
తిరువొత్తియూరు(తమిళనాడు): మూడోసారి ఆడబిడ్డ పుట్టిందని కన్నతల్లే కడతేర్చిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నామక్కల్ జిల్లా ఎరుంపట్టికి చెందిన చిన్నతంబి కుమారుడు సూర్య, కస్తూరి (27) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన కస్తూరిని ప్రస వం కోసం నామక్కల్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కస్తూరి ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయింది.
ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 13వ తేదీ శిశువు మృతి చెందినట్లు కస్తూరి పోలీసులకు తెలిపింది. అనుమానంతో బిడ్డ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అందులో శిశువు హత్యకు గురైనట్లు తెలిసింది. మూడో సారి ఆడబిడ్డ పుట్టడంతో హత్య చేసినట్లు కస్తూరి నేరం ఒప్పుకుంది. శుక్రవారం పోలీసులు కస్తూరిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment