దివ్య, రాజదురై
చెన్నై, అన్నానగర్: దారి దోపిడీ పోటీలు పెట్టుకుని ముగ్గురు యువకులను హతమర్చిన ఘటన తిరువలంలో కలకలం రేపింది. వారి మృతదేహాలను పొన్నై నదిలో ఖననం చేసినట్లు దోపిడీదారులు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం కలిగించింది. వివరాలు.. రాణిపేట జిల్లా సిప్కాట్ హౌసింగ్ బోర్డు పంప్ హౌస్ ప్రాంతంలో గత 16వ తేదీ అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను సిప్‌కాట్ పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా వారిలో ఒకరు పారిపోయాడు. మరో ముగ్గురి పట్టుబడ్డారు. రాణిపేట చిక్కరాజపురం మోట్టూరు బజన ఆలయ వీధికి చెందిన యువరాజ్ (26), పల్లవ నగర్ కన్నికోవిల్ వీధికి చెందిన వాసు (19), తిరువలం బస్టాండ్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంటుకు చెందిన అరవిందన్ (19)గా గుర్తించారు.
మార్చి నెలలో మలైమేడు ప్రాంతానికి చెందిన శరవణన్ భార్య వల్లి (30) అనే మహిళ వద్ద రూ.లక్ష విలువ చేసే బంగారు చైన్‌ను దారి దోపిడీ చేసినట్లు అంగీకరించారు. అంతేకాకుండా పారిపోయిన వ్యక్తి విజయప్రకాశ్, చెన్నైకి చెందిన నలుగురితో కలిపి మొత్తం 8 మంది గత ఏడాది జూన్ నెలలో చోరీ, దారి దోపిడీ పోటీలు పెట్టుకుని చెన్నైకి చెందిన ఆసిఫ్, విల్లుపురం జిల్లా తేని గ్రామానికి చెందిన నవీన్, సూర్య అనే ముగ్గురి నరికి హతమార్చినట్లు చెప్పారు. మృతదేహాలను తిరువలం చెంబరాజపురం గ్రామంలోని తాటి తోట వద్ద ఉన్న పొన్నై నదిలో ఖననం చేసినట్టు తెలిపారు. అయితే ఆ స్థలం వేలూరు జిల్లా సెంబరాజపురంలోని రెవిన్యూ శాఖ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వీఏఓ జోతీశ్వరన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువలం పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించాలని నిర్ణయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
హత్యకు గురైన నవీన్, సూర్య, ఆసిఫ్
ప్రియుడితో కలిసి కన్నబిడ్డ హత్య
ప్రియుడితో కలిసి కన్నబిడ్డనే కడతేర్చిందో తల్లి. వివరాలు.. కోవై కోవిల్ మేడు ప్రాంతంలో నివసిస్తున్న దివ్య (30) భర్త నుంచి విడిపోయి తన ఇద్దరు పిల్లలతో తుడియలూరులో నివాసముంటోంది. కొద్ది రోజులకు అదే ప్రాంతానికి చెందిన రాజదురైతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరు ఇరువై రోజుల క్రితం సాయిబాబా కాలనీకి నివాసం మార్చారు. వారి ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని కుమారుడు అభిషేక్ (6)ను చిత్రహింసలు పెట్టారు. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. అయితే వారి తీరుపై అనుమానం రావడంతో 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దివ్య, రాజదురై గుట్టు రట్టైంది. విచారణలో అభిషేక్ తనని తండ్రిగా అంగీకరించలేదని, తమ ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని అందుకే దివ్యతో కలిసి హతమార్చినట్లు రాజదురై అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. మూడేళ్ల కుమార్తెను శిశు సంక్షణ కేంద్రానికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment