uria load
-
యూరియా కోసం కలెక్టర్‌ను అడ్డుకున్నారు
సాక్షి, సిర్పూర్ కాగజ్‌నగర్: ఇంకా ఎన్ని రోజులు మా పనులన్నీ వదులుకొని యూరియా కోసం లైన్లు కట్టాలి.. మా పంటలు ఏం కావాలని కొమురం భీం(ఆసిఫాబాద్) జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును రైతలు నిలదీశారు. ఆయన సోమవారం యూరియా పరిస్థితిని పరిశీలించేందుకు కాగజ్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంలో రైతులు తమకు యూరియా అందే వరకు కదలనివ్వమని కలెక్టర్ వాహనం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు తమకు గత వారం రోజులుగా యూరియా అందటం లేదని.. తీవ్ర కొతరను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా నిత్యం పడిగాపులు కాస్తున్నామని కలెక్టర్‌కు దృష్టికి తీసుకువచ్చారు. యూరియా నిల్వలు పెంచాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. -
జిల్లాకు యూరియా సరఫరా ప్రారంభం
నల్లగొండ అగ్రికల్చర్ : మూడు రోజులుగా జిల్లాకు సరఫరా ప్రారంభమైందని జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 346 టన్నుల యూరియా జడ్చర్ల వ్యాగన్ పాయిం ట్ ద్వారా, 1200టన్నుల యూరియా ఐపీఎల్ కంపెనీ ద్వారా, స్పిక్ కంపెనీ ద్వారా 1025 టన్నులు మొత్తం రూ.2571 టన్నుల యూరియా చేరుకుందని, దీనిని మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు, ప్రైవేట్ డీలర్ల ద్వారా జిల్లాలోని రైతులందరికీ సరఫరా చేస్తామన్నారు. సోమవారం 1200 టన్నుల యూరియా ఇఫ్కో కంపెనీ ద్వారా మిర్యాలగూడ వ్యాగన్ పాయింట్‌కు చేరుకుందని, మంగళవారం ఉదయం లోపు అన్ని మండలాల్లో పీఏసీఎస్‌లకు, ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేస్తామన్నారు. యూరియా అధికంగా అవసరం ఉన్న 11 మండలాలకు 2,100టన్నుల యూరియాను రోడ్డు మార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టు నుంచి పంపించడానికి కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఇవికూడా రావడం ప్రారంభమైందని, రెండు మూడు రోజుల్లో అన్ని మండలాలకు రోడ్డు మార్గం ద్వారా రానుందన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దని, అవసరాల మేరకే కొనుగోలు చేసి వాడుకోవాలన్నారు. యూరియాను ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేసుకోవద్దని సూచించారు. -
‘రాష్ట్రంలో యూరియా కొరత లేదు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూరియా నిల్వలు ఖరీఫ్ సీజన్ అవసరాల మేరకు ఉన్నాయని వ్యవసాయశాఖ పేర్కొంది. వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యూరియా నిల్వలపై ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో యూరియాకు కొరత ఎక్కడా లేదని, ప్రస్తుతం రెండు లక్షల టన్నుల యూరియా నిల్వలు మార్క్‌ఫెడ్, డీలర్స్ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు సెప్టెంబర్ మాసంలో రాష్ట్ర వ్యవసాయ అవసరాల నిమిత్తం కేంద్రం మూడు లక్షల టన్నుల యూరియాను కేటాయించిందన్నారు. డీలర్లు అధిక ధరలకు యూరియాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుకు అవసరం లేని ఎరువులను బలవంతంగా అమ్మజూపినా డీలర్లపై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని అరుణ కుమార్ పేర్కొన్నారు. -
యూరియా కోసం క్యూలు కడుతున్న అన్నదాతలు
-
వ్యక్తికి గాయాలు
చెన్నూరు : స్థానిక పెన్నా వంతెన వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో మైదుకూరు మండలం నారావారిపల్లెకు చెందిన శివపురం చిన్నపుల్లయ్య(23) అనే వ్యక్తి గాయపడ్డాడు. పుల్లయ్య సొంత పనిమీద అపాచి భైకులో కడపకు వెళుతుండగా చెన్నూరు పెన్నా వంతెన వద్దకు రాగానే కడప నుంచి మైదుకూరు వైపునకు యూరియా లోడుతో వెళుతున్న లారీ వేగంగా ఢీకొంది. దీంతో గాయపడిన పుల్లయ్యను కడపకు తరలించారు. లారీని, బైకును స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపారు.