మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ అందరిని ఆకర్షించింది. అయితే ఈ టైటిల్ వెనుక పెద్ద చరిత్రే ఉందట. ఈ కథకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో తాజాగా దర్శకుడు బాబీ వివరించారు.
'వెంకీ మామ' షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో ఉన్నప్పుడు.. చిరంజీవి గారి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం’ అని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment