Mega star
-
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' మూవీ HD స్టిల్స్ (ఫోటోలు)
-
జూబ్లీహిల్స్‌లో ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, మెగాస్టార్ సందడి (ఫొటోలు)
-
సంక్రాంతికి విశ్వంభర
హీరో చిరంజీవి సంక్రాంతి కానుకగా అభిమానులకు ఖుషీ కబురు చెప్పారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేసి, టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అంతేకాదు.. ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రమిది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ‘‘ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. చిరంజీవిగారి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: కార్తీక్ శబరీష్, లైన్‌ప్రోడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి. -
మరో మాస్ కాంబినేషన్
-
వాల్తేరు వీరయ్య...ఇప్పుడు DJ వీరయ్య
-
ప్రేక్షకులు, ఫ్యాన్స్ సంతోషం కోసం గొడ్డులా కష్టపడతాను: చిరంజీవి
‘‘ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మంచి సినిమాలు, మంచి పాత్రలు చేయాలని మనం ఎలా ఆకలిగా ఉంటామో వంద, రెండొందలు చిత్రాలు చేసినా అదే ఆకలితో, కమిట్మెంట్తో ఉండాలి. అప్పుడే మన వృత్తికి న్యాయం చేయగలం. అది లేకపోతే సినిమాల నుంచి రిటైర్ అయిపోవాలి. ఆ కమిట్మెంట్కు నేను కట్టుబడి ఉంటాను.. ఆచరిస్తాను. ప్రేక్షకులు, ఫ్యాన్స్ సంతోషం కోసం గొడ్డులా కష్టపడతాను’’ అని హీరో చిరంజీవి అన్నారు. బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. హీరో రవితేజ కీలక పాత్ర పోషించారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 13న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో చిరంజీవి మాట్లాడుతూ–‘‘బాబీ కథ చెప్పినప్పుడు బాగుందనిపించింది. నిర్మాతలతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్నాను. నా హార్డ్‌కోర్ ఫ్యాన్ బాబీ ఈ మూవీలో నన్ను అద్భుతంగా చూపించాడు. ఎలాంటి సన్నివేశాలైనా డూప్స్‌తో చేయించడం నాకు ఇష్టం ఉండదు.. నేను చేస్తేనే సంతృప్తిగా ఉంటుంది. వేరే హీరోలు ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ, నాకు తెలిసింది ఇదే.. ఇలాగే చేస్తాను’’ అన్నారు. ‘‘అన్నయ్యకి(చిరంజీవి) నేను పెద్ద అభిమానిని. పైగా బాబీ అంటే నమ్మకం. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు రవితేజ. ‘‘2002లో గీతాఆర్ట్స్ ఆఫీసులో రక్తదానం చేసేందుకు వచ్చిన 50 మంది చిరంజీవిగారి అభిమానుల్లో నేనూ ఒక్కణ్ణి. ఆయనతో సినిమా చేయాలనే నా కల ‘వాల్తేరు వీరయ్య’తో తీరింది. సంక్రాతి బరిలో మా అన్నయ్యను దించాలని 94 రోజులు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేశాం’’ అన్నారు బాబీ. ‘‘సంక్రాంతి అనే పెద్ద పండగకి ఇలాంటి అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చిన బాబీగారికి థ్యాంక్స్’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఈ కథ విన్నప్పుడు ఆహా.. మళ్లీ మెగా హిట్ తప్పదు అనిపించింది’’ అన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. ‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల నిర్మాతలు ఒక్కరే. రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజవుతున్నాయి. వాటిని ఎలా రిలీజ్ చేసుకోవాలనేది వాళ్ల ఇష్టం. అందులో నటుడిగా నా ప్రమేయం ఉండదు. రెండు సినిమాలు వారికి రెండు కళ్లు.. వాటిలో ఏ ఒక్క కన్నుని పొడుచుకోవాలనుకోరు కదా?’’ అన్నారు చిరంజీవి. -
Mega 154: మాస్ లుక్‌లో మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగాస్టర్ చిరంజీవికి 154వ చిత్రమిది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు సినీ ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం షూరు అయిన విషయాన్ని తెలియజేస్తూబాబీ.. చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్‌లో స్టైలీష్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. . మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The day I'm waiting for quite a long time has arrived!! 🤗 Working with my all time favorite HERO Megastar @KChiruTweets garu for #MEGA154 ❤️ Presenting the 'Mass Moola Virat' in an avatar we love to see him the most 😎 Annayya Arachakam Arambham 🤩@MythriOfficial pic.twitter.com/olYEMnglJg — Bobby (@dirbobby) November 6, 2021 -
అందుకే ఆయనను ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అనేవాళ్లు
మమ్ముట్టి.. ఇండియన్ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా సౌత్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాలీవుడ్ మెగాస్టార్‌గా వెలుగొందుతున్న ఆయన.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలైన ముహమ్మద్ కుట్టీ పనపరంబిల్ ఇస్మాయిల్ నటనా పరంపర.. ఇవాళ అభిమానులతో ఆప్యాయంగా ‘మమ్ముక్క’ అని పిలిపించుకునేంత స్థాయికి ఎదిగింది. నేడు(సెప్టెంబర్ 7) ‘మమ్ముట్టి’పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం. Happy Birthday Mammootty: మిడిల్ క్లాస్ ముస్లిం కుటుంబంలో పుట్టిన మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. ఎర్నాకులం లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించాడు. ఆపై రెండేళ్లపాటు మంజేరీలో లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేశాడు. అనుభవంగళ్ పాలిచకల్(1971)లో గుంపులో గోవిందుడిగా కనిపించాడు పనపరంబిల్ ఇస్మాయిల్. ఆపై నటనపై ఆసక్తితో సినిమా, నాటకాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించాడు. 1979లో దేవలోకం సినిమాతో లీడ్ రోల్ పోషించాడు. కానీ, ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది. విక్కనుండు స్వప్నంగల్(1980) ద్వారా సాజిన్ పేరుతో మాలీవుడ్ ప్రేక్షకులను తొలిసారి పలకరించాడు. అదే ఏడాది వచ్చిన ‘మేళా’ ఆయనకి హీరోగా తొలి గుర్తింపు ఇచ్చింది. అందుకే ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అనేవారు ఎనభై దశకం మొదట్లో సాజిన్ పేరుతోనే కొన్నాళ్లపాటు నటనా ప్రస్థానం నడిచింది. ‘అహింసా’ సినిమాకు గాను కేరళ స్టేట్ తొలి అవార్డు(సపోర్టింగ్ రోల్) అందుకున్నాడు. ఓవైపు మాస్ క్యారెక్టర్లతో పాటు మరోవైపు ఎక్కువగా భర్త-తండ్రి పాత్రలతో అలరించాడాయన అందుకే ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అంటూ ప్రాసను వాడేవాళ్లు ఆయన మీద. అలాంటి టైంలో ‘న్యూఢిల్లీ’, ‘తనియావర్తనం’ ఆయనలోని సీరియస్ నటనా కోణాల్ని ఆవిష్కరించాయి. ఆపై చాలాకాలం వరుసగా అలాంటి సినిమాలే ఆయనకు దక్కాయి. 1984-93, 1994-2000, 2000-2010.. ఈ మధ్యకాలాల్లో మాస్-క్లాస్-ప్రయోగాత్మక కథలతో.. అప్ అండ్ డౌన్స్‌తో, మధ్య మధ్యలో భారీ బ్లాక్బస్టర్లతో మమ్మూటీ సినీ ప్రయాణం కొనసాగింది. ఎక్కువగా ఊరమాస్ క్యారెక్టర్లతో అలరించడం వల్లే మెగాస్టార్‌గా ముద్రపడిపోయాడు ఆయన. క్రిటికల్ నటుడు మమ్మూటీ మలయాళం పరిశ్రమకు మాస్ ఇంట్రోలు-యాక్షన్ అందించే మెగాస్టార్ కావొచ్చేమో.. కానీ, సౌత్‌కు మాత్రం ఆయనొక టిపికల్ నటుడు. సంగం, ఉత్తరం, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కథోడు కథోరం, పొంథన్ మడ, కౌరవర్, ప్రణామం, అయ్యర్ ది గ్రేట్, ముద్ర, ది కింగ్.. ఇలా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పాత సినిమాల సంగతి సరేసరి. పెరంబూ, ఉండా లాంటి కొన్ని రీసెంట్ చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని అన్ని భాషలకు చూపెట్టాయి. ఇక జబ్బర్ పటేల్ డైరెక్షన్లో వచ్చిన బాబా సాహెబ్ అంబేద్కర్కుగానూ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. ‘సామ్రాజ్యం’ లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆరు భాషల్లో.. 70 ఏళ్ల మమ్మూటీ ఇప్పటిదాకా 400పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఒక మెయిన్ లీడ్ హీరో మిగతా భాషల్లోనూ నటించడం అప్పటికే నడుస్తోంది. అలా మమ్మూటీ కూడా ఆరు భాషల్లో నటించారు. మాలీవుడ్‌తో పాటు మౌనం సమ్మదం(తమిళం)..దళపతి లాంటి సినిమాలు, స్వాతి కిరణం, త్రియాత్రి(హిందీ), షికారి(కన్నడ), డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(ఇంగ్లీష్) నటించారు. అంతేకాదు ఐదు సినిమాలకుగానూ మూడు నేషనల్ అవార్డులు అందుకున్న అరుదైన రికార్డు మమ్ముక్క సొంతం. ఒరు వడక్కన్(1989) వీరగాథకు ఫస్ట్ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. అలాగే ఏడు స్టేట్ అవార్డులు దక్కాయి కూడా. తెలుగులో స్వాతి కిరణం, సూర్య పుత్రులు(1996), రైల్వే కూలీ(రిలీజ్‌కు నోచుకోలేదు).. ఆపై రెండు దశాబ్దాల తర్వాత వైఎస్సార్ బయోపిక్‘యాత్ర’లో నటించి.. మెప్పించాడు మమ్మూట్టీ. 4 ఇయర్స్.. 120 ఫిల్మ్స్ జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలైన మమ్మూటీ.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా-విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌తో ఆపై లీడ్ రోల్స్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఒకానొక టైంలో ఆయన ఎంత బిజీ అయ్యారంటే.. 1983 నుంచి 1986 మధ్య నాలుగేళ్ల కాలంలో ఏడాదికి 30కి పైగా సినిమాల చొప్పున ఏకంగా 120 సినిమాల్లో నటించారాయన. అంతేకాదు మలయాళంలో 15సార్లు డ్యుయెల్రోల్స్ వేసిన ఘనత కూడా ఆయన ఖాతాలో ఉంది. నిర్మాతగా కూడా.. నటుడే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. మెగాబైట్స్, ప్లే హౌజ్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్, టెక్నోటెయిన్మెంట్ పేరుతో డిసస్టట్రిబ్యూషన్ కంపెనీ నడిపించారు కూడా. ఆయనలో రాతగాడు కూడా ఉన్నాడు. కాల్చప్పుడు పేరుతో ఓ పేపర్లో తన అనుభవాలను పంచుకోవడంతో పాటు సందర్భానికి తగ్గటుగా సోషల్ మీడియాలో వేదాంత ధోరణిలో కొటేషన్లు కూడా రాస్తుంటాడు. ఆయనలో మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అందుకే కేరళ వాలీబాల్ లీగ్‌కు అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడు. -
ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ: జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మెగాస్టార్‌గా..
Mammootty Completes 50 Years In Cinema: మమ్మూట్టీ.. ఇండియన్ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా సౌత్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాలీవుడ్ మెగాస్టార్‌గా వెలుగొందుతున్న ఆయన.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలైన ముహమ్మద్ కుట్టీ పనపరంబిల్ ఇస్మాయిల్ నటనా పరంపర.. ఇవాళ అభిమానులతో ఆప్యాయంగా ‘మమ్ముక్క’ అని పిలిపించుకునేంత స్థాయికి ఎదిగింది. సాక్షి, వెబ్‌డెస్క్: మిడిల్ క్లాస్ ముస్లిం కుటుంబంలో పుట్టిన మమ్మూట్టీ.. ఎర్నాకులం లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించాడు. ఆపై రెండేళ్లపాటు మంజేరీలో లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేశాడు. అనుభవంగళ్ పాలిచకల్(1971)లో గుంపులో గోవిందుడిగా కనిపించాడు పనపరంబిల్ ఇస్మాయిల్. ఆపై నటనపై ఆసక్తితో సినిమా, నాటకాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించాడు. 1979లో దేవలోకం సినిమాతో లీడ్ రోల్ పోషించాడు. కానీ, ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది. విక్కనుండు స్వప్నంగల్(1980) ద్వారా సాజిన్ పేరుతో మాలీవుడ్ ప్రేక్షకులను తొలిసారి పలకరించాడు. అదే ఏడాది వచ్చిన ‘మేళా’ ఆయనకి హీరోగా తొలి గుర్తింపు ఇచ్చింది. ఆల్ జానర్ల ఆర్టిస్ట్ ఎనభై దశకం మొదట్లో సాజిన్ పేరుతోనే కొన్నాళ్లపాటు నటనా ప్రస్థానం నడిచింది. ‘అహింసా’ సినిమాకు గాను కేరళ స్టేట్ తొలి అవార్డు(సపోర్టింగ్ రోల్) అందుకున్నాడు. ఓవైపు మాస్ క్యారెక్టర్లతో పాటు మరోవైపు ఎక్కువగా భర్త-తండ్రి పాత్రలతో అలరించాడాయన అందుకే ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అంటూ ప్రాసను వాడేవాళ్లు ఆయన మీద. అలాంటి టైంలో ‘న్యూఢిల్లీ’, ‘తనియావర్తనం’ ఆయనలోని సీరియస్ నటనా కోణాల్ని ఆవిష్కరించాయి. ఆపై చాలాకాలం వరుసగా అలాంటి సినిమాలే ఆయనకు దక్కాయి. 1984-93, 1994-2000, 2000-2010.. ఈ మధ్యకాలాల్లో మాస్-క్లాస్-ప్రయోగాత్మక కథలతో.. అప్ అండ్ డౌన్స్‌తో, మధ్య మధ్యలో భారీ బ్లాక్బస్టర్లతో మమ్మూటీ సినీ ప్రయాణం కొనసాగింది. ఎక్కువగా ఊరమాస్ క్యారెక్టర్లతో అలరించడం వల్లే మెగాస్టార్‌గా ముద్రపడిపోయాడు ఆయన. క్రిటికల్ నటుడు మమ్మూటీ మలయాళం పరిశ్రమకు మాస్ ఇంట్రోలు-యాక్షన్ అందించే మెగాస్టార్ కావొచ్చేమో.. కానీ, సౌత్‌కు మాత్రం ఆయనొక టిపికల్ నటుడు. సంగం, ఉత్తరం, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కథోడు కథోరం, పొంథన్ మడ, కౌరవర్, ప్రణామం, అయ్యర్ ది గ్రేట్, ముద్ర, ది కింగ్.. ఇలా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పాత సినిమాల సంగతి సరేసరి. పెరంబూ, ఉండా లాంటి కొన్ని రీసెంట్ చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని అన్ని భాషలకు చూపెట్టాయి. ఇక జబ్బర్ పటేల్ డైరెక్షన్లో వచ్చిన బాబా సాహెబ్ అంబేద్కర్కుగానూ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. ‘సామ్రాజ్యం’ లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆరు భాషల్లో.. 69 ఏళ్ల మమ్మూటీ ఇప్పటిదాకా 400పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఒక మెయిన్ లీడ్ హీరో మిగతా భాషల్లోనూ నటించడం అప్పటికే నడుస్తోంది. అలా మమ్మూటీ కూడా ఆరు భాషల్లో నటించారు. మాలీవుడ్‌తో పాటు మౌనం సమ్మదం(తమిళం)..దళపతి లాంటి సినిమాలు, స్వాతి కిరణం, త్రియాత్రి(హిందీ), షికారి(కన్నడ), డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(ఇంగ్లీష్) నటించారు. అంతేకాదు ఐదు సినిమాలకుగానూ మూడు నేషనల్ అవార్డులు అందుకున్న అరుదైన రికార్డు మమ్ముక్క సొంతం. ఒరు వడక్కన్(1989) వీరగాథకు ఫస్ట్ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. అలాగే ఏడు స్టేట్ అవార్డులు దక్కాయి కూడా. తెలుగులో స్వాతి కిరణం, సూర్య పుత్రులు(1996), రైల్వే కూలీ(రిలీజ్‌కు నోచుకోలేదు).. ఆపై రెండు దశాబ్దాల తర్వాత వైఎస్సార్ బయోపిక్‘యాత్ర’లో నటించి.. మెప్పించాడు మమ్మూట్టీ. 4 ఇయర్స్.. 120 ఫిల్మ్స్ జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలైన మమ్మూటీ.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా-విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌తో ఆపై లీడ్ రోల్స్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఒకానొక టైంలో ఆయన ఎంత బిజీ అయ్యారంటే.. 1983 నుంచి 1986 మధ్య నాలుగేళ్ల కాలంలో ఏడాదికి 30కి పైగా సినిమాల చొప్పున ఏకంగా 120 సినిమాల్లో నటించారాయన. అంతేకాదు మలయాళంలో 15సార్లు డ్యుయెల్రోల్స్ వేసిన ఘనత కూడా ఆయన ఖాతాలో ఉంది. నిర్మాతగా కూడా.. నటుడే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. మెగాబైట్స్, ప్లే హౌజ్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్, టెక్నోటెయిన్మెంట్ పేరుతో డిసస్టట్రిబ్యూషన్ కంపెనీ నడిపించారు కూడా. ఆయనలో రాతగాడు కూడా ఉన్నాడు. కాల్చప్పుడు పేరుతో ఓ పేపర్లో తన అనుభవాలను పంచుకోవడంతో పాటు సందర్భానికి తగ్గటుగా సోషల్ మీడియాలో వేదాంత ధోరణిలో కొటేషన్లు కూడా రాస్తుంటాడు. ఆయనలో మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అందుకే కేరళ వాలీబాల్ లీగ్‌కు అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడు. ఫ్రెండ్లీ స్టార్ సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోల మధ్య పోటీతత్వం.. అలాగే వాళ్ల అభిమానుల మధ్య వైరం కనిపిస్తుంటుంది. కానీ, మెగాస్టార్‌గా పేరున్న మమ్మూటీ.. మాలీవుడ్‌లో సీనియర్-జూనియర్లతోనూ స్నేహం కొనసాగిస్తుంటాడు. మధ్య మధ్యలో వాళ్ల సినిమాల్లో, మాలీవుడ్ చేపట్టే ఛారిటీ కార్యక్రమాల్లోనూ సహ నటులతో మెరుస్తుంటాడు. 2005-10 మధ్య మమ్మూట్టీ-మోహన్‌లాల్-దిలీప్.. ఈ త్రయం 97 శాతం మాలీవుడ్ ఫిల్మ్ రెవెన్యూను రాబట్టగా.. అందులో మేజర్ షేర్ మమ్మూట్టీదే కావడం విశేషం. ఇక మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కొనసాగించే స్నేహం చాలామంది హీరోలకు ఒక మంచి పాఠం కూడా. Today, my brother completes 50 glorious years in the film industry. I feel so proud to have shared the screen with him in 55 memorable films and looking forward to many more. Congratulations Ichakka! @mammukka pic.twitter.com/UevUpSkSGH — Mohanlal (@Mohanlal) August 6, 2021 -
అల్లు అర్జున్ 'మెగాస్టార్' అయిపోతారా?
దక్షిణాది వారికి సినిమా పిచ్చి కన్నా హీరోల మీద భక్తే ఎక్కువగా ఉంటుంది. మెగా స్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, యంగ్ టైగర్.. ఇలా రకరకాల పేర్లతో తమ అభిమాన హీరోలను ఆరాధిస్తారు. కానీ ఒకరి ట్యాగ్ మరొకరికి వాడితే మాత్రం అస్సలు సహించరు సరికదా సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతారు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరిగింది. (చదవండి: ఫైనల్ విన్నాక ఫైనలైజ్!) తెలుగు ఓటీటీ 'ఆహా'లో సామ్ జామ్ ప్రోగ్రామ్ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి సామ్‌తో కలిసి సందడి చేయగా తాజాగా అల్లు అర్జున్ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన ఆహా పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 21న వీక్షించవచ్చని తెలిపింది. అయితే ప్రోమోలో అల్లు అర్జున్‌కు ముందు "మెగాస్టార్" అని రాసుకొచ్చారు. ఇది చూసి చిర్రెత్తిపోయిన చిరు ఫ్యాన్స్ 'ఆహా'పై తీవ్రంగా మండిపడుతున్నారు. మా చిరంజీవి బిరుదును అందుకునే అర్హత ఏ హీరోకు లేదని ఫైర్ అవుతున్నారు. అయినా స్టైలిష్ స్టార్ అన్న ట్యాగ్ ఉండగా అల్లు అర్జున్ను మెగాస్టార్ అని పిలవడమేంటని నిందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకైక మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని తేల్చి చెప్తున్నారు. ఎంత సొంత ఓటీటీ అయితే మాత్రం బన్నీకి మెగాస్టార్ అన్న ట్యాగ్ ఇచ్చేస్తారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వెంటనే ఆహా మెగాస్టార్ ట్యాగ్‌ను తీసి, స్టైలిష్ స్టార్ అన్న ట్యాగ్ యాడ్ చేసి తన తప్పు సరిదిద్దుకుంది. అయితే అంతకు ముందు ఎపిసోడ్లో చిరంజీవి పాల్గొన్నందున మెగాస్టార్ అనే ట్యాగ్‌ను తీసేయడం టెక్నికల్ టీమ్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది. అంతే తప్ప కావాలని మరీ ఇంత పెద్ద తప్పు చేసుండకపోవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ) -
Chiranjeevi Unseen Photos: చిరంజీవి అరుదైన ఫోటోలు
-
మెగా ఇంటర్వ్యు
-
చిరు ఫ్యామిలీలోనూ సెగలు రేపుతున్న ఖైదీ
-
వివాదంలో విశాఖ ఫిల్మ్‌క్లబ్ వ్యవహారం
-
ఘనంగా చిరు పుట్టిన రోజు వేడుకలు
పాత శ్రీకాకుళం: మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకలు స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్ష కార్యదర్శులు తైక్వోండో శ్రీను, జీవీ నరిసింహం కేకు కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం బెహర మనోవికాస కేంద్రంలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలు థియేటర్ల మేనేజర్లు వరప్రసాద్, బోసుబాబు, చినరాజు తదితరులు పాల్గొన్నారు. -
రామ్ చరణ్ మోసం చేశాడు
ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా. చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా మీద ఆసక్తి పెంచేలా రోజుకో అప్ డేట్‌తో ఊరిస్తున్నాడు నిర్మాత, మెగా తనయుడు రామ్ చరణ్. అంతేకాదు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా చిరు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామంటూ ప్రకటించాడు చరణ్. అయితే అన్నయ్య ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన యూనిట్, చిరంజీవిని మాత్రం షాడో షాట్స్‌తో చూపించాడు. ఎక్కడ చిరు ముఖాన్ని స్పష్టంగా చూపించకుండా కేవలం స్టైల్స్‌తో అలరించే ప్రయత్నం చేశాడు. టీజర్ చూడటానికి సూపర్‌గా అనిపిస్తున్నా, చిరు కనపడకపోవటం మాత్రం అభిమానులకు నిరాశకలిగిస్తోంది. టీజర్ తో పాటు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లలో కూడా చిరు ముఖం కనిపించకుండానే డిజైన్ చేశారు. -
రామ్ చరణ్ మోసం చేశాడు
-
మెగాస్టార్‌కే హ్యాండ్ ఇచ్చిందట..?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం. మెగా వారసులైతే ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీ అంటూ పోటిపడుతున్నారు. అలాంటి సినిమాకు హీరోయిన్ మాత్రం దొరకటం లేదు. చిరంజీవి ఇమేజ్‌తో పాటు ఏజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాలో నటించడానికి నయనతారను ఎంపిక చేశారు. దాదాపుగా నయన్ కన్ఫామ్ అన్న టాక్ వినిపించింది. కానీ చివరి నిమిషంలో నయనతారను కాదని ఆ ప్లేస్‌లో అనుష్కను తీసుకున్నారు. త్వరలోనే అనుష్క హీరోయిన్గా చిరు 150 సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ భామ కూడా మెగాస్టార్‌కు హ్యాండ్ ఇచ్చిందట. ప్రస్తుతం బాహుబలి 2, సింగం 3, భాగమతి సినిమాల్లో నటిస్తున్న స్వీటి, ఇంత టైట్ షెడ్యూల్లో చిరు సినిమాకు డేట్స్ ఎడ్జస్ట్ చేయలేనని చెబుతోందట. మరో వారంలో సెట్స్ మీదకు వెళుతుందనుకున్న మెగాస్టార్ మూవీ ఇప్పుడు మరోసారి హీరోయిన్ వేటకు రెడీ అవుతోంది. మరి మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలో నటించే ఛాన్స్ ఏ భామకు వస్తుందో చూడాలి. -
'కంచె'లో వరుణ్ నటనకు గర్వంగా ఫీలవుతున్నా: చిరు
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్రట్ క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా తెలుగు సినిమా స్ధాయిని మరో మెట్టు పైకి చేర్చిందంటున్నారు విశ్లేకులు. కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించిన కంచె సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కంచె సినిమా స్పెషల్ షో చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ' ఈ సినిమా చూశాక యూనిట్ సభ్యులను అభినందించకుండా ఉండలేకపోయా. కంచె సినిమాను ప్రయోగాత్మక చిత్రం అనేకంటే, విజయవంతమైన ప్రయోగం అంటే సరిగ్గా సరిపోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ప్రేమకథతో పాటు అంతర్జాతీయ స్ధాయి యుద్ధ సన్నివేశాలను ఒకే సినిమాలో చూపించటంలో క్రిష్ మంచి విజయం సాధించాడు. ఓ తండ్రిగా వరుణ్ నటన చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా. సాయిమాధవ్ డైలాగ్స్ సినిమా స్ధాయిని మరింతగా పెంచాయి. చిన్న చిన్న పదాలతో బరువైన భావాలను పలికించారు. ముఖ్యంగా కుల వ్యవస్థ మీద రాసిన డైలాగ్ ఆలోచింప చేసేదిగా ఉంది. ఇంతటి భారీ చిత్రాన్ని ఇంత తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా' అంటూ యూనిట్ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. -
చిరు 150వ సినిమా ఖరారు
-
మెగా ఈవెంట్!
-
గ్రాండ్‌గా చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్
-
చిరంజీవ
-
’చిరు’బర్త్‌డే స్పెషల్ ఇంటర్వ్యూ
-
'పవన్ డైరెక్షన్లో మెగా బాహుబలి'
హైదరాబాద్: మోగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి 150వ సినిమాని ఏ ఇతర దర్శకులు అయినా బాహుబలిని మించి తీయలేరని మెగా అభిమానులందరం అనుకుంటున్నామని అన్నారు. కేవలం చిరు దర్శకత్వం వహిస్తేనే తన150వ సినిమా ఉన్నత శిఖరాలను చేరుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒక వేళ చిరంజీవి కాకపోతే ఆ సినిమాకి దర్శకత్వం పవన్ చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తే బాహుబలిని మించుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ దర్వకత్వంలో మెగా స్టార్ చిత్రం వస్తే అంతకు మించిన పెద్ద సినిమా ఉంటుందా..అని నేను నిజాయితిగా మెగా అభిమానులను అడుగుతున్నాను అంటూ ట్విట్ చేశారు. రాంచరణ్ నిర్మాతగా, పవన్ దర్శకత్వంలో మెగాస్టార్ నటనతో మెగాబాహుబలి తెరకెక్కించవచ్చని అన్నారు. Ram Charan producing,Pawan kalyan directing nd Mega star acting wil make 150 into MegaBahuBali nd I think Mega family owes this to Mega fans — Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2015 Only thing whch can create high of 150th is if Mega star directs himself..any other director will make us fans feel its lesser than Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2015 If not Megastar Pawan Kalyan shud direct..Pawan Kalyan directing Mega star's 150th will make it bigger than 2 Bahubalis — Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2015 -
'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. '
హైదరాబాద్: మెగా వీరాభిమానులందరం బాహుబలి సినిమాను మించి చిరంజీవి 150వ చిత్రం ఉండాలని కోరుకుంటున్నామని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. బాహుబలిని మించి చిరు 150వ సినిమా లేకపోతే.. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన దానికంటే మరింత పెద్ద తప్పు అవుతుందని వర్మ ట్విట్ చేశారు. రాజమౌళి తప్ప మరే ఇతర దర్శకులు చిరు 150వ సినిమాకి న్యాయం చేయలేరని భావిస్తున్నట్టు తెలిపారు. రాజమౌళి, ప్రభాస్‌ల కాంబినేషన్ ఆకాశమంత ఎత్తుకు వెళితే..మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళిల కాంబినేషన్ అంతరిక్షాన్ని అందుకుంటుందని అన్నారు. I truly think except for Rajmouli nobody can do justice to Mega stars 150th film..with any other director it will be ULTRA MEGA THANDA — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 If Rajmouli Prabhas can go sky high Mega star Rajmouli can go space high ..Any other director will pull 150 down to earth — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 As the biggest fan of Mega Star me nd millions of his other fans want to see his 150th film bigger than the biggest which is Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 If Mega star does not pitch his 150th film bigger than Bahubali it will be a bigger mistake than starting Praja Rajyam party — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 -
'బాహుబలిని చిరు అధిగమిస్తేనే'
హైదరాబాద్: బాహుబలి చిత్రం రికార్డును చిరంజీవి 150 వ చిత్రం అధిగమిస్తేనే ఏడేళ్ల మెగా అభిమానుల నిరీక్షణకు ఫలితం ఉంటుందని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150 వ చిత్రం బాహుబలి చిత్రాన్ని అధిగమించాలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిరంజీవి నటించే తదుపరి చిత్రాన్ని నిర్మాతలు బాహుబలికన్నా భారీగా నిర్మించలేకపోతే.. మెగా అభిమానులు నిరాశకు లోనవుతారన్నారు. మెగా స్టార్ నటించబోయే 150వ చిత్రం ఇండస్ట్రీలో రెండో బిగ్గెస్ట్ చిత్రంగా కాకుండా బాహుబలిని కూడా అధిగమించాలన్నారు. The seven year anxious nd hungry wait of all fans of Mega can be only satisfied if the 150th is bigger than the biggest which is Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2015 Mega star's 150th cannot be the 2nd biggest also ...it has to be bigger than the biggest of biggest which is Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2015 Mega star's 150 th has to be biggest ever nd makers shud not make mistake of making it lesser than Bahubali or it can b Mega disappointment — Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2015 -
చిరు కోరికను.. 'చిరు' నెరవేర్చాడు!!
-
చిరు చిందేస్తే...
-
తెరకెక్కబోతున్న చిరు 150వ చిత్రం..?