PIL
-
ఇప్పుడు ఎలాంటి ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరికివేతకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాంటి పోస్టులను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరగా, కౌంటర్ దాఖలు చేస్తే పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వంతోపాటు, అటవీ, రెవెన్యూ, పోలీసు విభాగాలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని ఆపాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటవీ శాఖ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి హాజరై.. ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చేలా తప్పుడు ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని చెప్పారు. కృత్రిమమేధ (ఏఐ)తో ఫేక్ ఫొటోలు సృష్టించి, వాటిని సోషల్ మీడియాలో పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు పిటిషనర్ కాదు కదా.. ప్రతివాది కనుక, మీ వాదనలతో కౌంటర్ దాఖలు చేయండి.. పరిశీలించి ఆదేశాలు జారీ చేస్తాం’అని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇతర ప్రతివాదులను కౌంటర్ వేయాలని చెప్పింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేస్తోందని, తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసిందని చెప్పారు. ఒకేసారి ఇరుకోర్టులు విచారణ జరపడం సరికాదని, వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం పాత పిల్లకు అటాచ్ చేసింది. -
ప్రైవేట్ ఆస్పత్రులలో మెడిసిన్ కొనుగోలు.. రాష్ట్రాలకు సుప్రీం చివాట్లు
ఢిల్లీ : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా మారింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెట్టింది. సామాన్యులకు వైద్య సంరక్షణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వైద్యాన్ని సామాన్యులకు దూరం చేయడమేకాదు.. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో చేరేలా పరోక్షంగా సులభతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేట్ ఆస్పత్రులు తాము నిర్వహించే మెడికల్ షాపుల్లోనే మెడిసిన్లు, ఇంప్లాంట్స్, ఇతర మెడికల్ కేర్ ఉత్పుత్తులు కొనుగోలు చేయాలని పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తున్నాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు, రోగులకు అమ్మే మెడిసిన్లను సైతం వాస్తవ ధరకంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని హైలెట్ చేశారు. ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ.. తమ ఫార్మసీలలో మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లో కోరారు. ఆ పిల్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ సూర్యకాంత్, ఎన్కే సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మేము మీతో ఏకీభవిస్తున్నాము.. అయితే దీన్ని ఎలా నియంత్రించాలి? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.The Supreme Court is hears a Public Interest Litigation (PIL) challenging the practice of hospitals and in-house pharmacies compelling patients to purchase medicines exclusively from their designated pharmacy.Bench: Justice Surya Kant and Justice N. Kotiswar Singh pic.twitter.com/jS3RLmZBwJ— Bar and Bench (@barandbench) March 4, 2025 ఈ సందర్భంగా తమ ఫార్మసీలలోనే మెడిసిన్ తీసుకోవాలని పేషెంట్లపై ఒత్తిడి చేసే ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మార్కెట్లో మెడిసిన్ తక్కువ ధరలో దొరికినప్పుడు అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటల్‌కు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు చేయాలని పేషెంట్లపై ఒత్తిడి చేయొకూడదని సూచించింది.మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్, వైద్య సంస్థలు పౌరులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు అంశంపై సుప్రీం కోర్టు ఒరిస్సా, ఆరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయా రాష్ట్రాలు సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి.మెడిసిన్ ధరలు కేంద్రం జారీ చేసిన ధర నియంత్రణ ఆదేశాలపై ఆధారపడ్డాయని, అత్యవసర మెడిసిన్ సైతం అందుబాటులో ఉండేందుకు ధరలు నిర్ణయించబడ్డాయని తెలిపాయి. హాస్పిటల్ ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని పేషెంట్లపై ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయడంలేదు’కేంద్రం సైతం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. -
తిరుపతి తొక్కిసలాట ఘటనపై పిల్ దాఖలు
అమరావతి, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభాకర్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రొటోకాల్ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలక్కిసలాటలో 29 మంది మృతి చెందిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన పిటిషన్లో ప్రస్తావించారు.తిరుపతిలో వైకుంఠ ద్వార టోకెన్ల టికెట్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. టీటీడీ నిర్లక్ష్యం.. పోలీసుల వైఫల్యంతోనే ఇంతటి ఘోరం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీఎస్ వ్యవస్థ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ట్యాక్స్ డిడక్షన్ యట్ సోర్స్ (TDS) వ్యవస్థను ‘ఏకపక్షం, అసంబద్ధమైనది’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(PIL) దాఖలైంది. సమానత్వంసహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా పేర్కొంటూ టీడీఎస్‌ను రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.మూలం వద్దే పన్నును మినహాయించడం, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేయడం తగిన విధానం కాదని పిటిషన్ వివరించింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే లాయర్, అడ్వొకేట్ అశ్వనీ దూబే ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్రం, న్యాయ మంత్రిత్వ శాఖ, లా కమిషన్, నీతి ఆయోగ్‌లు ప్రతివాదులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 14 (సమానత్వపు హక్కు), 19 (వృత్తి చేసే హక్కు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ఆర్టికల్స్‌కు వ్యతిరేకంగా టీడీఎస్ ఉందని, ఈ వ్యవస్థ ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉందని ప్రకటించాలని పిల్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుటీడీఎస్ అంటే ఏమిటి?టీడీఎస్ అనేది ఆదాయ వనరు వద్దే పన్ను వసూలు చేసే పద్ధతి.. పేమెంట్ సమయంలోనే పన్నును మినహాయించి పన్ను చెల్లింపుదారు తరఫున ప్రభుత్వానికి పంపుతారు. జీతభత్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, కమీషన్ వంటి విభిన్న చెల్లింపులు చేసేప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. -
‘ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే!’
న్యూఢిల్లీ, సాక్షి: నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీన్నొక పాన్ ఇండియా సమస్యగా అభివర్ణిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశంలో ఏయే నగరాల్లో అత్యధిక కాలుష్యం నమోదు అవుతుందో ఓ జాబితా అందించాలని ఆ ఆదేశాల్లో కేంద్రానికి స్పష్టం చేసింది.‘‘వాయుకాలుష్యం ఏయే నగరాల్లో తీవ్రంగా ఉందో ఓ జాబితా ఇవ్వండి. ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే. కేవలం ఢిల్లీకి మాత్రమే మేం ఈ అంశాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. అలా గనుక విచారణ జరిపితే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అందుకే ఈ ఆదేశాలిస్తున్నాం’’ అని ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ జరుపుతున్న జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM) ఎలా ఉందో.. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న నగరాల్లో అలాంటి వ్యవస్థలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. అయితే.. ఎన్సీఆర్ పరిధి వెలుపల నగరాలు ఈ విధానం పాటించడం లేదని, పంటలను తగలబెట్టడం ఇతర రాష్ట్రాలకూ ప్రధాన సమస్యగా ఉందని కోర్టు కమిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. పిల్ పరిధిని పెంచుతూ సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గత నెలలో.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయుకాలుష్యాన్ని నవంబర్ 18వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. అలాగే.. సీఏక్యూఎం ఆదేశాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలిస్తోంది. ఢిల్లీలో మళ్లీ GRAP-3ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో.. GRAP-3 విధానం కఠినంగా అమలు చేయాలని సీఏక్యూఎం ఆదేశించింది. ఈ విధానం ప్రకారం.. విద్యాసంస్థల తరగతులు హైబ్రిడ్ విధానంలో అమలు కానున్నాయి. అంటే.. ప్రాథమిక తరగతుల క్లాసులు ఆన్లైన్లో జరగనున్నాయి. ఇక.. నిత్యావసర వస్తువులకు చెందని డిజీల్ వాహనాలపై నిషేధం అమలు చేస్తారు.చదవండి👉🏼: అమిత్ షాజీ.. రాజధాని ఎలా మారిందో చూడండి! -
బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది: కల్పనా సోరెన్
రాంచీ: బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’ మారిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ విమర్శలు చేశారు. జార్ఖండ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ చర్యలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు.సోమవారం ‘మైయాన్ సమ్మాన్ యాత్ర'లో భాగంగా గుమ్లా జిల్లాలో జరిగిన ర్యాలీలో కల్పనా సోరెన్ మాట్లాడారు.‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన (జేఎంఎంఎస్‌వై)కి వ్యతిరేకంగా బీజేపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రజలకు మంచి చేసే ఏ పాలసీని ప్రవేశపెట్టినా.. బీజేపీ పిల్ వేస్తుంది. జార్ఖండ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచచ్చే పథకాలకు అడ్డంకులు సృష్టించేందుకు ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది’’ అని అన్నారు.గిరిజన వర్గాల డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ విస్మరిస్తోందని కల్పనా సోరెన్ మండిపడ్డారు. ఆదివాసీల గుర్తింపు వారి సంస్కృతి, సర్నా మత నియమావళిలో ఉందని తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలో మేము ఈ కోడ్ కోసం తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు. కానీ మన సంస్కృతిని రక్షించడానికి, ప్రత్యేక సర్నా కోడ్‌ను అందించటం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. జార్ఖండ్, గిరిజనుల గుర్తింపు సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే కాపాడగలదని అన్నారామె.చదవడి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’.. దిగ్విజయ్ చౌతాలా ఆసక్తికర వ్యాఖ్యలు -
బాబు వ్యాఖ్యలపై పిటిషన్లు
న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగానూ సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా తెలియజేశారు. తిరుపతి తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ప్రసాదం కలుషితమైందన్న ఆయన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయి. అందుకే దర్యాప్తునకు ఆదేశించేలా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను అని పోస్ట్ చేశారాయన.Today I filed a PIL seeking Supreme Court direction to investigate unsubstantiated allegation by CM C.B. Naidu that the Tirupati Tirumala Temple Prasadam were adulterated with meat of animals and other rotten items creating chaos almost bhaktas— Subramanian Swamy (@Swamy39) September 23, 2024 వైవీ సుబ్బారెడ్డి పిటిషన్మరోవైపు వైస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంలో పిల్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని ఆయన పిటిషన్లో సుప్రీంను అభ్యర్థించారు. అంతకు ముందు.. తిరుమల లడ్డూ వివాదంపై సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో సీబీఐ లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోరారు. -
పిల్లల ప్రాణాలు పోతున్నాయ్.. హైకోర్టు సీరియస్
హైదరాబాద్, సాక్షి: వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని, ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హెచ్చిరించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాగ్ అంబర్‌పేటలో ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయాడు. అయితే ఈ ఉదంతాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. జీహెచ్ఎంసీ పరిధిలో తరచూ వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విక్రమాదిత్య అనే న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇవాళ వీధి కుక్కల నియంత్రణ చర్యలపై నివేదిక ఇచ్చింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కుక్కల నియంత్రలకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొంది. అయితే.. ప్రభుత్వం దృష్టిసారించాల్సిన ఖరీదైన కాలనీలపై కాదని.. మురికివాడలపై అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రభుత్వం చూపించిన లెక్కలపైనా స్పందిస్తూ.. తమకు గణాంకాలు అక్కర్లేదని.. చర్యలు తీసుకుంటే చాలని సూచించింది. అయితే ఇందుకు సంబంధించిన రూల్స్ రూపొందించామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. .. రూల్స్ ఎప్పుడూ ఉంటాయని, కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని సీజే బెంచ్ వ్యాఖ్యానించింది. ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని వదిలిపెట్టమని హెచ్చరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని ఓ కేసుగా కాకుండా మానవీయ కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అభిపప్రాయపడింది. వీధి కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీని వారంలోగా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. -
TDP Attacks: వైవీ సుబ్బారెడ్డి పిల్‌పై మధ్యాహ్నాం విచారణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మొదలైన హింస.. ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగు దేశం పార్టీ, కూటమి పార్టీలు.. వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో.. వారంపైగా జరుగుతున్న ఈ హింసాత్మక దాడులపై రాష్ట్ర హైకోర్టులో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ జరపాల్సి ఉంది. అయితే కోర్టు ప్రారంభమైన కాసేపటికే విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:15కు ఈ పిల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.చదవండి: టీడీపీ దాడులపై అన్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం: వైవీ సుబ్బారెడ్డి -
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్‌లు... అయితే ఏంటి?
ఈవీఎంపై ఇద్దరు రాహుల్ గాంధీలు కనిపిస్తే? ఎవరికి ఓటేయాలి? ఇది ఎంతో కొంతమంది ఓటర్లను అయోమయానికి గురి చేసే అంశమే. కీలక అభ్యర్థుల పేర్లను పోలిన వారిని ప్రత్యర్థి పారీ్టలు బరిలో దించి ఓట్లను చీల్చడం పరిపాటే. కొన్నిసార్లు అభ్యర్థుల గెలుపోటములనే ప్రభావితం చేసే ఈ పోకడకు చెక్ పెట్టాలంటూ ‘సాబు స్టీఫెన్’ అనే వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులోనే పిల్ వేశారు! అదే పేరుతో మరొకరు పోటీలో ఉండడం వల్ల వెంట్రుకవాసి తేడాతో ఓటమి పాలైన ఉదంతాలను ఉదహరించారు. ‘‘2004 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో అలప్పుజ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వీఎం సుదీరన్ కేవలం 1,009 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అక్కడ వీఎస్ సు«దీరన్ అనే ఇండిపెండెంట్‌కు ఏకంగా 8,282 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి పారీ్టలు డబ్బు, తదితరాలు ఎరగా చూపి ఇలాంటి నకిలీలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ చర్యలు ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలకు వ్యతిరేకం’’ అని వాదించారు. ‘‘ప్రముఖ అభ్యర్థుల పేరును పోలిన వారు బరిలో ఉంటే వారి నేపథ్యాన్ని కూలంకషంగా విచారించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. నకిలీలని తేలితే పోటీ నుంచి నిషేధించేలా చూడండి’’ అని కోరారు. కానీ, ఈ పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచి్చంది. ఒకే తరహా పేర్లున్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం సరికాదని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘రాహుల్ గాం«దీ, లాలు ప్రసాద్ యాదవ్ వంటి ప్రముఖుల పేర్లున్న వారిని పోటీ చేయొద్దందామా? తల్లిదండ్రులు ఆ పేర్లు పెట్టిన కారణంగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచగలమా? పిల్లలకు ఏ పేరు పెట్టుకోవాలనేది తల్లిదండ్రుల హక్కు’’ అని పేర్కొంటూ పిల్‌ను కొట్టేసింది! – న్యూఢిల్లీ -
8న ‘కాళేశ్వరం’పై విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో వాదనలను సోమవారం(ఈనెల 8న) వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లలో ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు పిటిషన్ల తరఫు న్యాయవాదులకు చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు కారకులెవరో తేల్చేందుకు.. పూర్తి అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించాలి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.86 వేల కోట్ల సేకరణ వ్యవహారంపై కూడా సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఎఓ)తో దర్యాప్తునకు ఆదేశాలివ్వాలి. మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తేనే కుంగుబాటుకు అసలు కారణాలు బట్టబయలవుతాయి. నవంబర్ 1న నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్టును కూడా పరిగణనలోకి తీసుకుని బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్ల భద్రతకు వీలుగా చర్యలు చేపట్టేలా నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వాలి’అని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్‌తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు(4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక రిట్ పిటిషన్) దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకుని చెప్పండి సీబీఐకి అప్పగించే విషయం, పిటిషనర్ల వాదనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకొని చెప్పాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) ఇమ్రాన్ ఖాన్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఏఏజీ.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పార్టీ ఇన్ పర్సన్ (అతనే వాదనలు వినిపిస్తారు)గా కేఏ పాల్ వాదిస్తూ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అయితే ప్రభు త్వ వాదన కూడా వినాల్సి ఉన్నందున ఉత్త ర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. తమ వాదనలు వినాలని పాల్, ఇతర పిటి షనర్ల లాయర్లు కోరగా ధర్మాసనం నిరాకరించింది. వ్యాజ్యాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నామంటూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. గతేడాది ఎన్డీఎస్ఏ అధికారులు ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదికను గత నెల విచారణ సందర్భంగా ప్రభుత్వం.. ధర్మాసనం ముందు ఉంచింది. -
హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల బుడ్డోడు.. కారణమిదే!
యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ బుడ్డోడు అలహాబాద్ హైకోర్టును ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఆశ్రయించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, దానిని తొలగించాలంటూ ఆ ఐదేళ్ల చిన్నారి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మందుబాబులు పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చారని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి కారణంగా తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. కాన్పూర్‌లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సాయంతో కోర్టుకు ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పాఠశాల కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే తెరవాలి. అయితే తరచూ ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అథర్వ కోర్టుకు తెలిపాడు. అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయమై కాన్పూర్ అధికారులకు, యూపీ ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యిందని, మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్లనాటిదని వైన్స్ దుకాణ యజమాని వాదనకు దిగారు. ఈ నేపధ్యంలో అధర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. -
డిప్యూటీ సీఎం పదవులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం పదవులపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ పదవులపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ డిప్యూటీసీఎంల నియామకం చట్ట విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. ‘కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నారు. మంత్రి వర్గంలోని సీనియర్ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి లేదా సంకీర్ణంలోని పార్టీలకు సముచిత స్థానం కల్పించడానికి డిప్యూటీ సీఎంలను అపాయింట్ చేస్తున్నారు. పేరుకు డిప్యూటీ సీఎం అని పిలిచినప్పటికీ ఆయన కూడా మంత్రి వర్గంలో ఒక మంత్రే. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగంలోని ఏ నిబంధనను ఉల్లంఘించడం లేదు’అని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్ -
రఘురామకృష్ణరాజు పిల్‌పై విచారణ 23కి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు వాటి వల్ల పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులు 41 మందిలో నోటీసులు అందుకున్న వారందరూ ఈ పిల్ విచారణార్హతపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణార్హతపై కౌంటర్లు దాఖలు చేసిన తరువాత వాటిని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఉన్నం శ్రవణ్‌కుమార్‌కు అందజేయాలని ప్రతివాదుల తరఫు న్యాయవాదులను ఆదేశించింది. కౌంటర్లు అందుకున్న తరువాత వాటికి సమాధానం (రిప్లై) దాఖలు చేయాలని శ్రవణ్ కుమార్‌ను ఆదేశించింది. ఈ నెల 23న పిల్ విచారణార్హతపై వాదనలు వింటామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసుల జారీపై ఆరా తీసిన ధర్మాసనం.. అంతకుముందు ఈ పిల్ విచారణకు రాగానే, గతంలో తాము ప్రతివాదులకు జారీ చేసిన నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదో ధర్మాసనం ఆరా తీసింది. కొందరికి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపామని రఘురామకృష్ణ తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. ప్రతివాదులందరికీ నోటీసులు అంది, వారు కౌంటర్లు దాఖలు చేసిన తరువాతే పిల్ విచారణార్హతపై వాదనలు వింటామని గత విచారణ సమయంలో మీరు (ధర్మాసనం) చెప్పారని ఏజీ గుర్తు చేశారు. మిగిలిన అధికారిక ప్రతివాదులందరూ సీఎస్ కౌంటర్‌నే అన్వయింపచేసుకుంటారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వేలూరి మహేశ్వరరెడ్డి తెలిపారు. దీంతో ధర్మాసనం నోటీసులు అందుకున్న అనధికారిక ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని, ఆ కాపీలను పిటిషనర్ న్యాయవాదికి అందచేయాలని ఆదేశించింది. -
విషం చిమ్మడమే పని.. వ్యక్తిగత వైరంతోనే రఘురామ పిల్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు ఆ పథకాలవల్ల పలువురికి లబ్దిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వారిలో నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా, ఈ–మెయిల్ ద్వారా నోటీసులు అందజేసేందుకు పిటిషనర్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ పిల్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి దాఖలు చేసిన కౌంటర్‌కు తదుపరి విచారణ నాటికి బదులివ్వాలని రఘురామకృష్ణరాజును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు.. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ గురువారం మరోసారి విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ ఈ పిల్‌పై అభ్యంతరం తెలుపుతూ సీఎస్ ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం.. ధర్మాసనం ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న 41 మందిలో ఎంతమందికి నోటీసులు అందాయి? ఎంతమందికి నోటీసులు అందలేదన్న విషయం గురించి ఆరాతీసి నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్‌కు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీఎం, ప్రభుత్వంపై రోజూ విషం.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని సీఎస్ తన ప్రాథమిక కౌంటర్లో హైకోర్టుకు నివేదించారు. ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పిల్ దాఖలు చేయలేదని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నప్పటికీ ఆయన ప్రతీరోజూ వ్యక్తిగత వైరంతోనే మీడియా ముందు సీఎంతో పాటు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని సీఎస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి ముఖ్యమంత్రిపై రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా ఛానెళ్లలో మాట్లాడిన మాటలను జవహర్‌రెడ్డి తన అఫిడవిట్లో పొందుపరిచారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనలను కూడా తప్పుపట్టారన్నారు. వీటిని పరిశీలించి ముఖ్యమంత్రి, ప్రభుత్వంపట్ల పిటిషనర్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని జవహర్‌రెడ్డి తన అఫిడవిట్లో కోర్టును కోరారు. మీడియాలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ప్రచారం కోసమే ఆయన ఈ పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మీడియాతో మాట్లాడే సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపదజాలం వాడారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి శరీరాకృతి గురించి.. మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు, అదనపు అడ్వొకేట్ జనరల్ గురించి ఆయన మాట్లాడిన మాటలన్నీ ప్రజాబాహుళ్యంలో ఉన్నాయన్నారు. నిజానికి.. బ్యాంకును మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిందని సీఎస్ అందులో గుర్తుచేశారు. ఇక పిటిషనర్ దాఖలు చేసిన పిల్ అసలు హైకోర్టు నిబంధనలకు అనుగుణంగాలేదని, అందువల్ల ఇది పిల్ నిర్వచన పరిధిలోకి రాదన్నారు. వ్యక్తిగత వైరంతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని వివరించారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక రఘురామకృష్ణరాజు ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. -
‘స్కిల్’ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: హైకోర్టులో ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిందించిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కిల్ డెపలప్మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్ వేశారు. ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్.. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై పోరాడుతున్న విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్ చట్టాన్ని ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ సంవత్సరాల తరబడి అతిక్రమిస్తూ వస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ప్రజల నుంచి చిట్స్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తన గ్రూప్‌లోని ఇతర సంస్థలకు మళ్లించారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. -
ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2000 నోటు మార్పిడి.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఐడీ ప్రూఫ్ తప్పనిసరా కాదా అనే అంశంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి హైకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. నోట్ల రద్దు అనంతరం.. ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేకుండానే 2,000 రూపాయల నోట్ల మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఇదే దారిలో ఎస్బీఐ కూడా నడిచింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్బీఐ, ఎస్బీఐ నోటిఫికేషన్లు ఏకపక్షంగా, అహేతుకంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించేలా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. ఆర్బీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం నోట్ల రద్దు కాదని, చట్టబద్ధమైన చర్య అని ఆయన వాదించారు. చివరికి ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకపోయినా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవచ్చని తీర్పు వెలువరించింది. చదవండి: కరెంట్ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్ జరిగేది ఇదే: విద్యుత్ శాఖ వార్నింగ్! -
‘ఇది రాజ్యాంగ ఉల్లంఘనే!’.. సుప్రీం కోర్టులో పిల్
ఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిల్ దాఖలైంది. ప్రధాన మంత్రితో కాకుండా.. రాష్ట్రపతి చేత పార్లమెంట్‌ను ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్నట్లు లోక్‌సభ కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. Amidst the political controversy regarding the new Parliament building being inaugurated by the Prime Minister, a Public Interest Litigation has been filed in the Supreme Court seeking a direction that the inauguration should be done by the President of India. Read more:… pic.twitter.com/76YuPd185X — Live Law (@LiveLawIndia) May 25, 2023 ఈ లోపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public interest litigation - PIL, పిల్) దాఖలైంది. పార్లమెంట్‌ను ప్రారంభించాల్సింది రాజ్యాంగానికి అధినేతగా ఉన్న రాష్ట్రపతి. అంతేగానీ ప్రధాని కాదు అంటూ పిల్లో పేర్కొన్నారు. PIL filed in Supreme Court seeking a direction that the #NewParliamentBuilding should be inaugurated by the President of India. pic.twitter.com/IG8y4gQn4i — ANI (@ANI) May 25, 2023 ఈ విషయంలో లోక్‌సభ సెక్రటేరియేట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్లో కోరారు. ఈ కారణం చేతనే విపక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. -
పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టేకి హైకోర్టు నో
సాక్షి, హైదరాబాద్: పోడుభూముల క్రమబద్ధీకరణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో నేడు(సోమవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోడు భూములకు పట్టాలి ఇవ్వడం చట్ట విరుద్ధమనిటీ ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. అటవీ హక్కుల చట్టం, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా.. ప్రభుత్వ మెమో ఉందని పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే.. పొడుకు పట్టాలు ఇవ్వాలంటూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక.. పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోడు భూముల క్రమబద్ధీకరణలో చట్టం, నిబంధనలు పాటించాలని ఆదేశిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జూన్ 22కు తదుపరి విచారణ వాయిదా వేసింది. -
ఆదిపురుష్ సినిమాపై ఫిర్యాదు.. ఎందుకంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇటీవల వివాదాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై మరొకరు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆదిపురుష్ సినిమాపై అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సెన్సార్ బోర్డు అనుమతి లేకుండానే ప్రోమోను విడుదల చేశారని ఆరోపిస్తూ తివారి అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సినీ నిర్మాత ప్రోమోను రిలీజ్ చేయడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సెన్సార్ బోర్డుకు నోటీసులిచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 21 కి వాయిదా వేసింది. ఈ సినిమాలో సీతా దేవిగా కృతిసనన్ ధరించిన దుస్తులపై కూడా పిటిషన్లో అభ్యంతరాలు తెలిపారు. రాముడు, సీత దేవతలను ప్రజలు నమ్ముతారని.. అయితే ఈ చిత్రంలో వారి నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమా నిర్మాత, దర్శకుడిని 'ప్రతివాదులు పేర్కొంటూ పిటిషన్ వేశారు. -
KA Paul: పిల్ కాకుండా రిట్ ఏంటండి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్‌షోలు, బహిరంగ సభలపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో కాకుండా రిట్ పిటిషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపింది. దీనిపై.. తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి ముందుంచింది. రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యం గురువారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు వద్దకు వచ్చింది. ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం కదా. అలాంటప్పుడు ఈ వ్యాజ్యాన్ని పిల్ రూపంలో దాఖలు చేయాలి కదా! అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయినా పిటిషనర్ గతంలో తన క్లయింట్ అయినందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించలేనని స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చేలా రిజిస్ట్రీకి ఆదేశాలివ్వాలని పాల్ న్యాయవాది ఎంవీ రాజారాం కోరగా.. ఆ పని తాను చేయలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అత్యవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. -
'గే' వివాహాలకు చట్టబద్దతపై పిల్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం..
న్యూఢిల్లీ: స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై నేడు (శుక్రవారం) విచారణ జరిపింది. దీనిపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అటార్నీ జనరల్ కూడా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. దీనిపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ అప్పుడే చేపడతామని పేర్కొంది. హైదరాబాద్ జంట సుప్రియో, అభయ్‌లు గత పదేళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఇద్దరు వైరస్ బారినపడ్డారు. కరోనా నుంచి కోలుకున్నాక ఇద్దరూ 2021 డిసెంబర్లో వేడుక నిర్వహించారు. ఆ సంబరాలకు పేరెంట్స్, ఫ్యామిలీతో పాటు మిత్రులు హాజరయ్యారు. పర్త్ పిరోజ్ మెహరోత్రా, ఉదయ్ రాజ్ అనే మరో జంట రెండో పిటిషన్ వేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను గుర్తించకపోతే అది సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
ఆయన్ని ఎలా నియమించారు?.. కేంద్రం తీరుపై సుప్రీం అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల నియామకాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు.. బుధవారం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా.. నవంబర్ 19వ తేదీన రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. ఆయన నియామకానికి సంబంధించిన దస్త్రాలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చిన వెంటనే ఆయన్ని ఎన్నికల విభాగానికి కమిషనర్‌పై నియమించడంపై కేంద్రాన్ని సూటిగా నిలదీసింది. గురువారం వరకు సెక్రెటరీ లెవల్ ఆఫీసర్‌గా అరుణ్ గోయెల్ ఉన్నారని, శుక్రవారం ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారని, ఆ వెంటనే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బెంచ్‌కి వివరించారు. ఒకవేళ ఈసీగా ఆయనకు అవకాశం దక్కకపోయి ఉంటే.. డిసెంబర్లో ఆయన రిటైర్మెంట్ అయ్యే వారని తెలిపింది. ఆపై కేంద్రం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ.. నియామకం సక్రమంగా జరిగిందని చెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో.. జోక్యం చేసుకున్న బెంచ్.. ఏజీ వాదనను తోసిపుచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని.. సీఈసీగా నియమిస్తుందంటూ అసహనం వ్యక్తం చేసింది బెంచ్. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీ ప్రభావం నుంచి దూరంగా ఉండాలని, ప్రధాన ఎన్నికల అధికారి నియామక కమిటీలో సీజేఐను చేర్చాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేయాలి. ప్రధాని లాంటి వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేంత పారదర్శకత కమిషన్ సభ్యుల్లో ఉండాలి అని పేర్కొంది. ఒకవైపు సీఈసీ, ఈసీల నియామక పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఆయన్ని(అరుణ్ గోయల్) ఎలా నియమించారంటూ కేంద్రాన్ని నిలదీసింది. అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను తమకు సమర్పించాలని కోరిన బెంచ్.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
శ్రద్ధా వాకర్ హత్య కేసు: సీబీఐ విచారణ దేనికి?
ఢిల్లీ: సంచలన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఇవాళ కూడా కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. నిందితుడు అఫ్తాబ్ కస్టడీని పొడగించింది ఢిల్లీ సాకేత్ కోర్టు. అయితే.. సీబీఐకి అప్పగించాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించడానికి మాకు ఒక్క మంచి కారణం కనిపించలేదు అని ఈ సందర్భంగా జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్‌తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అలాంటిది మీకు ఎందుకు అంత ఆసక్తి?. అంటూ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘మేమేం విచారణ పర్యవేక్షణ సంస్థ కాదు’ అంటూ ఘాటు కామెంట్ చేసింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అసలు సీబీఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం ఏముందని పిటిషనర్‌ని నిలదీసింది. పోలీసులు 80 శాతం దాకా దర్యాప్తు పూర్తి చేశారని, ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 200 మంది సిబ్బంది ఇందులో భాగం అయ్యారని ఈ సందర్భంగా హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదికి తెలిపింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబడుతూ.. సీబీఐకి కేసును అప్పగించాలని పిటిషనర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. శ్రద్ధా వాకర్ కేసులో దర్యాప్తు సమర్థవంతంగా జరగడం లేదని, పైగా ఆధారాల సేకరణలోనూ ఢిల్లీ పోలీసులు విఫలం అవుతున్నారని, ఇవీగాక.. దర్యాప్తులో ప్రతీ విషయం మీడియాకు చేరుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది అడ్వొకేట్ జోగిందర్ తులీ(రిటైర్డ్ ఐపీఎస్ కూడా)వాదించారు. అయితే.. కోర్టు మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించేది లేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
నేతాజీ జయంతికి సెలవు.. పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్‌ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని.. సెలవు దినంగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్‌ని మందలించింది న్యాయస్థానం. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. 1897 జనవరి 23వ తేదీన కటక్‌లో జన్మించారు. అయితే.. ఆయన జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. తద్వారా ఆ మహనీయుడికి ఓ గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సెలవు ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిల్లో అభ్యర్థించారు పిటిషనర్ కె కె రమేష్. అయితే.. దేశానికి ఆయన(నేతాజీ) చేసిన సేవలను గుర్తించడానికి ఉత్తమ మార్గం.. కష్టపడి పని చేయడమేనని, అంతేకానీ, ఇలా జయంతికి సెలవులను జోడించడం కాదు అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అయినా ఇది పూర్తిగా భారత ప్రభుత్వ పరిధిలోని అంశమని, న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొంటూ ఆ పిల్‌ను డిస్మిస్ చేశారాయన. ఇదీ చదవండి: గూగుల్ పోటీలో నెగ్గిన మన కుర్రాడు -
ఉచితాలపై సుప్రీంలో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్
-
ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారని హైకోర్టు తేల్చింది. పేదలు, అణగారిన వర్గాల కోసం ఈ వ్యాజ్యం దాఖలు చేయలేదని తెలిపింది. ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిల్ దాఖలు చేశారు. దీనిని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం జూన్ 24న తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రతిని తాజాగా అందుబాటులో ఉంచింది. ఈ వ్యాజ్యం విచారణార్హతపై ధర్మాసనం తన తీర్పులో లోతుగా చర్చించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించింది. కేవలం అకడమిక్ ప్రయోజనం కోసం దాఖలు చేసే వ్యాజ్యాలను న్యాయస్థానాలు విచారించబోవని తెలిపింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పిల్ల ద్వారా లేవనెత్తినప్పుడు వాటిని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోరాదంది. ఏ రకంగానూ ఈ వ్యాజ్యాన్ని విచారించబోమని స్పష్టంచేసింది. రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని కార్పొరేషన్లను అడ్డుకుంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగించే వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరిస్తాయంది. అలాంటి వ్యవహారాల నిర్వహణను ప్రభుత్వానికి వదిలేయాలని స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేందుకు న్యాయస్థానాలేమీ ఆర్థికవేత్తలో, ఆర్థిక నిపుణులో కాదని తేల్చి చెప్పింది. రుణం పొందేందుకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు అనుమతినిస్తే రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఆర్థిక ముప్పును కలిగిస్తుందని చెప్పారని, అది ఏ విధంగానో చెప్పేందుకు ఎలాంటి వివరాలను కోర్టు ముందుంచలేదని హైకోర్టు ఆక్షేపించింది. కేవలం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను మాత్రమే ప్రశ్నించారని, దీనికీ, పేద ప్రజల సంక్షేమానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. -
‘ఐదు ఎకరాల్లోపే’ రైతుబంధు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని వర్తింపజేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు వ్యవసాయ శాఖ కమిషనర్లను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని వాటితో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది తల్లాడ నందకిశోర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలితో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో మెజారిటీ వ్యవసాయ భూములను కౌలుదారులే సాగుచేస్తున్నారు. వారికి ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులకు వందలాది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీరికీ రైతుబంధు కింద ఆర్థికసాయం అందుతోంది. అర్హులైన ఐదెకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందేలా ఆదేశాలు జారీ చేయండి’ అని పిటిషన్లో కోరారు. -
లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట
సాక్షి, చెన్నై (తమిళనాడు): అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. దీంతో కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో–కన్వీనర్ పళని స్వామిలకు ఊరట లభించింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ గెలుపుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో–కన్వీనర్ ఎంపికకు ఈనెల మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఈ పదువులకు ఆ పార్టీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామిలు తప్పా, ఇతరులెవ్వరూ నామినేషన్లు వేయడానికి వీలు లేకుండా అన్నాడీఎంకే వర్గాలు ముందుకు సాగాయి. చిరవకు ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరడంతో ఆ ఇద్దరు నేతలు ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో హోసూరుకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు జయచంద్రన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంస్థాగత ప్రక్రియలు జరిగినట్టు, ఈ ఇద్దరి ఎంపికను ధ్రువీకరించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వాదనల అనంతరం ఒక పార్టీకి సంబంధించి సంస్థాగత వ్యవహారాలు, ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చేందుకు తగ్గ జోక్యం కోర్టుకు లేదని పేర్కొంది. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తిరస్కరించింది. దీంతో పన్నీరు, పళని ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. వానతీ శ్రీనివాసన్ గెలుపు బీజేపీ మహిళా విభాగం జాతీయ అ«ధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్పై ఆమె 1,600 ఓట్లతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ ఆ నియోజకవర్గంలో పోటీచేసిన స్వ తంత్ర అభ్యర్థి రాహుల్ గాంధీ మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తి భారతీ దాసన్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆధారాలు లేకపోవడం, ఇతర అభ్యర్థులు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం వంటì అంశాలను పరిగణించిన కోర్టు పిటిషన్ విచారణను తిరస్కరించింది. చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో బంగారం.. -
పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..
తిరువొత్తియూరు( చెన్నై): నీలగిరిలో ఏడేళ్ల బాలుడిని అమ్మవారి ఆలయంలో పూజారిగా నియమించడంపై దేవదాయశాఖను హైకోర్టు వివరణ కోరింది. నెడుకాడు గ్రామంలో గేల్తై అమ్మన్ ఆలయం ఉంది. అమ్మవారు ఓ సామాజిక వర్గానికి కులదేవత. 1994 మే 25న ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. వంశపార్యంపర్యంలో భాగంగా గోపాలకృష్ణ కుమారుడు రాణేష్ (7)ను పూజారిగా నియమించారు. ఇక్కడ పూజారిగా ఉండే వారు పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీనిపై నీలగిరి జిల్లా కొత్తగిరి గ్రామానికి చెందిన టి.శివన్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాథ్ బండారి, ఆదికేశవులు బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పూజారిగా నియమించడం వల్ల బాలుడి చదువు ఆగిపోయిందని..అతని భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు దేవాదాయశాఖను ఆదేశించారు. చదవండి: MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
దళిత బంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం నిలుపుదలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ లక్ష్మయ్య పిల్ వేశారు. పిల్లో.. ప్రభుత్వ పథకాలు అన్ని అమలు అవుతున్నప్పుడు కేవలం దళిత బంధును మాత్రమే ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని, కనుక దళిత బంధు పథకాన్ని యధావిధిగా అమలయ్యేలా చూడాలని పిటిషనర్ పేర్కొన్నారు. చదవండి: వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే కొడుకు, ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం.. -
Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!
గూగుల్ సంబంధిత పేమెంట్ యాప్ జీపే(గూగుల్ పే) వివాదంలో చిక్కుకుంది. అనుమతులు లేకుండా యూజర్ ఆధార్, బ్యాంకింగ్ సమాచారాన్ని కలిగి సేకరిస్తోందని, తద్వారా యూజర్ భద్రతకు ముప్పు వాటిల్లడంతో పాటు అవకతవకలకు ఆస్కారం ఉందంటూ ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు. ఈ పిల్‌పై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, బుధవారం యూఐడీఏఐ, ఆర్బీఐలను నిలదీసింది. అంతేకాదు ఈ పిటిషన్‌పై నవంబర్ 8లోపు స్పందించాలంటూ గూగుల్ డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. గూగుల్ పే టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు, ఆధార్ వివరాల సేకరణ నిబంధనలు ఉన్నాయని.. ఇది అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న వ్యవహారమని అభిజిత్ మిశ్రా అనే ఫైనాన్షియల్ ఎకనమిస్ట్ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీగా ఆధార, బ్యాకింగ్ సమాచారాన్ని సేకరించడం, యాక్సెస్ పర్మిషన్ లాంటి అధికారాలు ఉండవు. ఇక ఆర్బీఐ ఆథరైజేషన్ లేకుండానే లావాదేవీలు నడిపిస్తోందని మరో పిల్ దాఖలు చేశారు. అయితే ఇది పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ కాదని, థర్డీ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అని గతంలోనే కోర్టుకు ఆర్బీఐ, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ తెలిపాయి. చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల ఆఫర్, స్పందించిన గూగుల్ పే -
నల్లకోటు ధరిస్తే.. ఇతరుల కన్నా ఎక్కువేం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఒక న్యాయవాది జీవితం ఇతరుల జీవితం కన్నా విలువైనది ఏమీ కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘నల్లకోటు ధరించి ఉన్నందుకు, మీ జీవితం ఇతరుల జీవితం కన్నా ఎక్కువనుకుంటున్నారా? న్యాయవాదులు దాఖలు చేసే ఇలాంటి బోగస్ వ్యాజ్యాలు ఆపాల్సిన సమయం వచ్చింది’ అని స్పష్టం చేసింది. 60 ఏళ్లలోపు న్యాయవాదులు కరోనాతో మృతి చెందినట్లైతే వారి కుటుంబసభ్యులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ న్యాయవాది ప్రదీప్‌కుమార్ యాదవ్ దాఖలు చేసిన పిల్‌ను కోర్టు విచారించింది. న్యాయవాది కాబట్టి ప్రచారం కోసం పిల్ దాఖలు చేశారని ధర్మాసనం పేర్కొంది. తాను ప్రభుత్వం నుంచి సొమ్ములు డిమాండు చేయడం లేదని, కేసులు దాఖలు చేసేటప్పుడు న్యాయవాదులు కడుతున్న కోర్టు ఫీజుల నుంచి కోరుతున్నానని, ఆ సొమ్ము అంతా ఎక్కడికి పోతోందని ప్రదీప్‌కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బార్ సభ్యులకు పరిహారం కోరడానికి కోర్టుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని, పిల్లో గ్రౌండ్స్ అన్నీ అసంబద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. న్యాయవాదులు ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి పరిహారం ఇవ్వాలని న్యాయమూర్తులను డిమాండు చేయడం పునరావృతం కారాదు అంటూ పిల్‌ను కొట్టివేసింది. పిటిషనర్‌కు రూ.10వేల జరిమానా విధించింది. 60 ఏళ్లలోపు న్యాయవాదులు కరోనాతో మృతి చెందినట్లైతే వారి కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల బార్‌కౌన్సిళ్లు తదితరులను ప్రతివాదులుగా చేరుస్తూ ప్రదీప్ పిటిషన్ దాఖలు చేశారు. -
బహిరంగ ప్రదేశాల్లో.. వినాయక విగ్రహాలను అనుమతించలేం
సాక్షి, అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయరాదని, ప్రైవేటు స్థలాల్లోనే ఏర్పాటుచేసుకుని గణేష్ ఉత్సవాలు జరుపుకోవచ్చునంటూ ప్రభుత్వ యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సైతం సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రజలందరికీ అనుమతినివ్వాలంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కోవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే బహిరంగ ప్రదేశాల్లో చవితి ఉత్సవాల నిర్వహణకు అధికారులు అనుమతివ్వలేదని, ఇందులో తప్పులేదని హైకోర్టు స్పష్టంచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించరాదంటూ కృష్ణాజిల్లా కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనని తెలిపింది. వీటిని రద్దుచేయాలని కోరుతూ వీహెచ్‌పీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వీహెచ్‌పీ కృష్ణాజిల్లా కార్యదర్శి సిద్ధినేని శ్రీసత్య సాయిబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు పిల్ ఎలా దాఖలు చేస్తారు? పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మత విశ్వాసాలకు అనుగుణంగా వేడుకలు జరుపుకునే హక్కు పౌరులందరికీ ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేయరాదని సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు కదా? అని ప్రశ్నించింది. అసలు ఎలా పిల్ దాఖలు చేస్తారని, మీ హక్కులు ఉల్లంఘన జరిగిందని భావిస్తే రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనాల్లేవని, ప్రజలందరి తరఫున ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది తెలిపారు. పెళ్లిళ్లకు 150 మందిని అనుమతినిస్తున్నప్పుడు ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో అనుమతినివ్వకపోవడం సరికాదన్నారు. వినాయక ఉత్సవాలపై ఆధారపడిన చిన్న వ్యాపారులకూ నష్టం చేకూరుతుందన్నారు. దీంతో.. వారెవ్వరూ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని, అందువల్ల ఆ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. జీవించే హక్కే ముఖ్యమని ‘సుప్రీం’ చెప్పింది... తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వినాయక ఉత్సవాలు జరుపుకోకుండా ఎవరినీ అడ్డుకోవడంలేదని, కేవలం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయడంపైనే ఆంక్షలు విధించామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేస్తే అక్కడికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం అసాధ్యంగా మారుతుందన్నారు. ప్రజల జీవించే హక్కే అత్యంత ముఖ్యమైనదన్న సుప్రీంకోర్టు తీర్పును సుమన్ వివరించారు. కరోనా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని, దీనిని పరిగణనలోకి తీసుకుని బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుపై ఆంక్షలు విధించామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే సింగిల్ జడ్జి ప్రైవేటు స్థలాల్లోనే విగ్రహాలు ఏర్పాటుచేసుకోవాలని ఉత్తర్వులిచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ రకంగానూ జోక్యం అవసరంలేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కలెక్టర్ ప్రొసీడింగ్స్‌పై ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని చెప్పింది. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వాలకు పరమావధి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే ఆంక్షలు విధించిందని తెలిపింది. ప్రభుత్వం చెబుతున్నట్లు బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలను నిలువరించడం అసాధ్యమేనని స్పష్టంచేసింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారన్న ధర్మాసనం.. వీహెచ్‌పీ దాఖలుచేసిన ఈ వ్యాజ్యా న్ని కొట్టేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలంటూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం (పిల్) దాఖలైంది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అధ్యాపకుడు ఎం.బాలకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇటీవల కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం కరోనా మూడో దశలో చిన్నారులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. విద్యార్థులకు టీకాలు ఇవ్వలేదు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తుండటం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే.ప్రత్యక్షబోధనను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయం డి. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేయండి’’అని పిటిషన్లో కోరారు. చదవండి: ‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా ఈ పిల్లో విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాలవిద్య, ప్రజారోగ్యవిభాగం డైరెక్టర్లతోపాటు కరోనా అంశాలకు సంబం«ధించి సలహాలిచ్చిన నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యు లతో కూడిన నిపుణుల కమిటీ ప్రతినిధి బృందాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం ముందు విచారణకు రానుంది. చదవండి: ‘దళితబంధు’ సర్వే చకచకా.. -
‘దళితబంధు’ చట్టవిరుద్ధం.. హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జనవాహినీ పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీల కార్యదర్శులు బి.సంగీత, కాసాని రత్నమాల, ఎ.ఆనంద్‌లు ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే అమలు చేయాలి... రాష్ట్ర వ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని, అక్కడ దళిత బంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్‌లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కల సురేష్‌కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
Truecaller: ట్రూకాలర్ యూజర్లకు అలర్ట్..!
ముంబై: ట్రూకాలర్ మొబైల్ అప్లికేషన్ దేశంలోని చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి యూజర్ డేటాను ఇతర సంస్థలో పంచుకుందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు బుధవారం కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. శశాంక్ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో..ట్రూకాలర్ యాప్ వినియోగదారులందరి డేటాను సేకరించి, వారి అనుమతి లేకుండా ఇతర భాగస్వాములతో వినియోగదారుల డేటాను పంచుకుంటుందని పేర్కొన్నాడు. ఈ వ్యాజ్యాన్ని ఛీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీ ఎస్ కులకర్ణితో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. యూజర్ల డేటా వారికి తెలియకుండా.. యూజర్లకు వేరే యాప్ అందుబాటులో లేకపోవడంతో ట్రూకాలర్ ఆటలు సాగుతున్నాయని పేర్కొన్నాడు. ట్రూకాలర్ యూజర్ల డేటాను వారికి తెలియకుండా గూగుల్ ఇండియా, భారతి ఎయిర్ టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, అనేక రుణాలు అందించే సంస్థలకు అందిస్తున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ఐటి విభాగం, ట్రూకాలర్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పి, ఐసిఐసిఐ బ్యాంక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నాడు. ట్రూకాలర్ యాప్ యూజర్ల అనుమతి లేకుండానే యూపిఐ సేవలను అందిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం..! ప్రభుత్వ అధికారులు ట్రూకాలర్ యాప్‌ను సరైన తనిఖీలు లేకుండా ఆమోదించారని ఆరోపించారు. ట్రూకాలర్ తన మొబైల్ అప్లికేషన్ ద్వారా పౌరుల డేటా గోప్యతను పూర్తిగా ఉల్లంఘించిందని కోర్టుకు విన్నవించాడు. అంతేకాకుంగా యాప్ డేటా రక్షణ చట్టాలను పూర్తిగా అతిక్రమిస్తోందని పేర్కొన్నాడు. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు మూడువారాల్లోపు సమాధానమివ్వాలని సూచించింది. -
ఆ ఆరోపణల్ని ఖండించిన సోనూసూద్
నటుడు సోనూసూద్ కరోనా టైం నుంచి అందిస్తున్న సాయం గురించి చెప్పనక్కర్లేదు. అయితే అడిగిన వెంటనే సాయం అందిస్తున్న ఆయన వైఖరిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సోనూసూద్ సహా కొందరు సెలబ్రిటీలకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు సైతం వీలుపడని రీతిలో మందుల్ని సోనూ సరఫరా చేస్తున్నాడని, ఇందులో అధికారికత ఎంత ఉందో తెల్చాలని, ఒకవేళ అక్రమాలుంటే నిగ్గు తేల్చాలని అందులో కోర్టును కోరారు. అయితే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఆయన అభ్యర్థన పిటిషన్‌ను దాఖలు చేశాడు. ముంబై: తనకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో దాఖలైన ఒక పిల్‌పై సోనూసూద్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశాడు. కరోనా టైంలో ట్రీట్మెంట్ కోసం మందుల్ని సోనూసూద్ అక్రమంగా కలిగి ఉన్నాడని, అవి ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై అనుమానాలూ ఉన్నాయని పేర్కొంటూ యాక్టివిస్ట్ నిలేష్ నవలఖా, అడ్వకేట్ స్నేహమర్జాది పిల్ దాఖలు చేశారు. సోనూతో పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ అందిస్తున్న సాయాన్ని ప్రస్తావిస్తూ ఆయన పేరు కూడా చేర్చారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు వాళ్లిద్దరినీ వివరణ కూడా కోరింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన సోనూ.. అభ్యర్థన పిటిషన్‌ను దాఖలు చేయగా కోర్టు మన్నించింది. కాగా, మందుల కొనుగోలు, నిల్వ, దాచడం, డీలింగ్, పంపిణీ చేయడం.. ఇలా ఏ విషయంలోనూ తాను తప్పుడు దారిలో వెళ్లడం లేదని సోనూసూద్, బాంబే కోర్టుకు వివరించాడు. తాను, తన ఫౌండేషన్ కేవలం మధ్యవర్తిగానే వ్యవహరిస్తున్నామని, కరోనా మొదటి వేవ్ టైంలో చేసిన సాయాన్ని సైతం ఆయన ప్రస్తావించాడు. ‘శక్తి అన్నదానం’ ద్వారా 45 వేల మందికి రోజూ భోజన సదుపాయం కల్పించామని వెల్లడించిన సోనూ.. కంపెనీల సహకారంతో 3 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపాడు. దశల వారీగా కన్ఫర్మేషన్ అఫిడవిట్లో సోనూసూద్.. ఫౌండేషన్ పనితీరును, సాయం అందిస్తున్న తీరును వివరంగా వెల్లడించాడు. ఫ్రంట్ లైన్ వర్కర్స్, వలస కాలర్మికులకు, అవసరంలో ఉన్నవాళ్లకు భోజనం, ఆరోగ్య సదుపాయాల్ని ఫౌండేషన్ తరపున కల్పిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరత్రా అధికార విభాగాలతో పరస్పర సమన్వయం కలిగి ఉంటున్నామని వెల్లడించాడు. పిల్లో రెమిడిసివర్ తదితరు మందుల అక్రమ పంపిణీ అంశాన్ని ప్రస్తావించిన సోనూసూద్.. సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అవుతున్న వాళ్లకు సాయం ఎలా అందుతున్నదనేది వివరంగా తెలిపాడు. పేషెంట్ల ఆధార్ కార్డ్, కొవిడ్ రిపోర్ట్, డాక్టర్ ప్రిస్కిప్షన్, ఇలా.. అన్ని పరిశీలిస్తున్నామని, ఆస్పత్రులను సంప్రదించి.. కన్ఫర్మ్ చేసుకుంటున్నామని, ఆ తర్వాత వలంటీర్లు మరోసారి ధృవీకరించుకుంటున్నారని వెల్లడించాడు సోనూ. ఒకవేళ ఆ మందులు దొరక్కపోతే.. జిల్లా కలెక్టర్‌ను, ఎంపీలను, చీఫ్ మెడికల్ ఆఫీసర్లను సంప్రదిస్తున్నామని తెలిపాడు. ఈ విషయంలో ఆస్ప్రతులు, ఫార్మసీ ఫ్రాంచైజీలు కూడా సహకరిస్తున్నాయని పేర్కొన్నాడు. తాము కేవలం మధ్యవర్తిగానే వ్యవహరిస్తున్నామని, సమాచారాన్ని సంబంధిత అధికారులకు, నేతలకు అందించడం ద్వారా అవసరం ఉన్నవాళ్లకు సాయం చేస్తున్నామని స్పష్టం చేశాడు. కాగా, సోనూసూద్ అభ్యర్థనపై పిటిషనర్ అభ్యంతరాలను తర్వాతి వాదనకు వాయిదా వేసింది బాంబే హైకోర్టు. చదవండి: కొడుక్కి బహుమతి.. సోనూ క్లారిటీ! -
నీలం సాహ్ని నియామకంపై వేసిన పిటిషన్ ఉపసంహరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్‌ను విత్‌డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఈ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు తన పిల్‌ను ఉపసంహరించుకున్నాడు. చదవండి: పిల్ వేయడమంటే ఆషామాషీ అయిపోయింది.. -
లాకప్‌డెత్ కేసు: అవసరమైతే రీపోస్ట్‌మార్టం చేయండి:హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ మరణించారని పిటిషనర్ ఆరోపించారు. మరియమ్మ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. పిటీషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, అడ్డగూడురు లాకప్‌డెత్‌పై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు.అడ్డగూడురు ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలపై వేటు వేశారు. లాకప్‌డెత్‌పై మల్కాజిగిరి ఏసీపీ విచారణ విచారణ చేస్తారని ఆయన ఆదేశాల్లో తెలిపారు. అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌లో 3 రోజుల క్రితం మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అవసరమైతే రీపోస్ట్‌మార్టం చేయండి: హైకోర్టు అడ్డగూడూరు లాకప్‌డెత్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారించింది. ఈ కేసులో న్యాయ విచారణకు ఆదేశించింది. లాకప్‌డెత్‌పై విచారణ జరపాలని ఆలేరు మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే రీపోస్ట్‌మార్టం జరపాలని హైకోర్టు సూచించింది. పీఎస్‌లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్? -
పిల్ వేయడమంటే ఆషామాషీ అయిపోయింది..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆమె నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యంలో మరిన్ని అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేసేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
సెంట్రల్ విస్టా: కేంద్రానికి ఊరట, పిటిషనర్‌కు ఫైన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమేనని ఢిల్లీ హైకోర్టు సోమవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషనర్ కు లక్ష రూపాయల జరిమానాను విధించింది. దీంతో కేంద్రానికి మరో ఊరట లభించింది. కరోనా ఉద్ధృతి సమయంలో సెంట్రల్ విస్టా నిర్మాణం అంతగా అవసరం లేదని, ఆ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ సోహైల్ హష్మీ, ట్రాన్స్‌లేటర్ అన్యా మల్హోత్రా ఢిల్లీ హైకోర్టులో సంయుక్తంగా పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ల ద్విసభ్య ధర్మాసనం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. కరోనా బూచిని చూపించి సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కూలీలు అక్కడ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి సమయంలో పనులు ఆపేయాల్సిన పని లేదని పేర్కొంది. ప్రాజెక్టు న్యాయబద్ధతపై ఇప్పటికే సుప్రీం కోర్టు విచారించిందని గుర్తు చేసింది. నిర్మాణ పనులకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతించిందని న్యాయస్థానం గుర్తుచేసింది. అత్యవసరం కూడా.. పార్లమెంట్ నూతన భవన సముదాయం సెంట్రల్ విస్టా నిర్మాణ పనుల్ని కొవిడ్ ఉధృతి వేళ కొనసాగిస్తుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది అని న్యాయస్థానం పేర్కొంది. నిర్మాణ పనులను ఆపేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేగాక, ఇది నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ఎవరి ప్రోద్బలంతోనే వేసిన పిటిషన్లా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్‌దారులకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా సుమారు వెయ్యి కోట్లకు పైగా ఖర్చుతో పార్లమెంట్ నూతన భవన సముదాయం సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ కు అనుగుణంగా నవంబర్ లోపు షాపూర్ జీ పల్లోంజీ సంస్థ.. సెంట్రల్ విస్టాను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పిటిషన్లపై ముగిసిన విచారణ..!
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణ (బీఆర్ఎస్), అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో... ఇదే అంశంపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలకు సంబంధించి జీవో 131, 152లను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త జువ్వాడి సాగర్‌రావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గత ఏడాది విచారణకు స్వీకరించి అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ఇక్కడ విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన 10 పిటిషన్లపై విచారణను ముగించింది. అయితే బీఆర్ఎస్ పథకంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకూ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టరాదంటూ గత జనవరిలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా గత సెప్టెంబరులో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం జారీచేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణను ముగించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఎటువంటి పిటిషన్ దాఖలు కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. అయితే బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో భాగంగానే రిజిస్ట్రేషన్లు నిలిపివేసిందని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అభ్యంతరం ఉంటే మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. -
మతం – అభిమతం
మత మార్పిడుల వ్యవహారం మన దేశంలో తరచు వివాదాస్పదమవుతోంది. ఈమధ్య కాలంలో బీజేపీ ఏలుబడిలోని మూడు రాష్ట్రాలు–ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మత మార్పిడుల నిరోధానికి ఆర్డినెన్సులు, చట్టాలు తీసుకొచ్చాయి. తాము అధికారంలోకొస్తే అలాంటి చట్టాన్ని తీసుకొస్తామని తమిళనాడులో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. బెదిరింపులు, వేధింపులు, మభ్యపెట్టడం ద్వారా దేశంలో కొందరు మత మార్పిడులకు పాల్పడుతున్నారని వీటిని నియంత్రించటానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం తమ ముందుకొచ్చినప్పుడు ధర్మాసనం కటువైన వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లకు పైబడిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకోవటాన్ని ఎందుకు నిరోధించాలని జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు ప్రజా ప్రయోజనానికి చాలా చాలా హాని కలిగించేవని, ఈ పిటిషన్ ప్రచార ప్రయోజన వ్యాజ్యం తప్ప మరేమీ కాదని దుయ్యబట్టింది. చివరకు పిటిషనర్ ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. మన రాజ్యాంగంలోని 25వ అధికరణ ఏ మతాన్నయినా స్వేచ్ఛగా అవలంబించటానికి, ప్రచారం చేసుకోవటానికి అనుమతినిస్తోంది. అయితే శాంతిభద్రతలకు, నైతికతకు, ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా ఈ హక్కును వినియోగించుకోవచ్చునని నిర్దేశిస్తోంది. మతాన్ని కించపరచ డానికి ప్రయత్నించటం, వేరే మతస్తుల మనోభావాలను దెబ్బతీయటం వగైరాలకింద చర్యలు తీసుకోవటానికి వీలు కల్పిస్తున్న భారతీయ శిక్షాస్మృతిలోని 295ఏ, 298 సెక్షన్లను బలవంతపు మతమార్పిడి జరిగిందని అనుమానం వచ్చిన సందర్భాల్లో వినియోగిస్తున్నారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా పదేళ్లక్రితం చట్టాలు చేసిన రాష్ట్రాలు సైతం అందుకు సంబంధించి నిబంధనలు రూపొందించటంలో అయోమయం తలెత్తటం వల్ల వాటిని నిలిపివుంచాయి. ఈ మధ్య ఉత్తరప్రదేశ్ ‘వివాహం కోసం మతం మారటాన్ని’ నిషేధిస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారణలో వున్నాయి. మతమార్పిడులు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కలగజేసి, అలాంటి ప్రచారం ద్వారా లబ్ధి పొందేందుకు రాజకీయ నాయకులు వెరవడం లేదు. ఈ ధోరణి సామాన్య పౌరులకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతున్నదో చెప్పడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఉదంతమే ఉదాహరణ. క్రైస్తవ సన్యాసినులతో కలిసి ఇద్దరు యువతులు రైల్లో వెళ్తుండగా, వారితోపాటే ప్రయాణిస్తున్న ఒక గుంపు వారిని శంకించింది. బలవంతంగా మత మార్పిడి చేయించటానికే ఆ ఇద్దరు యువతులనూ తీసుకెళ్తున్నారన్న అభిప్రాయం వారికేర్పడింది. దాంతో రైలు ఆగిపోయింది. అక్కడికక్కడ ‘విచారణ’ మొదలైపోయింది. తాము మతం మారడంలేదని, తాము కూడా పుట్టుకతో ఆ మతానికే చెందినవారమని యువతులు చెబుతున్నా ఎవరూ వినిపించుకోలేదు. వెంటనే పోలీ సులు రావటం, వారిని ప్రశ్నించటం కోసం పోలీస్‌స్టేషన్‌కు తరలించడం పూర్తయింది. ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. కానీ ప్రయాణం వాయిదా పడింది. సహ ప్రయాణికులకు ఇబ్బంది కలి గించటం, రైల్లో నేరానికి పాల్పడటం, టిక్కెట్ లేకుండా ప్రయాణించటంతోసహా ఎన్నో కారణాలు రైల్లోనుంచి దింపేయటానికి దారితీయడం ఎప్పటినుంచో వింటున్నదే. కానీ మత మార్పిడి అనుమానం కలిగినా ప్రయాణం ఆగిపోతుందని ఝాన్సీ ఉదంతం నిరూపించింది. నిజానికి మత మార్పిడులకు సంబంధించిన చర్చ చాలా పాతది. 1954లోనే మత మార్పిడులను క్రమబద్ధీకరించే బిల్లును పార్లమెంటు పరిశీలించింది. అలాగే 1960లో వెనకబడిన వర్గాల(మత పరిరక్షణ) బిల్లు ముసాయిదా సైతం రూపొందింది. అయితే ఆ రెండూ అంతకన్నా ముందుకు పోలేదు. 1967లో ఒరిస్సా మత స్వేచ్ఛ చట్టం తీసుకొచ్చినా రాజ్యాంగంలోని 25వ అధికరణ స్ఫూర్తికి అది విరుద్ధమని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. అయితే వేరొకరిని తన మతంలోకి మార్చే హక్కు ఎవరికీ వుండబోదని, అది రాజ్యాంగంలోని 25వ అధికరణకిందకు రాదని 1977లో ఒక కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘మత స్వేచ్ఛకు రాజ్యాంగమే పూచీపడుతున్నప్పుడు ఆ విషయంపై రాజ్యం ఆందోళన చెందాల్సిన అవసరమేమిటి?’ అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ ప్రశ్నించారు. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వేరే పార్టీలోకి ఫిరాయిస్తే అది తప్పని, ప్రజా భీష్టానికి విరుద్ధమని... అంతిమంగా ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయని గుర్తిం చనివారికి కూడా ఎవరైనా మతం మార్చుకుంటే అభ్యంతరం అనిపిస్తోంది. అందువల్ల ఏదో అయిపోతుందనే భయం కలుగుతోంది. రాజకీయ స్వప్రయోజనాలే ఇందుకు కారణమని సులభం గానే చెప్పొచ్చు. తమను బలవంతంగా మతం మార్చారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వేరు. కానీ ఎలాంటి సమస్య తలెత్తకుండా వివాదాన్ని రేకెత్తించటానికి చూడటం సరికాదు. తోటి పౌరుల వ్యక్తిగత నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోరాదన్న స్పృహ అందరిలో కలగవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు తీర్పు గుర్తుచేస్తోంది. ఈ అంశంపై మన దేశంలో తరచు తలెత్తుతున్న వివాదాలకు ధర్మాసనం వ్యాఖ్యలు ముగింపు పలుకుతాయని ఆశించాలి. -
కొత్తగా నిర్మిస్తారా.. పునర్నిర్మిస్తారా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా ఉన్న చారిత్రక ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రిని పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా అనే విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నాలుగు వారాల్లో ఒక వైఖరి వెల్లడించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అయితే వారసత్వ కట్టడాలు కూల్చవద్దనే వాదనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి గుర్తుచేసింది. ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మించాలన్న పిల్స్‌పై గురువారం హైకోర్టు విచారణ చేసింది. చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దన్న పిల్స్‌ను పరిశీలించి ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన వ్యాజ్యాలన్ని కలిపి విచారణ చేపడుతోంది. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. -
పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు.. రూ.10 వేల జరిమానా
హైదరాబాద్: ఒప్పంద డిగ్రీ, జూనియర్ అధ్యాపకులను క్రమబద్ధీకరించవద్దన్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. క్రమబద్ధీకరించకుండా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని 2016లో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరించిందా అని ఈ సందర్భంగా పిటీషనర్లను న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు రూపొందించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మంది నిరుద్యోగులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరిస్తున్నారని ఊహించుకొని పిటిషన్ ఎలా వేస్తారని అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ఒక్కొక్కరు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ చర్యతో పిటిషన్‌దారులు అవాక్కయ్యారు. -
అమెజాన్ నెత్తిన పిడుగు: సుప్రీంకోర్టు నోటీసులు
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది అమెజాన్ ప్రైమ్ వీడియో పరిస్థితి. ఇప్పటికే తాండవ్ సిరీస్‌ను వివాదాలు చుట్టుముట్టగా ఇప్పుడు మీర్జాపూర్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ ప్రాంతాన్ని హింసాత్మకంగా చూపించడంతో అక్కడ నివసించే ఓ వ్యక్తి ఈ వెబ్ సిరీస్ మీద పిల్ దాఖలు చేశాడు. దీంతో సుప్రీం కోర్టు గురువారం నాడు మీర్జాపూర్ టీమ్‌కు, అమెజాన్ ప్రైమ్ వీడియోకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఇష్టారీతిన వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్‌ను నియంత్రించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.(చదవండి: మీర్జాపూర్ 2ను బ్యాన్ చేయండి: మహిళా ఎంపీ) ఇదిలావుంటే ఈ వెబ్‌సిరీస్‌పై లక్నో, మీర్జాపూర్లో ఇదివరకే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అవగా తాజాగా ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మత, ప్రాంతీయ, సామాజిక మనోభావాలను దెబ్బతీయడంతో పాటు అక్రమ సంబంధాలను ఎక్కువ ఫోకస్ చేశారంటూ మీర్జాపూర్‌లోని అర్వింద్ చతుర్వేది పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మీరకు పోలీసులు సదరు వెబ్‌సిరీస్ నిర్మాతలతో పాటు, దాన్ని ప్రసారం చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైనా సోమవారం నాడు కేసు నమోదు చేశారు. కాగా అప్పట్లో ఈ సిరీస్ మీద మీర్జాపూర్ ఎంపీ అనుప్రియ పటేల్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మీర్జాపూర్ ప్రశాంతతకు కేంద్రంగా ఉందని, కానీ వెబ్ సిరీస్‌లో ఈ నగరాన్ని హింసాత్మకంగా చూపించి దాని ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. ఇక రెండు సిరీస్‌లుగా వచ్చిన మీర్జాపూర్లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, విక్రాంత్ మాస్సే, శ్వేత త్రిపాఠి, హర్షిత గౌర్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్ మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ దీన్ని నిర్మించారు. (చదవండి: హనీమూన్‌కు వెళ్లిన బిగ్‌బాస్ నటి) -
ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్)ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతున్నా దేశీయంగా ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన న్యాయవాది షాజీ జె కోదన్‌కందత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అకారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని, ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని పిటిషన్లో షాజి కోరారు. చమురు ధరలు తగ్గినా, కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని చమురు మార్కెటింగ్ సంస్థలు రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయనీ, ఏప్రిల్ నుండి వరుసగా ధరలు పెరుగుతున్నాయని షాజీ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం షాజిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక విధానానికి సంబంధించిన అంశంలో పిల్ వేయడాన్ని తప్పుబట్టిన సుప్రీం పిటిషన్‌ను కొనసాగించాలనుకుంటే పిటిషనర్‌కు భారీ జరిమానా విధిస్తామని జస్టిస్ రోహింటన్ నారిమన్ హెచ్చరించారు. దీంతో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు పిటిషనర్ ప్రకటించారు. -
స్కామ్‌లపై కేసులు వద్దంటే ఏంటర్థం?
దేశంలోనే ఇలాంటి వ్యాజ్యాలు అరుదుగా పడుతుంటాయేమో! తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విచారణ జరపరాదనీ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించరాదనీ, సీబీఐ విచారణకు అప్పగించరాదనీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకాలం దమ్ముంటే విచారణ చేసుకోండి, మేం ఏ తప్పూ చేయలేదు, నిప్పులా బతికాం అంటూ భీషణ ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదారులు ఎందుకు స్వరం మార్చారు? కేసులు పెట్టుకోండని సవాళ్లు చేసిన టీడీపీ, తమపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతో కేసులు పెడుతోందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తమ వాళ్లను అరెస్టు చేస్తోందని ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఏకంగా అసలు కేసులే పెట్టవద్దని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఏమి చేస్తుందన్నది వేరే విషయం. ఏ న్యాయస్థానం కూడా అక్రమాలను వెలికి తీయవద్దని, అన్యాయాలను నిరోధించవద్దని చెబుతుందని అనుకోజాలం. గతంలో ఎన్నో సందర్భాలలో హైకోర్టులే ప్రస్తుత ప్రభుత్వాలలో జరిగే తప్పులను, గత ప్రభుత్వాలలో జరిగే తప్పులను విచారించాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇచ్చాయి. ఏపీ హైకోర్టు కూడా అలా ఎన్నో తీర్పులు వెలువరించింది. చిన్న, చిన్న కేసులలో కూడా సీబీఐ విచారణ చేయాలని ఆదేశాలు ఇస్తూ సీరియస్ అయిన విషయాన్ని చూశాం. అలాంటిది వేల కోట్ల కుంభకోణం ఆరోపణలను విస్మరించకపోవచ్చు. అయినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తమపై కేసుల విచారణ సాగరాదని హైకోర్టుకు వెళ్లడం ఒకరకంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అవుతుంది. కోర్టు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా టీడీపీకి అప్రతిష్టే. ఏ సాంకేతిక కారణం ఆధారంగానో విచారణకు అనుమతి ఇవ్వకపోయినా టీడీపీకి పరువు తక్కువే. అసలే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని పేరుపొందిన చంద్రబాబుపై అనేక విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో అనేక విషయాలు వెల్లడించింది. ఏకంగా అప్పటి అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పైనే ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లకు సంబంధించిన హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోలు మొదలు అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావు, కొందరు ఎమ్మెల్యేలు అంతా కలిసి నాలుగు వేలకు పైగా ఎకరాల మేర ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ క్రమంలోనే టీడీపీ తరఫు న్యాయవాది గత ప్రభుత్వాలలో జరిగిన వాటిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేయరాదని వాదించడం విచిత్రమే. ఆయన చాలా సీనియర్ న్యాయవాది. అనేక విషయాలు తెలిసినవారు. మన రాష్ట్రంలోనే జరిగిన ఒక సంగతిని గుర్తు చేయాల్సి ఉంటుంది. 2007, 2008 ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు అయిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి మీడియాతో పాటు, కొన్ని పరిశ్రమలను స్థాపించారు. అందులో ఆయా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కొన్ని ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారు. కేంద్రం కానీ, ఆయా దర్యాప్తు సంస్థలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రభుత్వ శాఖలు కానీ జగన్ కంపెనీలలో పెట్టుబడులను తప్పుపట్టలేదు. కానీ 2009లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో టీడీపీ, కాంగ్రెస్ హైకోర్టుకు వెళ్లడం, ఆనాటి చీఫ్ జస్టిస్ ఆ పెట్టుబడులపై విచారణకు ఆదేశించడం, క్విడ్ ప్రో కో అనే కొత్త పదాన్ని కనిపెట్టి సీబీఐ విచారణ చేపట్టడం, వైఎస్ ప్రభుత్వం ఆ పారిశ్రామికవేత్తలకు ఉదారంగా రాయితీలు ఇచ్చిందని ఆరోపించడం, తద్వారా జగన్‌ను ఏకంగా పదహారు నెలల పాటు జైలులో నిర్బంధించిన సంగతి ఇంకా జనం స్మృతిపథంలోనే ఉంది. అప్పుడు అక్రమంగా కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు పెట్టాయని నమ్మారు కనుకే జగన్‌కు ఇప్పుడు జనం బ్రహ్మరథం పట్టారు. మరి టీడీపీ లాయర్ వెంకటరమణ వాదన కరెక్టు అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన నిర్ణయాలపై ఆయన చనిపోయిన తర్వాత కేసులే పెట్టకూడదు కదా! అది కూడా మూడు, నాలుగేళ్ల తర్వాత కేసులు పెట్టారే. అప్పుడు పరిశ్రమలలో పెట్టుబడులు నేరంగా సీబీఐ చూపించడం దారుణమని మాబోటివాళ్లం వాదించేవారం. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టకపోతే జైలులో పెట్టాలి కాని, పరిశ్రమలు పెట్టడానికి సిద్ధం అయినవారిపై కేసులు ఏమిటని ప్రశ్నించేవారం. కానీ ఆ రోజున ఇదే చంద్రబాబు, జగన్ అక్రమాలకు పాల్పడ్డారు కనుకే కేసులు వచ్చాయని చెప్పారు. తన రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్‌తో కలిసి మరీ కేసులు పెట్టించే యత్నం చేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు టీడీపీ వాదన బలహీనంగా ఉందని చెప్పడానికి. అంతేకాదు, ఇప్పుడు నేరుగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆనాటి అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సైతం ఇన్సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు నేరుగానే అభియోగం మోపారు కదా. మరి అది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదని రుజువు చేసుకోవలసిన చంద్రబాబు కానీ, ఇతర టీడీపీ నేతలు కానీ అసలు కేసే వద్దని హైకోర్టుకు వెళ్లారంటేనే వారు ముందుగానే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది. పోని గతంలో ఇలాంటివి జరగలేదా అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హయాంలో జరిగిన బియ్యం మిల్లుల కుంభకోణంపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో, ప్రత్యేకించి ఎమర్జెన్సీ అత్యాచారాలపై ఏకంగా జస్టిస్ షా కమిషన్‌ను నియమించి విచారణ చేయించింది. ఇందిరాగాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు కూడా వేశారే! తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వంపై ఏకంగా కేంద్రం ఒకసారి కమిషన్‌ను నియమించింది. అలాగే జయలలితపై కరుణానిధి ప్రభుత్వం విచారణ జరిపించడం, జైలుకు పంపించడం వంటి ఘట్టాలు చూశాం. అలాగే కరుణానిధిని కూడా అవినీతి ఆరోపణలపై జయలలిత జైలుకు పంపారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గానీ, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా గానీ వేర్వేరు కుంభకోణాలలో దోషులుగా రుజువు అవడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వాల అక్రమాలపై విచారణ జరగకూడదనుకుంటే ఇవేవీ జరగకూడదు కదా. అంతేకాదు, ఉమ్మడి ఏపీలో జలగం వెంగళరావు ప్రభుత్వ కాలంలో నక్సల్స్‌పై జరిగిన దాడులపై కేంద్ర ప్రభుత్వం విమద్ లాల్ కమిçషన్ను నియమించింది. ఆయనకు ఆ కమిషన్‌తో పెద్దగా ఇబ్బంది రాలేదు, అది వేరే విషయం. మరి ఇప్పుడు చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ అమరావతి రాజధానిలో అక్రమాలు జరగలేదని గట్టి విశ్వాసంతో ఉంటే వారు కూడా సిట్ లేదా సీబీఐ... ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పాలి తప్ప ఇలా జారిపోవడానికి ప్రయత్నించవచ్చా? తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల అధికారం అనుభవించిన తర్వాత దారుణమైన ఆత్మరక్షణలో పడిందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో భాగస్వామి అయితే బీసీ కనుక అభియోగాలు మోపి అరెస్టు చేశారని ఆరోపించారు. మరి ఈఎస్ఐ స్కామ్‌లో 151 కోట్ల గోల్మాల్ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కృష్ణా పుష్కరాలలో ఘాట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణ వేసి నలుగురు అధికారులపై దర్యాప్తు చేస్తుంటే అది మాజీ మంత్రి దేవినేని ఉమాను ఇబ్బంది పెట్టడానికే అని అంటారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికే రాజధాని భూ కుంభకోణం తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఆ మాట అనడం ద్వారా వారు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో స్కాములు జరిగాయని ఒప్పుకున్నట్లే అవుతుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎస్ ఇంటిపై దాడి చేసి 2 వేల కోట్ల మేర అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని ప్రకటన ఇచ్చింది. నిజానికి అది చాలా సీరియస్ కేసు. అయినా చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ దానిపై ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదు? పైగా బీజేపీ నేతల ప్రాపకం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అంటే కేంద్రంలో ఎలాగోలా మేనేజ్ చేసుకుని బయటపడవచ్చన్న నమ్మకమా? లేక ఇంకేమైనా కారణం ఉందా? మరి ఏపీ ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ దర్యాప్తు అంటే ఎందుకు భయపడి హైకోర్టును ఆశ్రయించారు? జగన్‌ను మేనేజ్ చేయలేమని అనుకున్నారా? ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఇది కొత్త ఒరవడి. నిజంగానే చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని జగన్ ప్రభుత్వం వెలికి తీయగలిగితే పెద్ద విషయమే అవుతుంది. అప్పుడు ప్రభుత్వం అంటే స్కాములు చేయడం కాదు, అలా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడో అప్పుడు శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజలకు కలుగుతుంది. ప్రజలకు రాజకీయ వ్యవస్థపై ఒక నమ్మకం వస్తుంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయులు -
అన్ని మతాలకూ ఒకే దత్తత చట్టం కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకేరకమైన దత్తత చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దత్తత చట్టం, సంరక్షణ బాధ్యత, వివక్షా పూరితంగా ఉన్నాయనీ, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని ఉల్లంఘిస్తున్నందున దత్తతకు సంబంధించిన యూనిఫాం మార్గదర్శకాలు ఉండాలని కోరారు. ప్రస్తుత దత్తత పద్ధతి వివక్షా పూరితంగా ఉందనీ, హిందువులకు ప్రత్యేక చట్టం ఉంది, కానీ ముస్లింలు, క్రిస్టియన్లు, పార్శీలకు ఎటువంటి చట్టం లేదని, తెలిపారు. (మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్) -
ఏదో చిన్న పిల్లల వ్యవహారంలా ఉంది
-
ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ 20 కి వాయిదా
సాక్షి, అమరావతి: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈనెల 20 కి వాయిదా వేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలంటే.. సమాచారం ఏ సోర్స్ నుంచి వచ్చిందనేది చాలా ముఖ్యమైన అంశమని ప్రభుత్వ న్యాయవాదులు అంతకు ముందు కోర్టుకు తెలిపారు. ఈ పిల్‌ను చూస్తే ఏదో చిన్నపిల్లల వ్యవహారంలా ఉందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద హైకోర్టు జడ్జి మీడియాతో మాట్లాడినట్టుగా కథనం ప్రచురించారని, తమకు తెలిసినంత వరకు హైకోర్టు జడ్జి ఎవరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ మీడియా సంస్థతోనూ మాట్లాడలేదని నమ్ముతున్నట్టు కోర్టుకు విన్నవించారు. కాబట్టి.. ఈ కథనం అంతా అసహనంతో నిండిన కథనంగా వారు పేర్కొన్నారు. చట్ట ధిక్కరణకు పాల్పడుతూ కథనం రాశారని స్పష్టం చేశారు. (చదవండి: ట్యాపింగ్ శుద్ధ అబద్ధం) ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం పరువునష్టం నోటీసు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. చట్టపరమైన చర్యలకు సన్నద్ధమైందని వెల్లడించారు. ఈ కేసులో కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థను కూడా పార్టీని చేయండని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ట్యాపింగ్ మీద వారికి ఎక్కడ నుంచి సమాచారం వచ్చింది? వారు ఈ కథనాన్ని ఎలా రాశారు? వారితో జడ్జి మాట్లాడి ఉంటే ఏం చెప్పారో కోర్టుకు చెప్పాలని అన్నారు. ‘జడ్జిల కదలికలపై నిఘా పెట్టారంటూ.. ఒక సీనియన్ ఐపీఎస్ అధికారి చెప్పారని పిటిషనర్ చెప్తున్నారు. ఆ వివరాలను పొందుపరుస్తూ అఫడవిట్ వేయమని కోర్టు ఆదేశించింది’ అని అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ పేర్కొన్నారు. -
చంద్రబాబుపై హైకోర్టులో పిల్..
-
క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. క్యాబ్ డ్రైవర్ల తరుపున న్యాయవాది రాపోలు భాస్కర్ పిల్‌ను వేశారు. పిటిషనర్ తరుపు వాదనలను సీనియర్ అడ్వకేట్ మాచర్ల రంగయ్య వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పిటిషనర్ కోరారు. లాక్డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఉపాధి లేక క్యాబ్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపారు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికి ఈఎంఐ కట్టాలని బ్యాంక్‌లు ఒత్తిడి తెస్తున్నాయని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈఎంఐలు కట్టలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు జూన్ 5న క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్5కు కోర్టు వాయిదా వేసింది. (‘అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు’) -
చంద్రబాబుపై హైకోర్టులో పిల్..
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించిన చంద్రబాబు.. మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్ ర్యాలీలతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. రాజకీయ ర్యాలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాప్తి జరిగేలా చంద్రబాబు వ్యవహరించాడని పిటిషన్లో పేర్కొన్నారు. బాబుకు ఇచ్చిన అనుమతిని రద్దుచేసి, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, రెండు నెలల విరామం తర్వాత సోమవారం ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు.. లాక్‌డౌన్‌ను తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసు శాఖ ఇచ్చిన ప్రత్యేక అనుమతితో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉండవల్లి లోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే మార్గమధ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జనసమీకరణ చేశారు. ఎక్కడా నేతలు, కార్యకర్తలు మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా హడావుడి చేయడంతో పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినా టీడీపీ కేడర్ లెక్కచేయలేదు. చంద్రబాబు కూడా కార్యకర్తల్ని వారించే ప్రయత్నం చేయలేదు.(చదవండి : లాక్డౌన్ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్) -
లాక్డౌన్: 100 కోట్లకు వడ్డీ చెల్లించండి
సాక్షి, హైదరాబాద్ : న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన రూ. 100 కోట్లు ఫండ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లకు వచ్చిన వడ్డీని న్యాయవాదులకు అందించాలని అడ్వకేట్ రాపోలు భాస్కర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. పిటినర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపిస్తూ.. లాక్డౌన్ కారణంగా న్యాయవాదులు కేసులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో కేటాయించిన రూ.100 కోట్ల ఫండ్‌కు వచ్చిన వడ్డీని కరోనా కష్ట కాలంలో న్యాయవాదులకు ఇచ్చి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసిందని అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పిటిషనర్ స్పందిస్తూ.. తాజాగా కేటాయించిన 25 కోట్ల గురించి తాము అడగడం లేదని, గతంలో ఇచ్చిన 100 కోట్ల న్యాయవాదుల ఫండ్ గురించి అడుగుతున్నామని వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. అలాగే రూ. 25 కోట్లు ఏ ప్రాతిపదికన న్యాయవాదులకు ఇస్తున్నారో రేపటిలోగా (బుధవారం) తెలపాలని ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. (అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకండి) జర్నలిస్ట్‌లను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1391284009.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జర్నలిస్ట్‌లను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పత్యక్ష పోరాటం చేస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్యకార్మికులు ఉన్నారు. వీరితో పాటు జర్నలిస్టులు కూడా కరోనాకి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వారికి ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా వారిని ఆదుకోవడానికి ముందు రావడం లేదు. దీనికి సంబంధించి కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషనర్ తరుపున వాదనలను సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వినిపించారు. (జీహెచ్ఎంసీకి కలిసివచ్చిన లాక్డౌన్..) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దాంతో పాటు కరోనా వార్తలు కవర్ చేస్తోన్న ప్రతి జర్నలిస్ట్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని పిటిషనర్ కోరారు. అదేవిధంగా వారికి మెడికల్ కిట్లు, మాస్క్‌లు ఉచితంగా అందించే విధంగా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్ కోరారు. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ డిపార్ట్ మెంట్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కు హైకోర్టు నోటీసులు జారిచేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. (ఈ మూడు ప్రతి నగరవాసికి ఓ అలవాటుగా) -
పీఎం కేర్స్ ఫండ్‌పై పిల్.. రేపు విచారణ
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కరోనాపై పోరులో భాగంగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పీఎం కేర్స్ ఫండ్ భారీగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి మోదీ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ, ఆర్థిక, హోం మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. ప్రధాని పిలుపుతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం పీఎం కేర్స్ ఫండ్ పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు. అయితే పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ ఎంఎల్ శర్మ సుప్రీం కోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. ‘మార్చి 28వ తేదీన కోవిడ్-19 పోరాటంలో భాగంగా ప్రజలు విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. ఇందు కోసం పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలకు సాయం అందించడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 267, 266(2) ప్రకారం ఈ ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆర్టికల్ 267 ప్రకారం దీనిని పార్లమెంట్ గానీ, రాష్ట్ర శాసనసభ గానీ రూపొందించలేదు. అలాగే దీనికి పార్లమెంట్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదం లేదు’ అని పిల్లో పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు ఈ ఫండ్ కింద సేకరించిన విరాళాలను కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా బదిలీ చేయాలని కోరారు. కాగా, ఈ పిల్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శాంతనగౌదర్‌లతో కూడిన ధర్మాసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనుంది. -
ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్ దాఖలు
సాక్షి, మహబూబ్‌బాద్(వరంగల్): తన ఇంటి ముందు ఉన్న స్కూల్‌ను కూల్చివేసి పార్కింగ్‌కు వాడుకుంటున్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌పై అదే గ్రామానికి చెందిన డిఎస్ వెంకన్న నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన 3 ఎకరాల స్థలాన్ని రెడ్యా నాయక్ కబ్జా చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన తన భార్య, ఇద్దరు కొడుకుల పేర్లను మార్చి మొదటి విడతలో ఇందిరమ్మ గృహలు పొందారని, ఉపాధి హామీ పథకం కింద తన పేరున ఉన్న భూమిని కొడుకు పేరు మీద ఉన్నట్లు చూపించి నిధులు పొందారని కోర్టుకు తెలిపారు. వెంకన్న నాయక్ పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు పూర్తి వివరాలు ఇవ్వాలని హోంశాఖను అదేశించింది. కాగా తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదికి వాయిదా వేసింది. -
బాలికల మిస్సింగ్ కేసుపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన మైనర్ బాల బాలికల అదృశ్యం కేసుపై న్యాయవాది రాపోల్ భాస్కర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. పోలీసులు బాలికల మిస్సింగ్ కేసును మూసివేశారని, ఇట్టి కేసులను మళ్లీ రీ ఓపెన్ చేయాలని ఆయన కోర్టును కోరారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు స్పెషల్ అధికారులను నియమించి విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే హాజిపూర్ ఘటనలో అదృశ్యమైన బాలికల తరహాలోనే వీరి అదృశ్యం జరిగి ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా క్లోన్ చేసిన 2 వేల కేసులను మళ్లీ తిరిగి విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపి..కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది. -
ఆ పోలీసులపై 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్
సాక్షి, హైదరాబాద్: ఆటవికంగా ‘దిశ’నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ పేర హతమాచ్చారని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై ఐపీసీలోని 302 సెక్షన్ కింద హత్యానేరం కేసులు నమోదు చేయాలని హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. పీయూ సీఎల్–మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలీసులపై 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని ఇతర రాష్ట్రాల పోలీసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మా నియా విశ్వవిద్యాలయం రిటైర్డు ప్రొఫెసర్ రామశంకరనారాయణ మేల్కొటె, రిటైర్డు లెక్చరర్ ఎస్.జీవన్‌కుమార్ సంయుక్తంగా పిల్ దాఖలు చేశారు. దిశ ఘటన తర్వాత ఏర్పడిన భావోద్వేగాల నేపథ్యంలో తక్షణ న్యాయం పేరుతో పోలీసులు నలుగురు నిందితులను బూటకపు ఎన్కౌంటర్ చేశారని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో పోలీసులు వినియోగించిన ఆయుధాలపై బాలిస్టిక్ నిపుణులతో పరీక్షలు చేయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటో లు, ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులను భద్రం చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని పిల్లో కోరారు. అయితే ఇదే తరహాలో ఇప్పటికే దాఖలైన రెండు వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. మంగళవారం మరో మూడు వ్యాజ్యాలు దాఖలు కావడంతో మొత్తం ఐదు వ్యాజ్యాలను గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన పౌర హక్కుల నేతలు షాద్‌నగర్‌టౌన్: దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని, నిందితులు దిశను దహనం చేసిన చటాన్‌పల్లి బ్రిడ్జి కింది ప్రదేశాన్ని బుధవారం పౌర హక్కుల సంఘం నాయకులు పరిశీలించారు. ఎన్కౌంటర్ ఎలా జరిగింది, హంతకులను పోలీసులు ఎక్కడ ఎన్కౌంటర్ చేశారన్న విష యాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం సమీపానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దనే అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయ రహదారిపై నుంచే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూశారు. -
మున్సి‘పోల్స్’కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వ హణ విషయంలో నెలకొన్న న్యాయ పరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్ని కలకు అవసరమైన ముందస్తు ప్రక్రి యను ప్రభుత్వం చట్ట ప్రకారం చేయ లేదంటూ దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాల (పిల్స్)ను హైకోర్టు ధర్మాస నం మంగళవారం తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని 243–జెడ్ ప్రకారం ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు విని యోగించిన ఓటర్ల జాబితా ఆధారంగా మున్సిపల్ ఎన్నికలకు అవసర మైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన చేయొచ్చని తేల్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. తీర్పు వెలు వడిన వెంటనే అదనపు అడ్వొ కేట్ జనరల్ జె.రామచంద్రరావు కల్పించుకొని పలు మున్సిపాలిటీలకు సంబంధించిన కేసులు సింగిల్ జడ్జి వద్ద పెండిం గ్లో ఉన్నాయని, కొన్నింటిలో స్టే ఆదేశాలు వెలువడ్డా యని, వాటి విషయంలోనూ జోక్యం చేసుకొని ఎన్ని కల నిర్వహణకు వీలుగా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ వాటన్నింటినీ సింగిల్ జడ్జి వద్దే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. కేవలం ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేం.. ‘‘అసెంబ్లీకి వినియోగించిన ఓటర్ల జాబితా ఆధారంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించొచ్చని మున్సిపల్ చట్టంలోని సెక్షన్–11 స్పష్టం చేస్తోంది. జూలై 3న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు వెలువరించిన నోటిఫికేషన్‌ను పిటిషనర్లు సవాల్ చేయడం సరికాదు. సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల మేరకు వాటి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు వీల్లేదు. అందుకే పిల్స్‌ను కొట్టేస్తున్నాం. ఈ దశలో ఎన్నికలకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని ఆధారాలు లేకుండా పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి మున్సిపల్ ఎన్నికలపై వెలువరించిన తీర్పులో ఎన్నికలకు గరిష్టంగా అవసరమైన రోజులు ఉండాలనే అంశాన్ని మాత్రమే తెలిపింది. ఆ ప్రక్రియ పూర్తికి కనీస సమయం ఎంత ఉండాలో ఎక్కడా లేదు. ఈ విషయంలో సందేహాలు అవసరం లేదు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన చేయడం సులభం. ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా చేయడం మరింత సులభం. ఆ కేటగిరీల ఓటర్ల గణనలో తప్పులు జరిగాయని పిటిషనర్లు ఎలాంటి ఆధారాల్ని చూపలేకపోయారు. ఆరోపణల ఆధారంగానే కోర్టుకు వచ్చారు. ఓటరు గణన తప్పుగా జరిగిందంటూ ఒక్క ఓటరు కూడా కోర్టుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్లు చేసిన ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకోలేం. ఓటర్ల జాబితాలో లోపాలున్నాయనే ఆరోపణ సరికాదు. ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కావాల్సినంత సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది జూలై 3న ఓటర్ల జాబితా సిద్ధం కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేయడం చెల్లదు. రాజ్యాంగంలోని 243–జెడ్ ప్రకారం ఐదేళ్ల గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి’’అని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. స్టే ఉత్తర్వుల అడ్డంకి తొలగితేనే.. ఈ వ్యాజ్యాలపై విచారణ సమయంలో స్టే ఉత్తర్వులు జారీ చేయని ధర్మాసనం... వాదనలు ముగిసన ఈ నెల 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించరాదని మధ్యంతర ఆదేశాలిచ్చింది. పిల్స్‌పై ధర్మాసనం 27 రోజులపాటు విచారణ జరిపింది. తాజా తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఉన్న న్యాయపర అడ్డంకులు తొలగిపోయాయి. అయితే 75 మున్సిపాలిటీలపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వుల తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్తిస్తే గడువు ముగిసిన 121 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లతోపాటు ఇంకా గడువు ఉన్న పది కార్పొరేషన్లకు (హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ మినహా) ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమం అవుతుంది. -
కోడెల మృతిపై పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిల్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లో ప్రజాప్రయోజనం ఏముందని పిటిషనర్ అనిల్‌కుమార్‌ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు జరుగుతుండగా జోక్యం చేసుకోలేమని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోడెల కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకోవాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిల్ వేసిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న బంజారాహిల్స్‌లో తాను నివాసం ఉంటున్న ఇంట్లో కోడెల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఐటీ కంపెనీలపై సంచలన కేసు
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీల్లో టెక్కీల కష్టాలు, పని ఒత్తిడి తదితర అంశాలపై చాలా కథనాలు ఇప్పటివరకూ విన్నాం. చదివాం. అయితే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీలపై ఉద్యోగులు ఏకంగా కోర్టుకెక్కడం సంచలనం రేపుతోంది. యాక్సెంచర్, కాగ్నిజెంట్, కాస్పెక్స్ కార్పొరేషన్ కంపెనీలపై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఐటి ఉద్యోగులు కేసు నమోదు చేశారు. ఫోరమ్ ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్తల బృందంతో కలిసి వీరు తెలంగాణ పిల్ హైకోర్టులో దాఖలు చేశారు. భారతదేశ ఐటి పరిశ్రమ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. "ఉపాధి పేరిట రాష్ట్రంలో వైట్ కాలర్డ్ బానిసత్వం" అని టెక్కీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎక్కువ పని గంటలు, ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం, చెత్త లీవ్ విధానం లాంటి వివిధ ఆరోపణలతో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా ఐటీ సంస్థలను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులిచ్చింది. ఐటి ఉద్యోగుల జీవితాలను మెరుగుపర్చడానికి, సంస్థల పని సంబంధిత దోపిడీని నిలువరించడానికి ఈ పిల్ దాఖలు చేశామని ఫోరం ఎగైనెస్ట్ అవినీతి అధ్యక్షుడు విజయ్ గోపాల్ వెల్లడించారు. అదనపు వేతనం లేకుండా దాదాపు పది గంటల విధులు, కార్యాలయ క్యాబ్‌ల ద్వారా రోజువారీ ప్రయాణంలో 4-5 గంటలు గడపవల్సి రావడం, సెలవులను సమయానికి కేటాయించకపోవడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయన్నారు. చట్టం ఏమి చెబుతుంది? 2002 లో ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, హైదరాబాద్, ఇతర ఐటి హబ్‌లలో వర్తించే చట్టాలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నాయి. ఉద్యోగులను వారానికి 48 గంటలు/ లేదా రోజుకు 8 గంటలు పని ఓవర్ టైం వారానికి 6 గంటలు, సంవత్సరానికి 24 గంటలు మాత్రమే ప్రతి ఉద్యోగికి సంవత్సరంలో 15 రోజుల పెయిడ్ లీవ్, 12 రోజుల క్యాజువల్ లీవ్, 12 రోజుల సిక్ లీవ్ ఇవ్వాలి మరోవైపు రాష్ట్రంలో (అప్పటి ఆంధ్రప్రదేశ్) తమ కార్యాలయాలను స్థాపించడానికి మరిన్ని ఐటి సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్మిక చట్టాలను దాటవేయడానికి వీలు కల్పించింది. మొత్తం 6 విభాగాలను బైపాస్ చేయడానికి అనుమతించారు. వీటిలో ప్రారంభ, ముగింపు గంటలు, రోజువారీ, వారపు పని గంటలు, సెలవులతోపాటు ఉద్యోగం నుంచి తొలిగించిన సందర్భంలో ఉద్యోగిని రక్షించడానికి నిబంధనలున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమింటే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆయా కంపెనీలకు కేవలం 100 రూపాయల జరిమానా మాత్రమే ప్రభుత్వం విధించవచ్చు. ఈ చట్టాన్నిమరో రెండేళ్లపాటు పొడిగిస్తూ 2019లో తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
‘పిల్లకు న్యాయవ్యవస్థ రక్షణ’
న్యూఢిల్లీ: ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లు కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం కాకుండా న్యాయవ్యవస్థ వాటిని పరిరక్షిస్తోందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. కేసులను ఆలస్యం చేయడానికే కొందరు తరచూ వాయిదాలు కోరుతుంటారనీ, దీంతో పేద∙కక్షిదారులపై ‘న్యాయ పన్ను’ పడుతోందన్నారు. పిల్లను ప్రవేశపెట్టిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, దివంగత జస్టిస్ పీఎన్ భగవతిపై వచ్చిన ‘లా, జస్టిస్ అండ్ జ్యుడీషియల్ పవర్: జస్టిస్ పీఎన్ భగవతీస్ అప్రోచ్’ అనే ఓ సంకలనాన్ని కోవింద్ ఆవిష్కరించారు. -
డొల్ల కంపెనీలకు సర్కారు భూమి కేటాయింపుపై హైకోర్టులో పిల్
-
‘పేదల కోటా’పై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను వేసింది. తాజా బిల్లుతో కోటా పరిమితి 50 శాతం దాటిపోతుందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. 124వ రాజ్యాంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లును రద్దుచేయాలని, అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందని, రిజర్వేషన్లకు ఆర్థిక స్థోమత ఒక్కటే ప్రాతిపదిక కావొద్దని అన్నారు. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లను జనరల్ కేటగిరీకే పరిమితం చేయొద్దని, అదే సమయంలో కోటా పరిమితి 50 శాతం దాటిపోకూడదని అభిప్రాయపడ్డారు. తాజా సవరణలతో ఆర్థికపరంగా రిజర్వేషన్ల పరిధి నుంచి ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలను తొలగించడం ద్వారా జనరల్ కేటగిరీలోని పేదలకే లబ్ధిచేకూరుతుందని ఆరోపించారు. ఓబీసీలకు అందిస్తున్న 27 శాతం రిజర్వేషన్లను కూడా ఆర్థిక ప్రాతిపదిక కిందికి తీసుకురావాలని డిమాండ్ చేసింది. -
ఈబీసీ బిల్లుపై సుప్రీంలో పిల్
సాక్షి, న్యూఢిల్లీ : అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈబీసీ బిల్లును సవాల్ చేస్తూ గురువారం భారత అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రమాణాలే ఏకైక ఆధారం కాదని, పార్లమెంట్ ఆమోదించిన బిల్లును కొట్టివేయాలంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు న్యాయపరమైన అడ్డంకులు తప్పవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పిల్ దాఖలవడం విశేషం. (రాజ్యసభ ముందుకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన) ఇక దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌కు తలొగ్గుతూ అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈనెల 7న ఆమోదం తెలిపగా.. 8న లోక్‌సభ, 9న రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై ఉభయ సభల్లో వాడివేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. (అగ్రవర్ణ పేదలకు 10% కోటా) చదవండి: పేదల కోటాకు ‘పెద్దల’ ఆమోదం -
వైద్యారోగ్యశాఖలో అవినీతిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం
సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖలో భారీగా అవినీతి జరుగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో అవకతవకలపై ప్రజాధన పరిరక్షణ సమితికి చెందిన రామరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రూ.370 కోట్ల వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టు నిర్వహణ సంస్థ ఎంపికలో అక్రమాలు జరిగాయని, నకిలీ పత్రాలు సృష్టించి.. ధనుష్ సంస్థకు టెండర్ అప్పగించారని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, ధనుష్ సంస్థ, ఏపీఎంఎస్డీసీ తదితరులను వివరణ కోరింది. -
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నంపై దాఖలు అయిన అన్ని పిటిషన్లను సోమవారం విచారిస్తామని ధర్మానం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ఆజమాయిషీ లేని థర్డ్ పార్టీ చేత దర్యాప్తు జరిపించాలని పిటిషన్లో వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. సోమవారం కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మరోవైపు వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో హైకోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏపీ పోలీస్ పరిధి నుండి కేసును సీఐఎస్ఎఫ్కు బదిలీ చేసి, జాతీయ దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర హోంమంత్రిత్వ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ తూర్పు డివిజన్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్, వైజాగ్ పోలీసు కమిషనర్, విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌పై విచారణను కూడా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారా? లేదా?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన కేసును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఆడపిల్లలకు అమానుషంగా.. హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారా? లేదా? అనేదీ తేలుస్తామని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది. ‘ఒకవేళ మేం సుమోటోగా తీసుకోకుంటే.. ఈ కేసును పాతేరేసేవారేగా’అంటూ ప్రభుత్వం, పోలీసులపై మండిపడింది. ‘కేసు దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకోసం ఎందుకు ప్రయత్నించలేదు. దర్యాప్తు ఎలా చేయాలో కూడా మేమే చెప్పాలా?’అని పోలీసులను ధర్మాసనం నిలదీసింది. ఈ కేసుకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. చిన్నారుల్లో హార్మోన్ తాలుకు అవశేషాలను పరీక్షించాలని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ రాకేశ్ సహాయ్ను ఆదేశించింది. ఇతర మందులేమైనా చిన్నారులపై ప్రయోగించారా? అనే విషయాన్నీ తెలపాలంది. ప్రజ్వల, శిశు గృహకేంద్రాల్లో ఉన్న బాధిత చిన్నారులకు తగిన రక్షణ కల్పించాలని.. ఆసుపత్రులకు వచ్చినపుడు వీరి స్వేచ్ఛ, గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో పోలీసులు, వైద్యులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించింది. ఇకపై ‘యాదాద్రి’కేసును ప్రతి మంగళవారం విచారిస్తామని చెబుతూ.. కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది. షీటీమ్స్ అధికారి నేతృత్వంలో సిట్ ‘యాదాద్రి’అమానుష ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. మంగళవారం మరోసారి విచారణ జరిపింది. జిల్లా జడ్జీ నుంచి తాము తెప్పించుకున్న చిన్నారుల వివరాలను ప్రచురించడం గానీ, ప్రసారం చేయడం గానీ చేయరాదని మీడియాను ఆదేశించింది. దీంతోపాటుగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విధివిధానాలను రూపొందించి.. అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి ఘటనలకు సంబంధించి కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, బెయిల్ పొందిన నిందితులకు సంబంధించిన సమాచారం వివరాలను 24 గంటల్లో తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించింది. షీటీమ్స్ నుంచి ఓ బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటుచేస్తామన్న డీజీపీ ప్రతిపాదనకు ధర్మాసనం ఆమోదం తెలిపింది. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆదేశించింది. సశాస్త్రీయంగా తెలుసుకుంటాం! పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘ఆ చిన్నారులపై హార్మోన్ ఇంజక్షన్లు వాడినట్లు మాకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు’అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుని.. దీనిపై మీ దగ్గర శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది. హార్మోన్ ఇంజక్షన్లు వినియోగాన్ని తామే సశాస్త్రీయంగా తేల్చుకుంటామని స్పష్టం చేసింది. అసలు బాధితులకు ఏం వైద్య పరీక్షలు నిర్వహించారని ధర్మాసనం ప్రశ్నించగా.. బాధితులతో పాటు నిందితులకు కూడా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించామని శరత్ వెల్లడించారు. ‘డీఎన్ఏ టెస్ట్‌తో ఎంతవరకు ఉపయోగం? శాస్త్రీయ ఆధారాల కోసం దర్యాప్తు అధికారులు ప్రయత్నించారా? ఆ చిన్నారులతో లైంగిక చర్యల్లో పాల్గొన్న వ్యక్తుల వీర్యాన్ని సేకరించారా? ఎండోక్రైనాలజీ వైద్యుల చేత హార్మోన్ల పరీక్ష చేయించారా? బాధిత చిన్నారుల రక్తంలో హా ర్మోన్ల అవశేషాయాలు ఉన్నాయో లేదో తెలుసుకున్నారా? ఎందుకు ఈ శాస్త్రీయ ఆధారాల కోసం ప్రయత్నించడం లేదు. దర్యాప్తు ఎలా చేయాలో కూడా మేమే చెప్పాలా?’అంటూ నిలదీసింది. తర్వాత శరత్ తన వాదనలను కొనసాగిస్తూ.. చిన్నారుల విషయంలో వ్యభిచార గృహ నిర్వాహకులు చాలా తెలివిగా వ్యవహరించారన్నారు. ఆ చిన్నారుల పేర్ల మీద ఆధార్ కార్డులు తీసుకుని, వారిని తమ పిల్లలుగా, సమీప బంధువుల పిల్లలుగా చెప్పుకుంటూ వచ్చారని, దీంతో నిర్వాహకుల తీరుపై ఇరుగుపొరుగు వారికి అనుమానం రాలేదన్నారు. పిల్‌గా తీసుకోకుంటే.. పాతరేసేవారే! ఈ కేసులో ఎంత మందికి బెయిల్ వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. వైద్యుడికి మాత్రమే బెయిల్ వచ్చిందని, దీన్ని రద్దుచేయించేందుకు చర్యలు తీసుకుంటామని శరత్ చెప్పారు. దీనిపై కోర్టు మండిపడుతూ.. ‘బెయిల్ రాకుండా చేయడం వేరు. దీన్ని రద్దు చేయించడం వేరు. బెయిల్ ఇస్తుంటే సంబంధిత కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తున్నారు? అసలు ఆ వైద్యుడి బెయిల్‌ను ఆ పీపీ వ్యతిరేకించారా? పీపీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని ఉండకపోతే.. పరిస్థితేంటి? చక్కగా ఈ కేసును పాతర వేసేవారు. అంతేకదా?’అంటూ గట్టిగా నిలదీసింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న చిన్నారుల్లో కొందరు ప్రజ్వల, శిశుగృహ సంస్థల సంరక్షణలో ఉన్నారని, ఈ కేసులో తాము కూడా ప్రతివాదులుగా చేరి కోర్టుకు సహాయకారిగా ఉండాలనుకుంటున్నామని సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ చెప్పారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఆసుపత్రుల్లో అనుమతి లేకుండా ఎవరూ ఆ చిన్నారులను కలిసేందుకు వీల్లేదని.. వారి రక్షణ, గోప్యత విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలంటూ పోలీసులకు పలు సూచనలుచేసింది. పరిహారంతో పరిస్థితులు మారవని.. సమాజంలో అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చాలని పేర్కొంది. -
అసెంబ్లీ రద్దుపై పిటిషన్: హైకోర్టులో వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపరచకుండా, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది నీరుప్‌రెడ్డి వాదించారు. శాసనసభను సమావేశపరచకుండా అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ముందస్తు రద్దును సవాల్ చేస్తూ భారీగా పిటిషన్స్ దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ దాదాపు 200 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. కాగా తెలంగాణ ఓటర్ల జాబితా సవరణపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ కొనసాగింది. ఈ పిటిషన్‌పై ఈసీ కౌంటర్ దాఖలు చేయగా, దీనిపై వాదనలు వినిపించేందుకు తమకు గడువు ఇవ్వాలని పిటిషనర్ కోరగా విచారణను కోర్టు వాయిదా వేసింది. 10న విచారణ అసెంబ్లీ రద్దు పై కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కొమ్మి రెడ్డి రాములు సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీం ఆదేశాలతో హైకోర్టు లంచ్ మోషన్ పిటీషన్ గా స్వీకరించి బుధవారం విచారణను చేపట్టనుంది.70 లక్షల ఓట్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయని పిటిషనర్లు ఆరోపించారు. కాగా అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లు అన్నింటిపై బుధవారం హైకోర్టు విచారిస్తుంది. -
హడావుడి ఎన్నికలు వద్దు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్ద యిన నేపథ్యంలో హడావుడిగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సం ఘాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు విడిగా నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సం ఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఐదేళ్ల కాల పరి మితి ముగియక ముందే అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించడం రాజ్యాంగ విరుద్ధమని, ముందస్తు ఎన్నికల దిశగా ఎటు వంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని వ్యాజ్యంలో పే ర్కొన్నారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది. ‘నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగాలి. ఆ మేరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2019లో జరగాల్సి ఉంది. ప్రజలు ఐదేళ్ల పాటు పదవీ కాలంలో ఉండేందుకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నా రు. మంత్రిమండలికి శాసనసభను రద్దు చేసే అధికారం ఉంది. త్వరలోనే పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీకి విడిగా నిర్వహించడం సరి కాదు. దీంతో కోట్ల మేర ప్రజాధనం వృథా అవుతుంది. ముందస్తు వల్ల సంక్షేమ, అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఓటరుగా ‘ముందస్తు’కు వెళ్లాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు ఎన్నికలు నిర్వహిం చాలని మంత్రిమండలి కోరుకుంటోంది. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపే అవకాశం లేకపోలేదు. అసలు ఓటర్ల జాబితా ఖరారు కాకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. రాజకీయ లబ్ధి పొందేందుకు ఓ వ్యూహం ప్రకారమే శాసనసభ రద్దుకు మంత్రి మండలి సిఫారసు చేసింది. ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సహేతుకమైన కారణం ఏదీ లేదు. కాబట్టి ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది..’అని పిటిషనర్ వాజ్యంలో పేర్కొన్నారు. -
రాఫెల్ వివాదం : వచ్చే వారం సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం నిలిపివేతను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై స్టే విధించాలని కోరుతూ న్యాయమూర్తి ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ అంగీకరించింది. రాఫెల్ డీల్‌లో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూరేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో దేశ ప్రజలకు తెలియచెప్పేందుకు రాఫెల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోదీ తన క్రోనీ క్యాపిటలిస్ట్ స్నేహితుల కోసం భారీ అవినీతికి ఊతమిస్తున్నారని ఆరోపించారు. -
పనికిమాలిన పిల్: కోర్టు వినూత్న జరిమానా
సాక్షి, బెంగళూరు: కర్నాటక హైకోర్టు వినూత్న తీర్పునిచ్చింది. టెర్రరిస్తుల దాడిపై తాను చేసిన హెచ్చరికను పట్టించుకోలేదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినకోర్టు పిటిషనరుకు జరిమానా విధించింది. శివమోగ జిల్లా తుడూర్ గ్రామానికి చెందిన హరీశ్చంద్ర గౌడ అనే పిటిషన్‌దారు నవంబరు 26, 2008 ముంబై ఉగ్రదాడిపై తాను అందించిన సమాచారాన్ని పట్టించుకోలేదంటూ పిటిషన్దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పనికిమాలిన పిల్‌గా బెంచ్ కొట్టిపారేసింది. రూ.5వేలను కొడగు వరద బాధితులకు అందించాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. 30రోజులలోపు ముఖ్యమంత్రి సహాయనిధి ఈ సొమ్మును డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన మెమోను కూడా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. అలాగే ఇకపై ఇలాంటి వ్యర్థమైన పిటిషన్లు దాఖలు చేయవద్దని, నిజమైన సమస్యలపై స్పందించాలని కోరారు. కాగా నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినవాడిననీ, 42 సంవత్సరాలు పాటు ఏఐసీసీలో కొనసాగినట్టు గౌడ చెప్పుకున్నారు. 2005లో కూడా తాను అధికారులను హెచ్చరించానని అయినా అధికారులు పటక్టించుకోలేదని వాదించారు.ఈ నేపథ్యంలో 2010జూన్‌లోఅప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు లేఖ రాయగా ఆమె మహారాష్ట్ర మంత్రిత్వశాఖకు రాశారని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎలాంటి చర్యతీసుకోలేదని గౌడ వాదించారు. -
నీట్ 2018 : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ)ను ఆదేశించింది. ఈ మేరకు నీట్ 2018 ర్యాంకు లిస్టును రెండు వారాల్లోగా పునః పరిశీలించాలని పేర్కొంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్సీ తీరును తప్పు పట్టింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ పెండింగ్‌లో ఉండగానే ర్యాంకు లిస్టు ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరంకుశంగా వ్యవహరించారు.. తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లలేదని సీబీఎస్సీ ఏ ప్రాతిపదికన చెబుతుందో వివరించాలని కోర్టు ఆదేశించింది. మెజారిటీ ప్రజలు సమర్థించినంత మాత్రాన తప్పులు ఒప్పులై పోవు కదా అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. పిల్ విచారణ కొనసాగుతుండగానే ర్యాంకు లిస్టు విడుదల చేయడం ద్వారా సీబీఎస్సీ నిరంకుశంగా వ్యవహరించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనువాద తప్పిదాల వల్ల విద్యార్థులు మార్కులు కోల్పోయారన్న వాదనను సీబీఎస్సీ తేలికగా తీసుకోవడం బాధ్యత రాహిత్యమేనని మండిపడింది. సైన్సు విభాగంలో ఆంగ్ల పదాలతో సరిపోయే తమిళ పదాలను రూపొందించడానికి ఎటువంటి ప్రమాణాలు పాటించిందో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఎస్సీని ఆదేశించింది. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
‘మెజారిటీ బీసీలకు న్యాయం చేయండి’
సాక్షి, హైదరాబాద్: బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించనిదే పంచాయతీ ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అమలు చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంబీసీ రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరణ చేపట్టకపోవడంతో మెజారిటీ బీసీ కులాలకు రాజకీయ పదవుల్లో అవకాశాలు రావడం లేదని పిటిషన్లో ఆశయ్య పేర్కొన్నారు. పిల్‌ను స్వీకరించిన హైకోర్టు రెండు వారాల్లో.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
రైతుబంధు సాయం లేఖపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపో తోందని, అర్హులకే ఆర్థిక సాయం అందచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది పి.యాదగిరిరెడ్డి రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 17కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు రూ.4 వేల సాయాన్ని రైతులందరికీ ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, అందువల్ల చిన్న, సన్నకారు రైతులకే ఆర్థిక సాయం అందించేలా చూడాలంటూ యాదగిరి రెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. -
‘రైతుబంధు’ పై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతుబంధు పథకంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతుబంధు పధకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సాయం వల్ల సామాన్యుల కంటే భూస్వాములకే మేలు జరుగుతోందని నల్లగొండ జిల్లాకు చెందిన యాదగిరి రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. పథకంలో చాలా మార్పులు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 10 కి కోర్టు వాయిదా వేసింది. -
రైతు బంధు పథకంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఓ వ్యక్తి రాసిన లేఖని హైదరాబాద్ హైకోర్టు పిల్‌గా స్వీకరించి, విచారణ చేపట్టింది. రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగాయంటూ నల్గొండ జిల్లాకు చెందిన యాదగిరి రెడ్డి హైకోర్టుకు ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకం ద్వారా సామాన్యుల కన్నా భూస్వాములకే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతు బంధు పథకంలో మార్పులు చేయాలని కోరారు. కాగా, ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు జూలై 10వ తేదీకి వాయిదా వేసింది. -
ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ అక్రమాలపై పిల్
హైదరాబాద్ : ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ అక్రమాలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇచ్చిన నివేదికపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది. జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రూ.2 కోట్ల11 లక్షల అవకతవకలు జరిగాయని కాగ్ తేల్చింది. ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణం చేపట్టకుండానే నిర్మించినట్టు తప్పుడు లెక్కలు చూయించారని పిటిషన్ పేర్కొన్నారు. లైబ్రరీలో విద్యార్థులు డిపాజిట్ చేసిన రూ.30 లక్షలు కూడా యాజమాన్యం, విద్యార్థులకు వెనక్కి తిరిగి ఇవ్వలేదు. కోర్సులు లేకున్నా అధ్యాపకులను నియమించినట్టు చూపించి లక్షల్లో జీతాలు తీసుకున్నట్టు యాజమాన్యం లెక్కలు చూపించింది. అలాగే ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడాన్ని పిటిషనర్ తప్పుపట్టారు. ఈ అక్రమాలపై హైకోర్టులో శంకర్ అనే విద్యార్థి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఐదుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్, సెక్రెటరీలకు, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులకు, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ అకౌంట్ జనరల్ అధికారులకు నోటీసులు పంపారు. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపట్టాలని కేసును హైకోర్టు వాయిదా వేసింది. -
‘పిల్’ అంటే ఎందుకు గుబులు?
సుప్రీం ప్రధాన న్యాయమూర్తులూ, న్యాయమూర్తులూ పెక్కు సందర్భాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా వ్యవస్థలను రక్షించిన ఉదాహరణలను కూడా మరచి, తాజాగా పిల్స్‌ను వ్యతిరేకించే, తిరస్కరించే ధోరణి కూడా న్యాయవ్యవస్థా చట్రంలో పాగా వేస్తోంది. ఇంతకుముందు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఠాకూర్ కూడా అమరావతి రైతాంగం తరఫున న్యాయం చేయాలని అర్థిస్తూ ఈ వ్యాసకర్త మరి ఇరువురు పాత్రికేయ మిత్రులూ వేసిన ‘పిల్’ను చూడకుండానే ఒక్క సెకనులో తోసిపుచ్చారు. ‘మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే వ్యక్తి ఎంత నీతిమంతుడైనా ఒక సామాన్య మనిషిగా ఆయనకూ బలహీనతలు ఉంటాయి. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఎంత సత్యసంధుడనుకున్నా, ముక్కుసూటి మనిషనుకున్నా ఆయనకు సంపూర్ణాధికారాలను మాత్రం కట్టబెట్టకూడదు.’ – డా. బీఆర్ అంబేడ్కర్ (రాజ్యాంగ రూపకల్పన సందర్భంగా) ‘ప్రధాన న్యాయమూర్తి సహ న్యాయమూర్తులకు ధర్మాసనాలను కేటాయించే విషయంలో దాదాపు అంబేడ్కర్ భావనే ఇంగ్లండ్‌లో కూడా వ్యక్తమ యింది. అయితే కేసులు కేటాయించిన న్యాయమూర్తుల పట్టికకు ప్రధాన న్యాయమూర్తిని సారథిగా (మాస్టర్ ఆఫ్ రోస్టర్) ప్రకటించే సంప్రదాయం ఉంది. కానీ ఆ సంప్రదాయం వెర్రితలలు వేసి క్రమంగా అది ఇంగ్లండ్ ప్రజలు తలపెట్టిన రాజకీయ మహోద్యమాలనే శాసించే న్యాయమూర్తులు పాక్షిక ధర్మాసనాలను ఏర్పాటు చేసుకునే సంప్రదాయానికి లార్డ్ చాన్స్లర్లు తెరలేపారు. ప్రధాన న్యాయమూర్తిని విశ్వసించాలన్న సూత్రం సాంఘిక ధర్మమైనా ఆ విశ్వాసం శాశ్వత సంపూర్ణ ధర్మంగా నిలవగలదని నమ్మలేం. సంప్రదాయం అనే మత్తులో పడే న్యాయవాద సోదరులందరికీ ఇంగ్లండ్ అనుభవం ఒక ఉదాహరణ. తాత్కాలికంగా న్యాయమూర్తుల మధ్య ఆంతరంగిక సర్దుబాట్లు/ పరిష్కారం కుదిరినట్టు కన్పించినా భారత న్యాయవ్యవస్థలో అంతటా సవ్యం గానే ఉందని ప్రపంచానికి చెప్పాలనుకున్నా–మహా అయితే అదంతా అతుకుల బొంత ‘పట్టీ’గానే మిగిలిపోతుంది. ఇంతకూ ఇప్పుడు జరగవలసిన అసలు చికిత్స–బహిరంగ చర్చ ద్వారా పార్లమెంట్ ప్రత్యేకమైన సుప్రీంకోర్టు చట్టాన్ని ఆమోదించడం. ఈ బహిరంగ చర్చలో సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న పౌర సమాజం, న్యాయవ్యవస్థ న్యాయవాద సంఘాలు, విభిన్న రాజకీయాభిప్రాయాలు గలవారు అంతా పాల్గొనాలి.’ – ప్రొ. అర్ఘ్యసేన్గుప్తా, 18–1–18 (సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్) న్యాయవ్యవస్థకూ, ప్రభుత్వ పక్షంగా పాలకవర్గాలకూ మధ్య కొన్ని మాసాలుగా, ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లుగా ఏదో ఒక సంఘర్షణ తలెత్తడం కనిపిస్తూనే ఉంది. ఆయా సందర్భాలలో ప్రజా సమస్యల మీద, ప్రాథమిక హక్కుల రక్షణలో ప్రభుత్వాలు పక్కదారులు తొక్కినప్పటికీ న్యాయవ్యవస్థ ప్రజలకు అండదండలనిచ్చిన ఉదాహరణలు కూడా తక్కువేమీ కాదు. అందులో ఒకటి అత్యవసర పరిస్థితిలో సాధించిన విజయం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా తన పదవీ రక్షణ కోసం ఎమర్జెన్సీ విధించారు. బీజేపీ వారు సమయం వచ్చినప్పుడల్లా నాటి అత్యవసర పరిస్థితి ప్రకటన మీద విరుచుకుపడుతూనే ఉంటారు. కానీ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అదే రాజ్యాంగం పేరిట అనుసరిస్తున్న విధానాలు కూడా కాంగ్రెస్ పోకడలనే గుర్తు చేస్తూ, ప్రజాకంటకంగా మారిపోతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పాలకులు చేసిందీ, ఇప్పుడు బీజేపీ–ఎన్డీఏ పాలకులు కూడా చేస్తున్నదీ ఒక్కటే– రాజ్యాంగ నిబంధనలను, ఆదేశాలను, సెక్యులర్ వ్యవస్థా నిర్దేశాలను ప్రజాహితంగా అమలు చేయడంలో దారుణంగా విఫలం కావడం. పెడధోరణులు నిజం కార్య నిర్వాహక అధికారాల పేరిట న్యాయవ్యవస్థ నిర్వహణలో నేరుగానో, నర్మగర్భంగానో బీజేపీ పాలకులు జోక్యం చేసుకునే స్థితికి చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి సుప్రీంకోర్టు, ధర్మాసనాలు, ప్రధాన న్యాయమూర్తి, కొందరు న్యాయమూర్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిళ్లకు లోనవుతున్నట్టు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొన్ని కేసుల విచారణ, కొన్ని ధర్మాసనాలు, వాటికి కొన్ని కేసుల కేటాయింపు తీరుతెన్నులు ప్రజాక్షేత్రంలో చాకిరేవుకు అవకాశం కల్పించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో అనుసరిస్తున్న ‘పాక్షిక ధోరణి’ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జస్టిస్ చలమేశ్వర్, మరో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహిం చడం సంచలనం కలిగించింది. ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాన్ని ఆ నలుగురు కూడా కాదనలేదు. కానీ ఆ కేటాయింపులు న్యాయ వ్యవస్థ నిర్వహణ యంత్రాంగం కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తికి సరి సమానులైన తోటి సీనియర్ న్యాయమూర్తులను కూడా సంప్రదించాలని, తద్వారా కేసుల కేటాయింపు జరగాలని ఆ నలుగురు ఆకాంక్షించారు. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ నలుగురు ఒక విశిష్టమైన, విజ్ఞానదాయకమైన ప్రకటన జారీ చేశారు: ‘దేశం రుణం తీర్చుకోవడానికే మేం నలుగురు న్యాయమూర్తులం పత్రికా గోష్టిని ఏర్పాటు చేశాం. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ లోయా మరణానికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఏ ధర్మాసనానికి బదలాయించాలన్న విషయం గురించి తలెత్తిన సమస్యే మేం పత్రికా గోష్టిని ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న కారణం’ (13–1–18). నేతలనుబట్టి మారుతున్న న్యాయం సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో బీజేపీ నేత అమిత్ షాకు ప్రమేయం ఉందన్న ఆరోపణే ఈ కేసు నాలుగేళ్లు నానడానికి అసలు కారణమన్న మాట ఉంది. అమిత్ షా నిర్దోషి అని కింది కోర్టు ప్రకటించినప్పటికీ, జస్టిస్ లోయా హఠాన్మరణం పూర్వరంగంలో ఈ కేసును తిరగదోడాలని బొంబాయి న్యాయవాదుల సంఘంలో మెజారిటీ సభ్యులు, ఒక పత్రికా రచయిత, ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి కొట్టివేశారు. ఇది అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామం గురించి పిటిషనర్ల తరఫున వాదించిన సుప్రీం కోర్టు న్యాయవాదులు దుష్యంత దావే, ఇందిరా జైసింగ్ ఇలా ప్రకటించారు: ‘లోయా మృతి కేసును పునర్విచారించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించడానికి చెప్పే కారణాల్లో తీవ్రమైన వైరుధ్యాలున్నాయి. జస్టిస్ లోయా మరణం విషయంలో స్వతంత్ర విచారణ జరక్కుండా నిరోధించడంలో ఆసక్తి ఉన్న ఒకే ఒక వ్యక్తి మరెవరో కాదు, మీ కక్షిదారుడేనని, అతనే అమిత్‌షా అనీ దావే, అమిత్‌షా తరఫున వకాల్తా వహించిన సుప్రీం లాయర్ సాల్వేకు చెప్పారు’ (‘ఫ్రంట్‌లైన్’: హిందూ గ్రూపు, 16.2.18). ఇదొక్క కేసే కాదు, యూపీ, ఒరిస్సాలలోని మెడికల్ కాలేజీ వ్యవహారాల్లో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్న రిటైర్డ్ జడ్జి విషయంలో విచారణ జరపడానికి ప్రధాన న్యాయమూర్తి తాత్సారం చేశారని కూడా నలుగురు న్యాయమూర్తులూ అభియోగం మోపడంతో వ్యవస్థ పరువు బజారున పడినట్టయింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యమనేది ‘అత్యంత అభ్యుదయకర ధర్మాసన చైతన్య శక్తి’గా వర్ణిస్తూ, ఈ ‘పిల్’ సుప్రీంకోర్టు రూపురేఖలనే మార్చి, ప్రజల న్యాయస్థానంగా మారుస్తుందని ఆశించినవారు జస్టిస్ జీబీ రెడ్డి. జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ‘నా న్యాయ చట్టం మనిషి జీవితానికి విరుద్ధంగా నడిచే పక్షంలో ఆ చట్టాన్ని తుంగలో తొక్కేయడం మంచిది కాని, దాన్ని సవాలు చేయడం కాదు’ అన్నారు. అంతేగాదు, సుప్రీం ప్రధాన న్యాయమూర్తులూ, న్యాయమూర్తులూ పెక్కు సందర్భాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా వ్యవస్థలను రక్షించిన ఉదాహరణలను కూడా మరచి, తాజాగా పిల్స్‌ను వ్యతిరేకించే, తిరస్కరించే ధోరణి కూడా న్యాయవ్యవస్థా చట్రంలో పాగా వేస్తోంది. ఇంతకుముందు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఠాకూర్ కూడా అమరావతి రైతాంగం తరఫున న్యాయం చేయాలని అర్థిస్తూ ఈ వ్యాసకర్త మరి ఇరువురు పాత్రికేయ మిత్రులూ వేసిన ‘పిల్’ను చూడకుండానే ఒక్క సెకనులో తోసిపుచ్చారు (దాని వెనుక ఒక ముఖ్యమంత్రి, ఒక న్యాయమూర్తి నడిపిన కథ కూడా బట్టబయలయింది). పిల్ అంటే ఎందుకు ఆగ్రహం? తాజా పరిణామం అంత కంటే దారుణం – ఉన్నావ్‌లో జరిగిన బాలిక అత్యాచారం కేసులో న్యాయం జరగాలని కోరుతూ అడ్వకేట్ ఎం.ఎల్. శర్మ సుప్రీంలో ‘పిల్’ దాఖలు చేశారు. ‘లైంగిక వేధింపులకు గురైన బాలిక తరఫు బంధువు నీకెవరైనా ఉన్నారా? నీవు బాధితుడివి కాదు కదా! రేప్ కేసులకు నీకు సంబంధం ఏమిటి?’ అని ధర్మాసనమే ప్రశ్నించింది. ఇది సబబా? ఇంతకూ అసలు రహస్యం– ఒక బీజేపీ లెజిస్లేటర్ ఈ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. బీజేపీ నాయకుడి కేసులో అనుకూల తీర్పు చెబితే రూ. 100 కోట్ల నజరానా ఇస్తారని బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహిత్ షా జస్టిస్ లోయాకు ఆశ చూపినట్టు ఒక ఆరోపణ ఉంది. తమ సోదరుడు జస్టిస్ లోయాయే తమకు ఈ సంగతి చెప్పాడని ఆయన తోబుట్టువులు అనూరాధ బియాని, సరితా మంధానీ చెప్పారు. ఇది నిజమా? అబద్ధమా? ఏది ఏమైనా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లోయా కేసుకు ‘భరత వాక్యం’ పలకడంతో కథ కంచికి వెళ్లినట్లేనా? వెళ్లినా గానీ పార్లమెంటులోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి అనేక ఆరోపణలు సంధించి ప్రధాన న్యాయమూర్తిపైన చరిత్రలో తొలిసారిగా అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే దాని పర్యవసానం ఏమిటి? మిరాజ్కర్ కేసులో ఒకసారి సుప్రీంకోర్టు గొప్ప వ్యాఖ్యానం చేసింది: ‘రహస్యమనే కారు చీకటిలో, దుష్ట ప్రయోజనాలతో అడుగడుగునా దుర్మార్గపు ఆలోచనలు కళ్లాలు లేని గుర్రాలుగా స్వైర విహారం సాగిస్తాయి’. సరిగ్గా ఇలాంటి అంధకారంలోనే నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు పత్రికా గోష్టి నిర్వహించి వెలుతురును ప్రసాదించారు. ‘ఈ వెలుగును ఆర్పేసి, అంతర్గతంగా తమ మధ్య సర్దుబాట్లు చేసుకుంటూ సమస్యను తమలో తాము సర్దుకోవడం అంటే తలెత్తిన తీవ్రమైన మౌలిక సమస్య కోరుకుంటున్న శాశ్వత పరిష్కారానికి విరుద్ధమని గమనించాల’ని ఒక లీగల్ పండితుడు గొంతు విప్పాడు. సీనియర్ న్యాయమూర్తి చలమేశ్వర్ మిగతా ముగ్గురు న్యాయమూర్తుల తరఫున దేశాన్ని, జాతిని ఉద్దేశించి విడుదల చేసిన (12.1.18) అపూర్వ సందేశం నిరాడంబరతకు, నికార్సయిన దేశభక్తికి అరమరికలు లేని నిండు మనస్సుకు ఉద్దీపన శక్తిగా భావిం చాలి: ‘నేటినుంచి ఇరవైయ్యేళ్ల తరువాత న్యాయమూర్తులమైన మమ్మల్ని – జస్టిసెస్ చలమేశ్వర్ రంజన్ గోగోయి/లోకూర్/కురియన్–తమ ఆత్మల్ని అమ్మేసుకుని, అత్యంత కీర్తిగన్న సుప్రీం సంస్థ ప్రయోజనాల్ని గాలికి వదిలేసి పోయారని ఏ జ్ఞాని, విజ్ఞానీ భావించకుండా ఉండేందుకే ఇప్పుడే ఈ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాం’. ఈ పరిణామాల దృష్ట్యానే ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షా సుప్రీం ప్రధాన న్యాయమూర్తుల పదవుల్ని కూడా ప్రజాస్వామీకరించాలని, ఒక వ్యక్తి వద్దనే అధికారాలు కేంద్రీకృతమై ఉండరాదని ఇది కేసుల బదలాయింపులో, న్యాయమూర్తులకు కేటాయించే ధర్మాసనాల విషయంలో (రోస్టర్స్) చాలా అవసరమని చెప్పారు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రైవేటు బ్యాంకులో వెయ్యికోట్లు.. టీటీడీపై పిల్
సాక్షి, హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆదాయంలోని రూ. వెయ్యి కోట్లను ప్రవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలైంది. ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన శ్రీవారి ఆదాయాన్ని ఇలా ప్రవేటు బ్యాంకులో డిపాజిట్ చేయడాన్ని తప్పుబడుతూ వెంకన్న భక్తుడు నవీన్‌కుమార్ రెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, టీటీడీ కార్యనిర్వహణాధికారి, ఇందుసిండ్ బ్యాంకులను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. -
న్యాయవ్యవస్థకు రక్షణ ఏది?
మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పుడు వినియోగిస్తున్న నీటి మీద ఆంక్షలు విధించాలంటూ ఇంతకు ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. క్రీడా మైదానాన్ని తడపకుండా రైతు రక్షణ కోసం మిగిల్చిన ఆ నీటి విలువ సంగతి పక్కన పెడదాం. అయితే ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులు ఉండగా క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పు చెప్పడానికి సమయం కేటాయించడం నిజంగా సమర్థించదగ్గదేనా? వివాహాల వైఫల్యమే ఇతివృత్తంగా బాసు భట్టాచార్య మూడు వరస సిని మాలు నిర్మించారు. వాటిలో 1971 నాటి ‘అనుభవ్’ ఒకటి. ఈ చిత్రంలో పని తప్ప మరొక ధ్యాస లేని ఒక పత్రికా సంపాదకుడి పాత్రలో సంజీవ్‌కుమార్, ఎప్పుడూ ఏకాంతంగా గడిపే అతడి భార్యగా తనూజ నటించారు. రెండు న్నర గంటలు పాటు సాగే చిత్రంలో చివర దినేష్ ఠాకూర్ (మరొక పాత్రలో కనిపించిన నటుడు) ముక్కోణపు ఉత్కంఠను రేపుతాడు. అప్పుడే ఆ జంట మధ్య ఈ సంభాషణ చోటు చేసుకుంటుంది. ‘ఎవరెవరివో సమస్యలు తీసు కుని వాటి మీద మీరు నిత్యం ఒక సంపాదకీయం రాస్తారు. మీరు మన కోసం కూడా ఒక సంపాదకీయం రాయండి!’ అంటూ తనూజ (21వ శతా బ్దంలో ప్రేక్షకులకు బాగా దగ్గరయిన కాజోల్ తల్లి) సంజీవ్‌కుమార్‌ను అడుగుతుంది. ఇలాంటి దృశ్యంలో ప్రతిభామూర్తులైన మీ సుప్రీం కోర్టు న్యాయమూర్తు లను ఒకసారి ఊహించుకోండి. ఈవారంలో వారు అరుదైన స్పష్టతతో, ఎలాంటి శబ్దాలంకారాలు లేని రీతిలో ఒక తీర్పు ఇచ్చారు. నాగ్‌పూర్‌లో సంభ వించిన జస్టిస్ బీహెచ్ లోయా మరణం వివాదంపై స్వతంత్ర దర్యాప్తు జరి పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ డీవై చంద్రచూడ్ పిటిషనర్లను తీవ్ర స్థాయిలో హెచ్చరిం చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదిని కూడా వదిలిపెట్టలేదు. చిన్న ఆధారం కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారని తీర్పులో పేర్కొన్నారు. ఆ విధంగా మొత్తం న్యాయ వ్యవస్థ మౌలికతనే తక్కువ చేసి చూపుతున్నారని కూడా చెప్పారు. పిటిషన్లను తిరస్కరించడంతో పాటు, న్యాయ వ్యవస్థను న్యాయ వాదుల నుంచి, ఉద్యమకారుల నుంచి, మీడియా నుంచి రక్షించుకోవలసి వస్తున్నదంటూ ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఇది ఎలా ఉందంటే, ప్రతివారు న్యాయమూర్తుల మీద పడి వేధిస్తున్నట్టు, ఈ పరిస్థితి నుంచి కాపాడుకోవడా నికి వారు పోరాడుతున్నట్టు ఉంది. కాబట్టి ‘అనుభవ్’ సినిమాలో తనూజ అడిగిన ప్రశ్ననే న్యాయమూర్తులను అడగవచ్చునా? ‘ న్యాయ వ్యవస్థను ఇత రుల నుంచి రక్షించడానికి మీరు ఎప్పుడూ తీర్పులు వెలువరిస్తూ ఉంటారు. అలాగే న్యాయమూర్తుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవడం ఎలా అనే అంశం మీద కూడా మీరు ఒక తీర్పును రాయగలరా?’ ఈ వాదనను తయారు చేయడంలో నేను అవసరానికి మించిన జాగ్రత్త చూపిస్తున్నానేమో! అలా ఉండడమే మంచిది. ఎందుకంటే జస్టిస్ లోయా కేసులో పిటిషనర్ల మీద, న్యాయవాదుల మీద నేర ధిక్కారం ఆరోపించ కుండా తాము విశాల హృదయంతో వ్యవహరించామని న్యాయమూర్తులు చెప్పారు. అంతటి ఔదార్యం ఒక మామూలు సంపాదకుడి విషయంలో చూపించకపోవచ్చు. అయినప్పటికి వాస్తవాలు చెప్పాలి. అవి చర్చకు రావాలి. అయితే తీర్పులోని మంచి విషయాలను చర్చించడానికి ఇది సమ యం కాదు. ఇందులో మంచి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు వెలువరించే చాలా ఆదేశాల వలె కాకుండా ఇందులో క్లుప్తత కూడా చక్కగా ఉంది. వేర్వేరు శిబిరాలుగా విడిపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మీరు వివరించదలిచినది ఏదైనా అది మీ రాజకీయ పంథా, సైద్ధాంతికతల పునాది ఆధారంగానే ఉంటుంది. జర్నలిస్ట్ బర్ఖా దత్ మీడియా వారి సంకట స్థితిని చాలా కటువుగా వర్ణించారు. మీడియాను రెండు ధ్రువాలుగా– ఒకరు చెంచాలు (అస్మదీ యులు), మరొకరు మోర్చాలు (ఉద్యమకారుల బృందాలు) అని పేర్కొ న్నారు. ఇలా మాట్లాడడం ప్రమాదకరం. ఎందుకంటే తరువాత మీరు రెండు ధ్రువాలని నిందించాలి. ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థ కూడా ఇలా ధ్రువా లుగా చీలిపోయిన సూచనలు కనిపిస్తున్న తరుణంలో అది మరింత ఇబ్బంది పెట్టే విషయం. న్యాయ వ్యవస్థకు అదే నిజమైన ముప్పు. తన నుంచి తనకు ఉన్న ముప్పు. నిజానికి దాని గురించే న్యాయమూర్తులు ఆగ్రహం ప్రకటిం చాలి. ఆ కారణంగానే న్యాయ వ్యవస్థ తనను తాను న్యాయమూర్తుల నుంచి రక్షించుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ వ్యక్తిగత ప్రతినాయకులు ఎవరూ లేరు. బయటి నుంచి వచ్చినదని భావించిన వైరస్‌ను వదిలించుకోవాలనుకు న్నప్పుడు వ్యవస్థ దానికదే స్వీయ రక్షణలో పడిపోతోంది. శరీరం తనని తాను తినడం ఎప్పుడు మొదలు పెడుతుందో మీకు తెలుసా? ఈ పిల్ మీద తీర్పులో మీరు అనివార్యంగా అంగీకరించ వలసిన కొన్ని అంశాలు ఉన్నాయి.మొదటి అంశం– ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్విని యోగమవుతున్నాయి. రాజకీయ, వ్యక్తిగత, సైద్ధాంతిక పోరాటాలను కోర్టు లకు తీసుకువస్తూ ప్రజలు పిల్ వ్యవహారాన్ని ఒక వృత్తిలా మార్చేశారు. కోర్టుల సమయాన్ని వృధా చేస్తూ జాప్యానికి కారకులవుతున్నారు. రెండో అంశం– న్యాయమూర్తులు అబద్ధాలు ఆడరాదు. కనీసం వారిలో నలుగురు కలుసుకోనప్పుడైనా అబద్ధం ఆడరాదు. మూడో అంశం– మొత్తం న్యాయ వ్యవస్థను ఒకే వ్యక్తి అదుపు చేస్తాడని చెప్పడం అర్థరహితం. అది అసంభవం. ఇప్పుడు కొన్ని వాస్తవాల గురించి పరిశీలిద్దాం. జస్టిస్ లోయాకు సంబం ధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజు ఉదయమే పత్రికలు బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు గురించి ప్రచురిం చాయి. మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పుడు వినియోగిస్తున్న నీటి మీద ఆంక్షలు విధించాలంటూ ఇంతకు ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. క్రీడా మైదానాన్ని తడపకుండా రైతు రక్షణ కోసం మిగిల్చిన ఆ నీటి విలువ సంగతి పక్కన పెడదాం. అయితే ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులు ఉండగా క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పు చెప్పడానికి సమయం కేటాయించడం నిజంగా సమర్ధించదగ్గదేనా? అయితే న్యాయమూర్తుల వివేకం గురించి ప్రశ్ని స్తున్నప్పటికీ కూడా వారి చర్యలను శంకించడం మాత్రం తగదు. ప్రచారం కోరుకునే వ్యక్తులకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒక ఆయుధంగా మారిపో యిందని లోయా కేసు తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తులు కూడా తమని తాము అద్దంలో చూసుకుంటూ తాము అలాంటి ఆకర్షణకు లోనయ్యే వాళ్లం కాదని చెప్పుకోగలరా! ఇలాంటి కొన్ని ఉదాహరణలను సేకరించ డంలో నాకు సహకరించిన నా సహ జర్నలిస్ట్ మనీష్ చిబ్బర్ ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థను ఆసక్తిగా, లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. ఆ ఉదాహరణలలో భారత క్రికెట్‌ను నిర్వహించమని దాదాపు సంవత్సరం క్రితం సుప్రీంకోర్టుకు అప్పగించిన బీసీసీఐ ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇటీవలనే భారత ప్రధాన న్యాయమూర్తి మరొక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని కూడా అనుమతించారు. ఆయనే ఇప్పుడు క్రికెట్ బెంచ్‌కు (ఇలాంటి రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నారా?) ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. క్రీడలలో బెట్టింగ్‌ను, జూదాన్ని చట్ట బద్ధం చేయాలంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆయనే అనుమతించారు. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక ముందు ఒక ఆదేశం జారీ (నవంబర్ 30, 2016) చేశారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను అనివార్యం చేస్తూ ఇచ్చిన ఆదేశమది. తరువాత దానిని రద్దు చేశారు. ఈ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా పత్రి కలలో పతాక శీర్షికల స్థానం పొందాయి. పిటిషన్‌దారులు ఎవరో ఎవరికీ గుర్తు లేదు. కాబట్టి పత్రికల పతాక శీర్షికలకు ఎక్కాలనుకుంటున్నారంటూ పిటిషనర్లను ఎందుకు విమర్శించడం? లోయా తీర్పు వచ్చిన తరువాత ప్రధాన న్యాయమూర్తి ముందు విచారణకు వచ్చిన 43 వ్యాజ్యాలలో 12 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలే. ఇంకొన్ని: బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం, సాంటా–బాంటా జోకుల నిషేధం, అశ్లీల చిత్రాల వీక్షణను నేరంగా ప్రకటించడం (2013 నుంచి కోర్టుల సమయాన్ని తింటున్నది), పాఠ శాలల్లో యోగాభ్యాసం తప్పనిసరి చేయడం–ఇంకొన్ని. ఇందులో కొన్నింటిని కొట్టివేశారు. ఇంకా ఎన్నో కీలకమైన కేసులు ఉండగా వీటిని ఎందుకు అను మతించాలి? వాస్తవం ఏమిటంటే, గొప్ప సదుద్దేశంతో 1980లో వచ్చిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని ఎందరో న్యాయమూర్తులు విస్తరించారు. ఇది ప్రజల అంతిమ ఆయుధంగా భావించారు. ఇంకొక విషయం–న్యాయమూర్తులు అబద్ధం ఆడరాదు. కనీసం నలు గురు సీనియర్ జిల్లా జడ్జీలు కలిసినప్పుడైనా అబద్ధం ఆడరాదు. ఈ సూత్రం సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు వర్తించదా? వీరు కోర్టు నిర్వహణకు సంబంధించిన కొన్ని దోషాలను గురించి కొన్ని నెలల క్రితం మాట్లాడారు. మనం నలుగురు మహారాష్ట్ర న్యాయమూర్తుల మాటను పరిగణిస్తున్నప్పుడు, వారి మాటలను ఉద్దేశపూర్వకమైనవిగా తోసిపుచ్చ వచ్చా, వారి ఆందోళనలను దారితప్పినవిగా కొట్టిపడేయవచ్చా? జిల్లా జడ్జీలు అబద్దమాడుతున్నారని అగ్నికి ఆజ్యం పోసేటంత మూర్ఖుడిని కాను. పైగా సుప్రీంకోర్టు జడ్జీలు అబద్దాల కోరులు అని నమ్మేందుకు నేను వెర్రి వాడినై ఉండాలి. వారు సంధించిన ప్రశ్నలకు స్పందించాలి. చర్చించాలి, అంతర్దృష్టితో చూడాల్సివుంది. న్యాయవ్యవస్ధపై కనికరం లేని ఈ సాగదీత, అంటువ్యాధిగా కొట్టిపడే సిన అదే ప్రజాప్రయోజన వ్యాజ్యాల గుండా పతాక శీర్షికలపై దృష్టి నిలిపే న్యాయవ్యవస్థ ధోరణి, తమ సొంత సంస్థను క్రమంలో ఉంచడంలో వారి అసమర్థత అనేవే బయటి వారికంటే ఎక్కువగా న్యాయవ్యవస్థను బలహీనప ర్చాయి. న్యాయమూర్తులు చీలిపోయినట్లు కనిపిస్తే, కక్షిదారులు, న్యాయవా దులు కలిసి ఫోరం షాపింగ్‌కు వెళతారని మీరు ఊహించవచ్చు. తీర్పులోని మూడో ముఖ్యమైన అంశంలోకి మనల్ని తీసుకెళుతోంది ఏదంటే, ఒక వ్యక్తిమాత్రుడు మొత్తం న్యాయవ్యవస్థను నియంత్రించగలడని చెప్పడం అర్ధరహితమనే చెప్పాలి. మీరు దీనితో విభేదించలేరు. వాస్తవానికి, అలాంటి పరిస్థితిని మనం గతంలో చూసి ఉన్నాం. కాని అలా చేసింది పురు షుడు కాదు మహిళ అయిన ఇందిరాగాంధీ. వెన్నెముక కలిగిన ఒకే ఒక్క సాహసికుడైన న్యాయమూర్తి హెచ్ ఆర్ ఖన్నా నేటి ఎర్డోగన్నేతత్వంలోని టర్కీ దేశంలా మారకుండా మనదేశాన్ని నాడు కాపాడారు. 2018 కాలపు భారతదేశానికి అలాంటి ఒక న్యాయమూర్తి కాదు, పలువురు న్యాయమూ ర్తులు కావలసి ఉంది. ఎందుకంటే న్యాయవ్యవస్థకు పెనుప్రమాదం ఇప్పుడు బయటినుంచి కాదు. లోపలి నుంచి పొంచి ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సుప్రీం తీర్పుపై అన్నీ సందేహాలే!
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర ప్రత్యేక జడ్జీ బ్రిజ్గోపాల్ హరికిషన్ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంపై స్వతంత్య్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు గురువారం నాడు నిర్ద్వంద్వంగా కొట్టివేసిన విషయం తెల్సిందే. లోయా మరణించిన రోజున ఆయన పక్కనే ఉన్న నలుగురు జడ్జీలు ఇచ్చిన వాంగ్మూలాన్ని శంకించడం అంటే న్యాయవవస్థను శంకించడమేనని, భారత పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు కోర్టుల విలువైన సమయాన్ని ఇలా వృధా చేయడం సమంజసం కాదని, ఈ కేసులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దుర్వినియోగం అయిందంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ వ్యాఖ్యానించింది. దీపక్ మిశ్రా బెంచీ ఇచ్చిన తీర్పుపై, ఆయన చేసిన వ్యాఖ్యలపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 నవంబర్ 30వ తేదీ అర్ధరాత్రా లేదా ఆ మరుసటి రోజు డిసెంబర్ ఒకటవ తేదీన లోయా మరణించారా ? అన్న విషయంలో స్పష్టత లేదు. గుండెపోటు వచ్చిన లోయాను ముందు డాండే ఆస్పత్రికి తీసుకెళ్లారా లేదా మెడిత్రినా ఆస్పత్రికి తీసుకెళ్లారా అన్న అంశంలో పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జీలను అనుమానిస్తే న్యాయవ్యవస్థనే శంకించడమని ధర్మాసనం మాట్లాడింది. ముందురోజే ఈసీజీ తీసినప్పుడు ఆయనకు గుండె బాగుందని, ఆ మరునాడు చనిపోయారని, అసలు ఈసీజేనే తీయలేదని, ఆస్పత్రిలోని ఈసీజీ మిషన్ పనిచేయలేదని, ఆయన ఈసీజీ బాగానే ఉందిగానీ, ఆ తర్వాత ఆయన మెట్లు ఎక్కి ఆస్పత్రి పైఅంతస్తులోకి రావడం వల్ల ఆయనకు గుండె పోటు వచ్చి ఉండవచ్చని... రకరకాలుగా రెండు ఆస్పత్రి వర్గాలు పరస్పర భిన్న కథనాలను వెల్లడించినా అనుమానించకూడదా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్న సంచలనం సృష్టించిన షొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణ ముగించి తీర్పును వెల్లడించడమే తరువాయిగా ఉన్నప్పుడు నాగపూర్ పెళ్లికి వెల్లి అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో లోయా మరణిస్తే అనుమానించకూడదా? ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని స్నేహితులతోపాటు కుటుంబ సభ్యులు వెల్లడించినప్పుడు కూడా అనుమానించకూడదా? తన కుమారుడికి ఎప్పుడు గుండె జబ్బులేదని, షొహ్రాబుద్ధీన్ ఎన్కౌంటర్ కేసును కొట్టివేస్తే వంద కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఒత్తిళ్లు వచ్చాయంటూ కన్న తండ్రే, సోదరి ఆరోపించినప్పుడు, కారావాన్ మాగజైన్ లోయ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించినప్పుడు అనుమానించకూడదా? లోయా స్థానంలో బదిలీపై వచ్చిన జడ్జీ కేసు పూర్వపరాలను సరిగ్గా పరిశీలించకుండానే వారం రోజుల్లో షొహ్రాబుద్ధీన్ ఎన్కౌంటర్ కేసును కొట్టివేస్తే అనుమానించకూడదా? కేసులో కీలకసాక్ష్యులైన 50 మందిలో కొందరు హత్యకు గురై, మిగతా వారు వారం రోజుల్లోనే ప్రాసిక్యూషన్‌కు ఎదురు తిరిగితే అనుమానించకూడదా? కేసుల దర్యాప్తునకు నెలలు, సంవత్సరాలు తీసుకునే పోలీసులు కారావాన్ మాగజైన్ కథనంపై ఐదు రోజుల్లో దర్యాప్తు ముగించి నలుగురు జడ్జీల నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని మాత్రం విశ్వసించాలా? ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ లాయరు ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే విశ్వసించరా? అది న్యాయవ్యవస్థను శంకించడం, కోర్టు సమయాన్ని వృధా చేయడమా ? ‘మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా’ లంచం కేసులో సీనియర్ జడ్జీలపైనే అవినీతి ఆరోపణలు వచ్చినా, నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు ఎన్నడూలేని విధంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తి ప్రవర్తననే ప్రశ్నించినా న్యాయవ్యవస్థను అనుమానించకూడదా? అసాధ్యమైన కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావాలంటూ, సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ, యోగాను నిర్బంధ విద్యగా ప్రవేశపెట్టాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు వద్ద సమయం ఉంటుంది. ఆధార్ కార్డులపై కొన్నేళ్లుగా విచారణ కొనసాగించడానికి సమయం ఉంటుంది. లోయా మృతి లాంటి కీలక కేసులో పిటిషన్ విచారించే సమయం ఉండదా? జడ్జీ హరికిషన్ లోయా గుండెపోటుతోనే మరణించి ఉండవచ్చు. ఆయన్ని ఎవరూ హత్యచేసి ఉండకపోవుచ్చు. ఆ విషయాన్ని స్పష్టంగా తేల్చడానికైనా స్వతంత్య్ర దర్యాప్తు అవసరం కదా! అప్పుడు న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుందికదా! న్యాయ వ్యవస్థనే ఇలా తీర్పు చెబితే ఇక తామెక్కడికి న్యాయం కోసం వెళ్లగలమంటూ తీర్పు తర్వాత లోయా కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారంటే అర్థం ఏమిటీ? ‘ఏ కేసులోనైనా న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు స్పష్టంగా కనిపించడం ముఖ్యం’ అన్న కీలక సూత్రాన్ని సూక్తిగా బోధించినది కూడా సుప్రీం కోర్టే కదా! -
పీఎన్బీ స్కామ్ : సమాంతర విచారణకు కేంద్రం నో
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ కుంభకోణం కేసులో సమాంతర విచారణ, కోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టడం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ 12,000 కోట్ల పీఎన్బీ స్కాం విచారణ పురోగతిని సీల్డ్ కవర్లో సమర్పించాలని సీబీఐకి సుప్రీం కోర్టు చేసిన సూచనను కేంద్రం తోసిపుచ్చింది. ఈ కేసుపై దర్యాప్తు సంస్థలు విచారణను ప్రారంభించకముందే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలతో ప్రజలు న్యాయస్ధానాలను ఆశ్రయించడం పట్ల అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విస్మయం వ్యక్తం చేశారు. పిల్ దాఖలు చేస్తూ విచారణ పురోగతి వివరాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడం న్యాయసమ్మతమేనా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ను ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్ధానాలు సమాంతర విచారణ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వాలను ఆయా పత్రాలను కోరడం సముచితమన్నారు. పిటిషనర్ సహేతుకమైన కారణాలను చూపకుంటే ఇలాంటి పిటిషన్లను న్యాయస్ధానాలు ఎందుకు ప్రోత్సహించాలని అటార్నీ జనరల్ వాదించారు. ఈ తరహా పిటిషన్లు దర్యాప్తు సంస్థల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు. పీఎన్బీ స్కామ్‌పై స్వతంత్ర విచారణ చేపట్టాలని, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది వినీత్ దందా దాఖలు చేసిన పిటిషన్‌ను అటార్నీ జనరల్ వ్యతిరేకించారు. పీఎన్బీ స్కామ్‌కు సంబంధించి జ్యూవెలర్ నీరవ్ మోదీ, ఆయన బంధువు గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీలపై సీబీఐ, ఈడీలు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
నీరవ్‌ను దేశానికి రప్పించేలా ఆదేశించండి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.11 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ నగల వ్యాపారి నీరవ్ మోదీ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని, ఆయనను భారత్‌కు అప్పగించేలా చూడాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. ఈ కుంభకోణం ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని న్యాయవాది జేపీ ధండా వాదనలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. న్యాయవాది వినీత్ ధండా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక, న్యాయ శాఖలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను దేశానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల ప్రమేయం ఉన్న ఈ స్కాంను సిట్‌తో విచారణ జరిపించాలని కూడా కోరారు. స్కాంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నతాధికారుల పాత్ర విషయంలో కూడా దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకులకు మార్గదర్శకాలు రూపొందించేలా ఆర్థిక శాఖను ఆదేశించాలని కూడా పేర్కొన్నారు. -
పీఎన్బీ స్కాం: సిట్ ఏర్పాటు చేయండి!
సాక్షి న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసుపై ప్రత్యేక దర్యాప్తుబృందంతో విచారణ జరిపించాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు వినీత్ దండా, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం ఆమోదం తెలిపింది. బ్యాంకులకు రుణాలు చెల్లించలేని రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారనీ, ప్రజల హక్కులను కాపాడేందుకు ఈ కేసులో సుప్రీం జోక్యం చేసుకోవాలని పిల్లో కోరారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా , న్యాయమూర్తులు ఎ.ఎ. ఖాన్విల్కర్, డి.ఎ. చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ ఫిబ్రవరి 23 శుక్రవారం విచారణను ప్రారంభించనుంది. పీఎన్బీ మెగాస్కాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని పిటీషనర్ వినీత్ దండా డిమాండ్ చేశారు. ప్రధాన ఆరోపణలుఎదుర్కొంటున్న నీరవ్ మోదీని రెండునెలలోగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని కోరారు. రెండు నెలలలోగా పీఎన్బీ స్కామ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని దండా కోరారు. ఇవే డిమాండ్లతో న్యాయవాది ఎంఎల్ శర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ లో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ఉండాలని కోరారు. రాజకీయ నాయకులు /అధికారుల నియంత్రణలో లేని సంస్థతో విచారణ జరగాన్నారు. అంతేకాదు రూ. 10కోట్లకు మించిన రుణాల కేటాయింపులో ఆర్థికమంత్రిత్వశాఖ ప్రత్యేక మార్గనిర్దేశకాలు జారీచేసేలా కోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. దోషులపై కఠినచర్యలు తీసుకోవాని, ఇలాంటి స్కాముల పాల్పడిన వారికి విధించే 3 సంవత్సరాల జైలు శిక్షకు బదులు జీవిత ఖైదు విధించేలా మార్పులు తేవాలని డిమాండ్ చేశారు. దేశంలో మొండి బకాయిల వివరాలను సేకరించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా పిటీషనర్లు విజ్ఞప్తి చేశారు. -
పద్మావత్‌కు వ్యతిరేకంగా పిల్
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ చిత్రంపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది ఒకరు శుక్రవారం న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే కోర్టు మాత్రం పిల్‌ను తోసిపుచ్చింది. ‘‘మాది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. సినిమాలను అడ్డుకోవటం మా పని కాదు. శాంతి భద్రతల పని ప్రభుత్వాలు చూసుకుంటాయని’’ అని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సినిమా విడుదలైతే అల్లర్లతో హింస చెలరేగే పరిస్థితి ఉందని.. ఈ నేపథ్యంలో పద్మావత్ సినిమాను విడుదల కానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేయటమే ఉత్తమమని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. అయితే ఇది(పిల్‌ను ఉద్దేశించి) ప్రజలకు ఏ రకంగా మేలు కలిగించేదో అర్థం కావట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చిత్ర విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానేయటం ఉత్తమమని.. ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు సిద్ధంగా లేమని అని పిటిషనర్‌తో న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సెన్సార్ బోర్డు చీఫ్‌కు వార్నింగ్... ఇదిలా ఉంటే పద్మావత్ చిత్ర విడుదలకు క్లియరెన్స్ ఇచ్చిన సీబీఎఫ్సీపై రాజ్‌పుత్ కర్ణిసేన ఆగ్రహంతో ఊగిపోతోంది. బోర్డు చీఫ్ ప్రసూన్ జోషిని ఇక ముందు రాజస్థాన్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సెన్సార్ బోర్డు పట్టించుకోకపోవటం దారుణమని.. మున్ముందు మరిన్ని పరిణామాలు సెన్సార్ బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుందని కర్ణిసేన ఓ ప్రకటన విడుదల చేసింది. -
థియేటర్లలో జనగణమన.. కేంద్రం యూటర్న్
సాక్షి, న్యూఢిల్లీ : సినిమాహాల్లో జాతీయ గీతాలాపన విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. జనగణమన ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిల్చొవాల్సిందేనని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆదేశాలను నిలుపుదల చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సోమవారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా మొదలయ్యే ముందు థియేటర్లలో జాతీయ గీతం అక్కర్లేదని కోర్టుకు తెలియజేసింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనే దానిపై మార్గదర్శకాల రూపకల్పన కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏర్పాటు చేసినట్టు కేంద్రం పేర్కొంది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు తాము ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేసి 30 నవంబరు 2016 తీర్పు ముందునాటి స్థితిని పునరుద్ధరించాలని కోరింది. కాగా, నేడు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్ విచారణకు రానుంది. జాతీయ గీతాలాపనకు సినిమా హాళ్లు వేదిక కాకూడదని దేశ వ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఈ మేరకు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. పౌరులు తమలోని దేశభక్తిని ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గతంలో న్యాయస్థానం తేల్చి చెప్పిన విషయం విదితమే. దీంతో తర్జన భర్జన పడిన ప్రభుత్వం దిగి వచ్చి ఈ నిర్ణయం తీసుకుంది. -
నాలుగో బుల్లెట్.. అంతా ఉత్తదే...
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసు పునర్విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా సీనియర్ అడ్వొకేట్ అమరేందర్ శరణ్ నియమించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో సుదీర్ఘ పరిశీలన చేపట్టిన ఆయన సోమవారం తన నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. మహాత్మాగాంధీని గాడ్సేనే హతమార్చాడని.. ఇందులో విదేశీ నిఘా సంస్థల వ్యక్తుల ప్రమేయం లేదని అమికస్ క్యూరీ స్పష్టం చేశారు. కేసును పునర్విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ అర్కైవ్స్ నుంచి అవసరమైన పత్రాలు, నివేదిక క్షణ్ణంగా పరిశీలించాకే ఈ నివేదికను రూపొందించినట్లు అమరేందర్ వెల్లడించారు. నాలుగో బుల్లెట్ గాంధీ ప్రాణం తీసిందన్న అంశం ఉత్తదేనని ఆయన తేల్చేశారు. కాగా, గాంధీ హత్య కేసులో పలు అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని కోరుతూ ముంబైకి చెందిన పరిశోధకుడు, అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ పంకజ్ ఫడ్నవీస్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఈ వాదనను గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఖండించారు. ఈ కేసులో జోక్యం చేసుకొనే హక్కు పంకజ్‌కు లేదంటూ తుషార్ తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించారు. మరి ఆ హక్కు తుషార్‌కు ఉందా? అని ప్రశ్నించిన బెంచ్.. ఈ కేసులో తమకూ చాలా అనుమానాలున్నాయని, శరణ్ నివేదిక అందేవరకూ తుది నిర్ణయం తీసుకోలేమని వ్యాఖ్యానించింది కూడా. -
ఎట్టకేలకు గట్టి బిల్లు
ఇంకా కళ్లు తెరవని పసి గుడ్డులు మొదలుకొని బాలబాలికలు, యువతుల వరకూ వేలాదిమందిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న మాఫియా ముఠాల ఆట కట్టించేందుకు ఎట్టకేలకు ఒక సమగ్ర చట్టం రాబోతున్నది. దీనికి సంబంధించి రూపొందించిన బిల్లు ప్రస్తుతం మంత్రుల బృందం(జీఓఎం) పరిశీలనలో ఉంది. నాగరిక విలువలనే సవాలు చేస్తున్న మనుషుల అక్రమ తరలింపు దుర్మార్గాన్ని అరికట్టడానికి అమల్లో ఉన్న చట్టాలు చాలడం లేదని, ఆ విషయంలో అత్యంత కఠినమైన చట్టం తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నడో 2004లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై ఆ న్యాయస్థానం ఆదేశాలిచ్చి కూడా రెండేళ్లు దాటింది. ఇన్నాళ్లకు ఆ బిల్లు రూపుదిద్దుకుంది. మాదక ద్రవ్యాల తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత వ్యవస్థీకృతంగా చాపకింద నీరులా సాగిపోతున్న నేరం మనుషుల అక్రమ తరలింపే. ఈ మాఫియా సామ్రాజ్యంలో మాయమాటలు చెప్పి అమాయక ఆడపిల్లల్ని వలలో వేసుకునే దళారులు మొద లుకొని అనేకులున్నారు. బాధితుల్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికీ తర లించడం, దేశ సరిహద్దులు కూడా దాటించడం ఇటీవలికాలంలో పలుమార్లు బయటపడింది. ఈమధ్యే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న వీరేందర్ దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్న మూడు కేంద్రాలపై దాడి చేస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ మూడు కేంద్రాల్లో దాదాపు 50మంది యువతులు, బాలికలను కాపాడారు. దాడులు జరగ బోతున్నాయని ముందస్తు సమాచారం అందుకుని చాలామందిని అప్పటికే వేరే చోటకు తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. నిరుడు పశ్చిమబెంగాల్లో వెల్లడైన ఉదంతం మరింత దుర్మార్గమైనది. రోజుల వయసున్న పిల్లల్ని బిస్కెట్ల పెట్టెల్లో పెట్టి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు బయటపడింది. ప్రసవించిన తల్లికి బిడ్డ పుట్టగానే మరణించిందని అబద్ధం చెప్పి, అందుకు కోర్టు గుమాస్తాల ద్వారా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తెప్పించి ఈ వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పుడప్పుడు దేశంలో వివిధ రైల్వే స్టేషన్లలో పదులు, వందల సంఖ్యలో పిల్లల్ని తరలిస్తూ ముఠాలు పట్టుబడుతున్నాయి. ఇలా అక్రమంగా తరలిస్తున్నవారిలో బాలికలనైతే వ్యభిచార కేంద్రాలకు విక్రయించడం, మగపిల్లల్ని వెట్టి చాకిరికి వినియోగించుకోవడానికి అమ్మడం సర్వసాధారణం. ఇవికాక పిల్లల అవయవాలు తొలగించి వారిని యాచక వృత్తిలోకి నెట్టడం కూడా రివాజు. మనుషుల అక్రమ తరలింపు రకరకాల ముసుగుల్లో సాగుతోంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామని, ఇంటి పనులకు అవసరమని, అనాథలకు ఆశ్రయమిస్తామని, దత్తత కోసమని మభ్యపెట్టి అమాయక బాలబాలికలను తెచ్చి నరకకూపాల్లోకి తోస్తున్నారు. వ్యవసాయంలో, ఇటుకల పరిశ్రమల్లో వెట్టిచాకిరీ చేయించడానికి లేదా వ్యభిచారం చేసేందుకు తరలిస్తున్నారు. పిల్లలను చీకటికొట్టాల్లో బంధించి, చిత్రహింసలకు గురిచేసి వారిని దారికి తెచ్చుకుని ఇదంతా సాగిస్తున్నారు. అపహ రించిన పిల్లల ద్వారా ఏటా దాదాపు రూ. 200 కోట్ల వ్యాపారం సాగుతున్నదని అంచనా. ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం నిరుడు మనుషుల అక్రమ తరలింపు కేసులు 8,132 నమోదయ్యాయి. అంతక్రితం సంవత్సరం ఈ మాదిరి కేసులు 6,877. రాష్ట్రాలవారీగా చూస్తే పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌లలో మహిళల అపహరణలు అధికంగా ఉన్నాయి. న్యాయస్థానాల్లో కూడా ఈ మాదిరి కేసుల విచారణ నత్తనడక నడుస్తోంది. 2015లో న్యాయస్థానాల ముందు 5,003 కేసులుంటే కేవలం 384 కేసుల విచారణ మాత్రమే పూర్తయింది. ఇందులో 55 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి. అంటే 14.4 శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. చట్టంలో నేరాల నిర్వచనం సక్రమంగా లేకపోవడం, ఆ చట్టాల అమలులో చూపే నిర్లక్ష్యం నేరగాళ్లకు పరోక్షంగా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. మన దేశంలో భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 370ని సవరిస్తూ 2013లో తెచ్చిన చట్టం తొలిసారి పిల్లల అక్రమ తరలింపు అంశాన్ని నేరంగా పరిగణించింది. మనుషుల అక్రమ తరలింపుపై కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికి మూడుసార్లు ముసాయిదా బిల్లులు రూపొందించింది. అయితే అందులోని లోటుపాట్లు ఎత్తి చూపి వాటిని సవరిస్తే తప్ప ప్రయోజనం ఉండబోదని వివిధ సంస్థలు, వ్యక్తులు చెప్పడంతో తగినంత సమగ్రతతో తాజా బిల్లు రూపొందించారు. బాధితులపై మాదకద్రవ్యాలు, రసాయనాలు లేదా హర్మోన్లు ప్రయోగించడం, అవయవాలను తొలగించి పిల్లలను భిక్షాటనలో పెట్టడం, వెట్టిచాకిరీ కోసం మనుషుల్ని తర లించడం, వ్యభిచార వృత్తిలోకి దించడం, పిల్లలను మానవ కవచాలుగా లేదా సైనికులుగా వినియోగించడం, లైంగిక దోపిడీకి పాల్పడటం, వారిని అశ్లీల చిత్రాల్లో వినియోగించడం వగైరా నేరాలకు తాజా బిల్లు కఠిన శిక్షలను ప్రతిపాదించింది. అలాగే జాతీయ స్థాయిలో మనుషుల అక్రమ తరలింపు కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం నెలకొల్పాలని నిర్దేశించింది. రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేక అధి కారులుంటారు. మనుషుల అమ్మకాలు, కొనుగోళ్లలో పాలుపంచుకునేవారికి ఈ బిల్లు కనీసం ఏడేళ్ల కఠిన శిక్ష, గరిష్టంగా పదేళ్ల శిక్ష ప్రతిపాదిస్తోంది. లైంగిక నేరాలకు పాల్పడి వాటిని ప్రచారంలో పెడతామని బెదిరించి బాధితులనుంచి లేదా వారి కుటుంబాలనుంచి డబ్బులు వసూలు చేసినా, ఇతరత్రా ఒత్తిళ్లు తెచ్చినా మూడు నుంచి ఏడేళ్ల శిక్ష విధిస్తారు. ఈ బిల్లు సాధ్యమైనంత త్వరగా చట్టంగా మారడం తక్షణావసరం. అలాగే ఎంత కఠినమైన చట్టాలున్నా అమలు చేసే యంత్రాంగం చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో పనిచేయకపోతే ఉద్దేశం నెరవేరదు. అందువల్ల నేరగాళ్లతో కుమ్మక్కయ్యే, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలుండాలి. బాధితులకు పునరావాసం కూడా ముఖ్యం. ఇవన్నీ చేస్తేనే ఈ దుర్మార్గం దుంపనాశనమవుతుంది. -
ఓ నేత ఒకేచోట పోటీ చేయాలి!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఓ నేత ఎన్నికల్లో ఒకే చోట పోటీ చేయాలన్నది ఆ పిల్ సారాంశం. కాగా, పిటిషనర్ వాదనతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పూర్తిగా ఏకీభవించింది. ఒక నేత ఒకే చోట పోటీ చేసేలా చట్ట సవరణ చేయాలన్నది తమ అభిప్రాయమని, ఇప్పటికే కేంద్రానికి రెండుసార్లు లేఖ రాశామని ఎన్నికల సంఘం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఎన్నికల సంఘం వివరించింది. ఒక నేత.. ఒకేచోట పోటీ చేయాలన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా కొందరు నేతలు రెండు చోట్ల ఎన్నికల బరిలో దిగడం, ఆ స్థానాల్లో విజయం సాధిస్తే ఓ స్థానానికి రాజీనామా చేస్తుంటారు. ఒకవేళ ఒకే స్థానంలో విజయం సాధిస్తే రాజీనామా ప్రస్తావనే ఉండదన్న సంగతి తెలిసిందే. -
సునంద కేసు.. స్వామికి చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై ఆయన వేసిన పిల్‌ను గురువారం కొట్టేసింది. కేసును శశిథరూర్ ప్రభావితం చేస్తున్నారని.. కోర్టు ఆధ్వర్యంలో సిట్ విచారణ జరిగేలా ఆదేశించాలంటూ స్వామి ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే స్వామి వేసిన పిటిషన్ ఓ రాజకీయ ప్రయోజన వ్యాజ్యంలా ఉందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అయితే స్వామి ఆరోపణలకు సంబంధించి సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయాడని జస్టిస్ ముదలియర్, జస్టిస్ మెహతా నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. కోర్టుకు సమర్పించిన అంశాలను స్వామి రహస్యంగా ఉంచారని ఈ సందర్భంగా జడ్జిలు పేర్కొన్నారు. నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా కేసులు వేయటం సరికాదని.. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యహరిస్తుందని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కేసును తప్పుదోవ పట్టించేందుకు శశిథరూర్ జోక్యం చేసుకున్నారంటూ స్వామి ఆరోపణలు చేయగా.. వాటిని ఢిల్లీ పోలీసులు, కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాటిని ఖండించారు. -
‘జింఖానా’లో సచివాలయం వద్దు
→ హైకోర్టులో పిల్ దాఖలు సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా, బైసన్‌పోలో మైదానాల్లో అసెంబ్లీ, సచివాలయం, కళాభారతి భవ నాల నిర్మాణాలను ప్రశ్నిస్తూ హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. 33 ఎకరాల బైసన్ పోలో, 22 ఎకరాల జింఖానా భూముల్లో నిర్మాణా లను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వా లని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో రిటైర్డు డీజీపీ ఎం.వి.భాస్కర రావు, మాజీ క్రికెటర్ వివేక్ జయసూర్య, మరో ఇద్దరు పిల్ వేశారు. ఈ మైదానాల్లోనే జాతీయ స్థాయి ఎన్సీసీ శిక్షణ జరుగుతుందని, అనేక క్రీడలకు వినియోగించే ఈ మైదానాల్లో నిర్మాణాలకు కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన అనుమతులు రద్దు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. ఇందులో తెలంగాణ సీఎస్, కేంద్ర రక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్, సబ్ ఏరియా కమాండర్, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికా రులను ప్రతివాదులుగా చేర్చారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతుంది ‘ఈ నిర్మాణాలు జరిగితే ఈ ప్రాంతం కాంక్రీట్ జంగిల్‌గా మారి పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది’అని పిటిషనర్లు పిల్లో హైకోర్టుకు అభ్యర్థించారు. -
ఆ నదులను ప్రాణ జీవులుగా గుర్తించండి
హైకోర్టులో న్యాయ విద్యార్థిని దీప్యా చౌదరి పిల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లో ప్రవహిస్తున్న పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులను, వాటి ఉప నదులను ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. మనిషికి ఉండే అన్ని చట్టబద్ధమైన హక్కులను వాటికీ కల్పించాలని కోరుతూ న్యాయ విద్యార్థిని దీప్యా చౌదరి పిల్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర నీటి వనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శులు, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నదులు తమను తాము రక్షించుకోలేవు కాబట్టి వాటిని ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించాలని కోరుతున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నదులను, ఉప నదులను పరిరక్షిం చేందుకు, వాటి సహజ ప్రవాహానికి ఎటువంటి అడ్డంకుల్లేకుండా చూసేందుకు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు లేదా ఇతర ఏ అధికారులనైనా నియమిం చాలని కోరారు. నదుల్లో చెత్తా చెదారం ఆసుపత్రుల వ్యర్థాలు తదితరాలను వేయకుండా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్కడెక్కడ మురి కినీటి శుద్ధి కేంద్రాల వివరాలను కోర్టు ముందుంచేలా ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలివ్వాలని కోరారు. -
సివిల్ ర్యాంకర్ గోపాలకృష్ణపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్-2016లో మూడో ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణింకి గోపాలకృష్ణకు చిక్కులు ఎదురయ్యాయి. ఆయన తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని, దీనిపై విచారణ జరపాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సివిల్ సర్వీసెస్-2016 యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణకు మూడో ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. అయితే, అతడికి ఈ ర్యాంక్‌ను కేటాయించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, అతను సమర్పించిన అంగవైకల్య ధ్రువీకరణపత్రంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఉమ్మడి హైకోర్టులో సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ పిల్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర వ్యక్తిగత శిక్షణశాఖ కార్యదర్శి, యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోణంకి గోపాలకృష్ణను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. పిల్లో ఆయన ఏం పేర్కొన్నారంటే.. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2016 తుది ఫలితాలను యూపీఎస్సీ ఈ ఏడాది మే 31న ప్రకటించింది. ఇందులో గోపాలకృష్ణకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకునిచ్చిందని తెలిపారు. అయితే గోపాలకృష్ణకు ఎటువంటి అంగవైకల్యం లేకున్నా ఆ కోటా కింద తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరయ్యారని వివరించారు. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడిక్ విభాగంలో 45శాతం మేర అంగవైక్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించారన్నారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 కాగా గోపాలకృష్ణకు 91.34 మార్కులే సాధించాడని, వికలాంగ కోటా కింద అర్హత మార్కులు 75.34తో అతను మెయిన్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. ఓబీసీ కేటగిరిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌కు అర్హత సాధించలేదని, వికలాంగుల కోటా కింద మాత్రమే అర్హత సాధించారని పేర్కొన్నారు. మెయిన్స్‌లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3గంటలు కాగా, వికలాంగ అభ్యర్థులకు 4 గంటలని, దీని ద్వారా కూడా గోపాలకృష్ణ లబ్ది పొందారన్నారు. వాస్తవానికి గోపాలకృష్ణకు పెద్ద వైకల్యమేదీ లేదని పిటిషనర్ వివరించారు. అతడు చెబుతున్న వైకల్యంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ గోపాలకృష్ణ అంగవైకల్యంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాక అతనికి ఐఏఎస్ సర్వీసు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. -
‘దువ్వాడ జగన్నాథమ్’కు మరో షాక్
హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ (డీజే) సినిమాలోని శృంగార గీతాల్లో యజుర్వేదంలో ఉన్న నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వీటిని తొలగించేంత వరకు ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్ దాఖలు చేశారు. ఇందులో ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్, డీజీపీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. డీజే సినిమాలోని శృంగార గీతాల్లో పలు అభ్యంతరకర పదాలు ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. అంతేకాక యజుర్వేదంలోని నమకం, చమకం వంటి పవిత్ర పథనాలను కూడా ఉపయోగించారన్నారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ సెన్సార్ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించినా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. ఈ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందువల్లే మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించేంత వరకు థియేటర్లలో డీజే ప్రదర్శనపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణమోహన్ కోర్టును కోరారు. ఇంతకుముందు బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేయడంతో పాటలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. -
జస్టిస్ పీఎన్ భగవతి కన్నుమూత
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థలో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’(పిల్)కు ఆద్యుడిగా భావించే న్యాయ కోవిదుడు, మాజీ సీజేఐ జస్టిస్ పీఎన్ భగవతి గురువారం కన్ను ముశారు. ఆయన వయసు 95 ఏళ్లు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తామని చెప్పారు. భగవతికి భార్య ప్రభావతి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పీఎన్ భగవతి 1985 జూలై నుంచి 1986 డిసెంబర్ వరకు సుప్రీంకోర్టుకు 17వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకు ముందు గుజరాత్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 1973 జూలైలో సుప్రీంకోర్టులో జడ్జిగా చేరారు. సుప్రీంకోర్టు జడ్జిగా భగవతి..పిల్, భారత న్యాయ వ్యవస్థలో సంపూర్ణ జవాబుదారీతనం లాంటి భావనలను ప్రవేశపెట్టారు. ఖైదీలు కూడా ప్రాథమిక హక్కులకు అర్హులే అని ఆయన ఓ సందర్భంలో తీర్పునిచ్చారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పౌరులు కోర్టులను ఆశ్రయించడానికి వారికి ప్రత్యేక హక్కులుండనక్కర్లేదని అన్నారు. 1978లో ప్రస్తుత కేంద్ర మంత్రి మేనకా గాంధీ పాస్‌పోర్టు స్వాధీన కేసులో ఆయన ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. పౌరుల కదలికలను నియంత్రించకూడదని, పాస్‌పోర్టులను తమ వద్దే ఉంచుకునే హక్కు ప్రతిఒక్కరికి ఉందని భగవతి ఆ సందర్భంగా అన్నారు. మినర్వా మిల్స్ కేసు విచారణలో...అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పార్లమెంట్ చేసిన 42వ రాజ్యాంగ సవరణకు మద్దతిచ్చిన ఏకైక జడ్జి భగవతినే. అయితే ఆ కేసు విచారించిన ధర్మాసనంలో మెజారిటీ కారణంగా దాన్ని కొట్టివేశారు. ప్రధాని సంతాపం: భగవతి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడంలో భగవతి ఎంతో కృషిచేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు. -
ఓటుకు నోటు తీసుకున్న ఓటర్లపైనా చర్యలు!
- ఇచ్చిన, తీసుకున్నవారిపై చర్యలకు వినతి -ఆర్కేనగర్ ఉపఎన్నికలపై మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం -వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌కు కోర్టు ఆదేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉపఎన్నికలకుగాను ఓటర్లకు నోట్లు పంచినవారే కాదు తీసుకున్న వారిని సైతం నేరస్తులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ నటరాజన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. ఆర్కేనగర్ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారని ప్రాథమికంగా రుజువుకావడంతో ఈనెల 12వ తేదీన జరగాల్సిన ఎన్నికల పోలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ 9వ తేదీన ప్రకటించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నళినీ చిదంబరం కోర్టుకు చెప్పారు. అయితే నోట్లు పంచిన అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, నగదు పంపిణీకి నాయకత్వం వహించిన ఐదుగురు మంత్రులు ఇతర అనుచరులపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఆర్కేనగర్ పరిధిలోని పోలీసులను ప్రధాన ఎన్నికల కమిషన్ అదేశించలేదని తప్పుపట్టారు. నగదు పంపిణీకి బాధ్యులను, పుచ్చుకున్న ఓటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరాడు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది నిరంజన్ తనవాదనను వినిపిస్తూ, ఓటర్లకు నగదు పంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్ తరఫున చెన్నై పోలీస్ కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపి ఆ పత్రాలను అందజేశారు. ఆర్కేనగర్ పరిధిలోని రెండు లక్షల ఓటర్లను తనిఖీ చేయడం ఆచరణలో సాధ్యం కాదని, అలా చేస్తే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు ఎలా వస్తారని నిరంజన్ వాదించారు. ఈ పిల్‌పై భారత ఎన్నికల కమిషన్, తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి, చెన్నై పోలీస్ కమిషనర్ సవివరమైన నివేదికను కోర్టుకు సమర్పించాలని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎమ్ సుందర్ ఆదేశించారు. విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. -
సీజే, జడ్జీల ఖాళీల భర్తీపై పిల్ కొట్టివేత
- నియామక ప్రక్రియ కొనసాగుతోందని సుప్రీం చెప్పింది - దాన్ని గౌరవిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించడంతో పాటు న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలను భర్తీ చేసేలా కేంద్రం, సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి సహా, ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగుతోందంటూ ఇటీవల సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో దానిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక ప్రస్తుతం హైకోర్టులోని న్యాయమూర్తుల్లో తెలంగాణకు చెందిన వారు నలుగురు మాత్రమే ఉన్నారన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇది ఎంతమాత్రం సరికాదని, హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన న్యాయమూర్తులు ఉన్నారని, వారి పూర్వీకులు తెలంగాణవారు కారన్న కారణంతో వారిని ఈ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. సదరు న్యాయమూర్తుల డీఎన్ఏలో వారి పూర్వీకులు ఇక్కడి వారేనని తేలితే తప్ప వారిని ఇక్కడి వారిగా పరిగణించేటట్లు లేరని హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణి యన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. మా వద్ద మంత్రదండమేమీ లేదు.. హైకోర్టుకు 22 నెలలుగా పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి లేరని, అలాగే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో వేసిన పిల్‌పై ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి తమ వద్ద మంత్రదండమేదీ లేదని తన తీర్పులో వ్యాఖ్యానించింది. న్యాయమూర్తుల నియామకపు ప్రక్రియ విస్తృతమైన సంప్రదింపులతో జరిగేదని గుర్తు చేసింది. న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించి అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలకు విశ్వసనీయతనిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నామే తప్ప, ఆ వ్యాజ్యాన్ని విచారించే న్యాయ పరిధి లేకో.. వ్యాజ్యానికి విచారణార్హత లేకో కాదని తెలిపింది. హైకోర్టులో పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనని, దీంతో న్యాయమూర్తులపై భరించలేనంత పనిభారం పెరగడంతో పాటు, పెండింగ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉందని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు కొలీజియం న్యాయవాదుల నుంచి ఆరుగురు పేర్లను, జిల్లా జడ్జీల నుంచి నలుగురు పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తే, వారిలో నలుగురే నియమితులయ్యారని పేర్కొంది. -
కులమతాల ప్రస్తావన ఉండని స్వేచ్ఛ ఇవ్వండి
- హైకోర్టులో పిల్ దాఖలు సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో ప్రవేశాలు, పరీక్షలు, టీసీల జారీ మొదలుకుని.. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పలు సందర్భాల్లో నింపే దరఖాస్తుల్లో దరఖాస్తుదారుడి కులం, మతం గురించి ప్రస్తావించకుండా ఉండగలిగే స్వేచ్ఛను కల్పించాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన డి.రామకృష్ణారావు, సలాది క్లారెన్స్ కృపాలనీ దంపతులు దీనిని దాఖలు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది డి.సురేశ్‌కుమార్ వాదిస్తూ... దరఖాస్తుల్లో కుల, మత ప్రస్తావన చేయడం ఇష్టం లేనివారు ఎందరో ఉన్నారని, కానీ ఆ వివరాలు నింపకపోతే అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. వైద్య బిల్లులను 58:42 నిష్పత్తిలో చెల్లించండి: ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్(ఏపీఏటీ) రిటైర్డ్ సభ్యుల వైద్య బిల్లులను 58:42 నిష్పత్తిలో చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీఏటీ విశ్రాంత సభ్యులు తమ బిల్లులను ఏపీఏటీ చైర్మన్‌కు సమర్పించాలని సూచించారు. చైర్మన్ నుంచి బిల్లులు అందుకున్న 10 రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. -
కమల్ హాసన్ కు మరో చిక్కు
చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ పై కేసులు పరంపర కొనసాగుతోంది. హిందూ మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా తిరునల్వేలి జిల్లా కోర్టులో హిందూ మక్కల్ కట్చి(హెచ్ఎంకే) సభ్యులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇదే ఆరోపణలతో ఇంతకుముందు హెచ్ఎంకే నిర్వాహకులు ఈ నెల 15న చెన్నై పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహాభారతంలోని పాత్ర గురించి కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను హెచ్ఎంకే ఖండించింది. తమిళనాడులో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కమలహాసన్ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్నాడీఎంకేలో అధికారం కోసం జరిగిన కుమ్ములాటపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఫొటోలు జయ వద్దన్నారు
చెన్నై : అన్నాడీఎంకే కార్యకర్త జోసెఫ్ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్)ను ఇటీవల దాఖలు చేశాడు. అస్వస్తతకు లోనైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో అడ్మిటై 74 రోజులపాటూ చికిత్స పొంది డిశంబరు 5వ తేదీన మరణించారు. జయ మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రజలు భావించగా, ఐదు మంది రిటైర్డు న్యా యమూర్తులతో విచారణ జరిపించాల్సిందిగా కోర్టులో పిటిషన్లు దాఖలైనాయి. నాగపట్నం జిల్లాకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త జ్ఞానశేఖరన్, సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వైద్యనాధన్ జయ మృతిలో తనకు సైతం సందేహాలు ఉన్నాయని, సమాధి నుండి జయ భౌతికకాయాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయా అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా జోసెఫ్ పెట్టిన ఈ కేసు గతంలో విచారణకు రాగా ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరక్టర్ తదితరులు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి హెచ్ రమేష్ ముందుకు గురువారం విచారణకు వచ్చింది. కేంద్రం తరుపున బదులు పిటిషన్ దాఖలు చేసేందుకు మరో రెండువారాలు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరగా న్యాయమూర్తి మంజూరు చేశారు. వివరణ ఇచ్చిన అపోలో: కాగా, అపోలో ఆసుపత్రి యాజమాన్యం తరుపున గురువారం ఒక బదులు పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందే చిత్రాన్ని విడుదల చేయవద్దని జయలలిత కోరినట్లుగా అపోలో తెలిపింది. ఆమె అభీష్టాన్ని అనుసరించి ఫోటో, వీడియోను విడుదల చేయలేదని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ నియమ నిబంధనలను అనుసరించి రోగికి జరుగుతున్న చికిత్స వివరాలను వెల్లడించ కూడదని వారు అన్నారు. అయితే ఎప్పటికప్పుడు జయ చికిత్స వివరాలపై బులెటిన్లు విడుదల చేశామని తెలిపారు. ఈ బులెటిన్లు సైతం జయ ఆమోదం మేరకే విడుదల చేశామని అన్నారు. ప్రభుత్వ వివరణ : అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం బదులు పిటిషన్ దాఖలు చేసింది. వైద్యల సలహామేరకే జయకు చికిత్స చేశామని, ఇందులో ఎటువంటి గోప్యం లేదని స్పష్టం చేసింది. అయితే పిటిషన్ల తరుపు న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. జయకు బాగా చికిత్స చేశామని మాత్రమే చెబుతున్నారు, తాము కోరిన వివరాలు కోర్టు ముందు ఉంచలేదని న్యాయవాది వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ సైతం ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన వివరణనే పోలి ఉందని అన్నారు. జయ మృతిపై పూర్తిస్తాయి వివరణ ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది కోరగా న్యాయమూర్తి ఈ కేసు విచారణను రెండువారాలకు వాయిదావేశారు. -
ఫేస్బుక్, వాట్సాప్‌లపై మరో ఫిర్యాదు
న్యూఢిల్లీ: మార్క్ జుకర్ బర్గ్ ప్రమోటెడ్ ఫేస్బుక్, వాట్సాప్‌లపై మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ప్లాట్‌ఫామ్‌లపై అందిస్తున్న ఇంటర్నెట్ కాల్స్‌ను రెగ్యులేటరీ కిందకి తీసుకురావాలంటూ వీడీ మూర్తి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఓ పిల్‌ను దాఖలుచేశారు.. దీన్ని విచారించిన ఢిల్లీ హైకోర్టు ఫేస్బుక్, వాట్సాప్ పై నమోదైన పిల్‌పై తమ స్పందన ఏమిటో తెలుపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు నోటీసులను సంబంధిత మంత్రిత్వశాఖలకు జారీచేసింది. పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై ఆరు వారాల్లోగా అఫిడివిట్లు దాఖలు చేయాలని, తదుపరి విచారణను మే 3న చేపట్టనున్నట్టు బెంచ్ పేర్కొంది. ఫేస్బుక్, వాట్సాప్‌లు చేపడుతున్న ఈ నియంత్రణ లేని కార్యకలాపాలు దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని, ప్రజాఖజానాకు భారీగా నష్టాలు చేకూరుస్తాయని పిటిషనర్ తన పిల్లో పేర్కొన్నారు. ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను, ఇండియాలో ఇదే తరహాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వాటిని టెలికాం సర్వీసు ప్రొవైడర్లు లాగా ఓ రెగ్యులేటరీ ప్రేమ్ వర్క్‌లోకి తీసుకురావాలని పిటిషనర్ కోరారు. దీనికి సంబంధించి అథారిటీలను ఆదేశించాల్సిందిగా అభ్యర్థించారు. -
చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి
-
చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వేగం పెంచారు. తన తరఫున సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయించారు. శశికళకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతున్నా, ఆమెను గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని, 24 గంటల్లోగా ఆమెను ఆహ్వానించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. స్వయంగా శశికళ ఈ పిల్ దాఖలు చేయకపోయినా.. ఆమెకు మద్దతుగా ఇది దాఖలైనట్లు తెలుస్తోంది. 24గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శశికళను ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలని న్యాయవాది పీఎల్ శర్మ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా శశికళను ఆహ్వానించడం లేదని ఆయన తన పిటిషన్లో ఫిర్యాదు చేశారు. మరోపక్క, శశికళ శిబిరానికి సంబంధించిన వివరాలను పోలీసులు మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు. 119 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే ఉన్నారని, వారినుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అందులో పేర్కొన్నారు. క్యాంపులో ఉంటున్నవారంతా కూడా స్వచ్ఛందంగా ఉంటున్నట్లు వారు చెప్పారని కోర్టుకు వివరించారు. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
జయలలిత ఆస్తులు జాతీయం చేయాలి!
-
జయలలిత ఆస్తులు జాతీయం చేయాలి!
మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని, ఆమె ఆస్తుల నిర్వహణ కోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జిని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో బుధవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. గత ఏడాది డిసెంబర్ 5న మృతిచెందిన జయలలితకు చట్టబద్ధమైన వారసులు లేరని, తాను ప్రజల కోసం ప్రజల తరఫున పాటుపడుతున్నానని ఆమె తరచూ బహిరంగ సభలలో పేర్కొనేవారని, కాబట్టి ఆమె ఆస్తులను జాతీయం చేసేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిల్ కోరింది. తమిళనాడు సెంటర్ ఫర్ పబ్లిక్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. పిల్‌తోపాటు జయలలిత ఆస్తులతో కూడిన అఫిడవిట్‌ను కూడా న్యాయస్థానానికి సమర్పించింది. ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని.. వాటిని ప్రజాసంక్షేమం కోసం ఉపయోగించాలని కోరింది. జస్టిస్ ఏ సెల్వం, జస్టిస్ పీ కలైయరాసన్తో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. జయలలిత ఆస్తులివే.. 2015 జూన్ నెలలో ఆర్కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు జయలలిత ప్రకటించారు. ఆ ఆస్తులలో పోయెస్ గార్డెన్‌లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.43.96 కోట్ల నివాస గృహం వేద విలాస్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేసినట్టు భావిస్తున్నారు. ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆమె తన తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు. కాంచీపురం చెయూర్లోని ప్రాపర్టీని 1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవనాలున్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. రెండు టయోటా ప్రాడో ఎస్‌యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహింద్రా జీప్, 1980లో తయారు చేసిన అంబాసిడర్ కారు, మహింద్రా బోలెరో, స్వరాజ్ మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెస్సాలు జయలలిత దగ్గరుండేవి. ఈ మొత్తం తొమ్మిది వాహనాల ఖరీదు రూ.42.25 లక్షలు. 21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు తన దగ్గరున్నాయని తమిళనాడు సీఎంగా ఆమెనే ఓ సారి ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల్లో ఇవి ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయి. ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదేవిధంగా రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి ఉంది. ఇక, 2016 ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు తనకు రూ.41.63 కోట్ల చరాస్తులు, రూ.72.09 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు జయలలిత ప్రకటించారు. -
'అమ్మ' మరణం సుప్రీంకు
చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణంపై చెన్నైకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ఊహించనిరీతిలో అకస్మాత్తుగా ఆమె కన్నుమూయడం, ఆమెను పరామర్శించడానికి బంధువులు సహా ఎవరినీ అనుమతించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిల్ వేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంను కోరింది. అలాగే ఆమె చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులను (మెడికల్ డాక్యుమెంట్స్) స్వాధీనం చేసుకోవాలని కోరింది. కాగా తీవ్ర జ్వరంతో అపోలో ఆసుపత్రిలో చేరిన అమ్మ కోలుకుంటున్నారన్న ఆనందం ఎంతో సేపు నిలవకుండానే కార్డియాక్ అరెస్ట్ తో ఈ లోకాన్ని వీడడం విషాదాన్ని నింపింది. రేపో మాపో డిశ్చార్చ్ కానున్న అమ్మ ఆకస్మిక మృతితో అన్నాడీఎంకే కార్యకర్తలు,ఇతరులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. -
గ్రేటర్లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ
- నివాస ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా చేస్తున్నారు - అయినా గ్రేటర్ అధికారులు పట్టించుకోవడం లేదు - హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం.. నేడు విచారణ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాస భవన సముదాయాలను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారని, నివాస ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా మార్చేస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నా, రోడ్లను కూరగాయల మార్కెట్లుగా మార్చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ సికింద్రాబాద్, శాంతినగర్‌కు చెందిన పి.సంతోష్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యాన్ని విచారణ జరపనుంది. నగరంలోని బాగ్‌లింగంపల్లి కాలనీలో హౌసింగ్ బోర్డ్ నిర్మించిన గృహ సముదాయాలను పలువురు ఇటీవల కాలంలో అనుమతుల్లేకుండా వాణిజ్య సముదాయాలుగా మార్చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు. అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారని వివరించారు. దీనిపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదన్నారు. నల్లకుంటలోని ఇన్నర్ రోడ్డును కూరగాయల మార్కెట్‌గా మార్చేశారని, కుళ్లిన కూరగాయలను రోడ్లపై పడేస్తున్నారని, దీంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా తయారవుతోందని తెలిపారు. అలాగే శివం రోడ్డులోనూ నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమ నిర్మాణాలు వెలిశాయన్నారు. వీటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తగిన గాలి, వెలుతురు లేక అరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని తెలి పారు. 80 చదరపు గజాల స్థలంలో 4 అంతస్తులతో పాటు పెంట్ హౌస్‌లను నిర్మిస్తున్నారని, గ్రేటర్ పరిధిలోని ప్రతీ కాలనీలోనూ పరిస్థితి ఇలానే ఉందన్నారు. -
అమ్మ వేలిముద్ర వ్యవహారంలో మేం తలదూర్చం
తమిళనాడు సీఎం జయలలిత ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ అన్నాడీఎంకే అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకం బదులు వేలిముద్ర వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము తలదూర్చమంటూ, ఎన్నికల సంఘమే పత్రాల్లో ప్రామాణికతను ధృవీకరిస్తుందని ఆ పిల్‌ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఎన్నికల గుర్తులు ఇప్పటికే అలాట్ చేసేశారు, ఈ సమయంలో తాము తలదూర్చడం కరెక్ట్ కాదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలైనా తలెత్తి, అవి సవాల్ చేయదగ్గవి అయితే అది ఎలక్షన్ పిటిషన్ కిందకు వస్తుందని కోర్టు తీర్పు చెప్పింది. దాదాపు నెలరోజులకు పైగా ఆస్పత్రిలో అస్వస్థతో బాధపడుతున్న అమ్మ జయలలిత, ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ అన్నాడీఎంకే ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకం బదులు వేలిముద్రవేశారు. అంతే వివాదం అక్కడ చెలరేగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని వార్తలొస్తుంటే, జయలలిత వేలిముద్ర వేయడేమేమిటంటూ.. కనీసం అమ్మ సంతకం చేసే స్థితిలో కూడా లేరా అంటూ వాదనలు వినిపించాయి. ఆరోగ్యంగా ఉంటే సంతకం చేసేవారు కదా అంటూ పలువురు వాపోయారు. అసలు ఈ వేలిముద్రలు జయలలితవేనా ? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ వివాదం మద్రాసు హైకోర్టు దాకా వెళ్లింది. నామినేషన్ పత్రాలపై అమ్మ వేలిముద్రను సవాలు చేస్తూ కోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సామాజిక కార్యకర్త కే రామస్వామి దాఖలు చేశారు. అరవకురిచ్చి, తంజావూర్, తిరుప్పరాంగుండ్రం అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న అన్నాడీఎంకే ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తులో సంతకం బదులు అమ్మ ఎడమ చేతి వేలిముద్ర వేశారని, సంతకం బదులు వేలిముద్ర వేయడం ఎన్నికల సంఘ ప్రక్రియ నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది న్యాయవిరుద్ధమని తీర్పు చెప్పాలని ఆయన కోరారు. వేలిముద్రను అంగీకరించడానికి ఎన్నికల కమిషన్ చాలా ఆతృతతో వ్యవహరించిందని దుయ్యబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరుఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ కోర్టు ముందు హాజరై, కోర్టుకు తమ వాదనలు వినిపించారు. చీఫ్ ఎలక్షన్ కార్యాలయం ముందుగానే ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలిపింది. ప్రభుత్వ వైద్యుని సమక్షంలోనే అమ్మ వేలిముద్ర వేశారని, వేసిన వేలిముద్ర ఉప ఎన్నికల్లో చెల్లుబాటు అవుతుందని సీఈసీ కూడా స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం వేలిముద్రతో కూడిన బీఫాంలపై ఆమోద ముద్ర వేశారు. -
నిధుల దుర్వినియోగంపై దర్యాప్తునకు ఆదేశించండి
⇒ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: మౌలానా అబ్దుల్ కలామ్ సుజల స్రవంతి కింద గోదావరి నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు సంబంధించిన పైప్లైన్ల నిర్మాణంలో రూ.24 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని, దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన పొన్నాల శశికుమార్ దాఖలు చేశారు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జలమండలి ఎండీ, జలమండలి మాజీ ఎండీ జగదీశ్వర్, ఆపరేషన్ డెరైక్టర్ జి.రామేశ్వర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘గోదావరి నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు రూ.3,375 కోట్లతో 186 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఇందులో గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక నుంచి ఘన్పూర్ రిజర్వాయర్ వరకు 58 కిలోమీటర్ల మేర రూ.810 కోట్ల విలువైన పైపులైన్ నిర్మాణ పనులను ఎల్అండ్టీ-కెబీఎల్-మేటాస్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది. పైపులైన్ వేసేందుకు కొన్ని నిర్మాణాలు అడ్డుగా వస్తున్నందున అలైన్మెంట్ మార్చాలని జలమండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.23.35 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని తేల్చారు. వాస్తవానికి ఇక్కడ అదనపు పైపులైన్ నిర్మాణం చేపట్టనే లేదు. నాణ్యతను పరిశీలించిన వ్యాప్‌కోతో జగదీశ్వర్, రామేశ్వర్, ఎల్అండ్టీ జేవీ కుమ్మక్కయ్యారు. చేయని పనులను చేసినట్లు బోగస్ బిల్లులు సష్టించారు. అడిగిందే తడవుగా అదనపు పనుల పేరుతో రూ.23.35 కోట్లు విడుదల చేశారు. దీనిపై అన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులకు వినతిపత్రాలు సమర్పించాను. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరాను. అయినా కూడా అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాలి’ అని సాయికుమార్ తన పిటిషన్లో అభ్యర్థించారు. -
‘జడ్జీలకు ఎవరి సర్టిఫికెట్లూ అవసరం లేదు’
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత కోసం ఓ సంస్థను ఏర్పాటు చేయాలంటూ జాతీయ న్యాయవాదుల సంఘం వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు ఎవరి సర్టిఫికెట్లు అవసరంలేదని జస్టిస్ ఏకే మిశ్రా, జస్టిస్ లలిత్‌ల ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో బంధుప్రీతి చోటుచేసుకుటోందన్న జాతీయ న్యాయవాదుల సంఘం చేసిన వాదనలతో ధర్మాసనం విభేదించింది. ప్రతిభ కలిగిన వారికి కొలీజియం అన్యాయం చేసిందన్న వాదనలు అవాస్తవమంటూ పిటిషన్‌ను కొట్టేసింది. -
ఈడీ డైరెక్టర్ నియామకంపై సుప్రీంలో పిల్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా కర్నల్ సింగ్ నియామకం, తర్వాత పదవీకాలాన్ని పొడిగించడం చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ముంబైకి చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉదయ్‌బాబు ఖల్వాదేకర్ దాఖలు చేసిన ఈ పిల్‌పై వచ్చే వారం విచారణ జరగనుంది. 2015 నవంబర్ నుంచి 2016 నవంబర్ వరకు సింగ్ పదవీకాలాన్ని పొడిగించారని, ఇది కేంద్ర విజిలెన్స్ చట్టంలోని సెక్షన్25(డి) ప్రకారం పూర్తి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా నియమితులైన వ్యక్తి ఆ పదవిలో కనీసం రెండేళ్లపాటు కొనసాగాలని తెలిపారు. ఈడీ డైరెక్టర్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరించడానికి, నిర్భయంగా చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వ ఒత్తిడులు పనిచేయకుండా ఉండడానికే రెండేళ్లు కచ్చితమైన నియామకం ఉండాలని చట్టంలో పేర్కొన్నారని వివరించారు. కానీ ఇందుకు వ్యతిరేకంగా ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, నియామకాలు, శిక్షణ శాఖ, కేంద్ర విజిలెన్స్ కమిషన్లు వ్యవహరించాయన్నారు. గతంలో యూపీఏ2 హయాంలో కూడా ఇలాంటి చట్టవిరుద్ధ పద్ధతులే అనుసరించారని పేర్కొన్నారు. -
అంతా కళ్లప్పగించి చూశారే తప్ప..
ఢిల్లీ: కావేరి అల్లర్లపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే అందరూ కళ్లప్పగించి చూశారు తప్ప ఏ ఒక్కరు వాటిని నివారించేందుకు ప్రయత్నించలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషనర్ అందులో పేర్కొన్నాడు. కావేరి జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 25 వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో శివకుమార్ అనే ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య ఘర్షణకు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అల్లర్ల సందర్భంగా జరిగే నష్టానికి ఎవరు పరిహారం చెల్లిస్తారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కొత్త జిల్లాల నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిల్
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం గత నెల 22న జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఏజెన్సీ ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో కొన్ని మండలాలతో కొత్త జిల్లాల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ ముగిసేంత వరకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా పునర్విభజన కమిటీ చైర్మన్, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సలహా మండలి చైర్మన్, గవర్నర్ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉండవని, గవర్నర్‌కు మాత్రమే అధికారాలు ఉంటాయని శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాలను ఆ జిల్లా నుంచి విడదీసి కొత్తగా ఏర్పాటు చేయదలచిన మహబూబాబాద్‌లో కలపనున్నారు. అలాగే వరంగల్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ మండలాలను కూడా మహబూబాబాద్‌లో కలపనున్నారు. వరంగల్ జిల్లాలోని ములుగు, గోవిందరావుపేట్, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట్ మండలాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలో చేర్చనున్నారు. అదే విధంగా అదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే కొమరం భీం జిల్లాలో చేర్చనున్నారు. రాజ్యాంగం ప్రకారం ఈ షెడ్యూల్ ప్రాంతాలపై పూర్తి అధికారాలు గవర్నర్‌వే. ఈ ప్రాంతాల్లో చేయబోయే ప్రతీ పనిని గిరిజన సలహా మండలిని సంప్రదించిన తరువాతే చేయాలి. కానీ, ఇక్కడ ప్రభుత్వం నేరుగా నోటిఫికేషన్ జారీ చేసేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం.’ అని శ్రీనివాస్ తన వ్యాజ్యంలో వివరించారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు -
వేర్పాటువాదులకు ప్రభుత్వ ధనంపై పిల్
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. వేర్పాటువాదుల విదేశీ ప్రయాణాలు, ఇతర వ్యవహారాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా చూడాలని పిల్ లో కోరారు. వేర్పాటువాదులకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలుపైగా ఖర్చు చేసిందని వెల్లడించారు. ప్రభుత్వ ధనాన్ని వేర్పాటువాదులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్ వెల్లడించిన అంశాలతో ఏకీభవిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. అయితే పిల్ ను కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్పించాలని సూచించింది. -
వాట్సాప్ పాలసీపై హైకోర్టులో సవాల్
పాపులర్ మెసేజింగ్ సర్వీసు యాప్ వాట్సాప్ ఇటీవల తీసుకున్న ప్రైవేట్ పాలసీ మార్పులపై సవాళ్లు ఎదురవుతున్నాయి. పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో వాట్సాప్ డేటా షేరింగ్‌ను సవాల్ చేస్తూ ఓ ఇద్దరు విద్యార్థులు కోర్టుకెక్కారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, 2012లో నిర్ణయించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, లక్షలాది యూజర్ల ప్రైవసీ హక్కులను హరిస్తుందని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శ్రేయా సేథీ, కర్మన్య సింగ్ సారిన్ అనే వాట్సాప్ యూజర్లు ఢిల్లీ హైకోర్టులో ఈ పిల్‌ను ఫైల్ చేశారు. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్‌తో కూడిన బెంచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీఓటీ), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)లకు నోటీసులు జారీచేసింది. సెప్టెంబర్ 14లోపు ఈ పిల్‌పై తమ స్పందన తెలపాలని ఆదేశించింది. గతవారంలోనే ఈ కొత్త ప్రైవసీ పాలసీని వాట్సాప్ ప్రకటించింది. పేరెంట్ కంపెనీతో యూజర్ల డేటాను షేర్ చేసుకోనున్నట్టు వెల్లడించింది. ఫోటోలు, మెసేజ్‌లు మాత్రం షేర్ చేయడం లేదని వాట్సాప్ తెలిపింది. సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పాలసీని కమర్షియల్ అడ్వర్టైజింగ్కు, మార్కెటింగ్‌కు యూజర్ల డేటాను వాడుకోనున్నట్టు ఫేస్బుక్, వాట్సాప్‌లు వెల్లడించాయి. అయితే ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని, ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు యూజర్ల ప్రైవసీ హక్కులను హరిస్తుందని ఆరోపించారు. -
ఎంసెట్-2 లీకేజీపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు నేతృత్వంలో విచారణ చేయాలని, ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఐడీ చీఫ్ సమావేశమయ్యారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై చర్చించారు. కాగా, ఎంసెట్-2 లీకేజీపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
బీరు బాధిస్తోందంటూ పిల్..
న్యూఢిల్లీ: మతసంబంధాలను కించపరిచిందంటూ 'గాడ్ ఫాదర్' పేరుతో విక్రయాలు జరుపుతున్న బీరును దేశ రాజధానిలో నిషేధించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ మేరకు పిల్ వేసిన ఓ స్వచ్ఛంద సంస్థ, బీరుకు పెట్టిన పేరులో 'గాడ్' అనే పదం ఉందని, ఇది అన్ని మతాల ప్రజల భావోద్వేగాలను కించపరుస్తోందని పేర్కొంది. ఈ బీరు తయారీదారులు కావాలనే అన్ని వర్గాల ప్రజల మనోభవాలను దెబ్బతీసేలా ఆ పేరును పెట్టారని స్వచ్ఛంద సంస్థ 'జన్ చేతన మంచ్' అధ్యక్షుడు దేవిందర్ సింగ్ పిటిషన్ లో వివరించారు. ఈ కేసును ఫైల్ చేసిన లాయర్ ఏపీ సింగ్ పదాలు 'గాడ్', 'ఫాదర్'లకు మతాలలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. 'గాడ్ ఫాదర్' పేరును తొలగిస్తూ తయారీ దారు జాతీయ న్యూస్ పేపర్ల ద్వారా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పిటిషన్ లో కోరారు. కాగా, ఈ పిటిషన్ వచ్చేవారం వాదనలు జరగనున్నాయి. 'గాడ్ ఫాదర్' బీరు ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. -
సదావర్తి భూములపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయల విలువ చేసే సదావర్తి సత్రం భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామమాత్రపు ధరకే విక్రయించిన వ్యవహారంపై జుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇప్పటికే జరిగిన సదావర్తి సత్రం భూముల అమ్మకాలను రద్దు చేసి, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సదావర్తి సత్రం ఈవో, ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్, పెద్దకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. -
తెలుగుకు ప్రాచీన హోదా ఎలా కల్పించారు?
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు సాక్షి ప్రతినిధి, చెన్నై: తెలుగు తదితర ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదాను ఏ ప్రాతిపదికన కల్పించారో ఆధారాలు సహా చూపాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తెలుగు తదితర భాషలకు కల్పించిన ప్రాచీన హోదాను రద్దు చేయాల్సిందిగా సీనియర్ న్యాయవాది ఆర్ గాంధీ ఇటీవల దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. పిల్లో వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేలాది భాషలు ఉండగా రెండు వేల సంవత్సరాలకు పైగా సాహిత్య సంపద, గ్రంధాలు కలిగి ఉన్న భాషలకు మాత్రమే ప్రాచీన భాష హోదాను కల్పిస్తున్నారు. ఆయా ప్రమాణాలు లేని కారణంగానే అరబిక్, పర్సియన్ తదితర భాషలకు ప్రాచీన హోదా ఇవ్వలేదు. అలాంటిది తెలుగు, కన్నడాలకు 2005లోనూ, మలయాళంకు 2013లోనూ, ఒడిశాకు 2014లోనూ ప్రాచీనభాష హోదాను ఎలా కల్పించారు. తగిన అర్హత లేకుండా వాటికి కల్పించిన ప్రాచీన హోదాను రద్దు చేయాలని పిల్లో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహాదేవన్‌ల ముందుకు సోమవారం పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిల్ విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తె లుపుతూ, పిటిషన్ దారుడు పేర్కొన్న తెలుగు తదితర భాషలకు ప్రాచీన హోదా ఎలా కల్పించారు, ఇందుకు ఉన్న ఆధారాలు ఏమిటో తగిన డాక్యుమెంట్లతో కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు 13వ తేదీన నేరుగా హాజరుకావాలని ఆదేశించారు. -
డయల్ 100 సర్వీసుపై న్యాయమూర్తి ఫిర్యాదు
న్యూఢిల్లీ: అత్యవసర ఫోన్ నెంబర్ డయల్ 100 కి ఫోన్ చేయగా ఎంతసేపటికీ రెస్పాన్స్ రాక పోవడంతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సింఘీ బిత్తరపోయారు. తన ఫోన్ కాల్ ను సమాధానం చెప్పకుండా హొల్డ్ లో ఉంచారని దీనిపై ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణికి లేఖ రాశారు. దీనిని పిల్ గా స్వీకరించిన కోర్టు సుమోటాగా విచారించనుంది. ఈ లేఖలో ఆయన రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ వర్మని ప్రతివాదిగా చేర్చారు. ఏప్రిల్ నెల 29న ఒక ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా వసంత్ కుంజ్ చౌరస్తాలో రాత్రి 10 గంటల ప్రాంతంలో చాలా సేపు ట్రాఫిక్ జామ్ అయింది. న్యాయమూర్తి దాదాపు 40 నిమిషాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. అందుబాటులో ట్రాఫిక్ పోలీసు కూడా లేకపోవడంతో ఆయన డయల్ 100కి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ ను వారు హొల్డ్ లో ఉంచి ఎంతసేపయినా సమాధానం చెప్పలేదని ఆయన వాపోయారు. -
సీబీఐ మాజీ డైరెక్టర్ కు చుక్కెదురు!
చెన్నై: సీబీఐ మాజీ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ బీసీసీఐపై దాఖలు చేసిన పిల్ (వ్యాజ్యం) ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఐపీఎల్ నిర్వహణ విషయంలో బీసీసీఐకి వచ్చే ఆదాయంలో భారీగా కోతపడుతుందని, చైర్మన్ శశాంక్ మనోహర్ నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు. ఐపీఎల్ నిర్వహణ వల్ల ఐసీసీ నుంచి బీసీసీఐ బోర్డుకు రావలసిన ఆదాయంలో శశాంక్ మనోహర్ తీరు వల్ల ఆర్థికంగా లోటు ఏర్పుడుతుందని విజయనారాయణ్, రాఘవన్ తమ వాదనలు వినిపించారు. సీబీఐ మాజీ డైరెక్టర్ దాఖలు చేసిన పిల్ విచారణకు రాగా, చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టిపారేసింది. 2015-23 మధ్యకాలంలో ప్రసార హక్కుల రూపంలో వచ్చే ఆదాయంలో ఐసీసీ నుంచి బీసీసీఐకి 21 శాతం వాటానే వస్తుందని, అయికతే కనీసం 1000 కోట్ల రూపాయలు బోర్డు ఖజానాకు గండిపడుతుందని ధర్మాసనానికి తెలిపారు. కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా పిల్ దాఖలు చేశారని ఈ విషయాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు పిటిషనర్ వద్ద కూడా లేదని బీసీసీఐ సభ్యులు వివరణ ఇచ్చుకున్నారు. శశాంక్ నిర్ణయాల వల్ల ఆరు శాతం వాటాలో తగ్గింపులు జరిగాయని రాఘవన్ ఆరోపించారు. ఐపీఎల్ ఒప్పందం అనేది ప్రైవేట్ ఒప్పందాల కిందకి వస్తుందని, పిల్ వెనక్కి తీసుకోవాలని సూచించింది. -
మున్సిపాలిటీలుగా మార్చడం సరికాదు
ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటీసు ఆధారంగా ఇప్పుడు జీవో ఇచ్చారు హైకోర్టులో ఎంపీపీ విక్రంరెడ్డి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండల పరిధిలోని మీర్‌పేట, జిల్లెలగూడ, కొత్తపేట, బాలాపూర్, జల్లపల్లి, పహాడీషరీఫ్ గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీవో 28ని కొట్టేసి, ఆ గ్రామాల్లో పంచాయతీల విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సరూర్‌నగర్ ఎంపీపీ తీగల విక్రంరెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ డెరైక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కొన్ని మార్గదర్శకాలకు లోబడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ అయిన షోకాజ్ నోటీసుల ఆధారంగా ఇప్పుడు డీ నోటిఫై నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసి, గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం తప్పనిసరన్నారు. అయితే ఈ విధి విధానాలను ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం హైకోర్టు విచారించనుంది. -
'మందుకు నీళ్లిస్తారు.. మనుషులకివ్వరా?'
వరంగల్: రాష్ట్రంలో తాగునీరు కొరతతో జనం, పశువులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ టీడీపీ నేత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. బీర్లు, వైన్, విస్కీ తయారు చేసే బేవరేజెస్ కంపెనీలకు మాత్రం ప్రభుత్వం లక్షల లీటర్ల నీటిని అందిస్తోందని ఆరోపించారు. బేవరేజెస్ కంపెనీలకు ఇచ్చే నీటిని నిలిపివేసి వాటిని ప్రజల తాగునీటి కోసం అందించి వారి దాహార్తిని తీర్చాలని అన్నారు. ప్రభుత్వం స్పందిచకపోతే హైకోర్టును ఆశ్రయించి, ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని అన్నారు. -
ఇక గర్భనిరోధక మాత్రలతో పనిలేదట!
లండన్: మహిళలు భవిష్యత్‌లో గర్భనిరోధక మాత్రలను తీసుకోనవసరం లేదా? అవుననే అంటోంది 'నేచురల్ సైకిల్' పేరుతో వస్తున్న ఆండ్రాయిడ్ యాప్. ఈ యాప్ సహాయంతో గర్భం దాల్చే అవకాశాలను తెలుసుకోవచ్చునని ఎస్బీస్.కామ్ ప్రచురించింది. ఒక మహిళ రోజూవారి శారీరక ఉష్ణోగ్రతల తేడాను యాప్‌లోని అల్గారిథమ్ ద్వారా తెలుసుకోవచ్చని తేల్చారు. తాజా ఆవిష్కరణ ద్వారా ఫెర్టిలిటీకి సంబంధించిన సూచనలను తెలుసుకోవచ్చని, తద్వారా అవాంఛిత గర్భాలను నిరోధించ వచ్చని పరిశోధకులు చెబుతున్నారు. గర్భనిరోధక మాత్రలతో పనిలేకుండా, నేచురల్ సైకిల్స్ డేటాను ఉపయోగించుకుని గర్భధారణను నియంత్రించుకోవచ్చని ఈ యాప్‌ను తయారుచేసిన వారిలో ఒకరైన ఎలినా బెర్గ్లండ్ చెప్పారు. స్వీడన్లో 4,000 వేల మందికి పైగా 25-30 ఏళ్ల వయసు గల మహిళలపై నిర్వహించిన పరిశోధనల్లో పెర్ల్ ఇండెక్స్‌లో గర్భనిరోధక మాత్రల్లానే నేచురల్ సైకిల్స్ కూడా పనిచేయడాన్ని గమనించారు. ఒక సంవత్సరకాలంలో ఎంతమంది మహిళలు యాక్సిడెంటల్‌గా గర్భం ధరిస్తున్నారన్న విషయాన్నిపరిశీలించారు. పిల్ ఉపయోగిస్తున్నవెయ్యి మంది స్త్రీలలో ముగ్గురు అనుకోకుండా గర్భం ధరిస్తోంటే. ఈ యాప్‌ను ఉపయోగించిన వారిలో ప్రతి వెయ్యి మందిలో ఐదుగురు స్త్రీలు మాత్రమే అనుకోకుండా గర్భం ధరించడం విశేషమని యాప్ రూపకర్తలు వెల్డడించారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అండ్ రీ ప్రొడక్టివ్ హెల్త్ కేర్ లో ఈ పరిశోధనా పత్రం ప్రచురితమైంది. -
ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్
బెంగళూరు : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల విషయమై కర్ణాటక హైకోర్టులో సోమవారం ప్రజాహిత వాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల తాగునీటి విషయమై ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అయితే ఐపీఎల్ కోసమంటూ ఎక్కువ పరిమాణంలో నీటిని స్టేడియంలోని పిచ్‌లను తడపడం సరికాదంటూ నగరానికి చెందిన శ్రీనివాస్‌శర్మ అనే అర్చకుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేకాకుండా సదరు నీటిని కూడా జలమండలి అక్రమంగా సరఫరా చేస్తోందని ఫిర్యాదుదారుడు న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల చిన్నస్వామి స్టేడియంకు వినియోగించే నీటిపై ఆడిట్‌ను జరపాల్సిన అవసరం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రోజా సస్పెన్షన్‌పై హైకోర్టులో పిల్
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ప్రభుత్వం అక్రమంగా ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయంపై సోమవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేయడంపై పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరపనున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీకి వెళ్లిన రోజాను ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం పట్ల పలువురు న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
బాబు అక్రమ నివాసంపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసుకున్న నివాసంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 60 ఎకరాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. గతంలో స్థానిక తహశీల్దార్ ఇచ్చిన నోటీసుపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. సాక్ష్యాత్తూ.. ముఖ్యమంత్రే నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణానది కరకట్ట పక్కనే నివాసం ఏర్పాటు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
ద్రోహులను సమర్ధించడం కూడా రాజద్రోహమే
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం అంతకంతకూ ఉధృత రూపం దాలుస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దేశ ద్రోహం కేసు పెట్టడాన్ని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సమర్ధించారు. దేశద్రోహులను సమర్ధించడంకూడా రాజద్రోహం కిందికి వస్తుందని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి వత్తాసు పలకడం, వారితో స్నేహం చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. అటు రాజ్యంగపరంగాగానీ, ఇటు ఆధ్యాత్మికపరంగా గానీ సమర్ధనీయం కాదంటూ రాందేవ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నేరంగానే పరిగణించాలన్నారు. ఇప్పటికే ఈ వివాదంలో కన్హయ కుమార్, యూనివర్శిటీ మాజీ అధ్యాపకుడు గిలానీలపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. అదే క్రమంలో జేఎన్‌యూ విద్యార్ధులకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా రాజద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసుపై విచారించేందుకు అలహాబాద్ కోర్టు అంగీకరించింది. భారతీయ శిక్షా స్మృతి (200 సెక్షన్) ప్రకారం రాహుల్‌పై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సుశీల్ కుమార్ ఆదేశించడంతో మరింత అగ్గి రాజుకుంది. ఇదిఇలా ఉంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి దేశరాజధాని నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీ నేతృత్వంలో పలువురు సీనియర్ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. -
'సరి-బేసి'ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు తలపెట్టిన సరి-బేసి వాహన విధానాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. 1988నాటి మోటారు వాహనం చట్టాన్ని సరిగ్గా అమలుచేయకుండా, కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై ఈ చట్టం కింద కఠిన చర్యలు చేపట్టకుండా.. అందుకు బదులుగా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే 'సరి-బేసి' విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం గతంలో 15 రోజులపాటు సరి-బేసి విధానాన్ని అమలుచేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాలుష్య పరీక్షలు ఒక ప్రహసనంగా మారిపోయాయని, ప్రభుత్వానికి, ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధం లేకుండానే వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు జారీచేస్తున్నారని ఈ పిల్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ హైకోర్టుకు నివేదించింది. దీనిపై చీఫ్ జస్టీస్ జీ రోహిణి, జస్టీస్ జయంత్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ మార్చి 30 లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్న్‌కు నోటిసులు ఇచ్చింది. సరి-బేసి విధానాన్ని ఏప్రిల్ 15 నుంచి 30 వరకు మరోసారి అమలుచేయనున్నట్లు సీఎం క్రేజీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'అన్నింటికి అమ్మేంటి.. ఆ ప్రచారమేంటి?'
మదురై: తమిళనాడులో అమ్మ పేరిట పథకాలు రావడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పేర్లకు అమ్మ, పురుచ్చి తలైవి(విప్లవాత్మక నేత) అని చేర్చడం, ఆ పేరిట ప్రకటనలు ప్రచురించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీ రథినం అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మున్ముందు అలాంటి ప్రకటనలు అలాంటి పనులు చేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాలని అందులో కోరారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును ఇలా పథకాల పేరిట వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించకుండా ఉండేలా చూడాలని కోరుతూ కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రచారం చేసుకునేందుకే పథకాల పేర్లు పెడుతున్నారని, వాటి ప్రకటనల్లో కూడా ఆమె పేరును చేరుస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అమ్మ కాల్ సెంటర్, అమ్మ మైక్రో లోన్స్ స్కీమ్స్ అంటూ ప్రతిరోజు దినపత్రికల్లో వేల కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని కూడా పిటిషనర్ అందులో పేర్కొన్నారు. -
నా కెప్టెన్సీపై ‘పిల్’ వేయాల్సిందే!
మెల్బోర్న్: కెప్టెన్‌గా తన పనితీరును అంచనా వేసేందుకు ఇక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయాలేమోనని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. వరుస పరాజయాలతో ధోని నాయకత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో అతను ఈ మాట అన్నాడు. ‘నా ప్రదర్శనను నేను సమీక్షిస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అవుతుంది. కాబట్టి ఒక ‘పిల్’ దాఖలు చేసి నా కెప్టెన్సీ పనితీరును విశ్లేషించాలి’ అని అతను చెప్పాడు. బౌలింగ్‌లో అనుభవం లేకపోవడమే జట్టు ఓటమికి కారణమని కెప్టెన్ అభిప్రాయ పడ్డాడు. ఇషాంత్ సీనియర్ అయినా వన్డేల్లో పెద్దగా అనుభవం లేదని... ఉమేశ్ రెగ్యులర్ సభ్యుడు కాకపోగా, మిగతా వాళ్లంతా కొత్త కుర్రాళ్లేనని కెప్టెన్ గుర్తు చేశాడు. నాయకుడి స్థానంలో ఎవరున్నా జట్టు లోపాలు సరిదిద్దడం ముఖ్యమన్న ధోని, ఫీల్డింగ్ వైఫల్యం కూడా మూడో వన్డేలో ఓటమికి కారణమన్నాడు. ఆల్‌రౌండర్‌గా వారి నైపుణ్యం పరిశీలించేందుకే గుర్కీరత్, రిషి ధావన్‌లకు అవకాశం ఇచ్చామని, వారు ఆకట్టుకున్నారని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లిపై ప్రశంసలు: విరాట్ కోహ్లిని చిన్న వయసు నుంచి చూస్తున్నానని, అతను కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతమని ధోని ప్రశంసించాడు. ‘అతను ఇన్నేళ్లలో తన నైపుణ్యం మెరుగుపర్చుకుంటూ నిలకడగా ఆడాడు. భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో కోహ్లి ఒకడు. కోహ్లి టాపార్డర్‌లో పనికొస్తాడని గుర్తించడం నేను చేసిన మంచి పని. ఆ తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. భవిష్యత్తులో సుదీర్ఘ కాలం పాటు భారత జట్టును ముందుకు నడిపించగల సత్తా అతనిలో ఉంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. -
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పిచ్చింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 1నుంచి ఆస్తులు వేలం వేస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కోర్టుకు వివరించింది. ఎమ్‌ఎస్‌టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీకి వేలం బాధ్యతలు అప్పగించామని కమిటీ తెలిపింది. మొదటి విడతలో సంస్థకు చెందిన ఆరు ఆస్తులు వేలం వేయనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎమ్‌ఎస్‌టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీలలో ఒక్కో సంస్థకు రెండు ఆస్తులు వేలం వేసేందుకు అప్పగిస్తామన్నారు. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో వెబ్సైట్ ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, టెండర్ల వివరాలను అందులో పొందుపరచాలని హైకోర్టు ఆదేశించింది. తొలి విడత వేలంలో రూ.3500 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ సంస్థ కోర్టుకు వివరించింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు హైకోర్టులో విచారణకు రాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా పడింది. -
‘ఓటుకు కోట్లు’పై పిల్ కొట్టివేత
న్యాయవాది పీవీ కృష్ణయ్య తీరుపై హైకోర్టు మండిపాటు కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు దర్యాప్తును ఏసీబీ నుంచి సీబీఐకి బదలాయించాలం టూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టేసింది. పార్టీ ఇన్ పర్సన్‌గా (పిటిషనర్ కమ్ న్యాయవాది) ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది పి.వి.కృష్ణయ్య తీరుపై మండిపడింది. కృష్ణయ్య తన చర్యల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొదటి నుంచి కృష్ణయ్య వ్యవహరించిన తీరును తమ ఉత్తర్వుల్లో ప్రస్తావిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే తాను రూ.లక్ష డిపాజిట్ చేయాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ కృష్ణయ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడి న ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని, అందువల్ల కేసును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కృష్ణయ్య పిల్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిల్ దాఖలు వెనుక సదుద్దేశాలు ఉన్నాయని నిరూపించుకోవాలని, ఇందు కు గాను రూ. లక్షను కోర్టులో డిపాజిట్ చేయాలని, ఆ తర్వాతే కేసు తదుపరి విచారణను చేపడతామంటూ విచారణను వాయిదా వేసింది. కేసు తదుపరి విచారణ సమయంలో లక్ష రూపాయల డిపాజిట్ ఉత్తర్వులపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నానని కృష్ణయ్య తెలిపారు. దీంతో ధర్మాసనం కేసును వాయిదా వేసింది. అయితే కృష్ణయ్య సుప్రీంకోర్టులో కేసు వేశానని ఒకసారి, కేసు వేయలేదని మరోసారి చెప్పి వాయిదాలు కోరారు. ఈ నేపథ్యంలో తన కేసును న్యాయవాది రాజుకు అప్పగించారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని తెలుసుకున్న ధర్మాసనం.. కృష్ణయ్య వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. తాజాగా వ్యాజ్యం విచారణకు రాగా.. వ్యక్తిగత సమస్యల వల్ల కృష్ణయ్య కోర్టు ముందు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది రాజు కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట్నుంచీ ఈ కేసులో కృష్ణయ్య ఇలాగే వ్యవహరిస్తున్నారని, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడింది. ఆయన తీరును ఉత్తర్వుల్లో పొందుపరిచింది. పిల్‌ను, దానితోపాటు అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. -
తక్షణ విచారణ అవసరం లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంలో ఆయనపై కేసు నమోదు చేసేలా సీబీఐని ఆదేశించాలని, నేరుగా నివేదిక సుప్రీంకోర్టుకే సమర్పించాలని న్యాయవాది మనోహర్ లాల్ శర్మ ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై తక్షణమే విచారణ జరపాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెల్ ఎల్ దత్తు నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ తనకున్న బ్రిటన్ పౌరసత్వాన్ని దాటిపెట్టి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని పిటిషనర్ ఆరోపించారు. -
మరో వివాదంలో రాధే మా
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కు మరోసారి చుక్కెదురైంది. త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించిన కేసులో దాఖలైన పిటిషన్ పై శుక్రవారం ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 18లోగా దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్ విఎం కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుండి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో రాధే మా ప్రయాణిస్తున్న సమయంలో త్రిశూలంతో ప్రయాణించడంపై సామాజిక కార్యకర్త రమేష్ జోషి వ్యాజ్యం దాఖలు చేశారు. మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను ఆమె అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధేమా మరింత ఇరకాటంలో పడ్డారు. రాధే మా మినీస్కర్టులో ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతోపాటు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు తదితర నేరాలతో పాటు మరికొన్ని కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై పిల్
హైదరాబాద్: విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ జీవోల అమలును నిలిపేసి, భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం, రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాయశాఖ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పరిస్థితులు లేవని ఓ నిపుణుల కమిటీ తేల్చిందని, ఇందుకు సంబంధించి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నారు. భోగాపురం బదులు కాకినాడ సమీపంలోని ఎస్.రాయవరం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఆ నిపుణుల కమిటీ తెలిపిందన్నారు. -
'బాబు పొలిటికల్ మైలేజీకి పాకులాడటం వల్లే.. '
హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట ఘటనపై పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. పుష్కరాలను మతపరమైన కార్యక్రమాలుగా ప్రభుత్వాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన పొలిటికల్ మైలేజీ కోసం పాకులాడటం వల్లే 29 మరణించారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. తొక్కిసలాట మృతులను అనుమానాస్పద మరణాలుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తొక్కిసలాట ఘటనను నేరాభియోగం కింద నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది. -
'ఓటుకు కోట్లు కేసుపై పిల్ వేస్తాం'
హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే కొనుగోలుకు పాల్పడలేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడా చెప్పడంలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు పై టీపీసీసీ, ఏపీసీసీలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)వేస్తాయని తెలిపారు. ఆర్థిక కుంభకోణంలో ఇరుక్కున్న లలిత్ మోడీని కాపాడేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, స్మృతి ఇరానీ, పంకజ్ ముండేల వ్యవహారంపై మోదీ స్పందించాలన్నారు. విభజన చట్టంలో ఉన్న సెక్షన్-8 పై ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. సెక్షన్-8 అమలుకు సంబంధించి న్యాయ వ్యవస్థ స్పష్టత ఇవ్వాలన్నారు. -
హైకోర్టులో సీపీఐ నారాయణ పిల్
హైదరాబాద్: ప్రజాప్రతినిదుల విచ్చలవిడిగా అవినీతికి అడ్డుకట్టవేసేలా తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సీసీఐ సీనియర్ నేత నారాయణ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలుచేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అవినీతికి పాల్పడటానికి కారణం ఇరు రాష్ట్రాల శాసనసభల స్పీకర్ల నిర్లక్ష్యమేనని నారాయణ తన పిటిషన్లో ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ను జాగృతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ అంశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ప్రతివాదులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడం, దీంతో సదరు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని పార్టీలు విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి వివిధ పార్టీలకు చెందిన డజను మందికిపైగా ఎమ్మెల్యేల అనర్హత ఫైళ్లు ఆయా రాష్ట్రాల స్పీకర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విషయంలో పూర్తి నిర్ణయం స్పీకర్లదే. అయితే ఈ అధికారాన్ని అడ్డంపెట్టుకొని అధికార పార్టీలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. -
ఓటుకు నోటుపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: ఓటుకు నోటుకు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది ప్రజల సొమ్ముతో ముడిపడి ఉన్న వ్యవహారం అయినందున సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిల్ లో పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన వైనాన్ని, ఫోన్ ట్యాపింగ్, పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపించాలని కోరారు. సెక్షన్ -8పై భారత ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను ఇవ్వాలని పిల్ లో పీవీ కృష్ణయ్య పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలపై ఈసీతో విచారణ చేయించాలని పిల్ లో పేర్కొన్నారు. -
సమ్మె చట్టవిరుద్ధమన్న హైకోర్టు
-
ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం: హైకోర్టు
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత సీఎల్ వెంకట్రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, సమ్మెపై ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ చిత్తూరు జిల్లాకు చెందిన మహమూద్ గౌస్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. -
వారి నియామకంపై విచారణ వాయిదా
హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23న జారీ చేసిన చట్టం (యాక్ట్ 7/2015)ను సవాల్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఇదే అంశంపై నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సైతం హైకోర్టు గురువారం విచారించనున్నది. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ రోజున గుత్తా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారిస్తామని తెలిపింది. -
'టీ పార్లమెంటరీ కార్యదర్శుల' పై హైకోర్టులో పిల్
శాసనసభ ఆమోదంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల చట్టాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలుచేశారు. మార్చి 25న తెలంగాణ శాసనసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు ప్రత్యామ్నయంగానే పార్లమెంటరీ కార్యదర్శి పదవులను తెరపైకి తెచ్చారిని అప్పట్లో విపక్షాలన్నీ విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. -
సచివాలయ తరలింపుపై వ్యాజ్యం కొట్టివేత
తెలంగాణ సచివాలయాన్ని వాస్తుదోషం కారణంతో ఎర్రగడ్డకు తరలించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిందని, దానిని అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో పిటిషనర్ సరైన వివరాలు సేకరించకుండానే కోర్టును ఆశ్రయించారని, తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ తరలింపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆప్ నేత మహ్మద్ హాజీ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. మంత్రిమండలి నోట్‌ఫైల్‌ను పరిశీలించి పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో ఎక్కడా కూడా వాస్తుదోషం కారణంగా సచివాలయాన్ని తరలిస్తున్నట్లు లేదని స్పష్టం చేసింది.