న్యూఢిల్లీ: మరణించిన ప్రభుత్వోద్యోగి తాలూకు పింఛన్ పొందేందుకు భర్త చనిపోయిన, విడాకులు తీసుకున్న కూతుళ్లు కూడా అర్హులేనని కేంద్రం ప్రకటించింది. సిబ్బంది శాఖ ఇటీవలే ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ అంశంపై పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇటీవల పదేపదే వివరణ కోరుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ సర్క్యులర్‌ను పంపింది.
‘పింఛన్‌ను పిల్లలకు కూడా చెల్లించవచ్చు. ఎందుకంటే వారిని ఉద్యోగిపైనా, అతని/ఆమె భాగస్వామిపైనా ఆధారపడి ఉన్నవారిగానే భావించడం జరుగుతుంది. కనీస కుటుంబ పింఛన్ మొత్తంతో సమానంగా గానీ, అంతకంటే ఎక్కువ గానీ సం పాదన లేని వారిని పిల్లలుగా, తమ తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నవారిగా పరిగణిస్తారు. కాబట్టి ప్రభుత్వోద్యోగి మరణించే నాటికి ఈ నిబంధనల పరిధిలోకి వచ్చే పిల్లలంతా పెన్షన్‌కు అర్హులే. భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న కూతురికీ తండ్రి పింఛన్ పొందేందుకు అర్హత ఉంటుంది’ అని అందులో పేర్కొంది.
కూతుళ్లూ పెన్షన్‌కు అర్హులే: కేంద్రం
Published Wed, Sep 18 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement
Advertisement