ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసే నిర్మాత నాగవంశీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తనని తిట్టుకున్నా పర్లేదని అన్నారు. ఇదంతా కూడా బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ సంగతేంటి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)
బాలకృష్ణ 'డాకు మహరాజ్'.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. మరో ఈవెంట్ విజయవాడలో నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇతడి గత చిత్రం 'వాల్తేరు వీరయ్య'. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ.. హిట్ అయింది.
అయితే బాబీ.. 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' సినిమాని బాగా తీశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ తనని తిట్టుకున్నా పర్లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాతే కాదు గతంలో దర్శకుడు బాబీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరు-బాలయ్యతో సినిమాలు చేయడం గురించి చెప్పారు. చిరంజీవి అయితే స్ట్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తారని, బాలకృష్ణ మాత్రం డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోతారని అన్నాడు. అప్పుడు బాబీ.. ఇప్పుడు నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: సన్నీ లియోన్ పేరిట మోసం)
Comments
Please login to add a commentAdd a comment