Company Results
-
ఆర్థికాంశాలు, ఫలితాలే దిక్సూచి..!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందనేది మార్కెట్ వర్గాల మాట. దీపావళి నుంచి ఇప్పటివరకు 4%, సెప్టెంబర్ 20 నుంచి 13 శాతం ర్యాలీ చేసిన ప్రధాన సూచీలు.. ఇదే జోరును కొనసాగించవచ్చని విశ్లేషిస్తున్నాయి. ‘లార్జ్, బ్లూ–చిప్ షేర్ల వాల్యుయేషన్స్ మళ్లీ ప్రీమియం స్థాయికి చేరుకున్నాయి. ఇది మార్కెట్ ట్రెండ్‌పై ప్రభావం చూపొచ్చు. అయితే, దీర్ఘకాలిక లాభాల కోసం మార్కెట్ అవుట్‌లుక్ మెరుగుపడింది. సంస్కరణలు, ఉద్దీపనలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల, వర్షాలు ఆశాజనకంగా ఉండటం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి సానుకూల అంశాల ప్రభావాన్ని ప్రస్తుత కంపెనీల ఫలితాల వెల్లడి సీజన్ అద్ధం పడుతోంది. ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ఎర్నింగ్స్ వృద్ధి బాగుండవచ్చనే సంకేతాలు ఇస్తుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఈ వారంలో వెల్లడికానున్న ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రెండ్ ఉంటుందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. స్థూల ఆర్థికాంశాలు.. సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, తయారీ రంగ ఉత్పత్తి డేటా నవంబర్ 11న (సోమవారం) వెల్లడికానున్నాయి. ఇక మంగళవారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, గురువారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రానున్నాయి. 2,700 కంపెనీల ఫలితాలు.. ఈ వారంలో 2,700 కంపెనీలు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి లార్జ్‌క్యాప్స్‌లో కోల్ ఇండియా, హిందాల్కో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్టెల్, ఓఎన్జీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మదర్సన్ సుమి సిస్టమ్స్, ఆయిల్ ఇండియా వంటివి ఉన్నాయి. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. గురునానక్ 550వ జయంతి సందర్భంగా మంగళవారం (12న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమైంది. బుధవారం (13న) మార్కెట్ యథావిధిగా ప్రారంభంకానుంది. అయోధ్యపై సుప్రీం తీర్పు ప్రభావం... అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. రామజన్మభూమి న్యాస్‌కే ఈ వివాదాస్పద భూమి చెందుతుందని, రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సూచించింది. రెండున్నర దశాబ్దాల వివాదాస్పదానికి తెరపడిన నేపథ్యంలో ఈ అంశంపై మార్కెట్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కేఆర్ చోక్సి ఇన్వెస్ట్మెంట్ ఎండీ దేవాన్ చోక్సి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని, వివాదం ముగియడంతో ఈ రాష్ట్ర వాటా మెరుగుపడొచ్చని ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా విశ్లేషించారు. అయితే, తీర్పు ప్రభావం మార్కెట్‌పై పెద్దగా ఉండకపోవచ్చని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ విశ్లేషకులు సంతోష్ మీనా అన్నారు. నవంబర్‌లో ఎఫ్‌పీఐ నిధులు రూ. 12,000 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో రూ. 12,000 కోట్లను కుమ్మరించారు. నవంబర్ 1–9 కాలంలో వీరు స్టాక్ మార్కెట్లో రూ. 6,434 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 5,673 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది. -
ఫలితాలు, గణాంకాలే నడిపిస్తాయ్..!
ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్) ఫలితాల వెల్లడి, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ బాగా తగ్గి ఉన్న రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. అయితే, ఫలితాలకు మించి చెప్పుకోదగిన స్థాయిలో కీలక పరిణామాలేవీ ఈ వారంలో లేకపోవడం వల్ల ఫలితాలు ఏ మాత్రం నిరాశపరిచినా ప్రధాన సూచీలకు ఒడిదుడుకులు తప్పవని విశ్లేíÙంచారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు, రిజల్స్ నేపథ్యంలో భారీ లాభాలను నమోదుచేసిన షేర్లల్లో లాభాల స్వీకరణ అవకాశం ఉందని వివరించారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఈ వారం దేశీ మార్కెట్ల ప్రయాణం ఉండనుందని తాను భావిస్తున్నట్లు ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. 650 కంపెనీల ఫలితాలు.. ఈవారంలో 650 కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ జాబితాలో ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, టైటాన్, సన్ ఫార్మా, పీఎన్బీ, డాబర్, టాటా స్టీల్, సిప్లా, కెనరా బ్యాంక్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ ఉన్నాయి. ఆటో రంగంపై మార్కెట్ దృష్టి ఎం అండ్ ఎం, ఐషర్ , అశోక్ లేలాండ్, ఎంఆర్ఎఫ్, అమర రాజా బ్యాటరీస్, ఎక్సైడ్ ఫలితాలు ఈవారంలో వెల్లడికానున్నాయి. దీంతో ఆటో రంగంపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి. ఎం అండ్ ఎం అమ్మకాలు 16.3 శాతం పడిపోయిన కారణంగా ఈ సంస్థ క్యూ2 ఫలితాల్లో రెండంకెల క్షీణత ఉండవచ్చని భావిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన నిర్వహణ లాభం మార్జిన్లలో 100–200 బేసిస్ పాయింట్ల మేర తగ్గుదల ఉండవచ్చని విశ్లేశిస్తున్నాయి. స్థూల ఆర్థికాంశాలు.. అక్టోబర్ మార్కిట్ సర్వీసెస్ పీఎంఐ డేటా మంగళవారం విడుదలకానుంది. ఈ అంశానికి తోడు అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, బ్రెగ్జిట్ అంశాలు కీలకం. రూ. 16,464 కోట్ల ఎఫ్ఐఐ పెట్టుబడి అక్టోబర్ 1–31 కాలానికి ఎఫ్ఐఐలు భారత ఈక్విటీ మార్కెట్లో రూ. 12,475 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో వీ రు డెట్ మార్కెట్లో రూ. 3,989 కోట్లు పె ట్టుబడి పెట్టడం ద్వారా గత నెల్లో వీరి నికర పెట్టుబడి రూ. 16,464 కోట్లుగా నిలిచింది. -
ఐఓబీ నికర లాభం రూ.133 కోట్లు
చెన్నై: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 16% తగ్గింది. గత క్యూ2లో రూ.158 కోట్ల లాభం రాగా, ఈ క్యూ2లో రూ.133 కోట్ల లాభం ఆర్జించామని ఐఓబీ శుక్రవారం తెలిపింది. ఇక మొత్తం ఆదాయం రూ.5,515 కోట్ల నుంచి రూ.5,999.75 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన 6 నెలల కాలానికి రూ.258 కోట్ల నికర లాభం సాధించామని, గతేడాది ఇదే కాలానికి రూ.392 కోట్ల లాభం ఆర్జించామని, 34% క్షీణత నమోదైందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.10,918 కోట్ల నుంచి రూ.12,187 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,574 కోట్ల నుంచి రూ.2,768 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో స్థూల మొండిబకాయిలు రూ.8,202 కోట్లుగా, నికర మొండి బకాయిలు రూ.4,875 కోట్లుగా ఉన్నాయని ఐఓబీ వివరించింది. -
97 శాతం పెరిగిన టీవీఎస్ మోటార్ లాభం
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో రూ.88.84 కోట్ల నికర లాభం(స్టాండ్ ఎలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.45.19 కోట్లు)తో పోల్చితే 97 శాతం వృద్ధి సాధించామని కంపెనీ పేర్కొంది. మెటార్ సైకిళ్ల అమ్మకాల్లో మంచి వృద్ధికి తోడు గ్రూప్ కంపెనీలో మోజారిటీ వాటా విక్రయం కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని వివరించింది. ఇక నికర అమ్మకాలు రూ.1,683.41 కోట్ల నుంచి రూ.1,962.03 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు 65 పైసల మధ్యంతర డివిడెండ్‌ను (65 శాతం) కంపెనీ ప్రకటించింది. టీవీఎస్ ఎనర్జీలో కంపెనీ తన వాటాను విక్రయించింది. ఈ విక్రయంపై రూ.30.28 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై-సెప్టెంబర్ కాలానికి మోటార్ సైకిళ్ల అమ్మకాలు 18 శాతం, స్కూటర్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయని, మొత్తం మీద టూవీలర్ల విక్రయాలు 2 శాతం, ఎగుమతులు 27 శాతం, త్రీ వీలర్ల ఎగుమతులు 85 శాతం చొప్పున వృద్ధి సాధించాయని కంపెనీ తెలిపింది.