న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.629 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్ల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి చూస్తే ఇది ఈ బ్యాంక్‌కు రెండో త్రైమాసిక నష్టం. గత ఆరి్థక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.951 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో రూ.96 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించింది.
గత క్యూ2లో రూ.8,714 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.8,348 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో 3.3%గా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ2లో 2.7%కి తగ్గింది. గత క్యూ2లో 1.60 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.39 శాతానికి ఎగిశాయి. అలాగే నికర మొండి బకాయిలు 0.84% నుంచి 4.35% చేరాయి. తాజా మొండి బకాయిలు రూ.5,950 కోట్లు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.943 కోట్ల నుంచి రూ.1,336 కోట్లకు పెరిగాయి.
►ఆర్థిక ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్‌ఈలో యస్ బ్యాంక్ షేర్ 5.4 శాతం నష్టంతో రూ.66.6 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment