Private Bank
-
ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’
దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల అట్రిషన్(ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం)రేటు తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా 31-51 శాతం పెరిగిన ఈ రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తగ్గినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌లో ప్రధానంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో నియామకాలు పెరగడం, తమ కెరియర్ కోసం యువత ఎక్కువగా బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకోవడం ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొవిడ్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. లాక్డౌన్ కారణంగా లోన్లు ఇవ్వడం ఆగిపోయింది. ఆ సమయంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించేందుకు ఆర్థికశాఖ గడువు ఇచ్చింది. ఫలితంగా బ్యాంకింగ్ నిర్వహణ భారంగా మారింది. దాంతో చాలామంది ఉద్యోగులు ఇతర సంస్థల్లో చేరడం, ఉద్యోగాలు మానడం వంటివి జరిగాయి. గత మూడు త్రైమాసికాల నుంచి బ్యాంకులు మెరుగైన పలితాలు విడుదల చేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు 31-51 శాతంగా ఉంది. 2023లో ఎంప్లాయి టర్నోవర్ రేటు(ఉద్యోగుల ద్వారా వచ్చే ఆదాయం) 25-45%గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , బంధన్ బ్యాంక్ , ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు కలిసి మార్చి చివరి నాటికి సుమారు 7,30,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు ఉద్యోగుల అట్రిషన్ రేటు గతంలో కంటే 4.5-14 శాతం పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 2023లో 34.2 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 2024లో 26.9%కి చేరింది. ఐసీఐసీఐ బ్యాంకులో 2023లో 30.9% నుంచి 2024లో 24.5%కు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 2023లో 45.9% నుంచి 2024లో 39.6%కి పడిపోయింది.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో బ్యాంకులు తమ శాఖల విస్తరణకు పూనుకున్నాయి. దాంతో నియామకాలపై దృష్టి సారించాయి. లోన్ల జారీ క్రమంగా పెరుగుతోంది. యువత తమ కెరియర్ అభివృద్ధికి బ్యాంకింగ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. దాంతో టాప్ బ్యాంకుల్లో చేరుతున్న ఉద్యోగులు సంస్థలు మారడం లేదని, క్రమంగా అట్రిషన్రేటు తగ్గుతుందని చెబుతున్నారు. -
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్‌లో తెలిపారు.బ్యాంకింగ్‌లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్‌లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావడానికి కృషి చేశారు. -
అందాల దీవుల్లో అడుగు పెట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
దేశంలోనే అగ్రగామి ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో అడుగుపెట్టింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తొలి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఏర్పాటైన మొదటి ప్రైవేటు బ్యాంకు ఇదే. భారత్‌కు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో కొలువు దీరిన అందమైన ద్వీపాల సమాహారం.. లక్షద్వీప్. ఇటీవల మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్‌కు విపరీతమైన ప్రచారం లభించింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా లక్షద్వీప్‌లో అడుగుపెట్టి టూరిజాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులు ఇక్కడికి రావాలని ప్రకటనలు చేశారు. ఫలితంగా ఈ దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన లక్షద్వీప్ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు, స్థానికులు, పర్యాటలకు పర్సనల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తమ బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. 2023 డిసెంబర్ 31 నాటికి, హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 3,872 నగరాలు, పట్టణాల్లో 8,091 బ్రాంచ్‌లు, 20,688 ఏటీఎంలు ఉన్నాయి. -
కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..
ప్రముఖ ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) తమ కస్టమర్లకు షాకిచ్చింది. బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ప్రకటించింది. మార్పులు సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయి. కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుతం ఉన్న బేస్ రేటును 11.20 శాతం నుంచి 11.40 శాతానికి పెంచింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR )ను 16.20 శాతం నుంచి 16.40 శాతానికి పెంచింది. దీంతో రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత పెరగనుంది. అలాగే ఈఎంఐలపైనా దీని ప్రభావం పడనుంది. ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లు ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ జూలైలో KVB ESOS 2011 స్కీమ్, KVB ESOS 2018 పథకం కింద ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లను స్టాక్ ఆప్షన్‌గా కేటాయించినట్లు ప్రకటించింది. ఒక్కొక్క ఈక్విటీ షేర్ల ముఖ విలువ రూ.2 ఉంటుంది. కాగా శుక్రవారం (సెప్టెంబర్15) వారాంతంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 1.84 శాతం లాభంతో రూ.132.75 వద్ద ముగిశాయి. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) -
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్‌ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్‌ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
రైట్ కాదు.. ఫ్లైట్! లోగో మార్చిన యస్ బ్యాంక్
ముంబై: కస్టమర్లకు చేరువయ్యే దిశగా ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రకటనలపై 30 శాతం అధికంగా వెచ్చించనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిపుణ్ కౌశల్ తెలిపారు. జూన్ 20 నుంచి ప్రారంభించే ప్రచార కార్యక్రమాలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. తమ రిటైల్ కార్యకలాపాలు కీలక స్థాయికి చేరుకున్నాయని, ఇక నుంచి లాభదాయకత పెరగగలదని చెప్పారు. యస్ బ్యాంక్ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా కౌశల్ ఈ విషయాలు తెలిపారు. స్వల్ప మార్పులతో యస్ బ్యాంక్ తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. బ్యాంక్ ప్రస్తుత ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ టిక్ స్థానంలో పైకెగిరే పక్షిని తలపించేలా మార్పులు చేశారు. ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర -
జేసీ ఫ్లవర్స్‌కు 7 కంపెనీల షేర్లు
న్యూఢిల్లీ: రుణాల రివకరీకి వీలుగా తనఖాకు వచ్చిన 7 కంపెనీల షేర్లను ఆస్తుల పునర్నిర్మాణ సంస్థ(ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్‌కు బదిలీ చేసినట్లు ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. జాబితాలో డిష్ టీవీ, ఏషియన్ హోటల్స్, అవంతా రియల్టీ తదితరాలున్నట్లు పేర్కొంది. మొత్తం రూ. 48,000 కోట్ల రుణ రికవరీలో భాగంగా తాజా చర్యలు చేపట్టింది. తనఖాకు వచ్చిన డిష్ టీవీ ఇండియాకు చెందిన దాదాపు 44.54 కోట్ల షేర్లు(24.19 శాతం వాటాకు సమానం) జేసీ ఫ్లవర్స్‌కు బదిలీ చేసినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. పొందిన రుణాలను ఎస్సెల్ గ్రూప్ తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇక ఇదే అంశంలో ఏషియన్ హోటల్స్(నార్త్)లో 7.21 శాతానికి సమానమైన 14 లక్షలకుపైగా షేర్లను జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి బదిలీ చేసినట్లు తెలియజేసింది. ఈ బాటలో రియల్టీ కంపెనీ అవంతాకు చెందిన 30 శాతం వాటా(10 లక్షలకుపైగా షేర్లు), తులిప్ స్టార్ హోటల్స్‌కు చెందిన 20.61 శాతం వాటా(9.5 లక్షల షేర్లు), రోజా పవర్ సప్లై కంపెనీకి చెందిన 29.97 శాతం వాటా(12.73 కోట్ల షేర్లకుపైగా), డియాన్ గ్లోబల్‌కు చెందిన 14.11 శాతం వాటా(45.46 లక్షల షేర్లు), వడ్రాజ్ సిమెంట్‌కు చెందిన 20 శాతం వాటా(40 కోట్ల షేర్లు) బదిలీ చేసినట్లు వివరించింది. -
యస్ బ్యాంక్‌లో వాటాలకు కార్లైల్‌కి గ్రీన్ సిగ్నల్
ముంబై: యస్ బ్యాంక్‌లో 9.99 శాతం వరకూ వాటాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు ది కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్లకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యస్ బ్యాంక్‌లో రూ. 8,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ ఏడాది జూలైలో ఈ రెండు సంస్థలు ప్రతిపాదించాయి. నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో 5 శాతానికి మించి వాటాలు తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. కార్లైల్, యాడ్వెంట్ ప్రతిపాదనలపై రిజర్వ్ బ్యాంక్ రెండు వేర్వేరు లేఖల ద్వారా నవంబర్ 30న ‘షరతులతో కూడిన ఆమోదం‘ తెలిపినట్లు బ్యాంక్ వెల్లడించింది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
యస్ బ్యాంకు ఎండీగా మరో మూడేళ్లు ప్రశాంత్ కుమార్
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ మరో మూడేళ్లు కొనసాగనున్నారు. అక్టోబర్ 6 నుంచి తదుపరి మూడేళ్ల కాలానికి యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలియజేసింది. ఈ ఏడాది జూలైలో ప్రశాంత్ కుమార్ నియామక ప్రతిపాదనను యస్ బ్యాంకు ఆర్బీఐకి పంపింంది. సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకు పునరుద్ధరణకు వీలుగా ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్న అనంతరం.. 2020లో ప్రశాంత్ కుమార్ మొదటిసారి యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా నియమితులు కావడం గమనార్హం. -
బ్యాంకు వద్ద తుపాకితో సన్యాసి హల్చల్... షాక్‌లో ఉద్యోగులు
చెన్నై: ఒక బ్యాంకు వద్ద సన్యాసి తుపాకితో హల్ చల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌లో చోటు చేసుకుంది. ఒక సన్యాసి రైఫిల్ చేతపట్టుకుని బ్యాంకు ఉద్యోగులపై బెదరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తిరుమలై స్వామి అనే సన్యాసి తిరువారూర్ జిల్లాలోని మూలంగుడి గ్రామ నివాసి. ఆ సన్యాసి తన కుమార్తె చదువు కోసం లోన్ కావాలంటూ ఒక ప్రైవేట్ బ్యాంకు వద్దకు వచ్చాడు. తన కూతురు చైనాలో మెడిసిన్ చదివేందుకు లోన్ కావాలని అడిగాడు. అందుకు హామీ పత్రాలు సమర్పించాల్పి ఉంటుందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐతే సన్యాసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు నిరాకరించాడు. తానే వడ్డితో సహా కట్టేస్తాను కాబట్టి హామీ పత్రాలు ఎందుకంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అధికారులు వివరంగా చెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నాడు. చేసేదేమి లేక బ్యాంకు అధికారుల లోన్ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో సన్యాసి ఇంటికి వెళ్లి తుపాకిని తీసుకుని లోన్ ఇస్తారా? లేదా? అని ఉద్యోగులను బెదిరించడం ప్రారంభించాడు. సామాజిక మాధ్యమాల్లో సైతం సదరు సన్యాసి లోన్ ఇవ్వనందుకు బ్యాంకును లూటీ చేస్తానంటూ లైవ్ వీడియోని పోస్ట్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సదరు సన్యాసిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: మరుగుదొడ్డిలో ఆటగాళ్లకు భోజనం) -
ప్రైవేట్ బ్యాంక్ చీఫ్‌లకు ఆర్బీఐ షాక్!
సాక్షి, ముంబై: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్ టైం డైరెక్టర్ల (డబ్ల్యూ్టటీడీ) పదవీకాలాన్ని15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలను జారీ చేసింది. బోర్డ్ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి. బ్యాంక్లలోకార్పొరేట్ గవర్నెన్స్‌పై మాస్టర్ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్యూటీడీలను పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డ్ ఆమోదిస్తే గనక.. కనీసం మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత.. కొన్నిషరతులకు లోబడి నియమించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బ్యాంక్‌తో లేదా అనుబంధ కంపెనీలతోఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. అదేవిధంగా సీఈఓ, ఎండీ, డబ్ల్యూటీడీలు 70 ఏళ్ల వయస్సుకు మించి ఆయా పదవుల్లో కొనసాగలేరని.. అంతకంటేతక్కువ వయసు లోపే పదవీ విరమణను బోర్డ్‌లు సూచించవచ్చని పేర్కొంది. చైర్మెన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఎన్ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. ఎన్‌ఈడీల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంక్ బోర్డ్‌లో ఎనిమిది సంవత్సరాలకుమించి ఉండకూడదు. వీరి పునర్నియామకానికి కూడా మూడేళ్ల వ్యత్యాసం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్‌ఈడీల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదనిఆదేశించింది. -
లక్ష్మీ విలాస్ బ్యాంకుకు కమిషన్ మొట్టికాయ
న్యూఢిల్లీ: అకారణంగా ఓ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంకు నగదును డెబిట్ చేసినందుకు.. ఆ మొత్తంతో పాటు పరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల వివాదాల జాతీయ కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఆదేశించింది. తమ సేవా లోపం లేదన్న బ్యాంకు వాదనను తిరస్కరించింది. పరిహారం కింద రూ.25,000తోపాటు, నగదును డెబిట్ చేసి నాటి నుంచి ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యాపారి గోపాల్ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంకు రూ.40,85,254ను 2015 ఏప్రిల్ 11న డెబిట్ చేసింది. అయితే, ఇందుకు తగిన కారణాన్ని చూపలేకపోయింది. దీంతో సేవా లోపంగా కమిషన్ పరిగణించింది. దీనివల్ల గోపాల్‌కు నష్టం జరిగినట్టు గుర్తించి ఈ ఆదేశాలు ఇచ్చింది. -
బ్యాంకు ఉద్యోగిని చితకబాదారు..
-
తగ్గిన యూకో బ్యాంక్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కొంచెం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయని యూకో బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నష్టాలు పెరిగాయి. ఈ బ్యాంక్‌కు ఈ క్యూ1లో రూ.601 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.3,749 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,534 కోట్లకు పెరిగింది. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.., గత క్యూ2లో రూ.29,581 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.25,665 కోట్లకు తగ్గాయి. నికర మొండి బకాయిలు రూ.11,820 కోట్ల నుంచి రూ.7,238 కోట్లకు చేరాయి -
యస్ బ్యాంక్ నష్టం రూ.629 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.629 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్ల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి చూస్తే ఇది ఈ బ్యాంక్‌కు రెండో త్రైమాసిక నష్టం. గత ఆరి్థక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.951 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రూ.96 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించింది. గత క్యూ2లో రూ.8,714 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.8,348 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో 3.3%గా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ2లో 2.7%కి తగ్గింది. గత క్యూ2లో 1.60 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.39 శాతానికి ఎగిశాయి. అలాగే నికర మొండి బకాయిలు 0.84% నుంచి 4.35% చేరాయి. తాజా మొండి బకాయిలు రూ.5,950 కోట్లు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.943 కోట్ల నుంచి రూ.1,336 కోట్లకు పెరిగాయి. ►ఆర్థిక ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేర్ 5.4 శాతం నష్టంతో రూ.66.6 వద్ద ముగిసింది. -
రెట్టింపైన ధనలక్ష్మీ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ధనలక్ష్మీ బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో రెట్టింపైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.22 కోట్లకు పెరిగిందని ధనలక్ష్మీ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో నికర లాభం దాదాపు రెట్టింపైందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.227 కోట్ల నుంచి రూ.277 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.245 కోట్ల నుంచి రూ.253 కోట్లకు పెరిగాయని తెలిపింది. -
లిక్విడిటీ సమస్య లేదు
న్యూఢిల్లీ: బ్యాంకులు రుణ వితరణ కార్యకలాపాలను పెంచాయని, వినియోగం పెరుగుతోందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగం (2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు) నుంచి ఆర్థిక రంగ వృద్ధి పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. గురువారం ఢిల్లీలో ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల అధినేతలతో భేటీ అయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... అవి ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలను ఎదుర్కోవడం లేదని ప్రకటించారు. రుణాలకు తగినంత డిమాండ్ ఉందని అవి చెప్పినట్టు పేర్కొన్నారు. ఇది మంచి శక్తినిచ్చే టానిక్‌వంటి సమావేశమని, మంచి విషయాలను, సానుకూల అంశాలను విన్నట్టు మంత్రి చెప్పారు. ఆర్థిక రంగ వృద్ధి క్షీణత బోటమ్ అవుట్ (ఈ స్థాయి నుంచి పడిపోకపోవడం) చేరుకుందన్నారు. రానున్న పండుగల సీజన్ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరి 5 శాతానికి పడిపోవడం గమనార్హం. వాహన అమ్మకాలు పడిపోవడం అన్నది సైక్లికల్‌గా జరిగిందేనని, వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో మెరుగుపడుతుందని బ్యాంకులు చెప్పినట్టుగా మంత్రి వెల్లడించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ... పండుగల సమయంలో రుణాలను అందించేందుకు దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో బ్యాంకులు మేళాలు నిర్వహిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రైవేటు బ్యాంకులను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్‌కోటక్ మాట్లాడుతూ... అక్టోబర్ నుంచి అధిక శాతం బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్లను అనుసరించనున్నట్టు ప్రకటించారు. కార్పొరేట్ పన్ను తగ్గింపుతో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు. -
ప్రైవేటు బ్యాంకులో వెయ్యికోట్లు.. టీటీడీపై పిల్
సాక్షి, హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆదాయంలోని రూ. వెయ్యి కోట్లను ప్రవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలైంది. ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన శ్రీవారి ఆదాయాన్ని ఇలా ప్రవేటు బ్యాంకులో డిపాజిట్ చేయడాన్ని తప్పుబడుతూ వెంకన్న భక్తుడు నవీన్‌కుమార్ రెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, టీటీడీ కార్యనిర్వహణాధికారి, ఇందుసిండ్ బ్యాంకులను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. -
హే..మగిరి మోసం
గ్రామీణుల అమాయకత్వాన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్నేళ్ల పాటు నమ్మకంగా ఉంటూ అనంతరం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లలో డబ్బు వసూలు బోర్డులు తిప్పేస్తున్నారు. పిల్లల భవిష్యత్ అవసరాలకు, పెళ్లి ఖర్చులకు, ఉన్నత చదువులకు ఇలా అష్ట కష్టాలు పడి, పైసా పైసా కూడబెట్టిన సొమ్మును దిగమింగి అమాయకుల ఉసురు పోసుకుంటున్నారు. పెద్దతిప్పసముద్రం:(చిత్తూరు):‘హేమగిరి’ ప్రైవేటు బ్యాంకు సంస్థ వలలో చిక్కుకుని పలువురు గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ వద్ద డబ్బు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ వరికసువుపల్లికి చెందిన పలువురు బాధితులు మంగళవారం స్థానిక ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ... కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కామాక్షిపాళ్యం ప్రధాన కేంద్రంగా ‘హేమగిరి మల్టీపర్పస్ కో– ఆపరేటివ్ సొసైటి లిమిటెడ్’ పేరుతో ఓ సంస్థను 2006లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రతినిధులు కర్ణాటకలోని చిక్బళ్లాపురం, శివమొగ్గ, చింతామణి, చిక్‌మంగళూర్, హోస్పేట్, తుమ్కూర్, హాసన్, చిత్రదుర్గ, దొడ్డ బళ్లాపురం లాంటి పట్టణాల్లో సబ్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేశా రు. సబ్ బ్రాంచీలలో వుండే సంస్థ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై ఎంతో నమ్మకంగా వున్న వారిని ఏజెంట్లుగా నియమించారు. మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ గుగ్గిళ్లపల్లికి చెందిన రామచంద్ర అనే వ్యక్తిని ఇక్కడ ఏజెంటుగా నియమించారు. హేమగిరి సంస్థలో పెట్టుబడులు పెట్టే డిపాజిటర్లకు, నెలవారి కంతులను చెల్లించే వారికి సంస్థ ద్వారా లబ్ధి చేకూరే వడ్డీ, రుణ సదుపాయాలను రామచంద్ర వివరించారు. దీంతో తామంతా తక్కువ వ్యవధిలో అధిక వడ్డీ వస్తుందని, స్థానికంగా ఉండే వ్యక్తి నమ్మకంగా ఉన్నాడనే ఆశతో నెలవారి ఖాతాదారులుగా, డిపాజి టర్లుగా చేరామన్నారు. నాలుగైదు మాసాలుగా నెలవారి చెల్లించే సొమ్ము వసూళ్లకు కూడా గ్రామాల్లోకి ఏజంట్లు రాకపోవడం, ఫిక్సెడ్ డిపాజిటర్లకు సంబం ధించి గడువు ముగిసినా చేతికి సొమ్ము రాలేదన్నారు. దీంతో పాటు తమ వద్ద ఉన్న రశీదులు, బాండ్లు కూడా ఏజంట్లు తీసుకెళ్లారని ఆరోపించారు. మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ పరిసర ప్రాంతాల్లోనే రూ.కోటిల దాకా సొమ్ము వసూలు చేసినట్టు వారు పేర్కొన్నారు. బాధితులకు బాస్ నాయకులు అండగా నిలిచారు. బాండ్లు, రశీదులు తీసుకెళ్లారు నెలకు రూ.500ల చొప్పున మూడేళ్లుగా రూ.18 వేలు చెల్లించాను. వడ్డీతో కలిపి రూ.21 వేలు ఇస్తామని మా వద్ద వున్న రశీదులు, బాం డ్లు తీసుకెళ్లి నాలుగైదు నెలలు కావస్తోంది. ఇంత వరకు అతీగతీ లేకుండా పోయారు. ఎవరిని నమ్మాలో దిక్కు తెలియడం లేదు. ముసలోళ్ల పింఛన్ సొమ్ము కూడా కట్టించుకున్నారు. – ఊరిముందర బయమ్మ,వరికసువుపల్లి, పీటీఎం మండలం గడువు ముగిసినా సొమ్ము రాలేదు నా కూతురు శ్యామలమ్మ పేరిట ఏడాదికి రూ.5 వేల చొప్పున ఐదేళ్లుగా డబ్బులు కట్టాను. మమ్మల్ని చూసి మరో ఇద్దరు మహిళలు నెలకు రూ.వెయ్యి చొప్పున 28 నెలలు కట్టినారు. గడువు ముగిసినా ఇంత వరకు డబ్బులు రాలేదు. చింతామణిలో ఉన్న ఆఫీసుకు ఫోన్ చేస్తే ఇస్తామంటారు. ఎవరో పెద్దాఫీసర్ రావాలంటారు. ఏజెంంట్ ఎక్కడున్నాడో తెలియదు. మిగిలిన మహిళలు డబ్బులు కట్టమని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. – సాకల రెడ్డెమ్మ,వరికసువుపల్లి, పీటీఎం మండలం -
ఖాతా ఓపెన్ చేసి.. డబ్బులు డ్రా..!
ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో జిల్లా ఇంధన వనరుల శాఖ పేరుతో ఖాతాను తెరిచి తర్వాత దానిలోకి రూ. కోట్లు వచ్చి చేరాయి. తర్వాత పెద్ద మొత్తంలో డ్రా అయ్యాయి. అయితే తమకు తెలియకుండానే ఖాతా ఓపెన్ అరుు్యందని జిల్లా ఇంధన వనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై విచారణ కోసం ఆ శాఖ ఎండీ కమలాకర్‌బాబు సోమవారం హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కమిటీని నియమించినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని కవిరాజ్‌నగర్‌లో తెలంగాణ నూతన-పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంఘం లిమిటెడ్‌తో కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పేరుతో ఈ నెల 2న మమత ఆస్పత్రిరోడ్డులోని ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి చెక్‌బుక్ అందింది. తమ కార్యాలయానికి సంబంధించిన ఖాతా లేకుండానే చెక్ బుక్ రావడంతో అధికారులు కంగుతిన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులను కలవడంతో బ్యాంకు టార్గెట్ కోసం ఖాతాను ఓపెన్ చేశామని, ఈ ఖాతాను కూడా క్లోజ్ చేశామని తప్పుడు స్టేట్మెంట్ను ఇచ్చినట్లు తెలిసింది. రూ. కోట్లు జమ.. ఈ ఏడాది మే 18న ఈ కార్యాలయం పేరుతో మేరుగు శ్రీనివాసరావు, బి.భగవాన్‌దాస్ పేర్లతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత ఆ ఖాతాలోకి సుమారు రూ.10,67,87,000 జమ అయ్యాయి. జమ అయిన మొత్తం నుంచి రూ.కోటి వరకు డిపాజిట్ చేయగా, మిగిలిన వాటిలో రూ.9.61 కోట్ల వరకు ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. రూ.6.83లక్షలు బ్యాంకు ఖాతాలో నిల్వ ఉన్నాయి. అయినా, తప్పుడు పేర్లతో, తమ కార్యాలయం పేరుతో ఖాతా ఓపెన్ అవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ బ్యాంకు ఉన్నతాధికారులకు, పోలీసులకు జిల్లా ఇంధన వనరుల శాఖ కార్యాలయ అధికారులు ఈనెల మొదటి వారంలో ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల హస్తం ఉందా..? కార్యాలయ అధికారులకు తెలియకుండా, కనీసం కార్యాలయం నుంచి లేఖ కూడా లేకుండా తప్పుడు పత్రాలతో ఖాతా తెరవడం.. ఆ ఖాతాలోకి కోట్లాది రూపాయలు వచ్చి చేరడంలో బ్యాంకు అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంధన వనరుల శాఖాధికారులు తొలు త బ్యాంకులో సంప్రదించినప్పుడు టార్గెట్ కోసం సెప్టెంబర్ 29న తెరచి, అక్టోబర్ 2న రద్దు చేసినట్లు చెప్పడం కూడా అనుమానాలు తావి స్తోంది. మరో మూడు రోజుల్లో విచారణ ఇంధన వనరులశాఖ కార్యాలయం పేరుతో కోట్లాది రూపాయలు జమ, డ్రా అయిన అంశంపై మూడురోజుల్లో ముగ్గురు అధికారులు ఖమ్మంలోని ఆ బ్యాంకులో విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై జిల్లా నెడ్‌క్యాప్ మేనేజర్, ఏజీ ఆడిట్ అధికారిని, నెడ్‌క్యాప్ హెడాఫీస్ నుంచి ఓ అధికారిని విచారణాధికారులుగా నియమించారు. కోర్టు అనుమతి కోసం లేఖ: సీఐ శ్రీధర్ తమ పేరుతో ఖాతా తెరిచిన విషయంపై జిల్లా ఇంధన వనరుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశా రు. అయితే దీనిపై కేసు నమోదు చేయడానికి అనుమతి కోరుతూ కోర్టుకు నివేదించాం. అనుమతి రాగానే కేసు నమోదు చేస్తాం. లేకుంటే నిధులు దుర్వినియోగం అయ్యాయని బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ఫిర్యాదు వచ్చినా కేసు నమోదు చేస్తాం. -
ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్
బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు క్యూ2 ఫలితాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలో ఇన్వెస్టర్లు 190 పాయింట్ల నష్టంతో 26,846కు సెన్సెక్స్ 48 పాయింట్లు నష్టపోయి 8,129కు నిఫ్టీ ఆరు రోజుల స్టాక్ మార్కెట్ ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం వివరాలు(మినిట్స్) వెల్లడికానున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, కొ న్ని ఫార్మా షేర్లలో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ప్రస్తుతమున్న ర్యాలీ పరిమిత కాలమేనని ఇన్వెస్టర్లు సందేహిస్తుండడం... ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 26,846 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 8,129 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే లోహ షేర్లు జోరు కొనసాగింది. ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త: అందరి అంచనాలను మించి ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటి(సెప్టెంబర్ 29 గత మంగళవారం) నుంచి స్టాక్ మార్కెట్ లాభాల్లోనే సాగుతోంది. దీనికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు మరింత ఆలశ్యమయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా తోడవడంతో స్టాక్ మార్కెట్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో జోరుగా పెరుగుతూనే ఉంది. గత ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్ ద్వారా రేట్ల కోత ఎప్పుడు ఉండొచ్చనే సంకేతాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఈ నెల 12న ఇన్ఫోసిస్ కంపెనీ జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఆర్థిక ఫలితాలు ఆరంభమవుతాయి. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా వచ్చే వారం వెలువడనున్నాయి. సెన్సెక్స్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో 1,419 పాయింట్లు లాభపడింది. ఈ అంశాలన్నింటి కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని విశ్లేషకులంటున్నారు. రిలయన్స్ 2.7 శాతం డౌన్: ఓఎన్జీసీతో ఉన్న గ్యాస్ వివాదానికి సంబంధించిన దర్యాప్తు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.7 శాతం క్షీణించి రూ. 889 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు గెయిల్ 2.5 శాతం, ఐటీసీ 2 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5 శాతం, సన్ ఫార్మా 1.1 శాత, చొప్పున నష్టపోయాయి. ఇక లాభపడిన షేర్ల విషయానికొస్తే, వేదాంత 2.3 శాతం, టాటా స్టీల్ 1.5 శాతం, హీరో మోటొకార్ప్ 0.8 శాతం, భెల్ 0.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.4 శాతం చొప్పున పెరిగాయి. -
సర్కారు ధాన్యం సొంతానికి తాకట్టు
ఓ రైస్‌మిల్లర్ నిర్వాకం రూ.కోటిన్నర రుణం పొందిన వైనం ఫిర్యాదుపై అధికారుల విచారణ బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరిక ఏలూరు (టూ టౌన్) : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని ఒక రైస్‌మిల్లు యజమాని తాకట్టు పెట్టి ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.కోటి 50 లక్షలు రుణం తీసుకున్నాడు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో రుణం ఇచ్చిన బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో పాటు రైస్మిలర్ను కూడా అధికారులు హెచ్చరించారు. కామవరపుకోట మండలంలోని రావికంపాడు, కామవరపుకోట, మొండూరు గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 2014 ఖరీఫ్‌లో రైతుల నుంచి సేకరించిన రూ.80 లక్షల విలువైన 35వేల 564 క్వింటాళ్ల ధాన్యాన్ని తడికలపూడిలోని శ్రీనివాసా రైస్‌మిల్లుకు పంపించారు. 2015 జూలైలోపు ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఏలూరులోని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు తరలించాలని జిల్లా పౌరసరఫరాల అధికారులు రైస్‌మిల్లర్ ఈడ్పుగంటి వెంకట శ్రీనివాసరావును ఆదేశించారు. రైస్‌మిల్లు యజమాని ధాన్యాన్ని రైస్‌మిల్లులో కాకుండా గోడౌన్లో భద్రపరిచి తానే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చూపి రాజమండ్రిలోని ఒక ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.కోటి 50 లక్షల రుణం తీసుకున్నారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులకు సమాచారం అందడంతో బ్యాంకు మేనేజర్‌కు నోటీసు పంపిస్తూ ప్రభుత్వ ధాన్యానికి రుణం ఎలా ఇచ్చారంటూ కేసు పెడతామని హెచ్చరించారు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది తడికలపూడి చేరుకుని రైస్‌మిల్లర్‌ను నిలదీశారు. అతను రెండు రోజుల్లో రుణం మొత్తం కట్టివేస్తానని చెప్పారు. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా రైస్‌మిల్లు యజమాని శ్రీనివాసరావుకు నోటీసు జారీ చేసి ధాన్యం ఆడించి బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు తరలించాలని ఆదేశించారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ వి.వలసయ్య ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం తడికలపూడి రైస్‌మిల్లుకు వెళ్లి కామవరపుకోట తహసిల్దార్ నర్సింహరాజు సమక్షంలో విచారణ నిర్వహించారు. ఐకేపీ కేంద్రాల ద్వారా పంపించిన 35 వేల 564 క్వింటాళ్లకు గాను దానిలో 10 వేల క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ నెలాఖరులోపు ఎఫ్‌సీఐ గోడౌన్‌కు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని పంపిణీ చేస్తానని రైస్‌మిల్లు యజమాని వద్ద హామీపత్రంతో పాటు బ్యాంకు గ్యారంటీ తీసుకున్నారు. ఈ విచారణలో పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్ రామానుజమ్మ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కె.రమేష్‌కుమార్, ఏజీపీవో టి.శివప్రసాద్, సివిల్ సప్లయ్స్ డీటీ శ్రీనివాస్, ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వో మురళీ పాల్గొన్నారు. -
పెన్షన్ ఫండ్స్ ఉన్నాయా..?
నాకు ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. 7 శాతం వరకూ వడ్డీ వస్తుంది. వివిధ పథకాల్లో పొదుపు చేయగా మిగిలిన సొమ్ములను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. డెట్ ఫండ్స్‌కు సంబంధించి పన్నుల్లో మార్పుచేర్పులు జరిగిన నేపథ్యంలో నేను ఇలా చేయడం సరైనదైనా? తగిన సూచనలివ్వండి? - గోపాల్, వరంగల్ మిగులు నిధులను లిక్వ్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదే. ఎప్పుడైనా వాటి నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా రాబడులు కూడా బాగానే వస్తాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కంటే అధికంగానే వస్తాయి. లిక్విడ్ ఫండ్స్‌లో మొదటి ఐదేళ్లలో ఏడాదికి 8 శాతం చొప్పున రాబడులు వస్తాయి. 91 రోజుల మెచ్యూరిటీకి మించిన ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనంలో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టవు. అందుకనే ఇతర డెట్ ఫండ్స్‌పై వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల ప్రభావం ఉన్నట్లుగా లిక్విడ్ ఫండ్స్‌పై ఉండదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో స్థిరమైన రాబడులు వస్తాయి. కానీ కొన్ని ఇబ్బందులుంటాయి. ఉదాహరణకు యెస్ బ్యాంక్ రూ.1 లక్షకు మించిన బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు 7శాతం వడ్డీని ఇస్తోంది. రూ. లక్ష కంటే తక్కువగా ఉంటే 6 శాతం వడ్డీరేటునే ఇస్తోంది. ఈ బడ్జెట్లో లిక్విడ్ ఫండ్స్‌కు సంబంధించి పన్ను విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసే వారికే ఈ మార్పులు వర్తిస్తాయి. ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంది. వ్యక్తుల ఆదాయపు పన్న స్లాబ్‌ననుసరించి ఈ పన్ను ఉంటుంది. అందుకని మూడేళ్లలోపు మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే, మీరు మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి 10-30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నేను, మావారు హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ నుంచి చెరొక కోటి రూపాయలకు టర్మ్ బీమా పాలసీలు తీసుకున్నాం. ఇది సరైన టెర్మ్ బీమా ప్లానేనా? ఈ ప్లాన్‌లోనే కొనసాగమంటారా? ఇన్వెస్ట్ చేయడానికి ఉత్తమమైన పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి? యాన్యుటీ ఆధారిత ప్లాన్లను ఎంచుకోవడం కరెక్టేనా? - మల్లిక, హైదరాబాద్ హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ అనేది ఉత్తమమైన ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీల్లో ఒకటి. సరైన మొత్తానికి టర్మ్ బీమా పాలసీని తీసుకోవడం సరైన నిర్ణయం. మీరు రిటైరయ్యేవరకూ, లేదా మీ కుటుంబంలో మీ వారసులు సంపాదన పరులయ్యేంత వరకూ ఈ ప్లాన్‌లో కొనసాగండి. రిటైర్మెంట్ ఫండ్స్‌గా పేరున్న రెండు మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. అయితే రిటైరైన తర్వాత ఇవి రెగ్యులర్ పింఛన్‌ను ఆఫర్ చేయడం లేదు. ప్రస్తుతానికైతే మార్కెట్లో స్పెషలైజ్డ్ పెన్షన్ ఫండ్ ఏదీ అందుబాటులో లేదు. ఇలాంటి ఫండ్స్ గురించి బడ్జెట్లో ప్రస్తావించారు. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ పెన్షన్ ఫండ్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రావచ్చు. పెన్షన్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ), ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్స్‌ను పరిశీలించవచ్చని కొందరు చెబుతుంటారు. కానీ ఇది సరికాదు. యూనిట్ లింక్డ్ ప్లాన్స్ ఖరీదైనవే కాకుండా ఇవి ఇచ్చే రిటర్న్‌లు తక్కువగా ఉంటాయి. ఇక ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్ల వ్యయాలు, ఖర్చులు మీ రాబడులను తినేస్తాయి. రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడానికి ఉత్తమమైన వ్యూహం ఒకటుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఈ వ్యూహం. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు బీమా కంపెనీల నుంచి ఇమ్మిడియేట్ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. నా వయస్సు 42 సంవత్సరాలు. రానున్న పదేళ్లలో నేను రూ.75 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఒక ప్రైవేట్ బ్యాంక్ 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. కొంతమంది మిత్రులేమో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. తగిన సూచనలివ్వండి? - ప్రహ్లాదరావు, విజయవాడ మీరు పొదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో సగభాగాన్ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అయితే స్వల్పకాలానికే ఎఫ్డీ తీసుకోండి. మిగిలిన మొత్తాన్ని ఏదైనా బ్యాలెన్స్డ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఒక ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు చేయండి. ఇలాచేయడం వల్ల సిప్ ఎలా పని చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ రాబడులు, ఎఫ్‌డీల రాబడులు, మ్యూచువల్ ఫండ్స్ పనితీరు తదితర అంశాలపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక బ్యాలెన్స్డ్ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి సురక్షితమైనవి, వృద్ధికి అవకాశం కలవి. ఎఫ్డీలపై వచ్చే రాబడులతో పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. -
అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేట్ బ్యాంక్‌గా ఐసీఐసీఐ
న్యూఢిల్లీ: అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేట్ బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ అవతరించింది. గత ఆర్థిక సంవత్సరంలో 10,161 కొత్త కొలువులు ఇచ్చామని, దీంతో 72,226 మందితో అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేట్ బ్యాంక్ తమదేనని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. కాగా గతేడాదిలో హెచ్డీఎఫ్సీ ఉద్యోగుల సంఖ్య 900 తగ్గి 68,165కు చేరింది. 2012-13లో ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 62,065గా ఉండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 69,065గా ఉంది. కాగా, గతేడాది కనీసం 5 ప్రైవేట్ బ్యాంకుల్లో(ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇండస్ ఇండ్, యస్ బ్యాంక్)సిబ్బంది సంఖ్య పెరిగింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం కొత్త కొలువులు(15,000) తో పోల్చితే ఈ ఐదు బ్యాంకుల్లో గత ఆర్థిక సంవత్సరంలో 22 వేల కొత్త కొలువులొచ్చాయి.