సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల వేళ అనూహ్య పరిణా మాలు చోటు చేసుకుంటుండడం ఆసక్తి క లిగిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గె లవాలనే తలంపు రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారానికి దారి తీస్తోంది. ప్రధాన పార్టీల నుంచి ప్ర భుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎంపీ వివేక్ బరిలో ఉండడంతో ను వ్వా నేనా అన్న తీరులో పోరు సాగుతోంది. ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బాల్క సు మన్ పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వివేక్ రాకతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ అధికారికంగా చెన్నూర్ నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరు ఖ రారు కాలేదు. వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో దా దాపు ఆయనకే బీఫాం అన్నట్లుగా పార్టీ వర్గాలు భా విస్తున్నాయి. చెన్నూర్ నుంచి వివేక్ బరిలో ఉంటారనే విషయం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక సీపీఐకి టికెట్ ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ చర్చల దశలోనే పొత్తు ఆగిపోయింది. బీజేపీలో వివేక్ ఉన్నంత కాలం ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం ఉండేది. ప్రస్తుతం సరైన అభ్యర్థి కోసం వెతికే క్రమంలో ఎవరినీ ప్రకటించలేదు. ఆయన పార్టీ మార్పుతో ఇక్కడ బీజేపీ ఇబ్బందిలో పడింది.
పోటాపోటీగా చేరికలు..
ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో చేరికల పర్వం పోటాపోటీగా సాగుతోంది. బీజేపీలోని వివేక్ అనుచర వర్గం భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతోంది. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకి చేరేందుకు ప్లాన్ వేశారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికంగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా భీమారం, జైపూర్ మండలాల్లో అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రామక్రిష్ణాపూర్, చెన్నూరు పట్టణాల్లోనూ చేరికలపై దృష్టి సారిస్తుండడంతో వలసలతో హస్తం పార్టీలో ఊపు వస్తోంది. మందమర్రి పట్టణంలో పలువురు వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే బాటలో మరికొందరు చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పార్టీలో నష్టం జరగకుండా అసమ్మతి నాయకులతో చర్చిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.
బుజ్జగింపులు, హామీలు ఇస్తూ నాయకులతో చర్చలు సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎదురుదాడితో వివేక్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ నెల 7న మందమర్రి పట్టణంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభతో ఊపు తెచ్చేందుకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసి, బీఆర్‌ఎస్‌ను పటిష్టం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్‌ను అంతా సిద్ధం చేస్తున్నారు.
వెనక్కి తగ్గిన ఓదెలు..
వివేక్ రాకతో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీని వీడుతారనే ప్రచారం జరిగినా చివరికి ఆయనతో కలిసి పని చేసేందుకు నిర్ణయించుకన్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి సమక్షంలో నాయకులంతా చర్చలు జరిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అ సంతృప్తులు ఒక్కొక్కరుగా చల్లబ డుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన మా జీ మంత్రి బోడ జనార్దన్, తదితర నాయకులు పార్టీలోనే ఉన్నా రు.
మరోవైపు రాజారమే శ్ తన అనుచరులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పా రు. మరోవైపు బీఎస్పీ నుంచి డాక్టర్ దాసారపు శ్రీనివాస్, టీడీపీ నుంచి సంజయ్, బీజేపీ టికె ట్ కోసం దుర్గం అశోక్ ప్రయత్నాలు చేస్తున్నా రు. మరికొంద రు స్వతంత్ర అభ్యర్థులుగా బరి లో దిగేందుకు ప్రణాళికలు వేశారు. ఈ క్రమంలో జిల్లాలో చెన్నూరు రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి.
ఇవి చదవండి: పాజిటివ్‌గా చెబితే.. ప్రజలు అర్థం చేసుకోవడం లేదు.. అందుకే ఇలా..
Comments
Please login to add a commentAdd a comment