
ముంబై: కస్టమర్లకు చేరువయ్యే దిశగా ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రకటనలపై 30 శాతం అధికంగా వెచ్చించనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిపుణ్ కౌశల్ తెలిపారు. జూన్ 20 నుంచి ప్రారంభించే ప్రచార కార్యక్రమాలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు.
తమ రిటైల్ కార్యకలాపాలు కీలక స్థాయికి చేరుకున్నాయని, ఇక నుంచి లాభదాయకత పెరగగలదని చెప్పారు. యస్ బ్యాంక్ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా కౌశల్ ఈ విషయాలు తెలిపారు. స్వల్ప మార్పులతో యస్ బ్యాంక్ తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. బ్యాంక్ ప్రస్తుత ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ టిక్ స్థానంలో పైకెగిరే పక్షిని తలపించేలా మార్పులు చేశారు.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
Comments
Please login to add a commentAdd a comment