Bobby
-
వాల్తేరు డైరెక్టర్‌కు పిలిచి మరో ఆఫర్ ఇస్తోన్న చిరు
-
డైరెక్టర్ 'బాబీ' లవ్‌స్టోరీ గురించి తెలుసా..?
డైరెక్టర్ బాబీ కొల్లిగా తెలుగు సినిమా అభిమానులకు దగ్గరయిన ఆయన అసలు పేరు కె.ఎస్.రవీంద్ర.. గుంటూరుకు చెందిన బాబీ బి.కామ్‌లో డిగ్రి పూర్తి చేసి సినిమా మీద ఆసక్తితో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా తన టాలెంట్‌తోనే చిత్ర పరిశ్రమలో విజయం సాధించాడు. ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతోనే సినిమాలు చేశాడు. రీసెంట్గా ‘డాకు మహారాజ్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, చాలామంది బాబీ కొల్లి ఎవరు..? తన ఫ్యామిలీ ఏంటి..? విషయాలపై చర్చించుకుంటున్నారు.ఘోస్ట్ రైటర్‌గా..టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా బాబీ కొల్లి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆయన మొదట ఘోస్ట్ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో పనిచేశారు. ఈక్రమంలో మొదటిసారి 2008 సమయంలో శ్రీహరి నటించిన హిట్ సినిమా 'భద్రాద్రి' కథతో బాబీ తన ప్రయాణం కొనసాగించారు. తర్వాత డాన్ శీను,బాడీగార్డ్,ఓ మై ఫ్రెండ్ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించారు. బలుపు,అల్లుడు శీను వంటి చిత్రాలకు కథను అందించిన ఆయన తొలిసారి 2014లో రవితేజ పవర్ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ అందుకున్నాడు. అక్కడి నుంచి తనదైన స్టైల్లో సర్దార్ గబ్బర్ సింగ్ ,జై లవ కుశ,వెంకీ మామా,వాల్తేరు వీరయ్య,డాకు మహారాజ్ వంటి టాప్ సినిమాలు తెరకెక్కించాడు.చెస్ క్రీడాకారిణి హారిక సోదరితో ప్రేమ.. పెళ్లి తర్వాత కష్టాలుచెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి అక్క అనూషను బాబీ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ దంపతులకు 2018లో ఒక కుమార్తె జన్మించింది. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి బాబీ ఇలా చెప్పాడు. అనూష తన జీవితంలోకి రావడం తన అదృష్టమని బాబీ అన్నారు. 'స్కూల్లో చదువుతున్న సమయంలోనే తనను నేను ప్రేమించాను. ఒక సందర్భంలో నీళ్ల బాటిల్ షేర్ చేసుకోవడంతో మొదలైన మా పరిచయం ఫైనల్‌గా పెళ్లి వరకు చేరింది. అనూష స్కూల్ టాపర్.. చాలా కష్టపడి చదువుతుంది. ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్గా సత్తా చాటిన ఆమె వేలూరులో ఎంటెక్ పూర్తి చేసింది. అక్కడ కూడా గోల్డ్ మెడలిస్ట్గానే తనేంటో ప్రూవ్ చేసుకుంది. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ సమయంలో ఏమీ లేని ఈ బాబీని అనూష పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆమె కుటుంబం కూడా చాలా పెద్దది. అయినా కూడా ఆమె నన్ను ఇష్టపడింది. కూతురిపై ప్రేమతో ఆమె తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ సమయంలో నేను ఘోస్ట్ రైటర్‌గా మాత్రమే ఉన్నాను. కనీసం స్క్రీన్ మీద నా పేరు కూడా పడేది కాదు. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ వారందరూ నన్ను నమ్మారు. హైదరాబాద్‌లో సంపాదన లేకుండా జీవించడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ పెళ్లి తర్వాత చాలా కష్టాలు పడ్డాం. ఆమె తల్లిదండ్రులు మాకు సపోర్ట్ చేయాలని అనుకున్నప్పటికీ మేమే వారికి తెలిపే వాళ్లం కాదు. అలా ఇబ్బందులు మా ఇంటిలోపలి వరకే ఉంచాం. సినిమా ఛాన్స్‌ల కోసం వెతక్కుంటూనే ఎదోలా ఇంటి అద్దెలతో పాటు ఈఎంఐలు చెల్లించేవాళ్లం. అలా మొదలైన మా ప్రయాణం.. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎన్నీ మారినా అనూష మారలేదు. ఇప్పటికీ సింపుల్‌గానే ఉంటుంది. ఒక స్టార్ డైరెక్టర్ భార్య అని కూడా చెప్పుకోదు. కారు ఉన్నా కూడా పాపను స్కూటీలోనే స్కూల్‌కు తీసుకెళ్తుంది. నా జీవితానికి ఆమె ఆదర్శం' అంటూ తన భార్యపై ప్రశంసలు కురిపించాడు. -
చిరంజీవితో 'మెగా' సినిమా ప్లాన్ చేస్తున్న హిట్ డైరెక్టర్
టాలీవుడ్లో వరుస హిట్ సినిమాలతో డైరెక్టర్ బాబీ కొల్లి స్పీడ్ పెంచాడు.. తాజాగా డాకు మహారాజ్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించాడు. 2023 సంక్రాంతి సమయంలో మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) వాల్తేరు వీరయ్య చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇలా భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన మరోసారి చిరంజీవితో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన కథను కూడా బాబీ రెడీ చేస్తున్నాడట. ఈ సారి మరింత బలమైన కథతో పాటు పాన్ ఇండియా రేంజ్లో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో వేగం పెంచుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ ముగింపు దశకు చేరుకుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ వెంటనే దర్శకులు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో మెగా సినిమాలను చిరు ప్లాన్ చేశారు. అయితే, వీరిలో మొదట అనిల్ సినిమానే ప్రారంభం అవుతుందని సమాచారం. ఇలా రెండు ప్రాజెక్ట్‌లు తన చేతిలో ఉండగానే బాబీ కొల్లికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. కమర్షియల్ చిత్రాల్ని తనదైన పంథాలో తెరకెక్కిస్తూ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా బాబీ పేరు తెచ్చుకున్నారు. చిరుతో వాల్తేరు వీరయ్యను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి వస్తున్నారనే వార్తలు రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. -
మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్‌తో బాబీ డియోల్
బాబీ డియోల్(Bobby Deol) ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో.. ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. 1995లో విడుదలైన 'బర్సాత్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత సోల్జర్,రేస్ 3,ఓం శాంతి ఓం, క్రాంతి,దోస్తానా, కిస్మత్, హీరోస్, హౌస్‌ఫుల్ 4 వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. అయితే, కెరీర్ పరంగా ఒకానొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఎంతో కుంగుబాటుకు గురయ్యారు. చివరకు భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడు అనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి. ఒక్క ఛాన్స్‌తో రీ ఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సంస్థలను కలిశారు. కానీ, ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ, ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపుగా 15 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్‌కు ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వల్లే జరిగిందని బాబీ డియోల్ అన్నట్లు ప్రముఖ తెలుగు దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) చెప్పారు.యానిమల్( Animal) సినిమా తర్వాత డాకు మహారాజ్‌తో బాబీ డియోల్ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. అయితే, ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు. 'యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. మళ్లీ వరుస సినిమా ఛాన్సులతో స్పీడ్ పెంచాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని తెలిసిందే. ఇదే విషయాన్ని బాబీ డియోల్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు. మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఆయన్ను టచ్ చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు. అంతలా మన తెలుగువారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడు.' అని డైరెక్టర్ బాబీ కొల్లి పంచుకున్నారు.బాబీ డియోల్ కన్నీళ్లకు కారణాలు కూడా ఉన్నాయి. 2012 తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, పలితం దక్కలేదు. దీంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. తన భార్య సంపాదనతోనే ఉండేవాడని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడి మాటలను ఆయన ఇలా గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ' నేను ఇంట్లో ఉండగానే నా కుమారుడు తన తల్లి వద్దకు వెళ్లి నాన్న ఎప్పుడూ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు..? ఎలాంటి పని చేయడా..? అని ప్రశ్నించాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది. వాడు పుట్టక ముందే నేనొక సూపర్‌స్టార్. కానీ, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫెయిల్యూ స్టార్‌ని అని నా మనసులో అనుకున్నా.' అని బాబీ డియోల్ గతంలో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్)సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన దశ తిరిగింది. పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందుకే సందీప్ రెడ్డి అంటే బాబీ డియోల్‌కు చాలా ఇష్టం. యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది. హరిహర వీరమల్లు, హౌస్‌ఫుల్ 5, ఆల్ఫా, విజయ్ 69 ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕍𝕠𝕟𝕘𝕠𝕕 𝕗𝕠𝕣𝕖𝕧𝕖𝕣 ♾️🛐 (@vongod_forever) -
అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ
'డాకు మహారాజ్'(Daaku Maharaaj) భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్‌లో భాగంగా మూవీటీమ్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, బాలయ్యకు సండేతో(Sunday) ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు.నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అసలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాను. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే, ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది. అయితే, ఈ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ, దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదు. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాను. అదేరోజు రాక రాక బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్ సెట్స్‌లోకి వచ్చారు. ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో నా నడుము విరిగింది. అయితే, ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఆయన కూడా చాలా కంగారుపడ్డారు.' అని ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్‌ను బాలయ్య పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా)యాంకర్ సుమతో మూవీ టీమ్ పాల్గొన్న ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడి ఆహారమే తింటానని ఆయన చెప్పారు.బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలామందికి తెలిసిందే.. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలుపెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతే దిన చర్య ప్రారంభిస్తారు. -
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ . నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే షో పడిపోయింది. తెలంగాణలో మాత్రం ఉదయం 8 గంటలకు ఫస్ట్ షో పడనుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డాకు మహారాజు కథ ఏంటి..? ఎలా ఉంది..? బాలయ్య ఖాతాలో హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో డాకు మహారాజుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. ఆశించన స్థాయిలో సినిమా లేదని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.Good mass bomma delivered by #Bobby Good visualsVijay Kannan’s best DOPThaman’s powerful BGM💥Bobby Kolli’s good directorialBut Predictable & dragged climaxMay be a fourth hit for #BalayyaRating: 3.25/5 #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #DaakuMaharaajReview pic.twitter.com/mFVZmjnKxg— IndianCinemaLover (@Vishwa0911) January 11, 2025‘డైరెక్టర్ బాబీ ఓ మంచి మాస్ బొమ్మను అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ పవర్ఫుల్ బీజీఎం అందించాడు. బాబీ డైరెక్షన్ బాగుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహకందేలా,సాగదీతగా అనిపిస్తుంది. బాలయ్య ఖాతాలో హిట్ పడొచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ 3.25 రేటింగ్ ఇచ్చాడు.#DaakuMaharaaj is a passable stylistic mass entertainer that works well till a point in the second half after which it feels dragged. The film is technically very strong and is filled with mass elevations blocks that work well. Balayya and Thaman combo deliver yet again in…— Venky Reviews (@venkyreviews) January 11, 2025డాకు మహారాజ్ మంచి మాస్ ఎంటర్టైనర్.కానీ సెకండాఫ్ మాత్రం సాగదీశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య, తమన్ కాంబో మరోసారి సాలిడ్ మాస్ మూమెంట్స్‌ని అందించారు. డైరెక్టర్ బాబీ బాలయ్యను సెట్ అయ్యే కథనే ఎంచుకున్నాడు. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి కథనం సాగదీశారు. ఊహకందేలా కథనం సాగుతుంది. చివరి 30 నిమిషాలు మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తుంది’అంటూ మరో నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు.Blockbuster bomma 🏆🏆🔥🔥Excellent screen PlayQuality Picture @MusicThaman sava dengav ayya 🔥@dirbobby 🙏🤍@vamsi84 Production quality 👌#DaakuMaharaaj - A slick mass entertainer with stunning visuals and #Thaman's powerful score.#NBK is exceptional, delivering electrifying moments for fans.Director #Bobby ensures commercial highs, making it a festive treat despite a predictable climax.— CHITRAMBHALARE (@chitrambhalareI) January 12, 2025uMaharaaj?src=hash&ref_src=twsrc%5Etfw">#DaakuMaharaaj #BlockBusterDaakuMaharaaj — kalyan ᴹᵃʰᵃʳᵃᵃʲ 🦁 (@kalyan_1405) January 12, 2025 #DaakuMaharaj First Half Review #NBK #Balayya #Balakrishna #NandamuriBalakrishana #DaakuMahaaraaj #DaakuMaharaaj #BuzzbasketReviews pic.twitter.com/kOAR1cdHPQ— BuzZ Basket (@theBuzZBasket) January 12, 2025Hahahahhahh 😂😂 ! My First Review of #DaakuMaharaaj proved “ TRUE ” !! I’m the Most Honest Film Critic in India 🇮🇳 today! Go & Watch Mass Masala this #Sankranthi 😃💥 https://t.co/DTUMdx5AOS— Umair Sandhu (@UmairSandu) January 11, 2025Oora Mass BGM From Teddy 🔥🔥Balayya Screen Presence > Nandamuri #DaakuMaharaaj pic.twitter.com/X6sNmHL5ZM— విక్రమ్ (@imVicky____) January 11, 2025A film that strikes the perfect balance between class and mass, cherished by the Maharaj🦁మళ్లీ సంక్రాంత్రి బుల్లోడు మా బాలయ్య బాబు🔥❤️Finally Good Output @dirbobby and @MusicThaman 🌟💫#DaakuMaharaaj 🦁🎇 pic.twitter.com/5E8UWwtbFa— ShelbY ᴹᵃʰᵃʳᵃᵃʲ⚔️ (@manishini9) January 11, 2025Naaku first half ye nachindhi ..Second half dabbulu return cheyi ra chintu #DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025Last 45 min sleep veyochuRest 🔥Routine story 😢Elevations 👍 Bgm 🔥🔥🔥#DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025 -
పొగిడితే కళ్లతోనే కనిపెట్టేస్తారు: దర్శకుడు బాబీ
‘‘సెట్స్‌లో నేను ఫ్యాన్ బాయ్‌లా ఉండను. అలా ఉంటే కొన్ని పనులు మనం అనుకున్నట్లుగా సాగవు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ గార్లతో వర్క్ చేశాను. ఇద్దరూ పని రాక్షసులు. వీరికి అపారమైన అనుభవం ఉంది. పొగడ్తలతో మాట్లాడితే మన అంతరంగాన్ని కళ్లతోనే కనిపెట్టేస్తారు. కాబట్టి నేను సెట్స్‌లో ఓ దర్శకుడిగా నిజాయితీతోనే ఉండాలనుకుంటాను. అప్పుడు మనపై గౌరవం పెరుగుతుంది.చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌గార్ల వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు బాబీ కొల్లి. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు బాబీ చెప్పిన విశేషాలు...⇒ డాకు మహారాజ్‌గా సీతారామ్ ఎలా మారాడు? అన్నది ఈ సినిమా కథనం. బాలకృష్ణగారి ఇమేజ్, ఆయన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను దృష్టిలో పెట్టుకునే ‘డాకు మహారాజ్’ కథ రాయడం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణగారిని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. ‘నరసింహనాయడు, సమరసింహారెడ్డి’ చిత్రాల తర్వాత నాకు బాలకృష్ణగారి ‘సింహా’ అంటే చాలా ఇష్టం. ‘సింహా’లో బాలకృష్ణగారు డాక్టర్ రోల్‌ను చాలా సెటిల్డ్‌గా చేశారు⇒ ‘డాకు మహారాజ్’ చిత్రంలో హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ల పాత్రలతో పాటు ఓ చిన్న పాప రోల్ కూడా కీలకంగా ఉంటుంది. ఓ విధంగా ఈ పాప చుట్టూనే కథ తిరుగుతుంది. అయితే మరో హీరోయిన్ చాందినీ చౌదరి సీన్స్ కొన్ని ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఆమెకు తెలియజేశాం. ఆమె ఏమీ అభ్యంతరం తెలుపలేదు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌గారు మంచి రోల్ చేశారు. ⇒ మంచి కథ రాసుకోవడం, సీరియస్ స్క్రీన్‌ప్లేని డీల్ చేయడంలో నేను బాగా చేస్తాననే పేరు తెచ్చుకోగలిగాను. కానీ విజువల్స్ పరంగా నా ప్రతిభ గురించి ఆడియన్స్ మాట్లాడుకునేలా చేయలేకపోయానేమో? అనే చిన్న ఆలోచన నాలో ఉండేది. అందుకే ఇప్పుడు ‘డాకు మహారాజ్’ సినిమా విజువల్స్ బాగున్నాయని అంటుంటే హ్యాపీగాఉంది. ‘జైలర్’ డీఓపీ విజయ్ కన్నన్గారు ఈ సినిమాకు వర్క్ చేశారు. విజయ్‌గారు కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత బాగా వచ్చాయి. -
కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది: సూర్యదేవర నాగవంశీ
‘‘డాకు మహారాజ్’లో యాక్షన్ సీన్స్ బాగుంటాయి. తెలుగుతోపాటు తమిళ్లోనూ ఈ నెల 12న మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బాలకృష్ణగారి కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, బాబీ డియోల్ కీలకపాత్ర చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.మంగళవారం జరిగిన సమావేశంలో బాబీ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. ‘‘ఈ సినిమా నా జర్నీలో ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. -
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ HD మూవీ స్టిల్స్
-
చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ
ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసే నిర్మాత నాగవంశీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తనని తిట్టుకున్నా పర్లేదని అన్నారు. ఇదంతా కూడా బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)బాలకృష్ణ 'డాకు మహరాజ్'.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. మరో ఈవెంట్ విజయవాడలో నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇతడి గత చిత్రం 'వాల్తేరు వీరయ్య'. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ.. హిట్ అయింది.అయితే బాబీ.. 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' సినిమాని బాగా తీశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ తనని తిట్టుకున్నా పర్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాతే కాదు గతంలో దర్శకుడు బాబీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరు-బాలయ్యతో సినిమాలు చేయడం గురించి చెప్పారు. చిరంజీవి అయితే స్ట్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తారని, బాలకృష్ణ మాత్రం డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోతారని అన్నాడు. అప్పుడు బాబీ.. ఇప్పుడు నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: సన్నీ లియోన్ పేరిట మోసం) -
'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్ రిలీజ్.. తమన్ మ్యూజిక్‌పై ప్రశంసలు
బాలకృష్ణ నటిస్తున్న 'డాకు మహారాజ్' ప్రకటన వెలువడిన సమయం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.బాలకృష్ణ నటించిన గత మూడు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఆ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన తమన్ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి 'ది రేజ్ ఆఫ్ డాకు' పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే, సంగీత ప్రియుల్లో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తమన్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు. 'డాకు మహారాజ్' పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు. "డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు.లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్‌గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. -
'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్ ప్రోమో.. తమన్ మాస్ ర్యాంప్
బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 'డాకు మహారాజ్' నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన 'డాకుస్ రేజ్' ప్రోమో అదిరిపోయింది. తమన్ అందించిన బీజీఎమ్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేలా ఈ సాంగ్ ఉండనుంది. ఈ సాంగ్‌కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా నాకాశ్ అజీజ్ ఆలపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా డాకు మహారాజ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
గేమ్ చేంజ్ చేసిన రామ్ చరణ్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
గొర్రెతో సినిమా.. మంచి ప్రయత్నమే!
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. వాస్తవానికి ఇందులో హీరో గొర్రె అనే చెప్పాలి. సినిమా మొత్తంలో సుహాస్ ఓ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. మిగతా భాగం అంతా గొర్రె చుట్టే తిరుగుతుంది. ఈ కథ బాగున్నప్పటికీ హీరో సుహాస్ ప్రమోషన్స్‌కి రాకపోవడం.. పబ్లిసిటీ అంతగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. కానీ దర్శకుడు బాబీ మాత్రం ఓ బోల్డ్ అటెంప్ట్ చేశాడు. (చదవండి: గొర్రె పురాణం మూవీ రివ్యూ)గొర్రెతో సినిమా చేయడం అంత చిన్న విషయం కాదు, గొర్రెను ఒక పాత్రగా తెరపై చూపించడం అంటే ఎంత కష్టపడాలో అది మేకర్స్ కు మాత్రమే తెలుసు. అలాంటిది ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది, ఈ విషయంలో దర్శకుడు బాబీ విజయం సాధించాడు అని చెప్పాలి. అందుకే బాబీకి మంచి ప్రశంసలు అందుతున్నాయి.సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ బడ్జెట్లో ఇంత మంచి సెటైరికల్ సినిమా తీయడంలో డైరెక్టర్ బాబి సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో మంచి కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఎక్కువైందనే విమర్శలు మాత్రం వస్తున్నాయి. -
కాంబినేషన్ రిపీట్?
‘పవర్’ మూవీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పవర్’. 2014లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. అయితే రవితేజ, బాబీల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రవితేజ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నారట బాబీ. త్వరలోనే రవితేజకి ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట దర్శకుడు.అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అవుతుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు.. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారని భోగట్టా. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోనూ రవితేజ ఓ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
తెలుగు సినిమా షూటింగ్లో గాయపడ్డ హాట్ బ్యూటీ ఊర్వశి!
హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గాయపడింది. బాలీవుడ్లో ఇప్పటికే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గతంలో 'వాల్తేరు వీరయ్య' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం అటు హిందీ, ఇటు తెలుగులో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఈమెకు ఓ సీన్లో భాగంగా తీవ్రమైన గాయమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్)బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ మధ్యే హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో రీసెంట్‌గానే ఊర్వశి రౌతేలా జాయిన్ అయింది. తాజాగా ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా.. కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు ఈమె టీమ్ చెప్పుకొచ్చింది. అయితే గాయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమాలో బాలయ్యతో పాటు చాందిని చౌదరి, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ పరిస్థితుల బట్టి రిలీజ్ డేట్ అటు ఇటు కావొచ్చని కూడా తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
బాలకృష్ణ-బాబీ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ నుంచి నాగవంశీ, సౌజన్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ ఉన్నారు. గతేడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో డైరెక్టర్ బాబీ హిట్ కొట్టాడు. అందులో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఊర్వశి రౌటేలాకు డైరెక్టర్ బాబీ మరో ఛాన్స్ ఇచ్చాడు. NBK 109 చిత్రంలో ఆమె కూడా ఒక స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. చాందిని చౌదరి కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. -
అల్లు అర్జున్ కజిన్ హీరోగా ముఖ్య గమనిక! సాంగ్ విన్నారా?
హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. ఇందులో లావణ్య హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజశేఖర్, సాయికృష్ణ నిర్మించారు. కిరణ్ వెన్న సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ఆ కన్నుల చూపుల్లోన..’ అంటూ సాగే పాటని డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘బన్నీగారిని (అల్లు అర్జున్) ఎప్పుడు కలవడానికి వెళ్లినా విరాన్ కనిపించేవాడు. అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకుని వాళ్ల సహాయం తీసుకోకుండా వారి ఆశీస్సులు తీసుకుని సొంత గుర్తింపు కోసం స్వతంత్రంగా ప్రయత్నించడం సంతోషం’’ అన్నారు. ‘‘నేను పుట్టింది, పెరిగింది ఇండస్ట్రీలోనే. బాబీ అన్నలాంటి మంచి మనిషి ఇండస్ట్రీలో లేరు. ఎన్ని జన్మలు ఎత్తినా మీరు చేసిన సహకారం మర్చిపోను’’ అన్నారు విరాన్. ‘‘తప్పు చేయాలన్న ఆలోచన వచ్చి.. ఆ ఆలోచనని సరిదిద్దుకునే లోపే కొన్ని అనర్థాలు జరుగుతాయి.. ఆ నేపథ్యంలో తీసిన సినిమా ఇది’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘ముఖ్య గమనిక’. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు రాజశేఖర్. కాగా విరాన్ ముత్తం శెట్టి గతంలో బతుకు బస్టాండ్ అనే సినిమా చేశాడు. చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి.. -
NBK109: పదునైన గొడ్డలికి కళ్ల జోడు.. పోస్టర్ అదిరింది
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. భగవంత్ కేసరితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. తాజాగా తన కొత్త సినిమా షూటింగ్‌ని ప్రారంభించాడు. వాల్తేరు వీరయ్యతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ బాబీ.. బాలయ్య 109వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ యాక్షన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమైంది. నేడు (నవంబర్ 8) 'NBK109'వ చిత్రం ప్రారంభం అయిందని తెలియజేస్తూ.. ఓ పోస్టర్ని వదిలారు మేకర్స్. ఆ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు. ఇప్పటికే బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా విడుదలైన సృజనాత్మక పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. బాలయ్యను ఒకవైపు ఊరమాస్ లుక్‌లో చూపిస్తూనే.. స్టైలీష్‌గా కూడా ప్రజెంట్ చేయబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. Blood Bath Ka Brand Name 🩸 𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂 𝑽𝑰𝑺𝑰𝑻𝑰𝑵𝑮 𝑪𝑨𝑹𝑫 🪓👓 #NBK109 Shoot begins today!! 📽️ Beginning a new journey with our Natasimham #NandamuriBalakrishna garu 😍 I seek your blessings and support, as always. 🙏❤️#NBK109ShootBegins 💥@vamsi84… pic.twitter.com/bYl7izkWAB — Bobby (@dirbobby) November 8, 2023 -
అత్యంత వృద్ధ శునకం ‘బాబి’ ఇకలేదు
లిస్బన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా పేరున్న ‘బాబి’ 31 ఏళ్ల వయస్సులో శనివారం తుదిశ్వాస విడిచింది. పోర్చుగల్‌లోని కాన్క్వెయిరోస్ అనే ఊళ్లో 1992 మే 11న ఈ కుక్క పుట్టింది. అప్పటికి బాబి యజమాని లియోనల్ కోస్టా వయస్సు 8 ఏళ్లే. మంచి ఆహారం, స్వచ్చమైన గాలి, అమితమైన ప్రేమ..ఇవే బాబి ఇన్నేళ్లపాటు జీవించడానికి కారణాలని లియోనల్ చెప్పారు. బాబి మొత్తం 31 సంవత్సరాల 165 రోజులపాటు జీవించినట్లు తెలిపింది. బాబి స్వచ్చమైన రఫీరో డో అలెంటెజో జాతికి చెందింది. ఈ జాతి శునకాల సగటు ఆయుర్దాయం 10 నుంచి 14 ఏళ్లు. -
గోల్డెన్ బాబీ
50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలీవుడ్ బంపర్ హిట్ చిత్రం బాబీ (1973) కి సంబంధించిన జ్ఞాపకాలు, తెలిసిన విషయాలు, తెలియని విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాగా ఇష్టపడి చేసిన సినిమా పరాజయం పాలైతే లేచి నిల్చోవడానికి, అడుగులు వేయడానికి, పరుగులు తీయడానికి శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే ‘ఎలాగైనా హిట్టు కొడతాను’ అనే కసి ఉండాలి. ‘మేరా నామ్ జోకర్’ సినిమాతో పరాజయం, అప్పుల పాలైన రాజ్ కపూర్‌లో ఆ కసి దండిగా ఉంది. కసి సంగతి సరే, ఇప్పుడొక సూపర్స్టారుడు కావాలి కదా. అప్పుల పాలైన తనతో సినిమా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ‘ఇక అంతా అయిపోయింది. మిగిలింది ఏమీలేదు’ అనుకున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుందట. ఆ ధైర్యంతోనే కుమారుడిని హీరోగా పెట్టి ‘బాబీ’ తీసి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు రాజ్ కపూర్. ఆర్కే స్టూడియోస్‌కు ఇది మకుటాయమాన చిత్రం అయింది. రిషి కపూర్, డింపుల్ కపాడియాలను ఎక్కడికో తీసుకెళ్లింది. ‘బాబీ’ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే...కమర్శియల్ రోమాంటిక్ ఫిల్మ్ ‘ఫార్మట్’ను సెట్ చేసింది. మినీ–స్కర్ట్స్, హాట్ ప్యాంట్స్, లెదర్ ఔట్ఫిట్స్, వోవర్ సైజ్డ్ గ్లాసెస్, పోల్క–డాటెడ్ నాటెడ్ టాప్స్ మన దేశంలోని ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్‌ను మోసుకొచ్చాయి. -
వాల్తేరు చిట్టిబాబు
-
అఫీషియల్: వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అసలు కథేంటంటే.. వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB — Netflix India South (@Netflix_INSouth) February 7, 2023 -
బాబీ.. ఓ కురు వృద్ధ శునకం!
లిస్బన్: పోర్చుగల్ వాసికి చెందిన బాబీ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన ఈ కుక్క వయసు ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్ల 226 రోజులు. ఆస్ట్రేలియాకు చెందిన బ్లూవై అనే కుక్క 29 ఏళ్ల 5 నెలలు జీవించి 1939లో చనిపోయింది. ఈ రికార్డును బాబీ తుడిచిపెట్టింది. పోర్చుగల్ ప్రభుత్వ పెట్ డేటాబేస్ ప్రకారం దాని వయస్సును నిర్ధారించారు. ఈ జాతి కుక్కల సరాసరి ఆయుర్దాయం 12–14 ఏళ్లు. బాబీ యజమానులు పోర్చుగల్‌లోని కాంకెయిరోస్ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లుండగా బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది. ‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న బాస్.. 10 రోజుల్లోనే రూ.200 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య' ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మూవీ భారీ విజయంతో చిత్రబృందం ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్‌పై చిరంజీవి సెటైర్లు) వాల్తేరు వీరయ్య విడుదలైన పది రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకుంది. కేవలం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రావడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. 'వాల్తేరు వీరయ్య' సినిమాతో మెగాస్టార్ అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. బాస్ పార్టీ సాంగ్, మెగాస్టార్ యాక్టింగ్, డ్యాన్స్, గ్రేస్‌కు ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్. మాస్ మహారాజ రవితేజ కూడా సినిమాలో ఉండగా వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. Megastar's ACTION PACKED BONANZA CONTINUES at Box Office with 200 CR+ Gross 💥🔥❤️🔥 Watch the MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥 - https://t.co/KjX8J7HFFi@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/4Ma7Fg21r3 — Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2023 -
మీ బోడి పెర్ఫార్మెన్స్ నా దగ్గరొద్దంటూ చిరు చైర్ విసిరేశారు..!
మెగాస్టార్ చిరంజీవి బయట ఎంత ప్రశాంతంగా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రెస్ మీట్లో కూడా తనదైన శైలీలో జోకులు వేస్తూ.. సరదాగా ఉంటారు. షూటింగ్ సమయంలో కూడా అలానే ఉంటారట. కానీ నిర్మాతలకు నష్టం కలిగించే పని చేస్తే మాత్రం ఘోరంగా ఫైర్ అవుతారట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ చెప్పారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. దీంతో శనివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తిక విషయాలు వెల్లడించారు. ‘సెట్లో చిరంజీవి పొగడ్తల్ని పట్టించుకోరు. కానీ.. నిర్మాతకి రూపాయి నష్టం వచ్చే పని చేస్తే మాత్రం ఆయనికి కోపం వచ్చేస్తుంది. వేరే సినిమా షూటింగ్లో ఆయనలోని శివుడిని నేను చూశా. షాట్‌కి పిలవకుండా మేనేజర్ ఇబ్బంది పడుతుంటే.. ఫస్ట్ టైమ్ చిరంజీవికి కోపం రావడాన్ని చూసి నేను షాక్ అయిపోయా. చైర్ విసిరేసి.. మీబోడి ఫెర్ఫార్మెన్స్ నా దగ్గరొద్దు. నేను ఇక్కడ తినే ఇడ్లీ కన్నా.. అక్కడ షాట్ ఇంపార్టెంట్’ అంటూ సిబ్బందిపై ఫైర్ అయిన మెగాస్టార్‌ని నేను దూరం నుంచి చూశాను. సినిమాకు ఇబ్బంది కలిగితే అన్నయ్యకు కోపం వస్తుందని నాకు అర్థమైంది. వాల్తేరు వీరయ్య షూటింగ్ టైమ్‌లో అలా ఇబ్బంది తేకూడదని ప్రయత్నించా. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ చేసి.. అన్నయ్యా... పీటర్ మాస్టర్ ఊరెళ్తానని అంటున్నారు. ఒక ఫైట్ సీన్.. మీరు సాంగ్ గ్యాప్‌లో ఓ మూడు గంటలు వస్తే? అంటూ మొహమాటంగా చెప్పాను. దానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావ్.. కరెక్ట్‌గా చెప్పు నాకు అర్థం అవ్వడం లేదు అని చిరంజీవి గారు అన్నారు. ఏం లేదు అన్నయ్య మీరు రేపు ఓ మూడు గంటలు వస్తే.. మీ పోర్షన్ కంప్లీట్ చేస్తాను. మళ్లీ రేప్పొద్దున ‘నాకు చెప్పాలి కదా సెట్ ఎందుకు హోల్డయ్యిందని’ అంటారని చెప్పేస్తున్నా అని చెప్పాను. దానికి ఇంతగా చెప్పాలా బాబీ.. రేపు మీరు రా అన్నయ్యా అంటే రానా? అంటూ చాలా సింపుల్‌గా చెప్పారు’అని బాబీ గుర్తు చేసుకున్నారు. -
ఈ కష్టం నాది కాదు.. వారిదే: మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మాస్ మహారాజా ప్రత్యేక పాత్రలో నటించారు. మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. వాల్తేరు వీరయ్య విజయంతో నాకు మాటలు రావడం లేదన్నారు. ఈ సినిమా కోసం వారు పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని మెగాస్టార్ అన్నారు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా కోసం పనిచేసిన కార్మికుల కోసం ప్రత్యేక వీడియోను ఆయన విడుదల చేశారు. విజయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ సినీ కార్మికుల కష్టం మనకు తెలియాలన్నారు. చిరంజీవి మాట్లాడుతూ..'వాల్తేరు వీరయ్య విజయంతో నా మాటలు కొరవడ్డాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.ప్రేక్షకుల ఉత్సాహమే మనకు ఇంధనం. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లాలి. నేను ఈ సినిమా కోసం కష్టపడలేదు. నా బాధ్యతగా అనుకుని పనిచేశా. కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిందరిదీ. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది. మన మీదతో జాలితో కాదు... సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి.' అంటూ ఎమోషనలయ్యారు మెగాస్టార్ -
‘వాల్తేరు వీరయ్య ’టైటిల్ వెనక ఇంత స్టోరీ ఉందా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ అందరిని ఆకర్షించింది. అయితే ఈ టైటిల్ వెనుక పెద్ద చరిత్రే ఉందట. ఈ కథకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో తాజాగా దర్శకుడు బాబీ వివరించారు. 'వెంకీ మామ' షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో ఉన్నప్పుడు.. చిరంజీవి గారి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం’ అని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. -
ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా.. నా జీవితంలో మర్చిపోలేను: బాబీ
చిరంజవి, రవితేజలు ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారో నేను కూడా అలాగే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడు వాళ్లిద్దరితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చేయడం నా అదృష్టం. ఒక ఫ్యాన్ బాయ్ గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ డిజైన్ చేశాను. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది’అని యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) అన్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా బాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► చిరంజీవికి ఒక ఫ్యాన్ బాయ్ గా 2003 నా జర్నీ మొదలైయింది. చిరంజీవి గారి సినిమాలో పని చేయాలనే ఒక కల ఉండేది. ఇప్పుడు 2023లో మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సినిమా విడుదవుతోంది. నా జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్ ఇది. మాస్ ఆడియన్స్ ఏం కావాలో అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్టోరీ డిజైన్ చేయడం జరిగింది. ► మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విజయాలు బ్లాక్ బస్టర్లు అలాగే కొన్ని అపజయాలు కూడా చూసుంటారు. ఆయనకి ఉన్నంత బ్యాలెన్స్ ఎవరికీ ఉండదని కూడా చెప్పొచ్చు. అలాగే రవితేజ గారు కూడా అంతే. ఒక సినిమాకి చేయాల్సిన న్యాయం కష్టం సర్వస్వం పెడతారు. ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని బలంగా నమ్ముతారు. ► లాక్ డౌన్ కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చిరంజీవికి ఈ కథ చెప్పాను. అయితే లాక్ డౌన్ లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకీ అలవాటు పడ్డారు. డిఫరెంట్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేక దృష్టి పెట్టాం. దాంట్లో నుంచి వచ్చిన క్యారెక్టరే రవితేజ గారిది. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీసి సెంటర్ ఆడియన్స్ తో పాటు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని గుణాలు లక్షణాలు వాల్తేరు వీరయ్యలో కనిపిస్తాయి. ► చిరంజీవి గారు, రవితేజ గారి కాంబినేషన్లో వచ్చే ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్ ఉంటాయి. పండక్కి రాబోతున్న కలర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉన్న చిత్రం వాల్తేరు వీరయ్య. ► రవితేజ గారి చాయిస్ నాదే. రవితేజ గారిని తీసుకోవాలనే ఆలోచన రావడం, చిరంజీవి గారికి చెప్పడం, ఆయన మరో ఆలోచన లేకుండా ఓకే అనడం, చిరంజీవి గారిపై ఉన్న ప్రేమ అభిమానం, నాపై ఉన్న నమ్మకంతో రవితేజ గారు ఒప్పుకోవడం జరిగింది. ► ఈ చిత్రంలో ముఠామేస్త్రీ, గ్యాంగ్ లీడర్ లాంటి వింటేజ్ లుక్ కనిపిస్తోందని అంతా అంటున్నారు. వాల్తేరు వీరయ్య పాత్రకు అలాంటి లిబర్టీ ఉంది. ఆయన లుంగీ కట్టుకోవచ్చు, బీడీ తాగొచ్చు.. గ్యాంగ్ లీడర్ లా గన్ పట్టుకొని వార్ కి రావచ్చు. ఆ ఫ్రీడమ్ అంతా వీరయ్య క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది తప్పితే బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు. ► చిరంజీవి గారి డ్యాన్స్ తో పాటు ఫన్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఫన్ టైమింగ్ లో ఆయన మాస్టర్ . మనం ఫన్ ఇవ్వగలిగితే దాన్ని స్కై లెవల్ కి తీసుకెళ్ళిపోతారాయన. ఆ మ్యాజిక్ అంతా చూస్తూ పెరిగాను. ఈ ఎనర్జీ అంతా ఆయన నుంచి తీసుకోవడం జరిగింది. ► వాల్తేరు వీరయ్య ఫస్ట్ కాపీని చిరంజీవి చూసి ‘బస్టర్ కొడుతున్నాం బాబీ’ అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకున్న ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి గారి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం మర్చిపోలేని మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా. ► చిరంజీవి గారిది దేవిశ్రీ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాల్తేరు వీరయ్య ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా థియేటర్ కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియో పరంగా. అలా మమ్మల్ని గెలిపించిన దేవిశ్రీ ప్రసాద్ గారి కి మా టీం అందరి తరపున కృతజ్ఞతలు. ► మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి పని చేయాలని ఎప్పటినుండో ఉండేది. ఇలాంటి సమయంలో నవీన్ గారు సినిమా చేద్దామని అడిగారు. తర్వాత జర్నీ మొదలైయింది. అద్భుతమైన నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. సినిమాకి ఏం కావాలో ఎక్కడ రాజీ పడకుండా సమకూరుస్తారు. -
వాల్తేరు వీరయ్య క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ మెగాస్టార్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్ కాంబినేషన్ సాంగ్ ఈనెల 30న రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటలు మెగాస్టార్ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తున్నాయి. తాజాగా మరో సాంగ్‌తో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం రెడీ అయింది. వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్ అలరించేందుకు వస్తోందంటూ చిరంజీవి, రవితేజ ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ట్వీట్ చేశారు మేకర్స్. మెగాస్టార్ వర్సెస్ మాస్ మహారాజా అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. Yo boys and girls, time to switch on the MEGA MASS mode 🔥🕺🏾 MEGASTAR × MASS MAHARAJA = #PoonakaaluLoading ❤️🔥 Song out tomorrow 💥#WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/OqnkdPnjEf — Mythri Movie Makers (@MythriOfficial) December 29, 2022 -
ప్రేక్షకులు, ఫ్యాన్స్ సంతోషం కోసం గొడ్డులా కష్టపడతాను: చిరంజీవి
‘‘ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మంచి సినిమాలు, మంచి పాత్రలు చేయాలని మనం ఎలా ఆకలిగా ఉంటామో వంద, రెండొందలు చిత్రాలు చేసినా అదే ఆకలితో, కమిట్మెంట్తో ఉండాలి. అప్పుడే మన వృత్తికి న్యాయం చేయగలం. అది లేకపోతే సినిమాల నుంచి రిటైర్ అయిపోవాలి. ఆ కమిట్మెంట్కు నేను కట్టుబడి ఉంటాను.. ఆచరిస్తాను. ప్రేక్షకులు, ఫ్యాన్స్ సంతోషం కోసం గొడ్డులా కష్టపడతాను’’ అని హీరో చిరంజీవి అన్నారు. బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. హీరో రవితేజ కీలక పాత్ర పోషించారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 13న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో చిరంజీవి మాట్లాడుతూ–‘‘బాబీ కథ చెప్పినప్పుడు బాగుందనిపించింది. నిర్మాతలతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్నాను. నా హార్డ్‌కోర్ ఫ్యాన్ బాబీ ఈ మూవీలో నన్ను అద్భుతంగా చూపించాడు. ఎలాంటి సన్నివేశాలైనా డూప్స్‌తో చేయించడం నాకు ఇష్టం ఉండదు.. నేను చేస్తేనే సంతృప్తిగా ఉంటుంది. వేరే హీరోలు ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ, నాకు తెలిసింది ఇదే.. ఇలాగే చేస్తాను’’ అన్నారు. ‘‘అన్నయ్యకి(చిరంజీవి) నేను పెద్ద అభిమానిని. పైగా బాబీ అంటే నమ్మకం. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు రవితేజ. ‘‘2002లో గీతాఆర్ట్స్ ఆఫీసులో రక్తదానం చేసేందుకు వచ్చిన 50 మంది చిరంజీవిగారి అభిమానుల్లో నేనూ ఒక్కణ్ణి. ఆయనతో సినిమా చేయాలనే నా కల ‘వాల్తేరు వీరయ్య’తో తీరింది. సంక్రాతి బరిలో మా అన్నయ్యను దించాలని 94 రోజులు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేశాం’’ అన్నారు బాబీ. ‘‘సంక్రాంతి అనే పెద్ద పండగకి ఇలాంటి అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చిన బాబీగారికి థ్యాంక్స్’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఈ కథ విన్నప్పుడు ఆహా.. మళ్లీ మెగా హిట్ తప్పదు అనిపించింది’’ అన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. ‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల నిర్మాతలు ఒక్కరే. రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజవుతున్నాయి. వాటిని ఎలా రిలీజ్ చేసుకోవాలనేది వాళ్ల ఇష్టం. అందులో నటుడిగా నా ప్రమేయం ఉండదు. రెండు సినిమాలు వారికి రెండు కళ్లు.. వాటిలో ఏ ఒక్క కన్నుని పొడుచుకోవాలనుకోరు కదా?’’ అన్నారు చిరంజీవి. -
'భగ భగ భగ మండే.. మగాడు వీడే'.. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా హైలెట్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్, 'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. ' అ’నే పాటలు రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నాయి. జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. ఇప్పటికే రిలీజైన పాటలు సినిమాపై క్రేజ్ మరింత పెంచాయి. తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్‌తో సినిమాపై మరింత హైప్ పెరగనుంది. -
'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే..' వాల్తేరు వీరయ్య సాంగ్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే బాస్ పార్టీ పేరుతో తొలి సింగిల్ పాటను రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా మరో పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని రెండో సింగిల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ పాట'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. రాయే రాయే రాయే చేసేద్దాం రబ్బో' అంటూ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో కొద్ది రోజుల క్రితమే షూట్ చేశారు. ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎవ్వరికీ చెప్పొద్దు.. ఆ సాంగ్ లీక్ చేస్తున్నా.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ ప్రత్యేక సాంగ్‌ను ఫ్రాన్స్‌లో షూట్ చేస్తున్నారు. ఈ పాటను దట్టమైన మంచు పర్వతాల్లో శృతిహాసన్, మెగాస్టార్ చిరంజీవిపై చిత్రీకరించారు. తాజాగా మెగాస్టార్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జనవరి 13 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈనెల 12న నేను శృతిహాసన్‌తో చేసిన ఓ సాంగ్ ఫినిష్ చేశాం. ఈ షూట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఆ లోకేషన్స్ కానీవ్వండి. సాంగ్ కానీవ్వండి. సో బ్యూటీఫుల్. ఈ లోకేషన్ సౌత్ ఆఫ్ ఫ్రాన్స్‌లో ఉంది. ఆ పేరు లేజే లేజే. ఇది స్విట్జర్లాండ్, ఇటలీ బార్డర్లో ఉన్న మౌంటెన్స్‌లో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ పాట కోసం యూనిట్ మొత్తం చాలా కష్టపడింది. దాదాపు -8 డిగ్రీల చలిలో ఈ పాటను షూట్ చేశాం. నిజంగా ఆ లోకేషన్ చాలా అందంగా ఉంటుంది. మేము పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు నేను ఆగలేకపోయాను. అయితే మీకోసం ఈ పాట నుంచి ఓ చిన్న బిట్‌ను లీక్ చేస్తున్నా. ఎవరికీ చెప్పకండి. త్వరలోనే మీ ముందుకు లిరికల్ సాంగ్ రానుంది.' అంటూ మెగాస్టార్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవిని.. రాయే రాయే రాయే' అంటూ సాగే సాంగ్ లిరిక్స్ లీక్ చేస్తున్నా అంటూ నవ్వుతూ చెప్పారు మెగాస్టార్. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
అటు విహార యాత్ర.. ఇటు వీరయ్య యాత్ర.. మెగాస్టార్ ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు మేకర్స్. జనవరి 13న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ విదేశాలకు బయలుదేరాడు. ఈ విషయాన్ని చిరు తన ట్విటర్లో పంచుకున్నారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' ఫ్యామిలీతో అటు విహార యాత్ర. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర' అంటూ పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులతో పాటు హీరోయిన్ శృతిహాసన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ తో అటు విహార యాత్ర హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022 -
సంక్రాంతి బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్య.. రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. జనవరి 13 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'ఈ సంక్రాంతికి థియేటర్లలో మాస్ మూలవిరాట్ దర్శనానికి ఇది సమయం' అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి సైతం సంక్రాంతికి కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్ర దర్శకుడు బాబీ 'జనవరి 13న మూలవిరాట్ ఆగమనం' అంటూ ట్వీట్ చేశారు. అధికారిక ప్రకటన రావడంతో మెగాస్టార్ సంక్రాంతి బరిలో నిలిచారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 13 "మాస్ మూలవిరాట్"ఆగమనం 🔥🎯 #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th https://t.co/FtDWVC4TkS — Bobby (@dirbobby) December 7, 2022 సంక్రాంతి కి కలుద్దాం 🔥🎯@RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/dLBKLphlZk — Chiranjeevi Konidela (@KChiruTweets) December 7, 2022 This Sankranthi, it's time for the MASS MOOLAVIRAT darshanam in theatres 🔥#WaltairVeerayya GRAND RELEASE WORLDWIDE on 13th JAN, 2023 💥 Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/Z7aiNFxOax — Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2022 -
తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు, బండ్ల వీడియో వైరల్
వివాదాలతో సావాసం చేసే సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా అల్లు ఫ్యామిలీ మీద ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొన్న బండ్ల గణేశ్ అల్లు బాబీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ.. 'అందరికీ చెప్తున్నా, తండ్రి మాట వినొద్దు. తండ్రిని గౌరవించి ఆయన మాట వింటే మా బాబీగారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే బన్నీగారిలా అవుతారు. బాబీగారిలా అవ్వాలా? బన్నీగారిలా అవ్వాలా? అనేది మీరే నిర్ణయించుకోండి' అన్నాడు. 'బాబీ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని మామూలుగా ఇలా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ పోయిన బన్నీ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దయచేసి తండ్రి మాట వినొద్దు, సొంత నిర్ణయాలు తీసుకోండి. తండ్రి మాట విన్న బాబీని చూడండి, వినని బన్నీని చూడండి' అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బాబీ పాజిటివ్‌గా తీసుకుని సరదాగా నవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతుంగా నెటిజన్లు బండ్ల గణేశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పబ్లిక్‌లో ఏది పడితే అది వాగేయడమేనా? కాస్తైనా కామన్సెన్స్ ఉండక్కర్లా, దీన్నే నోటిదురుసు అంటారు, ఒకరిని కించపరిచేలా మాట్లాడటం నీకు సరదాగా ఉందా? ఏది పడితే అది వాగడం తగ్గించుకుంటే మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే.. తండ్రి మాట వినలేదని బన్నీ నీకొచ్చి చెప్పాడా? నోటికొచ్చినట్లు వాగుతున్నావ్ అంటూ బండ్ల గణేశ్‌ను ఏకిపారేస్తున్నారు. చదవండి: క్రికెటర్‌తో లవ్, ఇప్పుడు మాటల్లేవన్న నటి పాత ఇల్లు కొని సొంతింటి కల సాకారం చేసుకున్న కమెడియన్ -
Mega 154 Title Teaser: చిరు చేతిలో సిగరేట్.. ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల కానుంది. టీజర్ కంటే ముందు తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో చిరంజీవి స్టైల్‌గా సిగరేట్ తాగుతుండగా.. పొగ అలా వస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చిన్న గ్లింప్సే ఇలా ఉంటే.. రేపే రాబోతున్న టైటిల్ టీజర్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. చిరంజీవి 154వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అని టైటిల్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. విశాఖపట్నం నేపథ్యంలో సాగు గ్యాంగ్‌స్టర్-పోలీసు డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసింది. ఇందులో రవితేజ ఓ కీలక పాత్ర పోషించగా, శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. MEGA MASS EXPLOSION in 24 Hours 🙌💥 We are Ready To Make Your Diwali Sparkle Even Brighter with #Mega154 Title Teaser Tomorrow at 11.07 AM ❤️🔥 Poonakalu Loading 🔥🤙 Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @ThisIsDSP @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/kWTdZuMfJM — Bobby (@dirbobby) October 23, 2022 -
వైజాగ్ టు హైదరాబాద్
చిరంజీవి హీరోగా బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇటీవల చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ వైజాగ్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, రవితేజలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ షెడ్యూల్లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రవితేజ తిరిగి హైదరాబాద్‌కు వచ్చారట. ఈ సినిమాలో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిరంజీవి. కాగా ‘వాల్తేరు వీరయ్య’ కొత్త షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం, లైన్ ప్రొడ్యూసర్: కేవీవీ బాలసుబ్రహ్మణ్యం. -
డైరెక్టర్ బాబీ ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు పితృవియోగం కలిగింది. వివరాల్లోకి వెళితే.. బాబీ తండ్రి మోహనరావు(69)గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు(ఆదివారం) తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా బాబీ ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’పేరుతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. -
ఆ యూట్యూబర్ ఆచూకీ చెబితే రూ.25,000 రివార్డ్!
డెహ్రాడూన్: విమానంలో సిగరెట్ తాగుతూ, రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల వైరల్‌గా మారిన ప్రముఖ యూట్యూబర్ బాబీ కటారియా అరెస్ట్‌కు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.25,000 రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ‘నిందితుడిపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. కటారియాను అరెస్ట్ చేసేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు ఉత్తరాఖండ్ పోలీసులు. కానీ, అతడు పారిపోయాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు రూ.25,000 రివార్డ్ ప్రకటించటం జరిగింది.’అని తెలిపారు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ దిలీప్ సింగ్ కున్వార్. ముస్సోరీ కిమాడి మార్గ్‌లో రోడ్డ మధ్యలో టెబుల్ వేసుకుని మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించాడని తెలిపారు. అలాగే మద్యం మత్తులో బైక్ ప్రమాదకరంగా నడిపాడన్నారు. దీంతో బాబీ కటారియాపై 342,336,290,510, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు దిలీప్ సింగ్. ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
Mega 154: చిరంజీవి సినిమాలో రవితేజ పాత్ర ఇదేనా.. స్టోరీ లీక్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల రవితేజ కూడా సెట్స్‌లోకి కూడా అడుగుపెట్టాడు. తాజాగా ఈ చిత్రంలో రవితేజ పోషించబోయే పాత్ర ఇదేనంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (చదవండి: బొద్దుగా ఉండే అంజలి.. ఇలా అయిపోయిందేంటి?) ఇందులో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపించబోతున్నాడట. సవతి తల్లి కొడుకైన రవితేజతో చిరంజీవికి వైర్యం ఏర్పడుతుదంట. ఇద్దరి పాత్రల మధ్య ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయట. వీరిద్దరి మధ్య వచ్చే ఓ హైలోల్టేజ్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. బయట కూడా చిరంజీవిని రవితేజ సొంత అన్నయ్యలా భావిస్తాడు. గతంలో వీరిద్దరు అన్నాదమ్ములుగా ‘అన్నయ్య’ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు కూడా మెగాస్టార్‌కు మాస్ మహారాజా తమ్ముడిగా నటిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
మెగాస్టార్‌తో మాస్ మహారాజా.. సెట్లోకి రవితేజ ఎంట్రీ.. స్పెషల్ వీడియో
వరుస సినిమాలతో జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. గాడ్‌ఫాదర్, భోళా శంకర్ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. మెగా 154 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేస్తూ.. ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. అందులో రవితేజ కారు దిగి నడుచుకుంటూ చిరంజీవి క్యారవాన్ దగ్గరకు వెళ్లాడు. ‘అన్నయ్యా..’అంటూ తలుపు కొట్టగా.. ‘హాయ్ బ్రదర్’అంటూ చిరు చేయి అందించాడు. వీరిద్దరు లోపలికి వెళ్లగానే బాబీ వచ్చి ‘మెగా మాస్ కాంబో మొదలైంది’అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. చిరంజీవి, రవితేజలు కలిసి అన్నయ్య చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్లీ వీరిద్దకు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. ఒకవైపు మెగాస్టార్, మరోవైపు మాస్ మహారాజా.. ఇద్దరు కలిస్తే థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్ నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
మలేసియాకు చిరంజీవి పయనం.. 20 రోజుల పాటు
Chiranjeevi Going To Malaysia For Valteru Veeraiah Movie Shoot: మలేసియా వెళ్లడానికి రెడీ అవుతున్నాడు 'వాల్తేరు వీరయ్య'. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసమే ఈ ప్రయాణం. టార్గెట్ ఎవరు? ప్లాన్ ఎలా డిజైన్ చేశారు ? అనే అంశాలు తెలియడానికి కాస్త సమయం ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మలేసియాలో ప్రారంభం కానుందని సమాచారం. జూన్ మొదటివారంలో లేదా రెండోవారం ప్రారంభంలో చిరంజీవి, బాబీ అండ్ కో మలేసియాకు పయనం అవుతారు. సుమారు 20 రోజులు అక్కడ షూట్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ సినిమాకు ఈ షూటింగ్ కీలకమని సమాచారం. జీకే మోహన్, ఎమ్ ప్రవీణ్ సహనిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. చదవండి: 👇 నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్ అందుకు క్షమాపణలు చెప్పిన కమల్ హాసన్.. -
చిరంజీవి 154వ సినిమాలో ఆ హీరోయిన్.. ఉమెన్స్ డే సందర్భంగా రివీల్
మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. యంగ్ హీరోలకన్నా తనేమి తక్కువ కాదంటూ మూడు సినిమాలను లైన్లో పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న చిరింజీవి మరో చిత్రం భోళా శంకర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక బాబీ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం ఒకటి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరో పరిచయం చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజున ఇంతకంటే మంచి వార్త ఏం ఉంటుంది. వెల్కమ్ శ్రుతి అంటూ సినిమా యూనిట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే మొదటి నుంచే ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ అని పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా ప్రభాస్ సరసన సలార్‌లో, గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణకు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. On this Women's Day, delighted to Welcome you on board @shrutihaasan You bring Woman Power to #Mega154 @MythriOfficial @dirbobby #GKMohan @ThisIsDSP pic.twitter.com/xYMaiQPpni — Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2022 What better day than #WomensDay to announce the big news! Welcoming #Mega154 Maguva, the gorgeous & talented @shrutihaasan on board for #Mega154 💥 Megastar @KChiruTweets @dirbobby @ThisIsDSP 🔥 pic.twitter.com/kRwiDTDoCR — Mythri Movie Makers (@MythriOfficial) March 8, 2022 -
శ్రుతీహాసన్ లిస్ట్‌లో మరో భారీ ఆఫర్
శ్రుతీహాసన్ లిస్ట్‌లో మరో భారీ ఆఫర్ చేరనుందా? అంటే ఫిల్మ్‌నగర్ అవుననే అంటోంది. చిరంజీవి సరసన ఈ బ్యూటీ జోడీ కట్టనున్నారని టాక్. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతీహాసన్‌ని కథానాయికగా ఎంపిక చేశారట. ఈ చిత్రంలో చిరంజీవి మత్స్యకారుడిగా కనిపించనున్నారని, టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రవితేజతో చేసిన ‘క్రాక్’ హిట్‌తో శ్రుతి మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తున్నారామె. ఇటీవలే బాలకృష్ణ సరసన సినిమా చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు వార్తల్లో ఉన్నట్లు మరో పెద్ద ఆఫర్ ఉందా? చిరంజీవి–శ్రుతీ కాంబో కుదురుతుందా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. -
కొత్త సినిమా షూటింగ్లో చిరంజీవి
చిరంజీవి ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. ‘ఆచార్య’, ‘బోళాశంకర్’ సినిమాల షూటింగ్లో పాల్గొంటున్న ఆయన తాజాగా కొత్త సినిమా చిత్రీకరణలో గురువారం జాయిన్ అయ్యారు. ఈ సినిమాకు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్స్‌లో చిరంజీవికి సీన్ వివరిస్తున్న ఓ ఫొటోను బాబీ షేర్ చేసి, ‘‘చిరంజీవి అన్నయ్య తొలిరోజు షూటింగ్లో మాతో జాయిన్ అయ్యారు. కొంచెం నెర్వస్‌గా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రయాణానికి గొప్ప ఆరంభం ఇది’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఏ విల్సన్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, సహ నిర్మాత: జీకే మోహన్, సీఈఓ: చెర్రీ. -
కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ ట్రీట్
Allu Arjun Son Allu Ayaan As Ghani Viral Video: సాధారణంగా స్టార్ హీరోల వారసులు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యింది. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం సినిమా ద్వారా డెబ్యూ ఇవ్వనుండగా, ఇప్పుడు కొడుకు అల్లు అయాన్ గని సినిమా కోసం రంగంలోకి దిగాడు. వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫాంహౌస్‌లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అచ్చం బన్నీలాగే ఎనర్జీ, స్టైల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ.. ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩 ▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H — Geetha Arts (@GeethaArts) November 8, 2021 -
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా పూజా కార్యక్రమం
-
Mega 154: మాస్ లుక్‌లో మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగాస్టర్ చిరంజీవికి 154వ చిత్రమిది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు సినీ ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం షూరు అయిన విషయాన్ని తెలియజేస్తూబాబీ.. చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్‌లో స్టైలీష్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. . మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The day I'm waiting for quite a long time has arrived!! 🤗 Working with my all time favorite HERO Megastar @KChiruTweets garu for #MEGA154 ❤️ Presenting the 'Mass Moola Virat' in an avatar we love to see him the most 😎 Annayya Arachakam Arambham 🤩@MythriOfficial pic.twitter.com/olYEMnglJg — Bobby (@dirbobby) November 6, 2021 -
అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్
Allu Ramalingaiah Statue: లెజెండరీ నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు అర్జున్,బాబీ, శిరీష్‌లు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్ చేస్తూ.. మా తాత, పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన మాకు ఎంతో గర్వ కారణం. అల్లు స్టూడియోస్ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ ఉంటారు అంటూ ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్సుకుమార్ దర్శకత్వంలో పుష్ఫ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల Unveiled the statue of my grandfather Padmashri #AlluRamalingaiah garu in ALLU Studios on his birth anniversary today along with #AlluBobby & @AlluSirish . He was our pride and will continue to be a part of our journey at Allu studios . pic.twitter.com/UHMZYvgiC3 — Allu Arjun (@alluarjun) October 1, 2021 -
చిరు గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. బాబీ ఎమోషనల్ ట్వీట్
పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచియమైన కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ తన ఫస్ట్ సినిమాతోనే పవర్ఫుల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా స్టార్ హీరోలతోనే సాలిడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్నాడు.. తాజాగా తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు...ఈరోజు(ఆగస్ట్ 1) బాబీ బర్త్ డే. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు బాబీ. ఇక పుట్టిన రోజు సందర్భంగా తన దగ్గరకు వచ్చిన బాబీకి ఓ ప్రత్యేకమైన కలాన్ని బహుమతిగా ఇచ్చాడు చిరంజీవి. అయితే ఇలా ఓ అభిమాని స్థాయి నుంచి దర్శకుడిగా చిరంజీవి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవడంతో బాబీ భావోద్వేగానికి గురైయ్యాడు. ఈ బహుమతి ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ చిరు గిఫ్ట్ వీడియోని ట్వీటర్లో పోస్ట్ చేశాడు. Thank you so much our dearest Megastar! A memorable birthday with the blessings from my idol himself @KChiruTweets garu, A fan in the millions to the man to direct you. It's truly a dream come true moment to me and I'm very thankful for this! Special thanks for the gift, sir!❤️ pic.twitter.com/eEqcmX1wcI — Bobby (@dirbobby) August 1, 2021 -
బన్నీ ఫ్రెండ్‌గా ‘గంగోత్రి’లో చాన్స్, పరువు పోతుందని చేయనన్నాను..
యంగ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర ‘బలుపు’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాబీ ఓ ఛానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’ మూవీలో నటించే చాన్స్ వచ్చినట్లు చెప్పాడు. అయితే పరువు పోతుందని ఆ మూవీలో నటించడానికి ఒప్పుకోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబీ మాట్లాడుతూ.. ‘గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యుక్షుడిగా ఉన్న సమయంలో రైటర్ చిన్ని కృష్ణ తనని కలిసి హైదరబాద్‌కు వచ్చినప్పుడు కలవమని చెప్పారు. అలా ఓ సారి హైదరబాద్‌కు వచ్చి ఆయనను కలిశాను. వెంటనే ఆయన నన్ను రఘవేంద్ర రావు దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత కాసేపు నన్ను గమనించిన ఆయన గంగోత్రిలో అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా నటించే అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నిక్కర్ వేసుకోవాలని నా కోలతలు తీసుకోమ్మంటూ అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెప్పారు. అయితే అలా నిక్కరులో కనిపిస్తే గుంటూరులో నా పరువు పోతుందని భయపడి వెంటనే నేను చేయనని చెప్పాను. మరీ ఏం చేస్తావని చిన్ని కృష్ణ అడిగారు. వెంటనే నేను కథలు రాస్తానని చెప్పాను. దీంతో గంగోత్రికి కొన్ని సన్నివేశాలు రాసే అవకాశం ఇచ్చారు. అలా నేను రాసిన సన్నివేశాలు రాఘవేంద్రరావు నచ్చి సినిమాలో పెట్టుకున్నారు. అలా రచయిత, డైరెక్టర్‌ను అయ్యాను’ అంటూ బాబీ చెప్పుకొచ్చాడు. -
ఏడేళ్ల తర్వాత సోనాక్షి, తొలిసారి నవాజుద్దీన్
దాదాపు ఏడేళ్ల తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా సౌత్‌లో ఓ సినిమా ఒప్పుకున్నారు. అది కూడా తెలుగు సినిమా కావడం విశేషం. చిరంజీవి సరసన జోడీ కట్టనున్నారామె. 2014లో రజనీకాంత్ సరసన చేసిన ‘లింగా’ తర్వాత దక్షాణాదిన సోనాక్షి చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో చిరంజీవికి విలన్‌గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనున్నారు. రజనీ ‘పేట’ తర్వాత దక్షిణాదిన నవాజుద్దీన్ చేయనున్న సినిమా ఇదే. చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ సినిమా తెరకెక్కించనుంది. ఈ సినిమాతో సోనాక్షీ కథానాయికగా, నవాజుద్దీన్ ప్రతినాయకుడిగా తెలుగులోకి మెగా ఎంట్రీ ఖరారైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. మలయాళ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్, మెహర్ రమేశ్ సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి గనక చిరంజీవి–బాబీ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్తంత సమయం పట్టేలా ఉంది. చదవండి: అందుకే విడాకులు రద్దు చేసుకుంటున్నాను: నటుడి భార్య -
నెక్స్ట్ సినిమా లీక్ చేసిన చిరంజీవి..
చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవికి ఖైదీ చిత్రం విజయాన్ని అందించి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఖైదీ అనంతరం 151 చిత్రంగా వచ్చిన సైరా నర్సింహరెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టగా ప్రస్తుతం ఆచార్య సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య తరువాత మలయాళ చిత్రం లూసిఫర్ రీమెక్‌లో నటించనున్నాడు. మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించనున్నారు. కాగా రెండు సినిమాలు చేతిలో ఉండగానే చిరంజీవి మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. దర్శకుడు కేఎస్ రవీంద్రతతో(బాబీ) తన 154వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లుచ చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లూసిఫర్ తరువాత బాబీతో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపాడు. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మించనుందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే బాబీ, అతని టీమ్ చిరంజీవికి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. చదవండి: తమిళ చిత్రానికి అంతర్జాతీయ గౌరవం.. నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్ -
బాబీ హీరో మరి లేడు
‘మై షాయర్ తో నహీ’... అంటూ 1970లలో ‘బాబీ’ సినిమా ద్వారా కుర్రకారును ఉర్రూతలూగించిన రిషి కపూర్ (67) బుధవారం అభిమానుల నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నాడు. రంగు రంగుల ఉన్ని జెర్సీలు, స్వెటర్లు మారుస్తూ అందమైన పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరించిన రిషి కపూర్ ఈ కరోనా కాలంలో చివరి చూపుకు కూడా వీలు ఇవ్వకుండా ఒక కలలాగా తరలి వెళ్లిపోయాడు. గత రెండేళ్లుగా ఆయన బ్లడ్ కేన్సర్‌తో బాధ పడుతున్నాడు. అమెరికాలో చాలా కాలం ఉండి వైద్యం చేయించుకుని 2019 సెప్టెంబర్‌లో తిరిగి వచ్చాడు. అప్పటినుంచి ముంబైలోనే అదే ఉత్సాహంతో కేన్సర్‌ని జయిస్తానన్న ధీమాతో కుటుంబాన్ని, మిత్రులను ఉత్సాహ పరుస్తూ వచ్చిన రిషి కపూర్ ఆస్పత్రిలో చేరిన ఒకరోజులోనే తుది శ్వాస విడిచాడు. ఆయన భార్య నీతూ సింగ్ ప్రసిద్ధ నటి. కుమారుడు రణబీర్ కపూర్ బాలీవుడ్ టాప్‌స్టార్. కుమార్తె రిధిమ వివాహం చేసుకుని ఢిల్లీలో స్థిరపడింది. ‘మేరా నామ్ జోకర్’లో తన తండ్రి రాజ్‌కపూర్ ద్వారా తెర పరిచయం అయిన రిషి కపూర్ ఆ తర్వాత తండ్రి ద్వారానే ‘బాబీ’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయ్యాడు. 1973–95ల మధ్య రిషి కపూర్ బిజీస్టార్‌గా నిలిచాడు. రాజ్‌కపూర్ తన ముగ్గురు కుమారునూ హీరోలుగా చేద్దామని అనుకున్నా పెద్దన్న రణధీర్ కపూర్, చిన్న తమ్ముడు రాజీవ్ కపూర్ ఆ కుటుంబ పరంపరను కొనసాగించలేకపోయారు. షమ్మీ కపూర్, శశికపూర్ తర్వాత రిషి కపూరే ఆ స్థాయి హీరోగా ఎదిగాడు. రణ్‌ధీర్ కపూర్ తన తమ్ముణ్ణి ముద్దుగా పిలుచుకున్న ‘చింటూ’ అన్న పేరు స్థిరపడి చింటూ కపూర్‌గా కూడా ఆయన కొనసాగాడు. రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘హెనా’లో రిషి కపూరే హీరో. అమితాబ్ బచ్చన్ ‘జంజీర్’తో, రిషి కపూర్ ‘బాబీ’తో ఒకే సంవత్సరం (1973) స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అమితాబ్ అంటే రిషి కపూర్‌కు మొదట్లో వ్యతిరేకత ఉన్నా ఆ తర్వాత కలిసి నటించి ‘అమర్ అక్బర్ ఆంధోని’, ‘నసీబ్’, ‘కభీ కభీ’, ‘కూలీ’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇటీవల ‘102 నాట్ అవుట్’లో మళ్లీ కలిసి నటించారు. రిషి కపూర్ తన కెరీర్లో తొలి కాలంలో కంటే మలి కాలంలో నటనకు అవకాశం ఉన్న సినిమాలు చేసి మెప్పించాడు. ‘కపూర్ అండ్ సన్స్’, ‘ముల్క్’, ‘డి–డే’ అతనికి అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టాయి. రిషి కపూర్ తన భోజన, మద్యపాన ప్రియత్వాలను ఎప్పుడూ దాచుకోలేదు. తన ఆత్మకథ ‘ఖుల్లం ఖుల్లా’లో వాటిని వివరించాడు. రిషి కపూర్ మరణవార్త పట్ల అతని కుటుంబం ప్రకటన విడుదల చేస్తూ ‘రిషికపూర్‌ను చిరునవ్వులతో గుర్తుపెట్టుకోవాలిగానీ కన్నీళ్లతో కాదు’ అంది. రిషి కపూర్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని చందన్వాడి క్రిమెటోరియమ్‌లో జరిగాయి. కరోనా లాక్డౌన్ కారణాన అతి కొద్దిమందే పాల్గొన్నారు. వారిలో కుమారుడు రణబీర్, భార్య నీతూ సింగ్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్ ఉన్నారు. కుమార్తె రిధిమ చివరి చూపుకు హాజరు కాలేకపోవడం విషాదం. ఆమె ఢిల్లీలో ఉన్న కారణాన రోడ్డు ప్రయాణాన బయలుదేరి రాత్రికి ముంబై చేరుకుంటారని తెలుస్తోంది. ఖవాలీ స్టార్ రిషి కపూర్ తన పాటల కోసమే కాకుండా ఖవాలీలకు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. హిందీ సినిమాలలోని రెండు గొప్ప ఖవాలీలు అతని మీద చిత్రీకరింప బడ్డాయి. రెంటినీ మహమ్మద్ రఫీయే పాడాడు. ‘హమ్ కిసీసే కమ్ నహీ’ సినిమాలో టైటిల్ సాంగ్‌ను ఖవాలీగా చిత్రీకరించారు. ‘ఏ అగర్ దుష్మన్’... అంటూ సాగే ఆ ఖవాలీ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ‘అమర్ అక్బర్ ఆంధోని’లోని ‘పరదాహై పరదా’ అనే ఖవాలీ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో అమితాబ్ కూడా రిషి కపూర్‌తో గొంతు కలుపుతాడు. ఖవాలీ వజ్రాసనంలో కూచుని పాడతారు. కాని రిషి కపూర్‌కు అలా కూచోవడం చిన్నప్పటి నుంచి రాదు. అందుకని రెండు ఖవాలీలలో అతను మోకాళ్ల మీద నిలబడి పాడటం కనిపిస్తుంది. రిషి కపూర్ వల్ల శైలేంద్ర సింగ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. బాబీ నుంచి మొదలెట్టి చాలా సినిమాలకు శైలేంద్ర సింగ్ రిషి కపూర్‌కు పాడాడు. ‘హమ్‌తుమ్ ఏక్ కమరేమే బంద్ హో’... ఎంత పెద్ద హిట్టో అందరికీ గుర్తుంటుంది. -
ఈ విజయానికి కారణం మా యూనిట్ – వెంకటేశ్
‘‘మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో యూనిట్ అంతా ఎంతో కష్టపడటంతోనే ఇంత పెద్ద సక్సెస్‌ను అందుకున్నాం. ‘వెంకీమామ’ సినిమాను బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. చిరంజీవిగాకి, మహేశ్‌బాబుకి కూడా మా సినిమా నచ్చడంతో అభినందించారు.. ఇందుకు వారిద్దరికీ ధన్యవాదాలు’’ అని వెంకటేశ్ అన్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిరి్మంచిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ గా ఉండేది. విడుదల తర్వాత చాలా సంతోషంగా ఉంది. అందరూ సినిమాను తమదిగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు మామలు కలిసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో నాకు చూపించారు. మాకే కాదు.. ఇది తాతగారి (రామానాయుడు) కల.. తాతగారి సక్సెస్. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూశాను. అంతా బాగా ఎంజాయ్ చేశారు’’ అన్నారు రాశీఖన్నా. ‘‘మనం రేపు మాట్లాడుకునే సినిమాల్లో ‘వెంకీమామ’ ఒకటిగా నిలుస్తుందని కచి్చతంగా చెప్పగలను’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘ఈ సక్సెస్ రెండేళ్ల కష్టం. హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం. వెంకటేశ్‌గారు, చైతన్యగారి పాజిటివిటీ వల్లే ఈ సినిమా తీయగలిగాను’’ అన్నారు కె.ఎస్.రవీంద్ర. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘వెంకటేశ్‌గారు, చైతన్యగారితో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి ‘వెంకీమామ’ చేశాను’’ అన్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్. ‘‘ఇంటి భోజనం తింటే ఎలా ఉంటుందో ‘వెంకీమామ’ చూస్తుంటే అలా అనిపించింది’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, చందూ మొండేటి, నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకీ మామ ఫ్యామిలీ ప్యాక్
-
ఈ మామకు ఇంకేం కావాలి : వెంకటేష్
‘‘వెంకీ మామ’ సినిమాలోని ‘అమ్మయినా నాన్నయినా నువ్వేలే వెంకీ మామ...’ పాటలా నాకంతా నా అభిమానులే. నా 30 ఏళ్ల కెరీర్లో మీరే నా బలం. ఈ నెల 13న కలుద్దాం’’ అని వెంకటేష్ అన్నారు. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఖమ్మంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతూకు మాత్రమే మామ.. కానీ, సినిమా విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే. ఎక్కడికి వెళ్లినా వెంకీ మామ అంటున్నారు. ఈ సినిమాలో చైతూ చించేశాడు.. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. మామ– అల్లుడు సెంటిమెంట్‌ని బాబీ చాలా బాగా తీశాడు. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘నా లైఫ్‌లో రెండే రెండు సినిమాలు.. ఒకటి ‘మనం’.. రెండోది ‘వెంకీ మామ’. కెమెరా వెనుక ఓ మామ(సురేష్‌బాబు).. ముందు మరో మామ(వెంకటేష్).. నన్ను చాలా బాగా చూసుకున్నారు. బాబీ కూల్ డైరెక్టర్. ఈ మూవీలో మామా అల్లుళ్ల అల్లరి మామూలుగా ఉండదు’’ అన్నారు. బాబీ మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన వెంకటేష్, నాగచైతన్య, మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులందరికీ నమస్కారం. ఏ హీరో అభిమానులు కూడా నెగిటివ్ మాట్లాడని హీరో వెంకటేష్‌గారు. చిన్నప్పుడు వీసీఆర్ కోసం వెళ్తే వెంకీగారి సీడీలు దొరికేవి కావు.. మహిళలు తీసుకుని వెళ్లేవాళ్లు. బ్లాక్‌లో తీసుకుని రావాల్సి వచ్చేది. ‘ఎఫ్ 2’లో వెంకటేష్‌గారి ఫన్ చూశారు.. ‘వెంకీ మామ’ లో ఆయన మాస్ యాంగిల్ చూపించాను. ఎంతో కుటుంబ నేపథ్యం ఉన్నా చైతూ కొత్త హీరోగానే ఆలోచిస్తాడు. సురేష్ బాబుగారు పెద్ద పుస్తకం’’ అని తెలిపారు. ‘‘వెంకీ మామ’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రాశీఖన్నా. ‘‘వెంకటేష్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఇంత త్వరగా పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘అన్ని రకాల భావోద్వేగాలున్న మంచి సినిమా ‘వెంకీ మామ’’ అన్నారు సురేష్ బాబు. ‘‘వెంకటేష్, నాగ చైతన్యలతో గ్రేట్ మల్టీస్టారర్ నిర్మించడం ఆనందంగా ఉంది’’ అన్నారు విశ్వప్రసాద్. ‘‘వెంకీ, చైతూల నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల. -
రైలెక్కి చెక్కేస్తా...
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై బేబి ఢమరి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘రైలెక్కి చెక్కేస్తా...’ అనే ఐటెమ్ సాంగ్‌ను దర్శకుడు బాబీ, నటుడు సత్యప్రకాశ్ విడుదల చేశారు. ‘ఎర్రచీర’ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ– ‘‘ఐటెమ్ సాంగ్ బావుంది. సుమన్ గారు దర్శకునిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించటం చాలా గొప్ప విషయం. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా దర్శకుడు బాబీ మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఢమరి అనే సొంత మ్యూజిక్ కంపెనీని స్టార్ట్ చేశాను. శ్రీకాంత్‌గారు ఇంతకుముందు ఎప్పుడూ చేయని అఘోర పాత్రలో నటించారు. డిసెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అన్నారు హీరోయిన్ సంజనా శెట్టి. సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన సురేష్ కొండేటి, మాజీమంత్రి పుష్పలీల, సంగీత దర్శకుడు ప్రమోద్, రచయిత గోపి తదితరులు పాల్గొన్నారు. -
నవంబరులో రేస్
‘గురు’ (2017) చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా వెంకటేశ్ నటన సూపర్ అని ఆడియన్స్ కితాబులిచ్చారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ వెంకీ క్రీడా నేపథ్యంలో ఉన్న చిత్రంలో నటించనున్నారని సమాచారం. హార్స్ రేసింగ్ ప్రధానాంశంగా సాగే ఓ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ స్టోరీకి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలిసింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట హార్స్ క్లబ్ నేపథ్యంలో స్క్రిప్ట్ రెడీ చేశారట తరుణ్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమా ఈ నవంబరులో మొదలవుతుందట. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు వెంకటేశ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య మరో హీరో. -
లీకైన ‘వెంకీ మామ’ వీడియో
పెరుగుతున్న టెక్నాలజీ అన్ని రంగాలను ఇబ్బందుల పాలు చేస్తుంది. ముఖ్యంగా సినీ రంగానికి లీకులు పైరసీ పెద్ద సమస్యగా మారాయి. స్టార్ హీరోల సినిమాలకు పదే పదే లీకుల కారణంగా తలనొప్పులు తప్పటంలేదు. తాజాగా వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమా కూడా లీకు వీరుల బారిన పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరగుతుంది. గోదావరి తీరంలో వెంకీ, చైతులపై చిత్రీకరించిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కోన ఫిలిం కార్పోరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నవంబర్ నుంచి మామ అల్లుళ్ల మల్టీస్టారర్
సీనియర్ హీరో వెంకటేష్, యువ కథానాయకుడు నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ. నిజజీవితంలో కూడా మామా అల్లుళ్లైన వెంకీ, చైతూలు ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్.. కోన వెంకట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకుడు. జై లవ కుశ లాంటి సూపర్ హిట్ తరువాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో వెంకీ మామపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మూవీలో చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా వెంకటేష్‌కు జోడిగా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించనున్నారు. -
మరో మల్టీ స్టారర్ మొదలైంది!
జై లవ కుశ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ(కె.యస్. రవీంద్ర) కొంత గ్యాప్ తరువాత తన కొత్త సినిమాను ప్రారంభించారు. మల్టీ స్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్, తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ రోజు (బుధవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. ఈసినిమాకు వెంకీ మామ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తుండగా, చైతూ సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. -
వెంకీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ
గురు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు వెంకీ. ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ తేజ్‌తో కలిసి నటించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ సినిమాతో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు ఓకె చెప్పారు వెంకీ. జై లవ కుశ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ(కె.యస్. రవీంద్ర) దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మల్టీ స్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్బ్యూటీ నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. కాలా సినిమాలో రజనీకాంత్ ప్రేయసిగా నటించిన హుమా ఖురేషీ, వెంకీకి జోడిగా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
మల్టీస్టారర్‌లో రకుల్..?
గత ఏడాది స్పైడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. టాలీవుడ్ లో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తమిళ, హిందీ సినిమాలను అంగీకరించి టాలీవుడ్ కు దూరమైంది. ప్రస్తుతం రకుల్ మూడు తమిళ సినిమాలతో పాటు ఒక హిందీలో నటిస్తున్నారు. వరుసగా తమిళ, హిందీ సినిమాలే అంగీకరిస్తుండటంతో ఇక టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్టే అని భావించారు ఫ్యాన్స్. అయితే తాజాగా ఈ భామ ఓ తెలుగు సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో చైతూకు జోడిగా రకుల్‌ను ఫైనల్ చేశారు. నాగచైతన్య, రకుల్ ప్రీత్ కాంబినేషన్లో తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరోసారి ఇదే కాంబినేషన్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. -
నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు
పవర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు బాబీ(కె.యస్.రవీంద్ర). దర్శకుడిగా మూడు సినిమాలు మాత్రమే చేసిన ఈ యంగ్ టెక్నీషియన్ త్వరలో నిర్మాతగా మారనున్నాడు. రెండో సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్‌ను డైరెక్టర్ చేసి ఛాన్స్ కొట్టేసిన ఈ యువ దర్శకుడు సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. సర్థార్ ఫెయిల్యూర్ తో గ్యాప్ తీసుకున్న బాబీ, తరువాత ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాను రూపొందించి మరోసారి సత్తా చాటాడు. ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్న బాబీ, నిర్మాతగా తెరకెక్కించే సినిమా పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు. నిర్మాతగా తొలి సినిమాకు అరుణ్ పవార్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు బాబీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఓ యువ కథానాయకుడిని సంప్రదిస్తున్నారట. -
చైతూతో ఎన్టీఆర్ డైరెక్టర్..?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న యువ దర్శకుడు బాబీ.. తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే నాగచైతన్యకు కథ వినిపించిన బాబీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు నాగచైతన్య ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ‘నిన్ను కోరి’ ఫేం శివా నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయితేగాని బాబీ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు. మరి బాబీ అప్పటి వరకు వెయిట్ చేస్తాడో లేక ఈ లోపు మరో సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి. -
మలయాళం మాట్లాడతా
సిద్ధార్థ్ తమిళ్ పయ్యన్ (అబ్బాయి). అయితే తెలుగు కూడా బాగా మాట్లాడతారు. ఈజీగా నేర్చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఈ తమిళ కుర్రాడు మలయాళం నేర్చుకునే పని మీద ఉన్నారు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కమ్మార సంభవం’ అనే మలయాళ మూవీలో నటిస్తున్నారు సిద్ధార్థ్. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించిన సిద్ధూకి మలయాళంలో ఇది మొదటి సినిమా. అందుకని చిత్రదర్శకుడు రితీష్ అంబాతి సిద్ధూ పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారట. కానీ, సిద్ధూ సొంత గొంతు వినిపించడానికి రెడీ అయి, మలయాళం నేర్చుకున్నారు. రితీష్ అంబాతి దర్శకత్వంలో దిలీప్, సిద్ధార్థ్, నమిత, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘సినిమాలో సిద్ధార్థ్ పోర్షన్ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. బాగా నటించారాయన. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు రితీష్. -
ఎన్టీఆర్ ఆ ఇద్దరి పేర్లు ఎప్పుడు చెప్తాడో..!
జై లవ కుశ సినిమాతో మరోసారి ఘన విజయాన్ని అందుకున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్, అభిమానులకు ఇచ్చిన ఒక మాటను మాత్రం మరిచిపోయాడు. జై లవ కుశ రిలీజ్‌కు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఓ మాట ఇచ్చాడు. తాను జై లవ కుశ సినిమా అంగీకరించడానికి ఇద్దరు వ్యక్తులు కారణం అని, వారి పేర్లు సినిమా ఘనవిజయం సాధించిన తరువాత తెలియజేస్తానన్నాడు. జై లవ కుశ సూపర్ హిట్ అని కన్ఫమ్ అయిపోయింది. దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ఈవెన్ కూడా సాధించింది. మరి ఇంతవరకు ఎన్టీఆర్ ఆ ఇద్దరు ఎవరన్న విషయం మాత్రం బయట పెట్టలేదు. అభిమానులు ఆ ఇద్దరు ఎవరై ఉంటారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జై లవ కుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయగా రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర కెరీర్లోనే బిగెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన జై లవ కుశ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
ఆ తర్వాతే డ్రామా ఎపిసోడ్ యాడ్ చేశాం!
‘‘ఎన్టీఆర్‌లాంటి గొప్ప నటుడు దొరికాడు కాబట్టి ‘జైలవకుశ’ వంటి బిగ్ స్పాన్ మూవీ చేయడానికి స్కోప్ దొరికింది. లేకపోతే ఆరు నెలల్లో ఇలాంటి సినిమాను కంప్లీట్ చేయడం చాలా కష్టం’’ అని బాబీ (కె.యస్. రవీంద్ర) అన్నారు. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వం లో కల్యాణ్‌రామ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘జైలవకుశ’కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు బాబీ. మరిన్ని విశేషాలను పంచుకున్నారు. ‘జైలవకుశ’ 30 నిమిషాల కథ ఎప్పట్నుంచో నా దగ్గర ఉంది. కథ చెప్పేటప్పుడు ఎన్టీఆర్‌గారి ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంప్రెస్ అయ్యారనుకున్నా. అది నిజమైంది. వారం రోజుల తర్వాత ఆయన్నుంచి పిలుపొచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఎగై్జట్ అయ్యాను. క్లైమాక్స్ గురించి నేను, తారక్ (ఎన్టీఆర్), కల్యాణ్‌రామ్‌గారు చాలా డిస్కస్ చేసుకున్నాం. అనుకున్నట్లుగానే క్లైమాక్స్ తీశాం. జై క్యారెక్టర్ చనిపోకపోయి ఉన్నట్లయితే ఇది సాధారణ సినిమా అయ్యుండేది. క్లైమాక్స్ విషయంలో ఎన్టీఆర్‌కి ఎలాంటి అపనమ్మకం లేదు. ఆయన అనుకున్నట్లుగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కీలకమైన ముగ్గురు అన్నదమ్ముల మధ్య వచ్చే నాటకం సీన్ కథ చెప్పినప్పుడు అనుకోలేదు. అయితే కథను డిస్కస్ చేసే టైమ్‌లో ఓసారి ఎన్టీఆర్‌గారిని కలిశాను. అదే టైమ్‌లో కల్యాణ్‌రామ్, హరిగారు కూడా అక్కడే ఉన్నారు. నాటకాల కారణంగా విడిపోయిన అన్నదమ్ములు తిరిగి నాటకాలతోనే కలిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. అప్పుడే ఆ డ్రామా ఎపిసోడ్ యాడ్ చేశాం. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ లీనమై నటించడం వల్ల స్క్రిప్ట్ దశలో ఉన్న కష్టం మేకింగ్ సమయంలో కనిపించలేదు. ముందుగా జై పాత్రకే గుర్తింపు వస్తుందనుకున్నప్పటికీ, లవ, కుశ పాత్రలకు కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. సినిమా రిలీజైన రోజు నేను ఎన్టీఆర్గారింట్లో రాజమౌళిగారిని కలిశాను. ఆయన దాదాపు అరగంటసేపు ఈ సినిమా గురించే మాట్లాడారు. చైల్డ్ ఎపిసోడ్ బాగుందన్నారు. ఆయన మెచ్చుకోవడం చాలా ఆనందం కలిగించింది. నెక్ట్స్ మూవీ గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. రెండు నెలలు గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నాను. -
ఎన్టీఆర్ స్టామినా: రెండు రోజుల్లో 60 కోట్లు
జై లవ కుశ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా చాటాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటం, అందులో ఒకటి నెగెటివ్ రోల్ కూడా కావటంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమాతో తొలిరోజే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్ సీస్ తో కలుపుకొని తొలిరోజే 49 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రెండు రోజు కూడా అదే జోరు చూపించిన జై లవ కుశ చిత్రం రెండు రోజుల్లో 60 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. అంతేకాదు తొలి రెండు రోజుల్లోనే ఓవర్ సీస్ లో మిలియన్ మార్క్ ను కూడా అందుకొని ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. లాంగ్ వీకెండ్ కలిసి రావటంతో తొలి వారాంతానికి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతోంది జై లవ కుశ. #MillionDollarJaiLavaKusa .. #JaiLavaKusa has already crossed the 60Cr Gross mark (worldwide) by the end of second day 👍🏻💪🏻🤘🏻 pic.twitter.com/RJtDtTkSf7 — Mahesh S Koneru (@smkoneru) September 23, 2017 -
ఓవర్ సీస్ లో 'జై లవ కుశ' హవా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా విడుదలైన తాజా చిత్రం జై లవ కుశ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో అదే స్థాయిలో భారీ వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా జై లవ కుశ రికార్డ్ సృష్టించింది. బుధవారం సాయంత్రమే మొదలైన ప్రీమియర్ షోస్ కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. దీంతో ప్రీమియర్ షోస్ తోనే 5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ జై లవ కుశ వసూళ్లను సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రీమియర్ షోస్ తో 5,89,390 డాలర్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా గురువారం 1,44,894 డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా 7,34,284 డాలర్ల కలెక్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ఇంకా వీకెండ్ కి శుక్ర, శని, ఆది వారాలు మిగిలి ఉండటంతో తొలి వారాంతానికే సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. Telugu film #JaiLavaKusa is racing towards $ 1 million in USA... Wed $ 589,390, Thu $ 144,894. Total: $ 734,284 [₹ 4.76 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 22 September 2017 -
జై లవ కుశ.. ఆడియో వేడుక లేదట..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై లవ కుశ. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్లు సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ను సెప్టెంబర్ 3న ఘనంగా నిర్వహించాలని భావించిన చిత్రయూనిట్ ఇప్పుడు ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోగణేష్ నవరాత్రుల సందడి నెలకొని ఉండటంతో ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలతో పాటు గణేష్ నిమజ్జనం కూడా ఉండటంతో ఆడియోను డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే అభిమానుల కోసం సెప్టెంబర్ 10న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించనున్నారు. అదే రోజు జై లవ కుశ టైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. #JaiLavaKusa Audio will be out into the market on September 3rd. We hope you'll love this peppy and energetic album from @ThisIsDSP (1/3) — NTR Arts (@NTRArtsOfficial) 30 August 2017 A grand audio launch was planned.Due to heavy rains & ganesh nimajjanam,we are avoiding audio event in the interest of public safety (2/3) — NTR Arts (@NTRArtsOfficial) 30 August 2017 A grand public event for fans will be held on September 10th in Hyderabad, where #JaiLavaKusaTrailer will be released (3/3) — NTR Arts (@NTRArtsOfficial) 30 August 2017 -
ఎన్టీఆర్ తరువాత బన్నీతో..!
పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దర్శకుడు బాబీ తొలి సినిమాతోనే కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటంతో బాబీ స్టార్ డైరెక్టర్ అవుతాడని భావించారు. అయితే పవన్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్థార్ గబ్బర్ సింగ్ కు డిజాస్టర్ టాక్ రావటంతో సీన్ రివర్స్ అయ్యింది. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎన్టీఆర్ హీరోగా సినిమా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు బాబీ. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమా తెరకెక్కిస్తున్న ఈ యువ దర్శకుడు, మరో స్టార్ హీరోను లైన్ లో పెట్టాడన్న ప్రచారం జరుగుతోంది. జై లవ కుశ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు బాబీ. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ.. జై లవ కుశ రిజల్ట్ చూసిన తరువాత బాబీ సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
జై లవ కుశ ఆడియో రిలీజ్ డేట్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన తొలి టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు అభిమానులు ఆడియో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను ఆగస్టు 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పూణెలోని ఓ భారీ భవంతిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. గతంలో బాలీవుడ్ మూవీ రామ్ లీలాను షూట్ చేసిన భవంతిలో విలన్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు లోనే షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఈ నెలాఖరున మరో టీజర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పూర్తి స్థాయి నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రలో నటిస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తూ ఇటీవల విడుదలైన జై టీజర్ ఆకట్టుకుంది. అభినవ రావణుడిగా ఎన్టీఆర్ లుక్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్. ముఖ్యంగా నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్‌కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ బద్ధలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ అంచనాలను మరింత పెంచుతూ మరో టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే జై పాత్రతో వావ్ అనిపించిన జూనియర్ ఈ సారి లవ క్యారెక్టర్ ను పరిచయం చేయబోతున్నాడు. జై రావణుడైతే. లవ క్యారెక్టర్ రాముడిలా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. తొలి టీజర్ ను మించే స్థాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో సెకండ్ టీజర్ ను రెడీ చేస్తున్నారు. ఈ నెలాఖరున లవ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. -
ఎన్టీఆర్ ట్రిపుల్ ధమాకా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ లోగా టీజర్ రఫ్ కట్ ఆన్లైన్లో లీక్ అవ్వటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే ఆ మూడు పాత్రలకు సంబంధించిన మూడు వేరు వేరు టీజర్లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా జూలై 6 సాయంత్ర 5 గంటల 22 నిమిషాలకు జై పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. మిగతా రెండు టీజర్లను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Jai. Lava. Kusha. 3 Unique Characters that deserve their own unique teasers. You saw Jai. Now get ready for #JaiTeaser on July 6th at 5:22pm pic.twitter.com/MBLg1FL1oi — NTR Arts (@NTRArtsOfficial) 1 July 2017