ములుగు, న్యూస్‌లైన్ :
ప్రైవేటు ఫైనాన్స్ చేతిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మోసపోయాడు. తాను మొత్తం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ద్విచక్రవాహనంపై సదరు కంపెనీ మేనేజర్ గుట్టుచప్పుడు కాకుండా లోన్ తీసుకోవడంతో అవాక్కయ్యాడు. కాగా, త న పేరిట లోన్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించిన ఉద్యోగిపై మేనేజర్ చిందులు తొక్కుతున్నాడు. నీ పేరిట తీసుకున్న బైక్ లోన్ డబ్బులు మేమే కడుతున్నాం కదా.. నీకేం బాధంటూ బెదిరిస్తున్నాడు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి. ములుగు మండల కేంద్రానికి చెందిన నలువాల నర్సయ్య స్థానిక ప్రభుత్వ గిరిజన హాస్టల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. అయితే తన కుమారుడు ఫ్యాషన్ ప్రో బైక్ కావాలని అడుగడం తో అతడు ములుగులో ఉన్న ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ను ఏడాదిన్న ర క్రితం సంప్రదించాడు. బైక్‌కు మొత్తం *62వేలు అవుతుంద ని, ముందుగా *20వేలు చెల్లిస్తే మిగతా డబ్బు *42వేలు లోన్ ద్వారా చెల్లిస్తామని చెప్పారు. దీంతో నర్సయ్య తొలుత *20 వేలు చెల్లించి ఫైనాన్స్ నిబంధనల మేరకు డాక్యుమెంట్లపై సం తకాలు చేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత మేనేజర్‌ను నర్స య్య కలిస్తే.. నీకు లోన్ మంజూరుకావడం లేదని, పూర్తిచేసిన డాక్యుమెంట్లు కూడా తిరిగి వెనక్కి వచ్చాయని చెప్పాడు.
తాను ప్రభుత్వ ఉద్యోగినైనా లోన్ మంజూరు కాకపోవడమేమిటని మేనేజర్‌ను అడిగాడు. దీనిపై మేనేజర్ సమాధానం ఇస్తూ గతంలో ఓ వాహనదారుడికి నువ్వు జమానతు ఇచ్చినందున లోన్ రావడంలేదన్నాడు. అలాగే చెల్లించిన *20 వేలలో తమ కంపెనీ కమీషన్ *5 వేలు పో గా, మిగతా సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని.. లేదంటే మిగతా మొత్తం డబ్బు *42వేలు చెల్లించి బైక్ కొనుగోలు చేసుకోవాలని సూచించాడు. దీంతో చేసేదేమి లేక నర్సయ్య తొ లుత చెల్లించిన *20వేలు పోగా మిగతా *42వేలు చెల్లించి ఫ్యాషన్‌ప్రో బైక్‌ను కొనుగోలు చేశాడు. అనంతరం మేనేజర్ బైక్ రిజిస్ట్రేషన్ కాగితాలను ఆరునెలల తర్వాత ఇచ్చాడు. ఇదిలా ఉండగా, నర్సయ్య పూర్తి డబ్బులు చెల్లించిన వాహనంపై మేనేజర్ గుట్టుచప్పుడు కాకుండా లోన్ తీసుకుని ప్రతీనెల కిస్తీలను చెల్లిస్తూ వస్తున్నాడు. అలాగే వాహనానికి సంబంధించిన ఎలాంటి లెటర్లు నర్సయ్యకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో అతడికి తన వాహనంపై లోన్ ఉన్న విషయం తెలియలేదు.
వెలుగులోకి వచ్చింది ఇలా..కాగా, బైక్ కొనుగోలు చేసి ఏడాదిన్నర కావడంతో నర్సయ్య కుమారుడు పాతబండిని అమ్మి పెట్టాలని ఇటీవ ల ఓ కన్సల్టెన్సీని సంప్రదించాడు. దీంతో కన్సల్టెన్సీ నిర్వాహకుడు బైక్ వివరాలను సేకరించాడు. మీరు ఓ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకుని బండిని కొనుగోలు చేశారని, పూర్తి కిస్తీ లు చెల్లిస్తే బైక్‌ను అమ్మి పెడతానని చెప్పాడు. దీంతో అవాక్కయిన నర్సయ్య కుమారుడు ఇంటికి వెళ్లి తండ్రిని నిలదీశాడు.
డబ్బులు మొత్తం కట్టిన తర్వాత లోన్ ఉండడమేమిటని వాదించాడు. దీంతో బిత్తరపోయిన నర్సయ్య ఇదెక్కడి గోల అంటూ.. ఫైనాన్స్ మేనేజర్‌ను లోన్ విషయమై నిలదీశాడు. దీనిపై మేనేజర్ మాట్లాడుతూ బైక్ కిస్తీలను తానే చెల్లిస్తున్నానని, మీకు ఎలాంటి బాధ ఉండదని సర్దిచెప్పాడు. తనకు లోన్ మంజూరుకాదని.. డాక్యుమెంట్లు తిరిగి వచ్చాయని.. చె ప్పి ఇప్పుడు వాహనంపై ఎలా లోన్ తీసుకున్నారని నర్సయ్య మేనేజర్‌ను ప్రశ్నించగా అతడిని బెదిరించడం గమనార్హం. కాగా, ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నర్సయ్య తెలిపాడు. ఇదిలా ఉండగా, సదరు మేనేజర్ ఇదే కాకుండా మరికొంతమంది వాహనాలపై కూడా లోన్ తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై మేనేజర్ మాట్లాడుతూ నర్సయ్య ఫ్యాషన్‌ప్రో వాహనంపై ఎలాంటి లోన్ లేదని చెప్పుకొస్తున్నాడు
ఫైనాన్స్ మేనేజర్ ఘరానా మోసం
Published Sat, Sep 7 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement