ప్రైవేటు బ్యాంకులో వెయ్యికోట్లు.. టీటీడీపై పిల్‌ | PIL on TTD over diposits in Private Bank | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 3:51 PM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

PIL on TTD over diposits in Private Bank - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమల శ్రీవారి ఆదాయంలోని రూ. వెయ్యి కోట్లను ప్రవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలైంది. ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన శ్రీవారి ఆదాయాన్ని ఇలా ప్రవేటు బ్యాంకులో డిపాజిట్‌ చేయడాన్ని తప్పుబడుతూ వెంకన్న భక్తుడు నవీన్‌కుమార్ రెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, టీటీడీ కార్యనిర్వహణాధికారి, ఇందుసిండ్ బ్యాంకులను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement