
హత్యకు గురైన ఉషా.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు(ఫైల్)
సాక్షి, చెన్నై : తిరునల్వేలి జిల్లాలో తల్లిని హత్య చేసిన మతిస్థిమితం లేని కూతళ్ల ఘటనకు సంబంధించి దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు బర్గర్ కొనివ్వటంతో... హత్య తామే చేసినట్లు ఆ ఇద్దరు ఒప్పుకున్నారు. తల్లిని హత్య చేసిన తర్వాత రక్తపు మడుగుల్లో పడి ఉన్న తల్లి శవం పక్కనే కూర్చుని, బొమ్మలకు రక్తం పూస్తూ వారు ఆడుకున్నట్లు విచారణలో తేలింది.
కేసు పూర్వాపరాలు : తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్‌పిచ్చై, ఉషా (50) దంపతులకు కుమార్తెలు నీనా(21), రీనా(19) ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కోయిల్‌పిచ్చై మున్నీర్‌పల్లంలో ఉంటున్నాడు. నీనా, రీనా ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఉషా స్కూలు పిల్లలకు ట్యూషన్ చెబుతూ జీవనం సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం ట్యూషన్ కోసం వచ్చిన పిల్లలు తలుపు వేసి ఉండటంతో కిటికీలోంచి లోపలికి చూసి, షాక్ అయ్యారు. ఉషా రక్తపు మడుగుల్లో పడిపోయి ఉండగా పక్కనే ఇద్దరు పిల్లలు కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మతిస్థిమితం లేని ఇద్దరు కూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment