చైనాలో నైరా | Sye Raa Narasimha Reddy Movie In Chaina | Sakshi
Sakshi News home page

చైనాలో నైరా

Published Sun, Mar 24 2019 12:26 AM | Last Updated on Sun, Mar 24 2019 8:20 AM

Sye Raa Narasimha Reddy Movie In Chaina - Sakshi

చిరంజీవి

‘సైరా’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టే సమయం వచ్చేసిందట. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తమన్నా, అనుష్క కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందని, ఏప్రిల్‌ మొదటి వారంతో చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తి అయిపోతుందని తెలిసింది. ఈ చిత్రం చైనాలో చిత్రీకరణ జరగుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదట. చైనాలో ‘నైరా’ అంటూ చిత్ర యూనిట్‌ పేర్కొంది.  ఈ సినిమాను దసరాకు రిలీజ్‌ చేసే ప్లాన్‌లో ఉందని టాక్‌. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: రత్నవేలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement