daughters
-
చదువు ఖర్చులు తల్లిదండ్రుల నుంచి పొందడం కుమార్తెల హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కుమార్తెలు తమ చదువులకయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందడం చట్టబద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆడబిడ్డలను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంది. విద్యాభ్యాసానికి అయ్యే సొమ్మును పొందడం ఆడపిల్లల చట్టబద్ధమైన హక్కు అని తేల్చిచెప్పింది. పెద్దలు తమ స్థోమత మేరకు కుమార్తెలకు చదువులు చదివించాలని వెల్లడించింది. విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. సదరు దంపతులు 26 ఏళ్ల క్రితం విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. మనోవర్తి కింద భార్యకు రూ.73 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. ఇందులో కుమార్తె చదువులకు అయ్యే ఖర్చు రూ.43 లక్షలు కలిపే ఉంది. కుమార్తె ఐర్లాండ్‌లో చదువుతోంది. తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకొనేందుకు నిరాకరించింది. తన సొంత డబ్బుతో చదువుకోగలనని, ఇంకొకరి సాయం అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కన్నబిడ్డను చదివించుకోగలనని, చదువుకయ్యే సొమ్మును తన కుమార్తె తీసుకొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం ఈ నెల 2వ తేదీన విచారణ చేపట్టింది. చదవులకయ్యే ఖర్చును తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెకు ఉందని వెల్లడించింది. తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే తల్లికి ఇవ్వాలని సూచించింది. -
పిల్లలతో కలిసి స్కూల్లో డ్యాన్స్ చేసిన అమ్మ
-
మామా అల్లుళ్ల సవాల్, నువ్వా..నేనా? అంటూ కూతురు, చివరికి!
మహారాష్ట్రలో ఇటీవల 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. వార్డుల పునర్విభజన తరువాత తమకు ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలు పక్కనున్న నియోజక వర్గాల్లోకి వెళ్లిపోవడం, కొన్ని నియోజక వర్గాలు వివిధ కులాలకు, మహిళలకు రిజర్వుడు కావడంతో రాజకీయ అనుభమున్న సీనియర్ నేతలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అనేక మంది నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపాల్సి వచ్చింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్ధులు విజయ ఢంకా మోగించారు.అనేక చోట్ల భార్యలు, కూతుళ్లు, సొంత సోదరులు, సోదరీమణులు, మామా, అల్లుడు, కోడళ్లు ఇలా దగ్గరి బంధువులు వివిధ పార్టీల టికెట్లపై లేదా ఇండి పెండెంట్లుగా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ అనేక చోట్ల గెలిచారు. ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావడం వారిలో సంతోషాన్ని నింపింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొంతమందికి చోటు దక్కే అవకాశముండటంతో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రభుత్వంలో కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బారామతిలో మామా అల్లుళ్ల పోటీకాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ముల్లో అమిత్ దేశ్‌ముఖ్ విజయం సాధించగా, లాతూర్ రూరల్ నియోజక వర్గంలో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ పశ్చిమమ బాంద్రా నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు వినోద్ శేలార్ పశ్చిమ మలాడ్ నియోజక వర్గంలో ఓడిపోయారు. మాజీ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ తనయుడు సలిల్ దేశ్‌ముఖ్ కాటోల్ నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆయన సోదరుడి కొడుకు ఆశీష్ దేశ్‌ముఖ్ సావనేర్ నియోజక వర్గంలో గెలిచారు. అనీల్ దేశ్‌ముఖ్ సొంత మేనల్లుడు, ఎంపీ అమర్ కాళే సతీమణి మయురా కాళే ఆర్వీ నియోజక వర్గంలో ఓటమిని చవిచూశారు. మంత్రి ఛగన్ భుజబల్ యేవలాలో గెలిచారు. కానీ ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ నాంద్గావ్లో పరాజయం పాలయ్యారు. బహుజన్ వికాస్ ఆఘాడి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ వసాయ్‌లో, ఆయన తనయుడు క్షితిజ్ ఠాకూర్ నాలాసోపారాలో ఓడిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇంద్రనీల్ నాయిక్ పుసద్ నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు యయాతీ (ఇండిపెండెంట్) కారంజాలో ఓడిపోయారు. ఇక బారామతిలో మేనమామ, మేనల్లుడు మధ్య పోరు జరిగింది. వీరిలో మామ అజిత్ పవార్ గెలుపొందగా, మేనల్లుడు యుగేంద్ర పరాజయం పాలయ్యారు. న్యూ ముంబైలోని ఏరోలీలో తండ్రి, కొడుకుల మధ్య పోరు జరిగింది. వీరిలో తండ్రి, మాజీ మంత్రి గణేశ్ నాయిక్ (బీజేపీ) గెలుపొందగా, తనయుడు సందీప్ నాయిక్ బేలాపూర్‌లో ఎస్పీ వర్గం టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ని బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే ఓడించారు. బోకర్‌లో తండ్రిపై కుమార్తె విజయంగడ్చిరోలీ జిల్లా అహేరీ నియోజక వర్గం ఎన్సీపీ(ఏపీ) అభ్యర్థి, మంత్రి ధర్మరావ్బాబా ఆత్రం తన సొంత కూతురు భాగ్యశ్రీ ఆత్రంను ఓడించారు. భాగ్యశ్రీ ఇండిపెండెంట్‌గా, తండ్రికి ప్రత్యర్ధిగా పోటీ చేశారు. భాగశ్రీతోపాటు ఆయన మేనల్లుడైన అంబరీష్ రాజే ఆత్రం కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే కావడం విశేషం. మరోవైపు నాందేడ్ జిల్లా లోహా నియోజక వర్గం నుంచి ఎన్సీపీ(ఏపీ) తరపున పోటీచేసిన మాజీ ఎంపీ ప్రతాప్‌రావ్ పాటిల్ చిఖిలీకర్ స్వయాన తన సోదరి ఆశా శిందేను ఓడించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ఆయన సొంత కూతురు శ్రీజయ బోకర్ నియోజక వర్గంలో ఓడించారు. ఆమె బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. బోకర్ నియోజక వర్గం అశోక్ చవాన్‌కు గట్టిపట్టున్న ప్రాంతంగా పేరు పొందింది. పారంపర్యంగా వస్తున్న గెలుపును మళ్లీ చేజిక్కించుకునేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కూతురు చేతిలో చవాన్ ఓడిపోక తప్పలేదు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్సీపీ(ఏపీ) ప్రదేశ్ అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే కుమార్తై, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అదితీ తట్కరే శ్రీవర్ధన్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించారు. చదవండి: ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?కాగా బోకర్, శ్రీవర్ధన్ రెండు చోట్ల కుమార్తైలు తండ్రులను ఓడించడం విశేషం. మరోవైపు ఆదివాసి సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ నందుర్బార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు. కాని ఆయన ఇద్దరు సొంత సోదరులైన రాజేంద్రకుమార్ గావిత్ (కాంగ్రెస్) శహదా నియోజక వర్గంలో, శరద్ గావిత్ (ఇండిపెండెంట్) నవాపూర్ నియోజక వర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా విజయ్‌కుమార్ గావిత్ కుమార్తై హినా గావిత్ అక్కల్కువా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గావిత్ కుటుంబంలో ఒక్కరికే ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. ఇక మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దానవే తనయుడు సంతోష్ దానవే బోకర్ నియోజక వర్గంలో మరోసారి గెలిచారు. కన్నడ్ నియోజక వర్గం నుంచి శివసేన ఏక్నాథ్ శిందే వర్గం టికెట్‌పై పోటీచేసిన రావ్‌సాహెబ్ కుమార్తై సంజనా విజయకేతనం ఎగురవేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రావ్‌సాహెబ్ ఓటమి పాలయ్యారు. కానీ పిల్లలిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆయనకు డబుల్ గిఫ్ట్ లభించినట్లైంది. లాతూర్‌లో మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇద్దరు తనయుల్లో ఒకరు ఓడిపోయారు.తండ్రి ఎంపీ.. కుమారులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక మహారాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులు, తండ్రి ఇలా ముగ్గురూ అధికారంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇద్దరు కొడుకుల్లో ఒకరైన నితేష్ రాణే కంకావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, రెండో కొడుకు నిలేష్ రాణే కుడాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారీ్టతో గెలిచారు. దీంతో వారిద్దరూ శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారాయణ్ రాణే ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ రత్నగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు కిరణ్ సామంత్ రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఇరువురూ ఏక్నాథ్ శిందే వర్గం తరపున పోటీ చేశారు. అలాగే తూర్పుబాంద్రా నియోజక వర్గంలో వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. వరుణ్ సర్దేశాయ్, ఉద్ధవ్ ఠాక్రే సతీమణీ రష్మీ ఠాక్రేకు స్వయానా చెల్లెలి కుమారుడు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి గెలిచారు. దీంతో వరుస సోదరులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎన్సీపీ(ఏపీ) తరపున పుణేలోని అంబేగావ్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరి సాయితాయి డహాకే కరాంజ నియోజక వర్గంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన సోదరుడు, సోదరి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. -
ఏడేళ్లు దూరమైన నాన్న.. కూతుళ్ల కన్నీళ్లు
-
బాలయ్య అఖండ-2 పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన కూతురు బ్రాహ్మణి (ఫొటోలు)
-
‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!
కుటుంబంలో ఒకరు డాక్టర్ అవడం సాధారణంగా చూస్తుంటాం. ఇద్దరు డాక్టర్లు ఉండటమూ మనకు తెలుసు. ఆ ఇంట్లో మాత్రం నలుగురు కుమార్తెలూ డాక్టర్లే! టైలరింగ్ చేస్తూ కూతుళ్లను డాక్టర్లు చేయడానికి తపించారు రామచంద్రం – శారద దంపతులు. వారి కలలు నిజమై ఇప్పుడు ఆ ఇల్లే వైద్యుల నిలయంగా మారి΄ోయింది. సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. రామచంద్రం – శారద టైలరింగ్ చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. ఇదంతా సాధారణమే! కానీ వీరి నలుగురు కుమార్తెలు డాక్టర్లే కావడమే విశేషం. ఒకరు వైద్యవిద్య పూర్తిచేయగా, మరొకరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. ఇంకో ఇద్దరు కుమార్తెలు ఈ ఏడాది మెడిసిన్‌లో సీట్లు సాధించారు. ‘నలుగురు కూతుళ్లేనా..’ అని హేళనలు ఎదుర్కొన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల ఎదుగుదలను చూసి గర్వపడుతున్నారు.ఒక్కరైనా డాక్టర్ కావాలని..రామచంద్రం, శారద ఇద్దరూ కలిసి రోజంతా కష్టపడితే రూ.800 వస్తుంది. దీంతో వారి కుటుంబం గడవడమే కష్టమైనా నలుగురు పిల్లలను చక్కగా చదివించాలని తపించారు. రామచంద్రం సోదరుడు రాజు 1992లో ఫిట్స్‌తో మృతిచెందగా, రామచంద్రం 14 ఏళ్ల వయసులో ఆయన తల్లి మల్లవ్వ గొంతు కేన్సర్‌తో మరణించింది. సరైన సమయంలో తాము గుర్తించక΄ోవడంతోనే సోదరుడు, తల్లిని కోల్పోవాల్సి వచ్చిందని... కుటుంబంలో ఒక్కరికైనా డాక్టర్ అయి ఉంటే వాళ్లు బతికేవారని అనుకునేవాడు. నలుగురు కూతుళ్ల లో పెద్ద కూతురు మమత ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆ తర్వాత ఆమె చెల్లెళ్లూ అదే బాట పట్టారు.చదువులోనూ కవలలే..రోహిణి, రోషిణి ఇద్దరు కవలలు... 2023 నీట్ రాసిన రోహిణి 443(పెద్ద కూతురు), రోషిణి 425(చిన్న కూతురు) మార్కులు సాధించారు. రోహిణికి ఓ ప్రై వేట్ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినా చెల్లి రోషిణికి సీటు రాక΄ోవడంతో ఒత్తిడికి గురవుతుందని అక్క సీటు వదులుకుంది. ఆపై ఇద్దరు లాంగ్‌టర్మ్ శిక్షణతో ప్రిపేర్ అయ్యారు. దీంతో 2024 నీట్లో రోహిణి 536 మార్కులు, రోషిణి 587 మార్కులు సాధించారు. ఇప్పుడు రోషిణికి(చెల్లి) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకేదగ్గర చదువుకోవాలని అక్క కోసం జగిత్యాల మెడికల్ కళాశాలలో సీట్లు తీసుకున్నారు. నాన్న కల నాకు లక్ష్యమైందిడాక్టర్ చదవాలన్నది మా నాన్న కల. ఆ కల నాకు లక్ష్యం అయ్యింది. 2018–2024లో ఎంబీబీఎస్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పూర్తిచేశా. గైనిక్ లేదా జనరల్ మెడిసిన్ పీజీ చేయాలని అనుకుంటున్నా. మా అమ్మనాన్నలు ఎన్ని ఇబ్బందులు పడినా మాకు ఏనాడూ లోటు రాకుండా చూసుకున్నారు. – డాక్టర్ మమత, ఎంబీబీఎస్(7009)అక్క చూపిన దారిఇంటర్మీడియెట్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎంబీబీఎస్ చదవలేనేమో అని, డిప్రెషన్‌కు లోనయ్యాను. హైదరాబాద్‌లో చదువుతున్నప్పటికీ ఇంటి నుంచే వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. ఇప్పుడు కరీంనగర్‌లోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. అక్క నా ముందున్న దారిని క్లియర్ చేయడంతో మేం సాఫీగా నడుస్తున్నాం. జనరల్ మెడిసిన్ పూర్తి చేసి పేదలకు సేవలు అందిస్తాను.– మాధురి, ఎంబీబీఎస్, ఫైనల్ ఇయర్(7012)మేం ఇద్దరం ఒకే కళాశాల లో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం సంతోషంగా ఉంది. మా అక్కలే మాకు రోల్ మోడల్. అమ్మానాన్న ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువుపై మాకు ఉన్న ఇష్టాన్ని గుర్తించి కాదనలేదు. అక్కలిద్దరూ మాకు సరైన గైడెన్స్ ఇచ్చారు. – రోహిణి, రోషిణి, ఎంబీబీఎస్, మొదటి సంవత్సరం(7011)నలుగురు ఆడపిల్లలని, వారిని హైదరాబాద్‌లో చదివిస్తున్నామని చాలామంది సూటి;yటీ మాటలు అనేవారు. అయినా కుంగిపోకుండా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలకున్నాం. టైలరింగ్ చేస్తూ వచ్చే కొద్ది డబ్బుతోనే పిల్లలను లోటు లేకుండా పెంచాం. అప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు మా నలుగురు కూతుర్లు మెడిసిన్ చేస్తుంటే సరస్వతీ పుత్రికలు అని మెచ్చుకోవడంతో మా బాద, కష్టమంతా మర్చి΄ోతున్నాం. మాది పేద కుటుంబం. పిల్లల చదువు నిమిత్తం ఎవరైనా దాతలు సాయం చేస్తే వారు ఉన్నత చదువులకు మార్గం ఏర్పడుతుంది.– రామచంద్రం, శారద – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేటఫోటోలు: కె సతీష్,ఈ సరస్వతీ పుత్రికలకు అండగా నిలవాలనుకునే వారు 98499 54604 ను సంప్రదించవచ్చు. (చదవండి: సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!) -
కూతుళ్లే అందం..ప్రముఖుల బ్యూటిఫుల్ డాటర్స్..!(ఫొటోలు)
-
International Daughters Day 2024: మన కంటిపాపకు కలలే కాదు... రెక్కలిద్దాం
మన దేశంలో కొత్తగా పెళ్లయిన దంపతులను ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో కూతురు పుట్టడమే పెద్ద అదృష్టం అనే విధంగా ఆలోచనలు మారుతున్నాయి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు సాధిస్తున్న విజయాలు అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళ వేరు. కూతురి సామర్థ్యాలు ఇంటికి వెలుగు. భ్రూణ హత్యల వల్ల స్త్రీల జనాభా కురచగా ఉన్న రోజులు ఇకపై చెల్లిపోవాలి. ప్రతి కూతురూ ఒక వరంలా వర్థిల్లాలి. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురుగా, కూతురికి తల్లిగా ఉన్న కొంతమంది రచయిత్రుల అభి్రపాయాలు.మీ కూతుళ్లకేం ఇస్తున్నారు?‘మీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండి, ఒకరిని మాత్రమే చదివించే స్థోమత ఉన్నట్లయితే అమ్మాయినే చదివించండి‘ అంటారు పెరియార్. ఆడపిల్లల చదువుప్రాధాన్యతను గుర్తించడం వల్లే కావచ్చు నన్ను, మా చెల్లిని బాగా చదివించారు మా తల్లిదండ్రులు. ఆడపిల్లలకేం కావాలి అంటే మంచి బట్టలు, నగలు అని కాకుండా ఆర్థికంగా స్వావలంబన కలిగివుండాలనే వారి ఆలోచన కారణంగానే మా జీవితాల్లో మేము నిలదొక్కుకున్నాం. ఈ కారణం చేతనే కొడుకులకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అనుకోకుండా వాళ్ల చివరి రోజుల్లో వారి ఆలనా పాలనా నేను చూసుకోగలిగాను. ఇప్పుడు అమ్మాయిలకి కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే సరిపోదు. సమాజంలో భద్రత, ఆత్మరక్షణ విద్యలు కూడా అవసరం. ఇంట్లో నేను ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని. కాలేజీలో నాకు ఎనిమిది వందల మంది కూతుళ్లు. వారంతా రెక్కలు తొడిగిన ఉత్సాహంతో స్వేచ్ఛగా ఎగరగలిగే వాతావరణం ఉండాలని నా ఆకాంక్ష. అమ్మాయిలు ఆర్థిక స్వావలంబనతో పాటు, ఆత్మవిశ్వాసంతో ఎదగటానికి తల్లిదండ్రులు సమాజం చేయగలిగినదంతా చేయాలి. నేటితరం కూతుళ్లందరికీ నా శుభాకాంక్షలు. – ఎం. ప్రగతి, రచయిత్రి, అనంతపురంకూతురి ప్రపంచంలోకి వెళతానుఏలూరు దగ్గర, కొక్కిరపాడు అనే పల్లెటూరులో ఆర్థికంగా చితికిపోతూ ఉన్న పెద్దరైతు కుటుంబంలో పుట్టాను. నలుగురాడపిల్లల్లో కడసారిదాన్ని. కూతురుగా ఎట్లా ఉన్నానో, ఉంటున్నానో తరచి చూసుకుంటుంటే కొత్తగా ఉంది. చిన్నప్పుడు మా అవసరాలకి డబ్బులు సరిగ్గా ఇవ్వనందుకు అమ్మానాన్నల మీద అరిచేదాన్నని అమ్మ చెపుతూ ఉంటుంది. కాని బుద్ధి పెరిగాక ఎపుడూ విసిగించింది లేదు. ‘మగపిల్లలు లేరు, అంతా ఆడమంద’ అని లోకం వెక్కిరించే రోజుల నుంచి ‘మా బిడ్డలు రత్నాలు’ అని అమ్మానాన్నలు గర్వంగా చెప్పుకునే రోజు వరకూ కూతురుగా నా ప్రయాణంలో అనేక ఎగుడు దిగుళ్లు. కులాన్ని వదిలి నా పెళ్లి నేనే చేసుకున్నందుకు, డబ్బు సంపాదన వదిలి నచ్చిన మార్గంలో వెళ్ళినపుడూ వారు రక్షకులై వెన్ను తట్టారు. చుట్టూ ప్రకృతిని, ప్రేమని ఆస్తులుగా పంచారు. ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలీని ప్రేమమూర్తుల కూతురిని. స్త్రీలకి అన్నిరంగాలలో స్వేచ్చ ఉండాలని నమ్మే నాకు స్నిగ్ధ ఒక్కతే కూతురు. నేను నమ్మే వాటికి, పెంపకానికి మధ్య కొన్ని విషయాలలో పేచీలు వచ్చేవి, దుస్తులు, షికార్లు, ప్రేమలు వంటివి. ‘స్వేచ్ఛ అంటే నీ నిద్ర నువ్వే లేవడం కూడా’ అంటూ కొటేషన్లు చెప్పిన నాకు ఏ మాత్రం లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని చక్కగా కాపాడుకున్న స్నిగ్ధని కొన్ని విషయాల్లో గురువుగా భావించే అమ్మనిపుడు. తనతో గడపడం కోసం నేను ఎదురు చూడడం కాదు, ‘అమ్మా... ముచ్చట్లు చెప్పుకుందామా?’ అని తను తరచూ అడిగే ఆకర్షణ నాలో ఉండడం కోసం ఆ వయసు వారి ప్రపంచంలోకి చొచ్చుకుపోతాను, నేర్చుకుంటాను. ‘నా విలువలకి అనుగుణంగా పెళ్లి చేసుకోకపోతే నేను రాను’ అని బెదిరించబోయానా! ‘నేను నీ ద్వారా వచ్చాను తప్ప నీ కోసం రాలేదు’ అని గట్టిగానే చెప్పింది. కూతురుగా, కూతురి తల్లిగా నా బొమ్మ వారికి సూపర్ హిట్.– కె.ఎన్. మల్లీశ్వరి, రచయిత్రి, విశాఖపట్నంఏ దేశ కరెన్సీ సరిపోదుఫలానా అమ్మాయికి మేము తల్లితండ్రులం అనే స్థాయికి ఎదిగిన ఆడపిల్లలు ఎందరో. అటువంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని గొప్పగా ఎదగాలని ఇండియన్ ఆర్మీకి, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం అయ్యాను. అనేక కారణాల చేత గమ్యం చేరుకోలేక నిస్సహాయతతో నలిగిపోయాను. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్న ప్రతిసారి ‘అమ్మా! నీలాగా నా జీవితం ఇంటికి, పెళ్లి, పిల్లలకు అంకితం అవ్వకూడదు’ అని మా అమ్మను నిందించేదాన్ని. అమ్మ మౌనంగా బాధపడేది. వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ కన్నీటిని దాచిపెట్టేది. అపుడు అర్థం అయ్యేది కాదు... నాకు పెళ్ళి అయ్యి ఒక కూతురు పుట్టే వరకు ఆమె మౌనానికి అర్థం నిస్సహాయత కాదు అది అంతర్మథనం అని నాకు తెలియలేదు. మా అమ్మ ఇద్దరు చెల్లెళ్లకు అక్కగా పుట్టింది. కొడుకులు లేని కుటుంబం. ఇద్దరూ పిన్నులు చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కానీ మా అమ్మ పరిస్థితుల రీత్యా టాలెంట్ ఉన్నా ఇంటికే పరిమితం ఐపోయింది. కానీ ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఆపరేషన్ ఐనా, ఒంట్లో బాగోలేకపోయినా, ఊరెళ్తున్నా ఇలా కారణం ఏదైనా ఆ కుటుంబానికి వండి పెట్టే బాధ్యత కూడా మా అమ్మ నిస్వార్థంగా తీసుకునేది. మా పిన్నులు జీతం సంపాదించే వారు కానీ ఇతరుల కోసం ఖర్చు చేసే సమయం సంపాదించలేక పోయారు. మా అమ్మను చూస్తూ మా తాత అనుకునేవారు..‘ ఇది నాకు కూతురు కాదు... మా అమ్మ అక్కలను కలిపి మళ్లీ పుట్టించాడు దేవుడు’ అని.. మా అమ్మ కథ విన్నాక నాకు అర్థమైంది ఏమిటంటే ఆడపిల్లగా కుటుంబానికి సహాయం చేయాలి అనుకుంటే ఉద్యోగాలే చెయ్యక్కర్లేదు.. అందరినీ నా వారు అనుకుంటూ కలుపుకుని పోతే డబ్బు సంపాదించే ఉద్యోగం చేయకపోయినా మనసులను సంపాదించొచ్చు. ఇది అర్థమయ్యాక మా అమ్మ జీవితాన్ని గమనించి ఆమె చెప్పినవి, చెప్పనివి అక్షరాలుగా రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలు పెట్టిన తరువాత తెలిసింది ఇది మా అమ్మ కథ కాదు. కొన్ని వందల వేల అమ్మల కథ. ఇంటిపట్టున మిగిలిపోయాము అని బాధపడే ఆడపిల్లల, ఆడతల్లుల మనోవ్యధ. మన దేశంలో ఆడపిల్లలు కొన్ని కోట్ల మంది ఇంటి పట్టున ఉండిపోయాము అని బాధ పడుతూ వుంటారు. మీరు ఓడిపోలేదు. మీరు కూతుర్లుగా మీ అమ్మ నాన్నల ప్రేమను, పేరును, పెంపకాన్ని నిస్వార్థంగా ప్రపంచానికి పంచుతున్నారు, కుటుంబాలను, కలలను పెంచుతున్నారు. మీరు చేస్తున్న సేవకు వెల కట్టి డబ్బు ఇవ్వాలని ఆలోచన వచ్చినా అది ఏ దేశ కరెన్సీలో ఇచ్చినా మీకు సరిపోదు. మీకు కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. ఇదంతా రాస్తుంటే నా 17 నెలల కూతురు ‘అమ్మ జూచు జూచు’ అనుకుంటూ ఒక గ్లాస్ ను వంకర టింకరగా పట్టుకుని నా టేబుల్ దగ్గరకు వచ్చింది. నాలో ఉన్న ఆడపిల్ల నాకు పుట్టిన ఆడపిల్లను చూసి మురిసిపోయింది. – ప్రవల్లిక, రచయిత్రి, సికింద్రాబాద్కూతుళ్లు మేజిక్ చేస్తారుఇంటికి ఆడపిల్ల వుండటం గొప్ప వైభవం. నేను ఒక కూతుర్ని, ఒక కూతురికి తల్లిని. అయితే నేను మరీ అంత గొప్ప లేదా మంచి కూతుర్ని కాదు. బహుశా ఇంకొంచం బాగా వుండాల్సింది. జీవితపు ప్రతి దశలో మా అమ్మతో/కుటుంబంతో అనేక విషయాల్లో విభేదిస్తూ, గొడవ పడుతూ, అప్పుడప్పుడూ సర్దుకుపోతూ, నా స్వాతంత్ర కాంక్షను, అభి్రపాయాలను కాపాడుకుంటూ నడిపాను. మా అమ్మ కాస్త మొండిమనిషి కాబట్టి చిన్నతనంలో అలవికాని నా అల్లరిని, ఇప్పటికీ నా స్వభావంలో వుండే లోపాల్ని భరిస్తోంది. సున్నితమైన అమ్మైతే చాలా కష్టం అయేది. కూతురిగా నాకై నేనైతే జస్ట్ పాస్ మార్క్ వేసుకుంటాను. నా కూతురి దగ్గరకొస్తే తన వల్ల నేను టెన్షన్ పడిన సందర్భాలకన్నా గర్వపడిన సందర్భాలే ఎక్కువ. కూతుళ్లు, తల్లులకన్నా, తండ్రులకు సన్నిహితంగా వుంటారు అనే లోకోక్తి నేను నమ్మను. నా కూతురు నాకు దగ్గరగా వుంటుంది. నాకు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుంది. నాతో వాదిస్తుంది. నాది తప్పైతే మన్నిస్తుంది. మంచి కూతురిగా, మా అమ్మాయికి డిస్టింక్షన్ శాంక్షన్ చేస్తాను. ఇవాళ మా అమ్మ దగ్గరకువెళ్ళి అడిగితే కూడా తనకు తక్కువ మార్కులు వేసుకొని, తన కూతురికి ఎక్కువ మార్కులు ఇస్తుంది. కూతుర్లు అంతే. మురిపిస్తారు. మాజిక్ చేస్తారు. – ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, రచయిత్రి, విజయవాడ -
దారుణం.. అప్పుడే పుట్టిన ట్విన్స్‌ను చంపి.. పాతిపెట్టిన తండ్రి
సాక్షి,న్యూఢిల్లీ: అప్పుడే పుట్టిన కూతుళ్లను గుండెల మీద కుంపటిలా భావించిన ఓ తండ్రి దారుణానికి ఒడిగాట్టాడు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన కవలల్ని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాల్ని పాతిపెట్టి పరారయ్యాడు. ఢిల్లీకి చెందిన నీరజ్ సోలంకి,పూజా సోలంకి భార్యభర్తలు. గర్బవతిగా ఉన్న పూజా సోలంకి మే 30న హర్యానాలోని రోహ్తక్లోని ఓ ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కొడుకే కావాలని కోరుకునే నీరజ్.. ఆడపిల్లలు పుట్టడంతో కలత చెందాడు. జూన 3వ తేదీన ఆ కవలల్ని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తన బావ నీరజ్ పసికందుల్ని హత్య చేశాడంటూ బావమరిది ఢిల్లీ సుల్తాన్‌పురి పీఎస్ పోలీసులకు సమాచారం అందించాడు. బావమరిది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పట్టించిన కాల్ డేటాఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నీరజ్ సోలంకి ఫోన్ కాల్ డేటాపై క్రైం బ్రాంచ్ పోలీసులు దృష్టిసారించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా తన మొబైల్ హ్యాండ్సెట్, సిమ్‌లు, ప్రదేశాలను తరచుగా మారుస్తున్నట్లు గమనించారు. ఢిల్లీ, హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత నిందదితుణ్ని రోహ్తక్లోని సంప్లాలో అరెస్ట్ చేశారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఐసీయూలో వెంటిలేటర్‌పై తండ్రి, ఆసుపత్రిలోనే కూతుళ్ల పెళ్లి...వైరల్ వీడియో
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడబిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతీ తల్లీదండ్రి ఆశపడతారు. ముఖ్యంగా పేద, ధనిక తేడాల్లేకుండా ప్రతీ కుటుంబంలోనూ ఉండే అత్యంత సమజమైన కోరిక. మరీముఖ్యంగా అమ్మలాంటి తన కూతురిపెళ్లిని ఉన్నంతలో ఘనం చేయాలనికోరుకుంటారు తండ్రులు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయాన్ని పిండేసే రీతిలో ఒక సంఘటన జరిగింది.లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ సరిగ్గా కుమార్తె పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత విషమించి ఇక్బాల్ ఎరా మెడికల్ కాలేజీ ఐసియులో ఉన్నాడు. అయితే తండ్రి కోరిక మేరకు ఆయన కళ్లముందే ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ తండ్రి పరిస్థితిని గమనించిన కుమార్తెలు కూతుళ్లు దర్శా, తాంజిలా ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్ద,వధూవరులు ఆసుపత్రి దుస్తుల్లో..ఆసుపత్రి అధికారుల అనుమతితోనే పెళ్లి తంతు మొత్తం జరిగింది. ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివాహాన్ని త్వరితగతిన నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆస్పత్నిని సిబ్బందిని అభినందించారు. అలాగే నూతన వధూవరులకు ఆశీర్వాదాలందించారు.Unique marriage took place with simplicity and rituals in the ICU of Era Hospital, #Lucknow !Father admitted in ICU got his daughters married in front of hi. pic.twitter.com/rFJIhRCpsK— Nuzba Amen Sheakh (@nuzzu52103) June 16, 2024 -
Father’s Day 2024: వ్యాపార సామ్రాజ్యంలో నాన్న తోడుగా.. (ఫొటోలు)
-
కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు.కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు.తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు. -
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
కవల శిశువుల జననం గురించి మనం వినేవుంటాం. ఒకే కాన్పులో ఇద్దరో లేదా ముగ్గురో పుట్టడాన్ని కూడా చూసేవుంటాం. అయితే ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు శిశువులు జన్మంచడాన్ని అంతగా చూసి ఉండం. వినివుండం. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో 20 ఏళ్ల మహిళ ఏకకాలంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. శిశువులంతా ఒక కిలో లోపు బరువుతో ఉన్నారు. తల్లి, శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ మహిళకు పురుడు పోసిన డాక్టర్ ఫర్జానా మాట్లాడుతూ ఈ కేసు తనకు చాలెంజింగ్‌గా అనిపించిందని, ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. కాగా ఆ మహిళకు సాధారణ ప్రసవం ద్వారా శిశువులంతా జన్మించడం విశేషం.కిషన్‌గంజ్ జిల్లాలోని కనక్‌పూర్ పంచాయతీ పరిధిలోని జల్మిలిక్ గ్రామానికి చెందిన తాహిరా బేగం (20) గర్భం దాల్చినప్పటి నుంచి ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స అందుకుంటోంది. ఈ నేపధ్యంలో ఆమె కడుపులో ఐదుగురు కవలలు ఉన్నారని స్కానింగ్‌లో వెల్లడయ్యింది. దీంతో ఆమె భయపడిపోయింది. అయితే డాక్టర్ ఫర్జానా ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత ఆమెకు తొమ్మిది నెలల పాటు రెగ్యులర్ చెకప్ కొనసాగింది. శనివారం ఆమె ఐదురుగు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తాహిరా ఇప్పుడు రెండోసారి తల్లి అయ్యింది. ఆమెకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఆరుగురు పిల్లలకు తల్లిగా మారింది. -
ఇద్దరు కుమార్తెలతో తల్లి బలవన్మరణం
సాక్షి, చెన్నై: భర్తతో అభిప్రాయ భేదాలు విడాకుల వరకు వెళ్లడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో పాటు తానూ బలవన్మరణానికి పాల్పడింది. దిండుగల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దిండుగల్ జిల్లా తాడి కొంబు పరిధిలోని కామాక్షిపురం శక్తినగర్‌కు చెందిన శ్రీనివాసన్(42), మేనక (35) దంపతులకు హిందు మహావిని(16), తన్యశ్రీ(11) కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు స్థానికంగా సీబీఎస్ఈ పాఠశాలలో పది, ఆరు తరగతులు చదువుతున్నారు. మహావిని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొద్ది రోజులుగా ఈ దంపతుల మధ్య జరిగిన గొ డవ విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లింది.నందవనం రోడ్డులో తాను నడుపుతున్న టూ వీలర్ సర్వీస్ సెంటర్ లో వాటర్ మోటార్ పనిచేయక పోవడంతో సోమవారం ఇంట్లో ఉన్న మోటారును తీసుకెళ్లేందు కు శ్రీనివాసన్ ప్రయత్నించాడు. దీనిని మేనకతో పాటు పిల్లలు అడ్డుకున్నారు. తమ గొడవలు విడా కుల కోసం కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో శ్రీనివా సన్ చర్యలపై మేనక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాయంత్రం అతడిని పోలీసులు పిలిపించి చీవాట్లు పెట్టారు. రాత్రి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన శ్రీనివాసన్ ఇంట్లో ఉన్న తన బట్టలను తీసుకెళ్లేందుకు వెళ్లాడు.ఇంటి తలుపులు తెరవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో కిటికి తలుపులు పగుల కొట్టి చూశారు. లోపల గది లో తన ఇద్దరు కుమార్తెలతో పాటుగా మేనక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టా నికి తరలించారు. శ్రీనివాసన్‌ను విచారించగా తాను పొద్దుపోయే వరకు పోలీసు స్టేషన్లోనే ఉన్న ట్లు చెప్పాడు. మనస్తాపంతో ఉన్న మేనక పిల్లలతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పో లీసులు నిర్ధారించారు. -
లోక్‌సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు?
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఇద్దరిని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధమయింది. ఆర్జేడీ టిక్కెట్‌పై మిసా భారతిని పాటలీపుత్ర నుంచి, రోహిణీ ఆచార్యను సరన్ నుంచి బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. పాటలీపుత్ర నియోజకవర్గంలో ఆర్జేడీ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు ఇప్పటికే రిత్లాల్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పట్నాలోని మాజీ సీఎం రబ్డీదేవి నివాసానికి పలు పర్యాయాలు వచ్చినట్లు కూడా మీడియా అంటోంది. దీంతో, పాటలీపుత్ర నుంచి ఇద్దరిలో ఎవరిని పోటీకి నిలపాలనే విషయంలో కొంత సందిగ్ధం కొనసాగుతున్నట్లు సమాచారం. -
తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. సంప్రదాయం పేరిట కొనసాగుతున్న తరతరాల ఆచారాన్ని కాదంటూ తొమ్మిదిమంది కుమార్తెలు తమ తండ్రి చితికి నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే బుందేల్‌ఖండ్ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు హరిశ్చంద్ర అహిర్వార్ ఉంటున్నారు. అతనికి తొమ్మిది మంది కుమార్తెలు. కొడుకులు లేరు. వీరిలో ఏడుగురికి వివాహాలయ్యాయి. మరో ఇద్దరు కుమార్తెలకు వివాహం జరగాల్సివుంది. అయితే హరిశ్చంద్ర అహిర్వార్ అకస్మాత్తుగా బ్రెయిన్ హెమరేజ్‌కు గురై ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ నేపధ్యంలో అతని కుమార్తెలు తమ తండ్రికి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారందరూ అంతిమయాత్రలో పాల్గొని, ముక్తిధామ్‌లో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. హరిశ్చంద్ర అహిర్వార్ బంధువు ఛోటాలాల్ అహిర్వార్ మాట్లాడుతూ కుమార్తెలు తమ తండ్రికి హిందూ ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. హరిశ్చంద్ర అహిర్వార్ తన ఏడుగురు కుమార్తెలకు వివాహాలు చేశారని, ఇంకా రోష్ని, గుడియాలకు వివాహాలు చేయాల్సివుందని అన్నారు. -
కూతుర్ని చంపిన హంతకుల కోసం హీరోలా వేటాడాడు ఓ తండ్రి..ఏకంగా రూ. 16 కోట్లు..
ఓ తండ్రి అంతులేని ప్రేమకు నిదర్శనమే ఈ గాథ. కూతురు ఆకస్మిక మరణం ఆ తండ్రిని నిలువనీయలేదు. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందన్న ప్రశ్నలు అతడ్ని కుదురుగా ఉండనివ్వలేదు. తానే ఓ డిటెక్టివ్‌లా దర్యాప్తు చేసేలా పురిగొల్పాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 37 ఏళ్లు తన కూతురికి న్యాయం జరగాలని తపించి నిరీక్షించాడు. దేశం కానీ దేశంలో వందసార్లుకు పైగా పర్యటించాడు. డబ్బును కూడా లెక్కచేయకుండా నీళ్లలా ఖర్చుపెట్టాడు. కానీ ఇప్పటికి అతడి కూతురు హత్య చిక్కుముడి వీడని మిస్టరీలో ఉండిపోయింది. ఐతే ఆ తండ్రి తపన, ఆశ, అలుపెరగని ప్రయత్నం చివరికి ఫలించాయా అంటే... అసలేం జరిగిందంటే..తన కూతురుని చంపిన హంతకుల కోసం హీరోలా అన్వేషించిన వ్యక్తి ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ వార్డ్ మరణించిన అతడి కూతురు పేరు జూలీ వార్డ్. ఆమె వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. జూలీ మరణించేనాటికి ఆమె వయసు 28 ఏళ్లు. ఆమె బరీ సెయింట్ ఎడ్మండ్స్లోని పబ్లిషింగ్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే జూలీ మాసాయి మారా గేమ్ రిజర్వ్‌లో జంతువుల ఫోటోలు తీసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆరు నెలలు కెన్యా పర్యటనలోనే ఉండిపోయింది. అయితే ఆమె చిరిసారిగా సెప్టెంబర్ కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి కనిపించడంలేదని తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆమె మరణించిందనే వార్త వచ్చింది. దీంతో ఏం అర్థకాని జూలీ తండ్రి ఆఘమేఘాలపై కెన్యా వెళ్లిపోయాడు. నా కూతురు ఎందుకని చనిపోయిందని అని ఆ తండ్రి ఒకటే ఆత్రుతో వెళ్లగా..అక్కడ అధికారులు ఆమెపై క్రూరమృగాలు దాడి చేసి చంపేశాయని చెప్పారు. ఐతే జూలీ తండ్రికి అధికారులు చెబుతున్నవన్నీ కట్టుకథల్లా తోచాయి. కనీసం కూతురి చివరి చూపు దక్కలేదు, పైగా ఆమె మృతదేహం కూడా కనిపించకపోవడం ఇవన్నీ జాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అధికారుల మాటలను నమ్ముతూ కూర్చొంటే.. ఏం లాభం లేదని నిర్ణయించుకుని జాన్ వార్డ్ స్వయంగా డిటెక్టివ్‌లా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాడు. జూన్వార్డ్ దంపతులు, జూలీ(కుడివైపు), ఇన్సెట్లో ఇద్దరు సోదరులతో దిగిన చిన్ననాటి చిత్రం అందులో భాగంగా ఫోరెన్సిక్ గురించి తనకు తానుగా నేర్చుకుని మరీ కూతురి మృతదేహం కోసం అన్వేషించాడు. జూలీని చివరిగా కనిపించిన ప్రాంతంలో ఏకంగా ఐదు విమానాలతో జల్లెడ పట్టించాడు. చివరికి ఆమె మృతదేహం ఆ రిజర్వ్‌కి దాదాపు 10 మైళ్ల దూరంలో కనిపించింది. జాన్ తన కుమార్తె దవడ, ఎడమ కాలు తదితర భాగాలను గుర్తించాడు. అయితే అవి రెండు కాలిపోయి పోదల్లో ఉన్నాయి. ఎలా చనిపోయిందనే దాని గురించి అలుపెరగకుండా దర్యాప్తు చేస్తూనే ఉన్నాడు. జూలీ అవశేషాలను ఫ్రిజర్‌లో భద్రపరిచి ఎలాగైనా హంతకులను పట్టుకోవాలని తన కూతరుకి న్యాయం చేయాలని ఎంతగానో తపించాడు. జాన్ దర్యాప్తు ఓ కొలిక్కి రాడమే కాకుండా ఆమె ఎలా చనిపోయిందో కనుకున్నాడు. దర్యాప్తులో కెన్యా అప్పటి అధ్యక్షుడు కుమారుడు జోనాథన్ మోయి జూలీపై క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడని కనుగొన్నాడు. ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి జంతువుల దాడిలో చనిపోయిందని నమ్మించాడని తెలుసుకున్నాడు. అయితే దాన్ని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు జాన్ వద్ద లేవు. ఎంతాగనో అధికారులను ప్రాధేయపడి చర్యలు తీసుకోమని చెప్పినా..కానీ వారు అధ్యక్షుడి కొడుకు కావడం వల్ల ఈ ఘటనను మభ్యపెట్టి తారుమారు చేసే కుట్రకే తెరతీశారు. ఐతే జాన్ తగ్గేదేలా అంటూ.. చేసిన దర్యాప్తు కారణంగా అధికారులు సైతం జూలీది హత్యేనని ఒప్పుకోక తప్పుకోలేదు. దీని కోసం కెనడా కోర్టులో ఏకంగా 22 సార్లు క్రాస్ ఎగ్జామిన్ని జాన్ ఎదుర్కొన్నాడంటేనే వాస్తవం ఏంటో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇద్దరు సోదరులో జూలీ వార్డ్(ఫైల్‌ఫోటో) ప్రభుత్వమే తమే చేతిలో ఉన్నవాళ్లతో పోరాడటం ఎంత కష్టం అనేదానికి ఈ జూలీ కేసు ఓ ఉదాహరణ. ఆ తండ్రి కూతురు కేసు దర్యాప్తు కోసం ఏకంగా తన సొంత డబ్బు రూ. 16 కోట్ల దాక నీళ్లలా ఖర్చుపెట్టాడు. చివరి శ్వాస వరకు కూతురుకి న్యాయం జరగాలని పోరాడాడు. జూన్ వయసు ఇప్పుడూ 79 ఏళ్లు ఇటీవలే అతన మరణించాడు. అతడు మరణించడానికి రెండు వారాల ముందే అతడి భార్య జేన్ కూడా చనిపోయారు. తమ తండ్రి జాన్ ఆశ అడియాశగానే మిగిలిపోయిందని అతడి కొడుకులు బాబ్, టిమ్ చాలా ఆవేదనగా చెప్పుకొచ్చారు. తమ సోదరి కేసును తాము క్లోజ్ చేయనివ్వమని తమ తండ్రి ఎలా కెన్యా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడో అలానే తాము పోరాడతామని, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని చెబుతున్నారు జాన్ కొడుకులు. జాన్ వార్డ్ కొడుకు బాబ్ వార్డ్ న్యాయం కోసం తన తండ్రి చూపిన పట్టుదల, తెగువ నమ్మశక్యం కానివని అన్నారు. జాన్ మరణించడానికి ఆరునెలల ముందు వరకు కెన్యా వెళ్లోచ్చారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన తండ్రి ఈ కేసుపై ఓ పుస్తకం కూడా రాశారని, అందుకు తాను సహకరించినట్లు బాబ్ చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు టిమ్ దీనిపై డాక్యుమెంటరీ కూడా తీస్తామన్నారు. ఇక ఈ జూలీ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 1992లో ఆమె హత్య కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న ఇద్దరు గేమ్ రేంజర్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. కెన్యా పోలీసు అధికారుల్లో కొత్త బృందం 1997లో ఈ కేసును మళ్లీ పరిశీలించింది. 1999లో ఒక గేమ్కీపర్ని ఈ కేసులో విచారించారు. కానీ, ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. 2004లో ఈ హత్యకు సంబంధించిన తీర్పును రికార్డ్ చేశారు. మళ్లీ 2010లో లండన్ డిటెక్టివ్‌ల సాయంతో కెన్యా స్థానికుల పోలీసుల ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. జూలీ అవశేషాలు కనిపించిన ప్రదేశంలో జరిగిన క్రైమ్ గురించి ఓ అవగాహనకు వచ్చారు. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా కొంత వరకు పురోగతి సాధించనట్లు తెలిపారు బాబ్. అలసు నిందితులను కనిపెట్టి ఈ కేసును చేధిస్తామని జాను కుమారుడు బాబ్ నమ్మకంగా చెబుతున్నారు. కాగా, పాపం ఆ తండ్రి కూతురుకి న్యాయం జరగాలని తపించి, తపించి అలిసిపోయి మత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఇప్పటికైన జూలీ కేసులో నిందులెవరనేది తెలుస్తుందా? అంతుపట్టిని మిస్టరీలా మిగిలి.., ఆ తండ్రి ప్రయత్నం వృధాగాపోతుందా? అనేది వేచి చూడాల్సిందే...! --ఆర్ లక్ష్మీ లావణ్య (చదవండి: ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతాం! సైన్సుకే అంతుచిక్కని మిస్టరీ ప్రదేశం..) -
రొటీన్‌కి భిన్నంగా..! ఆనంద్ మహీంద్రా కూతుళ్ల గురించి తెలుసా?
Anand Mahindra daughters: ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన పూర్తి పేరు ఆనంద్ గోపాల్ మహీంద్రా. ఎయిర్‌క్రాఫ్ట్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, విడిభాగాలు , నిర్మాణ పరికరాలు, రక్షణ, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక, బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ తదితర అనేక వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు. మహీంద్రా & మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా వారసుడు ఆనంద్ మహీంద్రా. ఫోర్బ్స్ 2023 నివేదిక ప్రకారం.. ఆయన నెట్‌వర్త్ 2.6 బిలియన్ డాలర్లు (రూ. 21 వేల కోట్లకుపైనే). జర్నలిస్టు అనురాధను పెళ్లాడిన తర్వాత ఈ దంపతులకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినప్పటికీ పలు విభిన్న అంశాలపై స్పందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఆయన కుమార్తెలు మాత్రం ప్రచారాలకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మందికి వీరి గురించి పెద్దగా తెలియదు. రొటీన్‌కి భిన్నంగా.. సాధారణంగా పారిశ్రామికవేత్త పిల్లలు తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాల్లో పాలుపంచుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆనంద్ మహీంద్రా కుమార్తెలు మాత్రం వారి తల్లికి చెందిన మ్యాగజైన్లో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సతీమణి అనురాధ వెర్వ్, మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్లకు ఎడిటర్‌గా ఉన్నారు. వివాహానికి ముందే ఆమె వెర్వ్ పత్రికను స్థాపించారు. వీరి పెద్ద కుమార్తె దివ్య డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివారు. 2009లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె వివిధ సంస్థలలో ఫ్రీలాన్సర్‌గా, పార్ట్ టైమ్ ఉద్యోగిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో ఆమె వెర్వ్ మ్యాగజైన్లో ఆర్ట్ డైరెక్టర్‌గా చేరారు. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక రెండవ కుమార్తె ఆలికా కూడా వెర్వ్ మ్యాగజైన్లో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్లుళ్లిద్దరూ విదేశీయులే.. ఆనంద్ మహీంద్రా పెద్ద కుమార్తె దివ్య న్యూయార్క్‌లో మెక్సికన్ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటాను వివాహం చేసుకున్నారు. అలాగే రెండవ కుమార్తె ఆలికా కూడా ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. ఇలా పూర్తిగా భిన్నమైన సంస్కృతులలో జరిగిన వీరి వివాహాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. -
ఆడపిల్ల భారం కాదు.. ప్రోత్సహిస్తే అండగా నిలుస్తుంది!
పెద్దపల్లి: కూతురు భారం కాదు.. ఆమెను ప్రోత్సహిస్తే కుటుంబానికి అండగా నిలుస్తూ ఇంటికి వెలుతురునిస్తుంది. ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే బరువు అనుకునేవారికి ఆ భావన తప్పు అని నిరూపిస్తున్నారు నేటి అమ్మాయిలు. కళలు, క్రీడలు, చదువులు, ఉద్యోగాల్లో రాణిస్తూ మగవాళ్లకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. తల్లిదండ్రులకు తమను చూసుకునే కొడుకుల్లేరనే బాధను మర్చిపోయేలా చేస్తున్నారు. వారి ఆశలను తీరుస్తూ.. కలలను నిజం చేస్తూ ఇంట్లో ఆనందాన్ని పంచుతున్నారు. నేడు అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముగ్గురూ ఉద్యోగులే.. మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామానికి చెందిన మండల కిష్టయ్య–సత్తమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సరిత, సవిత, కీర్తి ఉన్నారు. వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. సరిత పీజీ, బీఎడ్ పూర్తి చేసి, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి, ఇబ్రహీంపట్నం మండలంలో విధులు నిర్వహిస్తోంది. సవిత డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తోంది. కీర్తి 2020లో పోలీస్‌శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి, కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. తాము కూతుళ్లనే కొడుకులు భావించి, ఉన్నత చదువులు చదివించామని, వారు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడంతో తమ కల నెరవేరిందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టాం.. మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. పేద కుటుంబంలో పుట్టాం. అమ్మానాన్న జడల రామస్వామి, లక్ష్మి. నాన్న ఇంటివద్దే దుస్తులు అమ్మి, కుటుంబాన్ని పోషించేవారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకున్నాం. ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్న మమ్మల్ని అమ్మానాన్న ప్రోత్సహించారు. అక్క రాజమణి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కరీంనగర్లో పని చేస్తోంది. నేను 2012లో ఐఏఎస్ సాధించా. ప్రస్తుతం పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్‌గా పని చేస్తున్నా. భర్త శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇద్దరు అహిలన్, అభిషన్ సంతానం. చెల్లెలు జ్యోతి హైదరాబాద్‌లో బ్యాంకింగ్ రంగంలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తోంది. నాలుగు మాసాల క్రితం నాన్న చనిపోవడం తీరని బాధను మిగిల్చింది. కష్టపడి లక్ష్యం చేరుకున్నా.. మాది ప్రకాశం జిల్లా. నేను హైదరాబాద్‌లో పుట్టి, పెరిగాను. మేం నలుగురు అక్కాచెల్లెల్లం. నాన్న షేక్ యూసుఫ్ పాషా ఎక్స్ సర్వీస్‌మెన్, తల్లి షబీరా హౌస్ వైఫ్. నలుగురు కూతుళ్లలో నేనే పెద్దదాన్ని. పెళ్లి జరిగి, ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంటి వద్దే ఉంటూ వంట చేయడం, పిల్లలను చూసుకోవడం వంటివే జీవితం అనుకోలేదు. కష్టపడి చదివి, లక్ష్యాన్ని చేరుకున్నాను. 2003లో గ్రూప్–1 రాసి, ఎంపీడీవోగా, 2009లోనూ రాసి, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాను. 2011లో మహబూబ్‌నగర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను. 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చాను. 2020లో వనపర్తికి కలెక్టర్‌గా వెళ్లాను. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన జగిత్యాల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాను. పెద్ద చెల్లెలు నజీబీ లండన్‌లో స్థిరపడగా రెండో చెల్లెలు పర్వీన్ టీఎస్ ఎస్‌లో మంచి పొజిషన్లో ఉంది. చిన్న చెల్లెలు బీఫార్మిసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. అమ్మానాన్న అందరూ ఆడపిల్లలే అని బాధ పడలేదు. చదువుల్లో ప్రోత్సహిస్తూ మా వెన్నంటి ఉన్నారు. వారి వల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నాం. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించాలి. అమ్మ గర్వపడుతోంది.. మా స్వగ్రామం మేడిపల్లి మండలంలోని తొంబర్రావు పేట. కోరుట్లలో స్థిరపడ్డాం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నాన్న బుచ్చిలింగం గల్ఫ్ కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీ కార్మికురాలు. పిల్లలు ఆడవాళ్లనే భావన ఎప్పుడూ వారిలో చూడలేదు. అందరినీ ఉన్నత చదువులు చదివించారు. నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదివి, వ్యవసాయ అధికారి ఉద్యోగం సాధించాను. చెల్లెళ్లు విశాల, రమ్య పీజీ పూర్తి చేసి, ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. నాన్న గల్ఫ్ నుంచి వచ్చి, అనారోగ్యం బారిన పడినా అమ్మ బీడీలు చుట్టి, మా చదువులు పూర్తి చేయించింది. ప్రస్తుతం ప్రయోజకులుగా మారిన మమ్మల్ని చూసి, మా అమ్మ గర్వపడుతోంది. మా కల నిజం చేసింది.. మాది సిరిసిల్ల. మా అమ్మాయి శివాని పదోతరగతి నుంచి చదువుల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతోంది. పదోతరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్లో 968 మార్కులు సాధించింది. బీటెక్ ఈసీఈ పూర్తి చేసి, ప్రస్తుతం ఓ కంపెనీలో ఏడాదికి రూ.32 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగిగా పని చేస్తోంది. అమ్మాయి మా కల నిజం చేసినందుకు సంతోషంగా ఉంది. -
నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు..
వాషింగ్టన్: అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి గుండె చప్పుడు విని భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల క్రితం తన తండ్రి చనిపోగా ఆయన అవయవాలను దానం చేశారు ఆ బిడ్డలు. ఆ గుండె ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లిన ఆ అక్కాచెలెళ్లకు తండ్రి గుండెను అమర్చిన వ్యక్తి దొరికారు. వెంటనే ఆ గుండె మీద చెవులను ఆనించి తండ్రి గుండె చప్పుడు విన్నారు. మనల్ని ఇష్టపడేవాళ్లు విడిచి వెళ్లినా కూడా వారి జ్ఞాపకాలు మనలను తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వారు మన మధ్య ఉంటే బాగుండన్న భావన నిత్యం కలుగుతూ ఉంటుంది. కానీ అవయవదానం చేసిన సందర్భాల్లో వ్యక్తులు మరణించినా వారి అవయవాలు వేరే వాళ్లకి అమరిస్తే అవి సజీవంగానే ఉంటాయి. అలా అవయవదానం చేసిన ఎస్టబెన్ శాంటియాగో(39) కుమార్తెలు తన తండ్రి అవయవాల కోసం వెతుకుతూ చివరికి ఆయన గుండెను కనుగొన్నారు. కిసండ్ర శాంటియాగో(22) ఈ వెతుకులాటకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆమె ప్రయత్నం నాలుగేళ్లపాటు సాగి చివరికి తన తండ్రి హృదయాన్ని ఎవరికి అమర్చారో కనిపెట్టింది. వెంటనే తన చెల్లెళ్లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి వారు ఆయన గుండెల మీద తల ఆనించి గుండె చప్పుడును విని ఉద్వేగానికి లోనయ్యారు. కిసండ్ర శాంటియాగో మాట్లాడుతూ.. మా నాన్న నిజంగా సంతోషించేవారు. మా నాన్న కోమాలోకి వెళ్లి చనిపోయాక ఆయన అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. చివరకు ఎలాగో అంగీకరించాను. ఆ రోజు నుంచి నా గుండె భారంగానే ఉంది. ఈరోజు ఆయన గుండె చప్పుడు విన్నాక అది తేలికైందని చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఈ మొత్తం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విశేషమైన స్పందన వస్తోంది. View this post on Instagram A post shared by TODAY (@todayshow) ఇది కూడా చదవండి: దుబాయ్‌లో భారతీయుడి జాక్‌పాట్.. నెలకు రూ.5.59 లక్షలు.. -
పాక్‌లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు. ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు. -
ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. సంబరపడిన బంధువులకు సడెన్ షాక్!
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఒక ఇంటిలోని ఇద్దరు అమ్మాయిలకు ఒకే మూహూర్తానికి పెళ్లి నిశ్చయమయ్యింది. వివాహ వేడుకలో భాగంగా ఇద్దరు వరుల తరపు వారు ఊరేగింపుగా వధువుల ఇంటికి వచ్చారు. ఆ ఇద్దరు వరులను ఆహ్వానిస్తూ వధువులు వారికి పూల దండలు వేశారు. అయితే ఒక వరుని తరపువారితో వధువు తరపు వారికి ఏదో విషయమై వివాదం తెలెత్తింది. దీంతో చివరకు రెండు వివాహాలు జరగాల్సిన చోట ఒక వివాహమే జరిగింది. ఈ ఘటన ఫిరోజాబాద్‌లోని బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం జస్రానా గ్రామానికి చెందిన రాధేశ్యామ్ రాజ్‌పూత్ ఒకే ముహూర్తానికి తన ఇద్దరు కుమార్తెలకు వివాహం తలపెట్టారు. వివాహ వేడుకలో భాగంగా ఇద్దరు వరుల తరపువారు సోమవారం రాత్రి కల్యాణ మండపానికి చేరుకున్నారు. డాన్స్ చేయడంపై వివాదం వధువులిద్దరూ తమతమ వరులకు పూల దండలు వేసి ఆహ్వానించారు. తరువాత రాయపూర్ నుంచి వచ్చిన మగపెళ్లివారికి, వధువు తరపు వారికి డాన్స్ చేయడం విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఇది ఇరు పక్షాల వారు పరస్పరం కొట్టుకునేంతవరకూ దారితీసింది. దీంతో ఒక వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పింది. వరుని తరపు వారు తమవారిపై చేయిచేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయని.. అందుకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. పోలీసుల జోక్యంతో.. ఈ వివాదం పోలీసుల వరకూ చేరింది. జస్రానా పోలీసులు కల్యాణ మండపానికి చేరుకుని, ఇరుపక్షాల వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వధువు తరపువారికి ఎంతనచ్చజెప్పినా వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రాయ్‌పూర్ నుంచి వచ్చిన వరుడు పెళ్లి కాకుండానే తన కుటుంబ సభ్యులు, బంధువులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ వివాదం ముగిసిన తరువాత రాధేశ్యామ్ రాజ్‌పూత్ తన మరో కుమార్తెకు వివాహం జరిపించాడు. ఇది కూడా చదవండి: ఆ వెబ్ సిరీస్ చూసి.. ₹2000 దొంగనోట్లు ముద్రించి.. -
Ranee Ramaswamy: నటరాజు దీవించిన నాట్య సుధా నిధులు
భావం, రాగం, తాళం... ఈ మూడు నృత్య కళాంశాల సమ్మేళనం భరతనాట్యం. అరవై నాలుగు ముఖ, హస్త, పాద కదలికల అపురూప విన్యాసం భరతనాట్యం. మూడు దశాబ్దాల క్రిందట అమెరికాలో ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ మొదలు పెట్టి ఆ నాట్య వైభవాన్ని దశదిశలా తీసుకువెళుతోంది రాణీ రామస్వామి. తానే ఒక సైన్యంగా మొదలైన రాణీ రామస్వామికి ఇప్పుడు ఇద్దరు కూతుళ్ల రూపంలో శక్తిమంతమైన సైనికులు తోడయ్యారు.... ‘మేము గత జన్మలు, పునర్జన్మల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మా పెద్ద అమ్మాయి అపర్ణకు మూడు సంవత్సరాల వయసు నుంచే నృత్యంపై అనురక్తి ఏర్పడింది. ఆమె పూర్వజన్మలో నృత్యకారిణి అని నా నమ్మకం’ అంటుంది రాణీ రామస్వామి. చెన్నైలో పుట్టిన రాణీ రామస్వామికి ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంతో చెలిమి ఏర్పడింది. డెబ్బై ఒకటో యేట ఆమెకు ఆ నాట్యం శ్వాసగా మారింది. ఈ వయసులోనూ చురుగ్గా ఉండడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ఆమె అమెరికాలోని మినియాపొలిస్‌లో ‘రాగమాల డ్యాన్స్ కంపెనీ’కి శ్రీకారం చుట్టింది. ఈ కంపెనీ ద్వారా అమెరికాలో నృత్యాభిమానులైన ఎంతో మందికి ఆత్మీయురాలిగా మారింది. భరతనాట్యాన్ని ముందుకు తీసుకువెళ్లే ఇంధనం అయింది. ‘రాగమాల’ ద్వారా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది రాణీ రామస్వామి. ‘రాగమాల ట్రైనింగ్ సెంటర్’ ద్వారా ఏడు సంవత్సరాల వయసు నుంచే భరత నాట్యంలో శిక్షణ పొందుతున్నారు ఎంతోమంది పిల్లలు. ‘అమ్మా, నేను, అక్క ఒక దగ్గర ఉంటే అపురూపమైన శక్తి ఏదో మా దరి చేరినట్లు అనిపిస్తుంది. ప్రేక్షకుల్లో కూర్చొని వేదికపై వారి నృత్యాన్ని చూసినప్పుడు, డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్న వారిని చూస్తున్నప్పుడు, మేము ముగ్గురం కలిసి నృత్యం చేస్తున్నప్పుడు....అది మాటలకందని మధురభావన’ అంటోంది అశ్వినీ రామస్వామి. పాశ్చాత్య ప్రేక్షకులకు భరతనాట్యంలోని సొగసు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చేయడంలో రాణీ రామస్వామి విజయం సాధించింది. ‘క్రియేటివ్ పర్సన్ లేదా ఆర్టిస్ ప్రయాణం ఒంటరిగానే మొదలవుతుంది. ఆ ప్రయాణంలో వేరే వాళ్లు తోడైనప్పుడు ఎంతో శక్తి వస్తుంది. అమ్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాతో పాటు ఎంతోమంది ఆమె వెంట ప్రయాణం చేస్తున్నాం’ అంటుంది అపర్ణ రామస్వామి. భరతనాట్యానికి సంబంధించి ఈ ముగ్గురికి 3డీలు అంటే ఇష్టం. డీప్ లవ్, డెడికేషన్, డిసిప్లిన్. ‘ప్రశంసల సంగతి సరే, విమర్శల సంగతి ఏమిటి?’ అనే ప్రశ్నకు వీరు ఇచ్చే సమాధానం... ‘విమర్శ కోసం విమర్శ అని కాకుండా హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ అంటే ఇష్టం. దీని ద్వారా మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన ‘రిటెన్ ఇన్ వాటర్’ నృత్యరూపకం భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకే ప్రపంచంలోకి తీసుకు వచ్చింది. ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ ద్వారా మూడు దశాబ్దాల ప్రయాణం సులువైన విషయం ఏమీ కాదు. ప్రయాణంలో...కొందరు కొన్ని అడుగుల దూరంతో వెనుదిరుగుతారు. కొందరు కొన్ని కిలో మీటర్ల దూరంలో వెనుతిరుగుతారు. కొందరు మాత్రం వందలాది కిలోమీటర్లు అలుపెరగకుండా ప్రయాణిస్తూనే ఉంటారు. రాణీ రామస్వామి ఆమె కూతుళ్లు అపర్ణ, అశ్వినిలు అచ్చంగా ఈ కోవకు చెందిన కళాకారులు. నోట్స్ రెడీ ఇద్దరు కూతుళ్లు అపర్ణ, అశ్విని తల్లితో పాటు కూర్చుంటే కబుర్లకు కొరత ఉండదు. అయితే అవి కాలక్షేపం కబుర్లు కాదు. కళతో ముడిపడి ఉన్న కబుర్లు. అమ్మ రాణీ రామస్వామి తన సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన విలువైన అనుభవం ఒకటి ఆ సంభాషణలలో మెరిసి ఉండవచ్చు. ఈతరానికి నాట్యాన్ని ఎలా దగ్గర చేయాలి అనేదాని గురించి పిల్లలిద్దరూ తల్లితో చర్చించి ఉండవచ్చు. ఇలా ఎన్నెన్నో ఉండవచ్చు. ఈ కబుర్లు వృథాగా పోవడం ఎందుకని అర్చన, అశ్విన్‌లు నోట్స్‌తో రెడిగా ఉన్నారు. -
నీట్లో మెరిసిన రైతుబిడ్డలు
కర్నూలు: నీట్ పీజీ ఫలితాల్లో రైతు బిడ్డలు ప్రతిభ చూపారు. మంగళవారం సాయంత్రం వచ్చిన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నూరు హుసేని, చెన్నూరు హుసేనమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమార్తె రజియా అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేయాలన్న సంకల్పంతో నీట్ పరీక్షలు రాయగా 571 మార్కులు వచ్చాయి. ఆలిండియా స్థాయిలో 5248వ ర్యాంకు వచ్చింది. చిన్నపిల్లల వైద్యనిపుణురాలిగా మంచి పేరు తెచ్చుకుని పేదలకు సేవచేయాలన్నదే తన లక్ష్యమని ఈమె తెలిపారు. -
దారుణం.. తండ్రిని చంపి ఇంటికి నిప్పంటించిన కూతుర్లు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. కొప్పుల ఆంజనేయులు(75) అనే వ్యక్తిని కన్న కూతుర్లే దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. దీంతో ఆంజనేయులు సజీవ దహనమయ్యాడు. తమకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతోనే ముగ్గురు కూతుర్లు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అతను ఇంట్లో నిద్రిస్తున్న సమయం చూసి హతమార్చారు. వీరికి ఆంజనేయులు మనవడు భాను ప్రకాశ్ సహకరించాడు. కూతుర్లు, మనవడు కలిసే హత్య చేశారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గత పది రోజుల క్రితం ఆంజనేయులకు చెందిన ఎకరం భూమి అమ్మగా వచ్చిన రూ.10 లక్షలు ఇవ్వకపోవడంతోనే కుమార్తెలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. రాజంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి