god father
-
చిరంజీవితో ఛాన్స్ వచ్చిందని మాకు హ్యాండిచ్చాడు: డైరెక్టర్
కోలీవుడ్ టాప్‌స్టార్ ప్రశాంత్ చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం అందగన్. తాజాగా తమిళ్లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ హిట్ సినిమా అంధాధున్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసింది. ఇందులో నటి సిమ్రాన్, ప్రియా ఆనంద్, కార్తీక్, యోగిబాబు, సముద్రఖని, ఊర్వశీ,కేఎస్.రవికుమార్, వనితా విజయ్‌కుమార్ నటించారు.ఈ చిత్రాన్ని స్టార్ మూవీస్ పతాకంపై శాంతి త్యాగరాజన్ నిర్మించగా, త్యాగరాజన్ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ చిత్ర థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని చైన్నెలో మేకర్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు త్యాగరాజన్ మాట్లాడుతూ అందగన్ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ధన్యవాదాలన్నారు. పాజిటివ్ రివ్యూలే చిత్ర విజయానికి కారణం అన్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ కథానాయకుడు అయినా , అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. ఈ చిత్రానికి ముందుగా మోహన్‌రాజాను దర్శకుడిగా ఎంపిక చేశామని, మూడు నెలలు చర్చలు జరిగిన తరువాత ఆయన తెలుగులో చిరంజీవితో చిత్రం చేసే అవకాశం రావడంతో వెళ్లిపోయారన్నారు. దీంతో తానే దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోలేరని, దీంతో ఆ విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని ఆయన అన్నారు. మోహన్‌రాజా-చిరంజీవి కాంబినేషన్లో గాడ్‌ఫాదర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై హీరో ప్రశాంత్ పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. అందుకు బదులిచ్చిన త్యాగరాజన్ అందగన్ చిత్రం మంచి హిట్ అయ్యిందని, ఇక సినిమా విషయాలను పక్కన పెట్టి ప్రశాంత్ పెళ్లి పైనే పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు, త్వరలోనే మంచి అమ్మయితో ప్రశాంత్ పెళ్లి ఉంటుందని చెప్పారు. కాగా నటుడు ప్రశాంత్ మాట్లాడుతూ అందగన్ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడు త్యాగరాజన్, నటీనటులని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు కమ్ బ్యాక్ అనీ, ఇకపై చాలా చిత్రాలు చేస్తానని ఆయన అన్నారు. తొలి ముద్దు, జోడి, జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. -
Year End 2022: మాస్ స్టెప్పులతో ఊపేసిన స్టార్స్
సినిమా సక్సెస్‌లో పాటలు కీలక పాత్రలు పోషిస్తాయి. కంటెంట్ మాత్రమే కాదు పాటలతో, స్టెప్పులతోనూ విజయం సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అందుకే దర్శక-నిర్మాతలు స్క్రిప్ట్‌పైనే కాకుండా పాటలు, డాన్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకున్ని మరింత అలరించేందుకు డైరెక్టర్లు స్పెషల్ సాంగ్స్, హీరోహీరోయిన్లతో మాస్ స్టెప్పులు వేయించి ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు థియేటర్లో పెద్దగా రాణించకపోయిన సాంగ్స్ రికార్టు సృష్టించాయి. అలాగే కంటెంట్‌తో పాటు పాటల, డాన్స్ పరంగా కూడా మరిన్ని చిత్రాలు సోషల్ మీడియాను ఊపేశాయి. అలా గతేడాది పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు కంటెంట్‌తోనే కాదు పాటలు కూడా ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సాంగ్స్‌తో పాటు సిగ్నేచర్ స్టెప్పులు ఆడియాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది వచ్చిన పలు సినిమా పాటలే కాదు, సిగ్నేచర్ స్టెప్స్‌కి కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. మరి అవేంటో ఇక్కడ ఓ లుక్కెయండి! ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్న చిత్రంగా విడుదలై హ్యూజ్ హిట్ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా ఇందులో టైటిల్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డీజే టిల్లు అంటూ థియేటర్లో, యూట్యూబ్‌లో రిసౌండ్ చేసింది ఈ పాట. పాటే కాదు ఇందులో సిగ్నేచర్ స్టెప్‌కు కూడా ప్రతి ఆడియన్స్ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ స్టెప్‌ను అనుసరిస్తూ కాలు కదిపిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ‘మ.. మ.. మహేశా’ అంటూ మాస్ రికార్డు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ‘మ.. మ.. మహేశా’, ‘ఎవ్రీ పెన్ని’ సాంగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి ఈ రెండు పాటలు. మ.. మ.. మహేశా అంటూ మహేశ్, కీర్తిలు వేసిన మాస్ స్టెప్‌కు థియేటర్లో ఈళలు మోగాయి. ఎవ్రీ పెన్ని అంటూ మహేశ్ వేసిన క్లాస్ డాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘ది వారియర్’ బుల్లెట్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి చిత్రం ది వారియర్. ఈ ఏడాది జూలై 14న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ ఇందులోని బుల్లెట్, విజిల్ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్‌కు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ‘కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. వ్యూస్ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట మొత్తంగా 100 మిలియన్ పైనే వ్యూస్ రాబట్టింది. అంతేకాదా బుల్లెట్ బండి సిగ్నేచర్ స్టెప్ కూడా బాగా పాపులర్ అయ్యింది. రారా.. రక్కమ్మా (విక్రాంత్ రోణ) రారా.. రక్కమ్మా పాటల చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఏ ఈవెంట్స్, ఫంక్షన్స్‌కు వెళ్లిన ఈ పాట మోగాల్సిందే. కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి కాలు కదిపిన ఈ పాట విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిగ్నేచర్ స్టేప్‌ను అనుసరించిన ప్రేక్షకులకు లేరనడంలో సందేహం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్లు వరకు ఈ స్టెప్‌కు వీణ వాయిస్తు నడుం ఊపారు. యూట్యూబ్‌లో సైతం ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. బీస్ట్ అరబిక్ కతు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఈ మూవీ నుంచి వచ్చిన అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ రాబట్టిన రెండో పాటగా అరబిక్ కుతు నిలిచింది. ఇక పాట సిగ్నేచర్ స్టేప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో అరబిక్ కుతుకు కాలు కదిపారు. ఇప్పటికీ ఈ స్టెప్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో వందల సంఖ్యలో రీల్స్ దర్శనిమిస్తున్నాయి. తార్ మార్ టక్కర్ మార్(గాడ్ ఫాదర్) మెగాస్టార్ చిరంజీవి, సత్యాదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించని చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో కీ రోల్ పోషించారు. ఇక చిరు-సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరు, సల్మాన్ తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టైలిష్‌గా వేసిన ఈ స్టెప్ థియేటర్లో ఈలలు వేయించింది. రారా.. రెడ్డి (మాచర్ల నియోజకవర్గం) అలాగే మాచర్ల నియోజకవర్గంలో నితిన్, అంజలి కలిసి వేసిన రారా రెడ్డి పాటలకు మంచి హిట్ అందుకుంది. ఇందులోని అంజలి, నితిన్ వేసిన మాస్ స్టెప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోని భళా భళా బంజారా, కమల్ హాసన్ విక్రమ్ మూవీలోని మత్తు మత్తుగా పాటలకు బాగా ఆకట్టుకున్నాయి. వీటితో ఇంకేన్నో పాటలు సిగ్నేచర్ స్టెప్‌తో రికార్డులు క్రియేట్ చేసి ఉర్రుతలూగించాయి. -
అలాంటి కథలు చిరంజీవికి సెట్ కావు.. కానీ: పరుచూరి గోపాలకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. తాజాగా చిరంజీవి సినిమా గాడ్‌ఫాదర్‌పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ చెప్పారు. సినిమాలో ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే ఇంకాస్త బాగుండేదని ఆయన అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'తెలుగులోనే ఈ సినిమా బాగుందని చెబుతా. పేరుకు మలయాళ రీమేక్ చిత్రమైనా తెలుగు రాజకీయాన్ని ఈ చిత్రంలో పరిచయం చేశారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నేను చెబుతున్నా. ఈ సినిమాలో కథ చాలా స్లో పేస్‌లో వెళ్లింది. మెగాస్టార్‌కు స్లో కథనం అనేది సరిపోదు. ఇంకా మార్పులు చేయాల్సింది. స్లో పేస్‌తో పాటు చిరు బాడీ లాంగ్వేజ్‌కు తగిన క్యారెక్టర్ కాదు. కానీ ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. చిరంజీవి డ్యాన్స్, పాట లేని సినిమా కాస్త ఇబ్బంది అనిపించింది. షఫీ పాత్రలో సునీల్ ఉండి ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదేమో అనిపించింది.' అని అన్నారు. సల్మాన్ పాత్రపై ఆయన ఏమన్నారంటే.. పరుచూరి మాట్లాడూతూ.. 'ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ ఒకరకంగా ప్లస్. మరో రకంగా మైనస్. ఎందుకంటే మెగాస్టార్ నడుస్తుంటే సల్మాన్ ఫైట్ చేయడం ఫ్యాన్స్‌కు బాధ కలిగించింది. ఆచార్య మాదిరిగా చరణ్ లేదా పవన్ కల్యాణ్‌ను తీసుకుంటే మరోలా ఉండేదేమో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మరిన్ని డైలాగ్స్ ఉంటే బాగుండేది. 'రాజకీయానికి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' డైలాగ్ లాగా ఇంకా ఉండి ఉంటే ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చి ఉండేది.' అని అన్నారు. -
ఓటీటీకి వచ్చేసిన గాడ్ ఫాదర్, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్ దర్శక-నిర్మాతలు నవంబర్ 19న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీని ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది నెట్‌ఫ్లిక్స్. శుక్రవారం అర్థరాత్రి నుంచి గాడ్ ఫాదర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా, ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చదవండి: బేబీ బంప్ ఫొటోలు షేర్ షాకిచ్చిన హీరోయిన్, ఫొటోలు వైరల్ -
ఈ వారంలో థియేటర్లు, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే
సినీ ప్రేక్షకులకు ఈ వారం మరింత వినోదం అందనుంది. మిమ్మల్ని అలరించేందుకు ప్రతి వారంలాగే కొత్త కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీలో అగ్రహీరోల చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీకి రానున్న చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. భయపెట్టేందుకు సిద్ధమైన 'మసూద'..!: సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. మాస్ కథతో వస్తున్న‘గాలోడు’ సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఉత్కంఠభరిత కథతో..: ఎన్.రావన్‌రెడ్డి, శ్రీనిఖిత, అలంకృత షా, రవీంద్ర బొమ్మకంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. ఈ చిత్రానికి ఫణి కల్యాణ్ సంగీతమందిస్తున్నారు. రెడ్డి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ దబ్బుగొట్టు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ప్రేమ కథ: శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. హిందీలో దృశ్యం-2..: అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈనెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రాజ్‌తరుణ్ 'పెళ్లి సందడి': రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్‌సిరీస్ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ నవంబర్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీకి కార్తి థ్రిల్లర్ మూవీ: కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈనెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు /వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ ది వండర్ (హాలీవుడ్) నవంబరు 16 1899 (హాలీవుడ్) నవంబరు 17 రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) నవంబరు 17 ఇలైట్ (హాలీవుడ్) నవంబరు 18 స్లంబర్‌ల్యాండ్( హాలీవుడ్) నవంబరు 18 అమెజాన్ ప్రైమ్ వీడియో హాస్టల్‌డేజ్ సీజన్-3 (వెబ్‌సిరీస్-హిందీ) నవంబరు 16 ది సెక్స్‌లైవ్స్ ఆఫ్ కాలేజ్‌గర్ల్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 18 డిస్నీ+హాట్‌స్టార్ ఇరవతం (తమిళ్/తెలుగు) నవంబరు 17 సీతారామం (తమిళ్) నవంబరు 18 సోనీ లివ్ అనల్ మీలే పని తులి (తమిళ్) నవంబరు 18 వండర్ ఉమెన్ (తెలుగు) నవంబరు 18 -
‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు గాడ్ ఫాదర్ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ మూవీని అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందట. అంతేకాదు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. -
సల్మాన్ ఖాన్‌కు భద్రత మరింత పెంపు.. ఆ బెదిరింపులే కారణం..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తాజాగా ఆయనకు వై+ కేటగిరీలో ముంబై పోలీసులు భద్రత కల్పించారు. గతంలో సల్మాన్ ఖాన్‌కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను మరింత పటిష్ఠం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: జెనీలియా మూవీపై దర్శకుడు సంచలన ఆరోపణలు.. !) సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే ఈ గ్యాంగ్‌స్టర్ ప్రకటించాడు. గతంలో సల్మాన్ హత్యకు కుట్ర పన్నారని వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. లేఖను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సల్మాన్ ఇంటి వద్ద అదనపు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. -
గాడ్‌ఫాదర్ హిట్.. కానీ ఆ చిత్రం కంటే వెనుకంజలో ఉందా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్‌ఫాదర్' థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్‌కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌పై విడుదలైంది. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజైన గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడినట్లే కనిపించింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్‌తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది. (చదవండి: గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే) కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మెగాస్టార్ నటించిన గాడ్‌ఫాదర్ మూవీ అన్ని భాషల్లో చూసినా రూ.100 కోట్లు మాత్రమే దాటింది. అంటే లూసిఫర్‌తో పోలిస్తే కలెక్షన్ల పరంగా వెనుకంజలో ఉంది. గాడ్‌ఫాదర్ రిలీజైనప్పటి నుంచి మోహన్ లాల్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. దానికి కారణం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మెగాస్టార్ లూసిఫర్‌లో కొన్ని సీన్లు సరిచేస్తూ గాడ్ ఫాదర్ తీశామని మాట్లాడారు. అన్నట్లు గానే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం లూసిఫర్‌ను దాటలేకపోయింది. ఈ సినిమాలో సత్యదేవ్, స్టార్ హీరోయిన్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
‘జ్యోతిలక్ష్మి’ టైంలో పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్ తనదైన నటన స్కిల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన సత్యదేవ్ ఇటీవల గాడ్‌ఫాదర్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన జయదేవ్ పాత్రకి మంచి స్పందన వచ్చింది. గాడ్‌ఫాదర్ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన రీసెంట్గా ఓ యూట్యూబ్చానల్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు! ఇదిలా ఉంటే సత్యదేవ్ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని మరి ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో ఆయన జాబ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటించాడు. ఇక సాఫ్ట్వేర్ జాబ్‌ను పూర్తిగా వదిలేసి సినిమాల వైపే మొగ్గు చూపాడు. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించాడు. ‘అందరు నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చానంటున్నారు. అది నిజం కాదు. సినిమాల్లోకి రావడం కోసమే నేను ఉద్యోగం చేశాను. ఎందుకంటే అవకాశాలు వచ్చి నిలదొక్కునేంత వరకు డబ్బులు కావాలి కదా. డబ్బు కోసమే నేను జాబ్ చేశా. బ్లఫ్ మాస్టర్ సినిమా వరకూ జాబ్ చేస్తూనే షూటింగ్లో పాల్గోన్నాను’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం అనంతరం ‘షూటింగ్ కోసం నైట్ షిఫ్ట్‌లు చేశాను. ఉదయం షూటింగ్, నైట్ ఉద్యోగం చేస్తూ వచ్చాను. జ్యోతిలక్ష్మి సినిమాకి గ్యాప్ లేకుండా 39 రోజులు పని చేశాను. ఈ మూవీ చేసేటప్పుడు నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆఫీసులో తెలియదు. జాబ్ చేస్తున్నాననే విషయం డైరెక్టర్ పూరీ గారికి తెలియదు. జాబ్ టెన్షన్ షూటింగ్లో, సినిమా టెన్షన్ ఆఫీసుల కనిపించకుండ మేనేజ్ చేశా. ‘ఘాజీ’, ‘మనవూరి రామాయణం’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలు అలాగే పూర్తి చేశాను’ అని చెప్పాడు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో చేయాలనేది తన కల అని, ఆయనతో కలిసి నటించాలనే తన డ్రీమ్‌ను చాలా ఏళ్లుగా భద్రపరుచుకుంటూ వచ్చానన్నాడు సత్యదేవ్. -
చాలా పెద్ద రెమ్యునరేషన్ నాది కాదని వదిలేశాను : చిరంజీవి
‘‘ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. బలమైన కథనం ఉంటే పాటలు, ఫైట్లు లేకపోయినా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మార్పుకి తగ్గట్టుగానే ‘గాడ్ ఫాదర్’ సినిమా తీశాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తుండటం మంచి సంకేతంగా భావిస్తున్నాను. ఈ సినిమా హిట్ మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయాలనే ఉత్సాహాన్ని ఇచ్చింది’’ అని హీరో చిరంజీవి అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఇన్నేళ్ల మీ కెరీర్లో ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్స్‌ని చూశారు. ‘గాడ్ ఫాదర్’ విజయం ఎంత ప్రత్యేకమైనది? నా కెరీర్లో హిట్స్, ఫ్లాప్స్ చూశాను. హిట్‌కి పొంగిపోయి, ఫ్లాప్‌కి కుంగిపోయే దశను నేను ఎప్పుడో దాటేశాను. సినిమా అనేది సమిష్టి కృషి.. అందుకే ఒక విజయం నాది అనుకోను. నా గత చిత్రం (‘ఆచార్య’) ప్రేక్షకులను నిరాశ పరిచింది.. అయితే ఆ మూవీకి నేను చేయాల్సిన ధర్మం చేశాను.. దాన్ని చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తాన్ని (పారితోషికం) నాది కాదని వదిలేశాను.. అలాగే రామ్‌చరణ్ కూడా ఇచ్చేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లని కాపాడుతుందనే సంతృప్తి దక్కింది. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ హిట్ కూడా నాది అనుకోను.. యూనిట్ అందరిదీ. ► మలయాళ హిట్ మూవీ ‘లసిఫర్’కి రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చేయాలనే ఆలోచన ఎవరిది? ‘లూసిఫర్’లో చిన్న చిన్నమార్పులు చేస్తే ఈ కథ నాకు కరెక్ట్‌గా సెట్ అవుతుందని రామ్‌చరణ్‌కి దర్శకుడు సుకుమార్ చెప్పాడు. చరణ్ నాతో ఆ మాట అనగానే ఆ సినిమా రెండోసారి చూశాను. సుకుమార్ ఐడియా ఇచ్చాడు కానీ తర్వాత అందుబాటులో లేడు (నవ్వుతూ). ఆ తర్వాత ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపాం. మోహన్‌రాజా పేరును చరణ్ చెప్పగానే నమ్మకం కలిగింది. రచయిత సత్యానంద్‌తో కలిసి టీమ్ అంతా చక్కని మార్పులు చేసి, ‘గాడ్ ఫాదర్’ని అద్భుతంగా మలిచారు. ఈ సినిమా చూసి నాగార్జున, వెంకటేష్, కొందరు దర్శకులు, మిత్రులు అభినందనలు తెలిపారు. ► ‘గాడ్ ఫాదర్’లో పాటలు, డ్యాన్స్‌లు లేవు.. మీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. పాటలు, డ్యాన్స్‌లు లేవని ఎక్కడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసినప్పుడు పాటలు లేవనే ఫీలింగ్ కలగకుండా నేపథ్య సంగీతంతో తమన్ ప్రాణం పోశాడు. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ సూచించింది కూడా తమనే. ► ఈ మూవీలో సత్యదేవ్, పూరి జగన్నాథ్, సర్వదమన్ బెనర్జీ పాత్రలు మీ ఎంపికేనా? ఇందులో సీఎం పాత్రకి సర్వదమన్ బెనర్జీ అయితే బావుంటుందనుకున్నాం. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆయన మా కోరిక మేరకు నటించారు.. ఆ పాత్రకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నాకు, పూరి జగన్నాథ్‌కి మధ్య కాంబినేషన్ సీన్ ముందు అనుకోలేదు.. అయితే తను కావాలని అడగడంతో జైల్లో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్ పెట్టాం. సత్యదేవ్ కూడా అందరూ వావ్ అనేలా తన పాత్ర చేశాడు. నయనతార చాలా అద్భుతంగా చేసింది. సల్మాన్ ఖాన్ ఆలోచన మోహన్ రాజాదే. అయితే సల్మాన్‌తో రామ్ చరణ్ మాట్లాడటంతో నాపై ప్రేమతో ఒప్పుకున్నారు. ► ఓ వైపు సినిమాలు, మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు. ఇన్ని బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు? ప్రేక్షకులు, ఇండస్ట్రీ నన్నెంతగానో ఆదరించింది. వారు ఇచ్చిన ప్రేమ, అభిమానంతోనే ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటాను. ఆ కృతజ్ఞతని మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో తీర్చుకోవాలని ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ► ఎందరో సీనియర్ దర్శకులతో పని చేశారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్‌తో పని చేయడం ఎలా ఉంది? గతంలో కంటే ఇప్పుడు సమాచారం అన్నది అపరిమితంగా దొరుకుతోంది. యువ దర్శకులు కొత్త విషయాలని చాలా చక్కగా నేర్చుకుంటున్నారు.. దాన్ని చూపించడానికి వారికి పుష్కలమైన అవకాశాలున్నాయి. నా ఇమేజ్, వారు కొత్తగా చూపించే విధానం బాగుంటుందని నమ్ముతాను.. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను. ► ‘సైరా’ మీ కలల ప్రాజెక్ట్ అన్నారు.. అలాంటి పాత్రలు ఇంకా ఏవైనా చేయాలని ఉందా? అలా ఏమీ లేదు. ‘సైరా’ సంతృప్తినిచ్చింది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌లో చేస్తున్న సినిమాలో నా నుండి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ అంశాలు ఉంటాయి. అలాగే ‘బోళా శంకర్’లోనూ మంచి వినోదం ఉంటుంది. మీరు, పవన్ కల్యాణ్ కలసి నటించే అవకాశం ఉందా? తమ్ముడితో సినిమా చేయాలనే ఉత్సాహం నాకు, అన్నయ్యతో చేయాలని తనకీ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా నిర్మించే ట్రెండ్ ఇప్పుడు తెలుగులో ఉంది. మంచి కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. ► సల్మాన్ మీ చిత్రంలో స్పెషల్ రోల్ చేశారు. వేరే భాషల్లో మీరు స్పెషల్ రోల్ చేస్తారా? కథ, పాత్ర నచ్చితే తప్పకుండా చేస్తాను. అందరూ చేయాలని కోరుకుంటాను. భాష, ప్రాంతీయ బేధాలు లేకుండా ఇండియన్ సినిమా అనే పేరు రావాలనేది నా కోరిక. ‘బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్’ త్రాలతో సౌత్, నార్త్ అనే హద్దులు చెరిగిపోయాయని భావిస్తాను.. ఇది మంచి పరిణామం. ► కొందరు దర్శకులు సెట్స్‌లో డైలాగులు రాస్తున్నారని ఆ మధ్య అన్నారు? తప్పనిసరి పరిస్థితుల్లో సెట్స్‌లో డైలాగ్‌లు మార్చడంలో తప్పు లేదు. కానీ, ప్రీ ప్రొడక్షన్‌కి ఎక్కువ టైమ్ తీసుకుని, బౌండెడ్ స్క్రిప్్టతో సెట్స్‌కి వెళితే సమయం, డబ్బు వృథా కావు. ఆ ఆలోచనతో ఆ మాట అంటే, కొందరు వేరేలా ఆపాదించుకున్నారు. ‘గాడ్ ఫాదర్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని మోహన్ రాజా అద్భుతంగా చేశారు. దానివల్ల సెట్స్‌లో ఆలస్యం కాకుండా టైమ్, డబ్బు కలిసొస్తాయి. ► చాలా సందర్భాల్లో మీరే ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తారు.. ఎందుకిలా? నిజాలు నిలకడగా తేలుతాయనే మాటని నమ్ముతాను. ఇది నమ్మాను కాబట్టే.. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్లీ వారి తప్పుని తెలుసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా దగ్గరకి తీసుకుంటాను. నాకు తెలిసిన ఫిలాసఫీ ఇది. ఇక్కడ ఉన్నన్ని రోజులు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పెంచుకున్నామన్నది ముఖ్యం కాదు.. ఎంతమంది మనసులకు దగ్గరయ్యానన్నదే నాకు ముఖ్యం. ‘ప్రజారాజ్యం’ పార్టీ ఉండి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలో ఏదో ఒకదానికే పరిమితం అయ్యేవాణ్ణి. ఒక నటుడిగా రెండు రాష్ట్రాల ప్రజలు నన్ను బాగా ఆదరిస్తున్నారు.. అందుకు సంతోషంగా ఉంది. -
సినిమాలతో సంబంధం లేకుండా మనమంతా కలుసుకోవాలి
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు గురువారం ఆయనను నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో తేనీటి విందులో పాల్గొన్న చిరంజీవి తన చిత్రాలను గురించి సవివరంగా ముచ్చటించారు. 'ఆచార్య' మూవీ తదనానంతర పరిణామాలను మనసు విప్పి చెప్పారు. అలానే 'గాడ్ ఫాదర్' సక్సెస్ తర్వాత తనను కలిసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్న వారిని కలుసుకోవడం తన కర్తవ్యంగా భావించానని అన్నారు. 'ఆచార్య' పరాజయానికి తాను కృంగిపోలేదని, ఇప్పుడు 'గాడ్ ఫాదర్' విజయానికి పొంగి పోవడం లేదని, అలాంటి స్థితప్రజ్ఞతను సాధించానని చెప్పారు. 'లూసిఫర్'ను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్‌లో బలంగా కలిగించాడని, అతనికి దర్శకత్వం వహించే తీరిక లేకపోవడంతో వేరెవరితో అయినా ఆ ప్రాజెక్ట్ ను ప్రారంభించమని సలహా ఇచ్చాడని అన్నారు. ఒకానొక సమయంలో ఆ చిత్రం రీమేక్ ఆలోచన విరమించుకున్నానని, అయితే రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మోహన రాజా ను ఎంపిక చేయడంతో మళ్లీ పట్టాలు ఎక్కిందని, అతని బృందం 'లూసిఫర్' మూవీని తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిందని, అది వర్కౌట్ అయ్యిందని చిరంజీవి అన్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు రచయితలూ తన కోసం వైవిధ్యమైన కథలు చేస్తారనే నమ్మకం కలిగిందని, కరోనా సమయంలో ప్రేక్షకులలో వచ్చిన మార్పు కారణంగానే తానూ 'లూసిఫర్' లాంటి విభిన్న చిత్రాన్ని ధైర్యంతో చేశానని చిరంజీవి చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శకుడు బాబీ 'వాల్తేరు వీరయ్య', మెహర్ రమేశ్ 'భోళా శంకర్' చిత్రాల విశేషాలనూ చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో తనకున్న చిరకాల అనుబంధాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. హెల్త్ కార్డుల పంపిణీ సమయంలో అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉందని అన్నారు. 'గాడ్ ఫాదర్' లాంటి విజయవంతమైన చిత్రాలు మరిన్ని చేయాలని, ఆ రకంగా తామంతా మళ్ళీ మళ్ళీ కలిసే ఆస్కారం ఏర్పడుతుందని టి.ఎఫ్.జె.ఎ. అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీ నారాయణ, వై. జె. రాంబాబు తెలిపారు. అయితే... సినిమాలతో సంబంధం లేకుండానే తనను కలుసుకోవాలని తాను కోరుకుంటానని, ఇలాంటి ఆత్మీయ కలయికతో తనకు గూస్ బంబ్స్ వస్తాయని చిరంజీవి బదులిచ్చారు. చదవండి: గాడ్ ఫాదర్ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ నన్ను ఎద్దేవా చేసేవారిని ప్రేమతో దగ్గరకు తీసుకుంటా -
బన్నీ ఫోన్ చేసి నాతో 21 నిమిషాలు మాట్లాడారు..
-
గాడ్ ఫాదర్ సినిమా చూసి అల్లు అర్జున్ ఏమన్నాడంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్‌ఫాదర్ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం ప్రధాన బలంగా మారింది. ఊహించినదానికంటే ఎక్కువే కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు సైతం సంతోషంగా ఉన్నారు. తాజాగా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా సినిమా సక్సెస్‌ను మీడియాతో పంచుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాకు మొదట రామ్‌చరణ్ ఫోన్ చేశాడు. అంతేకాక ఉదయం ఆరు గంటలకే నా దగ్గరకు వచ్చి అరగంటసేపు మాట్లాడారు. ఇది చాలు నాకనిపించింది. అల్లు అర్జున్ నాతో 21 నిమిషాలు మాట్లాడారు. పిచ్చెక్కించేశారు, సినిమా లడ్డూలా ఉందన్నారు. సాయిధరమ్ తేజ్ అయితే ఏకంగా ఆఫీస్‌కే వచ్చేసి అభినందించారు' అని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా. చదవండి: గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి..: నటి -
గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! 'చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా'నని గరికపాటి చిరును బెదిరించడం సరి కాదంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తాజాగా ఈ వివాదంపై చిరంజీవి స్పందించాడు. గరికపాటి పెద్దాయన అని, ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది. గాడ్ ఫాదర్ సక్సెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. మొన్న వచ్చిన ఆచార్య ఫ్లాప్ అయింది. అందుకని నేను బాధతో కుంగిపోలేదు. బయ్యర్లను కాపాడాలని నేను, రామ్‌చరణ్ మా పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. గాడ్‌ఫాదర్ సినిమా విషయానికి వస్తే.. లూసిఫర్ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సుకుమార్.. చరణ్‌కు చెప్పాడట. ఐడియా ఇచ్చాడు కానీ తర్వాత అందుబాటులో ఉండలేదు. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పాడు. తని వరువన్ను అద్భుతంగా తీసిన ఆయన లూసిఫర్ రీమేక్‌కు న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. నిజానికి రీమేక్ సినిమాలు చేయడం ఒక సవాల్. కానీ ప్రేక్షకుల ఆదరణ వల్ల ఘరానా మొగుడు, ఠాగూర్.. ఇప్పుడు గాడ్ ఫాదర్ గొప్ప విజయాలు అందుకున్నాయి. సల్మాన్ ఖాన్.. గాడ్ ఫాదర్ చేసినట్లే నాకూ వేరే ఇండస్ట్రీ నుంచి పిలుపు వస్తే తప్పకుండా చేస్తాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా 'ఇండియన్ సినిమా' అనే పేరు రావాలని నా కోరిక. ఇకపోతే నేను చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటని అనుకుంటాను. ఇక్కడ తగ్గటం అంటే సంయమనం పాటించడం. నిజం నిలకడగా తెలుస్తుందనే మాటను నమ్మినవాడిని నేను. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్లీ వారి తప్పు తెలుసుకుని నా దగ్గరకు వస్తే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. చదవండి: సినిమా ఛాన్స్ అని నడుము చూపించమన్నాడు: నటి నయన్ సరోగసీపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం -
చిరు, సల్మాన్ల తార్‌మార్.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గాడ్ ఫాదర్'.దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన ‘తార్‌మార్ తక్కర్‌మార్’(Thaar Maar Thakkar Maar) సాంగ్ ప్రేక్షక్షకులను ఉర్రూతలూగించింది. చిరు, సల్మాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సాంగ్ ఫుల్ వీడియో ఇప్పుడు వచ్చేసింది. ఈ మాస్ సాంగ్‌కి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, శ్రేయా ఘోషల్ అద్భుతంగా ఆలపించారు . తమన్ సంగీతం అందించారు. -
ఊహించినదానికంటే ఎక్కువ కలెక్షన్స్: గాడ్ ఫాదర్ నిర్మాత
ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ''గాడ్ ఫాదర్'' విలేఖరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'గాడ్ ఫాదర్‌కు అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాను ఎవరికీ అమ్మలేదు. మేమే సొంతంగా విడుదల చేశాం. కలెక్షన్స్ మేము ఊహించినదాని కంటే అద్భుతంగా వున్నాయి. తెలుగు రాష్ట్రాలలో 60 కోట్ల షేర్ వచ్చింది. మా బ్యానర్‌కు మైల్ స్టోన్ సినిమా. లూసిఫర్‌ను అందరూ చూశారు. ఆ సినిమాను రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో పోన్నియిన్ సెల్వన్ అద్భుతంగా ఆడుతోంది. వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ గాడ్ ఫాదర్ రిలీజ్‌ను ఆపుకున్నాం. అక్టోబర్ 14న గాడ్ ఫాదర్‌ను తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. రామ్ చరణ్ ఆలోచన వల్లే ఈ సినిమా మొదలైయింది. విడుదల తర్వాత ఆయన ఆనందం మాటల్లో చెప్పలేం. చరణ్ తన సొంత సినిమా కంటే ఎక్కువ ఆనందపడ్డారు. గాడ్ ఫాదర్ లాంటి విజయం ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ వుంటుంది. ఎగ్జిబిటర్స్ అందరికి కూడా ఒక పండగలాంటి సినిమా గాడ్ ఫాదర్' అని చెప్పుకొచ్చాడు ఎన్వీ ప్రసాద్. చదవండి: నిన్ను చంపేస్తా.. నటుడి భార్యకు నటి వార్నింగ్ పంజాబీ నటితో సింగర్ డేటింగ్ -
డైరెక్టర్ పూరీకి ఏమైంది? చిరు పిలిచినా ఎందుకు రాలేదు?
ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. వంద కోట్ల క్లబ్‌ని కూడా దాటేసింది. సినిమా విడుదలైన మూడు రోజులకే సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడుకకి సినిమా కోసం పని చేసిన టెక్నిషియన్స్‌తో పాటు నటీనటులందరూ వచ్చారు. కానీ కీలక పాత్ర పోషించిన పూరీ జగన్నాథ్ మాత్రం కనిపించలేదు. దీంతో పూరీకి ఏమైంది? చిరు సినిమా సక్సెస్ మీట్‌కి ఎందుకు రాలేదు? అసలు సక్సెస్ మీట్‌కి చిరంజీవి ఆహ్వానించారా? లేదా? అనేది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించినప్పటికీ.. సక్సెస్ మీట్‌కి పూరీ రాలేనని చెప్పారట. (చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా..?) పూరీ ప్రస్తుతం గోవాలో తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో.. విజయ్ దేవరకొండ ప్లాన్ చేసిన ‘జనగనమణ’ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికిప్పుడు పూరీతో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. హీరోలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. ఇలాంటి సమయంలో బయటకు రావడానికి పూరీ ఇష్టపడడం లేదట. అందుకే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి సక్సెస్ మీట్‌కి ఆహ్వానించినా.. సున్నితంగా తిరస్కరించారట. గాడ్ ఫాదర్లో పూరీ జగన్నాథ్ పోషించిన జర్నలిస్ట్ పాత్ర అదిరిపోయింది. సక్సెస్ మీట్లో కూడా చిరంజీవి పూరీని పొగిడేశాడు. కానీ పూరీ, చిరు ఒకే స్టేజ్ మీద కనిపించి ఉంటే బాగుండేది అంటున్నారు ఆయన అభిమానులు. -
‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గాడ్‌ఫాదర్ చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. గాడ్‌ఫాదర్ చూసి రజనీకాంత్ తన రివ్యూ ఇచ్చారని, ఇది తనకు బెస్ట్ మూమెంట్ అంటూ డైరెక్టర్ మోహన్ రాజా ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఈ మేరకు మోహన్ రాజా ట్వీట్ చేస్తూ.. ‘సూపర్ స్టార్ ‘గాడ్‌ఫాదర్’ సినిమా చూశారు. ఈ మూవీ చాలా చాలా బాగుంది అన్నారు. ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ కోసం చేసిన అనుసరణలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ధన్యవాదాలు తైలవా(రజనీకాంత్) సార్, నా జీవితంలోని అత్యుత్తమ క్షణాలలో ఇది ఒకటి’ అంటూ మురిసిపోయాడు. కాగా డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. Superstar watched #Godfather 😇 Excellent!! very nice!! very interesting!!! are few of the remarks in his detailed appreciation on the adaptions made for the Telugu version. Thank u so much Thalaiva @rajinikanth sir, one of the best moments of life.. means a lotttt 🙏 pic.twitter.com/AFdT7oOoBe — Mohan Raja (@jayam_mohanraja) October 10, 2022 -
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
గాడ్ ఫాదర్ విజయానికి అదే కారణం: నయనతార
దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన చిరంజీవి గాడ్‌ఫాదర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా విజయం పట్ల ప్రధానపాత్రలో నటించిన కోలీవుడ్ భామ నయనతార తాజాగా స్పందించింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేసింది. నయనతార నోట్లో రాస్తూ.. 'గాడ్ ఫాదర్ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపినందుకు సినీ ప్రేమికులు, నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ విజయానికి కారణం అద్భుతమైన చిత్రబృందమే. మెగాస్టార్ చిరంజీవితో మరోసారి స్క్రీన్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆయన గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. నాపై నమ్మకం ఉంచి మరో అవకాశమిచ్చిన దర్శకుడు మోహన్ రాజాకు కృతజ్ఞతలు. సల్మాన్ ఖాన్‌ను ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడతారో ఈ సినిమా ద్వారా తెలిసింది. ఈ చిత్రం భారీ విజయం సాధించినందుకు ఆయనకు ధన్యవాదాలు'. అంటూ రాసుకొచ్చింది. మలయాళంలో మోహన్‌లాల్ చిత్రం లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్. ఈ సినిమాలో సత్యదేవ్, డైరెక్టర్ పూరీ జగన్నాధ్, గంగవ్వ, సునీల్, బ్రహ్మాజీ, కీలక పాత్రల్లో నటించారు. HUMONGOUS BLOCKBUSTER #GodFather pic.twitter.com/FC1eiPBsnT — Nayanthara✨ (@NayantharaU) October 9, 2022 -
గాడ్ ఫాదర్ సినిమా టాక్ పై మెగాస్టార్ ఆసక్తికర కామెంట్స్
-
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్‌గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్‌ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్‌కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
సల్మాన్ ఖాన్ కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన మెగాస్టార్
-
బాలీవుడ్ లో దుమ్ములేపుతున్న గాడ్ ఫాదర్ కలెక్షన్స్
-
రెండు రోజుల్లో గాడ్ ఫాదర్ కలెక్షన్స్ ఎంతంటే..