మంచిర్యాల: నిరక్ష్యరాసులతో పాటు అక్షరాశ్యులు కూడా సైబర్ నేరాగాళ్ల వలలోపడి మోసపోతున్నారు. బెజ్జూర్ మండలంలోని కుంటాలమానెపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నైతం లతశ్రీ కౌటాల మండలంలోని ఇప్పలగూడ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ఫేస్‌బుక్‌లో వచ్చిన వ్యాపార ప్రకటనలోని ఫోన్ నంబర్లను సంప్రదించింది.
ధనీ బ్యాంకు పేరుతో 9038683321 నంబర్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఈ నెల 2న రూ.50 లక్షల రుణం మంజూరు చేస్తున్నట్లు ఫోన్‌ద్వారా సందేశం పంపించారు. దీంతో పాటు సైబర్ నేరగాళ్లు ఆధార్, పాన్‌కార్డుతో పాటు ఆమె ఖాతా నంబర్ కలిగిన రూ.50 లక్షల బ్యాంకు చెక్కు వంటి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించారు. వివరాలను పోల్చి చూసిన బాధితురాలు వారిని నమ్మి లావాదేవీలు జరిపారు.
ఆగస్టు 2 నుంచి 11వ తేదీ వరకు పలు దఫాలుగా రూ.1.70 లక్షల నగదును పేటీఎం, ఫోన్‌పేల ద్వారా చెల్లించారు. మరిన్ని చార్జీలు చెల్లిస్తేనే రూ.50 లక్షల రుణం మీ ఖాతాలో జమ అవుతుందని సదరు వ్యక్తులు తెలపడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. కౌటాల ఎస్సై మధుకర్, సీఐ సాధిక్‌పాషాలకు ఫిర్యాదు చేయడంతో సైబర్ విభాగంలో ఫిర్యాదును నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment