
బుడ్డోడి సినిమాకు భారీ టైటిల్..?
జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై
జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్టీఆర్ సరసన ముగ్గురు అందాల భామలు నటిస్తున్న ఈ సినిమాకు ఓ భారీ టైటిల్ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. నట విశ్వరూప అనే టైటిల్ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.
ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు లీకుల గొడవ ఎక్కువవుతోంది. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించడానికి ముందే సినిమాకు సంబందించిన విశేషాలు బయటికి వచ్చేస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని యూనిట్ సభ్యులు కావాలనే లీకులందిస్తుండగా, మరికొన్ని అభిమానుల అత్యుత్సాహం కారణంగా ప్రచారంలోకి వస్తున్నాయి. అదే బాటలో ఎన్టీఆర్ కొత్త సినిమాకు 'నట విశ్వరూప' అనే టైటిల్ నిర్ణయించారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ టైటిల్పై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.