చెన్నూరు : స్థానిక పెన్నా వంతెన వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో మైదుకూరు మండలం నారావారిపల్లెకు చెందిన శివపురం చిన్నపుల్లయ్య(23) అనే వ్యక్తి గాయపడ్డాడు. పుల్లయ్య సొంత పనిమీద అపాచి భైకులో కడపకు వెళుతుండగా చెన్నూరు పెన్నా వంతెన వద్దకు రాగానే కడప నుంచి మైదుకూరు వైపునకు యూరియా లోడుతో వెళుతున్న లారీ వేగంగా ఢీకొంది. దీంతో గాయపడిన పుల్లయ్యను కడపకు తరలించారు. లారీని, బైకును స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ వినోద్‌కుమార్ తెలిపారు.