మృతదేహాన్ని గుర్తించారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. చంద్రశేఖర్‌కు ఫోన్ రాగానే తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని మధుబాబు గోడౌన్‌కు వెళ్లాడు. మధుబాబు తన వద్ద డబ్బులు లేవని, డబ్బు చెల్లించేవరకు తన భూమి దస్తావేజులు ఉంచుకోమని వాటిని అందజేశాడు. దస్తావేజులు పరిశీలిస్తున్న చంద్రశేఖర్‌ను వెనుక నుంచి మధురెడ్డి, రాజు రాడ్డుతో తలపై మోదారు. అనంతరం కేకలు వేయకుండా నోటికి గుడ్డను కట్టి, కాళ్లు చేతులను కట్టేసి దాడికి పాల్పడ్డారు. మృతి చెందాడని నిర్ధారించుకుని గోనె సంచిలో కుక్కి అట్టబాక్సులో ఉంచారు. తెలిసిన వారి కారు తీసుకుని డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం భాకరాపేట ఘాట్‌రోడ్డుకు చేరుకుని, లోయలో మృతదేహాన్ని పడేసి పారిపోయినట్లు డీఎస్పీ వెల్లడించారు. పరారీలో ఉన్న మధుబాబు, మధురెడ్డిల కోసం గాలిస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుడికి భార్య కస్తూరి, కుమారుడు రూపేష్, కుమార్తె లావణ్య ఉన్నారు. -
తగ్గిస్తే పోయేది.. కుదరదన్నాడు.. చివరికి ప్రాణమే పోయింది
ముంబై: సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని మన పెద్దలు చెప్తుంటారు. అంతెందుకు మనం బాధలో ఉన్నప్పుడు మధురమైన సంగీతం వింటే చాలు మనసు కాస్త కుదుట పడుతుంది. కాకపోతే ఎదైనా సరే సృతి మించకుండా ఉండాలి లేదంటే వాటి పరిణమాలు తీవ్రంగా ఉంటాయి. ఎంతటి మధురమైన సంగీతమైన సరే తగిన మోతాదులో సౌండ్ పెట్టుకుని వింటేనే ఓ అందం వినే వాళ్లకి ఆనందం. కానీ అదే సౌండ్ పెద్దగా పెడితే వినే వాళ్ల పరిస్థితి ఏమోగానీ పోరుగున ఉన్న వాళ్లకి చికాకు కలుగుతోంది. ఈ తరహాలోనే ఓ వ్యక్తి తన ఇంట్లో మ్యూజిక్ పెద్దగా పెట్టి.. చివరికి హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని అంబుజావాడి ప్రాంతంలో సురేంద్ర కుమార్ గున్నార్ అనే వ్యక్తి తన ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని వింటున్నాడు. కాకపోతే అదేదో చిన్నగా తనవరకు వినపడేలా కాకుండా పెద్దగా సౌండ్ పెట్టి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అంతలా శబ్ధం వస్తుండడంతో ఆ ఇంటి పక్కనే ఉన్న సైఫ్ అలీ చంద్‌కు కాస్త చికాకు కలిగింది. దీంతో అతను సురేంద్ర కుమార్ వద్దకు వెళ్లి సౌండ్ తగ్గించమని కోరాడు. అందుకు సురేంద్ర కూమార్ ససేమిరా అన్నాడు. అసలే చిరాకు, అందులో అతను సౌండ్ తగ్గించేందుకు అంగీకరించకపోవడంతో సైఫ్ అలీ సురేంద్రపై దాడి చేయడంతో అతను అక్కడే కుప్ప కూలిపోయాడు. కుటుంబ సభ్యులు సురేంద్ర కుమార్‌ను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సైఫ్ అలీని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి -
నిజామాబాద్: అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్య
డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం 44వ నంబర్ జాతీయ రహదారి నాగ్‌పూర్ గేటు వద్ద హీరో షోరూం పక్కనే ఉన్న గురునానక్ పం జాబీ గ్యారేజ్‌లో మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం గ్యారేజ్ ఓనర్ వచ్చి చూసే వరకు హత్యల విషయం తెలియరాలేదు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, అడిషనల్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుల్లో ఇద్దరు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా ఒకరు సంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చదవండి: కొండగట్టు అద్దె గదుల్లో వ్యభిచారం... ముగ్గురి అరెస్టు!! హత్యకు గురైన వారిలో హార్వెస్టర్ మెకానిక్ హర్పాల్సింగ్ (33), అతని బంధువుగా అనుమానిస్తున్న హార్వెస్టర్ డ్రైవర్ జోగిందర్‌సింగ్ (48)తో పాటు క్రేన్ డ్రైవర్‌గా పనిచేసే బానోత్ సునీల్ (బోజ్యానాయక్ తండా, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా) (22) ఉన్నారు. గ్యారేజ్ లోపల పడుకున్న హర్పాల్సింగ్, జోగిందర్ సింగ్‌ను గుర్తు తెలి యని దుండగులు ఆయుధంతో తలపై బలం గా కొట్టి హత్య చేశారు. ఆరు బయట నిద్రిస్తున్న సునీల్ ముఖంపై పదునైన ఆయుధంతో మూడుచోట్ల పొడిచి చంపారు. పోలీసులు జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను, క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీస్ డాగ్ హత్యా స్థలం నుంచి 44వ నంబర్ జాతీయ రహదారిపై కొంత దూరంలో ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్లి నిలిచిపోయింది. పక్కనే ఉన్న హీరో షోరూంలోని సీసీ టీవీ ఫుటేజీలను కమిషనర్ సుమారు మూడు గంటలపాటు పరిశీలించారు. వీలైనం త త్వర గా హంతకులను పట్టుకుంటామని సీపీ తెలిపారు. -
ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చిన మైనర్ కూతురు
-
వివాహేతర సంబంధం: పక్కా ప్లాన్.. ప్రియున్ని పిలిచి.. భర్త గొంతుకు టవల్ చుట్టి
ఓర్వకల్లు(కర్నూలు జిల్లా): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ప్రియుడి సాయంతో భర్తనే కడతేర్చిన భార్య ఉదంతం ఉయ్యాలవాడ గ్రామంలో చోటుచేసుకోంది. ఈ కేసుకు సంబంధించి నెల రోజులుగా పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హంతకులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. సీఐ శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన చెట్లమల్లాపురం రామయ్య(34)కు, వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామానికి చెందిన జయలక్ష్మితో 10 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.రామయ్య పండ్ల తోటల వ్యాపారం చేస్తుంటాడు. భార్య ఊళ్లోనే కూలీ పనులకు వెళ్తూ ఉంటుంది.(చదవండి: లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను చంపిన వృద్ధుడు) జయలక్ష్మి రెండేళ్ల నుంచి గ్రామంలోని మహ్మద్ ఖైజర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను మందలించేవాడు. దీంతో భర్త రామయ్యను అంతమొందించాలని ప్రియుడితో కలసి పథకం రచించింది. సెప్టెంబర్ 13వ తేదీ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో మహ్మద్ ఖైజర్ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. మంచంపై నిద్రిస్తున్న రామయ్య గొంతుకు టవల్ చుట్టి అదిమిపట్టగా, జయలక్ష్మి కాళ్లు కదలించకుండా అదిమిపట్టుకుంది. దీంతో ఊపిరాడక రామయ్య ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఖైజర్ తన బొలేరో వాహనంలో తడకనపల్లె వద్దకు తీసుకువెళ్లి హంద్రీనీవా కాల్వలో పడేశాడు. 14వ తేదీ ఉదయం జయలక్ష్మి ఏమీ ఎరుగనట్లు తన భర్త జడ్చర్లకు వెళ్లి తిరిగి రాలేదని ఓర్వకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జయలక్ష్మి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా వివాహేతర సంబంధం బయటపడింది. జయలక్ష్మి, ఆమె ప్రియుడు ఖైజర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు. ఓర్వకల్లు, నాగలాపురం ఎస్ఐలు మల్లికార్జున, ఫైమ నిందితులను అదుపులోకి తీసుకొని కర్నూలు రూరల్ సీఐ శ్రీనా«థ్‌రెడ్డి సమక్షంలో అరెస్టు చేయగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. హత్యకు గురైన రామయ్య మృతదేహం కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టనున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): డబ్బు విషయంగా గొడవపడి కట్టుకున్న భర్తనే భార్య హతమార్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన మాధవరెడ్డి (61)కి 35 ఏళ్ల క్రితం చిన్నయక్కలూరుకు చెందిన కాంతమ్మతో వివాహమైంది. రెండేళ్లుగా డబ్బు విషయంగా వీరి మధ్యలో మనస్పర్థలు తలెత్తాయి. బుధవారం ఉదయం డబ్బు కోసం ఒకరినొకరు దూషించుకున్నారు. (చదవండి: పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..) ఆ సమయంలో ఇంటిలో ఉన్న రోకలిబండ తీసుకుని భర్తను చితకబాదింది. కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకునే లోపు తలకు తీవ్ర గాయమై రక్తమోడుతూ మాధవరెడ్డి కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతన్ని తాడిపత్రిలోని సీహెచ్‌సీకి, అక్కడి నుంచి అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి అతను మృతి చెందాడు. ఘటనపై తాడిపత్రి రూరల్ సీఐ మల్లికార్జున గుప్త కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: కోతి చేసిన పని.. ఓ వ్యక్తి ప్రాణం పోయింది -
పెళ్లైన నెలకే మెడ కోసి..
నిజాంపేట్(హైదరాబాద్)/కామారెడ్డి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే సైకోగా మారాడు. పెళ్లి తర్వాత భార్యపై అనుమానం పెంచు కున్నాడు. మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై తానూ మెడ, చేతులపై కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీ స్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన సుధారాణి.. అదే జిల్లా శివయ్యపల్లి గ్రామానికి చెందిన ఎర్రోల కిరణ్‌కుమార్ ఏడెనిమిది నెలలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల 27న వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అత్తారింటికి వస్తే భర్త అనుమానాలతో ఆమె ఆందోళనకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బంధువులతో కలసి మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. కిరణ్‌కుమార్ సాప్ట్వేర్ ఉద్యోగి కావడంతో ప్రగతినగర్‌లోని శ్రీసాయిద్వారకా అపార్ట్మెంట్లో ఫ్లా ట్ తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం హై దరాబాద్ రావాలని కిరణ్ కుటుంబం నుంచి సుధారాణి తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది. రక్తం మడుగులో సుధారాణి... సుధారాణి తల్లిదండ్రులు శనివారం మధ్యా హ్నం 3:30 గంటల సమయంలో ప్రగతినగర్ కు వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టినా, ఇద్దరికీ ఫోన్లు చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బెడ్రూమ్ తలుపు పగులగొట్టారు. సుధారాణి రక్తం మడుగులో చనిపోయి ఉండగా, కిరణ్‌కుమార్ కొన ఊపిరితో ఉన్నాడు. పోలీసులు వెంటనే కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు కోసే కత్తితో సుధారాణి గొంతు, కాళ్లు, చేతులను కోశాడు. అపార్ట్మెంట్లోకి 2 వారాల క్రితమే వచ్చారని, అప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదని చుట్టుపక్కల వారు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో సుధారాణిని హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిరణ్‌కుమార్ మెడ, చేతులపై కత్తితో కోసుకోవడంతో అధిక రక్తస్త్రావం అయ్యిం దని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అతను స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందన్నారు. బంధువుల ఆందోళన భర్త, అత్తమామలే సుధారాణిని హతమార్చారని ఆగ్రహంతో ఆమె బంధువులు కామారెడ్డి శ్రీరాంనగర్ కాలనీలోని కిరణ్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. -
తాగిన మైకంలో పసికందును బలిచేసిన భార్యాభర్తలు
-
భార్యపై అనుమానం.. చివరికి ఏం చేశాడంటే..?
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): భర్త చేతిలో భార్య హతమైన సంఘటన స్థానిక శివాజీనగర్‌లో చోటుచేసుకుంది. టూటౌన్ సీఐ నరసింహులు, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు..శివాజీనగర్‌కు చెందిన లోకేష్ ఇంటింటికీ వాటర్ క్యాన్లు సరఫరా చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య గాయిత్రి(30) ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె నిషిత ఉంది. గాయిత్రి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకునితో చనువుగా ఉంటోదని తెలుసుకున్న లోకేష్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అతను ఇంటికి వచ్చేవేళకు ఆమె మరో వ్యక్తితో మాట్లాడటం చూసి గొడవపడ్డాడు. ఇది తారస్థాయికి చేరడంతో కత్తితో ఆమెను పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టూటౌన్ సీఐ, ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య -
చిన్నారి హత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది : కేటీఆర్
-
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య..
సాక్షి,తూర్పుగోదావరి : భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి చివరికి ఒకరి హత్యకు దారితీశాయి. తాళ్లరేవు మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)ను అతని భార్య దేవి గొడ్డలితో నరికి చంపడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన అప్పారావుతో ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన దేవి అలియాస్ భవానీకి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి పదేళ్ల కుమార్తె ఆదిలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమారుడు రాము ఉన్నారు. అప్పారావుకు దేవి మేనత్త కూతురు. కొన్నినెలలుగా వేరే కాపురం పెట్టమంటూ భర్తను అడుగుతోంది. అప్పారావు ఒకడే కుమారుడు కావడం తల్లి, చెల్లి బాధ్యత తనపై ఉండడంతో దానికి ససేమిరా అనేవాడు. దీంతో తరచూ గొడవలు పడేవారు. గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిన దేవిని గ్రామ పెద్దలు ఒప్పించడంతో వారం రోజుల క్రితం ఇంటికి వచ్చింది. రొయ్యల కంపెనీలో పనిచేసే అప్పారావును అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించారని, అప్పుల భారం అధికంగా ఉండడంతో భార్యను ఉద్యోగానికి వెళ్లాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఆదివారం ఉదయం తల్లి సత్యవతి, చెల్లి దుర్గాదేవి రొయ్యల పరిశ్రమలో పనికి వెళ్లిన అనంతరం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అప్పారావు హత్యకు గురయ్యాడు. పిల్లలు లేచి చూసేసరికి తండ్రి నెత్తుటి మడుగులో ఉండడం, తల్లి కనిపించకపోవడంతో బయటకు పరుగులు తీశారు. అప్పారావు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఉదయం 11 గంటల ప్రాంతంలో కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరంగి ఎస్సై ఎస్.రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ డీఎస్పీ వి.భీమారావు, కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ నిద్రలో ఉన్న అప్పారావు తలను దేవి గొడ్డలితో ఘోరంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. నిందితురాలు దేవి పరారీలో ఉందని ఆమెపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: పరుగులు తీసి.. ప్రాణం కాపాడి.. -
ఆదుకుంటాడని సాదుకున్న కొడుకే .. ఎంత పనిచేశాడు
హత్నూర (సంగారెడ్డి): పెంచి పెద్దచేసిన కొడుకే మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని మంగాపూర్‌లో చోటు చేసుకుంది. మంగాపూర్ గ్రామానికి చెందిన కొండని ఎల్లమ్మ-ఎల్లయ్య దంపతులకు సంతానం లేకపోవడంతో ఓ బాలుడిని తెచ్చుకుని పెంచుకున్నా రు. కొంతకాలానికి ఎల్లయ్య మరణించగా, పెంచిన కొడుకు మహేందర్‌తో కలిసి ఎల్లమ్మ (63) కూలి పనులకు వెళ్తోంది. ఇదిలా ఉండగా, తన పేరిట ఉన్న 11 గుంటల భూమిని అమ్మగా వచ్చిన డబ్బును ఎల్లమ్మ బ్యాంకులో వేసింది. ఆ డబ్బు కోసం మహేందర్ తల్లిని తరచూ వేధిస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి డబ్బు విషయమై తల్లితో ఘర్షణ పడ్డాడు. తాగిన మైకంలో కట్టెతో ఎల్లమ్మ మొహం, తలపై గట్టిగా బాదడంతో తీవ్ర గాయాలపాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయినప్పటికీ ఏం ఎరగనట్టు తెల్లవారుజామున ఇరుగుపొరుగు వారిని పిలిచి, ‘అమ్మ ఎంత పిలిచినా పలకడం లేదు’అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. మహేందర్ మాటలను విశ్వసించని స్థానికులు అతనిపై దాడి చేయడంతో మహేందర్ తలకు గాయంకాగా, చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కాళ్లు మొక్కినా కనికరించలే..! వరుసబెట్టి ముగ్గురిని..!
సాక్షి, వరంగల్: డబ్బుల కోసం విచక్షణ కోల్పోయిన ఓ తమ్ముడు.. సొంత అన్న కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ‘మా వాళ్లను చంపకండి బాబాయ్... మీకెన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాం. వదిలేయండి ప్లీజ్’అంటూ అన్న కూతురు కాళ్ల మీద పడి వేడుకున్నా వినలేదు. నిమిషాల వ్యవధిలో అన్న చాంద్‌పాషా(50), వదిన సాబీరా(42), బావమరిది ఖలీల్ (40)ని అంతమొందించాడు. ఈ దారుణ ఘటన వరంగల్‌లో కలకలం రేపింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... వరంగల్‌లోని ఎల్బీనగర్కు చెందిన చాంద్‌పాషాకు షఫీతోపాటు మరో సోదరుడు ఉన్నాడు. చాంద్‌పాషా, షఫీలు పరకాల కేంద్రంగా 20 ఏళ్లుగా పశువులు, గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వ్యాపారంలో లెక్కలు చూసుకుంటే రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఈ లెక్కల వ్యవహారాలు షఫీ చూస్తున్నందున వచ్చిన నష్టంలో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్‌పాషా భరించాలని నిర్ణయించుకున్నారు. తనకు పెద్ద మొత్తంలో కావాలనే అప్పుగా ఇచ్చారని, కట్టలేనని షఫీ మొండికేయడంతో వ్యాపారం చేసేందుకు చాంద్‌పాషా ఒప్పుకోలేదు. దీంతో షఫీ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎల్బీనగర్లో రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్‌పాషా ఏడాది క్రితం నూతన గృహాన్ని నిర్మించాడు. తనకు అప్పులు వేసి, అన్న డబ్బులు దాచుకొని కొత్త ఇల్లు కట్టుకున్నాడని షఫీ పలుమార్లు స్నేహితులు, బంధువుల వద్ద వాపోయాడు. అప్పులతో ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని అన్నా వదినలను బతిమిలాడినా పట్టించుకోకపోవడంతో కుటుంబాన్ని మట్టుబెట్టాడు. స్నేహితుల సాయంతో.. పథకం ప్రకారం షఫీ స్నేహితులతో కలసి అర్ధరాత్రి వర కు మద్యం సేవించాడు. ఇంటి తలుపులను కోసేందుకు ఎలక్ట్రిక్ రంపంతోపాటు వారిని నరికేందుకు పదునైన వేట కొడవళ్లు, కత్తులను తీసుకొని ఆటోలో బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అన్న ఇంటికి చేరుకున్నాడు. రంపంతో తలుపులను సగం వరకు కోశాడు. ముగ్గురు ఇంటి బయట పరిసరాలను గమనిస్తుండగా.. షఫీతోపాటు మిగిలినవాళ్లు లోపలికి వెళ్లారు. అలికిడికి నిద్ర లేచిన చాంద్‌పాషా ఎవరు, ఎవరు అంటూ రాగా.. అంతలోనే షఫీ రంపంతో చాతిభాగంలో కోశాడు. ఆ తరువాత పదునైన కత్తితో తలపై నరకడంతోపాటు శరీరంపై పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. అడ్డుకోబోయిన చాంద్‌పాషా బావమరిది ఖలీల్‌ను కత్తులతో విచక్షణరహితంగా దాడి చేసి చంపేశాడు. తర్వాత వదిన సాబీరానూ విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. వేరే గదిలో ఉన్న చాంద్‌పాషా కుమార్తె రూబీనా(23) బయటకు వచ్చి బాబాయ్.. అమ్మా, నాన్నలను ఏం చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. అడ్డువచ్చిన చాంద్‌పాషా కుమారులు ఫహాద్ (28), సమద్ (21)లను కొడవలితో పొడవడంతో వారు రక్తస్రావమై కిందపడిపోయారు. తర్వాత 2.35 గంటల ప్రాంతం లో స్నేహితులతో కలిసి షఫీ ఆటోలో తిరిగి వెళ్లిపోయాడు. పైన అద్దెకున్నవారు కిందకు వచ్చే ప్రయత్నం చేయగా... అడ్డొస్తే చంపుతానని బెదిరించారు. కాళ్లు మొక్కినా కనికరించలేదు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చప్పుడు వచ్చింది. అంతలోనే మా నాన్న ఎవరు.. ఎవరు అంటుండగానే బాబాయ్ రంపం, కత్తులతో నాన్నపై దాడి చేశాడు. తర్వాత మామ ఖలీల్‌ను నరికేశాడు. ఇది గమనించిన మా అమ్మ సాబీరా రెండేళ్ల నా బిడ్డను పట్టుకుని బాత్రూమ్లోకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆమెనూ వదల్లేదు. నా పాపను నా చేతిలో పెట్టి మా తల్లిని సైతం కిరాతంగా హతమార్చాడు. బాబాయ్ డబ్బులు మొత్తం నాన్నతో ఇప్పిస్తా వదిలేయ్ బాబాయ్ అని కాళ్లు మొక్కినా వినలేదు. వాడిని చంపేయండి వదిలిపెట్టొద్దు. – మృతుడి కుమార్తె రూబీనా వర్షం రాకుంటే..ఇంటికి వచ్చేటోడు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చాంద్‌పాషా బావమరిది సయ్యద్ ఖలీల్ వర్షం రాకపోతే ప్రాణాలతో బయటపడేవాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన ఖలీల్ హన్మకొండలోని ఓ మొబైల్‌షాపులో సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ ఇంటినుంచి హన్మకొండకు బైక్‌పై వెళ్లి వస్తుంటాడు. ఆలస్యమైనప్పుడు వరంగల్‌లోని తన అక్క ఇంటికి వెళ్లేవాడు. కేసముద్రంలో నూతనంగా మొబైల్‌షాపు పెట్టాలని నిర్ణయించుకున్న ఖలీల్ ఆగస్టు 31న తన జాబ్‌కు రాజీనామా చేశాడు. వర్షం వస్తుండటంతో అక్క ఇంటికెళ్లాడు. బావను చంపేందుకు వచ్చిన షఫీని అడ్డుకోబోయిన ఖలీల్ కూడా హత్యకు గురయ్యాడు. వర్షం రావడంతో ఖలీల్ అక్క ఇంటికెళ్లాడని, లేకుంటే ఇంటికి వచ్చేవాడని స్థానికులు చెప్పారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి... షఫీ వెళ్లిపోగానే ఆ ఇంట్లో అద్దెకున్న అజీమ్ కిందకు వచ్చి కార్పొరేటర్ పుర్కాన్కు సమాచారమివ్వగా ఆయన అక్కడికొచ్చారు. 3.40 గంటల ప్రాంతంలో డయల్ 100కు కాల్ చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న సమద్, ఫహాద్‌లను అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 4.05 గంటల ప్రాంతంలో నైట్ పెట్రోలింగ్‌లో ఉన్న మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ ఘటనాస్థలికి రాగా, తర్వాత వరంగల్ ఏసీపీ కె.గిరిధర్, పోలీసు కమిషనర్ తరుణ్ జోషి వచ్చారు. నిందితులు ఇంటిబయట ఓ సంచిలో వదిలిపెట్టిన కత్తులను, రంపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల సహాయంతోపాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా షఫీతోపాటు మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. రూబీనా ఫిర్యాదుమేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, షఫీపై 2010లో మట్టెవాడ ఠాణాలో అక్రమ ఆయుధాల సరఫరా కేసు నమోదైంది. దాడి ఘటనలో వరంగల్, పరకాల, నర్సంపేట ప్రాంతాలకు చెందిన షఫీ దగ్గరి మిత్రులు పాలుపంచుకున్నట్లు సమాచారం. -
ప్రియుడి ఘాతుకం: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య
యశవంతపుర(కర్ణాటక): పెళ్లి చేసుకోనని చెప్పిన యువతిని నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన ఘటన బెంగళూరు కెంగేరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. దొడ్డబెలె రోడ్డు నివాసి అనిత (23) అనే యువతి ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. సహొద్యోగి వెంకటేశ్ మూడేళ్ల నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. వెంకటేశ్‌తో పెళ్లికి అనిత కుటుంబీకులు తిరస్కరించారు. అనిత కూడా అదే మాట చెప్పడంతో వెంకటేశ్ పగ పెంచుకున్నాడు. సోమవారం ఉదయం 7.15 గంటలప్పుడు అనిత దొడ్డబెలె రోడ్డులో నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్తుండగా వెంకటేశ్ అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అనితను స్థానికులు తక్షణం బీజీఎస్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్థారించినట్లు పశ్చిమ డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు. వెంకటేశ్ ఇటీవల మార్కెట్‌కు వెళ్లి రూ. 80 పెట్టి పదునైన కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజరాజేశ్వరి ఆస్పత్రిలో అనిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇవీ చదవండి: బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి నవ వధువును కిడ్నాప్ చేసిన టీడీపీ నేత -
మూడెకరాల కోసం నాలుగు హత్యలు
రాయచూరు రూరల్: కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో భూ వివాదం నలుగురి హత్యకు దారితీసింది. మూడు ఎకరాల కోసం ఈ ఘోరం జరిగింది. వివరాలు... భాగల్కోటె జిల్లా జమఖండి తాలూకా మధురఖండిలో రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదం ఉంది. ధార్వాడ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పొలంలో ఉన్న అన్నదమ్ములు హన్మంతు (48), మల్లప్ప (44), ఈశ్వర్ (40) బసవరాజ్ (36)లను వరుసకు బంధువులైన పుటాణి కుటుంబ సభ్యులు మారణాయుధాలతో హతమర్చారు. కోర్టు తీర్పు ఆలస్యం అవుతుండటంతో శనివారం రాత్రి కాపుగాచి నలుగురిని కిరాతకంగా చంపేశారు. దీంతో జమఖండి పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Karnataka: బాలికతో అసభ్య ప్రవర్తన.. నడిరోడ్డుపై -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
షాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. షాబాద్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేశవగూడకు చెందిన పామెన మాణిక్యరావు(35)కు పన్నెండేళ్ల క్రితం షాబాద్‌కు చెందిన శోభారాణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. షాబాద్‌కు చెందిన యాదయ్యతో శోభారాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త మాణిక్యరావు దీనికి అడ్డుగా ఉన్నాడని, అతన్ని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న తనకు ఛాతిలో నొప్పిగా ఉందని శోభారాణి తన భర్తతో కలిసి షాద్‌నగర్ ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో చూపించుకుని అక్కడి నుంచి ఆటోలో మామిడిపల్లికి వచ్చారు. ఆటో దిగి ఇద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ షాబాద్‌కు వస్తున్నారు. అప్పటికే శోభారాణి తన ప్రియుడు యాదయ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ముందస్తు పథకం ప్రకారమే యాదయ్య బైక్‌పై మామిడిపల్లి శివారుకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి చున్నీ తీసుకుని మాణిక్యరావు మెడకు బిగించి హత్య చేశారు. అప్పటికే సాయంత్రం 7గంటలు కావడంతో శవాన్ని పొదల్లో వేశారు. మరుసటి రోజు యాదయ్య తన స్నేహితులైన వినోద్, శ్రీశైలం సాయంతో ఓ కారు తీసుకుని వెళ్లి శవాన్ని డిక్కీలో వేసుకుని శ్రీశైలం హైవేలో గల అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని లోయలో పడేశారు. ఆతర్వాత ఇంటికి వచ్చిన శోభారాణి ఏమీ తెలియనట్లు మీ కొడుకు కనిపించడం లేదని మామ అనంతయ్యకు చెప్పింది. ఆయన ఈ నెల 24న షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శోభారాణి కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆదివారం నిందితురాలు శోభారాణితో పాటు ఆమె ప్రియుడు యాదయ్య, వినోద్, శ్రీశైలంను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. -
మూడు రోజుల్లో అత్తింటికి రావాల్సి ఉండగా.. దారుణం
సాక్షి,పశ్చిమగోదావరి: మరికొద్ది నెలల్లో వారసుడి కేరింతలతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఆర్తనాదాలు మిన్నంటాయి. ఐదో నెల గర్భిణి అయిన తమ కోడలు దారుణ హత్యకు గురైందని తెలిసిన అత్తమామలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పండంటి బిడ్డకోసం ఎదురుచూసిన భర్త గుండెలవిసేలా రోదించాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తల్లి, కుమార్తె దారుణహత్యకు గురైన వార్త గణపవరంలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన లక్ష్మీప్రత్యూష (31)ను గణపవరానికి చెందిన రిటైర్డ్ ఆడిటర్ మానాప్రగఢ రాంబాబు కుమారుడు సాయి తేజస్వికి ఇచ్చి ఈ ఏడాది జనవరిలో వివాహం చేశారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తేజస్వి కోవిడ్ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఇంటి వద్ద నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భార్య లక్ష్మీప్రత్యూషకు తొలి ఆషాఢమాసం కావడంతో గతనెల రెండో వారంలో సత్తెనపల్లి పుట్టింటికి వెళ్లింది. శ్రావణమాసం రావడంతో తేజస్వి వారం క్రితం సత్తెనపల్లి అత్తవారింటికి వెళ్లి సంప్రదాయ ప్రకారం కొబ్బరికాయలు కొట్టి రెండు రోజులు ఉండి వచ్చాడు. లక్ష్మీప్రత్యూషను వచ్చేనెల 1న గణపవరం తీసుకువెళతామని చెప్పాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. శనివారం వరుసకు అన్న అయిన వ్యక్తి లక్ష్మీప్రత్యూషను ఆమె తల్లి పద్మావతిని సత్తెనపల్లిలో కత్తితో పొడిచి హతమార్చాడు. మరో మూడు రోజుల్లో కోడలు వస్తుందన్న ఆనందంలో ఉన్న భర్త, అత్తమామలకు విషయం తెలిసి కుప్పకూలిపోయారు. హుటాహుటిన సత్తెనపల్లి బయలుదేరారు. దీంతో రాంబాబు బంధువులు, సన్నిహితులతో పాటు గణపవరంలో తీవ్ర విషాదం నెలకొంది. చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -
రాహుల్ హత్య కేసులో మరో నలుగురు నిందితుల అరెస్ట్
-
22 రోజులుగా ఫ్రీజర్‌లో కుమారుడి మృతదేహాం.. చివరకు..
లక్నో: మరణించిన కుమారుడి మృతదేహన్ని అంత్యక్రియలు జరపకుండా 22 రోజులుగా తన ఇంట్లోని ఫ్రీజర్‌లో ఉంచాడు ఓ తండ్రి. కూమారుడు హత్య చేయబడ్డాడని ఆరోపిస్తూ ఆయన న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించడానికి తండ్రి నిరాకరించాడు. దీంతో అధికారులు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివాంక్ పాఠక్ 2012 నుంచి ఢిల్లీలోని కాల్ సెంటర్లో పని చేస్తున్నాడు. అక్కడ తనకు గుర్లీన్ కౌర్ అనే యువతి పరిచయమైంది. వీళ్లూ ఇద్దరూ 2013 లో వివాహాం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న శివాంక్ ఆగస్ట్ 1న అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మృతదేహానికి ఢిల్లీలో పోస్ట్‌మార్టం నిర్వహించి పోలీసులు అతడి తండ్రికి అప్పగించారు. అయితే అతని తండ్రి కూమరుడు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. శివాంక్ పాఠక్ పేరు మీద భారీ ఆస్తి ఉన్నందున, అతని భార్య ఆస్తి ఎలాగైనా దక్కించకోవాలని నిర్ణయించుకుందని తండ్రి శివప్రసాద్ పాఠక్ అన్నారు. ఈ నేపథ్యంలోనే తన కూమరుడుని హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో తనకు న్యాయం జరిగేంత వరకు కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోనని చెప్పారు. ఈ నేపథ్యంలో గత 22 రోజులుగా శివాంక్ మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచి తన ఇంట్లో భద్రపరిచాడు. కాగా కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని, లేనిపక్షంలో శివప్రసాద్‌పై చర్యలు తీసుకుంటామని సుల్తాన్పూర్ జిల్లా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అయితే యూపీలోని అధికార బీజేపీతోపాటు, ఎస్పీ, ఆప్ స్థానిక నేతలు శివ ప్రసాద్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. దీంతో కుమారుడి మృతదేహానికి మంగళవారం రీపోస్ట్‌మార్టం నిర్వహిస్తామని సుల్తాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీష్ గుప్తా చెప్పారు. -
అప్పు తిరిగి చెల్లించమన్నందుకు స్నేహితులతో కలిసి..
సాక్షి, బహదూర్‌పురా( హైదరాబాద్): తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... కాలాపత్తర్ పీఎస్ పరిధిలోని ఖాజిపురా ప్రాంతానికి చెందిన అబ్దుల్ సాధిక్ (36) కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన సాధిక్ బిన్ యెమన్‌కు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు.ఇలా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలని సాధిక్, యెమన్‌ను అడిగాడు. దీంతో యెమన్ అతని స్నేహితులతో కలిసి సాధిక్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. అందులో భాగంగానే ఆదివారం సాధిక్‌కు డబ్బులు చెల్లిస్తానని ఫోన్ చేసి పిలిపించాడు. డబ్బు కోసం వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సాధిక్‌ను యెమన్ కాలాపత్తర్ బిలాల్‌నగర్‌లోని తన నివాసంలోకి తీసుకెళ్లాడు. అనంతరం సాధిక్‌ను స్నేహితులతో కలిసి యెమెన్ దారుణంగా హత్య చేశారు. సోమవారం ఈ హత్య విషయం బయటపడటంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కాలాపత్తర్ పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
తోటి స్నేహితులే కిరాతకంగా హత్య చేసి.. ఆపై..
సాక్షి, దూద్‌బౌలి(హైదరాబాద్): డబ్బుల విషయంలో గొడవ కారణంగా తోటి స్నేహితులే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సిద్దిపేటకు చెందిన మధుసూదన్‌రెడ్డి కర్మన్‌ఘాట్‌లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. పేట్లబురుజు ప్రాంతానికి చెందిన సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరితో అతడికి స్నేహం ఏర్పడింది. కొన్ని రోజులుగా మధుసూదన్‌రెడ్డికి సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరికి డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఈ నెల 19వ తేదీన మధుసూదన్‌రెడ్డిని చార్మినార్ ప్రాంతానికి పిలిపించారు. సంజయ్, జగన్నాథ్‌తో పాటు మరో ఇద్దరు అతడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి ఓ పొలంలో పాతిపెట్టారు. దీనిపై మధుసూదన్‌రెడ్డి భార్య మధులతకు అనుమానం రావడంతో కుటుంబ సభ్యులతో వెళ్లి 20వ తేదీన చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుసూదన్‌రెడ్డి ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ మధులత ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
-
డీఎంకే నాయకుడి హత్య
తిరువొత్తియూరు: అన్నానగర్‌కు చెందిన టి.పి.సత్రం 16వ వీధికి చెందిన డీఎంకే నాయకుడు సంపత్‌కుమార్ (48)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చెన్నై అన్నానగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి సంపత్‌కుమార్ బైకులో వెళ్తుండగా.. ఆటోలో నుంచి కిందకు దిగిన ముగ్గురు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త దాడిలో భార్య మృతి: అంబత్తూరు సమీపం సూరప్పటు జేపీ ఏపీ నగర రెండవ వీధికి చెందిన ముత్తు (40) బేకరీ నడుపుతున్నాడు. భార్య విజయలక్ష్మి (34). వీరికి దీపశ్రీ (14) అనే కుమార్తె, వసంత్ (10) అనే కుమారుడు ఉన్నారు. గత 14వ తేది భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆగ్రహం చెందిన ముత్తు భార్య ముఖంపై తీవ్రంగా దాడి చేశాడు. మరుసటిరోజు ఆమె ముఖం వాపు ఏర్పడి వాంతులు కావడంతో ఆమెను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి గురువారం ఉదయం మృతి చెందారు. పోలీసులు ముత్తును అరెస్టు చేశారు. పెట్రోల్ చోరీని అడ్డుకున్నందుకు.. తిరువళ్లూరు జిల్లా నందిబాక్కం రైల్వేస్టేషన్ సమీపంలోని మీంజూర్ మేలూరు జోసెఫ్ వీధికి చెందిన వ్యక్తి రాజేష్ (24). తన బైక్‌ను రైల్వేస్టేషన్ పక్కన నిలిపి బుధవారం కట్టడ పనులకు వెళ్లాడు. రాత్రి రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇతడి బైక్ నుంచి పెట్రోల్ చోరీ చేస్తున్నారు. దీంతో వారిని రాజేష్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే వారు కత్తులతో దాడి చేయడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
రోకలిబండతో మోది.. గొంతు కోసి
అనంతపురం: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో అనంతపురం నగరం ఉలిక్కిపడింది. నాల్గో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని సంగమేష్ నగర్‌కు చెందిన ఆదినారాయణకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వెంగమ్మ అలియాస్ లక్ష్మి (30)తో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నిఖిల్ (11), రామ్‌చరణ్ (8) అనే పిల్లలున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కొట్టాలు ప్రాంతంలో నివాసముంటూ స్థానిక టమాట మండిలో కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వ్యక్తితో లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానాలు ఆదినారాయణలో బలపడ్డాయి. ఈ విషయంగానే దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. దారుణానికి ఒడిగట్టి.. పాఠశాలకు సెలవు కావడంతో పెద్ద కుమారుడు నిఖిల్‌ను ప్రొద్దుటూరులోని తల్లిదండ్రుల వద్ద లక్ష్మి వదిలింది. ఆదివారం రాత్రి ఇంటిలో చిన్న కుమారుడు రామ్‌చరణ్ నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మితో ఆదినారాయణ గొడవపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోకలిబండతో లక్ష్మి తలపై మోదాడు. అనంతరం కత్తి తీసుకుని అపస్మార స్థితిలో పడి ఉన్న భార్య గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందిన అనంతరం అక్కడి నుంచి ఆదినారాయణ పరారయ్యాడు. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కత్తి శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలో దింపారు. -
రూమ్మేట్ దారుణ హత్య..ఆ తరువాత
సాక్షి,ముంబై: క్షణికావేశంలో రూమ్మేట్ను దారుణంగా హత్య చేసి, గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టిన వైనం స్నేహం అన్న పదానికే కళంకాన్నిఆపాదించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని దాభా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. నాగ్‌పూర్‌లోని దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) పనిచేస్తున్నారు. ఇద్దరూ స్నేహితుల్లా ఒకే దగ్గర పని.. ఒకే గదిలో నివాసం. కలిసిమెలిసి ఉంటున్న వీరి మధ్య స్వల్ప విషయంలో వివాదం మొదలైంది. ఈ ఘర్షణ మరింత ముదిరి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో నందేశ్వర్‌ను తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కానీ ఏ మాత్రం పశ్చాత్తాపం లేని అతగాడు మృతదేహాన్ని గదికి సమీపంలోని ప్రదేశంలో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లు రూమ్‌లో ప్రశాంతంగా నిద్ర పోయాడు. ఆ ప్రదేశాన్ని చూసి అనుమానం వచ్చిన స్థానికులు ఆదివారం ఉదయం సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో దేవాన్ష్‌ను విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. చదవండి : Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి -
మూత్ర విసర్జన చేసి అవమానం.. అందుకే రాత్రి నిద్రపోతుంటే..
సాక్షి, సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని లక్ష్మీ కాంప్లెక్స్ వద్ద ఈనెల 6న కొనాపూర్‌కు చెందిన పెద్దగొల్ల పాపయ్య(65)ను తిమ్మన్న గూడెంకు చెందిన పెద్దగొల్ల బీరప్ప (32) హత్యచేశాడని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో ఆయన హత్య వివరాలను వెల్లడించారు. పెద్దగొల్ల బీరప్ప ఈనెల 5న రాత్రి ట్రాక్టర్ల బ్యాటరీలను దొంగతనం చేస్తుండగా, గమనించిన పెద్దగొల్ల పాపయ్య మరికొంతమందితో కొట్టి, మూత్ర విసర్జన చేసి అవమానించాడు. కక్ష్య పెంచుకున్న బీరప్ప 6వ తేదీ తెల్లవారుజామున కాంప్లెక్స్ పక్కన నిద్రిస్తున్న పాపయ్య తలపై బండరాయితో మోదీ హత్య చేశాడు. మృతుడి కుమారుడు పెద్దగొల్ల సుభాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానితుడు బీరప్పను విచారించగా, నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. బీరప్పను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని, హత్యకేసును త్వరగా ఛేదించిన ఇన్స్పెక్టర్ గూడూరి సంతోష్‌కుమార్, సిబ్బందిని డీఎస్పీ బాలాజీ అభినందించారు. -
పంజాబ్ లోని మొహాలీలో పట్టపగలే దారుణ హత్య
-
రూ.వంద కోసం అన్ననే కొట్టి చంపాడు..
అమరాపురం(అనంతపురం జిల్లా): మద్యం మత్తు ఆ వ్యక్తిని విచక్షణ కోల్పోయేలా చేసింది. అన్నకు వంద రూపాయలు ఎక్కువగా ఇచ్చారని తండ్రితో గొడవ పెట్టుకుని.. చివరికి నిలువునా అన్న ప్రాణాలు తీశాడు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామానికి చెందిన యంజేరప్పకు నలుగురు కుమారులు. ఆదివారం పింఛన్ అందుకున్న తల్లి.. కుమారులు లక్ష్మన్న(35)కు రూ.300, రంగప్పకు రూ.200 చొప్పున ఇచ్చింది. తాగి ఇంటికొచ్చిన రంగప్ప తనకెందుకు రూ.వంద తక్కువ ఇచ్చారంటూ గొడవ పెట్టుకున్నాడు. సర్దిచెప్పబోయినన అన్నపై కోపంతో ఊగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయిన రంగప్ప.. పొద్దుపోయాక లక్ష్మన్న వద్దకు వచ్చి మళ్లీ గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో కర్రతో లక్ష్మన్నపై దాడి చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే లక్ష్మన్న మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడ : ఫాతిమా హత్య కేసులో కీలక విషయాలు
-
వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డపై దారుణం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వివాహేతర సంబంధం మోజులో పడి కన్న కుమారుడినే తల్లి హతమార్చిన ఘటన రాజమహేంద్రవరం సీతంపేటలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న మల్లెమొగ్గల లక్ష్మి తన కుమారుడు మంజునాథ్ (6) మంచంపై నుంచి పడిపోయి, గాయపడినట్టు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఆ బాలుడు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆ బాలుడి తల, మెడ, ముఖంపై గాయాలుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నివేదికతో పాటు, స్థానికుల నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మంజునాథ్‌ను అతడి తల్లి లక్ష్మి, ప్రియుడు బోనం దాసు హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పొతవరం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హత్య కేసును పోలీసులు చేధించారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సత్యనారయణ వంశీ ను హత్య చేశాడాని పోలీసులు తెలిపారు. 2019 లో డేటింగ్ యాప్ ధ్వారా వంశీ కి సత్యనారాయణ పరిచయం అయ్యాడు. తరువాత ఇద్దరు మధ్య స్వలింగ సంపర్కం జరిగాక డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. చింతలసత్యనారాయణ, కొనకళ్ల వంశీ రాత్రి 7 గంటల సమయంలో పోతవరం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కలిశారని..వంశీ రూ.5 వేలు ఇవ్వక పోవడంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతిని తండ్రిని సత్యనారాయణ లక్ష రూపాయలు డిమాండ్ చేసి 40 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. వంశీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగాడబ్బులు తీసుకునే క్రమంలో సత్యనారాయణ ను అరెస్ట్ చేశామాని డీఎస్పీ పి.శ్రీనాధ్ తెలిపారు. -
భార్య, కూతురును గొడ్డలితో నరికి చంపిన గంగారాం : నిజామాబాద్
-
నపుంసకుడివి అంటూ హేళన? మహిళా డాక్టర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా డాక్టరును ఆమె బావ అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. వివరాలు.. వారణాసిలోని మహమూర్గంజ్ ప్రాంతానికి చెందిన స్వప్న స్థానిక ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తుంది. మహమూర్గంజ్ ప్రాంతంలో బావతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో అనిల్ తనని నపుంసకుడంటూ నిత్యం వేధిస్తోందనే ఆగ్రహంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేశారు. మృతురాలు స్వప్న ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో స్వప్నను అనిల్ హత్య చేశాడనే విషయం దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. మరోవైపు సప్నపై తాను పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మరణించిందని అనిల్ తన నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. తాను అనారోగ్యంతో ఉన్నా, తల్లిదండ్రులను చూసేందుకు వెళతుండగా తనను చూసి పెద్దగా నవ్వుతూ నపుంసకుడంటూ ఎద్దేవా చేసిందని వీడియో క్లిప్‌లో నిందితుడు అనిల్ వాపోయాడు. గతంలో తన సోదరుడిని కూడా ఇలానే వేధించిందని చెప్పుకు రావడం గమనార్హం. -
భర్తను రోకలి బండతో కొట్టి.. ఆపై బావిలో తోసిన భార్య
సాక్షి, తిరువొత్తియూర(చెన్నై): భర్తను రోకలి బండతో కొట్టి బావిలో తోసి హత్య చేసిన భార్యను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా పరవకోటై స్వామినాథన్ వీధికి చెందిన పాండ్యన్ (45), మహేశ్వరి (40) దంపతులు. పాండ్యన్ రోజూ మద్యం తాగి భార్యను చిత్రహింసలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రెండు రోజులుగా పాండ్యన్ ఇంటికి రాకపోవడంతో బంధువులు అతని కోసం గాలించారు. ఇంటి సమీపంలోని బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బావిలో చూడగా పాండియన్ శవంగా కనిపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. మహేశ్వరి భర్తను రోకలితో దాడి చేసి బావిలోకి తోసినట్టు తెలిసింది. నెల్లైలో మహిళ హత్య ఎల్‌ఐకేటీసీ నగర్ హౌసింగ్‌బోర్డు కాలనీ చిదంబర నగర్‌కు చెదిన కోవిల్ పిచ్చయ్ భార్య ఉష (50) మంగళవారం ఉదయం ఇంటిలో తీవ్ర గాయాలతో శవంగా పడి ఉంది. సమాచారం అందుకున్న పాలై తాలూకా పోలీసు ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఎస్ఐ వాసుదేవన్ అక్కడికి చేరుకుని విచారణ చేస్తున్నారు. -
చంపేస్తానన్నాడు.. చివరికి వాళ్లే చంపేశారు
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్): చంపేస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన రౌడీషీటరే.. ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడని, ఈ నెల 17న మలక్‌పేట వహీద్నగర్కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ ముస్తఖుద్దీన్ (35)ను హత్య చేసిన అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. ఈస్ట్‌జోన్ జాయింట్ కమిషనర్ రమేష్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ మురళీధర్, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ జి.చక్రవర్తిలతో కలిసి సోమవారం ఆయన కార్యాలయంలో వెల్లడించా రు. చంపుతానంటే.. చంపేశారు సీపీ చెప్పిన వివరాల ప్రకారం.. సయ్యద్ ముస్తఖుద్దీన్కు ఓల్డ్ మలక్‌పేటకు చెందిన రౌడీషీటర్లు, డెయిరీఫాం వ్యాపారి మహమూద్ బిన్ అల్వీ అలియాస్ మహమూద్ జబ్రీ, బైన్స్వాల మహమూద్, ఇతని తమ్ముడు ఆయూబ్ బిన్ అల్వీల మధ్య పాత కక్షలు ఉన్నాయి. మహమూద్ బిన్ అల్వీని చంపేస్తానంటూ సయ్యద్ ముస్తఖుద్దీన్ గతంలో పలుమార్లు బెదిరింపులకు దిగాడు. దీంతో మహమూ ద్ బిన్ అల్వీ తన తమ్ముడు ఆయుబ్ బిన్అల్వీకి విషయం చెప్పాడు. పూల్‌బాగ్ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మ ద్ హైదర్ అలీ ఖద్రీ, ఓల్డ్ మలక్‌పేటకు చెందిన మహ్మద్ జుబేర్, రామంతాపూర్‌నకు చెందిన వలీ అహ్మద్‌ల సాయం తీసుకున్నారు. ఈ నెల 17న అర్ధరాత్రి ఓల్డ్ మలక్‌పేటలోని అబూ బకర్ మసీదు వద్దకు వచ్చిన సయ్యద్ ముస్తఖుద్దీన్పై కత్తులతో దాడి చేశారు. ముస్తఖుద్దీన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు విచారణ చేపట్టారు. అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్టు చేశారు. వీరు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు సైతం పాల్పడినట్లు సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు నగరంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జనవరి 1 నుంచి ఈ నెల 15 వరకు మొత్తం 21 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేశామన్నారు. మరో 31మందిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎవరైనా రౌడీయిజం చెలాయించాలని చూస్తే ప్రజలు 94906 16555కు వాట్సప్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. జంట నగరాల్లో ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 272 మంది చిన్నారులను రెస్క్యూ చేశామన్నారు. బోనాలు, బక్రీద్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఇటీవల సెల్ఫోన్లు పోగొట్టుకున్న 30 మందికి తిరిగి వాటిని అందజేశామని చెప్పారు. ఎస్సార్‌నగర్, కార్ఖానా, ఆసీఫ్‌నగర్ పోలీసు స్టేషన్లను 15 రోజుల్లో ప్రారంభించనున్నట్లు సీపీ తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగి దారుణహత్య..
తలమడుగు(బోథ్): ప్రభుత్వ ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని కుచులపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ పురుషోత్తంచారి వివరాల ప్రకారం... రాగి ఉత్తమ్(53) జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లా డు. భోజనం అనంతరం రాత్రి పదున్న ర గంటలకు బయటకు వచ్చాడు. అదే సమయంలో అదును కోసం వేచిచూస్తున్న సుధాకర్ పాత కక్షల నేపథ్యంలో బండరాయితో ఉత్తమ్ తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి సుధాకర్ పారిపోయాడు. ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ పురుషోత్తంచారి, ఎస్సైలు దివ్య భారతి, ప్రవళిక వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ఉత్తమ్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నిందితుడి పట్టివేత... హత్య చేసి పారిపోయిన నిందితుడు సుధాకర్‌ను పట్టుకున్నట్లు ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీఐ వెల్లడించారు. ఉత్తమ్‌ని అదే గ్రామానికి చెందిన మందాడి సుధాకర్ పాత కక్షల నేపథ్యంలో హత్య చేయడానికి కుట్ర పన్నాడని, శనివారం రాత్రి ఒంటరిగా ఇంటి బయట కనిపించిన ఉత్తమ్‌ను బండరాయితో తలపై కొట్టి హత్య చేసి పారిపోయాడని తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు సుధాకర్‌ను అతడి పంట పొలంలో పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. -
దారుణం: ఎంత పని చేశావు తల్లీ..!
తిరువొత్తియూరు(తమిళనాడు): మూడోసారి ఆడబిడ్డ పుట్టిందని కన్నతల్లే కడతేర్చిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నామక్కల్ జిల్లా ఎరుంపట్టికి చెందిన చిన్నతంబి కుమారుడు సూర్య, కస్తూరి (27) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన కస్తూరిని ప్రస వం కోసం నామక్కల్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కస్తూరి ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 13వ తేదీ శిశువు మృతి చెందినట్లు కస్తూరి పోలీసులకు తెలిపింది. అనుమానంతో బిడ్డ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అందులో శిశువు హత్యకు గురైనట్లు తెలిసింది. మూడో సారి ఆడబిడ్డ పుట్టడంతో హత్య చేసినట్లు కస్తూరి నేరం ఒప్పుకుంది. శుక్రవారం పోలీసులు కస్తూరిని అరెస్టు చేశారు. -
హైతీ అధ్యక్షుడి హత్య కేసులో కీలక సూత్రధారి అరెస్టు
Port-Au-Prince: కరేబియన్ దేశమైన హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే. మోయిస్ హత్య వెనుక కీలక సూత్రధారిని అరెస్టు చేసినట్లు హైతీలోని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై హైతీ పోలీసు అధికారి లియోస్ చార్లెస్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ ఇమ్మాన్యుయేల్ సనోన్ (63) రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ప్రైవేట్ విమానంలో పలువురు కొలంబియన్లతో హైతీలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. ఇక ఈ హత్యకు సంబంధించి గత వారం రోజుల నుంచి కనీసం పద్దెనిమిది కొలంబియన్ పౌరులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడిని చంపే కుట్ర వెనుక మరో ఇద్దరు సూత్రధాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ ముగ్గురు హైతీ అమెరికన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో సనోన్ దేశంలోకి ప్రవేశించాడని, అతడి ఇంటి వద్ద పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్‌ను మయామి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. -
వివాహేతర సంబంధం: తరచూ ఫోన్ బిజీ వస్తుండటంతో..
సాక్షి, కర్నూలు(ఎమ్మిగనూరురూరల్): నెల రోజుల క్రితం బంధువుల పెళ్లికి బయలుదేరి అదృశ్యమైన మహిళ కేసు మిస్టరీ వీడింది. అనుమానంతోనే ఆమె ప్రియుడు అంతమొందించినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసు స్టేషన్లో సీఐ బీఏ. మంజునాథ్ హత్య కేసు వివరాలను వివరించారు. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన హరిజన లక్ష్మికి ఆదోని చెందిన నాగరాజుతో 11 ఏళ్ల క్రితంవివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. నాగరాజు 9 ఏళ్ల క్రితం చనిపోవటంతో అప్పటి నుంచి పిల్లలతో లక్ష్మి పుట్టినింట్లో ఉంటోంది. అప్పుడప్పుడు ఆదోనికి వెళ్లివచ్చేది. ఇదే క్రమంలో ఆస్పరి మండలం బి. ఆగ్రహారం గ్రామానికి చెందిన అంద్రి దేవదాస్‌తో పరిచయం ఏర్పడింది. ఇతను ములుగుందం సచివాలయంలో లైన్‌మన్‌గా పని చేస్తున్నాడు. లక్ష్మితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా కొన్ని నెలల నుంచి లక్ష్మిపై దేవదాస్ అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమె ఫోన్ బిజీ వస్తుండటంతో తనతోనే కాకుండా మరి కొందరితో పరిచయం ఉందని పలుమార్లు ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో లక్ష్మిని హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఆదోనిలో తన భర్త తరుపు బంధువుల పెళ్లికి వెళ్లిన లక్ష్మి తిరిగి రాలేదు. బంధువులను విచారించినా ఆచూకీ లేకపోవటంతో గోనెగండ్ల పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. హత్యకు గురైన లక్ష్మి (ఫైల్) చర్చికి వెళ్దామని తీసుకెళ్లి.. లక్ష్మిపై అనుమానం పెంచుకున్న అంద్రి దేవదాస్ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్ మేరీమాత చర్చికి వెళ్లివద్దామని, ఇక నుంచి ఇద్దరం బాగుందామని ఫోన్లో నమ్మించాడు. ఆ మాటలు నమ్మి జూన్ 7వ తేదీన లక్ష్మి అతనితో బైక్‌పై వెళ్లింది. పథకం ప్రకారం అంద్రి దేవదాస్ కసాపురం సమీపంలోని జీఎన్ఎస్ఎస్ కాల్వ దగ్గర పొలాల్లోకి తీసుకెళ్లాడు. తనను మోసం చేశావంటూ ఆవేశంతో లక్ష్మి గొంతు నులిమి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకున్నారు. ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్ తీసి మృతదేహంపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. లక్ష్మీ కుటుంబ సభ్యులు లైన్మెన్పై అనుమానం వ్యక్తం చేయటంతో కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ మేరకు లైన్మెన్ అంద్రి దేవదాస్‌ను శనివారం అదుపులో తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్టు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు. హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ పుర్రె, ఎముకలు కనిపించాయి. నిందితుడి నుంచి బైక్, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. సమావేశంలో గోనెగండ్ల ఎస్ఐ సురేష్, రూరల్ ఎస్ఐ సునీల్‌కుమార్, రూరల్ ఏఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రాళ్లతో కొట్టి భిక్షగాడి దారుణ హత్య
సాక్షి, గూడూరు: గుర్తుతెలియని వ్యక్తులు ఓ భిక్షగాడిని రాళ్లకొట్టి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రెండో పట్టణంలోని జీఎస్ రాయులు కూడలిలో శుక్రవారం రాత్రి జరిగింది. రెండో పట్టణ ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించే ప్రయత్నించారు. భిక్షగాడి హత్య మిస్టరీగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు.. హతుడు ఏడాదికిపైగా ఇక్కడే ఉంటున్నాడు. అతనికి తెలుగు రాదు, హిందీలోనే మాట్లాడుతుంటాడని తెలుస్తోంది. అతను పగటి వేళల్లో బయటకు వెళ్లి భిక్షాటన చేసుకుని రాత్రి వేళ స్థానికంగా రేకుల షెడ్డు కింద వండుకొని తిని, నిద్రపోతుంటాడు. అయితే భిక్షగాడ్ని హతమార్చే అవసరం ఎవరికొచ్చింది, దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బుల కోసమే అతన్ని హత్య చేశారా? అనుకుంటే అతని జేబులో రూ.2 వేల నగదు ఉంది. అయితే భిక్షగాడి వద్ద భారీగా నగదు ఉండొచ్చని, ఈ నగదు కాజేసే ప్రయత్నంలో ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వేసుకున్న జేబులో డబ్బులు గుర్తించలేక వదిలేసి వెళ్లి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అర్బన్ సీఐ నాగేశ్వరమ్మ మాట్లాడుతూ కేసును ఛేదించేందుకు డాగ్ స్క్వాడ్‌తో ప్రయత్నం చేశామన్నారు. జాగిలం ఘటనా స్థలం వద్ద కలియ తిరిగి అక్కడి నుంచి విందూరు వైపు వెళ్లే రోడ్డు వద్దకు వచ్చి ఆగిపోయిందన్నారు. సీసీ ఫుటేజీలను సేకరించి, నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. రెండో పట్టణ ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Haiti: రాజకీయ స్థిరత్వం లేని నెత్తుటి నేల
లాటిన్ అమెరికాలో భాగంగా.. కరేబియన్ దీవుల్లో వలస పాలన నుంచి విముక్తి పొందిన తొలి దేశంగా హైతీకి ఓ గుర్తింపు ఉంది. అయితే స్వేచ్ఛా దేశం అనేపేరే తప్పించి.. ఏనాడూ ఆ గడ్డ ప్రశాంతంగా ఉండింది లేదు. హింస, దురాక్రమణలు, రాజకీయ సంక్షోభం, ప్రజల తిరుగుబాటు, అణచివేతలు, పేదరికం, తిరుగుబాటుదారుల మారణ హోమాలు హైతీని నెత్తుటి నేలగా మార్చేశాయి. తాజాగా ఏకంగా అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెబ్‌డెస్క్: ఆఫ్రికన్ జాతులతో విరజిల్లుతున్న కరేబియన్ సముద్రపు హిస్పనియోల దీవుల్లో.. ఇటలీ నావికాన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఈ భూభాగంలో స్పెయిన్ కాలనీలు వెలిశాయి. రెండు వందల ఏళ్ల తర్వాత పశ్చిమం వైపు సగ భాగాన్ని ఫ్రాన్స్ చేజిక్కిచ్చుకుంది. అప్పటి నుంచి వాళ్లను బానిసలుగా మార్చుకుని షుగర్, రమ్, కాఫీ ఉత్పత్తులను ఫ్రాన్స్‌కు అక్రమంగా తరలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాళ్లు దారుణమైన హింసను చవిచూశారు. 1801లో.. టౌస్సెయింట్ లోవెర్టర్ తిరుగుబాటుతో బానిసత్వాన్ని రద్దు చేశారు. ఆపై 1804లో ఫ్రాన్స్ నుంచి విముక్తి పొంది హైతీ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. బానిస బతుకుల విముక్తి కోసం పోరాడిన జీన్ జాక్వెస్ డెస్సాలైన్స్ తొలి అధ్యక్షుడు అయ్యాడు. కానీ, రెండేళ్లకే అతన్ని దారుణంగా హత్య చేశారు(వాళ్లెవరో ఇప్పటిదాకా తెలియదు). ఆపై వంద సంవత్సరాలపాటు అంతర్యుద్దంతో నలిగిపోయిన హైతీలో 1915లో అమెరికా సైన్యం అడుగుపెట్టింది. అయితే 1943లో తమ దళాలను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆర్థిక, రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకుంటూ వస్తోంది. దాయాదిగా పొరుగు దేశం! పొరగున ఉండే డొమినికన్ రిపబ్లిక్‌తో 1937లో హైతీకి శత్రుత్వం మొదలైంది. సరిహద్దు విషయంలో జరిగిన గొడవలతో అప్పటి డొమినికా నియంతాధ్యక్షుడు టట్రుజిల్లో నర మేధానికి ఆదేశాలిచ్చాడు. దీంతో సరిహద్దులో నివసిస్తున్న హైతీ ప్రజల్ని.. డొమినికా సైన్యం ఊచకోత కోసింది. ఆ తర్వాత కాల్పులు తగ్గుముఖం పట్టినప్పటికీ .. సరిహద్దు ఒప్పందాలు మాత్రం కొనసాగుతున్నాయి. సైన్యం తిరుగుబాటులు 1957లో హైతీ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అప్పటి సైన్యాధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ పాపా డాక్ డువెలైర్.. మిలిటరీ సాయంతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ఎవరూ ఊహించని స్థాయిలో జరిగింది. చివరికి అంతర్జాతీయ సమాజం విమర్శలకు తలొగ్గి, టోంటోన్ మాకౌట్స్ రహస్య బృందాలకు భయపడి డువెలైర్ కొంచెం తగ్గాడు. 1964లో తనను తాను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించుకున్నాడు. అతని మరణం తర్వాత కొడుకు జీన్ కౌడ్(బేబీ డాక్) అధ్యక్షుడు అయ్యాడు. అతని పాలనలో ప్రజలు నరకం అనుభవించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఫ్లోరిడాకు పడవల్లో పారిపోయే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయాణాల్లో వేల మంది మృత్యువాత పడ్డారు. ఎన్నికలు.. పేదరిక ప్రభావం వరుస తిరుగుబాట్లు, ప్రజల నిరసన ప్రభావంతో బేబీ డాక్.. 1986లో ఫ్రాన్స్‌కు శరణార్థికి పారిపోవడంతో లెఫ్టినెంట్ జనరల్ హెన్రీ నాంపి పాలనను చేపట్టాడు. రెండేళ్లకు జనరల్ ప్రాస్పర్ అవిరిల్ తానే నిజమైన అధ్యక్షుడినని ప్రకటించుకోగా.. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో రాజీనామా చేసి తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. అయితే పేదల పెన్నిధిగా పేరున్న వామపక్ష నేత జీన్ బెర్ట్రాండ్ అర్టిస్టిడె ఆ ఎన్నికల్లో గెలవగా.. ఆ మరుసటి ఏడాది(1991)లో హింస చెలరేగడంతో అతన్ని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మూడేళ్ల పాటు ఆ మారణకాండలు అలాగే కొనసాగడంతో.. 1994లో అమెరికా జోక్యం చేసుకుంది. తమ సైన్యాన్ని దించి హైతీ మిలిటరీ చర్యల్ని అణచివేసి.. తిరిగి అర్టిస్టిడ్ను అధ్యక్షుడిగా నియమించి శాంతి స్థాపనకు ప్రయత్నించింది. అప్పటి రాజకీయ అస్థిరత్వం నడుమే అధ్యక్షుడిగా కొనసాగినప్పటికీ.. 2004లో మళ్లీ హింస చెలరేగడంతో అర్టిస్టిడ్ దేశం విడిచి పారిపోయాడు. దీంతో మరోసారి ఎన్నికలు జరగ్గా.. ప్రెవెల్ నెగ్గాడు. ఆపై నిరసనలు, ఆహార కొరత, కలరా.. 2010లో భారీ భూకంపాలతో రెండున్నర లక్షల మంది దుర్మరణం పాలవ్వడంతో హైతీ ఘోరంగా కుదేలు అయ్యింది. కోలుకున్నట్లే అనిపించి.. వరుస విషాదాలతో కొలుకున్న హైతీకి.. 2011 ఎన్నికల్లో మైకేల్ మార్టెల్లీ గెలవడంతో ఆశలు చిగురించాయి. అయితే ఆ ఆనందం ఏడాది కూడా నిలవలేదు. పేదరికం, ఆర్థిక సంక్షోభం, పైగా అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు మొదలయ్యాయి. దీంతో మార్టెల్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2017లో అరటి పండ్ల వ్యాపారిగా ఉన్న జోవెనెల్ మోయిస్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బ్రహ్మండమైన మెజార్టీతో గెలుపొందాడు. అయితే అధికార దుర్వినియోగంతో ఎన్నికలకు సిద్ధపడకపోకపోవడంతో.. మరోసారి వ్యతిరేక గళం వినిపించింది హైతీ గడ్డపై. ఈ ఏడాది మొదట్లో నియంతృత్వం వద్దంటూ లక్షల మంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంపిందెవరు? హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ అతిదారుణంగా హత్య చేసిన వాళ్ల గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. నిందితులు కాల్పుల సమయంలో స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడారని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఇక ఇది ఫ్రాన్స్ చేయించిన హత్య అని, కాదు అమెరికా చేయించిన హత్య అని, డొమెనికా సీక్రెట్ గ్రూప్ చేయించిన పని అని.. ఇలా ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఆయా దేశాలు మాత్రం ఆరోపణల్ని.. మోయిస్ హత్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఇక హత్యకు పాల్పడిన ముఠాగా అనుమానిస్తున్న ముగ్గురిని ఇప్పటికే హైతీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్ స్పృహలోకి వస్తే.. ఈ హత్యకు సంబంధించిన వివరాలేవైనా తెలుస్తాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. -
బావా బావమరుదుల కొట్లాట.. మధ్యలో వచ్చిన మామ హతం
చిలకలూరిపేట(గుంటూరు జిల్లా): స్థల వివాదం నేపథ్యంలో అల్లుడి చేతిలో మామ హతమైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. అర్బన్ సీఐ షేక్ బిలాలుద్దీన్ కథనం ప్రకారం పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ సుభాని బైక్ మెకానిక్. అతను తనకు పిల్లనిచ్చిన మామ షేక్ సుభాని(68) ఇంటి సమీపంలో ఖాళీ స్థలం కొన్నాడు. సెంట్‌మెంటు ప్రకారం ఇది సరికాదని సుభాని బావమరిది షేక్ జానీబాషా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో సోమవారం సుభాని స్థలాన్ని శుభ్రం చేయించాడు. దీంతో రాత్రి 11 గంటల సమయంలో బావా బావమరుదులు కొట్లాటకు దిగారు. వీరిద్దరినీ విడదీసే క్రమంలో మామ సుభాని అడ్డువెళ్లాడు. దీంతో మామపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మామ సుభాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో బావా బావమరుదులైన సుభాని, జానీబాషా కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సుభాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెల్లెల్ని కాపురానికి పంపాలని ఒత్తిడి.. మాట వినకపోవడంతో
నెల్లూరు (క్రైమ్): మద్యం మత్తులో బావను బీర్ బాటిల్‌తో పొడిచి బావమరిది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటిక వద్ద జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. సత్యనారాయణపురానికి చెందిన సునీల్ (33), మౌనిక దంపతులు. సునీల్ ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మౌనిక సోదరుడు పవన్ బావ ఇంట్లోనే ఉంటూ బావతో పాటు పనులకు వెళ్లేవాడు. సునీల్ చెల్లెలు శైలజను కిసాన్‌నగర్‌కు చెందిన రాజాకు ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. అయితే రాజా చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధిస్తుండటంతో ఆమె భర్తపై నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శైలజ తన అన్న సునీల్ వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో తన భార్యను కాపురానికి పంపాలని రాజా కొద్ది రోజులుగా బావ సునీల్‌పై ఒత్తిడి తెస్తున్నాడు. చెడు వ్యసనాలు మాని మంచిగా ఉంటానంటే శైలజను కాపురానికి పంపుతానని సునీల్ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో రాజా పవన్‌ను కలిసి తన భార్యను కాపురానికి పంపేందుకు సహాయం చేయాలని కోరారు. క్షణికావేశంలో హత్య కుటుంబంలో జరుగుతున్న గొడవలను మా ట్లాడి పరిష్కరించుకుందామని పవన్ తన బావ సునీల్‌ను సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఇంతలో రాజా మద్యం తీసుకుని వారున్న చోటుకు వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం తాగుతున్న క్రమంలో శైలజను భర్తతో పంపాలని పవన్ ఒత్తిడి తెచ్చాడు. వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన పవన్ తాను తాగుతున్న బీర్ బాటిల్‌ను పగులగొట్టి క్షణికావేశంలో సునీల్‌ను విచక్షణా రహితంగా పొడిచాడు. గాయపడిన సునీల్‌ను స్థానికులు చికిత్స నిమి త్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సైలు హాస్పిటల్ వద్ద కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పో స్టు మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అక్రమ సంబంధం: భర్త నిద్రపోతున్న సమయంలో..
మండ్య(కర్ణాటక): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన మండ్య నగరంలోని గుత్తలు లేఔట్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... గుత్తలు లేఔట్లో అల్తాఫ్ మెహది (54), భార్య సైదా రిజ్వాన్‌లు నివాసం ఉంటున్నారు. అల్తాఫ్ మండ్యలోని మంగళ గ్రామంలోని పీయూ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల సైదా రిజ్వాన్‌కు ఫేస్బుక్ ద్వారా దావణగెరెకు చెందిన రహంతుల్లా పరిచయం అయ్యాడు. ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. రహంతుల్లాకు సైదా ఒక టైల్స్ దుకాణం కూడా పెట్టించింది. వారి వివాహేతర సంబంధం తెలుసుకున్న అల్తాఫ్ భార్యను తీవ్రంగా మందలించాడు. దీంతో ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని ఇద్దరు పథకం వేశారు. శుక్రవారం రాత్రి అందరూ పడుకున్న సమయంలో సైదా ప్రియున్ని పిలిపించుకుంది. నిద్రపోతున్న అల్తాఫ్‌ను ఇద్దరు గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతను వెళ్లిపోగా తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అంత్యక్రియలు కూడా చేశారు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరినీఅదుపులోకి తీసుకున్నారు. -
మంచిర్యాల : భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
-
గుంటూరు : ఇద్దరు పిల్లల్ని కొట్టి చంపిన బాబాయ్
-
విజయవాడ : పట్టపగలే యువకుడిని నరికి చంపిన దుండగులు
-
స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడి పక్కా స్కెచ్!
సాక్షి, ఖమ్మం: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తనే హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు భాస్కర్ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వివరాలు.. భాస్కర్, జనార్దన్ స్నేహితులు. గత రెండేళ్లుగా భాస్కర్ భార్యతో జనార్దన్ అక్రమ సంబంధం నడుపుతున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి జనార్దన్‌ను పలుమార్లు నిలదీశారు. కొన్ని రోజులు దూరంగా ఉండి మరలా రాధమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో భార్య రాధమ్మ, ప్రియుడు జనార్దన్ కలిసి ఉండగా చూసిన భాస్కర్.. గంట తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి రాధమ్మే హత్య చేయించిదని మృతుని బంధువులు ఆరోపించారు. భాస్కర్ మృతికి కారకుడైన ప్రియుడు జనార్దన్ ఇంటిముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. -
అనంతపురం జిల్లా యల్లనూరు లో భగ్గుమన్న పాతకక్షలు
-
యల్లనూరులో భగ్గుమన్న పాత కక్షలు, ఇద్దరి దారుణ హత్య
సాక్షి, అనంతపురం: యల్లనూరులో పాత కక్షలు భగ్గుమన్నాయి. వ్యాసాపురం వద్ద ప్రత్యర్థులు.. ఇద్దరిని నరికి చంపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే నారాయణ, రాజగోపాల్ అనే వ్యక్తులు మృతి చెందారు. యల్లనూరు నుంచి అరవేటి గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. భూ తగాదాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. చదవండి: భయపెట్టి.. బెదిరించి.. బాలికపై లైంగికదాడి దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో.. -
తండ్రి, ఇద్దరు కుమారులను నరికి చంపిన ప్రత్యర్ధులు
సాక్షి, భూపాలపల్లి: ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూవివాదం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొంది. సొంత సోదరుడు, ఆయన ఇద్దరు కుమారులను పాశవికంగా నరికి చంపారు దుండగులు. ఫ్యాక్షనిజాన్ని మరిపించేలా ఏకకాలంలో ముగ్గురిని హత్యచేసిన ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లావుడ్యా మంజనాయక్ (68), ఆయన కుమారులు సారయ్య నాయక్ (45), భాస్కర్ నాయక్ (38) హతమయ్యారు. పదేళ్లుగా గొడవలు.. బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన లావుడ్యా మంజనాయక్, సమ్మయ్య నాయక్, మహంకాళి నాయక్, రజ్జానాయక్ సొంత అన్నదమ్ములు. వీరిలో మంజనాయక్ 15 ఏళ్ల క్రితం గ్రామశివారులో 20 ఎకరాల భూమి కొన్నాడు. పక్కనే కొన్ని గుంటల మిగులు భూమి ఉంటే తన భూమితో పాటే సాగు చేసుకుంటుండమే కాకుండా తన భూమితో కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇదే క్రమంలో మిగిలిన అన్నదమ్ములు ఆ భూమిలో తమకూ హక్కు ఉందని అడ్డుపడుతుండగా పదేళ్లుగా వివాదం కొనసాగుతుంది. పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. శనివారం మంజనాయక్, ఆయన ముగ్గురు కుమారులు సారయ్య నాయక్, భాస్కర్ నాయక్, సమ్మయ్య నాయక్, కోడలు సునీత, మనవడు భూమి వద్దకు వెళ్లి పత్తి కట్టె ఏరుతూ దుక్కి దున్నుతున్నారు. ఇది తెలుసుకున్న మహంకాళి నాయక్, మరికొందరు కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి వెళ్లారు. తమతోపాటుగా తెచ్చుకున్న కారం పొడిని మంజనాయక్, ఆయన కుమారులపై చల్లి గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మంజనాయక్, పెద్దకుమారుడు సారయ్య, చిన్నకుమారుడు భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమారుడు సమ్మయ్య నాయక్ తలపై నరకడంతో తీవ్ర రక్తస్రావమై తప్పించుకుని పారిపోయాడు. కోడలు సునీత చేయి విరిగింది. సుమారు పదిమంది తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. చదవండి: పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి హత్య ఘోరం: చితి పేర్చుకుని రైతు సజీవదహనం -
అత్తామామల చేతిలో అల్లుడు హతం
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా): మండల పరిధిలోని నులకపేటలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ భర్త భార్యను చితకబాది, రోడ్డుమీదకు లాక్కొచ్చి వివస్త్రను చేసి కిలోమీటరు దూరంలో ఉన్న అత్తమామ ఇంటివరకు లాక్కెళ్లాడు. అది తట్టుకోలేని అత్త మామలు అల్లుడిపై దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన కృష్ణ–రోహిణి దంపతుల పెద్ద కుమారుడైన కడలూరి నరేష్ (31)కు నులకపేటకు చెందిన దుర్గారావు–కమల దంపతుల పెద్దకుమార్తె లావణ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. నరేష్ పెళ్లయిన రెండేళ్ల తర్వాత లావణ్య తల్లితో అసహ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరేష్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసులో మూడేళ్లు జైలు శిక్ష పడింది. అనంతరం 2017లో మరోసారి అదేవిధంగా ప్రవర్తించడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో రెండవ కేసు నమోదై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భార్యను హింసిస్తూ అత్తమామల చేతిలో హతమయ్యాడు. సీఐ శేషగిరిరావు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నరేష్‌కు విజయవాడలోని బ్లేడ్‌బ్యాచ్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నగర బహిష్కరణకు గురైన సందీప్ అలియాస్ పెద్ద బాండ్ అనుచరుడిగా తిరుగుతున్నాడు. పెద్దబాండ్‌ను నగర బహిష్కరణ చేసిన తరువాత నులకపేట ప్రాంతంలోకి తీసుకువచ్చి ఇల్లు ఇప్పించింది కూడా నరేషే అని స్థానికులు చెబుతున్నారు. చదవండి: ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు మావోయిస్టుల మృతదేహాలను14 కి.మీ. మోసుకుంటూ.. -
దారుణం: భార్య చేతిలో భర్త హతం
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు ఒకరిపై, మరొకరు మనస్పర్థలు కలిగి ఘర్షణ పడ్డారు. చివరకు భార్య తులసి చేతిలోని కత్తికి భర్త వల్లూరు కిరణ్‌కుమార్ (35) బలయ్యాడు. భార్య కత్తితో దాడి చేయడంతో కిరణ్ మర్మాంగాలకు తీవ్రగాయమవడంతో రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికులు గమనించి 108కు ఫోన్ చేశారు. కొనఊపిరితో కొట్టుమిట్డాడుతూ ప్రాణాలను కోల్పోయాడు. ఈనెల 3వ తేదీ రాత్రి కడప నగరంలోని రియాజ్ హాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి వల్లూరు నారాయణమ్మ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని అక్కాయపల్లె శాస్త్రి నగర్‌కు చెందిన సుబ్బరాయుడు, నారాయణమ్మల రెండో కుమారుడు కిరణ్‌కుమార్‌కు, కలసపాడు మండలం, ముదిరెడ్డిపల్లెకు చెందిన పాలోజి సుబ్రమణ్యం కుమార్తె తులిసి(28)కి 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి జీవన్‌ఆచారి(10), సుశాంత్(8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఏడాది నుంచి మనస్పర్థలు ఏర్పడ్డాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేశారు.ఇటీవల బిల్టప్ సమీపంలో పరమేశ్వర స్కూల్ వద్ద మూన్‌స్టార్ అనే బ్యూటీపార్లర్‌లో తులసి పనిచేస్తోంది. రియాజ్ హాల్ సమీపంలో ఇంటిలో నాలుగునెలల క్రితం చేరారు. కిరణ్‌కుమార్ కార్పెంటర్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో మళ్లీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఈక్రమంలో నాలుగురోజులుగా తులసిని, ప్రవర్తన సరిగా లేదని, మార్చుకోవాలని కిరణ్‌కుమార్ గొడవపడేవాడు. ఈనెల 3వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారింది. కిరణ్‌కుమార్ తన భార్యను జుట్టుపట్టుకుని, ముందుకు లాగి కొడుతుండగా, భార్య తులసి తన చేతిలోని కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో భర్త మర్మాంగాల వద్ద తీవ్రగాయమవడంతో రక్తపుమడుగులో పడిపోయాడు. ఈ సంఘటనపై సమాచారాన్ని బ్యూటీపార్లర్ యజమాని ఆస్మ, మృతుని తల్లి నారాయణమ్మకు ఫోన్ చేసి తెలియజేశారు. సంఘటనస్థలానికి చేరుకున్న నారాయణమ్మ, కుటుంబసభ్యులు కిరణ్‌కుమార్ రక్తపుమడుగులో విగతజీవుడిగా మారిపోయి ఉండటాన్ని గమనించి, తీవ్రంగా విలపించారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన వల్ల తల్లిదండ్రులు దూరమైన కుమారులు జీవన్ ఆచారి, సుశాంత్‌లు పోలీసులకు, బంధువులకు సంఘటన జరిగిన విషయాన్ని తెలియజేశారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో తల్లి చేతి కత్తికి తండ్రి బలయ్యాడని తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప డీఎస్పీ హత్య జరిగిన ప్రదేశాన్ని, మృతదేహాన్ని కడప డీఎస్పీ బూడిద సునీల్, కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం, ఎస్ఐ ఎస్‌కెఎం హుసేన్‌లు, తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు. ఈ సంఘటనలో నిందితురాలైన తులసిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. చదవండి: కుటుంబాన్ని మింగేసిన అప్పుల బాధలు భార్యను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య -
‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’
‘ప్లేట్లు కడిగాను. సర్వర్‌గా పనిచేశాను. అదే హోటల్లో ప్రధాన చెఫ్‌గా చేరాను. పైసాపైసా కూడబెట్టి ఉన్నతంగా చదివించాను. కళ్లెదుటే ఎదుగుతున్న కూతురుని చూసి సంబరపడ్డాను. కుటుంబానికి తోడుగా.. జీవితంలో స్థిరపడే విధంగా దేవుడు దీవించాడని ఆనందించాను. వెంటబడుతున్న వాడి నుంచి కాపాడాలని పోలీస్‌స్టేషన్ మెట్లెక్కాను. కానీ ఆ భగవంతుడు కూడా కనికరించలేదు. నా గారాల పట్టి ప్రాణాలను ఆ రాక్షసుడు అతి కిరాతకంగా తీసుకెళ్లిపోయాడు. మేము ఎలా బతికేది తల్లీ’ అంటూ చిత్తూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన సుస్మిత తండ్రి వరదయ్య రోదించడం చూపరులకు కంటతడి పెట్టించింది. చిత్తూరు అర్బన్: నగరంలోని రిడ్స్పేటకు చెందిన వరదయ్య, లత దంపతులకు సుస్మిత, సునీల్ సంతానం. పెద్దగా చదువుకోని వరదయ్య పెళ్లయ్యి భార్య, పిల్లల్ని పోషించడానికి 25 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. తొలినాళ్లలో పనులు దొరక్క ఓ హోటల్లో చేరి పిల్లలు ఇద్దరినీ ఇంగ్లిషు మీడియంలో చదివించాడు. సాంబయ్యకండ్రిగలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాడు. భార్య లత అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కుమార్తె సుస్మితకు వేలూరు సీఎంసీ వైద్య కళాశాలలో సీటు రావడం.. కోర్సు పూర్తయ్యాక మూడు నెలల క్రితం ఆమెకు గుడిపాల సమీపంలోని చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం రావడం అదృష్టమనుకున్నాడు. నెలకు రూ.17 వేలు జీతం. నైట్‌డ్యూటీలతో కలిపి మూడు రోజుల క్రితం రూ.18 వేల జీతాన్ని చేతిలో పెట్టడంతో ఇక తన కష్టం తీరిపోయిందని అనుకున్నాడు. ప్రేమ పేరిట చదువు, ఉద్యోగం లేని చిన్నా వేధించడంతో ఈ ఏడాది జనవరి 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీలాపల్లె పోలీసులు ఐపీసీ 354–డీ సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి అతన్ని అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై వచ్చిన అతను తమపై పగ పెంచుకుంటాడేమోననుకుని మళ్లీ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. భవిష్యత్‌లో ఎప్పుడూ సుస్మితతో వివాదం పెట్టుకోకూడదని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేయడంతో అతను మారాడని భావించాడు. తీరా సుస్మితను కిరాతకంగా కత్తితో పొడిచి హత్యచేసిన చిన్నా చివరకు తనూ తనువు చాలించాడు. కూతురి రక్తంతో ఆ ఇల్లంతా తడిసి ముద్దవడం చూసిన తండ్రి తట్టుకోలేక పోయాడు. గుండెలు బాదుకుంటూ చిట్టితల్లిని తీసుకెళ్లిపోయావా దేవుడా.. అంటూ రోదించడం చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రహస్యంగా నగ్న వీడియోలు తీసి.. ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి.. అమ్మే అంతపని చేసిందా?! -
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త
బనశంకరి(కర్ణాటక): వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే తాలూకా బీమనబీడు గ్రామానికి చెందిన మహిళ (25)తో 30 ఏళ్ల వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. బుధవారం రాత్రి మహిళ ప్రియునితో కలిసి ఉండగా ఆమె భర్త కట్టె, కత్తితో ప్రియునిపై దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని మైసూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గుండ్లుపేటే పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. చదవండి: యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే.. Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం -
మద్యం మత్తులో దారుణం..
కావలి (నెల్లూరు జిల్లా): మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని వాయునందన ప్రెస్ వీధిలో జరిగింది. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన అనురాధ (32)తో కావలికి చెందిన పెసల మాల్యాద్రితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. మాల్యాద్రి మద్యానికి బానిసై నిత్యం భార్యతో ఘర్షణ పడేవాడు. గత నెల 25న ఇద్దరికి కరోనా సోకడంతో పిల్లలను ఇతరుల ఇంట్లో పెట్టి, వారు తమ ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించుకోగా ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. గురువారం రాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని మాల్యాద్రితో అనురాధ చెప్పింది. అప్పటికే చిత్తుగా మద్యం తాగి ఉన్న మాల్యాద్రి, ఇద్దరం కలసి చనిపోదామని భార్యతో చెప్పి ఆమె చేతి మణికట్టుపై బ్లేడ్‌తో కోశాడు. నరం తెగిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మాల్యాద్రి కూడా బ్లేడ్‌తో చేతిని కోసుకున్నాడు. శుక్రవారం ఉదయం మాల్యాద్రి స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు చెప్పి లొంగిపోయాడు. కాగా, కరోనాతో ఇబ్బంది పడుతున్నామని, ఇద్దరం చనిపోదాం అని చెప్పడంతో అందుకు తన భార్య కూడా అంగీకరించిందని అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిందితుడు చెబుతున్నాడు. చదవండి: రూ.కోట్ల ఆస్తులు ఉన్నా.. అనాథే..! బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే.. -
బద్వేలులో దారుణం: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
-
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): మండలంలోని గలిజేరుగుళ్లలో భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగగా శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కొనకనమిట్ల మండలం గార్లదిన్నెకు చెందిన దూదేకుల బాజీతో బేస్తవారిపేట మండలం అక్కపల్లెకు చెందిన ఖాజీబీ(26)కి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. నిత్యం అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో పెద్దలు సర్ది చెప్పి మూడేళ్ల క్రితం ఆమెను అత్తగారింటికి పంపారు. మామతో పాటు బాజీ బేల్దారి పనులు చేసుకుంటూన్నాడు. మళ్లీ గొడవలు జరగడంతో రెండేళ్లుగా దంపతులు గలిజేరుగుళ్లలో కాపురం ఉంటున్నారు. గురువారం రాత్రి ఏడేళ్ల కొడుకును బయట పడుకోబెట్టి దంపతులు ఇంట్లో గొడవపడ్డారు. కత్తిపీట, బ్లేడ్‌తో భార్య గొంతు కోసి ఆమె చనిపోయిన తర్వాత బయట తలుపునకు తాళం వేసుకుని పీవీపురం చేరాడు. భవన నిర్మాణం చేస్తున్న యజమాని ఆవుల కృష్ణారెడ్డి వద్దకు వెళ్లి గలిజేరుగుళ్లలో పెద్ద గొడవ జరిగిందని, గ్రామస్తులు తనను కొట్టి తరుముకున్నారని, తమ బంధువులు ఉన్న బసినేపల్లెలో మోటార్ సైకిల్‌పై తనను వదిలి పెట్టాలని కోరాడు. అక్కడ వదిలి పెట్టిన తర్వాత అనుమానంతో అక్కపల్లె వెళ్లి ఖాజాబీ తండ్రి పులిమద్ది సుబ్బయ్యకు సమాచారం అందించాడు. కుమార్తెకు, అల్లుడికి ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో సుబ్బయ్య తన బంధువులతో కలిసి గలిజేరుగుళ్ల వెళ్లాడు. గృహానికి తాళం వేసి ఉండటంతో పగులకొట్టి లోపలికి వెళ్లారు. గొంతుతెగి రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె మృతదేహం కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గిద్దలూరు ఎస్ఐ సుధాకరరావు, ఎస్ఐ బాలకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. చదవండి: పాపం రెండేళ్ల చిన్నారి.. ఎండలో ఒంటరిగా ఏడుస్తూ... అక్రమ సంబంధమే ప్రాణం తీసింది.. -
దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు..
మందస(శ్రీకాకుళం జిల్లా): మనవళ్లు తనవాళ్లు కాలేకపోయారు. ఆస్తిపై ప్రేమ పెంచుకున్న వారు తాతయ్యపై అభిమానం చూపలేకపోయారు. కష్టం వస్తే కాచుకోవాల్సిన వారే కాటికి దారి చూపారు. కదల్లేని వయసు లో ఉన్న తాతను నాటు తుపాకీతో కాల్చి చంపేశారు. మందస మండలం చికిడిగాం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పారిగ కమలొ(85) అనే వృద్ధుడు చికిడిగాంలో నివాసముంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తె లు రొంబ, జయంతి, సుకుంతల, ఒక కుమారుడు రమ్మో ఉన్నారు. రమ్మోకు ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య జమ్మకు ముగ్గురు కొడుకులు బుడ్డు, లక్ష్మణ్, దేవరాజులు ఉన్నారు. రెండో భార్య మాధవికి మనోజ్ అనే కుమారుడు ఉన్నారు. మనోజ్ ప్ర స్తుతం అసోంలో ఉంటున్నాడు. కమలొకు ఏడెకరాల భూమి ఉంది. ఈ ఆస్తి విషయంలో రమ్మో తన తండ్రితో ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. మనవళ్లు కూడా తాతతో నిత్యం తగాదా పడుతుండేవారు. దీ నిపై కోర్టుకు కూడా వెళ్లారు. కేసును కమలొ గెలిచా రు. అయితే ఆస్తి గొడవల కారణంగా కమలొ ఊరి లోనే ఉన్న చిన్నకుమార్తె సుకుంతల ఇంటిలో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇంటి నుంచి తుపాకీ పేలి న శబ్ధం రావడంతో బయట నిద్రిస్తున్న సుకుంతల కూతురు సీత లోపలకు వెళ్లి చూసింది. కమలొ రక్తపు మడుగులో గిలగిలలాడుతూ కనిపించడం, ఆయన ఛాతీపై బుల్లెట్ గాయం ఉండడంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికే కమలొ మృతి చెందారు. తాను ఇంటిలోపలకు వెళ్లేటప్పటికి అక్కడ బుడ్డు, లక్ష్మణతో పాటు రాయగడ బ్లాక్, గారబంద పంచాయతీ లోవ గ్రామానికి చెందిన సవర బుడ్డు(24) పారిపోతూ తనకు కనిపించారని సీత పోలీసులకు తెలిపారు. ఆస్తిని కుమార్తెలకు ఇచ్చేస్తాడన్న అనుమానంతోనే మనవళ్లు నాటు తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాస్త ఆలస్యంగా.. చికిడిగాంలో హత్య జరిగిందన్న సమాచారంతో కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సోంపేట సీఐ డీవీవీ సతీష్‌కుమార్, మందస ఎస్ఐ బి.రామారావులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్ వచ్చాయి. డాగ్ స్క్వాడ్ నిందితులు తిరిగిన ప్రాంతాల్లోనే తిరగడంతో పోలీ సుల అనుమానం బలపడింది. క్లూస్, క్రైమ్ టీమ్‌లు ఘటనా స్థలంలో బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నా యి. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించాయి. అయితే ఘటన ఆదివారం రాత్రి జరిగినా పోలీసులు అక్కడకు వెళ్లేందుకు కాస్త సమయం పట్టింది. చికిడిగాం కాస్త అడవుల్లో ఉండడం, మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ఈ ప్రాంతానికి వెళ్లడానికి వెనుకడుగు వేశారు. భారీ బందోబస్తు మధ్య సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు వెళ్లి దర్యాప్తు చేశారు. సోంపేట సీఐ సతీష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను పట్టుకుంటామని డీఎస్పీ శివరామిరెడ్డి చెప్పారు. చదవండి: ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు! అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే.. -
ప్రేమానురాగాలు మరిచి..అయినవారినే హతమార్చి..
నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి అని కూడా చూడలేదు.. తన చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఒక్కగానొక్క సోదరి పట్ల కనికరం చూపలేదు.. కలిసి పెరిగిన సోదరుడిపై కాస్తంత ప్రేమ చూపించలేదు. సైకో అవతారం ఎత్తిన అతను కన్న తల్లిని.. తోడబుట్టిన చెల్లిని.. తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు. బంధాలను మరచిన అతను క్షణాల వ్యవధిలో ముగ్గురినీ రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ప్రొద్దుటూరులో సోమవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు క్రైం (వైఎస్సార్ జిల్లా): ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న హైదర్‌ఖాన్ వీధిలో గుల్జార్‌బేగం (51), కరీమున్నీసా(27), మహమ్మద్‌రఫి (23) దారుణ హత్యకు గురయ్యారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాంద్‌బాషా ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య గుల్జార్‌బేగం, కరీముల్లా, మహబూబ్‌బాషా, మహమ్మద్‌రఫి అనే కుమారులు, కరీమున్నీసా అనే కుమార్తె ఉన్నారు. అతను బొంగుబజార్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మహ్మద్‌రఫి తండ్రితో పాటు పని చేస్తుండగా మిగతా ఇద్దరూ బీరువాల తయారీ పని చేస్తుంటారు. వీళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మహబూబ్‌బాషా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపైనే బాడుగకు ఉంటున్నాడు. కరీముల్లా మాత్రం తల్లిదండ్రుల వద్ద ఉండేవాడు. కుమార్తె కరీమున్నీసాకు భగత్‌సింగ్ కాలనీకి చెందిన రహిముల్లాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కరీముల్లా కొన్ని రోజుల నుంచి కుటుంబాన్ని పట్టించుకోలేదు. కుటుంబ ఖర్చులకు డబ్బు కూడా సరిగా ఇచ్చేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు అతన్ని పిలిచి మందలించారు. ఈ క్రమంలో ఏడాది క్రితం హైదర్‌ఖాన్ పక్కనే ఉన్న వీధిలో కరీముల్లాతో వేరు కాపురం పెట్టించారు. వారికి ఒక కుమార్తె ఉంది. వేరుకాపురం పెట్టిన నాటి నుంచి గొడవలు మొదలయ్యాయి.ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఒక రోజు భార్యను నిలదీశాడు. ‘మీ వాళ్లు కావాలనే నాపై నిందలు వేస్తున్నారు.. వాళ్లు నీకు చేతబడి చేసి ఉంటారు’ అని చెప్పింది. ఆ రోజు నుంచి తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతున్నాడు. అటు భార్యపై అనుమానం, ఇటు తల్లిదండ్రులపై కోపం అతన్ని రాక్షసుడిగా మార్చాయి. నాకు సుఖం లేనప్పుడు మిమ్మల్ని బతకనీయను.. తనకు సుఖం లేనప్పుడు ఇంట్లో ఎవ్వరినీ బతకనీయనని కరీముల్లా ఎప్పుడూ చెప్పేవాడు. అయినా అతని మాటలను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు.చెప్పినట్లు గానే తల్లి,చెల్లి, తమ్ముడిని హతమార్చాడు. నా కుమారుడ్ని ఉరి తీయండి సార్.. అమ్మను,తమ్ముడిని, చెల్లెల్ని చంపినఆ రాక్షసుడు భూమ్మీద ఉండొద్దు.. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు.. వాడిని ఉరి తీయండి’అంటూ తండ్రి చాంద్‌బాషా రోదించ సాగాడు. నా భార్య ఏ పాపం చేసింది.. కరీమున్నీసా ఆరు నెలల గర్భిణీ. 3 నెలల నుంచి అమ్మగారింట్లోనే ఉంటోంది. 2రోజుల క్రితం భర్త రహీముల్లా అత్తగారింటికి వెళ్లి భార్యను పంపమని అడిగాడు. కొన్ని రోజులుండి పంపుతామని కరిమున్నీసా తల్లిదండ్రులు చెప్పారు. ఇంతలోనే అన్న చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఏ పాపం చేసిందని నా భార్యను చంపాడు.. అంటూ అతను రోదిస్తున్నాడు. చదవండి: మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్.. -
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బందీగా ఉన్న ఏఎస్ఐ మురళీని హత్య చేశారు. అనంతరం మురళీ మృతదేహాన్ని గంగుళూరు వద్ద రహదారిపై పడేశారు. మృతదేహం వద్ద ఒక లేఖను వదిలి వెళ్లారు. ఈ నెల 21న గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలనార్ గ్రామంలో ఏఎస్ఐ మురళీని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి విదితమే. నాలుగు రోజుల తర్వాత కిడ్నాప్ ఘటన విషాదంతో ముగిసింది. మురళీని విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు విన్నవించిన మావోయిస్టులు కనికరించలేదు. ఏఎస్ఐ విడుదలకు గోండ్వానా సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ యత్నించిన సంగతి తెలిసిందే. చర్చలు జరిపే సమయంలోనే మురళీని మావోయిస్టులు హత్య చేశారు. చదవండి: కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. -
కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో..
రామసముద్రం (చిత్తూరు జిల్లా): భార్యతో సహజీవనం చేస్తున్నాడన్న ఆగ్రహంతో వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసిన ఘటన రామసముద్రం మండలం నారిగానిపల్లె పంచాయతీలో గురువారం రాత్రి జరిగింది. ఎస్ఐ రవికుమార్ కథనం మేరకు.. దిగువలంభంవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె ఆదిలక్ష్మికి.. పుంగనూరు మండలం ఆరడిగుంట గ్రామానికి చెందిన మునెప్ప కుమారుడు అర్జున్‌కు 20ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కలహాల వల్ల నాలుగేళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకాకి చెందిన శ్రీనివాసులు అలియాస్ ఆంజప్ప(41)తో ఆదిలక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ దిగువలంభంవారిపల్లెలో సహజీవనం చేస్తున్నారు. వీరి వ్యవహారం ఆమె భర్త అర్జున్‌కు తెలియడంతో గురువారం రాత్రి ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న ఆంజప్పపై బండరాయితో మోది పారిపోయాడు. ఆమె కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని గాయపడిన ఆంజప్పను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతిచెందాడు. శవపరీక్ష నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య, సీఐ మధుసూధన్‌రెడ్డి శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే.. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు -
వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే..
అమడగూరు(అనంతపురం జిల్లా): వేధింపులు భరించలేక తల్లిదండ్రులే కన్న కొడుకును హతమార్చిన ఘటన అమడగూరు మండలంలోని మద్దెమ్మగుడిపల్లిలో చోటు చేసుకుంది. సీఐ ఇస్మాయిల్, ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శివారెడ్డి, భాగ్యమ్మలకు కుమారుడు ప్రతాప్‌రెడ్డి, కూతురు శశికళ సంతానం. కుమార్తెకు వివాహం చేసి పంపారు. కుమారుడు ప్రతాప్‌రెడ్డి మాత్రం రోజూ మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే పదిహేను రోజులుగా కొత్త ద్విచక్రవాహనం కొనివ్వాలంటూ పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. ఈ బాధను భరించలేక తల్లిదండ్రులు కుమార్తెతో చెప్పుకుని రోదించారు. ప్రతాప్‌రెడ్డి గురువారం రాత్రి బైక్ కొనివ్వాలంటూ తల్లి భాగ్యమ్మను చితక్కొట్టాడు. గ్రామస్తుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అందరూ నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ప్రతాప్‌రెడ్డి మద్యం మత్తులో తల్లిని మరోసారి కొడుతుండగా తండ్రి శివారెడ్డి భరించలేక ఇద్దరూ ఏకమై కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టగా అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడి సోదరి శశికళ ఫిర్యాదు మేరకు సీఐ, ఎస్ఐ గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఆ నలుగురు ఔట్..! ‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్ -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని కొట్టి చంపిన కొడుకు
సాక్షి, నూతనకల్: మద్యం తాగొద్దన్నందుకు ఓ తనయుడు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నూతన్‌కల్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పుల వెంకన్న(50) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు మల్లయ్య తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు. కాగా, మల్లయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఇదే విషయంపై తండ్రికొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కుమారుడు తాగి రావడంతో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వెంకన్న తలపై మల్లయ్య కర్రతో దాడిచేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంకన్నకు ఎలాంటి వైద్యచికిత్స అందించకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు సీఐ రవి పర్యవేక్షణలో ఎస్ఐ శివకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి ) -
అవ్వను కడతేర్చిన మనుమడు
సాక్షి, చెన్నై: ఈరోడ్ సమీపంలో మద్యానికి డబ్బు ఇవ్వలేదని మంగళవారం అవ్వను మనుమడు హతమార్చాడు. ఈరోడ్ జిల్లా, అవల్‌పూందురై భారతివీధికి చెందిన ముత్తుస్వామి, జల్విన్‌మేరి కుమార్తె భారతివెన్నిలా, కుమారుడు పూవిళిసెల్వన్ (33). భారతివెన్నిలాకు వివాహమై విడిగా ఉంటున్నారు. పూవిళిసెల్వన్ భార్య షర్మిలా (35). ఒక కుమార్తె ఉన్నారు. పూవిళిసెల్వన్‌కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిలేదు.ఇలావుండగా షర్మిల, భర్త, కుమార్తెతో కోవైలోని పుట్టింటికి వెళ్లింది.ఆ తర్వాత మంగళవారం అవల్‌పూందురైకు వచ్చిన పూవిళిసెల్వన్ మద్యానికి డబ్బులివ్వాలంటూ తల్లి జల్విన్‌మేరీతో గొడవ పడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న 95 ఏళ్ల అవ్వను కత్తితో పొడిచి హతమార్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అరచ్చలూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కిరాతకం: అందరూ చూస్తుండగానే..
తుమకూరు: జిల్లాలోని తిపటూరులో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో స్నేహితున్ని అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. కొందరు ఈ వైనాన్ని మొబైళ్లలో బంధించారు. ఈ ఘోరం సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పట్టణంలోని తమిళ కాలనీకి చెందిన వెంకటేష్(45), మంజు(28) పెయింటర్లుగా పనిచేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. వీరిద్దరూ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగారు. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అంతే.. వెంకటేశ్ కొడవలి తీసుకొని హల్చల్ చేశాడు. స్థానికులు వెళ్లి సర్దిచెప్పినా వినకుండా మంజుపై దాడి చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మంజును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఆ సమయంలో పోలీసులు ఎవరూ అక్కడ లేరు. ఈ ఘోరం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి: ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో.. హాస్టల్లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం -
భర్త భారీ అప్పులు, మాట్లాడదామని పిలిచి మహిళపై దారుణం
సాక్షి, సైదాబాద్: భర్త చేసిన అప్పులకు భార్య బలైంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్‌పరిధిలో సోమవారం రాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. లోకాయుక్త కాలనీలోని నయాగ్రా అపార్ట్‌మెంట్స్‌లో మంజు (45) పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఆమె భర్త పరిమళ్ అగర్వాల్ అప్పులు చేసి ఏడాది నుంచి ఇంటికి రావడం మానేశాడు. మంజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషిస్తోంది. భర్త చేసిన అప్పులు చెల్లించాలని అప్పిచ్చిన వారు నిత్యం గొడవ చేసేవారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో అయిదుగురు వ్యక్తులు ఆమెతో గొడవపడ్డారు. మాట్లాడుకుందామని అపార్ట్మెంట్ బయటకు వెళ్లారు. వారితో మంజు మాట్లాడే సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో వారు పరారయ్యారు. సమాచారం తెలియడంతో జాయింట్ సీపీ చౌహాన్, డీసీపీ రమేష్, ఏసీపీ వెంకటరమణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
దారుణం: భర్త మెడపై కాలితో తొక్కి..
శివాజీనగర: భర్తను భార్య హత్య చేసిన దుర్ఘటన జే.జే.నగరలో తెల్లవారజామున జరిగింది. మోహన్ (41) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య పద్మ (37) నిందితురాలు. ఇద్దరూ బీబీఎంపీ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తుండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి మోహన్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇంట్లో పిల్లలు లేరు. దంపతుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మత్తులో ఉన్న మోహన్ కిందపడిపోగా భార్య అతని మెడపై తొక్కింది. స్పృహ తప్పి పడిపోవడంతో ఇరుగుపొరుగు సహాయంతో సమీపంలో ఆసుపత్రిలో తీసుకెళ్తుండగా చనిపోయాడు. పరారైన పద్మను జేజే నగర పోలీసులు గాలించి అరెస్ట్ చేశారు. చదవండి: విజయవాడ: అయ్యో.. తల్లీ ఎంతపని చేశావు! హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్ -
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణ హత్య
-
మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం..
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. అసద్‌ఖాన్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడు అసద్‌ఖాన్ ఓ హత్య కేసులో నిందితుడని.. ప్రత్యర్థులు హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం చేరుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో రెండు నెలలుగా వరుస హత్యలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: హైదరాబాద్‌లో బయటపడుతున్న వేల కోట్ల బ్లాక్‌మనీ నాంపల్లి హైకోర్టుకు హాజరైన విజయశాంతి -
భార్యపై అనుమానం.. తెల్లవారు జామునే నిద్రలేచి..
చీమకుర్తి (ప్రకాశం జిల్లా): ఆ జంట ఎనిమిదేళ్లు కలిసి కాపురం చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత దంపతులు తమ అనుబంధం మరిచారు. కనీసం పిల్లలు ఉన్నారన్న సోయ ఆ భర్తకు కలగలేదు. కట్టుకున్న భార్యను రోకలి బండతో తలపై బలంగా బాది నిలువునా ప్రాణం తీశాడు. విషయం బయటకు పొక్కటంతో మర్రిచెట్లపాలెం ఘొల్లుమంది. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం గ్రామానికి చెందిన అంకాల గురవయ్య తన భార్య వెంకట నారాయణమ్మ(35) హత్య చేశాడు. మండలంలోని మర్రిచెట్లపాలెంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానికంగా వలంటీర్‌గా విధులు నిర్వహించడంతో పాటు వేరే వారి సెల్‌షాపులో టెక్నీషియన్‌గా పని చేస్తున్న అంకాల గురవయ్య తన భార్య వెంకట నారాయణమ్మపై అనుమానం పెంచుకున్నాడు. భార్య స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ డ్వాక్రా మహిళా సంఘాల్లో వీఓఏగా కూడా పని చేస్తోంది. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గురవయ్య తరుచూ ఆమెతో ఘర్షణకు దిగుతుండేవాడు. దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన నారాయణమ్మన తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఎనిమిదేళ్ల ఉమేష్, ఆరేళ్ల భవ్యశ్రీ ఉన్నారు. ఏమైందో ఏమో శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటలకు ముందుగానే నిద్ర లేచిన గురవయ్య ఇంట్లోనే ఉన్న రోకలిబండతో బలంగా భార్య తలకు ఎడమ వైపు కొట్టాడు. ఆ దెబ్బకు నారాయణమ్మ ప్రాణాలు గాలిలోనే కలిసిపోయాయి. మృతదేహం ఉన్న మంచం కింద రక్తపు మడుగులు స్థానికులను ఆందోళను గురిచేసింది. హత్య చేసిన గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని సీఐ పి.సుబ్బారావు, ఎస్ఐ పి.నాగశివారెడ్డి సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు చీర్ల వెంకట్రావు ఫిర్యాదు మేరకు సీఐ పి.సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పాపం చిన్నారి.. ఊయలే ఉరితాడై .. భార్యా భర్తల గొడవ.. బామ్మర్తి చేతిలో బావ హతం -
మామ చేతిలో మేనల్లుడి హతం
పెందుర్తి(విశాఖపట్నం): తాగిన మత్తులో కుమారుడితో కలిసి మేనల్లుడినే (వరసకు అల్లుడు) మట్టుబెట్టాడు ఓ వ్యక్తి. పెందుర్తి సమీపం చినముషిడివాడలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కంచరపాలెం ప్రాంతానికి చెందిన కొత్తపల్లి చిన్నా(25) చినముషిడివాడ పాతూరులో నివాసం ఉంటున్న యమునని ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వృత్తిరీత్యా పెయింటర్ అయిన చిన్నా పనుల కోసం చినముషిడివాడ అత్తవారింటికి వచ్చేశాడు. కాగా.. గురువారం చిన్నా భార్య యమున పుట్టిన రోజు కావడంతో రాత్రి ఇంటి వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నాతో పాటు మామ కొల్లిపత్తి శంకర్, బావమరిది అశోక్ పూటుగా మద్యం సేవించారు. వీరి మధ్య పాత గొడవలు ఉండడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో శంకర్, అశోక్ కలిసి చిన్నా తలపై ఇనుపరాడ్‌తో బలంగా కొట్టారు. దీంతో చిన్నా కుప్పుకూలిపోయి అక్కడిడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. చిన్నా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. హత్యకు కారణం అదేనా.? అశోక్, యమున మధ్య అసహజ బంధం ఉన్నట్లు చిన్నా అనుమానించడమే హత్యకు కారణంగా తెలుస్తోంది. మృతుడు చిన్నా భార్య యమున తల్లి తులసి 18 ఏళ్ల కిందట భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి శంకర్‌తో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్ తన మేనల్లుడు అయిన చిన్నాకు తులసి కుమార్తె యమునకు పెళ్లి జరిపించాడు. వీరితో పాటే శంకర్ మొదటి భార్య కుమారుడు అశోక్ ఒకే ఇంట్లోని వేర్వేరు పోర్షన్లో ఉంటున్నాడు. శంకర్ మొదటి భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వరసకు సోదరి అయ్యే యమునతో అశోక్‌కు అసహజ బంధం ఉన్నట్లు చిన్నా తరచూ అనుమానించేవాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిత్యం గొడవలు జరిగేవి. అలా గురువారం రాత్రి కూడా మద్యం మత్తులో మాటామాటా పెరిగి చిన్నా హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇతరత్రా కోణాల్లో కేసును విచారిస్తున్నారు. చదవండి: భర్త చేష్టలతో విసుగుచెంది... బిడ్డల గొంతునులిమి చంపేశా.. నన్నెందుకు బతికించారు -
భర్త చేష్టలతో విసుగుచెంది...
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ), విశాఖపట్నం: భర్త చేష్టలతో విసుగుచెందిన ఓ భార్య.. అతన్ని హత్యచేసింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. పోలీసుల కథనం మేరకు.. జీవీఎంసీ 36వ వార్డు ఏవీఎన్ కళాశాల సమీపం ద్వారంవారివీధిలో నివాసం ఉంటున్న పూసర్ల పుండరీకాక్షయ్యతో పూసర్ల సాయిరాం అలియాస్ పుణ్యవతికి 2001లో వివాహం జరిగింది. వీరికి డిగ్రీ చదువుతున్న కుమార్తె దివ్య (18), పదో తరగతి చదువుతున్న కొడుకు యశ్వంత్ (14) ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు పుండరీకాక్షయ్య టిఫిన్ దుకాణం నడుపుతూ.. క్యాటరింగ్ వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో క్యాటరింగ్ పనికి వచ్చే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో.. ప్రతిరోజూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు భార్య సూచించినా.. పుండరీకాక్షయ్య పెడచెవిన పెట్టాడు. ఈ నేపథ్యంలో భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతనికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. పెళ్లీడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉండగా.. ఇటువంటి సంబంధాలు మంచివి కావని చెప్పి చూసింది. అయినప్పటికీ భర్తలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో పుండరీకాక్షయ్య మద్యానికి బానిసగా మారాడు. అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయి విచక్షణారహితంగా భార్య, పిల్లలపై దాడికి దిగేవాడు. పుణ్యవతి తల్లిదండ్రులు కురుపాం మార్కెట్ సమీపంలో నివాసం ఉండడం వల్ల భర్తతో గొడవపడినప్పుడు.. ఆమె పుట్టింటికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత వచ్చేది. ఈ నెల 10న ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన ఆమె.. 18న రాత్రి ఇంటికి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో తల్లి ఇద్దరు పిల్లలను వంటగదిలో ఉంచి బయట గడియపెట్టింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పుండరీకాక్షయ్య భార్యపై దాడికి దిగాడు. తనను తాను రక్షించుకునే క్రమంలో పుణ్యవతి అక్కడే ఉన్న ఇనుప గూటంతో భర్త తలమీద బలంగా మోదడంతో పుండరీకాక్షయ్య అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు సోదరి ఇచ్చిన సమాచారంతో పుణ్యవతిని పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. సీఐ వెంకటనారాయణ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది. చదవండి: నన్నెందుకు బతికించారు.. విషాదం: ప్రేమజంట ఆత్మహత్య -
దారుణం: బాత్రూమ్ గుంతలో మొండెం, కాళ్లు..
పలమనేరు(చిత్తూరు జిల్లా): దాదాపు నెల కిందట జరిగిన ఓ హత్య శుక్రవారం వెలుగు చూసింది. భర్తను భార్య, వరుసకు ఆమె సోదరుడు కలిసి చంపేశారనే విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. హతుడు పలమనేరు మండలం పందేరుపల్లె వడ్డూరుకు చెందిన పసల నాగరాజు(38) కాగా ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు పసల నాగరాజు, భాగ్యలక్ష్మి (34) కూలి పనులు చేసి జీవించేవారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 26న బంగారుపాళెం మండలం అండరెడ్డిపల్లెకు చెందిన పసల గోపి తన తమ్ముడు పసల నాగరాజు 13 రోజులుగా కనిపించలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం భాగ్యలక్ష్మి కి వరుసకు సోదరుడు, మండలంలోని క్యాటిల్ ఫామ్‌కు చెందిన నవీన్ (30) తానే నాగరాజును హత్య చేసినట్టు మొరం వీఆర్వో సిద్ధేశ్వర్ ముందు లొంగిపోయాడు. మృతదేహాన్ని ముక్కలుచేసి... నవీన్‌కు కుమార్తెనిచ్చి పెళ్లి చేసేందుకు నాగరాజు నిరాకరించాడు. అంతేగాక అనుమానంతో తరచూ భార్యను హింసించేవాడు. ఈ నేపధ్యంలో భర్తను అంతమొందించాలని నవీన్ ద్వారా ఆమె స్కెచ్ వేసింది. గత నెల 12వ తేదీ రాత్రి ఇంట్లో నాగరాజు మద్యం మత్తులో ఉండగా, నవీన్ వెళ్లి అతడి తలపై బండరాయితో బాది చంపేశాడు. అతడు తీసుకెళ్లిన కత్తితో మొండెం, కాళ్లు, చేతులు, శరీర భాగాలను ముక్కలు చేశాడు. బాత్రూమ్ గుంతలో పూడ్చేశాడు. సైకిల్‌పై తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. శుక్రవారం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ జయరామయ్య, ఎస్ఐలు నాగరాజు, ప్రియాంక, వెంకటసుబ్బమ్మ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. చదవండి: చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని.. -
పని ఒత్తిడితోనే పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
సాక్షి, షాద్‌నగర్‌రూరల్: విధుల్లో ఒత్తిడి, పనిభారంతోనే పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకున్నాడని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ యాదయ్య అన్నాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామ కార్యదర్శి ఆత్మహత్యకు నిరసనగా గురువారం ఫరూఖ్‌నగర్ మండల పంచాయతీ కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి జగన్నాథ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో భాగంగా జగన్నాథ్ ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డును అందకున్నారని అన్నారు. గ్రామంలో చేపట్టిన పనులకోసం ఖర్చు చేసిన బిల్లుల విషయంలో గ్రామ ఇంచార్జి సర్పంచ్, అధికారులు సహకరించకపోవడంతో ఆ త్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులసంఘం మండల అధ్యక్షుడు శ్రీరాం, çపంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, అనిల్, పండరీనా«థ్, మహేష్. ఫయాజ్, రాజేందర్, ముజఫర్, రామకృష్ణ, స్వాతి, అరుణ, నందిని, ప్రవళిక పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి శంషాబాద్ రూరల్: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్.శ్రీకాంత్‌గౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద జగన్నాథ్ చిత్ర పటానికి ఆయన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ప్రతిభ, శ్రీనివాస్‌రెడ్డి, అనిత, కృష్ణకాంత్, పంచాయతీ కార్యదర్శులు సురేష్, శశిధర్‌రెడ్డి, అశ్విని, భాస్కర్, ఇర్ఫాన్, శ్రీకాంత్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. మొయినాబాద్ రూరల్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని ఎదుర్కోవాలని మొయినాబాద్ ఎంపీడీఓ విజయలక్ష్మి అన్నారు. సంగారెడ్డి జిల్లా పూల్‌కల్ మండలం మిన్కూర్ గ్రామ కార్యదర్శి జగన్నాథ్ గ్రామ అభివద్ధిలో ఖర్చు చేసిన డబ్బుల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీఓ సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాఘవేందర్, మల్లేష్, దీపలత, తారాభాయ్, ప్రియాంక, లావణ్య, వనజ, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట... కొత్తూరు: సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ చిత్రపటానికి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గురువారం పలువురు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, ఎంపీఓ శ్రీనివాస్, ఏఓ గోపాల్, ఏఈఓలు సనా, దీపిక, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
దారుణం: ఆస్తి కోసం తల్లిని హత్య చేశాడు
సాక్షి, బనగానపల్లె(కర్నూల్): పెంచిన మమకారాన్ని మరచి, ఆస్తి కోసం తల్లినే హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ దారుణం బనగానపల్లె మండలం మిట్టపల్లె గ్రామంలో గురువారం వెలుగు చూసింది. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు..నార్పరెడ్డిగారి పుల్లమ్మ(58)కు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఈమె భర్త రామచంద్రారెడ్డి అనారోగ్యంతో 18 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలను పుల్లమ్మ పెంచి, పోషించి..వివాహం చేసింది. వృద్ధాప్యంలో కుమారుడు ప్రసాద్ రెడ్డి వద్ద ఉంటోంది. తల్లి పేరున ఉన్న పొలంలో మూడు ఎకరాలను ఇటీవల ప్రసాద్ రెడ్డి ఎకరా రూ.35 లక్షల చొప్పున విక్రయించాడు. వచ్చిన డబ్బుతో నిత్యం మద్యం తాగేవాడు. ఆస్తంతా తన పేరున రాయాలని తల్లితో వాగ్వాదానికి దిగేవాడు. ప్రసాద్ రెడ్డి భార్య అపర్ణ కాన్పుకోసం ఇటీవల పుట్టినిల్లు అయిన అవుకు మండలం మెట్టుపల్లెకు వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం తలుపు వేసి తల్లి పుల్లమ్మను దారుణంగా కత్తితో పొడిచాడు. తల్లి మృతి చెందడంతో ఇంటికి తలుపు వేసి పరారయ్యాడు. ప్రసాదరెడ్డి కోసం గురువారం బనగానపల్లె నుంచి మిట్టపల్లెకు వచ్చిన ఒక వ్యక్తి ఇంటి తలుపు తట్టి చూడగా.. పుల్లమ్మ రక్తపు మడుగులో కనిపించింది. ఇరుగు పొరుగు వారికి తెలియజేయగా..వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సురేష్ కుమార్‌రెడ్డి, ఎస్ఐ మహేష్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. హత్యకు పాల్పడిన ప్రసాదరెడ్డి తనకు ఏమీ తెలియనట్లు ఇంటి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో ఆయనను ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య
-
ప్రభుత్వ టీచర్ దారుణ హత్య, మంత్రి పరామర్శ
సాక్షి, మహబూబ్‌నగర్: పట్టణంలో దారణం చోటుచేసుకుంది. భగీరథ కాలనీ సమీపంలో నరహరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగుటు నరహరిని గొంతుకోసి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి నరహరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. అయినా అతడు మృతిచెందక పోవడంతో.. కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అయితే నరహరి స్నేహితుడికి 80 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు కుటుంబికుల నుంచి సమాచారం. దీంతో ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య మహబూబ్‌నగర్ పట్టణంలో సంచలనంగా మారింది. మృతుడి భార్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే కావడం గమనార్హం. కాగా మృతుడి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి పరామర్శించారు. -
సోదరి పెళ్లికి కట్నం ఎక్కువ ఇస్తోందని..!
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): చెల్లిలి వివాహాన్ని అడ్డుకునేందుకు తల్లిని రోకలి బండతో కిరాతకంగా కొట్టి చంపాడో కొడుకు. ఈ సంఘటన మండలంలోని ఖాజీపురంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని పూనూరు పెద్ద వెంకటరెడ్డి, ఆశ కార్యకర్త అరుణ (45) దంపతులకు మానసిక వికలాంగుడైన హరీష్‌కుమార్‌రెడ్డి, బీఫార్మసీ చదువుతున్న కళ్యాణి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కళ్యాణికి పెళ్లి సంబంధం చూశారు. పది రోజులుగా ఉన్న డబ్బులన్నీ చెల్లెలు వివాహానికి ఖర్చు పెడితే తనకు ఏమీ మిగలదని, ఎవరో ఒకరిని చంపుతానని బెదిరిస్తూ ఉన్నాడు కొడుకు. తండ్రి పొలానికి వెళ్లిన సమయంలో తల్లి అరుణ ఇంట్లో ఒంటరిగా ఆదమరిచి పనులు చేసుంటోంది. ఆ సమయంలో రోకలిబండ తీసుకుని తల్లి తలపై హరీష్‌కుమార్‌రెడ్డి కొట్టాడు. బలంగా పలుమార్లు కొట్టడంతో తలపగిలి గట్టిగా కేకలు పెడుతూ అక్కడికక్కడే పడిపోయింది. స్థానికులు గమనించిన చుట్టు పక్కల వారు భర్తకు సమాచారం ఇవ్వడంతో తీవ్రంగా గాయపడిన అరుణను ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గం మధ్యలోనే అరుణ మృత్యువాత పడింది. ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రి అనారోగ్యం ఒకవైపు, కుటుంబానికి అన్నీ విధాలుగా అండగా ఉన్న తల్లి మరణంతో తనకు ఇక దిక్కెవరంటూ కుమార్తె భోరున విలపిస్తోంది. చదవండి: భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..! కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. -
దారుణం: తల్లిని కడతేర్చిన కసాయి కూతురు
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): కన్నతల్లిని కుమార్తె హత్య చేసిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల కథనం మేరకు... ఏటీ అగ్రహారం జీరో లైనులో నివసించే పూతాబత్తిని భూలక్ష్మి (58)కి కుమారుడు నాగరాజు, కుమార్తె దాసరి అలియాస్ భవనం రమాదేవి ఉన్నారు. ఆరేళ్ల కుమారుడు రాహుల్‌రెడ్డితో కలిసి రమాదేవి తల్లి వద్దే ఉంటోంది. వ్యసనాలకు బానిసగా మారిన రమాదేవి కుమారుడిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో 25వ తేదీ రాత్రి రమాదేవి బయటకు వెళ్లడంతో కుమారుడు రాహుల్ ఆహారం తీసుకోకుండా ఏడుస్తుండటంతో తల్లి భూలక్ష్మి కుమార్తెకు ఫోన్ చేసి ఇంటి రావాలని చెప్పింది. ఇంటికి వచ్చిన తరువాత తల్లీకుమార్తెల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమాదేవి తల్లి భూలక్ష్మి గొంతు నులుముతుండగా నాగరాజు గమనించి, అడ్డుకుని, విడిపించాడు. అనంతరం తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ భూలక్ష్మి మృతిచెందింది. నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తరగతి గదిలో టీచర్‌పై హత్యాయత్నం భార్య కాపురానికి రావడంలేదని.. అత్తను చంపేశాడు -
భార్య కాపురానికి రావడంలేదని.. అత్తను చంపేశాడు
బుక్కరాయసముద్రం(అనంతపురం జిల్లా): మాటామాట పెరగడంతో ఓ వ్యక్తి తన అత్తపై కొడవలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన శుక్రవారం చెన్నంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నంపల్లి గ్రామానికి చెందిన హుసేన్‌బీ(55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహాలయ్యాయి. రెండో కుమార్తె షేకున్‌బీని నార్పలకు చెందిన మహబూబ్‌బాషాకిచ్చి పదేళ్ల క్రితం పెళ్లి చేసింది. అయితే మద్యానికి బానిసైన మహబూబ్‌బాషా రోజూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువ కావడంతో రెండురోజుల క్రితం హుసేన్‌బీ తన కూతురు షేకున్‌బీని చెన్నంపల్లికి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం పూటుగా మద్యం తాగి చెన్నంపల్లికి వచ్చిన అల్లుడు మహబూబ్‌బాషా తన భార్యను పంపాలని హుసేన్‌బీతో గొడవకు దిగాడు. మాటామాట పెరగడంతో వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో హుసేన్‌బీ తలకు, చేతులకు గాయాలు కాగా తీవ్ర రక్తస్రావమైంది. అక్కడి నుంచి పరారైన మహబూబ్‌బాషా నేరుగా నార్పల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కొన ఊపిరితో ఉన్న హుసేన్‌బీని స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. నార్పల పోలీసులు నిందితున్ని బుక్కరాయసముద్రం పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అనూష హత్య కేసులో నిందితుడి అరెస్ట్ కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా! -
దారుణం: వివాహితుడనని చెప్పకుండా..
మైసూరు: ప్రశాంతంగా ఉండే మైసూరులో ఘోరం చోటుచేసుకుంది. పెళ్లయిన వ్యక్తి ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మండ్య జిల్లాలోని హొంబాళె కొప్పలు గ్రామానికి చెందిన కాంట్రాక్టరు హెచ్,ఎం.లోకేష్ (30), నాగమంగలకు చెందిన అమూల్య (25)ను ప్రేమ పేరుతో మభ్యపెట్టాడు. లోకేష్‌కు ఇప్పటికే పెళ్లయి ఒక కుమార్తె కూడా ఉంది. మైసూరులో ఎమ్మెస్సీ చదివే అమూల్యతో తాను వివాహితుడనని చెప్పకుండా షికార్లకు తిరిగాడు. (చదవండి: పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. జవాను ఆత్మహత్య) ఆమె పెళ్లి చేసుకోవాలని కోరగా, మాట్లాడాలని చెప్పి బుధవారం సాయంత్రం మైసూరులోని ఒక హోటల్లో రూం తీసుకున్నారు. అక్కడ ఏం గొడవ జరిగిందో అతడు అమ్మాయిని గొంతు నులిమి చంపి తన స్నేహితునికి ఫోన్ చేసి చెప్పి తరువాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు, పోలీసులు వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి కనిపించారు. హెబ్బాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: దుపట్టాతో ఉరి.. తొడపై సూసైడ్ నోట్!) -
టైలర్ హత్య కేసు: ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భార్యే..
సాక్షి, కొత్తూరు(భువనేశ్వర్): భామిని మండలంలో సంచలనం సృష్టించిన టైలర్ నల్లకేవటి కుమారస్వామి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త హత్యకు భార్యే సూత్రధారని నిగ్గుతేల్చారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైనర్ కూడా ఉండడం గమనార్హం. ప్రేమాయణమే ప్రాణం తీసేందుకు ఉసుకొల్పిందని పోలీసులు వివరించారు. భామిని మండలం దిమ్మిడిజోల సమీపంలో ఈ నెల 25వ తేదీన నడిరోడ్డుపై ఇదే మండలం లోహజజోల గ్రామానికి చెందిన నల్లకేవటి కుమారస్వామి దారుణహత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తూరు సీఐ మజ్జి చంద్రశేఖర్, బత్తిలి ఎస్సై కేవీ సురేష్‌లు తమ సిబ్బందితో కలసి అయిదు రోజుల్లో హంతకులను పట్టుకొన్నారు. వారిని కొత్తూరులో విలేకరుల ముందు శుక్రవారం ప్రవేశపెట్టారు. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమారస్వామికి మాలతితో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లికి ముందు మాలతి తాతగారి గ్రామమైన పాతపట్నం మండలం గంగువాడలో ఉండేది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన పెనుబాకల హేమసుందరావు(శ్యామ్), మాలతిలు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరిదీ వేర్వేరు సామాజిక వర్గాలు కావడంతో పెళ్లి చేసుకోవడానికి వీలు కాలేదు. కుటుంబీకులు అదే ఏడాదిలో వారి సమాజికవర్గాలకు చెందినవారితో పెళ్లిళ్లు చేసేశారు. అయితే వివాహాలైనప్పటికీ హేమసుందరరావు, మాలతి మధ్య ప్రేమ పోలేదు. రెండు కుటుంబాలు వేర్వేరుగా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వీరిలో హేమసుందరరావు తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. హత్యకు గురైన కుమారస్వామి టైలర్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అక్కడ కూడా ఇద్దరి ప్రేమ కొనసాగేదని.. దీంతో రెండు కుటుంబాల మధ్య తరచూ తగాదాలు జరిగేవని సీఐ వివరించారు. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి భార్య మాలతి, పిల్లలను తీసుకొని స్వగ్రామం లోహరజోల తిరిగి వచ్చేశాడు. అయితే మాలతి, హేమసుందరరావు ప్రేమ వ్యవహారం ఫోన్ ద్వారా కొనసాగుతుండేది. తమ ప్రేమకు భర్త కుమారస్వామి అడ్డుగా ఉంటున్నారని భావించిన వారు అతని ప్రాణాన్ని తీసి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 25 తేదీన పర్లాకిమిడిలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లాలని భర్త కుమారస్వామికి మాలతి చెప్పడంతో నిజమని నమ్మాడు. ఇద్దరి పిల్లలను తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అయితే తమ ప్రయాణ సమాచారాన్ని ప్రియుడు హేమసుందరరావుకు చేరవేయడంతో అతను కూడా ఓ మైనర్ బాలుడిని వెంట తీసుకొని బైక్‌పై అదేమార్గంలో వస్తూ.. కుమారస్వామి బైక్ రాక పోకలను గమనించాడు. దిమ్మిడిజోల సమీపంలోకి వచ్చేసరికి కుమారస్వామి బైక్‌ను ఆపి కత్తులతో అతన్నిపొడిచి.. హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాలతిపై అనుమానంతో అమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భర్త హత్యను పక్కదారి పట్టించడానికి మాలతి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు పసిగట్టారు. తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించడంతో చివరకు హంతకుడిని పట్టుకున్నారు. ఈ ఘటనలో హేమసుందరరావు, అతని వెంట వచ్చిన మైనర్ బాలుడిని, ప్రధాన సూత్రధారి మాలతిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐ వివరించారు. హత్యకు ఉపయోగించిన కత్తులను పాతపట్నంలో హంతకుడు కొనుగోలు చేసినట్లు సీఐ చెప్పారు. -
పూరి గుడిసెలో పిల్లల శవాలు
రాంచీ : పూరి గుడిసెలో ఇద్దరు పిల్లల శవాలు వెలుగు చూసిన ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, రాంచీకి సమీపంలోని చన్హా ప్రాంతానికి చెందిన మనీష్ ఓరన్(12), గణేష్ భగవత్(16)లు ఆదివారం ఓ పొలంలోకి వెళ్లే విషయమై కొంతమంది బాలురతో గొడపడ్డారు. ఆ సాయంత్రమే గ్రామ శివారులోని పూరి గుడిసెలో శవాలై కనిపించారు. మనీష్ శవం గుడిసెకు వేళాతుండగా.. భగవత్ శవం నేలపై పడి ఉంది. ( హోటల్ గదిలో అత్యాచారం.. వీడియో తీసి..) సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అక్కడి నేలపై ఓ కర్రను గుర్తించారు. ఆ కర్రతోటే ఇద్దర్నీ కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, చిన్నారుల మృతిపై ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రాంచీ-పలాము జాతీయ రహదారిని దిగ్భందించి నిరసనలు తెలియజేశారు. -
కిరాతకం: వివాహం కావడం లేదని..
చిక్కబళ్లాపురం(కర్ణాటక): ఇంట్లో దివ్యాంగురాలైన చిన్నారి ఉండటం వల్లనే తనకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఓ వ్యక్తి ఐదేళ్ల వయసున్న తన అన్న కుమార్తెను కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. హృదయవిదారకమైన ఈ అమానుష ఘటన తాలూకా పరిధిలోని అంగరేకనహళ్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, శంకర్లు అన్నదమ్ములు. వీరిది ఉమ్మడి కుటుంబం. కృష్ణమూర్తికి ఐదేళ్ల వయసున్న చర్విత అనే కుమార్తె ఉంది. బాలిక పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇక శంకర్‌కు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరలేదు. తన అన్న కుమార్తె దివ్యాంగురాలైనందున తనకు సంబంధాలు కుదరడం లేదని గొడవపడేవాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుండగా తన వదిన ఎదురుగానే బాలిక గొంతుకోసి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడకక్కడే ప్రాణాలు వదిలింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు శంకర్ కోసం గాలింపు చేపట్టారు. -
తల్లీకుమారుడి దారుణ హత్య
సాక్షి, చందూరు (నిజామాబాద్): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చందూరు శివారులో తల్లీకుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. హుమ్నాపూర్ వాసి సావిత్రి(30) సహా రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన నిందితుడు.. చందూరు శివారు అటవీ ప్రాంతంలో పాతిపెట్టాడు. గత నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఘన్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. వివాహేతర సంబంధ వ్యవహారమే హత్యకు గల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు.. పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది. -
నక్సల్స్ ఘాతుకం: కాంట్రాక్టర్ దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను దారుణంగా హత్య చేసిన నక్సల్స్ అదే సమయంలో అక్కడే గల విలువైన వాహనాలను దహనం చేశారు. సుక్మా జిల్లా మాథిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోలియాగూడలో నక్సలైట్లు ఈ బీభత్స ఘటనకు పాల్పడ్డారు. భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వచ్చిన మావోయిస్టులు తొలుత మూడు వాహనాలకు నిప్పటించారు. ఆ తర్వాత అక్కడే ఉండి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ను చంపారు. నిన్న సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తమ సహచరున్ని పోలీసులు కాల్చి చంపారనే ఆగ్రహంతో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికంగా భీతావహాన్ని కలిగించిన ఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. -
పట్టించిన టైలర్ లేబుల్.. రెండో ప్రియుడితో కలిసి..
యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా): ఓ హత్య కేసులో నలుగురు నిందితులను హతుడు ధరించి ఉన్న చొక్కా టైలర్ లేబుల్ పట్టించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులను కేవలం 12 రోజుల్లో అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గత నెల 26వ తేదీన పుల్లలచెరువు నుంచి గంగవరం వెళ్లే దారిలో 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుర్తుతెలియన వ్యక్తి హత్యకు గురైనట్లు సీఐ దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో అతడి చొక్కాపై ఉన్న టైలర్ లేబుల్ ఆధారంగా మృతుడిది గుంటూరు జిల్లా వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన వాడుగా గుర్తించారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. హతుడు వినుకొండ మండలం ఉప్పరపాలేనికి చెందిన తిరుమల శ్రీనుగా గుర్తించారు. శ్రీను గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, పుల్లలచెరువు ప్రాంతాల్లో తిరుగుతూ నైటీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అతడికి ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. తన స్వగ్రామం ఉప్పరపాలెంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అదే గ్రామానికి చెందిన గోళ్ల నాగార్జునతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని గ్రహించిన శ్రీను ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. శ్రీనును అడ్డు తొలగించుకోవాలని ఆమె మరో ప్రియుడు నాగార్జునతో కలిసి పథకం వేసింది. పథకంలో భాగంగా పుల్లలచెరువులో నైటీలు అమ్ముదామని ఆమె శ్రీనుతో చెప్పింది. గంజాయి తాగే అలవాటు ఉన్న శ్రీను.. ఆమెతో కలిసి గంగవరం రోడ్డులోని నిర్మానుష్య స్థలంలోకి వచ్చాడు. అక్కడ వేచి ఉన్న ఆమె రెండో ప్రియుడు నాగార్జున కర్రతో దాడి చేసి శ్రీనును తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెతో కలిసి టవల్‌తో అతని గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. గతంలో నిందితుడు నాగార్జున ఒక యువతిని మోసం చేశాడు. హతుడు అప్పట్లో బాధితురాలికి అండగా ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రియురాలి ప్రోత్సాహం కూడా ఉండటంతో శ్రీనును నాగార్జున హత్య చేశాడు. హత్యానంతరం నిందితుడు హతుడి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లాడు. తన తండ్రి అంజయ్యకు విషయం చెప్పి అది ఇచ్చాడు. ఆ గొలుసును అమ్మి పెట్టాలని ఆయన తమ సమీప బంధువు రావులపల్లి హనుమంతయ్యకు ఇచ్చాడు. మృతుడి బంగారు గొలుసు, హత్యకు ఉపయోగించిన కర్ర, నిందితుల సెల్ఫోన్లు, నాగార్జునకు చెందిన బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నాగార్జున, హతుడి ప్రియురాలు, అంజయ్య, హనుమంతయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. తక్కువ సమయంలోనే హత్య కేసును ఛేదించిన సీఐ దేవప్రభాకర్, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, పి.ముక్కంటి, వి.హరిబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుళ్లు అంజి, హుస్సేన్, రమేష్‌లను డీఎస్పీ అభినందించారు. -
విషాదం: నీ వెంటే మేమూ!
సాక్షి, చెన్నై: భర్త మరణించి ఏడాది అవుతున్నా ఆయన జ్ఞాపకాలు వెంటాడటంతో బతుకు భారమై ఓ భార్య ఆత్మాహుతి చేసుకుంది. వెళ్తూ..వెళ్తూ ఇద్దరు ఆడ బిడ్డలను హతమార్చింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌కు చెందిన రంజిత్‌కుమార్ (32), రాశి(30) దంపతులకు అక్షయ(5), అనుçసయ(3) ఉన్నారు. మెడికల్ ఏజెన్సీ నడుపుతూ వచ్చిన రంజిత్ కుమార్ గత ఏడాది అనారోగ్యంతో మరణించాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్త చంద్ర, మామ రామదాసు ఇంట్లో రాశి ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రంజిత్‌కుమార్ సంవత్సరికం జరిగింది. ఆ రోజు నుంచి తీవ్ర మనోవేదనతో ఉంది. (చదవండి: భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ) ఈ క్రమంలో సోమవారం స్నానపు గది నుంచి వాసన రావడంతో అత్త చంద్ర వెళ్లి పరిశీలించింది. రాశి సజీవ దహనమై కనిపించింది. అనంతరం గదిలోకి వెళ్లి పిల్లలను చూడగా విగత జీవులుగా పడివున్నారు. నాగర్ కోయిల్ డీఎస్పీ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ సాయిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో రాశి రాసిపెట్టిన లేఖ బయట పడింది. తన అన్నలు, వదినమ్మలకు ఆ లేఖ రాస్తూ, తనను క్షమించాలని.. సంవత్సరికం కోసం ఎదురు చూశానని, ఆ తంతంగం ముగిసిందని, అందుకే తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొనడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచింది. (చదవండి: బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) -
ఆధిపత్యం కోసమే సుబ్బారాయుడి హత్య
సాక్షి, కర్నూలు : నంద్యాలలో ఈ నెలలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి హత్య కేసును నంద్యాల పోలీసులు చేధించారు. కాగా ఈ నెల 9న వైఎస్సార్సీపీ నేత, న్యాయవాది సుబ్బారాయుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నంద్యాలకు చెందిన సుబ్బరాయుడు వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మాటువేసి కర్రలతో కొట్టి హత్యచేశారు. అయితే ఆదిపత్య పోరుతోనే అతడిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. టీడీపీకి చెందిన మనోహర్ గౌడ్‌తోపాటు మరో ముగ్గురు అనుచరులు సుబ్బరాయుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: నంద్యాలలో వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య అంతేగాక హత్యకు పాల్పడిన టీడీపీ నాయకుడైన మనోహర్ గౌడ్.. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సన్నిహితుడిగా తేలింది. ఆధిపత్యం కోసమే సుబ్బారాయుడిని హత్య చేసినట్లు నిందితుడు మనోహర్ గౌడ్ అంగీకరించాడు. హత్యకు పాల్పడిన మనోహర్ గౌడ్, రవికుమార్, సురేంద్ర, హరి నాయక్‌లను నంద్యాల తాలూకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నెల్లూరులో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం