Chennur
-
బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును ఎవరు కూడా ఆపలేరు. అంగ బలం,అర్థ బలం అన్ని ఉన్న నేను అవలీలగా గెలువబోతున్న అంటూ మితిమీరిన విశ్వాసమే చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను నిండా ముంచింది అనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ, సింగరేణి అధికారులను నిర్లక్ష్యంగా చూడటం. వ్యక్తిగత సహాయకులు నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడటం. సీనియర్ నాయకులతో నాకు పనిలేదు. నేను ఎవరితో పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ పార్టీ సీనియర్ నాయకులను పక్కకు పెట్టడం. బాల్క సుమన్ పేరు చెప్పుకొని పలువురు నాయకులు,కార్యకర్తలు సింగరేణి,ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయించడం.తప్పుడు సమాచారం సుమన్ కు చేరవేయడం. అసలయిన విషయాన్నీ చెప్పకుండా దాచిపెట్టడం. నచ్చని నాయకులపై సుమన్ కు చాడీలు చెప్పడం. మందమర్రి,రామకృష్ణపూర్లో సింగరేణి క్వార్టర్ ల విషయంలో సుమన్‌ను నమ్ముకున్న వారికీ కాకుండ, పార్టీ క్యాడర్ లో కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడి వారి బందువులకు క్వార్టర్లను ఇప్పించడం. మందమర్రిలో గిరిజనుల భూములను కబ్జా చేయడం వంటి చర్యలు సుమన్ రెండో విజయానికి అడ్డుగోడల నిలిచాయని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కోటపల్లి మండలంలో రైతులను కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టపరిచినా స్పందించకపోవడంతో ఆ మండల వాసులు సుమన్‌ను వ్యతిరేకించారు. స్థానికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా, హైదరాబాద్ కె ఎక్కువ సమయం ఇవ్వడం కూడా సుమన్‌ను నష్టపరిచిందనే ఆరోపణ కూడా ఉంది. ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్ గా ,పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికినీ నియోజక వర్గం ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదనే అభిప్రాయాలూ సైతం ఉన్నాయి. గెలిచిన వెంటనే మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తా అని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన సుమన్ ఆ హామీని నెరవేర్చకపోవడం కూడా అయన ఓటమికి మరొక కారణమయినదని చెప్పవచ్చు. -
సుమన్‌కు సుడిగుండమే.. ‘చెన్నూరు’ ఆయన పట్టుతప్పుతోందా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు ఈ ఎన్నికలు సుడిగుండంలా మారాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు కొడుకులాంటి వాడినని చెప్పుకునే ఈ విద్యార్థి నాయకుడికి నియోజకవర్గంలో తన పట్టు తప్పుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆశించిన మైలేజీ రాక సొంత పార్టీలోనే విస్మయం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి అప్పటి సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి వివేక్‌పై అనూహ్యంగా గెలవడంతో సుమన్ ప్రజాప్రాతినిధ్య జీవితానికి తొలి అడుగు పడింది. 2018 ఎన్నికల్లో చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కాదని ఎంపీగా ఉన్న సుమన్‌కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో టికెట్‌పై పెట్రోల్ ‘మంటల’ మధ్యలోనే ఎన్నికలు ఎదుర్కొన్నారు. చివరికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ వెంకటేష్నేతపై 28వేల ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం రెండోసారి చెన్నూర్ టికెట్ దక్కించుకుని బరిలో ఉన్నారు. అభివృద్ధి చెప్పినా.. వ్యతిరేకతేనా? జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పోలిస్తే చెన్నూర్‌లోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని ఎమ్మె ల్యే సుమన్, పార్టీ శ్రేణులు చెబుతుంటారు. ప్రత్యేక బుక్లెట్ వేసి మరీ ప్రచారం చేస్తున్నా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ప్రచారం మొదలైన తొలి రోజు నుంచే ఓటర్లు తిరగబడుతున్నారు. ఆర్కేపీ, ఊరు మందమర్రి, చెన్నూరు, గంగారంలో నిరసనలు ఎదురయ్యాయి. చిత్రంగా మందమర్రి, ఆర్కేపీ, చెన్నూరు ఈ మూడు పట్టణాలకు రెండు వందల కోట్ల చొప్పున నిధులు తెచ్చామని చెప్పినా ఆ మే రకు ఓట్లు రాలుతాయా? అంటే చెప్పలేని పరిస్థితి. సుమన్ ప్రజలకు అందుబాటులో లేక, ఆయన పేరు చెప్పి నియోజకవర్గంలో కొందరు నాయకుల దందాలే కొంపముంచే పరిస్థితికి తెచ్చాయని అంటున్నారు. కోటపల్లి పరిధిలో ఓ నాయకుడు చేస్తు న్న భూ కబ్జాలు, బెదిరింపులు, మద్యం దందాలు, సెటిల్మెంట్లు అక్కడి ఓట్లపై దెబ్బ పడుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ వర్గీయులను పక్కకు పెట్టి, కేసులు పెట్టించడంతో వారంతా దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే రెండో సెట్ నామినేషన్ వేసే సందర్భంలో ఎమ్మెల్సీని బతిమాలినా రాకపోతే, చివరకు పార్టీ హైకమాండ్‌తో చెప్పించుకోవల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సొంత నియోజకవర్గ సీనియర్ నాయకుడినే ఆయన లెక్క చేయకపోగా కార్యకర్తలు, నాయకులకు ఫోన్లోనైనా అందుబాటులో ఉండరనే అపవాదు సామాన్య కార్యకర్తల్లో ఉంది. మందమర్రి, ఆర్కేపీలో సింగరేణి క్వార్టర్లు, భూములు ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు, ఆయన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడడంతో వందల కోట్ల అభివృద్ధి ఈ వ్యతిరేకత ముందు నిలవడం లేదు. -
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్తత
-
ఎన్నికల ప్రచారంలో వేగం.. పోటాపోటీగా సాగుతున్న ప్రచారం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల వేళ అనూహ్య పరిణా మాలు చోటు చేసుకుంటుండడం ఆసక్తి క లిగిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గె లవాలనే తలంపు రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారానికి దారి తీస్తోంది. ప్రధాన పార్టీల నుంచి ప్ర భుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎంపీ వివేక్ బరిలో ఉండడంతో ను వ్వా నేనా అన్న తీరులో పోరు సాగుతోంది. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్క సు మన్ పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వివేక్ రాకతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ అధికారికంగా చెన్నూర్ నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరు ఖ రారు కాలేదు. వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో దా దాపు ఆయనకే బీఫాం అన్నట్లుగా పార్టీ వర్గాలు భా విస్తున్నాయి. చెన్నూర్ నుంచి వివేక్ బరిలో ఉంటారనే విషయం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక సీపీఐకి టికెట్ ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ చర్చల దశలోనే పొత్తు ఆగిపోయింది. బీజేపీలో వివేక్ ఉన్నంత కాలం ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం ఉండేది. ప్రస్తుతం సరైన అభ్యర్థి కోసం వెతికే క్రమంలో ఎవరినీ ప్రకటించలేదు. ఆయన పార్టీ మార్పుతో ఇక్కడ బీజేపీ ఇబ్బందిలో పడింది. పోటాపోటీగా చేరికలు.. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చేరికల పర్వం పోటాపోటీగా సాగుతోంది. బీజేపీలోని వివేక్ అనుచర వర్గం భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతోంది. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకి చేరేందుకు ప్లాన్ వేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికంగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా భీమారం, జైపూర్ మండలాల్లో అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రామక్రిష్ణాపూర్, చెన్నూరు పట్టణాల్లోనూ చేరికలపై దృష్టి సారిస్తుండడంతో వలసలతో హస్తం పార్టీలో ఊపు వస్తోంది. మందమర్రి పట్టణంలో పలువురు వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే బాటలో మరికొందరు చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పార్టీలో నష్టం జరగకుండా అసమ్మతి నాయకులతో చర్చిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. బుజ్జగింపులు, హామీలు ఇస్తూ నాయకులతో చర్చలు సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎదురుదాడితో వివేక్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ నెల 7న మందమర్రి పట్టణంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభతో ఊపు తెచ్చేందుకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసి, బీఆర్ఎస్ను పటిష్టం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్‌ను అంతా సిద్ధం చేస్తున్నారు. వెనక్కి తగ్గిన ఓదెలు.. వివేక్ రాకతో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీని వీడుతారనే ప్రచారం జరిగినా చివరికి ఆయనతో కలిసి పని చేసేందుకు నిర్ణయించుకన్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి సమక్షంలో నాయకులంతా చర్చలు జరిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అ సంతృప్తులు ఒక్కొక్కరుగా చల్లబ డుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన మా జీ మంత్రి బోడ జనార్దన్, తదితర నాయకులు పార్టీలోనే ఉన్నా రు. మరోవైపు రాజారమే శ్ తన అనుచరులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పా రు. మరోవైపు బీఎస్పీ నుంచి డాక్టర్ దాసారపు శ్రీనివాస్, టీడీపీ నుంచి సంజయ్, బీజేపీ టికె ట్ కోసం దుర్గం అశోక్ ప్రయత్నాలు చేస్తున్నా రు. మరికొంద రు స్వతంత్ర అభ్యర్థులుగా బరి లో దిగేందుకు ప్రణాళికలు వేశారు. ఈ క్రమంలో జిల్లాలో చెన్నూరు రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవి చదవండి: పాజిటివ్‌గా చెబితే.. ప్రజలు అర్థం చేసుకోవడం లేదు.. అందుకే ఇలా.. -
నా భార్యది ఆత్మహత్య కాదు.. ఇదిగో వినండి.. వాయిస్ రికార్డ్!
సాక్షి, కుమురం భీం: చెరువులో దూకి అధ్యాపకురాలు బలవన్మరణం చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ వాసుదేవరావు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ మండలానికి చెందిన పసునూటి తిరుమలేశ్వరి (32) చెన్నూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం విధుల్లో భాగంగా కళాశాలకు వెళ్లి రిజిష్టర్‌లో సంతకం చేసింది. అనంతరం బయటకు వెళ్తుండగా తొటి ఉపాధ్యాయురాలు ప్రశ్నించడంతో సెల్‌ఫోన్ మర్చిపోయాను.. ఇంటికి వెళ్లివస్తానని చెప్పింది. 10 గంటల ప్రాంతంలో పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త సంపత్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీయించి పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కీలకంగా మారిన వాయిస్ రికార్డు.. ఆత్మహత్యకు ముందు తిరుమలేశ్వరి తన మృతికి కళాశాల ప్రిన్సిపాల్, ఏటీసీ, పీఈటీతో పాటు మరో ఉపాధ్యాయురాలు కారణమని సెల్ఫోన్లో వాయిస్ రికార్డు చేసింది. ఇదే కేసులో కీలకంగా మారింది. వాయిస్ రికార్డు ఆధారంగా మృతురాలి భర్త సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. బంధువుల ఆందోళన! మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు కుమారస్వామి, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి గురుకుల కళాశాల అధికారులు వచ్చే వరకు పోస్ట్‌మార్టం చేయవద్దని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఆర్సీవో స్వరూపారాణి వచ్చి మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమలేశ్వరి ఉద్యోగాన్ని భర్త సంపత్‌కు ఇస్తామని, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ కుమార్తె పేరున అందజేస్తామని రాసివ్వడంతో ఆందోళన విరమించారు. ప్రిన్సిపాల్, ఏసీటీ, మరో ముగ్గురిపై కేసు నమోదు.. అధ్యాపకురాలి మృతి కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలేశ్వరి ఉద్యోగ రీత్యా చెన్నూర్‌లోని ఆదర్శనగర్‌లో నివాసం ఉంటోంది. నాలుగేళ్లుగా గురుకుల కళాశాల లెక్చరర్‌తో పాటు మెస్ కేర్‌టేకర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కొన్ని రోజులుగా ప్రిన్సిపాల్ రాజమణి, ఏసీటీ స్రవంతి, పీఈటీలు రేష్మ, శిరీష, మరో ఉపాధ్యాయురాలు పుష్పలత వేధింపులకు గురిచేస్తున్నారని మృతురాలి భర్త సంపత్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
దెయ్యం పట్టిందని క్షుద్రపూజలు.. యువకుడు మృతి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో క్షుద్రపూజలు వికటించి ఓ యువకుడు మృతిచెందాడు. చెన్నూర్ పట్టణం బొక్కగూడెం కాలనీకి చెందిన దంపతులు దాసరి లచ్చన్న, లక్ష్మి కుమారుడు మధు (33) గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచిర్యాలలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మధుకు చేతబడి అయిందని బంధువులు చెప్పడంతో శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్ ప్రాంతానికి చెందిన క్షుద్ర మాంత్రికుడిని ఆశ్రయించారు. ఇంటి వద్ద పూజల్లో భాగంగా మధుపైనుంచి కోడిని తిప్పడంతో అది చనిపోయింది. దీంతో దెయ్యం పట్టిందని, పెద్ద పూజలు చేయాలంటూ చెప్పడంతో ఆదివారం చెన్నూర్ గోదావరి ఒడ్డున మేకతోపాటు పలు క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రితో వెళ్లారు. పూజలు చేసే క్రమంలో మాంత్రికుడు మధుకు గుగ్గిలం (సాంబ్రాణి) పొగ వేసి పైనుంచి దుప్పటి కప్పినట్లు తెలిసింది. పొగతో మధు స్పృహ కోల్పోయి కాసేపటికే మృతిచెందాడు. దీంతో సదరు మాంత్రికుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రి ఇంటికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియల కోసం గోదావరి నదికి తీసుకెళ్లారు. పోలీసులకు విషయం తెలియడంతో నది వద్దే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ వాసుదేవరావును సంప్రదించగా.. క్షుద్రపూజలతో మృతిచెందాడన్న సమాచారం మేరకు పోస్టుమార్టం చేయించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని వివరించారు. చదవండి: చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి -
మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో ఆపరేషన్ చేసి.. కడుపులో కాటన్ పాడ్ వదిలేశారు వైద్యులు. దీంతో ఆ బాలింత ప్రాణాల మీదకు వచ్చింది. ఐదురోజుల కిందట.. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆ సమయంలో ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి.. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాటన్ ప్యాడ్‌ను వైద్యులు ఆమె కడుపులో వదిలేశారు. ఈ క్రమంలో ఆ బాలింత తీవ్ర అస్వస్థతకు గురవుతూ వచ్చింది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి మరింత దిగజారండంతో.. చెన్నూర్ అసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు కీర్తి లయను పరిశీలించి.. ఆపై ఆపరేషన్ చేసి కాటన్ పాడ్‌ను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బహిరంగంగా చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేననని, తనని పంపింది తానేనని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి తెలిపారు. చెన్నూర్‌లో ప్రజాశీర్వాద. ర్యాలీలో సుమన్ మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్‌లో మనవాళ్లు ఉన్నారు. వాళ్లను కాంగ్రెస్‌లోకి పంపించింది నేనే. ఆ కాంగ్రెస్ నాయకులు కూడా.. ఎన్నికల తర్వాత మన పార్టీలోకి వస్తారు. గతంలో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ వెంకటేశ్ మన పార్టీలోకే వచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కూడ బీఆర్ఎస్కే వస్తారు.. ..ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రచారం కోసం వస్తే సహకరించండి. వాళ్ల ప్రచారాన్ని అడ్డుకోవొద్దు అని కార్యకర్తలను ఉద్దేశించి సుమన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో తన బినామీలు ఉన్నారన్న బాల్క సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. -
చెన్నూరు (SC) రాజకీయ చరిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?
చెన్నూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత బల్క సుమన్ విజయం సాదించారు. 2014లో ఆయన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన 2018లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ కు చెందిన బొర్లకుంట వెంకటేష్ నేతపై 28126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదేలు కు టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు. అది కొంత గొడవ అయినా, ఆ తర్వాత సర్దుకుని బల్క సుమన్ గెలుపొందారు. నల్లాల ఓదేలు మూడోసారి.. ఆ తర్వాత రోజులలో వెంకటేష్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ మూడోస్థానం ఆర్పిఐ కి చెందిన సంజీవ్ కు వచ్చింది. ఆయనకు 5274 ఓట్లు వచ్చాయి. 2014లో టిఆర్ఎస్ నేత నల్లాల ఓదేలు మూడోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ఐ ప్రత్యర్ది మాజీ మంత్రి వినోద్‌ను ఓడిరచారు. పెద్దపల్లి ఎమ్.పి వివేక్ సోదరుడు అయిన ఈయన కొంతకాలం క్రితం వరకు టిఆర్ఎస్ లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌ఐలో చేరారు. ఆ తర్వాత వినోద్ బిఎస్పి తరపున బెల్లంపల్లిలో 2018లో పోటీచేసి ఓడిపోతే, వివేక్ బిజెపి పక్షాన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చెందారు. ఓదేలు రెండువేల తొమ్మిదిలో గెలుపొంది, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటు అయిన నేపద్యంలో తిరిగి 26164 ఓట్ల తేడాతో మూడోసారి ఘన విజయం సాధించారు. 2018లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. 1962లో నుంచి ఏర్పడిన చెన్నూరు అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందితే, తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు గెలవగా మూడుసార్లు టిఆర్ఎస్ విజయం సాధించింది. 1983 తరువాత ఒక్కసారే కాంగ్రెస్ ఐ గెలవగలిగింది. సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం.. : మహాకూటమిలో భాగంగా టిఆర్ఎస్ 2009లో పోటీచేసి గెలవగా, ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం సాదించింది. ప్రముఖ కాంగ్రెస్ నేత కోదాటి రాజమల్లు ఇక్కడ మూడుసార్లు గెలిస్తే, అంతకుముందు సిర్పూరులో ఒకసారి, లక్సెట్టిపేటలో మరోసారి గెలిచారు. టిడిపి నేత బోడ జనార్దన్ నాలుగుసార్లు విజయం సాధించగా, ప్రముఖ కార్మికనేత ఏడుసార్లు ఎమ్‌పిగా నెగ్గిన జి. వెంకటస్వామి కుమారుడు వినోద్ 2004లో ఇక్కడ గెలిచి, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడు కాగలిగారు. కోదాటి రాజమల్లు జలగం క్యాబినెట్లో ఉండగా, జనార్థన్ 1989లో ఎన్టిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. చెన్నూరు(ఎస్సీ)లో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే.. : -
వైరల్ వీడియో: వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్‌పైనే తాళి కట్టాడు
-
వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్‌పైనే తాళి కట్టాడు
సాక్షి, మంచిర్యాల: అమ్మాయిది నిరుపేద కుటుంబం. అందుకే పెళ్లి అయినా ఘనంగా చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వివాహానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు పెళ్లి కూతురు ఆస్పత్రి పాలైంది. ఆ పెళ్లి కొడుకు వధువు కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆసుపత్రి బెడ్‌పైనే వధువుకు తాళి కట్టాడు వరుడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లంబాడిపల్లికి చెందిన శైలజకు.. భూపాలపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ముహూర్తం. అయితే.. బుధవారం రాత్రి వధువుకు కడపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే.. ఖర్చు చేసి చుట్టాలందరినీ పిలిపించి.. వివాహ వేడుకను వాయిదా వేయడానికి పెళ్లి కొడుక్కి మనస్సు రాలేదు. అందుకే.. పెద్దలను ఒప్పించాడు. ఆపై ఆస్పత్రి వైద్యులతో మాట్లాడితే.. వాళ్లూ సంతోషంగా అంగీకరించారు. వాళ్ల సమక్షంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఆ జంట. -
ఫోటో షూట్ కోసం వెళ్లి.. గోదావరిలో ఇద్దరు టీచర్లు గల్లంతు..
సాక్షి, మంచిర్యాల: వారు ముగ్గురూ ఉపాధ్యాయులు. వృతి నిమిత్తం కేరళ నుంచి వచ్చారు. చెన్నూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఫోటోషూట్, సరదాగా గడిపేందుకు ముగ్గురూ గోదావరి నది వద్దకు వెళ్లారు. ముగ్గురూ కలిసి నదీ తీరంలో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరు బయటకు వచ్చారు. ఈ విషాద ఘటన కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో జరిగింది. ఎస్సై చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కేరళకు చెందిన టోనీ, బిజూ, ఆంటోనీ సరదా కోసం ఆదివారం గోదావరి తీరానికి వెళ్లారు,. ఫోటో షూట్ అనంతరం నదిలో ఈతకొడుతుండగా బిజూ, టోనీ గల్లంతయ్యారు. ఆంటోనీ ఒడ్డుకు చేరారు. వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం వెతుకున్నారు. -
టీఆర్ఎస్కు గుడ్ బై.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం టీపీసీసీ చీఫ్ నేతృత్వంలో వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిద్దరికీ పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే, భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్‌గా మరో రెండేళ్ల కాలం ఉండటం విశేషం. ఇక, నల్లాల ఓదెలు 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ప్రభుత్వ విప్‌గా కూడా ఓదెలు పనిచేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణకు ప్రధాని మోదీ.. బీజేపీలో జోష్ Ex MLA Nallala Odelu garu & his wife Mancherial ZP chairperson Bhagyalakshmi garu joined Congress today in Delhi in presence of AICC Gen sec, Smt @priyankagandhi and TPCC president shri @revanth_anumula. pic.twitter.com/pUlSvcdgFk — Telangana Congress (@INCTelangana) May 19, 2022 -
మా కుమార్తె ఏం తప్పు చేసింది.. ఎందుకు తీసుకెళ్లరు
సాక్షి, కడప(చెన్నూరు): అత్త, భర్త పెట్టే వేధింపులు భరించలేకపోవడంతోపాటు సంసారానికి తీసుకెళ్లడంలేదని ఓ వివాహిత ముండ్లపల్లె గ్రామంలోని అత్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామనపల్లె గ్రామానికి చెందిన పెడబల్లి సుబ్బారెడ్డి, సరోజనమ్మ రెండో సంతానమైన సుస్మితను ముండ్లపల్లె గ్రామానికి చెందిన బండి వెంకట కృష్ణారెడ్డి, మాధవిల కుమారుడు బండి సురేంద్రనాథ్‌రెడ్డికి ఇచ్చి పెద్దల సమక్షంలో 2020 ఆగస్టు 5వ తేదీన వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు ఇచ్చారు. వివాహమైనప్పటి నుంచి అత్త మాధవి, భర్త సురేంద్రనాథ్‌రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని సుస్మిత వాపోయింది. వివాహమైన రెండు నెలల నుంచే బిడ్డలు పుట్టలేదని, పుట్టకపోతే నా కుమారుడికి వేరే పెళ్లి చేస్తామని అత్త నన్ను మానసిక ఇబ్బందులకు గురి చేసేదని చెప్పారు. తాను గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లానన్నారు. బాబు పుట్టి తొమ్మిది నెలలైనా అత్త, భర్త ఇంటికి తీసుకెళ్లలేదని వాపోయింది.మా అమ్మానాన్నలు పెద్ద మనుషులను పంపించి తనను తీసుకెళ్లాలని చెప్పినప్పటికీ వాళ్లు ససేమిరా అన్నారన్నారు. తమ కుమార్తెను ఎందుకు తీసుకెళ్లరని, ఏ తప్పు చేసిందో చెప్పాలని నిలదీయడంతో వారు మండ్లపల్లె నుంచి కడపకు వెళ్లారన్నారు. చదవండి: (ఆ దంపతులేమయ్యారు?.. దారి తప్పి తప్పారా లేక మరేదైనా..!) తన భర్తను అత్త చెప్పుచేతల్లో పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తోందని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంబీఏ వరకు చదివానని, బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేశానని చెప్పారు. తనను ఉద్యోగం మాన్పించిందన్నారు. తన భర్తకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని, నెలకు రూ.30 వేలు జీతం అని తెలిసి కూడా ఉద్యోగం వద్దని, ఇంటి వద్దనే వ్యాపారం చేసుకోమని సలహా ఇచ్చిందని సుస్మిత తెలిపారు. మా అత్త ఎందుకు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తోందో తెలియడంలేదన్నారు. ఇప్పుడు తొమ్మిది నెలల పసికందును కూడా చూడలేదంటే వారెంత కర్కోటకులో అర్థం చేసుకోవవచ్చన్నారు. విజేత మహిళా మండలి అధ్యక్షురాలి సంఘీభావం సుస్మితకు విజేత మహిళా మండలి అధ్యక్షురాలు అరుణకుమారి సంఘీభావం తెలిపి అండగా నిలిచారు. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. బాధితురాలు సుస్మిత సమస్య తన దృష్టికి రావడంతో ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి భార్యాభర్తలిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
మున్సిపల్ అధికారుల దౌర్జన్యం.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నూర్: మున్సిపాలిటీ అనుమతితో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షెడ్డును కూల్చివేస్తామని మున్సిపాల్ అధికారులు దౌర్జన్యానికి పాల్పడడంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన చెన్నూర్ పట్టణంలో గురువారం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల అస్నాద రోడ్డులో జిల్లెల సమత షెడ్డు వేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటోంది. వ్యాపార అనుమతి కోసం మున్సిపాలిటీలో రూ.1,000 చెల్లించి లైసెన్స్ కూడా తీసుకుంది. లైసెన్స్ గడువు ఈ ఏడాది మార్చి 31వరకు ఉంది. మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహిజొద్దీన్ సిబ్బంది, జేసీబీ తీసుకుని గురువారం షాపు వద్దకు వచ్చారు. అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారని, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ షెడ్డే తనకు జీవనాధారమని, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తే రోడ్డున పడతానని సమత వేడుకుంది. దీంతో రెండు రోజులు గడువు ఇస్తున్నామని, షెడ్డు తొలగించకపోతే మళ్లీ వచ్చి కూల్చేస్తామని తెలిపి వెళ్లిపోయారు. షెడ్డు తొలగిస్తే జీవనోపాధి పోతుందని మనస్తాపం చెందిన సమత పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు సమతను స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల అసుపత్రికి తీసుకెళ్లారు. చదవండి: బస్సులోనే గుండె పోటు: జగిత్యాలకు చెందిన మహిళ మృతి అధికారులు కూల్చివేసేందుకు వెళ్లిన షెడ్డు ఇదే.. పరస్పరం ఫిర్యాదు.. మున్సిపల్ అధికారులు షెడ్డు కూల్చివేస్తామని, మహిళ అని చూడకుండా దౌర్జన్యానికి పాల్పడడంతో సమత పురుగుల మందు తాగిందని, బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు మమత, ఆమె కుటుంబ సభ్యులు అటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ ఖాజామోహీజొద్దీన్ ఫిర్యాదు చేసినట్లు చెన్పూర్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చదవండి: కేంద్ర బడ్జెట్లో బీసీలకు లక్షకోట్లు కేటాయించండి నోటీసులు ఇచ్చాం... అక్రమ కట్టడాలను తొలగించాలని గతంలో రెండుసార్లు సమతకు నోటీసులు ఇచ్చాం. అక్రమ కట్టడాలు కూల్చివేతలో భాగంగా గురువారం షెడ్డు తొలగించాలని చెప్పడం జరిగింది. మరో రెండు రోజులు గడువు సైతం ఇచ్చాం. మా విధులను మేము నిర్వహించాం. దౌర్జన్యం చేయలేదు. జిల్లా ఉన్నతాధికారుల అదేశాల మేరకు అక్రమ కట్టడాలు తొలగించకతప్పదు. – ఖాజా మోహిజొద్దీన్, -మున్సిపల్ కమిషనర్, చెన్నూర్ -
చెన్నూరు ఆర్బీకేకు ఐఎస్వో సర్టిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలోనే రైతులకు సమస్త సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అరుదైన గౌరవం లభించింది. దశల వారీగా ఆర్బీకేలు ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం ఫలించే దిశగా అడుగుపడింది. ఏడాదిన్నరగా అత్యుత్తమ సేవలందిస్తున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు రైతు భరోసా కేంద్రానికి ఐఎస్వో సర్టిఫికేషన్–9001–2015 దక్కింది. ఇటీవల చెన్నై నుంచి వచ్చిన ఐఎస్వో ఏజెన్సీ బృందం ఈ కేంద్రాన్ని సందర్శించింది. రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, పారదర్శకంగా అందిస్తున్న సేవలను ప్రామాణికంగా తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఈ కేంద్రం ఉందని నిర్ధారించింది. ఆ మేరకు చెన్నూరు ఆర్బీకేకి ఐఎస్వో సర్టిఫికేషన్ జారీ చేసింది. చెన్నూరు ఆర్బీకే ప్రత్యేకతలివే.. చెన్నూరు ఆర్బీకే పరిధిలో 1,600 మంది రైతులుండగా 3 వేల ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. రూ.21.80 లక్షలతో నిర్మించిన నూతన భవనంలో రైతులకు సేవలందిస్తున్నారు. గతేడాది 267 మందికి 44.5 ఎంటీల యూరియా, 45 మందికి 105 బస్తాల పచ్చిరొట్ట, 20 మందికి 30 బస్తాల జీలుగు విత్తనాలు, 40 మందికి 75 బస్తాల వరి విత్తనాలు పంపిణీ చేశారు. సిద్ధారెడ్డిపాళెం, కట్టుబడిపాళెం గ్రామాల్లోని 60 మంది రైతుల క్షేత్రాల్లో రెండు పొలంబడులు నిర్వహించారు. రూ.9.52 కోట్ల అంచనా వ్యయంతో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన, సున్నావడ్డీ పంట రుణాలు, పంటల బీమా వంటి పథకాల ద్వారా ఆర్బీకే పరిధిలో అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చారు. ఆర్బీకేలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 8.78 కోట్ల విలువైన 1.15 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. -
కరోనాతో యువ వైద్యుడు మృతి
కోటపల్లి (చెన్నూర్): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన యువ వైద్యుడు రావుల రాజేశ్ (30) గురువారం కరోనా వైరస్‌తో మృతిచెందాడు. రాజేశ్ కరోనా బారిన పడి తొమ్మిది రోజులుగా హన్మకొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి రాజేశ్ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రాజేశ్ ఫాండీ అనే ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును పూర్తి చేసి హన్మకొండలో స్థిరపడ్డాడు. నాలుగేళ్లుగా అక్కడే మాక్స్‌కేర్ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. అతను వ్యాక్సిన్ వేసుకుని ఉంటే వ్యాధి తీవ్రత ఇంతగా ఉండేది కాదని బంధువులు పేర్కొన్నారు. రాజేశ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు చదవండి: ఢిల్లీకి ‘ఊపిరి’: ఆక్సిజన్‌పై కీలక ప్రకటన -
కలకలం రేపిన బాల్క సుమన్ వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల : కేవలం ఎన్నికల కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొండి చేస్తున్నారని, అడ్డందిడ్డం మాట్లాడుతున్న ఆయన నాలుక కోస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వానకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రతిగింజ కొన్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం వారిని నట్టేట ముంచే చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలకర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు, విప్ హాజరయ్యారు. ఢిల్లీలో రైతులు చలికి వణుకుతూ.. చట్టాల రద్దుకోసం దీక్ష చేస్తుంటే కేంద్రం చర్చల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్రం మాత్రం కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని తాకట్టుపెడుతోందని విమర్శించారు. (పీసీసీ: కలకలం రేపిన రేవంత్ వ్యాఖ్యలు) బండి సంజయ్ గుడులు, బడులు, ఇండియా, పాకిస్తాన్ పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నికల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. కేసీఆర్ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వల్లనే బండికి రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరీంనగర్‌కు అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ త్రిబుల్ ఐటీ తీసుకొస్తే.. దానిని కర్ణాటకలోని రాయచూర్‌కు తరలించారని, ఎంపీగా ఉన్న బండి ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్‌పై లేని పోని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులను మహారాష్ట్రలోని బాల్‌ఠాక్రే శివసేన అనుచరుల శివసేన తరహ దాడులు చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలంగా మారాయి. టీఅర్ఎస్ ప్రజాప్రతినిధులు పరుష వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలలో హీట్ పుట్టించారు. మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏలా స్పందిస్తారో చూడాలి. (రేవంత్‌కు షాక్.. పీసీసీపై అనూహ్య నిర్ణయం!) ఉద్యమకారులను గుర్తిస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తున్నారని, ఆలస్యమైనా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారని మంత్రి గంగుల అన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో 1980లో రైతులు ఎదుర్కొన్న నష్టాలు, కష్టాలు పునరావృతం అవుతాయన్నారు. మంత్రి ఐకే.రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీంసాగర్కు నీళ్లు వచ్చాయని, ఇప్పుడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందని పేర్కొన్నారు. విప్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నుంచి ఎలాంటి నిధులూ అందడం లేదని, కానీ.. బండి సంజయ్ మాత్రం కేసీఆర్‌పై అసత్యపు ఆరోపణలు చేస్తూ దొంగే దొంగదొంగ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే కరీంనగర్ గడ్డపైనే బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. అంగీలు మార్చినట్లు రంగు మార్చే నాయకుడు ఒకరు, ప్రజాసమస్యలు, అభివృద్ధి అంటే తెలియకుండా.. వందల కోట్లు సంపాదించుకుని వచ్చిన మరో నాయకుడు రోజుకో ఊరు తిరుగుతున్నారని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. త్వరలో చెన్నూర్ డివిజన్ కేంద్రంగా మందమర్రి, భీమారం, జైపూర్ మండలాలకు కొత్త వ్యవసాయ మార్కెట్‌యార్డు నిర్మాణం, కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాట్లాడుతూ రైతువేదికలు పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రం బంగారు తెలంగాణ, ప్రాజెక్టులతో జలకసంతరించుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రం 2014కు ముందు ఎలా ఉందో..? ఇప్పుడు ఎలా ఉందో గ్రహించాలని సూచించారు. ప్రమాణ స్వీకారానికి జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్యెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా పల్లె భూమేష్, వైస్‌చైర్మన్‌గా గోపతి లస్మయ్య, డైరెక్టర్లుగా అన్కం లక్ష్మి, తోకల సురేష్, తిప్పని తిరుపతి, జి, భీమయ్య, పి. ప్రభకార్, ఎండీ.షాబీర్ అలీ, అశోక్ కుమార్లడ్డా, కే.సురేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. పాలకవర్గాన్ని డీసీఎంస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లాఅధ్యక్షులు మోటపలుకుల గురువయ్య, గ్రంథాలయ చైర్మన్ రేణుగుంట్ల ప్రవీణ్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, సహకార సంఘం చైర్మన్ వెంకటేష్ అభినందించారు. -
చెన్నూర్‌లో వింత శిశువు జననం
సాక్షి, చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. కానీ పుట్టిన గంటకే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు అరుణశ్రీ వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ప్రియాంక శనివారం ఉదయం ప్రసూతి కోసం ఆస్పత్రిలో చేరింది. సాధారణ ప్రసవంలో మగ శిశువు పుట్టింది. శిశువు నుదుటిపైన ఒంటి కన్నులాంటి అవయవం ఉండటంతో గంటకే మృతి చెందింది. జన్యుపరమైన లోపంతో ఇలాంటి వింత ఆకారంలో శిశువులు పుడుతారని వైద్యులు తెలిపారు. ఆసంపల్లి ప్రియాంక శంకర్ దంపతులకు మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది, రెండో కాన్పులో మగ బిడ్డ వింత రూపంతో పుట్టడంతో పాటు గంటకే మృతి చెందడంతో దంపతులు కన్నీటి పర్యాంతమయ్యారు. (నాడు తల్లి.. నిన్న తండ్రి మృతి) -
భూతవైద్యుడితో పాటు సహకరించిన వ్యక్తుల అరెస్టు
జైపూర్(చెన్నూర్): భూత వైద్యం పేరిట బాలింతను చింత్రహింసలకు గురిచేసిన మాంత్రికుడు, అతడికి సహకరించిన వ్యక్తులను మంగళవారం జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. భూతవైద్యం నెపంతో మండలంలోని కుందారం గ్రామంలో బాలింతను చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. భూతవైద్యంపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ భూపతి నరేందర్, శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాలను వెల్లడించారు. కరీంగనర్ జిల్లా శంకరపట్నం మండలం గడ్డపాక గ్రామానికి చెందిన కనుకుట్ల రజిత, జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్‌లు ప్రేమించుకొని గత ఏడాది మంచిర్యాల ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం మూడు నెలల పాప కూడా ఉంది. రజిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం.. ప్రేమవివాహం కావడంతో కట్నం తీసుకురాలేదన్న కోపంతో రజితను ఎలాగైన వదిలించుకోవాలని రజిత భర్త మల్లేశ్, అతని కుటుంబ సభ్యులు రజిత బంధువు పులికోట రవీందర్‌తో కలిసి పథకం రచించారు. దీనికి జమ్మికుంట మండలం శాయంపేట గ్రామానికి చెందిన దొగ్గల శ్యామ్ అనే భూతవైద్యుడిని సంప్రదించారు. గతనెల 21న కుందారం గ్రామంలోని మల్లేశ్ ఇంటికీ రవీందర్, శ్యామ్‌లు వచ్చి రజితకు దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించాలని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రజిత భర్త మల్లేశ్ తన ఫోన్లో చిత్రీకరించాడు. రజితకు వెంటనే చికిత్స అందించకుండా మంత్రాల నెపంతో కాలయాపన చేయడంతో రజిత తన సోదరుడు సురేశ్‌కు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమెను వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంగనర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిన రజిత ఆప్పత్రిలోనే మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. కేసులో ప్రధాన నిందితులు ఏ–1 దొగ్గల శ్యామ్(భూత వైద్యుడు), ఏ–2 పులికోట రవీందర్ (రజిత చిన్నాన్న), ఏ–3 సెగ్యం మల్లేశ్ (రజిత భర్త)లను అరెస్టు చేసి వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. -
తోటి వాళ్లంతా పని చేస్తున్నారు.. నీవు మాత్రం !
సాక్షి, జైపూర్(ఆదిలాబాద్) : జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన సౌదాని రాజశేఖర్(21)అనే యువకుడు తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఎస్సై గంగరాజాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..టేకుమట్లకు చెందిన లీల–మల్లేశ్ దంపతుల కుమారుడు రాజశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. రాజశేఖర్‌కు దేవుడి పూనకం రావడం.. తోటి వాళ్లు పని చేస్తున్నారు నీవు పని లేకుండా ఖాళీగా ఉంటున్నావు అని తండ్రి మల్లేశ్ ఈనెల 6న ఇంట్లో మందలించాడు. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి టేకుమట్ల సమీపంలో గోదావరి నదిలో దూకాడు. మూడు రోజులకి మృతదేహం టేకుమట్ల గోదావరి ఒడ్డుకు చేరుకోవడం స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్సై గంగరాజాగౌడ్ పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. (దారుణం: ఆగిన లిఫ్టు.. ఆ సమయంలో..) -
చేర్యాల కవికి సత్కారం
సాక్షి, చేర్యాల (సిద్దిపేట): మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన జాతీయ బహుభాషా కవి సమ్మేళనంలో మండల పరిధిలోని గుర్జకుంట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రేణుకుంట్ల మురళికి ‘కళాత్మ’ బిరుదుతో పాటు పురస్కారాన్ని అందించారు. కవి, గాయకుడిగా పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి రాషష్ట్ర, జాతీయ అవార్డులు గ్రహించి మాతృభాష పరిరక్షణకు కట్టుబడి తనకలం, గళంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మురళి ఇటీవల జరిగిన మాతృభాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ‘మన భాష-శ్వాస’ కవితను ఆలపించినందుకు అభినందిస్తూ ‘కళాత్మ బిరుదు’ ‘భాషాశ్రీ’ పురస్కారంతో మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు బొడ్డు మహేందర్, తెలంగాణ భాష-యాస గ్రంథ రచయిత, మంజీరా సాహితీవేత్త రాజారెడ్డి చేతుల మీదుగా షీల్డ్‌ను బహుకరించి ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన మురళిని స్థానిక కవులు, ప్రముఖులు అభినందించారు. -
పశువుల కాపరిపై పులి పంజా
సాక్షి, కోటపల్లి(చెన్నూర్) : మండలంలోని అటవీ ప్రాంతంలో మళ్లీ పులి కదలికలు మొదలయ్యాయి. పులి ఈసారి ఒక అడుగు ముందుకేసి పశువుల కాపరిపై దాడి చేసి గాయపర్చిన ఘటన కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోటపల్లి మండలంలోని బమన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా వెంకటయ్య రోజు లాగానే శుక్రవారం నక్కలపల్లి బమన్‌పల్లి అటవీప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లాడు. పశువులపై ఒక్కసారిగా పులి దాడి చేయబోయే క్రమంలో ప్రతిఘటించడంతో కాపరి కాలుపై పంజా విసిరింది. దీంతో అతనికి కాలికి పెద్ద గాయమైంది. వెంటనే వెంకటయ్య పులిని దగ్గరలోని కట్టలతో బెదిరించినట్లు చేయడంతో పులి అక్కడినుంచి వెళ్లిపోయింది. గ్రామసమీపంలోకి వచ్చి అరుపులు పెట్టడంతో గ్రామస్తులు వచ్చి ప్రథమచికిత్స నిర్వహించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్ఆర్వో రవికుమార్, డిప్యూటీ రేంజర్ దయాకర్ బాధితుడిని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా పులి పాదముద్రలను గుర్తించి ప్లగ్మార్క్ చేసి దాడిచేసింది ఏ1 పులిగా గుర్తించారు. బాధితుడిని మెరుగైన వైద్యంకోసం చెన్నూర్ అస్పత్రికి తరలించారు. భయాందోళనలో స్థానికులు గత డిసెంబర్లో పంగిడిసోమారం అటవీప్రాంతంలో ఏడు ఆవులపై దాడి చేసి హతమార్చిన పులి మళ్లీ కాపరిపై దాడిచేయడంతో గ్రామస్తులు, భయాందోళనలు చెందుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం అడవిలో సంచరిస్తున్న పులి గ్రామాల సమీపంలోకి వస్తుండటంతో పులికి ప్రమాదం పొంచి ఉంది. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమరుస్తుండడంతో అటవీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వేటను సంపూర్ణంగా నిలిపివేయకుంటే పులికి ప్రమాదం ఉంది. -
చెన్నూర్ డివిజన్లో పులులు ఒకటి కాదు.. మూడు
సాక్షి, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో పులుల సంతతి పెరుగుతోంది. ఈ ప్రాంతంలో ఒకే పులి ఉన్నట్లు భావిస్తున్న అటవీ అధికారులు.. ప్రస్తుతం 3 పులులు ఉన్నట్లు గుర్తించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్య లు చేపట్టారు. ఇందులో భాగంగా తొమ్మిది బృం దాలు ఏర్పాటు చేశారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి గతంలో కే–4 పులి సంచారం మాత్రమే కనిపించేది. నెల రోజుల నుంచి ఈ ప్రాంతంలో మూడు పులులు సంచరిస్తున్నట్లు ఇటీవల సీసీ కెమెరాల్లో లభించిన పుటేజీల ఆధారంగా నిర్ధారించారు. మూడేళ్ల క్రితం కోటపల్లి మండలం పిన్నారంలో పులి హతమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ పులుల సం చారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. వేట ప్రారంభం డివిజన్లోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పులులు వేట ప్రారంభించాయి. 15 రోజుల నుంచి ఆవులు, మేకలపై దాడి చేస్తూ హత మారుస్తున్నాయి. కోటపల్లి మండలం పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో బుధవారం ఒకే రోజు ఐదు ఆవులపై పంజా విసిరాయి. పులి దాడి చేసిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించారు. అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని ఆయా గ్రామాల ప్రజలకు సూచించారు. గత నెలలో చెన్నూర్ అటవీ ప్రాంతంలో ఒకే రోజు నాలుగు మేకలపై దాడి చేశాయి. శీతాకాలం కావడంతో పులి ఆకలి తీర్చుకునేందుకు ఆటవీ ప్రాంతంలో సంచరించే అవకాశాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో వన్యప్రాణుల నుంచి పంటల సంరక్షణ కోసం కొందరు రైతులు అమరుస్తున్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు పులికి తగిలితే పెను ప్రమాదం జరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. నిర్ధారించిన అధికారులు చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో మూడు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు ద్రువీకరించారు. గతంలో ఈ ప్రాంతంలో కే–4 ఆడపులి ఒక్కటే సంచరించేదని, ఆసిఫాబాద్ నుంచి ఏ–1, సిర్పూర్ నుంచి ఎస్–1 రెండు మగ పులులు రెండు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెబుతున్నారు. అవి ఆవుల మందలపై దాడి చేస్తున్నాయని అనుమానిస్తున్నారు. మూడు పులులు సంచరిస్తున్నా.. పులులన్నీ కలసి ఉండవని అధికారులు తెలిపారు. రోజుకో ప్రాంతానికి వెళ్తాయని చెబుతున్నారు. పులులు సంరక్షణకు 9 బృందాలు పులుల సంరక్షణ కోసం 9 బృందాలను ఏర్పాటు చేశామని చెన్నూర్ డివిజన్ ఫారెస్టు అధికారి రాజారావు తెలిపారు. నిత్యం పులుల కదలికనలు గమనిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పులి ఒకే ప్రదేశంలో ఉండదన్నారు. కోటపల్లి మండలంలో పనిచేస్తున్న స్ట్రైకింగ్ ఫోర్స్, బేస్ క్యాంప్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. గ్రామాల్లో పులి సంచారం ఉందని, అటవీ ప్రాంతానికి వెళ్ల వద్దని దండోరా వేయిస్తున్నామని చెప్పారు. గతంలో జరిగిన ఘటన మళ్లీ చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. -
దసలి ‘పట్టు’.. మొదటిస్థానం కొట్టు..
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్): మంచిర్యాల జిల్లాలో దసలి పట్టు సాగు తెలంగాణకే తలమాణికంగా మారింది. రాష్ట్రంలోనే దసలి పట్టు కాయ దిగుబడికి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టు పరిశ్రమ పెట్టింది పేరు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా దసలి పట్టుసాగుకు కొంత నష్టం వాటిల్లినప్పటికి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యానికి చేరువులో దిగుబడి వస్తుందని అధికారులు అంటున్నారు. చెన్నూర్ పట్టు కేంద్రానికి వివిధ అటవీ ప్రాంతాల నుంచి దసలి పట్టు కాయలను రైతులు తీసుకొస్తున్నారు. త్వరలోనే బహిరంగ వేలం.. చెన్నూర్ పట్టు పరిశ్రమ పరిధిలోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నల మండలాల్లో పండించిన దసలి పట్టు కాయను చెన్నూర్‌లో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొంటారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పోవడంతో దిగుబడి కొంత త గ్గిందని రైతులు పేర్కొంటున్నా రు. ఎకరం విస్తీర్ణంలో గల మద్ది చెట్లకు 20 వేల దసలి కాయల దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది 15 నుంచి 18 వేల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. భూములు లేని గిరిజన రైతులే.. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేద రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం దసలి కాయ సాగును ప్రొత్సహిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి లేని రైతులను గుర్తించి దసలి కాయను పండించే విధానంపై శిక్షణనిచి్చంది. గత 30 ఏళ్లుగా ఈ జిల్లాల్లో సుమారు 1000 మంది రైతులు 7500 ఎకరాల్లో దసలి పంటను పండిస్తున్నారు. కుమురంభీం జిల్లాలోని గొల్లతరివి, కౌటల, బెజ్జురు, మంచిర్యాల జిల్లాలోని నెన్నల మండలంలోని మన్నెగూడెం, కోటపల్లి మండలంలోని కొత్తపల్లి, రాజారం, పారుపల్లి, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్లబంధం, వేమనపల్లి మండలంలోని ముల్కలపేట చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, లింగంపల్లి గ్రామాలో దసలి పట్టు కాయ పండిస్తూ రైతులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ఏడాది ఆసిఫాబాద్‌లో ఫారెస్ట్ అధికారులు దసలి పట్టు సాగుకు అనుమతించలేదు. ఏడాదికి మూడు పంటలు.. దసలి పట్టు కాయ పంట 45 రోజుల్లో చేతికి వస్తుంది. రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నారు. దసలి పట్టు కాయలో బైలొల్టిన్, ట్రైవొలి్టన్ అనే రెండు రకాలు ఉన్నాయి. బైవొల్టిన్ దసలి కాయకు ధర వెయ్యికి రూ. 2000 వేల నుంచి రూ. 2500 వేల వరకు పలుకుతుండగా ట్రైవొలి్టన్ కాయ ధర రూ. 1700 నుంచి రూ.1900 వరకు ఉంటుంది. బైవొల్టిన్ దసలి గుడ్లపై 50 శాతం సబ్సిడీ ఉండడంతో రైతులు బైవొల్టిన్ పట్టు పంటను ఎక్కువ శాతం పండిస్తున్నారు. ట్రైవొలి్టన్ గుడ్లకు (విత్తనాలకు) సబ్సిబీ ఎత్తి వేశారు. అలాగే గత ఏడాది గుడ్డు ధర రూ. 6 ఉండగా ప్రస్తుతం రూ. 12కు పెంచారు. గుడ్ల ధర రెండింతలు కావడంతో పంట సాగు ఖర్చు పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు. వేలంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల వ్యాపారులు (ఫైల్) రైతుల శ్రమే పెట్టుబడి.. దసలి పట్టు కాయ పంట సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. రైతుల శ్రమే పెట్టుబడి. రైతులు 2వేల నుంచి 3 వేల రూపాయలతో గుడ్లను కోనుగోలు చేస్తే సరిపోతుంది. అంతకు మించి పెద్దగా ఖర్చులు ఉండవు. గుడ్లు కొనుగోలు అనంతరం అవి పిల్లలు అయ్యేంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. గుడ్ల నుంచి పట్టు పురుగులు బయటికి వచ్చిన తర్వాత వాటిని చెట్లపై వేస్తారు. పట్టుపురుగులు ఆకులను తింటు 20 రోజులకు దసలి పట్టు కాయగా మారుతాయి. పట్టు పురుగులను పక్షులు తినకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలి. రెండు నెలల పాటు కష్టపడితే కాయ చేతికి అందుతుంది. ఒక్కో రైతు 20 నుంచి 30 వేల కాయను పండిస్తారు. దసలి కాయ మంచి దిగుబడి వస్తే ఒక్కో రైతు సంవత్సరానికి పెట్టుబడులు పోను రూ. 70వేల నుంచి రూ.80 వేలు సంపాదిస్తారు. ప్రథమ స్థానంలో మంచిర్యాల జిల్లా.. రాష్ట్రంలోని భద్రాచలం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రైతులు దసలి పట్టు సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా రైతులు దసలి పట్టు కాయ సాగు చేస్తూ సాగులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ ప్రాంతంలో పండించిన పట్టు కాయ కొనుగోలు వేలంలో ఇతర రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనుండడం విశేషం. ఇక్కడి పట్టు కాయకు మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రథమ స్థానంలో మంచిర్యాల జిల్లా.. రాష్ట్రంలోని భద్రాచలం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రైతులు దసలి పట్టు సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా రైతులు దసలి పట్టు కాయ సాగు చేస్తూ సాగులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ ప్రాంతంలో పండించిన పట్టు కాయ కొనుగోలు వేలంలో ఇతర రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనుండడం విశేషం. ఇక్కడి పట్టు కాయకు మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. వెయ్యి కాయలకు రూ. 4 వేలు ఇవ్వాలి ఇంటిల్లిపాది 45 రోజులు కష్టపడి దసలి పురుగులను కాపాడితే కాయ చేతికి వస్తుంది. కాయ కొసి అమ్ముకునే సరికి రెండు నెలలు అవుతుంది. దీనికి రూ. 25 వేల నుంచి రూ. 35 వేలు వస్తున్నాయి. ఈ ఏడు పంట సరిగా లేదు. బహిరంగ వేలంలో వెయ్యి కాయలకు రూ. 4 వేలు పలికితే రైతుకు లాభం చేకూరుతుంది. ఆరు నెలల పాటు ఖాళీగా ఉంటున్నాం. పట్టుదారం తీసే యంత్రాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి. – బాగాల మధునక్క, మహిళ రైతు, కోటపల్లి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం.. చెన్నూర్ పట్టు పరిశ్రమ దసలి పట్టు సాగులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఆరు నెలల పాటు పనులు కల్పించాలనే ఉద్ధేశంతో ఉపాధి హామీ పనుల్లో రైతులను భాగస్వాములు చేసేందుకు డీఆర్డీఏ పీడీతో మాట్లాడా. ముడి సరుకులు ఇక్కడే పండిస్తుండడంతో మహిళలకు దారం తీసే పనులు కల్పించాలని దారం తీసే యంత్రాలను కూడా కొనుగోలు చేశాం. త్వరలోనే శిక్షణ తరగతులు ప్రారంభిస్తాం. – బాషా, ఏడీ, సెరికల్చర్, చెన్నూర్ -
ఈ ‘చేప’ వయసు 12 కోట్ల ఏళ్లు
రాతిపై పెయింట్ చేసిన చేప బొమ్మలాగా ఉంది కదూ ఇది. కానీ, ఇది నిజమైన చేప అచ్చు. సహజంగా ఇలా రాతిలో నిక్షిప్తమైంది. దీని వయసు ఎంతో తెలుసా? దాదాపు 12 కోట్ల ఏళ్లు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. శిలాజంగా మారిన ఆ చేప ఆకృతి ఇలా రాతి పొరల్లో ఉండిపోయింది. సాక్షి, హైదరాబాద్: కోట్ల ఏళ్ల నాటి చేపలు, వృక్షాలు, ఆకులు, జంతువుల పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు రాష్ట్రంలో లభ్యమయ్యాయి. శిలాజంగా మారిన చేప ఆకృతి రామగుండం ఎన్టీపీసీ పరిధిలో లభించింది. ఈ ప్రాంతంలో శిలాజాలకు కొదవే లేదు. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రాక్షస బల్లులు కూడా జీవించాయనడానికి సాక్ష్యంగా గతంలో వాటి శిలాజాలు లభ్యమయ్యాయి. బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని డైనోసారియంలో ఉన్న రాక్షసబల్లి ఆకృతి శిలాజాల రూపం ఇక్కడ లభించిందే. ఇప్పటికీ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రకరకాల శిలాజాలు లభిస్తూనే ఉన్నాయి. తాజాగా కోట్ల ఏళ్ల నాటి చేపలు, వృక్షాలు, ఆకులు, జంతువుల పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు లభించాయి. చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో లభించిన ఆకుల ముద్రలున్న శిలాజం ఔత్సాహిక పరిశోధకుడు సముద్రాల సునీల్ తాజాగా వీటిని సేకరించారు. చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో కొన్ని ఆకుల ఆకృతులతో కూడిన శిలాజాలు లభించాయి. ఇవి ప్రాచీన వృక్షజాతి గ్లోసోప్టెరీస్‌కు చెందినవిగా నిష్ణాతులు అభిప్రాయపడుతున్నట్లుగా వాటిని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఈ జాతి చెట్లలో నారవేప, తిరుమణి తదితరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పత్ర శిలాజాల వయసు 10 కోట్ల ఏళ్లుగా ఉంటుందని అంచనా వేశారు. మంచిర్యాల జైపూర్ ప్రాంతంలో ఒక జంతువు పాద ముద్ర నిక్షిప్తమైన శిలాజాన్ని కూడా గుర్తించారు. -
అమ్మో పులి..
సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్) : మండలంలోని ఎదులబంధం అడవుల్లో పులి కదలికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం చెన్నూర్, వేమనపల్లి మండలాల్లోని అడవుల్లో పులి సంచరించగా.. తాజాగా కోటపల్లి మండల కేంద్రం, కోటపల్లి మండలంలోని ఎదులబంధం, లింగన్నపేట అటవీ ప్రాంతంలో పులి కదలికలను గుర్తించారు. పులి సంచారం విషయం తెలియగానే గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈనెల8న మండల కేంద్రానికి చెందిన కాశెట్టి తిరుపతి, రాళ్లబండి శ్యాంసుందర్ అనే వ్యక్తులకు చెందిన గేదెలపై పులి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాయి. అయితే గేదెల మంద ఎదురుతిరగడంతో పాటు చెల్లాచెదురై గ్రామాల వైపు పురుగెత్తడంతో పులి వెనుకడుగు వేసిందని పశువుల కాపరులు పేర్కొన్నారు. కాగా ఆదివారం కే4 ఎదులబంధం లింగన్నపేట గ్రామాల సమీపంలో దట్టమైన అటవీప్రాంతం కావడం.. చిన్న చిన్న అడవి జంతువులు ఎక్కువగా ఉండటంతో వాటిని వేటాడుతూ పులి సంచరిస్తున్నట్లు సమాచారం. అయితే మండలంలో ఇప్పటికే కే4, కే6 పులులు ఉండగా తాజాగా ఇంకో పులి వచ్చినట్లు సమాచారం కానీ పులికి రక్షణ దృష్ట్యా అధికారులు ఎవరూ కూడా ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. మండలంలో కే4 ఆనవాళ్లు లభ్యమైనా.. అటవీ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో మాత్రం కే6 ఎక్కడా కనిపించలేదు. చెన్నూర్ మండలంలో సంకారం బుద్దారం అటవీ ప్రాంతంలో తిరిగిన పులి ప్రస్తుతం కోటపల్లి మండలంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరైనా పులికి హాని తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలను హెచ్చరించారు. -
లావుగా ఉన్నావని అత్తింటి వేధింపులతో..
సాక్షి, చెన్నూర్(ఆదిలాలబాద్) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని కుమ్మరిబొగుడ కాలనీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలివీ..కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన తోట కిషన్–మధునమ్మలకు మానస, మౌనిక ఇద్దరు కూతుర్లు. తండ్రి కిషన్ 2014లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమార్తె మౌనిక (22) మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా, ఆరుడ గ్రామానికి చెందిన ఏతం కిరణ్‌కు రూ.8లక్షల కట్నం ఇచ్చి 2018లో వివాహం చేసింది. మౌనిక లావుగా ఉండడంతో భర్త, అత్తమామలు వేధించసాగారు. దీంతో ఆరు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. శుక్రవారం బంధువులు ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు తల్లి మంచిర్యాల వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మానిక చున్నీతో దూలానికి ఉరేసుకుంది. ఎస్సై సంజీవ్, తహసీల్దార్ పుష్పలత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త కిరణ్, అత్తమామలు విడాకులు ఇవ్వాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మేనమామ మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చెన్నూర్‌లో భారీ చోరీ
సాక్షి, చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో జేబీఎస్ పాఠశాల సమీపంలోని గోదావరి రోడ్డులో చెన్నూర్ ఎంఈవో రాధాకృష్ణమూర్తి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలకొట్టి బీరువాలో దాచిన నగదు, విలువైన సొత్తును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు కొమ్మెర రాధాకృష్ణమూర్తి వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లి అదేరోజు అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా పగులగొట్టి అందులో దాచిన మూడున్నర తులాల బంగారం, రూ.70 వేల విలువైన వెండి, రూ.1.60 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్సై విక్టర్, సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. డాగ్‌స్వా్కడ్, క్లూస్ టీం బృందం సభ్యులు రంగంలోకి దిగారు. పట్టణంలోని జెండవాడలో చెన్న మధు ఇంటి వద్ద కుక్క ఆగడంతో మధును తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. జైపూర్ ఏసీపీ నరేందర్ ఎంఈవో ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును తెలుసుకున్నారు. పక్కా ప్లాన్‌తోనే దొంగతనం.. ఏంఈవో రాధాకృష్ణమూర్తి కుటుంబం హైదరాబాద్ వెళ్లి వచ్చేలోగా ఇంట్లో చోరీ జరిగింది. పక్కా ప్లాన్‌తోనే దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన వారైన ఉండాలి. లేక రెక్కీ నిర్వహించిన దొంగలైన ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి ఇల్లు రోడ్డు పక్కనే ఉండడంతో పాటు నిరంతరం జన సంచారం ఉంటుంది. పగలు చోరీ జరిగే అవకాశమే లేదు. రాత్రివేళ సుమారు 10 నుంచి 12 గంటల మధ్యే చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
జనావాసంలో పులి హల్చల్
సాక్షి, వేమనపల్లి(ఆదిలాబాద్) : వేమనపల్లి మండలం సుంపుటం – ఖర్జీ వెళ్లే రామలక్ష్మణుల దారి లో పులి ఎడ్లబండిపై వెళ్తున్న రైతును భయానికి గురిచేసింది. గ్రామానికి చెందిన కుబిడె శంకర్ ఊరి నుంచి తన కూతురు వద్దకు ఎడ్లబండిపై ఖర్జీకి రామలక్ష్మణుల దారిమీదుగా వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన పులి గాండ్రిస్తూ ఎడ్ల వద్దకు రావడం మొదలు పెట్టింది. అప్పటికే శంకర్ భయంతో వణికిపోతున్నాడు. ఎడ్లు పులి గాండ్రింపులకు బెదురుతున్నాయి. శంకర్ ముళ్లుకర్రతో ఎడ్లను దమాయిస్తూ డబొబ్బలు ప్రారంభించాడు. వెంటనే సెల్ఫోన్లో గ్రామంలో ఉన్న తన కొడుకుకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామస్తులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జనం రాకను పసిగట్టిన పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గ్రామస్తుల సమాచారంతో సుంపుటం బీట్ ఆఫీసర్ నజీర్, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పులి అటకాయించిన ప్రాంతంలో ఉన్న పాదముద్రలను తీసుకొచ్చినట్లు సమాచారం. చెన్నూర్‌లో ఆవు, మేకలపై పంజా చెన్నూర్ ఆటవీ డివిజన్లో పులి అలజడి ప్రారంభమైంది. నాలుగు రోజులుగా చెన్నూర్ మండలం సంకారం, బుద్దారం ఆటవీ ప్రాంతంలో మేకలు, పశువులపై దాడి చేసి హతమార్చింది. ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న విషయాన్ని ఫారెస్ట్ అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో అటవీప్రాంతానికి వెళ్లాలంటేనే మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కటా.. చాలానా..? చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్లోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి అటవీ ప్రాంతంలో గతంలో కే4 పులి సంచరించింది. కే4 సంచరించిన సమయంలో చెన్నూర్‌తోపాటు కోటపల్లి, నీల్వాయి మండలాల్లో పశువులపై దాడి చేసి హతమార్చింది. ఆరునెలల నుంచి పులి సంచారం కానరాలేదు. ఇటీవల సంకారంలో మేకలు, పశువుపై దాడి చేయడంతో పులి సంచారం మొదలైందని గ్రామస్తులు అంటున్నారు. అది గతంలో ఇక్కడ సంచరించిన కే4 పులా..? లేక కాగజ్‌నగర్ ప్రాంతం నుంచి ఇతర పులులు వచ్చాయా..? అని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. మేకను హతమార్చిన ప్రాంతంలో పులి ఆడుగులు చిన్నవిగా ఉండడంతో తల్లి పులితోపాటు మరో పిల్లపులి సంచరిస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయంతో ఉన్న పులి గర్భవతి కాగజ్‌నగర్‌లో ఫాల్గుణ పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పులి పిల్లలకు ఫారెస్ట్ అధికారులు కే1, కే2, కే3, కే4గా నామకరణం చేశారు. 2016లో పిన్నారంలో ఓ పులి వేటగాళ్లు బిగించిన ఉచ్చులో పడి మృతి చెందింది. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో మరో పులి కే4 వేటగాళ్లు బిగించిన ఉచ్చుకు తగిలింది. నడుం ప్రాంతంలో ఉచ్చుతోనే చెన్నూర్ ప్రాంతంలో సంచరించింది. ఆటవీ శాఖ అధికారులు పులికి బిగిసిన ఉచ్చును తీసేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. అదే పులి గర్భంతో ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇన్నిరోజులు కన్పించని పులి మళ్లీ సంచరిస్తుండడం.. చిన్న అడుగులు ఉండడంతో ఆ పులే పిల్లకు జన్మనిచ్చిదా..? లేక కొత్త పులులు వలస వచ్చాయా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆమెది హత్య ? ఆత్మహత్య ?
సాక్షి, చెన్నూరు : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ బీజోన్ ఏరియాకు చెందిన వివాహిత గంజి కళ్యాణి(25) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కళ్యాణి ఉరేసుకుని చనిపోయిందని ఆమె భర్త చెబుతుండగా.. భర్తే ఉరేసి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు.. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన గంజి నర్సింహారావు కూతురు కళ్యాణిని 2014 ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన అర్జి సత్యబోస్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.5 లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. పెళ్లి అయిన కొద్దిరోజులకు సత్యబోస్‌కు వెల్ఫేర్ ఆఫీసర్‌గా సింగరేణిలో ఉద్యోగం రావడంతో వారు రామకృష్ణాపూర్‌కు వచ్చి ఇక్కడే కంపెనీ క్వార్టర్లో ఉంటున్నారు. పెళ్లయి ఐదేళ్లు కావస్తున్నా సంతానం కలగలేదని సత్యబోస్తోపాటు అతని తల్లిదండ్రులు కళ్యాణిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. అదనపు కట్నంగా మరో రూ.నాలుగు లక్షలు తేవాలని, లేకపోతే తమ అబ్బాయికి మరో పెళ్లి చేస్తామని సత్యబోస్ తల్లిదండ్రులు బెదిరించారు. ఈ క్రమంలో గతనెల సెప్టెంబర్ 15న కళ్యాణిని పుట్టింటికి పంపించారు. సత్యబోస్‌కు నచ్చజెప్పి కళ్యాణిని మళ్లీ కాపురానికి పంపించారు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో సత్యబోస్ ఫోన్ చేసి కళ్యాణికి కడుపునొప్పి వచ్చిందని, ఆర్కేపీ ఏరియా ఆసుపత్రిలో చేర్పించామన్నారని, దీంతో బుధవారం వేకువజామున ఇక్కడికి వచ్చాక.. వైద్యం జరుగుతుందని అబద్దం చెప్పాడని, చివరికి కళ్యాణి చనిపోయి మార్చురీలో ఉందన్నాడని రోదిస్తూ తెలిపారు. తమ బిడ్డను అల్లుడు సత్యబోస్ ఉరిపెట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆసుపత్రిలో చేర్పించాడని కళ్యాణి తండ్రి నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలు పుట్టలేదనే బెంగతోనే : మృతురాలి మామ అర్జిప్రసాద్ పెళ్లై ఐదేళ్లయినా పిల్లలు పుట్టడం లేదనే బెంగతోనే కళ్యాణి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి మామ అర్జి ప్రసాద్ పేర్కొన్నారు. ఏరియా ఆసుపత్రిలో మాట్లాడారు. పిల్లలు లేకపోవడంతో ఇటీవల ఆసుపత్రుల్లో చూపించుకుంటున్నారని, సంతానం కలగకపోవడంతో మానసికంగా కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని పట్టణ ఎస్సై రవిప్రసాద్ తెలిపారు. నిందితులపై 302, 304బీ కింద కేసు నమోదు చేశామన్నారు. -
రోడ్డుపై గేదెలను కట్టేసినందుకు జరిమానా
సాక్షి, చెన్నూర్ : మనషులకే కాదు జంతువులకు కూడా రూల్స్ వర్తిస్తాయని నిరూపించారు ఓ మహిళా అధికారిణి . ఓ వ్యక్తి తన గేదెలను రోడ్డుపై కట్టేసినందుకు జరిమానా చెల్లించిన వింత ఘటన చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలలోని కత్తెరసాల గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం రోడ్డుపై పశువులను కట్టేసినందుకు మల్లవేన పెద్ద పోషంకు రూ.2000 జరిమానా విధించినట్లు ప్రత్యేకాధికారి గంగాభవానీ తెలిపారు. ఇక నుంచి ఎవరూ రోడ్లపై పశువులు కట్టేయొద్దని సూచించారు. రోడ్లపై పశువులను కట్టేసినా, చెత్త వేసినా జరిమానా వేస్తామన్నారు. అలాగే రోడ్లపై పాదులను తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్ తోట మధుకర్, కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజక్షన్ వికటించి వైద్యుడు మృతి
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్) : మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బొడిగె రవికిరణ్ (48)శుక్రవారం ఇంజక్షన్ వికటించి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. వివరాలు రవికిరణ్ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడని కొద్ది కాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధ పడుతున్నాడని ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో పెరాలసిస్‌కు సంబంధించిన ఇంజక్షన్ తీసుకోవడంతో కింద పడిపోయాడని ఎస్సై తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుమారుడు కృష్ణచైతన్య పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్డమ్ నిమిత్తం చెన్నూరు తరలించినట్లు ఎస్సై తెలిపారు. రవికిరణ్ సొంతగా ఇంజక్షన్ తీసుకున్నాడా లేకా ఎవరైన ఇచ్చారా అనేది విచారణలో తెలుసుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన రవికిరణ్ గత 20 ఏళ్ల నుంచి భీమారంలో ఆర్ఎంపీ వైద్యుడుగా సేవలు అందిస్తున్నారు. కాగా రవి కిరణ్‌కు భార్య తోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. -
సింగరేణి పార్క్ వద్ద కొండచిలువ హల్చల్
సాక్షి, చెన్నూర్(మంచిర్యాల) : ఏరియాలోని కోల్‌బెల్ట్ రహదారి పక్కనే ఉన్న సింగరేణి గ్రీన్ పార్క్ వద్ద గురువారం సాయంత్రం కొండచిలువ హల్చల్ చేసింది. పార్క్ నుంచి బయటకు వచ్చిన ఆరడుగుల పొడువు గల కొండచిలువ వర్క్‌షాపు మూలమలుపు వద్ద రోడ్డుపైకి రావడంతో రాకపోకలు సాగించే వారు భయంతో ఆగిపోయారు. వాహనాల లైటింగ్‌కు తిరిగి పార్క్‌లోకి వెళ్లిపోయింది. కొండచిలువ తిరిగి పార్క్‌లోకి వెళ్లిపోవడంతో పట్టణ ప్రజలు భయపడుతున్నారు. రోజు సాయంత్రం సమయంలో వందలాది మంది కాలక్షేపానికి పార్క్‌కు వెళతారు. అధికారులు కొండ చిలువను పట్టుకోవాలని కోరుతున్నారు. -
విద్యార్థినిపై హత్యాయత్నం
సాక్షి, చెన్నూర్ : కలిసి చదువుకునే విద్యార్థినులే తోటి విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చెన్నూర్ కస్తూర్బా పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత విద్యార్థిని కథనం ప్రకారం.. చెన్నూర్ మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం తోటి విద్యార్థినులందరితో కలిసి వారికి కేటాయించిన గదిలో పడుకుంది. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అదే గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థినులు తనపై హత్యాయత్నం చేశారని, ఇద్దరు కాళ్లు, చేతులు పట్టుకోగా.. మరో విద్యార్థిని గొంతుకు గుడ్డచుట్టి నులిమినట్లు పేర్కొంది. ఊపిరి ఆడక పోవడం.. కాళ్లు కొట్టుకోవడంతో పక్కనే ఉన్న విద్యార్థినులు లేచారు. ఉపాధ్యాయురాలు కూడా గదికి వచ్చారు. జరిగిన విషయాన్ని ఆమెకు తెలపడంతో ముగ్గురు విద్యార్థినులను చితకబాదింది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు ముగ్గురు విద్యార్థినులను వారివారి స్వగ్రామాలకు పంపించారని బాధిత విద్యార్థిని తెలిపారు. ఇంత జరిగినా గోప్యమెందుకో.. ? పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు తోటి విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మంగళవారం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులతో పాఠశాలకు వచ్చి ఘటన విషయాన్ని సిబ్బందిని అడిగేవరకూ పాఠశాల ప్రత్యేకాధికారి, సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారనే విషయం చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి విద్యార్థిని కేకలు వేయడంతో ఉపాధ్యాయురాలు వచ్చి సదరు ముగ్గురు విద్యార్థిను చితకబాదిందని బాధిత విద్యార్థిని చెబుతుంటే.. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పక పోవడంలోని ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం వెలుగులోకి వస్తే పాఠశాలలో విద్యాభ్యాసం చేసే ఇతర విద్యార్థులు భయాందోళనలకు గురవుతారని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందనా..? లేక విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలుగుతుందనా..? అని తల్లిదండ్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. బిడ్డ చనిపోతే బాధ్యులు ఎవరు..? ‘గదిలో పడుకున్న నా బిడ్డ అరవకుంటే చనిపోయేది. నా బిడ్డా చనిపోతే ఎవరు బాధ్యత వహించేవారు..’ అని బాధిత విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం తన బిడ్డను చంపే ప్రయత్నం చేసినా.. ఉపాధ్యాయురాళ్లు తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆదివారం పాఠశాలకు వచ్చిన లంబాడిపల్లి గ్రామానికి చెందిన కొందరు తన బిడ్డ ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో అదే రాత్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లానని, అక్కడ తనను చంపే ప్రయత్నం చేశారని చెప్పే వరకూ తమకు తెలియదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అడిగేందుకు వస్తే ప్రిన్సిపాల్ లేదంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు జిల్లా అధికారులను కోరారు. -
చెన్నూరు కుర్రోడికి ఏడాదికి రూ.1.24 కోట్ల జీతం
సాక్షి, కైకలూరు: కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు కృష్ణా జిల్లాకు చెందిన బుద్దా కార్తీక్. ముదినేపల్లి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గోపాలకృష్ణమూర్తి, సత్య సులోచనల కుమారుడు కార్తీక్. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. హైదరాబాద్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లో ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాల్‌కమ్ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం పొందాడు. తర్వాత అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు పూర్తి చేశాడు. ఇప్పుడు అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.కోటీ 24 లక్షల జీతం అందుకుంటున్నాడు. శుక్రవారం లిటల్ ప్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ బలుసు రఘురామయ్య, వైస్ ప్రిన్సిపాల్ సాయి సుమిత్, ఉపాధ్యాయులు కార్తీక్‌కు అభినందనలు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే ఓదెలుకు మాతృవియోగం
మందమర్రిరూరల్: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తల్లి నల్లాల పోశమ్మ (74) కొంత కా లంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జా మున మృతి చెందింది. పోశమ్మ భౌతికకాయం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మందమర్రిలో ని రెండవ జోన్‌లోని ఇంటికి తీసుకువచ్చారు. సా యంత్రం స్థానికంగా అత్యక్రియలు నిర్వహిం చారు. రాష్త్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి మా జీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, గ్రంధాల య చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ప్రబాకర్రావ్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య , ప్రదాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామ య్య, ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, సర్పం చ్ల ఫోరం మండల అద్యక్షుడు ఒడ్నాల కొమురయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
‘సాహిత్యం’లో రాణిస్తున్న రమాదేవి
చెన్నూర్: పట్టణానికి చెందిన బొల్లంపల్లి రమాదేవి కవితలు,రచనలు చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకుంటూ పలువురి మన్ననలు పొందారు. హృదయ స్పందన అనే కవిత పుస్తకాన్ని రచించి అందరి మనసులను దోచుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర నలుమూలలో నిర్వహించిన కవి సమ్మేళనాల్లో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకుంది. జాతీయ సాహితీ పురస్కారం అందుకోవడమే తన లక్ష్యంగా సాహిత్య రంగాల్లో ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు రమాదేవి పాల్గొన్న కవి సమ్మేళనాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రమాదేవి ప్రస్థానం రమాదేవి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని. దేవరకొండ కమలాదేవి, యాదగిరిలకు జన్మించింది. చెన్నూర్‌కు చెందిన బొల్లంపల్లి పున్నంచంద్తో వివాహమైంది. ఏంఏ తెలుగు, బీఎడ్, సోషీయాలజీ పూర్తి చేసింది. ప్రస్తుతం చెన్నూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. రాష్ట్రస్థాయి పురస్కారం మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాలలోని తెలంగాణ భాషా సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో రమాదేవికి రాష్ట్రస్థాయి ఎంవీ నరసింహారెడ్డి పురస్కారం అందజేశారు. రాష్ట్ర స్థాయి పురస్కారం లభించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. సన్మానాలు, సత్కారాలు రామగుండం నగరపాలక సంస్థ 2016లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రశంసపత్రం, అవార్డు తెలంగాణ రైతు హార్వేస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి కవిత అవార్డు సహస్ర కవి సమ్మేళనంలో ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించిన పోటీల్లో సన్మానం ఉదయ కళానిధి సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి శిల్పకళా వైభవం పేరుతో నిర్వహించిన కవి సమ్మేళనంలో సన్మానం, ప్రశంస పత్రం 1116 మంది కవులతో ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్‌లో ప్రశంస పత్రం 2018 ఆగష్టు 15న చెన్నూర్‌లో నీర్ల మధునయ్య జయంతి వేడుకల్లో సాహిత్య పురస్కారం జాతీయ స్థాయిలో గుర్తింపే నా లక్ష్యం సాహిత్య రంగాభివృద్ధికి నావంతు కృషి చేస్తా. దిగజారిపోతున్న నైతికత విలువలను కాపాడే విధంగా సాహిత్యం ఉండాలన్నదే నా ఉద్దేశం. అవార్డు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలుతో అనేవి ప్రతిభకు గుర్తింపుగా వస్తూ ఉంటాయి. సన్మానాలతో అగిపోకుండా నా రచనలు నిరంతర సాగిస్తా. జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించడమే నా ముందున్న లక్ష్యం. – బొల్లంపల్లి రమాదేవి, కవి రచయిత, చెన్నూర్ -
సుమన్ చరిత్ర బయటపెడతా: ఓదేలు
వరంగల్ అర్బన్: చెన్నూరు అసెంబ్లీ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కేటాయించకపోవడంతో ఆయన అనుచరుడు నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి బాల్క సుమన్‌పై మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారిపై హత్యాయత్నం కేసు పెట్టించడం దారుణమన్నారు. తన వర్గానికి సంబంధించిన వారు బాల్క సుమన్‌పై దాడి చేయలేదని స్పష్టం చేశారు. స్థానికేతరుడికి టికెట్ కేటాయించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు. తాను ప్రజల మధ్య ఉండి రాజకీయం చేస్తానే తప్ప ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడనని చెప్పారు. బాల్క సుమన్ గురించి ఓయూ విద్యార్థులకు తెలుసునని విమర్శించారు. సుమన్ జీవిత చరిత్రను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు బయట పెడతానని తెలిపారు. తనను మానసిక క్షోభకు గురిచేసేందుకే తనపై కుట్రలు చేస్తున్నారని వాపోయారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
నాపై హత్యాయత్నం : బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల : చెన్నూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ, విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి చేసి చంపాలనుకుంటున్నారని, తాను చస్తే చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే తాను చావడానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. ‘నా పైన దాడి చేసి నన్ను చంపాలి అనుకున్నారు. నేను చస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను చావడానికి సిద్ధం’ అని పేర్కొన్నారు. జైపూర్ మండలం ఇందారంలో బుధవారం బాల్క సుమన్ ఓ కార్యక్రమం శంకుస్థాపన చేసేందుకు రాగా.. ఆయనకు వ్యతిరేకంగా ఓదెలు అనుచరులు ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బాల్క సమన్ మీడియాతో ఓదెలు వర్గం చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని, టికెట్ ఇచ్చాక మొదటిసారి నియోజకవర్గంలో కాలుపెడితే తనపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదేశం మేరకే తాను చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీలోకి దిగుతున్నానని తెలిపారు. సీనియర్ నేత వివేక్ పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వీలుగా.. ఆ టికెట్ ఇచ్చేసి.. చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీకి దిగాలని అధిష్టానం ఆదేశించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను వివేక్‌ను, ఆయన సోదరుడు వినోద్‌ను కలిసి సహకరించాలని కోరానని, అందుకు వారు సానుకులంగా స్పందించారని తెలిపారు. నల్లాల ఓదెలును కూడా హైదరాబాద్‌లో కలిసి సహకరించాల్సిందిగా కోరానని చెప్పారు. నిజమబాద్ నుండి జగ్దల్పూర్ రహదారికి నిధులు వచ్చేలా చేసి చెన్నూర్ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం చెన్నూరు ఎమ్యెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలుకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆయన అనచరులు ఆత్మహత్యాయత్నం చేశారు. జైపూర్ మండలం ఇందారంలో బుధవారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పాల్గొన్న ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ రాకను తెలుసుకున్న ఓదేలు అనుచరులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ బాల్కసుమన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఘట్టయ్యా అనే కార్యకర్త తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకోని నిప్పంటించుకున్నాడు. అతని పక్కనే ఉన్న మరో నలుగురికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అక్కడున్నవారు వారి మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొని భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడున్న వారిని అరెస్ట్ చేసి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
హైదరాబాద్ రా... మాట్లాడుదాం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ సీటును పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మందమర్రిలోని తన నివాసంలో సోమవారం రాత్రి నిద్రపోయిన ఓదెలు కుటుంబం మంగళవారం ఇంటి నుంచి బయటకు రాలేదు. క్వార్టర్స్ ప్రధాన గేటుతో పాటు ఇంటికి ఉన్న అన్ని దర్వాజాలను మూసివేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. గన్మన్లను కూడా బయటే ఉంచిన ఓదెలు ఇంటి లోపలికి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రంలోగా తనకు చెన్నూర్ టికెట్టు ఇస్తున్నట్లు ప్రకటిస్తేనే తలుపులు తీస్తామని, లేదంటే ఏం జరుగుతుందో కూడా తెలియదని హెచ్చరించారు. ఉదయం నుంచి హైడ్రామా! ఓదెలు గృహ నిర్బంధంలోకి వెళ్లారనే ప్రచారం మంగళవారం ఉదయం 9.15 గంటలకు దావానలంలా వ్యాపించింది. దాంతో కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన నివాసం ఎదుట బైఠాయించారు. మంత్రులు, పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తే తప్ప తాను బయటకు వచ్చేది లేదంటూ ఓదెలు చాలా స్పష్టమైన సంకేతాన్ని పార్టీ వర్గాలకు ఇచ్చారు. అయితే.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ ఓదెలుకు సర్ది చెప్పేందుకు విఫలయత్నం చేశారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కేసీఆర్ స్వయంగా ఓదెలుకు ఫోన్ చేసి ‘రేపు ప్రగతిభవన్‌లో ఉండేలా హైదరాబాద్ బయలు దేరి వచ్చేయ్..’ అని చెప్పడంతో గృహ నిర్బంధం వీడారు. కేసీఆర్‌నే నమ్ముకున్నా: ఓదెలు తాను కేసీఆర్‌నే నమ్ముకున్నానని ఓదెలు స్పష్టం చేశారు. స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన ఫోన్లో ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఈనెల 6న ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేనందుకు మనస్తాపానికి గురైనట్లు వెల్లడించారు. ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్నానని తెలిపారు. ఇప్పటికీ కేసీఆర్ తననే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారన్న నమ్మకం ఉందని ఓదెలు స్పష్టం చేశారు. బాల్క సుమన్ తప్పుడు నివేదికలు ఇచ్చారని, కేసీఆర్ తన వేగుల ద్వారా సర్వే చేయించాలని, ఆ సర్వేలో వచ్చే రిపోర్టుకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఇప్పటికీ రేకుల ఇంట్లో ఉంటున్నానని, తనకు టిక్కెట్టు ఇవ్వాలని ఓదెలు ఉద్విగ్నంగా చెప్పారు. -
స్వీయ గృహ నిర్భంధంలోకి వెళ్లిన ఓదేలు
-
టికెట్ ఇస్తేనే తలుపు తీస్తా..
సాక్షి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 105మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న కేసీఆర్ తన విషయంలో మాత్రం ఎందుకు అన్యాయం చేశారని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూర్ టికెట్ అధిష్టానం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై నిరసన గళం తీవ్రం చేశారు. అందులో భాగంగా మంగళవారం తన ఇంట్లో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. చెన్నూర్ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇస్తేనే తలుపులు తీస్తానని స్పష్టం చేశారు. 24 గంటల్లో తనకు సానుకూల స్పందన రాకపోతే జరిగే పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని నల్లాల ఓదెలు హెచ్చరించారు. ఓదెలు చర్యతో కుటుంబ సభ్యులు, అభిమానుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఓదెలు ఇంటికి చేరుకొని బయటకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం నిరాహారదీక్ష టీఆర్ఎస్ పార్టీ తన భర్తకు టికెట్ కేటాయించాలని స్థానిక కార్పోరేటర్ నిరాహారదీక్ష చేపట్టారు. తన భర్త పన్నాల హరీష్ చంద్ర రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటూ కావ్య హరీష్ చంద్ర రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. కావ్య హరీష్ చంద్ర రెడ్డి బాలాజీ నగర్ డివిజన్ కార్పోరేటర్ కావడం విశేషం. -
గుప్తనిధి తవ్వకాల గ్యాంగ్
చెన్నూర్ : గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చిన గ్యాంగ్‌లో నుంచి ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. వీరిని శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ కిశోర్‌కుమార్ విలేకరల ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్ట్ చేసిన సభ్యుల వివరాలు వెల్లడించారు. చెన్నూర్ మండలం రాయిపేట గ్రామ సమీపంలో గల చెరువుకట్ట ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని భీమారం గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి గోదావరిఖని, మెదక్, జమ్మికుంట, చెన్నూర్ పట్టణాల్లో ఉన్న తన పరిచయస్తులతో చెప్పారు. వీరంత ఒక గ్యాంగ్‌గా ఏర్పడి గుప్త నిధులు తవ్వకానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గురువారం రాత్రి రాయిపేట గ్రామంలో గుప్త నిధులు తవ్వకానికి వచ్చారు. గ్రామ పొలిమేరల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో గ్రామస్తులు వారిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు రాయిపేటకు వెళ్లి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమనమ్మపూడి నాగ జ్ఞానేశ్వర్‌రెడ్డి (రామచంద్రాపురం, మెదక్ జిల్లా), చిందం రాజన్న (గోదావరిఖని), దాముక రాజం (గోదావరిఖని), కొడిపె బక్కయ్య (చెన్నూర్), జన్నాల వేణుగోపాల్ (జమ్మికుంట), లాడి బెంజిమన్ (కొత్తగూడెం, భద్రాది జిల్లా)ను విచారించారు. వారి వద్ద పూజకు సంబంధించిన సామగ్రితోపాటు టార్చిలైట్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల కోసం వచ్చినట్లు వారు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కిశోర్‌కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న మరోవ్యక్తి సమ్మయ్య కోసం గాలింపు నిర్వహిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. -
కౌలు రైతులపై పిడుగు
సాక్షి, భీమారం(చెన్నూర్): మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు కౌలు రైతులు ఆదివారం తెల్లవారుజామున పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఆరెపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి రాజయ్య(32), ముడిపల్లిరాజం(50), జాడి రమేశ్(28) వరి కల్లాల వద్ద ఉన్న వరిధాన్యానికి కాపలా ఉండేందుకు వెళ్లి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారజామున మూడు గంటల ప్రాంతంలో వర్షంతో పాటు ఏకధాటిగా పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో వారిపై పిడుగులు పడి అక్కడిక్కడే మృతి చెందారు. గ్రామ శివారుల్లో ఉన్న వరి కల్లం వద్దకు సుధాకర్ అనే వ్యక్తి గమనించి వచ్చే వరకు రైతుల మరణ వార్తను గ్రామస్తులకు చెప్పాడు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరణించిన రైతు కుటుంబాలకు ఒక్కొరికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు విప్ ఓదెలు, కలెక్టర్ కర్ణన్ హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.50 వేలు చెక్కులను అందజేశారు. జెడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్‌నాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు చేకూర్తి సత్యనారాయణరెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ భూమేశ్వర్, జైపూర్ ఏసీపీ సీతారామలు, సీఐ నారాయణ ఆరేపల్ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తెల్లారితే వడ్లని తీసుక పోయేవారు: రైతులు ఆరెపల్లిలో రైతులు ఆరబెట్టిన వడ్లను భీమారంలోని కొ నుగోలు కేంద్రం నిర్వాహులు ఆదివారం తరలిస్తామని చెప్పినట్లు స్థానిక రైతులు తెలిపారు. గ్రామంలో కొనుగోలు కేంద్రం లేక ఆరెపల్లి వరిధాన్యం మొత్తం భీమారం తరలిస్తుంటారు. ఈమేరకు శనివారం ఐకేపీ వీవో సభ్యులు ఆరెపల్లికి వెళ్లి వరి ధాన్యం పరిశీలించారు. తేమ శాతం సరిపోను ఉందని ఆదివారం తీసుకెళ్తామని చెప్పి వెళ్లినట్లు రైతులు పేర్కొన్నారు. ఇంతలోనే అంత పనిజరిగిందా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధిన పడ్డ కుటుంబాలు పిడుగుపాటు గురై మృతి చెందిన ముగ్గురు రైతులకు స్వంత భూమి కూడా లేదు. వీరు ఇతురుల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఆరెపల్లిలో గతంలో కన్నా ఇప్పుడు వ్యవసాయం అభివృద్ధి చెందడంతో వ్యవసాయంపై కూలీలు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ముగ్గురు రైతులు కూలీ పనులు మానుకుని నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ముడిపల్లి రాజం ఏడెకరాలు, రాంటుంకి రాజయ్య నాగుగెకరాలు, జాడి రమేశ్ ఆరెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల మరణంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. మృతి చెందిన జాడిరమేశ్కు భార్య, ఒక కూతురు ఉన్నారు. మిడిపల్లి రాజంకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాటెంకి రాజయ్యకు భార్య రాజేశ్వరి, కూతురు రవళి, కుమారుడు అంజి ఉన్నారు. -
ప్రజలు మూఢ నమ్మకాలు వీడాలి
చెన్నూర్‌రూరల్ : మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు మూఢ నమ్మకాలను వీడా లని జైపూర్ ఏసీపీ సీతారాములు అన్నారు. మండలంలోని ఆస్నాద గ్రామంలో శనివారం రాత్రి కమిషనరేట్ పరిధిలో మూడ నమ్మకాలపై, రోడ్డు ప్రమాదాలపై, మద్యం తాగితే కలిగే నష్టాలు, ర్యాగింగ్, బాల్యవివాహలు, గల్ఫ్ మోసాలు, రైతుల అత్మహత్యలు వివిధ రకాల సమస్యల గురించి నాటకాల రూపంలో కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులకు సహకరించొద్దన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆన్నారు. యువత చెడు వ్యసనాల జోలికిపోవద్దన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా జేపీవో దృషికి తెస్తే పరిష్కరిస్తారన్నారు. గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను నిర్వహించొద్దని సూచించారు. చెన్నూర్ పట్టణ సీఐ కిశక్షర్, సర్పంచ్ కొల్లూరి బుచ్చమ్మ, లచ్చన్న, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
గుడిసె దగ్ధం: వృద్ధుడు సజీవ దహనం
చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం చెల్లాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కాగా ఓ వృద్ధుడు సజీవదహనమయ్యాడు. సిందిల సమ్మయ్య(80) అనే వృద్ధుడు మంటల్లో పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదిగో పులి...
⇒ బ్రాహ్మన్‌పల్లి అటవీ ప్రాంతంలో సంచారం ⇒ శుక్రవారం సీసీ కెమెరాకు చిక్కిన వైనం ⇒ భయాందోళనలో రెండు మండలాల ప్రజలు ⇒ అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చెన్నూర్/కోటపల్లి: మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పులి సంచరిస్తున్న విషయం తేటతెల్లమైంది. పదిహేను రోజుల క్రితమే అటవీ అధికారులు వేమనపల్లి మండలంలో పులి సంచరిస్తుందన్న విషయాన్ని ధ్రువీకరిం చారు. తాజాగా శుక్రవారం వేమనపల్లి మండలం నీల్వాయి, కోటపల్లి మండలం బ్రాహ్మన్‌పల్లి అటవీ ప్రాంతంలో పులి కుర్మ శ్రీనివాస్‌కు చెందిన ఆవును హతమార్చింది. ఆ ప్రాంతంలో లభించిన ఆధారాలను సేకరించిన ఫారెస్ట్ అధికారులు పులే ఆవును హతమార్చిందని నిర్ధారించారు. దీంతో రెండు మండలాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. పులి సంచారాన్ని తెలుసుకునేందుకు కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్రాహ్మన్‌పల్లి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో శనివారం పులి చిక్కినట్లు అధికారులు తెలిపారు. నాలుగు నెలల తర్వాత. పంగిడి సోమారం గ్రామానికి చెందిన రాళ్లబండి శ్రీనివాస్ అనే రైతుకు చెందిన ఆవును గతేడాది నవంబర్ 8న అటవీ ప్రాంతంలో పులి హతమార్చింది. ఈ విషయంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆవు ఇంటికి రాక పోవడంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా.. 2016 నవంబర్ 15న ఆవు కళేబరం లభించింది. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలుపడంతో అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆవును పులి హతమార్చిన అనవాళ్లు లభించడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలో పులి చిక్కింది. ఒంటరిగా వెళ్లొద్దు.. కోటపల్లి అడవుల్లో పులి సంచరిస్తోందని అటవీ ప్రాంతా నికి ఒంటరిగా వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ నాలుగు నెలల తర్వాత కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మళ్లీ అదే రీతిన పులి ఆవును హతమార్చింది. గతంలో ఆవును హతమార్చిన పులి వారం వ్యవధిలోనే కోటపల్లి మండలం పిన్నారం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి మృతి చెందిం ది. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా పులి సంరక్షణకు ఫారెస్ట్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారని ఈ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. అంతా గోప్యం.. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో పులి సంచరిస్తున్నది సీసీ కెమెరాలో చిక్కినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పులి సంచరిస్తుందన్న విష యం బయటికి పొక్కితే వేటగాళ్లు మళ్లీ పులిని వేటాడే అవకాశాలుండడంతో అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. ఎట్టకేలకు శనివారం నీల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బ్రాహ్మన్‌పల్లి అటవీ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాకు పులి చిక్కిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. అప్రమత్తమైన అధికారులు.. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు పులి సంచరిస్తుందన్న సమాచారం మేరకు పక్షం రోజులుగా చెన్నూర్, కోటపల్లి, నీ ల్వా యి ఫారెస్ట్ రేంజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు మండలా ల్లో పులి ఎక్కడైనా సంచరించే అవకాశం ఉండడంతో మూడు రేంజ్‌ల సి బ్బందిని అప్రమత్తం చేశారు. గ్రామాల్లో డప్పు చాటింపు వేయిస్తున్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, బేస్ క్యాంప్ సిబ్బంది తాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల వేటగాళ్లున్న గ్రామాలను సందర్శించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వన్యప్రాణులను హతమారిస్తే కఠిన చర్యలుంటా యని హెచ్చరికలు జారీ చేస్తూనే.. వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం పులి సంచరిస్తున్న విషయం వాస్తవమే. పులి ఈ ప్రాంతంలో ఉం డేందుకు అన్ని సౌకర్యాలున్నాయి. సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతం నుంచి ఇటు వచ్చింది. చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌ల అధికారులను అప్రమత్తం చేశారు. బేస్ క్యాంప్ సిబ్బంది పులి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నీల్వాయిలో ప్రాజెక్ట్ ఉండడంతో నీటి వస తి సమృద్ధిగా ఉంది. చిన్నచిన్న జంతువులు పులికి ఆహారంగా మారుతున్నాయి. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. పాత వేటగాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశాం. నీల్వా యి అటవీ ప్రాంతంలో 11కేవీ విద్యుత్ తీగలు లేవు. పులికి హానీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. – తిరుమలరావు, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, చెన్నూర్ -
మద్యం ఎంత పని చేసింది...
చెన్నూర్: పట్టణంలోని జెండావాడకు చెందిన కొండమూరి నాగరాజు (35) అనే వ్యక్తి మద్యం మత్తులో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఏఎస్సై బెనర్జీ తెలిపారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. నాగరాజు మద్యానికి బానిసై ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన నాగరాజు అతడి భార్య లక్ష్మితో ఘర్షణ పడి ఇద్దరు పిల్లలతోసహా ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో లక్ష్మి భయంతో సమీపంలోని సోదరుని ఇంటికి వెళ్లింది. అర్ధరాత్రి 2గంట ప్రాంతంలో లక్ష్మి తన బంధువులతో ఇంటికి వెళ్లి చూడగా లోపలి గడియపెట్టి ఉంది. అనుమానం వచ్చిన బంధువులు తలుపులు బద్దలు కొట్టి చూడగా నాగరాజు నాగరాజు దూలానికి ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
కొండపేట(చెన్నూరు): చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామానికి చెందిన జెండాల మస్తాన్(36) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వినోద్‌కుమార్, మృతుని బంధువుల కథనం మేరకు..మస్తాన్ ట్రాక్టర్లో వరిపొట్టు పోసే కూలీగా వెళ్లేవాడు. బుధవారం రాత్రి భార్య, కుమారుడు, అదే గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి బాగా కడుపు నొప్పిగా ఉందని కుమార్తెకు చెప్పడంతో తల్లికి ఫోన్‌చేసి చెప్పింది. ఈ వేళలో వెళ్లేందుకు ఇబ్బందని ఉదయాన్నే వెళదామని చెప్పడంతో కుమార్తెను పడుకోమని చెప్పి, మస్తాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే కొడుకు వెళ్లి తలుపు తట్టగా తీయకపోవడంతో తోసి చూడగా పైపునకువేలాడుతూ కనిపించాడు. పక్కింటి వారి సాయంతో కిందకు దించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. విచారణ చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. -
నేటి నుంచి మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు
చెన్నూర్ నుంచి సిరోంచకు ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం ట్రయల్ రన్ చెన్నూర్: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాక పోకలు ప్రారంభంకానున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నుంచి కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో బస్సును ఆదివారం నుంచి అధికారులు ప్రారంభించనున్నారు. శనివారం చెన్నూర్ నుంచి కాళేశ్వరం మీదు గా సిరోంచ వరకు కిలో మీటర్ల సర్వే కోసం ఆర్టీసీ అధికారులు ట్రయల్ ట్రిప్పును ప్రారంభించారు. కాళేశ్వరం గోదావరి నదిపై నిర్మించిన వంతెన ప్రారంభం కావడంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలకు సులభతరం చేసే క్రమంలో అధికారులు ఈ మేరకు ఏర్పాటు చేశారు. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులను చెన్నూర్ బస్టాండ్ నుంచి, పలుగుల, కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ వరకు ఆర్టీసీ బస్సును నడిపించేందుకు సిద్ధం అవుతున్నారు. చెన్నూరు నుంచి కాళేశ్వరం మీదుగా సిరోంచకు ఆర్టీసీ బస్సులను ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు మంచిర్యాల ఆర్టీసీ డీఎం పీఆర్ కృష్ణ తెలిపారు. చెన్నూరు నుంచి కాళేశ్వరం వెళ్లేందుకు ప్రస్తుతం తాత్కాలిక వంతెన మాత్రమే ఉంది. గతంలో మంచిర్యాల ప్రజలు సిరోంచకు వెళ్లాలంటే కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాం తంలోగల ప్రాణహిత నదిపై పడవల ద్వారా ప్రయాణం చేసేవారు. ప్రాణహితపై వంతెన కోసం రూ. 126 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. -
ఈవ్ టీజింగ్‌కు పాల్పడుత్ను విద్యార్థిని పోలీసులకు అప్పగింత
చెన్నూరు: విద్యార్థినుల పట్ల నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న చెన్నూరుకు చెందిన ఓ యువకుడ్ని పోలీసులకు అప్పగించారు. తమను నిత్యం బస్సుల్లో ఈవ్‌టీజింగ్ చేస్తున్నారని కొందరు విద్యార్థినులు కడపలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు విన్నవించారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు గమనించి హెచ్చరించినా మార్పు రాలేదు. రోజూలాగే బస్సులో ఈవ్‌టీజింగ్ చేస్తున్న యువకులను బుధవారం సాయంత్రం కడప నుంచి పల్లెవెలుగు బస్సులో వెళుతున్న ఆ మహిళా కానిస్టేబుల్ గమనించి, చెన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. చెన్నూరు కొత్తరోడ్డు వద్ద కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఎస్ఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నామని, విద్యార్థిని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. -
ఈవ్ టీజింగ్‌కు పాల్పడుత్ను విద్యార్థిని పోలీసులకు అప్పగింత
ఈవ్ టీజింగ్‌కు పాల్పడుత్ను విద్యార్థిని పోలీసులకు అప్పగింత student arrested by eve teasing ఆర్టీసీ బస్సు, చెన్నూరు, మహిళా కానిస్టేబుల్ rtc bus, chennur, lady conistable చెన్నూరు: విద్యార్థినుల పట్ల నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న చెన్నూరుకు చెందిన ఓ యువకుడ్ని పోలీసులకు అప్పగించారు. తమను నిత్యం బస్సుల్లో ఈవ్‌టీజింగ్ చేస్తున్నారని కొందరు విద్యార్థినులు కడపలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు విన్నవించారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు గమనించి హెచ్చరించినా మార్పు రాలేదు. రోజూలాగే బస్సులో ఈవ్‌టీజింగ్ చేస్తున్న యువకులను బుధవారం సాయంత్రం కడప నుంచి పల్లెవెలుగు బస్సులో వెళుతున్న ఆ మహిళా కానిస్టేబుల్ గమనించి, చెన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. చెన్నూరు కొత్తరోడ్డు వద్ద కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఎస్ఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నామని, విద్యార్థిని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. -
వ్యక్తికి గాయాలు
చెన్నూరు : స్థానిక పెన్నా వంతెన వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో మైదుకూరు మండలం నారావారిపల్లెకు చెందిన శివపురం చిన్నపుల్లయ్య(23) అనే వ్యక్తి గాయపడ్డాడు. పుల్లయ్య సొంత పనిమీద అపాచి భైకులో కడపకు వెళుతుండగా చెన్నూరు పెన్నా వంతెన వద్దకు రాగానే కడప నుంచి మైదుకూరు వైపునకు యూరియా లోడుతో వెళుతున్న లారీ వేగంగా ఢీకొంది. దీంతో గాయపడిన పుల్లయ్యను కడపకు తరలించారు. లారీని, బైకును స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపారు. -
బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
– ఒకరు మృతి చెన్నూరు : కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారిలోని చెన్నూరు పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో నంద్యాల ఈశ్వరయ్య(32) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మండలంలోని శివాల్‌పల్లెకు చెందిన నంద్యాల ఈశ్వరయ్య ఫెర్టిలైజర్ కంపెనీలో ఏజెంటుగా పని చేస్తూ, స్థానికంగా వ్యవసాయం చేసుకుని జీవించేవాడు.అదే గ్రామానికి చెందిన ఆదివెంకటరమణ(26) అనే వ్యక్తితో కలిసి బైకుకు పెట్రోల్ పట్టించుకొనేందుకు చెన్నూరుకు వచ్చారు. పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు దాటుతుండగా కడప డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళుతూ బైకును ఢీకొంది. దీంతో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలు కాగా, రమణకు గాయాలయ్యాయి. ఇద్దరిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ఈశ్వరయ్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య అయ్యవారమ్మ, 3 ఏళ్ల కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును, బైకును స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
చెన్నూరులో చోరీ
చెన్నూరు (ఆదిలాబాద్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి దోచుకెళ్లిన సంఘటన అదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారుపాక పోచం అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు పడి ఇంట్లో ఉన్న తులం బంగారం, 16 తులాల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు, టీవీ, ఫ్యాన్ వంటి ఎలక్ట్రిక్ గృహోపకరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
విష జ్వరంతో చిన్నారి మృతి
చెన్నూరు: స్థానిక సరస్వతీనగర్‌లో నివాసముంటున్న కె రవి, మహేశ్వరిల కుమార్తె తేజస్విని(2) విషజ్వరంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. బంధువులు తెలిపిన ప్రకారం తేజస్వినికి మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాల, ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించారు. శుక్రవారం వైద్యశాలలో చికిత్స అనంతరం ఇంటికి తీసుకురాగా రాత్రి తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండటంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా, కడపకు తీసుకెళ్లాలని సూచించారు. రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. విజృంభిస్తున్న విష జ్వరాలు : చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె, శివాలపల్లె, చెన్నూరు, బయనపల్లె గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చెన్నూరు తూర్పు దళితవాడకు చెందిన బాలిక డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతోంది. వనంవీధికి చెందిన సురేష్ కుమార్తె అలేఖ్య (7) విషజ్వరంతో బాధపడుతుండగా కడపకు తీసుకెళ్లగా డెంగీ జ్వరమని అక్కడి వైద్యులు నిర్ధారించడంతో కర్నూలుకు తరలించారు. మండలంలో పలు గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నారని అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
చెన్నూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
ఆందోళన బాటపట్టిన చెన్నూర్ ప్రజానీకం మంచిర్యాల సిటీ : కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని చెన్నూర్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయం ఇన్చార్జి రాజేశ్వర్‌రావుకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్చార్జి డాక్టర్ మురళీధర్‌గౌడ్ మాట్లాడుతూ చెన్నూర్‌ను డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తే వేమనపల్లి, కోటపల్లి, జైపూర్ మండలాలతోపాటు చెన్నూర్ మండలవాసులకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మండల వ్యవస్థ రాకముందు చెన్నూర్ తహసీల్ కేంద్రంగా ప్రజలకు సేవలందించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, అందుగుల శ్రీనివాస్ ఉన్నారు. -
సాక్షి హరితహారం
-
టాటా ఏస్, లారీ ఢీ: ఒకరి మృతి
చెన్నూరు: వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం పాలంపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం, మినీలారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వీరపునాయునిపల్లె మండలానికి చెందిన వీరంతా ఒంటిమిట్టలోని రామాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెన్నూరులో ప్రబలిన విష జ్వరాలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో విష జ్వరాలు ప్రబలాయి. దీంతో గ్రామంలోని 200 మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో 10 మంది డెంగ్యూతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నై, నెల్లూరు ఆసుపత్రులకు తరలించారు. -
పోలీసుల అదుపులో నకిలీ వైద్యురాలు
చెన్నూర్ (ఆదిలాబాద్) : స్త్రీల వైద్య నిపుణురాలిగా అవతారమెత్తిన ఓ నర్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నూర్‌లో గత మే 15 వ తేదీన ప్రారంభించిన ఓ నర్సింగ్‌హోంలో నాగమణి చెన్ను అనే మహిళ.. స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలి(ఎంఎస్, ఓబీజీ)గా చేరింది. గత మూడు నెలలుగా రోగులకు సేవలందిస్తోంది. అయితే రోగులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తుండటం, సరైన మందులు రాయకపోవడంతో యాజమాన్యానికి అనుమానం వచ్చింది. ఆసుపత్రి వైద్యులకు ఆమె సర్టిఫికెట్‌పై అనుమానం ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాగమణి స్వగ్రామం విజయవాడకు వెళ్లి విచారణ చేపట్టారు. గుంటూరులో నాగమణి చెన్ను అనే వైద్యురాలు లేదని, ఈ నాగమణి గుంటూరు ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా మాత్రమే పని చేసిందని తెలిసింది. నకిలీ సర్టిఫికెట్‌తోపాటు రిజిస్ట్రేషన్ నంబరు 65699తో చెన్నూర్‌లో పని చేసింది. హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెంట్ ద్వారా ఇక్కడ చేరింది. నాగమణిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చెన్నూర్ ఎస్సై చందర్ తెలిపారు. -
ఉప్పొంగిన వాగులు : నిలిచిన రవాణా
చెన్నూరు (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. దీంతో గురువారం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మండలంలోని బుద్దారం, సంకారం, సుద్దాల నారాయణపూర్ గ్రామాల మధ్యలో ఉన్న వాగులు గురువారం కురిసిన వర్షంతో పొంగిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో ఈ గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. -
30 టేకు దుంగలు స్వాధీనం
చెన్నూరు: అక్రమంగా నిల్వ ఉంచిన 30 టేకు దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం అక్కపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. అక్కపల్లి గ్రామంలోని అక్కపల్లి వాగులో టేకు దుంగలను అక్రమంగా నిల్వ ఉంచినట్లు అటవీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని 30టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. కాగా, ఈ దుంగలను ఎవరు నిల్వ ఉంచారనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత
చెన్నూరు (ఆదిలాబాద్ జిల్లా) : అక్రమంగా కిరాణ దుకాణంలో నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. కిష్టంపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి కిరాణ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కిరాణ దుకాణంపై సోమవారం దాడి చేసి 66 బాటిళ్ల లిక్కర్, 14 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణంగా హత్య చేసి పొలాల్లో పడేసి..
చెన్నూరు : వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం గోపవరం గ్రామంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. సుమారు 32 ఏళ్ల వయసున్న వ్యక్తిని గొంతు నులిమి, తలపై రాడ్‌తో మోది హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని చూసిన రైతులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెన్నూరులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
చెన్నూరు:మిషన్ కాకతీయ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలోని మల్లబోయినకుంట, శెలువగుంట చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, జిల్లా కలెక్టర్ జగన్మోహన్రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, చెన్నూరులో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఆదివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. -
భూ క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం
చెన్నూర్: భూ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం మార్గదర్శకాలనూ విడుదల చేసింది. జీవో ఎంఎస్ నం.58, 59 గత ఏడాది డిసెంబర్లో జారీ చేసింది. వారం రోజులు గడవకముందే ప్రభుత్వ భూ ఆక్రమణదారులపై కేసు నమోదు చేయడంతో ప్రభుత్వ భూకబ్జాదారుల గుండెల్లో దడ మొదలైంది. గతంలో కొందరు రియల్టర్లు అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జా చేసి విక్రయించారు. దీంతో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకునేందుకు భూమి లేని దుస్థితి ఏర్పడింది. కబ్జాదారుల భరతం పట్టేందుకు భూ క్రమబద్ధీకరణ పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులపై కొరడా ఝలిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. వేలాది ఎకరాలు వెలుగులోకి.. భూ క్రమబద్ధీకరణతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెలుగులోకి వస్తాయి. చెన్నూర్ పట్టణంలో జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడ్డ అక్రమార్కులు బండారం బయటపడనుంది. ఆక్రమణదారుల వద్ద భూములు కోనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారూ ఇబ్బందుల పాలు కానున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఇల్లు నిర్మించుకున్న వారు సైతం అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండి మార్కెట్ విలువ ప్రకారం భూమి ధర నుంచి 50, 75 శాతం చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన వారు రెండు విధాలుగా నష్టాపోవాల్సి వస్తుంది. రాయల్టీ చెల్లించనట్లయితే ఆ కట్టడాలతో సహా ఆక్రమించుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. ఎంతటి వారైనా వదిలేది లేదు.. ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా వదిలేది లేదు. గడువులోగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పట్టణ సమీపంలోని 869 సర్వే నంబర్లో ఎకరం భూమిని ఆక్రమించుకున్న తబస్సమ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆమె కట్టుకున్న అక్రమ కట్టడాలను తొలగిస్తాం. ప్రభు త్వ భూమిని ఆక్రమించుకున్న ప్రతీ వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. - హన్మంతరావు, తహశీల్దార్, చెన్నూర్. -
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా
చెన్నూర్/మందమర్రిరూరల్/మంచిర్యాల టౌన్ : మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. బుధవారం రాత్రి మంచిర్యాల పోలీసుస్టేషన్, గురువారం చెన్నూర్, మందమర్రిలోని పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. సెంట్రీ, తుపాకులు భద్రపర్చే గదులు, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయా స్టేషన్లలో విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల నుంచి జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, కాసిపేట మండలం తిర్యాణిలో ఎదురుకాల్పులు జరిగాయని, అక్కడ తప్పించుకుని పారిపోయారని అన్నారు. జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 15ఏళ్ల క్రితం సికాస పనిచేసిందని, ఆ సమయంలో పనిచేసిన సానుభూతి పరులను ఆకట్టుకుని ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా బుధవారం మందమర్రిలో వాల్‌పోస్టర్లు వేశారని తెలిపారు. వీటిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. మందమర్రి పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లోపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మంచిర్యాలలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌తోపాటు మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా ఎస్సై నియామకానికి త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏఎన్ఎంలు స్థానికంగా ఉండాలి
అంగ్రాజ్‌పల్లి(చెన్నూర్ రూరల్) : ఏఎన్‌ంలు స్థానికంగా ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌వో రుక్మిణమ్మ వైద్యులను ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెన్నూర్ మండలంలోని అంగ్రాజ్‌పల్లి గ్రామంలోని పీహెచ్‌సీని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీకి వచ్చే రోగుల రిజిస్టర్లను, పీహెచ్సీలో మందుల స్టాక్‌ను పరిశీలించారు. మండలంలో పీహెచ్సీ తరఫున వైద్యశిబిరాలు పెడుతున్నారా లేదా ఆరా తీశారు. డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ, మందులు ఎక్స్పైరీ అయిన వెంటనే తీసేయాలని సూచించారు. పీహెచ్సీలో డెలివరీలు అయ్యేలా చూడాలని క్లస్టర్ వైద్యుడు సత్యనారాయణకు, పీహెచ్సీ వైద్యురాలు అరుణశ్రీని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందుతుందా లేదా అని తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు గ్రామాల్లో తిరిగి గర్భిణుల ఆరోగ్య స్థితిగతులు ఆరా తీయాలని స్పష్టం చేశారు. వారవారం సమావేశమవ్వాలని పేర్కొన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి అదనపు నిధులు చెన్నూర్ : ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి అభివృద్ధికి వచ్చే నిధులతో పాటు అదనంగా మరిన్ని మంజూరు చేస్తానని జిల్లా వైద్యాధికారిని రు క్మిణమ్మ అన్నారు. మంగళవారం స్థానిక ప్ర భుత్వ సివిల్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో వైద్యుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నూర్ ఆస్పత్రికి కోటపల్లి, వేమనపల్లి మండలాల రోగులు వస్తారని, దీని సా ్థయి పెంచి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చే యాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రా జిరెడ్డి వైద్యాధికారిని కోరారు. తనవంతు కృ షి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం రోగులను పరీక్షించారు. ఎంపీపీ మైదం కళావ తి, సర్పంచ్ ఎస్.కృష్ణ పాల్గొన్నారు. బాలింత మృతిపై విచారణ ఈ నెల 20న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత కుందేటి ప్రమీల(28) వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బాధితులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. జిల్లా వైద్యాధికారిని రుక్మిణమ్మ చెన్నూర్‌కు వచ్చిన సందర్భంగా దీనిపై గోప్యంగా విచారణ జరిపారు. ప్రమీల మృతిచెందిన వార్డుకు వెళ్లి వార్డులో ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలింత ప్రమీల వ్యక్తిగత కేశీట్ను పరిశీలించారు. కాలేయంలో నీరు రావడంతోనే ప్రమీల మృతి చెందిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
చెన్నూర్ : వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి కుందేటి ప్రమీల (28) శుక్రవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. వైద్యులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమీలకు నెలలు నిండడంతో గత మంగళవారం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికు వెళ్లింది. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు అరుణశ్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలని సూచించింది. అదే రోజు కుటుంబసభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి 12.30 నిమిషాలకు ప్రమీల నార్మల్ డెలివరీ అయిన ప్రమీల మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు పరీక్షలు నిర్వహించిన వైద్యుడు సత్యనారాయణ బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగలేదని పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని సూచించడంతో ప్రమీల భర్త శ్రీనివాస్ కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులతోపాటు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం వరకు ప్రమీల కడుపులో మంటగా ఉందని చాలా అవస్థ పడింది. సిబ్బంది, వైద్యులు అందుబాటులో లేక వైద్యం అందక తెల్లవారు జామున ప్రమీల మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పారు. వైద్యులు అందుబాటులో ఉంటే ప్రమీల బతికేదని పేర్కొన్నారు. మృతురాలికి భర్త శ్రీనివాస్, కుమారుడు క్రిష్ ఉన్నారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన ప్రమీల మృతికి కారణమైన వైద్యులు, సిబ్బందిని సస్పెండ్ చేసి, మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట మృతురాలు బంధువులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, సీఐటీయూ, కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు ధర్నా చేశారు. నాలుగు గంటల పాటు ధర్నా చేయడంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలియడంతో జిల్లా పరిషత్ ైవె స్ చైర్మన్ మూల రాజిరెడ్డి, తహశీల్దార్ హన్మంతరావు సంఘటన స్థలానికి చేరుకొని వైద్యులను విచారించారు. వైద్యులపై చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తహశీల్దార్ చెప్పినా ఆందోళన కారులు వినిపించుకోలేదు. వైద్యులకు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తహశీల్దార్ ఆర్డీవోతో మాట్లాడారు. దళితబస్తీ పథకం ద్వారా మూడు ఎకరాల భూమి, ఆపద్బంధు పథకం కింద రూ.1.50 లక్షలు అందజేస్తామని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లేశ్, చిరంజీవి, కృష్ణమాచారి, తగరం మధురాజ్, మోహన్ పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చెన్నూర్ : అప్పుల బాధ తాళలేక దూలానికి ఉరివేసుకొని రైతు తోట కిషన్ (43) శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథ నం ప్రకారం.. చెన్నూర్ పట్టణంలోని కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన కిషన్ తనకున్న రెం డెకరాల భూమితోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ ఏడాది పత్తి పంట సాగు చేశా డు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి రాలేదు. మూడేళ్ల నుంచి వరుసగా పంట నష్టపోవడంతో సుమారు రూ.6లక్షల వరకు అప్పయ్యాడు. ఇవి ఎలా తీర్చాలో తెలియక మనస్థాపం చెందాడు. భార్య మధునక్క చేనుకు వెళ్లగా, ఇద్దరు కూతర్లు మానస, మౌనిక కళాశాలకు వెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి కిషన్ దూలానికి ఉరి వేసుకున్నాడు. చిన్న కూతురు కళాశాల నుంచి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ వేసి ఉంది. ఎంత పిలిచిన పలకక పోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. -
నాలుగు రాష్ట్రాల వారధిపై ఆశలు
చెన్నూర్ : ప్రాణహిత నదిపై వంతెన లేక తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వంతెన నిర్మాణానికి పూనుకోలేదు. ప్రాణహిత నదిపై వంతెన నిర్మిస్తే నాలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెరగనున్నాయి. ఇటీవల వంతెన నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయడంతో నాలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆమోద ముద్రే తరువాయి.. తెలంగాణ రాష్ట్రంలోని జగ్దల్పూర్ నుంచి కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నది వరకు 66వ జాతీయ రహదారి పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇక ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి రెండు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నదులపై వంతెన నిర్మాణం చేపడతామని ప్రకటించా రు. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని సిరోంచ గ్రామానికి రాగా తెలంగాణ బీజేపీ నాయకులు ఆయనను కలిసి ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో నాలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. తగ్గనున్న దూరభారం ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రకు వెళ్లాలంటే 28 కి లోమీటర్లు మాత్రమే ప్రయాణించాలి. అదే ఇతర ప్రాం తాల నుంచి వెళ్తే 150 కిలోమీటర్లు ప్రయాణించక తప్ప దు. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ప్రాణహి త నది మీదుగా వెళ్తే 200 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. అలాగే ప్రయాణ వ్యయం కూడా తగ్గుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో దూరం భారమైనా, ప్రయాణ వ్యయం ఎక్కువైనా ఇన్నాళ్లుగా ఈ రాష్ట్రాల మధ్య రాకపోకలు తప్పడం లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల వ్యాపారులు ఇప్పటికే ప్రాణహిత మీదుగా వచ్చి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. వంతె న నిర్మిస్తే నాలుగు రాష్ట్రాల్లో వ్యాపార సంబంధాలతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. సరిహద్దుల్లో తెలంగాణ వారే ఎక్కువ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఉన్నారు. కొందరు వ్యాపార నిమిత్తం ఆ రాష్ట్రాల్లో ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన చాలామంది ఆయా రాష్ట్రాల వారిని వివాహమాడారు. దీంతో మూడు రాష్ట్రాల్లో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. వీరు ప్రాణహిత నది మీదుగానే ప్రయాణం సాగిస్తారు. వంతెన నిర్మిస్తే నాలుగు రాష్ట్రాలకు లాభం చేకూరుతుంది. -
కారుకు ఓటేసి కష్టాల పాలు..
చెన్నూర్/కోటపల్లి : బంగారు తెలంగాణ తీసుకువస్తామని చెప్పిన కేసీఆర్ మాయమాటలు విని కారు గుర్తుకు ఓటేస్తే కష్టాలు తీసుకొచ్చారని, ప్రజలు ఓటు వేసి గెలిపించిన కారు ప్రజలపై సవారీ చేస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కోటపల్లి మండల కేంద్రంలో పూర్తిస్థాయి రుణమాఫీ, నిరంతర విద్యుత్ సరఫరా, రైతు ఆత్మహత్యలకు నిరసనగా చేపట్టిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రోజుకో నిబంధన పెడుతూ ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. కరెంటు కోతలతో రైతులు పంటలు ఎండి తీవ్రంగా అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తామంతా కృషి చేశామని చెప్పారు. ఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీల ధైర్యంతోనే కేసీఆర్ ముందడుగు వేశారని.. ఏనాడూ స్వయంగా పార్లమెంటు వద్ద నిరసన తెలిపిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ ప్రజల బతుకులను బాగు చేసేందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని విమర్శించారు. కరెంటు లేకుంటే పరిశ్రమలెలా వస్తాయి.. తెలంగాణలో కరెంటు లేకుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. రెండు నెలల క్రితం కేసీఆర్ తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఛత్తీస్‌ఘడ్ నుంచి రెండున్నర నెలల్లో కరెంటు తెస్తామని చెప్పిన వీడియో దృశ్యాలను ఈ సందర్బంగా ప్రజలకు చూపించారు. ప్రస్తుతం మూడేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవని కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రోజుకో మాట మాట్లాడ్డం కేసీఆర్ నైజమని పేర్కొన్నారు. జిల్లాలో 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పరిహారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇటీవల డెంగీ జ్వరంతో ఎమ్మెల్యే మనమరాలు మృతి చెందినా.. జిల్లాలో డెంగీ మరణాలు లేవనడం ఎంత వరకు సమంజసమన్నారు. తెలంగాణ ఇప్పటివరకు రైతులు చేసుకున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని, పదవీకాంక్షతోనే ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం కోసం ఊహకందని హామీలు ఇచ్చిందని.. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని మాజీ ఎంపీ బలరాం నాయక్ ఆరోపించారు. కేట్లు, డూప్లికేట్లు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. డబ్బులు సంపాదనే ధ్యేయంగా పాలకులు ఇసుక రిచ్ కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తాని హామీ ఇచ్చారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు ముక్కుపోగులు, మూడు తులాల బంగారం ఇస్తామని కేసీఆర్ మభ్యపెట్టే అవకాశాలు ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీని అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి వినోద్, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పాడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
చెన్నూర్ : జిల్లాలో పాడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాడి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. యాక్షన్ ప్లాన్ పంపించాలని మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (పాల శీతలీకరణ కేంద్రం) నిర్వాహకులకు సూచించింది. పాడి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2003లో జిల్లాలో 11 పాల శీతలీకరణ కేంద్రాలు ప్రారంభించారు. పాడి సంపద అంతరిస్తుండడంతో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఉట్నూర్, బోథ్, ఇచ్చోడలోని పాలడెయిరీ కేంద్రాలు మూతపడ్డాయి. ఆదిలాబాద్, నిర్మల్, లక్సెట్టిపేట, చెన్నూర్, భైంసా, కడెం మండలాల్లో కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు వేల లీటర్ల పాల సేకరిస్తున్నారు. దీంతో వెయ్యి మందికి పైగా రైతులకు ఉపాధి లభిస్తోంది. రైతుకు మేలు.. పాడి సంపద అభివృద్ధితోనే రైతులకు మేలు జరుగుతోందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రైతులకు డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గేదెలు, ఆవులు మంజూరు చేసి 20 వేల లీటర్ల పాలు సేకరించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పాల డెయిరీ జిల్లా మేనేజర్ గజ్జరామ్ తెలిపారు. పాడి సంపదను అభివృద్ధి చేస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందికి లాభం చేకూరడంతోపాటు ఉపాధి మెరుగయ్యే అవకాశాలున్నాయి. పాల డెయిరీల ఆధునికీకరణ పాల డెయిరీల బలోపేతంలో భాగంగా జిల్లాలోని పాలడెయిరీలను ఆధునికరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో పాల సామర్థ్యాన్ని పాల డెయిరీలో పనిచేసే ఉద్యోగులు పరీక్షించే వారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఈఎంటీ(ఎలక్ట్రానిక్ మెనికో టైసర్) ద్వారా పాలను పరీక్షించాలని పరికరాలు పంపిణీ చేయనుంది. అవసరమైనంత మంది బాలమిత్రలను ఎంపిక చేసి గౌరవ వేతనంతోపాటు ఇన్సెంటివ్ ఇవ్వనుంది. -
సింగరేణి సంస్థ పేరుతో ఇసుక అక్రమ రవాణా
చెన్నూర్ : పేరు సింగరేణిది.. అక్రమార్జన వ్యాపారులది.. ఇదీ ప్రస్తుతం చెన్నూర్ పరిధిలోని గోదావరిలో సాగుతున్న తంతు. ఏడేళ్లుగా గోదావరి నుంచి యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. నిబంధనలు తుంగలో తొక్కి సింగరేణి పేరు చెప్పి.. ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా స్పందించే వారు లేకుండా పోయారు. చివరికి మంచిర్యాల ఆర్టీవో అయేషా మస్రత్ ఖానమ్ పరిశీలనలో ఈ అక్రమ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నూర్‌లోని గోదావరి నుంచి సింగరేణి సంస్థకు ఇసుక తరలించేందుకు సెప్టెంబర్ 21, 2007లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని సర్వే నంబర్లు 225 నుంచి 468 వరకు ఉన్న 540 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టాలని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులు హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ సమయంలో వారు పట్టించుకోలేదు. గోదావరి మధ్యలో నుంచి తవ్వకాలు.. హద్దులు చూపించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. తమను ఎవరు అడ్డుకుంటారనే ధీమాతో సింగరేణి కాంట్రాక్టర్లు గోదావరి మధ్యలో నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తంతు ఏడేళ్లుగా కొనసాగుతున్నా నేటికీ అధికారులు గమనించకపోవడం వారి నిర్లక్ష్యంగా స్పష్టం చేస్తోంది. అయితే.. శుక్రవారం రాత్రి గోదావరి నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి సంస్థకు అని చెప్పి ఇసుక తరలిస్తున్న మూడు లారీలను తహశీల్దార్ పట్టుకున్నారు. దీంతో శనివారం మంచిర్యాల ఆర్డీవో అయేషా మస్రత్ ఖానమ్ గోదావరి నదిని సందర్శించారు. సింగరేణి సంస్థకు ఇచ్చిన అనుమతి ప్రాంతాల్లో కాకుండా గోదావరి మధ్యలోంచి అక్రమంగా రవాణా సాగుతోందని ఆమె పరిశీలనలో వెల్లడైంది. అక్రమాలకు రాచ మార్గం... సింగరేణి సంస్థకు ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని కొందరు కాంట్రాక్టర్లు గోదావరి నది నుంచి సంస్థకే కాకుండా రాష్ట్ర రాజధానికి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గోదావరి ప్రాంతం నుంచి ఇసుక తీసుకెళ్లే లారీలను కాంట్రాక్టర్లు సింగరేణికి కాకుండా దారి మళ్లించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా ఏడేళ్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గోదావరి నదిలో 8 మీటర్ల లోతుగా ఇసుక ఉంటే 2 మీటర్ల వరకు తవ్వకాలు జరుపాల్సి ఉంది. కానీ.. సదరు కాంట్రాక్టర్లు 5 నుంచి 6 మీటర్ల లోతులో తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగు నీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఇసుక తవ్వకాలు నిలిపివేశాం.. గోదావరి నుంచి ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. సింగరేణి సంస్థకు ఇచ్చిన సర్వే నెంబర్లలో కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఇసుక రావాణా సాగుతోంది. దీంతో గోదావరి నదిలో ఉన్న రెండు పొక్లెయినర్లను సీజ్ చేసి ఇసుక తవ్వకాలను నిలిపి వేశాం. నివేదికన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తాం. -
తహసీల్దార్ వాహనంపై రాళ్లతో దాడి
హైదరాబాద్: వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలం తహసీల్డార్పై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై ఇసుక అక్రమ రవాణాదారులు రాళ్లతో దాడి చేశారు. మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలను గుర్తించిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనం ధ్వంసమవగా, సిబ్బంది గాయపడ్డారు. టీడీపీ నాయకులే దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దాడి సంఘటన గురించి తహసీల్డార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
బంగారు నాణేలు స్వాధీనం
చెన్నూర్ : మరుగుదొడ్డి నిర్మాణ తవ్వకాల్లో ఇటీవల కూలీలకు లభ్యమైన 34 బంగారు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని కోటబోగూడ ప్రాంతానికి చెందిన గడుదాసు గట్టయ్య ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం 15 రోజుల క్రితం పట్టణానికి చెందిన కూలీలు పెరుకుల రాజు, సత్యనారాయణ, హరీశ్, గంగన్న, గుంజ్ర రమేశ్ గుంత తవ్వుతుండగా అందులో ఒక డబ్బా కనిపించింది. ఆ డబ్బాను రాజు చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. విషయాన్ని సహచర కూలీలకు చెప్పి అందరూ కలిసి పంచుకున్నారు. ఈ క్రమంలో రాజు గురువారం బంగారు నాణెం అమ్మకానికి తీసుకురాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు చేరుకొని రాజును అదుపులోకి తీసుకొని విచారించగా తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికినట్లు తెలిపాడు. ఇంటి యజమాని గట్టయ్యకు సైతం నాణేల్లో వాటా ఇచ్చామని పేర్కొన్నాడు. ఈ మేరకు రాజు వద్ద ఎనిమిది బంగారు నాణేలు, సత్యనారాయణ, హరీశ్‌ల వద్ద 24, గంగన్న వద్ద రెండు మొత్తం 34 నాణేలు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. గుంజ్ర రమేశ్, ఇంటి యజమాని గట్టయ్య వద్ద ఉన్న నాణేలనూ త్వరలో స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురు కూలీలు, ఇంటి యజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
వారధితో మేలు
చెన్నూర్ : చెన్నూర్ సమీపంలోని పలుగుల వద్ద గల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఆదిలాబాద్-కరీంనగర్-వరంగల్ జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. దీంతో మూడు జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా జిల్లాల మధ్య దూరభారంతోపాటు సమయం, వ్యయం భారం తగ్గుతుంది. గోదావరి నదిపై వంతెన నిర్మించాల్సి ఉన్నా గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిర్మాణానికి మోక్షం కలగలేదు. ఫలితంగా మూడు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం గోదావరిపై వారధి నిర్మాణం చేపడుతుందని ప్రజలు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. చెన్నూర్ నుంచి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో గోదావరిపై వంతెన లేక పోవడంతో గోదావరిఖని మీదుగా ప్రయాణిస్తే 125 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. గోదావరిపై వంతెన నిర్మాణం చేపడితే ఈ ప్రాంత రైతులకు వరంగల్ మార్కెట్ దగ్గరవుతుంది. ఆదిలాబాద్-కరీంనగర్ అంతర్ జిల్లాల వంతెన నిర్మాణం ద్వారా మూడు జిల్లాల ప్రజలకు మేలు చేకూరుతుంది. మంచిర్యాల నుంచి వరంగల్‌కు 140 కి.మీ. చెన్నూర్ వద్ద గల గోదావరిపై వంతెన నిర్మిస్తే మంచిర్యాల నుంచి చెన్నూర్ మీదుగా కాళేశ్వరం 52 కిలో మీటర్లు, వరంగల్ 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే మంచిర్యాల నుంచి వయా గోదావరిఖని మీదుగా కాళేశ్వరం 107, వరంగల్ 180 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ లెక్కన 40 కిలో మీటర్ల దూరం గంటపాటు సమయంతోపాటు వ్యయం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా శ్రీరాంపూర్, మందమర్రి, చెన్నూర్ ఇందారం, బెల్లంపల్లి పట్టణాల నుంచి భూపాల్పల్లికి నిత్యం వందలాది మంది సింగరేణి కార్మికులు రాక పోకలు సాగిస్తుంటారు. ప్రభుత్వం చెన్నూర్ గోదావరిపై వంతెన నిర్మిస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. మూడు జిల్లాల్లో పుణ్య క్షేత్రాలు ఆదిలాబాద్ జిల్లాలో బాసర, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం, వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి లాంటి పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఈ పుణ్య క్షేత్రాలను నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ మూడు జిల్లాలను దగ్గర చేసేందుకు గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వంతెన నిర్మాణం చేపట్టాలి.. - పర్స శ్రీనివాస్‌రావు, విద్యావంతుల వేదిక, జిల్లా నాయకులు చెన్నూర్, కాళేశ్వరం మధ్య ఉన్న గోదావరిపై వంతెన నిర్మించాలి. వంతెన నిర్మాణం కోసం తమ వంతు కృషి చేస్తాం. తెలంగాణ విద్యా వంతుల వేదిక అధ్వర్యంలో వంతెన నిర్మాణం చేపట్టాలని కరపత్రాలు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదెలుతో కలసి కేసీఆర్‌ను కలుస్తాం. వంతెన నిర్మాణానికి కృషి చేయాల్సిందిగా కోరుతాం. -
మళ్లీ పెరిగిన విద్యుత్ కోతలు
చెన్నూర్ : నిన్న మొన్నటి వరకు మండల కేంద్రాల్లో రోజుకు 4 గంటల విద్యుత్ కోతలు ఉంటే మళ్లీ శనివారం నుంచి 6 గంటల విద్యుత్ కోతలు ఉంటాయని ట్రాన్స్ కో అధికారులు ప్రకటించారు. దీంతో వర్షాకాలంలో కూడా ప్రజలకు విద్యుత్ వెతలు తప్పడంలేదు. దీంతో ఇటు చిన్న వ్యాపారులు, అటు రైతులు, మరోవైపు గృహ వినియోగదారులు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. వ్యాపారాలపై పిడుగు ఇదివరకు మండల కేంద్రాల్లో ఉదయం 6 నుం చి 8 వరకు సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు కరెంటు కోతలు విధించారు. ఈ సమయాల్లో కోత విధించడంతో చిన్న వ్యాపారులకు కొంత వెసులుబాటు లభించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తుండడంతో వెల్డింగ్ షాపులు, జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్, పిండి గిర్ని, టైర్ పంక్చర్ టైలరింగ్, కార్పెంటర్లు, సర్వీసింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. షాపులు తెరిచే సమయంలో కరెంటు కోతలు ఉంటే తాము పనులు ఎలా చేసుకునేదని వ్యాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరని నష్టం కరెంటు కోతలు ప్రారంభం నుంచి ప్రజలు, రై తులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కరెంటు ఉంటే రూ.300ల నుంచి రూ. 400ల వరకు గిట్టుబాటు అయ్యేది. రెండు నెలల ట్రాన్స్‌కో విధిస్తున్న కరెంటు కోత ల మూలంగా రోజుకు రూ.200 గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మ ళ్లీ మరో రెండు గంటలు పెంచితే షాపుల అద్దె లు కట్టేందుకు కూడా తమ సంపాదన సరిపోదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడలేదని ఇష్ట్యారాజ్యంగా కరెంటు సరఫరా నిలిపివేయడంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.