మెగాస్టార్కే హ్యాండ్ ఇచ్చిందట..? | mega star chiranjeevi 150th movie details | Sakshi
Sakshi News home page

మెగాస్టార్కే హ్యాండ్ ఇచ్చిందట..?

Published Tue, May 31 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

మెగాస్టార్కే హ్యాండ్ ఇచ్చిందట..?

మెగాస్టార్కే హ్యాండ్ ఇచ్చిందట..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం. మెగా వారసులైతే ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీ అంటూ పోటిపడుతున్నారు. అలాంటి సినిమాకు హీరోయిన్ మాత్రం దొరకటం లేదు. చిరంజీవి ఇమేజ్తో పాటు ఏజ్ను కూడా దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు చిత్రయూనిట్.

ముందుగా ఈ సినిమాలో నటించడానికి నయనతారను ఎంపిక చేశారు. దాదాపుగా నయన్ కన్ఫామ్ అన్న టాక్ వినిపించింది. కానీ చివరి నిమిషంలో నయనతారను కాదని ఆ ప్లేస్లో అనుష్కను తీసుకున్నారు. త్వరలోనే అనుష్క హీరోయిన్గా చిరు 150 సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ భామ కూడా మెగాస్టార్కు హ్యాండ్ ఇచ్చిందట.

ప్రస్తుతం బాహుబలి 2, సింగం 3, భాగమతి సినిమాల్లో నటిస్తున్న స్వీటి, ఇంత టైట్ షెడ్యూల్లో చిరు సినిమాకు డేట్స్ ఎడ్జస్ట్ చేయలేనని చెబుతోందట. మరో వారంలో సెట్స్ మీదకు వెళుతుందనుకున్న మెగాస్టార్ మూవీ ఇప్పుడు మరోసారి హీరోయిన్ వేటకు రెడీ అవుతోంది. మరి మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలో నటించే ఛాన్స్ ఏ భామకు వస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement