న్యూఢిల్లీ: మతసంబంధాలను కించపరిచిందంటూ 'గాడ్ ఫాదర్' పేరుతో విక్రయాలు జరుపుతున్న బీరును దేశ రాజధానిలో నిషేధించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ మేరకు పిల్ వేసిన ఓ స్వచ్ఛంద సంస్థ, బీరుకు పెట్టిన పేరులో 'గాడ్' అనే పదం ఉందని, ఇది అన్ని మతాల ప్రజల భావోద్వేగాలను కించపరుస్తోందని పేర్కొంది.
ఈ బీరు తయారీదారులు కావాలనే అన్ని వర్గాల ప్రజల మనోభవాలను దెబ్బతీసేలా ఆ పేరును పెట్టారని స్వచ్ఛంద సంస్థ 'జన్ చేతన మంచ్' అధ్యక్షుడు దేవిందర్ సింగ్ పిటిషన్ లో వివరించారు. ఈ కేసును ఫైల్ చేసిన లాయర్ ఏపీ సింగ్ పదాలు 'గాడ్', 'ఫాదర్'లకు మతాలలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. 'గాడ్ ఫాదర్' పేరును తొలగిస్తూ తయారీ దారు జాతీయ న్యూస్ పేపర్ల ద్వారా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పిటిషన్ లో కోరారు. కాగా, ఈ పిటిషన్ వచ్చేవారం వాదనలు జరగనున్నాయి. 'గాడ్ ఫాదర్' బీరు ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది.
బీరు బాధిస్తోందంటూ పిల్..
Published Sat, Jul 2 2016 12:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM
Advertisement
Advertisement