Government employee
-
702––562 నంబర్ మీదేనా?
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగినిని (75) టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.73 లక్షలు కాజేశారు. ఆడియో, వీడియో కాల్స్ ద్వారా..పోలీసు, సీబీఐ అధికారుల పేరు చెప్పి.. దుర్భాషలాడిన ఆరోపణలపై కేసుంటూ మొదలుపెట్టి...మనుషుల అక్రమ రవాణా వరకు తీసుకువెళ్లి ఈ మొత్తం స్వాహా చేశారు. ఎట్టకేలకు తాను మోసోయినట్లు గుర్తించిన బాధితురాలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితురాలికి వారం రోజుల క్రితం టెలికం విభాగానికి చెందిన అధికారి పేరుతో ఫోన్ వచ్చింది. 702–––––562 నంబర్ మీదేనా? అంటూ అవతలి వ్యక్తి పశి్నంచగా కాదని సమాధానం ఇచ్చారు. ఆమె ఆధార్‌తో లింకై ఉన్న ఆ ఫోన్ నెంబర్ వినియోగించిన కొందరు అసభ్య పదజాలంతో పలువురికి ఫోన్లు చేశారని, దీనిపై బెంగళూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదై ఉందని చెప్పారు. ఆమె పేరుతో ఉన్న అన్ని ఫోన్లు త్వరలో బ్లాక్ అవుతాయని భయపెట్టాడు. ఈ ఆరోపణల్ని బాధితురాలు తోసిపుచ్చగా... త్వరలోనే పోలీసులు సంప్రదిస్తారని చెప్పాడు. ఆపై వాట్సాప్ వీడియో కాల్ చేసిన వ్యక్తి పోలీసు యూనిఫాంలో బాధితురాలికి కనిపించాడు. ఆమె ద్వారా ఆధార్ కార్డు కూడా షేర్ చేయించుకున్నాడు. తాము షాదత్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, అతడు వినియోగించిన బ్యాంకు ఖాతాల్లో కొన్ని బాధితురాలి పేరుతో ఉన్నట్లు చెప్పాడు. బాధితురాలి ఆరి్థక స్థితిగతుల్ని అడిగిన అతగాడు మనుషుల అక్రమ రవాణా కేసులో 187వ అనుమానితురాలిగా చేరుస్తున్నట్లు చెప్పాడు.ఆ కేసులో అరెస్టు వారెంట్, బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ ఆదేశాలు సిద్ధంగా ఉన్నట్లు నమ్మబలికాడు. దీని తర్వాత సీబీఐ అధికారి పేరుతో వీడియో కాల్ చేసిన మరో వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ జారీ చేసినట్లు ఉన్న నకిలీ లేఖను పంపాడు. అందులో సుప్రీం కోర్టు జ్యుడీషియల్ అథారిటీ ఆదేశాల ప్రకారం బాధితురాలు కొంత మొత్తం పోలీసులు సూచించినట్లు డిపాజిట్ చేయాలని ఉంది. సదరు నకిలీ సీబీఐ అధికారి ఆ కేసుల్లో పలువురు ప్రభుత్వ, బ్యాంకు అధికారులకూ పాత్ర ఉన్నట్లు చెప్పాడు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం నగదు డిపాజిట్ చేయాలని, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రిఫండ్ చేస్తామని నమ్మబలికాడు. దీంతో బాధితురాలు తన వద్ద ఉన్న డబ్బుతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు సైతం బ్రేక్ చేసి, తన కుమార్తె వద్ద నుంచి తీసుకుని మొత్తం రూ.73.5 లక్షలు సిద్ధం చేశారు. ఆపై నేరగాళ్లు ఆర్బీఐ పేరుతో మరో నకిలీ లేఖ పంపి...అందులో కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లు, వివరాలు సూచించిన వాటిల్లోకి నగదు బదిలీ చేయమన్నారు. బాధితురాలు అలానే చేయడంతో ఆదాయపుపన్ను శాఖ, ఆర్బీఐ స్టాంపులు ఉన్న నకిలీ రసీదులు కూడా షేర్ చేశారు. కొన్నాళ్లకు నేరగాళ్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో మరో నకిలీ లేఖను పంపిస్తూ... అందులో ఆమె పేరును నిందితుల జాబితా నుంచి బాధితుల జాబితాలోకి మార్చినట్లు పేర్కొన్నారు. బాధితురాలు ఎన్నిసార్లు కోరినా నగదు రిఫండ్ చేయకపోవడంతో అనుమానించిన ఆమె ఎట్టకేలకు మోసపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
మూడు నెలల శిశువు అపహరణ
కాచిగూడ హైదరాబాద్: దుస్తులు ఇప్పిస్తానని నమ్మించి ఓ తల్లి నుండి మూడు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడిని సీసీ కెమెరాల సాయంతో కాచిగూడ పోలీసులు గంటల వ్యవధిలో పట్టుకున్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ రఘు, ఇన్స్పెక్టర్ చంద్రకుమార్‌లు మంగళవారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం, అగ్రహారం గ్రామానికి చెందిన రవి, వరలక్ష్మి దంపతులు 3 నెలల బాబుతో ఉపాధి కోసం నగరానికి వచ్చి ఉప్పుగూడలో నివాసం ఉంటూ కూలీ పనిచేస్తున్నారు. గౌలిగూడా ప్రాంతానికి చెందిన బోగ నర్సింగ్ రాజ్ పంజగుట్టలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవేందర్ (48), అదే ప్రాంతానికి చెందిన ఎన్.ఉమావతి (55)తో పరిచయం ఉంది. ఉమావతి పనిచేస్తున్న బట్టల షాపులో లాల్‌దర్వాజా ప్రాంతానికి చెందిన సంధ్యారాణి పనిచేస్తుంటుంది. శివ, సంధ్యారాణి దంపతులకు పిల్లలు లేకపోవడంతో తాను పెంచుకోవడానికి దత్తతకు పిల్లలు కావాలని ఉమావతిని కోరింది. ఉమావతి ఈ విషయాన్ని నర్సింగ్ రాజ్, రాఘవేంద్రలకు తెలిపింది. వారు తమకు తెలిసిన వాళ్లు పిల్లలను దత్తతకు ఇస్తారని, వారికి లక్షన్నర డబ్బులు ఇవ్వాలని సంధ్యారాణికి తెలిపారు. దానికి అంగీకరించిన సంధ్యారాణి తొలివిడతగా లక్ష రూపాయలు చెల్లించింది. డబ్బులు చెల్లించి ఆరు నెలలు గడుస్తున్నా వారు ఇచి్చన మాట నిలబెట్టుకోక పోవడంతో సంధ్యారాణి వారిపై ఒత్తిడి చేసింది. దీనితో కిడ్నాప్ చేసి, ఆమెకు చిన్నారిని అందించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో సోమవారం చాదర్‌ఘాట్ చౌరస్తాలో వరలక్ష్మి తన మూడేళ్ల కుమారుడితో భిక్షాటన చేస్తుండగా నర్సింగ్‌రాజ్ ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నాడు. కొత్త దుస్తులు ఇప్పిస్తానని వరలక్ష్మీని మాటల్లో పెట్టాడు. తన వెంట కాచిగూడ డిమార్ట్‌కు తీసుకెళ్లాడు. వరలక్ష్మి దుస్తులు చూస్తుండగా నర్సింగ్‌రాజ్ అక్కడి నుండి బాబును తీసుకొని ఆటోలో ఉడాయించాడు.లాల్ దర్వాజాలో ఉండే సంధ్యారాణికి అప్పజెప్పాడు. బాలుడు కని్పంచకపోవడంతో వరలక్ష్మి కొద్దిసేపు వెదికింది. ఫలితం లేకపోవడంతో సోమవారం సాయంత్రం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐలు సుభాష్, రవికుమార్‌లు రెండు టీంలుగా ఏర్పడి సీసీ కెమెరాల సహాయంతో లాల్‌దర్వాజలో బాలుడు ఉన్నట్లు కనుగొన్నారు. సోమవారం రాత్రి 7 గంటలకు చాకచక్యంగా కిడ్నాపర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నర్సింగ్‌రాజ్, రాఘవేందర్‌లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. ఉమావతి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఆరు గంటల్లో కేసును ఛేదించిన కాచిగూడ పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
బంగ్లాలు, కోట్లాది ఆస్తులు!
కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడానికి బదులు అడ్డదారుల్లో ఆస్తులు సంపాదించినవారిపై లోకాయుక్త ముమ్మర దాడులు చేసింది. బెంగళూరు, మైసూరు, బీదర్, బళ్లారి, విజయనగరతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 63కు పైగా ప్రాంతాల్లో 13 మంది అధికారులు, ఉద్యోగుల ఆఫీసులు, ఇళ్లు, వారి బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు జరిపింది. ఇందులో కోట్లాది విలువ చేసే నగదు, బంగారం, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. లెక్చరర్ వ్యాపారాలు మైసూరు నంజనగూడు ప్రభుత్వకాలేజీ లెక్చరర్ మహదేవస్వామికి చెందిన మైసూరు గురుకుల లేఔట్ నివాసంతో పాటు 12 చోట్ల దాడులు చేశారు. పేరుకే ఆయన అధ్యాపకుడు, కానీ ఎంఎస్ గ్రూప్ కంపెనీ నిర్వహిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు పోగేసినట్లు తెలిసి సోదాలు చేపట్టారు. మైసూరులోని ఇళ్లు, కార్యాలయం, పాఠశాల, వాణిజ్య కట్టడాల్లో గాలింపు జరిపారు. ఒక విద్యాసంస్థ, స్టీల్, వస్త్ర దుకాణాలు గుర్తించారు. ఆయన కార్ల పార్కింగ్ కోసమే విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఘనాపాఠి తిమ్మరాజ కేఆర్ఐడీఎల్ సూపరిన్టెండెంట్ ఇంజనీర్ తిమ్మరాజప్ప బంగ్లా చూసి లోకాయుక్త అధికారులు షాక్ తిన్నారు. కోలారు, బెంగళూరు, బెళగావితో పాటు 8 చోట్ల దాడులు చేశారు. కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని సొంతూరు మహదేవపురలో బృహత్ బంగ్లా కట్టుకున్నారు. బెంగళూరులోనూ తిమ్మరాజప్ప 7 ప్రాంతాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువచేసే నివాసం, ఆస్తులు, భూములు రికార్డులు లభ్యమయ్యాయి. విజయేంద్ర బావమరిదిపై... బళ్లారి గనులు, భూ విజ్ఞానశాఖ చంద్రశేఖర్, అటవీశాఖ డీఆర్‌ఎఫ్‌ఓ మారుతి ఇళ్లలో తనిఖీలు చేశారు. చంద్రశేఖర్ బళ్లారిలో పనిచేస్తుండగా ఇల్లు హోసపేటెలో ఉంది. బీదర్‌లో పశువైద్య యూనివర్శిటీ ఉద్యోగి సునీల్‌కుమార్ నివాసం, వాణిజ్య కాంప్లెక్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై. విజయేంద్ర భార్య సోదరుడు, యాదగిరి డీహెచ్ఓ డాక్టర్ ప్రభులింగ మానకర్ కలబురిగి నివాసంలోను సోదాలు చేపట్టారు. అందరి ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు తదితరాల తనిఖీ కొనసాగుతోంది. బెంగళూరులో ముగ్గురు.. బెంగళూరులో మూడుచోట్ల... బెస్కాం జాగృతి దళం అధికారి టీఎన్.సుధాకర్‌రెడ్డి, సహకార సంఘం సీఈఓ హెచ్ఎస్.కృష్ణమూర్తి, జయనగర బెస్కాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్డీ. చెన్నకేశవల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. చెన్నకేశవకు చెందిన అమృతహళ్లి ఇంటిలో రూ.6 లక్షలు నగదు, 3 కిలోల బంగారు నగలు, 28 కేజీల వెండి, రూ.25 లక్షల విలువచేసే వజ్రాభరణాలు, రూ.5 లక్షలు విలువైన 7 పురాతన వస్తువులు లభించాయి. వీటన్నింటి ప్రాథమిక విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈయన కరెంటు కనెక్షన్ ఇవ్వాలంటే లక్షలాది రూపాయల ముడుపులు తీసుకుంటారని ఆరోపణలున్నాయి. ఇటీవల ఫిర్యాదులు కూడా అందాయి. మొదటి భార్య భవనం చిక్కబళ్లాపురం: రామనగర జిల్లాలో వ్యవసాయశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసే మునేగౌడపై లోకాయుక్త దాడులు చేసింది. ఇక్కడ నంది క్రాస్‌లో ఉన్న మొదటి భార్య ఉండే విలాసవంతమైన బంగ్లాలో సోదాలు చేశారు. పాలిహౌస్‌ల కొనుగోలులో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రామనగర, బెంగళూరు, సొంతూరు శిడ్లఘట్ట, చిక్కబళ్లాపురంలోనూ బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. బంగారం, నగదు, ఆస్తిపత్రాలు లభించాయి. చిక్కబళ్లాపురం లోకాయుక్త ఎస్పీ రామ్, డీఎస్పీ వీరేంద్రకుమార్, ఇన్స్పెక్టర్లు శివప్రసాద్, మోహన్ పాల్గొన్నారు. -
విద్యార్థుల దుస్తులు.. విద్యార్థినులతో విప్పించి.. ఫొటోలు తీసి.. కీచక టీచర్!
సాక్షి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్ధుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బి.మోహన్‌రావు అనే ఉపాధ్యాయుడు.. రెండో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఎక్కాలు సరిగా చెప్పలేదంటూ వారి దుస్తులు విప్పించాడు. అందులో ఇద్దరి దుస్తులను నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినులతో విప్పించి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాక తమను దుస్తులు లేకుండా సెల్ఫోన్లో ఫొటోలు తీసి బెదిరించాడని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సదరు టీచర్‌ను ప్రశ్నించేందుకు సోమవారం పాఠశాలకు రాగా, ఆ ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరయ్యాడు. దాంతో పాఠశాలలో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడని, ఇలాంటి టీచర్లతో విద్యార్థినులకు ఏం భద్రత ఉంటుందని ప్రశ్నించారు. అయితే శనివారం పాఠశాల హెచ్ఎం శిక్షణ కార్యక్రమానికి వెళ్లగా, ఓ టీచర్ సెలవు పెట్టారు. మరో ఉపాధ్యాయుడు మధ్యాహ్నమే వెళ్లిపోగా, మోహన్‌రావు ఒక్కడే స్కూళ్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై పి.శ్రీకాంత్ అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు, డీఈఓకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో అనుచితంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఇవి చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై దాడి! అల్లుడిని దారుణంగా.. -
ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనా.. వారి వలలో పడి.. భారీ మూల్యాన్ని చెల్లించింది..
మంచిర్యాల: నిరక్ష్యరాసులతో పాటు అక్షరాశ్యులు కూడా సైబర్ నేరాగాళ్ల వలలోపడి మోసపోతున్నారు. బెజ్జూర్ మండలంలోని కుంటాలమానెపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నైతం లతశ్రీ కౌటాల మండలంలోని ఇప్పలగూడ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ఫేస్బుక్లో వచ్చిన వ్యాపార ప్రకటనలోని ఫోన్ నంబర్లను సంప్రదించింది. ధనీ బ్యాంకు పేరుతో 9038683321 నంబర్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఈ నెల 2న రూ.50 లక్షల రుణం మంజూరు చేస్తున్నట్లు ఫోన్‌ద్వారా సందేశం పంపించారు. దీంతో పాటు సైబర్ నేరగాళ్లు ఆధార్, పాన్‌కార్డుతో పాటు ఆమె ఖాతా నంబర్ కలిగిన రూ.50 లక్షల బ్యాంకు చెక్కు వంటి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించారు. వివరాలను పోల్చి చూసిన బాధితురాలు వారిని నమ్మి లావాదేవీలు జరిపారు. ఆగస్టు 2 నుంచి 11వ తేదీ వరకు పలు దఫాలుగా రూ.1.70 లక్షల నగదును పేటీఎం, ఫోన్‌పేల ద్వారా చెల్లించారు. మరిన్ని చార్జీలు చెల్లిస్తేనే రూ.50 లక్షల రుణం మీ ఖాతాలో జమ అవుతుందని సదరు వ్యక్తులు తెలపడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. కౌటాల ఎస్సై మధుకర్, సీఐ సాధిక్పాషాలకు ఫిర్యాదు చేయడంతో సైబర్ విభాగంలో ఫిర్యాదును నమోదు చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టి కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ పిటిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీని అడ్డుకునేందుకు అధికారులపై అతను దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేగాక రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలని, ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరు మీద జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు. సర్వీసు నుంచి తొలగింపుపై పిటిషన్ తిరుపతి జిల్లా, నాయుడుపేటకు చెందిన అంబటి శ్రీనివాసులు నాయుడు ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) ఉద్యోగి. ఇతన్ని సస్పెండ్ చేస్తూ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మెమో జారీచేశారు. దాన్ని సవాలు చేస్తూ శ్రీనివాసులు నాయుడు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ ఆ మెమోను సస్పెండ్ చేస్తూ పిటిషనర్ శ్రీనివాసులు నాయుడిని ఉద్యోగం చేసుకోనివ్వాలంటూ ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం శ్రీనివాసులు నాయుడును ఉద్యోగంలోకి తీసుకున్న అధికారులు అతన్ని ఉదయగిరికి బదిలీ చేశారు. పోస్టింగ్ ఉత్తర్వుల గురించి పిటిషన్లో ఎక్కడా చెప్పలేదు శ్రీనివాసులు నాయుడు తరఫు న్యాయవాది ఆర్.సుధీర్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందువల్ల అతన్ని ఉదయగిరికి బదిలీ చేయడం తగదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్, అనారోగ్య సమస్యలన్నవి పూర్తిగా వేరని, వాటిని ప్రస్తుత కోర్టు ధిక్కార పిటిషన్లో విచారించజాలమని తేల్చిచెప్పారు. పోస్టింగ్ ఆర్డర్‌ను నేరుగా తీసుకునేందుకు పిటిషనర్ నిరాకరించడం, రిజిస్టర్ పోస్టు ద్వారా ఆ ఆర్డర్‌ను అందుకున్న విషయాన్ని దాచిపెట్టడం అన్నదే ఇక్కడ ప్రధాన విషయమన్నారు. శ్రీనివాసులు నాయుడు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారని న్యాయమూర్తి తేల్చారు. ఈ మేరకు రూ.25వేలను ఖర్చుల కింద చెల్లించాలని శ్రీనివాసులు నాయుడును న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాలను గౌరవించి విధుల్లోకి తీసుకున్నాం ఇదిలా ఉంటే కార్పొరేషన్ అధికారులు కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ శ్రీనివాసులు నాయుడు వారిపై హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ కె.సంతోష్‌రావు, సూపరింటెండింగ్ ఇంజినీర్ బి.వెంకట సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సుధాకర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ ప్రతివాదులుగా ఉన్న అధికారులకు నోటీసులు జారీచేశారు. ఇటీవల ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాదులు కొవ్వూరి వెంకట్రామిరెడ్డి, అభయ్ జైన్ వాదనలు వినిపిస్తూ, కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ శ్రీనివాసులు నాయుడును విధులోకి తీసుకుని అతన్ని ఉదయగిరికి బదిలీ చేశారని తెలిపారు. పోస్టింగ్ ఆర్డర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పిటిషనర్‌కు అందచేయగా, ఆ ఆర్డర్‌ను నేరుగా తీసుకునేందుకు అతను నిరాకరించారని, దీంతో 7వ తేదీన రిజిస్టర్ పోస్టు ద్వారా పోస్టింగ్ ఆర్డర్ పంపగా, దాన్ని 8వ తేదీన అందుకున్నారంటూ, ఇందుకు సాక్ష్యంగా పోస్టల్ శాఖ ట్రాకింగ్ రిపోర్ట్‌ను వారు కోర్టు ముందుంచారు. బదిలీ తర్వాతవాత కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన శ్రీనివాసులు నాయుడు అధికారులు ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్ గురించి తన పిటిషన్లో పేర్కొనలేదని వెంకట్రామిరెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టడమే అవుతుందన్నారు. -
నిజామాబాదు జిల్లాలో ఏసీబీ దాడుల కలకలం...
ఖలీల్‌వాడి : జిల్లాలో ఇటీవల ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. అక్రమార్కులు మధ్యవర్తుల ద్వారా గాని తనకు అనుకూలంగా ఉన్న వారితో లంచాలు తీసుకోవడంతో కొంత కాలంగా ఏసీబీ దాడుల ఊసు లేకుండా పోయింది. అయితే లంచం తీసుకుంటూనే అక్రమార్కులు ఇబ్బందులకు గురి చేయడంతో బాధితు లు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.కాగా కొత్త కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభమై ఏడాది పూర్తి కాక ముందే అందులోని సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్లో దాడులు చేసి ఏసీబీ అధికారులు ముగ్గురిపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం డిమాండ్ చేస్తే డైరెక్ట్‌గా టోల్‌ఫ్రీనెంబర్ 1064కు కాల్ చేయాలని ఏసీబీ డీఏస్పీ ఆనంద్ సూచించారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. బాధితులు జిల్లా కేంద్రంలోని ఏసీబీ కార్యాలయంలోనూ సంప్రదించవచ్చన్నారు. తాజాగా మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన దుగ్గెన రాజేందర్ వద్ద నాల కన్వర్షన్‌కు చెందిన పంచనామా పత్రం కోసం రూ. 10 వేలు డిమాండ్ చేసిన జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. ఈ నెల 17న తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా భీమ్‌గల్‌లోని ఓ ప్రవేట్ కాలేజీలో పరీక్ష సెంటర్ అనుమతి కోసం రూ. 50 వేలు డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుపడ్డారు. హైదరాబాద్ తార్నాకలోని వీసీ ఇంటిలోనే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
పెరగనున్న పెన్షన్ల భారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న తొమ్మిదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్నారు. అదే స్థాయిలో పెన్షన్ల వ్యయం కూడా భారీగా పెరగనుంది. వచ్చే తొమ్మిదేళ్లలో 1,33,417 మంది ఉద్యోగులు రిటైర్ కానుండగా పెన్షన్ల రూపంలో ప్రభుత్వం మొత్తం రూ.2,80,141.94 కోట్లు చెల్లించనుంది. రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక శాఖ ఈ వివరాలను పొందుపరిచింది. వచ్చే ఏడాది 13,643 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం పెన్షన్ల వ్యయం రూ.20 వేల కోట్లు ఉండగా వచ్చే ఏడాది రూ.25,520.04 కోట్లకు పెరగనుంది. 2024 నుంచి 2032 వరకు ఏటా 13 వేల నుంచి 16 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతారని ద్రవ్య విధాన పత్రం వెల్లడించింది. దీంతో 2032 నాటికి పెన్షన్ల వ్యయం రూ.41,803.40 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. -
పచ్చదళంలో మహిళా పోలీస్!
సాక్షి, అనంతపురం(ఆత్మకూరు): ఓ ప్రభుత్వ ఉద్యోగి గీత దాటారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఓ రాజకీయ పార్టీ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ హల్చల్ చేశారు. ఆమె వ్యవహార శైలి చూసి అక్కడున్న వారంతా ముక్కునవేలేసుకున్నారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మ మదిగుబ్బ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తోంది. గురువారం ఆత్మకూరు మండలం సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా సాగిన పరిటాల సునీత పాదయాత్రలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రామాంజినమ్మ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తగా పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఎంపీడీఓ కొండన్న, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులను వివరణ కోరగా.. విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
మత్తుమందు ఇచ్చి లైంగికదాడి
డిండి: ఓ ప్రభుత్వ ఉద్యోగి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడటమేకాక అనంతరం ఆమె నగ్న చిత్రాలు తీసి.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. కొద్ది రోజులు మానసికంగా కుంగిపోయిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఆ మృగాడి ఘాతు కం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయపల్లికి చెందిన ముడావత్ చందూలాల్ (40) శంషాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం జేత్యతండాకు చెందిన ఓ మహిళ (28) భర్త చనిపోవడంతో బతుకుదెరువుకు తన ఇద్దరు పిల్లల తో కలసి ఆరేళ్లుగా శంషాబాద్‌లో ఉంటూ కూలీగా జీవనం సాగిస్తోంది. కన్నేసి.. కోరిక తీర్చాలని.. అదే ప్రాంతంలో ఉంటున్న చందూలాల్ ఆ వితంతు మహిళపై కన్నేశాడు. ఆమె తో పరిచయం పెంచుకుని కోరిక తీర్చాలని వేధింపుల కు పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ రెండు నెలల క్రితం పిల్లలతో కలసి బంధువుల ఊరైన నల్లగొండ జిల్లా డిండి మండలం వీరబోయనపల్లి తండాకు మకాం మార్చింది. దీంతో చందూలాల్ జూన్ 27న అర్ధరాత్రి మత్తు మందు ఉంచిన చేతి రుమాలుతో ఆ మహిళ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆమె తలుపు తీయగానే రుమాలును ముఖంపై పెట్టడంతో స్పృహ కోల్పోయింది. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన చందూలాల్ ఆమె నగ్న చిత్రాలు సెల్ఫోన్లో తీసు కుని వాట్సాప్‌లో ఆమెకే పంపించి బెదిరిస్తున్నాడు. బాధితురాలు ఈనెల 23న శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు కేసును 24న డిండి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సురేశ్ వివరించారు. -
లోన్ యాప్ వేధింపులకు ప్రభుత్వ ఉద్యోగి బలి
-
బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాది.. వీడియో ఇదే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్‌ను ఓ ఉగ్రవాది తన చేతుల్లోని తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో మేనేజర్ అక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. విజువల్స్‌లో ఉగ్రవాది రెండు బ్యాంక్ తలుపుల నుంచి చూస్తూ వెనక్కి వెళ్తూ కనిపించాడు. తరువాత మరోసారి బ్యాంక్‌లోకి వచ్చి మేనేజర్‌పై అంత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన విజయ్ కుమార్ కుల్గామ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాంక్‌లోకి చొరబడిన టెర్రరిస్ట్ తుపాకీతో మేనేజర్ విజయ్ను కల్చి చంపాడు. కాల్పుల అనంతరం విజయ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. కాగా కశ్మీర్లో కొన్ని రోజులుగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. రెండు రోజుల ముందు ఇదే కుల్గామ్‌లోనే రజనీ బాలా అనే ప్రభుత్వం టీచర్‌ను కూడా చంపేశారు. అంతేగాక ఒక్క మే నెలలోనే అయిదుగురుప్రభుత్వ ఉద్యోగులను హతమార్చారు. మరోవైపు ఈ హత్యలను కాశ్మీరీ పండిట్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. చదవండి: కోవిడ్ బారిన సోనియా.. ట్వీట్ చేసిన ప్రధాని #WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district. The bank manager later succumbed to his injuries. (CCTV visuals) pic.twitter.com/uIxVS29KVI — ANI (@ANI) June 2, 2022 -
Chhattisgarh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి..
ఛత్తీస్‌ఘడ్: భారతదేశమంతట 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పని దినాలతో పాటు పలు విధానపర నిర్ణయాలను ప్రకటించారు. అదే విధంగా, పెన్షన్ పథకంలో రాష్ట్రప్రభుత్వం వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులలో సామర్థ్యం, ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. ఆయా నివాస ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేర్కొన్నారు. ఇది చిరువ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రజా భద్రతకు ఇబ్బందులు కల్గించే ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బిల్డింగ్ కోడ్‌లోని నిబంధలను అందరు పాటించాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లలో సెకండ్ బిల్డింగ్ పర్మిషన్ పథకానికి అనుగుణంగా ప్రణాళిక నిబంధనలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతోపాటు రవాణా సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధలను సులభతరం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళల భద్రత కోసం మహిళ సేఫ్టీ సెల్స్‌ను ఏర్పాటు చేస్తామని భూపేష్ బఘెల్ ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్ ప్రాంతంలో దట్టమైన అడవులతో కూడి ఉంటుంది. ఈ క్రమంలో గిరిజనులు ఎక్కువగా జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడతారు. వీరి కోసం అటవీ వాసులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయనున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లోని ప్లాట్లలో 10 శాతం భూమిని ఓబీసీ వర్గానికి రిజర్వు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రైతుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పప్పుధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీఎం తెలిపారు. అలాగే కార్మికులకు జన్మించిన మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 20,000 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. చదవండి: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం -
జీవో 317ను సవరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను గత నెలరోజులుగా మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, స్థానికత కోల్పోయి ఇతర జోన్లు, జిల్లాలకు శాశ్వతంగా బదిలీ అయిన ఉద్యోగులను అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. సీనియారిటీపై అప్పీల్స్, సామాజిక తరగతులకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రకటనలకే పరిమితం కాకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పేద వర్గాలకు ఉపయోగకరమే అయినప్పటికీ తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేస్తే ఆయా వర్గాలకే నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరిగా ఉండాలన్నారు. 22న ఆన్లైన్ బహిరంగ సభ.. ఈ నెల 22 నుంచి 25 వరకు పార్టీ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తమ్మినేని తెలిపారు. 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నాయకులు ప్రసంగిస్తారన్నారు. -
‘ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశ్యం కాదన్నారు. కచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదన్నారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు. చదవండి: వేతనాలు తగ్గవు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టీకరణ ఉద్యోగులు ఆవేశాలకు లోను కావద్దన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్ఎ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలనే ఆలోచించే ప్రభుత్వమిదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దన్నారు. పదివేల కోట్ల భారం పడుతున్నా సీఎం వైఎస్ జగన్ వెనుకాడలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ ఒమిక్రాన్ దెబ్బకు మళ్లీ పునరాలోచనలో పడ్డాయి.ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన ఓ రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పని చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం జనవరి 7 నుండి జనవరి 31 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, సబ్- ఆర్డినేట్ కార్యాలయాలు 50శాతం మంది ఉద్యోగులతో విధులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కార్యాలయాలకు హాజరయ్యే ఉద్యోగుల ఎంపిక విధానాన్ని సంబంధింత డిపార్ట్మెంట్/ కార్యాలయాల ఉన్నతాధికారులు నిర్ణయించుకోవచ్చని' సాధారణ పరిపాలన, పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ లు జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. అయితే, ప్రత్యేక సహాయ కమిషనర్, ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వాహణ అథారిటీ, పోలీస్,అగ్నిమాపక, ఆరోగ్యం, మున్సిపల్ సేవలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ముఖ్యమైన కార్యాలయాలు,సేవలను పరిధి నుండి మినహాయించింది. ఈ విభాగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఒడిశా ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒడిశా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఒడిశా సబార్డినేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి అన్ని నియామక సంస్థల కార్యాలయాల్లో 75 శాతం మంది ఉద్యోగులు పనిచేస్తారని తెలిపారు. రోస్టర్‌లో విధుల్ని కేటాయించని అధికారులు, సిబ్బంది రెగ్యులర్, పెండింగ్ పనులకు హాజరు కావడానికి వారికి అందించిన వీపీఎన్తో ఇంటి నుండి పని చేయాలని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. డిజెబిలిటీ ఉన్న ఉద్యోగులు, గర్భిణీ స్త్రీలైన ఉద్యోగులు ఇంటి వద్దనుంచి పనిచేయాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం: ఉద్యోగులకు గుడ్‌న్యూస్! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
స్థానికతనూ పరిగణించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీతో పాటు స్థానికతను తప్పకుండా పరిగణించాలని జాతీయ బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను పాటించకపోవడం, విభజన ప్రక్రియ పూర్తికాకముందే కేటాయింపులు జరపడం వంటి అవకతవకలు జరిగాయంటూ పలువురు ఉద్యోగులు జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన కేటాయింపులను నిలిపివేయాలని కోరారు. దీనిపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) సోమవారం విచారణ చేపట్టింది. ఎన్సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో విచారణ సాగింది. పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హాజరు కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్ హాజరయ్యారు. విచారణ అనంతరం ఎన్సీబీసీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీ మాత్రమే కాకుండా వయసు, స్థానికతను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పదవీ విరమణకు దగ్గరున్న ఉద్యోగులను అక్కడే కొనసాగించాలన్నారు. అటవీ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగుల స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా వారిని మైదాన ప్రాంతాలకు, మైదాన ప్రాంతాల్లో పనిచేసే వారిని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయన్నారు. ఉద్యోగుల వినతులను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్దేశించిన చోట చేరాలని బలవంతం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకముందే ఉద్యోగ కేటాయింపులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. -
కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే అతని/ఆమె డిపెండెంట్‌కు కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబం ఆర్థిక స్థితిగతులు, అతడు/ఆమెపై ఆ కుటుంబంలోని వారు ఏ మేరకు ఆధారపడ్డారు, వారు వృత్తి, వ్యాపారాల్లో కొనసాగుతున్నారా వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కారుణ్యనియామకాన్ని చేపట్టాల్సి ఉంటుందని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. సర్వీస్ నిబంధనల్లో కారుణ్య నియామకం కూడా ఒక్కటై, ఉద్యోగి మరణించిన సందర్భాల్లో ఆటోమేటిక్‌గా, ఎలాంటి పరిశీలనలు జరపకుండా కారుణ్య నియామకం చేపడితే అది సంపూర్ణ చట్టబద్ధ హక్కు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘కానీ, ప్రస్తుతం కారుణ్య నియామకం అలా కాదు. అది వివిధ పరామితులకు లోబడి ఉంటుంది. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక పరిస్థితులు, ఆ కుటుంబం ఏమేరకు ఆ మృత ఉద్యోగిపై ఆధారపడి ఉంది, వారు సాగిస్తున్న వివిధ వృతులు, ఉద్యోగాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు భీమేశ్ అనే వ్యక్తికి కారుణ్య కారణాలతో ఉద్యోగం ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన బెడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. భీమేశ్ సోదరి కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తూ 2010లో చనిపోయారు. అవివాహిత అయిన ఆమెకు తల్లి, ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సోదరి ఆదాయంపై తమ కుటుంబం ఆధారపడి ఉన్నందున తనకు కారుణ్య కారణాలతో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ భీమేశ్ వాదించగా అధికారులు తిరస్కరించారు. దీంతో, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా తీర్పు అనుకూలంగా వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా, ట్రిబ్యునల్ తీర్పునే కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో, ఆ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సుప్రీంకోర్టు తలుపుతట్టింది. -
ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం.. మరి ఈ కక్కుర్తి ఏంటి!
సాక్షి, పెద్దపల్లి: వేతనాలు పెంచుతున్నా.. పీఆర్సీలు ప్రకటిస్తున్నా కొన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతస్థాయి నుంచి దిగువస్థాయి అధికారుల వరకూ లంచం ఇవ్వనిదే పనికాని పరిస్థితి నెలకొంది. దీనికి మూడు నెలల్లో ముగ్గురు అధికారులు పట్టుబడడమే నిదర్శనం. జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కలకలం రేపుతున్నా.. అధికారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. నూతన జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలు, పెరిగిన రియల్ ఎస్టేట్ బూమ్‌తో ఏరికోరుకుంటూ పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. చేతుల్లో లంచం పడకపోతే దస్త్రం కదలదంటూ తేల్చి చెబుతున్నారు. ఏసీబీ దాడులు చేస్తున్నా తీరు మారడం లేదు. అదే పనిగా సామాన్యులను పట్టి పీడిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. పలు విభాగాల్లో అక్రమాలెన్నో.. ప్రజల నుంచి ఎక్కువగా లంచాలు తీసుకుంటున్న శాఖలపైనే కాకుండా ఆ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపైనా ఏసీబీ అధికారులు ఇక నుంచి సీరియస్‌గా ఆరా తీయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అవినీతి పరుల పక్కా సమాచారాన్ని సేకరించిన తరువాతనే వ్యూహాత్మకంగా దాడి జరిపేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఇటు రెడ్‌హ్యాండెడ్ కేసులతోపాటు అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బంది ఆస్తులపై.. వారి బినామీల ఆస్తులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్, ఆర్టీఏ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, మరికొన్ని శాఖల్లో పెరిగిపోతున్న లంచాల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కొంతకాలంగా ఈ శాఖల్లో పెద్దఎత్తున అవినీతి కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల క్రితమే ఎఫ్ఏసీగా బాధ్యతలు.. కోల్‌సిటీ:పెద్దపల్లి ఆర్డీవో కె.శంకర్‌కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్ 2న కార్పొరేషన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈ రషీద్‌ను ఏసీబీకి పట్టించిన రజినీకాంత్ అనే కాంట్రాక్టరే.. ఆర్డీవోను కూడా పట్టించడం గమనార్హం. గోదావరిఖనికి చెందిన రజినీకాంత్‌కు కరోనా వ్యాప్తి నివారణకు పిచికారీ చేయించిన హైపోక్లోరైడ్‌కు సంబంధించి రూ.9.20 లక్షలు, హరితహారం కింద నాటిన మొక్కల బిల్లు రూ.25లక్షలు రావాల్సి ఉంది. పనులు పూర్తి చేసి ఆర్నెళ్లు గడుస్తున్నా తమకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యే, మేయర్‌కు చెప్పినా ఫలితం కనిపించలేదని, పైగా కమిషనర్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు రజినీకాంత్ వెల్లడించారు. భూపాలపల్లికి బదిలీ అయినా.. కరీంనగర్లో భూసేకరణ విభాగంలో పనిచేసిన శంకర్‌కుమార్‌కు జయశంకర్భూపాలపల్లి జిల్లాకు బది లీ అయ్యింది. అక్కడకు వెళ్లకుండా పెద్దపల్లికి వచ్చా డు. తహసీల్దార్‌గా పనిచేసిన పలు ప్రాంతాల్లోనూ ఈయనపై అవినీతి ఆరోపణలు అధికంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నారు. రూట్ మారుస్తున్నారు జిల్లాలో వరుస ఏసీబీ దాడులతో మిగతా శాఖల ఉద్యోగులు అవినీతికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా పట్టుబడిన ఆర్డీవో ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని మరీ లంచం తీసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది. జిల్లాలోని పలుశాఖల్లోని అధికారులు సైతం అదే బాటలో కొనసాగుతున్నారు. పనికోసం వచ్చిన వారిని సెక్షన్లో ఫలానా వ్యక్తిని కలవాలని చెబుతున్నారు. మరికొందరు నేరుగా డబ్బు తీసుకోకుండా తమ బినామీల వ్యక్తుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేసి.. దానికి సంబంధించిన బ్యాంక్ రిసిప్ట్ చూపిస్తే పనులు చేస్తున్నారు. మరికొందరు బంగారం, ఇతరత్రా గిఫ్ట్‌ల రూపంలో ‘మామూళ్లు’ తీసుకుంటున్నారు. చదవండి: ప్రేమించి, శారీరకంగా ఒక్కటై.. గర్భం దాల్చగానే.. -
ఉద్యోగుల జీతాలు ఎక్కడా ఆగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కడా ఆగలేదని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ‘కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా ఇబ్బందులు వచ్చాయి. మనమూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా చెల్లిస్తున్నాం. ఈ విషయంలో ఉద్యోగుల నుంచి సహకారం ఉంది. దీనిని కూడా ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదని సంక్షేమ పథకాల ద్వారా డబ్బు ఇచ్చాం’ అని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో మంత్రి బుగ్గన మంగళవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బుగ్గన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు సంక్షేమానికే.. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు చేసిందే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు కోసం. ఈ కార్పొరేషన్ ఏర్పాటుపై చట్టమే చేశాం. అందులో అన్ని విషయాలూ ఉన్నాయి. దీని ద్వారా తీసుకున్న రుణాలను అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒప్పందాలన్నీ గవర్నర్ పేరు మీదే పరిపాలన అంతా ఎప్పుడూ గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. అప్పులు తీసుకున్నా, జీవోలు జారీ చేసినా, ఎలాంటి ఒప్పందాలయినా గవర్నర్ పేరు మీదే జరుగుతాయి. గత ప్రభుత్వాలు ఎవరి పేరుతో అప్పులు చేశాయి? భూములు తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకోవడం కూడా అత్యంత సహజం. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రభుత్వ నిధుల వినియోగంపై కాగ్ అభ్యంతరాలు చాలా సహజం. వాటికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉంది. ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ అమల్లో ఉన్నందున ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ ఉండాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామే నాతో ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ఏమీ బాధ పడటంలేదు. పన్నుల వసూళ్ల గురించి డీలర్ బేస్‌పై ప్రాథమికంగా చర్చించాం. ముఖ్యమంత్రి కొత్తగా ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష చేశాను. రాష్ట్రానికి ఇంతవరకు జీఎస్టీ కింద రూ.3,274 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇంకా రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు జీఎస్టీ బకాయిలు రావాలి. -
రిటైరయ్యే వయస్సు.. పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు
అనంతపురం క్రైం/సెంట్రల్: అతని పేరు మాధవరెడ్డి.. అనంతపురం నగర పాలక సంస్థలో వర్క్ ఇన్స్పెక్టర్. మరికొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ పొందే వయస్సు! రూ. లక్ష వరకూ జీతం. అయినా పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి అమ్మాయిలకు ఎర వేసి వ్యభిచార వృత్తిలోకి దింపుతుంటాడు. అనేక సంవత్సరాలుగా దీనినే వృత్తిగా పెట్టుకున్న ఇతగాడు ఇటీవల ఓ బాలికను వ్యభిచార కూపంలోకి దించే యత్నంలో దిశ పోలీసులకు పట్టుబడ్డాడు. (చదవండి: Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం) ఏనాడూ ఉద్యోగం చేసింది లేదు తన సర్వీసు మొత్తం అనంతపురం మున్సిపాలిటీ... ఆ తర్వాత నగర పాలక సంస్థలోనే పని చేస్తున్న మాధవరెడ్డి ఏనాడూ ఉద్యోగం చేసింది లేదు. ప్రముఖులకు అమాయకులైన అమ్మాయిలను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. తన అక్రమ సంపాదనలోను, నెలవారీ జీతంలోనూ నగర పాలక సంస్థ ఉన్నతాధికారులకు వాటాలు పంచుతూ కార్యాలయం మెట్టు కూడా ఎక్కకుండా నెట్టుకొస్తున్నాడు. ఆన్లైన్ ద్వారా అమ్మాయిలను బుక్ చేసుకునేలా విటులకు వెసులుబాటు కలి్పంచి తన చీకటి వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. ఈ క్రమంలోనే ఇతనిపై ఇతర రాష్ట్రాల్లోనూ పోలీసులు కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరేందుకు అప్పట్లో పనిచేసిన ఓ ఉన్నతాధికారికి రూ.50 లక్షలు, సూపరింటెండెంట్‌కు రూ.లక్షల్లో ముట్టజెప్పినట్లు ఆ సంస్థ ఉద్యోగులే బాహటంగా చెబుతున్నారు చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి సత్ఫలితాన్నిచ్చిన ‘దిశ’ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం సత్ఫలితాన్నిస్తోంది. బాధితులు ఎవరైనా ఆశ్రయిస్తే తక్షణమే దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మాధవరెడ్డి పన్నిన ఉచ్చు నుంచి తప్పించుకున్న ఓ బాలిక నేరుగా డీఎస్పీ శ్రీనివాసులును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఈ నెల 9న కేసు నమోదు చేసిన దిశ పోలీసులు వెంటనే రంగంలో దిగారు. నగర శివారులోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మాధవరెడ్డిని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. బాధితులు ముందుకు రావాలి మాధవరెడ్డి ఉచ్చులో చిక్కుకున్న బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయాలని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సూచించారు. బుధవారం సాయంత్రం దిశ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్తులో మాధవరెడ్డి లాంటి వంచకుల చేతిలో ఏ ఒక్కరూ మోసపోకుండా ఉండేందుకు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
మహిళతో అసభ్యకర ప్రవర్తన, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కు దేహశుద్ధి
సాక్షి, సంగారెడ్డి: మున్సిపల్ అధికారి వేధింపులు భరించలేని ఓ మహిళ తన భర్తతో కలిసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జరిగింది. వివరాల ప్రకారం.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో పనిమీద వచ్చిన మహిళలను అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అధికారి ప్రవర్తనకు విసిగిపోయిన బాధితురాలు తన భర్తకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్యతో కలిసి శానిటరీ ఇన్స్పెక్టర్కు చితకబాది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అధికారి.. నాలుగు దెబ్బలు బాది..
సాక్షి, మైసూరు(కర్ణాటక): నివాస ధ్రువీకరణ పత్రం కోసం పాలికె కార్యాలయానికి వెళ్లిన మహిళతో అధికారి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. శారదాదేవీ నగరలో పాలికె జోన్ కార్యాలయంలో విషకంఠేగౌడ అనే అధికారిని నివాస ధ్రువీకరణ పత్రం కోసం మహిళ అడగ్గా, అసభ్యంగా మాట్లాడాడు. దీంతో మహిళ కోపం పట్టలేక చేతితో నాలుగు దెబ్బలు బాదడంతో అధికారి కంగుతిన్నాడు. అక్కడే ఉండే ఎవరో ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సరస్వతిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. గొంతుకు కేబుల్ బిగించి మహిళ హత్య బనశంకరి: అనేకల్ తాలూకాలోని వినాయకగరలో నివాసం ఉంటున్న నాగవేణి(45) అనే మహిళ బుధవారం హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుకు కేబుల్‌వైర్ బిగించి హత్య చేశారు. అనేకల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆనేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తెలిసినవారే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రభుత్వాసుపత్రిలో లంచావతారులు.. తోటి ఉద్యోగుల వద్దే
సాక్షి, కరీంనగర్‌టౌన్: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లు తయారైంది ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగుల పరిస్థితి. లంచాల కోసం ప్రజలనే కాదు.. సహోద్యోగులను కూడా పీడించే దుస్థితి దాపురించింది. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల కోసం వెళ్లే సామాన్య ప్రజల వద్ద కొంత మంది ఉద్యోగులు లంచం తీసుకొని పనిచేయడం సర్వసాధారణం. కానీ ప్రభుత్వ ఉద్యోగుల వద్దే తోటి ఉద్యోగులు పనులు చేసేందుకు లంచాలు తీసుకోవడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చర్చనీయాంశంగా మారింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే మిగిలిపోతున్నాయి. తోటి ఉద్యోగులు డబ్బుల కోసం పీడిస్తూ.. ఇవ్వకుంటే మీ పనులు పెండింగ్‌లో ఉంటాయంటూ బెదిరింపులకు గురిచేస్తూ జబర్దస్త్‌గా వసూలు చేస్తున్నారని బాధిత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సర్వీసు బుక్ రాస్తే రూ.1,500.. ఇటీవల కొత్తగా 40 మంది స్టాఫ్ నర్సులు ఆసుపత్రిలో విధుల్లో చేరారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు సర్వీసు బుక్ ఎంతో కీలకం. కొత్తగా చేరిన ఉద్యోగుల సర్వీస్‌బుక్ రాసేందుకు సంబంధిత ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. సర్వీస్ బుక్ తామే తీసుకువచ్చి రాసేందుకు ఒక్కో ఉద్యోగి వద్ద రూ.5 వేల వరకు డిమాండ్ చేయగా, చివరకు రూ.1,500లకు బేరం కుదిరినట్లు సమాచారం. అది కూడా సర్వీస్ బుక్ ఉద్యోగులే కొనుగోలు చేసి తీసుకువస్తే రూ.1,500 తీసుకొని రాసిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే కొంత మంది సర్వీసు బుక్‌తో పాటు ఒప్పుకున్న ప్రకారం డబ్బులు కవర్లో పెట్టి ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. పే ఫిక్సేషన్‌కు రూ.500.. మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా చూసిన వేతన సవరణ (పీఆర్సీ)ను ప్రభుత్వం ఇటీవల అమలు చేసింది. దీంతో ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. పెరిగిన వేతనాలను సంబంధిత ఉద్యోగుల హెడ్ ఆఫ్‌ది డిపార్ట్మెంట్ నుంచి సవరణ చేసి డీటీవోకు పంపించాల్సి ఉంటుంది. ఇదంతా ఎలాంటి ఖర్చు లేకుండా చేయాల్సిన పని. కానీ ప్రభుత్వాసుపత్రిలో సర్వీస్ బుక్‌లో పే ఫిక్సేషన్ చేసేందుకు సంబంధిత ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500 వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పే ఫిక్సేషన్ చేయాల్సిన ఉద్యోగుల పనితీరు అంతా హడావిడి అన్నట్లు తయారైంది. కొంత మందికి జీతాల బిల్లులు చేయరాదు. టెక్నాలజీ, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చాక వివరాలు నింపితే బిల్లు దానంతట అదే చకచకా తయారైపోతుంది. అయితే ఆసుపత్రిలో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ ఉన్నా చాలా మందికి మౌస్ పట్టడం కూడా రాదు. దీంతో బయటివారితో చేయించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసూళ్ల దందాపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ఆసుపత్రిలో డబ్బు వసూలు చేసే విషయం నా దృష్టికి రాలేదు. విధుల్లో భాగంగా జరిగే పనుల కోసం ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా వసూళ్లకు పాల్పడితే వారిపై ఫిర్యాదు చేయాలి. శాఖాపరమైన చర్యలు చేపడతాం. డబ్బు వసూలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు. – డాక్టర్ రత్నమాల, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ -
‘ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. లేదంటే చంపేస్తా’
అనంతగిరి: బాధ్యతగల ఓ ప్రభుత్వోద్యోగి ఓ వ్యక్తిని ఎయిర్‌గన్‌తో బెదిరించిన సంఘటన శుక్రవారం రాత్రి వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. పట్టణంలోని సాకేత్‌నగర్‌లో నివసించే షేక్ ఫయాజ్ అహ్మద్ కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కమలానగర్‌కు చెందిన ప్రణీత్‌కుమార్ అనే వ్యక్తి గౌలికార్ ఫంక్షన్ హాల్ వెనక ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన కోసం ఆగగా.. ఫయాజ్ అహ్మద్ వచ్చి పరుష పదజాలంతో తిట్టాడు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. లేదంటే చంపేస్తా’అంటూ కారులో నుంచి తుపాకీ తీసి బెదిరించాడు. దీంతో ప్రణీత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఫయాజ్ అహ్మద్ ఇంట్లో వెతకగా ఎయిర్‌గన్‌తో పాటు తల్వార్, కత్తులు దొరికాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్, మారణాయుధాలు ఎక్కడివని ఆరా తీశారు. అతని ఇండికా కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించామని సీఐ రాజశేఖర్ తెలిపారు. కాగా, ఫయాజ్ అహ్మద్ వద్ద అసలైన తుపాకీ ఉందని, పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తు్తన్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. చదవండి: Banjara Hills: సహజీవనం.. విషాదం -
ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం.. ఇదేం పాడు పని
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్) : వృత్తిపరంగా నిజామాబాద్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇలా తప్పులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగిడిని ఎట్టకేలకు నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా రామ్‌గర్ గ్రామంలోని పీహెచ్సీ సెంటర్లో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అనూప్ దేవదాసన్.. నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నాడు. 2018లో హిమాయత్‌నగర్ ఎస్బీఐ టచ్ బ్యాంక్‌లో ఇన్నోవా కారు కోసం లోన్ తీసుకున్నాడు. దీని ఖరీదు రూ.19 లక్షలు. బ్యాంక్ వాళ్లకు పత్రాల్లో అనూప్దేవదాసన్ అడ్రస్‌లో హిమపురి కాలనీ, మన్సురాబాద్, ఎల్బీనగర్ ఉంది. మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించాడు. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. ఈ విషయంపై పలుమార్లు బ్యాంక్ అధికారులు పత్రాల్లో ఇచ్చిన అడ్రాస్ ఇంటికి వెళ్లగా అనూప్దేవదాసన్ అనే వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరని అక్కడి వారు చెప్పారు. ఫోన్ నంబర్లు మార్చి, అడ్రస్‌లు వేర్వేరు చెబుతూ బ్యాంక్ అధికారులను తిప్పలు పెట్టడం సాగాడు. దీంతో 2019 ఆగస్టు 8న బ్యాంక్ అధికారులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నట్లు సమాచారం రావడంతో గురువారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. మూడు చెక్‌బౌన్స్ కేసుల్లో నిందితుడు అనూప్ దేవదాసన్ చెక్ బౌన్స్ కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకుని వారికి చెక్‌లు ఇచ్చాడు. చెక్‌బుక్‌లు పోయాయని కొత్త చెక్‌బుక్‌ల కోసం అప్లై చేస్తుండేవాడు. ఇలా డబ్బులు ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టడంతో వారు కోర్టులను ఆశ్రయించగా మూడు చెక్‌బౌన్స్ కేసుల్లోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు. ( చదవండి: పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా.. ) -
మానవత్వం చాటుకున్న చైర్మన్, కమిషనర్..
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): ఉన్నత హోదా లో ఉండి..అంతే హుందాగా, ఎంతో ఉన్నతంగా, మనస్సున్న మారాజుల మాదిరి స్పందిస్తూ ఈ ఆపత్కాలంలో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ), మణుగూరు మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్. కరోనాతో మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలకు అయినవారే భయపడుతున్న వేళ.. మేమున్నామంటూ వచ్చి అన్నీ జరిపిస్తున్నారు. ఇల్లెందు చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గతేడాది కాలంనుంచి ఇదే తరహాలో పలు కుంటుంబాలకు బాసటగా నిలిచారు. సోమవా రం ఇల్లెందు పట్టణంలోని 22వ వార్డులో శంకరమ్మ(55)అనే మహిళ కరోనాతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ డీవీ వార్డు కౌన్సిలర్ అంకెపాక నవీన్, సయ్యద్ ఆజంతో కలిసి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారే స్వయంగా దహన సంస్కారం చేయించారు. పట్టణ మొదటి పౌరుడిగా ఆయన స్వయంగా పాల్గొంటుండటం, ఆ కుటుంబాలకు అండగా నిలుస్తుండటం పట్ల చైర్మన్ డీవీ సేవాగుణాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. నేనున్నానంటున్న నాగ ప్రసాద్ మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీశ్రీనగర్‌కు చెందిన ఎం.సంపత్‌కుమార్(38)కోవిడ్ కారణంగా ఖమ్మంలోని ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన మణుగూరు మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్లు కలిసి ప్రత్యేక పీపీ కిట్లు ధరించి తన మున్సిపల్ సిబ్బందితో కలిసి దహన సంస్కారాలు జరిపించారు. ఇటీవల సుందరయ్యనగర్‌లో ఒకరు కరోనాతో మృతి చెందగా..మున్సిపల్ కమిషనరే దగ్గరుండి తుది వీడ్కోలు పలికారు. -
పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోక్సో యాక్ట్ కింద నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించింది. ఉద్యోగం నుంచి సస్పెండ్ కాకుండా ఉండాలన్నా.. జైలుకు వెళ్లకుండా ఉండాలన్న బాధితురాలిని వివాహం చేసుకోవాలని సూచించింది. నిందితుడు మోహిత్ సుభాష్ చవాన్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘నీవు పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశావ్. ఇందుకు గాను నీమీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఒకవేళ నీవు బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటే.. మేం నీకు సాయం చేయగలం. లేదంటే నీవు జైలుకెళ్తావ్.. అప్పుడు ఆటోమెటిగ్గా నీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని కోర్టు నిందితుడికి తెలిపింది. దీనిపై చవాన్ స్పందిస్తూ.. ‘‘గతంలో నేను బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాను. కానీ ఆమె అంగీకరించలేదు. ప్రస్తుతం నేను తనను పెళ్లి చేసుకోలేను.. ఎందుకంటే ఇప్పుడు నాకు వివాహం అయ్యింది’’ అని కోర్టుకు తెలిపాడు. నిందితుడు చవాన్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కంపెనీలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం చవాన్ మైనర్ స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దాంతో అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు చవాన్‌ని అరెస్ట్ చేస్తే.. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. దాంతో అతడు అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ.. హై కోర్టుని ఆశ్రయించాడు. అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చవాన్ బెయిల్ పిటిషన్ సందర్బంగా కోర్టు.. బాధితురాలిని వివాహం చేసుకుంటే.. జైలుకెళ్లాల్సిన అవసరంలేదని తెలిపింది. ఇక ఈ విషయంలో కోర్టు బలవంతం ఏం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బాధితురాలిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే.. రెగ్యూలర్ బెయిల్‌కు అప్లై చేసుకోవాలని కోర్టు సూచించింది. చవాన్‌కి నాలుగు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. చదవండి: ఆ రిటైర్డు జడ్జి విచారణ ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు -
కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపించకుండా పోయినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలని, అప్పుడు మాత్రమే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరు కారుణ్య నియామకం కింద ఉద్యోగానికి అర్హులవుతారన్న నిబంధనను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ నిబంధన ఏకపక్షమని, అన్యాయమని పేర్కొంటూ దాన్ని కొట్టేసింది. ఈ నిబంధనను కారణంగా చూపుతూ.. కనిపించకుండాపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఎఫ్ఐఆర్ నాటికి ఏడేళ్ల సర్వీసు మిగిలి లేదన్న కారణంతో అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తూ అధికారులు జారీ చేసిన మెమోను రద్దు చేసింది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్ శ్రీనివాసరావు పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, అతడికి సరిపోయే పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో టి.సుబ్బారావు ప్లాంట్ అటెండెంట్‌గా పనిచేస్తూ 2001 ఆగస్టు 26న కనిపించకుండా పోయారు. దీనిపై సుబ్బారావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం సంబంధిత కోర్టులో సుబ్బారావు అదృశ్యాన్ని ‘అన్ డిటెక్టబుల్’గా పేర్కొంటూ తుది నివేదిక దాఖలు చేశారు. 2002 అక్టోబర్‌లో ఇదే విషయాన్ని థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులకు తెలియచేశారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు కుమారుడు టి.శ్రీనివాసరావు కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రి కనిపించకుండా పోయి ఏడేళ్లు అయిందని, అందువల్ల తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే అదృశ్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి సుబ్బారావుకు ఏడేళ్ల సర్వీసు మిగిలి లేదంటూ శ్రీనివాసరావు దరఖాస్తును థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులు తోసిపుచ్చారు. దీనిపై శ్రీనివాసరావు 2012లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తుది విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. నిబంధనల పేరుతో ఈ వివక్ష ఏమిటి? ‘ప్రభుత్వోద్యోగి మరణిస్తే అతని కుటుంబంలో అర్హులకు కారుణ్య నియామకం కింద వెంటనే ఉద్యోగం దొరుకుతోంది. మరణించిన ఉద్యోగికి ఎంత సర్వీసు మిగిలి ఉందన్న విషయంలో కండీషన్లు లేవు. ఉద్యోగి మరణించిన ఏడాది లోపు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు పెట్టుకుంటే చాలు. అదే.. ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపించకుండా పోతే అతని కుటుంబంలో ఎవరైనా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాలంటే ఎఫ్ఐఆర్ నమోదయ్యే నాటికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీసు మిగిలుండటం తప్పనిసరి. ఆ ఉద్యోగిని చనిపోయినట్టు ప్రకటించాలంటే ఏడేళ్లు వేచిచూడాలి. ఇద్దరూ ప్రభుత్వోద్యోగులే. అలాంటప్పుడు నిబంధనల పేరుతో ఈ వివక్ష ఏంటి? కారుణ్య నియామకానికి సంబంధించి ప్రభుత్వ విధానం అందరికీ ఒకేలా ఉండాలి. అంతే తప్ప మరణించిన ఉద్యోగి విషయంలో ఓ రకంగా, కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో మరోలా ఉండటానికి వీల్లేదు. ప్రభుత్వం సానుభూతితో ఆలోచించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు మార్గదర్శకాలు తేవాలి’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
భర్తను చంపినా పెన్షన్ ఇవ్వాల్సిందే..
చండీగఢ్: ప్రభుత్వోద్యోగి అయిన భర్తను చంపిన భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రభుత్వోద్యోగి అయిన భర్తను చంపిందని తేలితే భార్యకు పెన్షన్ ఇచ్చేది లేదని హర్యానా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఆదేశాలను తప్పుబడుతూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. భర్తను భార్యే చంపిందని సాక్షాధారాలతో రుజువైనా, భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే, వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ఫ్యామిలీ పెన్షన్‌ను ఇస్తారని, అలాంటిది ఎటువంటి ఆర్ధిక భరోసా లేని భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తే తప్పేంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భార్య క్రిమినల్ కేసులో దోషిగా తేలినా ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హురాలేనని కోర్టు స్పష్టం చేసింది. భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన బల్జీత్ కౌర్ అనే మహిళ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది. హర్యానా ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త 2008లో మరణించాడని ఆమె పిటిషన్లో పేర్కొంది. అయితే 2009లో ఆమె తన భర్తను హతమార్చిందని పోలీసులు ఆమెపై హత్యానేరం మోపగా, 2011లో ఆమె దోషిగా తేలింది. 2011 వరకూ హర్యానా ప్రభుత్వం ఆమెకు పెన్షన్ ఇచ్చినా.. ఆతర్వాత దోషిగా తేలడంతో ఆమె పెన్షన్‌ను నిలిపి వేసింది. తాజా విచారణలో హర్యానా ప్రభుత్వ ఆదేశాలను తప్పు పట్టిన కోర్టు.. బల్జీత్ కౌర్‌కు పూర్తి బకాయిలతో పాటు పెన్షన్ చెల్లించాలని సంబంధిత శాఖను ఆదేశించింది. కాగా, సీసీఎస్ రూల్స్, 1972 ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఫ్యామిలీ పెన్షన్‌ను ఇస్తారు. భర్త మరణాంతరం భార్య రెండో పెళ్లి చేసుకున్నా, ఆమె ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే. -
ఉద్యోగులకు కంబైన్డ్ పాస్ బస్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైలుతో ప్రయాణాల కోసం కంబైన్డ్ పాస్‌లను ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేయాలి. ఆర్డినరీ బస్సు చార్జీలో 2/3 వంతుకు మించకుండా వీటి ద్వారా జరిపే ప్రయాణాల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలి. మిగిలిన వ్యయాన్ని ఉద్యోగులు భరించాలి’అని చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసు చేసింది. ఇటు ఉద్యోగుల ట్రావెలింగ్ అలవెన్సులు (టీఏ) పెంపు విషయంలో ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసింది. మైలేజీ అలవెన్స్ పెంచాలి.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో సొంత వాహనాలు వినియోగించే వారికి అందించే మైలేజీ అలవెన్సులను పెంచాలని పెట్రోల్‌తో నడిచే కార్లకు కిలోమీటర్‌కు రూ.13 నుంచి రూ.16కు, డీజిల్‌తో నడిచే వాటికి రూ.9 నుంచి రూ.14కు, ద్విచక్ర వాహనాలకు రూ.5 నుంచి రూ.6కు అలవెన్సు పెంచాలని కోరింది. కొత్తగా సవరించి ప్రతిపాదిస్తున్న వేతనాల్లో రూ.54,220–1,33,630 వేతనం అందుకునే అధికారులు సొంత కారు, సవరించిన వేతనం రూ.36,750–1,06,990, ఆపై అందుకునే అధికారులు సొంత ద్విచక్రవాహనం ద్వారా ప్రయాణించడానికి ఈ అలవెన్సులను మంజూరు చేయాలని సూచించింది. ఇతర సిఫారసులు.. గ్రేడ్–1, 2 ఉద్యోగులు ఆర్టీసీ/ప్రైవేటు ఏసీ బస్సుల ద్వారా ప్రయాణించడానికి అనుమ తించాలి. గ్రేడ్–3 ఉద్యోగులు నాన్ ఏసీ బస్సుల చార్జీలు చెల్లించాలి. రూ.42,300–1,15,270 వేతనం అందు కుంటున్న ఉద్యోగులకు ఫస్ట్ క్లాస్‌లోని ఏసీ, చైర్ కార్/ఏసీ, 3 టైర్/ఏసీ, 2 టైర్‌తో పాటు సెకండ్ క్లాస్ రైల్వే ప్రయాణాలకు అనుమతించాలి. రూ.38,890–1,12,510 వేతనం ఉన్న ఉద్యోగులకు సెకండ్ క్లాస్ రైల్వే ప్రయాణాలకు అనుమతించాలి. వేతన సవరణ తర్వాత నెలకు రూ.96,890–1,58,380 వేతనం ఉన్న ఉద్యోగులకు అధికార పర్యటనల కోసం విమాన ప్రయాణ సదుపాయాన్ని కల్పిం చాలి. డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులకు సైతం విమాన ప్రయాణ సదుపాయం కల్పించాలి. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 15 శాతాన్ని ప్రత్యేక అలవెన్సుగా చెల్లించాలి. ప్రజారవాణా/ప్రైవేటు రవాణా సదుపాయం లేని జిల్లా కేంద్రం నుంచి 8 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో పర్యటిం చడానికి అందించే మైలేజీ అలవెన్సులను పెంచాలని సిఫారసు చేసింది. గ్రేడ్–1 ఉద్యోగులకు కి.మీ.కు రూ.7 నుంచి రూ.9, గ్రేడ్–2 ఉద్యోగులకు రూ.6 నుంచి రూ.7.50, గ్రేడ్–3 ఉద్యోగులకు రూ.5 నుంచి రూ.6.5కు పెంచాలి. గ్రేడ్–1 ఉద్యోగులకు రాష్ట్రం లోపల ప్రయా ణాలకు రూ.600, వెలుపల ప్రయాణాలకు రూ.800, గ్రేడ్–2 ఉద్యోగులకు రాష్ట్రం లోపల ప్రయాణాలకు రూ.400, వెలుపల ప్రయాణాలకు రూ.600, గ్రేడ్–3 ఉద్యోగు లకు రాష్ట్రం లోపల ప్రయాణాలకు రూ.300, బయట ప్రయాణాలకు రూ.400 వరకు దినసరి భత్యాలను పెంచాలి. కోర్టు మాస్టర్లకు ఇలా.. కోర్టు మాస్టర్లు, హైకోర్టు జడ్జీల వ్యక్తిగత కార్యదర్శుల కన్వెయన్స్ అలవెన్సును నెలకు రూ.5 వేల వరకు పెంచాలి. మండలం లోపల చేసే ప్రయాణాల కోసం ట్రావెలింగ్ అలవెన్సులను నెలకు రూ. 1,200 నుంచి రూ.1,500కు పెంచాలి. రెవె న్యూ డివిజ¯Œ లోపల జరిపే ప్రయాణాలకు నెలకు రూ.1,500 నుంచి రూ.2 వేలకు పెంచాలి. -
కరోనా నుంచి కోలుకొని ఇంటికి.. ఊహించని షాక్
సాక్షి, శ్రీకాళహస్తి: మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నాననే ఆనందం కాసేపైనా ఆమెకు లేకుండా పోయింది. కనీస దయ, జాలి, కరుణ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకి వెళ్లగొట్టాడు తను అద్దెకుంటున్న బిల్డింగ్ యజమాని. ఈ అమానవీయ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వరిస్తున్న ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే చికిత్స అనంతరం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి కోటి ఆశలతో తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకుంది. కానీ ఆ మహిళను ఇంటి యజమాని అడ్డుకున్నాడు. అమె అద్దెకుంటున్న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో ఈ ఊహించని పరిణామం ఏర్పడటంతో ఏం చేయాలో పాలుపోక నడిరోడ్డుపై సదరు మహిళ నిల్చునే పరిస్థితి ఏర్పడింది. అయితే తమ సహోద్యోగి పరిస్థితి తెలుసుకున్న శ్రీకాళహస్తి తహశీల్దారు ఆమెకు వేరొకచోట బస ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్థానికులు మహిళా ఉద్యోగికి అండగా నిల్చోగా ఇంటి యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కలతచెంది.. కాలినడకన బయలుదేరి.. డాక్టర్ దంపతులపై పూల వర్షం -
‘సాధ్యం కాదన్న ప్రతిపక్ష పార్టీకి చేసి చూపించారు’
సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని వైఎస్సార్ పార్కులో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని కార్మికులు సంబరాలు చేసుకున్నారు. తమ కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆయనకు అజన్మాంతం రుణపడి ఉంటామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతం రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని కొనియాడారు. సీఎం నిర్ణయంతో ఆర్టీసీలో 53 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. విలీనం సాధ్యం కాదన్న ప్రతిపక్ష పార్టీ నోటికి కళ్లెం వేసారని అభినందించారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు యావద్దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తున్నాయని తెలిపారు. -
ఇది చరిత్రాత్మకమైన బిల్లు
-
పతులు ఉద్యోగులు.. సతులు డీలర్లు
సాక్షి, చాపాడు: భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా అతని భార్య చౌక దుకాణం నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. అయినా ఈ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా గత కొన్నేళ్లుగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు చౌక దుకాణం డీలర్లుగా కొనసాగుతున్న సంఘటన మైదుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చాపాడు మండలం మొర్రాయిపల్లెకు చెందిన కుమ్మితి వెంకటరాజ్యం షాపు నెంబరు 1114010 చౌకదుకాణం డీలర్‌గా ఉంటోంది. ఈమె భర్త హజరత్‌రెడ్డి అదే మండలంలోని బద్రిపల్లె దళితవాడ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భర్త టీచర్‌గా ఉంటూ భార్య చౌకదుకాణం డీలర్‌గా కొనసాగటం నిబంధనలకు వ్యతిరేకం. హజరత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా తన భార్య వెంకట రాజ్యం దగ్గరే ఉంటూ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండటం గమనార్హం. మొర్రాయిపల్లె పేరుతో చౌకదుకాణం ఉండగా వెంకటరాజ్యం నాగాయపల్లెలో ఓ ఇంటిలో రేషన్ పంపిణీ చేస్తోంది. గతంలో బినామీ డీలర్ ద్వారా సరకులు పంపిణీ చేయిస్తుండగా, ఈ నెలలో వీరిరువురే సరుకులు పంపిణీ చేస్తుండటం గమనార్హం. వీరు మాత్రం మైదుకూరులో నివాసం ఉంటున్నారు. గత సెపె్టంబర్ నెలలో రెవెన్యూ అధికారులు జరిపిన తనిఖీల్లో తూకాల్లో వ్యత్యాసాలు రావటంతో చౌకదుకాణంపై కేసు నమోదు చేశారు. అయితే వీరు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. నవంబరు నెలలో వీరే రేషన్ పంపిణీ చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నవంబరు నెల సరుకులను తెచ్చుకున్నారు. తహసీల్దారు ఏమన్నారంటే.. మండలంలోని మొర్రాయిపల్లె చౌకదుకాణం డీలర్‌గా ఉంటున్న కుమ్మితి వెంకటరాజ్యం భర్త హజరత్‌రెడ్డి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నా చౌకదుకాణం నిర్వహించటంపై తహసీల్దారు శ్రీహరిని వివరణ కోరగా.. ప్రభుత్వ ఉద్యోగి భార్య చౌకదుకాణం డీలర్‌గా ఉండకూడదన్నారు. సరుకుల పంపిణీలో టీచర్ ఉండకూడదని, దీనిపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖాజీపేటలోనూ ఇలాంటి పరిస్థితే.. ఖాజీపేట: పట్టణంలోని 16వ నంబర్ చౌకదుకాణం డీలర్ లక్షి్మదేవి భర్త కొండయ్య ఆర్‌ఆండ్‌బీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె మాత్రం కొన్నేళ్లుగా డీలర్‌గా కొనసాగుతోంది. సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతోందంటూ ఆమెపై అందిన ఫిర్యాదుల మేరకు ఇటీవల విజిలెన్స్ అధికారులు ఆ చౌక దుకాణంపై దాడులు నిర్వహించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే షాపును సీజ్ చేశారు. ఈ దుకాణం తనే నిర్వహించాలంటూ ఆమె కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీజ్ చేసిన సరుకును స్వా«దీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను సైతం ఆమె అడ్డుకుని నానా హంగామా సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు చౌక దుకాణం డీలర్లుగా కొనసాగుతుండటం.. వారికి భర్తలు చేదోడు వాదోడుగా ఉంటుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై ఖాజీపేట తహసీల్దార్ సూర్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి అనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మూడు లక్షలతో ఉడాయించిన ప్రభుత్వ ఉద్యోగి
సాక్షి, కడప : వ్యవసాయశాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ప్రభుత్వ సొమ్మును మెక్కేశాడు. మొత్తం రూ.3 లక్షల 80 వేలు తన సొంత ఖాతాలోకి మార్చుకుని ఏమీ తెలియనట్లు నటించాడు. బ్యాంకు అకౌంట్లను తనిఖీ చేయగా విషయం బయటపడింది. దీంతో ఆ ఉద్యోగి కార్యాలయం నుంచి పరారయ్యాడు.. వివరాల్లోకి వెళితే జిల్లా వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ప్రధాన ఉద్యోగి తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. వ్యవసాయశాఖలో ఐటీసెల్ విభాగంలో ఖర్చులు చెల్లిస్తుంటారు. ఇందులో అధికారుల ఫోన్ బిల్లులు, ట్యాబ్‌లకు ఉపయోగించే సిమ్ కార్డులకు బిల్లులు చెల్లిస్తుంటారు. ఈ నిధులు ఎన్ఎఫ్ఎస్ఎం పథకం నుంచి వాడుకునే విధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ వీలు కల్పించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు అధికారి అనుకూలంగా మలుచుకుని రూ.3.80 లక్షలు వాడుకున్నాడు. ఈ బిల్లులు మూడు నెలలకు ఒకసారి బ్యాంకుకు చెల్లిస్తుంటారు. ఈ కోణంలో మొత్తం రూ.11.20 లక్షలు గతనెల 29వ తేదీన చెక్కులు బ్యాంకుకు అందజేశారు. జేడీ అకౌంట్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులను ట్రెజరీలో సమర్పిస్తారు. ఆ బిల్లులకు సంబంధించిన చెక్కులు బ్యాంకుకు వెళ్లాయి. ఆ బ్యాంకు మేనేజర్ డీడీఓ ఖాతాను పరిశీలించగా రూ.7.40 లక్షలు మాత్రమే చూపిస్తోందని జేడీ కార్యాలయ ఉద్యోగికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే సంబంధిత ఉద్యోగులు బ్యాంకుకు వెళ్లి చూడగా కార్యాలయ ప్రధాన ఉద్యోగి ఖాతాకు రూ.3.80 లక్షలు మళ్లించినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ జేడీకి వివరించారు. ఆయన స్పందించి సదరు ప్రధాన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు జరిగిన విషయాన్ని నివేదిక రూపంలో పంపించారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణను వివరణ కోరగా సదరు ఉద్యోగినే జీతాల బిల్లులు ఇతరత్రా ఖర్చుల బిల్లులు తయారుచేసి ట్రెజరీకి పంపుతుంటారన్నారు. దీనికి సంబంధించి కార్యాలయ ఉద్యోగులు కనుగొని చెప్పడంతో అతనిపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని చెప్పారు. -
ఐఆరా.. పీఆర్సీనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న ఐఆర్, పీఆర్సీ అంశాలపై మళ్లీ చర్చ జోరందుకుంది. పీఆర్సీ అమలు, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలపై త్వరలోనే చర్చిస్తామంటూ సీఎం నోటివెంట వచ్చిన వ్యాఖ్యలే ఈ చర్చకు కారణం. పీఆర్సీపై సమావేశం ఎప్పుడు? ముందుగా మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తారా? లేక పీఆర్సీనే అమలు చేస్తారా? అనే చర్చ జోరందుకుంది. సీఎంతో సమావేశం ఎప్పుడు ఉంటుందంటూ సంఘాల నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. త్వరగా తేల్చకపోతే ఆందోళన చేస్తామంటూ ఉపాధ్యాయ సంఘాలు ఓ అడుగు ముందుకేశాయి. దీంతో.. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, పింఛనర్లకు ఐఆర్/ఫిట్మెంట్ ఎంత ఇస్తే ఎంత ఖర్చు అవుతుందన్న లెక్కలు తేల్చింది. వీలైనంత త్వరగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు ఓ పరిష్కారం చూపాలన్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఒక్క శాతం ఇస్తే రూ.225 కోట్లు ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పింఛనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్సీ లేదా ఐఆర్‌ను అమలు చేయాల్సి ఉంది. వారికి ఒక్క శాతం ఐఆర్ ఇచ్చినా లేదా ఫిట్మెంట్ అమలు చేసినా ఖజానాపై రూ.225 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. ఇలా ఒక్క శాతం నుంచి మొదలుకొని 35% వరకు ఫిట్మెంట్ లేదా ఐఆర్ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై లెక్కలు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ కనీసంగా 27% ఐఆర్ ఇస్తారన్న ఆలోచనలతో ఉద్యోగులు అంచనాలు వేసుకుంటున్నారు. ఆ లెక్కన రాష్ట్రంలోని ఉద్యోగులకు ఐఆర్ కింద ఏటా రూ.6,075 కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేశాయి. అంతేకాదు 35% అమలు చేస్తే ప్రభుత్వం రూ.7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చింది. ఎలాగైతే ఉద్యోగులకు సంతృప్తి? ఉద్యోగులకు సంబంధించిన అంశాల పరిష్కారం దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగితే మెజారిటీ వర్గానికి సంతృప్తి కలిగించగలమన్న దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు రాష్ట్ర ఖజానాపై పడే భారంపై అంచనా వేసుకొని చివరగా ఉద్యోగులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. పీఆర్సీ వర్గాలతోపాటు ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. అనధికారిక సంప్రదింపులు జరుపుతున్నారు. 27% ఐఆర్? 30% ఫిట్మెంట్? ఉద్యోగుల సమస్యల్లో ప్రధానమైన డిమాండ్ ఐఆర్ ఇవ్వడం, పీఆర్సీ అమలు. రెండింటిలో ఏ ఒక్కదానిపై నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతానికి చాలు. అయితే ప్రభుత్వం రెండింటిపైనా ఆలోచనలు చేస్తోంది. ఐఆర్ ఇస్తే ఎంతివ్వాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. ఏపీలో 27% ఇచ్చినందున.. అంతకంటే తక్కువ ఇస్తే ఉద్యోగులు అంగీకరిస్తారా? అన్న అలోచనలు చేస్తోంది. ఒకవేళ ఉద్యోగుల ఒప్పుకోకపోతే సంప్రదింపుల సమయంలో 27 శాతానికి ఓకే చేద్దామా? అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇపుడు ఐఆర్ ఇచ్చినా, మరో మూడు నాలుగు నెలల తరువాత మళ్లీ పీఆర్సీ అమలు చేయక తప్పదు. అప్పడే అదే 27% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తామంటే.. మళ్లీ ఉద్యోగులు అలకవహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే 30% ఫిట్మెంట్తో పీఆర్సీనే అమలు చేస్తే మరో ఐదేళ్ల వరకు తంటాలుండవన్న ఆలోచనలు కూడా చేస్తున్నట్లు తెలిసింది. గతంలో 43% ఫిట్మెంట్ ఇవ్వడం, అప్పుడు ఇచ్చిన స్కేల్స్ కంటే తరువాత కొన్ని కేటగిరీల్లో స్కేళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో 30%తో ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగులు సంతృప్తి చెందుతారన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే ఇపుడు 27% ఐఆర్ ఇచ్చి మరో నాలుగైదు నెలల తరువాత 3% కలిపి 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీనే తరువాత అమలు చేయాలా? అన్న చర్చ కూడా జరుగుతోంది. తెరపైకి ప్యాకేజీ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీతోపాటు ప్రధాన డిమాండ్లు అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచడం, కాంట్రిబ్యూటరీ పింఛను స్కీం రద్దుపై కమిటీ ఏర్పాటు చేయడం వంటి వాటితోపాటు ఇతర సమస్యలను పరిష్కరించేలా ప్యాకేజీ అమలు చేయాలా? అనే కోణంలో చర్చిస్తున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఐఆర్‌ను 25% ఇస్తూ ఈ ప్రధాన డిమాండ్లకు పరిష్కారం చూపితే, ఐఆర్ కొంత తగ్గినా ఉద్యోగులు సంతృప్తి చెందే అవకాశం ఉంటుందన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. దానిపైనా ప్రభుత్వం వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. మరో నాలుగైదు నెలలకైనా చేయాల్సినవే కదా! మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎక్కువగా పట్టుండే పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో వారి ఓట్లు కీలకం కానున్నాయి. ఒక్క ఓటును కూడా వదులుకునే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తే ఎన్నికల్లో సులభంగా నెగ్గొచ్చనే వాదన ఉంది. పైగా వారి సమస్యలను ఇప్పుడు కాకపోతే మరో నాలుగైదు నెలలకైనా పరిష్కరించాల్సిందే.. అదేదో ఇప్పుడు చేస్తే సరిపోతుంది కదా! అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఉద్యోగుల సమçస్యలపై ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకుంటే వారిలో ఆందోళనను పోగొట్టడంతోపాటు, వారిని దగ్గర చేసుకోవచ్చన్న వాదనను ఉన్నతాధికారులే వ్యక్తం చేస్తున్నారు. -
వాట్సాప్‌లో ఐ లవ్ యూ.. అధికారి సస్పెన్షన్
సాక్షి, చెన్నై : మహిళా ఉద్యోగికి వాట్సాప్‌లో ఐ లవ్యూ అంటూ మెసేజ్ పంపిన సూళగిరి ఉప తాలూకా అభివృద్ధి అధికారిని శుక్రవారం సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. కృష్ణగిరిలో రాయకోటై రోడ్డులో నివసిస్తున్నారు కుమరేశన్ (51). ఈయన కృష్ణగిరి తాలూకా అభివృద్ధి కార్యాలయంలో అధికారిగా పనిచేస్తూ వచ్చారు. ఇటీవల సూళగిరి యూనియన్‌కు బదిలీ అయ్యారు. ఇలాఉండగా సూళగిరి కార్యాలయంలో పని చేస్తున్న మహిళా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగి వాట్సాప్ నంబరుకు ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపారు. దీని గురించి జిల్లా ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు అందడంతో శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విచారణలో కుమరేశన్ మహిళా ఉద్యోగికి మెసేజ్ పంపినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కలెక్టర్ ప్రభాకర్ కుమరేశన్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. -
లెక్క తేలేదెప్పుడో...!
సాక్షి, కురుపాం: పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలేదెప్పుడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నెల 22 వరకు వేసేందుకు గడువు ఉండడంతో పోస్టల్ బ్యాలెట్‌పైనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు దృష్టి సారించారు . సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి నెల రోజులు దాటింది. ఏప్రిల్ 11న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. అప్పటికే ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ముందుగానే సిద్ధం చేశారు. అయితే ఏప్రిల్ 11న ఎన్నికల విధులను నిర్వహించేందుకు వెళ్లే ప్రతీ అధికారి వివరాలు సేకరించి వారికి పోస్టల్ బ్యాలెట్లను అందజేశారు. పోలింగ్ ముగిసి లెక్కింపు సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అత్యంత కీలకం కానున్నాయి. ఎన్నికల్లో ప్రతీ ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ ఆ ఓటు దక్కాలన్న ఆలోచనలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్‌పై దృష్టి పెట్టినట్టు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్క ఏమిటోనని తీవ్రంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని పార్టీలకు చెందిన నాయకులు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకే ఎర చూపి ఏకంగా బేర సారాలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 23న జరగనున్న ఎన్నికల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్లనే లెక్కింపుకు అవకాశం ఉండటంతో పాటు ఆ ఓట్లే తమ విజయం వైపు మలుచుకోవాలని అభ్యర్థులు దృష్టి సారించినట్టు తెలిసింది. 1542 పోస్టల్ బ్యాలెట్లు కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఉద్యోగులకు 1542 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటిలో ఏప్రిల్ 11న కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటింగ్ ప్రక్రియలో 476 మంది ఉద్యోగులు ఎన్నికల విధులకు వెళ్లే ముందు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా మిగిలిన 1066 మందిలో 50శాతం వరకు కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసి పోస్టల్ బూత్‌లో తమ బ్యాలెట్లను వేయగా మరికొందరు తపాలా శాఖ ద్వారా పోస్టాఫీసుకు వెళ్లి అసెంబ్లీ, పార్లమెంటుకు చెందిన బ్యాలెట్లు వేశారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగటానికి ఈ నెల 22 వరకు సమయం ఉండటంతో ఇంతలోగా పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న ఉద్యోగులపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు దృష్టి పెట్టి పోస్టల్ బ్యాలెట్లను చేజిక్కించుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలకుండా పోయిందని చర్చ జరుగుతుంది. -
పేపర్లేకుండా.. పని..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : పేపర్‌తో పని లేకుండా జీతాల బిల్లులన్నీ ఆన్లైన్లో సమర్పిస్తే.. నెలనెలా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు వారి ఖాతాలో పడతాయి. ఇటువంటి కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది ఖమ్మం ఖజానా(ట్రెజరీ) శాఖ. ఇక ప్రతి చిన్న పనికి శాఖ ఉద్యోగులు ఉన్నతాధికారి వద్దకు ఫైల్ పట్టుకుని వెళ్లడం.. దీనిపై అనుమానాలుంటే సదరు అధికారికి వివరించాల్సిన అవసరం ఉండదు. వివిధ శాఖల ఉద్యోగులకు ఏ పని కావాలన్నా ఆన్లైన్లో ట్రెజరీ శాఖ ప్రత్యేక పోర్టల్‌ను సంప్రదించవచ్చు. అలాగే నేరుగా కాగితపు రహిత బిల్లులతో వేతనాల చెల్లింపును కూడా అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తింపజేసేలా ఖజానా శాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ద్వారా మే నెలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను అందజేస్తారు. 2020 జనవరి నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో దీనిని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి నెలవారీ వేతనం పొందాలంటే ఆ శాఖకు చెందిన పాలనా సిబ్బంది నెలవారీ హాజరును ముందుగానే ట్రెజరీ శాఖకు పంపాలి. సంతకాలు చేసిన ఫైళ్లను అందజేయాలి. ఈ మొత్తం వివరాలన్నీ సక్రమంగా పంపితేనే ఉద్యోగికి వేతనాలు సక్రమంగా వస్తాయి. వివరాలు పంపడంలో ఏమాత్రం ఆలస్యమైనా.. వేతనాలు కూడా లేటుగానే వస్తాయి. ఉద్యోగులకు నెలవారీగా వేతనం అందాలంటే ఉద్యోగులకు, ట్రెజరీకి మధ్య అకౌంటింగ్ వ్యవస్థ అమలులో ఉంటుంది. అయితే ప్రస్తుతం రూపొందించిన పోర్టల్ ద్వారా ఇక ఈ వ్యవస్థ అవసరం ఉండదు. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్ఎంఐఎస్) ద్వారా ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా జిల్లాలోని 13,320 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 12,453 మంది పెన్షనర్లకు ఉపయోగం కానున్నది. ప్రస్తుత విధానం ఇలా.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ సేవలు వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగి వేతనాలు, ఇతర బిల్లులు ఆన్లైన్లో నమోదు చేసి.. వాటికి సంబంధించిన హార్డ్ కాపీలను డీడీఓ(డిపార్ట్మెంటల్ డ్రాయింగ్ ఆఫీసర్) ధ్రువీకరణతో ట్రెజరీలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల పనిభారంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే కొత్త విధానం అమలు జరిగితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. హార్డ్ కాపీలను సమర్పించే అవకాశం ఉండదు. ఐఎఫ్ఎంఐఎస్ చేసే ప్రక్రియ.. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ప్రతి శాఖకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. దీని ద్వారా లాగిన్ అయిన తర్వాత పూర్తి పేరు, బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు, ఆధార్ కార్డు వివరాలతోపాటు మొదటి పోస్టింగ్ ఎక్కడ.. గతంలో ఎక్కడ పని చేశారు.. పదోన్నతులు పొందితే ఆ వివరాలు, ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన వివరాలను ఆన్లైన్ ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌కు పంపాల్సి ఉంటుంది. డీటీఓకు వచ్చిన సమాచారాన్ని పరిశీలించి.. వేతనాలు చెల్లించే ఈ–కుబేర్‌కు పంపిస్తారు. ట్రెజరీలో కాగితం రహిత పాలన.. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కాగితం రహిత విధానం అమలు చేయనున్నారు. మరికొద్ది నెలల్లో పూర్తిగా కాగితం రహిత పాలన అమలు కానున్నది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని శాఖల డ్రాయింగ్ అధికారులకు ఐఎఫ్ఎంఐఎస్ కేటాయించారు. ఆయా శాఖల పరిధిలోని అధికారులు, ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల వ్యక్తిగత వేతనాలు వారి ఖాతాలో జమ అయ్యేలా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెల వేతనాలు ఈ విధానం ద్వారా చెల్లించనున్నారు. అయితే ఈ విధానాన్ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఉద్యోగుల వివరాలు అందజేసినా ట్రెజరీకి మళ్లీ హార్డ్ కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 2020 నుంచి హార్డ్ కాపీలతో పనిలేకుండా నేరుగా వేతనాలు, ఇతర బిల్లులు అందజేయనున్నారు. వివరాలు సమర్పించాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా శాఖలో ఐఎఫ్ఎంఐఎస్ అనే నూతన విధానాన్ని తెచ్చింది. దీని ద్వారా జిల్లాలోని ఉద్యోగులందరి వేతనాలు సకాలంలో అందనున్నాయి. కొత్త విధానం ద్వారా పేపర్ రహిత పాలన అమలు కానున్నది. శాఖలవారీగా వేతనాల కోసం ఆన్లైన్లో వివరాలు సమర్పించిన తర్వాత కూడా డిసెంబర్ వరకు హార్డ్ కాపీలను ట్రెజరీలో అందజేయాలి. 2020 జనవరి నుంచి హార్డ్ కాపీలు లేకుండా నేరుగా ఆన్లైన్లో వివరాలు సమర్పిస్తే ట్రెజరీ ద్వారా వేతనాలు అందనున్నాయి. – ముత్తినేని వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఖమ్మం -
ఉద్యోగులకు భరోసా..!
సాక్షి, ఒంగోలు సిటీ: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి ఉద్యోగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉద్యోగుల హక్కులు నానాటికీ హరించుకుపోతున్నాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రశ్నించలేని దుస్థితి. గడిచిన ఐదేళ్లలో ఒక్క డిమాండ్‌ను పరిష్కరించుకోలేకపోయారు. వేతన సవరణ సాధించుకోలేకపోయారు. మధ్యంతర భృతి మధ్యలోనే ఆగింది. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం అగమ్యగోచరంగా ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని గొంతెత్తి ఘోషించినా ప్రయాసే మిగిలింది. ఇక పొరుగు సేవల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. గొడ్డు చాకిరీ చేస్తూ.. గొర్రె తోక సంపాదనతో అల్లాడుతున్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్నభోజన పథకం కార్మికులకు ఉపాధి భద్రత లేకుండా పోయింది. ఇలా ఒకరేంటి అందరు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించుకునే శక్తిని కోల్పోయారు. ఉద్యోగ సంఘాలు వీరి సమస్యలపై ఉద్యమాలు చేయడం లేదు. ఉద్యోగులు నోరుమెదిపి వారి హక్కులనో.. డిమాండ్లనో ప్రస్తావిస్తే జీతాలే సరిగ్గా ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో ఉందని పదే పదే చంద్రబాబు నూరిపోసిన మాటలతో ఉద్యోగులు అభద్రతాభావంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని వారి ఆశలకు జీవం పోశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం 2004 నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానం ఉద్యోగులకు పెన్షన్ భద్రతను దూరం చేసింది. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గినందునే ఈ సీపీఎస్ అమలులోకి వచ్చింది. జిల్లాలో 20 వేల మంది ఉద్యోగులు 2004 తర్వాత వివిధ సందర్భాల్లో నియమితులయ్యారు. వీరికి నెలవారీ జీతాల బిల్లులో పది శాతం మొత్తాన్ని కోత విధించి ప్రభుత్వం షేర్ల వ్యాపారంలో పెట్టుబడిగా ఉంచుతోంది. దీనికి ఏపాటి భద్రత ఉందన్నది ఉద్యోగుల వాదన. దీనిపై ఉద్యోగులు అనేక పోరాటాలు చేసినా ఫలితం లేదు. సీపీఎస్‌పై పోరాడిన వారిపైనా వేటు వేసింది బాబు సర్కార్. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానమైన 96 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు కలిపి 56 వేల మందికి పైగా ఉన్నారు. పెన్షనర్లు సుమారుగా 20 వేల మంది ఉన్నారు. టీడీపీ పాలనలో ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరు. అధికారులు తమ ఇంటి ముఖం చూడడానికి ఏ అర్ధరాత్రో అపరాత్రో కావాల్సిందే. నిత్యం రిపోర్టులు.. అర్థంపర్దం లేని నివేదికలతో కాలయాపన. ప్రభుత్వానికి క్షేత్ర స్థాయి నుంచి ఏం కావాలో తెలియదు. గంటకో ఫార్మాట్.. వెంటనే వివరాలివ్వాలని వేధింపులు. దీంతో ఉద్యోగులు, అధికారులు విసిగిపోయారు. ఇక చాలు ఈ వేధింపులు అన్న ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలు ఒక భరోసా నింపాయి. కాంట్రాక్టు కార్మికులకు వరం జిల్లాలో అత్యధికంగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. విద్యుత్, డీఆర్డీఏ, డ్వామా తదితర శాఖల్లో ఐదు వేల మంది అరకొర వేతనంతో పని చేస్తున్నారు. వీరిక ఉద్యోగ భద్రత లేదు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా పని ఉన్నా ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు. రాయితీలు లేవు. కాంట్రాక్టు ఉద్యోగులు ఎప్పటి నుంచో క్రమబద్ధీకరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని జగన్ ఇచ్చిన హామీతో వారిలో ఒక నమ్మకం మొలకెత్తింది. ఐఆర్ 27 శాతం.. ఉద్యోగుల్లో ఆనందం ఉద్యోగుల మధ్యంతర భృతి 27 శాతం ఇవ్వడానికి జగన్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ఎందుకంటే చంద్రబాబు గీత గీసి బేరమాడి 20 శాతం ఐఆర్ ఇస్తానన్నారు. ఉద్యోగులు తమకు హక్కుగా రావాల్సిన మధ్యంతర భృతి విషయంలోనూ భిక్ష వేస్తున్నట్లుగా ఉందన్న అసంతృప్తి ఉంది. జగన్ 27 శాతం ఐఆర్‌తో అటెండర్ నుంచి అధికారుల వరకు సుమారు వారు తీసుకొనే మూలవేతనంపై 38–42 శాతం వరకు వేతనం పెరుగుతుంది. జిల్లాలోని ఉద్యోగులపై ఐఆర్ పెంపుదల నేపధ్యంలో సుమారు రూ.180 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉన్నా ఈ పెంపుదల అమలు చేయడానికి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత వరకు 11వ వేతన సవరణ కమిటీని వేయలేదు. పూర్వ బకాయిలను గత ఏడాది డిసెంబర్లో ఇవ్వడం గమనార్హం. వేతనాల్లో కోతతోపాటు వారికి చెల్లించాల్సిన డీఏ, టీఏ తదితరాలకు బడ్జెట్ లేదంటూ, బడ్జెట్ మురిగిపోయిందంటూ చెల్లింపులను వాయిదా వేయడం గమనార్హం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల పీఆర్సీని కచ్చితంగా సమయానికి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ ధీమా కల్పించారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ జిల్లాలోని వివిధ శాఖల్లో 18 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయనందున ఒక ఉద్యోగిపై నలుగురి భారం పడుతోంది. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చి కొంత పని తగ్గించినా మాన్యువల్‌గా చేయాల్సిన పని భారం వీరికి తప్పడం లేదు. వివిధ శాఖల్లో మంజూరైన పోస్టుల కన్నా 37 శాతం ఖాళీలు ఉన్నాయి. వీటిని ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు. ఒక్క రెవెన్యూలోనే 450 ఖాళీలు ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో క్షేత్ర స్థాయి ఉద్యోగులు బాగా తగ్గిపోయారు. అయినా కొత్త పోస్టులు ఇవ్వకుండా, కొత్త డీఎస్సీలు వేసి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా నెట్టుకొస్తున్నారు. అంగన్వాడీలు.. ఆశా వర్కర్లకు.. జిల్లాలో సుమారు తొమ్మిది వేల మంది అంగన్వాడీలు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపునకు జగన్ హామీ ఇచ్చారు. అతి తక్కువ వేతనాలతో వీరు క్షేత్ర స్థాయిలో చాకిరీ చేస్తున్నారు. వీరి పనిపై విధి విధానం లేదు. పై అధికారులు ఏ హుకుం జారీ చేసినా వీరు విధుల్లో ఉండాల్సిందే. వీరు కొన్ని సందర్భాల్లో శాఖేతర పనులు చేస్తున్నారు. వెట్టిచాకిరీ చేస్తున్నా వీరికి తగిన వేతనాలు ఉండడం లేదు. వీరిపై అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వీరికి ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు వంటి లబ్ధి చేకూర్చడానికి జగన్ హామీ ఇచ్చారు. నాలుగో తరగతి ఉద్యోగులకు అభయం నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ ఉంది. వీరి గోడును చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదు. ఫలితంగా జిల్లాలోని 780 మంది నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయి. ఇటీవల 56 మంది ఉద్యోగ విరమణ చేశారు. జగన్ నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను తీరుస్తానని భరోసా ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్సులు కూడా పరిమితం చేస్తానని, పోలీసు ఉద్యోగులకు వారంతపు సెలవు ఇస్తానని, ప్రభుత్వ డ్రైవర్ల వ్యవస్థ పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని జగన్ ఇచ్చిన హామీపై ఆయా రంగాల్లోని 7 వేల మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం జిల్లాలో పొరుగు సేవల్లో సుమారు 12 వేల మంది వరకు పని చేస్తున్నారు. మీ సేవ, ఈ సేవ, విద్యుత్ తదితర శాఖల్లో పని చేస్తున్న వీరికి వేతనం ఏజెన్సీల ద్వారా చెల్లిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది సంస్థలు పొరుగు సేవకులను ఆయా శాఖలకు సరఫరా చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వారికి ఏడాది వేతనం ఒక్కసారే ఇస్తున్నారు. నెలనెలా వీరికి వేతనాలు ఉండవు. ప్రభుత్వం వద్ద కాస్త నిధులు సమకూరినప్పుడు మాత్రమే వీరికి చెల్లింపులు చేస్తున్నారు. పొరుగు సేవల్లో పని చేసే వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు వీరికి పనివేళలు అమలులో లేవు. ఇచ్చే కాంట్రిబ్యూషన్లో పది శాతం ఆయా సంస్థలు చార్జీల కింద తీసుకుంటాయి. భారంగానే వీరు పొరుగు సేవల్లో పని చేస్తున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే పొరుగు సేవలకు ఒక బధ్రత ఇవ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామంటున్నారు. హోంగార్డుల వేతనాలను పెంచుతామంటున్నారు. పెన్షనర్లకు ప్రత్యేక కేంద్రం ప్రతి జిల్లాలో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో సుమారు 20 వేల మంది సర్వీసు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారు. ఒంగోలు కేంద్రంగానే 9 వేల మంది ఉన్నారు. వీరికి రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటికి జవాబు చెప్పడానికి ప్రత్యేకంగా విభాగం లేదు. ఉద్యోగుల వద్దకు వెళ్లినా వారి నుంచి సరైన జవాబు రావడం లేదు. ఏటా సమర్పించే లైఫ్ సర్టిఫికెట్లు, ఐటీ రిటర్నులు, ఇతర రాయితీలు, మినహాయింపులు వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా సంప్రదింపులు జరిపే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా పెన్షనర్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒక సమస్యపై పదే పదే తిరిగే సమస్య తీరుతుంది. ఉద్యోగులను జైళ్లలో పెట్టించిన ఘనత చంద్రబాబుదే.. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పద్ధతి అమలు చేయాలని కోరుతూ రాస్తారోకోలు, ఆందోళనలు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై కేసులు పెట్టి, జైళ్లలో వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. గత రెండేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా పీఆర్సీ ఇవ్వొచ్చని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. పీఆర్సీ పెంచకపోగా, 40 శాతం ఐఆర్ అడిగితే 20 శాతం ఇచ్చారు. గతంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఎటువంటి పారితోషికం అందలేదు. వారి కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. – కాసులనాటి అమరేశ్వరప్రసాద్, రిటైర్డ్ హెడ్మాస్టర్(యర్రగొండపాలెం) ఐఆర్, పీఆర్సీ, డీఏపై హర్షం ఐఆర్, పీఆర్సీ, డీఏలు సకాలంలో ఇస్తానని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఉద్యోగులకు చెందిన సమస్యలన్ని పరిష్కరిస్తానని చెప్పారు. అదే విదంగా దీర్ఘకాలంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని అర్హతను బట్టి రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు. చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత లభిస్తుంది. వేతన జీవులకు సరైన న్యాయం చేస్తానని ప్రకటించడం హర్షణీయం. – ఉడుముల శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఉద్యోగుల బాధలు గుర్తించడం హర్షనీయం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగుల బాధలు గుర్తించి మధ్యంతర భృతి 27 శాతం పెంచుతానని ప్రకటించడం చాలా ఆనందకర విషయం. పెరుగుతున్న ధరలతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఐఆర్ పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు మేలు చేస్తుంది. – శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, దర్శి యూనియన్లు పెద్దల సంక్షేమానికా.. రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉద్యోగులు నాలుగేళ్లుగా సీపీఎస్ విధానం రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మొర ఆలకించిన ఒక మహానుభావుడు నేను విన్నాను–నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం రెండు లక్షల మంది జీవితాల్లో వెలుగొస్తుందని కృతజ్ఞతలు తెలిపిన సీపీఎస్ ఉద్యమకర్త రామాంజనేయులు యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం చాలా దారుణం. రామాంజనేయులుకు సంఘీబావం ప్రకటించకుండా సీపీఎస్ ఉద్యమం చేయడమే తప్పుగా చెత్త మెసేజ్‌లు వ్యాప్తి చేయడం సరికాదు. కొందరు పెద్దల సంక్షేమమే విధిగా యూనియస్లు పనిచేస్తుండటం దురదృష్టకరం. – బాజీ పఠాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ సీపీఎస్ఇఏ -
ప్రచారం చేస్తే..పరేషాన్ కావాల్సిందే..!
సాక్షి, వైఎస్సార్ కడప : ఎన్నికల కోడ్ కూయడంతో... ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చి చేరారు. దీంతో పాటు సోషల్ మీడియాకు ఎన్నికల నియమావళి వర్తింపచేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో సోషల్ మీడియాలో ప్రచారం చేసినా.. ఫార్వర్డ్ చేసినా ఇబ్బందులు తప్పవు.. సో.. ఉద్యోగులూ బహుపరాక్.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభకు కలిపి జమిలి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ప్రకటించారు. దీంతో ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కోడ్ పరిధిలోకి వచ్చినట్లయింది. ఉద్యోగులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వారిపై వేటు వేసే అధికారం ఎన్నికల యంత్రాంగానికి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తే వారిని ఉద్యోగం నుంచి కూడా తొలగించే అధికారం ఉంటుంది. (గతంలో మన జిల్లాలో కొందరు ఉద్యోగులు సైతం సస్పెన్షన్‌కు గురైన ఘటనలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓ అభ్యర్థికి సమీప బంధువైన విద్యావిభాగానికి చెందిన ఓ అధికారిపై కూడా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.) కాగా ఫలానా అభ్యర్థికి ఓటు వేయండి అని ప్రచారం చేసినా.. వ్యతిరేకంగా ప్రచారం చేసినా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సెక్షన్ 23 (ఐ)ను అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం నిర్వహించరాదని 1949 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం సెక్షన్ 23(ఐ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలను కూడా ఈ సమయంలో ప్రచారం చేయకూడదన్న ఆంక్షలు లేకపోలేదు. సోషల్ మీడియాతో బీ కేర్‌ఫుల్ కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర ఎనలేనిది. ఎన్నికల ఫలితాలను సైతం తారుమారు చేసే స్థాయికి సోషల్ మీడియా ఎదగడంతో పోటీ చేసే అభ్యర్థులు, వారి అనుచరగణం సోషల్‌మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటారు. ఇందుకోసం ఏకంగా సోషల్ మీడియా విభాగాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, మెసెంజర్ వంటి వాటితో ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో గ్రూపుల్లో రెచ్చగొట్టే ప్రచారాలు, మతపరమైన సున్నితాంశాలు వంటి విషయాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జరగరానిదేదైనా జరిగితే గ్రూప్ అడ్మిన్ బాధ్యుడవుతాడని కనుక సోషల్ మీడియా విషయంలో కూడా ఉద్యోగులు అనవసరమైన వివాదాలకు, ప్రచారాలకు పోకుండా ఉంటే మంచిదని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ వాట్సాప్ గ్రూపుల్లో ఎన్నికల నియమావళికి సంబంధించిన క్రమశిక్షణ చర్యల గురించి వేగంగా విస్తరిస్తున్నాయి. -
రిజిస్టర్లు, గొడౌన్ తాళాలతో సహా... పరారీ...!
ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. సెలవు పెట్టాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ ఆ ఉద్యోగి ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా...సెలవు పెట్టకుండా పది రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో చౌక దుకాణాలకు వెళ్లాల్సిన బియ్యం పంపిణీ నిలిచిపోయింది. తీరా చూస్తే ఇప్పుడు ఆ ఉద్యోగి ఆచూకీ కోసం ఉన్నతాధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. విజయనగరం , చీపురుపల్లి: పౌర సరఫరాల శాఖ నేతృత్వంలో నిర్వహిస్తోన్న ఎంఎల్ఎస్ పాయింట్ గొడౌన్ ఇన్చార్జి పరారీలో ఉన్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. సుమారు పది రోజులుగా గొడౌన్ ఇన్చార్జి హెచ్.రమణారావు ఆచూకీ లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారులు సైతం గుట్టు చప్పుడు కాకుండా వెతికించే పనిలో పడ్డారు. అయితే గొడౌన్ ఇన్చార్జి కనిపించకుండా పరారీలో ఉండడం ఒకెత్తయితే ఆయనతో పాటు గొడౌన్‌కు చెందిన అతి ముఖ్యమైన రిజిస్టర్లు, ప్రధాన గొడౌన్ తాళాలు కూడా ఆయన వద్దే ఉండడం చర్చనీయాంశమైంది. అది కూడా మార్చి నెలలో తెలుపు రంగు రేషన్ కార్డు లబ్ధిదారులకు సరఫరా చేయాల్సిన బియ్యం దాదాపు 70 వేల క్వింటాళ్లకు పైగా గొడౌన్లో నిల్వ ఉండగా ఆయన తాళాలతో సహా కనిపించకుండా వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి సెలవు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరవ్వడం మాత్రమే కాకుండా కనిపించకుండా వెళ్లిపోవడంపై సంబంధిత అధికార వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అయితే వ్యక్తిగత అవసరాలు ఉంటే సెలవుపై వెళ్తారని, లేకపోయినప్పటికీ తాళాలు, రిజిస్టర్లు కూడా అప్పగించకుండా కనిపించకుండా వెళ్లిపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 4 నుంచి పరారీలోనే.... చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం(పార్ట్), గుర్ల(పార్ట్)కు సంబంధించిన ఆయా పరిధిలో ఉండే చౌకదుకాణాలకు చీపురుపల్లిలో ఉండే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రతీ నెలా రేషన్ సరుకులు పంపిస్తారు. ఈ గొడౌన్‌కు ఇన్చార్జిగా ఉండే హెచ్.రమణారావు ఈ నెల 4 నుంచి కార్యాలయానికి వెళ్లడం లేదు. ఎక్కడున్నారో తెలియదు. జిల్లా అధికారుల ఫోన్లకు సైతం స్పందించడం లేదు. ప్రభుత్వ సెల్ నంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉండగా, వ్యక్తిగత సెల్ నంబరు కూడా ఏదో ఒక సమయంలో మాత్రమే పని చేస్తోందని తెలిసింది. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో సమావేశానికి కూడా ఆయన హాజరు కానట్టు సమాచారం. అయితే ఆయనతో పాటు రిజిస్టర్లు, గొడౌన్ తాళాలు కూడా ఉండడంతో విభిన్న చర్చలకు దారి తీస్తోంది. 70 వేల క్వింటాళ్లకు పైగా బియ్యం.... మార్చి నెలకు సంబంధించి చౌక దుకాణాలు ద్వారా పంపిణీ చేసేందుకు అవసరమైన బియ్యం ఫిబ్రవరి 3న స్థానిక గొడౌన్‌కు చేరుకుంది. అప్పటికి గొడౌన్ ఇన్చార్జి విధుల్లోనే ఉన్నారు. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 4 నుంచి ఆయన అందుబాటులో లేరు. అయితే గొడౌన్లులో దాదాపు 70 వేల క్వింటాళ్లకు పైగా బియ్యం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 18 నుంచి గొడౌన్ నుంచి చౌక దుకాణాలకు సరుకులు వెళ్లాల్సి ఉంది. ఇంతవరకు ఇన్చార్జి ఆచూకీ లభించలేదు. ఫిబ్రవరి 4 నుంచి దాదాపు పది రోజులుగా ఇన్చార్జి ఆచూకీ లేకపోయినప్పటికీ ఎలాంటి చర్యలు కానరావడం లేదు. జిల్లా అధికారులు రెండు రోజులుగా ఆయన ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. చర్యలకు సిద్ధం... చీపురుపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ గొడౌన్ ఇన్చార్జిపై చర్యలకు సిద్ధమవుతున్నాం. ముఖ్యమంత్రి పర్యటన పూర్తి కాగానే ఆయనపై చర్యలు ప్రారంభమవుతాయి. గొడౌన్ తాళాలు, రిజిస్టర్లు ఆయన వద్ద పెట్టుకోవడం చాలా పెద్ద నేరం. ఆయన ఎలాంటి సెలవు పెట్టలేదు. ఎన్నో ఫోన్ కాల్స్ చేసాం, ఇంటికి పంపించాం ఎవ్వరూ లేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగి కావడంతో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. చర్యలు తీసుకోమని జాయింట్ కలెక్టర్ గారికి కోరతాం. తాళాలు, రిజిస్టర్లు స్వాధీనం చేసుకుంటాం. రిజిస్టర్లు, తాళాలు వచ్చాక పరిశీలన చేసి ఎలాంటి తేడాలు ఉన్నా గట్టి చర్యలు ఉంటాయి.– షర్మిల,జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ -
3 రోజులు... 30 సార్లు!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, ఈ–మెయిల్స్ ద్వారా ఎరవేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు నానాటికీ రెచ్చిపోతున్నారు. సైబర్ క్రిమినల్స్ చేతిలో రూ.6 లక్షలు మోసపోయిన ఓ వృద్ధుడు శుక్రవారం సిటీ సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. తన ఫోన్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను(ఓటీపీ) ఏకంగా 30 సార్లు నేరగాళ్లకు చెప్పేయడం గమనార్హం. చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన మోహన్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ పొంది భార్యతో కలిసి జీవిస్తున్నారు. ఇటీవల ఆయనకు ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ చేసిన కేటుగాళ్లు తాము బ్యాంకు అధికారులమంటూ పరిచయం చేసుకుని, మీ డెబిట్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయాలని చెప్పి కార్డు నంబర్, సీవీవీ కోడ్‌తో పాటు ఇతర వివరాలు తీసుకున్నారు. ఆ వివరాలతో బాధితుడి బ్యాంకు ఖాతాలోకి యాక్సిసయ్యారు. మళ్లీ ఫోన్ చేసి కార్డు అప్డేషన్ దాదాపు పూర్తయిందని ఇక ఓటీపీ ఎంటర్ చేయడమే మిగిలిందని చెప్పారు. మీ ఫోన్‌కు వచ్చే ఆ నంబర్ చెప్పాలంటూ కోరారు. మోహన్ అలానే చేయడంతో ఆయన ఖాతాలోని డబ్బు స్వాహా చేయడం మొదలు పెట్టారు. ఇలా 3 రోజుల్లో దాదాపు 30 సార్లు ఓటీపీలు తెలుసుకుని బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.6 లక్షలు వివిధ ఈ–కామర్స్ యాప్స్‌తో పాటు పేటీఎంలోకి మళ్లించుకున్నారు. ఎట్టకేలకు విషయం గుర్తించిన మోహన్ శుక్రవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఏసీపీ విజయ్ ప్రకాశ్ తివారీ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నేరగాళ్లు జార్ఖండ్ కేంద్రంగా కథ నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలతో పాటు ఈ–కామర్స్ యాప్స్ ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళుతున్నారు. -
వంద రెట్ల జీతం అదనంగా పొందాడు..!
కాన్బెర్రా : నెలంతా కష్టపడి పనిచేస్తేనే పూర్తి జీతం చేతికి రాదు. ఏవో సాకులతో జీతం సోమ్ములోంచి ఎంతో కొంత కట్ చేయడం అన్ని కంపెనీల్లో సర్వ సాధారణం. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం నెల జీతం కంటే వంద రెట్లు ఎక్కువ వేతనాన్ని పొందాడు. అంత ఎక్కువ జీతం వచ్చిందంటే సదరు ఉద్యోగి ఎంతలా కష్టపడి పనిచేశాడో అనుకుంటే పొరపాటే. అకౌంట్స్ డిపార్ట్మెంట్ తప్పిదం వల్ల ఇంత ఎక్కువ వేతనాన్ని పొందాడు. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం 3,582 ఆస్ట్రేలియన్ డాలర్లు(మన కరెన్సీలో 1,84,121.96 రూపాయలు). కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు చేసిన తప్పిదం వల్ల సదరు ఉద్యోగి తన నెల వారీ వేతనం కంటే వంద రెట్లు ఎక్కువ అంటే 3,60,700 ఆస్ట్రేలియన్ డాలర్ల(రూ. 1,85,40,701.40) జీతాన్ని పొందాడు. ఈ విషయం గురించి సదరు ఉద్యోగి సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసాడు. దాంతో అధికారులు ఎక్కడ తప్పిదం జరిగిందో చూడగా అసలు విషయం వెలికి వచ్చింది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఓ విలువను తప్పుగా ముద్రించారని గుర్తించారు. ఎక్కువ వేతనం పొందడానికి గల కారణం తెలుసుకున్న సదరు ఉద్యోగి నాలుగు వారాల తర్వాత అధికంగా పొందిన వేతనాన్ని తిరిగి ఇచ్చేశాడు. -
వద్దురా... సామీ ఈ విధులు
సాక్షి, కడప / అగ్రికల్చర్ : ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లుంది జిల్లా కేంద్రంలోని పలు శాఖల అధికారులు పరిస్థితి. ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. కాదు.. పోము.. అంటే కుదరదు. అందునా ప్రభుత్వ ఉద్యోగం. ప్రోటోకాల్ కావడంతో అల్లాడిపోతున్నారు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు వారంరోజులుగా ప్రతిరోజు వస్తున్న ప్రముఖుల సేవలో ప్రభుత్వ అధికారులు నలిగిపోయారు. వద్దురా సామీ.. ఈ విధులు అంటూ కొట్టుకుంటున్నారు. మంత్రులు, వీఐపీల వెంట వచ్చే చోటా మోటా నేతలఆర్డర్లతోనే అధికారులు అదిరిపోతున్నారు. ఇది కావాలి, అది కావాలి అంటూ మంత్రుల వెంట వచ్చేవారు ఆదేశాలు ఇస్తుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి దీక్ష కారణంగా అధికారులకు నిద్ర ఉండటం లేదు. ఒకపక్క ప్రొటోకాల్, మరోపక్క దీక్షకు సంఘీభావాల నేపథ్యంలో జన సమీకరణతో అల్లాడిపోయారు. తమ్ముళ్లతో తంటా! దీక్షకు సంఘీభావం తెలుపడానికి వచ్చే మంత్రులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రొటోకాల్ కలిగిన సంస్థల అధ్యక్షులు ఆర్‌అండ్‌బీలో దిగుతున్నారు. ఈ సందర్భంలో వారి అనుయాయుల హడావుడి అంతా ఇంతా కాదు. వారి కోర్కెలు తీర్చడం పలుశాఖల్లో ప్రొటోకాల్ చూసే అధికారుల చేతిచమురు వదులుతోందని ఆందోళన చెందుతున్నారు. ఉద యం పూట తెలుగు తమ్ముళ్లు తమకు టిఫెన్లు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్నం ఖరీదైన భోజనాలు తెప్పించి ఉం చాలని ఆదేశించడం పరిపాటిగా మారిం దని అధికారులు వాపోతున్నారు. పోతూపోతూ తమ వాహనాలకు డీజిల్ పట్టించుకుని మరీ వెళుతున్నారు. మంత్రుల హడావుడి.. అధికారుల గడిబిడి రోజూ మంత్రుల హడావుడి ఉంది. ప్రతిక్షణం వారి రాక కోసం కొందరు అధికారులు బొకేలు అందించడం, తర్వాత దీక్ష ప్రాంగణానికి తీసుకెళ్లే వరకు బాధ్యతలతో బిజీబిజీగా కనిపిస్తున్నారు. అలాగే మంత్రుల రెస్ట్ కోసం విశ్రాంతి భవనాలకు తీసుకు వెళ్లడం, ఇతర అవసరాల మేరకు అందుబాటులో ఉండడంతోపాటు మంత్రుల విభాగాలకు సంబం«ధించిన జిల్లా అధికారులు కూడా ప్రొటోకాల్ ప్రకారం కనిపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా మంత్రుల పర్యటనలతో అధికారులు వారంరోజులుగా అల్లాడిపోతున్నారు. అలాగే జిల్లాకు మంత్రులు, వీఐపీలు, ఎంపీలు, సినీ ప్రముఖులు రాకతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. వారం రోజులుగా ఎయిర్‌పోర్టు నుంచి దీక్షా శిబిరం వరకు మంత్రులను తీసుకు రావడం, రోడ్డు మార్గాన వచ్చేవారికి ఎక్కడికక్కడ వెంట బందోబస్తుతోపాటు దీక్షాశిబిరం వద్ద వీఐపీల తాకిడి నేపథ్యంలో బందోబస్తు విధుల్లో జిల్లా పోలీసు యంత్రాంగానికి నిద్రలేకుండా పోయింది. -
ఏసీబీ వలలో ఆటోనగర్ ఫైర్ ఆఫీసర్
విజయవాడ: మరో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. విజయవాడలోని ఆటోనగర్ అగ్నిమాపక శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస రావు తన కార్యాలయంలో విజయదుర్గ పెట్రో కెమికల్స్ యజమాని ముద్దాడ రామకృష్ణ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇటీవల విజయదుర్గ పెట్రో కెమికల్స్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కర్మాగారంలోని విద్యుత్ మీటర్ దగ్ధమైంది. మీటర్ సర్టిఫై చేసేందుకు శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు నగదు స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల డిప్యుటేషన్ అలవెన్సును రెట్టింపు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.డిప్యుటేషన్ అలవెన్సును 2.25 రెట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించిందని, 2017, జులై 1 నుంచి ఈ నిర్ణయం వర్తింపచేస్తామని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే స్టేషన్లో డిప్యుటేషన్‌కు సంబంధించి డిప్యుటేషన్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 5 శాతంగా ఉంటుందని గరిష్టంగా నెలకు రూ 4500 వరకూ పెరుగుతుందని, లొకేషన్ మారితే మూల వేతనంలో పది శాతం గరిష్టంగా రూ 9000 వరకూ డిప్యుటేషన్ అలవెన్స్ చెల్లిస్తారని నోటిఫికేషన్ తెలిపింది.ప్రస్తుతం డిప్యుటేషన్ అలవెన్స్‌ను ఈ రెండు కేటగిరీల్లో వరుసగా రూ2000, రూ 4000గా చెల్లిస్తున్నారు. -
జీవో విడుదలైతే మా తడాఖా చూపిస్తాం
-
చీకటి జీవోలపై ఉద్యోగుల ఆగ్రహం
-
సర్వీస్ నిబంధనలు మారిస్తే ఊరుకోము
-
ప్రభుత్వ నిర్ణయం దారుణం: బొప్పరాజు
అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఇపుడు 50 ఏళ్లకే ఉద్యోగులను ఉద్యోగ బాధ్యతల నుంచి బలవంతంగా రిటైర్ చేయించే నిర్ణయాన్ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం దారుణమైందని, ఇప్పటికే ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. పదిమంది పనిని ఒక్క ఉద్యోగి చేస్తున్నారని, అలాంటప్పుడు పనితీరును ఎలా లెక్కగడతారని బొప్పరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే సీఎంవోకు ఫిర్యాదు చేశామని, ఉద్యోగ సంఘాలతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవద్దని కోరామన్నారు. సర్కార్ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని బొప్పరాజు పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడు కావాలంటే అప్పుడు బలవంతంగా రిటైర్ చేయించేందుకు వీలుగా నిబంధనలన్నీ మార్చుతూ అందుకు అనుగుణంగా ఐదు జీవోలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్థిక, న్యాయ శాఖల ఆమోదం పొంది సీఎస్ వద్దకు చేరిన ఆ జీవోలు త్వరలో జీవం పోసుకుని ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నాయి. -
50 ఏళ్లకే ఇంటికి..
♦ 50 ఏళ్లు నిండగానే పనితీరుపై సమీక్ష ♦ పనితీరు ఆధారంగా బలవంతంగా పదవీ విరమణ ♦ ఉద్యోగుల ఫండమెంటల్, పెన్షన్ రూల్స్‌లో సవరణలు ♦ ఐదు జీవోలు సిద్ధం చేసిన చంద్రబాబు సర్కార్ ♦ సర్కార్ నియమించే సమీక్షా కమిటీలదే తుది నిర్ణయం ఆరు లక్షల మంది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను షాక్‌కు గురిచేసే వార్త ఇది. పనితీరు ఆధారంగా 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపించేయబోతున్నారు. ఇకపై సర్కారుకు నచ్చిన ఉద్యోగి.. సర్కారు మెచ్చినంత కాలం మాత్రమే ఉద్యోగంలో ఉండగలుగుతాడు.. నచ్చని మరుక్షణాన ప్రయివేటు ఉద్యోగిని తొలగించినట్లు ఒక్క కలం పోటుతో తొలగించి ఇంటికి పంపించేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను దశలవారీగా తొలగించి వారి స్థానంలో తాత్కాలిక.. కన్సల్టెంట్లను తెచ్చుకోవాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడు కావాలంటే అప్పుడు బలవంతంగా రిటైర్ చేయించేందుకు వీలుగా నిబంధనలన్నీ మార్చుతూ అందుకు అనుగుణంగా ఐదు జీవోలను కూడా తయారు చేశారు. ఆర్థిక, న్యాయ శాఖల ఆమోదం పొంది సీఎస్ వద్దకు చేరిన ఆ జీవోలు త్వరలో జీవం పోసుకుని ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నాయి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగికీ.. ప్రైవేటు ఉద్యోగికీ తేడా ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగికి అనేక హక్కులుంటాయి... అన్నిటినీ మించి ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగికి అవేవీ ఉండవు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అలాంటి ప్రివిలేజెస్ అన్నీ తొలగిపోనున్నాయి. ఇక ప్రైవేటు ఉద్యోగులకు వారికీ ఎలాంటి తేడా ఉండదు.. అదేమిటి.. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగ విరమణవయసు కూడా 60 ఏళ్లకు పెంచారు కదా అనుకుంటున్నారా.. అది పేరుకే.. త్వరలో నిబంధనలన్నీ మారబోతున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఇపుడు 50 ఏళ్లకే ఉద్యోగులను ఉద్యోగ బాధ్యతల నుంచి బలవంతంగా రిటైర్ చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. 35 సంవత్సరాలకు ముందు ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులను 50 సంవత్సరాలకే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు, 40 సంవత్సరాలు దాటిన తరువాత ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులను 55 సంవత్సరాలకే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు వీలుగా నిబంధనలన్నీ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉద్యోగుల ఫండమెంటల్ రూల్స్, పెన్షన్ నిబంధనల్లో సవరణలు చేయడానికి ఐదు ముసాయిదా జీవోలను సాధారణ పరిపాలన శాఖ రూపొందించింది. ఈ ముసాయిదా జీవోలకు ఇప్పటికే ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోద ముద్ర వేశారు. సాధారణ పరిపాలన శాఖ ఈ ముసాయిదా జీవోలను న్యాయ శాఖ పరిశీలనకు పంపించింది. న్యాయ శాఖ ఆమోదం అనంతరం తిరిగి సీఎస్ వద్దకు చేరాయి. ఉద్యోగి పనితీరుపై తరచూ సమీక్ష ప్రస్తుతం ఫండమెంటల్ రూల్స్‌లో 56వ నిబంధన ప్రకారం ప్రభుత్వ సర్వీసులోకి చేరిన ఉద్యోగి 60 సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు. అయితే ఇప్పుడు ఫండమెంటల్ రూల్స్‌లో సవరణ చేస్తూ 56 (1) పేరుతో ప్రతి ఉద్యోగి పనితీరును తరచూ సమీక్షించాలని నిర్ణయించింది. ఆ సమీక్ష ఆధారంగా ఆ ఉద్యోగిని సర్వీసులో కొనసాగించాలా లేదా బలవంతంగా పదవీ విరమణ చేయించాలనేది నిర్ణయిస్తారు. సమీక్షలో ఉద్యోగి నిజాయితీ (ఇంటిగ్రిటీ)పై అనుమానం కలిగితే బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారు. అలాగే సమీక్షలో ఉద్యోగి పనితీరు (ఫెర్ఫార్మెన్స్) ఆధారంగా అసమర్ధుడని (ఇనెఫిషియెన్సీ) తేలితే బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారు. ఇందుకోసం ఫండమెంటల్ రూల్స్ 56లో (2) నిబంధన పేరుతో ముందస్తు నోటీసు ఇవ్వడం లేదా మూడు నెలలు జీత భత్యాలు ఇచ్చి బలవంతంగా పదవీ విరమణ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉండేలా చేశారు. షోకాజ్ ఉండదు.. చర్చా ఉండదు.. అలాగే ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలు చేస్తున్నారు. దీనిపై ఎటువంటి ఆర్బిట్రేషన్ కూడా ఉండదని సవరణల్లో పేర్కొనడం గమనార్హం. ప్రతీ ప్రభుత్వ శాఖలోను అలాంటి ఉద్యోగులను సమీక్షా కమిటీలు ప్రతి ఏడాదీ గుర్తిస్తాయి. ఆ సమీక్షల ఆధారంగా ఉద్యోగుల భవితవ్యాన్ని నిర్ధారిస్తారు. బలవంతపు పదవీ విరమణ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ రూల్స్ 1980లోని సెక్షన్ (1)లో (బి) పేరుతో నిబంధనలను సవరించేందుకు ఒక జీవోను రూపొందించింది. బలవంతంగా పదవీ విరమణ చేయించే ఉద్యోగులకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిని గతంలో సుప్రీం కోర్టు సమర్ధించిందని ముసాయిదా జీవోలో స్పష్టం చేశారు. 50 సంవత్సరాలు నిండే ఉద్యోగి అంతకు ముందు పనిచేసిన ఐదేళ్ల కాలంలోని పనితీరు, అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత ప్రవర్తన ఆధారంగా ఆ ఉద్యోగి భవిష్యత్‌ను సమీక్షా కమిటీలు నిర్ధారిస్తాయి. ఇందుకోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా సమీక్షకు చీఫ్ విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా మరో ముసాయిదా జీవోను సర్కారు రూపొందించింది. ఇప్పటి వరకు ఉన్నదేమిటి? ♦ ఫండమెంటల్ రూల్స్‌లో 56వ నిబంధన ప్రకారం ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో ఉంటారు. ఇపుడు జరిగేదేమిటి? ♦ ఫండమెంటల్ రూల్స్ సవరిస్తున్నారు. దాని ప్రకారం ప్రతి ఉద్యోగి పనితీరును తరచూ సమీక్షిస్తారు. ♦ దాని ఆధారంగానే సర్వీసులో కొనసాగించాలా లేదా బలవంతంగా ఇంటికి పంపించేయాలా అనేది నిర్ణయిస్తారు ♦ నిజాయితీ, పనితీరు, సమర్థతలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తారు. ♦ ఒక్క నోటీసు ఇచ్చి, మూడునెలల జీతభత్యాలు ఇచ్చి బలవంతంగా ఉద్యోగ విరమణ చేయిస్తారు.. ♦ అసలు ఎలాంటి షోకాజు నోటీసూ ఇవ్వకుండానే బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించవచ్చు. ♦ దానిపై ఎలాంటి ఆర్బిట్రేషన్కూ వీలు లేని విధంగా సవరణలు చేస్తున్నారు. సమీక్ష వర్తించేదెవరికి? ♦ 35 సంవత్సరాలకు ముందు ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగుల పనితీరును 50 ఏళ్లకు సమీక్షిస్తారు. ♦ 40 ఏళ్ల తర్వాత ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగుల పనితీరును 55 ఏళ్లకు సమీక్షిస్తారు.. -
50 ఏళ్లకే ఇంటికి..
-
అంత్యక్రియలకు డబ్బులు అడిగితే కూతుళ్లను..
-
కొందరి వల్ల డిపార్ట్మెంట్కు చెడ్డపేరు
ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలి అంకిత భావంతో పనిచేయాలి ఏసీబీ పనితీరు అమోఘం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బీచ్‌రోడ్ : ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి నీతి, నిజాయితీ, అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్‌లో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ శాఖా సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లా, మండల కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కొంత మంది అధికారులు, సిబ్బంది చేస్తున్న పనుల వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోందన్నారు. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారులకు వచ్చిన జీతం చాలకపోతే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ప్రజలకు నమ్మకం పోతోంది.. అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతిపై మండల స్థాయిలో ఎప్పటికప్పడు సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తుండాలన్నారు. అమాయకులకు అన్యాయం జరిగితే సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కొంతమంది సిబ్బంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పరిష్కారం దొరక్క వారు బాధితులవుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల డిపార్ట్‌మెంట్‌పై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. కార్యాలయంతో సంబంధం లేని బయట వ్యక్తులను లోనికి అనుమతించరాదని ఆదేశించారు. సిబ్బంది వారి జాబ్ చార్ట్ ప్రకారం, రూల్స్‌ను అతిక్రమించకుండా క్రమశిక్షణతో పారదర్శకంగా పనిచేయాలన్నారు. అవినీతి నిర్మూలనలో ఏసీబీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 డి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డైరీ ఆవిష్కరణ జిల్లా రెవెన్యూ అసోషియేషన్ ప్రచురించిన 2017 నూతన డైరీని కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్–2 డి.వెంకరెడ్డి ఆవిష్కరించారు. -
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే..
జామీనుదారులకు భారీ జరిమానా ఒక్కొక్కరికి రూ.50 వేలు తిరుపతిలో నాలుగో అదనపు జడ్జి తీర్పు డబ్బుకు కక్కుర్తిపడి ముక్కూ ముఖం తెలియని నిందితులకు.. జామీను ఇస్తే.. మొదటికే మోసం వస్తుందన్న విషయం మరోసారి తిరుపతి కోర్టు సాక్షిగా.. తేటతెల్లమైంది. మహిళా చైన్ స్నాచర్లు ఇచ్చిన మొత్తానికి ఆశపడిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. మొదట వారికి జామీను ఇచ్చారు. చివరికి వారిని సకాలంలో తిరిగి కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు. దీంతో ఏకంగా ఒక్కొక్కరు రూ. 50 వేలు జరిమానాగా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతి లీగల్: ప్రభుత్వ ఉద్యోగులై ఉండి చిన్న మొత్తానికి ఆశపడి తెలియని వ్యక్తులకు జామీను ఇచ్చి, నిందితులను కోర్టులో హాజరుపరిచని ఒక్కొక్కరికీ రూ. 50 వేలు జరిమానా చెల్లించాలని తిరుపతి అదనపు జూనియర్ జడ్జి సన్యాసినాయుడు మంగళవారం తీర్పు ఇచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన ఇందుమతి, తాయమ్మ 2014లో శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా ఆరుగురు మహిళా భక్తుల వద్ద బంగారు చైన్లను అపహరించుకెళ్లారు. దీనిపై చంద్రగిరి పోలీసులు ఆ ఇద్దరి మహిళలపై కేసులు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలిం చారు. ఇద్దరి తరఫున ఓ న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా కోర్టు ఒకొక్క క్రైంలో రూ.10 వేలు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలలో ఉద్యోగులుగా ఉన్న తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన మునికృష్ణయ్య, రంగనాథ్ నిందితులకు జామీను ఇచ్చారు. ఆ తర్వాత నిందితులు ఇద్దరూ జైలు నుంచి విడుదలై పరారయ్యారు. ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ ఇద్దరికి జామీను ఇచ్చిన మునికృష్ణయ్య, రంగనాథ్‌కు నోటీసులు ఇచ్చారు. అరుునా కూడా ఇద్దరు నిందితురాళ్లను కోర్టులో హాజరుపరచలేక పోయారు. దీంతో న్యాయమూర్తి జామీనుదారులు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున జరిమానా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఇద్దరూ కోర్టులో జామీను సొమ్ము చెల్లించారు. అలాగే వీరు మరో కేసులో కూడా సొమ్ము చెల్లించాల్సి ఉండడం గమనార్హం. -
ప్రభుత్వ ఉద్యోగికి ఏడాది జైలు
సాక్షి, సిటీబ్యూరో: మెడికల్ షాప్ లెసైన్స్ కోసం లంచం తీసుకొని పట్టుబడ్డ డ్రగ్స్ కంట్రోలర్ డెరైక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.వెంకటేశ్వర్లుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ సీఐ నాగేశ్వర్రావు కథనం ప్రకారం... ప్రస్తుతం ప్రకాశం జిల్లా దర్శిలో ఉంటున్న ఫిర్యాదుదారుడు పి.ఆంజనేయులు...ఆరేళ్ల క్రితం బీఎన్‌రెడ్డి నగర్లో మెడికల్ షాప్ ఏర్పాటు చేద్దామని లెసైన్స్ కోసం దరఖాస్తు చేశారు. లెసైన్స్ మంజూరు చేయాలంటే తనకు రూ. 4,500 లంచం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ డెరైక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని లంచం డబ్బు తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు సమర్పించిన సాక్ష్యాధారాలన్నీ రుజువు కావడంతో నిందితుడు వెంకటేశ్వర్లుకు కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. -
ప్రభుత్వ ఉద్యోగుల అంత్యక్రియలకు రూ.15,000
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకూ అంత్యక్రియల నిమిత్తం రూ.10వేలు ఇస్తుండగా, దీన్ని రూ.15 వేలకు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ (సేవలు) కార్యదర్శి డాక్టర్ బి. కిశోర్ బుధవారం జీవో జారీ చేశారు. పదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేలకు పెంచాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ.15 వేలకు పరిమితం చేసింది. అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు అన్ని స్థాయిల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా?
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చా ? ఏజెంట్లు, బ్రోకరేజ్ చార్జీలు వంటి బాదరబందీలేమీ లేకుండా ఇలా నేరుగా ఇన్వెస్ట్ చేసే అవకాశముందా? వివరించండి? - మార్కండేయ, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ డెరైక్ట్ ప్లాన్లను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి 2013, జనవరిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ డెరైక్ట్ ప్లాన్స్‌లో ఏజెంట్లు, దళారీల ప్రమేయం లేకుండా మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫలితంగా ఏజెంట్లకు చెల్లించే కమీషన్ ఆదా అవుతుంది. దీంతో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండి ఇన్వెస్టర్లకు ఎక్కువ రాబడులు వస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ ఫార్మా ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున ఏడాది పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను సొంతంగా ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రయోజనకరం? - మందాకిని, హైదరాబాద్ నెలకు నిర్ణీత మొత్తం-మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసినా, లేకుంటే సిప్ విధానంలో(ప్రతి నెలా ఒక నిర్ణీత తేదీన) ఇన్వెస్ట్ చేసినా.. ఏ విధంగా ఇన్వెస్ట్ చేసినా మీకు దక్కే ప్రయోజనాలు దాదాపు ఒక్కటే. మార్కెట్ స్థితిగతులను బట్టి నెలలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించేంత తీరిక, ఓపిక సాధారణ ఇన్వెస్టర్లకు ఉండవు. అలా కాకుండా మీకు ఆసక్తి ఉండి, నెల మొత్తంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే మొదటి విధానం మంచిదే. అయితే అది కొంచెం కష్టసాధ్యమైన విషయమే. ఈ బాదరబందీలేమీ లేకుండా సిప్ విధానాన్నీ ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏజెంట్ల కమీషన్ ఖర్చు ఉండదు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో కారణంగా ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలుంటాయి. నెలకు రూ.5,000 చొప్పున ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫ్రాంక్లిన్ ట్యాక్స్షీల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలాగే ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే కూడా పన్ను మినహాయింపులు లభిస్తాయా? - శశి, హైదరాబాద్ ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్ అనేది టెక్నాలజీ (ఐటీ) స్కీమ్. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభించవు. ఫ్రాంక్లిన్ ట్యాక్స్షీల్డ్ అనేది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్). ఇది ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కిందకు వస్తుంది. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను మినహాయింపులు పొందవచ్చు. అయితే ఈ తరహా ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాను. నా వయ స్సు 35 సంవత్సరాలు. 32 సంవత్సరాల నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మాకు రెండేళ్ల పాప ఉంది. నాకు, నా కుటుంబానికి రూ.5 లక్షల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను తీసుకుందామనుకుంటున్నాను. ఈ బీమా కవర్ సరిపోతుందా? నా అవసరాలకు తగిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను సూచించండి? - శరత్ చంద్ర, చిత్తూరు మీలాంటి యువ కుటుంబాలు లైఫ్‌టైమ్ రెన్యువల్ ఆప్షన్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. దీంట్లో సబ్-లిమిట్స్, కో పేమెంట్ క్లాజ్ ఉండకూడదు. ఇక మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే, అపోలో మ్యూనిక్ ఈజీ హెల్త్ పాలసీ, ఐసీఐసీఐ లాంబార్డ్ ఐహెల్త్.. పాలసీలను పరిశీలించవచ్చు. మీ కుటుంబంలో పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న చరిత్ర ఉంటే, క్రిటికల్ ఇల్నెస్ కవర్ తప్పకుండా తీసుకోవాలి. మీరు చెప్పిన రూ.5 లక్షల కవర్ ఇప్పటికి సరిపోతుంది. మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, వ్యాధులకు సంబంధించి మీ కుటుంబ చరిత్ర, మీ ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత మొత్తానికి బీమా కవర్ కావాలో మీరే సొంతంగా నిర్ణయించుకోవాలి. బీమా కవర్ పెంచుకోవాలనుకున్నప్పుడల్లా, సూపర్ టాప్ అప్ ప్లాన్‌ను ఎంచుకోండి. అపోలో మ్యూనిక్ ఈజీ హెల్త్ పాలసీకి ఏడాది ప్రీమియం రూ.10,523, ఐసీఐసీఐ లాంబార్డ్ ఐహెల్త్ పాలసీకి ప్రీమియం రూ.11,719గా ఉన్నాయి. రెండేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే కొంత డిస్కౌంట్‌ను రెండు పాలసీలు ఆఫర్ చేస్తున్నాయి. -
జీపు, బైక్ ఢీ: ప్రభుత్వ ఉద్యోగి మృతి
కరీంనగర్ జిల్లా కమాలాపూర్ మండలం వగపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అంకూస్ అనే ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై వెళుతున్న అంకూస్ ను ఎదురుగా వస్తున్న జీపు ఘీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘనటలో నలుగురుతీవ్రంగా గాయపడ్డారు. మరో ఐదుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. -
నకి'లీలలు!
సహకార శాఖలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. ఓ ఆడిటర్ తన అధికారాన్ని చెలాయించి అక్రమంగా రుణాలు కాజేసిన బాగోతం బయటపడింది. ఇందుకు శాఖలోని మరి కొందరి ‘సహకారం’ కూడా తోడయింది. వెరసి,, తన పేరుతో పాటు కుటుంబసభ్యుల పేరున కూడా నకిలీ పట్టాపాస్‌పుస్తకాలు పెట్టి పెద్ద మొత్తం రుణాల పేరుతో కాజేసిన విషయం వెలుగుచూ సింది. ఇంత జరిగినా అతడిపై వేటు వేయాల్సిన ఉన్నతాధికారులు కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. - దొంగ పట్టాలు... ఆపై రుణాలు.. - తనతోపాటు కుటుంబసభ్యుల పేరిటా లోన్లు - బినామీ పేర్లతో రూ. కోటి వరకు స్వాహా - సహకార శాఖ ఆడిటర్ అవినీతి బాగోతం - అక్రమాలు వాస్తవమేనంటున్న డీసీఓ నిజామాబాద్ అర్బన్ : జిల్లా సహకార శాఖలో అవినీతి పర్వం జోరుగా సాగుతోంది. సహకార శాఖలోని ఆడిటర్ బోగస్ పట్టాలతో లక్షలాది రూపాయల రుణాలు పొందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిఉండి, అదే శాఖలో తనతో పాటు కుటుంబసభ్యుల పేర్లతోనూ నకిలీ పట్టాలు సృష్టించి లోన్ తీసుకున్నారు. ఇలా మొత్తం రూ. కోటి వరకు లోన్ల రూపంలో కాజేశారనే ఆరోపణలున్నారుు. ఇలా జరిగింది... జిల్లా సహకార శాఖలో సుమారు పదేళ్లకు పైబడి ఆడిటర్‌గా అంబర్‌సింగ్ కొనసాగుతున్నాడు. ఇతను తన పేరున, మరో ముగ్గు రు కుటుంబసభ్యుల పేర్లపై నకిలీ పట్టాలు సమర్పించి లోన్ తీసుకున్నాడు. మాక్లూర్, కమ్మర్పల్లి మండలం కొనసముందర్ ప్రాథమిక సహకార సంఘాలలో అక్రమంగా రుణాలు పొందాడు. ఇతను ఆడిటర్‌గా ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్ వ్యవహారాలను పరిశీలించేవారు. దీంతో అందులోని లొసుగులను బయటకు తీసి మాక్లూర్, కొనసముందర్ సహకార సంఘాల సెక్రటరీలను బెదిరించాడు. తనకు సహకార సంఘాలలో రుణ ం కావాలని, దీనికి సంబంధించిన దరఖాస్తులు, పాస్‌పుస్తకాలను అందిస్తానని చెప్పాడు. అదే శాఖలో ఉద్యోగి అరుునందన లోన్ ఇవ్వలేమని కార్యదర్శులు వ్యతిరేకించగా.. ‘ఆడిట్లో మీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చారుు’ అంటూ భయపెట్టడంతో వారు కూడా అతడికి సహకరించారు. కొనసముంద ర్ సొసైటీలో రూ.2.50 లక్షలు, మాక్లూర్ సహకార సంఘంలో రూ.4 లక్షలు, అమ్రాద్ సహకార సంఘంలో రూ.1.50 లక్షలు రుణ ం తీసుకున్నాడు. అతడికి ఏ మాత్రం భూమి లేకున్నా.. తన పేరున, కుటుంబసభ్యుల పేరున అక్రమ పట్టాలు సృష్టించాడు. వీఆర్వో, తహశీల్దార్, ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేశాడు. తనకు అనుకూలంగా ఉన్న సహకార సంఘాల్లో ఈ పత్రాలు పెట్టి రుణం తీసుకున్నాడు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘంలో బినామీ పేర్లు, నకిలీ పట్టాలతో రూ.50 లక్షల వరకు వివిధ పేర్లపై రుణాలు పొందారు. నిజామాబాద్ మండలం మంచిప్ప సహకార సంఘంలో నకిలీ పట్టాలతో రుణ ం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కాలేదు. అలాగే వర్ని, రేంజల్, నందిపేట, నవీపేట, కమ్మర్పల్లి, మాక్లూర్, ఎడపల్లి మండలాల్లో నకిలీ పట్టాలతో బినామీ పేర్లమీద మరికొందరు రుణాలు తీసుకున్నారు. వెలుగులోకి వచ్చిందిలా.. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ సొసైటీ చెర్మైన్ నకిలీ పట్టాల వ్యవహారాన్ని గుర్తించారు. పట్టా పాస్‌పుస్తకాలు కొత్తగా ఉండటం, సంతకాల్లో తేడా ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో ఆడిటర్‌కు సంబంధించిన రుణాల వివరాలను తనీఖీ చేశారు. అరుుతే ఇదంతా 20 రోజుల క్రితమే జరిగినప్పటికీ బయటకు రానీయకుండా ఆడిటర్ తీసుకున్న రూ.2.50 లక్షల రికవరీ చేరుుంచారు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘంలో రుణాలు పొందిన లబ్దిదారుల పట్టాలను చైర్మన్ పరిశీలించగా నకిలీ పట్టాపాస్ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రుణాలు పొందిన జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించగా సుమారు రూ.50 లక్షల వరకు నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు తేలింది. ఈ వ్యవహారంపై చైర్మన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. హుటాహుటిన బదిలీ..! నకిలీ పట్టాపాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన ఆడిటర్‌ను జిల్లా సహకార శాఖ అధికారి శ్రీహరి రెండు రోజుల క్రితమే బదిలీ చేశారు. జిల్లా కేంద్ర సహకార శాఖ కార్యాలయంలో ఆడిటర్‌గా ఉన్న ఆయనను బోధన్ సహకార శాఖ పరిపాలన కార్యాలయానికి పంపించారు. కాగా, ఆడిటర్ అక్రమాలపై అధికారులకు ముందే తెలిసినా పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఉద్యోగి అయి ఉండి సొంత శాఖలోనే సెక్రటరీలను బెదిరించి నకిలీ పట్టాలతో రుణాలు పొందడంపై జిల్లాస్థాయి అధికారులు పెదవివిప్పడం లేదు. ఆడిటర్‌కు సంబంధిత యూనియన్ నేతలు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదని ఓ నాయకుడు చెప్పారు. ఈ వ్యవహారంపై అధికారులు సైతం గత ఏడాదిన్నర కాలంగా వ్యవహారంపై ఎందుకు స్పందించలేదనే అనుమానాలకు తావిస్తోంది. -
ప్రభుత్వోద్యోగి ఇంటిపై ఏసీబీ దాడి: రూ.4 కోట్ల ఆస్తులు గుర్తింపు
వరంగల్ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ప్రభుత్వోద్యోగి ఇమ్మానియల్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లి పట్టణ ప్రణాళిక విభాగంలో పర్యవేక్షణాధికారిగా ఇమ్మానియల్ పనిచేస్తున్నాడు. హన్మకొండ భవానీనగర్‌లో నివాసముంటున్న ఇమ్మానియల్ గతంలో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ బృందం వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాయిబాబాతో కలిసి ఇమ్మానియల్ ఇంటిపై దాడి చేసి రూ. 4 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భవానీనగర్‌లోని ఇల్లు, పక్కనే 800 గజాలలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్, హైదరాబాద్‌లో ఒక అపార్ట్మెంట్, కాజీపేటలో ఒక ఇల్లు, హసన్‌పర్తి మండలంలో 4 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, రూ.30 వేల నగదు, 20 తులాల బంగారం, రెండు ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, క్రెడిట్‌కార్డులు, ఏటీఎంకార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ అకౌంట్లను తెలుసుకోవాల్సి ఉంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. -
ఇదో రకం మోసం..!
- ఇళ్ల స్థలాల పేరిట పిలిచి... ‘ప్రత్యేక హోదా’ కోసం ఆందోళన - రాజుపాలెం నుంచి మహిళలను గుంటూరు రప్పించిన ప్రభుత్వ ఉద్యోగి.. - ఆ వ్యక్తి కోసం ఆరా తీస్తున్న పోలీసులు సాక్షి, గుంటూరు : తాము చేసే ఆందోళనలకు కొందరు ప్రజాసంఘాల నాయకులు మాయమాటలు చెప్పి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నారు. ప్రజా సంఘాల నాయకుల మాటలు నిజమేనని నమ్మి ఆందోళనల్లో పాల్గొంటున్న అమాయక ప్రజలు చివరకు మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనలు గుంటూరు నగరంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సోమవారం నగరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆందోళన కార్యక్రమం జరిగింది. దీంట్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే వినతిపత్రం ఇచ్చేందుకు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఇళ్ల స్థలాల కోసం మీ తరఫున పోరాడుతున్నామని నమ్మించి తమను ఈ కార్యక్రమానికి రప్పించారనీ, ప్రత్యేక హోదా కోసం ఆందోళ చేస్తున్న విషయమే తమకు తెలియదని కొందరు మహిళలు పోలీసుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఓప్రభుత్వ ఉద్యోగి తమను నమ్మించి రాజుపాలెం నుంచి గుంటూరు రప్పించారనీ, అసలు ఇక్క డ ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి మధ్యాహ్న సమయమైందని వారు వాపోయారు. ఏదో కార్యక్రమం కోసం ఆందోళన చేసి ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే రక్షించేదెవరం టూ పోలీసుల వద్ద మహిళలు ఆవేదన చెందినట్లు సమాచారం. విషయం అర్థం చేసుకున్న పోలీసు అధికారులు ఆ ప్రభుత్వ ఉద్యోగి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
మరో ఉద్యమానికి ఉద్యోగులు రెడీ?
-
అనుమతిలేని ఏ ప్రాసిక్యూషన్ నిలబడదు
చెన్నై: నేరశిక్షా స్మృతిలో నిర్దేశించినట్లు తగిన అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వ ఉద్యోగిపై ప్రారంభించే ఏ ప్రాసిక్యూషన్ చర్యా నిలబడదని మద్రాస్ హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. తమిళనాడులోని వేలూరుకు చెందిన డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ కే మస్తాన్ రావు సహా, దక్షిణ రైల్వే అధికారులు కొందరిపై వేలూరుకే చెందిన ఫ్యాక్టరీల విభాగం ఇనస్పెక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదును మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం కొట్టివేశారు. నేరశిక్షా స్మృతిలోని 197వ సెక్షన్ ప్రకారం తగిన అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా చేపట్టే ప్రాసిక్యూషన్ నిలువదని సుప్రీంకోర్టు పేర్కొందని, సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సదరు ప్రాసిక్యూషన్ ప్రక్రియను కొట్టివేయవలసి ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని అరక్కోణం రైల్వే ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో, అగ్నిప్రమాద నిరోధక నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ అక్కడి అధికారులపై వేలూరు ఫ్యాక్టరీల విభాగం ఇనస్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, చట్టప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకుండా కేంద్రప్రభుత్వ ఉద్యోగులైన తమపై ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తూ రైల్వే అధికారులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో ఫిర్యాదీదారు వివేచనతో వ్యవహరించలేదని, లోపాలను సరిచేసుకునే అవకాశాన్ని అధికారులకు ఇవ్వలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా ప్రాసిక్యూషన్ తప్పదన్న బెదిరింపుతో వారికి నోటీసులు జారీ చేశారని, ఈ కారణంతోనే ఫిర్యాదును కొట్టివేయవచ్చని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
శుభకార్యానికి వెళుతూ మృత్యువాత
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :బంధువుల ఇంట జరుగుతున్న శుభ కార్యానికి వెళుతూ ఓ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుని పట్టణానికి చెందిన బిళ్లకుర్తి రవికుమార్ (42) కాకినాడలోని విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. యానాంలో ని బంధువుల ఇంట్లో వివాహం జరుగుతుండడంతో భార్య, ఇద్దరు కుమారులు రెండు రోజుల క్రితమే అక్కడకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం రవికుమార్ మోటార్ బైక్‌పై తుని నుంచి యానాం బయలుదేరాడు. కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని తురంగేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్.. బైక్‌ను ఢీ కొట్టింది. అదుపుతప్పిన అతడు ట్యాంకరు వెనుక చక్రాల కింద పడ్డాడు. ట్యాంకర్ డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని నడపడంతో చక్రాల మధ్యలో ఇరుక్కున్న రవి కుమార్ నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఇంద్రపాలెం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. రవికుమార్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సుమారు 50 మీటర్ల మేర మాంసపు ముద్దలు పడి ఉండడంతో సంఘటనా స్థలం భయానకంగా మారింది. -
తప్పు చేశాం!
వేదిక మా అబ్బాయికి పెళ్లయి ఏడాది దాటింది. ఒక్కగానొక్క కొడుకు. మిగతావాళ్లతో పోలిస్తే కొంచెం గారాబంగానే పెంచాం. నా భర్త గవర్నమెంటు ఉద్యోగి. మా అబ్బాయిని పెద్ద చదువులు చదివించి విదేశాలకు పంపాలనుకునేవాళ్లం. వాడికి మాత్రం ఎలాంటి ఆశలు, ఆశయాలు ఉండేవి కావు. మా గోలపడలేక... పల్టీలు కొడుతూ కష్టపడి డిగ్రీ పూర్తిచేశాడు. తీరిక దొరికితే చాలు క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లడం తప్ప ఉపయోగపడే ఆలోచనేదీ చేసేవాడు కాదు. వాళ్లనాన్నగారు తనకు తెలిసిన చోట ఉద్యోగంలో పెట్టించారు. ఓ మూడునెలల పనిచేసి ‘నాకు నచ్చలేదు... నాకిష్టమైన ఉద్యోగాన్ని నేను వెతుక్కుంటాను’ అని ఉద్యోగం వేటలో పడి ఓ ఏడాది గడిపేశాడు. మధ్యలో వ్యాపారం చేస్తానంటూ... ఏవో రెండు మూడు ప్రయోగాలు చేసి ఊరుకున్నాడు. ఆ వంకతో నా దగ్గర చాలా డబ్బు తీసుకుని వృథా చేశాడు. పెళ్లి చేస్తే... వాడే దారిలో పడతాడని పెళ్లి చేద్దామనుకున్నాం. ముందు మంచి ఉద్యోగంలో పెట్టి తర్వాత పెళ్లి చేయడం మంచిది కదా అని తెలిసినవారి దగ్గర ఉద్యోగంలో చేర్పించాం. అదే నెలలో ఏదో మంచి సంబంధం వస్తే వెంటనే పెళ్లి చేసేశాం. పెళ్లయిన రెండో నెలలో ఉద్యోగం మానేశాడు. తోటి ఉద్యోగితో ఏదో గొడవ కారణంగా కంపెనీవాళ్లే వీణ్ణి ఉద్యోగంలో నుంచి తీసేశారని తర్వాత తెలిసింది. ఉద్యోగం పోయి ఏడాది కావస్తోంది. గట్టిగా మాట్లాడితే వేరు కాపురం అంటాడేమోనని భయం. పోనీ వాడిష్టం అనుకుని ఊరుకుందామంటే కోడలి తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను. ‘మీ అబ్బాయి గురించి మీకు ముందే తెలుసు కదా! అత్తయ్యా... రూపాయి సంపాదన లేకుండా ఇలా ఖాళీగా తిరుగుతుంటే రేపు నా భవిష్యత్తు ఏంటి’ అని మొన్నామధ్య నా కోడలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. ‘వాడే మారతాడమ్మా’ అన్నాను. ‘మారాకనే పెళ్లి చేయకపోయారా...? అంటూ నిలదీసింది. ఆ అమ్మాయి అడిగినదాంట్లో నిజం ఉంది. డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఆ మాత్రం మాట్లాడ్డం తప్పుకాదు. మేం చేసిందే తప్పు. - విజయలక్ష్మి, గుంటూరు -
కూతుళ్లూ పెన్షన్‌కు అర్హులే: కేంద్రం
న్యూఢిల్లీ: మరణించిన ప్రభుత్వోద్యోగి తాలూకు పింఛన్ పొందేందుకు భర్త చనిపోయిన, విడాకులు తీసుకున్న కూతుళ్లు కూడా అర్హులేనని కేంద్రం ప్రకటించింది. సిబ్బంది శాఖ ఇటీవలే ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ అంశంపై పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇటీవల పదేపదే వివరణ కోరుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ సర్క్యులర్‌ను పంపింది. ‘పింఛన్‌ను పిల్లలకు కూడా చెల్లించవచ్చు. ఎందుకంటే వారిని ఉద్యోగిపైనా, అతని/ఆమె భాగస్వామిపైనా ఆధారపడి ఉన్నవారిగానే భావించడం జరుగుతుంది. కనీస కుటుంబ పింఛన్ మొత్తంతో సమానంగా గానీ, అంతకంటే ఎక్కువ గానీ సం పాదన లేని వారిని పిల్లలుగా, తమ తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నవారిగా పరిగణిస్తారు. కాబట్టి ప్రభుత్వోద్యోగి మరణించే నాటికి ఈ నిబంధనల పరిధిలోకి వచ్చే పిల్లలంతా పెన్షన్‌కు అర్హులే. భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న కూతురికీ తండ్రి పింఛన్ పొందేందుకు అర్హత ఉంటుంది’ అని అందులో పేర్కొంది. -
ఫైనాన్స్ మేనేజర్ ఘరానా మోసం
ములుగు, న్యూస్‌లైన్ : ప్రైవేటు ఫైనాన్స్ చేతిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మోసపోయాడు. తాను మొత్తం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ద్విచక్రవాహనంపై సదరు కంపెనీ మేనేజర్ గుట్టుచప్పుడు కాకుండా లోన్ తీసుకోవడంతో అవాక్కయ్యాడు. కాగా, త న పేరిట లోన్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించిన ఉద్యోగిపై మేనేజర్ చిందులు తొక్కుతున్నాడు. నీ పేరిట తీసుకున్న బైక్ లోన్ డబ్బులు మేమే కడుతున్నాం కదా.. నీకేం బాధంటూ బెదిరిస్తున్నాడు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి. ములుగు మండల కేంద్రానికి చెందిన నలువాల నర్సయ్య స్థానిక ప్రభుత్వ గిరిజన హాస్టల్లో కుక్‌గా పనిచేస్తున్నాడు. అయితే తన కుమారుడు ఫ్యాషన్ ప్రో బైక్ కావాలని అడుగడం తో అతడు ములుగులో ఉన్న ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ను ఏడాదిన్న ర క్రితం సంప్రదించాడు. బైక్‌కు మొత్తం *62వేలు అవుతుంద ని, ముందుగా *20వేలు చెల్లిస్తే మిగతా డబ్బు *42వేలు లోన్ ద్వారా చెల్లిస్తామని చెప్పారు. దీంతో నర్సయ్య తొలుత *20 వేలు చెల్లించి ఫైనాన్స్ నిబంధనల మేరకు డాక్యుమెంట్లపై సం తకాలు చేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత మేనేజర్‌ను నర్స య్య కలిస్తే.. నీకు లోన్ మంజూరుకావడం లేదని, పూర్తిచేసిన డాక్యుమెంట్లు కూడా తిరిగి వెనక్కి వచ్చాయని చెప్పాడు. తాను ప్రభుత్వ ఉద్యోగినైనా లోన్ మంజూరు కాకపోవడమేమిటని మేనేజర్‌ను అడిగాడు. దీనిపై మేనేజర్ సమాధానం ఇస్తూ గతంలో ఓ వాహనదారుడికి నువ్వు జమానతు ఇచ్చినందున లోన్ రావడంలేదన్నాడు. అలాగే చెల్లించిన *20 వేలలో తమ కంపెనీ కమీషన్ *5 వేలు పో గా, మిగతా సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని.. లేదంటే మిగతా మొత్తం డబ్బు *42వేలు చెల్లించి బైక్ కొనుగోలు చేసుకోవాలని సూచించాడు. దీంతో చేసేదేమి లేక నర్సయ్య తొ లుత చెల్లించిన *20వేలు పోగా మిగతా *42వేలు చెల్లించి ఫ్యాషన్‌ప్రో బైక్‌ను కొనుగోలు చేశాడు. అనంతరం మేనేజర్ బైక్ రిజిస్ట్రేషన్ కాగితాలను ఆరునెలల తర్వాత ఇచ్చాడు. ఇదిలా ఉండగా, నర్సయ్య పూర్తి డబ్బులు చెల్లించిన వాహనంపై మేనేజర్ గుట్టుచప్పుడు కాకుండా లోన్ తీసుకుని ప్రతీనెల కిస్తీలను చెల్లిస్తూ వస్తున్నాడు. అలాగే వాహనానికి సంబంధించిన ఎలాంటి లెటర్లు నర్సయ్యకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో అతడికి తన వాహనంపై లోన్ ఉన్న విషయం తెలియలేదు. వెలుగులోకి వచ్చింది ఇలా..కాగా, బైక్ కొనుగోలు చేసి ఏడాదిన్నర కావడంతో నర్సయ్య కుమారుడు పాతబండిని అమ్మి పెట్టాలని ఇటీవ ల ఓ కన్సల్టెన్సీని సంప్రదించాడు. దీంతో కన్సల్టెన్సీ నిర్వాహకుడు బైక్ వివరాలను సేకరించాడు. మీరు ఓ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకుని బండిని కొనుగోలు చేశారని, పూర్తి కిస్తీ లు చెల్లిస్తే బైక్‌ను అమ్మి పెడతానని చెప్పాడు. దీంతో అవాక్కయిన నర్సయ్య కుమారుడు ఇంటికి వెళ్లి తండ్రిని నిలదీశాడు. డబ్బులు మొత్తం కట్టిన తర్వాత లోన్ ఉండడమేమిటని వాదించాడు. దీంతో బిత్తరపోయిన నర్సయ్య ఇదెక్కడి గోల అంటూ.. ఫైనాన్స్ మేనేజర్‌ను లోన్ విషయమై నిలదీశాడు. దీనిపై మేనేజర్ మాట్లాడుతూ బైక్ కిస్తీలను తానే చెల్లిస్తున్నానని, మీకు ఎలాంటి బాధ ఉండదని సర్దిచెప్పాడు. తనకు లోన్ మంజూరుకాదని.. డాక్యుమెంట్లు తిరిగి వచ్చాయని.. చె ప్పి ఇప్పుడు వాహనంపై ఎలా లోన్ తీసుకున్నారని నర్సయ్య మేనేజర్‌ను ప్రశ్నించగా అతడిని బెదిరించడం గమనార్హం. కాగా, ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నర్సయ్య తెలిపాడు. ఇదిలా ఉండగా, సదరు మేనేజర్ ఇదే కాకుండా మరికొంతమంది వాహనాలపై కూడా లోన్ తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై మేనేజర్ మాట్లాడుతూ నర్సయ్య ఫ్యాషన్‌ప్రో వాహనంపై ఎలాంటి లోన్ లేదని చెప్పుకొస్తున్నాడు