
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు మేకర్స్. జనవరి 13న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ విదేశాలకు బయలుదేరాడు. ఈ విషయాన్ని చిరు తన ట్విటర్‌లో పంచుకున్నారు. మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' ఫ్యామిలీతో అటు విహార యాత్ర. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర' అంటూ పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులతో పాటు హీరోయిన్ శృతిహాసన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఫ్యామిలీ తో అటు విహార యాత్ర
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022
హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4