మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మాస్ మహారాజా ప్రత్యేక పాత్రలో నటించారు. మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. వాల్తేరు వీరయ్య విజయంతో నాకు మాటలు రావడం లేదన్నారు.
ఈ సినిమా కోసం వారు పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని మెగాస్టార్ అన్నారు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా కోసం పనిచేసిన కార్మికుల కోసం ప్రత్యేక వీడియోను ఆయన విడుదల చేశారు. విజయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ సినీ కార్మికుల కష్టం మనకు తెలియాలన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ..'వాల్తేరు వీరయ్య విజయంతో నా మాటలు కొరవడ్డాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.ప్రేక్షకుల ఉత్సాహమే మనకు ఇంధనం. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లాలి. నేను ఈ సినిమా కోసం కష్టపడలేదు. నా బాధ్యతగా అనుకుని పనిచేశా. కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిందరిదీ. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది. మన మీదతో జాలితో కాదు... సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి.' అంటూ ఎమోషనలయ్యారు మెగాస్టార్
Comments
Please login to add a commentAdd a comment