Nayanthara Shocking Remuneration For Chiranjeevi Godfather Movie - Sakshi
Sakshi News home page

Nayanthara: నయన్‌ రెమ్యునరేషన్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Published Fri, Nov 19 2021 4:55 PM | Last Updated on Fri, Nov 19 2021 5:08 PM

Nayanthara Shcoking Remuneration For Chiranjeevi Godfather Movie - Sakshi

Nayanthara Shcoking Remuneration For Chiranjeevi Godfather Movie: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రస్తుతం టాలీవుడ్‌లో గాడ్‌ ఫాదర్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహ‌న్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన నటించనుంది. ఇటీవలె నయన్‌ బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం నయనతార తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ  క్రేజీ ప్రాజెక్టు కోసం నయన్‌ సుమారు  రూ.4 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందట. పారితోషికం విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నయనతార మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినా నయన్‌కి ఉన్న క్రేజ్‌ను బట్టి ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారు మేకర్స్‌.

ఇక సైరా న‌రసింహారెడ్డి త‌ర్వాత చిరంజీవితో న‌య‌న‌తారకు ఇది రెండో సినిమా. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement