
అమరావతి, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభాకర్ రెడ్డి పిల్ దాఖలు చేశారు.
భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రొటోకాల్ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలక్కిసలాటలో 29 మంది మృతి చెందిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన పిటిషన్‌లో ప్రస్తావించారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార టోకెన్ల టికెట్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. టీటీడీ నిర్లక్ష్యం.. పోలీసుల వైఫల్యంతోనే ఇంతటి ఘోరం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.