కశ్మీర్ వేర్పాటువాదులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. వేర్పాటువాదుల విదేశీ ప్రయాణాలు, ఇతర వ్యవహారాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా చూడాలని పిల్ లో కోరారు. వేర్పాటువాదులకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలుపైగా ఖర్చు చేసిందని వెల్లడించారు.
ప్రభుత్వ ధనాన్ని వేర్పాటువాదులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్ వెల్లడించిన అంశాలతో ఏకీభవిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. అయితే పిల్ ను కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్పించాలని సూచించింది.