సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా? | Story Behind Singer Ramana Gogula Bald Head | Sakshi
Sakshi News home page

Ramana Gogula: భార్య కోసం ఇలా జీవితాంతం గుండుతోనే

Published Mon, Dec 23 2024 4:05 PM | Last Updated on Mon, Dec 23 2024 4:17 PM

Story Behind Singer Ramana Gogula Bald Head

సింగర్ రమణ గోగుల పేరు చెప్పగానే.. చాలా ఏళ్ల క్రితం తెలుగులోని అద్భుతమైన పాటలే గుర్తొస్తాయి. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, జానీ, లక్ష‍్మీ, యోగి మూవీస్‌కి అదిరిపోయే సంగీతమందించారు. 2013 తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయిన ఈయన.. అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉండిపోయారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వెంకటేశ్ 'సంక్రాంతి వస్తున్నాం' మూవీలో 'గోదారి గట్టు మీద' పాటతో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)

ఈ క్రమంలోనే రమణ గోగుల పేరు తెలుగు ఇండస్ట్రీలో మరోసారి మార్మోగిపోతోంది. తాజాగా ఈయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్, వ్యక్తిగత విషయాలు, ఇండస్ట్రీకి దూరమవడం లాంటి చాలా విషయాలు మాట్లాడారు. ఇవన్నీ పక్కనబెడితే తనది ఒరిజినల్ గుండు కాదని, ఎప్పటికప్పుడు జుత్తుని గీసేస్తున్నానని చెప్పడం మాత్రం షాకింగ్‌గా అనిపించింది. అలా చేయడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టారు.

''జానీ' మూవీ చేస్తున్న టైంలో నా భార్య ప్రెగ్నెంట్. డాక్టర్స్ ఏమో డెలివరీ కష్టం అన్నారు. దాని గురించే ఆలోచిస్తూ ఆఫీస్‌లో డల్‍‌గా ఉంటే.. మా కీ బోర్డ్ ప్లేయర్ ఒకతను ఏంటి సార్ అలా ఉన్నారని నన్ను అడిగాడు. విషయమంతా చెప్పా. మీరేం ఆలోచించకుండా తిరుపతి వెళ్లి రండి సార్, అంతా సెట్ అయిపోద్ది అని చెప్పాడు. సరే అని వెళ్లి అక్కడే జుత్తుంతా దేవుడికి ఇచ్చేసి వచ్చా. తర్వాత నా భార్యకు నార్మల్ డెలివరీ అయింది. అప్పుడే డిసైడ్ అయ్యా. ఇక జీవితంలో నా జుత్తుని పెంచుకోకూడదని' అని రమణ గోగుల చెప్పారు.

(ఇదీ చదవండి: చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement