న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో రూ.88.84 కోట్ల నికర లాభం(స్టాండ్ ఎలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.45.19 కోట్లు)తో పోల్చితే 97 శాతం వృద్ధి సాధించామని కంపెనీ పేర్కొంది. మెటార్ సైకిళ్ల అమ్మకాల్లో మంచి వృద్ధికి తోడు గ్రూప్ కంపెనీలో మోజారిటీ వాటా విక్రయం కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని వివరించింది.
ఇక నికర అమ్మకాలు రూ.1,683.41 కోట్ల నుంచి రూ.1,962.03 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు 65 పైసల మధ్యంతర డివిడెండ్‌ను (65 శాతం) కంపెనీ ప్రకటించింది. టీవీఎస్ ఎనర్జీలో కంపెనీ తన వాటాను విక్రయించింది. ఈ విక్రయంపై రూ.30.28 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై-సెప్టెంబర్ కాలానికి మోటార్ సైకిళ్ల అమ్మకాలు 18 శాతం, స్కూటర్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయని, మొత్తం మీద టూవీలర్ల విక్రయాలు 2 శాతం, ఎగుమతులు 27 శాతం, త్రీ వీలర్ల ఎగుమతులు 85 శాతం చొప్పున వృద్ధి సాధించాయని కంపెనీ తెలిపింది.
97 శాతం పెరిగిన టీవీఎస్ మోటార్ లాభం
Published Sat, Oct 26 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement