ఫలితాలు, గణాంకాలే నడిపిస్తాయ్‌..! | More Than 650 Companies Will Announce Their Second Quarter Results | Sakshi
Sakshi News home page

ఫలితాలు, గణాంకాలే నడిపిస్తాయ్‌..!

Published Mon, Nov 4 2019 3:43 AM | Last Updated on Mon, Nov 4 2019 4:55 AM

More Than 650 Companies Will Announce Their Second Quarter Results - Sakshi

ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల వెల్లడి, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ బాగా తగ్గి ఉన్న రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించవచ్చని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు.

అయితే, ఫలితాలకు మించి చెప్పుకోదగిన స్థాయిలో కీలక పరిణామాలేవీ ఈ వారంలో లేకపోవడం వల్ల ఫలితాలు ఏ మాత్రం నిరాశపరిచినా ప్రధాన సూచీలకు ఒడిదుడుకులు తప్పవని విశ్లేíÙంచారు. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, రిజల్స్‌ నేపథ్యంలో భారీ లాభాలను నమోదుచేసిన షేర్లల్లో లాభాల స్వీకరణ అవకాశం ఉందని వివరించారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఈ వారం దేశీ మార్కెట్ల ప్రయాణం ఉండనుందని తాను భావిస్తున్నట్లు ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు.  

650 కంపెనీల ఫలితాలు..
ఈవారంలో 650 కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ జాబితాలో ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, టైటాన్, సన్‌ ఫార్మా, పీఎన్‌బీ, డాబర్, టాటా స్టీల్, సిప్లా, కెనరా బ్యాంక్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ ఉన్నాయి.

ఆటో రంగంపై మార్కెట్‌ దృష్టి
ఎం అండ్‌ ఎం, ఐషర్‌ , అశోక్‌ లేలాండ్, ఎంఆర్‌ఎఫ్, అమర రాజా బ్యాటరీస్, ఎక్సైడ్‌  ఫలితాలు ఈవారంలో వెల్లడికానున్నాయి. దీంతో ఆటో రంగంపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించాయి. ఎం అండ్‌ ఎం అమ్మకాలు 16.3 శాతం పడిపోయిన కారణంగా ఈ సంస్థ క్యూ2 ఫలితాల్లో రెండంకెల క్షీణత ఉండవచ్చని భావిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన నిర్వహణ లాభం మార్జిన్లలో 100–200 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గుదల ఉండవచ్చని విశ్లేశిస్తున్నాయి.

స్థూల ఆర్థికాంశాలు..
అక్టోబర్‌ మార్కిట్‌ సర్వీసెస్ పీఎంఐ డేటా మంగళవారం విడుదలకానుంది. ఈ అంశానికి తోడు అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, బ్రెగ్జిట్‌ అంశాలు కీలకం.  

రూ. 16,464 కోట్ల ఎఫ్‌ఐఐ పెట్టుబడి
అక్టోబర్‌ 1–31 కాలానికి ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీ మార్కెట్లో రూ. 12,475 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో వీ రు డెట్‌ మార్కెట్లో రూ. 3,989 కోట్లు పె ట్టుబడి పెట్టడం ద్వారా గత నెల్లో వీరి నికర పెట్టుబడి రూ. 16,464 కోట్లుగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement