Chiranjeevi And Bobby Mega 154 Movie Shooting Started - Sakshi
Sakshi News home page

Mega 154: మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

Published Sat, Nov 6 2021 1:38 PM | Last Updated on Sat, Nov 6 2021 4:51 PM

Chiranjeevi And Bobby Mega 154 Movie Shooting Started - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్‌ కె ఎస్‌ రవీంద్ర అలియాస్‌ బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగాస్టర్‌ చిరంజీవికి 154వ చిత్రమిది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు సినీ ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి 154వ చిత్రం షూరు అయిన విషయాన్ని తెలియజేస్తూబాబీ.. చిరు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

ఇందులో చిరంజీవి మాస్‌ లుక్‌లో స్టైలీష్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. . మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్‌ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement