Q2
-
వొడాఫోన్ ఐడియా నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. జులైలో టారిఫ్‌ల పెంపు చేపట్టడంతో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం ఇందుకు దోహదపడింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8,747 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,932 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 10,716 కోట్ల టర్నోవర్ సాధించింది. ఏఆర్పీయూ 8 శాతం పుంజుకుని రూ. 166ను తాకింది. మొత్తం వినియోగదారుల సంఖ్య 20.5 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్కాగా.. మూడేళ్ల కాలంలో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లతో 3.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,000 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. లితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 7.37 వద్ద ముగిసింది. -
అరబిందో లాభం అదిరింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న అరబిందో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం ఎగసి రూ.817 కోట్లు సాధించింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లు నమోదైంది. ఎబిటా మార్జిన్ 65 బేసిస్ పాయింట్లు మెరుగై 20.1 శాతంగా ఉంది. ఈపీఎస్ 9 శాతం వృద్ధి చెంది రూ.14 ఉంది. టర్నోవర్ 8 శాతం అధికమై రూ.7,796 కోట్లకు చేరింది.మొత్తం ఫార్ములేషన్స్ ఆదాయం 11.3 శాతం వృద్ధి చెంది రూ.6,640 కోట్లు సాధించింది. మొత్తం ఏపీఐ టర్నోవర్ 0.9 శాతం క్షీణించి రూ.1,156 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్ ఫార్ములేషన్స్ వ్యాపారం 4.3 శాతం పెరిగి రూ.3,530 కోట్లు, యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19% ఎగసి రూ.2,105 కోట్లను తాకింది. వృద్ధి మార్కెట్ల నుంచి ఆదాయం 44% దూసుకెళ్లి రూ.812 కోట్లకు చేరింది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు రూ.410 కోట్లు. ఇది ఆదాయంలో 5.3 శాతానికి సమానం.సింహభాగం యూఎస్..మొత్తం వ్యాపారంలో విదేశీ మార్కెట్ల వాటా ఏకంగా 89% ఉంది. టర్నోవర్‌లో యూఎస్ 45.3% తో సింహభాగం వాటా కైవసం చేసుకుంది. యూరప్ 27%, ఏపీఐలు 14.8, వృద్ధి మార్కెట్లు 10.4, ఏఆర్వీ ఫార్ములేషన్స్ 2.5% వాటా దక్కించు కున్నాయి. ‘ఈ త్రైమాసికంలో కీలక వ్యాపార రంగాలలో రాబడుల నిరంతర వృద్ధితో సంతోషి స్తున్నాం. ఇది విభిన్న పోర్ట్‌ఫోలియో స్థితి స్థాపక తను ప్రతిబింబిస్తుంది. ప్రాథమికంగా కొన్ని వ్యా పార కార్యకలాపాల తాత్కాలిక స్వభావం కారణంగా లాభదాయకత స్వల్పంగా తగ్గినప్పటికీ, అంతర్లీన పనితీరు బలంగా ఉంది. బలమైన పునాది, కొనసాగుతున్న కార్యాచరణ మెరుగు దలలతో వృద్ధి పథాన్ని కొనసాగించగలమని, ప్రస్తుత సంవత్సరానికి వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగ లమని విశ్వసిస్తున్నాం’ అని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. -
అధిక ధరల సెగ: జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23, జూలై-సెప్టెంబర్) నెమ్మదించింది. 2021-22 ఇదే కాలంతో పోల్చితే జీడీపీ విలువ 6.3 శాతం పెరిగింది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు ఇందుకు ఒక కారణం. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం కన్నా వృద్ధి వేగం (2.1 శాతం మేర) మందగించడం గమనార్హం. అయితే, ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను మాత్రం భారత్ కొనసాగిస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 3.9 శాతం. భారత్ సాధించిన వృద్ధి రేటుకు మరే దేశమూ చేరుకోకపోవడం గమనార్హం. ఇక మొదటి, రెండు త్రైమాసికాలు కలిపి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి రేటు 9.7శాతం, రెండవ త్రైమాసికంలో 6.1-6.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనాలకు అనుగుణంగానే బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఉండడం గమనార్హం. 6.3 శాతం ఎలా అంటే.. 2011-12 స్థిర ధరల ప్రాతిపదిక, వాస్తవిక జీడీపీ విలువ 2021-22 క్యూ2లో రూ.35.89 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి 6.3 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్- జీవీఏ) ప్రాతిపదికన క్యూ2 వృద్ధి రేటు మాత్రం 5.6శాతం పెరిగి రూ.35.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. వ్యవసాయం: ఆర్థిక వ్యవస్థలో 15శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2శాతం . తయారీ: ఈ రంగం జీవీఏ మాత్రం 5.6 శాతం (2021 ఇదే కాలంలో) వృద్ధి నుంచి 4.3 శాతం పడిపోయింది. మైనింగ్: ఈ విభాగం కూడా 2.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021 ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు భారీగా 14.5 శాతంగా ఉంది. నిర్మాణం: వృద్ధి 8.1శాతం నుంచి 6.6శాతానికి తగ్గింది. యుటిలిటీ సేవలు: విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల వృద్ధి రేటు 5.6 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.5 శాతంగా నమోదైంది. సేవలు: మొత్తం జీడీపీలో మెజారిటీ వాటా కలిగిన ఈ విభాగం చూస్తే (ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్) వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 14.7 శాతానికి చేరింది.జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...ఎకానమీ పరుగుకు ఢోకా లేదు! అక్టోబర్‌లో 20 నెలల కనిష్టానికి మౌలికం అక్టోబర్‌లో ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం వృద్ధి రేటు 20 నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధి కేవలం 0.1శాతం గా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, సిమెంట్ రంగాలు క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఎరువుల రంగం మాత్రం 5.4శాతం పురోగతి సాధించింది. బొగ్గు విభాగంలో 3.6 శాతం, స్టీల్ రంగంలో 4శాతం వృద్ధి నమోదైతే, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి కేవలం 0.4శాతంగా నమోదైంది. 7 శాతం వరకూ వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం 7 శాతం శ్రేణి బాటలో ఉంది. పలు రంగాల్లో రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్లో అమ్మకాలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, బ్యాంక్ రుణ వృద్ధి, ఆటో అమ్మకాల గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి. -వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
ఎక్సైడ్ ఆదాయంలో వృద్ధి
కోల్‌కతా: బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. రూ.3,719 కోట్ల ఆదాయంపై రూ.246 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 5 శాతం, ఆదాయం 13 శాతం చొప్పున పెరిగాయి. ఎబిట్డా పెద్దగా మార్పులేకుండా రూ.412 కోట్లుగా ఉంది. ఫలితాలపై అధిక తయారీ వ్యయాల ప్రభావం కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. అయినప్పటికీ ఎబిట్డా మార్జిన్‌ను 9.9 శాతం నుంచి 11.1 శాతానికి పెంచుకుంది. ప్రస్తుత త్రైమాసికం నుంచి లాభదాయకత మెరుగుపడుతుందని, తయారీ వ్యయాలపై అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సుబీర్ చక్రవర్తి తెలిపారు. బెంగళూరులో లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రం నిర్మాణానికి తన అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ భూమి పూజ చేసినట్టు చెప్పారు. -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం రూ.62 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ఉపకరణాల తయారీ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.62 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.62.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 6.81 శాతం తగ్గి రూ.1,159 కోట్లుగా ఉంది. కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆదాయం 2.45 శాతం తగ్గి రూ.883 కోట్లు, లైటింగ్ సొల్యూషన్స్ విభాగం 3.73 శాతం క్షీణించి రూ.276 కోట్లు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ 39.4 శాతం పడిపోయి రూ.67 కోట్లకు వచ్చి చేరింది. ఆర్డర్ బుక్ అక్టోబర్ 1 నాటికి రూ.1,554 కోట్లు ఉందని కంపెనీ వెల్లడించింది. క్రితం ముగింపుతో పోలిస్తే బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 0.47 శాతం పెరిగి రూ.1,158.55 వద్ద స్థిరపడింది. -
ఇండియా సిమెంట్స్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 113 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం 7.5 శాతం బలపడి రూ. 1,327 కోట్లను దాటింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 27 శాతం పెరిగి రూ. 1,528 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా లాభపడి రూ. 248 వద్ద ముగిసింది. -
పేటీఎంకు భారీ షాక్
బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిజిటల్ చెల్లింపుల దేశీ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు పెరిగి రూ. 594 కోట్లను తాకాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 481 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 76 శాతం జంప్‌చేసి రూ. 1,914 కోట్లను తాకింది. గత క్యూ2లో కేవలం రూ. 1,086 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆదాయంలో 18% వాటాను ఆక్రమిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసులు, ఇతర బిజినెస్‌ల నుంచి 293 శాతం అధికంగా రూ. 349 కోట్లు సమకూరినట్లు కంపెనీ తెలియజేసింది. రుణదాత భాగస్వాముల ద్వారా మొత్తం రూ. 7,313 కోట్ల రుణాలందించినట్లు వెల్లడించింది. ఇది 482 శాతం వృద్ధిగా తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పేటీఎమ్ షేరు స్వల్పంగా లాభపడి రూ. 652 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం రెట్టింపు!
ముంబై: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మంచి పనితీరు ప్రదర్శించింది. స్టాండలోన్ లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.452 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.208 కోట్లు కావడం గమనించాలి. లాభంలో 117 శాతం వృద్ధిని చూపించినట్టు బ్యాంకు ఎండీ, సీఈవో ఏఎస్ రాజీవ్ తెలిపారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు ఉన్నా కానీ తాము మంచి ఫలితాలను సాధించినట్టు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికం నుంచి అధిక వృద్ధిని అంచనా వేస్తున్నామని, భవిష్యత్తు వృద్ధి పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. నికర వడ్డీ ఆదాయం 20 శాతానికి పైగా పెరిగి రూ.1,686 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.05 శాతం నుంచి 3.28 శాతానికి పుంజుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 6.35 శాతం నుంచి 3.74 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 2.22 శాతం నుంచి 0.88 శాతానికి పరిమితమయ్యాయి. తాజాగా రూ.697 కోట్ల రుణాలు ఎన్పీఏల జాబితాలోకి చేరాయి. -
స్మార్ట్‌టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్మీ
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీదారు రియల్‌మి ఇక స్మార్ట్‌టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. 2020 ఏడాదిలో బహుళ స్మార్ట్ టీవీలను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. రియల్‌మి స్మార్ట్ టీవీలు క్యూ2 లో (ఏప్రిల్ నెలలో) విడుదల కానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్‌లో కూడా అవకాశం ఉందన్నారు. రియల్మీ-బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. (చదవండి : ఎంటర్టైన్మెంట్ కా సూపర్‌స్టార్, బడ్జెట్ ధరలో) మరోవైపు రియల్‌మి సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ ఇప్పటికే తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటో స్మార్ట్‌టీవీలకే సంబంధించినదే అని అందరూ ఖాయంగా భావిస్తున్నారు. రియల్ సౌండ్, రియల్ డిజైన్ రియల్ క్వాలిటీ కాప్షన్‌తో వచ్చిన టీజర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. రియల్మీ టీవీల పూర్తి ఫీచర్లును అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ ఈ స్మార్ట్‌టీవీలలో సౌండ్, పిక్చర్ క్వాలిటీలు అద్భుతంగా ఉండనున్నాయని అంచనా. అయితే రియల్‌మి టీవీలలో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ What is this? pic.twitter.com/uFQBWYXBtv — Francis Wang (@FrancisRealme) February 21, 2020 -
ఒడిదుడుకులు... అయినా లాభాల్లోనే!!
ముంబై: దేశీయ ప్రధాన స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఉదయం సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 40,510 వద్ద ప్రారంభమైంది. ఆ తరువాత కొనసాగిన లాభాల స్వీకరణతో కనిష్టంగా 40,337 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం మళ్లీ కోలుకుని గరిష్టంగా 40,646 పాయింట్లకు చేరినప్పటికీ.. నిరాశపరిచిన ఇటీవలి క్యూ2 జీడీపీ గణాంకాల నేపథ్యంలో ప్రీమియం వాల్యుయేషన్స్ వద్ద మార్కెట్ నిలబడే అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయనే అనుమానాలు లాభాల స్వీకరణకు కారణమయ్యాయి. సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,937 వద్ద ముగిశాయి. 7.5 శాతం పెరిగిన వీఐఎక్స్ మార్కెట్లో రానున్న 30 రోజుల ఒడిదుడుకులను ప్రతిబింబించే ఇండియా వీఐఎక్స్ సూచీ సోమవారం ఒక్కసారిగా 7.5 శాతం పెరిగి 14.59 స్థాయికి చేరుకుంది. ఈ సూచీ కదలికల ఆధారంగా రానున్న రోజుల్లో ఒడిదుడుకులకు మరింత ఆస్కారం ఉందని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వీపీ అజిత్ మిశ్రా విశ్లేíషించారు. బలపడిన రూపాయి.. ఐటీ షేర్లు డీలా డాలరుతో రూపాయి బలపడిన కారణంగా నిఫ్టీ ఐటీ 0.87 శాతం నష్టపోయింది. ఈ సూచీలోని టీసీఎస్ షేరు అత్యధికంగా 2.99 శాతం నష్టపోగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.62 శాతం, టెక్ మహీంద్ర 0.86 శాతం నష్టపోయాయి. మరోవైపు హెక్సావేర్, ఎన్ఐఐటీ షేర్లు ఒక శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.73 శాతం లాభం.. మారుతీ సుజుకీ నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని 4.33 శాతం పెంచినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ కంపెనీ షేరు 2 శాతం మేర లాభపడింది. ఈ సానుకూల అంశంతో ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎంఆర్ఎఫ్, ఆశోక్ లేలాండ్, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో షేర్లు 0.45 శాతం నుంచి 1.41 శాతం మధ్యలో లాభపడ్డాయి. వోడాఫోన్ ఐడియా 5.80 శాతం డౌన్ ప్రభుత్వ సాయం లేకపోతే వ్యాపారాన్ని మూసివేస్తామని వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా చేసిన వ్యాఖ్యలతో ఈ కంపెనీ షేరు 5.8 శాతం నష్టంతో రూ. 6.50 వద్ద ముగిసింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.75 శాతం నష్టపోగా.. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 7.88 శాతం నష్టపోయింది. డిష్ టీవీ 6.37 శాతం అప్ అంతర్గత సమీకరణల ద్వారా తన అప్పులలో అధిక భాగాన్ని చెల్లిస్తామని డిష్ టీవీ ప్రకటించటంతో ఈ కంపెనీ షేరు 6.37 శాతం లాభపడింది. ఆకర్షణీయ రెవెన్యూ గైడెన్స్‌తో వా టెక్ వాబాగ్ 15.38 శాతం లాభపడింది. కాగా నిఫ్టీ–50 షేర్లలో బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఆదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ అత్యధికంగా 2 శాతం మేర లాభపడ్డాయి. -
వాణిజ్య ఒప్పంద పరిణామాలు కీలకం
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అంశానికి సంబంధించిన పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, డెరివేటివ్స్‌కి సంబంధించి ముగియనున్న నవంబర్ సిరీస్ తదితర అంశాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిస్థితులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. ‘ఈ వారం మార్కెట్లు మరీ ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. డిజిన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి లేదా ఆర్థిక విధానాలపరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాలు మొదలైన వాటి ఆధారంగా ఏవైనా కదలికలు ఉండొచ్చు‘ అని సామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్‌నోట్ వ్యవస్థాపకుడు జిమీత్ మోదీ తెలిపారు. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చల పురోగతి .. ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనుంది. ఇక, డాలర్‌తో రూపాయి మారకం తీరుతెన్నులు, చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల విధానం తదితర అంశాలూ కీలకంగా ఉండనున్నాయి. గురువారంతో ముగిసే నవంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) కాంట్రాక్టులపై ఇవి ప్రభావం చూపవచ్చని అంచనా. క్యూ2 గణాంకాలపై దృష్టి.. ఈ వారమే విడుదలయ్యే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండో త్రైమాసిక గణాంకాలపై మార్కెట్ దృష్టి ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్ విభాగం) వినోద్ నాయర్ తెలిపారు. అటు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్టు గౌరంగ్ సోమయ్య కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత జీడీపీ గణాంకాలు వెలువడే అవకాశముంది. వినియోగం బలహీనపడటం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు మొదలైన వాటి కారణంగా ఆర్థిక వృద్ధి మరింతగా దిగజారే అవకాశం ఉందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండవ త్రైమా సికంలో జీడీపీ వృద్ధి రేటు 5 నుంచి 5.5% మధ్యే ఉంటుందన్నది మెజారిటీ విశ్లేషణ. -
అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్..!
ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెపె్టంబర్) ఫలితాల సీజన్ దాదాపుగా పూరైయిన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలే ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఇది అధ్యక్షుల స్థాయిలోనే ఉండగా.. కేవలం మంత్రులు మాత్రమే దీనిపై సంతకాలు చేస్తారని తెలియజేశారు. ఈ సానుకూల వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్ సూచీలు శుక్రవారం 0.80 శాతం లాభపడి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకున్నాయి. అయితే, ఒప్పందం అంశంపై శని, ఆదివారాల్లో పూర్తి స్పష్టత లేనందున దేశీయంగా మార్కెట్ వర్గాలు ఆ రెండు దేశాల ప్రకటనలపై దృష్టిసారించారని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ‘దేశీయంగా మార్కెట్‌ను నడిపించే ప్రధానాంశాలేవీ లేకపోవడం వల్ల అమెరికా–చైనాల మధ్య వాణిజ్య చర్చల వంటి అంతర్జాతీయ అంశాలే ఈవారం కీలకం కానున్నాయి. ట్రేడింగ్ రేంజ్ బౌండ్‌కే పరిమితం కానుందని అంచనావేస్తున్నాం’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషిశించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం పూర్తయితే మాత్రం దేశీ సూచీలు సైతం ఆల్ టైం హైని నమోదుచేయవచ్చని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. అమెరికా ఆర్థిక గణాంకాల ప్రభావం.. ఫెడ్ అక్టోబర్ పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 21న (గురువారం) ప్రకటించనుంది. గతనెలకు చెందిన యూఎస్ రిటైల్ విక్రయాల డేటా 15న వెల్లడికానుండగా.. మార్కిట్ తయారీ పీఎంఐ, సర్వీసెస్ పీఎంఐ 22న వెల్లడికానున్నాయి. కాగా దేశీయంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 (సోమవారం) ప్రారంభం కానుండగా.. తాజా ఉద్దీపనలు ఏవైనా ఉంటే మాత్రం మార్కెట్‌కు సానుకూలం అవుతుందని భావిస్తున్నారు. క్రూడ్ ధర పెరిగింది ముడి చమురు ధరలు వారాంతాన ఒక్కసారిగా లాభపడ్డాయి. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ (జనవరి డెలివరీ) శుక్రవారం 1.70 శాతం లాభపడి 63.34 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావంతో డాలరుతో రూపాయి మారకం విలువ 18 పైసలు నష్టపోయి 71.78 వద్దకు బలహీనపడింది. ప్రస్తుతం రూపాయి ట్రెండ్ బలహీనంగానే ఉందని, 71.50 వద్ద రెసిస్టెన్స్ ఎదుర్కోనుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు స్ట్రాటజీ వీకే శర్మ అన్నారు. -
ఈ ఏడాది వృద్ధి 5 శాతం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం ఎస్బీఐ ఎకోరాప్ స్పష్టంచేసింది. వృద్ధి 6.1 శాతం మేర ఉంటుందని గతంలో వేసిన అంచనాలను సంస్థ సవరించింది. మరీ ముఖ్యంగా రెండో త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) జీడీపీ వృద్ధి 4.2 శాతానికి పడిపోవచ్చని పేర్కొనడాన్ని గమనించాలి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ఇది 2013 మార్చి తర్వాత అత్యంత కనిష్ట వృద్ధి రేటు. ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గిపోవడం, విమాన ప్రయాణికుల్లో క్షీణత, ప్రధాన రంగాల్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉండటం, నిర్మాణం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు తగ్గిపోవడం వంటివి రెండో త్రైమాసికంలో వృద్ధిని తగ్గించనున్నట్లు ఎస్బీఐ ఎకోరాప్ పేర్కొంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 6.2 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. కీలక రేట్లలో భారీ కోత? వృద్ధికి ఊతమిచ్చేందుకు గాను ఆర్బీఐ డిసెంబర్లో జరిగే పాలసీ సమీక్షలో భారీ రేట్ల కోత దిశగా అడుగు వేయవచ్చని ఎస్బీఐ ఎకోరాప్ తన నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 1.35% మేర కీలక రేట్లను తగ్గించింది. అక్టోబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ సైతం 2019–20 జీడీపీ వృద్ధి అంచనాలను 6.1 శాతానికి తగ్గించడం గమనార్హం. -
పరిశ్రమలు.. రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పట్టింది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం– 2019 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –4.3 శాతం క్షీణించింది. అంటే 2018 సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే (అప్పట్లో 4.6 శాతం వృద్ధిరేటు) పారిశ్రామిక ఉత్పత్తి అసలు పెరక్కపోగా –4.3 శాతం క్షీణించిందన్నమాట. ఇంత తీవ్ర స్థాయి క్షీణత గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నడూ నమోదుకాలేదు. 2011 అక్టోబర్‌లో ఐఐపీ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అటు తర్వాత ఇంత తీవ్ర ప్రతికూల గణాంకం రావడం ఇదే తొలిసారి. ఆగస్టులో కూడా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతనే (–1.4 శాతం) నమోదుచేసుకోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం. భారీ యంత్రపరికరాల ఉత్పత్తిని సూచించే క్యాపిటల్ గూడ్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి దీర్ఘకాలిక వినియోగ ఉత్పత్తులుసహా కీలకమైన తయారీ, మౌలికం, నిర్మాణం ఉత్పత్తుల్లోనూ సెప్టెంబర్‌లో ‘మైనస్’ ఫలితం వచ్చింది. గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► తయారీ: సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తిలో –3.9 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగంలో 4.8 శాతం వృద్ధి నెలకొంది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 క్షీణతను నమోదుచేసుకున్నాయి. మోటార్ వాహనాలు ప్రత్యేకించి భారీ, మధ్యస్థాయి వాహన ఉత్పత్తి విభాగంలో –24.8 శాతం క్షీణత నమోదయితే, –23.6 శాతం క్షీణతతో తరువాతి స్థానంలో ఫర్నిచర్ ఉంది. ► విద్యుత్: ఈ విభాగంలో 8.2 శాతం ఉత్పత్తి వృద్ధి రేటు –2.6 క్షీణతలోకి జారింది. ► మైనింగ్: గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ 0.1 శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 సెప్టెంబర్‌లో వృద్ధిలేకపోగా –8.5 శాతం క్షీణత వచ్చింది. ► క్యాపిటల్ గూడ్స్: ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా – 20.7 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఉత్పత్తి –9.9 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా – 0.4 శాతం క్షీణత రావడం గమనార్హం. ► మౌలిక, నిర్మాణ రంగ ఉత్పత్తుల్లో కూడా 6.4 శాతం క్షీణత నమోదయ్యింది. త్రైమాసికంగా –0.4 శాతం క్షీణత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో పారిశ్రామిక ఉత్పత్తి – 0.4 శాతం క్షీణించింది. మొదటి త్రైమాసికంలో 3 శాతం వృద్ధి రేటు రాగా, 2018–19 రెండవ త్రైమాసికంలో 5.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇక ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే, దాదాపు నిశ్చలంగా 1.3%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 5.2 శాతం. క్యూ2 జీడీపీపై ప్రతికూల ప్రభావం? ఏప్రిల్–జూన్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలోనైనా (జూలై–సెప్టెంబర్) కొంత మెరుగైన ఫలితం వస్తుందన్న ఆశలపై తాజా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు నీళ్లు జల్లుతున్నాయి. నవంబర్ 29న జూలై– సెప్టెంబర్ జీడీపీ డేటా వెలువడనుంది. -
అశోక్ లేలాండ్ లాభం 93 శాతం డౌన్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్లో 93 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.39 కోట్లకు తగ్గిందని అశోక్ లేలాండ్ తెలిపింది. ఆదాయం రూ.7,621 కోట్ల నుంచి 48 శాతం తగ్గి రూ.3,939 కోట్లకు చేరిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. వాహన పరిశ్రమ అమ్మకాలు ఈ క్యూ2లో 53 శాతం మేర తగ్గాయని ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ కంపెనీ అమ్మకాలు గణనీయంగానే తగ్గినప్పటికీ, 5.8 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించామని తెలిపారు. -
అలహాబాద్ బ్యాంక్ నష్టం 2,103 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థికసంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,816 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.2,103 కోట్లకు పెరిగాయని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు ఈ రేంజ్లో పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.4,492 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,725 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బ్యాంక్ మొండిబకాయిలు మరింత పెరిగాయి. గత క్యూ2లో రూ.27,236 కోట్లుగా ఉన్న స్థూల మొండి బాకీలు ఈ క్యూ2లో రూ.31,468 కోట్లకు పెరిగాయి. అయితే నికర మొండిబకాయిలు రూ.11,083 కోట్ల నుంచి రూ.8,502 కోట్లకు తగ్గాయి. -
హెచ్‌పీసీఎల్‌కు రిఫైనరీ మార్జిన్ల షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 3 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,052 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రిఫైనరీ మార్జిన్లు సగం తగ్గడం, ఇన్వెంటరీ లాభాలు కూడా భారీగా తగ్గడం వల్ల నికర లాభం కూడా తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ఎమ్.కె. సురానా వివరించారు. బీఎస్–సిక్స్ పర్యావరణ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పారు. అప్పటికల్లా బీఎస్–సిక్స్ నిబంధనలకు అనుగుణ్యమైన ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ మేరకు తమ రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. -
తగ్గిన యూకో బ్యాంక్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కొంచెం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయని యూకో బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నష్టాలు పెరిగాయి. ఈ బ్యాంక్‌కు ఈ క్యూ1లో రూ.601 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.3,749 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,534 కోట్లకు పెరిగింది. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.., గత క్యూ2లో రూ.29,581 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.25,665 కోట్లకు తగ్గాయి. నికర మొండి బకాయిలు రూ.11,820 కోట్ల నుంచి రూ.7,238 కోట్లకు చేరాయి -
కొనసాగిన ‘రికార్డ్’ లాభాలు
సెన్సెక్స్ ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు గురువారం కూడా కొనసాగాయి. రియల్టీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం సంస్కరణలను ప్రకటించడం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కావడం సానుకూల ప్రభావం చూపించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ దాదాపు ఐదు నెలల తర్వాత 12,000 పాయింట్లపైకి ఎగబాకింది. ఇక సెన్సెక్స్ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,688 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 184 పాయింట్ల లాభంతో 40,654 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 12,012 పాయింట్ల వద్దకు చేరింది. జీవిత కాల గరిష్ట స్థాయి, 12,103 పాయింట్లకు 91 పాయింట్ల దూరంలోనే ఉంది. వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం స్వల్పంగా పెరిగింది. లోహ, ఇంధన, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడ్డాయి. వాహన, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. రూ.25,000 కోట్ల రియల్టీ నిధి... రియల్టీ రంగంలో ఆగిపోయిన 1,600 ప్రాజెక్ట్‌ల కోసం రూ.25,000 కోట్ల నిధిని కేంద్రం ప్రకటించింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, పరస్పరం విధించుకున్న సుంకాలను దశలవారీగా తొలగించుకోవడానికి అమెరికా–చైనాలు అంగీకారానికి రావడం.... ఈ అంశాలన్నింటి కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. -
టైటాన్... లాభం రూ.312 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 4 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.301 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.312 కోట్లకు పెరిగిందని టైటాన్ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,595 కోట్ల నుంచి రూ.4,693 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ సి.కె. వెంకటరామన్ పేర్కొన్నారు. డిమాండ్, వినియోగదారుల సెంటిమెంట్స్ అంతంతమాత్రంగానే ఉన్నా, తమ అన్ని వ్యాపార విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని వివరించారు. ఇతర కంపెనీలతో పోలి్చతే జ్యూయలరీ వ్యాపారం వృద్ధినే సాధించిందని పేర్కొన్నారు. వాచ్‌లు, కళ్లజోళ్ల వ్యాపారాలు మాత్రం మంచి వృద్ధిని సాధించాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో డిమాండ్ పుంజుకునేలా వివిధ బ్రాండ్లలో కొత్త కొత్త కలెక్షన్లను అందించనున్నామని, తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ 1.2 శాతం తగ్గి రూ.1,284 వద్ద ముగిసింది. -
డాబర్ ఆదాయం రూ.2,212 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దేశీయ దిగ్గజం డాబర్ ఇండియా రెండో త్రైమాసిక కాలంలో రూ.404 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ.378 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని డాబర్ ఇండియా తెలిపింది. పెట్టుబడుల విలువకు సంబంధించి రూ.40 కోట్ల వన్‌టైమ్ ఇంపెయిర్మెంట్ కారణంగా నికర లాభం ఒకింత తగ్గిందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం రూ.2,125 కోట్ల నుంచి రూ.2,212 కోట్లకు పెరిగిందని వివరించింది. 140 శాతం మధ్యంతర డివిడెండ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1.40 మధ్యంతర డివిడెండ్ (140 శాతం) ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. పన్నులతో కలుపుకొని మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.298 కోట్లకు చేరతాయి. -
టెక్ మహీంద్రా లాభం 1,124 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) సెపె్టంబర్ క్వార్టర్లో రూ.1,124 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం(రూ.1,064 కోట్లు)తో పోలి్చతే 6 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా ఎమ్డీ, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.8,630 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.9,070 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆదాయం 128 కోట్ల డాలర్లకు.... డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 14 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 128 కోట్ల డాలర్లకు పెరిగాయి. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 4 శాతం పెరిగింది. డిజిటల్ విభాగం ఆదాయం సీక్వెన్షియల్‌గా 12 శాతం ఎగసింది. నిర్వహణ లాభం 7 శాతం తగ్గి రూ.1,501 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్ 2.3 శాతం తగ్గి 16.50 శాతానికి చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నిర్వహణ లాభం 14 శాతం, నిర్వహణ లాభ మార్జిన్ 1.3 శాతం చొప్పున పెరిగాయి. ఏటీఅండ్‌టీ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని ఈ క్యూ2లో కుదుర్చుకుంది. ఈ క్యూ2లో కంపెనీ నికరంగా 5,749 ఉద్యోగాలిచి్చంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,522కు పెరిగింది. ఉద్యోగుల వలస(ఆట్రీషన్ రేటు) ఎలాంటి మార్పు లేకుండా 21 శాతంగా ఉంది. టెక్ మహీంద్రా చేతికి బార్న్ గ్రూప్... అమెరికాకు చెందిన బార్న్ గ్రూప్ కంపెనీని రూ.671 కోట్లకు టెక్ మహీంద్రా పూర్తి అనుబంధ సంస్థ, టెక్ మహీంద్రా (సింగపూర్) పీటీఈ లిమిటెడ్ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ ఈ నెల 15 కల్లా పూర్తవ్వనున్నది. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి లండన్, సింగపూర్, హాంకాంగ్, భారత్‌ల్లో కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,100గా ఉంది. -
పీఎన్బీని వెంటాడుతున్న మొండిబాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.507 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.4,532 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.14,036 కోట్ల నుంచి రూ. 15,557 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 7% వృద్ధితో రూ.4,264 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 7% పెరిగినా, రుణాలు 0.7 % తగ్గాయి. పెరిగిన మొండి బకాయిలు.. గత క్యూ2లో 17.16 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.76 శాతానికి తగ్గాయి. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 16.49 శాతంగానే ఉన్నాయి. ఈ క్యూ1లో 7.17 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.65 శాతానికి పెరిగాయి. ఈ క్యూ1లో రూ.5,412 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.7,460 కోట్లకు పెరిగాయి. అయితే మొండి బకాయిలకు కేటాయింపులు బాగా తగ్గాయి. గత క్యూ2లో రూ.7,733 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,253 కోట్లకు తగ్గాయి. ఇక పూర్తి ఆరి్థక సంవత్సరానికి మొండి బకాయిలు రూ.19,000 కోట్లకు పెరుగుతాయని పీఎన్బీ అంచనా వేస్తోంది. . -
ఫలితాలు, గణాంకాలే నడిపిస్తాయ్..!
ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్) ఫలితాల వెల్లడి, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ బాగా తగ్గి ఉన్న రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. అయితే, ఫలితాలకు మించి చెప్పుకోదగిన స్థాయిలో కీలక పరిణామాలేవీ ఈ వారంలో లేకపోవడం వల్ల ఫలితాలు ఏ మాత్రం నిరాశపరిచినా ప్రధాన సూచీలకు ఒడిదుడుకులు తప్పవని విశ్లేíÙంచారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు, రిజల్స్ నేపథ్యంలో భారీ లాభాలను నమోదుచేసిన షేర్లల్లో లాభాల స్వీకరణ అవకాశం ఉందని వివరించారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఈ వారం దేశీ మార్కెట్ల ప్రయాణం ఉండనుందని తాను భావిస్తున్నట్లు ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. 650 కంపెనీల ఫలితాలు.. ఈవారంలో 650 కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ జాబితాలో ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, టైటాన్, సన్ ఫార్మా, పీఎన్బీ, డాబర్, టాటా స్టీల్, సిప్లా, కెనరా బ్యాంక్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ ఉన్నాయి. ఆటో రంగంపై మార్కెట్ దృష్టి ఎం అండ్ ఎం, ఐషర్ , అశోక్ లేలాండ్, ఎంఆర్ఎఫ్, అమర రాజా బ్యాటరీస్, ఎక్సైడ్ ఫలితాలు ఈవారంలో వెల్లడికానున్నాయి. దీంతో ఆటో రంగంపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి. ఎం అండ్ ఎం అమ్మకాలు 16.3 శాతం పడిపోయిన కారణంగా ఈ సంస్థ క్యూ2 ఫలితాల్లో రెండంకెల క్షీణత ఉండవచ్చని భావిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన నిర్వహణ లాభం మార్జిన్లలో 100–200 బేసిస్ పాయింట్ల మేర తగ్గుదల ఉండవచ్చని విశ్లేశిస్తున్నాయి. స్థూల ఆర్థికాంశాలు.. అక్టోబర్ మార్కిట్ సర్వీసెస్ పీఎంఐ డేటా మంగళవారం విడుదలకానుంది. ఈ అంశానికి తోడు అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, బ్రెగ్జిట్ అంశాలు కీలకం. రూ. 16,464 కోట్ల ఎఫ్ఐఐ పెట్టుబడి అక్టోబర్ 1–31 కాలానికి ఎఫ్ఐఐలు భారత ఈక్విటీ మార్కెట్లో రూ. 12,475 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో వీ రు డెట్ మార్కెట్లో రూ. 3,989 కోట్లు పె ట్టుబడి పెట్టడం ద్వారా గత నెల్లో వీరి నికర పెట్టుబడి రూ. 16,464 కోట్లుగా నిలిచింది. -
సిగ్నిటీ టెక్నాలజీస్‌కు 36 కోట్ల లాభం
హైదరాబాద్: సిగ్నిటీ టెక్నాలజీస్ సంస్థ సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రూ.215 కోట్ల టర్నోవర్‌పై రూ.36 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆరి్థక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.205 కోట్ల ఆదాయంతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ, నికర లాభం మాత్రం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.49.52 కోట్లతో పోలిస్తే 25 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం కూ1లో నికర లాభం రూ.28.5 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదైంది. క్యూ2లో ఎబిటా రూ.68.52 కోట్లకు పెరిగింది. ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ సేవల్లో సిగ్నిటీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 266 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.266 కోట్ల నికర లాభం సాధించింది. కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటం, ఇతర ఆదాయం పెరగడంతో ఈ స్థాయి లాభం నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.10,800 కోట్ల నుంచి రూ.11,986 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.27% నుంచి 2.99%కి పెరిగింది. ఇది 18 క్వార్టర్ల గరిష్ట స్థాయి. గత క్యూ2లో 16.36%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.31%కి తగ్గాయి. నికర మొండి బకాయిలు 7.64% నుంచి 5.77%కి చేరాయి. -
యస్ బ్యాంక్ నష్టం రూ.629 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.629 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్ల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి చూస్తే ఇది ఈ బ్యాంక్‌కు రెండో త్రైమాసిక నష్టం. గత ఆరి్థక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.951 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రూ.96 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించింది. గత క్యూ2లో రూ.8,714 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.8,348 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో 3.3%గా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ2లో 2.7%కి తగ్గింది. గత క్యూ2లో 1.60 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.39 శాతానికి ఎగిశాయి. అలాగే నికర మొండి బకాయిలు 0.84% నుంచి 4.35% చేరాయి. తాజా మొండి బకాయిలు రూ.5,950 కోట్లు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.943 కోట్ల నుంచి రూ.1,336 కోట్లకు పెరిగాయి. ►ఆర్థిక ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేర్ 5.4 శాతం నష్టంతో రూ.66.6 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,093 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 504 కోట్లతో పోలిస్తే 117 శాతం అధికం. క్యూ2లో ఆదాయం రూ. 3,798 కోట్ల నుంచి 26 శాతం పెరిగి రూ. 4,801 కోట్లకు చేరింది. పన్నులపరమైన సర్దుబాట్లు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి మూడు ఉత్పత్తుల హక్కులను విక్రయించడం వంటి వన్‌టైమ్ అంశాలు.. ఆదాయాలు, లాభాలు పెరగడానికి కారణమయ్యాయని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ, సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. మూడు ఔషధాల విక్రయ హక్కుల బదలాయింపునకు గాను అప్షర్–స్మిత్ లాబరేటరీస్ నుంచి రూ. 720 కోట్లు లైసెన్సు ఫీజు కింద రాగా, సుమారు రూ. 326 కోట్ల మేర ఆదాయపు పన్నుపరమైన ప్రయోజనం లభించినట్లు చక్రవర్తి తెలిపారు. ఈ క్వార్టర్లో అత్యధిక లాభాలు, ఆదాయాలు నమోదు చేసినట్లు వివరించారు. నిర్దిష్ట మలినాల కారణంగా .. రానిటిడిన్ ఔషధాన్ని అమెరికా మార్కెట్ల నుంచి స్వచ్ఛందంగా రీకాల్ చేశామని, ప్రస్తుతం దీన్ని ఎక్కడా విక్రయించడం లేదని చక్రవర్తి వివరించారు. చైనా మార్కెట్లో క్యాన్సర్ ఔషధాలతో పాటు 70 ఉత్పత్తులు ప్రవేశపెట్టడంపై దృష్టి సారిస్తున్నామని ఇజ్రేలీ తెలిపారు. ద్వితీయార్థంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు కేటాయింపులు పెరగనున్నట్లు చెప్పారు. వృద్ధి లేని ఉత్తర అమెరికా.. యూరప్, వర్ధమాన మార్కెట్లు, భారత్ తదితర దేశాల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం వార్షికంగా 7 శాతం వృద్ధితో రూ. 3,280 కోట్లుగా నమోదైంది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో వృద్ధి లేకపోగా.. ధరలు తగ్గించాల్సి రావడం, విక్రయాలు తగ్గడం వంటి అంశాల కారణంగా సీక్వెన్షియల్‌గా చూస్తే 13 శాతం క్షీణించి రూ. 1,430 కోట్లకు పరిమితమైంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఉత్తర అమెరికా మార్కెట్లో ఎనిమిది కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టామని, ప్రస్తుతం 99 జనరిక్ ఔషధాలకు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చక్రవర్తి చెప్పారు. మెరుగ్గా యూరప్... కొత్త ఉత్పత్తులు, అమ్మకాల వృద్ధి ఊతంతో యూరప్ మార్కెట్ ద్వారా ఆదాయం 44 శాతం వృద్ధి చెంది రూ. 280 కోట్లుగా నమోదైంది. ఇక, దేశీ మార్కెట్లో ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 750 కోట్లకు చేరినట్లు చక్రవర్తి తెలిపారు. రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో కొత్తగా 5 ఉత్పత్తులు ప్రవేశపెట్టినట్లు వివరించారు. మరోవైపు వర్ధమాన మార్కెట్ల ద్వారా ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. పీఎస్‌ఏఐ విభాగం 18 శాతం అప్.. ఫార్మా సరీ్వసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం వార్షికంగా 18 శాతం, సీక్వెన్షియల్‌గా 57 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఉత్పత్తుల విక్రయాలు పెరగడం ఇందుకు దోహదపడింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 370 కోట్లు వెచ్చించగా.. పెట్టుబడి వ్యయాల కింద ప్రథమార్ధంలో మొత్తం రూ. 214 కోట్లు వెచ్చించినట్లు చక్రవర్తి తెలిపారు. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరు 1 శాతం క్షీణించి రూ. 2,755 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్ నష్టాలు రూ.188 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.188 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న మందగమనం ఈ కంపెనీపై బాగానే ప్రభావం చూపించినప్పటికీ, గత క్యూ2లో వచి్చన నష్టాలు(రూ.1,009 కోట్లు)తో పోలి్చతే నష్టాలు బాగానే తగ్గాయి. గత క్యూ2లో రూ.71,981 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.65,432 కోట్లకు తగ్గిందని టాటా మోటార్స్ తెలిపింది. అయితే స్డాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ2లో మాత్రం రూ.1,282 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్ సీఈఓ గుంటర్ బశ్చెక్ చెప్పారు. దేశీయంగా హోల్‌సేల్స్ వాహన విక్రయాలు 44 శాతం తగ్గి 1,06,349కు తగ్గాయని తెలిపారు. సుదీర్ఘ మందగమనం కారణంగా వాహన విక్రయాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలు, నిధుల కొరత, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం... ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయన్నారు. ఫలించిన ‘ప్రాజెక్ట్ ఛార్జ్’..... లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) హోల్‌సేల్స్ అమ్మకాలు 3 శాతం పెరిగి 1,34,489 కు పెరిగాయని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్మెత్ చెప్పారు. రూ.10,000 కోట్ల సమీకరణ రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని టాటా మోటార్స్ వెల్లడించింది. మాతృ కంపెనీ టాటా సన్స్‌కు ఒక్కో షేర్‌ను రూ.150 ధరకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లు, వారంట్ల జారీ ద్వారా రూ.6,494 కోట్లు సమీకరిస్తామని, అలాగే విదేశీ వాణిజ్య రుణాల ద్వారా రూ.3,024 కోట్లు చొప్పున ఈ నిధులను సమీకరిస్తామని తెలిపింది. ఆరి్థక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 5 శాతం నష్టంతో రూ.127 వద్ద ముగిసింది -
ఇండిగో నష్టం 1,062 కోట్లు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు రూ.1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తెలిపింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి రూ.428 కోట్ల ఫారెక్స్ నష్టాలు, రూ.319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్ దత్తా చెప్పారు. మొత్తం ఆదాయం రూ.6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో రూ.1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచి్చన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి రూ.9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికలపైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. -
మారుతీకి మందగమనం దెబ్బ
న్యూఢిల్లీ: వాహన విక్రయాల మందగమనం దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 39% తగ్గింది. గత క్యూ2లో రూ.2,280 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,391 కోట్లకు తగ్గింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యంత భారీ తగ్గుదల. ఆదాయం రూ.21,554 కోట్ల నుంచి 25% తగ్గి రూ.16,123 కోట్లకు చేరింది. క్యూ2లో వాహన విక్రయాలు 30% తగ్గి 3,38,317కు చేరాయని కంపెనీ చైర్మన్ ఆర్. సి. భార్గవ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కారు ఇప్పుడే కాదు... : ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం తయారీ దశలో ఉందని, విక్రయాల నిమిత్తం ఈ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి తెచ్చే అవకాశాల్లేవని భార్గవ చెప్పారు. ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు దేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదని, ప్రభుత్వ తోడ్పాటు కూడా తగిన విధంగా లేదన్నారు. -
మార్కెట్‌కు ఫలితాల దన్ను!
ఐటీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల దన్నుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, కంపెనీల క్యూ2 ఫలితాలు ఆశావహంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పుంజుకోవడం, ముడి చమురు ధరలు 0.85 శాతం తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైనా, చివరకు కీలకమైన పాయింట్ల ఎగువునే ముగిశాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,600 పాయింట్ల పైకి ఎగబాకాయి. రోజంతా 331 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 95 పాయింట్ల లాభంతో 39,059 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,604 పాయింట్ల వద్ద ముగిశాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల నికర లాభాలు పెరుగుతున్నాయని, ఈ సానుకూల క్యూ2 ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 2.9 శాతం లాభంతో రూ.1,096 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆరి్థక ఫలితాల వెల్లడికి ముందు సానుకూల అంచనాలతో ఈ కౌంటర్లో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. -
బజాజ్ ఆటో లాభం రూ.1,523 కోట్లు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆరి్థక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.1,257 కోట్లు)తో పోలి్చతే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్ ఆటో తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనం కారణంగా రూ.182 కోట్ల పన్ను ఆదా కావడం కలసి వచ్చిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,036 కోట్ల నుంచి 4 శాతం తగ్గి రూ.7,707 కోట్లకు చేరిందని పేర్కొంది. పన్నులు, డివిడెండ్లు కలిసి మొత్తం రూ.2,072 కోట్ల చెల్లింపులు పోను ఈ ఏడాది సెపె్టంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.15,986 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. కాగా, గత క్యూ2లో 13.4 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ2లో 11.73 లక్షలకు తగ్గాయని బజాజ్ ఆటో తెలిపింది. మోటార్ బైక్‌ల విక్రయాలు 11.26 లక్షల నుంచి 12 శాతం తగ్గి 9.84 లక్షలకు తగ్గాయని పేర్కొంది. -
‘హీరో’ లాభం 10 శాతం డౌన్
న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ నికర లాభం రెండో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.982 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.884 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,168 కోట్ల నుంచి రూ.7,661 కోట్లకు తగ్గిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, నిరంజన్ గుప్తా తెలిపారు. ఈ క్యూ2లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకాన్ని తెచ్చామని, వీఆర్ఎస్కు అంగీకరించిన ఉద్యోగుల కోసం రూ.60 కోట్లు కేటాయింపులు జరిపామని, ఆ మేరకు నికర లాభం ప్రభావితమైందని వివరించారు. గత క్యూ2లో 15.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ2లో 14.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. గత క్యూ2లో 21.3 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 21 శాతం తగ్గి 16.91 లక్షలకు చేరాయని గుప్తా తెలిపారు. కాగా, పండుగల సీజన్ ముగిసిన తర్వాత భారత్ స్టేజ్–సిక్స్ (బీఎస్–సిక్స్) మోటార్ బైక్‌లను కంపెనీ అందుబాటులోకి తేనుంది. -
భారత్‌లో డిమాండ్ బంగారం
ముంబై: బంగారానికి ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో (క్యూ2) దేశంలో మంచి డిమాండ్ నమోదయ్యింది. 2018 ఇదే కాలంతో పోల్చితే డిమాండ్ 13 శాతం పెరిగి 213 టన్నులకు చేరింది. సంబంధిత మూడు నెలల్లో పర్వదినాలు, అలాగే ఆకర్షణీయమైన ధరలు పసిడి కొనుగోళ్లను పెంచినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం నివేదికలో అంశాలను వెల్లడించారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2018 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పసిడికి డిమాండ్ 189.2 టన్నులు. అంటే 2019 ఇదే కాలంలో 13 శాతం పెరిగి, 213 టన్నులుగా నమోదయ్యిందన్నమాట. ♦ విలువ రూపంలో చూస్తే, పసిడి డిమాండ్ 17 శాతం పెరిగి రూ.53,260 కోట్ల నుంచి రూ.62,422 కోట్లకు ఎగసింది. ♦ ఆభరణాలకు డిమాండ్ 12 శాతం పెరిగి, 149.9 టన్నుల నుంచి 168.6 టన్నులకు చేరింది. ♦ విలువలో ఆభరణాలను చూస్తే, 17 శాతం పెరిగి రూ. 42,200 కోట్ల నుంచి రూ.49,380 కోట్లకు చేరింది. ♦ పెట్టుబడుల డిమాండ్ 13 శాతం పెరిగి 39.3 టన్నుల నుంచి 44.5 టన్నులకు చేరింది. ♦ పెట్టుబడులకు సంబంధించి విలువ 18 శాతం పెరుగుదలతో రూ.11,060 కోట్ల నుంచి 13,040 కోట్లకు ఎగసింది. ♦ గోల్డ్ రీసైకిల్డ్ విలువ 18 శాతం ఎగసి 32 టన్నుల నుంచి 37.9 టన్నులకు ఎగసింది. ♦ కడ్డీలు, నాణేల డిమండ్ భారీగా ఐదేళ్ల గరిష్టాన్ని తాకడం గమనార్హం. ♦ నెలల వారీగా ఏప్రిల్, మేలలో డిమాండ్ భారీగా ఉన్నా, జూన్‌లో దాదాపు యథాతథ స్థాయిలో ఉంది. ధరలు పెరగడం, బడ్జెట్లో ఎగుమతుల సుంకం మరింత పెంచే అవకాశం ఉందన్న వార్తలు దీనికి కారణమయ్యాయి. ♦ జనవరి–జూన్ దేశంలో పసిడి డిమాండ్ 9 శాతం పెరిగి 372.2 టన్నులుగా నమోదయ్యింది. ఆర్థిక మందగమనం, ఎన్నికల సీజన్ నేపథ్యంలో నగదు కదలికలపై ఆంక్షలు వంటి ప్రతికూలతలు ఉన్నా... ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం గమనార్హం. ♦ 2019 గడచిన ఆరు నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 17.7 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. 2018 ఇదే కాలంలో ఈ పరిమాణం 8.1 టన్నులు మాత్రమే. ♦ కాగా త్రైమాసిక కాలంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పసిడి దిగుమతులు జరగలేదు. ♦ 2017 తొలి త్రైమాసికం నుంచీ దేశంలో పసిడి సరఫరా బాగుంది. భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో... రీసైక్లింగ్ కూడా ఊపందుకునే వీలుంది. ♦ కస్టమ్స్ సుంకాల పెంపు భారత్‌లో పడిసి డిమాండ్‌పై దీర్ఘకాలం ఉంటుందని భావించడం లేదు. అయితే మూడవ త్రైమాసికంలో మాత్రం కొంత కనబడవచ్చు. తరువాత డిమాండ్ పుంజుకుంటుంది. ♦ 2019 మొత్తంలో పసిడి డిమాండ్ 750 నుంచి 850 టన్నుల వరకూ ఉంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్త డిమాండ్ 1,123 టన్నులు ప్రపంచవ్యాప్తంగా రెండవ త్రైమాసికంలో పసిడి డిమండ్ 8 శాతం పెరిగి 1,123 టన్నులుగా నమోదయ్యింది. సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడిని కొనుగోలు చేయడం, పసిడి ఆధారిత ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పెట్టుబడులు ఎనిమిది శాతం వృద్ధికి కారణం. 2018 రెండవ త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్త పసిడి డిమాండ్ 1,038.8 టన్నులని డబ్ల్యూజీసీ క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక వివరించింది. సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ 67 శాతం పెరిగి 152.8 టన్నుల నుంచి 224.4 టన్నులకు చేరింది. పోలాండ్ భారీగా 100 టన్నులు కొనుగోలు చేసింది. ఈ విషయంలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే రష్యాను వెనక్కు నెట్టింది. ఈటీఎఫ్‌ల పెట్టుబడులు భారీగా ఉన్నా కేవలం పెట్టుబడులకు పసిడి డిమాండ్ ఒకశాతమే పెరిగింది. యూరోప్, చైనాల్లో 12 కడ్డీలు, నాణేలు డిమాండ్ పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈటీఎఫ్‌ల పెట్టుబడులు 67.2 టన్నులు పెరిగి 2,548 టన్నులుగా నమోదయ్యింది. ఇది ఆరేళ్ల గరిష్టస్థాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంక్‌ల సరళతర విధానాలు పసిడి ధరలకు జూన్‌లో ఊతం ఇచ్చాయి. ఆభరణాల డిమాండ్ 2 శాతం పెరిగి 520.8 టన్నుల నుంచి 531.7 టన్నులకు ఎగసింది. భారత్ మార్కెట్ రికవరీ దీనికి ప్రధాన కారణం. పసిడి సరఫరా 6 శాతం ఎగసి, 1,121.3 టన్నుల నుంచి 1,186.7 టన్నులకు ఎగసింది. పసిడి గనుల ఉత్పత్తి 882.6 టన్నులు. రీసైక్లింగ్ 9 శాతం పెరిగి 314.6 టన్నులకు చేరింది. -
క్యూ2 లో పుంజుకున్న జీడీపీ వృద్ధిరేటు
సాక్షి, న్యూఢిల్లీ: గత త్రైమాసికంలో 5.7 శాతానికి పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో వృద్ధితో జులై-సెప్టెంబర్ మధ్య వృద్ధిరేటు 6.3 శాతంగా నమోదైంది. 2017-18 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వరుసగా ఐదు త్రైమాసికాల నుంచి నెమ్మదిగా ఉన్న దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు తిరిగి పుంజుకోవడం గమనార్హం. తాజాగా కేంద్ర గణాంకశాఖ వెల్లడించిన డేటా ప్రకారం రెండో త్రైమాసికంలో తిరిగి 6శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా క్యూ2లో జీడీపీ వృద్ధిరేటు 6.4శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేశారు. తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, మంచినీటి సరఫరా, ట్రేడ్, హోటల్స్, రవాణా, సేవల రంగాల్లో వృద్ధిరేటు పెరిగింది. గనుల త్రవ్వకాలు, క్వారీ, వర్తకం, హోటళ్లు వరుసగా 12.9 శాతం,12.2 శాతం పెరిగాయి. తయారీ రంగం రెండో త్రైమాసికంలో ఉత్పాదకత 9.5 శాతం పెరగగా, వ్యవసాయ రంగం కేవలం 3.7 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు నిర్మాణరంగంలో వృద్ధి జీడీపీ వృద్ధిరేటులో కీలకపాత్ర పోషించడం గమనించాల్సిన విషయమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఆర్ధిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం తయారీ రంగంలో కనిపించిందని తెలిపారు. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావాలు మెల్లగా తొలగిపోతున్నాయని, రానున్న త్రైమాసికాల్లో వృద్ధిరేటు పరుగులు పెడుతుందన్న విశ్వాసాన్ని ఆర్థికమంత్రి వ్యక్తంచేశారు. -
మెరుగ్గానే జీడీపీ వృద్ధి రేటు!
ముంబై: ఒకపక్క పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)... మరోపక్క వస్తు సేవలపన్ను(జీఎస్టీ) దెబ్బకు మందగమనంలోకి జారిపోయిన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కుతోందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(2017–18, క్యూ2) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కోలుకోనుందని చెబుతున్నారు. 6.4 శాతంమేర నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. క్యూ2 జీడీపీ గణాంకాలను కేంద్రం నేడు (గురువారం) విడుదల చేయనుంది. తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్, క్యూ1)లో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టమైన 5.7 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ‘క్యూ1 దెబ్బ నుంచి ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోకి వస్తోంది. రెండో క్వార్టర్లో 6.3–6.4 శాతం మేర వృద్ధి రేటు(గ్రాస్ వేల్యూ యాడెడ్–జీవీఏ వృద్ధి 6.1–6.2%) నమోదవుతుందనేది మా అంచనా’ అని ఎస్బీఐ ఎకనమిస్ట్‌లు బుధవారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న తీవ్ర కుదుపుల నుంచి అన్నిరంగాల పనితీరు మెరుగుపడుతూ వస్తోందని.. సానుకూల స్థూల ఆర్థిక సంకేతాలు దీనికి బలం చేకూరుస్తున్నట్లు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. రికవరీ సుస్పష్టం... క్యూ1లో వృద్ధి దిగజారడానికి వినియోగ డిమాండ్ పేలవంగా ఉండటం, జీఎస్టీ అడ్డంకుల కారణంగా తయారీ రంగం క్షీణించడం, మైనింగ్ కార్యకలాపాల పతనం వంటివి ప్రధాన కారణంగా నిలిచాయని ఎస్బీఐ ఎకనమిస్ట్‌లు పేర్కొన్నారు. తాజా స్థూల ఆర్థిక సంకేతాలను పరిశీలిస్తే.. విస్తృత స్థాయిలో రికవరీ కనబడుతోందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా సెప్టెంబర్‌లో తయారీ ఉత్పాదకత వృద్ధి రేటు 10 నెలల గరిష్టానికి చేరడం(3.4 శాతం), మైనింగ్ రంగం 9.4 శాతం వృద్ధి(ఐదు నెలల గరిష్టం), విద్యుత్ ఉత్పాదకత 7.9 శాతానికి ఎగబాకడాన్ని పటిష్ట రికవరీకి నిదర్శనంగా పేర్కొన్నారు. దాదాపు 2,700 కంపెనీల ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. భవిష్యత్తుపై ఆశావహ ధోరణి స్పష్టంగా కనబడుతోందని ఎస్బీఐ తెలిపింది. ప్రధానంగా విమానయాన రంగంలో కంపెనీల ఆదాయం 28 శాతం ఎగబాకిన విషయాన్ని ప్రస్తావించింది. ఇతర అంచనాలు ఇలా... డీబీఎస్: క్యూ2లో వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని సింగపూర్ బ్రోకరేజి సంస్థ డీబీఎస్‌కు చెందిన ఎకనమిస్ట్‌లు అంచనా వేశారు. అయితే, తొలి క్వార్టర్లో వృద్ధి భారీగా పడిపోయిన నేపథ్యంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్లో 0.2 శాతం కోత విధించి 6.6 శాతానికి పరిమితం చేశారు. హెచ్ఎస్బీసీ: పారిశ్రామికోత్పత్తి పుంజుకున్న నేపథ్యంలో జీవీఏ ఆధారిత వృద్ధి రేటు క్యూ2లో 6.3 శాతంగా ఉండొచ్చని బ్రిటిష్ బ్రోకరేజి దిగ్గజం హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. నేడు గణాంకాల వెల్లడి ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయ్: మోర్గాన్ స్టాన్లీ వచ్చే ఏడాది భారత్‌లో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని అంత ర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో అంచనావేసింది. ఫైనాన్షియల్ వ్యవస్థ మెరుగుపడుతుందని, ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ ఆర్థిక స్థితిగతులూ పురోగమిస్తాయని నివేదిక వివరించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటుసైతం 7.5 శాతానికి చేరుతుందని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ మెరుగుపడటం, ఆరేళ్లుగా మందగమనంలో ఉన్న ప్రైవేటు పెట్టుబడులకు ఊపు... వెరసి 2018లో భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయి పునరుత్తేజానికి వీలుందని మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. -
శాంసంగ్ లాభాలు హై జంప్
సియోల్: దక్షిణ కొరియా టెక్నాలజీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాభాల్లో దూసుకుపోయింది. సంస్థ కిందటి త్రైమాసికంలో గైడెన్స్‌ను అధిగమించి క్యూ2లో73శాతం వృద్ధితో భారీ లాభాలను నమోదు చేసింది. ముఖ్యంగా గత మూడు నెలల్లో మొమరీ చిప్ ద్వారా వచ్చిన ఆదాయంతో క్వార్టర్ 2 లాభాలు భారీగా పుంజుకున్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో పాటు బై బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ సంవత్సరంలో ఇది మూడవసారి కావడం విశేషం. గురువారం ప్రకటించిన సంస్థ ఆదాయ ఫలితాల్లో ఆజూన్క్వార్టర్లో రికార్డ్ ఆపరేటింగ్ లాభాలను సాధించింది.ఆ పరేటింగ్ లాభం గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 72.7 శాతం పెరిగింది. 14.1 లక్షల కోట్ల డాలర్లకు (12.68 బిలియన్ డాలర్లు) సాధించిందని శాంసంగ్ పేర్కొంది. ఆదాయం 19.8 శాతం పెరిగి 61 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. జూలైలో 14 ట్రిలియన్ల గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే థర్డ్ క్వార్టర్లో 15 ట్రిలియన్ కంటే ఎక్కువ (మూడవ త్రైమాసికంలో లాభాలు) లాభాలను ఆర్జించనుందని ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్‌లో విశ్లేషకుడు గ్రెగ్ రో చెప్పారు. మెమోరీ చిప్స్, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ శాంసంగ్ రికార్డు లాభాలను పూర్తిస్థాయిలో సాధించినుందని భావిస్తున్నారు. శాంసంగ్ మొబైల్ వ్యాపారంలో త్రైమాసిక లాభాల కంటే మెరుగైన పనితీరు పెరగడంతో, ఎక్కువగా లాభాలు ఆర్జించిందని విశ్లేషకులు చెప్పారు. అలాగే 1.7 ట్రిలియన్ డాలర్ల (1.53 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో జనవరి నెలలో ప్రకటించిన బై బ్యాక్ తో కలిపి మొత్తం బై వ్యాక్ విలువ 9.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే 2 ట్రిలియన్ల సొంత వాటాలను రద్దును కూడా ప్రకటించింది. మెమరీ చిప్ సూపర్-సైకిల్ కారణంగా మూడవ-త్రైమాసిక ఆదాయం, రెండవ త్రైమాసికాన్న దాటిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
రిలయన్స్ నుంచి విడిగా జియో..
ముంబై: టెలికాం దిగ్గజాలకు చుక్కులు చూపిస్తున్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇప్పటివరకు అధికారిక త్రైమాసిక ఫలితాలను ప్రకటించలేదు. కానీ జియో ఇన్ఫోకామ్ త్రైమాసిక ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడిగా ప్రకటించాలని ముఖేష్ అంబానీ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్యూ2(జూలై-సెప్టెంబర్ కాలం) నుంచి రిలయన్స్ జియో త్రైమాసిక ఫలితాలు అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ విషయంలో బోర్డు తుది ఆమోదం తెలుపాల్సి ఉందని, కానీ ఇంకా యోచన ప్రక్రియలోనే ఉన్నట్టు తెలిసింది. కంపెనీ వ్యాపారాలు అన్ని పూర్తిగా మార్కెట్లో సర్దుకున్నాక, ఫలితాలను విడిగా ప్రకటించనున్నామని ఓ అధికారి చెప్పారు. ఈ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఎలాంటి చట్టపరమైన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే మార్చితో ముగిసిన ఆరు నెలల కాలంలో జియోకు వచ్చిన నష్టాన్ని మాత్రం ప్రకటించారు. ముందటేడాది జియో నష్టం రూ.7.46 కోట్లు ఉంటే, అవి ఈ ఏడాది రూ.22.50 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాలు కూడా కేవలం బాండ్ హోల్డర్స్ కోసం తీసుకొచ్చారు. గత సెప్టెంబర్ లో టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ ఉచిత ఆఫర్లతో సంచలన రేపిన సంగతి తెలిసిందే.మార్చి 31తో ఈ కంపెనీ ఉచిత సర్వీసులకు స్వస్తి చెప్పి, టారిఫ్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది. అయితే ఈ నెట్ వర్క్ పై కాల్స్ మాత్రం జీవితకాలం ఉచితమే. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది యూజర్లను కూడా సొంతం చేసుకుంది. కానీ ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్ బేస్ యాడ్ చేసుకోవడంలో కంపెనీ కాస్త నెమ్మదించింది. జియో దెబ్బకు ఓ వైపు నుంచి టెలికాం దిగ్గజాలు భారీగా రెవెన్యూలు కోల్పోతున్నాయి. ఆ కంపెనీలు ప్రకటించే ఫలితాల్లో జియో వల్ల భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్నట్టు ప్రకటిస్తున్నాయి. -
ఫలితాల్లో నీరసించిన హెచ్‌డీఐఎల్
ముంబై: రియల్టీ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్) కు ఈ సం.రం ఆర్థిక ఫలితాల్లో ఎదురు దెబ్బ తగిలింది. క్యూ2లో నికర లాభం భారీగా క్షీణతను నమోదు చేసి నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. 36 శాతం క్షీణించి రూ. 37 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇది రూ. 57 కోట్లు. నిర్వహణ ఆదాయం 8 శాతం తగ్గి రూ. 218.54 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది జులై క్వార్టర్ లో ఇది 237 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 223 కోట్లను సాధించినట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో సంస్థ తెలిపింది. గత ఏడాది మొత్తం ఆదాయం రూ.243కోట్లుగా నిలిచింది. అలాగే స్టాండెలోన్ ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 31 శాతం తగ్గి రూ. 110 కోట్లను తాకగా, ఇబిటా మార్జిన్లు 67.7 శాతం నుంచి 50.5 శాతానికి మందగించాయి. హెచ్‌డీఐఎల్ షేరు 0.73 శాతం నష్టంతో రూ.61.35 వద్ద ముగిసింది. -
దూసుకెళ్లిన స్పైస్‌జెట్
ముంబై : బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ స్పైస్‌జెట్ 2016-17 రెండో త్రైమాసికంలో దూసుకెళ్లింది. తన నికర లాభాల్లో రెట్టింపు లాభాలను నమోదుచేసి 103 శాతం ఎగిసింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.29 కోట్లగా ఉన్న కంపెనీ నికర లాభాలు, ఈ త్రైమాసికంలో రూ.58.9 కోట్లకు పెంచుకోగలిగింది. మార్కెట్లో పోటీ వాతావరణం విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, స్పైస్‌జెట్ అనూహ్యమైన పనితీరును నమోదుచేయగలిగిందని ఈ ప్యాసెంజర్ క్యారియర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. తమకు నెలకొన్న న్యాయబద్ధమైన సమ్యసల నుంచి బయటపడగలిగామని, తమ నగదు నిల్వలను పెంచుకోవడానికి ప్రయత్నించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఎయిర్‌లైన్‌కు ఈ క్వార్టర్ వరుసగా ఏడవ క్వార్టర్ లాభాలుగా నమోదైంది. 2014 డిసెంబర్లో చాలా సవాళ్లను ఎదుర్కొన్న ఈ ఎయిర్‌లైన్, మేనేజ్మెంట్, కంట్రోల్లో మార్పులతో లాభాల బాటలోకి పయనించి, మార్కెట్లో నిలదొక్కుకోగలిగిందని కంపెనీ పేర్కొంది. -
పీఎన్బీ లాభాల క్షీణత
చెన్నై: ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ. 549.36 కోట్ల నికర లాభం పోస్ట్ చేసింది. గత ఆర్థిక త్రైమాసికం రూ 621.03 కోట్ల పోలిస్తే ఇది 11.5 తగ్గినట్టు కంపెనీ బీఎస్ సీ ఫైలింగ్ లో తెలిపింది. మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ 14,218.27 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ 13,702 కోట్లుగా ఉంది. అయితే, మూడు నెలల కాలంలో బ్యాంకు సంపాదించిన మొత్తం వడ్డీ 4.16 శాతం క్షీణించి రూ 11,830.36 కోట్లు. గత ఏడాది రూ. 12,345 కోట్లుగా ఉంది. బ్యాడ్ రుణాల శాతం 34.6 శాతం పెరిగి రూ 2,534కోట్లు, గత ఏడాది రూ. 1,882కోట్ల బ్యాడ్ లోన్ల విలువ ఉన్నట్టు కంపెనీ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 13,63 శాతం పెరిగాయి. ఇదే కాలంలో గత ఆర్థిక సంవత్సరంలో 6.36 శాతం ఉండగా రెండవ త్రైమాసికంలోనికర మొండి బకాయిలు కూడా 9.10 శాతానికిపెరిగాయి. -
ఎన్టీపీసీ ఫలితాలు
ముంబై: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో స్వతంత్ర నికరలాభాలు17.87 శాతం తగ్గి రూ.2,496 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇది రూ.3,039 కోట్లుగా ఉంది. జూలై-సెప్టెంబర్ క్యూ2 లో మొత్తం ఆదాయం రూ. 19,398 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 5,396 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 27.8 శాతంగా నమోదయ్యాయి. అయితే ఇతర ఆదాయం రూ. 278 కోట్ల నుంచి రూ. 191 కోట్లకు క్షీణించింది. ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ ప్రధాన విద్యుదుత్పత్తి సంస్థ ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ 17,994 కోట్లతో పోలిస్తే రూ 19,492 కోట్లకు పెరిగిందని సంస్థ అధికారి ఒకరు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో ఎన్టీపీసీ షేరు 1.2 శాతం బలపడినా స్వల్పలాభంతో రూ. 152దగ్గర ముగిసింది. -
పడిపోయిన టెక్ మహింద్రా
న్యూఢిల్లీ : ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా లాభాల్లో పడిపోయింది. 2016 ఆర్థికసంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 19.2 శాతం కోల్పోయి, కేవలం రూ.643.4 కోట్ల నికరలాభాలను మాత్రమే ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.780.3 కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ ఫలితాల్లో ఆపరేషన్స్ నుంచి వచ్చిన మొత్తం ఆదాయాలు ఎనిమిది శాతం ఎగిసి రూ.7,167.4 కోట్లగా నమోదైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఆర్థిక త్రైమాసికంలో తమ పనితీరు, కొత్త టెక్నాలజీల్లో తాము పెట్టిన పెట్టుబడుల, సామర్థ్యాల ఫలితమేనని టెక్ మహింద్రా వైస్ చైర్మన్ వినీత్ నాయర్ తెలిపారు. డాలర్ విలువలో ఆర్జించే పీఏటీలు(పన్నుల అనంతర లాభాలు) యేటికేటికీ 18.2 శాతం పడిపోయి, 96.5 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ తమకు మంచి త్రైమాసికమేనని, కీలకమైన కమ్యూనికేషన్, ఎంటర్ప్రైజ్ బిజినెస్‌లు వృద్ధిని నమోదుచేయడానికి దోహదం చేశాయని కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. -
లాభాల్లోకి దూకిన ఇండియన్ ఆయిల్
దేశీయ చమురు, సహజవాయువుల సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నష్టాలకు చెక్ పెట్టి, లాభాలోకి దూకింది. దలాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన క్వార్టర్లో రూ.3,122 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ రూ.450 కోట్ల నికర నష్టాలను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం ఆదాయాలను కూడా రూ.101,128 కోట్లగా నమోదుచేసింది. 2015 ఆర్థికసంవత్సరం ప్రథమార్థంలో ఈ ఆదాయాలు రూ.97,771.6 కోట్లగా ఉన్నాయి. కాగ, గతేడాది ప్రథమార్థంలో ఉన్న రూ.6,141 కోట్ల నికరలాభాలను ఏకంగా రూ.11,391 కోట్లకు ఇండియన్ ఆయిల్ పెంచుకోగలిగింది. అయితే గత క్వార్టర్ కంటే కంపెనీ లాభాలు 62 శాతం తక్కువగానే నమోదయ్యయి. ఏప్రిల్-సెప్టెంబర్ క్వార్టర్లో సగటు స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) లేదా రిఫైనింగ్ క్రూడ్ ఆయిల్‌పై రాబడులను బ్యారెల్‌కు 7.19డాలర్లు ఆర్జించింది. 2015 ఇదే క్వార్టర్లో ఇవి 5.76 డాలర్లుగా నమోదయ్యాయి. మార్కెట్ సమయంలో ఈ ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ స్టాక్ కొంత క్షీణించింది. 9.65 పాయింట్లు పడిపోయి 312.40 రూపాయలుగా నమోదైంది. -
మరోసారి సత్తా చాటిన మారుతి
న్యూఢిల్లీ: దేశీ కార్ల దిగ్గజం మారుతి సుజుకి క్యూ2 నికర లాభాలు భారీగా జంప్ చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అధిగమించి ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరు తో ముగిసిన క్యూ 2 లో నికర లాభాలు 60.18 శాతం వృద్ధితో రూ 2,398 కోట్లను ఆర్జించింది. గత జూలై-సెప్టెంబర్ కాలంలో,రూ 1,497 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 29.28 శాతం పుంజుకుని రూ. 20,297 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 15,699.7 కోట్లగా ఉంది. ఇతర ఆదాయం రూ. 474 కోట్ల నుంచి రెట్టింపై రూ. 813 కోట్లను తాకగా, నిర్వహణ లాభం(ఇబిటా) 35 శాతం జంప్‌చేసి రూ. 3037 కోట్లుగా నమోదు చేసింది ఇబిటా మార్జిన్లు 14.3 శాతం నుంచి 14.96 శాతానికి బలపడినట్టు మారుతి సుజుకి ఇండియా బీఎస్ఈకి తెలిపింది. మొత్తం 4,18,470 వాహనాల విక్రయంతో 18.4 శాతం పెరుగుదలను సాధించినట్టు తెలిపింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారి నాటి మార్కెట్ లో మారుతి సుజుకి షేర్లు రూ 5,932 వద్చద రిత్రాత్మక గరిష్టాన్ని నమోదుచేసింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 0.87 శాతం క్షీణించి రూ. 5,818 వద్ద వద్ద ట్రేడవుతున్నాయి. -
రిలయన్స్ లాభం 7,206 కోట్లు
క్యూ2లో 23% తగ్గుదల... • ఆదాయం రూ.81,651 కోట్లు; 9.6 శాతం అప్ • పెట్రోకెమికల్, రిఫైనరీ ఆదాయాల జోరు... • స్థూల రిఫైనింగ్ మార్జిన్ 10.1 డాలర్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ రూ.7,206 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.9,345 కోట్లతో పోలిస్తే 23 శాతం తగ్గింది. కాగా, క్రితం ఏడాది క్యూ2లో నికర లాభం అధికంగా నమోదుకావడానికి అమెరికా షేల్ గ్యాస్ ఆస్తుల విక్రయం రూపంలో వచ్చిన రాబడులు కూడా కలిసి ఉండటం ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని మినహాయించిచూస్తే... నికర లాభం 43.1 శాతం ఎగబాకినట్లు లెక్క. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ2లో రూ.74,490 కోట్ల నుంచి రూ. 81,651 కోట్లకు ఎగబాకింది. 9.6 శాతం వృద్ధి చెందింది. కంపెనీ కీలక వ్యాపారాలైన పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ విభాగాల్లో మంచి పనితీరు నమోదుకావడం ఆకర్షణీయమైన ఫలితాలకు దోహదం చేసింది. రిఫైనింగ్ మార్జిన్ తగ్గింది... సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్ఐఎల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 10.1 డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్ఎం 10.6 డాలర్లు కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 11.5 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ చమురు-గ్యాస్ ఉత్పత్తి వ్యాపారానికి సంబంధించి క్యూ2లో కంపెనీ రూ.491 కోట్ల స్థూల నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల లాభం రూ.3,326 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా చమురు-గ్యాస్ ధరలు తగ్గడం, కేజీ-డీ6 బేసిన్లో ఉత్పిత్తి పడిపోవడం వంటివి దీనికి కారణంగా నిలిచాయి. ⇔ పెట్రోకెమికల్స్ విభాగం స్థూల లాభం 35.5 శాతం ఎగబాకి రూ.3,417 కోట్లకు చేరింది. పాలియెస్టర్, ఇతర ఫైబర్ ఉత్పత్తులకు సంబంధించి అమ్మకాలు జోరందుకోవడం దీనికి దోహదం చేసింది. ⇔ రిఫైనింగ్ విభాగం స్థూల లాభం రూ.5,445 కోట్ల నుంచి రూ.5,975 కోట్లకు పెరిగింది. 10 శాతం మేర వృద్ధి చెందింది. ⇔ రిటైల్ వ్యాపారం మార్జిన్లు కూడా భారీగా దూసుకెళ్లాయి. క్యూ2లో ఈ విభాగం స్థూల లాభం 42.1 శాతం వృద్ధితో రూ.114 కోట్ల నంచి రూ.162 కోట్లకు పెరిగింది. ⇔ సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,89,132 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలానికి రుణ భారం రూ.1,80,388 కోట్లుగా ఉంది. ⇔ ఇక నగదు నిల్వలు కూడా రూ.89,966 కోట్ల నుంచి రూ.82,330 కోట్లకు తగ్గాయి. ⇔ రిలయన్స్ షేరు ధర గురువారం బీఎస్ఈలో 0.15 శాతం స్వల్ప లాభంతో రూ.1,089 వద్ద ముగిసింది. కాగా, మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. రిఫైనింగ్ వ్యాపారంలో పటిష్టమైన పనితీరుతో పాటు పెట్రోకెమికల్స్ విభాగంలో రికార్డుస్థాయి లాభాల కారణంగా క్యూ2లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించగలిగాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రిఫైనింగ్ వ్యాపారం అధిక లాభదాయకతను నమోదు చేసింది. దీనికి ప్రధానంగా రిఫైనింగ్ అసెట్స్ సామర్థ్యంతో పాటు మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా కంపెనీ సత్వర చర్యలు, కార్యకలాపాల నిర్వహణ పనితీరు దోహదం చేశాయి. నిర్మాణంలో ఉన్న హైడ్రోకార్బన్ ప్రాజెక్టులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే... ఇంధన, పెట్రోకెమికల్స్ రంగంలో దిగ్గజ స్థానంలో ఉన్న కంపెనీ స్థాయి మరింత బలోపేతం అవుతుంది. రిలయన్స్ జియో 4జీ సేవలకు కస్టమర్లనుంచి లభించిన అద్వితీయమైన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మొబైల్ ఇంటర్నెట్(డేటా) పవర్‌తో దేశ ప్రజలందరి సామర్థ్యాలను మరింతగా పెంచడమే లక్ష్యంగా జియో టెలికం వెంచర్‌ను ఏర్పాటుచేశాం. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
అదరగొట్టిన ఎస్ బ్యాంక్
ప్రయివేట్ రంగ సంస్థ ఎస్ బ్యాంక్ అంచనాలను అధిగమించిన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. జూలై -సెప్టెంబర్ క్వార్టర్ లో 32 శాతం వృద్ధితో రూ. 802 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది రూ. 610 కోట్ల తో పోలిస్తే మెరుగైన ఫలితాలో మరోసారి తన సత్తా చాటింది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలనుగురువారం ప్రకటించినసంస్థ నికరవడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ. 1446 కోట్లను సాధించినట్టు తెలిపింది. ఈ ఫలితాలతో దలాల్ స్ట్రీట్ లో ఎస్ బ్యాంక్ షేర్ లాభాల్లో ఉంది. ప్రాఫిట్ గ్రోత్, లోన్ గ్రోత్, ఎస్సెట్ క్వాలిటీలో ఎస్ బ్యాంక్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని మార్కెట్ విశ్లేషకుడు జి చొక్క లింగం వ్యాఖ్యానించారు. రుణాల వృద్ధి కొనసాగితే బ్యాంక్ వాల్యూయేషన్ భవిష్యత్తులో మరింత పెరుగుతుందన్నారు. ప్రొవిజన్లు రూ. 104 కోట్ల నుంచి రూ. 162 కోట్లకు పెరిగగా ఇతర ఆదాయం రూ. 618 కోట్ల నుంచి రూ. 888 కోట్లకు జంప్‌చేసింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) జూన్ త్రైమాసికంలో 0.79 శాతంతో పోలిస్తే 0.83 శాతం నమోదు కాగా, నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.29 శాతం వద్ద, , నికర వడ్డీ మార్జిన్లు'(ఎన్ఐఎం) 3.4 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 15 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. -
బీఓబీ లాభం 89 శాతం డౌన్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 89% క్షీణించింది. గత క్యూ2లో రూ.1,104 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.124 కోట్లకు తగ్గిందని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పడిపోయిందని వివరించింది. గత క్యూ2లో రూ.11,817 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ. 12,300కు ఎగసిందని పేర్కొంది. ఢిల్లీలోని అశోక్ విహార బ్రాంచ్‌లో రూ.11 కోట్ల మోసాన్ని గుర్తించామని, ఆర్బీఐకు నివేదించామని తెలిపింది. ఒక రుణ గ్రహీత రూ.374 కోట్ల ఖాతాకు గాను 25% మొత్తానికి(రూ.94 కోట్లు)కు కేటాయింపులు జరిపామని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.32% నుంచి 5.56%కి పెరిగాయని వివరించింది. -
ఎస్బీఐ లాభం హైజంప్!
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఏడాది సెప్టెం బర్తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 25 శాతం దూసుకెళ్లి రూ.3,879 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,100 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 12 శాతం వృద్ధితో రూ.41,833 కోట్ల నుంచి రూ.46,854 కోట్లకు ఎగబాకింది. ముఖ్యంగా మొండిబకాయిలపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) తగ్గుముఖం పట్టడం, నికర వడ్డీ ఆదా యం, ఇతర ఆదాయాలు పుంజుకోవడం లాభాల జోరుకు దోహదం చేశాయి. మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో ఎస్బీఐ సగటున రూ.3,580 కోట్ల లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. కన్సాలిడేటెడ్‌గా ఇలా... అనుబంధ సంస్థలన్నింటితో కలిపి(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ఎస్బీఐ క్యూ2లో రూ.4,992 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,024 కోట్లతో పోలిస్తే 25% ఎగసింది. మొత్తం ఆదాయం 9% వృద్ధితో రూ. 61,099 కోట్ల నుంచి రూ.66,586 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 3.86 శాతం లాభపడి రూ.243 వద్ద స్థిరపడింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం 18% వృద్ధి
చెన్నై: ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.369 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.314 కోట్లు)తో పోల్చితే 18 శాతం వృద్ధి సాధించామని ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ2లో రూ.4,340 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,579 కోట్లకు పెరిగిందని వివరించింది. స్థూల మొండిబకాయిలు 4.21 శాతం నుంచి 4.61 శాతానికి, నికర మొండిబకాయిలు 2.55 శాతం నుంచి 2.6 శాతానికి పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.287 కోట్లుగా ఉన్న మొండిబకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.137 కోట్లకు తగ్గాయని ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల కాలంలో రూ. 585 కోట్ల నికర లాభం ఆర్జించామని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.521 కోట్లని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,484 కోట్ల నుంచి రూ.9,073 కోట్లకు పెరిగిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 6% లాభంతో రూ.133 వద్ద ముగిసింది. -
ఎల్ అండ్ టీ లాభం రూ.996 కోట్లు
* 16% వృద్ధి * ఆదాయం 11% అప్ న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 16 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.862 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.996 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. నికర అమ్మకాలు రూ. 21,159 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ. 23,393 కోట్లకు, కన్సాలిడేటెడ్ స్థూల ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.23,605 కోట్లకు పెరిగి నట్లు వివరించింది. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం రూ.7,658 కోట్లని(32%) పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.19,374 కోట్ల నుంచి రూ.21,495 కోట్లకు ఎగిశాయని తెలిపింది. ఈ క్యూ2లో రూ.28,620 కోట్ల తాజా ఆర్డర్లు సాధించామని, వీటిల్లో 38 శాతం(రూ.10,973 కోట్లు) విదేశాల నుంచి వచ్చినవేనని తెలిపింది. ఈ ఏడాది 30 నాటికి కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 14 శాతం వృద్ధితో రూ.2,44,097 కోట్లకు చేరిందని వివరించింది. లాభదాయక ప్రాజెక్టులపైనే దృష్టి ఈ క్యూ2లో పెట్టుబడుల వాతావరణం మందగమనంలో ఉందని కంపెనీ తెలిపింది. ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా ఉన్నాయని, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. తమ ఆర్డర్ బుక్ భారీగా ఉందని, లాభదాయక ప్రాజెక్టులపైననే దృష్టి కేంద్రీకరిస్తున్నామని, ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటే మంచి వృద్ధిని సాధించగలమని ధీమా వ్యక్తం చేసింది. -
ఐసీఐసీఐ లాభం రయ్..
క్యూ2లో రూ. 3,419 కోట్లు; 12 శాతం అప్ * ఆదాయం 13.5 శాతం వృద్ధి; రూ.25,137 కోట్లు * రిటైల్ రుణాలు, విదేశీ మార్జిన్ల ఆసరా.. * మరింత పెరిగిన మొండిబకాయిలు... * ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9% వాటా విక్రయానికి ఓకే ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్.. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలతో కలిపి) రూ.3,419 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,065 కోట్లతో పోలిస్తే 12% వృద్ధి నమోదైంది. ప్రధానంగా రిటైల్ రుణాలు పుంజుకోవడం, విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మార్జిన్లు మెరుగుపడటం లాభాల జోరుకు దోహదం చేసింది. అయితే, మొండిబకాయిలు మాత్రం మరింత పెరగడం గమనార్హం. ఇక మొత్తం ఆదాయం క్యూ2లో 13.5 శాతం వృద్ధితో రూ.22,150 కోట్ల నుంచి రూ.25,138 కోట్లకు దూసుకెళ్లింది. స్టాండెలోన్‌గానూ జోష్... బ్యాంకింగ్ బిజినెస్(సాండెలోన్) ప్రాతిపదికన కూడా ఐసీఐసీఐ ఆకర్షణీయమైన పనితీరును నమోదుచేసింది. సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం 12% ఎగసి రూ.3,030 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,709 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.14,889 కోట్ల నుంచి రూ.16,106 కోట్లకు పెరిగింది. 8.2% వృద్ధి నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 13% వృద్ధితో రూ.4,657 కోట్ల నుంచి రూ.5,251 కోట్లకు ఎగసింది. వడ్డీయేతర ఆదాయం కూడా 10% ఎగసి రూ.3,007 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఈ మొత్తం రూ.2,738 కోట్లు. విదేశీ కార్యకలాపాలపై మార్జిన్లు 1.58 శాతం నుంచి 2 శాతానికి పెరిగాయి. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) క్యూ2లో 0.1 శాతం పెరిగి 3.52 శాతానికి చేరాయి. మొండిబకాయిల సెగ... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ2లో 3.77 శాతానికి(రూ.15,858 కోట్లు) ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 3.12 శాతంగా(రూ.11.547 కోట్లు), ఈ ఏడాది క్యూ1లో 3.68 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 1.09 శాతం(రూ.3,942 కోట్లు) నుంచి 1.65 శాతానికి(రూ.6,759 కోట్లు) పేరుకుపోయాయి. ఈ ఏడాది క్యూ1లో నికర ఎన్పీఏలు 1.58 శాతంగా నమోదయ్యాయి. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో మొండిబకాయిలకు ప్రొవిజన్స్ రూపంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.942 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.850 కోట్లు. ఇక క్యూ2లో కొత్తగా రూ.2,242 కోట్లు మొండిబకాయిలుగా మారాయి. పునర్వవస్థీకరణ రుణాల్లో రూ.931 కోట్ల ఎన్పీఏలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం రుణ వృద్ధి 17 శాతంగా నమోదైంది. మొత్తం రుణాల్లో రిటైల్ విభాగ రుణాలు 40 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 2 శాతం లాభపడి రూ.277 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్లను ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించగలమన్న నమ్మకం ఉంది. ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు అనుగుణంగా ఖాతాదారులకు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదలాయిస్తున్నాం. డిమాండ్ మందగమనం కారణంగానే కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 7%కే పరిమితమైంది. పూర్తి ఏడాదికి బ్యాంక్ మొత్తం రుణ వృద్ధి 18-20 శాతం స్థాయిలో ఉండొచ్చు. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9% వాటా సాధారణ బీమా అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.1,550 కోట్లు. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్‌లో ఫెయిర్‌ఫాక్స్ వాటా 35 శాతానికి చేరనుంది. ప్రవాస భారతీయుడైన ప్రేమ్ వత్స నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు జాయింట్ వెంచర్‌గా దీన్ని ఏర్పాటు చేశాయి. దేశీ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో తాజా ఒప్పందం చోటుచేసుకుంది. ఈ డీల్ ప్రకారం ఐసీఐసీఐ లాంబార్డ్ కంపెనీ విలువ రూ.17,225 కోట్లుగా లెక్కతేలినట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఈ అనుబంధ సంస్థ ఐపీఓకు సంబంధించి తక్షణ ప్రణాళికలేవీ లేవని ఐసీఐసీఐ చీఫ్ చందాకొచర్ స్పష్టం చేశారు. -
ఎస్బీహెచ్ లాభం 375 కోట్లు
క్యూ2లో 21% వృద్ధి * ఈ ఏడాది వ్యాపారంలో 10 శాతం వృద్ధి అంచనా * మార్చిలోగా మరోసారి వడ్డీరేట్లు తగ్గొచ్చు * ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ద్వితీయ త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 21 శాతం, ఆదాయంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 311 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ. 375 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 3,675 కోట్ల నుంచి రూ. 3,945 కోట్లకు చేరింది. ట్రెజరీ విభాగంలో లాభాలు, ఇతర ఆదాయాలు పెరగడం, వ్యయాలు తగ్గించుకోవడం నికర లాభం పెరగడానికి ప్రధాన కారణాలుగా ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ పేర్కొన్నారు. బుధవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమీక్షా కాలంలో కాస్ట్ టు ఇన్కమ్ (ఆదాయంలో వ్యయం చేసే శాతం ) 3.28 శాతం తగ్గి 47.78 శాతం నుంచి 44.50 శాతానికి చేరిందన్నారు. మొత్తం వ్యాపారం 8 శాతం వృద్ధితో రూ. 2.36 లక్షల కోట్లు దాటింది. కార్పొరేట్ రుణాలకు ఇంకా డిమాండ్ పెరగకపోవడంతో ఈ ఏడాది మొత్తం మీద వ్యాపారంలో 10 శాతానికి అటుఇటుగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సమీక్షా కాలంలో ఇతర ఆదాయం 47 శాతం పెరిగి రూ. 224 కోట్ల నుంచి రూ. 329 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికంతో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు స్వల్పంగా పెరిగినా గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గాయన్నారు. గతేడాది సెప్టెంబర్ నాటికి 5.73 శాతంగా ఉన్న స్థూల ఎన్పీఏ తొలి త్రైమాసికానికి 4.59 శాతానికి తగ్గినా, ద్వితీయ త్రైమాసికానికి స్వల్పంగా 4.92 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు 2.87 శాతం నుంచి 2.39 శాతానికి తగ్గాయి. తొలి త్రైమాసికంతో పోలిస్తే నికర వడ్డీ లాభదాయకత (నిమ్) 3.08 శాతం నుంచి 3.05 శాతానికి తగ్గింది. వడ్డీరేట్లు తగ్గొచ్చు.. వచ్చే మార్చిలోగా ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలున్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. వడ్డీరేట్ల తగ్గింపుపై ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు వంటి నిర్ణయాలు ప్రభావం చూపుతాయని, వీటిపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ ఏడాదిలోగా ఒకసారి వడ్డీరేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరిగితే టైర్-2 బాండ్ల ద్వారా నిధులు సేకరించే అంశాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
టీవీఎస్ మోటార్ స్పీడ్...
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం(స్టాండ్ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 23 శాతం వృద్ధి సాధించింది. గత క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.116 కోట్లకు పెరిగిందని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,667 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,881 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వాహన విక్రయాలు 6,76,139 నుంచి 0.3 శాతం వృద్ధితో 6,78,718కు పెరిగాయని, అయితే మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు మాత్రం 6.48 లక్షల నుంచి 0.3 శాతం క్షీణతతో 6.46 లక్షలకు తగ్గాయని తెలిపింది. స్కూటర్ల అమ్మకాలు 1.9 లక్షల నుంచి 12 శాతం వృద్దితో 2.18 లక్షలకు పెరగ్గా, మోటార్ సైకిళ్ల విక్రయాలు స్వల్ప వృద్ధితో 2.55 లక్షలకు చేరాయని వివరించింది. ఎగుమతులు 1.03 లక్షల నుంచి 23 శాతం వృద్ధితో 1.27 లక్షలకు చేరాయని పేర్కొంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి నికర లాభం (స్టాండ్ఎలోన్) రూ.167 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.207 కోట్లకు చేరిందని, మొత్తం ఆదాయం రూ.4,960 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.5,489 కోట్లకు పెరిగిందని వివరించింది. మొత్తం టూవీలర్ల విక్రయాలు 12,60,252 నుంచి 4 శాతం వృద్ధితో 13,16,751కు పెరిగాయని పేర్కొంది. పండుగల సీజన్ శుభారంభాన్ని ఇచ్చిందని, ఈ పండుగల సీజన్లో మంచి అమ్మకాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్ 13 శాతం వృద్ధితో రూ.276 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 1,916 కోట్లు
క్యూ2లో 19 శాతం వృద్ధి ముంబై: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలానికి రూ.1,916 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక నికర లాభం(రూ.1,611 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. గత క్యూ2లో రూ.10,550 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.12,001 కోట్లకు పెరిగిందని వివరించింది. బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్షీణించింది. స్థూల మొండి బకాయిలు 1.34 శాతం నుంచి 1.38 శాతానికి. నికర మొండి బకాయిలు 0.44 శాతం నుంచి 0.48 శాతానికి పెరిగాయని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. యాక్సిస్ సెక్యూరటీస్ యూరప్ సంస్థలోని పూర్తి వాటాను యాక్సిస్ క్యాపిటల్ నుంచి రూ.19 కోట్లకు కొనుగోలు చేశామని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ స్వల్పలాభంతో రూ.521 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ డేటా బూస్ట్
క్యూ2లో 10% పెరిగిన నికర లాభం; రూ. 1,523 కోట్లు... * ఆదాయం రూ.23,836 కోట్లు * డేటా ఆదాయం 50 శాతం అప్ న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలానికి రూ.1,523కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ఆర్జించిన నికర లాభం(రూ.1,383 కోట్లు)తో పోల్చితే 10 శాతం వృద్ధి సాధించామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. మొబైల్ డేటా వినియోగం భారీగా పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ చెప్పారు. గత క్యూ2లో రూ.22,845 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 4.3 శాతం వృద్ధితో రూ.23,836 కోట్లకు పెరిగిందని వివరించారు. స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ను వినియోగించే వారి సంఖ్య బాగా పెరుగుతుండటంతో మొబైల్ డేటా ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.3,806 కోట్లకు పెరిగిందని, ఇది మొత్తం ఆదాయంలో 16 శాతమని, గత క్యూ2లో ఇది 11 శాతమని పేర్కొన్నారు. డేటా ట్రాఫిక్ 76 శాతం ఎగసిందని తెలిపారు. ఇబిటా రూ.7,749 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.8,265 కోట్లకు పెరిగిందని, ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు డేటా ఆదాయం రూ.42 నుంచి రూ.193కు వృద్ధి చెందిందని గోపాల్ వివరించారు. మూడేళ్లలో అధిక వృద్ధి భారత్‌లో ఆదాయ వృద్ధి 13 శాతం పెరిగిందని, మూడేళ్లలో ఇదే అత్యధికమని గోపాల్ పేర్కొన్నారు. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే వాయిస్ మినిట్స్ తగ్గాయని తెలిపారు. గత క్యూ2లో 3,42,987గా ఉన్న వాయిస్ మినిట్స్ ఈ క్యూ2లో 3,36,002 కు తగ్గిపోయాయని వివరించారు. 334 నగరాల్లో 4జీ సర్వీసులనందిస్తున్నామని, పలు సర్కిళ్లలో 3జీ సర్వీసులందిస్తున్నామని, ఈ కారణంగా భారత మొబైల్ పరిశ్రమలో వేగంగా వృద్ధి చెందుతున్న డేటా మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ క్యూ2లో రూ.3,102 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రుణభారం రూ.70,777 కోట్లుగా ఉందని. అఫ్రికా కార్యకలాపాల నష్టం 12.4 కోట్ల నుంచి 17 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌కు 20 దేశాల్లో మొత్తం 34 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 2 శాతం(రూ.7) క్షీణించి రూ.352 వద్ద స్థిరపడింది. -
విప్రో లాభం 2,235 కోట్లు
క్యూ2లో 7.2 శాతం వృద్ధి * ఆదాయం రూ. 12,567 కోట్లు; 6.3 శాతం అప్ గడిచిన క్వార్టర్(క్యూ2)లో కంపెనీ అన్ని విభాగాల్లో మంచి పురోగతిని కనబరిచింది. ఐటీ సేవల రంగంలో డాలరు రూపేణా(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 3.1 శాతం ఆదాయ వృద్ధిని సాధించాం. రానున్న కాలంలో స్థిరమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. ఇక పెద్ద డీల్స్ విషయంలో పోటీ తీవ్రంగా ఉంది. కొత్త కాంట్రాక్టులకు సంబంధించి ప్రైసింగ్ ఒత్తిళ్లు కూడా కొనసాగే అవకాశం ఉంది. - టీకే కురియన్, విప్రో సీఈఓ బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో... ఈ ఏడాది రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో రూ.2,235 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,085 కోట్లతో పోలిస్తే లాభం 7.2 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ2లో 6.3 శాతం వృద్ధితో రూ.11,816 కోట్ల నుంచి రూ.12,567 కోట్లకు ఎగబాకింది. సీక్వెన్షియల్‌గా... కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1-రూ.2,188 కోట్లు)తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభం 2.1 శాతం మాత్రమే పెరిగింది. ఆదాయం కూడా క్యూ1లో రూ.12,371 కోట్లతో పోలిస్త్తే... స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదైంది. ఐటీ సేవల విషయానికొస్తే.. కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఐటీ సేవల విభాగం ఆదాయం క్యూ2లో రూ.12,043 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.10,923 కోట్లతో పోలిస్తే... 10.2 శాతం ఎగసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే(క్యూ1లో రూ. 11,573 కోట్లు) 4 శాతం పెరిగింది. డాలర్ల రూపంలో సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం 2.1 శాతం వృద్ధితో 1.83 బిలియన్లుగా నమోదైంది. తమ అంచనా(గెడైన్స్) 1.82-1.85 బిలియన్ డాలర్లకు అనుగుణంగానే ఐటీ సేవల ఆదాయం నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక ప్రస్తుత మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయం 1.841-1.878 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చిన కంపెనీ అంచనా వేసింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... * క్యూ2లో 67 కొత్తగా క్లయింట్లను దక్కించుకుంది. * ఐటీ ఉత్పత్తుల విభాగ ఆదాయం రూ.544 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ2లో రూ.915 కోట్లతో పోలిస్తే 40.5% దిగజారింది. * ఐటీ సేవల విభాగంలో కంపెనీ గత క్వార్టర్లో 6,607 మందిని నియమించుకుంది. దీంతో సెప్టెంబర్ చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,68,396కు చేరింది. * ఈ ఏడాది డిజిటల్ టెక్నాలజీలకు సంబంధించి దాదాపు 10,000 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఒక ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు విప్రో వెల్లడించింది. * క్రాస్-కరెన్సీ(డాలరుతో ఇతర ప్రధాన కరెన్సీల విలువల్లో హెచ్చుతగ్గులు) ప్రభావం నిర్వహణ మార్జిన్లపై పడినప్పటికీ.. డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గుదలతో దీన్ని ఎదుర్కోగలినట్లు కంపెనీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ చెప్పారు. * యూరప్, అమెరికాల్లో సెలవుల సీజన్ కారణంగా డీల్స్ కుదుర్చుకోవడంలో మందగమనం, తక్కువ పనిదినాల కారణంగా క్యూ3 ఆదాయాలపై ప్రభా వం చూపనునందని కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ధర బుధవారం బీఎస్ఈలో 1 శాతం పెరిగి రూ.578 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. -
3 రెట్లు పెరిగిన హెరిటేజ్ నికరలాభం
* క్యూ2లో రూ.5 కోట్ల నుంచి 15 కోట్లకు చేరిన లాభం * ఒక్క డెయిరీ విభాగంలోనే లాభం 14 కోట్ల నుంచి 34 కోట్లకు * అనూహ్య ఫలితాలతో ఒక్కరోజే 13 శాతం పెరిగిన షేరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన మూడు త్రైమాసికాలూ వరుసగా హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు భారీగా పెరుగుతూనే వస్తున్నాయి. 2014వ సంవత్సరం సెప్టెం బర్తో ముగిసిన త్రైమాసికానికి రూ.512 కోట్ల ఆదాయంపై రూ.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన కంపెనీ... ఈ ఏడాది అదే కాలంలో రూ.586 కోట్ల ఆదాయంపై ఏకంగా రూ.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంటే రెండో త్రైమాసికంలో కంపెనీ నికరలాభం ఏకంగా 200 శాతం పెరిగినట్లు లెక్క. గడిచిన ఆరు నెలల్లో పాల మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగింది. కర్ణాటక కు చెందిన నందిని, గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్లు కూడా ప్రవేశించటంతో పాల ధరలు కూడా తగ్గాయి. పోటీ కారణంగా హెరిటేజ్ ఫుడ్స్ కూడా తన పాల ధరలు తగ్గించినా... లాభాలు మాత్రం గణనీయంగా పెరగటం విశేషమే. 2015 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఒక్క డెయిరీ విభాగాన్నే తీసుకుంటే... లాభాలు (పన్నులు, వడ్డీలు చెల్లించక ముందు) రూ.14 కోట్ల నుంచి రూ. 34 కోట్లకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. డెయిరీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 383 కోట్ల నుంచి రూ. 442 కోట్లకు పెరిగింది. ఈ త్రైమాసికంలో రిటైల్ విభాగం నష్టాలు రూ.6 కోట్లకు పెరిగితే... అగ్రి, బేకరి విభాగాల్లో కోటి రూపాయల వరకు నష్టాలు వచ్చాయి. అనూహ్యమైన ఫలితాలను ప్రకటించడంతో సోమవారం హెరిటేజ్ ఫుడ్స్ షేరు ఏకంగా 13 % పెరిగి రూ.456 వద్ద ముగిసింది. -
అపోలో హాస్పిటల్స్ లాభం రూ. 91 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్) కాలానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం 5%పైగా పెరిగి రూ. 92 కోట్లకు చేరింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 87 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా రూ. 975 కోట్ల నుంచి 18% ఎగసి రూ. 1,153 కోట్లను తాకింది. ప్రణాళిక ప్రకారం విస్తరణ పనులు కొనసాగుతున్నాయని కంపెనీ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి చెప్పారు. ఈ ఏడాదిలోగా కొత్తగా 600 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే మహిళ, శిశు సంబంధిత 45 పడకలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇక అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో నెల్లూరులో 200, చెన్నై, ఓఎంఆర్లలో 170 పడకను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఫార్మసీల విస్తరణ: ప్రస్తుత సమీక్షా కాలంలో హైదరాబాద్‌కు చెందిన హెటెరో మెడ్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఫార్మసీ చైన్ పటిష్టంకానుందని ప్రతాప్ రెడ్డి చెప్పారు. హాస్పిటళ్లు, ఫార్మసీలు, రిటైల్ హెల్త్‌కేర్ కేంద్రాల విస్తరణ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హెల్త్‌కేర్ సర్వీసుల పరిధిని విస్తరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగిస్తామని చెప్పారు. హెల్త్‌కేర్ సర్వీసుల విభాగం 13% పుంజుకున్నట్లు తెలిపారు. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2లో రూ. 1,315 కోట్ల ఆదాయంపై రూ. 88 కోట్ల నికర లాభాన్ని పొందింది. -
టెక్ మహీంద్రా లాభం 720 కోట్లు
ఆదాయం రూ. 5,488 కోట్లు ముంబై: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి రూ. 720 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 718 కోట్లతో పోలిస్తే ఇది నామమాత్ర వృద్ధి. అయితే గత లాభాల్లో ఒక భారీ డీల్ కారణంగా లభించిన 9 మిలియన్ డాలర్లు(రూ. 54 కోట్లు) కలసి ఉన్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత లాభాలను రూ. 46 కోట్ల ఫారెక్స్ నష్టాలు కూడా ప్రభావితం చేసినట్లు తెలిపారు. ఇటీవల హెడ్జింగ్ వ్యూహాన్ని మార్చుకున్నామని, కరెన్సీ ఒడిదుడుకుల రక్షణ కాలాన్ని ఐదేళ్ల నుంచి రెండేళ్లకు కుదించామని చెప్పారు. డాలరుతో మారకంలో రూపాయి భారీ హెచ్చుతగ్గులకు లోనుకావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఆదాయం మాత్రం 15% ఎగసి రూ. 5,488 కోట్లకు చేరింది. గతంలో రూ. 4,772 కోట్ల ఆదాయం నమోదైంది. డాలర్లలో చూస్తే నికర లాభం 11.8 కోట్లు, ఆదాయం 90 కోట్ల డాలర్లుగా నమోదైంది. వ్యూహాత్మక పెట్టుబడుల కొనసాగింపు ద్వారా కీలక విభాగాల్లో వృద్ధి సాధించగలిగామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌లను పొందడంపై ఆశావహంగా ఉన్నట్లు వినీత్ చెప్పారు. 95,309కు సిబ్బంది సంఖ్య క్లయింట్ల సంఖ్య 17 పెరిగి 649కు చేరగా, 2,580 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 95,309ను తాకింది. వీరిలో సాఫ్ట్వేర్ బిజినెస్‌లో 66,175 మంది, బీపీవో విభాగంలో 22,433 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఉద్యోగవలస(అట్రిషన్) 16% నుంచి 18%కు పెరిగింది. నగదు, తత్సమాన నిల్వలు రూ. 3,434 కోట్లుగా నమోదయ్యాయి. కమ్యూనికేషన్స్ డొమైన్, ఎంటర్ప్రైజ్ డొమైన్లలో కంపెనీకున్న ప్రత్యేకతల కారణంగా మార్కెట్లో మరింత విస్తరించగలుగుతున్నామని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% పెరిగి రూ. 2,397 వద్ద ముగిసింది. -
రిలయన్స్ లాభం 5,972 కోట్లు
రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో మరోసారి అద్భుతమైన పనితీరును సాధించాం. ప్రాంతీయంగా పరిశ్రమ ప్రమాణాల కంటే మెరుగైన పనితీరును కనబరిచాం. అంతర్జాతీయంగా ఆర్థిక పరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ ధోరణి.. వ్యాపార రంగానికి కలిసొచ్చే అంశం. వచ్చే 12-18 నెలల్లో వాటాదారులకు రిలయన్స్ గణనీయమైన విలువను సృష్టించనుంది. ఇంధన, కన్జూమర్ వ్యాపార విభాగాల్లో తలపెట్టిన భారీ పెట్టుబడులన్నీ పూర్తికానున్నాయి. ఆయా ప్రాజెక్టులు కంపెనీకే కాకుండా భారత్ ఆర్థికాభివృద్ధిని పెంచడంలో చోధకంగా పనిచేస్తాయి. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ క్యూ2లో స్వల్పంగా 1.7% వృద్ధి * ఆదాయం 4.3 శాతం తగ్గుదల; రూ.1,13,396 కోట్లు * స్థూల రిఫైనింగ్ మార్జిన్ 8.3 డాలర్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.5,972 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,873 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.7 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం 4.3 శాతం తగ్గుదలతో రూ.1,13,396 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.1,18,439 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుముఖం, రిఫైనింగ్, చమురు-గ్యాస్ వ్యాపారంలో అమ్మకాల తగ్గుదలతో ఆదాయం కొద్దిగా దిగొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇంధన ఎగుమతులు క్యూ2లో 14.7 శాతం తగ్గి రూ.66,065 కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎగుమతులు రూ.77,428 కోట్లుగా ఉన్నాయి. పెరిగిన జీఆర్ఎం...: ఇదిలాఉండగా... కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) క్యూ2లో 8.3 డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో జీఆర్ఎం 7.7 డాలర్లు మాత్రమే. ఈ ఏడాది క్యూ1లో జీఆర్ఎం 8.7 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడి చమురును శుద్ధి చేసి తద్వారా వచ్చిన ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కంపెనీకి వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. చమురు, గ్యాస్ రంగంలో ఆదాయాల క్షీణత ప్రభావాన్ని పటిష్ట జీఆర్ఎంతో కంపెనీ పూడ్చుకోగలిగింది. ఇతర ముఖ్యాంశాలు... * కీలకమైన రిఫైనరీ వ్యాపారం పన్ను ముందు లాభం(ఎబిటా) క్యూ2లో 18.5 శాతం ఎగబాకి రూ.3,844 కోట్లకు చేరింది. అయితే, ఈ విభాగంలో ఆదాయం 5.9% తగ్గి రూ.1,03,590 కోట్లుగా నమోదైంది. * ఇక పెట్రోకెమికల్స్ విభాగంలో ఎబిటా దాదాపు మార్పుల్లేకుండా రూ.2,361 కోట్లుగా ఉంది. చమురు-గ్యాస్ రంగం ఎబిటా 14.5 శాతం క్షీణించి రూ.818 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది క్యూ2లో ఈ మొత్తం రూ. 956 కోట్లు.. ఈ ఏడాది క్యూ1లో రూ.1,042 కోట్లుగా నమోదైంది. దేశీయంగా కేజీ-డీ6లో ఉత్పత్తి క్షీణత ఈ విభాగంలో ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. * రిటైల్ వ్యాపార ఆదాయం రూ.3,470 కోట్ల నుంచి రూ.4,167 కోట్లకు ఎగసింది. ఎబిటా రూ.70 కోట్ల నుంచి రూ.99 కోట్లకు పెరిగింది. * పెట్రోకెమికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్ఐఎల్ 16 బిలియన్ డాలర్లమేర పెట్టుబడుల ప్రణాళికను అమలు చేస్తోంది. * మరో 4.5 బిలియన్ డాలర్లను పాలిస్టర్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణపై ఖర్చుచేస్తోంది. 2017-18 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకా మిగిలిన కాలంలో దాదాపు రూ. 5,000- 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ గ్రూప్ సీఎఫ్‌వో అలోక్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే క్యూ1లో రూ. 15,000 కోట్లు, క్యూ2లో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. * ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి కంపెనీ రుణ భారం రూ.1,42,084 కోట్లకు ఎగబాకింది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.1,35,769 కోట్లు. * కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ ఇతర నిల్వలు ఈ సెప్టెంబర్ ఆఖరికి రూ.83,456 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.81,559 కోట్లు. * రిలయన్స్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో స్వల్పంగా 0.3 శాతం తగ్గి.. రూ.958 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.